chance
-
'ఇండియా వరల్డ్ కప్ గెలిచింది.. ఏదైనా పని ఉంటే కాస్తా చెప్పండి'.. బుల్లితెర నటుడు విజ్ఞప్తి!
సినీ ఇండస్ట్రీలో ఎత్తుపల్లాలు సహజం. స్టార్డమ్ అనేది అందరికీ ఒకేలా ఉండదు. ఒకప్పుడు స్టార్‌గా ఉన్నవాళ్లు అవకాశాల కోసం ఎదురు చూడాల్సిన సందర్భాలు కూడా వస్తాయి. ఒకానొక సమయంలో పని కోసం అడుక్కోవాల్సిన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. తాజాగా అలాంటి పరిస్థితి బాలీవుడ్ బుల్లితెర నటుడు కరణ్ పటేల్‌కు ఎదురైంది. 'యే హై మొహబ్బతే' స్టార్ కరణ్ పటేల్ తన ఇన్స్టాగ్రామ్ చేసిన పోస్ట్ నెట్టింట చర్చనీయాశంగా మారింది.కరణ్ పటేల్ తన ఇన్‌స్టాలో రాస్తూ..'దేశంలో సాధారణ ఎన్నికలు ముగిశాయి. ఇండియా టీ20 ప్రపంచ కప్ గెలిచింది. దీపికా పదుకొణె బేబీ బంప్ వార్త కూడా మనందరికీ తెలిసింది. త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్న వారికి నా అభినందనలు. ఇప్పుడు తిరిగి పని చేసుకోవాల్సిన సమయం. కాస్టింగ్ అవకాశం ఉంటే ఎవరైనా నాకు తెలియజేయండి.' అంటూ సోషల్ మీడియాలో రాసుకొచ్చారు.బుల్లితెర నటుడు కరణ్ పటేల్ చివరిసారిగా 2020లో ‘కసౌతి జిందగీ కే’ అనే సీరియల్లో కనిపించారు. అంతే కాకుండా ఏక్తా కపూర్ నటించిన కహానీ ఘర్ ఘర్ కిలో కూడా కనిపించాడు. ప్రముఖ టీవీ సీరియల్ 'యే హై మొహబ్బతే'తో ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఇందులో అతనితో పాటు దివ్యాంక త్రిపాఠి కూడా నటించింది. అయితే గతంలో కరణ్ పటేల్‌కు రియాలిటీ షో బిగ్‌బాస్‌లో అవకాశం వచ్చినా తిరస్కరించాడు. -
పాలేరు నుంచి తమ్మినేని
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఎం పోటీ చేసే అభ్యర్థుల స్థానాలను ఆ పార్టీ రాష్ట్ర కార్య దర్శి తమ్మినేని వీరభద్రం ప్రకటించారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జాన్ వెస్లీ, మల్లు లక్ష్మి, టి. సాగర్, ఎండీ అబ్బాస్‌తో కలిసి ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రధానంగా మూడు నినాదాలతో సీపీఎం ఈ ఎన్నికల్లో ప్రజల ముందుకు వెళ్తుందని వెల్లడించారు. ’’మొదటిగా.. సమాజంలో అన్ని వర్గాల హక్కుల కోసం చట్ట సభల్లో పోరాడేందుకు సీపీఎంకు అసెంబ్లీలో ప్రాతి నిధ్యం ఇవ్వాలని అడుగుతాం. రెండో అంశంగా వామపక్ష అభ్యర్థులను బలపర్చాలని విజ్ఞప్తి చేస్తాం. మూడో అంశంగా.. దేశాన్ని చిన్నాభిన్నం చేస్తున్న బీజేపీకి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు గానీ.. గెలవగలిగే రెండు మూడు స్థానాల్లో కూడా అడ్డుకోవాలని కోరతాం.’’అని ఆయన వివరించారు. పొత్తుపై కాంగ్రెస్‌కు స్పష్టత లేదు వామపక్షాలతో పొత్తుల విషయంలో కాంగ్రెస్‌కు స్పష్టత లేదని, ఆ పార్టీ తీరు సరిగా లేదని తమ్మినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క సీటు ఇస్తామనీ, ఆ తర్వాత ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పినట్టు సీపీఐ ద్వారా తెలిసిందన్నారు. వామపక్ష ఐక్యతను దృష్టిలో ఉంచుకుని సీపీఐకి కాంగ్రెస్‌తో పొత్తు ఉన్న ప్పటికీ ఆ పార్టీ పోటీ చేస్తున్న స్థానాల్లో సీపీఎం తమ అభ్యర్థులను పోటీ పెట్టబోదన్నారు. తమ్మినేనికి భట్టి, జానారెడ్డి ఫోన్ కాగా, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, సీనియర్ కాంగ్రెస్ నేత జానారెడ్డిలు తమ్మినేని వీరభద్రానికి ఫోన్ చేసి పొత్తుల విషయంలో కాంగ్రెస్ అధిష్టానం చర్చిస్తుందని చెప్పారు. పొత్తు ఉండే అవకాశం ఉందని వెల్లడించారు. మరోవైపు పొత్తుల విషయంపై సీపీఐ.. కాంగ్రెస్ నుంచి అధికారిక ప్రకటన కోసం ఎదురుచూస్తోంది. ఎవరెవరు ఎక్కడెక్కడంటే సీపీఎం తరపున భద్రాచలం నియోజకవర్గంలో కారం పుల్లయ్య, అశ్వారావుపేటలో పిట్టల అర్జున్, పాలేరులో తమ్మినేని వీరభద్రం, మధిరలో పాలడుగు భాస్కర్, వైరాలో భూక్యా వీరభద్రం, ఖమ్మంలో ఎర్ర శ్రీకాంత్, సత్తుపల్లిలో మాచర్ల భారతి, మిర్యాలగూడలో జూలకంటి రంగారెడ్డి, నకిరేకల్‌లో బజ్జ చిన్న వెంకులు, భువనగిరిలో కొండమడుగు నర్సింహ్మ, జనగాంలో మోకు కనకారెడ్డి, ఇబ్రహీంపట్నంలో పగడాల యాదయ్య, పటాన్చెరులో జె.మల్లికార్జున్, ముషీరాబాద్‌లో ఎం.దశరథ్ పోటీ చేస్తారని తమ్మినేని ప్రకటించారు. మరో మూడు స్థానాలను త్వరలో ప్రకటిస్తామని తెలిపారు. అనంతరం ఎన్నికల మ్యానిఫెస్టోను విడుదల చేశారు. -
ఈశాన్య వర్షాలకు వాయుగుండం బ్రేక్!
