Indian athletes
-
Paris Paralympics 2024: భారత్ పతకాల మోత
పారాలింపిక్స్‌లో సోమవారం భారత క్రీడాకారులు పతకాల మోత మోగించారు. రెండు స్వర్ణ పతకాలు, మూడు రజతాలు, రెండు తో కలిపి మొత్తం ఏడు పతకాలను సొంతం చేసుకున్నారు. ఒకే రోజు భారత్ ఖాతాలో రెండు పసిడి పతకాలు చేరడం విశేషం. ముందుగా తొలిసారి పారాలింపిక్స్ లో ఆడుతున్న షట్లర్ నితేశ్ కుమార్ బంగారు పతకంతో అదరగొట్టగా... మూడేళ్ల క్రితం టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం నెగ్గిన జావెలిన్ త్రోయర్ సుమిత్ అంటిల్ అదే ప్రదర్శనను ‘పారిస్’లోనూ పునరావృతం చేశాడు. తద్వారా దేవేంద్ర ఝఝారియా, అవని లేఖరా తర్వాత పారాలింపిక్స్‌లో రెండు స్వర్ణ పతకాలు గెలిచిన మూడో భారత ప్లేయర్‌గా సుమిత్ అంటిల్ గుర్తింపు పొందాడు. పారిస్: అంచనాలను అందుకుంటూ భారత దివ్యాంగ క్రీడాకారులు సోమవారం పారాలింపిక్స్‌లో అదరగొట్టారు. ఏడు పతకాలతో తమ సత్తాను చాటుకున్నారు. పురుషుల బ్యాడ్మింటన్ సింగిల్స్ ఎస్ఎల్3 కేటగిరీలో నితేశ్ కుమార్ చాంపియన్‌గా అవతరించాడు. డేనియల్ బెథెల్ (బ్రిటన్) తో జరిగిన ఫైనల్లో నితేశ్ 21–14, 18–21, 23–21తో గెలుపొందాడు. నిర్ణాయక మూడో గేమ్‌లో నితేశ్ రెండుసార్లు మ్యాచ్ పాయింట్లను కాపాడుకొని నెగ్గడం విశేషం. పురుషుల బ్యాడ్మింటన్ సింగిల్స్ ఎస్ఎల్4 కేటగిరీలో ఐఏఎస్ ఆఫీసర్ సుహాస్ యతిరాజ్ మరోసారి రజత పతకంతో సరిపెట్టుకున్నాడు. గత టోక్యో పారాలింపిక్స్‌లోనూ రన్నరప్‌గా నిలిచిన సుహాస్ ఈసారీ రెండో స్థానాన్ని సంపాదించాడు. ఫైనల్లో 41 ఏళ్ల సుహాస్ 9–21, 13–21తో డిఫెండింగ్ చాంపియన్ లుకాస్ మజుర్ (ఫ్రాన్స్) చేతిలో ఓడిపోయాడు. మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్ ఎస్యు5 కేటగిరీలో భారత క్రీడాకారిణులు తులసిమతి రజతం పతకం నెగ్గగా ... మనీషా రామదాస్ కాంస్య పతకాన్ని సంపాదించింది. ఫైనల్లో తులసిమతి 17–21, 10–21తో యాంగ్ కియు జియా (చైనా) చేతిలో ఓడింది. కాంస్య పతక మ్యాచ్‌లో మనీషా 21–12, 21–8తో కేథరీన్ రొసెన్‌గ్రెన్ (డెన్మార్క్)పై విజయం సాధించింది. పురుషుల సింగిల్స్ ఎస్ఎల్4 కాంస్య పతక మ్యాచ్‌లో భారత ప్లేయర్ సుకాంత్ కదమ్ 17–21, 18–21తో ఫ్రెడీ సెతియవాన్ (ఇండోనేసియా) చేతిలో ఓడిపోయాడు. ‘సూపర్’ సుమిత్ అథ్లెటిక్స్‌లో భారత్‌కు ఒక స్వర్ణం, ఒక రజతంతో కలిసి రెండు పతకాలు దక్కాయి. పురుషుల జావెలిన్ త్రో ఎఫ్64 కేటగిరీలో డిఫెండింగ్ చాంపియన్ సుమిత్ అంటిల్ తన పసిడి పతకాన్ని నిలబెట్టుకున్నాడు. సుమిత్ రెండో ప్రయత్నంలో జావెలిన్‌ను 70.59 మీటర్ల దూరం విసిరాడు. ఈ ప్రయత్నం సుమిత్‌కు పసిడి పతకాన్ని ఖరారు చేసింది. నిరీ్ణత ఆరు త్రోల తర్వాత కూడా ఇతర అథ్లెట్లు సుమిత్ దరిదాపులకు రాలేకపోయారు. అంతకుముందు పురుషుల డిస్కస్ త్రో ఎఫ్56 కేటగిరీలో భారత అథ్లెట్ యోగేశ్ కథునియా రెండో స్థానంలో నిలిచి రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు. యోగేశ్ డిస్క్‌ను 42.22 మీటర్ల దూరం విసిరాడు. శీతల్–రాకేశ్ జోడీకి కాంస్యం ఆర్చరీ మిక్స్డ్ కాంపౌండ్ టీమ్ విభాగంలో శీతల్ దేవి–రాకేశ్ కుమార్ జంట కాంస్య పతకాన్ని దక్కించుకుంది. కాంస్య పతక మ్యాచ్‌లో శీతల్–రాకేశ్ 156–155తో ఎలెనోరా సారి్ట–మాటియో బొనాసినా (ఇటలీ) జంటపై గెలిచింది. సెమీఫైనల్లో శీతల్–రాకేశ్ ద్వయం ‘షూట్ ఆఫ్’లో ఇరాన్ చేతిలో ఓడిపోయి ఫైనల్ చేరలేకపోయింది. షూటింగ్లో నిహాల్ సింగ్, అమీర్ అహ్మద్ భట్ మిక్స్డ్ 25 మీటర్ల పిస్టల్ ఎస్‌హెచ్1 కేటగిరీలో క్వాలిఫయింగ్‌లోనే వెనుదిగిరారు. పారిస్ పారాలింపిక్స్‌లో భారత్ 3 స్వర్ణాలు, 5 రజతాలు, 6 కాంస్యాలతో కలిపి 14 పతకాలతో 14వ స్థానంలో ఉంది. -
భారత మహిళల, పురుషుల 4*400 రిలే జట్లు విఫలం..
పారిస్: ఒలింపిక్స్‌లో కనీస అంచనాలను అందుకోలేకపోయిన భారత మహిళల, పురుషుల జట్లు 4*400 మీటర్ల రిలే ఈవెంట్లలో నిరాశపరిచి హీట్స్‌లోనే వెనుదిరిగాయి. ఆంధ్రప్రదేశ్ అమ్మాయి దండి జ్యోతిక శ్రీ, విత్యా రాంరాజ్, పూవమ్మ రాజు, శుభా వెంకటేశన్‌లతో కూడిన భారత మహిళల జట్టు హీట్స్‌లో పోటీపడ్డ ఎనిమిది జట్లలో చివరిదైన ఎనిమిదో స్థానంలో నిలవడం గమనార్హం.భారత బృందం 3 నిమిషాల 32.51 సెకన్లలో రేసును పూర్తి చేసి చివరి స్థానాన్ని దక్కించుకుంది. ముందుగా విత్యా రేసును ఆరంభించి 53.46 సెకన్ల తర్వాత బ్యాటన్‌ను జ్యోతిక శ్రీకి అందించింది. జ్యోతిక శ్రీ వాయువేగంగా పరుగెత్తి 51.30 సెకన్ల తర్వాత బ్యాటన్‌ను పూవమ్మ రాజుకు అందించింది. పూవమ్మ 54.80 సెకన్ల తర్వాత శుభకు బ్యాటన్ ఇచ్చింది. శుభ 52.95 సెకన్లలో 400 మీటర్లను పూర్తి చేసింది. ఈ నలుగురిలో జ్యోతిక శ్రీ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. అనస్, అజ్మల్, అమోజ్, రాజేశ్‌లతో కూడిన భారత పురుషుల జట్టు 3 నిమిషాల 00.58 సెకన్లలో గమ్యానికి చేరి నాలుగో స్థానంలో నిలిచింది. ఓవరాల్‌గా భారత బృందం పదో స్థానాన్ని దక్కించుకుంది. -
ఒలింపిక్స్ లో దూసుకుపోతున్న భారత్ అథ్లెట్లు
-
ఆ మాత్రం ఆలోచన ఎందుకు రాదు : గుత్తా జ్వాల ఫైర్, ఫోటో వైరల్
ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో పొల్గొనే భారతీయ క్రీడాకారుల యూనిఫాం డిజైన్‌పై అసంతృప్తి చెలరేగింది. ముఖ్యంగా తరుణ్ తహిలియానిపై విమర్శలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో భారత మాజీ బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాలా సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ముఖ్యంగా మహిళల దుస్తులపై అసహనం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. దీనికి సంబంధించి రియో ఒలింపిక్స్నాటి ఫొటోతో.. దుస్తులను, తమకెదురైన అసౌకర్యం గురించి తన అనుభవాన్ని షేర్ చేశారు. ఫోటోలను కూడా ట్వీట్ చేశారు. After not much of thinking..The garments which was made for the Indian contingent participating in Olympics this time has been a huge disappointment!! (Especially when the designer was announced I had huge expectations)First not all girls know how to wear a saree…why didn’t… pic.twitter.com/b5UjzpvUJQ— Gutta Jwala 💙 (@Guttajwala) July 28, 2024‘‘ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత బృందం కోసం తయారు చేసిన వస్త్రాలు నిరాశ పరుస్తూనే వస్తున్నాయి. టీమిండియా దుస్తులు డిజైనర్‌ను ప్రకటించాక నేనైతే భారీ అంచనాలే పెట్టుకున్నా. కానీ దాదాపు అమ్మాయిలందరికీ చీర కట్టుకోవడం రాదు. ప్రస్తుత ట్రెండ్‌కు అనుగుణంగా రెడీ టూ వేర్ చీరను డిజైన్ చేయాలన్ని కనీస ఆలోచన ఎందుకు చేయలేక పోయారో అర్థం కాలేదు. ఆ పిచ్చి బ్లౌజ్‌లు, బాడీకి ఫిట్ కాక చాలా ఇబ్బందులు పడ్డాం. అస్సలు సౌకర్యంగా లేవు. పైగానాసికరంగా, చూడటానికి దారుణంగా ఉన్నాయి. భారత సంప్రదాయాలను ప్రతిబింబించేలా చీరలపై ఎంబ్రాయిడరీ లేదా హ్యాండ్ పెయింట్ ద్వారా మన కళలను ప్రదర్శించేందుకు డిజైనర్లకు అవకాశం ఉన్నాఎందుకు ఉపయోగించుకోలేదు. ఇప్పటికైనా మైదానం లోపల, బైట క్రీడాకారులకు ఇచ్చే దుస్తుల నాణ్యతపై క్రీడాకుటుంబం రాజీ లేని ధోరణి అవలంబిస్తారని ఆశిస్తున్నాను’’ అంటూ ఆమె ట్వీట్ చేశారు.దీంతో చాలామంది నెటిజన్లు కూడా గుత్తాజ్వాలకు మద్దతు పలికారు. ఇంట్రెస్టింగ్ షేడ్ అండ్ డిజైన్ ఉంటే బాగుండేది. అలాగే చుడీదార్ కుర్తా లేదా రెడీమేడ్ చీర అయితే బావుండేది. తరుణ్ తహిలియానీ భారతదేశ సంస్కృతిని ప్రదర్శించే మంచి అవకాశాన్ని కోల్పోయారని ఒకరు వ్యాఖ్యానించారు.ఇదీ చదవండి : పీవీ సింధు ఒలింపిక్ చీరపై దుమారం.. నెట్టింట చర్చ కాగా ప్యారిస్ ఒలింపిక్స్‌లో భారత మహిళా క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో క్రీడాకారిణి మను భాకర్ కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. ఇక ఇండియా స్టార్ షట్లర్ పీవీ సింధు చరిత్ర సృష్టించేందుకు రెడీ అవుతోంది. మూడో ఒలింపిక్ మెడల్ సాధించే క్రమంలో ఆదివారం జరిగిన గ్రూప్–ఎమ్ తొలి మ్యాచ్‌లో సింధు 21–9, 21–6తో ఫాతిమా అబ్దుల్ రజాక్ (మాల్దీవ్స్)పై విజయం సాధించి శుభారంభం చేసిన సంగతి తెలిసిందే. మంగళవారం జరిగే రెండో మ్యాచ్‌లో సింధు.. క్రిస్టినా కుబా (ఈస్టోనియా)తో తలపడుతుంది. -
Olympics: చేరువై... దూరమై!
చిక్కినట్లే చిక్కి చేజారితే కలిగే బాధ వర్ణణాతీతం! ఒలింపిక్స్ వంటి ప్రతిష్ఠాత్మక వేదికపై పతకం పట్టాలని ప్రతి అథ్లెట్ కలలు కంటాడు. ఏళ్ల తరబడి కఠోర సాధన, అలుపెరగని పోరాటం చేస్తూనే ఉంటారు. మరి అలాంటిది... మెడల్‌కు అత్యంత చేరువైన తర్వాత అందినట్లే అంది ఆ విజయం దూరమైతే కలిగే బాధ అంతా ఇంతా కాదు! ప్రస్తుతం జరుగుతున్న పారిస్ ఒలింపిక్స్ క్రీడల్లో పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్లో భారత షూటర్ అర్జున్ బబుతాకు ఇలాంటి మనసు వికలమయ్యే అనుభవం ఎదురైంది. అయితే త్రుటిలో పతకాలు చేజార్చుకున్న భారత ప్లేయర్లలో అర్జున్ బబూతా మొదటి క్రీడాకారుడేమీ కాదు... గతంలోనూ పలుమార్లు విశ్వ క్రీడల్లో భారత్‌కు ఎదురైన ఇలాంటి చేదు అనుభవాలను పరిశీలిస్తే... ఫుట్‌బాల్‌తో మొదలు 1956 మెల్బోర్న్ ఒలింపిక్స్‌లో భారత ఫుట్‌బాల్ జట్టు అద్భుత ప్రదర్శన కనబర్చింది. హైదరాబాదీ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ శిక్షణలో రాటుదేలిన మన జట్టు.. ప్రత్యర్థులకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. క్వార్టర్స్‌లో ఆతిథ్య ఆ్రస్టేలియాపై నెవిల్లె డిసౌజా హ్యాట్రిక్ గోల్స్‌తో విజృంభించడంతో సెమీస్‌లో అడుగుపెట్టి పతకం సాధించడం ఖాయమే అనిపించింది. అయితే యుగోస్లో వియాతో జరిగిన సెమీఫైనల్లో భారత్ 1–4తో పరాజయం పాలైంది. కాంస్య పతక పోరులోనూ తడబడ్డ భారత్ 0–3తో బల్గేరియా చేతిలో ఓడి నాలుగో స్థానంతో నిరాశగా వెనుదిరిగింది. మిల్కా సింగ్ వెంట్రుకవాసిలో... 1960 రోమ్ ఒలింపిక్స్‌లో భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన భారత స్టార్ అథ్లెట్ మిల్కాసింగ్.. నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు. పురుషుల 400 మీటర్ల పరుగులో సమీప ప్రత్యరి్థని చూసే క్రమంలో క్షణకాలాన్ని వృథా చేసుకున్న మిల్కా.. దానికి జీవితకాల మూల్యం చెల్లించుకున్నాడు. రోమ్ ఒలింపిక్స్ అనుభవంతో అథ్లెటిక్స్కే వీడ్కోలు పలకాలని నిర్ణయించుకున్నాడు. అతి బలవంతంగా అతడిని తిరిగి ట్రాక్ ఎక్కించగా.. 1962 ఆసియా క్రీడల్లో రెండు స్వర్ణ పతకాలతో సత్తాచాటాడు. మహిళల హాకీలో ఇలా.. 1980 మాస్కో విశ్వ క్రీడల్లో భారత మహిళల హాకీ జట్టు చక్కటి అవకాశాన్ని అందిపుచ్చుకోలేకపోయింది. అఫ్గానిస్తాన్‌పై ఆతిథ్య సోవియట్ యూనియన్ దాడి చేసిన నేపథ్యంలో నెదర్లాండ్స్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ వంటి దేశాలు మాస్కో క్రీడలను బహిష్కరించాయి. దీంతో మన జట్టు పోడియంపై నిలవడం ఖాయమే అనిపించింది. ఆ్రస్టియా, పోలాండ్‌పై ఘనవిజయాలు సాధించిన మన మహిళల జట్టు పతకంపై ఆశలు రేపింది. అయితే ఆ తర్వాత జింబాబ్వేతో మ్యాచ్ ‘డ్రా’ కాగా.. చెకోస్లోవియా, సోవియట్ యూనియన్ చేతిలో ఓడి నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. పరుగుల రాణికి తీరని వ్యథ! 1984 లాస్ఏంజెలిస్ క్రీడల్లో పరుగుల రాణి పీటీ ఉషకు ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. మహిళల 400 మీటర్ల హర్డిల్స్‌లో సెకనులో వందో వంతు తేడాతో పీటీ ఉష నాలుగో స్థానానికి పరిమితమైంది. అంతర్జాతీయ స్థాయిలో ఏ పోటీలోనైనా ఒక భారత అథ్లెట్ పతకం కోల్పోయిన అత్యల్ప తేడా ఇదే. ఫైనల్లో ఉష 55.42 సెకన్లలో లక్ష్యాన్ని చేరింది. జాయ్దీప్కు నిరాశ 2012 లండన్ ఒలింపిక్స్‌లో జాయ్దీప్ కర్మాకర్‌కు అర్జున్‌లాంటి అనుభవమే ఎదురైంది. పురుషుల 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ విభాగంలో బరిలోకి దిగిన కర్మాకర్ క్వాలిఫికేషన్ రౌండ్లో చక్కటి ప్రదర్శన కనబర్చి ఏడో స్థానంతో ఫైనల్‌కు అర్హత సాధించాడు. అయితే తుదిపోరులో కాంస్యం గెలిచిన షూటర్ కంటే.. 1.9 పాయింట్లు వెనుకబడిన కర్మాకర్ నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు. దీపా కర్మాకర్ త్రుటిలో... 2016 రియో ఒలింపిక్స్‌లో భారత స్టార్ జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ త్రుటిలో కాంస్య పతకం చేజార్చుకుంది. వాల్ట్ ఫైనల్లో దీపా కర్మాకర్ 15.066 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచింది. కాంస్యం గెలిచిన జిమ్నాస్ట్‌కు దీపా కర్మాకర్‌కు మధ్య 0.150 పాయింట్ల తేడా మాత్రమే ఉండటం గమనార్హం. ఇదే క్రీడల్లో భారత షూటర్ అభినవ్ బింద్రా నాలుగో స్థానంలో నిలిచి కాంస్య పతకం చేజార్చుకున్నాడు. మహిళల హాకీ జట్టు మరోసారి 2020 టోక్యో ఒలింపిక్స్‌లో మరోసారి భారత మహిళల హాకీ జట్టుకు నిరాశ తప్పలేదు. 1980 మాస్కో క్రీడల్లో త్రుటిలో కాంస్యం చేజార్చుకున్న మహిళల జట్టు.. టోక్యోలోనూ అదే బాటలో నడిచింది. మూడుసార్లు ఒలింపిక్ చాంపియన్ ఆ్రస్టేలియాను మట్టికరిపించి ఆశలు రేపిన మన అమ్మాయిలు.. సెమీఫైనల్లో అర్జెంటీనా చేతిలో పరాజయం పాలయ్యారు. కాంస్య పతక పోరులోనైనా అద్భుతం చేస్తారనుకుంటే.. ఇంగ్లండ్‌తో పోరులో ఆరంభంలో ఆధిక్యం సాధించినా.. చివర్లో పట్టు విడిచి 3–4తో నాలుగో స్థానానికి పరిమితమయ్యారు. ఇదే క్రీడల్లో ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన గోల్ఫర్ అదితి అశోక్ నాలుగో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని కోల్పోయింది. ఈసారి ఇద్దరు.. 2004 ఎథెన్స్ ఒలింపిక్స్‌లో లియాండర్ పేస్–మహేశ్ భూపతి జంట నాలుగో స్థానంలో నిలిచింది. భారత అత్యుత్తమ ద్వయంగా విశ్వక్రీడల బరిలోకి దిగిన పేస్–భూపతి హోరాహోరీగా సాగిన కాంస్య పతక పోరులో 6–7, 6–4, 14–16తో అన్సిచ్–లుబిసిచ్ (క్రొయేషియా) జోడీ చేతిలో పరాజయం పాలైంది. -
Mann ki Baat: చీర్ఫర్ భారత్
సాక్షి, న్యూఢిల్లీ: ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొంటున్న మన క్రీడాకారులను మరింత ఉత్సాహపరుద్దామని, వారిని ప్రోత్సహిద్దామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. భారత అథ్లెట్లకు ప్రజలంతా మద్దతు ఇవ్వాలని కోరారు. ఛీర్ ఫర్ భారత్ అని ఉద్ఘాటించారు. అంతర్జాతీయ వేదికపై భారత జాతీయ పతాకాన్ని రెపరెపలాడించే అవకాశం ఒలింపిక్స్ క్రీడల ద్వారా మన ఆటగాళ్లకు వచ్చిందన్నారు. వారికి మనమంతా అండగా నిలవాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రధాని మోదీ ఆదివారం ‘మన్‌కీ బాత్’లో ప్రజలను ఉద్దేశించి రేడియోలో ప్రసంగించారు. వివిధ అంశాలను ప్రస్తావించారు. కొన్ని రోజుల క్రితం గణితశాస్త్రంలో ఒలింపిక్స్ జరిగాయని, నలుగురు భారతీయు విద్యార్థులు బంగారు పతకాలు, ఒకరు రజత పతకం సాధించారని ప్రశంసించారు. అస్సాంలోని అహోమ్ రాజుల సమాధులకు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కట్టడాల జాబితాలో స్థానం దక్కడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఇది మనకు గర్వకారణమని అన్నారు. నేటి యువత మాదక ద్రవ్యాల విష వలయంలో చిక్కుకుంటుండడం బాధాకరమని అన్నారు. అలాంటి వారిని బయటకు తీసుకురావడానికి ‘మానస్’ పేరుతో ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. డ్రగ్స్‌పై పోరాటంలో ఇదొక గొప్ప ముందడుగు అవుతుందన్నారు. మాదక ద్రవ్యాల వ్యసనానికి సంబంధించి ‘1933’ టోల్‌ఫ్రీ నెంబర్‌కు ఫోన్ చేసి సహాయం పొందవచ్చని సూచించారు.ప్రతి ఇంటా మువ్వన్నెల జెండా ఎగరాలి ‘‘త్వరలో స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకోబోతున్నాం. ఈ సందర్భంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలి. మువ్వన్నెల జెండాతో సెల్ఫీ దిగి హర్గర్తిరంగా.కామ్ వెబ్సైట్లో అప్లోడ్ చేయండి. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలి. ఖాదీ గ్రామోద్యోగ్ వ్యాపారం తొలిసారిగా రూ.1.5 లక్షల కోట్లకు చేరుకుంది. ఖాదీ, చేనేత వ్రస్తాల విక్రయాలు పెరుగుతున్నాయి. దీనివల్ల నూతన ఉద్యోగాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఎంతోమందికి ఉపాధి లభిస్తోంది. ఖాదీ ఉత్పత్తులను ఉపయోగించడానికి ఇష్టపడినవారు ఇప్పుడు వాటిపై ఆసక్తి చూపుతున్నారు. ఖాదీ వస్త్రాలు ధరిస్తున్నారు. హరియాణాలోని రోహతక్‌లో 250 మంది మహిళలు బ్లాక్ పెయింటింగ్, డయింగ్ శిక్షణతో జీవితాలను తీర్చిదిద్దుకున్నారు’’ అని మోదీ ప్రశంసించారు.నల్లమల చెంచులు టైగర్ ట్రాకర్స్ ఆంధ్రప్రదేశ్‌లోని నల్లమల అడవుల్లో నివసించే చెంచులను ప్రధాని మోదీ ప్రశంసించారు. వారిని టైగర్ ట్రాకర్స్‌గా అభివరి్ణంచారు. ‘‘ఆంధ్రప్రదేశ్‌లోని నల్లమల కొండలపై నివసించే చెంచు తెగల ప్రయత్నాలు చూస్తే ఆశ్చర్యపోతాం. టైగర్ ట్రాకర్స్‌గా వారు అడవిలో వన్యప్రాణుల సంచారంపై ప్రతి చిన్న సమాచారం సేకరిస్తారు. అటవీ ప్రాంతంలో అక్రమ కార్యక్రమాలపైనా నిఘా పెడతారు. టైగర్ ఫ్రెండ్స్‌గా వ్యవహరించే వీరు మానవులు, పులుల మధ్య ఎలాంటి వైరం లేకుండా చూస్తారు. చెంచుల కృషితో పులుల సంఖ్య పెరుగుతోంది’’ అని ‘మన్‌కీ బాత్’లో కొనియాడారు. దేశవ్యాప్తంగా పులుల జనాభా గొప్ప విజయమని పేర్కొన్నారు. ప్రపంచంలోని మొత్తం పులుల్లో 70 శాతం పులులు మన దేశంలోనే ఉన్నాయని చెప్పారు. ఇది మనకు చాలా గర్వకారణమని చెప్పారు.అభివృద్ధి, వారసత్వాలకు పెద్దపీటన్యూఢిల్లీ: భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా అవతరింపజేయడమే ఏకైక లక్ష్యంగా వికసిత్ భారత్ అజెండా ఉంటుందని ప్రధాని మోదీ స్పష్టంచేశారు. అయితే వికసిత్ భారత్ అజెండాలో ప్రాచీన, వారసత్వ కట్టడాలు, సంస్కృతులను కాపాడుకుంటూనే అభివృద్ధికి పెద్దపీట వేస్తామని ఆయన అన్నారు. ఆదివారం ఢిల్లీలో బీజేపీపాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మోదీ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ‘ముఖ్యమంత్రి పరిషత్’ భేటీలో 13 మంది సీఎంలు, 15 మంది డిప్యూటీ సీఎంలు పాల్గొన్నారు. ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థికవ్యవస్థగా భారత్‌ను తీర్చిదిద్దడం, సంక్షేమ పథకాల్లో ప్రజల భాగస్వామ్యంపై ప్రధాని మాట్లాడారు. సమాజంలోని భిన్న వర్గాల్లో చిట్టచివరి వ్యక్తికి సైతం కేంద్ర పథకాలు, సుపరిపాలన గురించి తెలిసేలా సామాజిక మాధ్యమాలను వినియోగించుకోవాలని సీఎంలు, డిప్యూటీ సీఎంలకు మోదీ సూచించారు. కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్, అమిత్‌షా, జేపీ నడ్డా, ధర్మేంద్ర ప్రధాన్ తదితరలు ఈ భేటీలో పాల్గొన్నారు. నూతన జాతీయ విద్యా విధానాన్ని రాష్ట్రాలు ఎలా సమర్థంగా అమలు చేయాలో మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వివరించారు. ‘‘సంక్షేమ పథకాలు లబ్దిదారులందరికీ అందేలా చూడటం మీ తక్షణ కర్తవ్యం. బీజేపీపాలిత రాష్ట్రాలు సుపరిపాలనకు సిసలైన చిరునామాగా మారాలి’’ అని మోదీ అన్నారు. -
