Gave
-
క్యాన్సర్తో పోరాడుతున్న పాపకు అడివి శేష్ సర్ప్రైజ్ (ఫోటోలు)
-
పెన్షన్లపై తప్పుడు ప్రచారం.. క్లారిటీ ఇచ్చిన సచ్చివాలయ సిబ్బంది
-
బాలింతలకు పండ్లు పంపిణీ
చిత్తూరు (అర్బన్): మాస మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీ సత్యసాయి సేవా సమితి నిర్వాహకులు సోమవారం స్థానిక ప్రభుత్వాసుపత్రిలో బాలింతలకు పండ్లు పంపిణీ చేశారు. అలాగే పిల్లలకు దుస్తులు, బిస్కెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సేవా సమితి సభ్యులు ఉమాపతినాయుడు, శివప్రకాష్, రాఘవులు, బద్రి, పద్మావతి, ప్రమీలమ్మ, శాంతమ్మ, మధుసూధన్ తదితరులు పాల్గొన్నారు. 19సీటీఆర్ 37– 26010010– బాలింతలకు పండ్లు పంపిణీ చేస్తున్న సేవా సమితి సభ్యులు -
హల్ చల్ చేస్తున్న 'డాడా-డింగ్'..!
దాదాపు పదిహేను రోజుల క్రితం కొత్తగా రిలీజైన ఓ ప్రకటన ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. నైక్ కమర్షియల్ ఫీచరింగ్ యాక్టర్ దీపికా పదుకొనె సహా 10 మంది భారత క్రీడాకారిణులు నటించిన యాడ్.. వైరల్ గా మారింది. ఇది.. కేవలం పురుష ప్రపంచమే కాదని, మహిళల్లోనూ మహామహులు ఉన్నారని ఈ కొత్త యాడ్ నిరూపిస్తోంది. గ్రామీణ ప్రాంతాలనుంచీ వచ్చినా... గట్టి పోటీని ఎదుర్కొని గగనతలాలను తాకిన మహిళా సాధికారతను ప్రపంచానికి చాటుతోంది. స్పోర్ట్స్ మాన్యుఫాక్చరింగ్ దిగ్గజం నైక్.. రూపొందించి, తాజాగా విడుదల చేసిన బెస్ట్ కమర్షియల్ యాడ్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. క్రియేటివ్ డైరెక్టర్ మహమ్మద్ రిజ్వాన్ సృజనాత్మకత ప్రకటనలో స్పష్టంగా కనిపిస్తూ అందర్నీ ఆకట్టుకుంటోంది. డాడా-డింగ్ అనే టైటిల్ తో విడుదలైన యాడ్ లో 12 మంది క్రీడాకారిణులతోపాటు.., వారి ఫిట్ నెస్ ట్రైనర్లు అదరహో అనిపించారు. 3 నిమిషాల నిడివితో ఉన్న యాడ్.. గ్రామీణ మహిళా శక్తిని సాక్షాత్కరిస్తోంది. గ్రామీణ మహిళలు డైలీ లైఫ్ లో ఎంత కష్టిస్తారో ఈ వీడియో ప్రత్యక్షపరుస్తోంది. శతాబ్దాలుగా నాలుగ్గోడల మధ్యా ఎటువంటి గుర్తింపూ లేకుండా మిగిలిపోతున్న మహిళా శక్తిని ప్రతిబింబింస్తూ ఈ ప్రకటన రూపొందింది. దీన్ని మహిళలకు అంకితమిస్తూ.. దర్శకుడు యూట్యూబ్ లో పోస్ట్ చేసిన కొద్ది రోజులకే ప్రశంసల వర్షం కురిపిస్తోంది. క్రికెటర్ హర్మాన్ ప్రీత్ కౌర్, హాకీ ప్లేయర్ రాణి రాం పాల్, ఫుట్ బాల్ ప్లేయర్ తన్వీ హంస్, మరో క్రికెటర్ స్మృతి మంధనా, స్క్వాష్ ప్లేయర్ జోష్నా చిన్నప్ప, ఫుట్ బాలర్ జ్యోతి, మరో క్రికెటర్ సుబ్బలక్ష్మి శర్మతో పాటు, స్ప్రింటర్ శ్వేతా హక్కే పర్సనల్ ట్రైనర్ శ్వేతా సుబ్బయ్య, సర్ఫర్ ఇషితా మాలవీయ, ఇన్ స్ల్రక్టర్, నమ్రతా పురోహిత్, ఫిట్ నెస్ ట్రైనర్ అర్మి కొథారె లతో కూడిన వీడియో ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. తమ తమ ఆటల్లో అద్భుత ప్రతిభను ప్రదర్శిస్తున్న క్రీడాకారిణులతో రూపొందిన యాడ్.. హల్ చల్ చేస్తోంది. -
నాటకరంగ అనుభవమే భుక్తి
ప్రముఖ సినీ నటుడు వైజాగ్ప్రసాద్ ఖమ్మం కల్చరల్ : ఆ నాటి నాటక రంగ అనుభవమే నేటి ముక్తికి మార్గమైందని ప్రముఖ సినీ నటుడు వైజాగ్ ప్రసాద్ పేర్కోన్నారు. నెలనెలా వెన్నెల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొనేందుకు ఖమ్మం వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుతం నటనా రంగంలో అనుభవంతో పనిలేకుండా ఎవరితో పడితే వాళ్లతో నటింపజేసి నాణ్యతలేని, జీవం లేని సినిమాలు, సీరియళ్లను నిర్మించడం దారుణమన్నారు. మరీ కొన్ని సినిమాలు, సీరియళ్లలో సంస్కృతి, సంప్రదాయాలను మంటగలిపేస్తున్నారని వాపోయారు. 50 ఏళ్లుగా నాటకాలు వేస్తున్నానని, సినిమాల్లో అనేక పాత్రలు చేశానని తెలిపారు. నాటకరంగలో రచన, నటన, దర్శకత్వం రంగాల్లో గుర్తింపు లభించిందని, అనేక అవార్డులొచ్చాయని చెప్పారు. మాట్లాడుతున్న వైజాగ్ ప్రసాద్ -
"నేను శివుడికి జన్మనిచ్చా.."
