Birmingham 2022
-
మ్యాచ్‌కు డుమ్మా కొట్టి బంధువుల ఇళ్లకు వెళ్లిన ఇద్దరు బంగ్లాదేశ్ ప్లేయర్స్‌పై నిషేధం
కామన్వెల్త్ గేమ్స్ లాంటి కీలకమైన ఈవెంట్లో మ్యాచ్‌కు డుమ్మా కొట్టి బంధువుల ఇళ్ల సందర్శనకు వెళ్లిన ఇద్దరు బంగ్లాదేశీ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణులపై ఆ దేశ క్రీడల సమాఖ్య నిషేధం విధించింది. సోనమ్ సుల్తానా సోమా, సాదియా అక్తర్ మౌ అనే ఇద్దరు బంగ్లాదేశ్ టీటీ ప్లేయర్లు.. బర్మింగ్‌హామ్ వేదికగా జరిగిన కామన్వెల్త్ గేమ్స్ 2022లో ఆగస్ట్ 5న షెడ్యూలైన మహిళల మ్యాచ్‌ల్లో (సింగిల్స్, డబుల్స్, మిక్సడ్ డబుల్స్) పాల్గొనాల్సి ఉండింది. అయితే ఈ జోడీ క్యాంప్ అధికారులకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా, మ్యాచ్ సమయానికి కనిపించకుండా పోయారు (బంధువుల ఇళ్లకు వెళ్లినట్లు విచారణలో పేర్కొన్నారు). దీంతో ప్రత్యర్ధులకు బై లభించింది. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న బంగ్లాదేశ్ క్రీడల సమాఖ్య.. దేశ ప్రతిష్టకు భంగం కలిగించారన్న కారణంగా ఇద్దరు మహిళా టీటీ ప్లేయర్లపై రెండేళ్ల నిషేధం విధించింది. ఈ నిషేధం అంతర్జాతీయ మ్యాచ్‌లతో పాటు డొమెస్టిక్ సర్క్యూట్‌కు కూడా వర్తిస్తుందని బంగ్లాదేశ్ టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ప్రకటించింది. చదవండి: G.O.A.T అని ఇలా కూడా పిలవొచ్చా.. వారెవ్వా! -
డోపింగ్‌లో దొరికిన భారత డిస్కస్ త్రోయర్ నవ్‌జీత్ కౌర్
ఇటీవల బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్‌లో పోటీపడ్డ భారత మహిళా డిస్కస్ త్రోయర్ నవ్‌జీత్ కౌర్ ధిల్లాన్ డోపింగ్ పరీక్షలో విఫలమైంది. గత నెలలో ప్రపంచ చాంపియన్‌షిప్ కంటే ముందు ఆమె నుంచి సేకరించిన శాంపిల్స్‌లో నిషేధిత ఉత్ప్రేరకాల ఆనవాళ్లు ఉన్నాయని అథ్లెటిక్స్ ఇంటెగ్రిటీ యూనిట్ (ఏఐయూ) శనివారం ప్రకటించింది. పంజాబ్‌కు చెందిన 27 ఏళ్ల నవ్‌జీత్ 2018 గోల్డ్‌కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్‌లో కాంస్య పతకం నెగ్గింది. బర్మింగ్‌హామ్ గేమ్స్‌లో మాత్రం ఆమె ఎనిమిదో స్థానంలో నిలిచింది. గత జూన్‌లో చెన్నైలో జరిగిన ఇంటర్ స్టేట్ చాంపియన్‌షిప్‌లో, కజకిస్తాన్‌లో జరిగిన కొసనోవ్ స్మారక మీట్లో నవ్‌జీత్ స్వర్ణ పతకాలు సాధించింది. నవ్‌జీత్‌పై నాలుగేళ్ల నిషేధం విధించే అవకాశముంది. -
అథ్లెట్ స్వయంగా కూలీకి వెళితే తప్ప ఇల్లు గడవని స్థితి... అయినా అద్భుత విజయాలు!
సాక్షి, హైదరాబాద్: ‘ఒక అథ్లెట్ స్వయంగా కూలీకి వెళితే తప్ప ఇల్లు గడవని స్థితి. మరొకరి తల్లిదండ్రులు రోజూవారీ కార్మికులు. ఇంకొకరిది కూడా కడు పేదరికం. కానీ ఇలాంటి స్థితినుంచి వచ్చి కూడా వారు అంతర్జాతీయ స్థాయిలో గొప్ప ప్రదర్శన కనబరుస్తున్నారు. అందుకే మన అథ్లెట్లను చూస్తే నాకు గౌరవం, గర్వం కలుగుతాయి. వారి శ్రమను ప్రత్యేకంగా అభినందించాలని అనిపిస్తుంది’ అని భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ వ్యాఖ్యానించారు. బ్యాడ్మింటన్ సహా కొన్ని ఇతర క్రీడల్లో కనీస స్థాయినుంచి మొదలు పెట్టి మరింతగా పైకి ఎదుగుతారని... కానీ కనీస సౌకర్యాలు లేని నేపథ్యంనుంచి వచ్చి అథ్లెట్లు సాధించే సాధారణ విజయాలను కూడా చాలా గొప్పగా భావించాలని ఆయన అభిప్రాయపడ్డారు. ‘గోపీచంద్–మైత్రా ఫౌండేషన్’ ఆధ్వర్యంలో గురువారం జరిగిన ఒక కార్యక్రమంలో ఇటీవల భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన అథ్లెట్లను సన్మానించారు. దాదాపు ఏడేళ్ల క్రితం.. యువ క్రీడాకారులకు అండగా నిలవాలనే సంకల్పంతో ‘మైత్రా ఫౌండేషన్’తో జత కట్టానని, అది మంచి ఫలితాలు ఇచ్చిందని సంతోషం వ్యక్తం చేసిన గోపీచంద్... ప్రభుత్వ సంస్థలు ‘సాయ్’, ‘శాట్స్’ అధికారికంగా ఇచ్చే సౌకర్యాలతో పాటు కీలక సమయాల్లో ఆటగాళ్లకు డైట్, ఫిట్నెస్, ఫిజియో తదితర అంశాల్లో ‘మైత్రా’ సహకారం అందిస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో కామన్వెల్త్ క్రీడల్లో ఫైనల్స్‌కు అర్హత సాధించిన యెర్రా జ్యోతి, ద్యుతీచంద్లతో పాటు అండర్–20 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఫైనల్ చేరిన ఎ.నందిని, కె.రజితలకు కూడా నగదు ప్రోత్సాహకాన్ని అందించారు. ఇతర అథ్లెట్లు జ్యోతికశ్రీ, ఎన్.ఎస్. శ్రీనివాస్, ప్రణయ్, అనూష, దిల్ఖుష్ యాదవ్, భారత అథ్లెటిక్స్ కోచ్ నాగపురి రమేశ్‌లతో పాటు ‘మైత్రా’ గ్రూప్ చైర్మన్ రవి కైలాస్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చదవండి: PAK Vs NED: రెండో వన్డేలో ఘన విజయం..'ఈసారి మాత్రం తేలిగ్గా తీసుకోలేదు' KL Rahul: ఒక్క విజయంతో దిగ్గజాల సరసన చోటు.. -
Commonwealth Games 2022: విజేతలకు ఐఓఏ నజరానా
న్యూఢిల్లీ: కామన్వెల్త్ క్రీడల్లో పతకాలు సాధించిన క్రీడాకారులను భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) ఘనంగా సత్కరించింది. నగదు పురస్కారాలతో వారిని గౌరవించింది. స్వర్ణం గెలిచిన వారికి రూ. 20 లక్షలు, రజతానికి రూ. 10 లక్షలు, కాంస్యానికి రూ. 7.5 లక్షల చొప్పున ఐఓఏ అందించింది. ఈ కార్యక్రమంలో ఐఓఏ అధ్యక్ష, కార్యదర్శులు అనిల్ ఖన్నా, రాజీవ్ మెహతా, కోశాధికారి ఆనందీశ్వర్ పాండే తదితరులు పాల్గొన్నారు. బర్మింగ్‌హామ్‌లో జరిగిన పోటీల్లో భారత్ 22 స్వర్ణాలు, 16 రజతాలు, 23 కాంస్యాలు (మొత్తం 61 పతకాలు) సాధించింది. -
CWG 2022: స్వర్ణ యుగం మొదలైంది.. మిమ్మల్ని చూసి దేశం గర్విస్తోంది: ప్రధాని మోదీ
Commonwealth Games 2022- న్యూఢిల్లీ: కామన్వెల్త్ క్రీడల్లో పతకాలు సాధించిన భారత క్రీడాకారులతో ప్రధాని నరేంద్ర మోదీ శనివారం భేటీ అయ్యారు. ప్రధాని అధికారిక నివాసంలో జరిగే ఈ కార్యక్రమంలో కొందరు మినహా దాదాపు విజేతలంతా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ క్రీడాకారులను ఉద్దేశించి ప్రసంగిస్తూ మీ అపూర్వ విజయాలు చూసి జాతి మొత్తం గర్విస్తోందని ప్రశంసించారు. స్వర్ణ యుగం మొదలైంది! ‘‘మీ షెడ్యూల్లో కొంత సమయాన్ని నాకు కేటాయించి నా నివాసానికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అందరు భారతీయుల్లాగే.. మీ గురించి మాట్లాడటం నాకూ గర్వంగా ఉంది. భారత క్రీడల్లో స్వర్ణ యుగం ఆరంభమైంది. ఇది కేవలం యువ శక్తి వల్లే సాధ్యమైంది. గడిచిన రెండు వారాల్లో అటు కామన్వెల్త్.. ఇటు చెస్ ఒలింపియాడ్ రూపంలో రెండు మెగా ఈవెంట్లు. కామన్వెల్త్ క్రీడల్లో చారిత్రాత్మక ప్రదర్శనతో పాటు చెస్ ఒలింపియాడ్‌కు మనం తొలిసారి ఆతిథ్యం ఇచ్చాము. ఈ మెగా ఈవెంట్లో విజయం సాధించిన వాళ్లందరికీ కూడా నా శుభాభినందనలు’’ అని ప్రధాని మోదీ విజేతలను కొనియాడారు. ఇక కామన్వెల్త్ క్రీడల్లో రజత పతకం సాధించిన భారత మహిళా క్రికెట్ జట్టు గురించి ప్రధాని మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. హర్మన్‌ప్రీత్ కౌర్ బృందాన్ని ప్రశంసల్లో ముంచెత్తిన ఆయన.. స్వర్ణ పతక విజేత బాక్సర్ నీతూ ఘంఘస్, బ్మాడ్మింటన్ స్టార్, గోల్డ్ మెడలిస్ట్ పీవీ సింధు, క్రికెటర్ రేణుకా సింగ్‌తో పాటు రెజ్లర్ పూజా గెహ్లోత్ పేరును ప్రస్తావించారు. భేటీలు భేష్! అమ్మాయిలంతా శెభాష్ అనిపించుకున్నారని, దేశమంతా గర్వించేలా చేశారని కొనియాడారు. అయితే, పూజా కాంస్యానికే పరిమితమైనందుకు కన్నీరు పెట్టుకున్నపుడు తాను వెంటనే స్పందించానన్న ప్రధాని మోదీ.. పతకం సాధించి దేశ ప్రతిష్టను ఇనుమడింపజేసినందుకు ఆనందించాలే తప్ప బాధపడవద్దంటూ క్రీడాకారులకు సూచించారు. కామన్వెల్త్ గేమ్స్‌లో సీనియర్ అథ్లెట్లు ముందుండి నడిస్తే.. యువ ఆటగాళ్లు వారి స్ఫూర్తితో పతకాలు సాధించారని కొనియాడారు. ప్రతిష్టాత్మక క్రీడా వేదికపై త్రివర్ణ పతాకం రెపరెపలాడినపుడు గర్వంతో గుండె ఉప్పొంగిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. కాగా యూకేకు బయల్దేరే ముందు కూడా క్రీడాకారులతో ప్రధాని మోదీ భేటీ అయిన విషయం తెలిసిందే. దేశాన్ని గర్వపడేలా చేస్తామని అప్పుడు తనకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారంటూ ప్రధాని మోదీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఇక ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్‌లో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో భారత్ 22 స్వర్ణాలు, 16 రజతాలు, 23 కాంస్యాలు (మొత్తం 61 పతకాలు) సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. రెజ్లింగ్‌లోనే మనకు 6 స్వర్ణాలు సహా మొత్తం 12 పతకాలు వచ్చాయి. చదవండి: Ind Vs Zim ODI Series: జింబాబ్వేకు పయనమైన టీమిండియా ఆటగాళ్లు.. The Great Khali: 'ది గ్రేట్ ఖలీ' కన్నీటి పర్యంతం.. అంతుచిక్కని ప్రశ్నలా! Elated to interact with our CWG 2022 contingent. Entire nation is proud of their outstanding achievements. https://t.co/eraViqKcnl — Narendra Modi (@narendramodi) August 13, 2022 -
CWG 2022: జీతం లేని సెలవు పెట్టి తండ్రి త్యాగం! కూతురు ‘పసిడి’ పంచ్‌తో..
CWG 2022- Boxer Nitu Ghanghas: బాక్సింగ్‌లో మన అమ్మాయిల పంచ్ కామన్వెల్త్ క్రీడల్లో గట్టిగా పడింది. తెలంగాణ నిఖత్ జరీన్‌తో పాటు హర్యాణ నీతు ఘణఘస్ కూడా స్వర్ణం సాధించింది. నిఖత్ వెనుక ఆమె తండ్రి ఎలా మద్దతుగా నిలిచాడో నీతు ఘంఘస్ వెనుక ఆమె తండ్రి జై భగవాన్ నిలిచాడు. హర్యాణ విధాన సభలో బిల్ మెసెంజర్‌గా పని చేసే జై భగవాన్ ఉద్యోగానికి జీతం లేని సెలవు పెట్టి నీతు బాక్సింగ్‌కు వెన్నుదన్నుగా నిలిచాడు. అతని త్యాగం ఫలించింది. నీతు బంగారు పతకం సాధించింది. ఆదివారం కామన్వెల్త్ క్రీడలలో బంగారు పతకం సాధించిన నీతు ఘణఘస్ అక్కడి నేషనల్ ఎగ్జిబిషన్ సెంటర్లో అభిమానులు ‘భారత మాతాకీ జై’ అని ఉత్సాహంగా నినాదాలు ఇస్తుంటే తన మెడలోని బంగారు పతకాన్ని చూపుతూ ‘ఈ పతకం ఈ దేశ ప్రజలందరితో పాటు మా నాన్నకు అంకితం’ అని చెప్పింది. కామన్వెల్త్ క్రీడలలో 45– 48 కేజీల విభాగంలో నీతు ఘణఘస్ ఇంగ్లండ్ బాక్సర్ డెమీ జేడ్‌ను ఘోరంగా ఓడించింది. ఎంత గట్టిగా అంటే రెఫరీలందరూ ఆమెకు ఏకగ్రీవంగా 5–0తో గెలుపునిచ్చారు. ‘మా కోచ్ భాస్కర్ చంద్ర భట్ నాతో నీ ప్రత్యర్థి ఎత్తు తక్కువ ఉంది. ఎక్కువగా దాడి చేసే వీలు ఉంది. కాచుకోవడానికి పక్కకు జరుగుతూ దాడి చెయ్ అన్నారు. అదే పాటించాను’ అంది నీతు. ఇలాంటి ఎన్నో సవాళ్లను సమర్థంగా, సమయస్ఫూర్తితో ఎదుర్కొంది కాబట్టే ఇవాళ ఆమె విజేత అయ్యింది. తండ్రికీ, దేశానికీ గర్వకారణంగా నిలిచింది. అతని గెలుపుతో స్ఫూర్తి 2008లో బీజింగ్ ఒలిపింగ్స్లో బాక్సర్ విజేందర్ సింగ్ స్వర్ణం సాధించడంతో నీతు కల మొదలైంది. అప్పటికి ఆ అమ్మాయికి 8 ఏళ్లు. ఆమె ఊరు ధనానాకు విజేందర్ సింగ్ ఊరు సమీపంలోనే ఉంటుంది. ఆ తర్వాత మూడు నాలుగేళ్ల వరకూ విజేందర్ విజయాలు సాధిస్తూనే ఉన్నాడు. 12 ఏళ్ల వయసులో నీతు తాను కూడా బాక్సర్ కావాలని నిశ్చయించుకుంది. ముగ్గురు తోబుట్టువులలో ఒకరైన నీతు ఇంట్లోగాని స్కూల్లోగాని ఫైటింగుల్లో ముందు ఉంటుంది. ఆ దూకుడు గమనించిన తండ్రి జై భగవాన్ ఆమెను బాక్సర్‌ను చేయడానికి నిశ్చయించుకుని చండీగఢ్‌లోని కుటుంబాన్ని ధనానాకు మార్చాడు. తను ఉద్యోగం చేస్తూ కూతురిని అక్కడకు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ‘భివాని బాక్సింగ్ క్లబ్’కు శిక్షణ కోసం వెళ్లి వచ్చే ఏర్పాటు చేశాడు. భివానిలోనే విజేందర్ సింగ్ బాక్సింగ్ శిక్షణ తీసుకున్నాడు. రెండేళ్లు గడిచిపోయాయి. కాని నీతు బాక్సింగ్‌లో చెప్పుకోదగ్గ పురోగతి సాధించలేదు. ‘నేను బాక్సింగ్ మానేస్తాను నాన్నా’ అని తండ్రికి చెప్పింది. కాని కూతురు అలా నిరాశలో కూరుకుపోవడం తండ్రికి నచ్చలేదు. ఉద్యోగానికి సెలవు పెట్టి చండీఘడ్‌లో విధాన సభలో బిల్ మెసెంజర్‌గా పని చేసేవాడు. చిన్న ఉద్యోగం. మూడేళ్లు లీవ్ అడిగాడు కూతురి కోసం. అన్నేళ్లు ఎవరు ఇస్తారు. పైగా కూతురి బాక్సింగ్ కోసం అంటే నవ్వుతారు. కాని జై భగవాన్ లాస్ ఆఫ్ పే మీద వెళ్లిపోయాడు. సొంత ఊరు ధనానాకు చేరుకుని ఉదయం సాయంత్రం కూతురిని ట్రైనింగ్‌కు తీసుకెళ్లసాగాడు. జరుగుబాటుకు డబ్బులు లేవు. తండ్రి నుంచి వచ్చిన పొలంలో కొంత అమ్మేశాడు. ఎప్పుడో కొనుక్కున్న కారు అమ్మేశాడు. ఒక్కోసారి ట్రైనింగ్ కోసం ధనానా నుంచి భివానికి నీతు వెళ్లకపోయేది. ఇంట్లోనే సాధన చేయడానికి ఊక బస్తాను వేళ్లాడగట్టి ఉత్సాహపరిచేవాడు. ‘నువ్వు గొప్ప బాక్సర్వి కావాలి’ అనేవాడు. ‘నాన్నా... నేను మంచి బాక్సర్‌ని కాకపోతే నువ్వు ఉద్యోగంలో చేరిపో’ అని నీతు అనేది. ‘దాని గురించి ఆలోచించకు’ అని లక్ష్యంవైపు గురి నిలపమనేవాడు. విజయం వరించింది జై భగవాన్ అతని భార్య ముకేశ్ కుమారి కలిసి నీతు మీద పెట్టుకున్న ఆశలు ఫలించాయి. 2017, 2018 రెండు సంవత్సరాలు వరుసగా యూత్ వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో నీతు ఛాంపియన్‌గా నిలిచింది. 21 ఏళ్ల వయసులో మొదటిసారిగా కామన్వెల్త్ క్రీడల్లో దిగి గోల్డ్‌మెడల్ సాధించడంతో ఆమె ఘనత ఉన్నత స్థితికి చేరింది. గొప్ప విషయమేమంటే ఏ విధాన సభలో తండ్రి పని చేస్తాడో అదే విధాన సభ చైర్మన్ జ్ఞాన్‌చంద్ నీతు విజయం గురించి విని సంబరాలు జరపడం. నీతు తండ్రి జై భగవాన్‌కు ఫోన్ చేసి అభినందనలు తెలిపాడు. ‘మనమ్మాయి గొప్ప విజయం సాధించింది’ అన్నాడాయన జై భగవాన్‌తో నిజమే. ఇప్పుడు నీతు ‘మన అమ్మాయి’. మన భారతదేశ గర్వకారణం. చదవండి: CWG 2022: నిఖత్ జరీన్‌కు అరుదైన గౌరవం Sourav Ganguly: మహిళా క్రికెట్ జట్టుపై గంగూలీ అభ్యంతరకర ట్వీట్.. ఆటాడుకుంటున్న నెటిజన్లు -
CWG 2022: మిమ్మల్ని చూసి దేశమంతా గర్విస్తోంది.. కంగ్రాట్స్: కోహ్లి
Commonwealth Games 2022: కామన్వెల్త్ గేమ్స్-2022లో పతకాలు సాధించిన భారత క్రీడాకారులకు టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి శుభాకాంక్షలు తెలిపాడు. ప్రతిష్టాత్మక క్రీడల్లో సత్తా చాటి దేశ ప్రతిష్టను ఇనుమడింపజేశారని కొనియాడాడు. మిమ్మల్ని చూసి భారతీయులంతా గర్వపడుతున్నారంటూ ప్రశంసించాడు. కాగా జూలై 29 నుంచి ఆగష్టు 8 వరకు ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్ వేదికగా కామన్వెల్త్ క్రీడలు జరిగిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా భారత్ ఈసారి 22 స్వర్ణాలు, 16 రజతాలు, 23 కాంస్య పతకాలు సాధించింది. రెజ్లింగ్‌లో 12, వెయిట్‌లిఫ్టింగ్‌లో 10, అథ్లెటిక్స్‌లో 8, బాక్సింగ్‌లో 7, టేబుల్ టెన్నిస్‌లో 7, బ్యాడ్మింటన్‌లో 6, జూడోలో 3, హాకీలో 2, లాన్ బౌల్స్‌లో 2, స్వ్కాష్‌లో 2, టీ20 క్రికెట్లో 1, పారా పవర్‌లిఫ్టింగ్‌లో 1 మెడల్స్ వచ్చాయి. ఇలా మొత్తంగా 61 పతకాలు గెలిచిన భారత్.. పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. ఈ నేపథ్యంలో భారత క్రీడా బృందానికి సోషల్ మీడియాలో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఇందులో భాగంగా కోహ్లి.. మంగళవారం ట్విటర్ వేదికగా స్పందించాడు. గొప్ప పురస్కారాలు అందించారు! ఈ మేరకు.. ‘‘మన దేశానికి గొప్ప పురస్కారాలు అందించారు. కామన్వెల్త్ గేమ్స్-2022లో పాల్గొన్న, గెలిచిన వాళ్లందరికీ శుభాకాంక్షలు. మిమ్మల్ని చూసి మేము గర్విస్తున్నాం. జై హింద్’’ అంటూ కోహ్లి పతకధారుల ఫొటోను షేర్ చేశాడు. ఇక ఆసియా కప్-2022 టోర్నీ నేపథ్యంలో విరాట్ కోహ్లి తిరిగి భారత జట్టులో ఎంట్రీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే. ఇన్నాళ్లు విశ్రాంతి పేరిట జట్టుకు దూరంగా ఉన్న ఈ స్టార్ బ్యాటర్.. ఈనెల 27 నుంచి ప్రారంభం కానున్న ఈ మెగా ఈవెంట్‌కు ఎంపికైన జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. సుదీర్ఘకాలంగా సెంచరీ చేయలేకపోయిన కోహ్లి.. ఈ టోర్నీలోనైనా విజృంభించాలని అభిమానులు కోరుకుంటున్నారు. You have brought great laurels for our country. Congratulations to all our winners and the participants of CWG 2022. We are so proud of you. Jai Hind 🇮🇳👏 pic.twitter.com/phKMn7MMdY — Virat Kohli (@imVkohli) August 9, 2022 చదవండి: Ravindra Jadeja: మంచి మనసు చాటుకున్న జడేజా భార్య.. ఏకంగా 101 ఖాతాలు.. ప్రధాని మోదీ ప్రశంసలు -
కామన్వెల్త్ గేమ్స్‌కు వెళ్లిన బృందంలో 10 మంది లంక ఆటగాళ్లు అదృశ్యం
కామన్వెల్త్ గేమ్స్ 2022 బర్మింగ్హమ్ వేదికగా ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. గతనెల 28న ప్రారంభమైన కామన్వెల్త్ గేమ్స్ ఆగస్టు 8న ముగిశాయి. ఈ గేమ్స్‌కు 72 దేశాలు పాల్గొనగా.. అందులో శ్రీలంక కూడా ఉంది. ఈసారి కామన్వెల్త్ లో వివిధ క్రీడాంశాల్లో పాల్గొనేందుకు గాను లంక.. 110 మంది (50 మంది పురుషులు, 60 మంది మహిళలు)తో కూడిన అథ్లెట్ల బృంధం బర్మింగ్‌హామ్‌కు వెళ్లింది. అయితే గేమ్స్ జరుగుతున్న సమయంలోనే 10 మంది లంక అథ్లెట్లు కనిపించకుండా పోయారు. అథ్లెట్లతో పాటు పలువురు అధికారులు కూడా తప్పిపోయినట్లు సమాచారం. కాగా ఆటల కోసమని వచ్చిన ఆటగాళ్లలో మిస్ అయినవాళ్లు తమ బ్యాగులను క్రీడాగ్రామంలోనే వదిలి అక్కడ్నుంచి వెళ్లిపోవడం విశేషం. వీళ్లకు ఆరునెలల పాటు వీసాలున్నాయని తెలుస్తున్నది. అయితే అదృశ్యమైన తొలి ముగ్గురు అథ్లెట్లను బర్మింగ్‌హామ్ పోలీసులు వెతికి పట్టుకున్నారని, కానీ వాళ్లను ఎక్కడ ఉంచింది మాత్రం వెల్లడించలేదని లంక ప్రతినిధులు తెలిపారు. లంకలో ప్రస్తుతం దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే ఆ దేశంలో ఆర్థిక, రాజకీయ సంక్షోభం తలెత్తింది. ఒక్కపూట తిండి దొరక్క అక్కడి ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. దీంతో బర్మింగ్‌హామ్ కు వెళ్లిన లంక అథ్లెట్లు కూడా ఇదే కారణంతో అక్కడ ఆగిపోయి ఉంటారని.. స్వదేశానికి వెళ్లి తిండి తిప్పలు మాని అల్లాడటం కంటే యూకేలోని ఆగిపోయి ఏదో ఒక పని చేసుకోవడమే మంచిదనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. మరి అదృష్యమైన ఆ పది మంది ఆటగాళ్ల జాబితా ఎక్కడుంది అనేది ఆసక్తికరంగా మారింది. కాగా కామన్వెల్త్ గేమ్స్‌లో శ్రీలంక.. ఒక రజతం, మూడు కాంస్యాలతో మొత్తంగా 4 పతకాలు సాధించి పతకాల పట్టికలో 31వ స్థానంలో నిలిచింది. -