పీవీ సింధు ఒలింపిక్ చీరపై దుమారం
అట్టహాసంగా ప్రారంభమైన ప్యారిస్ ఒలింపిక్స్ 2024 ప్రారంభ వేడుకల్లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఫ్లాగ్ బేరర్‌గా అరుదైన గౌరవాన్ని సాధించింది. మువ్వన్నెల చీరలో భారత పతాకాన్ని చేబూని భారత అథ్లెట్ల బృందానికి సారథ్యం వహించింది. దీనికి సంబందించిన ఫోటోలను పీవీ సింధు సోషల్ మీడియాలో షేర్ చేసింది. తన జీవితంలో ఇంతకంటే గొప్ప గౌరవం మరేదీ ఉండదంటూ తన ఆనందాన్ని ప్రకటించింది.Hello Tarun Tahiliani!I have seen better Sarees sold in Mumbai streets for Rs.200 than these ceremonial uniforms you’ve ‘designed’.Cheap polyester like fabric, Ikat PRINT (!!!), tricolors thrown together with no imagination Did you outsource it to an intern or come up with it… https://t.co/aVkXGmg80K— Dr Nandita Iyer (@saffrontrail) July 27, 2024భారతీయ ఒలింపిక్ యూనిఫాంపై దుమారంఅయితే అంతర్జాతీయ క్రీడా వేదికపై పీవీ సింధు కట్టుకున్న చీరపై దుమారం రేగింది. తరుణ తహిలియానీ డిజైన్ చేసిన దుస్తులు చాలా పేలవంగా ఉన్నాయంటూ బెంగళూరుకు చెందిన రచయిత డాక్టర్ నందితా అయ్యర్ ఎక్స్‌లో ఒక పోస్ట్ పెట్టారు. మీరు ‘డిజైన్ చేసిన’ ఈ యూనిఫామ్‌ల కంటే మెరుగైన చీరలు రూ.200లకు ముంబై వీధుల్లో అమ్మడం నేను చూశాను. చౌకైన పాలిస్టర్ వస్త్రంతో, ఇకత్ ప్రింట్((!!!) త్రివర్ణమనే ఊహకు అందకుండా గజిబిజిగా అద్దిన రంగులతో అధ్వాన్నంగా ఉందంటూ విమర్శించారు. అంతేకాదు ఇంటర్న్‌కి అవుట్సోర్స్ చేశారా? లేక ఆఖరి 3 నిమిఫాల్లో హడావిడిగా డిజైన్ చేశారా? అంటూ ఆమె మండి పడ్డారు. భారతదేశ సుసంపన్నమైన నేత సంస్కృతికి, చరిత్రకు ఇది అవమానం అటూ నందితా అయ్యర్ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలు ఈ డిజైనర్ దుస్తులను ధరించిన క్రీడాకారిణి పట్ల అగౌరవం కాదని కూడా వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్‌లో భారతీయ ఒలింపిక్ యూనిఫాంపై ఎన్ఐఎఫ్టీ బెంగళూరు మాజీ డైరెక్టర్ సుసాన్ థామస్ (అఫ్సర్నామా) ఇన్‌స్టాగ్రామ్‌లో దృక్కోణాన్ని కూడా ప్రస్తావించారు. కాగా ఒలింపిక్స్ చరిత్రలోనే తొలిసారిగా ఫ్యాషన్ రాజధాని పారిస్‌లో, నదిలో జరిగిన సంబరాలు ఆద్యంతం ఆకట్టుకున్నాయి. పీవీ సింధు, టేబుల్ టెన్నిస్ ఛాంపియన్ శరత్ కమల్ భారతీయ జెండా బేరర్లుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్, అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు థామస్ బాక్ సహా దిగ్గజ అథ్లెట్లు ఇందులో పాల్గొన్నారు.TEAM INDIA IS HERE TO WIN 🇮🇳🫶💙#OpeningCeremony #Paris2024 #Olympic2024 #Paris #ParisOlympics #ParisOlympics2024 #paris2024olympics #Olympics #Olympics2024Paris #OlympicGames pic.twitter.com/7ELyTEFpMV— Ankit Avasthi Sir 🇮🇳 (@ankitavasthi01) July 27, 2024ప్రారంభ వేడుక కోసం ప్రఖ్యాత డిజైనర్ తరుణ్ తహిలియాని భారతీయ అథ్లెట్ల కోసం ప్రపంచ వేదికపై భారతీయ వారసత్వాన్ని హైలైట్ చేసే అసాధారణమైన దుస్తులను రూపొందించారు. పురుష అథ్లెట్లు తెల్లటి కుర్తా , నారింజ , ఆకుపచ్చ నక్సీ వర్క్‌తో అలంకరించబడిన బూండీ జాకెట్ ధరించగా. ఈ జాకెట్లపై 'ఇండియా' ఇన్ స్రిప్ట్, ఒలింపిక్ లోగో ఉన్న పాకెట్స్ కూడా ఉన్నాయి. మహిళలకు మూడు రంగుల మేళవింపుతో చీర, జాకెట్టును డిజైన్ చేశారు. -
పతకాల పంట
హాంగ్జౌ: ఆసియా పారా క్రీడల్లో భారత క్రీడాకారులు పతకాల పంట పండిస్తున్నారు. పోటీల మూడో రోజు బుధవారం భారత్ ఖాతాలో 30 పతకాలు చేరాయి. ఇందులో ఆరు స్వర్ణ పతకాలు ఉన్నాయి. పురుషుల జావెలిన్ త్రో ఎఫ్64 కేటగిరీలో సుమిత్ అంటిల్ కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పి పసిడి పతకం గెలిచాడు. సుమిత్ జావెలిన్‌ను 73.29 మీటర్ల దూరం విసిరి 70.83 మీటర్లతో తన పేరిటే ఉన్న పాత ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. జావెలిన్ త్రో ఎఫ్46 కేటగిరీలో భారత్‌కే చెందిన సుందర్ సింగ్ గుర్జర్ కూడా కొత్త ప్రపంచ రికార్డు సృష్టించి స్వర్ణ పతకం గెలిచాడు. సుందర్ జావెలిన్‌ను 68.60 మీటర్ల దూరం విసిరి 67.79 మీటర్లతో శ్రీలంక అథ్లెట్ దినేశ్ ముదియన్‌సెలగె పేరిట ఉన్న ప్రపంచ రికార్డును తిరగ రాశాడు. పురుషుల టి11 1500 మీటర్ల విభాగంలో అంకుర్ ధామా, మహిళల టి11 1500 మీటర్ల విభాగంలో రక్షిత రాజు... పురుషుల ఎఫ్37/38 జావెలిన్ త్రో ఈవెంట్లో హనే... మహిళల టి47 లాంగ్‌జంప్ ఈవెంట్లో నిమిషా బంగారు పతకాలు గెలిచారు. కాంస్య పతకాలు నెగ్గిన గురు నాయుడు, ప్రియదర్శిని పనాజీ: జాతీయ క్రీడల్లో భాగంగా బుధవారం వెయిట్‌లిఫ్టింగ్ క్రీడాంశంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు ఒక్కో కాంస్య పతకం లభించింది. పురుషుల 55 కేజీల విభాగంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎస్. గురు నాయుడు ఓవరాల్‌గా 230 కేజీలు బరువెత్తి మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని సాధించాడు. మహిళల 45 కేజీల విభాగంలో తెలంగాణ అమ్మాయి ప్రియదర్శిని మొత్తం 161 కేజీల బరువెత్తి మూడో స్థానంతో కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. -
అసాధారణం.. మన అద్భుత విజయం: ప్రధాని మోదీ
సాక్షి, ఢిల్లీ: ఆసియా క్రీడల్లో పతకాలతో అదరగొడుతున్న భారత అథ్లెట్లకు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఇవాళ వంద పతకాల మైలురాయిని దాటి.. సరికొత్త రికార్డు సృష్టించిన వేళ ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఆసియా క్రీడల్లో అద్భుత ప్రతిభ కనబర్చారంటూ క్రీడాకారుల్ని ఉద్దేశించి ట్వీట్ చేశారాయన. అంతేకాదు వాళ్లను కలుసుకుని ముచ్చటించడానికి ఆత్రుతగా ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. ఆసియా క్రీడల్లో భారత్‌కు దక్కిన అద్భుత విజయం!. మనం 100 పతకాల మైలురాయిని చేరుకున్నందుకు భారత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భారతదేశానికి ఈ చారిత్రాత్మక మైలురాయికి కారణమైన మన అసాధారణ క్రీడాకారులకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. అబ్బుర పరిచే వాళ్ల ప్రదర్శన.. చరిత్ర సృష్టించి.. మన హృదయాలను గర్వంతో నింపింది. 10వ తేదీన మా ఆసియా క్రీడల బృందానికి ఆతిథ్యం ఇవ్వడానికి, అథ్లెట్లతో సంభాషించడానికి ఎదురుచూస్తున్నా అంటూ ట్వీట్ చేశారాయన. A momentous achievement for India at the Asian Games! The people of India are thrilled that we have reached a remarkable milestone of 100 medals. I extend my heartfelt congratulations to our phenomenal athletes whose efforts have led to this historic milestone for India.… pic.twitter.com/CucQ41gYnA — Narendra Modi (@narendramodi) October 7, 2023 మరోవైపు ఆసియా క్రీడల్లో భారత్ సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఇప్పటివరకు వంద పతకాలు వచ్చాయి. అందులో స్వర్ణం 25 ఉండగా.. ఇవాళ ఒకే రోజు 3 దక్కాయి. ఇక.. మిగిలిన పతకాల్లో రజతం 35, కాంస్యం 40 ఉన్నాయి. పాయింట్ల పట్టికలో నాల్గవ స్థానంలో కొనసాగుతోంది భారత్. రేపటితో ఆసియా గేమ్స్ 2023 ముగియనున్నాయి. -
మన బాణం బంగారం
ఆసియా క్రీడల్లో పన్నెండో రోజు భారత క్రీడాకారులు పసిడి ప్రదర్శనతో అలరించారు. ఆర్చరీ టీమ్ విభాగంలో రెండు స్వర్ణ పతకాలు సొంతం చేసుకోగా... స్క్వాష్ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో దీపిక పల్లికల్–హరీందర్‌పాల్ సింగ్ జోడీ బంగారు పతకంతో అదరగొట్టింది. స్క్వాష్ పురుషుల సింగిల్స్ విభాగంలో భారత స్టార్ సౌరవ్ ఘోషాల్ రజతం నెగ్గి వరుసగా ఐదో ఆసియా క్రీడల్లోనూ పతకం సంపాదించడం విశేషం. మహిళల రెజ్లింగ్‌లో రైజింగ్ స్టార్ అంతిమ్ పంఘాల్ కాంస్య పతకంతో రాణించింది. బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్‌లో హెచ్ఎస్ ప్రణయ్, డబుల్స్‌లో సాతి్వక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి సెమీఫైనల్లోకి ప్రవేశించి పతకాలను ఖరారు చేసుకున్నారు. పన్నెండో రోజు పోటీలు ముగిశాక భారత్ 21 స్వర్ణాలు, 32 రజతాలు, 33 కాంస్యాలతో కలిపి 86 పతకాలతో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. హాంగ్జౌ: చైనా నేలపై భారత బాణం బంగారమైంది. ఆసియా క్రీడల ఆర్చరీ ఈవెంట్లో భారత మహిళల కాంపౌండ్ జట్టు తొలిసారి స్వర్ణ పతకం సాధించగా... భారత పురుషుల కాంపౌండ్ జట్టు 2014 తర్వాత మళ్లీ పసిడి పతకం సంపాదించింది. ఆంధ్రప్రదేశ్ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ, అదితి స్వామి, పర్ణీత్ కౌర్‌లతో కూడిన భారత మహిళల జట్టు ఫైనల్లో 230–229తో యి సువాన్ చెన్, హువాంగ్ ఐజు, లు యున్ వాంగ్‌లతో కూడిన చైనీస్ తైపీ జట్టును ఓడించి తొలిసారి ఆసియా క్రీడల చాంపియన్‌గా అవతరించింది. సెమీఫైనల్లో భారత్ 233–219తో ఇండోనేసియా జట్టుపై, క్వార్టర్ ఫైనల్లో 231–220తో హాంకాంగ్ జట్టుపై విజయం సాధించింది. 2014 ఇంచియోన్ ఏషియాడ్‌లో జ్యోతి సురేఖ, త్రిషా దేబ్, పూర్వాషా షిండేలతో కూడిన భారత జట్టు కాంస్యం నెగ్గగా... 2018 జకార్తా ఏషియాడ్‌లో జ్యోతి సురేఖ, ముస్కాన్, మధుమితలతో కూడిన టీమిండియా రజతం కైవసం చేసుకుంది. మూడో ప్రయత్నంలో భారత్ ఖాతాలో స్వర్ణం చేరడం విశేషం. ఈ మూడుసార్లూ జ్యోతి సురేఖ జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించింది. ‘ఆసియా క్రీడల్లో తొలిసారి టీమ్ స్వర్ణం నెగ్గినందుకు సంతోషంగా ఉన్నాం. శనివారం నా వ్యక్తిగత విభాగం ఫైనల్ కూడా ఉంది. ఆ ఈవెంట్లోనూ స్వర్ణమే లక్ష్యంగా బరిలోకి దిగుతా’ అని విజయవాడకు చెందిన 27 ఏళ్ల జ్యోతి సురేఖ వ్యాఖ్యానించింది. ఓజస్ ప్రవీణ్ దేవ్‌తలే, అభిషేక్ వర్మ, ప్రథమేశ్‌లతో కూడిన భారత పురుషుల కాంపౌండ్ జట్టు ఫైనల్లో 235–230తో జేహున్ జూ, జేవన్ యాంగ్, కింగ్ జాంగ్హోలతో కూడిన దక్షిణ కొరియా జట్టును ఓడించి బంగారు పతకం నెగ్గింది. సెమీఫైనల్లో భారత్ 235–224తో చైనీస్ తైపీపై, క్వార్టర్ ఫైనల్లో 235–221తో భూటాన్‌పై, తొలి రౌండ్లో 235–219తో సింగపూర్‌పై గెలుపొందింది. 2014 ఇంచియోన్ ఏషియాడ్‌లో రజత్ చౌహాన్, సందీప్ కుమార్, అభిషేక్ వర్మలతో కూడిన భారత జట్టు తొలిసారి పసిడి పతకం గెలిచింది. సురేఖ బృందానికి సీఎం జగన్ అభినందనలు సాక్షి, అమరావతి: తమ అద్భుతమైన ప్రదర్శనతో మహిళల ఆర్చరీ కాంపౌండ్ టీమ్ విభాగంలో స్వర్ణ పతకం సాధించిన వెన్నం జ్యోతి సురేఖ, పర్ణీత్ కౌర్, అదితిలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభినందించారు. విజయ వాడకు చెందిన జ్యోతి సురేఖ సాధించిన విజయంపట్ల తనతో పాటు, ఆంధ్రప్రదేశ్ ఎంతో గర్వపడుతోందన్నారు. తెలుగు జెండా రెపరెపలాడుతోందంటూ సీఎం వైఎస్ జగన్ గురువారం ట్వీట్ చేశారు. -
Asian Games 2023: అదే జోరు...
వంద పతకాల లక్ష్యంతో చైనా గడ్డపై అడుగుపెట్టిన భారత క్రీడాకారుల బృందం ఆ దిశగా సాగుతోంది. పోటీలు మొదలైన తొలి రోజు నుంచే పతకాల వేట మొదలు పెట్టిన భారత క్రీడాకారులు దానిని వరుసగా తొమ్మిదోరోజూ కొనసాగించారు. ఆదివారం ఈ క్రీడల చరిత్రలోనే ఒకేరోజు అత్యధికంగా 15 పతకాలు సాధించిన భారత క్రీడాకారులు సోమవారం ఏడు పతకాలతో అలరించారు. అంచనాలకు అనుగుణంగా రాణిస్తున్న అథ్లెట్లు మూడు రజతాలు, ఒక కాంస్యం సాధించగా... ఎవరూ ఊహించని విధంగా రోలర్ స్కేటింగ్‌లో రెండు కాంస్య పతకాలు వచ్చాయి. మహిళల టేబుల్ టెన్నిస్ డబుల్స్‌లో సుతీర్థ–అహిక ముఖర్జీ సంచలన ప్రదర్శనకు కాంస్య పతకంతో తెరపడింది. ఆర్చరీ, హాకీ, బ్యాడ్మింటన్, స్క్వా‹Ùలోనూ భారత ఆటగాళ్లు తమ ఆధిపత్యం చాటుకొని పతకాల రేసులో ముందుకెళ్లారు. తొమ్మిదో రోజు తర్వాత ఓవరాల్‌గా భారత్ 13 స్వర్ణాలు, 24 రజతాలు, 23 కాంస్యాలతో కలిపి 60 పతకాలతో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. హాంగ్జౌ: షూటర్ల పతకాల వేట ముగిసినా వారిని స్ఫూర్తిగా తీసుకొని భారత అథ్లెట్స్ ఆసియా క్రీడల్లో అదరగొడుతున్నారు. సోమవారం భారత్ ఖాతాలో ఏడు పతకాలు చేరాయి. అందులో అథ్లెట్స్ మూడు రజతాలు, ఒక కాంస్యంతో కలిపి నాలుగు అందించారు. రోలర్ స్కేటింగ్‌లో రెండు కాంస్యాలు, టేబుల్ టెన్నిస్‌లో ఒక కాంస్యం దక్కింది. మహిళల 3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్‌లో ఆసియా చాంపియన్, భారత స్టార్ పారుల్ చౌధరీ రజత పతకం నెగ్గగా... భారత్‌కే చెందిన ప్రీతి కాంస్య పతకాన్ని సాధించింది. ప్రపంచ చాంపియన్ యావి విన్‌ఫ్రెడ్ ముతిలె తన స్వర్ణ పతకాన్ని నిలబెట్టుకుంది. కెన్యాలో జని్మంచిన 23 ఏళ్ల యావి విన్‌ఫ్రెడ్ 2016లో బహ్రెయిన్‌కు వలస వచ్చి అక్కడే స్థిరపడింది. అంతర్జాతీయ ఈవెంట్స్‌లో బహ్రెయిన్ తరఫున పోటీపడుతోంది. 2018 జకార్తా ఆసియా క్రీడల్లోనూ పసిడి పతకం నెగ్గిన యావి విన్‌ఫ్రెడ్ ఈసారీ తన ప్రత్యర్థులకు అవకాశం ఇవ్వలేదు. యావి విన్‌ఫ్రెడ్ 9ని:18.28 సెకన్లలో గమ్యానికి చేరి అగ్రస్థానంలో నిలువగా... పారుల్ 9ని:27.63 సెకన్లతో రెండో స్థానాన్ని... ప్రీతి 9ని:43.32 సెకన్లతో మూడో స్థానాన్ని సంపాదించారు. ఆన్సీ అదుర్స్... మహిళల లాంగ్‌జంప్‌లో కేరళకు చెందిన 22 ఏళ్ల ఆన్సీ సోజన్ ఇడపిలి రజత పతకంతో సత్తా చాటుకుంది. తొలిసారి ఆసియా క్రీడల్లో ఆడుతున్న ఆన్సీ సోజన్ 6.63 మీటర్ల దూరం దూకి రెండో స్థానంలో నిలిచింది. షికి జియాంగ్ (చైనా; 6.73 మీటర్లు) స్వర్ణం... యాన్ యు ఎన్గా (హాంకాంగ్; 6.50 మీటర్లు) కాంస్యం గెలిచారు. భారత్‌కే చెందిన శైలి సింగ్ (6.48 మీటర్లు) ఐదో స్థానంలో నిలిచింది. రిలే జట్టుకు రజతం... 4గీ400 మీటర్ల మిక్స్డ్ రిలేలో భారత జట్టుకు రజత పతకం లభించింది. అజ్మల్, విత్యా రామ్రాజ్, రాజేశ్, శుభ వెంకటేశ్‌లతో కూడిన భారత జట్టు ఫైనల్ రేసును 3ని:14.34 సెకన్లలో ముగించి మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని దక్కించుకుంది. శ్రీలంక జట్టు 3ని:14.25 సెకన్లతో రజతం గెలిచింది. అయితే రేసు సందర్భంగా శ్రీలంక అథ్లెట్ నిబంధనలకు విరుద్ధంగా వేరే బృందం పరిగెడుతున్న లైన్లోకి వచ్చాడని తేలడంతో నిర్వాహకులు శ్రీలంక జట్టుపై అనర్హత వేటు వేశారు. దాంతో భారత జట్టు పతకం కాంస్యం నుంచి రజతంగా మారిపోయింది. నాలుగో స్థానంలో నిలిచిన కజకిస్తాన్‌కు కాంస్యం లభించింది. ఈ ఈవెంట్లో బహ్రెయిన్ జట్టు స్వర్ణం సాధించింది. పురుషుల 200 మీటర్ల ఫైనల్లో భారత అథ్లెట్ అమ్లాన్ బొర్గోహైన్ 20.60 సెకన్లలో గమ్యానికి చేరి ఆరో స్థానంలో నిలిచాడు. మహిళల పోల్‌వాల్ట్‌లో భారత క్రీడాకారిణి పవిత్ర వెంకటేశ్ ఆరో స్థానాన్ని దక్కించుకుంది. పది క్రీడాంశాల సమాహారమైన పురుషుల డెకాథ్లాన్‌లో ఐదు ఈవెంట్లు ముగిశాక భారత ప్లేయర్ తేజస్విన్ శంకర్ 4260 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. -
Asian Games 2023: పదిహేను పతకాలతో పండుగ
ఆసియా క్రీడల్లో ఆదివారం భారత క్రీడాకారులు పతకాల పంట పండించారు. ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు.... ఏకంగా 15 పతకాలతో పండుగ చేసుకున్నారు. అథ్లెటిక్స్‌లో అత్యధికంగా తొమ్మిది పతకాలు రాగా... షూటింగ్లో మూడు పతకాలు... బ్యాడ్మింటన్, గోల్ఫ్, బాక్సింగ్‌లో ఒక్కో పతకం లభించాయి. భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ క్రీడాకారులు కూడా తమ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్ అథ్లెట్ జ్యోతి యర్రాజీ రజతం, తెలంగాణ అథ్లెట్ అగసార నందిని కాంస్యం... తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ కాంస్యం... తెలంగాణ షూటర్ కైనన్ చెనాయ్ స్వర్ణం, కాంస్యంతో మెరిపించారు. రజత పతకం నెగ్గిన భారత బ్యాడ్మింటన్ జట్టులో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్లు కిడాంబి శ్రీకాంత్, సాత్విక్ సాయిరాజ్ సభ్యులుగా ఉన్నారు. ఎనిమిదో రోజు పోటీలు ముగిశాక భారత్ 13 స్వర్ణాలు, 21 రజతాలు, 19 కాంస్యాలతో కలిపి మొత్తం 53 పతకాలతో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. హాంగ్జౌ: ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్లు అంచనాలను అందుకున్నారు. అటు సీనియర్లు, ఇటు జూనియర్లు కూడా సత్తా చాటడంతో భారత్ ఖాతాలో ఆదివారం ఒక్క అథ్లెటిక్స్‌లోనే 9 పతకాలు చేరాయి. ఇందులో 2 స్వర్ణాలు, 4 రజతాలు, 3 కాంస్యాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ అథ్లెట్ జ్యోతి యర్రాజీ రేసు విషయంలో కాస్త వివాదం రేగినా... చివరకు రజతంతో కథ సుఖాంతమైంది. తెలంగాణకు చెందిన అగసార నందిని కూడా ఏషియాడ్ పతకాల జాబితాలో తన పేరును లిఖించుకుంది. సత్తా చాటిన సాబ్లే 3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్‌లో అవినాశ్ సాబ్లే కొత్త చరిత్ర సృష్టించాడు. పురుషుల విభాగంలో గతంలో ఏ భారత అథ్లెట్‌కూ సాధ్యంకాని రీతిలో స్వర్ణ పతకంతో మెరిసాడు. 8 నిమిషాల 19.50 సెకన్లలో ఈవెంట్‌ను పూర్తి చేసిన సాబ్లే మొదటి స్థానంలో నిలిచాడు. 29 ఏళ్ల సాబ్లే ఈ క్రమంలో కొత్త ఆసియా క్రీడల రికార్డును నమోదు చేశాడు. 2018 జకార్తా క్రీడల్లో హొస్సీన్ కేహని (ఇరాన్: 8 నిమిషాల 22.79 సెకన్లు) పేరిట ఉన్న ఘనతను అతను సవరించాడు. 3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్ మహిళల విభాగంలో మాత్రం భారత్ నుంచి 2010 గ్వాంగ్జౌ ఆసియా క్రీడల్లో సుధా సింగ్ స్వర్ణం గెలుచుకుంది. తజీందర్ తడాఖా పురుషుల షాట్‌పుట్‌లో తజీందర్‌పాల్ సింగ్ తూర్ సత్తా చాటడంతో భారత్ ఖాతాలో మరో స్వర్ణం చేరింది. 2018 జకార్తా క్రీడల్లో స్వర్ణం గెలుచుకున్న అతను ఈసారి తన మెడల్‌ను నిలబెట్టుకున్నాడు. ఇనుప గుండును 20.36 మీటర్ల దూరం విసిరిన తజీందర్ అగ్రస్థానాన్ని అందుకున్నాడు. తొలి రెండు ప్రయత్నాల్లో అతను ఫౌల్ చేసినా మూడో ప్రయత్నంలో 19.51 మీటర్ల దూరం గుండు వెళ్లింది. తర్వాతి ప్రయత్నంలో దానిని 20.06 మీటర్లతో అతను మెరుగుపర్చుకున్నాడు. ఐదో ప్రయత్నం కూడా ఫౌల్ అయినా... ఆఖరి ప్రయత్నంలో తన అత్యుత్తమ ప్రదర్శనతో పసిడిని ఖాయం చేసుకున్నాడు. పర్దుమన్ సింగ్, జోగీందర్ సింగ్, బహదూర్ సింగ్ చౌహాన్ తర్వాత వరుసగా రెండు ఆసియా క్రీడల్లో షాట్‌పుట్ ఈవెంట్లో స్వర్ణం సా ధించిన నాలుగో భారత అథ్లెట్‌గా తజీందర్ నిలిచాడు. సిల్వర్ జంప్ పురుషుల లాంగ్‌జంప్‌లో భారత ఆటగాడు మురళీ శ్రీశంకర్ తనపై ఉన్న అంచనాలను నిలబెట్టుకున్నాడు. ఆగస్టులో బుడాపెస్ట్‌లో జరిగిన వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో రజతం సాధించిన మురళీ ఇక్కడ ఆసియా క్రీడల్లోనూ రజత పతకాన్ని గెలుచుకున్నాడు. 8.19 మీటర్లు దూకిన శ్రీశంకర్ రెండో స్థానంలో నిలిచాడు. జియాన్ వాంగ్ (చైనా–8.22 మీ.), యుహావో షి (చైనా–8.10 మీ.) స్వర్ణ, కాంస్యాలు సాధించారు. వహ్వా హర్మిలన్ 1998 జనవరి... పంజాబ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డులో ఉద్యోగి అయిన మాధురి సింగ్ మూడు నెలల గర్భిణి. అయితే క్రీడాకారుల కోటాలో ఉద్యోగం పొందిన ఆమె సంస్థ నిబంధనలు, ఆదేశాల ప్రకారం తన ప్రధాన ఈవెంట్ 800 మీటర్ల నుంచి 1500 మీటర్లకు మారి పరుగెత్తాల్సి వచ్చింది. 1500 మీటర్ల ట్రయల్‌లో పాల్గొని ఉద్యోగం కాపాడుకున్న మాధురికి ఆరు నెలల తర్వాత పాప పుట్టింది. ఆ అమ్మాయే హర్మిలన్ బైన్స్. నాలుగేళ్ల తర్వాత 2002 ఆసియా క్రీడల్లో మాధురి 800 మీటర్ల పరుగులోనే పాల్గొని రజత పతకం సాధించింది. ఇప్పుడు 21 ఏళ్ల తర్వాత ఆమె కూతురు ఆసియా క్రీడల్లో రజత పతకంతో మెరిసింది... అదీ 1500 మీటర్ల ఈవెంట్లో కావడం యాదృచ్చికం! ఆదివారం జరిగిన 1500 మీటర్ల పరుగును హర్మిలన్ 4 నిమిషాల 12.74 సెకన్లలో పూర్తి చేసి రెండో స్థానంలో నిలిచింది. అజయ్‌కు రజతం, జాన్సన్‌కు కాంస్యం పురుషుల 1500 మీటర్ల పరుగులో కూడా భారత్ ఖాతాలో రెండు పతకాలు చేరాయి. ఉత్తరప్రదేశ్‌కు చెందిన అజయ్ కుమార్ సరోజ్, కేరళ అథ్లెట్ జిన్సన్ జాన్సన్ రెండు, మూడు స్థానాల్లో నిలిచి రజత, కాంస్యాలు సొంతం చేసుకున్నారు. 3 నిమిషాల 38.94 సెకన్లలో అజయ్ రేసు పూర్తి చేయగా, 3 నిమిషాల 39.74 సెకన్లలో లక్ష్యం చేరాడు. ఈ ఈవెంట్లో ఖతర్‌కు చెందిన మొహమ్మద్ అల్‌గర్ని (3 నిమిషాల 38.38 సెకన్లు)కు స్వర్ణం దక్కింది. సీనియర్ సీమ జోరు మహిళల డిస్కస్ త్రోలో సీమా పూనియా వరుసగా మూడో ఆసియా క్రీడల్లోనూ పతకంతో మెరిసింది. 2014లో స్వర్ణం, 2018లో కాంస్యం గెలిచిన సీమ ఈసారి కూడా కాంస్య పతకాన్ని తన మెడలో వేసుకుంది. 40 ఏళ్ల సీమ డిస్కస్‌ను 58.62 మీటర్ల దూరం విసిరి మూడో స్థానంలో నిలిచింది. దాదాపు 20 ఏళ్ల తన సుదీర్ఘ కెరీర్లో కామన్వెల్త్ క్రీడల్లోనూ 3 రజతాలు, 1 కాంస్యం నెగ్గిన సీమ ఇవి తనకు ఆఖరి ఆసియా క్రీడలని ప్రకటించింది. ర్యాంకింగ్ ద్వారా పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధిస్తానని ఆశిస్తున్నట్లు ఆమె పేర్కొంది. -