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో ఈశాన్య రుతుపవనాల చురుకుదనానికి వాయుగుండం బ్రేకులు వేసింది. మళ్లీ ఇవి చురుకుదనం సంతరించుకోవడానికి మరికొన్ని రోజుల సమయం పట్టనుంది. ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని వాయుగుండం బలపడి మరో మూడు, నాలుగు రోజులు ఉత్తర ఈశాన్య దిశగా బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ తీరాల వైపు ప్రయాణించనుంది. ఈ వాయుగుండం గాలిలోని తేమను అటువైపు లాక్కుని పోతుండటంతో ఈశాన్య రుతుపవనాలు మన రాష్ట్రంపై ప్రభావం చూపలేకపోతున్నాయి. ఈ వాయుగుండం తీరాన్ని దాటే వరకు ఇదే పరిస్థితి కొనసాగనుంది. వాయుగుండం బెంగాల్ తీరాన్ని దాటడానికి ఇంకా నాలుగైదు రోజులు పడుతుంది. ఆ తర్వాత మరో రెండు మూడు రోజులకు గాని ఈశాన్య గాలుల్లో తేమ ఏర్పడే పరి స్థితి ఉండదు. అందువల్ల ఈశాన్య రుతుపవనాలు బలం పుంజుకోవడానికి కనీసం వారం రోజులైనా ప డుతుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నా రు. ఏపీలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవాలంటే అప్పటివరకు వేచి ఉండాల్సిందేనని చెబుతున్నారు. తీరానికి దూరంగా వాయుగుండం సాధారణంగా పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం గాని, వాయుగుండం గాని ఏర్పడితే ఏపీలో సమృద్ధిగా వర్షాలు కురుస్తాయి. కానీ ప్రస్తుత వాయుగుండం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోనే ఏర్పడినప్పటికీ అది తీరానికి దూరంగా ఉంది. పైగా ఈ వాయుగుండం ఆంధ్ర తీరం వైపు కాకుండా బెంగాల్ వైపు పయనిస్తూ పునరావృతం) చెందుతుంది. ఫలితంగా ఏపీలో వర్షాలు కురవడం లేదని వాతా వరణ నిపుణులు అంటున్నారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలకు వారమైనా పట్టవచ్చని చెబుతున్నారు. బలపడిన వాయుగుండం.. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం ఆదివారం సాయంత్రానికి తీవ్రవా యుగుండంగా బలపడింది. ఇది ఒడిశాలోని పారాదీప్‌కు దక్షిణంగా 550, పశ్చిమ బెంగాల్‌లోని దిఘాకు దక్షిణంగా 710 కి.మీల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈ తీవ్రవాయుగుండం సోమవారం వరకు ఉత్తర దిశగా కదులుతుంది. ఉత్తర ఈశాన్యంగా దిశ మార్చుకుంటూ రీకర్వ్ తీసుకుని బంగ్లాదేశ్ తీరం వైపు పయనిస్తుందని ఐఎండీ తెలిపింది -
లక్కీచాన్స్
దక్షిణాది ప్రేక్షకులకు హీరోయిన్ రెజీనా సుపరిచితురాలే. కానీ ఇటీవల కాలంలో ఈ బ్యూటీకి చెప్పుకోదగ్గ హిట్ దక్కలేదు. ఇలాంటి సమయంలో రెజీనాకు ఓ లక్కీచాన్స్ లభించిందని కోలీవుడ్ టాక్. అజిత్ హీరోగా మగిళ తిరుమేణి దర్శకత్వంలో ‘విడాముయార్చి’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో హీరోయిన్ గా త్రిష నటిస్తున్నారని సమాచారం. అలాగే కథ రీత్యా ఈ సినిమాలో మరో హీరోయిన్ కు చాన్స్ ఉందని, ఈ అవకాశం రెజీనా తలుపు తట్టిందనే టాక్ కోలీవుడ్‌లో వినిపిస్తోంది. మరి.. ఈ మూవీలో రెజీనా నటి స్తారా? లేదా? వేచి చూడాలి. లైకా ప్రోడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ విదేశాల్లో జరుగుతోంది. వచ్చే ఏడాది ఈ సినిమాని విడుదల చేయాలనుకుంటున్నారు. -
