మురళీ శ్రీశంకర్,మన్‌ప్రీత్ కౌర్, మొహమ్మద్ అనీస్ యాహియా
కామన్వెల్త్ గేమ్స్ అథ్లెటిక్స్‌లో భారత క్రీడాకారులు శుభారంభం చేశారు. పురుషుల లాంగ్‌జంప్‌లో మురళీ శ్రీశంకర్, మొహమ్మద్ అనీస్ యాహియా... మహిళల షాట్‌పుట్‌లో మన్‌ప్రీత్ కౌర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. మంగళవారం జరిగిన లాంగ్‌జంప్ క్వాలిఫయింగ్‌లో గ్రూప్ ‘ఎ’లో పోటీపడ్డ శ్రీశంకర్ 8.05 మీటర్ల దూరం గెంతి తన గ్రూప్‌లో టాపర్‌గా నిలిచాడు. గ్రూప్ ‘బి’లో యాహియా 7.68 మీటర్ల దూరం గెంతి మూడో స్థానంలో నిలిచాడు. రెండు గ్రూప్‌ల నుంచి కలిపి టాప్–12లో నిలిచినవారికి ఫైనల్ బెర్త్‌లు ఖరారయ్యాయి.
షాట్‌పుట్ క్వాలిఫయింగ్‌లో మన్‌ప్రీత్ కౌర్ ఇనుప గుండును 16.78 మీటర్ల దూరం విసిరి ఓవరాల్‌గా ఏడో ర్యాంక్‌తో ఫైనల్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. మహిళల 100 మీటర్ల విభాగంలో భారత స్టార్ స్ప్రింటర్ ద్యుతీచంద్ హీట్స్‌లోనే వెనుదిరిగింది. ఐదో హీట్‌లో పాల్గొన్న ద్యుతీచంద్ 11.55 సెకన్లలో గమ్యానికి చేరి నాలుగో స్థానంలో నిలిచింది. ఓవరాల్‌గా ద్యుతీచంద్ 27వ ర్యాంక్‌లో నిలిచి సెమీఫైనల్‌కు అర్హత పొందలేకపోయింది.
చదవండి: CWG 2022: పీవీ సింధు మాత్రమే.. బ్యాడ్మింటన్ మిక్స్‌డ్ టీమ్‌కు రజతం
Comments
Please login to add a commentAdd a comment