కార్తిక్, గుల్వీర్లకు రజతం, కాంస్యం.. అదరగొట్టిన అమ్మాయిలు
Asian Games 2023 India Medals: ఆసియా క్రీడలు-2023లో భారత అథ్లెట్లు దుమ్ములేపారు. పురుషుల 10 వేల మీటర్ల పరుగు పందెంలో రజత, కాంస్య పతకాలు రెండూ మనోళ్లే కైవసం చేసుకున్నారు. కార్తిక్ కుమార్, గుల్వీర్ సింగ్ ఈ అద్భుతం చేశారు. చైనాలోని హోంగ్జూ వేదికగా శనివారం సాయంత్రం జరిగిన రేసులో ఈ ఇద్దరూ తమ వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శనలతో సిల్వర్, బ్రాంజ్ మెడల్స్ గెలవడం గమనార్హం. కార్తిక్ 28:15.38, గుల్వీర్ 28:17.21 నిమిషాల్లో పరుగు పూర్తి చేయడం విశేషం. వరల్డ్ నంబర్ 2 జోడీని ఓడించి.. ఇదిలా ఉంటే.. టేబుల్ టెన్నిస్ వుమెన్స్ డబుల్స్ విభాగంలో భారత ప్లేయర్లు ఐహిక, సుతీర్థ సెమీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్ ఖాతాలో మరో పతకం చేర్చేందుకు సిద్ధమయ్యారు. శనివారం నాటి క్వార్టర్ ఫైనల్లో చైనాకు చెందిన వరల్డ్ నంబర్ 2 జోడీ చెన్ మెంగ్, వాంగ్ యిదీలను మట్టికరిపించి వహ్వా అనిపించారు. అత్యధికంగా షూటింగ్లో ఇక 19వ ఆసియా క్రీడల్లో భారత్ ఇప్పటి వరకు 10 బంగారు, 14 వెండి, 14 కాంస్యాలు మొత్తంగా 38 పతకాలు గెలిచింది. భారత మహిళా క్రికెట్ జట్టుతో పాటు ఈక్వెస్ట్రియన్ డ్రెసాజ్ టీమ్, 10మీ. ఎయిర్ పిస్టల్ టీమ్ మెన్, వ్యక్తిగత విభాగం, 50మీ. రైఫిల్ 3 పొజిషన్స్ టీమ్ మెన్, 10మీ. ఎయిర్ పిస్టల్ వుమెన్, 25మీ. పిస్టల్ టీమ్ వుమెన్, 50మీ. రైఫిల్ 3 పొజిషన్స్ వుమెన్, మెన్స్ స్క్వాష్, టెన్నిస్ మిక్స్డ్ డబుల్స్‌లో భారత్ పసిడి పతకాలు గెలిచింది. ఇందులో అత్యధికంగా షూటింగ్లో ఆరు గోల్డ్ మెడల్స్ ఉన్నాయి. చదవండి: WC2023: అతడి ఆట అద్భుతం.. గేమ్ ఛేంజర్ తనే: యువరాజ్ సింగ్ -
ముగ్గురు భారత అథ్లెట్లకు చైనా వీసా నిరాకరణ
న్యూఢిల్లీ: ఆసియా క్రీడలకు సంబంధించి అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. వుషు పోటీల్లో పాల్గొనాల్సిన 11 మంది సభ్యుల భారత బృందంలో ముగ్గురికి చైనా ప్రభుత్వం వీసా నిరాకరించింది. ఈ ముగ్గురూ అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారే. అరుణాచల్‌ప్రదేశ్‌కు సంబంధించి భారత్, చైనా మధ్య సరిహద్దు వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో ఈ వీసా నిరాకరణ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ముగ్గురు మహిళా వుషు ప్లేయర్లు నైమన్ వాంగ్సూ, ఒనిలు టెగా, మేపుంగ్ లంగులను భారత అథ్లెట్లుగా గుర్తించేందుకు చైనా నిరాకరించింది. దాంతో శుక్రవారం రాత్రి వీరు మినహా మిగిలిన ముగ్గురు ఆసియా క్రీడల కోసం చైనా బయల్దేరి వెళ్లారు. ఈ అంశంపై కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆసియా క్రీడలకు హాజరయ్యేందుకు చైనాకు వెళ్లాల్సిన ఠాకూర్... తాజా పరిణామాలకు నిరసనగా తన పర్యటనను రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించారు. -
Commonwealth Games 2022: కనకాభిషేకం
బ్రిటిష్ గడ్డపై భారత జాతీయ జెండా రెపరెపలాడింది. జాతీయ గీతం మారుమోగింది. కామన్వెల్త్ గేమ్స్‌లో ఆదివారం భారత క్రీడాకారులు ఒకరి తర్వాత మరొకరు పసిడి పతకాలు సాధించారు. బాక్సింగ్, అథ్లెటిక్స్‌లో మనోళ్లు బంగారంలాంటి ప్రదర్శన చేయగా... బ్యాడ్మింటన్‌లో పీవీ సింధు, లక్ష్య సేన్, సాత్విక్ సాయిరాజ్– చిరాగ్ శెట్టి ఫైనల్లోకి దూసుకెళ్లి మూడు స్వర్ణ పతకాల రేసులో నిలిచారు. మహిళల హాకీలో సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ పతకం సొంతం చేసుకోగా... టేబుల్ టెన్నిస్‌లో ఆచంట శరత్ కమల్–సత్యన్ జ్ఞానశేఖరన్ జంట పురుషుల డబుల్స్‌లో రజతం పతకంతో మెరిసింది. బర్మింగ్‌హామ్: పంచ్ పంచ్కూ పతకం తెచ్చి కామనెŠవ్ల్త్ గేమ్స్‌లో ఆదివారం భారత బాక్సర్లు చిరస్మరణీయ ప్రదర్శన చేశారు. మహిళల 50 కేజీల విభాగంలో తెలంగాణ అమ్మాయి, ప్రపంచ చాంపియన్ నిఖత్ జరీన్... 48 కేజీల విభాగంలో హరియాణా అమ్మాయి నీతూ ఘంఘాస్... పురుషుల 51 కేజీల విభాగంలో హరియాణాకే చెందిన అమిత్ పంఘాల్ స్వర్ణ పతకాలు సాధించారు. కామన్వెల్త్ గేమ్స్‌లో తొలిసారి పాల్గొంటున్న నిఖత్ జరీన్ ఫైనల్లో 5–0తో కార్లీ మెక్నాల్ (నార్తర్న్ ఐర్లాండ్)ను చిత్తుగా ఓడించగా... నీతూ 5–0తో డెమీ జేడ్ రెస్టాన్ (ఇంగ్లండ్)పై... అమిత్ 5–0తో డిఫెండింగ్ చాంపియన్ కియరాన్ మెక్‌డొనాల్డ్ (ఇంగ్లండ్)పై గెలుపొందారు. తాజా విజయంతో 2018 గోల్డ్‌కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్ ఫైనల్లో కియరాన్ చేతిలో ఎదురైన ఓటమికి అమిత్ బదులు తీర్చుకున్నాడు. కార్లీతో జరిగిన ఫైనల్లో నిఖత్ సంపూర్ణ ఆధిపత్యం చలాయించింది. లెఫ్ట్ హుక్, రైట్ హుక్ పంచ్‌లతో కార్లీని కంగారెత్తించిన నిఖత్ ప్రత్యర్థి తనపై పంచ్‌లు విసిరిన సమయంలో చాకచక్యంగా తప్పించుకుంటూ అద్భుత డిఫెన్స్‌ను కనబరిచింది. ఈ గేమ్స్‌లో స్వర్ణం గెలిచే క్రమంలో నిఖత్ నాలుగు బౌట్లలోనూ తన ప్రత్యర్థులకు ఒక్క రౌండ్‌ను కూడా కోల్పోకపోవడం విశేషం. తొలి రౌండ్లో నిఖత్ పంచ్‌ల ధాటికి రిఫరీ బౌట్‌ను మధ్యలోనే నిలిపివేయగా... క్వార్టర్ ఫైనల్లో, సెమీఫైనల్లో, ఫైనల్లో నిఖత్ 5–0తో గెలుపొందింది. శనివారం అర్ధరాత్రి దాటాక ముగిసిన పురుషుల 67 కేజీల విభాగం సెమీఫైనల్లో భారత బాక్సర్ రోహిత్ టొకాస్ 2–3తో స్టీఫెన్ జింబా (జాంబియా) చేతిలో ఓడిపోయి కాంస్య పతకాన్ని దక్కించుకున్నాడు. ప్లస్ 92 కేజీల విభాగం సెమీఫైనల్లో సాగర్ (భారత్) 5–0తో ఇఫెయాని (నైజీరియా)పై గెలిచి డెలిషియస్ ఒరీ (ఇంగ్లండ్)తో స్వర్ణ–రజత పోరుకు సిద్ధమయ్యాడు. -
'అంచనాలకు మించి.. అదే చేత్తో కోహినూర్ వజ్రాన్ని'
కామన్వెల్త్ గేమ్స్ 2022లో భారత క్రీడాకారులు అంచనాలు మించి రాణిస్తున్నారు. ఇంతకముందు మనకు ఎన్నడూ రాని విభాగాల్లోనూ పతకాలు కొల్లగొడుతున్న ఆటగాళ్లు.. అచ్చొచ్చిన క్రీడల్లో స్వర్ణ పతకాలతో చెలరేగుతున్నారు. తొమ్మిది రోజులు ముగిసేసరికి భారత్ ఖాతాలో 40 పతకాలు ఉండగా.. అందులో 13 స్వర్ణాలు, 11 రజతాలు, 16 కాంస్యాలు ఉన్నాయి. కాగా ఇందులో 22 పతకాలు కేవలం రెండు క్రీడల్లోనే రావడం విశేషం. రెజ్లింగ్‌లో 12 పతకాలు రాగా.. వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో 10 పతకాలు వచ్చి చేరాయి. ఇంకో విశేషమేమిటంటే.. రెజ్లింగ్ విభాగంలో మనవాళ్లు 12 మంది పోటీ పడితే.. 12 మంది పతకాలు తేవడం విశేషం. అందులో భజరంగ్ పూనియా, రవి దహియా, వినేష్ పొగాట్, దీపక్ పూనియాలు స్వర్ణాలు గెలిచారు. ఇక పదోరోజు కూడా భారత్ ఖాతాలో దండిగానే పతకాలు వచ్చి చేరనున్నాయి. మరి సోమవారంతో ముగియనున్న కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ ఎన్ని పతకాలు కొల్లగొడుతుందనేది వేచి చూడాలి. కాగా కామన్వెల్త్లో భారత క్రీడాకారుల ప్రదర్శనపై మాజీ ఆటగాళ్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. పతకాల కోసం పోటీ పడడం ఆనందాన్ని కలిగిస్తుందంటూ కామెంట్స్ చేశారు. ఈ నేపథ్యంలోనే టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ చేసిన ఒక ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ''కామన్వెల్త్ గేమ్స్‌లో భారత అథ్లెట్లు అద్బుత ప్రదర్శన కనబరుస్తున్నారు. అంచనాలకు మంచి రాణిస్తూ పతకాల పంట పండిస్తున్నారు. అదే చేత్తో బ్రిటీష్ వాళ్లు పట్టుకెళ్లిన మన కోహినూర్ వజ్రాన్ని కూడా తీసుకురండి'' అంటూ కామెంట్ చేశాడు. కామన్వెల్త్ గేమ్స్‌తో పాటు వెస్టిండీస్ గడ్డపై రోహిత్ సేన టి20 సిరీస్ గెలవడంపై కూడా జాఫర్ ట్వీట్ చేశాడు.''విదేశీ గడ్డపై మరో సిరీస్ గెలిచినందుకు రోహిత్ సేనకు కంగ్రాట్స్. జట్టులో ఆటగాళ్లందరు ఒకరినొకరు సహకరించుకుంటూ బ్యాట్, బంతితో ఆల్‌రౌండ్ ప్రదర్శన చేసి ఆకట్టుకున్నారు. వెల్డన్'' అంటూ ట్వీట్ చేశాడు. ఇక టీమిండియా ఇవాళ విండీస్‌తో చివరి టి20 మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్‌ను విజయంతో ముగించి సిరీస్‌ను 4-1తో కైవసం చేసుకోవాలనే యోచనలో ఉంది. Indian athletes are doing so well at the Commonwealth Games that at this rate they might even bring the Kohinoor back 😄 #CWG2022 #IndiaAt75 — Wasim Jaffer (@WasimJaffer14) August 6, 2022 Congratulations @ImRo45 and Team India on another series win 👏🏽 Total team effort with both bat and ball with almost everyone contributing. #WIvIND — Wasim Jaffer (@WasimJaffer14) August 6, 2022 DISTINGUISHED WRESTLER VINESH🥇 Watch moments from the medal ceremony. Our champ @Phogat_Vinesh Looked fantastic with 🥇 Proud of you Girl! #Cheer4India#India4CWG2022@PMOIndia @ianuragthakur @NisithPramanik @CGI_Bghm @ddsportschannel @SonySportsNetwk @IndiaSports pic.twitter.com/8mocOYGxj9 — SAI Media (@Media_SAI) August 7, 2022 🇮🇳's Dhakad youth wrestler Naveen' s confidence is worth the applaud 👏 Watch moments from his medal🥇 ceremony 👇 Congratulations 👏 #Cheer4India#India4CWG2022@PMOIndia @ianuragthakur @NisithPramanik @IndiaSports @YASMinistry @CGI_Bghm pic.twitter.com/44XpKWcXYk — SAI Media (@Media_SAI) August 7, 2022 PLAYING FOR G🥇LD!!#Tokyo2020 Olympian and Gold🥇 Medalist at #B2022, @ravidahiya60 steals the show🤩 Watch his winning moment🏅 from yesterday's match👇#Cheer4India🇮🇳#India4CWG2022 🤟@PMOIndia @ianuragthakur @NisithPramanik @CGI_Bghm @IndiaSports @YASMinistry pic.twitter.com/oaZK41S6zr — SAI Media (@Media_SAI) August 7, 2022 చదవండి: చరిత్రకు అడుగుదూరంలో.. ఫైనల్లో తలపడనున్న భారత్, ఆస్ట్రేలియా CWG 2022: స్వర్ణంతో మెరిసిన భవీనాబెన్ పటేల్ -
CWG 2022: అథ్లెటిక్స్ ఫైనల్లో ముగ్గురు...
కామన్వెల్త్ గేమ్స్ అథ్లెటిక్స్‌లో భారత క్రీడాకారులు శుభారంభం చేశారు. పురుషుల లాంగ్‌జంప్‌లో మురళీ శ్రీశంకర్, మొహమ్మద్ అనీస్ యాహియా... మహిళల షాట్‌పుట్‌లో మన్‌ప్రీత్ కౌర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. మంగళవారం జరిగిన లాంగ్‌జంప్ క్వాలిఫయింగ్‌లో గ్రూప్ ‘ఎ’లో పోటీపడ్డ శ్రీశంకర్ 8.05 మీటర్ల దూరం గెంతి తన గ్రూప్‌లో టాపర్‌గా నిలిచాడు. గ్రూప్ ‘బి’లో యాహియా 7.68 మీటర్ల దూరం గెంతి మూడో స్థానంలో నిలిచాడు. రెండు గ్రూప్‌ల నుంచి కలిపి టాప్–12లో నిలిచినవారికి ఫైనల్ బెర్త్‌లు ఖరారయ్యాయి. షాట్‌పుట్ క్వాలిఫయింగ్‌లో మన్‌ప్రీత్ కౌర్ ఇనుప గుండును 16.78 మీటర్ల దూరం విసిరి ఓవరాల్‌గా ఏడో ర్యాంక్‌తో ఫైనల్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. మహిళల 100 మీటర్ల విభాగంలో భారత స్టార్ స్ప్రింటర్ ద్యుతీచంద్ హీట్స్‌లోనే వెనుదిరిగింది. ఐదో హీట్‌లో పాల్గొన్న ద్యుతీచంద్ 11.55 సెకన్లలో గమ్యానికి చేరి నాలుగో స్థానంలో నిలిచింది. ఓవరాల్‌గా ద్యుతీచంద్ 27వ ర్యాంక్‌లో నిలిచి సెమీఫైనల్‌కు అర్హత పొందలేకపోయింది. చదవండి: CWG 2022: పీవీ సింధు మాత్రమే.. బ్యాడ్మింటన్ మిక్స్డ్ టీమ్‌కు రజతం -
Commonwealth Games 2022: పతకాల బోణీ కొట్టేనా?
కామన్వెల్త్ గేమ్స్ ప్రారంభోత్సవ లాంఛనం ముగియడంతో... నేటి నుంచి క్రీడాకారులు ఇక పతకాల వేట మొదలుపెట్టనున్నారు. తొలి రోజు స్విమ్మింగ్, ట్రాక్ సైక్లింగ్, జిమ్నాస్టిక్స్, ట్రయాథ్లాన్ క్రీడాంశాల్లో మొత్తం 16 స్వర్ణాల కోసం పోటీలు జరుగుతాయి. ఈ నాలుగు ఈవెంట్స్‌లోనూ భారత క్రీడాకారులు బరిలో ఉన్నారు. ట్రయాథ్లాన్ మినహాయిస్తే మిగతా మూడు ఈవెంట్స్‌లో భారత ఆటగాళ్లు క్వాలిఫయింగ్‌ను దాటి ముందుకెళితేనే పతకాల రేసులో ఉంటారు. ఇతర క్రీడాంశాల్లో తొలిరోజు పోటీపడనున్న భారత క్రీడాకారుల వివరాలు ఇలా ఉన్నాయి. పురుషుల బాక్సింగ్ (తొలి రౌండ్): శివ థాపా గీ సులేమాన్ (పాకిస్తాన్–63.5 కేజీలు; సాయంత్రం గం. 4:30 నుంచి) మహిళల టి20 క్రికెట్: భారత్ గీ ఆస్ట్రేలియా (మ. గం. 3:30 నుంచి). మహిళల హాకీ లీగ్ మ్యాచ్: భారత్ గీ ఘనా (సాయంత్రం గం. 6:30 నుంచి). బ్యాడ్మింటన్ (మిక్స్డ్ టీమ్ ఈవెంట్ లీగ్ మ్యాచ్): భారత్ గీ పాకిస్తాన్ (మధ్యాహ్నం గం. 2 నుంచి) స్విమ్మింగ్ (హీట్స్; మధ్యాహ్నం గం. 3 నుంచి): సజన్ (50 మీటర్ల బటర్‌ఫ్లయ్), శ్రీహరి (100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్), కుశాగ్ర (400 మీటర్ల ఫ్రీస్టయి ల్; అర్హత సాధిస్తే ఫైనల్: రాత్రి గం. 11:35), ఆశిష్ (100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్; పారా స్విమ్మింగ్). స్క్వాష్ (తొలి రౌండ్): అనాహత్ సింగ్ గీ జాడా రోస్ (సెయింట్ విన్సెంట్; రాత్రి గం. 11 నుంచి); అభయ్ సింగ్ గీ జో చాప్మన్ (బ్రిటిష్ వర్జీన్ ఐలాండ్స్; రాత్రి గం. 11:45 నుంచి). టేబుల్ టెన్నిస్ (టీమ్ లీగ్ మ్యాచ్‌లు): మహిళల విభాగం: భారత్ గీ దక్షిణాఫ్రికా (మధ్యాహ్నం గం. 2 నుంచి); భారత్ గీ ఫిజీ (రాత్రి గం. 8:30 నుంచి); పురుషుల విభాగం: భారత్ గీ బార్బడోస్ (సాయంత్రం గం. 4:30 నుంచి); భారత్ గీ సింగపూర్ (రాత్రి గం. 11 నుంచి). ట్రాక్ సైక్లింగ్: విశ్వజీత్, నమన్, వెంకప్ప, అనంత, దినేశ్ (పురుషుల టీమ్ పర్సూట్ క్వాలిఫయింగ్: మధ్యాహ్నం గం. 2:30 నుంచి; అర్హత సాధిస్తే ఫైనల్: రాత్రి గం. 8:30 నుంచి). రోజిత్, రొనాల్డో, డేవిడ్, ఎసో (పురుషుల టీమ్ స్ప్రింట్ క్వాలిఫయింగ్; మధ్యాహ్నం గం. 2:30 నుంచి; అర్హత సాధిస్తే ఫైనల్: రాత్రి గం. 8:30 నుంచి). మయూరి, త్రియష, శశికళ (మహిళల టీమ్ స్ప్రింట్ క్వాలిఫయింగ్; మధ్యాహ్నం గం. 2:30 నుంచి; అర్హత సాధిస్తే ఫైనల్; గం. 8:30 నుంచి). ట్రయాథ్లాన్: ఆదర్శ్, విశ్వనాథ్ యాదవ్ (పురుషుల వ్యక్తిగత స్ప్రింట్ ఫైనల్; మ.గం. 3:30 నుంచి); ప్రజ్ఞా మోహన్, సంజన జోషి (మహిళల వ్యక్తిగత స్ప్రింట్ ఫైనల్; మ.గం. 3: 30 నుంచి). ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్: యోగేశ్వర్, సత్యజిత్, సైఫ్ (క్వాలిఫయింగ్; మధ్యాహ్నం గం. 1:30 నుంచి; అర్హత సాధిస్తే ఫైనల్: రాత్రి గం. 10 నుంచి). -
భారత్‌కు వరుస షాక్‌లు.. డోప్ టెస్ట్‌లో పట్టుబడ్డ మరో అథ్లెట్
Commonwealth Games 2022: బర్మింగ్‌హామ్ వేదికగా ఈనెల 28 నుంచి ప్రారంభంకానున్న కామన్వెల్త్ క్రీడా సంగ్రామానికి ముందు భారత్‌కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే నలుగురు అథ్లెట్లు డోప్ టెస్ట్‌లో విఫలమై మెగా ఈవెంట్ నుంచి నిష్క్రమించగా.. తాజాగా మరో అథ్లెట్‌కు నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (నాడా) నిర్వహించిన డోప్ టెస్ట్‌లో పాజిటివ్ రిపోర్ట్ వచ్చినట్టు తెలుస్తోంది. మహిళల 4x100 మీటర్ల బృందంలోని మరో సభ్యురాలు (ఇదివరకే ఈ విభాగంలో ఓ సభ్యురాలు డోప్ టెస్టులో విఫలమైంది) డోప్ టెస్ట్‌లో పట్టుబడినట్లు అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధి ధృవీకరించారు. అయితే ఆ అథ్లెట్ పేరు వెల్లడించడానికి ఆయన నిరాకరించారు. కాగా, గతవారం ఇద్దరు పారా అథ్లెట్లు (అనీష్ కుమార్, సురేంద్రన్ పిళ్లై) సహా మరో ఇద్దరు భారత అథ్లెట్లు (స్ప్రింటర్ ధనలక్ష్మీ, ట్రిపుల్ జంపర్ ఐశ్యర్య బాబు) డోప్ టెస్ట్‌లో విఫలమైన విషయం తెలిసిందే. తాజా ఘటనతో భారత బృందంలో డోపీల సంఖ్య 5కు చేరింది. చదవండి: డోపింగ్‌లో దొరికిన ‘కామన్వెల్త్’ అథ్లెట్లు -
World Athletics Championships: ఫైనల్‌కు చేరిన శ్రీశంకర్.. తొలి భారతీయుడిగా రికార్డు!
అమెరికాలోని యుజీన్ వేదికగా జరుగుతోన్న వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో భారతీయ లాంగ్ జంప్ అథ్లెట్ మురళీ శ్రీశంకర్ చరిత్ర సృష్టించాడు. శనివారం జరిగిన క్వాలిఫికేషన్స్ రౌండ్లో 8 మీటర్ల జంప్ చేసిన శ్రీశంకర్ పురుషుల లాంగ్‌జంప్ విభాగంలో ఫైనల్‌కు అర్హత సాధించాడు. తద్వారా ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ లాంగ్‌జంప్‌లో ఫైనల్‌కు చేరిన తొలి పురుష అథ్లెట్‌గా శ్రీశంకర్ రికార్డులకెక్కాడు. కాగా 2003 పారిస్ వేదికగా వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ మహిళల లాంగ్ జంప్ విభాగంలో పతకం సాధించిన తొలి భారతీయరాలుగా అంజు బాబీ జార్జ్ నిలిచింది. ఇక ఇదే ఈవెంట్లో పోటీ పడ్డ మరో ఇద్దరు భారత అథ్లెట్లు జస్విన్ ఆల్డ్రిన్ (7.79 మీ), మొహమ్మద్ అనీస్ యాహియా (7.73 మీ) లు ఫైనల్‌కు ఆర్హత సాధించ లేకపోయారు. అదే విధంగా ఈ టోర్నీలో అవినాష్ సాబ్లే 3వేల మీటర్ల స్టీపుల్‌చేజ్ క్రీడలో 8:18.75 టైమింగ్‌తో మూడవ స్థానంలో నిలిచి.. ఫైనల్‌కు అర్హత సాధించాడు. భారత ఆర్మీ ఉద్యోగి అయినా అవినాష్ 8:8:75 నిమిషాల్లో పూర్తిచేసి నేరుగా ఫైనల్లో అడుగు పెట్టాడు. చదవండి: World Athletics Championships: 90 మీటర్లే టార్గెట్‌గా.. వరల్డ్ చాంపియన్‌షిప్‌లో నీరజ్ చోప్రా -
Commonwealth Games 2022: బర్మింగ్‌హామ్‌లో వేర్వేరుగా వసతి!