నిర్మాతకు డబ్బులొస్తే చాలు: డైరెక్టర్
‘ఎంతో కష్టపడితే దర్శకుడిగా ‘’తో తొలి చాన్స్ వచ్చింది. సినిమా బ్లాక్‌బస్టర్ అయిందా లేదా అన్నది కాదు.. నిర్మాతకు డబ్బులొస్తే అదే పెద్ద సక్సెస్’’ అని సాయి సునీల్ నిమ్మల అన్నారు. యామిన్ రాజ్, విరాట్ కార్తీక్, ప్రియాంక రేవ్రి లీడ్ రోల్స్‌లో నటించిన చిత్రం ‘ప్రేమదేశపు యువరాణి’. సాయి సునీల్ నిమ్మల దర్శకత్వంలో ఆనంద్ వేమూరి, హరిప్రసాద్ సీహెచ్ నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకకి అతిథులుగా హాజరైన నటులు అరవింద్ కృష్ణ, శివారెడ్డి మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రం ట్రైలర్,పాటలు చాలా బాగున్నాయి. సినిమా హిట్టవ్వాలి’’ అన్నారు. ‘‘ఈ సినిమాలో ప్రేమ, కుటుంబ భావోద్వేగాలు, డ్రామా ఉన్నాయి’’ అన్నారు యామిన్ రాజ్. -
Asian Games 2023: ఆసియా క్రీడల్లో ఆడనివ్వండి
న్యూఢిల్లీ: ఆసియా క్రీడల్లో భారత ఫుట్‌బాల్ జట్టుకు ఆడే అవకాశం కలి్పంచాలని కోరుతూ సీనియర్ టీమ్ హెడ్ కోచ్ ఐగర్ స్టిమాక్ దేశ ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. సెపె్టంబర్ 23 నుంచి చైనాలోని హాంగ్జూలో ఆసియా క్రీడలు జరగనున్నాయి. ఇందులో ఫుట్‌బాల్ క్రీడాంశంలో వివిధ దేశాలకు చెందిన అండర్–23 స్థాయి టీమ్‌లు పాల్గొంటాయి. ఈ జట్లలో ముగ్గురు సీనియర్ ఆటగాళ్లకు కూడా ఆడే వెసులుబాటు కలి్పస్తారు. అయితే టీమ్ ఈవెంట్లలో ర్యాంకింగ్స్‌లో టాప్–8లో ఉంటేనే మన జట్లను పంపిస్తామని భారత క్రీడా శాఖ మాత్రం విధానం రూపొందించుకుంది. ప్రస్తుతం ఆసియాలో భారత ఫుట్‌బాల్ జట్టు 18వ ర్యాంక్‌లో ఉంది. దాంతో ఫుట్‌బాల్ టీమ్‌ను పంపడానికి అవకాశం లేదు. దీనిపైనే ప్రధాని జోక్యం చేసుకోవాలంటూ స్టిమాక్ సోషల్ మీడియాలో సుదీర్ఘ లేఖ రాస్తూ ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. భారత్ 2017లో అండర్–17 ప్రపంచ కప్‌కు ఆతిథ్యమిచ్చింది. నాటి జట్టులో ఆడినవారే ఇప్పుడు అండర్–23 క్వాలిఫయర్స్‌లో మెరుగ్గా రాణించారు. ఈ కుర్రాళ్లలో మంచి ప్రతిభ ఉంది. కానీ ఇప్పుడు ఆసియా క్రీడల్లో మన జట్టు పాల్గొనకుండా అడ్డు చెబుతున్నారు. ఈ టీమ్‌లో అలాంటి ప్రతిష్టాత్మక ఈవెంట్లో పాల్గొనాలి. జట్టును పంపకుండా ఉండేందుకు చెబుతున్న కారణాలు సహేతుకంగా లేవు. అందుకే భారత్ కోచ్‌గా ఈ విషయాన్ని మీ దృష్టికి, కేంద్ర క్రీడాశాఖ దృష్టికి తీసుకొస్తున్నాను. కాబట్టి మీరు జోక్యం చేసుకొని జట్టు ఆసియా క్రీడల్లో పాల్గొనేలా చేయాలి అని స్టిమాక్ అన్నారు. ఎలాంటి ప్రత్యర్థినైనా ఓడించే సత్తా మన జట్టుకు ఉందని ఆయన అభిప్రాయ పడ్డారు. ‘ర్యాంకింగ్ పేరు చెప్పి మన క్రీడా శాఖనే జట్టు పాల్గొనకుండా చేస్తోంది. నిజానికి ఆసియా క్రీడల్లో పాల్గొంటున్న కొన్ని ఇతర క్రీడల