CWG 2022: ఈ స్వర్ణం కోసం ఎంతో నిరీక్షించాను.. ఎట్టకేలకు: సింధు
Commonwealth Games 2022- బర్మింగ్‌హామ్: గతంలో జరిగిన పొరపాట్లు ఈసారి పునరావృతం కాకుండా ఆద్యంతం ఆధిపత్యం చలాయిస్తూ ఆడిన భారత స్టార్ షట్లర్ పీవీ సింధు తొలిసారి కామన్వెల్త్ గేమ్స్ చాంపియన్‌గా నిలిచింది. ఈ క్రీడల చివరిరోజు సోమవారం జరిగిన బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ ఫైనల్లో ఏడో ర్యాంకర్ సింధు 21–15, 21–13తో 13వ ర్యాంకర్, 2014 గేమ్స్ స్వర్ణ పతక విజేత మిషెల్లి లీ (కెనడా)పై గెలిచింది. 2014 గేమ్స్ సెమీఫైనల్లో మిషెల్లి లీ చేతిలో ఓడిన సింధు, 2018 గేమ్స్ సెమీఫైనల్లో మిషెల్లి లీని ఓడించి ఫైనల్ చేరి తుది పోరులో సైనా నెహ్వాల్ చేతిలో పరాజయం పాలైంది. మూడోసారి మిషెల్లి లీపై గెలుపుతో సింధు విజేతగా నిలిచింది. చివరిసారి ఎనిమిదేళ్ల క్రితం సింధును ఓడించిన మిషెల్లి ఈసారి తన ప్రత్యర్థికి అంతగా పోటీనివ్వలేకపోయింది. అవకాశం ఇవ్వకుండా.. అనుభవజ్ఞురాలైన మిషెల్లిని ఏమాత్రం తక్కువ అంచనా వేయకుండా పక్కా ప్రణాళికతో దూకుడుగా ఆడిన సింధు అనుకున్న ఫలితం సంపాదించింది. తొలి గేమ్‌లో 14–8తో స్పష్టమైన ఆధిక్యంలోకి వెళ్లిన ఈ ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి అదే జోరులో గేమ్‌ను దక్కించుకుంది. రెండో గేమ్‌లోనూ సింధు విజృంభణ కొనసాగడంతో మిషెల్లికి తేరుకునే అవకాశం లేకుండాపోయింది. లక్ష్యసేన్ సైతం.. అంచనాలకు అనుగుణంగా మెరిసిన భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ముచ్చటగా మూడో ప్రయత్నంలో కామన్వెల్త్ గేమ్స్ చాంపియన్‌గా అవతరించింది. 2014 గ్లాస్గో గేమ్స్‌లో కాంస్యం... 2018 గోల్డ్‌కోస్ట్ గేమ్స్‌లో రజతం నెగ్గిన ఈ తెలుగుతేజం సోమవారం ముగిసిన బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణ పతకం సొంతం చేసుకుంది. పురుషుల సింగిల్స్‌లో లక్ష్య సేన్ కూడా అదరగొట్టి పసిడి పతకం దక్కించుకోగా... పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి ద్వయం బంగారు పతకాన్ని తమ మెడలో వేసుకుంది. శరత్ కమల్ 16 ఏళ్ల తర్వాత టేబుల్ టెన్నిస్‌లో ఆచంట శరత్ కమల్ 16 ఏళ్ల తర్వాత రెండోసారి పురుషుల సింగిల్స్‌లో పసిడి పతకం నెగ్గగా... సత్యన్ కాంస్యం కైవసం చేసుకున్నాడు. పురుషుల హాకీలో టీమిండియా మరోసారి రజత పతకంతో సంతృప్తి పడింది. మొత్తానికి ఈ గేమ్స్ చివరిరోజు భారత్ నాలుగు స్వర్ణాలు, ఒక రజతం, ఒక కాంస్యం సాధించి చిరస్మరణీయ ప్రదర్శనతో ముగించింది. ఓవరాల్‌గా ఈ క్రీడల్లో భారత్ 61 పతకాలతో నాలుగో స్థానంలో నిలిచింది. 2026 కామన్వెల్త్ గేమ్స్ ఆస్ట్రేలియాలోని విక్టోరియా రాష్ట్రంలో జరుగుతాయి. అభిమానులకు ధన్యవాదాలు: సింధు సుదీర్ఘ కాలంగా కామన్వెల్త్ గేమ్స్ స్వర్ణం కోసం నిరీక్షించాను. ఎట్టకేలకు పసిడి పతకాన్ని సాధించడంతో చాలా ఆనందంగా ఉన్నాను. మ్యాచ్‌ను ప్రత్యక్షంగా తిలకించేందుకు వచ్చిన వేలాది మంది ప్రేక్షకులకు, అభిమానులకు ధన్యవాదాలు. –పీవీ సింధు PC: PV Sindhu Twitter సింధు ఘనతలు: ►కామన్వెల్త్ గేమ్స్ మహిళల సింగిల్స్‌లో స్వర్ణం గెలిచిన రెండో భారతీయ క్రీడాకారిణి సింధు. గతంలో సైనా నెహ్వాల్ (2010, 2018) రెండుసార్లు పసిడి పతకాలు సాధించింది. ►కామన్వెల్త్ గేమ్స్ బ్యాడ్మింటన్ వ్యక్తిగత విభాగంలో అత్యధిక పతకాలు నెగ్గిన భారతీయ ప్లేయర్‌గా సింధు (3 పతకాలు) నిలిచింది. గతంలో అపర్ణా పోపట్ (1998లో రజతం; 2002లో కాంస్యం), సైనా రెండు పతకాల చొప్పున సాధించారు. చదవండి: Asia Cup 2022: ఆసియాకప్‌కు భారత జట్టు ప్రకటన.. కోహ్లి వచ్చేశాడు -
commonwealth games 2022: ‘నా ఆనందానికి హద్దుల్లేవు’
శరత్ కమల్ తొలి కామన్వెల్త్ పతకం గెలిచినప్పుడు ఆకుల శ్రీజ వయసు 8 ఏళ్లు! ఇప్పుడు అలాంటి దిగ్గజం భాగస్వామిగా కామన్వెల్త్ క్రీడల బరిలోకి దిగిన శ్రీజ మిక్స్డ్ డబుల్స్‌లో స్వర్ణాన్ని సొంతం చేసుకుంది. పాల్గొన్న తొలి కామన్వెల్త్ క్రీడల్లోనే పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఈ ఏడాది తొలిసారి సీనియర్ స్థాయిలో జాతీయ చాంపియన్‌గా నిలిచిన శ్రీజ దురదృష్టవశాత్తూ సింగిల్స్ విభాగంలో నాలుగో స్థానానికే పరిమితమైనా... 24 ఏళ్ల వయసులోనే తొలి పతకంతో ఈ హైదరాబాద్ అమ్మాయి భవిష్యత్తుపై ఆశలు రేపింది. విజయం సాధించిన అనంతరం బర్మింగ్‌హామ్ నుంచి ‘సాక్షి’తో ఆనందం పంచుకుంటూ శ్రీజ చెప్పిన విశేషాలు ఆమె మాటల్లోనే... ‘సింగిల్స్ కాంస్య పతక పోరులో ఓటమితో చాలా బాధపడ్డాను. ఎంతో పోరాడిన తర్వాత ఓడిపోవడంతో విపరీతంగా ఏడ్చేశాను. ఈ సమయంలో శరత్ అన్నయ్య నన్ను సముదాయించారు. నువ్వు చేయాల్సిన పని ఇంకా పూర్తి కాలేదు. మిక్స్‌డ్‌లో ఇంకా ఫైనల్ మిగిలే ఉంది. మనం స్వర్ణానికి గురి పెడదాం అని చెప్పారు. అప్పటికే సెమీస్ వరకు అన్న నన్ను చాలా ప్రోత్సహిస్తూ వచ్చారు. తెలుగులోనే మేం మాట్లాడుకునేవాళ్లం. నాకంటే ఎంతో సీనియర్ అయిన ఆయన ప్రతీ మ్యాచ్‌లో, ప్రతీ పాయింట్‌కు అండగా నిలిచారు. ఏమాత్రం ఆందోళన వద్దు. నువ్వు చాలా బాగా ఆడుతున్నావని మళ్లీ మళ్లీ చెబుతూ వచ్చారు. చివరకు నేను పాయింట్ చేజార్చినా ఆయనే సారీ చెప్పేవారు. 2019లో ఒకసారి శరత్ అన్నతో కలిసి మిక్స్డ్ డబుల్స్ ఆడాను. నా కోచ్ సోమ్‌నాథ్ ఘోష్‌కు శరత్ అన్నతో మంచి సాన్నిహిత్యం ఉంది. అందుకే ఆ చొరవతోనే ఈ సారి కామన్వెల్త్ క్రీడలకు ముందు నాతో కలిసి ఆడితే బాగుంటుందని ఆయన అన్నకు సూచించారు. దీనికి ఆయన ఒప్పుకున్నారు. చిన్నప్పటి నుంచి స్ఫూర్తిగా తీసుకున్న వ్యక్తితో కలిసి ఇప్పుడు పతకమే గెలవడం చాలా ఆనందంగా ఉంది. మ్యాచ్ గెలిచిన తర్వాత కూడా శరత్ అన్న... ఇప్పటి వరకు నాకు సరైన భాగస్వామి లేక మిక్స్డ్ పతకం లోటుగా ఉండేది. ఇప్పుడు నీతో కలిసి ఆడాక అది దక్కింది, థాంక్యూ అని చెప్పడం ఎప్పటికి మరచిపోలేను’ -
CWG 2022: బ్యాడ్మింటన్‌లో భారత్‌కు మరో స్వర్ణం..
Commonwealth Games 2022: కామన్వెల్త్ గేమ్స్-2022లో ఆఖరి రోజు బ్యాడ్మింటన్‌లో భారత్‌కు మరో స్వర్ణం దక్కింది. భారత షట్లర్ లక్ష్య సేన్ ఫైనల్లో సత్తా చాటాడు. మలేషియా ప్లేయర్ ఎన్జీ జీ యోంగ్‌ను ఓడించాడు. తద్వారా పసిడి పతకం గెలిచాడు. కాగా అంతకుముందు తెలుగు తేజం పీవీ సింధు.. బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్‌లో గోల్డ్ మెడల్ సాధించింది. తడబడినా.. ఇక లక్ష్య సేన్ సోమవారం నాటి మెన్స్ సింగిల్స్ ఫైనల్లో మలేషియా షట్లర్ ఎన్జీ జీ యోంగ్‌తో తలపడ్డాడు. హోరాహోరీగా సాగిన మొదటి గేమ్‌లో లక్ష్య సేన్ 19-21తో వెనుకబడ్డాడు. అయితే, రెండో గేమ్‌లో పుంజుకున్న అతడు 21-9తో ప్రత్యర్థిని చిత్తు చేశాడు. ఇక ఆఖరి గేమ్‌లో ఆధిపత్యం కొనసాగిస్తూ 21-16తో లక్ష్య సేన్ యోంగ్‌ను ఓడించి స్వర్ణం ఖాయం చేసుకున్నాడు. కాగా లక్ష్య సేన్ గెలుపుతో భారత్ ఖాతాలో 20వ పసిడి పతకం చేరింది. దిగ్గజాల సరసన.. వరల్డ్ చాంపియన్‌షిప్స్‌లో కాంస్యం సాధించిన 20 ఏళ్ల లక్ష్య సేన్‌కు కామన్వెల్త్ గేమ్స్‌లో ఇదే మొదటి టైటిల్. ఈ విజయంతో కామన్వెల్త్ గేమ్స్‌లో పతకం గెలిచిన బ్యాడ్మింటన్ స్టార్లు ప్రకాశ్ పదుకొణె(1978), సయ్యద్ మోదీ(1982), పారుపల్లి కశ్యప్(2014) తదితరుల సరసన నిలిచాడు. ఇక భారత బ్యాడ్మింటన్ మిక్స్డ్ టీమ్ విభాగంలో భారత్‌కు రజత పతకం లభించిన విషయం తెలిసిందే. గత మంగళవారం అర్థరాత్రి మలేషియాతో జరిగిన మిక్స్డ్ టీమ్ ఫైనల్లో 3-1 తేడాతో ఓడిన టీమిండియా రజతంతో సరిపెట్టుకుంది. పీవీ సింధు మినహా మిగతావారు ఓటమి పాలవడంతో స్వర్ణం గెలవాలన్న ఆశలు నెరవేరలేదు. ఇదిలా ఉంటే.. భారత్ ఇప్పటి వరకు 20 పసిడి, 15 రజత, 23 కాంస్య పతకాలు సాధించి మొత్తంగా 58 మెడల్స్‌తో పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. చదవండి: PV Sindhu Gold Medal: చాంపియన్లకే చాంపియన్.. గోల్డెన్ గర్ల్.. క్వీన్.. సింధుపై ప్రశంసలు Asia Cup 2022: ఆసియా కప్‌కు భారత జట్టు.. అయ్యర్‌కు నో ఛాన్స్! హుడా వైపే మెగ్గు! -
CWG 2022- PV Sindhu: చాంపియన్లకే చాంపియన్.. ఈ ‘క్వీన్’ ముందు తలవంచాల్సిందే!
Commonwealth Games 2022: కామన్వెల్త్ గేమ్స్-2022లో స్వర్ణ పతకం గెలిచిన బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ప్రతిష్టాత్మక టోర్నీల్లో వరుస విజయాలు నమోదు చేస్తూ భారత ప్రతిష్టను ఇనుమడింపజేస్తున్న ఈ తెలుగు తేజం గెలుపును యావత్ భారతావని సెలబ్రేట్ చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ సింధు గెలుపును ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. చాంపియన్లకే చాంపియన్ ‘‘పీవీ సింధు చాంపియన్లకే చాంపియన్! ఎప్పటికప్పుడు తన ప్రతిభా పాటవాలను చాటుకుంటూనే ఉంది. ఆట పట్ల తన అంకితభావం, నిబద్ధత స్ఫూర్తిదాయకం. కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించిన సింధుకు శుభాభినందనలు. భవిష్యత్తులో ఆమె మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నా’’ అంటూ ప్రధాని మోదీ సింధును విష్ చేశారు. అదే విధంగా కేంద్ర క్రీడా శాఖా మాజీ మంత్రి, ప్రస్తుత న్యాయశాఖా మంత్రి కిరన్ రిజిజు సైతం పీవీ సింధుకు అభినందనలు తెలిపారు. సింధు విజయాన్ని కీర్తిస్తూ ఆయన ట్వీట్ చేశారు. ఇక కేంద్ర క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్ కూడా సింధును సోషల్ మీడియా వేదికగా అభినందించారు. మరో వైపు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా పీవీ సింధును అభినందించారు. కాగా అపూర్వ విజయం నేపథ్యంలో పీవీ సింధు పేరు సామాజిక మాధ్యమాల్లో మారుమ్రోగి పోతోంది. ఆమె రాణి.. తన ముందు తలవంచాల్సిందే! నెటిజన్లు ఆమెపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఈ క్రమంలో టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ తనదైన శైలిలో సింధుకు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ఆమె ముందు మనం తలవంచాలా? అవును కచ్చితంగా.. ఎందుకంటే తను రాణి. గోల్డెన్ గర్ల్ సింధు.. నువ్వు భారతావనిని మరోసారి తలెత్తుకునేలా చేశావు’’ అంటూ విష్ చేశాడు. చదవండి: Asia Cup 2022 IND VS PAK: భారత్-పాక్ మ్యాచ్ సందడి మొదలైంది.. హీటెక్కిస్తున్న హిట్‌మ్యాన్ ప్రోమో (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) The phenomenal @Pvsindhu1 is a champion of champions! She repeatedly shows what excellence is all about. Her dedication and commitment is awe-inspiring. Congratulations to her on winning the Gold medal at the CWG. Wishing her the best for her future endeavours. #Cheer4India pic.twitter.com/WVLeZNMnCG — Narendra Modi (@narendramodi) August 8, 2022 Pride of India, @Pvsindhu1 creates history by winning the Gold Medal in #CommonwealthGames2022 ! She won Bronze in Glasgow 2014, Silver in Gold Coast 2018 and now GOLD!! Congratulations Sindhu for making India proud once again! #Cheer4India 🇮🇳 #CWG2022 pic.twitter.com/El8YRUo5zT — Kiren Rijiju (@KirenRijiju) August 8, 2022 Should we bow? Yes, she's a Queen 🙌🏽 🏅 Congratulations to Golden girl @Pvsindhu1 you make India proud 🇮🇳 #CWG22india pic.twitter.com/mn1wgEkifH — Wasim Jaffer (@WasimJaffer14) August 8, 2022 The unstoppable #PVSindhu First Gold Medal for her in Commonwealth Games in Singles Event. She won the finals in style. The nation is applauding the untiring efforts of @Pvsindhu1. Heartiest congratulations to her. pic.twitter.com/52iQRUO4eT — Y. Satya Kumar (@satyakumar_y) August 8, 2022 -
బ్యాడ్మింటన్ సింగిల్స్‌లో గోల్డ్ మెడల్ గెలిచిన సింధు
-
CWG 2022: సింధు సాధించింది.. స్వర్ణ పతకం గెలిచిన తెలుగు తేజం
Commonwealth Games 2022: కామన్వెల్త్ గేమ్స్-2022లో భారత బ్యాడ్మింటన్ స్టార్, తెలుగు తేజం పూసర్ల వెంకట సింధు అద్భుత విజయం సాధించింది. ప్రతిష్టాత్మక క్రీడల్లో స్వర్ణం సాధించి త్రివర్ణ పతకాన్ని రెపరెపలాడించింది. బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ ఫైనల్లో సత్తా చాటి పసిడి పతకం గెలిచి మరో ప్రతిష్టాత్మక టైటిల్‌ను తన ఖాతాలో వేసుకుంది. కాగా బర్మింగ్‌హామ్ వేదికగా సోమవారం జరిగిన ఫైనల్లో కెనడా షట్లర్ మిచెల్లీ లీని సింధు మట్టికరిపించింది. ఆది నుంచి ఆధిపత్యం కనబరుస్తూ (21-15, 21-13) ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా దూసుకుపోయింది. తన అనుభవాన్నంతా ఉపయోగిస్తూ వరుస సెట్లలో పైచేయి సాధించి విజేతగా నిలిచింది. ఇక కామన్వెల్త్ గేమ్స్‌లో పీవీ సింధుకు ఇదే తొలి స్వర్ణం కావడం విశేషం. అంతకుముందు 2014లో కాంస్యం, 2018లో రజత పతకాలను సింధు గెలిచింది. 2018లో సింధు ఫైనల్ చేరినా.. తుదిపోరులో మరో భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ చేతిలో ఓడిపోయిన విషయం తెలిసిందే. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: CWG 2022 Womens Doubles Badminton: కాంస్యం నెగ్గిన గోపిచంద్ తనయ -
బాక్సింగ్‌లో మరో పతకం.. సాగర్ అహ్లావత్‌కు రజతం
బర్మింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న 22వ కామన్వెల్త్ క్రీడల బాక్సింగ్‌లో భారత పోరాటం ముగిసింది. పురుషుల 92 కేజీల విభాగంలో సాగర్ అహ్లావత్ రజతం సాధించడంతో బాక్సింగ్‌లో భారత ప్రస్థానం సమాప్తమైంది. పదో రోజు సాగర్ అహ్లావత్.. ఇంగ్లండ్‌కు చెందిన డెలిసియస్ ఓరీ చేతిలో 5-0 తేడాతో ఓటమిపాలై రజతంతో సరిపెట్టుకున్నాడు. సాగర్ పతకంతో బాక్సింగ్‌లో భారత పతకాల సంఖ్య ఏడుకు (3 గోల్డ్, సిల్వర్, 3 బ్రాంజ్) చేరింది. ఓవరాల్‌గా 10వ రోజు ముగిసే సమాయానికి భారత్ ఖాతాలో 55 పతకాలు (18 స్వర్ణాలు, 15 రజతాలు, 22 కాంస్యాలు) చేరాయి. చదవండి: IND VS WI 5th T20: ఆఖరి పోరులోనూ భారత్‌దే గెలుపు -
CWG 2022: ఫైనల్‌కు దూసుకెళ్లిన పీవీ సింధు.. ‘పసిడి’కి అడుగు దూరంలో..
CWG 2022- PV Sindhu Enters Final: కామన్వెల్త్ గేమ్స్-2022లో బ్యాడ్మింటన్ స్టార్, తెలుగు తేజం పీవీ సింధు మరోసారి అదరగొట్టింది. సెమీస్‌లో సింగపూర్ షట్లర్ ఇయో జియా మిన్ను ఓడించి ఫైనల్ చేరింది. కాగా క్వార్టర్ ఫైనల్లో సింధు మలేషియా షట్లర్ గో వె జిన్ను 19-21, 21-14, 21-18తో ఓడించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బర్మింగ్‌హామ్ వేదికగా ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్‌లో సింధు జియాతో సెమీస్‌లో పోటీపడింది. గాయం వేధిస్తున్నా.. హోరాహోరీగా సాగిన పోరులో సింధు ఆఖరికి పైచేయి సాధించింది. ప్రత్యర్థి నుంచి పోటీ ఎదురైనా తన అనుభవంతో ఒత్తిడిని జయించి పీవీ సింధు 21-19, 21-17తో గెలుపు నమోదు చేసింది. తద్వారా ఈ భారత షట్లర్ కామన్వెల్త్ గేమ్స్-2022 ఫైనల్లో ప్రవేశించింది. కాగా సింధు ఈ ఫీట్ నమోదు చేయడం వరుసగా ఇది రెండోసారి. అంతేకాదు.. తాజా ప్రదర్శనతో ఆమె ఈ ప్రతిష్టాత్మక క్రీడల్లో వరుసగా మూడో పతకాన్ని ఖాయం చేసుకుంది. కాగా 2018 కామన్వెల్త్ గేమ్స్‌లో సింధు రజత పతకం గెలిచిన విషయం తెలిసిందే. అదే విధంగా 2014లో కాంస్య పతకం అందుకుంది. ఇక ఇప్పుడు స్వర్ణ పతకానికి గురిపెట్టింది పూసర్ల వెంకట సింధు. ఈ క్రమంలో ఆమెకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రముఖ క్రికెట్ కామెంటేటర్ హర్షా భోగ్లే ట్విటర్ వేదికగా సింధును అభినందించాడు. భారత ప్రతిష్టను ఇనుమడింపజేస్తున్నారంటూ పీవీ సింధుతో పాటు కాంస్యం గెలిచిన జట్టులో భాగమైన హాకీ ప్లేయర్ సవితా పునియా, స్వర్ణం గెలిచిన బాక్సర్ నీతూ ఘంగస్ను కొనియాడాడు. ఈ మేరకు భారత మహిళా అథ్లెట్లు దేశాన్ని గర్వపడేలా చేస్తున్నారని ప్రశంసించాడు. చదవండి: Rohit Sharma: ఎనిమిదింటికి ఎనిమిది గెలిచేశాడు.. 5 క్లీన్‌స్వీప్‌లు.. నువ్వు తోపు కెప్టెన్! CWG 2022: భారత్ ఖాతాలో మరో స్వర్ణం.. చరిత్ర సృష్టించిన నీతు! PV Sindhu, Savita Punia, Nitu Ghanghas..Across sports, so many stars. India's women athletes are doing us proud. — Harsha Bhogle (@bhogleharsha) August 7, 2022 -
CWG: నన్ను క్షమించండి.. మహిళా రెజ్లర్ కన్నీటి పర్యంతం.. ప్రధాని మోదీ ట్వీట్!
