ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో పొల్గొనే భారతీయ క్రీడాకారుల యూనిఫాం డిజైన్‌పై అసంతృప్తి చెలరేగింది. ముఖ్యంగా తరుణ్ తహిలియానిపై విమర్శలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో భారత మాజీ బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాలా సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ముఖ్యంగా మహిళల దుస్తులపై అసహనం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. దీనికి సంబంధించి రియో ఒలింపిక్స్‌నాటి ఫొటోతో.. దుస్తులను, తమకెదురైన అసౌకర్యం గురించి తన అనుభవాన్ని షేర్ చేశారు. ఫోటోలను కూడా ట్వీట్ చేశారు.
After not much of thinking..
The garments which was made for the Indian contingent participating in Olympics this time has been a huge disappointment!! (Especially when the designer was announced I had huge expectations)
First not all girls know how to wear a saree…why didn’t… pic.twitter.com/b5UjzpvUJQ— Gutta Jwala 💙 (@Guttajwala) July 28, 2024
‘‘ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత బృందం కోసం తయారు చేసిన వస్త్రాలు నిరాశ పరుస్తూనే వస్తున్నాయి. టీమిండియా దుస్తులు డిజైనర్‌ను ప్రకటించాక నేనైతే భారీ అంచనాలే పెట్టుకున్నా. కానీ దాదాపు అమ్మాయిలందరికీ చీర కట్టుకోవడం రాదు. ప్రస్తుత ట్రెండ్‌కు అనుగుణంగా రెడీ టూ వేర్ చీరను డిజైన్ చేయాలన్ని కనీస ఆలోచన ఎందుకు చేయలేక పోయారో అర్థం కాలేదు. ఆ పిచ్చి బ్లౌజ్‌లు, బాడీకి ఫిట్ కాక చాలా ఇబ్బందులు పడ్డాం. అస్సలు సౌకర్యంగా లేవు. పైగానాసికరంగా, చూడటానికి దారుణంగా ఉన్నాయి. భారత సంప్రదాయాలను ప్రతిబింబించేలా చీరలపై ఎంబ్రాయిడరీ లేదా హ్యాండ్ పెయింట్ ద్వారా మన కళలను ప్రదర్శించేందుకు డిజైనర్లకు అవకాశం ఉన్నాఎందుకు ఉపయోగించుకోలేదు. ఇప్పటికైనా మైదానం లోపల, బైట క్రీడాకారులకు ఇచ్చే దుస్తుల నాణ్యతపై క్రీడాకుటుంబం రాజీ లేని ధోరణి అవలంబిస్తారని ఆశిస్తున్నాను’’ అంటూ ఆమె ట్వీట్ చేశారు.
దీంతో చాలామంది నెటిజన్లు కూడా గుత్తాజ్వాలకు మద్దతు పలికారు. ఇంట్రెస్టింగ్ షేడ్ అండ్ డిజైన్ ఉంటే బాగుండేది. అలాగే చుడీదార్ కుర్తా లేదా రెడీమేడ్ చీర అయితే బావుండేది. తరుణ్ తహిలియానీ భారతదేశ సంస్కృతిని ప్రదర్శించే మంచి అవకాశాన్ని కోల్పోయారని ఒకరు వ్యాఖ్యానించారు.
ఇదీ చదవండి : పీవీ సింధు ఒలింపిక్ చీరపై దుమారం.. నెట్టింట చర్చ
కాగా ప్యారిస్ ఒలింపిక్స్‌లో భారత మహిళా క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో క్రీడాకారిణి మను భాకర్ కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. ఇక ఇండియా స్టార్ షట్లర్ పీవీ సింధు చరిత్ర సృష్టించేందుకు రెడీ అవుతోంది. మూడో ఒలింపిక్ మెడల్ సాధించే క్రమంలో ఆదివారం జరిగిన గ్రూప్–ఎమ్ తొలి మ్యాచ్‌లో సింధు 21–9, 21–6తో ఫాతిమా అబ్దుల్ రజాక్ (మాల్దీవ్స్)పై విజయం సాధించి శుభారంభం చేసిన సంగతి తెలిసిందే. మంగళవారం జరిగే రెండో మ్యాచ్‌లో సింధు.. క్రిస్టినా కుబా (ఈస్టోనియా)తో తలపడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment