అందుకు రెండున్నరేళ్లు పట్టింది: నటి | Kamya Panjabi Says She Battled Depression After Breakup With Karan Patel | Sakshi
Sakshi News home page

రెండున్నరేళ్లు కష్టంగా గడిచింది: నటి

Published Mon, Jun 29 2020 8:26 PM | Last Updated on Mon, Jun 29 2020 8:44 PM

Kamya Panjabi Says She Battled Depression After Breakup With Karan Patel - Sakshi

కామ్యా పంజాబీ- కరణ్‌ పటేల్‌(ఫైల్‌ఫొటో)

‘‘నిజం చెప్పాలంటే కరణ్‌ నుంచి విడిపోయిన తర్వాత మామూలు మనిషిని కావడానికి నాకు రెండున్నరేళ్లు పట్టింది. ఆ తర్వాత నా ప్రేమమయమైన జీవితం మళ్లీ మొదలైంది. కడుపు నిండా తినడం, సమయానికి నిద్ర పోవడం, స్నేహితులతో మాట్లాడటం, పనుల్లో నిమగ్నమవడం. దినచర్య మారిపోయింది. నిజంగా ఆ రెండున్నరేళ్ల కాలం కష్టంగా గడిచింది. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నా’’ అంటూ నటి కామ్యా పంజాబీ తన జీవితంలోని చేదు అనుభవాల గురించి పంచుకున్నారు. ఎంతగానో ప్రేమించిన వ్యక్తి దూరం కావడంతో డిప్రెషన్‌తో కుంగిపోయానని.. కౌన్సిలింగ్‌ తీసుకున్న తర్వాతే మానసిక రుగ్మత నుంచి బయటపడ్డానని చెప్పుకొచ్చారు. మనిషి జీవితంలో కష్టాలు సహజమేనని.. ధైర్యంగా పోరాడి వాటిని అధిగమించాలని స్ఫూర్తి నింపారు. (న‌టి మూడో పెళ్లి: 'డ‌బ్బుల కోస‌మే డ్రామాలు' )


భర్త షలభ్‌ దాంగ్‌తో కామ్యా

కాగా సీరియల్‌ నటిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హిందీ బిగ్‌బాస్‌ సీజన్‌ 7లో పాల్గొని పాపులర్‌ అయ్యారు. కెరీర్‌లో దూసుకుపోతున్నప్పటికీ కామ్యా వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గతంలో బంటీ నేగీ అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకున్న ఆమె.. అతడి నుంచి విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత నటుడు ‘యే హై మొహబ్బతే’ సీరియల్‌ ఫేం కరణ్‌ పటేల్‌తో ప్రేమలో పడ్డారు. కొన్నాళ్లు వీరి బంధం సాఫీగానే సాగినప్పటికీ భేదాభిప్రాయాలు తలెత్తడంతో 2015లో విడిపోయారు. ఈ క్రమంలో కరణ్‌ మరో నటి అంకితా భార్గవను పెళ్లి చేసుకోగా.. కామ్యా గతేడాది.. వైద్య రంగానికి షలభ్‌ దాంగ్‌ అనే వ్యక్తిని వివాహమాడారు. తన కూతురు ఆరా(బంటీ నేగీ సంతానం), భర్తతో కలిసి ప్రస్తుతం సంతోషంగా జీవిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement