
∙విరాట్, ప్రియాంక, యామిన్
‘ఎంతో కష్టపడితే దర్శకుడిగా ‘’తో తొలి చాన్స్ వచ్చింది. సినిమా బ్లాక్‌బస్టర్ అయిందా లేదా అన్నది కాదు.. నిర్మాతకు డబ్బులొస్తే అదే పెద్ద సక్సెస్’’ అని సాయి సునీల్ నిమ్మల అన్నారు. యామిన్ రాజ్, విరాట్ కార్తీక్, ప్రియాంక రేవ్రి లీడ్ రోల్స్‌లో నటించిన చిత్రం ‘ప్రేమదేశపు యువరాణి’. సాయి సునీల్ నిమ్మల దర్శకత్వంలో ఆనంద్ వేమూరి, హరిప్రసాద్ సీహెచ్ నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది.
ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకకి అతిథులుగా హాజరైన నటులు అరవింద్ కృష్ణ, శివారెడ్డి మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రం ట్రైలర్,పాటలు చాలా బాగున్నాయి. సినిమా హిట్టవ్వాలి’’ అన్నారు. ‘‘ఈ సినిమాలో ప్రేమ, కుటుంబ భావోద్వేగాలు, డ్రామా ఉన్నాయి’’ అన్నారు యామిన్ రాజ్.
Comments
Please login to add a commentAdd a comment