సినీ ఇండస్ట్రీలో ఎత్తుపల్లాలు సహజం. స్టార్‌డమ్ అనేది అందరికీ ఒకేలా ఉండదు. ఒకప్పుడు స్టార్‌గా ఉన్నవాళ్లు అవకాశాల కోసం ఎదురు చూడాల్సిన సందర్భాలు కూడా వస్తాయి. ఒకానొక సమయంలో పని కోసం అడుక్కోవాల్సిన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. తాజాగా అలాంటి పరిస్థితి బాలీవుడ్ బుల్లితెర నటుడు కరణ్ పటేల్‌కు ఎదురైంది. 'యే హై మొహబ్బతే' స్టార్ కరణ్ పటేల్ తన ఇన్‌స్టాగ్రామ్ చేసిన పోస్ట్ నెట్టింట చర్చనీయాశంగా మారింది.
కరణ్ పటేల్ తన ఇన్‌స్టాలో రాస్తూ..'దేశంలో సాధారణ ఎన్నికలు ముగిశాయి. ఇండియా టీ20 ప్రపంచ కప్ గెలిచింది. దీపికా పదుకొణె బేబీ బంప్ వార్త కూడా మనందరికీ తెలిసింది. త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్న వారికి నా అభినందనలు. ఇప్పుడు తిరిగి పని చేసుకోవాల్సిన సమయం. కాస్టింగ్ అవకాశం ఉంటే ఎవరైనా నాకు తెలియజేయండి.' అంటూ సోషల్ మీడియాలో రాసుకొచ్చారు.
బుల్లితెర నటుడు కరణ్ పటేల్ చివరిసారిగా 2020లో ‘కసౌతి జిందగీ కే’ అనే సీరియల్‌లో కనిపించారు. అంతే కాకుండా ఏక్తా కపూర్ నటించిన కహానీ ఘర్ ఘర్ కిలో కూడా కనిపించాడు. ప్రముఖ టీవీ సీరియల్ 'యే హై మొహబ్బతే'తో ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఇందులో అతనితో పాటు దివ్యాంక త్రిపాఠి కూడా నటించింది. అయితే గతంలో కరణ్ పటేల్‌కు రియాలిటీ షో బిగ్‌బాస్‌లో అవకాశం వచ్చినా తిరస్కరించాడు.
Comments
Please login to add a commentAdd a comment