టీమ్‌ల కంటే మన ఫుట్‌బాల్ జట్టు ర్యాంక్ మెరుగ్గానే ఉంది. పైగా తమకంటే బలమైన జట్లపై చిన్న టీమ్‌లు సంచలన విజయాలు సాధించడం ఫుట్‌బాల్‌లో అసాధ్యమేమీ కాదని చరిత్ర చెబుతోంది’ అని స్టిమాక్ అభిప్రాయపడ్డారు. ఇటీవల ఫ్రాన్స్ పర్యటనలో భాగంగా అక్కడి స్టార్ ఆటగాడు కిలియాన్ ఎంబాపె భారత్‌లో సూపర్‌హిట్ అని, అతనికి అక్కడికంటే మన దేశంలోనే ఎక్కువ మంది అభిమానులు ఉన్నారని నరేంద్ర మోదీ చెప్పిన విషయాన్ని స్టిమాక్ గుర్తు చేశారు. ‘ఫ్రాన్స్ పర్యటనలో ఎంబాపె గురించి మీరు చేసిన వ్యాఖ్య భారత ఫుట్‌బాల్‌ను అభిమానించేవారందరికీ సంతోషం కలిగించింది. మన జట్టు ఆసియా క్రీడల్లో పాల్గొనేలా చూడాలని భారత టీమ్ తరఫున మిమ్మల్ని కోరుతున్నా. క్రీడాశాఖ సూచనల్లో ఒక ప్రత్యేక నిబంధన కూడా ఉంది. టాప్–8లో లేకపోయినా సరైన కారణంతో నిపుణుల బృందం సిఫారసు చేస్తే ఆ టీమ్‌ను ఆసియా క్రీడలకు పంపవచ్చు. దీని ప్రకారం అవకాశం కలి్పంచండి’ అని స్టిమాక్ కోరారు. భారత ఫుట్‌బాల్ జట్టు 1951 న్యూఢిల్లీ, 1962 జకార్తా ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాలు... 1970 బ్యాంకాక్ ఆసియా క్రీడల్లో కాంస్య పతకం సాధించింది. ఆ తర్వాత పలుమార్లు భారత జట్టు ఆసియా క్రీడల్లో పాల్గొన్నా ఆరంభ రౌండ్లలోనే ని్రష్కమించింది. -
సీతగా నన్నే ఎందుకు ఎంపిక చేశారంటే: కృతి సనన్
టాలీవుడ్లో ప్రిన్స్ మహేష్ బాబు '1: నేనొక్కడినే' సినిమాతో వెండితెరమీదకొచ్చి బాలీవుడ్లో దూసుకుపోతోంది కృతి సనన్. రామాయణం నేపథ్యంలో వస్తున్న పాన్ ఇండియా సినిమా ‘ఆదిపురుష్’లో సీతగా రానుంది. రాముడిగా ప్రభాస్ నటించిన ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మించారు మేకర్స్. జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది ఈ చిత్రం. తాజాగా సీతగా తననే ఎందుకు ఎంపిక చేశారో కృతి సనన్ తెలిపింది. (ఇదీ చదవండి: కూతురి అన్నప్రాసన ఫోటో.. అభిమానులతో షేర్ చేసుకున్న హీరోయిన్) ''ఆదిపురుష్’లో ఛాన్స్ రావడం నా అదృం.. నా హైట్ ఎక్కువగా ఉండటం వల్ల గతంలో చాలా అఫర్లు వచ్చినట్లే వచ్చి, పోయాయి. కానీ ఆదిపురుష్ విషయంలో హైటే నాకు ప్లస్ అయింది. ప్రభాస్ మంచి ఎత్తు ఉన్న హీరో.. కాబట్టి నేను అయితేనే ఆయన పక్కన సెట్ అవుతానని మేకర్స్ సంప్రదించారు. సీతగా నన్ను ఎంపిక చేయడం చాలా సంతోషాన్ని ఇచ్చింది'. అని తెలిపింది. మొత్తానికి హైట్ కారణంగానే సీత పాత్ర కోసం తనను ఎంచుకున్నారని కృతి సనన్ వెల్లడించింది. దీంతో నెట్టింట్ట ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ప్రభాస్ ఫ్యాన్స్ అయితే కృతి సనన్‌కు ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు. ఈ సినిమాతో తెలుగులో మంచి అవకాశాలు వస్తాయని కామెంట్స్ చేశారు. (ఇదీ చదవండి: 'తమన్‌పై ట్రోల్స్.. భార్యగా బాధగానే ఉంటుంది') -
తెలంగాణ పోలిస్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. ఆ ‘హైట్’ ఉన్నవారికి మరో ఛాన్స్!