న్యూఢిల్లీ: గత కామన్వెల్త్ గేమ్స్ ఆతిథ్య వేదికలకు భిన్నంగా ఈ సారి బర్మింగ్‌హామ్‌లో బస ఏర్పాట్లు చేశారు. సాధారణంగా ఏదైనా మెగా ఈవెంట్ జరిగితే ఒక క్రీడా గ్రామాన్ని నిర్మించి అందులో అందరికి వసతి ఏర్పాట్లు చేసేవారు. కానీ ప్రస్తుతం బర్మింగ్‌హామ్‌లో ఒక దేశానికి చెందిన అథ్లెట్ల బృందం ఒకే చోట ఉండటం కుదరదు. కరోనా తదితర కారణాలతో ఆర్గనైజింగ్ కమిటీ మొత్తం 5000 పైచిలుకు అథ్లెట్ల కోసం బర్మింగ్‌హామ్‌లో ఐదు క్రీడా గ్రామాల్ని అందుబాటులోకి తెచ్చింది. 16 క్రీడాంశాల్లో పోటీపడే 215 మంది భారత అథ్లెట్లు ఇప్పుడు ఈ ఐదు వేర్వేరు క్రీడా గ్రామాల్లో బసచేయాల్సి ఉంటుంది. కోచ్‌లు, అధికారులు కలుపుకుంటే భారత్‌నుంచి 325 మంది బర్మింగ్‌హామ్ ఫ్లయిట్ ఎక్కనున్నారు. బస ఏర్పాట్లు, ఇతరత్రా సదుపాయాల వివరాలను ఆర్గనైజింగ్ కమిటీ భారత ఒలింపిక్ సంఘాని (ఐఓఏ)కి సమాచార మిచ్చింది. ఈ నెల 28 నుంచి బర్మింగ్‌హామ్‌లో ప్రతిష్టాత్మక పోటీలు జరుగనున్నాయి. -
భారత అథ్లెట్స్‌పై దిగ్గజ లాంగ్ జంపర్ సంచలన ఆరోపణలు
భారత అథ్లెటిక్స్ ఫెడరేషన్ (ఏఎఫ్ఐ) వైస్ ప్రెసిడెంట్.. లెజెండరీ లాంగ్ జంపర్.. 2003 వరల్డ్ అథ్లెట్స్ చాంపియన్‌షిప్ కాంస్య పతక విజేత అంజు బాబీ జార్జ్ భారత అథ్లెట్స్‌పై సంచలన ఆరోపణలు చేసింది. దేశంలో బ్యాన్ చేసిన చాలా రకాల నిషేధిత డ్రగ్స్‌ను కొందరు అథ్లెట్లు విదేశాల నుంచి తీసుకొచ్చి పంచుతున్నారని ఆరోపించింది. ఢిల్లీ వేదికగా ఆదివారం జరిగిన ఏఎఫ్ఐ రెండు రోజుల వార్షిక సర్వసభ్య సమావేశంలో అంజూ జార్జీ ఈ వ్యాఖ్యలు చేసింది. ''భారతదేశంలో నిషేధించబడిన అనేక డ్రగ్స్ పదార్థాలను విదేశాల నుంచి కొందరు అథ్లెట్లు విరివిగా తీసుకువస్తున్నారు. తాము వాడడమే కాకుండా మిగతా అథ్లెట్లకు నిషేధిత డ్రగ్స్ పంచడం దారుణం. వద్దని చెప్పాల్సిన కోచ్‌లే దగ్గరుండి డ్రగ్స్ అందజేస్తున్నారు. తమ ప్రదర్శనను మెరుగుపరుచుకునేందుకే కొందరు అథ్లెట్లు ఇలాంటి నిషేధిత డ్రగ్స్ వాడుతున్నారు. దేశంలో అథ్లెట్స్ నిషేధిత డ్రగ్స్ వాడకంలో పెరుగుదల ఆందోళనకరమైన విషయం'' అని పేర్కొంది. కాగా ఏఎఫ్ఏ అధ్యక్షుడు ఆదిల్ సుమరివాలా మాట్లాడుతూ.. ''అంజూ బాబీ జార్జీ ఆరోపణను తీవ్రంగా పరిగణిస్తున్నాము. అథ్లెట్ల పరీక్షకు సంబంధించిన డోపింగ్ టెస్ట్‌ను మరింత కఠినతరం చేస్తాము. ఇప్పటికే ఈ విషయాన్ని నేషనల్ యాంటీ-డోపింగ్ ఏజెన్సీ (నాడా)కి ఈ విషయాన్ని తెలియజేశాం. డోపింగ్ పరీక్షలను మరింత పకడ్బందీగా నిర్వహించాలని వారిని కోరాం అని తెలిపారు. -
ఆత్మవిశ్వాసమే ఆలంబన.. మహిళా పారాలింపియన్లు
అంగవైకల్యం శాపం అన్న భావనను వీడి మనోధైర్యమే బాసటగా విజయశిఖరాలను అధిరోహిస్తున్నారు. భారతదేశ మహిళా పారాలింపియన్లు. ప్రపంచ క్రీడలో మన ఖ్యాతిని చాటుతున్నారు. టెన్నిస్ నుండి షాట్ పుట్ వరకు భారతదేశానికి అనేక పతకాలు తీసుకొచ్చారు. వైకల్యపు మూస పద్ధతులను తొలగించుకుంటూ అనన్య బన్సాల్, అవని లేఖర, భావినా పటేల్, ఏక్తా భ్యాన్, రుబినా ప్రాన్సిస్ లు.. మనందరికీ రోల్‌మోడల్‌గా నిలుస్తున్నారు. బంగారు అవని 2021 పారాలింపిక్లో భారత స్వర్ణ పతక విజేతగా నిలిచిన అవని లేఖర ఈ యేడాది ప్రతిష్టాత్మక ఖేల్‌రత్న అవార్డును కూడా అందుకుంది. మహిళల పది మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ ఫైనల్ ఈవెంట్లో 149.6 స్కోర్‌తో స్వర్ణం సాధించి సరికొత్త పారాలింపిక్ రికార్డ్‌ను నెలకొల్పింది అవని. పదకొండేళ్ల వయసులో కారు ప్రమాదానికి గురైన అవని 2012లో నడుము క్రింది భాగం పక్షవాతానికి లోనైంది. రాజస్థాన్‌లో లా చదువుతున్న విద్యార్థి. ఆమె తండ్రి ఆమెను క్రీడల్లో పాల్గొనేలా ప్రోత్సహించాడు. రజతం అనన్య మేధోపరమైన లోపం ఉన్న అథ్లెట్ అనన్య బన్సాల్. కిందటివారం బహ్రెయిన్‌లోని మనామాలో ఆసియా యూత్ పారాలింపిక్ గేమ్స్ జరిగాయి. ఈ పారాలింపిక్లో 30 దేశాల నుంచి 23 ఏళ్ల వయసు లోపు వారు పాల్గొన్నారు. వీరిందరితో పోటీపడి ఎఫ్–20 విభాగం షాట్‌పుట్‌లో భారత్‌కి తొలి రజత పతకాన్ని సాధించింది అనన్య. భారత్‌లోని మొహాలీకి చెందిన అనన్య బన్సాల్ సాధించిన ఘనతకు పారాలింపిక్ కమిటీ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ దీపామాలిక ‘ఒక అమ్మాయి భారతదేశ ఖ్యాతిని నిలుపుతూ తొలి ఖాతాను తెరిచింది. విజయాన్ని జరుపుకోవడానికి ఇది సరైన రోజు’ అంటూ ప్రశంసించారు. పతకాల భావినా పటేల్ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి భవినా పటేల్. 2020 టోక్యోలో పారాలింపిక్స్‌లో రజత పతకాన్ని సాధించింది. జాతీయ, అంతర్జాతీయ పోటీలలో అనేక పతకాలు సాధించి వార్తల్లో నిలిచింది. 12 ఏళ్ల వయసులో పోలియో బారిన పడిన భావినా గుజరాత్‌లోని సుంధియా అనే చిన్న గ్రామం నుండి వచ్చిన మహిళ. టోక్యో విజయగాథలలో ఆమె విజయం ఒక మైలురాయి. క్లబ్ త్రో ఏక్తాభ్యాన్ కారు ప్రమాదంలో వెన్నుపూస దెబ్బతిని, చక్రాల కుర్చీకే పరిమితమైన ఏక్తాభ్యాన్ క్లబ్ త్రో అథ్లెట్‌గా టోక్యో 2020 పారాలింపిక్స్‌కు చేరుకునేంతగా తనను తాను మలుచుకుంది. తన కలలను సాకారం చేసుకునేందుకు ఆత్మవిశ్వాసాన్నే పెట్టుబడిగా పెట్టింది. ‘మొదట క్రీడల గురించి ఆలోచించలేదు. ఎప్పుడూ విద్యావేత్తలతో సంభాషించడానికి ఇష్టపడేదాన్ని. నా వైకల్యం రోజువారి పనులకు కూడా సవాల్ మారింది. ఫిట్నెస్ మెరుగుపరుచుకోవడానికి క్రీడలను ఎంచుకున్నాను. అందులో భాగంగా క్లబ్ త్రో నా సాధనలో భాగమైంది’ అని అనందంగా చెబుతుంది ఏక్తా. షూటర్ రుబినా ఫ్రాన్సిస్ భారతీయ పారా పిస్టల్ షూటర్‌గా వార్తల్లో నిలిచింది రుబినా ఫ్రాన్సిస్. ప్రస్తుతం ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ నుంచి ఐదవ స్థానంలో ఉంది. 2018లో ఆసియా పారా గేమ్స్‌లో పాల్గొంది. జబల్పూర్లోని గన్ ఫర్ గ్లోరీ షూటింగ్ అకాడమీలో ఈ క్రీడను సాధన చేసింది రుబినా. ‘స్కూల్ చదువుతో పాటు మరేదైనా చేయాలనుకున్నాను. షూటింగ్ అకాడమీకి చెందిన వారు తమ ప్రచారంలో భాగంగా ఓ రోజు మా స్కూల్‌కు వచ్చారు. ఈ విషయం మా నాన్నకు చెప్పి, రిజిస్టర్ చేయించుకున్నాను. ఎంపికయ్యాను. దీంతో ఈ క్రీడలో ఆసక్తి పెరిగింది’ అని చెబుతుంది రుబినా. విధి చిన్నచూపు చూసిందని వీధి వాకిలివైపు కూడా చూడని ఎంతోమందికి ఈ మగువల సాధన ఓ దిక్సూచి. మనోబలమే కొండంత అండగా సాగుతున్న వీరి జీవితం ఎంతో మందికి స్ఫూర్తి. చదవండి: IND vs SA: ఆ ముగ్గురు ఆటగాళ్లకి ఇదే చివరి ఛాన్స్! -
Tokyo Paralympics: చివరి రోజు భారత్ ఖాతాలో స్వర్ణం
-
Tokyo Paralympics: చివరి రోజు భారత్ ఖాతాలో స్వర్ణం
పారాలింపిక్స్‌లో రజతంతో మొదలైన తమ పతకాల వేటను భారత క్రీడాకారులు స్వర్ణంతో దిగి్వజయంగా ముగించారు. ఈ క్రీడల ఆఖరి రోజు ఆదివారం భారత్ రెండు పతకాలను సొంతం చేసుకుంది. బ్యాడ్మింటన్‌లో çకృష్ణ నాగర్ బంగారు పతకం... ఐఏఎస్ అధికారి, నోయిడా జిల్లా కలెక్టర్ సుహాస్ యతిరాజ్ రజత పతకం నెగ్గారు. ఓవరాల్‌గా భారత్ 5 స్వర్ణాలు, 8 రజతాలు, 6 కాంస్యాలతో కలిపి మొత్తం 19 పతకాలు సాధించి 24వ స్థానంలో నిలిచింది. టోక్యో: ఆత్మవిశ్వాసమే ఆస్తిగా.... పట్టుదలే పెట్టుబడిగా... అనుక్షణం తమ పోరాట పటిమితో ఆకట్టుకున్న భారత పారాలింపియన్లు టోక్యో విశ్వ క్రీడలకు చిరస్మరణీయ ముగింపు ఇచ్చారు. చివరి రోజు ఒక స్వర్ణం, ఒక రజతం సాధించి యావత్ దేశం గర్వపడేలా చేశారు. తొలుత బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ ఎస్ఎల్–4 విభాగం ఫైనల్లో సుహాస్ యతిరాజ్ 21–15, 17–21, 15–21తో రెండుసార్లు ప్రపంచ పారా చాంపియన్ లుకాస్ మజూర్ (ఫ్రాన్స్) చేతిలో పోరాడి ఓడిపోయి రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు. తొలిసారి పారాలిం పిక్స్‌లో ఆడుతున్న 38 ఏళ్ల సుహాస్ తొలి గేమ్‌ను గెల్చుకున్నా ఆ తర్వాత అదే జోరును కనబర్చలేకపోయాడు. అనంతరం జరిగిన పురుషుల సింగిల్స్ ఎస్‌హెచ్–6 కేటగిరీ ఫైనల్లో రాజస్తాన్‌కు చెందిన కృష్ణ నాగర్ 21–17, 16–21, 21–17తో చు మన్ కాయ్ (హాంకాంగ్)పై గెలిచి బంగారు పతకం దక్కించుకున్నాడు. సింగిల్స్ ఎస్ఎల్–4 విభాగం కాంస్య పతక పోరులో భారత ప్లేయర్ తరుణ్ ధిల్లాన్ 17–21, 11–21తో ఫ్రెడీ సెతియవాన్ (ఇండోనేసియా) చేతిలో ఓడిపోయాడు. మిక్స్డ్ డబుల్స్ ఎస్ఎల్–3/ఎస్ఎల్–5 కాంస్య పతక పోరులో ప్రమోద్ భగత్–పలక్ కోహ్లి (భారత్) ద్వయం 21–23, 19–21తో దైసుకె ఫుజిహారా–అకీకో సుగినో (జపాన్) జంట చేతిలో పోరాడి ఓడిపోయింది. షూటింగ్ మిక్స్డ్ 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ ఎస్‌హెచ్–1 విభాగంలో బరిలోకి దిగిన భారత షూటర్లు సిద్ధార్థ బాబు, దీపక్, అవనీ లేఖరా క్వాలిఫయింగ్‌ను దాటలేకపోయారు. క్వాలిఫయింగ్‌లో సిద్ధార్థ బాబు 617.2 పాయింట్లు సాధించి తొమ్మిదో స్థానంలో... 612 పాయింట్లు స్కోరు చేసి అవని 28వ స్థానంలో... 602.2 పాయింట్లు సాధించి దీపక్ 46వ స్థానంలో నిలిచారు. టాప్–8లో నిలిచిన వారికి మాత్రమే ఫైనల్లో పోటీపడే అవకాశం లభిస్తుంది. దటీజ్ కృష్ణ... రెండేళ్లపుడే కృష్ణ నాగర్ వయసుకు తగ్గట్టుగా పెరగడని నిర్ధారించారు. కానీ అతనే ఇప్పుడు బంగారం గెలిచేంతగా ఎదిగిపోయాడు. జైపూర్ (రాజస్తాన్)కు చెందిన కృష్ణది ఎదగలేని వైకల్యం. కానీ దేన్నయినా సాధించే అతని పట్టుదల ముందు మరుగుజ్జుతనమే మరుగున పడింది. పొట్టొడే గట్టోడని టోక్యో పారాలింపిక్స్ స్వర్ణంతో నిరూపించాడు. ఓ మధ్యతరగతి కుటుంబానికి చెందిన కృష్ణ పొట్టివాడే. కానీ పతకాలు కొల్లగొట్టేవాడు కూడా! తనకిష్టమైన బ్యాడ్మింటన్‌లో చాంపియన్. 14 ఏళ్ల వయసులో షటిల్ వైపు దృష్టి మరల్చిన ఈ పొట్టి కృష్ణుడు 2016 నుంచి గట్టి మేలే తలపెట్టాడు. ప్రొఫెషనల్ పారా బ్యాడ్మింటన్ ప్లేయర్‌గా సత్తా చాటుకోవడం మొదలుపెట్టాడు. 4 అడుగుల 5 అంగుళాల ఎత్తున్న కృష్ణ నిలకడైన విజయాలతో ఎస్‌హెచ్–6 పురుషుల సింగిల్స్ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో రెండో ర్యాంకర్‌గా ఎదిగాడు. 2019లో బాసెల్‌లో జరిగిన ప్రపంచ పారా బ్యాడ్మింటన్ చాంపియన్íÙప్లో సింగిల్స్‌లో కాంస్యం, డబుల్స్‌లో రజతం సాధించాడు. గతేడాది బ్రెజిల్లో జరిగిన పారా బ్యాడ్మింటన్ ఓపెన్‌లో రన్నరప్‌గా (రజతం) నిలిచాడు. అదే ఏడాది పెరూలో జరిగిన ఈవెంట్లో సింగిల్స్, డబుల్స్‌లో విజేతగా నిలిచి రెండు బంగారు పతకాలు సాధించాడు. పోటీల బరిలో అతని ఆత్మవిశ్వాసమే అతన్ని అందనంత ఎత్తులో నిలబెడుతోంది. ఒలింపిక్స్, పారాలింపిక్స్‌లో పతకానికి ఉండే ప్రత్యేకతే వేరు. ప్రతిష్టాత్మక ఈ విశ్వక్రీడల్లో ఏకంగా బంగారమే సాధిస్తే ఆ ఆనందం మాటలకందదు. మేం బ్యాడ్మింటన్‌లో ఐదారు పతకాలు సాధిస్తామనే ధీమాతో వచ్చాం. చివరకు నాలుగింటితో తృప్తిపడ్డాం. అనుకున్న దానికి ఒకట్రెండు తగ్గినా మా ప్రదర్శన ఎంతో మెరుగైందన్న వాస్తవాన్ని అంగీకరించాలి. ఈ పతకాన్ని కరోనా వారియర్స్‌కు అంకితం ఇస్తున్నాను. –కృష్ణ నాగర్ -
పసిడి కాంతులు...
మునుపెన్నడూ లేని విధంగా దివ్యాంగుల విశ్వ క్రీడల్లో భారత క్రీడాకారులు తమ విశ్వరూపం ప్రదర్శిస్తున్నారు. ఎవ్వరూ ఊహించని విధంగా పతకాల పంట పండిస్తూ త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడిస్తున్నారు. టోక్యో పారాలింపిక్స్‌కు నేటితో తెర పడనుండగా... శనివారం భారత దివ్యాంగ క్రీడాకారులు రెండు స్వర్ణాలు, ఒక రజతం, ఒక కాంస్యంతో కలిపి మొత్తం నాలుగు పతకాలను గెల్చుకున్నారు. షూటింగ్లో మిక్స్డ్ 50 మీటర్ల పిస్టల్ ఎస్‌హెచ్–1 ఫైనల్లో మనీశ్ నర్వాల్ పసిడి పతకం నెగ్గగా... సింగ్‌రాజ్ అధానా రజత పతకం కైవసం చేసుకున్నాడు. పారాలింపిక్స్‌లో అరంగేట్రం చేసిన బ్యాడ్మింటన్‌లోనూ భారత షట్లర్లు మెరిశారు. పురుషుల సింగిల్స్ ఎస్ఎల్–3 విభాగంలో ప్రపంచ చాంపియన్ ప్రమోద్ భగత్ బంగారు పతకం సాధించగా... మనోజ్ సర్కార్ కాంస్య పతకం దక్కించుకున్నాడు. టోక్యో: పారాలింపిక్స్‌లో మరోసారి భారత క్రీడాకారులు తమ ప్రతాపం చూపించారు. శనివారం ఏకంగా నాలుగు పతకాలతో అదరగొట్టారు. ముందుగా షూటింగ్లో మనీశ్ నర్వాల్... సింగ్‌రాజ్ అధానా... అనంతరం బ్యాడ్మింటన్‌లో ప్రమోద్ భగత్, మనోజ్ సర్వార్ పతకాలు సొంతం చేసుకున్నారు. మిక్స్డ్ 50 మీటర్ల పిస్టల్ ఈవెంట్ ఫైనల్లో 19 ఏళ్ల మనీశ్ నర్వాల్ 218.2 పాయింట్లు స్కోరు చేసి పారాలింపిక్ రికార్డు సృష్టించడంతోపాటు అగ్రస్థానంలో నిలిచాడు. 39 ఏళ్ల సింగ్‌రాజ్ 216.7 పాయింట్లు స్కోరు చేసి రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. ఈ క్రీడల్లో సింగ్‌రాజ్‌కిది రెండో పతకం కావడం విశేషం. ఇంతకుముందు 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో సింగ్‌రాజ్ కాంస్యం సాధించిన సంగతి తెలిసిందే. ఈ ప్రదర్శనతో ఒకే పారాలింపిక్స్‌లో రెండు పతకాలు నెగ్గిన రెండో భారతీయ క్రీడాకారుడిగా, ఓవరాల్‌గా మూడో భారత ప్లేయర్‌గా సింగ్‌రాజ్ గుర్తింపు పొందాడు. 1984 పారాలింపిక్స్‌లో అథ్లెట్ జోగిందర్ సింగ్ బేడీ మూడు పతకాలు గెల్చుకోగా... ప్రస్తుత పారాలింపిక్స్‌లో మహిళా షూటర్ అవనీ లేఖరా రెండు పతకాలు సాధించింది. ఫుట్‌బాలర్ కావాలనుకొని... హరియాణాకు చెందిన 19 ఏళ్ల మనీశ్ జన్మతః కుడి చేతి వైకల్యంతో జని్మంచాడు. కొన్నాళ్లు ఫుట్‌బాల్ ప్రాక్టీస్ చేసి క్లబ్ స్థాయిలో మ్యాచ్‌లు కూడా ఆడిన మనీశ్ కుడి చేతి వైకల్యం కారణంగా ఎక్కువ రోజులు ఫుట్‌బాల్‌లో కొనసాగలేకపోయాడు. ఆ తర్వాత తండ్రి దిల్బాగ్ మిత్రుడొకరు మనీశ్‌కు షూటింగ్‌ను పరిచేయం చేశాడు. స్థానిక 10ఎక్స్ షూటింగ్ అకాడమీలో చేరిన మనీశ్ రెండేళ్లలో ఆటపై పట్టు సాధించాడు. 2018లో ఆసియా పారా గేమ్స్‌లో స్వర్ణం, రజతం సాధించాడు. ఆ తర్వాత 2019 వరల్డ్ పారా షూటింగ్ చాంపియన్‌షిప్‌లో రెండు కాంస్యాలు గెలిచాడు. ప్రమోదం నింపిన విజయం టోక్యో పారాలింపిక్స్‌లో అరంగేట్రం చేసిన బ్యాడ్మింటన్‌లో భారత షట్లర్లు సూపర్ ప్రదర్శన చేశారు. పురుషుల సింగిల్స్ ఎస్ఎల్–4 విభాగంలో ఒడిశాకు చెందిన 33 ఏళ్ల ప్రమోద్ భగత్ స్వర్ణ పతకాన్ని గెల్చుకున్నాడు. ఫైనల్లో టాప్ సీడ్ ప్రమోద్ 21–14, 21–17తో రెండో సీడ్ డానియెల్ బెథెల్ (బ్రిటన్)ను ఓడించాడు. ‘ఈ విజయం నాకెంతో ప్రత్యేకం. నా కల నిజమైంది. ఈ పతకాన్ని నా తల్లిదండ్రులకు అంకితం ఇస్తున్నాను’ అని ప్రమోద్ వ్యాఖ్యానించాడు. నాలుగేళ్ల వయసులో పోలియో బారిన పడ్డ ప్రమోద్ ఇరుగు పొరుగు వారు బ్యాడ్మింటన్ ఆడుతుండగా ఈ ఆటపై ఆసక్తి ఏర్పరచుకున్నాడు. 2006లో పారా బ్యాడ్మింటన్‌లో అడుగుపెట్టిన ప్రమోద్ ఇప్పటివరకు అంతర్జాతీయస్థాయిలో 45 పతకాలను సాధించాడు. ఇందులో నాలుగు ప్రపంచ చాంపియన్‌షిప్ స్వర్ణ పతకాలు ఉండటం విశేషం. మరోవైపు ఎస్ఎల్–4 విభాగంలోనే భారత్‌కు చెందిన మనోజ్ సర్కార్ కాంస్యం సాధించాడు. కాంస్య పతక పోరులో మనోజ్ 22–20, 21–13తో దైసుకె ఫుజిహారా (జపాన్)పై విజయం సాధించాడు. ఉత్తరాఖండ్‌కు చెందిన 31 ఏళ్ల మనోజ్ ఏడాది వయసులో పోలియో బారిన పడ్డాడు. ఐదేళ్ల వయసులో బ్యాడ్మింటన్ వైపు ఆకర్షితుడైన మనోజ్ ఆటపై పట్టు సంపాదించి 2013, 2015, 2019 ప్రపంచ చాంపియన్íÙప్ డబుల్స్ విభాగంలో స్వర్ణ పతకాలు సాధించాడు. చివరి రోజు భారత ప్లేయర్లు 5 పతకాలపై గురి పెట్టారు. బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ ఎస్ఎల్–4 విభాగంలో ఐఏఎస్ అధికారి సుహాస్ యతిరాజ్ స్వర్ణం కోసం... తరుణ్ కాంస్యం కోసం... ఎస్‌హెచ్ –6 విభాగంలో కృష్ణ నాగర్ స్వర్ణం కోసం... మిక్స్డ్ డబుల్స్‌లో ప్రమోద్–పలక్ ద్వయం కాంస్యం కోసం పోటీపడతారు. షూటింగ్ మిక్స్డ్ 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ విభాగంలో సిద్ధార్థ, దీపక్, అవని బరిలో ఉన్నారు. -
టోక్యో పారాలింపిక్స్: పురుషుల హై జంప్‌లో భారత అథ్లెట్ ప్రవీణ్ కుమార్ రజత పతకం సాధించాడు
-
పోరాడండి.. పతకాలు వాటంతటవే వస్తాయి: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: ఈ నెల 24 నుంచి సెప్టెంబర్ 5 వరకు టోక్యో వేదికగా జరుగనున్న పారా ఒలింపిక్స్‌లో భారత అథ్లెట్లు ఒత్తిడికి గురికాకుండా పోరాడాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. అథ్లెట్లు పతకాల గురించి ఆలోచించకుండా శక్తి మేరకు పోరాడాలని, పతకాలు వాటంతటవే వస్తాయని ఆయన సూచించారు. పారా అథ్లెట్లు జపాన్‌లో మరోసారి సత్తా చాటాలని ప్రధాని ఆకాంక్షించారు. మీరంతా అత్యుత్తమ నైపుణ్యం కలిగిన అథ్లెట్లంటూ కితాబునిచ్చారు. పారా ఒలింపిక్స్‌లో పాల్గొననున్న అథ్లెట్లతో ఆయన మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు. సమావేశంలో కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని అథ్లెట్లలో స్పూర్తి నింపారు. పారా ఒలింపిక్స్ కోసం భారత్ నుంచి 54 మంది అథ్లెట్ల బృందం త్వరలో జపాన్ బయలుదేరనుంది. అయితే పారా ఒలింపిక్స్‌లో భారత్ నుంచి ఇంత పెద్ద మొత్తంలో క్రీడాకారులు పాల్గొనడం ఇదే మొదటిసారి. 2016 రియో పారా ఒలింపిక్స్‌లో భారత్ 2 స్వర్ణ పతకాలు, ఓ రజతం, మరో కాంస్యం సహా మొత్తం నాలుగు పతకాలు సాధించింది. చదవండి: నీరజ్ చోప్రాకు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు -
అంతర్జాతీయ వేదికపై భారత్‌కు పతకాల పంట
వ్రోక్లా (పోలాండ్): ఆర్చరీ యూత్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారులు అదరగొట్టారు. శనివారం మూడు స్వర్ణాలు, రెండు రజతాలు, రెండు కాంస్యాలతో కలిపి ఏడు పతకాలు గెలిచారు. కొరియా, చైనా ఆర్చర్ల గైర్హాజరీని భారత ప్లేయర్లు సద్వినియోగం చేసుకున్నారు. క్యాడెట్ మహిళల కాంపౌండ్ టీమ్ ఫైనల్లో పర్ణీత్ కౌర్, ప్రియా గుర్జర్, రిధి వర్షిణిలతో కూడిన భారత బృందం 228–216తో టర్కీ జట్టును ఓడించింది. క్యాడెట్ పురుషుల కాంపౌండ్ టీమ్ ఫైనల్లో కుశాల్ దలాల్, సాహిల్ చౌదరీ, నితిన్‌లతో కూడిన భారత జట్టు 233–231తో అమెరికా జట్టుపై గెలిచింది. కాంపౌండ్ మిక్స్డ్ ఫైనల్లో ప్రియా–కుశాల్ ద్వయం 155–152తో అమెరికా జోడీపై నెగ్గింది. క్యాడెట్ మహిళల కాంపౌండ్ వ్యక్తిగత ఫైనల్లో ప్రియా గుర్జర్ 136–139తో సెలెన్ రోడ్రిగెజ్ (మెక్సికో) చేతిలో ఓడిపోయి రజతం దక్కించుకుంది. ఇదే విభాగం కాంస్య పతక పోరులో పర్ణీత్ 140–135తో హేలీ బౌల్టన్ (బ్రిటన్)ను ఓడించి కాంస్య పతకం సాధించింది. కాంపౌండ్ జూనియర్ మహిళల వ్యక్తిగత ఫైనల్లో సాక్షి 140–141తో అమందా మ్లినారిచ్ (క్రొయేషియా) చేతిలో ఓడిపోయి రజతం సొంతం చేసుకోగా... కాంపౌండ్ జూనియర్ పురుషుల వ్యక్తిగత కాంస్య పతక పోరులో రిషభ్ యాదవ్ 146–145తో సెబాస్టియన్ గార్సియా (మెక్సికో)పై గెలిచి కాంస్యం సాధించాడు. -
Ram Nath Kovind: దేశమంతా గర్వపడుతోంది
న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌లో భారత క్రీడాకారులంతా అద్భుత ప్రదర్శన కనబర్చారని... వారిని చూసి దేశమంతా గర్వపడుతోందని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ వ్యాఖ్యానించారు. ఇకపై ఎక్కువ మంది క్రీడల్లో పాల్గొనేలా, వారిని తల్లిదండ్రులు ప్రోత్సహించేలా మన ఆటగాళ్లంతా స్ఫూర్తిగా నిలిచారని రాష్ట్రపతి కొనియాడారు. రాష్ట్రపతి భవన్లో శనివారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొన్న క్రీడాకారులతో ముచ్చటించారు. ఒలింపిక్స్ పతక విజేతలు నీరజ్ చోప్రా, రవి దహియా, మీరాబాయి చాను, బజరంగ్, పీవీ సింధు, లవ్లీనా బొర్గోహైన్‌ల తోపాటు కాంస్య పతకం నెగ్గిన భారత పురుషుల హాకీ జట్టు, నాలుగో స్థానంలో నిలిచిన భారత మహిళల హాకీ జట్టు సభ్యులు, ఇతర క్రీడాకారులు, కోచ్ లు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర మంత్రులు అనురాగ్ ఠాకూర్, కిరణ్ రిజిజు, అర్జున్ ముండా, నితీశ్ ప్రామాణిక్, ఐఓఏ అధ్యక్ష, కార్యదర్శులు నరీందర్ బత్రా, రాజీవ్ మెహతా కూడా పాల్గొన్నారు. -
వీరులకు బ్రహ్మరథం.. విమానాశ్రయంలో రచ్చ
ఒలింపిక్స్ చరిత్రలోనే ఈసారి అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన భారత క్రీడాకారులు సోమవారం టోక్యో నుంచి స్వదేశానికి చేరుకున్నారు. ఒలింపిక్స్ అథ్లెటిక్స్‌లో భారత్‌కు తొలి పతకం, అదీ స్వర్ణం అందించిన జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా... రజత, కాంస్య పతకాలు సాధించిన రెజ్లర్లు రవి, బజరంగ్.. కాంస్యం నెగ్గిన మహిళా బాక్సర్ లవ్లీనా... 41 ఏళ్ల విరామం తర్వాత విశ్వ క్రీడల్లో పతకం సాధించిన భారత పురుషుల హాకీ జట్టు... నాలుగో స్థానంలో నిలిచిన భారత మహిళల హాకీ జట్టు సభ్యులకు ఇందిరాగాంధీ విమానాశ్రయంలో అభిమానులు ఘనస్వాగతం పలికారు. సాయంత్రం కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఆధ్వ ర్యంలో పతక విజేతలకు సన్మాన కార్యక్రమం జరిగింది. తాను సాధించిన పతకం తన ఒక్కడిదే కాదని, దేశ ప్రజలందరిదని నీరజ్ చోప్రా అన్నాడు. నీరజ్ చోప్రా, రవి దహియా బజరంగ్, లవ్లీనా ‘మీరంతా నవతరం హీరోలు...’ ► టోక్యో ఒలింపిక్స్ పతక విజేతలపై ప్రశంసల జల్లు ► స్వదేశంలో ఘన స్వాగతం ► కేంద్ర క్రీడా శాఖ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌లో భారత క్రీడాకారుల ప్రదర్శన... ప్రపంచాన్ని గెలవాలనుకునే భారత కొత్త తరానికి స్ఫూర్తిగా నిలిచిందని కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు. మున్ముందు కూడా అన్ని రకాలుగా క్రీడాకారులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఆయన ప్రకటించారు. టోక్యో ఒలింపిక్స్‌లో పతకాలు సాధించి సోమవారం స్వదేశం చేరుకున్న అథ్లెట్ నీరజ్ చోప్రా, రెజ్లర్లు రవి దహియా, బజరంగ్ పూనియా, మహిళా బాక్సర్ లవ్లీనా బొర్గొహైన్‌లతో పాటు భారత పురుషుల హాకీ జట్టు సభ్యులకు సోమవారం కేంద్ర ప్రభుత్వం తరఫున ఘన సన్మానం జరిగింది. ఈ సందర్భంగా ఠాకూర్ మాట్లాడుతూ... ‘స్వీయ క్రమశిక్షణ, అంకితభావం ఉంటే ఎలాంటి ఫలితాలు వస్తాయో భారత అథ్లెట్లు చూపించారు. సన్మాన కార్యక్రమంలో స్వర్ణ పతకంతో నీరజ్ చోప్రా, కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్; రజతం నెగ్గిన రెజ్లర్ రవి దహియాకు జ్ఞాపికను అందజేస్తున్న అనురాగ్ ఠాకూర్, చిత్రంలో న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు పతకాలు సాధించే వరకు వారి ప్రయాణం చాలా గొప్పగా సాగింది. నవ భారతంలో వీరంతా నవతరం హీరోలు. ఆటగాళ్ల అద్భుత ప్రదర్శనపై జాతి యావత్తూ సంబరాలు చేసుకుంది. మన దేశంలో తూర్పు నుంచి పశ్చిమం వరకు, ఉత్తరం నుంచి దక్షిణం వరకు అందరినీ ఒక్కచోటికి చేర్చే శక్తి క్రీడలకు మాత్రమే ఉంది. క్రీడల్లో మన దేశం మరింత ఘనతలు సాధించేలా సహకారం అందిస్తాం’ అని ఠాకూర్ అన్నారు. ఒలింపిక్ చరిత్రలో భారత్ ఈసారి ఎక్కువ (7) పతకాలు గెలవడం తనకు చాలా సంతోషం కలిగించిందన్న మాజీ క్రీడా శాఖ మంత్రి, ప్రస్తుత న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు... 2024 పారిస్ ఒలింపిక్స్‌లో మన దేశం మరింత బలమైన శక్తిగా ఎదుగుతుందని ఆకాంక్షించారు. టోక్యోలో రజత, కాంస్యాలు సాధించి కొద్ది రోజుల క్రితమే భారత్‌కు వచ్చేసిన మీరాబాయి చాను, పీవీ సింధు ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. కేక్ కట్ చేస్తున్న భారత హాకీ జట్టు సభ్యులు విమానాశ్రయంలో రచ్చ... టోక్యో విజేతలకు సోమవారం ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. పెద్ద సంఖ్యలో అభిమానులు, వివిధ క్రీడా సంఘాల ప్రతినిధులు, ‘సాయ్’ ఉన్నతాధికారులు అక్కడకు చేరుకొని తమ ఆటగాళ్లకు ‘వెల్కమ్’ చెప్పారు. అయితే ఈ సందర్భంగా పరిస్థితి అంతా గందరగోళంగా మారిపోయింది. అభిమానులు, ఆటగాళ్ల సన్నిహితులతో విమానాశ్రయం నిండిపోవడంతో బాగా రచ్చ జరిగింది. త్రివర్ణ పతాకాలతో ఎయిర్పోర్ట్ వద్ద డప్పు, ఇతర వాయిద్యాలతో ఫ్యాన్స్ పెద్ద శబ్దాలు చేస్తూ హంగామా సృష్టించారు. సెల్ఫీల కోసం మీద పడిపోతున్న వారి నుంచి తప్పించుకొని బయటకు రావడానికి ఆటగాళ్లు బాగా ఇబ్బంది పడ్డారు. నీరజ్ పోలీస్ భద్రత మధ్య బయటకు రాగా... బజరంగ్ పూనియా, రవి దహియాలను అతని మిత్రులు భుజాలపై ఎత్తుకొని ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఒలింపిక్ స్వర్ణం సాధించిన తర్వాత రోజు తీవ్రమైన ఒంటి నొప్పులతో బాధపడ్డాను. అయితే నా విజయం ముందు అది చాలా చిన్న విషయం. జావెలిన్ విసిరిన సమయంలో నేను నా వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చానని మాత్రమే అనుకున్నాను. అయితే త్రో ఇంకా చాలా దూరం వెళ్లింది. ఈ పతకం నా ఒక్కడిదే కాదు. భారతదేశ ప్రజలందరిది. ప్రత్యర్థి ఎంత బలమైనవాడైనా సరే మన అత్యుత్తమ ఆట ప్రదర్శించాలని, ప్రత్యర్థి గురించి భయపడవద్దని చెబుతా. అదే బంగారు పతకాన్ని తెచ్చి పెట్టింది. నాకూ పొడవాటి జుట్టు ఉంచడమే ఇష్టం. వేడి వల్ల చెమట పట్టి ఇబ్బంది కావడంతో జుట్టు తగ్గించుకున్నా. – సన్మాన కార్యక్రమంలో నీరజ్ చోప్రా -
Tokyo Olympics: శుభవార్త వింటామా!