Commonwealth Games 2022: భారత మహిళా రెజ్లర్ పూజా గెహ్లోత్‌పై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. పూజ సాధించిన పతకం ఆనందోత్సవాలకు కారణమవుతుందన్న ఆయన.. నువ్వు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదంటూ ఆమెను ఓదార్చారు. కాగా ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్ వేదికగా సాగుతున్న కామన్వెల్త్ గేమ్స్-2022లో పూజా గెహ్లోత్ కాంస్య పతకం సాధించింది. మహిళల ఫ్రీస్టయిల్ రెజ్లింగ్ (50 కేజీల) విభాగంలో కెనడాకు చెందిన మాడిసన్ బియాంక పార్క్స్ తో శనివారం జరిగిన సెమీ ఫైనల్లో పూజా ఓటమి పాలైంది. ఈ క్రమంలో స్కాట్లాండ్ రెజ్లర్ క్రిస్టెలీ లెమోఫాక్ లిచిద్జియోతో ప్లే ఆఫ్‌లో తలపడింది. ఇందులో భాంగా 12-2తో విజయం సాధించి కాంస్య పతకం గెలిచింది. అయితే, సెమీ ఫైనల్లో ఓటమితో తీవ్ర నిరాశకు గురైన పూజా.. మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగానికి లోనైంది. నన్ను క్షమించండి! తాను కాంస్య పతకానికే పరిమితమైనందుకు క్షమించాలంటూ కన్నీటి పర్యంతమైంది. ప్రతిష్టాత్మక క్రీడా వేదికపై జాతీయ గీతం వినిపించలేకపోయానంటూ భారతావనిని క్షమాపణలు కోరింది. ఈ మేరకు పూజా గెహ్లోత్ మాట్లాడుతూ.. ‘‘నేను సెమీ ఫైనల్ చేరుకున్నాను. కానీ ఓడిపోయాను. నా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలనుకుంటున్నా. జాతీయ గీతం వినిపించాలనుకున్నా.. కానీ అలా చేయలేకపోయాను.. నా తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుంటాను. వాటిని సరిదిద్దుకుంటాను’’ అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా వైరల్ అవుతోంది. ఈ వీడియోపై స్పందించిన ప్రధాని నరేంద్ర మోదీ పూజను అభినందిస్తూ ట్వీట్ చేశారు. ‘‘పూజా.. నీ పతకం సెలబ్రేషన్స్‌కు కారణమవుతుంది. క్షమాపణకు కాదు! నీ జీవిత ప్రయాణం మాకు ఆదర్శం. నీ విజయం మాకు సంతోషాన్నిచ్చింది. మరిన్ని గొప్ప విజయాలు అందుకోవాలి.. భవిష్యత్తు ఉజ్వలంగా వెలిగిపోవాలి’’ అంటూ పూజాకు అండగా నిలిచారు. నవీన్, రవి దహియా, వినేశ్ ఫొగట్ రెజ్లర్లు అదరగొట్టారు.. కామన్వెల్త్ గేమ్స్-2022లో భారత రెజ్లర్ అద్భుత విజయాలు అందుకున్నారు. ఈ క్రీడా విభాగంలో భారత్‌కు మొత్తంగా ఆరు స్వర్ణాలు, ఒక రజతం, ఐదు కాంస్య పతకాలు లభించాయి. స్టార్ రెజ్లర్లు బజరంగ్ పూనియా, దీపక్ పూనియా, సాక్షి మలిక్, వినేశ్ ఫొగట్, రవి దహియా, నవీన్ స్వర్ణ పతకాలతో మెరవగా... అన్షు మలిక్ రజతం... దివ్య కక్రాన్, మోహిత్ గ్రెవాల్, పూజా గెహ్లోత్, పూజా సిహాగ్, దీపక్ నెహ్రా కాంస్య పతకాలు గెలిచారు. చదవండి: Rohit Sharma-Rishabh Pant: పంత్ ప్రవర్తనపై రోహిత్ శర్మ ఆగ్రహం.. వీడియో వైరల్ Rohit Sharma: ఎవరైనా ఒకటీ రెండు మ్యాచ్‌లలో విఫలమవుతారు! అప్పుడు ఫెయిల్.. ఇప్పుడు హీరో! Pooja, your medal calls for celebrations, not an apology. Your life journey motivates us, your success gladdens us. You are destined for great things ahead…keep shining! ⭐️ https://t.co/qQ4pldn1Ff — Narendra Modi (@narendramodi) August 7, 2022 -
'అంచనాలకు మించి.. అదే చేత్తో కోహినూర్ వజ్రాన్ని'
కామన్వెల్త్ గేమ్స్ 2022లో భారత క్రీడాకారులు అంచనాలు మించి రాణిస్తున్నారు. ఇంతకముందు మనకు ఎన్నడూ రాని విభాగాల్లోనూ పతకాలు కొల్లగొడుతున్న ఆటగాళ్లు.. అచ్చొచ్చిన క్రీడల్లో స్వర్ణ పతకాలతో చెలరేగుతున్నారు. తొమ్మిది రోజులు ముగిసేసరికి భారత్ ఖాతాలో 40 పతకాలు ఉండగా.. అందులో 13 స్వర్ణాలు, 11 రజతాలు, 16 కాంస్యాలు ఉన్నాయి. కాగా ఇందులో 22 పతకాలు కేవలం రెండు క్రీడల్లోనే రావడం విశేషం. రెజ్లింగ్‌లో 12 పతకాలు రాగా.. వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో 10 పతకాలు వచ్చి చేరాయి. ఇంకో విశేషమేమిటంటే.. రెజ్లింగ్ విభాగంలో మనవాళ్లు 12 మంది పోటీ పడితే.. 12 మంది పతకాలు తేవడం విశేషం. అందులో భజరంగ్ పూనియా, రవి దహియా, వినేష్ పొగాట్, దీపక్ పూనియాలు స్వర్ణాలు గెలిచారు. ఇక పదోరోజు కూడా భారత్ ఖాతాలో దండిగానే పతకాలు వచ్చి చేరనున్నాయి. మరి సోమవారంతో ముగియనున్న కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ ఎన్ని పతకాలు కొల్లగొడుతుందనేది వేచి చూడాలి. కాగా కామన్వెల్త్లో భారత క్రీడాకారుల ప్రదర్శనపై మాజీ ఆటగాళ్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. పతకాల కోసం పోటీ పడడం ఆనందాన్ని కలిగిస్తుందంటూ కామెంట్స్ చేశారు. ఈ నేపథ్యంలోనే టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ చేసిన ఒక ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ''కామన్వెల్త్ గేమ్స్‌లో భారత అథ్లెట్లు అద్బుత ప్రదర్శన కనబరుస్తున్నారు. అంచనాలకు మంచి రాణిస్తూ పతకాల పంట పండిస్తున్నారు. అదే చేత్తో బ్రిటీష్ వాళ్లు పట్టుకెళ్లిన మన కోహినూర్ వజ్రాన్ని కూడా తీసుకురండి'' అంటూ కామెంట్ చేశాడు. కామన్వెల్త్ గేమ్స్‌తో పాటు వెస్టిండీస్ గడ్డపై రోహిత్ సేన టి20 సిరీస్ గెలవడంపై కూడా జాఫర్ ట్వీట్ చేశాడు.''విదేశీ గడ్డపై మరో సిరీస్ గెలిచినందుకు రోహిత్ సేనకు కంగ్రాట్స్. జట్టులో ఆటగాళ్లందరు ఒకరినొకరు సహకరించుకుంటూ బ్యాట్, బంతితో ఆల్‌రౌండ్ ప్రదర్శన చేసి ఆకట్టుకున్నారు. వెల్డన్'' అంటూ ట్వీట్ చేశాడు. ఇక టీమిండియా ఇవాళ విండీస్‌తో చివరి టి20 మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్‌ను విజయంతో ముగించి సిరీస్‌ను 4-1తో కైవసం చేసుకోవాలనే యోచనలో ఉంది. Indian athletes are doing so well at the Commonwealth Games that at this rate they might even bring the Kohinoor back 😄 #CWG2022 #IndiaAt75 — Wasim Jaffer (@WasimJaffer14) August 6, 2022 Congratulations @ImRo45 and Team India on another series win 👏🏽 Total team effort with both bat and ball with almost everyone contributing. #WIvIND — Wasim Jaffer (@WasimJaffer14) August 6, 2022 DISTINGUISHED WRESTLER VINESH🥇 Watch moments from the medal ceremony. Our champ @Phogat_Vinesh Looked fantastic with 🥇 Proud of you Girl! #Cheer4India#India4CWG2022@PMOIndia @ianuragthakur @NisithPramanik @CGI_Bghm @ddsportschannel @SonySportsNetwk @IndiaSports pic.twitter.com/8mocOYGxj9 — SAI Media (@Media_SAI) August 7, 2022 🇮🇳's Dhakad youth wrestler Naveen' s confidence is worth the applaud 👏 Watch moments from his medal🥇 ceremony 👇 Congratulations 👏 #Cheer4India#India4CWG2022@PMOIndia @ianuragthakur @NisithPramanik @IndiaSports @YASMinistry @CGI_Bghm pic.twitter.com/44XpKWcXYk — SAI Media (@Media_SAI) August 7, 2022 PLAYING FOR G🥇LD!!#Tokyo2020 Olympian and Gold🥇 Medalist at #B2022, @ravidahiya60 steals the show🤩 Watch his winning moment🏅 from yesterday's match👇#Cheer4India🇮🇳#India4CWG2022 🤟@PMOIndia @ianuragthakur @NisithPramanik @CGI_Bghm @IndiaSports @YASMinistry pic.twitter.com/oaZK41S6zr — SAI Media (@Media_SAI) August 7, 2022 చదవండి: చరిత్రకు అడుగుదూరంలో.. ఫైనల్లో తలపడనున్న భారత్, ఆస్ట్రేలియా CWG 2022: స్వర్ణంతో మెరిసిన భవీనాబెన్ పటేల్ -
చరిత్రకు అడుగుదూరంలో.. ఫైనల్లో తలపడనున్న భారత్, ఆస్ట్రేలియా
కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణ పతకం సాధించడానికి భారత మహిళల జట్టు ఒక్క అడుగుదూరంలో ఉంది. ఆగస్టు 8(ఆదివారం) రాత్రి జరగనున్న ఫైనల్లో ఆస్ట్రేలియాను భారత్ ఎదుర్కోనుంది. ముఖాముఖి రికార్డులో భారత్‌పై ఆస్ట్రేలియాదే పైచేయి అయినప్పటికి.. ఆత్మవిశ్వాసంతో ఉన్న భారత్‌ను ఆసీస్ ఏ మేరకు నిలువరిస్తుందనే వేచి చూడాలి. భారత మహిళా బ్యాటర్లలో స్మృతి మంధాన, జేమీమా రోడ్రిగ్స్‌లు తమ కెరీర్లో అత్యున్నత ఫామ్‌లో ఉండగా.. బౌలింగ్‌లో రేణుకా సింగ్ తన మిస్టరీ బౌలింగ్‌తో ప్రత్యర్థులను ముప్పతిప్పలు పెడుతుంది. ఒకవేళ భారత్ గెలిస్తే మాత్రం చరిత్ర సృష్టించినట్లే. కామన్వెల్త్ గేమ్స్‌లో మహిళల విభాగంలో క్రికెట్‌ను ప్రవేశపెట్టిన తొలిసారే పతకం సాధించిన జట్టుగా భారత మహిళల జట్లు కొత్త రికార్డు నెలకొల్పనుంది. సెమీస్‌లో న్యూజిలాండ్‌పై ఆస్ట్రేలియా గెలుపు ఇక శనివారం న్యూజిలాండ్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన రెండో సెమీఫైనల్లో ఆసీస్ మహిళలు 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ మహిళలు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. సోఫీ డివైన్ 53 పరుగులతో టాప్ స్కోరర్ కాగా.. అమేలియా ఖేర్ 40 పరుగులతో రాణించింది. ఆసీస్ బౌలర్లలో స్కాట్ 3, తాహిలా మెక్‌గ్రాత్ 2 వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా మహిళలు 19.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. బెత్ మూనీ 36, తాహిలా మెక్‌గ్రాత్ 34 పరుగులు చేశారు. చదవండి: Obed Mccoy: మొన్న 'భయపెట్టాడు'.. ఇవాళ 'భయపడ్డాడు' Katherine Brunt CWG 2022: ఇంగ్లండ్ బౌలర్‌కు షాకిచ్చిన ఐసీసీ -
ఇంగ్లండ్ బౌలర్‌కు షాకిచ్చిన ఐసీసీ
ఇంగ్లండ్ మహిళా ఫాస్ట్ బౌలర్ కేథరిన్ బ్రంట్‌కు ఐసీసీ షాకిచ్చింది. మ్యాచ్ సమయంలో అసభ్య పదజాలం ఉపయోగించి ఐసీసీ నియమావళి లెవెల్-1 నిబంధనను ఉల్లంఘించినందుకు గానూ కేథరిన్‌ను హెచ్చరించడమే గాక మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత విధించింది. ఇక డిసిప్లీనరి యాక్ట్ కింద ఒక పాయింట్ కోత విధించింది. ఏడాది కాలంలో కేథరిన్ బ్రంట్ ఐసీసీ నిబంధన ఉల్లఘించడం ఇది రెండోసారి. ఇప్పటికే రెండు డీమెరిట్ పాయింట్లు ఉండడంతో.. మరోసారి నిబంధన ఉల్లంఘిస్తే మాత్రం ఒక మ్యాచ్ నిషేధం ఎదుర్కొనే అవకాశం ఉంది. విషయంలోకి వెళితే.. శనివారం ఇంగ్లండ్, టీమిండియా మహిళల మధ్య కామన్వెల్త్ గేమ్స్ సెమీఫైనల్ మ్యాచ్ జరిగింది. భారత బ్యాటింగ్ సమయంలో ఇన్నింగ్స్ 17వ ఓవర్ కేథరిన్ బ్రంట్ వేసింది. దీప్తి శర్మ ఇచ్చిన క్యాచ్‌ను ఫీల్డర్ విడిచిపెట్టడంతో కేథరిన్ అసభ్య పదజాలం ఉపయోగిస్తూ కోపంగా అరిచింది. ఆమె వ్యాఖ్యలు స్టంప్ మైక్‌లో రికార్డ్ అయ్యాయి. దీంతో మ్యాచ్ అనంతరం ఐసీసీ నిబంధనల ప్రకారం ఆర్టికల్ 2.3 నిబంధన ఉల్లఘించిన కేథరిన్ బ్రంట్‌కు హెచ్చరిస్తూ ఒక డీమెరిట్ పాయింట్ విధిస్తున్నట్లు మ్యాచ్ రిఫరీ స్పష్టం చేశారు. తొలిసారిగా కామన్వెల్త్ క్రీడల్లో ప్రవేశపెట్టిన మహిళల టి20 క్రికెట్లో భారత జట్టు సత్తా చాటింది. ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరుస్తూ హర్మన్‌ప్రీత్ బృందం ఫైనల్లోకి అడుగు పెట్టింది. ఫలితంగా స్వర్ణం లేదా రజత పతకం గెలుచుకోవడం ఖాయమైంది. శనివారం ఆసక్తికరంగా జరిగిన తొలి సెమీఫైనల్లో ఆతిథ్య ఇంగ్లండ్ జట్టుపై భారత్ 4 పరుగుల తేడాతో గెలిచింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. స్మృతి మంధాన (32 బంతుల్లో 61; 8 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీతో చెలరేగగా, జెమీమా రోడ్రిగ్స్ (31 బంతుల్లో 44 నాటౌట్; 7 ఫోర్లు) రాణించింది. మహిళల అంతర్జాతీయ టి20ల్లో భారత్ తరఫున వేగవంతమైన అర్ధ సెంచరీ (23 బంతుల్లో)ని స్మృతి నమోదు చేయడం విశేషం. అనంతరం ఇంగ్లండ్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 160 పరుగులే చేయగలిగింది. ఆఖరి ఓవర్లో గెలుపు కోసం 14 పరుగులు చేసే ప్రయత్నంలో ఇంగ్లండ్ 9 పరుగులు మాత్రమే రాబట్టగలిగింది. స్పిన్నర్లు స్నేహ్ రాణా (2/28), దీప్తి శర్మ (1/18) ప్రత్యర్థిని కట్టడి చేయడంలో సఫలమయ్యారు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్ల మధ్య రెండో సెమీఫైనల్ విజేతతో తుది పోరులో భారత తలపడుతుంది. భారత కాలమానం ప్రకారం నేడు రాత్రి 9 గంటల 30 నిమిషాలకు ఫైనల్ మొదలవుతుంది. కాంస్య పతక మ్యాచ్ మధ్యాహ్నం గం. 3:30 నుంచి జరుగుతుంది. చదవండి: Commonwealth Games 2022: క్రికెట్లో కనకంపై గురి మంధాన ఊచకోత.. టీ20ల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ నమోదు -
థ్రిల్లింగ్ మ్యాచ్‌లో గెలుపు.. ఫైనల్‌కు భారత పురుషుల హాకీ జట్టు
భారత పురుషుల హాకీ జట్టు కామన్వెల్త్ గేమ్స్ 2022లో తమ జోరును ప్రదర్శిస్తోంది. శనివారం రాత్రి దక్షిణాఫ్రికాతో జరిగిన ఉత్కంఠభరిత సెమీఫైనల్లో 3-2 తేడాతో గెలిచి ఫైనల్లోకి ప్రవేశించిన భారత్ స్వర్ణ పతకానికి అడుగుదూరంలో నిలిచింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే తొలి క్వార్టర్లో ఇరుజట్లు గోల్ చేయలేకపోయాయి. అయితే రెండో క్వార్టర్ ఆరంభంలోనే అభిషేక్ గోల్ కొట్టడంతో భారత్ ఖాతాలో తొలి గోల్ నమోదైంది. ఆ తర్వాత మణిదీప్ సింగ్ మరో గోల్ మెరవడంతో భారత్ 2-0తో ఆధిక్యంలో వెళ్లింది. ఇక మూడో క్వార్టర్లో సౌతాఫ్రికా తరపున రెయాన్ జూలిస్ గోల్ కొట్టడంతో భారత్ ఆధిక్యం 2-1కి తగ్గింది. నాలుగో క్వార్టర్ మొదలైన రెండో నిమిషంలోనే డ్రాగ్ ఫ్లికర్ జుగ్రాజ్ గోల్ కొట్టడంతో భారత్ 3-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఇక సౌతాఫ్రికా తరపున రెండో గోల్ నమోదు చేసింది. అయితే చివర్లో కాస్త ఉత్కంఠ నెలకొన్నప్పటికి భారత్ ప్రత్యర్థిని గోల్స్ చేయకుండా అడ్డుకొని ఫైనల్లోకి ప్రవేశించింది. చదవండి: CWG 2022: స్వర్ణంతో మెరిసిన భవీనాబెన్ పటేల్ -
CWG 2022: స్వర్ణంతో మెరిసిన భవీనాబెన్ పటేల్
బర్మింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2022లో శనివారం భారత స్టార్ పారా టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి భావినా పటేల్ మహిళల సింగిల్స్ 3-5తో స్వర్ణ పతకం సాధించింది. టోక్యో పారాలింపిక్స్‌లో రజతం గెలిచిన గుజరాత్‌కు చెందిన 35 ఏళ్ల యువకుడు 12-10 11-2 11-9తో నైజీరియాకు చెందిన ఇఫెచుక్వుడే క్రిస్టియానా ఇక్‌పెయోయ్‌పై విజయం సాధించి క్వాడ్రినియెల్ ఈవెంట్లో అద్భుతమైన ప్రదర్శనను కనబరిచింది. ఇక సోనాల్‌బెన్ మనుభాయ్ పటేల్ కూడా మహిళల సింగిల్స్ క్లాస్‌లో 3-5తో కాంస్యం సాధించి భారత్‌కు పతకాన్ని అందించింది. 34 ఏళ్ల భారత ఆటగాడు కాంస్య పతక ప్లే ఆఫ్‌లో ఇంగ్లండ్‌కు చెందిన స్యూ బెయిలీపై 11-5 11-2 11-3 తేడాతో విజయం సాధించారు. అయితే, పురుషుల సింగిల్స్ తరగతుల్లో రాజ్ అరవిందన్ అళగర్ 0-3తో నైజీరియాకు చెందిన ఇసౌ ఒగున్‌కున్లే చేతిలో 3-5తో కాంస్య పతక ప్లే-ఆఫ్‌తో ఓడిపోయాడు. కాగా కామన్వెల్త్ గేమ్మ్ తొమ్మిదో రోజు భారత్ మూడు స్వర్ణాలు సాధించింది. పలు కాంస్య పతకాలు గెలుచుకుంది. మొత్తం ఇప్పటివరకు కామన్వెల్త్ గేమ్స్ 2022 లో భారత్ 40 మెడల్స్‌తో ఐదో స్థానంలో ఉండగా.. అందులో 13 స్వర్ణం, 11 రజతం, 16 కాంస్యం ఉన్నాయి. Our country is constantly being brought up with the stellar performance of Indian sports talent in #CommonwealthGames2022. In this sequence, in the Para Table-Tennis match, Gujarat's pride, Bhavinaben Patel, won the GOLD🏅medal and made the nation proud. You are a champion 👏 pic.twitter.com/ANWtyMiksA — Sports Authority of Gujarat (@sagofficialpage) August 6, 2022 చదవండి: Commonwealth Games 2022: ‘పసిడి’కి పంచ్ దూరంలో... -
ఆట ఏదైనా ఒక్కటే.. అంపైర్ల చీటింగ్ మాత్రం మారదు
కామన్వెల్త్ గేమ్స్‌లో భారత మహిళల హాకీ జట్టు శుక్రవారం ఆస్ట్రేలియా మహిళలతో జరిగిన సెమీఫైనల్లో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. పెనాల్టీ షూటౌట్లో భాగంగా ఆసీస్ చేతిలో భారత్ 3-0తో పరాజయం చవిచూసింది. అయితే పెనాల్టీ షూటౌట్ ప్రారంభానికి జరిగిన ఒక చిన్న తప్పిదం భారత మహిళలను ఓటమి వైపు నడిపించింది. విషయంలోకి వెళితే.. మ్యాచ్ ముగిసే సమయానికి ఇరుజట్లు 1-1తో సమంగా నిలిచాయి. దీంతో పెనాల్టీ షూటౌట్ అనివార్యమైంది. ఆస్ట్రేలియా డిపెండర్ అంబ్రోషియా మలోనే షూటౌట్‌కు సిద్దమైంది. ఆమె షాట్ ఆడగా.. భారత గోల్‌కీపర్ సవితా అడ్డుకుంది. అలా ఆసీస్ ఒక పెనాల్టీ వృథా చేసుకుందని మనం సంతోషించేలోపే అంపైర్ మధ్యలో దూరింది. సారీ.. షూటౌట్ క్లాక్ టైంలో తప్పిదం ఉందని.. మళ్లీ ప్రారంభించాలని చెప్పింది. అప్పటికే షూటౌట్ చేయడానికి వచ్చిన భారత క్రీడాకారిణికి విషయం చెప్పి అక్కడి నుంచి పంపించేసి మల్లీ అంబ్రోషియాను పిలిచింది. తొలిసారి మిస్ అయిన అంబ్రోషియా ఈసారి మాత్రం గురి తప్పలేదు. ఆ తర్వాత ఆస్ట్రేలియా వరుసగా మూడు గోల్స్ కొట్టగా.. భారత్ మాత్రంఒక్క గోల్ చేయలేకపోయింది. అలా భారత మహిళల హాకీ జట్టు ఫైనల్ చేరడంలో విఫలమైంది. అయితే పెనాల్టీ షూటౌట్ సమయంలో అంపైర్ విధానంపై అన్ని వైపుల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆడుతున్నది ఒక సెమీఫైనల్ మ్యాచ్ అని మరిచిపోయి.. క్లాక్‌టైం మిస్టేక్ అని చెప్పడం సిల్లీగా ఉందని.. అంపైర్ కావాలనే ఇలా చేసిందేమో అంటూ కామెంట్స్ చేశారు. ఇదే విషయమే టీమిండియా మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ కూడా అంపైర్ తీరుపై ఘాటుగా స్పందించాడు. ''ఆస్ట్రేలియాకు పెనాల్టీ మిస్ కాగానే అంపైర్ పరిగెత్తుకొచ్చి.. సారీ క్లాక్ ఇంకా స్టార్ట్ చెయ్యలేదు.. మళ్లీ ఆరంభిద్దామా అని సింపుల్‌గా చెప్పేసింది. అంపైర్లు ఇలా ఎందుకుంటారో అర్థం కావడం లేదు. క్రికెట్.. హాకీ ఇలా ఏదైనా ఒక్కటే.. అంపైర్లు తమకుండే సూపర్ పవర్‌తో ఎలాంటి నిర్ణయమైనా తీసుకుంటారు. ఇలాంటివి క్రికెట్లో బాగా జరిగేవి.. అందుకే మేం హాకీలోకి కూడా త్వరలోనే ఎంటరవుతాం.. అమ్మాయిలు.. ఓడిపోయారు పర్లేదు.. మిమ్మల్ని చూస్తే గర్వంగా ఉంది.'' అంటూ క్యాప్షన్ జత చేశాడు. మరోవైపు భారత్- ఆస్ట్రేలియా వుమెన్స్ మధ్య జరిగిన సెమీస్ మ్యాచ్‌పై విమర్శలు పెరగడంతో అంతర్జాతీయ హాకీ ఫెడరేషన్ కూడా స్పందించింది. ''కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్- ఆస్ట్రేలియా సెమీఫైనల్లో షూటౌట్ చిన్న తప్పిదం వల్ల క్లాక్ సెట్ చేయకముందే ప్రారంభమయింది. అందుకే మళ్లీ ప్రారంభించాం. ఈ తప్పిదానికి మేం క్షమించమని కోరుతున్నాం. ఇలాంటివి జరగకుండా జాగ్రత్తపడతాం.'' అని కామెంట్ చేసింది. కాగా సెమీస్‌లో ఓడినప్పటికి భారత మహిళల హాకీ జట్టుకు కాంస్య పతక పోరుకు సిద్ధమవనుంది. మరో సెమీఫైనల్లో ఇంగ్లండ్ న్యూజిలాండ్‌పై 2-0 తేడాతో విజయం సాధించి ఫైనల్ పోరుకు అర్హత సాధించింది. ఇక కాంస్య పతక పోరులో భాగంగా ఆదివారం భారత్, న్యూజిలాండ్ మహిళల జట్లు పోటీ పడనున్నాయి. Penalty miss hua Australia se and the Umpire says, Sorry Clock start nahi hua. Such biasedness used to happen in cricket as well earlier till we became a superpower, Hockey mein bhi hum jald banenge and all clocks will start on time. Proud of our girls 🇮🇳pic.twitter.com/mqxJfX0RDq — Virender Sehwag (@virendersehwag) August 6, 2022 My heart goes out to the Indian women’s hockey team who fought like bravehearts against Australia. No shame in losing in penalties to the Aussies. Our ladies gave everything on the pitch. As fans, we cannot expect more. Really proud of the this team. 🇮🇳🏑❤️ — Viren Rasquinha (@virenrasquinha) August 5, 2022 చదవండి: 'నా సుత్తిని అవలీలగా ఎత్తేస్తుందేమో'.. మీరాబాయిపై 'థోర్' ప్రశంసలు -
'నా సుత్తిని అవలీలగా ఎత్తేస్తుందేమో'.. మీరాబాయిపై 'థోర్' ప్రశంసలు
భారత మహిళా వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చానుపై హాలివుడ్ స్టార్.. థోర్(క్రిస్ ఎమ్‌స్వర్త్) ప్రశంసల జల్లు కురిపించాడు. ఇటీవలే కామన్వెల్త్ గేమ్స్ 2022లో భారత్‌కు తొలి స్వర్ణం అందించిన మీరాబాయి ప్రదర్శనను మెచ్చుకుంటూ ట్వీట్ చేశాడు. మార్వెల్ కామిక్స్‌లో థోర్ పాత్ర చేతిలో ఉండే సుత్తి చాలా బరువు ఉంటుంది. ఆ సుత్తిని అతను తప్ప ఎవరూ ఎత్తలేరు. అందుకే చాను సాధించిన విజయాన్ని కీర్తిస్తూ..'' ఎంత బరువైనా ఎత్తేస్తుంది.. థోర్ ఇక నీ సుత్తిని వదిలేయాల్సిన సమయం వచ్చేసింది.'' అన్నట్టుగా క్రిస్ హెమ్స్ను ట్యాగ్ చేశాడు సదరు అభిమాని. అభిమాని చేసిన ట్వీట్‌పై హెమ్స్‌వర్త్ స్పందించాడు. ''ఇక నేను సుత్తిని వదిలి వేయాల్సిన సమయం ఆసన్నమైంది. ఎందుకంటే ఆమె నా సుత్తిని కూడా అవలీలగా ఎత్తేస్తుందేమో. అయినా అందుకు ఆమె అర్హురాలే. కంగ్రాట్స్.. సికోమ్.. నువ్వొక లెజెండ్'' అంటూ కామెంట్ చేశాడు. ఇక టోక్యో ఒలింపిక్స్‌లో వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో రజత పతకం సాధించిన మీరాబాయి చానూ కామన్వెల్త్ గేమ్స్‌లో బంగారు పతకం ఒడిసి పట్టింది. గత శనివారం 49 కేజీల విభాగంలో జరిగిన వెయిట్‌లిఫ్టింగ్ ఫైనల్లో మీరాబాయి చాను స్నాచ్‌లో 88 కేజీలు, క్లీన్ అండ్ జర్క్‌లో 113 కేజీలు (మొత్తం 201 కేజీలు) ఎత్తి పసిడి పతకం అందుకుంది. కాగా స్నాచ్ విభాగంలో 90 కేజీల బరువు ఎత్తాలని టార్గెట్‌గా పెట్టుకుంది మీరాబాయి చాను. కానీ స్నాచ్ మొదటి, రెండో ప్రయత్నంలో 84, 88 కేజీలు ఎత్తిన చాను మూడో ప్రయత్నంలో 90 కేజీలకు ప్రయత్నించి విఫలమైంది. క్లీన్ అండ్ జర్క్‌లో కూడా 109, 113 కేజీల తర్వాత 115 కేజీలకు ప్రయత్నించి ఎత్తలేకపోయింది. She is worthy! Congrats, Saikhom, you legend. — Chris Hemsworth (@chrishemsworth) August 4, 2022 చదవండి: Commonwealth Games 2022: పసిడి పట్టు.. ఆరు పతకాలతో మెరిసిన భారత రెజ్లర్లు Lifting 201kg never felt easy but thanks to the love and wishes of billions back home, every challenge is just an attempt away. 🇮🇳#WeAreTeamIndia #TeamIndia pic.twitter.com/GnyaftZkpv — Saikhom Mirabai Chanu (@mirabai_chanu) July 30, 2022 -
కామన్వెల్త్ గేమ్స్ చరిత్రలో స్వర్ణం నెగ్గిన అతిపెద్ద వయస్కుడిగా
స్కాట్లాండ్కు చెందిన జార్జ్ మిల్లర్ ‘లేట్ వయసు’లో గ్రేట్ అనిపించుకున్నాడు. 75 ఏళ్ల 8 నెలల జార్జ్ ‘లాన్ బౌల్స్’ మిక్స్డ్ పెయిర్లో బంగారు పతకం సాధించాడు. మెలనీ ఇన్నెస్‌తో కలిసి విజేతగా నిలిచాడు. తద్వారా కామన్వెల్త్ గేమ్స్ చరిత్రలో పసిడి పతకం నెగ్గిన అతిపెద్ద వయస్కుడిగా రికార్డు నెలకొల్పాడు. క్వార్టర్ ఫైనల్లో సింధు, శ్రీకాంత్ బ్యాడ్మింటన్ ఈవెంట్లో మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో పీవీ సింధు (భారత్) 21–10, 21–9తో కొబుగెబ్ (ఉగాండా)పై... పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో కిడాంబి శ్రీకాంత్ (భారత్) 21–9, 21–12తో దిమిందు అబెవిక్రమ (శ్రీలంక)పై గెలిచి క్వార్టర్ ఫైనల్ చేరారు. మహిళల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ (భారత్) జంట 21–2, 21–4తో జెమీమా –గనెసా ముంగ్రా (మారిషస్) జోడీని ఓడించింది. 4X400 రిలే ఫైనల్లో భారత్: అథ్లెటిక్స్ పురుషుల 4్ఠ400 మీటర్ల రిలే విభాగంలో అనస్, నోవా నిర్మల్, అజ్మల్, అమోజ్ జేకబ్‌లతో కూడిన భారత బృందం ఫైనల్ చేరింది. మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి జ్యోతి యెర్రాజీ 13.18 సెకన్లలో లక్ష్యానికి చేరి ఓవరాల్‌గా పదో స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత పొందలేకపోయింది. సెమీస్‌లో శ్రీజ: టేబుల్ టెన్నిస్ (టీటీ) మిక్స్డ్ డబుల్స్‌లో తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ–ఆచంట శరత్ కమల్ (భారత్) ద్వయం క్వార్టర్ ఫైనల్లో 11–7, 8–11, 11–8, 11–13, 11–9తో ఫిచ్‌ఫోర్డ్–హో టిన్టిన్ (ఇంగ్లండ్) జంటపై నెగ్గి సెమీఫైనల్ చేరింది. మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో శ్రీజ 9–11, 11–4, 6–11, 9–11, 11–5, 11–4, 11–8తో మో జాంగ్ (కెనడా)పై గెలిచి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. -
భారత్‌తో సెమీఫైనల్.. ఇంగ్లండ్‌కు భారీ షాక్! కెప్టెన్ దూరం!