సాక్షి, హైదరాబాద్ : యూనిఫాం సర్వీసెస్ ఉద్యోగాల భర్తీలో భాగంగా అభ్యర్థులకు నిర్వహించిన ఎత్తు కొలతల్లో ఒక సెంటీమీటర్, అంతకంటే తక్కువ తేడాతో అనర్హులైన అభ్యర్థులకు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు మరో అవకాశం కల్పించనుంది. ఒక సెంటీమీటర్, ఆ లోపు తేడాతో అనర్హులైన అభ్యర్థులకు మరోమారు ఎత్తు కొలతలు తీయాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు టీఎస్ఎలీ్పఆర్బీ చైర్మన్ వీవీ శ్రీనివాసరావు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎత్తు కొలతలో పాల్గొనాలనుకునే అర్హులైన అభ్యర్థులు www.tslprb.in వెబ్సైట్ ఈనెల 10 ఉదయం 8 గంటల నుంచి 12వ తేదీ రాత్రి 8 గంటల వరకు లాగిన్ ఐడీల ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. హైదరాబాద్‌లోని ఎస్ఏఆర్ సీపీఎల్ అంబర్పేట్, 8వ బెటాలియన్ కొండాపూర్‌లలో ఈ ఎత్తు కొలతలను తీయనున్నట్లు వెల్లడించారు. భౌతిక కొలతలకు హాజరయ్యే అభ్యర్థులు అడ్మిట్‌కార్డులను తీసుకురావాల్సి ఉంటుందని, ఆన్లైన్లో దరఖాస్తు చేయకుండా వినతిపత్రాలు రాసి తెచ్చే వారిని ఎట్టిపరిస్థితుల్లో అనుమతించబోమని స్పష్టం చేశారు. -
తెలంగాణ నుంచి మరొకరికి కేంద్రమంత్రి పదవి..?
-
హాకీ ఇండియా...చలో టోక్యో...
భువనేశ్వర్: ఆఖరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న భారత పురుషుల, మహిళల హాకీ జట్లు వచ్చే ఏడాది జరిగే టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించాయి. శనివారం జరిగిన రెండో అంచె మ్యాచ్‌ల్లో భారత జట్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. తొలి మ్యాచ్‌లో 5–1తో అమెరికాపై భారత మహిళల జట్టు విజయం సాధించగా... రెండో అంచె మ్యాచ్‌లో టీమిండియాకు 1–4తో ఓటమి ఎదురైంది. భారత్, అమెరికా చెరో మ్యాచ్‌లో నెగ్గడంతో... నిబంధనల ప్రకారం రెండు మ్యాచ్‌ల్లో సాధించిన మొత్తం గోల్స్ ఆధారంగా బెర్త్ ఎవరికి దక్కాలో నిర్ణయించారు. ఇక్కడ భారత్ 6–5 గోల్స్ తేడాతో అమెరికాపై పైచేయి సాధించి ‘టోక్యో’ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. మరోవైపు తొలి అంచె మ్యాచ్‌లో రష్యాపై 4–2తో నెగ్గిన భారత పురుషుల జట్టు రెండో అంచె మ్యాచ్‌లో మాత్రం విశ్వరూపం ప్రదర్శించింది. ఏకంగా 7–1 గోల్స్ తేడాతో రష్యాను చిత్తు చేసి ‘టోక్యో’ బెర్త్‌ను తమ ఖాతాలో వేసుకుంది. మొత్తం గోల్స్‌లోనూ భారత్‌దే 11–3తో పైచేయిగా నిలిచింది. ఆదుకున్న రాణి రాంపాల్... తొలి అంచె మ్యాచ్‌లో అమెరికాను వణికించిన భారత మహిళల జట్టు రెండో మ్యాచ్‌లో మాత్రం తడబడింది. కనీసం నాలుగు గోల్స్ తేడాతో గెలిస్తేనే ‘టోక్యో’ బెర్త్ ఆశలు సజీవంగా ఉన్న పరిస్థితుల్లో అమెరికా ఆరంభం నుంచే ఎదురుదాడులు చేసింది. వారి దూకుడు ఫలితాన్నిచ్చింది. తొలి క్వార్టర్లో రెండు గోల్స్... రెండో క్వార్టర్లో మరో రెండు గోల్స్ చేసి 4–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. మూడో క్వార్టర్లో అమెరికాను నిలువరించిన భారత్ ఇంకో గోల్‌ను సమర్పించుకోలేదు. అప్పటికి మొత్తం గోల్స్ సంఖ్య (రెండు మ్యాచ్‌లవి కలిపి) 5–5తో సమఉజ్జీగా ఉంది. నాలుగో క్వార్టర్ మొదలైన మూడో నిమిషంలో అమెరికా ‘డి’ రక్షణ వలయంలో లభించిన సువర్ణావకాశాన్ని భారత కెప్టెన్ రాణి రాంపాల్ వదులుకోలేదు. కళ్లు చెదిరే షాట్‌తో బంతిని లక్ష్యానికి చేర్చిన రాణి రాంపాల్ భారత్ ఖాతాలో గోల్ చేర్చింది. దాంతో మొత్తం గోల్స్ సంఖ్యలో భారత్ 6–5తో ఆధిక్యంలోకి వచ్చింది. చివరి 12 నిమిషాల్లో అమెరికా దాడులను సమర్థంగా నిలువరించిన భారత మహిళల బృందం మ్యాచ్‌లో ఓడిపోయినా ‘టోక్యో’ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. ఒలింపిక్స్ క్రీడలకు భారత మహిళల హాకీ జట్టు అర్హత సాధించడం ఇది మూడోసారి (1980, 2016) మాత్రమే. మహిళల విభాగం భారత్ 1 ►రాణి రాంపాల్ (48వ ని.లో) అమెరికా 4 ►అమండా మగాడాన్ (5వ ని.లో) ►కాథ్లీన్ షార్కీ (14వ ని.లో) ►అలీసా పార్కర్ (20వ ని.లో) ►అమండా మగాడాన్ (28వ ని.లో) పురుషుల విభాగం భారత్ 7 ►లలిత్ ఉపాధ్యాయ్(17వ ని.లో) ►ఆకాశ్‌దీప్ సింగ్ (23వ ని.లో) ►ఆకాశ్‌దీప్ సింగ్ (27వ ని.లో) ►నీలకంఠ శర్మ (47వ ని.లో) ►రూపిందర్ సింగ్ (48వ ని.లో) ►రూపిందర్ సింగ్ (59వ ని.లో) ►అమిత్ రోహిదాస్ (60వ ని.లో) రష్యా 1 ►సబోలెవ్స్కీ (1వ ని.లో) -
నో ఛాన్స్!