టోక్యో: విశ్వ క్రీడల ప్రారంభ వేడుకలు ముగిశాయి. నేటి నుంచి క్రీడాకారులు పతకాల వేటను మొదలుపెట్టనున్నారు. తొలి రోజు మొత్తం 7 క్రీడాంశాల్లో 11 స్వర్ణ పతకాల కోసం పోటీలు జరగనున్నాయి. ఈ ఏడు క్రీడాంశాల్లో నాలుగింటిలో భారత క్రీడాకారులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ముందుగా మహిళల షూటింగ్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో మెడల్ ఈవెంట్ జరగనుంది. భారత కాలమానం ప్రకారం ఉదయం 5 గంటలకు క్వాలిఫయింగ్ రౌండ్ మొదలవుతుంది. అనంతరం ఉదయం 7 గంటల 15 నిమిషాలకు ఫైనల్ జరుగుతుంది. అంతా అనుకున్నట్లు జరిగితే ఎనిమిది గంటల వరకు భారత్‌కు పతకం ఖాయమైందో లేదో తేలిపోతుంది. షూటింగ్‌లోనే పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్‌లోనూ మెడల్ ఈవెంట్ ఉంది. మధ్యాహ్నం 12 గంటలకు ఫైనల్ ప్రారంభమవుతుంది. ఫైనల్లో భారత షూటర్లు ఉంటే అరగంటలోపు భారత షూటర్ల గురికి పతకం ఖాయమైందో లేదో తెలిసిపోతుంది. మహిళల 10 మీ. ఎయిర్‌రైఫిల్ క్వాలిఫయింగ్: ఉదయం గం. 5:00 నుంచి; ఫైనల్: ఉదయం గం. 7:15 నుంచి పురుషుల 10 మీ. ఎయిర్ పిస్టల్ క్వాలిఫయింగ్: ఉదయం గం. 9:30 నుంచి; ఫైనల్: మధ్యాహ్నం గం. 12 నుంచి నాలుగు పతకాలపై షూటర్ల గురి... కొన్నేళ్లుగా అంతర్జాతీయ టోర్నీలలో భారత షూటర్లు నిలకడగా పతకాలు సాధిస్తున్నారు. ఒలింపిక్స్ కోసం క్రొయేషియాలో ప్రత్యేకంగా రెండు నెలలపాటు సాధన చేశారు. తొలి రోజు రెండు విభాగాల్లో భారత షూటర్లు బరిలో ఉన్నారు. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో ప్రపంచ మాజీ నంబర్‌వన్ ఇలవేనిల్ వలారివన్, అపూర్వీ చండేలా పోటీపడనున్నారు. 48 మంది షూటర్లు పాల్గొనే క్వాలిఫయింగ్ రౌండ్లో టాప్–8లో నిలిచిన వారు ఫైనల్‌కు అర్హత సాధిస్తారు. ఇలవేనిల్, అపూర్వీ తొలి లక్ష్యం ఫైనల్ చేరడమే. అనంతరం ఎలిమినేషన్ పద్ధతిలో జరిగే ఫైనల్లో నిలకడగా పాయింట్లు స్కోరు చేస్తేనే ఇలవేనిల్, అపూర్వీ పతకాలను ఖాయం చేసుకుంటారు. పురుషుల 10 ఎయిర్ పిస్టల్ విభాగంలో సౌరభ్ చౌదరీ, అభిషేక్ వర్మ బరిలో ఉన్నారు. ప్రస్తుత ప్రపంచ ర్యాంకింగ్స్‌లో సౌరభ్ రెండో స్థానంలో, అభిషేక్ వర్మ మూడో స్థానంలో ఉన్నారు. 36 మంది పాల్గొనే క్వాలిఫయింగ్‌లో రాణించి టాప్–8లో నిలిస్తే ఫైనల్‌కు అర్హత సాధిస్తారు. ఎలిమినేషన్ పద్ధతిలో జరిగే ఫైనల్లో నిలకడగా పాయింట్లు సాధిస్తే సౌరభ్, అభిషేక్‌ల నుంచి పతకాలు ఆశించవచ్చు. దీపిక–ప్రవీణ్ జోడీ అద్భుతం చేస్తేనే... ♦ మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్: ఉదయం గం. 6 నుంచి ♦ కాంస్య పతక మ్యాచ్: మధ్యాహ్నం గం. 12:55 నిమిషాల నుంచి ♦ స్వర్ణ–రజత పతక మ్యాచ్: మధ్యాహ్నం గం. 1:15 ని. నుంచి ఆర్చరీలో శుక్రవారం మహిళల, పురుషుల ర్యాంకింగ్ రౌండ్లు జరిగాయి. మహిళల వ్యక్తిగత విభాగంలో ప్రపంచ నంబర్‌వన్ దీపిక కుమారి 663 పాయింట్లు స్కోరు చేసి తొమ్మిదో ర్యాంక్‌లో నిలిచింది. పురుషుల వ్యక్తిగత విభాగంలో ప్రవీణ్ జాదవ్ 656 పాయింట్లు స్కోరు చేసి 31వ ర్యాంక్‌లో... అతాను దాస్ 653 పాయింట్లతో 35వ ర్యాంక్‌లో... తరుణ్‌దీప్ రాయ్ 652 పాయింట్లతో 37వ ర్యాంక్‌లో నిలిచారు. తొలిసారి ప్రవేశపెట్టిన మిక్స్డ్ విభాగంలో భారత్ తరఫున దీపిక కుమారి–ప్రవీణ్ జాదవ్ జోడీ బరిలోకి దిగనుంది. భార్యాభర్తలైన దీపిక, అతాను దాస్ జతగా ఈ విభాగంలో పోటీపడుతుందని ఆశించినా... ర్యాంకింగ్ రౌండ్లో అతాను దాస్ వెనుకంజలో ఉండటం... ప్రవీణ్ ఉత్తమ ప్రదర్శన కనబర్చడంతో... దీపికకు భాగస్వామిగా ప్రవీణ్‌నే ఎంపిక చేశామని భారత ఆర్చరీ సంఘం స్పష్టం చేసింది. నేడు మిక్స్డ్ డబుల్స్‌లో మెడల్ ఈవెంట్ జరగనుంది. దీపిక–ప్రవీణ్ సంయుక్త స్కోరు (1319) ఆధారంగా తొలి రౌండ్లో ఈ జంటకు తొమ్మిదో సీడ్ లభించింది. నాకౌట్ పద్ధతిలో జరిగే మిక్స్డ్ ఈవెంట్లో తొలి రౌండ్లో లిన్ చియా ఇన్–టాంగ్ చి చున్ (చైనీస్ తైపీ) ద్వయంతో దీపిక–ప్రవీణ్ జంట తలపడుతుంది. తొలి రౌండ్ దాటితే క్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ ఆన్ సాన్–కిమ్ జె డియోక్ (దక్షిణ కొరియా)లతో దీపిక–ప్రవీణ్ తలపడే అవకాశముంది. కొరియా అడ్డంకిని అధిగమిస్తే దీపిక–ప్రవీణ్ సెమీఫైనల్ చేరతారు. మీరాబాయి మెరిసేనా... ప్రపంచ మాజీ చాంపియన్ వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను కూడా పతకంపై ఆశలు రేకెత్తిస్తోంది. 49 కేజీల విభాగంలో పోటీపడుతున్న మీరాబాయి తన అత్యుత్తమ ప్రదర్శన చేస్తే పతకం మోసుకొస్తుంది. ఎనిమిది మంది పోటీపడే ఫైనల్లో మీరాబాయికి చైనా లిప్టర్ జిహుయ్ హు, డెలాక్రుజ్ (అమెరికా), ఐసా విండీ కంతిక (ఇండోనేసియా) నుంచి గట్టిపోటీ లభించనుంది. గత ఏప్రిల్‌లో ఆసియా చాంపియన్‌షిప్‌లో క్లీన్ అండ్ జెర్క్‌లో 119 కేజీలతో ప్రపంచ రికార్డు నెలకొల్పిన మీరాబాయి అదే ప్రదర్శనను పునరావృతం చేసి, స్నాచ్‌లోనూ రాణిస్తే ఆమెకు కనీసం కాంస్యం దక్కే అవకాశముంది. మహిళల 49 కేజీల విభాగం ఫైనల్: ఉదయం గం. 10.20 నిమిషాల నుంచి సుశీలా ‘పట్టు’ ప్రయత్నం మహిళల జూడో 48 కేజీల విభాగంలో భారత క్రీడాకారిణి సుశీలా దేవి పోటీపడనుంది. తొలి రౌండ్లో ఆమె ఇవా సెర్నోవిక్జీ (హంగేరి)తో ఆడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే ప్రిక్వార్టర్ ఫైనల్లో ఫునా తొనాకి (జపాన్)తో సుశీలా తలపడుతుంది. ఇటీవల జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో సుశీలా 33వ ర్యాంక్‌లో... ఆసియా చాంపియన్‌షిప్‌లో ఆరో ర్యాంక్‌లో నిలిచింది. ఈ నేపథ్యంలో సుశీలా పతకం రేసులో నిలిస్తే అద్భుతమే అవుతుంది. తొలి రౌండ్: ఉదయం గం. 7: 30 తర్వాత బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ లీగ్ మ్యాచ్: సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి ్ఠ యాంగ్ లీ–చి లిన్ వాంగ్ (చైనీస్ తైపీ); ఉదయం గం. 8:50 నుంచి. పురుషుల సింగిల్స్ లీగ్ మ్యాచ్: సాయిప్రణీత్ ్ఠ మిషా జిల్బెర్మన్ (ఇజ్రాయెల్); ఉదయం గం. 9:30 నుంచి బాక్సింగ్ పురుషుల 69 కేజీల తొలి రౌండ్: వికాస్ కృషన్ ్ఠ మెన్సా ఒకజావా (జపాన్); మధ్యాహ్నం గం. 3:55 నుంచి. హాకీ పురుషుల విభాగం లీగ్ మ్యాచ్: భారత్ VS న్యూజిలాండ్ (ఉదయం గం. 6:30 నుంచి). మహిళల విభాగం లీగ్ మ్యాచ్: భారత్ VS నెదర్లాండ్స్ (ఉదయం గం. 5:15 నుంచి) రోయింగ్ లైట్‌వెయిట్ డబుల్ స్కల్స్ హీట్–2: అర్జున్ లాల్–అరవింద్ సింగ్ (ఉదయం గం. 7:30 నుంచి) టేబుల్ టెన్నిస్ మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్: శరత్ కమల్–మనిక బత్రా VS యున్ జు లిన్–చింగ్ చెంగ్ (చైనీస్ తైపీ) ఉదయం గం. 8:30 నుంచి మహిళల సింగిల్స్ తొలి రౌండ్: మనిక బత్రా VS టిన్ టిన్ హో (బ్రిటన్); మధ్యాహ్నం గం. 12:15 నుంచి; సుతీర్థ ముఖర్జీ ్ఠ లిండా బెర్గ్స్టోరెమ్ (స్వీడన్); మధ్యాహ్నం గం. 1:00 నుంచి టెన్నిస్ పురుషుల సింగిల్స్ తొలి రౌండ్: సుమిత్ నగాల్ ్ఠ ఇస్టోమిన్ (ఉజ్బెకిస్తాన్); ఉదయం గం. 7:30 నుంచి నేడు అందుబాటులో ఉన్న స్వర్ణాలు (11) ఆర్చరీ (1) రోడ్ సైక్లింగ్ (1) ఫెన్సింగ్ (2) జూడో (2) షూటింగ్ (2) తైక్వాండో (2) వెయిట్‌లిఫ్టింగ్ (1) అన్ని ఈవెంట్స్ ఉదయం గం. 6:00 నుంచి సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్ చానెల్స్‌లో ప్రత్యక్ష ప్రసారం -
Tokyo Olympics: ఈ ఒలింపిక్స్‌లో భారత్ గెలిచే పతకాల సంఖ్య?
న్యూఢిల్లీ: సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ ఒలంపిక్స్ క్రీడలు ఎట్టకేలకు ఆరంభమయ్యాయి. కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడిన టోక్యో ఒలంపిక్స్ ప్రారంభ వేడుక శుక్రవారం మొదలైంది. మహమ్మారి వ్యాప్తి కొనసాగుతున్న నేపథ్యంలో నిరాండబరంగానే ఈ మెగా ఈవెంట్‌కు శంఖం పూరించారు. మొత్తం 42 వేదికల్లో... 33 క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించనున్నారు. ప్రపంచ దేశాల నుంచి మొత్తంగా 11,500 మంది ఇందులో పాల్గొననున్నారు. మొత్తం 339 స్వర్ణ పతకాలు అందుబాటులో ఉన్నాయి. ఇక గత రియో ఒలంపిక్స్‌లో భారత్ రెండు పతకాలు మాత్రమే సాధించి పతకాల పట్టికలో 67వ స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్‌లో తెలుగుతేజం పీవీ సింధు రజత పతకం... మహిళల ఫ్రీస్టయిల్ రెజ్లింగ్ (58 కేజీల విభాగం)లో హరియాణాకు చెందిన సాక్షి మాలిక్ కాంస్య పతకం గెలుచుకున్నారు. వీటితో కలిపి ఒలింపిక్ క్రీడల చరిత్రలో మొత్తంగా భారత్ ఇప్పటి వరకు... గెలుచుకున్న పతకాల సంఖ్య 28. ఇందులో 9 స్వర్ణాలు, 7 రజతాలు, 12 కాంస్యాలు ఉన్నాయి. గెస్ చేయండి.. రూ. 5 వేలు గెలుచుకోండి! మరి, ప్రపంచ జనాభాలో రెండోస్థానంలో ఉన్న భారత్... ఈసారి ఒలంపిక్స్‌లో ఎన్ని పతకాలు గెలుచుకుంటుంది? గతేడాది నిరాశపరిచిన ఆటగాళ్లు.. ఈసారైనా స్వర్ణ పతకాన్ని సాధిస్తారా? అన్న అంశాలు ఆసక్తికరంగా మారాయి. ఇప్పుడున్న ఆటగాళ్లు, వారి ప్రతిభ, బలాబలాల గురించి మీకు అవగాహన ఉందా? ఈసారి భారత్ ఎన్ని పతకాలు గెలుచుకుంటుందో అంచనా వేయగలరా? ఒకవేళ మీకు ఈ అంశాలపై ఆసక్తి ఉంటే.. భారత్ ఏ విభాగంలో, ఎన్ని స్వర్ణ, రజత, కాంస్య పతకాలు సాధిస్తుందో గెస్ చేయండి. కచ్చితమైన గణాంకాలు చెప్పిన టాప్-3 పాఠకులకు Sakshi.com 5 వేల చొప్పున నగదు బహుమతి ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఇంకెందుకు ఆలస్యం... కింద కామెంట్ బాక్స్‌లో మీ అంచనా తెలియజేసి సాక్షి.కామ్ ఇచ్చే గిఫ్ట్‌ను అందుకోండి! -
రండి చీర్స్ చేద్దాం: ఒలింపిక్స్‌పై ప్రధాని మోదీ పిలుపు
సాక్షి, న్యూఢిల్లీ: విశ్వ క్రీడా సంబురం శుక్రవారం నుంచి ప్రారంభమైంది. ఒలింపిక్స్ క్రీడా పోటీల ప్రారంభోత్సవం అట్టహాసంగా సాగింది. భారతదేశానికి చెందిన క్రీడాకారులు వేదికపైకి రాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చప్పట్లతో స్వాగతం పలికారు. టీవీలో క్రీడా ప్రారంభోత్సవాలు చూస్తూ మన క్రీడాకారులకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ‘అందరూ చీర్స్ ఫర్ ఇండియా చేద్దాం రండి’ అంటూ ప్రధాని ప్రజలకు పిలుపునిచ్చారు. ఢిల్లీలోని తన నివాసంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒలింపిక్స్ క్రీడా వేడుకలను టీవీలో స్వయంగా వీక్షించారు. భారత క్రీడాకారులు వేదిక మీదకు రాగానే ప్రధాని మోదీ లేచి నిలబడి చప్పట్లు చరుస్తూ వారికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వజ్రాల్లాంటి క్రీడాకారులంటూ ప్రశంసిస్తూ అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఒలింపిక్స్ వేదికపై భారత పురుషుల హాకీ టీమ్ కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్, మహిళా దిగ్గజ బాక్సర్ మేరీకోమ్ భారత జెండాని పట్టుకుని భారత బృందాన్ని నడిపించారు. భారత్ నుంచి 119 మంది క్రీడాకారులు టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న విషయం తెలిసిందే. వీరిలో 67 మంది ఫురుషులు, 52 మంది మహిళా క్రీడాకారులు ఉన్నారు. ఆగస్టు 8వ తేదీ వరకూ టోక్యో ఒలింపిక్స్ కొనసాగనున్నాయి. Come, let us all #Cheer4India! Caught a few glimpses of the @Tokyo2020 Opening Ceremony. Wishing our dynamic contingent the very best. #Tokyo2020 pic.twitter.com/iYqrrhTgk0 — Narendra Modi (@narendramodi) July 23, 2021 భారత క్రీడాకారులు వేదికపైకి వస్తున్న వీడియో చూడండి #ओलम्पिकखेल भारतीय दल का मार्च पास्ट#Tokyo2020 #cheers4india #TeamIndia pic.twitter.com/jx0NSzgpDR — Doordarshan National दूरदर्शन नेशनल (@DDNational) July 23, 2021 -
టోక్యో ఒలింపిక్స్: నేటి నుంచి ప్రపంచ క్రీడా పండగ
బంగారం వెల రోజురోజుకూ మారిపోవచ్చు... కానీ ఆ బంగారు పతకం విలువ అమూల్యం... శాశ్వతంగా వన్నె తగ్గకుండా చరిత్రలో నిలిచిపోతుంది. జీవితంలో ఎంత పసిడి ధరించినా ఆ పతకధారణ కోసం జీవిత కాలం కష్టపడేందుకు అందరూ సిద్ధం... బంగారంతో పోటీ పడి అక్కడ సాధించే వెండి పతకం కూడా ప్రకాశవంతంగా వెలుగులు విరజిమ్ముతుంది... ఆ వేదికపై కంచు మోత కూడా ఎందరికో కనకమంత ఆనందాన్ని పంచుతుంది... గెలుచుకున్న కాంస్యం అంతులేని కీర్తిని మోసుకొస్తుంది. ఆశలు, ఆశయాలూ అన్నీ ఉంటాయి... అపరిమిత ఆనందం, అంతులేని దుఃఖం కూడా కనిపిస్తాయి... విజయం సాధించిన వేళ, అదే గెలుపును త్రుటిలో చేజార్చుకొని గుండె పగిలిన క్షణాన ఆనందబాష్పాలు, కన్నీళ్లూ వేరు చేయలేనంతగా కలగలిసిపోతాయి... కొందరికి ఆ పతకం జీవితాశయం అయితే మరికొందరికి అదే జీవితం... విశ్వ వేదికపై తమ జాతీయ గీతం వినిపిస్తుండగా... జాతీయ జెండా ఎగురుతుండగా ఆటగాళ్ల మనసులో భావనను కొలిచేందుకు ఏ మీటర్లూ సరిపోవు. పక్షం రోజుల వ్యవధిలో అక్కడ ఎన్నో రకాల భావోద్వేగాలు కనిపిస్తాయి... ఎందరినో ఆ క్రీడలు హీరోలుగా మారుస్తాయి... కొందరు దిగ్గజాలూ జీరోలుగా మారి మౌనంగా మైదానం నుంచి నిష్క్రమించే దృశ్యాలు కోకొల్లలు... ఒలింపిక్స్ అంటే ఒక మహా ఉత్సవం... 204 దేశాల ఆటగాళ్లతో జరిగే అతి పెద్ద క్రీడా పండగ. ఏళ్ల కఠోర శ్రమకు ప్రతిఫలాన్ని ఆశించే అథ్లెట్లు తమ సత్తాను ప్రదర్శించేందుకు సరైన వేదిక... విశ్వ సంగ్రామంలో గెలిచి గొప్పగా వెలిగేందుకు వచ్చే అత్యుత్తమ అవకాశం. క్రీడాకారులంతా ఒలింపిక్స్‌లో ఆడాలని అనుకుంటే కరోనా మహమ్మారి ఒలింపిక్స్‌తో సంవత్సర కాలంగా ఆడుకుంది. ఎట్టకేలకు ఏడాది ఆలస్యంగానైనా మెగా ఈవెంట్‌కు తెర లేవనుండటం ఊరట కలిగించే విషయం. ఈ క్రమంలో ఎన్ని అవాంతరాలు, అడ్డంకులు, ఆర్థికపరమైన నష్టాలు, పాజిటివ్ కేసులు... ప్రతీ రోజూ ఆటలు జరగడంపై సందేహాలే... కానీ అన్ని అవరోధాలను అధిగమించి చివరకు క్రీడల స్ఫూర్తి కోవిడ్‌ను జయించింది. ఈవెంట్స్ మొదలైన తర్వాత కూడా ఆటలకు ఎలాంటి గండాలు, రాకూడదని ప్రపంచమంతా కోరుకుంటోంది. విజేతలు ఎవరైనా అనూహ్య, అసాధారణ పరిస్థితుల మధ్య జరుగుతున్న టోక్యో క్రీడలు ఒలింపిక్స్ చరిత్రలో అన్నింటికంటే భిన్నంగా నిలిచిపోతాయి. టోక్యో: ప్రపంచవ్యాప్తంగా క్రీడాకారులు, క్రీడాభిమానులు ఎదురు చూసిన క్షణం రానే వచ్చింది. ప్రతిష్టాత్మక ఒలింపిక్ క్రీడలు శుక్రవారం ప్రారంభం కానున్నాయి. షెడ్యూల్ ప్రకారం గత ఏడాదే జరగాల్సి ఉన్నా... కరోనా కారణంగా సంవత్సరం పాటు వాయిదా పడిన ఆటలకు నేటితో తెర లేవనుంది. రెండు వారాల పాటు జరిగే క్రీడలు ఆగస్టు 8న ముగుస్తాయి. క్యాలెండర్లో తేదీ మారినా... మార్కెటింగ్, ఇతర కారణాల వల్ల టోక్యో–2020గానే ఈ క్రీడలను పరిగణిస్తున్నారు. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఏసీ)లో 206 సభ్య దేశాలు ఉండగా... ఉత్తర కొరియా పోటీల నుంచి గతంలోనే తప్పుకుంది. కరోనా భయంతో ఆఫ్రికా దేశం గినియా కూడా ఆటల్లో పాల్గొనడం లేదని గురువారం ప్రకటించింది. దాంతో 204 దేశాలకు చెందిన అథ్లెట్లు బరిలో నిలిచారు. ఐఓసీ ఎంపిక చేసిన శరణార్ధుల జట్టు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. గత డోపింగ్ కేసుల కారణంగా రష్యా దేశంపై నిషేధం కొనసాగుతున్నా.... డోపింగ్‌తో సంబంధం లేని రష్యా క్రీడాకారులకు టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు అవకాశమిచ్చారు. వీరందరూ రష్యా ఒలింపిక్ కమిటీ (ఆర్ఓసీ) పేరిట బరిలోకి దిగుతారు. గేమ్స్ విలేజ్‌తో పాటు బయట కూడా కరోనా కేసులు బయటపడుతున్నా... ఒలింపిక్స్‌ను ఎలాగైనా నిర్వహిస్తామని ఐఓసీ స్పష్టం చేసింది. సాధ్యమైనన్ని జాగ్రత్తలు తీసుకొంటూ ఇప్పటికే విధించిన ఆంక్షలు, నిబంధన ప్రకారం క్రీడలను పూర్తి చేయాలని వివిధ దేశాల చెఫ్ డి మిషన్ల సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. మొత్తం క్రీడాంశాలు: 33 పాల్గొంటున్న ఆటగాళ్ల సంఖ్య: 11,500 పోటీల వేదికలు : 42 అందుబాటులో ఉన్న స్వర్ణ పతకాలు : 339 25 మందితో భారత బృందం ఆర్భాటాలు, అట్టహాసాలు ఏమీ లేకుండా ఒలింపిక్ క్రీడలు ప్రారంభం కానున్నాయి. కరోనా కారణంగా తక్కువ మందితో ఆరంభ వేడుకలు సాదాసీదాగా నిర్వహించనున్నారు. స్టేడియంలో ప్రేక్షకులు లేకపోయినా వివిధ దేశాల మార్చ్‌పాస్ట్ కార్యక్రమం జరుగుతుంది. ఇందులో కూడా అన్ని దేశాలు తక్కువ మందితోనే పాల్గొంటున్నాయి. జపాన్ దేశ అక్షరమాల ప్రకారం వరుసలో 21వ స్థానంలో భారత బృందం నడుస్తుంది. మన దేశం నుంచి మార్చ్‌పాస్ట్‌లో 20 మంది ఆటగాళ్లు, 5 మంది అధికారులు నడుస్తారని భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) వెల్లడించింది. లండన్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత మేరీకోమ్, భారత హాకీ జట్టు కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్ ‘ఫ్లాగ్ బేరర్స్’గా ముందుండి నడిపిస్తారు. ప్రేక్షకుల్లేకుండానే... మైదానంలో అభిమానుల చప్పట్లు, ప్రోత్సాహాలే అథ్లెట్లకు అదనపు ప్రాణవాయువునందిస్తాయి. ప్రేక్షకుల జోష్ మధ్య ఆటలు ఆడితే ఆ మజాయే వేరు. కానీ టోక్యోలో ఆటగాళ్లకు ఆ అదృష్టం లేదు. కరోనా నేపథ్యంలో ఈ క్రీడలకు ప్రేక్షకులను అనుమతించడం లేదు. జూలై 12 నుంచి జపాన్‌లో అత్యయిక పరిస్థితిని విధించడంతో ప్రజ లకు ఆటలను చూసేందుకు ఎలాంటి అవకాశం లేదు. ఇక అభిమానులంతా తమ హీరోల ఆట చూసేందుకు ఇంట్లో టీవీలు, ఫోన్లకు పరిమితం కావాల్సిందే. ‘రియో’లో భారత్ గత క్రీడల్లో భారత్ రెండు పతకాలు మాత్రమే గెలిచి పతకాల పట్టికలో 67వ స్థానంలో నిలిచింది. బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్‌లో తెలుగు పీవీ సింధు రజత పతకం గెలుచుకోగా... మహిళల ఫ్రీస్టయిల్ రెజ్లింగ్ (58 కేజీల విభాగం)లో హరియాణాకు చెందిన సాక్షి మలిక్ కాంస్య పతకం సాధించింది. 9 స్వర్ణాలు, 7 రజతాలు, 12 కాంస్యాలు... ఒలింపిక్ క్రీడల చరిత్రలో మన దేశం సాధించిన మొత్తం పతకాల సంఖ్య 28... ఇందులో 8 పసిడి పతకాలు ఒక్క హాకీలోనే రాగా... ఇప్పటి వరకు ఒకే ఒక వ్యక్తిగత స్వర్ణం భారత్ ఖాతాలో ఉంది. నాలుగేళ్లకు ఒకసారి భారీ బలగంతో, ఆకాశాన్ని తాకే అంచనాలతో మన బృందం వెళుతున్నా... చాలా వరకు ఈ క్రీడలు నిరాశనే మిగిల్చాయి. ఇప్పుడు కూడా 127 మంది సభ్యులతో టీమిండియా తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. 2012లో గరిష్టంగా సాధించిన 6 పతకాల సంఖ్యను అధిగమిస్తుందా... రెండంకెల సంఖ్యను చేరుతుందా అనేది ఆసక్తికరం! ఇక ఒలింపిక్స్ చరిత్రలో అత్యధికంగా అమెరికా మొత్తం 2,847 పతకాలు గెలిచింది. ఇందులో 1,134 స్వర్ణాలు... 914 రజతాలు... 799 కాంస్యాలు ఉన్నాయి. -
టోక్యో ఒలింపిక్స్: పతకాల ఆశల పల్లకిలో..