భారత మహిళలతో సెమీ ఫైనల్‌కు ముందు ఇంగ్లండ్‌కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ హీథర్ నైట్ గాయం కారణంగా కామన్వెల్త్ గేమ్స్-2022 నుంచి వైదొలిగింది. అదే విధంగా త్వరలో జరగనున్న ది హండ్రెడ్ లీగ్‌కు కూడా ఆమె దూరమైంది. ఈ విషయాన్ని ట్విటర్ వేదికగా ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. "ఇంగ్లండ్ మహిళల జట్టు కెప్టెన్ హీథర్ నైట్ గాయం కారణంగా కామన్వెల్త్ గేమ్స్, ది హండ్రెడ్ లీగ్‌కు దూరం కానుంది. దక్షిణాఫ్రికా సిరీస్‌లో గాయపడ్డ నైట్ ఇంకా పూర్తిగా కోలుకోలేదు. ఆమె ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉంది. అదే విధంగా మిగితా మ్యాచ్‌లకు కూడా నాట్ స్కివర్ కెప్టెన్‌గా కొనసాగనుంది" అని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ట్విటర్లో పేర్కొంది. కాగా కామన్వెల్త్ గేమ్స్‌కు ప్రకటించిన ఇంగ్లండ్ జట్టుకు కెప్టెన్‌గా నైట్ ఎంపికైనప్పటికీ.. ఇప్పటి వరకు బెంచ్‌కే పరిమితమైంది. ఇక భారత్-ఇంగ్లండ్ మధ్య తొలి సెమీఫైనల్ ఎడ్జ్‌బాస్టన్ వేదికగా శనివారం(ఆగస్టు 6) జరగనుంది. తుది జట్లు(అంచనా) ఇంగ్లండ్ మహిళల జట్టు: డేనియల్ వ్యాట్, సోఫియా డంక్లీ, ఆలిస్ క్యాప్సే, నటాలీ స్కివర్ (కెప్టెన్), అమీ జోన్స్ (వికెట్ కీపర్), మైయా బౌచియర్, కేథరీన్ బ్రంట్, సోఫీ ఎక్లెస్టోన్, ఫ్రెయా కెంప్, ఇస్సీ వాంగ్, సారా గ్లెన్ భారత మహిళల జట్టు: షఫాలీ వర్మ, స్మృతి మంధాన, జెమిమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), యస్తికా భాటియా (వికెట్ కీపర్), దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్, రాధా యాదవ్, స్నేహ రాణా, మేఘనా సింగ్, రేణుకా సింగ్ England Women’s captain Heather Knight has been ruled out of the Commonwealth Games and The Hundred. The hip injury she sustained in the first Vitality IT20 against South Africa has failed to settle down as expected and Knight will continue to receive treatment. pic.twitter.com/iTJA17nXkU — England Cricket (@englandcricket) August 3, 2022 చదవండి: Chris Gayle: క్రిస్ గేల్ అభిమానులకు గుడ్ న్యూస్.. మళ్లీ యునివర్స్ బాస్ మెరుపులు! -
CWG: బాల్‌రాజ్ ఏంటిది? చొక్కాలు పట్టుకుని కొట్టుకున్న ఆటగాళ్లు.. వైరల్
కామన్వెల్త్ గేమ్స్-2022లో దురదృష్టకర ఘటన చోటుచేసుకుంది. ప్రతిష్టాత్మక క్రీడల్లో పోటీ పడుతున్నామనే విషయం మరిచి ఇద్దరు హాకీ ఆటగాళ్లు బాహాబాహీకి దిగారు. చొక్కాలు పట్టుకుని ఒకరినొకరు నెట్టేసుకున్నారు. సహచర ఆటగాళ్లు వచ్చి వారిని విడదీయకపోతే అలాగే కొట్టుకునేవాళ్లేమో! ఇంతకీ ఏం జరిగిందంటే.. సెమీస్‌కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లండ్... గురువారం కెనడాతో తలపడింది. పూల్ బీలో జరిగిన ఈ మ్యాచ్‌లో హాఫ్‌టైమ్ ముగియడానికి కొన్ని నిమిషాల ముందు కెనడా ప్లేయర్ బాల్‌రాజ్ పనేసర్, ఇంగ్లండ్ ఆటగాడు క్రిస్ గ్రిఫిత్స్ మధ్య వివాదం తలెత్తింది. అప్పటికే ఇంగ్లండ్ 4-1తో ఆధిక్యంలో ఉంది. ఆట కొనసాగుతుండగా గ్రిఫిత్స్ బంతిని తీసుకునే ప్రయత్నం చేయగా.. పనేసర్ అడ్డుకున్నాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య తలెత్తిన వివాదం.. ఒకరినొకరు చొక్కాలు పట్టుకునే స్థాయికి వెళ్లింది. ఒకానొక సమయంలో పనేసర్.. గ్రిఫిత్స్ గొంతు కూడా పట్టుకున్నాడు. ఇద్దరి మధ్య కాసేపు ఘర్షణ జరిగింది. దీంతో సహచర ఆటగాళ్లు వచ్చి ఇద్దరినీ విడదీశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హాకీలో రెజ్లింగ్.. ఒకే టికెట్‌పై రెండు ఆటలు అంటూ నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ఇక ఈ ఘటనలో బాల్‌రాజ్‌కు అంపైర్ రెడ్ కార్డ్ చూపడంతో మైదానాన్ని వీడగా.. గ్రిఫిత్స్‌కు యెల్డో కార్డ్ జారీ అయింది. మ్యాచ్ విషయానికొస్తే.. 11-2తో కెనడాను ఓడించిన ఇంగ్లండ్ సెమీస్ చేరింది. ఆస్ట్రేలియాతో సెమీస్ పోరులో అమీతుమీ తేల్చుకోనుంది. మరోవైపు.. భారత్ సైతం వేల్స్‌పై 4-1తో గెలుపొంది సెమీ ఫైనల్ చేరుకుంది. వైస్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ హ్యాట్రిక్ గోల్స్‌తో రాణించడంతో అద్భుత విజయం అందుకుంది. చదవండి: WC 2022: ఓపెనర్‌గా పంత్, ఇషాన్.. సూర్య కాదు! అతడే సరైనోడు! జట్టులో చోటే లేదే! SreeShankar Won Silver CWG 2022: మేజర్ సర్జరీ.. లాంగ్ జంప్ చేయొద్దన్నారు; ఎవరీ మురళీ శ్రీశంకర్? Thanks to @JaspreetSSahni for showing me a new sport that combines Hockey and Wrestling pic.twitter.com/UiRopSLNfQ — Digvijay Singh Deo (@DiggySinghDeo) August 4, 2022 -
మేజర్ సర్జరీ.. లాంగ్ జంప్ చేయొద్దన్నారు; ఎవరీ మురళీ శ్రీశంకర్?
ఒక ఇంట్లో తండ్రి మంచి క్రీడాకారుడైనంత మాత్రాన అతడి వారసులు(కొడుకు లేదా కూతురు) అలాగే అవ్వాలని ఎక్కడా రాసిపెట్టి ఉండదు. అయితే, కొంతమంది తల్లిదండ్రులు మాత్రం తమ వారసులు కూడా క్రీడాకారులు అవ్వాలని.. రాణించాలని ఆశపడుతుంటారు. మరికొంత మంది మాత్రం తాము ఏం కావాలనుకుంటున్నామో అన్న నిర్ణయాన్ని పిల్లలకే వదిలేస్తారు. ఆ ప్రయత్నంలో కొంతమంది పిల్లలు విఫలమైతే.. మరికొందరు మాత్రం వారసత్వాన్ని కొనసాగిస్తూ దూసుకుపోతారు. ఆ కోవకు చెందినవాడే భారత్ హై జంప్ స్టార్ అథ్లెట్ మురళీ శ్రీశంకర్. తన అపూర్వ విజయంతో తల్లిదండ్రులతో పాటు యావత్ భారతావనిని గర్వపడేలా చేశాడు. బర్మింగ్హమ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2022లో హై జంప్ విభాగంలో జరిగిన ఫైనల్స్‌లో ఐదో ప్రయత్నంలో 8.08 మీటర్లు దూకి రజతం ఒడిసిపట్టాడు. ఇక శ్రీశంకర్ ఆర్థికంగా ఏనాడు ఇబ్బంది పడనప్పటికి.. ఈరోజు పతకం సాధించాడంటే అందులో తన పాత్ర ఎంత ఎందో.. కుటుంబానికి అంతే ప్రాధాన్యత ఉంటుంది. 23 ఏళ్ల మురళీ శ్రీ శంకర్ కేరళలోని పాలక్కడ్ ప్రాంతంలో పుట్టి పెరిగాడు. తల్లిదండ్రులిద్దరు క్రీడాకారులే కావడం శ్రీశంకర్‌కు కలిసి వచ్చింది. తల్లి కెఎస్ బిజ్మోల్ 800 మీటర్ల క్రీడాకారిణి.. తండ్రి ఎకోస్ బిజ్మోల్ అథ్లెటిక్స్ కోచ్‌గా పని చేస్తున్నాడు. ఇంకేముంది తల్లిదండ్రులిద్దరు క్రీడా విభాగంతో పరిచయం ఉంటే శ్రీశంకర్ క్రీడాకారుడు కాకుండా ఇంకేం అవుతాడు. కుటుంబంతో మురళీ శ్రీశంకర్ 2018 కామన్వెల్త్ క్రీడలకు చివరి నిమిషంలో దూరమయ్యాడు మురళీ శ్రీశంకర్. అపెండిస్ రూపంలో అతనికి సమస్య వచ్చి పడింది. నొప్పిని భరించలేక కామన్వెల్త్ గేమ్స్‌కు దూరమయ్యాడు. లాంగ్ జంప్ చేస్తే సమస్యలు చుట్టుముడుతాయన్నారు వైద్యులు. కానీ అపెండిస్ ఆపరేషన్ విజయవంతం కావడం.. ఆ తర్వాత కఠోర సాధన ద్వారా శ్రీశంకర్ లాంగ్‌జంప్‌లో ఈ నాలుగేళ్లలో తనను తాను చాలా మెరుగు పరుచుకున్నాడు. తాజాగా కామన్వెల్త్ గేమ్స్‌లో రజతంతో మెరిసిన మురళీ శ్రీశంకర్ ఔరా అనిపించాడు. మురళీ శ్రీశంకర్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు.. ►శ్రీశంకర్ తాను సాధన చేసే సమయంలో ఎలాంటి డిస్టర్బన్స్ లేకుండా చూసుకోవడం అలవాటు. తాను ఇంట్లో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలోనూ అంతేనంట. ఒక సందర్బంలో శ్రీశంకర్ తండ్రి మొబైల్‌కు హెడ్‌ఫోన్స్ పెట్టుకొని పాటలు వింటున్నాడు. ఆ పాట సౌండ్ శంకర్‌కు వినిపించింది. వెంటనే తండ్రి దగ్గరకు వచ్చి నా ప్రాక్టీస్ సమయంలో నాకు ఎలాంటి సౌండ్ వినిపించొద్దు.. అలా అయితే నేను డిస్ట్రబ్ అవుతా అని చెప్పాడట. అంతే ఆప్పటి నుంచి ఇప్పటివరకు శ్రీశంకర్ ప్రాక్టీస్ సమయంలో తండ్రి మ్యూజిక్‌ను బ్యాన్ చేస్తూనే వచ్చాడు. శ్రీశంకర్ తెచ్చిన ఈ రూల్ ఇప్పటికి ఆ కుటుంబసభ్యులు పాటిస్తూనే ఉన్నారు. 11 గంటల తర్వాత టీవీ కట్.. ►ఇక రాత్రి 11 గంటల తర్వాత శ్రీశంకర్ ఇంట్లో ఎవరు టీవీ చూడరు. అది ఎంత పెద్ద మ్యాచ్ గాని.. ఇంట్లో మాత్రం టీవీ ఆన్ చేయరు. తాజాగా శ్రీశంకర్ ఒక మెగాటోర్నమెంట్‌లో పాల్గొంటూ మ్యాచ్ ఆడుతున్న సంగతి తెలిసి కూడా టీవీ పెట్టలేదంటే వాళ్లు తమ నిర్ణయానికి ఎంత కట్టుబడి ఉన్నారో తెలుస్తోంది. తమ కొడుకు కామన్వెల్త్లో రజతం సాధించాడన్న వార్తను ఆ తల్లిదండ్రులు ఉదయమే తెలుసుకోవడం విశేషం. ►శ్రీశంకర్ తనకు 18 ఏళ్ల వయసు వచ్చేవరకు ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ వంటి వాటికి దూరంగా ఉన్నాడు. తల్లిదండ్రులు తనపై ఎన్ని ఆంక్షలు పెట్టినా వాటిని ఏనాడు నెగిటివ్‌గా తీసుకోలేదు. వాళ్లు పెట్టే కండీషన్స్ వల్లే ఈరోజు ఈ స్థాయికి చేరుకున్నానని శ్రీశంకర్ బలంగా నమ్ముతాడు. చదువులో మెరిట్.. ►సాధారణంగా క్రీడాకారులుగా మారేవాళ్లకు సరిగ్గా చదువు అబ్బదంటారు. కానీ ఈ విషయంలో శ్రీశంకర్ పూర్తిగా వేరు. ఆటలో ఎంత చురుకుగా ఉండేవాడో.. చదువులోనూ అంతే చురుకుదనాన్ని చూపించేవాడు. మ్యాచ్‌లు లేని సమయంలో చదువుకునే శ్రీశంకర్.. ఒకవేళ తాను పాల్గొనబోయే గేమ్స్‌లో సమయం దొరికితే కూడా చదువుకునేవాడు. అలా 10వ తరగతి, ఇంటర్మీడియెట్లు 95 శాతం మార్కులతో పాసయ్యాడు. ►ఆ తర్వాత నీట్ పరీక్షలో స్పోర్ట్స్ కోటాలో సెకండ్ ర్యాంక్ సాధించిన మురళీ శ్రీశంకర్ మెరిట్లో బీఎస్సీ మాథ్స్‌ను పూర్తి చేశాడు. నీట్లో తనకొచ్చిన మార్కులతో మెడికల్ సీట్ వచ్చే అవకాశం ఉన్నప్పటికి వేరే కారణాల వల్ల మెడిసిన్ చేయలేదు. ఇక్కడ విచిత్రమేంటంటే.. మెరిట్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినప్పటికి శ్రీశంకర్ ఇప్పటికి నిరుద్యోగే.'' చదువు మనకు బ్రతికే తెలివిని నేర్పిస్తుంది.. నాతో సహా నా మిత్రులందరూ ఇప్పటికీ ఏ ఉద్యోగాలు చేయడం లేదంటే నమ్ముతారా.. భారత్ కదా ఈ పరిస్థితి మాములే'' అని ఒక సందర్బంలో చెప్పుకొచ్చాడు. మద్యం, సిగరెట్లకు ఆమడ దూరం ►శ్రీశంకర్ ఇచ్చే పార్టీల్లో ఫ్రూట్ జ్యూస్‌లు తప్ప ఇంకేం కనిపించవు. ఎందుకంటే శ్రీశంకర్ ఆల్కహాల్‌ను ఎంకరేజ్ చెయ్యడు. తన మిత్రుల్లో చాలా మంది మందు, సిగరెట్లు అలవాట్లు ఉన్నవారే. కానీ శ్రీశంకర్ పార్టీలిచ్చినా.. ఏ పార్టీలకు వెళ్లినా అక్కడ నో ఆల్కాహాల్.. నో సిగరెట్. ఎందుకంటే శ్రీశంకర్‌కు మేమిచ్చే గౌరవమని అతని స్నేహితులు పేర్కొంటారు. ''శంకు(మురళీ శ్రీశంకర్ ముద్దుపేరు) నా కొడుకుగా పుట్టడం అదృష్టంగా భావిస్తున్నాం. ఎంత పెద్ద స్థాయికి చేరుకున్నా వాడు చూపించే ప్రేమ, గౌరవం ఎప్పుడు తగ్గిపోలేదు. స్కూల్ వయసు నుంచి వాడిని ఒక మంచి అథ్లెట్‌గా చూడాలని కఠిన నిబంధనల మధ్య పెంచినా.. ఒక్కసారి కూడా మాకు ఎదురుచెప్పడం చూడలేదు. అందుకే ఈరోజు దేశం గర్వించే స్థాయికి చేరుకున్నాడు'' - తల్లి కెస్ బిజ్మోల్ ''వాడు(శ్రీశంకర్) కష్టపడే తత్వాన్ని ఎప్పుడు వదల్లేదు. ఏనాడు షార్ట్‌కట్స్, అడ్డదారులు తొక్కలేదు. చిన్నప్పటి నుంచి కష్టపడిన తత్వమే ఈరోజు ఈస్థాయిలో నిలబెట్టింది. ఒక తండ్రిగా నాకు ఇంతకమించి ఏముంటుంది. నా మాటకు ఎదురుచెప్పకుండా ఎన్నో చేశాడు.. అలాంటి వాడి కోసం నేను చేసిన త్యాగాలు చాలా చిన్నవి. వాడు నా కొడుకుగా పుట్టడం నాకు గర్వకారణం' - తండ్రి ఎకోస్ బిజ్మోల్ Keep watching that 8.08m jump on a loop...it's a Silver Medal for #India from Murli Sreeshankar 🇮🇳#CommonwealthGames2022 Congratulations India, Congratulations Sree!@birminghamcg22 pic.twitter.com/Rzec3zHWyO — Athletics Federation of India (@afiindia) August 5, 2022 The First Medal of the Day 💪 Murali Sreeshankar wins the first medal of the day with his 🥈 win and takes India to a medal count of 19 in #CWG2022 🔥#BirminghamMeinJitegaHindustanHamara 🫶#B2022 #SirfSonyPeDikhega #SonySportsNetwork pic.twitter.com/dcbAFO0Wgu — Sony Sports Network (@SonySportsNetwk) August 4, 2022 చదవండి: Commonwealth Games 2022: మురళీ శ్రీశంకర్ కొత్త చరిత్ర.. లాంగ్‌జంప్‌లో భారత్‌కు రజతం వారం కిత్రం పేరు లేదు.. కుక్కలతో హై జంప్ ప్రాక్టీస్; కట్‌చేస్తే -
భారత్ ఖాతాలో ఆరో స్వర్ణం.. పారా పవర్‌లిఫ్టింగ్‌లో తొలి పతకం
కామన్వెల్త్ గేమ్స్ 2022లో భారత్ ఖాతాలో మరో స్వర్ణ పతకం వచ్చి చేరింది. పురుషుల హెవీ వెయిట్ పారా పవర్ లిఫ్టింగ్ లో సుధీర్ స్వర్ణం గెలుచుకున్నాడు. కామన్వెల్త్ క్రీడల చరిత్రలో పారా పవర్ లిఫ్టింగ్ స్వర్ణం సాధించిన తొలి భారతీయుడిగా సుధీర్ చరిత్ర సృష్టించాడు. దీంతో కామన్వెల్త్ గేమ్స్ 2022లో భారత్ ఆరో బంగారు పతకం కైవసం చేసుకుంది. గేమ్స్‌లో ఇప్పటివరకు భారత్ ఆరు స్వర్ణాలు, ఏడు రజతాలు, ఏడు కాంస్యాలతో మొత్తం 20పతకాలు సాధించింది. ప్రస్తుతం పతకాల పట్టికలో ఏడవ ర్యాంకులో భారత్ కొనసాగుతోంది. కాగా పారా పవర్ లిఫ్టింగ్‌లో విజేతను పాయింట్ల ఆధారంగా నిర్ణయిస్తారు. ఇందులో పాల్గొనేవారి శరీర బరువు అలాగే అతను ఎత్తే బరువు ఆధారంగా పాయింట్లు లెక్కిస్తారు. 87 కేజీల సుధీర్ తన తొలి ప్రయత్నంలోనే 208 కేజీలు ఎత్తి 132 పాయింట్లకు పైగా సాధించి మొదటి స్థానంలో నిలిచాడు. అదే సమయంలో అతను నైజీరియన్ పవర్‌లిఫ్టర్ నుంచి కఠిన సవాల్‌ను ఎదుర్కొన్నాడు. దీంతో రెండవ ప్రయత్నంతో సుధీర్ రెండోస్థానానికి పడిపోయాడు. అయినా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోని భారత అథ్లెట్ రెండవ ప్రయత్నంలో 212 కిలోల బరువును ఎత్తి 134.5 పాయింట్లు సాధించి రికార్డు సృష్టించాడు. ఇదే సమయంలో నైజీరియాకు చెందిన ఇకెచుక్వు క్రిస్టియన్ ఉబిచుక్వు తన చివరి ప్రయత్నంలో 203 కిలోలు ఎత్తడంలో విఫలమయ్యాడు. ఇది సుధీర్ బంగారు పతకం అవకాశాలను మెరుగుపరచింది. ఇదే ఈవెంట్లో నైజీరియాకు చెందిన ఇకెచుక్వు, క్రిస్టియన్ ఉబిచుక్వు 133.6 స్కోరుతో రజతం గెలుచుకోగా, స్కాట్లాండ్కు చెందిన మిక్కీ యూల్ 130.9 స్కోరుతో కాంస్యం గెలుచుకున్నాడు. క్రిస్టియన్ 197 కిలోలు ఎత్తగా, యూల్ 192 కిలోలు ఎత్తాడు. హర్యానాలోని సోనిపట్ లో ఓ రైతు కుటుంబంలో సుధీర్ జన్మించారు. తీవ్ర జ్వరం కారణంగా నాలుగేళ్ల వయసులో పోలియో బారిన పడ్డాడు. కానీ అతనికి వైకల్యం అడ్డురాలేదు. క్రీడలపై జీవితాంతం ఆసక్తిని కనబర్చాడు. HISTORIC GOLD FOR INDIA 🔥🔥🔥 Asian Para-Games Bronze medalist, #Sudhir wins 🇮🇳's 1st ever GOLD🥇 medal in Para-Powerlifting at #CommonwealthGames with a Games Record to his name 💪💪 Sudhir wins his maiden 🥇 in Men's Heavyweight with 134.5 points (GR) at CWG#Cheer4India 1/1 pic.twitter.com/cBasuHichz — SAI Media (@Media_SAI) August 4, 2022 This is so special 😍 6 gold 🥇for Bharat 🇮🇳 thanks to Sudhir lifting 212 kg in para power lifting setting new Games record !! Many congrats to u bhai 👏👏 Billion Indian’s proud of you 👏 #ParaPowerlifting #Sudhir pic.twitter.com/TZ6VEnef4b — Soug (@sbg1936) August 4, 2022 చదవండి: CWG 2022: మురళీ శ్రీశంకర్ కొత్త చరిత్ర.. లాంగ్‌జంప్‌లో భారత్‌కు రజతం -
మురళీ శ్రీశంకర్ కొత్త చరిత్ర.. లాంగ్‌జంప్‌లో భారత్‌కు రజతం