పాతికేళ్లుగా కాకినాడలో అడ్రస్ లేని టీడీపీ 1992 తరువాత ప్రతి ఎన్నికలోనూ ఓటమే మున్సిపల్ ఎన్నికల్లో ఇదీ చరిత్ర ఈసారీ హిస్టరీ రిపీటేనా! కాకినాడ : కేంద్రంలో చక్రం తిప్పినా.. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినా.. జిల్లా కేంద్రం కాకినాడ మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం తెలుగుదేశంపార్టీ 25 ఏళ్లుగా అడ్రస్ లేని పరిస్థితిని ఎదుర్కొంటోంది. మున్సిపల్ ఎన్నికలు జరిగినా, కార్పొరేషన్ ఎన్నికలు జరిగినా కొద్దిపాటి కౌన్సిలర్ సీట్లతో గట్టెక్కడమే తప్ప అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకున్న దాఖలాలు లేవు. ప్రస్తుతం నగరపాలక సంస్థ ఎన్నికల్లో కూడా ‘హిస్టరీ రిపీట్’ కాగలదన్న సంకేతాలు ప్రజల నుంచే కనిపిస్తున్నాయి. ప్రభుత్వంపై నెలకొన్న తీవ్రమైన వ్యతిరేకత అవినీతిపాలన, పార్టీకేడర్లో తిరుగుబాటు నేపథ్యంలో ఈసారి కూడా అవే ఫలితాలు వస్తాయన్న పరిస్థితి కనిపిస్తోంది. 1987లో ఒకే ఒక్కసారి.. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రత్యక్ష పద్ధతిలో సింబల్స్‌పై తొలిసారిగా 1987లో ఎన్నికలు జరిపించారు. ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి జ్యోతుల సీతారామమూర్తి నేరుగా మున్సిపల్ ఛైర్మన్ అయ్యారు. అయితే అప్పుడు కూడా టీడీపీకి మెజార్టీ రాని పరిస్థితి ఎదురైంది. అప్పట్లో కాంగ్రెస్ 20 వార్డులను గెలుచుకోగా 18 టీడీపీ గెలుచుకుంది. ఆరుగురు టీడీపీ రెబల్స్ ఇండిపెండెంట్టుగా నెగ్గారు. ఆ పాలకవర్గం 1987 నుంచి 92 వరకు ఐదేళ్లపాటు కొనసాగింది. ఇక వరుస ఓటములే.. 1987–92 మధ్య ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచిన టీడీపీ ఆ తరువాత అన్నీ ఓటములే ఎదుర్కొంది. 92 నుంచి 95 వరకు ప్రత్యేకాధికారి పాలన కొనసాగింది. 1995లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ప్రభాజోసఫ్ కాంగ్రెస్ తరఫున మున్సిపల్ చైర్మన్‌గా నెగ్గారు. ఐదేళ్ల తరువాత 2000 సంవత్సరంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో డాక్టర్ బీరక చంద్రశేఖర్ కాంగ్రెస్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. తొలి మేయర్‌లో మట్టి కరిచిన టీడీపీ మున్సిపల్ ఎన్నికల్లో ఓటమిపాలవుతున్న టీడీపీ 2005లో జరిగిన తొలి కార్పొరేషన్ ఎన్నికల్లోనూ మట్టి కరిచింది. పరోక్ష పద్ధతిలో ఈ ఎన్నికలను నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ 30 కార్పొరేటర్లు గెలవగా తెలుగుదేశం 15 స్థానాలను మాత్రమే గెలుచుకోగలిగింది. దీంతో కాకినాడ తొలినగరపాలక సంస్థ తొలి మేయర్ పీఠాన్ని కాంగ్రెస్ గెలుచుకుంది. ఇలా ఎప్పుడు మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలు జరిగినా వరుస ఓటమిలతో కంగుతింటున్న టీడీపీ, మరోసారి ఎన్నికలకు వెళ్లేందుకు సాహసం చేయలేకపోతోంది. ఇందులో భాగంగానే ఎన్నికలు జరగకుండా సవాలక్ష సమస్యలు సృష్టించి ప్రస్తుత కార్పొరేషన్ ఎన్నికలు జరగకుండా టీడీపీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. -
ఛాన్స్ కావాలంటే అడ్జస్ట్ కావాలన్నాడు!