ఐదేళ్ల క్రితం భారీ అంచనాలతో రియో ఒలింపిక్స్‌లో పాల్గొన్న భారత బృందం కేవలం రెండు పతకాలతో తిరిగి వచి్చంది. మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్‌లో పీవీ సింధు రజతం సాధించగా... మహిళల రెజ్లింగ్‌లో సాక్షి మలిక్ కాంస్య పతకం కైవసం చేసుకుంది. ‘రియో’ క్రీడల్లో భారత్ నుంచి 15 క్రీడాంశాల్లో 117 మంది క్రీడాకారులు బరిలోకి దిగారు. ‘రియో’ వైఫల్యం తర్వాత కేంద్ర క్రీడా శాఖ భారత క్రీడారంగాన్ని బలోపేతం చేసేందుకు నడుం బిగించింది. టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ (టాప్స్)ను రూపొందించి ఒలింపిక్స్‌లో పతకాలు సాధించే సత్తా ఉన్న క్రీడాకారులను ఎంపిక చేసి వారికి అన్ని రకాల సౌకర్యాలు కల్పించింది. ఫలితంగా టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ నుంచి అత్యధికంగా 18 క్రీడాంశాల్లో 127 మంది క్రీడాకారులు పతకాల వేటకు వెళ్లనున్నారు. గత ఐదేళ్ల కాలంలో భారత క్రీడాకారులు అంతర్జాతీయస్థాయిలో నిలకడగా రాణిస్తుండటం... మేటి క్రీడాకారులను మట్టికరిపిస్తూ పతకాలు కొల్లగొడుతుండటంతో... టోక్యో ఒలింపిక్స్‌లో మనోళ్లపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఎప్పుడూలేని విధంగా ఈసారి ఒలింపిక్స్‌లో భారత్ పతకాల సంఖ్య రెండంకెలు దాటుతుందని అందరూ విశ్వసిస్తున్నారు. ఇటీవల కాలంలో భారత క్రీడాకారుల ప్రదర్శన ఆధారంగా ఆర్చరీ, షూటింగ్, బ్యాడ్మింటన్, రెజ్లింగ్, బాక్సింగ్, వెయిట్‌లిఫ్టింగ్ క్రీడాంశాల్లో భారత్‌కు కచ్చితంగా పతకాలు వస్తాయని ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనబోతున్న భారత క్రీడాకారుల వివరాలు, షెడ్యూల్ మీ కోసం... హాకీ (38) పురుషుల జట్టు (19): శ్రీజేష్ (గోల్‌కీపర్), మన్‌ప్రీత్ సింగ్ (కెప్టెన్), హర్మన్‌ప్రీత్ సింగ్, రూపిందర్ పాల్ సింగ్, సురేందర్ కుమార్, అమిత్ రోహిదాస్, బీరేంద్ర లాక్రా, హార్దిక్ సింగ్, వివేక్ సాగర్ ప్రసాద్, నీలకంఠ శర్మ, సుమిత్, షంషేర్ సింగ్, దిల్‌ప్రీత్ సింగ్, గుర్జంత్ సింగ్, లలిత్ ఉపాధ్యాయ్, మన్దీప్ సింగ్. స్టాండ్‌బై: వరుణ్ కుమార్, సిమ్రన్‌జిత్ సింగ్, కృషన్ పాఠక్ (గోల్‌కీపర్). మహిళల జట్టు (19): సవితా పూనియా (గోల్‌కీపర్), రాణి రాంపాల్ (కెపె్టన్), షర్మిలా దేవి, దీప్ గ్రేస్ ఎక్కా, వందన కటారియా, గుర్జిత్ కౌర్, నవ్‌జ్యోత్ కౌర్, నవ్‌నీత్ కౌర్, లాల్రెమ్సియామి, మోనిక, నేహా, నిషా, నిక్కీ ప్రధాన్, సుశీలా చాను, సవితా పూనియా, సలీమా టెటె. స్టాండ్‌బై: రీనా, నమితా టొప్పో, రజని (గోల్‌కీపర్). షెడ్యూల్: జూలై 24 నుంచి ఆగస్టు 6 షూటింగ్ (15) మహిళల విభాగం అంజుమ్ మౌద్గిల్ (50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్, 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ ఈవెంట్), తేజస్విని (50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్), ఇలవేనిల్ (10 మీటర్ల ఎయిర్‌రైఫిల్, మిక్స్డ్ ఈవెంట్), అపూర్వీ చండేలా (10 మీటర్ల ఎయిర్ రైఫిల్), మనూ భాకర్ (10 మీటర్ల ఎయిర్ పిస్టల్, 25 మీటర్ల ఎయిర్ పిస్టల్, 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ ఈవెంట్), యశస్విని(10 మీటర్ల ఎయిర్ పిస్టల్, మిక్స్డ్ ఈవెంట్), రాహీ సర్నోబత్ (25 మీటర్ల ఎయిర్ పిస్టల్) పురుషుల విభాగం దివ్యాంశ్, దీపక్ (10 మీటర్ల ఎయిర్ రైఫిల్, మిక్స్డ్ ఈవెంట్), సంజీవ్ రాజ్‌పుత్, ఐశ్వరీ ప్రతాప్ సింగ్ (50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్), సౌరభ్ చౌదరీ, అభిõÙక్ వర్మ (10 మీటర్ల ఎయిర్ పిస్టల్, మిక్స్డ్ ఈవెంట్), మేరాజ్ అహ్మద్ ఖాన్, అంగద్ (స్కీట్ ఈవెంట్) షెడ్యూల్: జూలై 24 నుంచి ఆగస్టు 2 టేబుల్ టెన్నిస్ (4) పురుషుల సింగిల్స్: శరత్ కమల్, సత్యన్ మహిళల సింగిల్స్: మనిక బత్రా, సుతీర్థ మిక్స్డ్ డబుల్స్: శరత్ కమల్–మనిక బత్రా షెడ్యూల్: జూలై 24 నుంచి 27 గోల్ఫ్ (3) అనిర్బన్, అదితి అశోక్, ఉదయన్ మానె షెడ్యూల్: జూలై 29 నుంచి ఆగస్టు 7 అథ్లెటిక్స్ (26) పురుషుల విభాగం జావెలిన్ త్రో: నీరజ్ చోప్రా, శివపాల్ సింగ్ 20 కి.మీ. నడక: కేటీ ఇర్ఫాన్ థోడి, సందీప్ కుమార్, రాహుల్ రోహిల్లా 50 కి.మీ. నడక: గుర్ప్రీత్ సింగ్ 3000 మీ. స్టీపుల్‌ఛేజ్: అవినాశ్ సాబ్లే లాంగ్‌జంప్: శ్రీశంకర్ షాట్‌పుట్: తజీందర్ పాల్ సింగ్ తూర్ 400 మీటర్ల హర్డిల్స్: జాబిర్ 4్ఠ400 మీటర్ల రిలే: అమోల్ జేకబ్, రాజీవ్ అరోకియా, మొహమ్మద్ అనస్, నాగనాథన్ పాండి, నోవా నిర్మల్ టామ్. మహిళల 20 కి.మీ. నడక: భావన జట్, ప్రియాంక గోస్వామి డిస్కస్ త్రో: కమల్‌ప్రీత్, సీమా పూనియా 100, 200 మీటర్లు: ద్యుతీచంద్ జావెలిన్ త్రో: అన్ను రాణి మిక్స్డ్ 4్ఠ400 మీటర్ల రిలే: సార్థక్ బాంబ్రీ, అలెక్స్ ఆంటోనీ, రేవతి వీరణమి, సుభా వెంకటేశన్, ధనలక్ష్మి శేఖర్ షెడ్యూల్: జూలై 30 నుంచి ఆగస్టు 7 బాక్సింగ్ (9) పురుషుల విభాగం: సతీశ్ కుమార్ (ప్లస్ 91 కేజీలు), ఆశిష్ కుమార్ (75 కేజీలు), వికాస్ కృషన్ (75 కేజీలు), మనీశ్ కౌశిక్ (63 కేజీలు), అమిత్ పంఘాల్ (52 కేజీలు) మహిళల విభాగం: మేరీకోమ్ (51 కేజీలు), సిమ్రన్‌జిత్ (60 కేజీలు), లవ్లీనా బొర్గోహైన్ (69 కేజీలు), పూజా రాణి (75 కేజీలు). షెడ్యూల్: జూలై 24 నుంచి ఆగస్టు 8 స్విమ్మింగ్ (3) పురుషుల 200 మీటర్ల బటర్‌ఫ్లయ్: సజన్ పురుషుల 100 మీ. బ్యాక్‌స్ట్రోక్: శ్రీహరి మహిళల 100 మీ. బ్యాక్‌స్ట్రోక్: మానా పటేల్ షెడ్యూల్: జూలై 25 నుంచి 30 రెజ్లింగ్ (7) పురుషుల విభాగం: రవి (57 కేజీలు), బజరంగ్ (65 కేజీలు), దీపక్ (86 కేజీలు). మహిళల విభాగం: సీమా (50 కేజీలు), వినేశ్ (53 కేజీలు), అన్షు (57 కేజీలు), సోనమ్ (62 కేజీలు) షెడ్యూల్: ఆగస్టు 3 నుంచి 7 టెన్నిస్ (3) మహిళల డబుల్స్: సానియా, అంకిత రైనా పురుషుల సింగిల్స్: సుమిత్ నగాల్ షెడ్యూల్: జూలై 24 నుంచి ఆగస్టు 1 రోయింగ్ (2) పురుషుల లైట్ వెయిట్ డబుల్ స్కల్స్: అర్జున్ లాల్, అరవింద్ సింగ్ షెడ్యూల్: జూలై 24 ఆర్చరీ (4) పురుషుల రికర్వ్ టీమ్, వ్యక్తిగత విభాగం: తరుణ్‌దీప్ రాయ్, అతాను దాస్, ప్రవీణ్ జాదవ్; మహిళల రికర్వ్ వ్యక్తిగత విభాగం: దీపిక కుమారి షెడ్యూల్: జూలై 23 నుంచి 31 సెయిలింగ్ (4) మహిళల లేజర్ రేడియల్: నేత్ర కుమనన్ పురుషుల లేజర్ స్టాండర్డ్: విష్ణు శరవణన్ పురుషుల స్కీఫ్ 49 ఈఆర్: గణపతి, వరుణ్ షెడ్యూల్: జూలై 25 నుంచి 27 రోయింగ్ (2) పురుషుల లైట్ వెయిట్ డబుల్ స్కల్స్: అర్జున్ లాల్, అరవింద్ సింగ్ షెడ్యూల్: జూలై 24 ఈక్వెస్ట్రియన్ (1) పురుషుల వ్యక్తిగత ఈవెంటింగ్: ఫౌద్ మీర్జా షెడ్యూల్: జూలై 30 బ్యాడ్మింటన్ (4) మహిళల సింగిల్స్: పీవీ సింధు పురుషుల సింగిల్స్: సాయిప్రణీత్ పురుషుల డబుల్స్: సాతి్వక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి షెడ్యూల్: జూలై 24 నుంచి ఆగస్టు 2 జూడో (1) మహిళల 49 కేజీల విభాగం: సుశీలా దేవి షెడ్యూల్: జూలై 24 ఈక్వెస్ట్రియన్ (1) పురుషుల వ్యక్తిగత ఈవెంటింగ్: ఫౌద్ మీర్జా షెడ్యూల్: జూలై 30 ఫెన్సింగ్ (1) మహిళల సాబ్రే ఈవెంట్: భవాని దేవి షెడ్యూల్: జూలై 26 బ్యాడ్మింటన్ (4) మహిళల సింగిల్స్: పీవీ సింధు పురుషుల సింగిల్స్: సాయిప్రణీత్ పురుషుల డబుల్స్: సాతి్వక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి షెడ్యూల్: జూలై 24 నుంచి ఆగస్టు 2 వెయిట్‌లిఫ్టింగ్ (1) మహిళల 48 కేజీల విభాగం: మీరాబాయి షెడ్యూల్: జూలై 24 జిమ్నాస్టిక్స్ (1) మహిళల ఆరి్టస్టిక్: ప్రణతి నాయక్ షెడ్యూల్: జూలై 25 నుంచి ఆగస్టు 3 -
టోక్యోలో భారతీయం: ప్రాక్టీస్ ప్రారంభించిన మన క్రీడాకారులు
టోక్యో: ఒలింపిక్స్ పతకాల పట్టికలో అత్యుత్తమ ప్రదర్శనతో కొత్త చరిత్ర సృష్టించాలనే ఏౖకైక లక్ష్యంతో భారత అథ్లెట్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. క్రీడల వేదికకు చేరుకున్న ఒకరోజు తర్వాత భారత తొలి బృందం సోమవారం పూర్తి స్థాయి ప్రాక్టీస్‌లో పాల్గొంది. అన్ని క్రీడాంశాలకు చెందిన ఆటగాళ్లు సాధనలో చెమటోడ్చారు. కరోనా కేసుల కారణంగా భారత్ నుంచి వచ్చే ఆటగాళ్లకు మూడు రోజుల పాటు సెల్ఫ్ ఐసోలేషన్ అంటూ గతంలో ప్రకటించిన ఒలింపిక్ కమిటీ తర్వాత ఆ ఆంక్షలను తప్పించడంతో మొదటి రోజే నేరుగా మైదానంలోకి దిగే అవకాశం మన క్రీడాకారులకు కలిగింది. ఆర్చరీ జంట దీపిక కుమారి, అతాను దాస్ స్థానిక యుమెనొషిమా పార్క్‌లో తమ బాణాలకు పదును పెట్టగా... తొలి ఒలింపిక్ పతకాన్ని ఆశిస్తున్న టేబుల్ టెన్నిస్ ఆటగాళ్లు శరత్ కమల్, సత్యన్ సుదీర్ఘ సమయం పాటు సాధన చేశారు. జిమ్నాస్టిక్స్‌లో ఆశలు రేపుతున్న ప్రణతి నాయక్ తన కోచ్ మనోహర్ శర్మ పర్యవేక్షణలో ప్రాక్టీస్ చేసింది. బ్యాడ్మింటన్ క్రీడాకారులు కూడా తమ జట్టు కోచ్‌లతో కలిసి కోర్టులోకి దిగారు. భారత సింగిల్స్, డబుల్స్ కోచ్‌లు పార్క్ సంగ్, మథియాస్ బో సాధనలో పీవీ సింధు, సాయిప్రణీత్, సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టిలకు సహకరించారు. సింధు, సాయిప్రణీత్ కోర్టులో చెరో వైపు నిలిచి తలపడగా, పార్క్ వారి మధ్యలో నిలబడి ప్రాక్టీస్ చేయించాడు. అసాకా రేంజ్లో భారత షూటర్లకు ప్రాక్టీస్ అవకాశం దక్కింది. ఇదే వేదికపై పోటీలు జరగనుండటంతో నాలుగు రోజుల సాధన వల్ల మేలు కలుగుతుందని షూటర్లు భావిస్తున్నారు. 1964 టోక్యో ఒలింపిక్స్‌లో కూడా షూటింగ్ పోటీలు ఇక్కడే నిర్వహించారు. వాటర్ స్పోర్ట్స్‌లో భాగంగా సెయిలింగ్‌లో పోటీ పడుతున్న వి.శరవణన్, నేత్ర కుమనన్, కేసీ గణపతి, వరుణ్ ఠక్కర్‌లతో పాటు రోయర్లు అర్జున్ లాల్, అర్వింద్ సింగ్ కూడా సీ ఫారెస్ట్ వాటర్ వే జలాల్లో సన్నద్ధమయ్యారు. 100 ‘టీ కెటిల్స్’ కావాలి... ఒలింపిక్ విలేజ్‌లోకి అడుగు పెట్టగానే సాధారణంగా అథ్లెట్ల నుంచి ఏదో ఒక రూపంలో ఫిర్యాదులు మొదలవుతాయి. కానీ ఈసారి పరిస్థితి పూర్తిగా భిన్నం. నిజంగా సమస్య ఉన్నా సర్దుకుపోవడమే తప్ప గట్టిగా అడిగే పరిస్థితి లేదు. భారత అథ్లెట్లకు ఇలాంటి అనుభవాలే ఎదురవుతున్నాయి. కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో మూడు రోజులకు ఒక సారి మాత్రమే ఆటగాళ్ల గదిని శుభ్రపరుస్తారు. టవల్స్ కూడా గ్రౌండ్‌ఫ్లోర్‌కు వెళ్లి ప్రతీ రోజు తెచ్చుకోవాల్సిందే. ప్రాక్టీస్‌కు వెళ్లే ముందు ప్రతీ రోజు ఆటగాళ్లు తమ కోవిడ్ శాంపిల్స్‌ను ఇవ్వాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన టెస్టింగ్ కిట్స్ కూడా రోజూవారీ ప్రాతిపదికనే ఇస్తున్నారు. భోజనం విషయంలో మాత్రం మన అథ్లెట్లు సంతృప్తిగానే ఉన్నట్లు సమాచారం. అయితే మరీ మన ఇంటి భోజనంతో పోల్చి చూడవద్దని, కొన్నిసార్లు సరిగా ఉడకకపోయినా సరే సర్దుకుపోవాల్సిందేనని భారత బృందంలో ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. స్థానిక జపాన్ ఫుడ్‌ను బాగా వండుతున్నారని, మరీ భారతీయ వంటకాలపై మోజు పడకుండా దానిని కూడా అలవాటు చేసుకుంటే మంచిదని కూడా ఆయన సూచించారు. మరోవైపు ఉదయమే వేడి నీళ్లు తాగేందుకు వీలుగా తమ గదుల్లో ఎలక్ట్రిక్ టీ కెటిల్స్ కావాలని భారత అథ్లెట్లు విజ్ఞప్తి చేశారు. ఆటగాళ్ల కోరిక మేరకు భారత రాయబార కార్యాలయం 100 కెటిల్స్ ఏర్పాటు చేయనుందని చెఫ్ డి మిషన్ ప్రేమ్ వర్మ వెల్లడించారు. మరోవైపు టెన్నిస్ ప్లేయర్లు సానియా మీర్జా, అంకిత రైనా, సుమిత్ నగాల్ సోమవారం న్యూఢిల్లీ నుంచి టోక్యోకు బయలుదేరి వెళ్లారు. సానియా–అంకిత ద్వయం మహిళల డబుల్స్‌లో, సుమిత్ పురుషుల సింగిల్స్‌లో పోటీపడతారు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1731380308.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
టోక్యోకు భారత్ నుంచి తొలి బృందం
న్యూఢిల్లీ: శతకోటి ఆశలను, ఆకాంక్షలను మోసుకుంటూ భారత్ నుంచి క్రీడాకారులు, క్రీడాధికారులతో కూడిన తొలి బృందం శనివారం రాత్రి టోక్యోకు పయనమైంది. తొలి బృందంలో 88 మంది ఉన్నారు. ఇందులో ఆర్చరీ, హాకీ, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, జూడో, జిమ్నాస్టిక్స్ పోటీల్లో పాల్గొనే 54 మంది క్రీడాకారులు ఉన్నారు. మిగతా వారు సహాయ సిబ్బంది ఉన్నారు. భారత్ నుంచి మొత్తం 127 మంది క్రీడాకారులు టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించగా... విదేశాల్లో శిక్షణకెళ్లిన పలువురు క్రీడాకారులు అక్కడి నుంచే నేరుగా టోక్యో చేరుకుంటున్నారు. షూటర్లకు క్వారంటైన్ లేదు విదేశాల్లో శిక్షణ తీసుకున్న భారత షూటర్లు నేరుగా టోక్యోకు చేరడంతో క్వారంటైన్ తప్పింది. దీంతో వారంతా సోమవారం నుంచి ప్రాక్టీస్ చేసుకునే వీలు చిక్కింది. ఒలింపిక్స్‌కు అర్హత పొందిన 15 మంది షూటర్లలో 13 మంది క్రొయేషియాలో, ఇద్దరు స్కీట్ షూటర్లు ఇటలీలో తుది కసరత్తు చేశారు. ఆటలకు సమయం దగ్గరపడటంతో ఆమ్‌స్టర్‌డామ్‌లో ఒక్కటైన షూటింగ్ జట్టు అక్కడి నుంచి శనివారం ఉదయం టోక్యోకు చేరుకుంది. -
Tokyo Olympics: క్రీడాకారుల్లారా విజయోస్తు..