కామన్వెల్త్ గేమ్స్ 2022లో భారత్ పతకాల జోరు కొనసాగుతుంది. బుధవారం హై జంప్‌లో తేజస్విన్ శంకర్ కాంస్య పతకం సాధించిన ఆ విభాగంలో పతకం సాధించిన తొలి అథ్లెట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. తాజాగా గురువారం అర్థరాత్రి జరిగిన పురుషుల లాంగ్ జంప్ ఫైనల్లో భారత్ అథ్లెట్ మురళీ శ్రీశంకర్ రజతం సాధించి చరిత్ర సృష్టించాడు. కామన్వెల్త్ గేమ్స్‌లో పురుషుల లాంగ్ జంప్ విభాగంలో భారత్‌కు ఇదే తొలి పతకం కావడం విశేషం. ఓవరాల్‌గా కామన్వెల్త్ గేమ్స్‌లో లాంగ్‌జంప్ విభాగంలో ఇది మూడో పతకం. ఇంతకముందు 2002 ,2010లో మహిళల లాంగ్ జంప్ విభాగంలో అంజూ బాబీ జార్జీ(కాంస్యం), ప్రజూషా మాలిక్కల్(రజతం) పతకాలు సాధించారు. భారత కాలమాన ప్రకారం గురువారం రాత్రి జరిగిన లాంగ్ జంప్ ఫైనల్లో ఐదో ప్రయత్నంలో 8.08 మీటర్లు దూకిన శ్రీశంకర్ రెండో స్థానంలో నిలిచి రజత పతకం సాధించాడు. కాగా బహమాస్‌కు చెందిన లకాన్ నైర్న్ కూడా 8.08 మీటర్లే దూకి స్వర్ణం గెలిచాడు. ఎందుకంటే లకాన్ రెండో ఉత్తమ ప్రదర్శన(7.98 మీటర్లు).. శ్రీశంకర్(7.84 మీటర్లు) కన్నా ఎక్కువగా ఉండడమే కారణం. జమైకాకు చెందిన థాంప్సన్(8.05 మీటర్లు) దూకి కాంస్యం గెలిచాడు. కాగా కేరళకు చెందిన 23 ఏళ్ల మురళీ శ్రీ శంకర్ 2018 కామన్వెల్త్ క్రీడలకు చివరి నిమిషంలో దూరమయ్యాడు. అపెండిస్ సమస్యతో కామన్వెల్త్కు దూరమైన మురళీ శ్రీ శంకర్ ఇకపై లాంగ్ జంప్ చేయకపోవచ్చు అని అంతా భావించారు. కానీ అపెండిస్ ఆపరేషన్ విజయవంతం కావడం.. ఆ తర్వాత కఠోర సాధన ద్వారా లాంగ్‌జంప్‌లో తనను తాను మెరుగు పరుచుకున్నాడు. తాజాగా కామన్వెల్త్ గేమ్స్‌లో రజతంతో మెరిసిన మురళీ శ్రీశంకర్ ఔరా అనిపించాడు. SOARING HIGH 🤩🤩 🥈 #SreeshankarMurali after the historic feat at #CommonwealthGames in Men's Long Jump 😍😍#Cheer4India #India4CWG2022 pic.twitter.com/BdPt80MQwo — SAI Media (@Media_SAI) August 4, 2022 -
వెయిట్లిఫ్టింగ్కు పర్యాయపదం ‘ఒపెలాజ్ ఫ్యామిలీ’
పురుషుల వెయిట్‌లిఫ్టింగ్ 96 కేజీల విభాగంలో ‘సమోవా’ దేశానికి చెందిన డాన్ ఒపెలాజ్ మంగళవారం స్వర్ణ పతకం గెలుచుకున్నాడు... అయితే 24 గంటలు తిరగక మందే ఒపెలాజ్ కుటుంబంలో మరో పతకం వచ్చి చేరింది. బుధవారం 109 కేజీల కేటగిరీలో డాన్ సోదరుడు జాక్ ఒపెలాజ్ రజతం సాధించాడు. కామన్వెల్త్ క్రీడల పతకాలతో ఈ కుటుంబ అనుబంధం చాలా పాతదే. సరిగ్గా చెప్పా లంటే ఆ దేశంలో వెయిట్లిఫ్టింగ్కు పర్యాయపదం ‘ఒపెలాజ్ ఫ్యామిలీ’. 12 మంది సభ్యుల కుటుంబంలో 10 మంది అంతర్జాతీయ వెయిట్‌లిఫ్టర్లే కావడం విశేషం. 2010 ఢిల్లీ కామన్వెల్త్ క్రీడల్లో డాన్ సోదరు డు న్యూసిలా ఒపెలాజ్ స్వర్ణం గెలుచుకోగా (105 కేజీలు), అదే రోజు అతని సోదరి ఎలె ఒపెలాజ్ కూడా 75 కేజీల కేటగిరీలో పసిడి సొంతం చేసుకుంది. న్యూసెలా 2002 మాంచెస్టర్ క్రీడల్లోనూ కాంస్యం సాధించగా, 2014లో ఎలె ఖాతాలో రజతం చేరింది. మరో సోదరి మేరీ ఒపెలాజ్ 2014 గ్లాస్గో క్రీడల్లో రజత పతకం అందుకుంది. గత గోల్డ్ కోస్ట్ క్రీడల్లోనూ డాన్ ఒపెలాజ్ రజతం సాధించగా... అందరికంటే చిన్నవాడు జాక్ పతకం సాధించడంతో ఈ కుటుంబం కామన్వెల్త్ క్రీడల్లో గెలుచుకున్న పతకాల సంఖ్య ‘8’కు చేరింది. పసిఫిక్ మహా సముద్రంలో దాదాపు 2 లక్షల జనాభా ఉండే సమోవా ఒలింపిక్స్‌లో సాధించిన ఏకైక పతకం కూడా ఎ లె ఒపెలాజ్దే కావడం విశేషం. 2008 బీజింగ్ క్రీడల్లో 75+ కేజీల కేటగిరీలో ఎలె రజతం గెలుచుకుంది. -
CWG 2022: స్మృతి మంధాన అరుదైన రికార్డు! రోహిత్ శర్మ తర్వాత ఆమే!
Commonwealth Games 2022: భారత మహిళా బ్యాటర్ స్మృతి మంధాన అరుదైన ఘనత సాధించింది. టీ20 ఫార్మాట్లో భారత్ తరఫున ఓపెనర్‌గా అత్యధిక పరుగులు(2004) చేసిన రెండో క్రికెటర్‌గా నిలిచింది. ఈ జాబితాలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ముందు వరుసలో ఉన్నాడు. పొట్టి ఫార్మాట్లో హిట్‌మ్యాన్ ఇప్పటి వరకు భారత ఓపెనర్‌గా 96 ఇన్నింగ్స్‌లో 2973 పరుగులు చేశాడు. ఇక 79 ఇన్నింగ్స్‌లో 2 వేల పరుగుల మార్కును అందుకున్న మంధాన.. రోహిత్ తర్వాతి స్థానంలో నిలిచింది. ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్-2022లో భాగంగా బార్బడోస్‌తో మ్యాచ్‌లో ఈ ఫీట్ నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో 5 పరుగులు చేసి పెవిలియన్ చేరిన స్మృతి మంధాన.. 2004 పరుగులు పూర్తి చేసుకుంది. ఈ క్రమంలో టీమిండియా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్, మహిళా జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్, కేఎల్ రాహుల్‌లను మంధాన అధిగమించింది. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. భారత బౌలర్లు చెలరేగడంతో 62 పరుగులకే బార్బడోస్ కథ ముగిసింది. ఏకంగా వంద పరుగుల తేడాతో విజయం సాధించిన భారత్ సెమీస్‌కు దూసుకెళ్లింది. కామన్వెల్త్ గేమ్స్‌లో పతకం సాధించే దిశగా హర్మన్‌ప్రీత్‌కౌర్ బృందం పయనిస్తోంది. కాగా స్మృతి మంధాన 2013లో పరిమిత ఓవర్ల క్రికెట్లో.. ఆ మరుసటి ఏడాది టెస్టుల్లో అరంగేట్రం చేసింది. టీమిండియా తరఫున ఓపెనర్లుగా టీ20 ఫార్మాట్లో అత్యధిక పరుగులు సాధించిన టాప్-5 వీరే! 1. రోహిత్ శర్మ-2973 పరుగులు 2. స్మృతి మంధాన- 2004 పరుగులు 3. శిఖర్ ధావన్- 1759 పరుగులు 4. మిథాలీ రాజ్- 1407 పరుగులు 5. కేఎల్ రాహుల్-1392 పరుగులు చదవండి: Asia Cup 2022: ఆసియా కప్‌లో భారత్, పాక్‌లు మూడుసార్లు ఎదురెదురు పడే అవకాశం..! -
వారం కిత్రం పేరు లేదు.. కుక్కలతో హై జంప్ ప్రాక్టీస్
తేజస్విన్ శంకర్.. వారం క్రితం కామన్వెల్త్ గేమ్స్‌కు ఎంపికయిన భారత బృందంలో పేరు లేదు. హై జంప్ విభాగంలో క్వాలిఫై స్టాండర్డ్స్ అందుకోలేదన్న కారణంగా చూపి భారత్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ అధికారులు అతన్ని ఎంపిక చేయలేదు. దీంతో కోర్టు మెట్లు ఎక్కి విజయం సాధించిన తేజస్విన్ శంకర్ ఆఖరి నిమిషంలో కామన్వెల్త్ గేమ్స్‌కు వెళ్లనున్న భారత బృందంలో బెర్త్ దక్కించకున్నాడు. తనను ఎంపిక చేయలేదన్న కోపమో లేక బాధో తెలియదు కానీ.. ఇవాళ 30వేల మంది ప్రేక్షకుల సమక్షంలో హై జంప్ విభాగంలో కాంస్య పతకం సాధించి అందరి దృష్టిని ఆకర్షించాడు. తన రికార్డును బ్రేక్ చేయలేదన్న బాధ ఉన్నప్పటికి కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ తరపున హై జంప్ విభాగంలో పతకం సాధించిన తొలి అథ్లెట్‌గా తేజస్విన్ శంకర్ చరిత్ర సృష్టించాడు. మరి బర్మింగ్హమ్లో కాంస్యం సాధించిన తేజస్విన్ శంకర్ హై జంప్ ప్రాక్టీస్ ఎలా చేశాడో తెలిస్తే షాకవుతారు. తాను రోజు ప్రాక్టీస్ చేసే జేఎల్ఎన్ గ్రౌండ్లో మూడు కుక్కలు ఉండేవి. వాటిని మచ్చిక చేసుకున్న శంకర్ హై జంప్ ప్రాక్టీస్ చేసేవాడు. రోజు వాటికి ఆహారం అందిస్తూ స్టిక్స్ ఏర్పాటు చేసి వాటి వెనకాల పరిగెత్తుతూ హై జంప్ చేసేవాడు. అలా హైజంప్‌లో మరింత రాటు దేలే ప్రయత్నం చేశాడు. అయితే భారత్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ అతనికి షాక్ ఇచ్చింది. అయితే కోర్టు మెట్లు ఎక్కడం ద్వారా విజయం సాధించిన తేజస్విన్ శంకర్ కామెన్వెల్త్ గేమ్స్‌లో అడుగుపెట్టాడు. వాస్తవానికి అథ్లెట్ల సంఖ్య కోటా ఎక్కువగా ఉన్నందున శంకర్ పేరును పరిగణలోకి తీసుకోలేదని తర్వాత తేలింది. కట్‌చేస్తే.. కామన్వెల్త్ గేమ్స్‌లో కొత్త చరిత్ర సృష్టించాడు. బుధవారం హైజంప్ విభాగంలో జరిగిన ఫైనల్లో తేజస్విన్ శంకర్ 2.22 మీటర్ల ఎత్తు దూకి కాంస్యం ఒడిసిపట్టాడు. అయితే జూన్‌లో జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్లో శంకర్ 2.27 మీటర్ల దూరం జంప్ చేయడం గమనార్హం. శంకర్ గత రికార్డుతో పోల్చితే కామన్వెల్త్లో కొంత నిరాశ పరిచినా ఇది కూడా గొప్ప ఘనత కిందే లెక్కించొచ్చు. ఇక ఈ విభాగంలో న్యూజిలాండ్‌కు చెందిన హమీష్ కెర్ 2.25 మీటర్ల జంప్‌చేసి మొదటి స్థానంలో నిలిచి స్వర్ణం సాధించగా, ఆస్ట్రేలియాకు చెందిన బ్రండన్ స్టార్క్ సిల్వర్ సాధించాడు. A week back Tejaswin Shankar was practising in front of 3 dogs at JLN Stadium, after not being named to the CWG squad despite meeting the AFI QF standard. Included at the last minute after taking the fed to court, today in front of 30000, he wins a high jump bronze in Birmingham. pic.twitter.com/1YDiEsvjE3 — jonathan selvaraj (@jon_selvaraj) August 3, 2022 ☑️First-ever high jump medal for India at CWG ☑️First track and field medal for India in this CWG edition Tejaswin Shankar🙌🏻#CommonwealthGames2022 pic.twitter.com/la6a6APpD5 — The Bridge (@the_bridge_in) August 3, 2022 చదవండి: CWG 2022: హైజంప్‌లో భారత్‌కు కాంస్యం.. తొలి అథ్లెట్‌గా రికార్డు CWG 2022: వైరల్‌గా మారిన నిఖత్ జరీన్ చర్య.. ఏం జరిగింది? -
వైరల్‌గా మారిన నిఖత్ జరీన్ చర్య.. ఏం జరిగింది?
భారత మహిళా బాక్సర్.. తెలంగాణ ముద్దుబిడ్డ నిఖత్ జరీన్ కామన్వెల్త్ గేమ్స్ 2022లో కనీస కాంస్య పతకం ఖాయం చేసుకుంది. మహిళల బాక్సింగ్ 50 కేజీల లైట్ ఫ్లైవెయిట్ విభాగంలో బుధవారం జరిగిన క్వార్టర్‌ఫైనల్ బౌట్లో 5–0తో హెలెన్ జోన్స్ (వేల్స్)పై గెలిచి సెమీస్‌కు ప్రవేశించింది. ఈ క్రమంలో మ్యాచ్ గెలిచిన అనంతరం నిఖత్ జరీన్ చర్య సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విషయంలోకి వెళితే.. బుధవారం నిఖత్ జరీన్ తల్లి పర్వీన్ సుల్తానా పుట్టినరోజు. తల్లి పుట్టినరోజు నాడే క్వార్టర్స్ మ్యాచ్ గెలిచి కనీసం కాంస్య పతకం ఖరారు చేయడంతో నిఖత్ మొహం సంతోషంతో వెలిగిపోయింది. రింగ్ నుంచి కిందకు దిగగానే.. ''హ్యాపీ బర్త్‌డే అమ్మీ.. ఐ లవ్ యూ.. అల్లా నిన్ను సంతోషంగా ఉంచాలి'' అంటూ గట్టిగా అరిచింది. ఈ విజయాన్ని పర్వీనా సుల్తానాకు అంకితం చేసిన నిఖత్ జరీన్ తన తల్లిపై ఉన్న ప్రేమను ఈ విధంగా చూపించింది. ఇక నిఖత్ జరీన్‌తో పాటు మరో తెలంగాణ బాక్సర్ హుసాముద్దీన్(57 కేజీలు) కూడా సెమీస్‌లోకి ప్రవేశించాడు. వీరితో పాటు హరియాణా అమ్మాయి నీతూ (48 కేజీలు) క్వార్టర్ ఫైనల్స్‌లో నికోల్ క్లయిడ్ (నార్తర్న్ ఐర్లాండ్)ను ఓడించింది. అయితే కచ్చితంగా పతకం తెస్తుందని ఆశించిన లవ్లీనా బొర్హంగైన్ మాత్రం నిరాశపరిచింది. మిడిల్ వెయిట్ క్వార్టర్ఫైనల్లో వేల్స్‌కు చెందిన రోసీ ఎక్లెస్ చేతిలో 3-2తో ఓడిపోయింది. మరో బాక్సర్ ఆశిష్ కుమార్(80 కేజీలు) ఇంగ్లండ్‌కు చెందిన ఆరోన్ బోవెన్ చేతిలో 4-1తో ఓడి క్వార్టర్స్‌లోనే వెనుదిరిగాడు. The beautiful thing by @nikhat_zareen after winning QF.. "Happy Birthday ammi, Allah aapko khush rakhe" ❤️😍 #B2022 #boxing #NikhatZareen #CommonwealthGames2022 #CWG2022 #TeamIndia @WeAreTeamIndia @Media_SAI pic.twitter.com/lqp4fVkhoX — Sagar 🕊️ (@imperfect_ocean) August 3, 2022 చదవండి: CWG 2022: హైజంప్‌లో భారత్‌కు కాంస్యం.. తొలి అథ్లెట్‌గా రికార్డు Suryakumar Yadav: 'సూర్యుడి'లా వెలిగిపోతున్నాడు.. ఆపడం కష్టమే -
CWG 2022: హైజంప్‌లో భారత్‌కు కాంస్యం.. తొలి అథ్లెట్‌గా రికార్డు
కామన్వెల్త్ క్రీడల్లో భారత్ మరో పతకం సాధించింది. హైజంప్‌లో తేజస్విన్ శంకర్ కాంస్య పతకం సొంతం చేసుకున్నాడు. దీంతో కామన్వెల్త్ గేమ్స్ హైజంప్ విభాగంలో దేశానికి పతకం అందించిన తొలి అథ్లెట్‌గా తేజస్విన్ శంకర్ రికార్డు సృష్టించాడు. భారత కాలమాన ప్రకారం బుధవారం అర్థరాత్రి జరిగిన హైజంప్ ఫైనల్స్‌లో శంకర్ 2.22 మీటర్ల దూరం దూకి మూడో స్థానంలో నిలిచాడు. న్యూజిలాండ్‌కు చెందిన హమీష్ కెర్ 2.25 మీటర్ల జంప్‌చేసి మొదటి స్థానంలో నిలిచి స్వర్ణం సాధించగా, ఆస్ట్రేలియాకు చెందిన బ్రండన్ స్టార్క్ సిల్వర్ సాధించాడు. అయితే జూన్‌లో జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్లో శంకర్ 2.27 మీటర్ల దూరం జంప్ చేయడం గమనార్హం. శంకర్ గత రికార్డుతో పోల్చితే కామన్వెల్త్లో కొంత నిరాశ పరిచినప్పటికీ హైజంప్‌లో దేశానికి తొలిపతకం తీసుకొచ్చిన ప్లేయర్‌గా మాత్రం చరిత్రలో నిలిపోయాడు. తాజా పతకంతో భారత్ ఖాతాలో ఇప్పటివరకు 18 పతకాలు ఉండగా.. అందులో 5 స్వర్ణాలు, ఆరు రజతాలు, ఏడు కాంస్య పతకాలు ఉన్నాయి. ఇక కాంస్య పతకం సాధించిన శంకర్‌ను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. ''తేజస్విని శంకర్ కొత్త చరిత్ర సృష్టించాడు. కామన్వెల్త్ గేమ్స్‌లో హైజంప్ విభాగంలో పతకం సాధించిన తొలి అథ్లెట్‌గా నిలిచాడు. కాంస్య పతకం సాధించినందుకు అభినందనలు. నీ ప్రదర్శన పట్ల దేశం గర్విస్తుంది. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నా.'' అంటూ తెలిపారు. ఇక కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ కూడా శంకర్‌ను అభినందించారు. కామన్వెల్త్ క్రీడల్లో హైజంప్ విభాగంలో పతకం సాధించిన మొదటి అథ్లెట్‌గా చరిత్ర సృష్టించాడని ప్రశంసించారు. ☑️First-ever high jump medal for India at CWG ☑️First track and field medal for India in this CWG edition Tejaswin Shankar🙌🏻#CommonwealthGames2022 pic.twitter.com/la6a6APpD5 — The Bridge (@the_bridge_in) August 3, 2022 చదవండి: Commonwealth Games 2022: తులిక తెచ్చిన రజతం CWG 2022: బార్బడోస్పై ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన టీమిండియా మహిళలు 🇮🇳🥇 𝐇𝐈𝐒𝐓𝐎𝐑𝐈𝐂! Tejaswin Shankar - remember the name! 💪 This is India's first medal in Athletics at #B2022.#TejaswinShankar #B2022 #CWG2022 #HighJump #TeamIndia #BharatArmy pic.twitter.com/7zQ2S8eMAA — The Bharat Army (@thebharatarmy) August 3, 2022 Tejaswin Shankar creates history. He wins our first high jump medal in the CWG. Congratulations to him for winning the Bronze medal. Proud of his efforts. Best wishes for his future endeavours. May he keep attaining success. @TejaswinShankar pic.twitter.com/eQcFOtSU58 — Narendra Modi (@narendramodi) August 4, 2022 -
CWG 2022: బార్బడోస్పై ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన టీమిండియా
కామన్వెల్త్ గేమ్స్ 2022లో టీమిండియా మహిళల జట్టు సెమీస్‌కు దూసుకెళ్లింది. గేమ్స్‌లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో టీమిండియా వుమెన్స్ జూలు విదిల్చారు. బుధవారం బార్బడోస్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా మహిళలు 100 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించారు. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా మహిళలు 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. జెమీమా రోడ్రిగ్స్(46 బంతుల్లో 56 నాటౌట్, 6 ఫోర్లు, ఒక సిక్స్) టాప్ స్కోరర్ కాగా.. షఫాలీ వర్మ(26 బంతుల్లో 43, 7 ఫోర్లు, 1 సిక్సర్), చివర్లో దీప్తి శర్మ(28 బంతుల్లో 34, 2 ఫోర్లు, 1 సిక్సర్) దుమ్మురేపడంతో భారత్ మహిళల జట్టు గౌరవప్రదమైన స్కోరు సాధించింది. అనంతరం బ్యాటింగ్ చేసిన బార్బడోస్ మహిళల జట్టు భారత్ బౌలర్ల ఒత్తిడిని తట్టుకోలేక 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 62 పరుగుల వద్ద ఇన్నింగ్స్ ముగించింది. కోషోనా నైట్ 16 పరుగులతో టాప్ స్కోరర్ కాగా.. మిగతావారు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. టీమిండియా వుమెన్స్ బౌలర్లలో రేణుకా సింగ్ 4 వికెట్లు తీయగా.. మేఘనా సింగ్, స్నేహ్ రాణా, రాదా యాదవ్, హర్మన్‌ప్రీత్ కౌర్‌లు తలా ఒక వికెట్ తీశారు. ఇక న్యూజిలాండ్, ఇంగ్లండ్ మధ్య విజేతతో టీమిండియా మహిళల జట్టు సెమీస్‌లో తలపడనుంది. సెమీస్‌లో గెలిస్తే మాత్రం టీమిండియా మహిళల జట్టుకు పతకం ఖాయమైనట్లే. A fantastic victory for #TeamIndia. They win by 100 runs and advance into the semi-finals at the #CWG2022 👏👏 Scorecard - https://t.co/upMpWogmIP #INDvBAR #B2022 pic.twitter.com/uH6u7psVmG — BCCI Women (@BCCIWomen) August 3, 2022 -
బార్బడోస్‌తో భారత్ కీలక పోరు.. ఓడితే ఇంటికే!తుది జట్లు!
