Karan Patel
-
'ఇండియా వరల్డ్ కప్ గెలిచింది.. ఏదైనా పని ఉంటే కాస్తా చెప్పండి'.. బుల్లితెర నటుడు విజ్ఞప్తి!
సినీ ఇండస్ట్రీలో ఎత్తుపల్లాలు సహజం. స్టార్డమ్ అనేది అందరికీ ఒకేలా ఉండదు. ఒకప్పుడు స్టార్‌గా ఉన్నవాళ్లు అవకాశాల కోసం ఎదురు చూడాల్సిన సందర్భాలు కూడా వస్తాయి. ఒకానొక సమయంలో పని కోసం అడుక్కోవాల్సిన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. తాజాగా అలాంటి పరిస్థితి బాలీవుడ్ బుల్లితెర నటుడు కరణ్ పటేల్‌కు ఎదురైంది. 'యే హై మొహబ్బతే' స్టార్ కరణ్ పటేల్ తన ఇన్స్టాగ్రామ్ చేసిన పోస్ట్ నెట్టింట చర్చనీయాశంగా మారింది.కరణ్ పటేల్ తన ఇన్‌స్టాలో రాస్తూ..'దేశంలో సాధారణ ఎన్నికలు ముగిశాయి. ఇండియా టీ20 ప్రపంచ కప్ గెలిచింది. దీపికా పదుకొణె బేబీ బంప్ వార్త కూడా మనందరికీ తెలిసింది. త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్న వారికి నా అభినందనలు. ఇప్పుడు తిరిగి పని చేసుకోవాల్సిన సమయం. కాస్టింగ్ అవకాశం ఉంటే ఎవరైనా నాకు తెలియజేయండి.' అంటూ సోషల్ మీడియాలో రాసుకొచ్చారు.బుల్లితెర నటుడు కరణ్ పటేల్ చివరిసారిగా 2020లో ‘కసౌతి జిందగీ కే’ అనే సీరియల్లో కనిపించారు. అంతే కాకుండా ఏక్తా కపూర్ నటించిన కహానీ ఘర్ ఘర్ కిలో కూడా కనిపించాడు. ప్రముఖ టీవీ సీరియల్ 'యే హై మొహబ్బతే'తో ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఇందులో అతనితో పాటు దివ్యాంక త్రిపాఠి కూడా నటించింది. అయితే గతంలో కరణ్ పటేల్‌కు రియాలిటీ షో బిగ్‌బాస్‌లో అవకాశం వచ్చినా తిరస్కరించాడు. -
అందుకు రెండున్నరేళ్లు పట్టింది: నటి
‘‘నిజం చెప్పాలంటే కరణ్ నుంచి విడిపోయిన తర్వాత మామూలు మనిషిని కావడానికి నాకు రెండున్నరేళ్లు పట్టింది. ఆ తర్వాత నా ప్రేమమయమైన జీవితం మళ్లీ మొదలైంది. కడుపు నిండా తినడం, సమయానికి నిద్ర పోవడం, స్నేహితులతో మాట్లాడటం, పనుల్లో నిమగ్నమవడం. దినచర్య మారిపోయింది. నిజంగా ఆ రెండున్నరేళ్ల కాలం కష్టంగా గడిచింది. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నా’’ అంటూ నటి కామ్యా పంజాబీ తన జీవితంలోని చేదు అనుభవాల గురించి పంచుకున్నారు. ఎంతగానో ప్రేమించిన వ్యక్తి దూరం కావడంతో డిప్రెషన్‌తో కుంగిపోయానని.. కౌన్సిలింగ్ తీసుకున్న తర్వాతే మానసిక రుగ్మత నుంచి బయటపడ్డానని చెప్పుకొచ్చారు. మనిషి జీవితంలో కష్టాలు సహజమేనని.. ధైర్యంగా పోరాడి వాటిని అధిగమించాలని స్ఫూర్తి నింపారు. (నటి మూడో పెళ్లి: 'డబ్బుల కోసమే డ్రామాలు' ) భర్త షలభ్ దాంగ్తో కామ్యా కాగా సీరియల్ నటిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హిందీ బిగ్‌బాస్ సీజన్ 7లో పాల్గొని పాపులర్ అయ్యారు. కెరీర్లో దూసుకుపోతున్నప్పటికీ కామ్యా వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గతంలో బంటీ నేగీ అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకున్న ఆమె.. అతడి నుంచి విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత నటుడు ‘యే హై మొహబ్బతే’ సీరియల్ ఫేం కరణ్ పటేల్‌తో ప్రేమలో పడ్డారు. కొన్నాళ్లు వీరి బంధం సాఫీగానే సాగినప్పటికీ భేదాభిప్రాయాలు తలెత్తడంతో 2015లో విడిపోయారు. ఈ క్రమంలో కరణ్ మరో నటి అంకితా భార్గవను పెళ్లి చేసుకోగా.. కామ్యా గతేడాది.. వైద్య రంగానికి షలభ్ దాంగ్ అనే వ్యక్తిని వివాహమాడారు. తన కూతురు ఆరా(బంటీ నేగీ సంతానం), భర్తతో కలిసి ప్రస్తుతం సంతోషంగా జీవిస్తున్నారు. -
'అందుకే ఆమె పెళ్లికి వెళ్లలేదు'
ముంబై: బుల్లితెర నటీనటులు దివ్యాంక త్రిపాఠి, వివేక్ దహియ పెళ్లికి టెలివిజన్ ఇండస్ట్రీకి చెందిన చాలా మంది సన్నిహితులు హాజరయ్యారు. దివ్యాంక వివాహానికి ఆమె సహనటుడు కరణ్ పటేల్ రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. చాలా సీరియల్స్ లో దివ్యాంక భర్తగా నటించిన కరణ్ పెళ్లికి ఎందుకు రాలేదని అందరూ చెవులు కొరుక్కున్నారు. జూలై 8న భోపాల్ లో దివ్యాంక-వివేక్ పెళ్లి జరిగింది. అయితే బిజీ షెడ్యూల్ కారణంగానే దివ్యాంక పెళ్లికి రాలేకపోయానని, వేరే కారణాలు ఏమీ లేవని కరణ్ తెలిపాడు. 'దివ్యాంక పెళ్లికి తప్పనిసరిగా వెళ్లాలనుకున్నాను. ఓ టీవీ షో షూటింగ్లో బిజీగా ఉండడంతో వెళ్లలేకపోయాను. నేను ప్రధానపాత్ర పోషిస్తున్నందున షూటింగ్ కు విరామం ఇవ్వడం కుదరలేద'ని కరణ్ వెల్లడించాడు. పెళ్లి హాజరుకాలేకపోయిన అతడు తన భార్య అంకిత భార్గవతో కలిసి రిసెప్షన్ కు వెళ్లాడు. పెళ్లికి వెళ్లకపోవడంతో రిసెప్షన్ తప్పనిసరిగా వెళ్లాలనుకున్నానని కరణ్ చెప్పాడు. ఈద్ పండుగ రోజున షూటింగ్ కు వచ్చేందుకు అతడు ఒప్పుకోకపోవడంతో దివ్యాంక పెళ్లికి వెళ్లేందుకు సెలవు దొరకలేదని బయట ప్రచారం జరుగుతోంది.