న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌లో పతకాల వేటకు సిద్ధమైన భారత క్రీడాకారుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొండంత విశ్వాసం నింపారు. వెన్నంటి ఉండే ఉత్సాహమిచ్చారు. టోక్యోకు తుది కసరత్తుల్లో నిమగ్నమైన క్రీడాకారులతో మంగళవారం సాయంత్రం ప్రధాని ఆన్లైన్ వీడియో కాన్ఫరెన్స్‌లో భేటీ అయ్యారు. క్రీడాకారులంతా తమ ఆటపైనే దృష్టి పెడితే చాలని, అంచనాలను మోయాల్సిన పనిలేదని అన్నారు. ఏమాత్రం ఒత్తిడిలో కూరుకుపోవద్దని యావత్ దేశం వారి అత్యుత్తమ ప్రదర్శన కోసమే ఎదురు చూస్తోం దని అథ్లెట్లతో మోదీ అన్నారు. ఈ కార్యక్రమంలో స్టార్ షట్లర్, ప్రపంచ చాంపియన్ పీవీ సింధు, బాక్సింగ్ దిగ్గజం మేరీకోమ్, టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, షూటర్లు సౌరభ్ చౌదరి, ఇలవెనిల్ వలరివన్, టేబుల్ టెన్నిస్ (టీటీ) ప్లేయర్లు శరత్ కమల్, మనిక బాత్రా, ప్రపంచ నంబర్‌వన్ ఆర్చర్ దీపిక కుమారి, బాక్సర్ ఆశిష్ కుమార్, స్టార్ స్ప్రింటర్ ద్యుతీచంద్ తదితరులతో మోదీ ముచ్చటించారు. వారిలో స్ఫూర్తి నింపారు. ప్రపంచ క్రీడా వేదికపై భారత్ సత్తా చాటాలని, విశ్వాసంతో ముందడుగు వేయాలని సూచించారు. ప్రభుత్వం నుంచి ఏ సాయమందించడానికైనా సిద్ధమేనని ప్రకటించారు. ‘మీతో ఇలా భేటీ కావడం చాలా సంతోషంగా ఉంది. టోక్యో నుంచి తిరిగొచ్చాక తప్పకుండా ముఖాముఖిగా కలుసుకుందాం. ముఖ్యంగా నేను చెప్పేదొకటే... మీరెవరూ అంచనాలతో పోటీ పడకండి. ప్రత్యర్థులతోనే తలపడండి. అనవసర ఒత్తిడిని తలకెత్తుకోవద్దు. అత్యుత్తమ ప్రదర్శన మాత్రమే చూపండి. ఎందుకంటే నాకు మీ గురించి తెలుసు, మీరు పడ్డ కష్టం విలువా తెలుసు. మీ అందరి ఉమ్మడి లక్ష్యం పతకమైతే... మీలో ఉన్న సుగుణం అంకితభావం. ఆటలకే అంకితమయ్యారు. ఈ ఆటల కోసమే ఎన్నో త్యాగాలు చేశారు. శ్రమ, సాధనతో ఈస్థాయికి చేరిన మీ వెంటే మేమంతా ఉంటాం. మీ కృషిని కొనియాడుతూనే ఉంటాం’ అని మోదీ అన్నారు. ఈ వర్చువల్ మీటింగ్‌లో కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్, మాజీ క్రీడల మంత్రి, ప్రస్తుత న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు పాల్గొన్నారు. మోదీ నోట... సింధు ఐస్‌క్రీమ్ ముచ్చట తెలుగుతేజం సింధుతో పాటు ఆమె తల్లిదండ్రులు పీవీ రమణ, విజయలతోనూ మోదీ వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ‘రియో’ విజయం కోసం సింధు ఫోన్‌ను కోచ్ గోపీచంద్ పక్కన పెట్టించారని, తనకెంతో ఇష్టమైన ఐస్‌క్రీమ్ కూడా తినకుండా ఆంక్షలు విధించినట్లు తెలుసుకున్న మోదీ ఈ విషయాన్ని సరదాగా ప్రస్తావించారు. దీనిపై సింధు హుషారుగా సమాధానమిచ్చింది. ‘ప్లేయర్లకు పూర్తి ఫిట్నెస్ అవసరం. డైట్ నియంత్రణ తప్పనిసరి. ఇందుకు ఇష్టాయిష్టాలను పక్కన బెట్టాల్సి వస్తుంది’ అని తెలిపింది. ఇప్పుడు ‘టోక్యో’ కోసం కూడా అలాంటి డైట్‌నే ఫాలో అవుతున్నానని చెప్పింది. గచ్చిబౌలి స్టేడియంలో ఆమె ప్రాక్టీస్‌పై ప్రధాని అడిగి తెలుసుకున్నారు. తమ అమ్మాయిని వెన్నంటి ఉండి ప్రోత్సహించిన ఆమె తల్లిదండ్రులను మోదీ అభినందించారు. 228 మందితో భారత బృందం... టోక్యో ఒలింపిక్స్ కోసం 228 మందితో కూడిన భారత బృందం జపాన్‌కు పయనమవుతుంది. భారత్ తరఫున 18 క్రీడాంశాల్లో మొత్తం 119 క్రీడాకారులు పోటీపడనున్నారు. ఇందులో 67 మంది పురుషులు, 52 మంది మహిళలు ఉన్నారు. మిగతా వారంతా కోచింగ్, ఫిజియో సిబ్బంది. 17న తొలి విడతగా 90 మంది అక్కడికి బయలుదేరుతారని భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) చీఫ్ నరీందర్ బాత్రా వెల్లడించారు. సానియా ఏం చెప్పిందంటే... ప్రధాని మోదీతో హైదరాబాదీ టెన్నిస్ స్టార్ సానియా మాట్లాడుతూ ఈ తరం ఆటగాళ్ల దృక్పథం గొప్పగా ఉందన్నారు. ‘ఎవరైనా ఉన్నతస్థానానికి చేరుకోవచ్చని యువ క్రీడాకారులు భావిస్తున్నారు. అయితే వాళ్లు లక్ష్యం కోసం బాగా కష్టపడాలి. అంకితభావంతో ముందడుగు వేయాలి. అప్పుడే అదృష్టం కూడా కలిసొస్తుంది. అంతేకానీ కఠోర శ్రమ, అంకితభావం లేకపోతే అదృష్టరేఖ కూడా ఏమీ చేయలేదు’ అని సానియా చెప్పింది. టోక్యో చేరిన భారత సెయిలింగ్ జట్టు భారత సెయిలింగ్ జట్టు మంగళవారం టోక్యో చేరుకుంది. భారత్ నుంచి ఒలింపిక్స్ కోసం టోక్యోలో అడుగుపెట్టిన తొలి బృందం ఇదే. వరుణ్ ఠక్కర్, గణపతి చెంగప్ప, విష్ణు శరవణన్, నేత్ర కుమనన్... కోచ్‌లు, ఇతర సహాయ సిబ్బందితో కూడిన సెయిలింగ్ జట్టు యూరోప్‌లో శిక్షణ అనంతరం అక్కడి నుంచే నేరుగా జపాన్‌కు పయనమైంది. -
దేశం మొత్తం మీ వెనుకే ఉంది.. అత్యుత్తమ ప్రదర్శన కనబర్చండి
న్యూఢిల్లీ: ఈ నెల 23 నుంచి ప్రారంభంకానున్న టోక్యో ఒలింపిక్స్‌లో భారత అథ్లెట్లు ఒత్తిడికి లోను కాకుండా అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. విశ్వక్రీడల్లో పాల్గొనేందుకు భారత్ నుంచి తొలి బృందం ఈనెల 17న ఒలింపిక్ గ్రామానికి బయల్దేరనున్న నేపథ్యంలో ప్రధాని మోదీ వర్చువల్ విధానంలో అథ్లెట్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన భారత బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. దేశం మొత్తం మీ వెనకే ఉందని అథ్లెట్లకు భరోసానిచ్చారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో అథ్లెట్లతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. Let us all #Cheer4India. Interacting with our Tokyo Olympics contingent. https://t.co/aJhbHIYRpr— Narendra Modi (@narendramodi) July 13, 2021 అందరితో మాట్లాడిన ప్రధాని.. అథ్లెట్లు తమపై ఉన్న అంచనాల గురించి భయపడొద్దని, ధైర్యంగా ముందడుగు వేయాలని, పతకాలు వాటంతట అవే వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ.. మేరీ కోమ్, పీవీ సింధు, ప్రవీణ్ జాదవ్, శరత్ కమల్, సానియా మీర్జా, దీపికా కుమారి, నీరజ్ చోప్రా తదితరులతో ప్రత్యేకంగా మాట్లాడారు. కరోనా నేపథ్యంలో అథ్లెట్లంతా అక్కడి పరిస్థితులకు త్వరగా అలవాటు పడాలని, ఆటపై మనసు పెట్టి, 100 శాతం విజయం కోసం ప్రయత్నించాలని ఆకాంక్షించారు. కాగా, 119 మందితో కూడిన భారత అథ్లెట్ల బృందం మొత్తం 85 విభాగాల్లో పోటీపడనుంది. ఇందులో 67 మంది పురుషులు, 52 మంది మహిళలున్నారు. -
మన క్రీడాకారులకు మీ అండదండలు కావాలి
న్యూఢిల్లీ: కష్టనష్టాలను ఓర్చి టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సంపాదించిన భారత క్రీడాకారులకు యావత్ జాతి మద్దతు తెలపాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. ఆదివారం ‘మన్ కీ బాత్’లో ఆయన క్రీడాకారుల గురించి వారి నేపథ్యం, పడ్డ కష్టాలపై ప్రత్యేకంగా ప్రస్తావించారు. ‘ప్రతీ క్రీడాకారుడిది ప్రత్యేక గాథ. దేశానికి ప్రాతినిధ్యం కోసం... పతకం కోసం వారంతా శ్రమైక జీవనంలో ఏళ్ల పాటు గడిపారు. వారి పయనం కేవలం పతకం కోసమే కాదు... దేశం కోసం. జాతి గర్వపడే విజయాల కోసం, ఈ ప్రయత్నంలో ప్రజల మనసులు గెలిచేందుకు టోక్యో వెళుతున్నారు. వాళ్లంతా విజయవంతమయ్యేందుకు మనమంతా వెన్నుదన్నుగా నిలవాల్సిన తరుణమిది. ప్రతి ఒక్క భారతీయుడు వారికి మనస్ఫూర్తిగా మద్దతు తెలపాలని నేను కోరుతున్నాను’ అని మోదీ అన్నారు. ఆర్చర్లు దీపిక కుమారి, ప్రవీణ్ జాదవ్, హాకీ క్రీడాకారిణి నేహా గోయెల్, బాక్సర్ మనీశ్ కౌశిక్, రేస్ వాకర్ ప్రియాంక గోస్వామి, జావెలిన్ త్రోయర్ శివపాల్ సింగ్, తెలుగు షట్లర్ సాత్విక్ సాయిరాజ్ అతని భాగస్వామి చిరాగ్ షెట్టి టోక్యో ఒలింపిక్స్ అర్హత కోసం కఠోరంగా శ్రమించారని ప్రధాని కితాబిచ్చారు. టోక్యో ఒలింపిక్స్ జూలై 23 నుంచి ఆగస్టు 8 వరకు జరుగుతాయి. -
పతకాల సంఖ్య రెండంకెలు దాటుతుంది
న్యూఢిల్లీ: ఈ ఏడాది జరిగే టోక్యో ఒలింపిక్స్‌లో భారత క్రీడాకారులు గతంలో ఎన్నడూలేని విధంగా అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తారని కేంద్ర క్రీడల మంత్రి కిరణ్ రిజిజు ఆకాంక్షించారు. టోక్యో ఒలింపిక్స్ కౌంట్‌డౌన్ బుధవారంతో 100 రోజులకు చేరింది. ఈ సందర్భంగా జరిగిన వర్చువల్ వెబీనార్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘ఈసారి జరిగే ఒలింపిక్స్ భారత చరిత్రలో ఒక తీపి గుర్తు కావాలనుకుంటున్నాం. అందుకోసం మంత్రి త్వ శాఖ తరఫున చేయాల్సిందంతా చేశాం. ఒలింపిక్స్ కోసం సిద్ధమవుతున్న క్రీడాకారులకు సకల సదుపాయాలను కల్పించాం. ఇప్పడంతా మీ (అథ్లెట్లు) చేతుల్లోనే ఉంది. రెండంకెల్లో పతకాలను సాధిస్తారని ఆశిస్తున్నాను’ అని కిరణ్ రిజిజు వ్యాఖ్యానించారు. ఓవరాల్‌గా ఒలింపిక్స్ చరిత్రలో భారత అత్యుత్తమ ప్రదర్శన 2012 లండన్ ఒలింపిక్స్‌లో వచ్చింది. లండన్ ఒలింపిక్స్‌లో భారత్‌కు అత్యధికంగా ఆరు పతకాలు (రెండు రజతాలు, నాలుగు కాంస్యాలు) లభించాయి. -
డోప్ టెస్టులో పట్టుబడ్డ ఇద్దరు భారత అథ్లెట్లు
న్యూఢిల్లీ: భారత్ తరఫున ఈ ఏడాది జరిగే టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనాల్సిన ఇద్దరు భారత అథ్లెట్లు డోపీలుగా తేలారు. గత నెలలో పాటియాలా వేదికగా జరిగిన ఇండియన్ గ్రాండ్‌ప్రి మీట్లో నిర్వహించిన డోపింగ్ పరీక్షలో వీరిద్దరు విఫలమైనట్లు జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) డైరెక్టర్ జనరల్ నవీన్ అగర్వాల్ శనివారం తెలిపారు. అయితే వారి పేర్లను మాత్రం ఆయన వెల్లడించలేదు. ఈ ఇద్దరు అథ్లెట్ల నుంచి సేకరించిన శాంపిల్స్‌లో శక్తినిచ్చే మిథైల్హెక్సాన్–2–అమైన్ అనే నిషేధిత ఉత్ప్రేరకం ఉన్నట్లు తేలిందని ఆయన పేర్కొన్నారు. వీరిని త్వరలోనే ‘నాడా’ క్రమశిక్షణా ప్యానెల్ (ఏడీడీపీ) ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అక్కడ దోషులుగా తేలితే వారిపై రెండు నుంచి నాలుగేళ్ల పాటు నిషేధం విధించే అవకాశం ఉంది. -
చిత్ర పసిడి పరుగు
దోహా (ఖతర్): ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో చివరి రోజు కూడా భారత అథ్లెట్స్ పతకాల పంట పండించారు. బుధవారం ముగిసిన ఈ మెగా ఈవెంట్లో ఆఖరి రోజు భారత అథ్లెట్స్ ఒక స్వర్ణం, రెండు రజతాలు, ఒక కాంస్యం సొంతం చేసుకున్నారు. ఓవరాల్‌గా భారత్‌కు ఈ పోటీల్లో మూడు స్వర్ణాలు, ఏడు రజతాలు, ఏడు కాంస్యాలతో కలిపి మొత్తం 17 పతకాలు లభించాయి. పతకాల పట్టికలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. మహిళల 1500 మీటర్ల విభాగంలో చిత్ర ఉన్నికృష్ణన్ స్వర్ణం సాధించింది. ఈ పోటీల్లో భారత్‌కు లభించిన మూడో పసిడి పతకమిది. 1500 మీటర్ల రేసును చిత్ర 4 నిమిషాల 14.56 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ఫినిషింగ్ లైన్‌కు కొన్ని మీటర్ల దూరంలో చిత్ర బహ్రెయిన్ అథ్లెట్ గషా టైగెస్ట్‌ను దాటి ముందుకెళ్లింది. మహిళల 200 మీటర్ల విభాగంలో ఒడిశా అథ్లెట్ ద్యుతీ చంద్ కాంస్య పతకాన్ని సాధించింది. తెలంగాణ కోచ్ నాగపురి రమేశ్ పర్యవేక్షణలో శిక్షణ తీసుకుంటున్న ద్యుతీ చంద్ 23.24 సెకన్లలో రేసును ముగించి మూడో స్థానంలో నిలిచింది. ఎడిడియోంగ్ ఒడియోంగ్ (బహ్రెయిన్) కూడా 23.24 సెకన్లలోనే గమ్యానికి చేరినా ఫొటోఫినిష్లో ద్యుతీ చంద్‌కు కాంస్యం ఖాయమైంది. మహిళల 4్ఠ400 మీటర్ల రిలేలో ప్రాచి, పూవమ్మ రాజు, సరితాబెన్ గైక్వాడ్, విస్మయలతో కూడిన భారత బృందం 3ని:32.21 సెకన్లలో రేసును ముగించి రజత పతకం గెల్చుకుంది. పురుషుల 1500 మీటర్ల రేసులో అజయ్ కుమార్ సరోజ్ 3ని:43.18 సెకన్లలో గమ్యానికి చేరి రజతం సాధించాడు. పురుషుల 4్ఠ400 మీటర్ల రిలేలో కున్హు మొహమ్మద్, జీవన్, అనస్, అరోకియా రాజీవ్‌లతో కూడిన భారత బృందం 3ని:03.28 సెకన్లలో రేసును పూర్తి చేసి రజతం కైవసం చేసుకుంది. అయితే రేసు సందర్భంగా మూడో ల్యాప్‌లో చైనా అథ్లెట్‌ను భారత అథ్లెట్ అనస్ నిబంధనలకు విరుద్ధంగా ఢీకొట్టడంతో నిర్వాహకులు భారత జట్టుపై అనర్హత వేటు వేసి పతకాన్ని వెనక్కి తీసుకున్నారు. మహిళల డిస్కస్ త్రోలో నవజీత్ కౌర్ (57.47 మీటర్లు) నాలుగో స్థానంలో... కమల్‌ప్రీత్ కౌర్ (55.59 మీటర్లు) ఐదో స్థానంలో నిలిచారు. పురుషుల 5000 మీటర్ల రేసులో మురళి ఐదో స్థానంలో, అభిషేక్ ఆరో స్థానంలో నిలిచారు. -
ముంబై మారథాన్‌లో మెరిసిన సుధా సింగ్
ముంబై: భారత అథ్లెట్లు సుధా సింగ్, నితేంద్ర సింగ్ రావత్ ముంబై మారథాన్‌లో మెరిశారు. మహిళల, పురుషుల విభాగాల్లో భారత్ తరఫున మెరుగైన స్థానంలో నిలిచారు. సుధ 2 గంటల 34 నిమిషాల 56 సెకన్లలో పరుగును పూర్తిచేసి దోహాలో జరిగే ప్రపంచ చాంపియన్‌షిప్ కోసం నిర్దేశించిన 2:37:00 క్వాలిఫయింగ్ మార్క్‌ను అధిగమించింది. రావత్ 2:15:52 సెకన్ల టైమింగ్‌తో మెరిశాడు. పురుషుల కేటగిరీలో 2:16:00 క్వాలిఫయింగ్ మార్క్‌ను నితేంద్రసింగ్ అధిగమించాడు. ఈ మారథాన్‌లో కాస్మస్ లగత్ (కెన్యా; 2:09:15) పురుషుల విభాగంలో విజేతగా నిలువగా... మహిళల కేటగిరీలో వర్క్నెష్ అలెము (ఇథియోపియా; 2:25:45) గెలిచింది. -
ద్యుతీ... రజత ఖ్యాతి
అంచనాలు నిలబెట్టుకుంటూ పతకంతో మెరిసిన టీనేజర్ ఒకరు... ఆటకే పనికిరావంటూ ఒకనాడు ఎదురైన చేదు జ్ఞాపకాలను ట్రాక్ కింద సమాధి చేస్తూ విజయంతో మరొకరు... సొంతూళ్లో ప్రకృతి వైపరీత్యానికి అల్లాడుతున్న సన్నిహితులకు గెలుపుతో ఊరటనందించే ప్రయత్నం చేసిన వారొకరు... ఆసియా క్రీడల్లో ముగ్గురు భిన్న నేపథ్యాల అథ్లెట్లు అందించిన రజత పతకాలతో ఆదివారం భారత్ మురిస్తే... ‘గీత’ దాటినందుకు మరో అథ్లెట్ చేతికి వచ్చిన కాంస్యం దూరమై విజయం కాస్తా విషాదంగా మారిపోవడం మరో కీలక పరిణామం. ఈక్వెస్ట్రియన్‌లో వచ్చిన రెండు వెండి పతకాలు, ‘బ్రిడ్జ్’ అందించిన రెండు కాంస్యాలు కలిపి ఈవెంట్ ఎనిమిదో రోజు మొత్తం ఏడు పతకాలు మన ఖాతాలో చేరాయి. జకార్తా: అథ్లెటిక్స్‌లో ప్రతిష్టాత్మక ఈవెంట్ 100 మీటర్ల పరుగు (మహిళల)లో భారత క్రీడాకారిణి ద్యుతీ చంద్ రజత పతకంతో సత్తా చాటింది. 11.32 సెకన్లలో ఆమె లక్ష్యాన్ని చేరి రెండో స్థానంలో నిలిచింది. ఒడియాంగ్ ఎడిడియాంగ్ (బహ్రెయిన్) 11.30 సెకన్లలో పరుగు పూర్తి చేసి స్వర్ణం గెలుచుకోగా... వీ యోంగ్లీ (చైనా–11.33 సెకన్లు) కాంస్యం సాధించింది. ఎనిమిది మంది హోరాహోరీగా తలపడ్డ ఈ రేస్‌లో ఫలితాన్ని ‘ఫొటో ఫినిష్’ ద్వారా తేల్చారు. తాను పాల్గొంటున్న తొలి ఆసియా క్రీడల్లోనే ద్యుతీ రజతం సాధించడం విశేషం. మహిళల 100 మీటర్ల ఈవెంట్లో భారత అథ్లెట్ ఒకరు ఆఖరిసారిగా 1998 ఆసియా క్రీడల్లో పతకం సాధించారు. నాడు రచిత మిస్త్రీకి కాంస్యం దక్కింది. 1951లో రోషన్ మిస్త్రీ... 1982, 1986 ఆసియా క్రీడల్లో పీటీ ఉష రజత పతకాలు సాధించాక ... మళ్లీ ఇప్పుడు భారత అథ్లెట్‌కు 100 మీటర్ల విభాగంలో రజతం దక్కింది. హిమ దాస్ మళ్లీ రికార్డు... వరుసగా రెండో రోజు జాతీయ రికార్డును బద్దలు కొడుతూ 18 ఏళ్ల హిమ దాస్ 400 మీటర్ల పరుగులో రజతం గెలుచుకుంది. హిమ 50.79 సెకన్లలో పరుగు పూర్తి చేసి రెండో స్థానంలో నిలిచింది. సల్వా నాసర్ (బహ్రెయిన్–50.09 సెకన్లు) స్వర్ణం గెలుచుకోగా, మిఖినా ఎలీనా (కజకిస్తాన్–52.63 సె.)కి కాంస్యం దక్కింది. శనివారమే ఆమె క్వాలిఫయింగ్ రౌండ్లో 51.00 సెకన్ల టైమింగ్ నమోదు చేసి కొత్త జాతీయ రికార్డు నెలకొల్పగా, ఇప్పుడు తానే దానిని బద్దలు కొట్టింది. ఇదే ఈవెంట్లో మరో భారత అథ్లెట్ నిర్మలా (52.96 సెకన్లు) నాలుగో స్థానంలో నిలిచి నిరాశగా వెనుదిరిగింది. 2006 దోహా క్రీడల్లో మన్జీత్ కౌర్ రజతం గెలిచిన తర్వాత 400 మీటర్ల పరుగులో భారత్‌కు ఇదే తొలి పతకం కావడం విశేషం. పురుషుల 400 మీటర్ల పరుగులో భారత అథ్లెట్ మొహమ్మద్ అనస్ యహియా రజతం సాధించాడు. 45.69 సెకన్ల టైమింగ్ నెలకొల్పి అనస్ రెండో స్థానంలో నిలిచాడు. ఈ పోరులో హసన్ (ఖతర్–44.89 సెకన్లు) అగ్రస్థానంలో నిలిచి స్వర్ణం గెలుచుకోగా, అలీ (బహ్రెయిన్–45.70 సె.)కు కాంస్యం లభించింది. ‘నేను మరింత వేగంగా పరుగెత్తాల్సింది. అయితే ప్రస్తుతానికి రజతంతో సంతృప్తిగా ఉన్నా. కచ్చితంగా పతకం సాధించాలనే లక్ష్యంతో ఇక్కడ బరిలోకి దిగాను. అనుకున్నది దక్కింది. నా కేరళలో అష్టకష్టాలు పడుతున్న ప్రజలకు నా విజయం అంకితం’ అని అనస్ వ్యాఖ్యానించాడు. కొత్తగా రెక్కలు తొడిగి... సాక్షి క్రీడా విభాగం సరిగ్గా నాలుగేళ్ల క్రితం ద్యుతీ చంద్ గ్లాస్గో కామన్వెల్త్ క్రీడలకు సన్నద్ధమవుతోంది. అప్పటికే ఈ ఈవెంట్‌కు అర్హత సాధించిన ఆమె ఎలాగైనా పతకం గెలవాలని పట్టుదలగా శ్రమిస్తోంది. అయితే అనూహ్యంగా అథ్లెటిక్స్ సమాఖ్య చేసిన ప్రకటనతో ఆమె ట్రాక్‌పై కుప్పకూలిపోయింది. ద్యుతీచంద్‌లో అధిక మోతాదులో పురుష హార్మోన్లు (టెస్టోస్టిరాన్) ఉన్నాయి కాబట్టి ఆమెకు మహిళల విభాగంలో పాల్గొనే అర్హత లేదంటూ కామన్వెల్త్ క్రీడల నుంచి తప్పించారు. ఎలాంటి డ్రగ్స్ ఆరోపణలు లేకున్నా... ఈ తరహాలో వేటు పడటం 18 ఏళ్ల అమ్మాయిని ఒక్కసారిగా షాక్‌కు గురి చేసింది. అన్ని వైపుల నుంచి విమర్శలతో పాటు ఒక రకమైన వ్యంగ్య వ్యాఖ్యలతో ఆమె మనసు వికలమైంది. ట్రాక్‌పై ప్రాక్టీస్‌కంటే కూడా ముందు తాను ఆడపిల్లనేనని రుజువు చేసుకోవాల్సిన అగత్యం ద్యుతీకి ఎదురైంది. అయితే ఆమె వెనక్కి తగ్గకుండా పోరాడాలని నిర్ణయించుకుంది. తాను ఎంచుకున్న ఆటలో లక్ష్యం చేరాలంటే అన్ని అడ్డంకులు అధిగమించేందుకు సిద్ధమైంది. చివరకు కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ ద్యుతీకి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ‘హైపర్‌ఆండ్రోజెనిజమ్’ను రుజువు చేయడంలో అంతర్జాతీయ అథ్లెటిక్స్ సమాఖ్య (ఐఏఏఎఫ్) విఫలమైందని, సరైన ఆధారాలు కూడా లేవంటూ ద్యుతీ మళ్లీ బరిలోకి దిగేందుకు అనుమతి ఇచ్చింది. దాంతో ద్యుతీ మళ్లీ కొత్తగా ట్రాక్‌పైకి అడుగు పెట్టి తన పరుగుకు పదును పెట్టింది. హైదరాబాద్‌లోనే... పేరుకు ఒడిషాకు చెందిన అమ్మాయే అయినా ద్యుతీ ప్రాక్టీస్ మొత్తం హైదరాబాద్‌లోనే సాగింది. గచ్చిబౌలి అథ్లెటిక్స్ స్టేడియంలో ట్రాక్‌లో ఆమె సాధన చేసింది. ద్యుతీని తీర్చి దిద్దడంలో తెలంగాణకు చెందిన భారత కోచ్ నాగపురి రమేశ్‌దే ప్రధాన పాత్ర. ఎన్ని సమస్యలు వచ్చినా, కొన్ని సార్లు ప్రతికూల ఫలితాలు వచ్చినా పట్టువదలకుండా ఆయన ద్యుతీకి లక్ష్యాలు విధించి ప్రాక్టీస్ చేయించారు. ఒక మెగా ఈవెంట్లో ఆమె వల్ల పతకం సాధించడం సాధ్యమవుతుందా అనే సందేహాలు అనేక సార్లు వచ్చినా... రమేశ్ మాత్రం ఆశలు కోల్పోలేదు. చివరకు ఇప్పుడు ఆసియా క్రీడల్లో రజతంతో వీరిద్దరి శ్రమకు గుర్తింపు లభించింది. జిమ్, ఫిట్నెస్ ట్రైనింగ్, డైట్‌కు సంబంధించిన అన్ని అదనపు సౌకర్యాలు తన అకాడమీలోనే కల్పించి ద్యుతీని ప్రోత్సహిస్తూ భారత బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ కూడా అండగా నిలవడం విశేషం. ‘ద్యుతీచంద్ రజతం నెగ్గడంతో చాలా సంతోషంగా ఉన్నాను. ఎన్నో ప్రతికూలతలను అధిగమించి ఆమె ఈ స్థాయికి చేరుకుంది’ అని గోపీచంద్ వ్యాఖ్యానించారు. లక్ష్మణన్ విషాదం... మరో భారత అథ్లెట్ గోవిందన్ లక్ష్మణన్‌ను దురదృష్టం వెంటాడింది. 10 వేల మీటర్ల పరుగును 29 నిమిషాల 44.91 సెకన్లలో పూర్తి చేసిన లక్ష్మణన్‌కు ముందుగా కాంస్య పతకం ఖరారైంది. అయితే అంతలోనే అతడిని డిస్‌క్వాలిఫైగా తేల్చడంతో ఆనందం ఆవిరైంది. పరుగులో ప్రత్యర్థిని దాటే ప్రయత్నంలో అతను ట్రాక్ వదిలి ఎడమ వైపు బయటకు వెళ్లినట్లు తేలింది. జ్యూరీ నిర్ణయాన్ని భారత జట్టు సవాల్ చేసింది. అతను గీత దాటినా సహచర ఆటగాడిని ఇబ్బంది పెట్టలేదని, దాని వల్ల అదనపు ప్రయోజనం ఏమీ పొందలేదని కూడా వాదించింది. అయితే ఈ అప్పీల్‌ను జ్యూరీ తిరస్కరించడంతో లక్ష్మణన్‌కు నిరాశ తప్పలేదు. మరోవైపు పురుషుల లాంగ్‌జంప్ ఫైనల్లో శ్రీశంకర్ 7.95 మీటర్ల దూరం గెంతి ఆరో స్థానంలో నిలిచాడు. పురుషుల 400 మీటర్ల హర్డిల్స్‌లో ధరున్ అయ్యసామి, సంతోష్ కుమార్... మహిళల 400 మీటర్ల హర్డిల్స్‌లో జౌనా ముర్ము, అను రాఘవన్ ఫైనల్స్‌కు అర్హత సాధించారు. అథ్లెటిక్స్‌కు సంబంధించి ఆసియా క్రీడలు ఎంతో కఠినమైనవి. ఇక్కడ ఎన్నో ఏళ్ల తర్వాత పతకం దక్కడం సంతోషంగా ఉంది. ఆమె ఆరంభంపై ఎంతో శ్రమించాం. దక్షిణాఫ్రికా నుంచి ప్రత్యేకంగా స్పీడ్ రబ్బర్లను తెప్పించి సాధన చేయించాం. గోపీచంద్‌తో పాటు ఎన్నో రకాలుగా సహకరించిన అందరికీ కృతజ్ఞతలు. –నాగపురి రమేశ్, ద్యుతీ కోచ్ 2014లో నా గురించి జనం నానా రకాల మాటలు అన్నారు. ఇప్పుడు దేశం తరఫున పతకం సాధించడం గొప్ప ఘనతగా భావిస్తున్నా. రేసులో మొదటి 40 మీటర్లు చాలా వేగంగా పరుగెత్తాలని కోచ్ ముందే చెప్పారు. నేను కళ్లు మూసుకొనే పరుగెత్తాను. కళ్లు తెరిచే సరికి రేసు పూర్తయింది. గెలిచానో కూడా తెలీదు. డిస్ప్లే బోర్డుపై పేరు కనిపించిన తర్వాతే జాతీయ పతాకాన్ని చేతిలోకి తీసుకున్నాను. నా కెరీర్లో ఇదే పెద్ద పతకం. –ద్యుతీచంద్ ద్యుతీచంద్ హిమ దాస్, అనస్ -
కాంటినెంటల్ కప్‌కు నీరజ్, హిమ దాస్
న్యూఢిల్లీ: కాంటినెంటల్ కప్‌లో పాల్గొనే ఆసియా పసిఫిక్ జట్టుకు ఏడుగురు భారత అథ్లెట్లు ఎంపికయ్యారు. ఇందులో స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా, స్ప్రింట్ సంచలనం హిమ దాస్ సహా మొహమ్మద్ అనస్ (400 మీ.), జిన్సన్ జాన్సన్ (800 మీ.), అర్పిందర్ సింగ్ (ట్రిపుల్ జంప్), పి.యు.చిత్ర (1500 మీ.), సుధా సింగ్ (3000 మీ. స్టీపుల్‌చేజ్) ఉన్నారు. అంతర్జాతీయ ఈవెంట్లలో కనబరిచిన మెరుగైన ప్రదర్శన, ఐఏఏఎఫ్, ఆసియా పసిఫిక్ ర్యాంకింగ్స్‌లో మెరిట్ ఆధారంగానే ఈ ఏడుగుర్ని ఎంపిక చేసినట్లు భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్ఐ)కు ఆసియా అథ్లెటిక్స్ సంఘం (ఏఏఏ) కార్యదర్శి మారిస్ నికోలస్ తెలియజేశారు. ఐఏఏఎఫ్ కాంటినెంటల్ కప్ చెక్ రిపబ్లిక్‌లోని ఒస్ట్రావాలో సెప్టెంబర్ 8, 9 తేదీల్లో జరగనుంది. ఈ కప్ 2010లో ప్రారంభమైంది. ప్రతి నాలుగేళ్లకోసారి ఈవెంట్ జరుగుతుంది. ఇందులో ఆఫ్రికా, అమెరికా, ఆసియా పసిఫిక్, యూరోప్ జట్లు తలపడతాయి. -
కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు పసిడి పంట
-
క్రీడాగ్రామంలో మన జెండా ఎగిరె...