కామన్వెల్త్ గేమ్స్-2022లో బుధవారం బార్బడోస్ మహిళల జట్టుతో కీలక పోరులో అమీతుమీ తెల్చుకోవడానికి భారత్ సిద్దమైంది. ఈ మెగా ఈవెంట్లో ఇప్పటి వరకు 2 మ్యాచ్‌లు ఆడిన భారత్ ఒక్క మ్యాచ్‌లో మాత్రమే విజయం సాధించింది. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి లీగ్ మ్యాచ్‌లో ఓటమి పాలైన భారత్.. రెండో మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై విజయం సాధించి తిరిగి గాడిలో పడింది. గ్రూపు-ఎలో నాలుగు పాయింట్లతో తొలి స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా జట్టు ఇప్పటికే సెమీస్ బెర్త్‌ను ఖారారు చేసుకుంది. ఇక ఇప్పటి వరకు చెరో విజయం సాధించిన భారత్, బార్బడోస్ రెండు పాయింట్లు తమ ఖాతాలో వేసుకున్నాయి. అయితే బార్బడోస్ కంటే భారత్(+1.165)కు మెరుగైన రన్‌రేట్ ఉండటంతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. ఇక మూడో స్థానంలో బార్బడోస్ ఉండగా.. అఖరి స్థానంలో పాకిస్తాన్ ఉంది. ఇప్పటికే రెండు మ్యాచ్‌ల్లో ఓటమి పాలైన పాకిస్తాన్ పోటీ నుంచి నిష్క్రమించింది. ఇక సెమీస్‌లో అడుగు పెట్టాలంటే బార్బడోస్పై హర్మన్ ప్రీత్ సేన ఖచ్చితంగా విజయం సాధించాలి. ఒక వేళ ఓడితే భారత్ ఇంటిముఖం పట్టక తప్పదు. ఇక కీలకపోరులో తలపడనున్న భారత్, బార్బడోస్ జట్ల బలా బలాలపై ఓ లుక్కేద్దాం. భారత జట్టు బ్యాటింగ్ పరంగా పటిష్టంగా కన్పిస్తోంది. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ ఆనూహ్యంగా ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో బ్యాటర్లు అద్భుతంగా రాణించనప్పటికీ.. బౌలర్లు అఖరిలో చేతులెత్తేశారు. అనంతరం పాక్‌పై మాత్రం టీమిండియా మహిళలు ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టారు. తొలుత బౌలింగ్‌లో పాక్‌ను కేవలం 99 పరుగులకే కుప్పకూల్చిన భారత మహిళలు.. అనంతరం బ్యాటింగ్‌లో కూడా ఇరగదీశారు. ఓపెనర్ స్మృతి మంధాన 63 పరుగులతో ఆజేయంగా నిలిచి భారత్‌కు విజయ తీరాలకు చేర్చింది. ఇక స్మృతి మంధానతో పాటు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, షఫాలీ వర్మలు కూడా అద్భుతమైన ఫామ్‌లో ఉండడం భారత్‌కు సానుకూలాంశం. ఇక బౌలింగ్ పరంగా భారత్ కాస్త తడబడుతోంది. ఆసీస్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో పేసర్ రేణుక సింగ్ నాలుగు వికెట్లు పడగొట్టి అద్భుతమైన ఆరంభం ఇచ్చినప్పటికీ.. మిగితా బౌలర్లు పూర్తిగా విఫలమయ్యారు. అయితే రెండో మ్యాచ్‌లో పాక్‌పై మాత్రం బౌలర్లు విజృంభించారు. ఇక మరోసారి భారత బౌలర్లు చెలరేగితే బార్బడోస్‌కు మాత్రం ఓటమి తప్పదు. ఇక బార్బడోస్ విషయానికి వస్తే.. తొలి మ్యాచ్‌లో పాక్‌పై అద్భుతమైన విజయం సాధించిన బార్బడోస్, రెండో మ్యాచ్‌లో ఆసీస్ చేతిలో భంగపాటు పడింది. అయితే బార్బడోస్‌ను మాత్రం తక్కువగా అంచనా వేయలేం. జట్టులో కెప్టెన్ హేలీ మాథ్యూస్, ఓపెనర్ డాటిన్ వంటి అద్భుతమైన క్రికెటర్లు ఉన్నారు. బౌలింగ్‌లో కూడా షకేరా సెల్మాన్, షామిలియా కన్నెల్ వంటి సీనియర్ బౌలర్లు ఉండడం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం. తుది జట్లు (అంచనా) బార్బడోస్ మహిళల జట్టు: డియాండ్రా డాటిన్, హేలీ మాథ్యూస్ (కెప్టెన్), కైసియా నైట్ (వికెట్ కీపర్), కైషోనా నైట్, ఆలియా అలీన్, త్రిషన్ హోల్డర్, అలీసా స్కాంటిల్‌బరీ, షకేరా సెల్మాన్, షామిలియా కన్నెల్, కైలా ఇలియట్, షానికా బ్రూస్ భారత మహిళల జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), జెమిమా రోడ్రిగ్స్, స్మృతి మంధాన, షఫాలీ వర్మ, యాస్తికా భాటియా (వికెట్ కీపర్), సబ్బినేని మేఘన, దీప్తి శర్మ, రాధా యాదవ్, స్నేహ రాణా, పూజా వస్త్రాకర్, రేణుకా సింగ్ చదవండి: తొమ్మిదేళ్ల తర్వాత కుటుంబాన్ని కలిసిన ‘ముంబై’ యువ స్పిన్నర్! తల్లితో దిగిన ఫొటో షేర్ చేస్తూ ఎమోషనల్! -
CWG 2022: హర్మన్‌ప్రీత్ సేనకు చావో రేవో.. గెలిస్తేనే సెమీస్‌కు
బర్మింగ్హమ్: ప్రతిష్టాత్మక కామన్వెల్త్ గేమ్స్ 2022లో టీమిండియా మహిళల జట్టు బుధవారం(ఆగస్టు 3న) బార్బడోస్‌తో కీలక మ్యాచ్ ఆడనుంది. ఒక రకంగా భారత్‌కు ఇది డూ ఆర్ డై మ్యాచ్ అని చెప్పొచ్చు. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో గెలిచి ఆత్మవిశ్వాసం కూడగట్టుకున్న హర్మన్ ప్రీత్ సేన బార్బడోస్‌తో గెలిస్తేనే ముందుకు వెళుతుంది. పాక్‌పై గెలిచి.. ఆస్ట్రేలియాతో ఓటమి చవి చూసిన భారత్.. బార్బడోస్‌తో గెలిస్తే సెమీస్‌కు చేరుకుంటుంది. అటు బార్బడోస్ జట్టుది కూడా అచ్చం ఇదే పరిస్థితి. పాకిస్తాన్‌పై విజయం.. ఆసీస్‌తో చేతిలో ఓటమితో ఆ జట్టకు కూడా భారత్‌తో మ్యాచ్ కీలకం కానుంది. మరి తొలిసారి టీమిండియా మహిళలు ఆడుతున్న కామన్వెల్త్ గేమ్స్‌లో సెమీస్‌కు చేరి పతకం దిశగా అడుగులు వేస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. భారత కాలమాన ప్రకారం రాత్రి 10:30 గంటలకు మ్యాచ్ జరగనుంది. టీమిండియా వుమెన్స్‌లో స్మృతి మంధాన, హర్మన్ ప్రీత్ కౌర్, షఫాలీ వర్మలు ఫామ్‌లో ఉండడం సానుకూలాంశం. ఇక ఇతర మ్యాచ్‌లు పరిశీలిస్తే.. భారత పరుషుల, మహిళల హాకీ జట్టు కెనడాతో అమితుమీ తేల్చుకోనుండగా.. బాక్సర్లు లవ్లీనా బొర్హంగైన్, నికత్ జరీన్, నీతు గంగాస్లు క్వార్టర్ ఫైనల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఆరవ రోజు భారత్ ఆటగాళ్లు పాల్గొనబోయే మ్యాచ్‌ల షెడ్యూల్.. పూర్తి వివరాలు అథ్లెటిక్స్: మహిళల షాట్‌పుట్ ఫైనల్ - మన్‌ప్రీత్ కౌర్ (గురువారం ఉదయం 12.35) పురుషుల హైజంప్ ఫైనల్ - తేజస్విన్ శంకర్ (11.30 pm ) బాక్సింగ్ మహిళల 45kg-48 kg క్వార్టర్ ఫైనల్స్ – నీతు గంగాస్ (సాయంత్రం 4.45) 48-50 కిలోల (లైట్ ఫ్లై వెయిట్) క్వార్టర్ ఫైనల్స్ – నిఖత్ జహ్రీన్ (11.15 PM) 66-70 కిలోల (లైట్ మిడిల్ వెయిట్) క్వార్టర్-ఫైనల్ - లోవ్లినా బోర్గోహైన్ (12.45 AM) పురుషులు 54-57 కేజీలు (ఫెదర్ వెయిట్) క్వార్టర్ ఫైనల్స్ – హుస్సామ్ ఉద్దీన్ మహమ్మద్ (సాయంత్రం 5.45) క్రికెట్ మహిళల T20 - భారతదేశం వర్సెస్ బార్బడోస్ - 10.30 PM హాకీ మహిళల పూల్ A - ఇండియా వర్సెస్ కెనడా - 3.30 PM పురుషుల పూల్ B - ఇండియా వర్సెస్ కెనడా - 6.30 PM జూడో మహిళల 78 కేజీల క్వార్టర్-ఫైనల్ - తులికా మన్ - మధ్యాహ్నం 2.30 PM పురుషుల 100 కేజీల ఎలిమినేషన్ రౌండ్ 16 - దీపక్ దేశ్వాల్ - మధ్యాహ్నం 2.30 PM లాన్ బౌల్స్ పురుషుల సింగిల్స్ - మృదుల్ బోర్గోహైన్ - 1 PM- 4 PM మహిళల జంట - భారతదేశం vs నియు - 1 PM - 4 PM పురుషుల ఫోర్- భారత్ vs కుక్ ఐలాండ్స్ మరియు ఇంగ్లండ్ - రాత్రి 7.30-10.30 PM మహిళల ట్రిపుల్ - ఇండియా vs నియు - 7.30 PM స్క్వాష్ మిక్స్డ్ డబుల్స్ రౌండ్ ఆఫ్ 32 వర్సెస్ శ్రీలంక - 3.30 PM వెయిట్‌లిఫ్టింగ్: పురుషుల 109 కేజీలు - లోవ్‌ప్రీత్ సింగ్ - 2 PM మహిళల 87 కేజీలు - పూర్ణిమ పాండే - సాయంత్రం 6.30 PM పురుషుల 109+కేజీలు - గుర్దీప్ సింగ్ - రాత్రి 11 PM 𝙄𝙩 𝙝𝙖𝙥𝙥𝙚𝙣𝙨 𝙤𝙣𝙡𝙮 𝙖𝙩 𝙩𝙝𝙚 𝘾𝙤𝙢𝙢𝙤𝙣𝙬𝙚𝙖𝙡𝙩𝙝 𝙂𝙖𝙢𝙚𝙨 🙌 Guess who were out there to cheer for our women's hockey team?😎💪 🏏@BCCIWomen 🤝 @TheHockeyIndia🏑 📷 @imharleenDeol/@WeAreTeamIndia | #B2022 pic.twitter.com/KHyw61Qvja — Team India (@WeAreTeamIndia) August 2, 2022 చదవండి: CWG 2022: పీవీ సింధు మాత్రమే.. బ్యాడ్మింటన్ మిక్స్డ్ టీమ్‌కు రజతం Lan Bowls CWG 2022: ఊహించని ఫలితం.. ‘ఆనందం నాలుగింతలు’ -
CWG 2022: అథ్లెటిక్స్ ఫైనల్లో ముగ్గురు...
కామన్వెల్త్ గేమ్స్ అథ్లెటిక్స్‌లో భారత క్రీడాకారులు శుభారంభం చేశారు. పురుషుల లాంగ్‌జంప్‌లో మురళీ శ్రీశంకర్, మొహమ్మద్ అనీస్ యాహియా... మహిళల షాట్‌పుట్‌లో మన్‌ప్రీత్ కౌర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. మంగళవారం జరిగిన లాంగ్‌జంప్ క్వాలిఫయింగ్‌లో గ్రూప్ ‘ఎ’లో పోటీపడ్డ శ్రీశంకర్ 8.05 మీటర్ల దూరం గెంతి తన గ్రూప్‌లో టాపర్‌గా నిలిచాడు. గ్రూప్ ‘బి’లో యాహియా 7.68 మీటర్ల దూరం గెంతి మూడో స్థానంలో నిలిచాడు. రెండు గ్రూప్‌ల నుంచి కలిపి టాప్–12లో నిలిచినవారికి ఫైనల్ బెర్త్‌లు ఖరారయ్యాయి. షాట్‌పుట్ క్వాలిఫయింగ్‌లో మన్‌ప్రీత్ కౌర్ ఇనుప గుండును 16.78 మీటర్ల దూరం విసిరి ఓవరాల్‌గా ఏడో ర్యాంక్‌తో ఫైనల్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. మహిళల 100 మీటర్ల విభాగంలో భారత స్టార్ స్ప్రింటర్ ద్యుతీచంద్ హీట్స్‌లోనే వెనుదిరిగింది. ఐదో హీట్‌లో పాల్గొన్న ద్యుతీచంద్ 11.55 సెకన్లలో గమ్యానికి చేరి నాలుగో స్థానంలో నిలిచింది. ఓవరాల్‌గా ద్యుతీచంద్ 27వ ర్యాంక్‌లో నిలిచి సెమీఫైనల్‌కు అర్హత పొందలేకపోయింది. చదవండి: CWG 2022: పీవీ సింధు మాత్రమే.. బ్యాడ్మింటన్ మిక్స్డ్ టీమ్‌కు రజతం -
పీవీ సింధు మాత్రమే.. బ్యాడ్మింటన్ మిక్స్డ్ టీమ్‌కు రజతం
కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ పతకాల జోరు కొనసాగుతుంది. తాజాగా భారత్ ఖాతాలో 13వ పతకం వచ్చి చేరింది. భారత బ్యాడ్మింటన్ మిక్సడ్ టీమ్ విభాగం రజత పతకం సాధించింది. మంగళవారం అర్థరాత్రి మలేషియాతో జరిగిన మిక్స్డ్ టీమ్ ఫైనల్లో 3-1 తేడాతో ఓడిన భారత జట్టు రజతం గెలుచుకుంది. పీవీ సింధు మినహా మిగతావారు ఓటమి పాలవ్వడంతో భారత్ రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ముందుగా భారత షెట్లర్లు చిరాగ్ శెట్టి- సాత్విక్ సాయిరాజ్ మలేషియాకు చెందిన టెంగ్ ఫాంగ్ ఆరోన్ చియా,వూయి యిక్‌తో జరిగిన పురుషులు డబుల్స్ మ్యాచ్‌లో పరాజయం పాలయ్యారు. ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో 21-18,21-15 తేడాతో చిరాగ్-సాత్విక్ జంట ఓటమి చవిచూసింది. అనంతరం సింగిల్స్‌లో భాగంగా పీవీ సింధు.. మలేషియా స్టార్ జిన్ వెయ్-గోహ్‌ను 22-20, 21-17తో మట్టికరిపించి మ్యాచ్ గెలిచింది. మూడో మ్యాచ్‌గా జరిగిన పురుషుల సింగిల్స్‌లో భారత్ షెట్లర్ కిడాంబి శ్రీకాంత్.. మలేషియా షెట్లర్ జె యోంగ్ చేతిలో 21-19,6-21,21-16తో ఓడిపోయాడు. దీంతో మలేషియా 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఇక నిర్ణయాత్మకమైన నాలుగో మ్యాచ్ అయిన మహిళల డబుల్స్‌లో భారత్ జోడి త్రీసా జోలీ-గాయత్రి గోపిచంద్ చేతులెత్తేసింది. మలేషియన్ జంట మురళీధరన్ తీనా- కూంగ్ లే పెర్లీ టాన్ చేతిలో 21-18,21-17తో భారత్ జంట ఓటమి పాలవ్వడంతో భారత్ ఖాతాలో రజతం వచ్చి చేరింది. ప్రస్తుతం భారత్ ఖాతాలో 13 పతకాలు ఉండగా.. అందులో 5 స్వర్ణం, ఐదు రజతం, మూడు కాంస్యాలు ఉన్నాయి. SILVER FOR INDIA 🇮🇳 Indian #Badminton Mixed Team puts up a brilliant show of team play, grit, resilience to bag its 2nd consecutive medal🥇🥈 at #CommonwealthGames A mix of comebacks & dominance by our Champs lead 🇮🇳 to this 🥈 at @birminghamcg22 Well played 👏#Cheer4India pic.twitter.com/AMj8q9sAik — SAI Media (@Media_SAI) August 2, 2022 చదవండి: Lan Bowls CWG 2022: ఊహించని ఫలితం.. ‘ఆనందం నాలుగింతలు’ CWG 2022: ఫ్రెంచ్ ఫ్రైస్ ధర తెలిస్తే షాకవ్వడం ఖాయం! -
Lan Bowls: ఊహించని ఫలితం.. ‘ఆనందం నాలుగింతలు’
సాధారణంగానైతే కామన్వెల్త్ క్రీడల్లో పతకం... అదీ స్వర్ణం సాధించిన వారి గురించి ఇలాంటి పరిచయ కార్యక్రమం అవసరం ఉండదు. కానీ లాన్ బౌల్స్ ఆట గురించే అరుదుగా తెలిసిన దేశంలో అందులోని క్రీడాకారుల గురించి అంతకంటే ఎక్కువగా తెలిసే అవకాశం లేదు. అసలు ప్రాచుర్యం పొందని ఆటను ఎంచుకోవడంలోనే ఒక సాహసం ఉంటే ఇప్పుడు అదే క్రీడలో కామన్వెల్త్ క్రీడల పసిడి గెలుచుకోవడం అసాధారణం. కానీ పై నలుగురు మహిళలు దానిని చేసి చూపించారు. ఒక్కసారిగా అందరి దృష్టీ తమపై పడేలా చేశారు. సగటు క్రీడాభిమాని భాషలో... ‘ఆట గురించైతే పూర్తిగా తెలీయదు, కానీ ఫలితం చూస్తే ఆనందం మాత్రం వేసింది’ అనడం సరిగ్గా సరిపోతుందేమో! –సాక్షి క్రీడా విభాగం లాన్ బౌల్స్ స్వర్ణం గెలిచిన నలుగురికీ క్రీడాకారులుగా ఇది రెండో ఇన్నింగ్స్ అని చెప్పవచ్చు. గాయాల కారణంగా లవ్లీ, నయన్మోని కెరీర్లు అర్ధాంతరంగా ఆగిపోతే క్రీడల్లో కొనసాగాలనే ఆసక్తితో మరో కొత్త ఆటను ఎంచుకోవాల్సి వచ్చింది. ఢిల్లీ యూనివర్సిటీ తరఫున క్రికెట్ ఆడిన పింకీ పని చేస్తున్న పాఠశాల ఒకసారి నేషనల్ లాన్ బౌల్స్‌కు వేదికైంది. ఆ సమయంలో ఆటను చూసిన ఆమె కొద్ది రోజుల్లోనే దానిని నేర్చుకోవడంతో పాటు జాతీయ శిబిరానికి అర్హత సాధించింది. టీమ్ గేమ్ కాకుండా వ్యక్తిగత క్రీడకు మారాలనుకున్న రూప అనుకోకుండా బౌల్స్ వైపు వచ్చింది. జాతీయ చాంపియన్‌షిప్‌లో కాంస్యం గెలిచినప్పుడు జార్ఖండ్ ప్రభుత్వం అందించిన నగదు పురస్కారం కబడ్డీకంటే ఎక్కువగా ఉండటంతో ఇక్కడే కొనసాగింది. మన దేశంలో లాన్ బౌల్స్ ఆడేందుకు తగిన సౌకర్యాలు కనిపించవు. ప్రమాణాలకు అనుగుణంగా లాన్స్ లేకపోవడంతో పాటు బౌల్స్ కూడా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ల నుంచి తెప్పించాల్సి ఉంటుంది. ఇలాంటి స్థితిలో వీరు ప్రతికూలతలను దాటి ఇలాంటి విజయం సాధించడం గొప్ప ఘనతగా చెప్పవచ్చు. మాజీ క్రికెట్ అంపైర్ అయిన మధుకాంత్ పాఠక్ వీరందరికీ కోచింగ్ ఇచ్చారు. 2014 గ్లాస్గో కామన్వెల్త్ క్రీడలకు ముందు భారత ఆటగాళ్లు సింథటిక్ గ్రాస్‌పై ప్రాక్టీస్ చేయగా... అక్కడికి వెళ్లాక సహజమైన పచ్చిక ఎదురైంది. దాంతో వారి ఆటలో గందరగోళం కనిపించింది. సహజ పచ్చికపై బౌల్ చేసేందుకు ఎక్కువగా భుజ బలం అవసరం. అక్కడ దెబ్బతిన్న వీరు ఆ తర్వాత సాధనను మార్చారు. ప్రైవేట్ రిసార్ట్‌లలో మాత్రమే ఉండే సౌకర్యాలను సొంత ఖర్చులతో ఉపయోగించుకున్నారు. వేర్వేరు పోటీల ద్వారా పరిచయమైన ఈ నలుగురు దాదాపు పదేళ్లుగా కలిసి ఆడుతున్నారు. 2010 కామన్వెల్త్ క్రీడల్లో పెయిర్స్ విభాగంలో రూప, పింకీ కాంస్యానికి చేరువగా వచ్చి పతకం కోల్పోయారు. వీరిద్దరితో పాటు 2014, 2018లో లవ్లీతో కలిసి ‘ట్రిపుల్స్’ ఆడగా క్వార్టర్ ఫైనల్‌కే పరిమితమయ్యారు. ఇప్పుడు నయన్మోని కలిసి రాగా నలుగురి బృందం ‘ఫోర్స్’లో గోల్డ్‌వైపు సాగిపోయింది. గత ఓటముల బాధ తాజా విజయపు ఆనందాన్ని రెట్టింపు చేసిందనడంలో సందేహం లేదు. గెలుపు ఖరారైన క్షణాన, పతకాలు అందుకునేటప్పుడు వారి సంబరాల్లో అది స్పష్టంగా కనిపించింది. నలుగురితో పాటు దశాబ్దకాలంగా జట్టు మేనేజర్‌గా ఉన్న అంజు లుత్రా పాత్ర కూడా ఇందులో చాలా ఉంది. తన కుమార్తెలవంటి వీరితో సుదీర్ఘ కాలంగా సాగించిన ప్రయాణం తర్వాత దక్కిన ఈ పతకం ఆమెనూ భావోద్వేగానికి గురి చేసింది. ఒక రకంగా వీరందరికీ కామన్వెల్త్ క్రీడలు చావో, రేవోగా మారాయి. ఎవరూ పట్టించుకోని ఆటలో ఇంకో పరాజయం అంటే ఇక కెరీర్లు ముగిసినట్లే అని భావించారు. ఇప్పటి వరకు ఎంతో కొంత సహకారం అందించివారు కూడా సహజంగానే వెనక్కి తగ్గుతారు. ఇలాంటి స్థితిలో దక్కిన విజయం కచ్చితంగా వారితో పాటు ఆటను కూడా ఒక మెట్టు ఎక్కిస్తుందనడంలో సందేహం లేదు. లవ్లీ చౌబే: వయసు 42 ఏళ్లు, మాజీ స్ప్రింటర్, పోలీస్ కానిస్టేబుల్, జార్ఖండ్ పింకీ: 41 ఏళ్లు, మాజీ క్రికెటర్, పీఈటీ, ఢిల్లీ రూపా రాణి టిర్కీ: 34 ఏళ్లు, మాజీ కబడ్డీ క్రీడాకారిణి, జిల్లా క్రీడాధికారి, జార్ఖండ్ నయన్మోని సైకియా: 33 ఏళ్లు, మాజీ వెయిట్‌లిఫ్టర్, అటవీ అధికారి, అసోం HISTORY CREATED 🥳 1st Ever 🏅 in Lawn Bowls at #CommonwealthGames Women's Fours team win 🇮🇳 it's 1st CWG medal, the prestigious 🥇 in #LawnBowls by defeating South Africa, 17-10 Congratulations ladies for taking the sport to a new level🔝 Let's #Cheer4India#India4CWG2022 pic.twitter.com/uRa9MVxfRs — SAI Media (@Media_SAI) August 2, 2022 చదవండి: Commonwealth Games 2022: బౌల్స్‌లో బంగారం... టీటీలో పసిడి Emma McKeon: కామన్వెల్త్ క్రీడల్లో సంచలనం.. 12 స్వర్ణాలు సాధించిన ఆసీస్ స్విమ్మర్ -
CWG 2022: ఫ్రెంచ్ ఫ్రైస్ ధర తెలిస్తే షాకవ్వడం ఖాయం!
