మాట్లాడుతున్న వైజాగ్ ప్రసాద్
- ప్రముఖ సినీ నటుడు వైజాగ్‌ప్రసాద్
ఖమ్మం కల్చరల్ : ఆ నాటి నాటక రంగ అనుభవమే నేటి ముక్తికి మార్గమైందని ప్రముఖ సినీ నటుడు వైజాగ్ ప్రసాద్ పేర్కోన్నారు. నెలనెలా వెన్నెల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొనేందుకు ఖమ్మం వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుతం నటనా రంగంలో అనుభవంతో పనిలేకుండా ఎవరితో పడితే వాళ్లతో నటింపజేసి నాణ్యతలేని, జీవం లేని సినిమాలు, సీరియళ్లను నిర్మించడం దారుణమన్నారు. మరీ కొన్ని సినిమాలు, సీరియళ్లలో సంస్కృతి, సంప్రదాయాలను మంటగలిపేస్తున్నారని వాపోయారు. 50 ఏళ్లుగా నాటకాలు వేస్తున్నానని, సినిమాల్లో అనేక పాత్రలు చేశానని తెలిపారు. నాటకరంగలో రచన, నటన, దర్శకత్వం రంగాల్లో గుర్తింపు లభించిందని, అనేక అవార్డులొచ్చాయని చెప్పారు.
మాట్లాడుతున్న వైజాగ్ ప్రసాద్