గోల్డ్‌కోస్ట్ (ఆస్ట్రేలియా): కామన్వెల్త్ గేమ్స్‌లో పాల్గొనేందుకు వచ్చిన భారత అథ్లెట్లు సోమవారం క్రీడాగ్రామంలో జెండా వందనం కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. అథ్లెట్లందరూ త్రివర్ణ పతకానికి గౌరవ వందనం చేశారు. ఐదుసార్లు ప్రపంచ చాంపియన్ అయిన భారత స్టార్ మహిళా బాక్సర్ మేరీకోమ్, జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా సహా అందరూ ఆహ్లాదంగా గడిపారు. జాతి గర్వించే నినాదాలు చేశారు. క్రీడా గ్రామంలో భారత బృందం బస చేసిన భవనం సమీపంలో సిరంజీలు బయట పడిన ఘటనపై స్పందించేందుకు భారత చెఫ్ డి మిషన్ విక్రమ్ సిసోడియా నిరాకరించారు. భారత బాక్సర్లపైనే డేగ కన్ను! ప్రతిష్టాత్మక గేమ్స్‌కు ముందు కలకలం రేపిన సిరంజీల ఘటనతో నిర్వాహకులు, దర్యాప్తు కమిటీ భారత బాక్సర్లపై కన్నేసినట్లుంది. అయితే ఉప్పందించిన పాపానికి తమపై అనుమానం వ్యక్తం చేయడం పట్ల భారత వర్గాలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నాయి. ‘సీజీఎఫ్ నియమించిన మెడికల్ కమిషన్ ముందు హాజరు కావాలని కామన్వెల్త్ గేమ్స్ అసోసియేషన్ భారత బాక్సర్లకు సమన్లు జారీ చేసింది’ అని సీజీఎఫ్ సీఈఓ గ్రీవెన్బర్గ్ తెలిపారు. అయితే ఈ సిరంజీలను మరీ అంత తీవ్రంగా పరిగణించాల్సిన పని లేదని... మల్టీ విటమిన్స్ ఇంజెక్షన్లకు కూడా వినియోగించవచ్చని భారత వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి భారత బాక్సర్లకు డోప్ పరీక్షలు నిర్వహించారు. 2 లక్షల 25 వేల కండోమ్స్ అథ్లెట్లు... ఆడండి, గెలవండి. చల్లని ఐస్‌క్రీమ్‌లు తినండి... వెచ్చని కోర్కెలు తీర్చుకోండనే విధంగా కామన్వెల్త్ గేమ్స్ సమాఖ్య ఏర్పాట్లు చేసింది. నిష్ణాతులైన 300 మంది చెఫ్‌ల ఆధ్వర్యంలోని పాకశాస్త్ర బృందం 24 గంటలపాటు తినుబండారాలను ఎప్పటికప్పుడు తాజాగా తయారు చేయిస్తోంది. క్రీడాగ్రామంలో బస చేసిన 6,600 మంది అథ్లెట్ల కోసం రుచికరమైన ఫ్లేవర్లలో ఐస్ క్రీమ్‌లు చేయిస్తున్న నిర్వాహకులు 2 లక్షల 25 వేల కండోమ్లనూ అందుబాటులో ఉంచారు. సురక్షిత శృంగారం కోసం సగటు లెక్కలేసుకొని మరీ వీటిని ఉంచడం గమనార్హం. ఆరువేల పైచిలుకున్న అథ్లెట్లకు 11 రోజుల పాటు 34 కండోమ్‌ల చొప్పున... 2.25 లక్షల కండోమ్‌లను సిద్ధంగా ఉంచింది. ఇటీవల దక్షిణ కొరియాలో జరిగిన వింటర్ ఒలింపిక్స్‌లో రికార్డు స్థాయిలో 1.10 లక్షల కండోమ్స్‌ను ఉచితంగా పంచారు. అదే రియో ఒలింపిక్స్ సమయంలో ‘జికా’ వైరస్ కలకలం రేగడంతో ఏకంగా 4.50 లక్షల కండోమ్స్‌ను ఉచితంగా ఇచ్చారు. -
‘పసిడి’ పంట పండించారు
♦ చివరి రోజు ఐదు స్వర్ణాలు నెగ్గిన భారత అథ్లెట్స్ ♦ 29 పతకాలతో ఆసియా అథ్లెటిక్స్‌లో అగ్రస్థానం భువనేశ్వర్: ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ చరిత్రలోనే భారత్ తమ అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసింది. ఆదివారంతో ముగిసిన ఈ మెగా ఈవెంట్లో భారత్ 12 స్వర్ణాలు, 5 రజతాలు, 12 కాంస్యాలతో కలిపి మొత్తం 29 పతకాలతో తొలిసారి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. 20 పతకాలతో చైనా (8 స్వర్ణాలు, 7 రజతాలు, 5 కాంస్యాలు) రెండో స్థానంతో సంతృప్తి పడింది. 1985, 1989 ఆసియా చాంపియన్‌షిప్‌లో భారత్ అత్యధికంగా 22 పతకాలు గెలిచింది. ఆఖరి రోజు భారత్‌కు ఐదు స్వర్ణ పతకాలు లభించాయి. హెప్టాథ్లాన్‌లో స్వప్న బర్మన్ (5,942 పాయింట్లు)... 10 వేల మీటర్ల రేసులో లక్ష్మణన్ (29ని:55.87 సెకన్లు)... జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా (85.23 మీటర్లు) పసిడి పతకాలు గెలిచారు. పురుషుల, మహిళల 4గీ400 మీటర్లలో భారత రిలే జట్లు స్వర్ణాలు నెగ్గాయి. భారత్‌కే చెందిన పూర్ణిమ (హెప్టాథ్లాన్), జాన్సన్ (పురుషుల 800 మీటర్లు్ల), దవిందర్ సింగ్ (జావెలిన్ త్రో) కాంస్య పతకాలను కైవసం చేసుకోగా... గోపీ (10 వేల మీటర్లు్ల) రజతం నెగ్గాడు.అర్చనకు నిరాశ: మహిళల 800 మీటర్ల రేసులో భారత అథ్లెట్ అర్చన (2ని:05.00 సెకన్లు) విజేతగా నిలిచింది. అయితే తనను వెనక్కినెట్టి అర్చన ముందుకెళ్లిందని శ్రీలంక అథ్లెట్ నిమాలి ఫిర్యాదు చేసింది. విచారణ అనంతరం నిమాలి ఆరోపణల్లో నిజం ఉందని నిర్వాహకులు తేల్చి అర్చనపై వేటు వేసి పతకాన్ని వెనక్కి తీసుకున్నారు. -
భారత్ పసిడి కాంతులు
రెండో రోజు నాలుగు స్వర్ణాలు ⇒ ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిఫ్ భువనేశ్వర్: సొంతగడ్డపై భారత అథ్లెట్స్ రెండో రోజూ మెరిశారు. అందుబాటులో ఉన్న నాలుగు స్వర్ణ పతకాలను సొంతం చేసుకున్నారు. పురుషుల, మహిళల 400 మీటర్ల విభాగాల్లో వరుసగా మొహమ్మద్ అనస్ (45.77 సెకన్లు), నిర్మలా షెరోన్ (52.01 సెకన్లు)... పురుషుల, మహిళల 1500 మీటర్ల విభాగాల్లో వరుసగా అజయ్ కుమార్ సరోజ్ (3ని:45.85 సెకన్లు), పీయూ చిత్రా (4ని:17.92 సెకన్లు) విజేతలుగా నిలిచి పసిడి పతకాలను గెల్చుకున్నారు. మహిళల 100 మీటర్ల విభాగంలో ద్యుతీ చంద్ (11.52 సెకన్లు) కాంస్య పతకాన్ని సాధించింది. పురుషుల షాట్‌పుట్‌లో తజీందర్ పాల్ సింగ్ (19.77 మీటర్లు) రజతం... పురుషుల 400 మీటర్లలో అరోకియా రాజీవ్ (46.14 సెకన్లు) రజతం... మహిళల 400 మీటర్లలో జిస్నా మాథ్యూ (53.32 సెకన్లు) కాంస్యం కైవసం చేసుకున్నారు. అంతకుముందు 4్ఠ100 మీటర్ల రిలే ప్రిలిమినరీ రేసులో భారత బృందం నిర్ణీత వ్యవధిలో ఫైనల్ బ్యాటన్‌ను అందించకపోవడంతో అనర్హత వేటుకు గురైంది. మరోవైపు డెకాథ్లాన్ ఈవెంట్లో పోటీపడాల్సిన భారత అథ్లెట్ జగ్తార్ సింగ్ డోపింగ్‌లో పట్టుబడటంతో అతను బరిలోకి దిగలేదు. -
భారత్‌కు 2 స్వర్ణాలు
తైపీ సిటీ: ఆసియా గ్రాండ్‌ప్రి అథ్లెటిక్స్ మూడో అంచె మీట్లోనూ భారత అథ్లెట్స్ రాణించారు. ఆదివారం జరిగిన ఈ మీట్లో భారత అథ్లెట్స్ రెండు స్వర్ణాలు, నాలుగు రజతాలు, రెండు కాంస్యాలతో కలిపి మొత్తం ఎనిమిది పతకాలను సొంతం చేసుకున్నారు. పురుషుల 400 మీటర్ల విభాగంలో కేరళకు చెందిన మొహమ్మద్ అనస్ యాహియా... పురుషుల షాట్‌పుట్‌లో హరియాణా క్రీడాకారుడు ఓంప్రకాశ్ సింగ్ కర్హానా పసిడి పతకాలను గెల్చుకున్నారు. అనస్ 400 మీటర్ల రేసును 45.69 సెకన్లలో పూర్తి చేశాడు. ఓంప్రకాశ్ ఇనుప గుండును 19.58 మీటర్ల దూరం విసిరి ఈ సీజన్లో తన అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేశాడు. మహిళల 100 మీటర్ల విభాగంలో ద్యుతీ చంద్ (11.52 సెకన్లు–సీజన్ బెస్ట్)... 800 మీటర్ల విభాగంలో టింటూ లుకా (2ని:03.97 సెకన్లు–సీజన్ బెస్ట్)... పురుషుల 800 మీటర్ల విభాగంలో జిన్సన్ జాన్సన్ (1ని:51.35 సెకన్లు)... మహిళల షాట్‌పుట్‌లో మన్‌ప్రీత్ కౌర్ (17.38 మీటర్లు–సీజన్ బెస్ట్) రజత పతకాలు సాధించారు. పురుషుల జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా (79.90 మీటర్లు), మహిళల 400 మీటర్ల విభాగంలో పూవమ్మ (53.11 సెకన్లు) కాంస్య పతకాలను దక్కించుకున్నారు. ఇంతకుముందు ఆసియా గ్రాండ్‌ప్రి తొలి అంచెలో భారత అథ్లెట్స్ ఏడు పతకాలు, రెండో అంచెలో ఆరు పతకాలు సాధించారు. -
ఆఖరి రోజు ఐదు పతకాలు
దుబాయ్: ఫజా అంతర్జాతీయ పారా అథ్లెటిక్స్ గ్రాండ్‌ప్రి మీట్ ఆఖరి రోజు భారత అథ్లెట్లు ఐదు పతకాలతో మెరిశారు. రెండు స్వర్ణ, రెండు రజత, ఒక కాంస్య పతకం సాధించి సత్తా చాటారు. జావెలిన్‌త్రో, డిస్కస్‌త్రోలో రెండు స్వర్ణాలు సాధించిన గుర్జార్ సుందర్ సింగ్ మూడో స్వర్ణాన్ని అందుకున్నాడు. టి–44/46 విభాగంలో షాట్‌పుట్‌ను 13.36 మీటర్ల దూరం విసిరి గుర్జార్ స్వర్ణం సాధించాడు. హైజంప్ ఎఫ్–13/20/42/44 విభాగంలో శరత్ కుమార్ 1.66 మీటర్లు, గిరీశ నాగరాజ్ గౌడ 1.63 మీటర్లు ఎత్తుకు ఎగిరి రజత, కాంస్య పతకాలు సాధించారు. మహిళల విభాగంలో కూడా భారత్‌కు రెండు పతకాలు వచ్చాయి. వీల్‌ఛైర్ ఎఫ్–55 షాట్‌పుట్ విభాగంలో కరంజ్యోతి (5.76 మీటర్లు) స్వర్ణం సాధించగా... శతాబ్ది అవస్థి (5.71 మీటర్లు) రజతాన్ని కైవసం చేసుకుంది. -
స్వర్ణం గెలిస్తే రూ.75 లక్షలు
⇒ పారాలింపిక్స్ విజేతలకు కేంద్రం నజరానా న్యూఢిల్లీ: పారాలింపిక్స్‌లో భారత అథ్లెట్లను మరింత ప్రోత్సహించడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం వారికి నజరానాలు ప్రకటించింది. బ్రెజిల్ లోని రియో డి జనీరోలో ఈనెల 7 నుంచి 18 వరకు జరిగే ఈ పోటీల్లో స్వర్ణం సాధించే అథ్లెట్‌కు రూ.75 లక్షలు ఇవ్వనున్నట్టు క్రీడా మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అలాగే రజతానికి రూ.50 లక్షలు, కాంస్య పతకానికి రూ.30 లక్షలు ఇవ్వనున్నట్టు తమ అధికార ట్వీట్టర్ పేజీలో పేర్కొంది. భారత్ నుంచి ఈసారి ఎన్నడూ లేని విధంగా 17 మందితో కూడిన బృందం ఈ గేమ్స్‌కు వెళ్లింది. 2004 ఏథెన్స్లో స్వర్ణం గెలిచిన దేవేంద్ర జాజరియా ఈసారి కూడా జావెలిన్ త్రో ఎఫ్ 46 విభాగంలో బరిలోకి దిగబోతున్నాడు. -
పారాలింపిక్స్‌కు భారత్ నుంచి 17 మంది
శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని న్యూఢిల్లీ: ఈనెల 7 నుంచి 18 వరకు రియోలో జరిగే పారాలింపిక్స్ గేమ్స్ కోసం ఈసారి భారత్ నుంచి 17 మంది అథ్లెట్లు బరిలోకి దిగుతున్నారు. ఈ గేమ్స్ చరిత్రలో ఇంతమంది భారతీయులు పాల్గొనడం ఇదే తొలిసారి. ఇందులో 15 మంది పురుషులు, ఇద్దరు మహిళా అథ్లెట్లు ఉన్నారు. ఐదు ఈవెంట్లలో వీరు బరిలోకి దిగుతారు. రియోకు వెళుతున్న భారత అథ్లెట్లకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ‘పారాలింపిక్స్ గేమ్స్ కోసం వెళుతున్న ఆటగాళ్లపై దేశమంతా ఆసక్తి చూపడంతో పాటు వారికి అభినందనలు తెలుపుతోంది. కచ్చితంగా వారు మెరుగైన ప్రదర్శనతో దేశం గర్వించేలా చేస్తారని భావిస్తున్నాను’ అని ప్రధాని ట్వీట్ చేశారు. పాకిస్తాన్ 247/8 -
భారత ఒలింపిక్ ప్లేయర్స్‌కు సల్మాన్ నజరానా
రియో ఒలింపిక్స్‌కు గుడ్ విల్ అంబాసిడర్‌గా ఎంపికై ఎన్నో విమర్శలు ఎదుర్కొన్న సల్మాన్ ఖాన్ ఇప్పుడు నష్టానివారణా చర్యలకు దిగాడు. పతకాలతో సంబందం లేకుండా ఈ క్రీడల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ తన వంతుగా ఆర్థిక సాయం చేయడానికి ముందుకు వచ్చాడు. ఒలింపిక్స్‌లో తొలి పతకంతో సాక్షి బోణి చేసిన కొద్ది సేపటికే సల్మాన్ ట్విట్టర్లో ఓ ప్రకటన చేశాడు. ఒలింపిక్స్‌లో పథకం వేటలో పాల్గొన్న ప్రతీఒక్కరికి సపోర్ట్ గా నిలవాలన్న ఆలోచనతో, తన వంతుగా లక్షా పదివేల రూపాయలను అందిస్తున్నట్టుగా ప్రకటించాడు. సల్మాన్ స్థాయికి లక్ష రూపాయలు అన్నది చిన్న మొత్తంలా కనిపించినా.. వంద మందికి పైగా క్రీడాకారులకు ఇంత మొత్తం అందించటం అంటే సామాన్యమైన విషయం కాదు. ఈ ఏడాది ఒలిపింక్స్‌లో 118 మంది క్రీడాకారులు పాల్గొంటుండగా.. అందరికీ కలిపి కోటి ఒక లక్షా 18 వేల రూపాయలు ఇస్తున్నాడు సల్మాన్. -
ప్లీజ్.. ఆటగాళ్లను అవమానించొద్దు : కోహ్లీ
ప్రపంచంలో క్రీడల పోటీలు అనగానే మొదటగా గుర్తొచ్చేది ఒలింపిక్స్. నాలుగేళ్లకోసారి నిర్వహించే ఈ గేమ్స్ లో తమను తాము నిరూపించుకోవడంతో పాటు దేశానికి ప్రాతినిధ్యం వహించి పతకాలు కొల్లగొట్టాలని ప్రతి క్రీడాకారుడు భావిస్తాడు. అందుకే దేశం కోసం ఏదైనా చేయాలని తపించే ఆటగాళ్లను మనం గౌరవించాలని టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ అభిప్రాయపడ్డాడు. ముందుగా మనం ఒలింపిక్స్ లాంటి అత్యున్నత క్రీడల పోటీల్లో పాల్గొనే ఆటగాళ్లు ఎంతో కష్టపడి సాధన చేస్తారని, వారి లక్ష్యం కచ్చితంగా పతకమే అయ్యుంటుందని పేర్కొన్నాడు. ఒలింపిక్స్ లాంటి గేమ్స్ లో ఆడుతున్నందుకు మన ఆటగాళ్లను చూసి గర్వపడాలని వారికి కోహ్లీ మద్ధతుగా నిలిచాడు. ఇటీవల కొందరు రియోలో పాల్గొన్న భారత ఆటగాళ్లను విమర్శస్తూ ట్వీట్లు, కామెంట్ చేయడంపై కోహ్లీ స్పందించాడు. విండీస్ పై సిరీస్ విజయాన్ని సాధించిన తర్వాత కోహ్లీ మాట్లాడుతూ.. కొందరు అథ్లెట్లు, ఇతర ఆటగాళ్లను చులకన చేసి మాట్లాడుతున్నారని, అయితే ఆ వ్యాఖ్యలు వారిని మరింత కుంగదీస్తాయని అభిప్రాయపడ్డాడు. దేశం తరఫున అత్యున్నత ప్రాతినిధ్యం వహించే వారిని గౌరవించుకోవాల్సిన అవసరం ఉందన్నాడు. మనం దేశం నుంచి వారికి అండగా నిలవాలని.. వారికి విజయాలు చేకూరాలని ఆకాంక్షించాలని సూచించాడు. -
బృందాలుగా రియోకు భారత అథ్లెట్లు
రియో డి జనీరో: రియో ఒలింపిక్స్‌కు మరో వారం రోజులే సమయం ఉండటంతో భారత అథ్లెట్లు బృందాలుగా ఇక్కడికి చేరుకుంటున్నారు. ఒకటి, రెండు క్రీడాంశాలకు చెందిన ఆటగాళ్లు బ్యాచ్‌లుగా తరలి వస్తున్నారు. గురువారం బ్రేక్‌ఫాస్ట్ సమయంలో భారత చెఫ్ డి మిషన్ రాకేశ్ గుప్తా... ఐఓసీ అధ్యక్షుడు థామస్ బ్యాచ్‌తో కొద్దిసేపు ముచ్చటించారు. భారత అథ్లెట్ల సన్నాహాకాలపై ఆరా తీసిన థామస్... ముందుగానే ఇక్కడి చేరుకుంటున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. అంతకుముందు జరిగిన చెఫ్ డి మిషన్ల సమావేశానికి హాజరైన గుప్తా... అథ్లెట్లకు సంబంధించిన నివేదికలను అందజేశారు. ఒలింపిక్ విలేజ్‌లో వసతి సౌకర్యాలు, ఆహార పదార్థాల గురించి మాట్లాడుతూ.. ‘శాఖాహార వంటకాలు చాలా ఉన్నాయి. తర్వాతి రోజుల్లో అథ్లెట్ల సంఖ్య పెరుగుతుంది కాబట్టి కొత్త వంటకాలు కూడా ఇందులో చేర్చొచ్చు. రూమ్‌లు ఫర్వాలేదు. రెండు రోజుల్లో చిన్నచిన్న పనులు కూడా పూర్తి అవుతాయి’ అని గుప్తా పేర్కొన్నారు. ఒలింపిక్ విలేజ్‌లో బ్రెజిల్ పక్కన భారత్‌కు చోటు కల్పించారు. కామన్ స్విమ్మింగ్ పూల్, ఒలింపిక్ ప్లాజా, జిమ్‌లు ఏర్పాటు చేశారు. షూటర్లు జీతూ రాయ్, ప్రకాశ్ నంజప్ప, గురుప్రీత్ సింగ్, కైనాన్ చినాయ్, మానవ్‌జీత్ సింధూ, అపూర్వి చండేలా, సందీప్ కుమార్, అయోనికా పౌల్; వాకర్స్ కుశ్బీర్ కౌర్, సపనా పూనియా, సందీప్ కుమార్, మనీష్ రావత్; షాట్ పుటర్ మన్‌ప్రీత్ కౌర్; బాక్సర్ శివ్ తాపా, మనోజ్ కుమార్ ఇక్కడి చేరిన వారిలో ఉన్నారు. ఈవెంట్లు ఆలస్యంగా ఉన్న అథ్లెట్లు ఆగస్టు తొలి వారంలో ఇక్కడికి రానున్నారు. 15 క్రీడాంశాల్లో భారత అథ్లెట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. -
ఇలాగేనా శిక్షణ...?
- నాసిరకం భోజనం - బొద్దింకలతో సావాసం - ఇదీ ఆసియా గేమ్స్‌కు సిద్ధమవుతున్న భారత అథ్లెట్ల పరిస్థితి న్యూఢిల్లీ: వారంతా ప్రతిష్టాత్మక ఆసియా గేమ్స్‌లో బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్న ఆటగాళ్లు. అంతర్జాతీయ స్థాయిలో పోటీ ఉంటుంది కాబట్టి ఆ రేంజ్‌లోనే ఫిట్నెస్ ఉండాలి. దీని కోసం ఆరోగ్యకరమైన వాతావరణంతో పాటు మంచి పౌష్టికాహారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. అయితే వాస్తవ పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది. వంట శాలలో విచ్చలవిడిగా తిరుగుతున్న బొద్దింకలు.. అపరిశుభ్ర వాతావరణంలో ఉన్న కూరగాయలు.. పనిచేయని స్థితిలో ఉన్న వాటర్ కూలర్లు.. సరిగా కడగని వంట పాత్రలు.. ఇదీ ఢిల్లీలోని ఇందిరాగాంధీ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లోని పరిస్థితి. ఈనెల 19 నుంచి ప్రారంభమయ్యే ఆసియా గేమ్స్ కోసం సన్నద్ధమవుతున్న అథ్లెట్లకు ఈ దృశ్యాలు తీవ్ర అసంతృప్తిని కలిగిస్తున్నాయి. ఇక్కడి వాస్తవ పరిస్థితిపై విచారణ జరపాల్సిందిగా కొందరు అథ్లెట్లు కేంద్ర క్రీడా శాఖకు లేఖలు కూడా రాశారు. ‘భోజన నాణ్యత గురించి క్యాటరర్‌ను అడిగితే అతడు మాపైనే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటానని బెదిరించాడు. శిబిరం నుంచి బయటకి పంపిస్తామని అన్నాడు. కోచ్‌లు, డైటీషియన్లు ఇక్కడి పరిస్థితికి దూరంగా ఉంటున్నారు. క్యాంప్‌లో ఉన్న మేమే బలి కావాల్సి వస్తోంది. సర్వ్ చేసే వ్యక్తి క్యాప్, గ్లోవ్స్ లేకుండానే పనిచేస్తున్నాడు. కొన్నిసార్లు మధ్యాహ్నం మిగిలిన చికెన్‌ను రాత్రి పెడుతున్నారు. ఏమన్నా అంటే ‘ఇది మీకు ఉచిత భోజనం.. నోర్మూసుకుని తినండి’ అని గద్దిస్తున్నారు. పది రోజుల నుంచి డైనింగ్ రూమ్‌లో వాటర్ కూలర్ పనిచేయడం లేదు’ అని తాము పడుతున్న బాధలను ఓ అథ్లెట్ వివరించింది. మరోవైపు ఇలాంటి ఘటనలను క్షమించేది లేదని భారత క్రీడాప్రాధికార సంస్థ (సాయ్) డెరైక్టర్ జనరల్ జిజి థామ్సన్ అన్నారు. ‘స్టేడియంలోని క్యాటరింగ్ ఇన్చార్జి సాయ్ వ్యక్తి కాదు. తక్కువ ఖర్చుతో క్యాటరర్‌ను ఎంపిక చేసుకోమంటున్నారు. కానీ మంచి వ్యక్తులు ఈ ధరకు రావడం లేదు’ అని ఆయన చెప్పారు. -
కామన్వెల్త్కు 224 మంది భారత అథ్లెట్లు
న్యూఢిల్లీ: గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్‌కు భారత్ భారీ బృందాన్ని పంపనుంది. 14 అంశాల్లో మొత్తం 224 మంది అథ్లెట్లు బరిలోకి దిగనున్నారు. ఇందులో ఏడుగురు పారా అథ్లెట్లు ఉన్నారు. కోచ్‌లు, సహాయక సిబ్బందితో కలిసి 90 మంది అధికారులు కూడా ఈ బృందం వెంట వెళతారు. ఈనెల 23 నుంచి ఆగస్టు 3 వరకు జరగనున్న ఈ టోర్నీలో 17 అంశాల్లో 261 మెడల్ ఈవెంట్స్ ఉన్నాయి. అయితే నెట్‌బాల్, రగ్బీ, ట్రయథ్లాన్‌లలో భారత్ పాల్గొనడం లేదు. పారా అథ్లెట్స్ 22 ఈవెంట్స్‌లో పోటీపడనున్నారు. 2010 ఢిల్లీ కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ 495 మంది అథ్లెట్లను బరిలోకి దించి రికార్డు స్థాయిలో 101 పతకాలు సాధించింది. గ్లాస్గో గేమ్స్‌లో ఆర్చరీ, టెన్నిస్‌లను పక్కనబెట్టడంతో భారత్ పతకాలు గెలిచే అవకాశాలపై కాస్త ప్రభావం చూపనుంది. అయితే వీలైనన్ని ఎక్కువ పతకాలు సాధించేందుకు కృషి చేస్తామని భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) సెక్రటరీ జనరల్ రాజీవ్ మెహతా అన్నారు. కేంద్ర బడ్జెట్లో ఈ క్రీడలకు అదనంగా మరో 100 కోట్లు కేటాయించడాన్ని ఆయన స్వాగతించారు. సమయం లేకపోవడం వల్ల ఆసియా గేమ్స్-2019 బిడ్‌ను దాఖలు చేయలేకపోయామన్నారు. అయితే ఇందులో ఐఓఏను గానీ, క్రీడా శాఖను గానీ తప్పుబట్టలేమని స్పష్టం చేశారు. భవిష్యత్‌లో ఆసియా గేమ్స్‌ను నిర్వహించేందుకు కృషి చేస్తామన్నారు. -
ఆరు రాష్ట్రాలపై ఏఎఫ్ఐ వేటు
న్యూఢిల్లీ: భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్ఐ) కొరఢా ఝుళిపించింది. జాతీయ ఈవెంట్స్‌లో వయసు మీరిన క్రీడాకారులను బరిలోకి దింపినందుకు ఢిల్లీ సహా ఆరు రాష్ట్రాల సంఘాలపై వేటు వేసింది. డోపింగ్‌లో దోషులని తేలిన 14 మంది అథ్లెట్లపై రెండేళ్ల పాటు నిషేధం విధించింది. ఇటీవల రెండు రోజుల పాటు సమావేశమైన ఏఎఫ్ఐ ఎగ్జిక్యూటీవ్ కమిటీ ఈ మేరకు నిర్ణయాలు తీసుకుంది. ఢిల్లీ, హర్యానా, బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన అథ్లెట్లు ఏడాది పాటు పాల్గొనకుండా నిషేధం విధించింది. అయితే సంబంధిత రాష్ట్రాలకు చెందిన అథ్లెట్లు జాతీయస్థాయి పోటీల్లో తమ సొంత రాష్ర్టం తరఫున కాకుండా ఏఎఫ్ఐ గొడుగు కింద పాల్గొనే వెసులుబాటు కల్పించింది.