మాములుగా మనం తినే ఫ్రెంచ్ ఫ్రైస్ ధర రూ.100కు మించి ఉండదు. కానీ బర్మింగ్హమ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్‌కు వెళితే.. అక్కడ మీరు కొనుక్కునే ప్లేట్ ఫ్రెంచ్ ఫ్రైస్, సాసేజ్ బాక్స్ ధర ఎంత తెలుసా అక్షరాల వెయ్యి రూపాయలు. సాధారణంగా ఎక్కడైనా ఒక కార్యక్రమం జరుగుతుంటే అక్కడ పెట్టే షాపుల్లో బయటికన్నా ధరలు రెట్టింపు ఉండడం సహజం. కానీ కామన్వెల్త్ గేమ్స్‌కు వస్తున్న అభిమానులు ఏమైనా తినాలంటే పర్సు ఖాళీ చేయాల్సిందే. అంతలా మండిపోతున్నాయి అక్కడి రేట్లు. కామన్వెల్త్లో ఆయా దేశాలు ఆటగాళ్లు పతకాల పంట పండిస్తుంటే.. అక్కడి వ్యాపారులు మాత్రం కామన్వెల్త్ చూసేందుకు వస్తున్న అభిమానుల జేబులకు చిల్లు పెడుతూ తమ పంట పండించుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఫ్రెంచ్ ఫ్రైస్, ఒక సాసేజ్ ఉన్న బాక్సును ఏకంగా 9.80 యూరోలకు అమ్మేస్తున్నారు. భారత కరెన్సీలో ఇది సుమారు రూ.వెయ్యి రూపాయలు. అంటే ప్రేక్షకులు ఫ్రెంచ్ ఫ్రైస్, ఒక సాసేజ్ తీసుకుంటూ వెయ్యి రూపాయలు చెల్లించాల్సి ఉంటుందన్నమాట. ఇందులో భాగంగానే ఒక అభిమాని ట్విటర్ వేదికగా తన గోడును వెల్లబోసుకున్నాడు. ''కామన్వెల్త్ గేమ్స్ చూడడానికి ఎంతో దూరం నుంచి వచ్చాం. ఏమైనా తినాలని కొనడానికి వెళ్తే పర్సు ఖాళీ అవుతుంది. పోనీ అంత భారీ రేటుతో కొన్నా ఫ్రైంచ్ ఫ్రైస్ పచ్చిగానే ఉంటుంది.. వాటిని ఫ్రై చేయడానికి ఇంకా డబ్బులు తగలేస్తున్నామంటూ?'' ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక కామన్వెల్త్ గేమ్స్ 2022లో భారత్ పతకాల జోరు కొనసాగిస్తుంది. నాలుగు రోజుల్లో భారత్ ఖాతాల్లో 9 పతకాలు జమవ్వగా.. అందులో మూడు స్వర్ణం, మూడు రజతం.. మరో మూడు కాంస్య పతకాలు ఉన్నాయి. ప్రస్తుతం భారత్ పతకాల పట్టికలో ఆరో స్థానంలో కొనసాగుతుంది. Hello @FootyScran, this is the sausage and chips I had at the Sandwell Leisure Centre ahead of tonight's swimming events at @birminghamcg22. This cost £9.80! 🙂 pic.twitter.com/cZAaRg25Cl — Matthew (The Pieman) Williams (@Matthew23732409) July 29, 2022 చదవండి: CWG 2022: కామన్వెల్త్లో అపశ్రుతి.. తీవ్రంగా గాయపడ్డ భారత మహిళా సైక్లిస్ట్ Common Wealth Games 2022: స్వర్ణంపై భారత్ గురి.. అసలు లాన్ బౌల్స్ అంటే ఏమిటి? -
కామన్వెల్త్లో అపశ్రుతి.. తీవ్రంగా గాయపడ్డ భారత సైక్లిస్ట్
బర్మింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. పోటీల్లో పాల్గొన్న భారత్ మహిళా సైక్లిస్ట్ మీనాక్షి తీవ్రంగా గాయపడింది. విషయంలోకి వెళితే.. గేమ్స్‌లో భాగంగా సోమవారం సైక్లింగ్‌లో 10కి.మీ స్క్రాచ్ రేసు జరిగింది. ఈ పోటీల్లో భారత్ నుంచి మహిళా సైక్లిస్ట్ మీనాక్షి పాల్గొంది. పోటీ ప్రారంభమైన కాసేపటికే ఈ మీనాక్షి సైకిల్‌పై నుంచి జారిపడి ట్రాక్ అంచుకు చేరుకుంది. అదే సమయంలో న్యూజిలాండ్‌కు చెందిన బ్రయోనీ బోథా సైకిల్ వేగంగా మీనాక్షిపై దూసుకెళ్లింది. దీంతో బ్రయోనీ బోథా కూడా సైకిల్‌పై నుంచి కిందకు పడిపోయింది. ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని రైడర్‌లిద్దరినీ పోటీ నుంచి తప్పించారు. మీనాక్షిని వెంటనే అక్కడి నుంచి స్ట్రెచర్‌పై తీసుకెళ్లారు. కాగా ఈ ఈవెంట్లో ఇంగ్లండ్‌కు చెందిన లారా కెన్నీ స్వర్ణ పతకం గెలుచుకుంది. కాగా మీనాక్షి ప్రమాదానికి గురైన దృశ్యాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఇదే లీ వ్యాలీవెలో పార్క్ వద్ద ఇది రెండో ప్రమాదం. ఇంగ్లండ్‌కు చెందిన మాట్ వాల్స్ కూడా ఈవెంట్లో సైకిల్‌పై నుంచి పడిపోయాడు. అతనికి కుట్లు పడ్డాయి. అదే సమయంలో కెనడాకు చెందిన సైక్లిస్టులు మాట్ బోస్టాక్, డెరెక్ జి కూడా ఆసుపత్రి పాలయ్యారు. Horrible accident involving Indian cyclist Meenakshi at the Velodrome. Hope she’s ok! #CommonwealthGames #B2022 pic.twitter.com/o0i4CE7M82 — Sahil Oberoi (@SahilOberoi1) August 1, 2022 చదవండి: CWG 2022: కామన్వెల్త్లో భారత్ జోరు.. ఖాతాలో తొమ్మిదో పతకం -
కామన్వెల్త్ గేమ్స్ ఐదో రోజు భారత్ షెడ్యూల్ ఇదే..
కామన్వెల్త్ గేమ్స్‌లో భారత ఆటగాళ్లు తమ జోరు చూపిస్తున్నారు. ఇప్పటివరకు భారత్ ఖాతాలో తొమ్మిది పతకాలు ఉండగా.. మూడు స్వర్ణం, 3 రజతం, మూడు కాంస్యాలు ఉన్నాయి. ఇక ఐదో రోజు ఆటలో భారత్ ఎన్ని పతకాలు కొల్లగొట్టనుందనేది ఆసక్తికరంగా మారింది. ఐదోరోజు భారత్ పాల్గొనబోయే ఈవెంట్స్ ఒకసారి పరిశీలిస్తే.. ►1 PM (లాన్ బౌల్స్): మహిళల జంట- భారత్ vs న్యూజిలాండ్ మహిళల ట్రిపుల్స్- భారత్ vs న్యూజిలాండ్ ►2 PM (వెయిట్ లిఫ్టింగ్):మహిళల 76 కేజీలు- పూనమ్ యాదవ్ ►2:30 PM (అథ్లెటిక్స్ మరియు పారా అథ్లెటిక్స్): పురుషుల లాంగ్ జంప్ క్వాలిఫైయింగ్- ఎం శ్రీశంకర్, మహమ్మద్ అనీస్ యాహియా ►3:04 PM (స్విమ్మింగ్): పురుషుల 200 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ -శ్రీహరి నటరాజ్ ►3:30 PM (అథ్లెటిక్స్ మరియు పారా అథ్లెటిక్స్): మహిళల షాట్‌పుట్ క్వాలిఫైయింగ్- మన్‌ప్రీత్ కౌర్ ►4:10 PM (స్విమ్మింగ్): పురుషుల 1500మీ ఫ్రీస్టైల్ హీట్ 1- అద్వైత్ పేజీ ►4:15 (లాన్ బౌల్స్): మహిళల ఫోర్స్ ఫైనల్స్- భారత్ vs సౌతాఫ్రికా పురుషుల సింగిల్స్- మృదుల్ బోర్గోహైన్ vs షానన్ మెసిలోరీ ►4:28 PM (స్విమ్మింగ్): పురుషుల 1500 మీటర్ల ఫ్రీస్టైల్ హీట్ 2- కుశాగ్రా రావత్ ►5:17 PM (అథ్లెటిక్స్):మహిళల 100మీ రౌండ్ 1 - హీట్ 5 - ద్యుతీ చంద్ ►06:00PM (టేబుల్ టెన్నిస్): పురుషుల టీమ్ ఫైనల్ - ఇండియా vs సింగపూర్ ►6:30PM (హాకీ): మహిళల మ్యాచ్- భారత్ vs ఇంగ్లండ్ ►6:30 PM (వెయిట్ లిఫ్టింగ్): పురుషుల 96 కేజీలు- వికాస్ ఠాకూర్ ►8:30 PM (స్క్వాష్): మహిళల సింగిల్స్ ప్లేట్ సెమీఫైనల్స్- సునయన సనా కురువిల్లా vs ఫైజా జాఫర్ ►8:45 PM (లాన్ బౌల్స్): పురుషుల ఫోర్లు- భారత్ vs ఫిజీ మహిళల ట్రిపుల్స్- భారత్ vs ఇంగ్లండ్ ►9:15PM (స్క్వాష్): పురుషుల స్క్వాష్ సెమీఫైనల్స్- సౌరవ్ ఘోసల్ vs పాల్ కోల్ ►10:00PM (బ్యాడ్మింటన్): మిక్స్డ్ టీమ్ గోల్డ్ మెడల్ మ్యాచ్ - ఇండియా vs మలేషియా ►11 PM (వెయిట్ లిఫ్టింగ్): మహిళల 87 కేజీలు- ఉషా బన్నూర్ ఎన్కే ►11:45 PM (బాక్సింగ్): పురుషుల వెల్టర్ వెయిట్- రోహిత్ టోకాస్ vs ఆల్ఫ్రెడ్ కోటే ►12:52 AM (ఆగస్టు 3): (అథ్లెటిక్స్ మరియు పారా అథ్లెటిక్స్) మహిళల డిస్కస్ త్రో ఫైనల్- సీమా పునియా, నవజీత్ కౌర్ ధిల్లాన్ Day 5️⃣ at CWG @birminghamcg22 Take a 👀 at #B2022 events scheduled for 2nd August Catch #TeamIndia🇮🇳 in action on @ddsportschannel & @SonyLIV and don’t forget to send in your #Cheer4India messages below#IndiaTaiyaarHai #India4CWG2022 pic.twitter.com/0waVvMwsI9 — SAI Media (@Media_SAI) August 2, 2022 -
కామన్వెల్త్లో భారత్ జోరు.. ఖాతాలో తొమ్మిదో పతకం
బర్మింగహమ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2022లో వెయిట్ లిఫ్టింగ్ విభాగం నుంచి ఆరు పతకాలు కొల్లగొట్టిన భారత్.. తాజాగా ఆ విభాగంలో ఏడో పతకం సాధించింది. భారత కాలమాన ప్రకారం సోమవారం అర్థరాత్రి మహిళల వెయిట్‌లిఫ్టింగ్ 71 కేజీల విభాగంలో జరిగిన మ్యాచ్‌లో హర్జీందర్ కౌర్ కాంస్య పతకాన్ని అందుకుంది. స్నాచ్ కేటగిరీలో 93 కేజీలు.. క్లీన్ అండ్ జెర్క్ కేటగిరీలో 119 కేజీలు.. మొత్తం 212 కేజీలు ఎత్తి కాంస్యం ఒడిసి పట్టింది. ఇంగ్లండ్‌కు చెందిన సారా డేవిస్ స్వర్ణం దక్కించుకుంది. తాజా పతకంతో ఓవరాల్‌గా భారత్ ఖాతాలో తొమ్మిదో పతకం చేరగా.. అందులో 3 స్వర్ణాలు, 3 రజతాలు.. మరో మూడు కాంస్యాలు ఉన్నాయి. కాగా స్నాచ్ కేటగిరిలో మొదటి ప్రయత్నంలో 90 కేజీలు ఎత్తడంలో హర్జీందర్ విఫలమైంది. తన రెండో ప్రయత్నంలో 90 కేజీలు ఎత్తిన ఆమె.. మూడో ప్రయత్నంలో 93 కేజీల బరువును ఎత్తి కెరీర్ బెస్ట్ నమోదు చేసింది. ఇక క్లీన్ అండ్ జెర్క్ కేటగిరీలో మొదటి ప్రయత్నంలో 113 కేజీలు, రెండో ప్రయత్నంలో 116 కేజీలు విజయవంతగా ఎత్తిన హర్జీందర్ కౌర్.. మూడో ప్రయత్నంలో 119 కేజీల బరువును ఎత్తి ఓవరాల్‌గా 212 కేజీలతో కాంస్యం దక్కించుకుంది. 9️⃣th medal for 🇮🇳 at @birminghamcg22 🤩🤩 After high voltage 🤯 drama India's #HarjinderKaur bags 🥉 in Women's 71kg Final with a total lift of 212Kg 🏋♂️ at #B2022 Snatch- 93kg Clean & Jerk- 119kg With this #TeamIndia🇮🇳 wins its 7️⃣th Medal in 🏋♀️🏋♂️ 💪💪#Cheer4India🇮🇳 pic.twitter.com/D13FqCqKYs — SAI Media (@Media_SAI) August 1, 2022 చదవండి: Common Wealth Games 2022: స్వర్ణంపై భారత్ గురి.. అసలు లాన్ బౌల్స్ అంటే ఏమిటి? -
స్వర్ణంపై భారత్ గురి.. అసలు లాన్ బౌల్స్ అంటే ఏమిటి?
బర్మింగ్‌హామ్: లాన్ బౌల్స్... కామన్వెల్త్ క్రీడలు ప్రారంభమైన నాటినుంచి ఒక్కసారి మినహా ప్రతీసారి ఈ మెగా ఈవెంట్లో భాగంగా ఉంది. 2010 నుంచి మాత్రమే పాల్గొంటున్న భారత్ అత్యుత్తమంగా నాలుగో స్థానంలో నిలిచింది. అయితే ఇప్పుడు మన మహిళలు కొత్త చరిత్రను సృష్టించారు. లాన్ బౌల్స్ ‘ఫోర్స్’ ఫార్మాట్లో ఫైనల్‌కు చేరి పతకం ఖాయం చేశారు. లవ్లీ చౌబే, రూపా రాణి టిర్కీ, పింకీ, నయన్మోని సైకియా సభ్యులుగా ఉన్న భారత బృందం సెమీఫైనల్లో 16–13 పాయింట్ల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించింది. నేడు దక్షిణాఫ్రికాతో జరిగే ఫైనల్లో విజయం సాధిస్తే భారత్‌కు స్వర్ణ పతకం దక్కుతుంది. ఓడితే రజతం లభిస్తుంది. భారత పురుషుల జట్టు మాత్రం 8–26 తేడాతో నార్తర్న్ ఐర్లాండ్ చేతిలో ఓడి క్వార్టర్ ఫైనల్లో నిష్క్రమించింది. ‘లాన్ బౌల్స్’ ఎలా ఆడతారంటే... సింగిల్స్, డబుల్స్‌లతో పాటు టీమ్‌లో నలుగురు ఉండే ‘ఫోర్స్’ ఫార్మాట్లు ఇందులో ఉన్నాయి. పచ్చిక మైదానంలో ఆడే ఈ ఆటలో ‘బౌల్స్’గా పిలిచే రెండు పెద్ద సైజు బంతులతో పాటు ‘ది జాక్’ అని చిన్న బంతి కూడా ఉంటుంది. టాస్ వేసి ముందుగా ఎవరు బౌల్ చేస్తారో, ఎవరు జాక్‌ను విసురుతారో తేలుస్తారు. ముందుగా ఒకరు ‘జాక్’ను అండర్ ఆర్మ్ త్రో తో విసురుతారు. ఆపై మరో జట్టు సభ్యులకు బౌల్స్ విసిరే అవకాశం లభిస్తుంది. ‘ఫోర్స్’ ఫార్మాట్లో ఒక్కో జట్టు ఒక్కో రౌండ్ (ఎండ్)లో ఎనిమిది త్రోలు విసరవచ్చు. ఇలా 18 రౌండ్లు ఉంటాయి. ‘జాక్’కు సాధ్యమైనంత దగ్గరగా బౌల్ చేయడమే ఫలితాన్ని నిర్దేసిస్తుంది. ప్రత్యర్థికంటే ఎన్ని తక్కువ ప్రయత్నాల్లో జాక్‌కు దగ్గరగా బౌల్ చేయగలరో అన్ని పాయింట్లు జట్టు ఖాతాలో చేరతాయి. చివర్లో ఈ పాయింట్లను లెక్కకట్టి విజేతను నిర్ణయిస్తారు. 🇮🇳 Creates History at @birminghamcg22 🔥 India's #LawnBowl Women's Four team creates history by becoming the 1st Indian Team to reach the Finals of #CommonwealthGames India 🇮🇳 16- 13 🇳🇿 New Zealand (SF) They will now take on South Africa in the Finals on 2nd Aug#Cheer4India pic.twitter.com/tu64FSoi8R — SAI Media (@Media_SAI) August 1, 2022 చదవండి: Commonwealth Games 2022: సుశీలకు చేజారిన స్వర్ణం -
Commonwealth Games: మరో రెండు పతకాలు ఖాయం చేసుకున్న భారత్
కామన్ వెల్త్ గేమ్స్-2022లో భారత్‌కు మరో రెండు పతకాలు ఖాయమయ్యాయి. జూడో 48 కేజీ విభాగంలో భారత అథ్లెట్ సుశీలా దేవి లిక్మాబమ్ ఫైనల్‌కు చేరుకుంది. సోమవారం జరిగిన సెమీఫైనల్లో మారిషస్‌కు చెందిన ప్రిస్సిల్లా మోరాండ్పై సుశీలా దేవి విజయం సాధించి పతకాన్ని ఖాయం చేసుకుంది. ఒక వేళ ఫైనల్లో సుశీలా దేవి దేవి ఓటమి చెందిన రజత పతకమైన భారత్ ఖాతాలో చేకూరుతుంది. మరో వైపు లాన్ బౌల్స్ క్రీడలో భారత జట్టు ఫైనల్లో అడుగుపెట్టింది. మహిళల ఫోర్స్ లాన్ బౌల్స్ జట్టు సెమీఫైనల్లో న్యూజిలాండ్‌ను 16-13తో ఓడించింది. తత్వారా కామన్ వెల్త్ గేమ్స్‌లో మరో పతకం భారత్ ఖాతాలో చేరనుంది. కాగా లాన్ బౌల్స్ క్రీడలో భారత్ తొలి సారి పతకం సాధించబోతుండడం గమనార్హం. ఇక కామన్ వెల్త్ గేమ్స్‌లో భారత అథ్లెట్లు సత్తా చాటుతున్నారు. ఇప్పటి వరకు భారత్ ఖాతాలో ఇప్పటికే ఆరు పతకాలు ఉన్నాయి. వాటిలో మూడు గోల్డ్ మెడల్స్, రెండు రజత పతకాలు, ఒక్క కాంస్య పతకం ఉంది. కాగా ఇప్పటి వరకు భారత అథ్లెట్లు సాధించిన పతకాలన్నీ వెయిట్ లిఫ్టింగ్‌లో సాధించినవే కావడం విశేషం. మహిళల కేటగిరిలో మీరాబాయ్ చాను 49 కేజీల విభాగంలో స్వర్ణం, జెరెమీ లాల్రిన్నుంగ 67 కేజీల విభాగంలో స్వర్ణం, 73 కేజీల విభాగంలో అచింత షెవులి స్వర్ణం, 55 కేజీల విభాగంలో సంకేత్ మహదేవ్ సార్గర్ రజతం, 55 కేజీల విభాగంలో బింద్యారాణి దేవి రజతం, 61 కేజీల విభాగంలో గురురాజ్ పూజారి కాంస్య పతకం సాధించారు. చదవండి: Mirabai Chanu: ‘పుత్రికోత్సాహం’తో పొంగిపోయిన మీరాబాయి తల్లి! వీడియో వైరల్ -
కామన్వెల్త్ గేమ్స్ నాలుగో రోజు భారత షెడ్యూల్ ఇదే..!