‘‘ఒక్క ఛాన్స్ కావాలా? అయితే ‘అడ్జస్ట్’ అవ్వాలి.. ఓకేనా?’’ అని అడిగేవాళ్లు ఉంటారని సినిమా రంగం గురించి తెలిసినవాళ్లు అంటుంటారు. ఒకప్పుడు రెజీనాకి ఇలాంటి సంఘటనే ఎదురైంది. ఆ విషయం గురించి ఓ ఆంగ్ల పత్రికతో రెజీనా మాట్లాడుతూ – ‘‘ఏడేళ్ల క్రితం నేనో తెలుగు సినిమా చేస్తున్నప్పుడు, ఎవరో వ్యక్తి ఒక తమిళ సినిమాకి అవకాశం ఇస్తానంటూ ఫోన్ చేశాడు. ఆ ఛాన్స్ కావాలంటే, కొన్ని అడ్జస్ట్మెంట్స్ చేయాలన్నాడు. అతనేం మాట్లాడుతున్నాడో అర్థం కాలేదు. ఫోన్ పెట్టాశాను’’ అన్నారు. ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు తమను తాము ఎలా కాపాడుకోవాలో మహిళలకు తెలిసుండాలని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు. -
క్లిక్ సినీ క్రాప్ట్ సినిమా ఛాన్స్
పాత గుంటూరు : స్థానిక కొరిటెపాడులోని ఎల్వీఆర్ అండ సన్స్ క్లబ్లో క్లిక్ సినీ క్రాఫ్ట్ ఆడిషన్స్(ఎంపికలు) సోమవారం అట్టహాసంగా జరిగాయి. నవతరంలో దాగిన ప్రతిభను వెలికితీసి చిత్ర పరిశ్రమకు పరిచయం చేయాలనే తలంపుతో క్లిక్ సినీ క్రాఫ్ట్ ఆడిషన్స్‌ను ప్రారంభించిందని ప్రముఖ సంగీత దర్శకుడు శశిప్రీతమ్ తెలిపారు. సోమవారం జరిగిన ఆడిషన్స్‌లో 200 మంది ఔత్సాహికులు పాల్గొన్నారన్నారు. మరో రెండు రోజులపాటు ఆడిషన్స్‌ను నిర్వహించనున్నామని, ఆసక్తిగల యువత సద్వినియోగపరుచుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో వర్ధమాన గాయని ప్రత్యూషశర్మ, వారి బృందం సభ్యులు పర్యవేక్షించారు. -
ఎమ్మెల్సీ ఎన్నికల్లో అవకాశం ఇవ్వండి
టీఎస్ పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు హర్షవర్ధన్‌రెడ్డి ఊట్కూర్ : రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్థానికుడిగా అవకాశం ఇవ్వాలని తెలంగాణ పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు హర్షవర్ధన్ రెడ్డి కోరారు. శనివారం సాయంత్రం బాలుర ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వం గుర్తించిన 2048 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, జీఓ 11ద్వారా 2000 ఉపాధ్యాయ పోస్టులు రావాల్సివుదని ఆరోపించారు. ప్రభుత్వం స్పెషల్ డీఎస్సీ నిర్వహించి ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలన్నారు. గతంలో గెలిచిన ఎమ్మెల్సీలు పాలమూరు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాల్లో నెలకొన్న విద్యా సమస్యలను పట్టించుకోలేదని, దీంతో పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు లేక విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. ప్రభుత్వం ఉపాధ్యాయునిలకు రెండేళ్ల చైల్డ్ కేర్ సెలవులు ఇవ్వాలని కోరారు. దసరా కానుకగా పీఆర్సీ బకాయిలను మంజూరు చేయాలని, భాష పండితులకు, పీఈటీలకు పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు. జిల్లాలో ఉపాధ్యాయులు లేక 23 ఉర్దు మీడియం పాఠశాలలు మూతపడ్డాయని అన్నారు. స్థానికుడిగా ఎన్నికల్లో గెలిపిస్తే విద్యాభివద్ధికి కషిచేస్తానన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రధానకార్యదర్శి మరికెంటి బాల్‌రాజ్, నాయకులు నారాయణరెడ్డి, రఘురాంగౌడ్, జనార్దన్, సుధాకర్, ఆంజనేయులు, సస్సేన, విశ్వనాథ్, రేణుక, జగన్నా«ద్, రవూఫ్, జలాల్ తదితరులు పాల్గొన్నారు. -
ఆవర్తన ప్రభావంతో తెలుగురాష్ట్రాల్లో వర్షాలు
-
నాటకరంగ అనుభవమే భుక్తి
ప్రముఖ సినీ నటుడు వైజాగ్‌ప్రసాద్ ఖమ్మం కల్చరల్ : ఆ నాటి నాటక రంగ అనుభవమే నేటి ముక్తికి మార్గమైందని ప్రముఖ సినీ నటుడు వైజాగ్ ప్రసాద్ పేర్కోన్నారు. నెలనెలా వెన్నెల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొనేందుకు ఖమ్మం వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుతం నటనా రంగంలో అనుభవంతో పనిలేకుండా ఎవరితో పడితే వాళ్లతో నటింపజేసి నాణ్యతలేని, జీవం లేని సినిమాలు, సీరియళ్లను నిర్మించడం దారుణమన్నారు. మరీ కొన్ని సినిమాలు, సీరియళ్లలో సంస్కృతి, సంప్రదాయాలను మంటగలిపేస్తున్నారని వాపోయారు. 50 ఏళ్లుగా నాటకాలు వేస్తున్నానని, సినిమాల్లో అనేక పాత్రలు చేశానని తెలిపారు. నాటకరంగలో రచన, నటన, దర్శకత్వం రంగాల్లో గుర్తింపు లభించిందని, అనేక అవార్డులొచ్చాయని చెప్పారు. మాట్లాడుతున్న వైజాగ్ ప్రసాద్ -
కాంచన హిట్‌తో తాప్సీ దశ తిరిగిందా ?