తన అందచందాలు గ్లామర్ తో యువతను వెర్రెత్తించిన మోడల్ సోఫియా హయత్ నటిగా కూడ ఎంతో పేరు సంపాదించుకుంది.. అంతేకాదు ఆమె.. తన మార్గాన్ని ఆథ్యాత్మికత వైపు మళ్ళించుకున్నట్లు, ఓ నన్ గా మారుతున్నట్లు ఇటీవల ఏకంగా ఓ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మరీ వెల్లడించింది. అయితే అక్కడితో ఆగని ఆమె.. ఇప్పుడు ఏకంగా శివుడికే జన్మనిచ్చానంటోంది. బిగ్ బాస్ రియాలిటీ షోలో పాల్గొని అభిమానులను తనవైపు తిప్పుకున్న నటి, మోడల్ సోఫియా హయత్... నన్ మారి, అందరికీ ఝలక్ ఇచ్చిన విషయం మరచిపోక ముందే.. మరో సంచలనం రేపింది. తాజాగా తన కెరీర్ కు గుడ్ బై చెప్పి, క్రిస్టియన్ నన్ గా అవతారమెత్తిన విషయం ఇటీవల సంచలనం రేపింది. ఈ నెల మొదట్లో ఓ మీడియా సమావేశం పెట్టిమరీ ఆ విషయాన్ని ఆవిడగారు అందరి ముందుకూ తెచ్చింది. ఇకపై తాను సన్యాసినిగా జీవించనున్నట్లు తెలిపిన ఆమె... తన జీవితాన్ని దేవుడి దగ్గరే ఎక్కువగా గడిపే ప్రయత్నం చేస్తానని, సమాజ సేవాకార్యక్రమాల్లోనూ పాల్గొంటానని చెప్పింది. ఇదంతా బాగానే ఉంది.. అక్కడే మరో ట్విస్ట్ ఇస్తూ ఇకపై తనను గయా మదర్ సోఫియా గా పిలవాలని విన్నవించింది. దీనికి తోడు జనానికి షాక్ ఇచ్చేలాంటి మరోవార్త వారి చెవిన పడేసింది. తాను ఇప్పటిదాకా అందంగా ఉండటంకోసం వక్షోజాలకు సిలికాన్ ఇంప్లాంట్ప్ పెట్టుకున్నాని, ఇప్పుడు సన్యాసినిగా మారుతుండటంతో వాటిని తీసివేస్తున్నానంటూ అందరికీ ప్రదర్శనకూడ ఇచ్చింది. అయితే ఇప్పటిదాకా చెప్పినదంతా సోఫియా హయత్ గతం... హాట్ మోడల్ నుంచి నన్ అవతారం నుంచి ఇప్పుడు ఏకంగా హిందూమతానికి చెందిన ఓ దేవుడికే జన్మనిచ్చానని చెప్తోంది. నన్ అవతారంలో కొన్నాళ్ళు కనిపించిన హయత్.. ఇటీవల కైలాష్ యాత్రకు వెళ్ళింది. యాత్రలో భాగంగా ఎల్లోరా, ఔరంగాబాద్ లలో తాను శివలింగంతో కలసి తీయించుకున్న ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసి, మరో సంచలనానికి తెర తీసింది. శివలింగంనుంచీ ఓ భారీ అయస్కాంత శక్తి వచ్చి తనలో ప్రవేశించిందని, అప్పుడు కనీసం తల పైకెత్తలేకపోయానని, ఇప్పుడు ఆ శక్తి ఏమిటో తనకు అర్థమైందని చెప్పిన ఆమె... చివరిగా తాను శివుడికి జన్మనిచ్చానంటోంది.