-
జిల్లాకు మరో ఎమ్మెల్సీ స్థానం?
- తెలంగాణకు పెరిగిన మూడు మండలి సీట్లు - స్థానాల పునర్విభజనకు ఈసీ కసరత్తు - స్థానిక సంస్థల కోటాలో మరో స్థానం లభించే ఛాన్స్ సాక్షి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి: జిల్లాకు మరో ఎమ్మెల్సీ స్థానం రానుంది. స్థానిక సంస్థల కోటాలో అదనపు సీటు లభించే అవకాశం ఉంది. రాష్ట్ర పునర్విభజన చట్టం మేరకు శాసన మండలి స్థానాల సంఖ్యను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్‌ను ప్రచురించడంతో త్వరలోనే ఈ సీటుపై స్పష్టత రానుంది. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న 11 ఎమ్మెల్సీ స్థానాలను 14కు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ సంఖ్యకు అనుగుణంగా మండలి సీట్ల పునర్విభజన ప్రక్రియను చేపట్టాలని ఎన్నికల కమిషన్‌ను ఆదేశించింది. ఈ నేపథ్యంలో కొంతకాలంగా ఎమ్మెల్సీ స్థానాల పెంపుపై కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. స్థానిక సంస్థల ప్రతినిధుల సంఖ్యకు అనుగుణంగా నియోజకవర్గాన్ని డీలిమిటేషన్‌ను చేయనున్నారు. జిల్లాలో ఐదు మున్సిపాలిటీల్లోని కౌన్సిలర్లు, ఎంపీటీసీ సభ్యులు సహా దాదాపు వేయి మంది ప్రజాప్రతినిధులున్నారు. దీనికితోడు జీహెచ్ఎంసీలో ప్రస్తుతం 48 డివిజన్లు మన జిల్లా పరిధిలో ఉన్నాయి. ప్రస్తుతం వీటి కాలపరిమితి ముగిసింది. త్వరలోనే వీటికి అదనంగా మరో 50 డివిజన్లు శివార్లలోనే ఏర్పడుతున్నాయి. వీటన్నింటినీ గమనంలోకి తీసుకుంటే జిల్లాకు అదనంగా మరో ఎమ్మెల్సీ స్థానం రావడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుతం స్థానిక సంస్థలకు ప్రాతినిధ్యం వహిస్తున్న పట్నం నరేందర్‌రెడ్డి పదవీకాలం వచ్చే నెలతో ముగియనుంది. ఈ నేపథ్యంలో అతిత్వరలోనే దీనికి ఎన్నికల షెడ్యూల్ వెలువడే ఛాన్స్ ఉంది. ఈ క్రమంలో ఈ ఎన్నికను కూడా పునర్విభజన అనంతరం పెరిగే సీట్లతో చేస్తారా? గడువులోపు చేస్తారా? అనే అంశంపై ఎన్నికల కమిషన్ స్పష్టీకరించడంలేదు. కేంద్ర ప్రభుత్వం గురువారమే గెజిట్ ప్రకటించినందున.. కేంద్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు పరిశీలించిన తర్వాతే దీనిపై క్లారిటీ వస్తుందని అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా, లోకల్‌బాడీ కోటాలో రెండు సీట్లు వస్తాయని గత కొంతకాలంగా భావిస్తున్న ఆశావహులు.. సీట్ల సంఖ్యపై మల్లగుల్లాలు పడుతున్నారు. బల్దియా పాలకవర్గం పదవీకాలం ముగియడంతో 48 డివిజన్లు ఖాళీగా ఉన్నందున ఇప్పట్లో స్థానిక సంస్థల కోటా ఎన్నికలు జరిగే అవకాశంలేదని కొందరు అంటున్నారు. అయితే, మొత్తం సీట్లలో 50శాతం సీట్లు తక్కువగా ఉంటే మాత్రమే ఎన్నిక వాయిదా పడుతుందని, ఇక్కడ మాత్రం ఆ పరిస్థితిలేదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఎమ్మెల్సీ స్థానాల పెంపుపై సీఈసీ కసరత్తు ప్రారంభిస్తున్నందున సరికొత్త ప్రచారానికి తెరలేచింది. సీట్ల పునర్విభజన పూర్తయితే తప్ప ఎన్నికలుండవనే వాదన తెరపైకి వస్తోంది. -
’గోల్డెన్ చాన్స్’ మిస్ అయిన రకుల్