కామన్వెల్త్ గేమ్స్ మొదటి మూడు రోజుల్లో ఊహించని ఫలితాలతో సత్తా చాటిన భారత బృందం నాలుగో రోజు (ఆగస్ట్ 1) కూడా అదే జోరును కొనసాగించాలని భావిస్తుంది. ఇప్పటికే ఆరు మెడల్స్ (3 స్వర్ణాలు, రెండు రజతాలు, ఓ కాంస్యం) సాధించి పతకాల జాబితాలో ఆరో స్థానంలో ఉన్న భారత్.. నాలుగో రోజు మరిన్ని పతకాలు సాధించాలని పట్టుదలగా ఉంది. ఇవాళ భారత్ పాల్గొనబోయే ఈవెంట్స్ విషయానికొస్తే.. లాన్ బౌల్స్ (మధ్యాహ్నం 1 నుంచి ప్రారంభం) ఉమెన్స్ ఫోర్ సెమీ ఫైనల్ జూడో (మధ్యాహ్నం 2.30 నుంచి మొదలు) మెన్స్ 66 కేజీలు రౌండ్ 16 - జస్లీన్ సింగ్ సైని ఉమెన్స్ 57 కేజీలు రౌండ్ 16 - సుచికా తరియాల్ మెన్స్ 60 కేజీలు రౌండ్ 16 - విజయ్ కుమార్ యాదవ్ ఉమెన్స్ 48 కేజీలు - క్వార్టర్ ఫైనల్ - సుశీలా దేవి స్క్వాష్ (సాయంత్రం 4.30 నుంచి ప్రారంభం) ఉమెన్స్ సింగిల్స్ ప్లాటర్ క్వార్టర్ ఫైనల్ - సునయన సారా కురివిల్లా ఉమెన్స్ సింగిల్స్ క్వార్టర్ ఫైనల్ - జాషువా చిన్నప్ప (సాయంత్రం 6 గంటలు) స్విమ్మింగ్ (మధ్యాహ్నం 3.51 నుంచి ప్రారంభం) మెన్స్ 100 మీటర్స్ - బటర్ ఫ్లై హీట్ 6 - సజన్ ప్రకాష్ బాక్సింగ్ (సాయంత్రం 4.45 నుంచి ప్రారంభం) 48 51 కేజీల కేటగిరీ - ఫ్లై వెయిట్ రౌండ్ 16 - అమిత్ ఫంగల్ 54 57 కేజీలు - ఫెథర్ వెయిట్ రౌండ్ 16 - హుసాముద్దీన్ మహమ్మద్ (సాయంత్రం 6 గంటలకు) 75 80 కేజీలు - లైట్ హెవీ వెయిట్ రౌండ్ 16 - ఆశిష్ కుమార్ (మధ్నాహ్నం 1 నుంచి ప్రారంభం) సైక్లింగ్ (సాయంత్రం 6.32 నుంచి ప్రారంభం) ఉమెన్స్ కీరెన్ ఫస్ట్ రౌండ్ - త్రియాశీ పాల్, శుశికల అగషే, మయూరీ లూటే మెన్స్ 40 కిమీ రేస్ క్వాలిఫయింగ్ - నమన్ కపిల్, వెంకప్ప, దినేష్ కుమార్, విశ్వజీత్ సింగ్ (సాయంత్రం 6.52 కి ప్రారంభం) హాకీ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ (రాత్రి 8.30) వెయిట్ లిఫ్టింగ్ మెన్స్ 81 కేజీలు - అజయ్ సింగ్ (మధ్యాహ్నం 2 గంటలు) ఉమెన్స్ 71 కేజీలు - హర్జీందర్ సింగ్ (రాత్రి 11 గంటలు) టేబుల్ టెన్నిస్ మెన్స్ టీమ్ సెమీ ఫైనల్ ఇండియా వర్సెస్ నైజీరియా (రాత్రి 11.30 ) పారా స్విమ్మింగ్ మెన్స్ 50 మీటర్స్ ఫ్రీ స్టైల్ ఎస్ 7 ఫైనల్ - నిరంజన్ ముకుందన్, సుహాస్ నారాయణన్ సోమవారం అర్ధరాత్రి తర్వాత చదవండి: రికార్డు సృష్టించిన అచింత షెవులి.. భారత్ ఖాతాలో మూడో స్వర్ణం -
CWG 2022: మా అమ్మ.. ఇంకా బంధువుల సంబరాలు! వీడియో వైరల్
Birmingham 2022- Mirabai Chanu: భారత స్టార్ వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను తల్లి టాంబీ దేవి ‘పుత్రికోత్సాహం’తో పొంగిపోయారు. బంధువులతో కలిసి తమ సంప్రదాయ శైలిలో నాట్యం చేస్తూ కూతురి విజయాన్ని ఆస్వాదించారు. కామన్వెల్త్ గేమ్స్-2022లో భాగంగా మీరాబాయి భారత్‌కు తొలి స్వర్ణ పతకం అందించిన సంగతి తెలిసిందే. వెయిట్‌లిఫ్టింగ్ 49 కేజీల విభాగం ఫైనల్లో మీరాబాయి స్నాచ్‌లో 88 కేజీలు, క్లీన్ అండ్ జర్క్‌లో 113 కేజీలు (మొత్తంగా 201 కేజీలు) ఎత్తి.. పసిడి పతకం గెలిచింది. టోక్యో ఒలింపిక్స్‌లో రజతం సాధించిన ఆమె.. ఈ ప్రతిష్టాత్మక క్రీడల్లో స్వర్ణం గెలిచి సత్తా చాటింది. తద్వారా బర్మింగ్‌హామ్‌లో భారత త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించి.. జాతికి గర్వకారణంగా నిలిచింది. ఈ క్రమంలో యావత్ భారతావనితో పాటు ఆమె కుటుంబ సభ్యులు కూడా సంతోషంలో మునిగిపోయారు. ఇక మీరాబాయి చాను తల్లి టాంబీ దేవి తమ ఇంట్లోనే సంబరాలు జరుపుకొన్నారు. My mom and other relatives celebrating victory at my home ✌️ pic.twitter.com/sTCIoTDVwM — Saikhom Mirabai Chanu (@mirabai_chanu) July 31, 2022 ఇందుకు సంబంధించిన వీడియోను మీరాబాయి సోషల్ మీడియాలో షేర్ చేసింది. ‘‘మా అమ్మ.. ఇంకా బంధువులు.. నా విజయాన్ని ఇంట్లో ఇలా సెలబ్రేట్ చేసుకున్నారు’’ అంటూ ఆమె తన ఆనందాన్ని పంచుకుంది. ఈ వీడియోను రీషేర్ చేస్తూ నెటిజన్లు మీరాబాయికి, ఆమె తల్లికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా మీరాబాయి 2014 గ్లాస్కో గేమ్స్‌లో రజతం.. 2018 గోల్డ్ కోస్ట్ గేమ్స్‌లో స్వర్ణం, టోక్యో ఒలింపిక్స్‌లో రజతం.. తాజాగా స్వర్ణం సాధించింది. మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చి.. మణిపూర్‌కు చెందిన మీరాబాయి చానుది మధ్యతరగతి కుటుంబం. కుటుంబ సభ్యులతో కలిసి వంట కలప కోసం వెళ్లినపుడు తన అన్న కంటే ఎక్కువ బరువుల్ని మోసిన మీరాబాయి.. అప్పుడే తనలోని ప్రతిభను వారికి పరిచయం చేసింది. ఈ క్రమంలో ఆమెను ప్రోత్సహించిన కుటుంబం.. అంచెలంచెలుగా ఎదగడంలో అండగా నిలిచింది. తల్లితో మీరాబాయి చాను ఇక పదకొండేళ్ల వయసులోనే స్థానికంగా జరిగే వెయిట్‌లిఫ్టింగ్ పోటీల్లో పాల్గొనడం ప్రారంభించిన చాను.. 2014 గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్‌లో వెండి పతకం సాధించి వెలుగులోకి వచ్చింది. ఇక 2016లో రియో ఒలింపిక్స్‌లో విఫలమైనా... పడిలేచిన కెరటంలా 2017లో ప్రపంచ వెయిట్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్స్‌లో 48 కేజీల విభాగంలో స్వర్ణం గెలిచింది. ఇవేకాకుండా ఎన్నో అరదైన రికార్డులు తన ఖాతాలో వేసుకుంది. మీరాబాయి ప్రయాణంలో కుటుంబ సభ్యులు.. ముఖ్యంగా ఆమె తల్లి ప్రోత్సాహం ఎంతగానో ఉంది. చదవండి: Mirabai Chanu: మన 'బంగారు' మీరాబాయి CWG 2022: మీరాబాయి ఇచ్చిన బూట్లతో బరిలోకి దిగి.. రజతంతో -
CWG 2022: సెమీస్‌లో భారత బ్యాడ్మింటన్ జట్టు
కామన్వెల్త్ గేమ్స్ బ్యాడ్మింటన్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ సెమీఫైనల్లోకి ప్రవేశించింది. క్వార్టర్ ఫైనల్లో టీమిండియా 3–0తో దక్షిణాఫ్రికాపై గెలిచింది. తొలి మ్యాచ్‌లో సుమీత్ రెడ్డి–అశ్విని పొన్నప్ప ద్వయం... రెండో మ్యాచ్‌లో లక్ష్య సేన్... మూడో మ్యాచ్‌లో ఆకర్షి కశ్యప్ తమ ప్రత్యర్థులపై విజయం సాధించారు. స్క్వాష్‌లో మహిళల సింగిల్స్‌లో జోష్నా చినప్ప, పురుషుల సింగిల్స్‌లో సౌరవ్ క్వార్టర్ ఫైనల్ చేరారు. -
CWG 2022: పతకం రేసులో భారత టీటీ జట్టు
కామన్వెల్త్ క్రీడల టేబుల్ టెన్నిస్ (టీటీ) పురుషుల టీమ్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ భారత్ సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. ఆదివారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో భారత్ 3–0తో బంగ్లాదేశ్‌ను ఓడించింది. తొలి మ్యాచ్‌లో హర్మీత్–సత్యన్ జ్ఞానశేఖరన్ ద్వయం 11–8, 11–6, 11–2తో రమిహిమిలన్–అహ్మద్ జంటను ఓడించింది. రెండో మ్యాచ్‌లో శరత్ కమల్ 11–4, 11–7, 11–2తో రిఫాత్‌పై గెలిచాడు. మూడో మ్యాచ్‌లో జ్ఞానశేఖరన్ 11–2, 11–3, 11–5తో అహ్మద్‌పై నెగ్గి భారత విజయాన్ని ఖాయం చేశాడు. -
కామన్వెల్త్ క్రీడల్లో రికార్డు.. ఘనాపై భారీ విజయం సాధించిన టీమిండియా
కామన్వెల్త్ క్రీడల్లో భారత పురుషుల హాకీ జట్టు రికార్డు విజయం నమోదు చేసింది. పూల్-బిలో జరిగిన మ్యాచ్‌లో ఘనాపై ఏకంగా 11-0 తేడాతో భారీ విజయం సాధించింది. కామన్వెల్త్ క్రీడల్లో భారత్ సాధించిన అత్యంత భారీ విజయం ఇదే. 1998 గేమ్స్‌లో ట్రినిడాడ్‌పై భారత్ 10–1తో నెగ్గింది. GOAL! Harmenpreet hits a hatrick, having just scored another goal for India, Harmanpreet Singh is sustaining his title of "Best Drag Flicker."IND 11:0 GHA #IndiaKaGame #HockeyIndia #B2022 #Birmingham2022 @CMO_Odisha @IndiaSports@sports_odisha @Media_S— Hockey India (@TheHockeyIndia) July 31, 2022 ఈ మ్యాచ్‌లో భారత ఆటగాడు హర్మన్‌ప్రీత్ సింగ్ అదిరిపోయే ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. హ్యాట్రిక్ గోల్స్‌తో ప్రత్యర్ధిపై విరుచుకుపడ్డాడు. మరో ఆటగాడు జుగ్రాజ్ సింగ్ కూడా రెండు గోల్స్‌తో ఆకట్టుకున్నాడు. భారత్ తర్వాతి మ్యాచ్‌లో పూల్-బి టాపర్ ఇంగ్లండ్‌తో తలపడనుంది. -
నిఖత్ పంచ్ అదిరె.. పతకం దిశగా దూసుకెళ్తున్న తెలంగాణ చిచ్చర పిడుగు
కామన్వెల్త్ గేమ్స్ మహిళల బాక్సింగ్‌లో భారత స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ (50 కేజీలు) క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. తొలి రౌండ్లో నిఖత్ పంచ్‌ల ధాటికి ప్రత్యర్థి హెలెనా (మొజాంబిక్) తట్టుకోలేక విలవిలలాడింది. దాంతో రిఫరీ మూడో రౌండ్ మధ్యలోనే బౌట్‌ను నిలిపివేసి నిఖత్‌ను విజేతగా ప్రకటించారు. నిఖత్ ఇటీవలే జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం నెగ్గి జోరుమీదున్న విషయం తెలిసిందే. ఈ పోటీల్లోనూ నిఖత్ పసిడి పంచ్ విసరాలని పట్టుదలగా ఉంది. క్వార్టర్స్‌లో నిఖత్.. న్యూజిలాండ్‌కు చెందిన గార్టన్తో తలపడనుంది. మరోవైపు పురుషుల 63.5 కేజీల విభాగంలో భారత స్టార్ బాక్సర్ శివ థాపాకు అనూహ్య పరాజయం ఎదురైంది. ప్రిక్వార్టర్స్‌లో థాపా 1-4తో రిసీ లించ్ (స్కాట్లాండ్) చేతిలో ఓటమి పాలయ్యాడు. -
రికార్డు సృష్టించిన అచింత షెవులి.. భారత్ ఖాతాలో మూడో స్వర్ణం
Achinta Sheuli: కామన్వెల్డ్ గేమ్స్ 2022లో భారత వెయిట్‌లిఫ్టర్ల హవా కొనసాగుతుంది. ఈ గేమ్స్ భారత్ ఇప్పటివరకు సాధించిన పతకాలన్నీ వెయిట్ లిఫ్టింగ్‌లో సాధించినవే కావడం విశేషం. ఈ క్రీడలో ఇప్పటికే 5 మెడల్స్ సాధించిన భారత్.. తాజాగా మరో పతకం ఖాతాలో వేసుకుంది. 73 కేజీల విభాగంలో అచింత షెవులి రికార్డు ప్రదర్శనతో పసిడి సాధించాడు. Achinta Sheuli bags #TeamIndia's third 🥇 at @birminghamcg22 👏🎆All three gold medals so far have been won by our weightlifters 🏋♂️🏋♀️🏋♂️#EkIndiaTeamIndia | @WeAreTeamIndia pic.twitter.com/kCJVxFVNYI— Team India (@WeAreTeamIndia) July 31, 2022 స్నాచ్‌లో 143 కేజీలు, క్లీన్ అండ్ జర్క్‌లో 170 కేజీల బరువు ఎత్తిన షెవులి.. మొత్తంగా 313 కేజీల బరువు ఎత్తి సరికొత్త కామన్వెల్త్ రికార్డు నెలకొల్పాడు. కామన్వెల్త్లో భారత్‌కు ఇది మూడో స్వర్ణం. 73 కేజీల ఈవెంట్లో మలేషియాకు చెందిన ఎర్రి హిదాయత్ మహమ్మద్ 303 కేజీల బరువు ఎత్తి రజతం సాధించగా.. కెనెడాకు చెందిన షాడ్ డార్సిగ్ని (298 కేజీలు) కాంస్యం దక్కించుకున్నాడు. ఇదిలా ఉంటే, ప్రస్తుతం జరుగుతున్న 22వ కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ పతకాల సంఖ్య మొత్తం ఆరుకు చేరింది. మహిళల కేటగిరిలో మీరాబాయ్ చాను 49 కేజీల విభాగంలో స్వర్ణం, జెరెమీ లాల్రిన్నుంగ 67 కేజీల విభాగంలో స్వర్ణం, 73 కేజీల విభాగంలో అచింత షెవులి స్వర్ణం, 55 కేజీల విభాగంలో సంకేత్ మహదేవ్ సార్గర్ రజతం, 55 కేజీల విభాగంలో బింద్యారాణి దేవి రజతం, 61 కేజీల విభాగంలో గురురాజ్ పూజారి కాంస్య పతకం సాధించారు. చదవండి: భారత్ ఖాతాలో మరో పతకం.. వెయిట్ లిఫ్టింగ్‌లో జెరెమీకి గోల్డ్ -
ధోని రికార్డు బద్దలు కొట్టిన టీమిండియా కెప్టెన్
కామన్వెల్త్ గేమ్స్ 2022 మహిళల క్రికెట్లో భాగంగా పాకిస్తాన్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో హర్మన్ ప్రీత్ కౌర్ నేతృత్వంలోని టీమిండియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో హర్మన్ పొట్టి ఫార్మాట్లో అత్యధిక విజయాలు సాధించిన భారత కెప్టెన్‌గా (పురుషులు, మహిళల క్రికెట్లో కలిపి) సరికొత్త రికార్డు (42 విజయాలు) నెలకొల్పింది. ఈ మ్యాచ్‌కు ముందు టీ20ల్లో టీమిండియా తరఫున అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా మాజీ సారధి మహేంద్ర సింగ్ ధోని (41 విజయాలు) ఉండేవాడు. తాజా విజయంతో హర్మన్.. ధోని రికార్డును బద్దలు కొట్టి పొట్టి ఫార్మాట్లో అత్యంత విజయవంతమైన భారత కెప్టెన్‌గా అవతరించింది. ఈ జాబితాలో మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి 30 విజయాలతో మూడో స్థానంలో ఉండగా.. ప్రస్తుత సారథి రోహిత్ శర్మ 27 విజయాలతో నాలుగో ప్లేస్‌లో కొనసాగుతున్నాడు. ఈ మ్యాచ్‌లో విజయం ద్వారా భారత్ మరో రికార్డ్‌ను కూడా బద్దలు కొట్టింది. పాక్ నిర్ధేశించిన 99 లక్ష్యాన్ని మరో 38 బంతులుండగానే ఛేదించిన టీమిండియా.. ఇరు జట్ల మధ్య టీ20 మ్యాచ్‌ల్లో బంతుల పరంగా అతి పెద్ద విజయం నమోదు చేసింది. ఇంతకుముందు 2018లో 23 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించిన భారత్.. ఈ మ్యాచ్‌తో ఆ రికార్డును చెరిపి వేసింది. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. వర్షం అంతరాయం కలిగించడంతో 18 ఓవర్లకు కుదించిన ఈ పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత ఓవర్లలో 99 పరుగులకే కుప్పకూలగా.. ఛేదనలో భారత్ మెరుపు వేగంతో లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్ స్మృతి మంధాన (42 బంతుల్లో 63 నాటౌట్; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) విధ్వంసం ధాటికి భారత్ మరో 38 బంతులుండగానే (11.4 ఓవర్లలోనే) లక్ష్యాన్ని చేరుకుని 8 వికెట్ల తేడా ఘన విజయం సాధించింది. చదవండి: మంధాన విధ్వంసం.. పాక్‌ను మట్టికరిపించిన భారత్ -
మంధాన విధ్వంసం.. పాక్‌ను మట్టికరిపించిన భారత్
మంధాన విధ్వంసం.. పాక్‌ను మట్టికరిపించిన భారత్ కామన్వెల్త్ క్రీడల్లో భాగంగా పాక్‌తో జరిగిన కీలక సమరంలో టీమిండియా ఘన విజయం సాధించింది. వర్షం అంతరాయం కలిగించడంతో 18 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత ఓవర్లలో 99 పరుగులకే కుప్పకూలగా.. ఛేదనలో భారత్ మెరుపు వేగంతో లక్ష్యాన్ని చేరుకుంది. ఓపెనర్ స్మృతి మంధాన (42 బంతుల్లో 63 నాటౌట్; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) విధ్వంసం ధాటికి భారత్ మరో 38 బంతులుండగానే (11.4 ఓవర్లలోనే) లక్ష్యాన్ని ఛేదించి 8 వికెట్ల తేడా ఘన విజయం సాధించింది. పాక్: 99 ఆలౌట్ భారత్: 102/2 (11.4 ఓవర్లు) మంధాన సుడిగాలి హాఫ్ సెంచరీ భారత ఓపెనర్ స్మృతి మంధాన సుడిగాలి హాఫ్ సెంచరీ బాదింది. స్వల్ప లక్ష్య ఛేదనలో మంధాన ఆకాశమే హద్దుగా చెలరేగుతుంది. 31 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో ఫిఫ్టి పూర్తి చేసింది. మంధాన వీర బాదుడు ధాటికి టీమిండియా 8 ఓవర్లలో వికెట్ నష్టానికి 76 పరుగులు చేసి విజయం దిశగా సాగుతుంది. తొలి వికెట్ కోల్పోయిన భారత్ 100 పరుగుల స్వల లక్ష్య ఛేదనకు దిగిన భారత్.. ఆరంభం నుంచే దూకుడుగా ఆడుతుంది. ఓపెనర్లు షఫాలీ వర్మ (9 బంతుల్లో 16; 2 ఫోర్లు, సిక్స్), మంధాన (26 బంతుల్లో 44; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగి ఆడుతున్నారు. ముఖ్యంగా మంధాన పాక్ బౌలర్లను చీల్చి చెండాడుతుంది. ఈ దశలో షఫాలీ వర్మ మరో భారీ షాట్‌కు ప్రయత్నించి ఔటైంది. 6 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 61/1. కుప్పకూలిన పాక్ టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన పాక్.. భారత బౌలర్ల ధాటికి 99 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లు మూకుమ్మడిగా రాణించి పాక్ నడ్డి విరిచారు. ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో (18వ ఓవర్లో) పాక్ ఏకంగా మూడు వికెట్లు కోల్పోయింది. రాధా యాదవ్, స్నేహ్ రాణా చెరో 2 వికెట్లు పడగొట్టగా.. రేణుకా సింగ్, మేఘన సింగ్, షఫాలి వర్మ తలో వికెట్ సాధించారు. ముగ్గురు బ్యాటర్లు రనౌటయ్యారు. పాక్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ మునీబా అలీ (32) టాప్ స్కోరర్‌గా నిలిచింది. 12 ఓవర్ల తర్వాత పాక్ స్కోర్ 66/4 ఇన్నింగ్స్ ఆరంభంలో నత్తనడకలా సాగిన పాక్ స్కోర్ బోర్డు 12 ఓవర్లు ముగిసాక కూడా అదే తీరులో సాగుతోంది. 8వ ఓవర్లో 14 పరుగులు సాధించిన ఆ జట్టు.. ఆ తర్వాత స్నేహ్ రాణా వేసిన 9వ ఓవర్లో మహరూఫ్ (17), మునీబా అలీ (32) వికెట్లు కోల్పోయింది. ఆతర్వాత రేణుకా సింగ్ వేసిన 12వ ఓవర్లో పాక్ మరో వికెట్ కోల్పోయింది. రేణుకా సింగ్ బౌలింగ్‌లో రోడ్రిగ్స్‌కు క్యాచ్ ఇచ్చి అయేషా నసీమ్ (10) పెవిలియన్ బాట పట్టింది. 12 ఓవర్ల తర్వాత పాక్ స్కోర్ 66/4గా ఉంది. ఆలియా రియాజ్(1), ఒమైమా సొహైల్ (5) క్రీజ్‌లో ఉన్నారు. నత్తనడకన సాగుతున్న పాక్ బ్యాటింగ్.. వర్షం కారణంగా ఆలస్యంగా మొదలైన పాక్ ఇన్నింగ్స్ నత్తనడకను తలపిస్తుంది. సున్నా పరుగులకే రెండో ఓవర్లో వికెట్ కోల్పోయిన ఆ జట్టు 7 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టానికి కేవలం 35 పరుగులు మాత్రమే చేయగలిగింది. బిస్మా మహరూఫ్ (16), మునీబా అలీ (18) క్రీజ్‌లో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన పాక్ టాస్ ఓడి తొలుత బౌలింగ్ చేస్తున్న భారత్‌కు రెండో ఓవర్లోనే వికెట్ దక్కింది. మేఘన సింగ్ బౌలింగ్‌లో యస్తిక క్యాచ్ పట్టడంతో ఇరామ్ జావీద్ డకౌట్‌గా వెనుదిరిగింది. అంతకుముందు తొలి ఓవర్‌ను రేణుకా సింగ్ మెయిడిన్ చేసింది. 2 ఓవర్ల తర్వాత పాక్ స్కోర్ 7/1. క్రీజ్‌లో బిస్మా మహరూఫ్ (5), మునీబా అలీ (1) ఉన్నారు. వర్షం కారణంగా 18 ఓవర్లకు కుదింపు మ్యాచ్ ప్రారంభానికి ముందు నుంచే వరుణుడు ఆటంకం కలిగించడంతో టాస్ గంటకు పైగా ఆలస్యమైంది. దీంతో మ్యాచ్‌ను 18 ఓవర్లకు కుదించారు. భారతకాలమానం ప్రకారం మ్యాచ్ సాయంత్రం 4:15 గంటలకు ప్రారంభమైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ టీమిండియాతో హైఓల్టేజ్ మ్యాచ్‌లో పాకిస్తాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. వర్షం కారణంగా టాస్ ఆలస్యం.. క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్-పాక్ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. భారతకాలమానం ప్రకారం మ్యాచ్ మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభంకావాల్సి ఉండింది. అయితే మ్యాచ్ వేదిక అయిన ఎడ్జ్‌బాస్టన్‌లో జల్లులు కురుస్తుండటంతో కనీసం టాస్ కూడా సాధ్యపడలేదు. వరుణుడు శాంతించి మ్యాచ్ సజావుగా సాగాలని అభిమానులు ఆశిస్తున్నారు. కామన్వెల్త్ క్రీడల్లో మహిళల క్రికెట్‌కు సంబంధించి ఇవాళ (జులై 31) హైఓల్టేజ్ మ్యాచ్ జరుగనుంది. చిరకాల ప్రత్యర్ధులైన భారత్-పాక్‌లు ఎడ్జ్‌బాస్టన్ వేదికగా అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ క్రీడల్లో గ్రూప్-ఏలో పోటీపడుతన్న ఇరు జట్లు.. తమతమ మొదటి మ్యాచ్‌ల్లో ప్రత్యర్ధుల చేతుల్లో పరాజయం పాలయ్యారు. భారత్.. ఆరంభ మ్యాచ్‌లో పటిష్టమైన ఆస్ట్రేలియా చేతిలో 3 వికెట్ల తేడాతో పరాజయం పాలవ్వగా.. పాక్‌కు పసికూన బార్బడోస్ (15 పరుగుల తేడాతో ఓటమి) షాకిచ్చింది. కామన్వెల్త్ గేమ్స్‌లో మహిళల క్రికెట్‌కు తొలిసారి ప్రాతినిధ్యం లభించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే, బర్మింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న 22వ కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ సత్తా చాటుతుంది. ఈ క్రీడల్లో భారత్ ఇప్పటివరకు నాలుగు పతకాలు సాధించి మాంచి జోరు మీద ఉంది. భారత్ సాధించిన నాలుగు పతాకలు వెయిట్ లిఫ్టింగ్‌లో సాధించినవే కావడం విశేషం. మీరాబాయ్ చాను 49 కేజీల విభాగంలో స్వర్ణ పతకం సాధించగా, 55 కేజీల విభాగంలో సంకేత్ మహదేవ్ సార్గర్ రజతం, 55 కేజీల విభాగంలో బింద్యారాణి దేవి రజతం, 61 కేజీల విభాగంలో గురురాజ్ పూజారి కాంస్య పతాకలు సాధించారు. -
మీరాబాయి ఇచ్చిన బూట్లతో బరిలోకి దిగి.. రజతంతో
టోక్యో ఒలింపిక్స్‌లో రజతం గెలిచిన మీరాబాయి ఛానును బింద్యారాణి దేవి రోల్ మోడల్‌గా భావించింది. కనీసం బూట్లు కూడా కొనుక్కోలేని కడు పేదరికం నుంచి వచ్చిన బింద్యారాణ దేవి ఇవాళ అంతర్జాతీయ వేదికపై భారత పతకాన్ని రెపరెపలాడించింది. మీరాబాయి చానులాగే మణిపూర్ నుంచి వచ్చిన బింద్యారాణి దేవి, ఒకే అకాడమీలో శిక్షణ తీసుకున్నారు. ఓ చిన్న గుడిసెలో జీవనం సాగించిన మీరాబాయి ఛాను లైఫ్ స్టైల్, ఒలింపిక్ మెడల్ తర్వాత పూర్తిగా మారిపోయింది. అయితే తనలాగే పేదరికాన్ని అనుభవిస్తూ కూడా భారత్‌కి పతకాలు సాధించాలనే పట్టుదలతో ప్రయత్నిస్తున్న బింద్యారాణి దేవి ఆర్థిక పరిస్థితి గురించి తెలుసుకున్న మీరాబాయి ఛాను... ఖరీదైన బూట్లను కానుకగా ఇచ్చింది. అవే బూట్లు వేసుకొని బరిలోకి దిగిన బింద్యారాణి దేవి తాజాగా కామన్వెల్త్ గేమ్స్ 2022లో 55 కేజీల విభాగంలో రజతం సాధించింది. 23 ఏళ్ల బింద్యారాణి స్నాచ్‌లో 86 కేజీలు, క్లీన్ అండ జెర్క్ కేటగిరిలో 116 కేజీలు.. మొత్తంగా 202 కేజీలు ఎత్తి రెండో స్థానంలో నిలిచింది. నైజీరియాకు చెందిన అడిజట్ ఒలారినోయ్ 117 కిలోల బరువెత్తి గోల్డ్ మెడల్ సాధించింది. ఒలారొనోయ్(స్నాచ్ 92 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 111 కేజీలు) మొత్తంగా 203 కేజీలు ఎత్తి స్వర్ణం చేజెక్కించుకుంది. కాగా కేవలం ఒక్క కేజీ కేజీ తేడాతో బింద్యారాణి రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక లోకల్ క్రీడాకారిణి ఫ్రేర్ మారో 196 కేజీలు(86 స్నాచ్, 109 క్లీన్ అండ్ జెర్క్) ఎత్తి కాంస్యం చేజెక్కించుకుంది. ఇక మ్యాచ్ అనంతరం బింద్యారాణి దేవి మాట్లాడుతూ.. ‘నా సక్సెస్‌లో మీరా దీ పాత్ర చాలా ఉంది. నా టెక్నిక్, ట్రైయినింగ్‌లో మీరా ఎంతగానో సాయం చేసింది. క్యాంప్‌లోకి కొత్తగా వచ్చినప్పుడు ఎంతో అప్యాయంగా పలకరించి, మాట్లాడింది. నా దగ్గర బూట్లు కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేవని తెలిసి, తన షూస్ నాకు ఇ్చింది. ఆమె నాకు ఆదర్శం... నేను తనకి పెద్ద అభిమానిని అయిపోయా...’ అంటూ చెప్పుకొచ్చింది. -
అదరగొట్టిన భారత మహిళల హాకీ జట్టు.. వరుసగా రెండో విజయం
కామన్వెల్త్ గేమ్స్‌లో భారత మహిళల హాకీ జట్టు వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. పూల్-ఏలో భాగంగా వేల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ మహిళల జట్టు 3-1 తేడాతో ఘన విజయం అందుకుంది. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ శనివారం అర్థరాత్రి జరిగింది. ఈ విజయంతో భారత మహిళల జట్టు ఆరు పాయింట్లతో పూల్-ఏలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. భారత్ తరపున వందనా కటారియా(ఆట 26, 48వ నిమిషం), గుర్జీత్ కౌర్(ఆట 28వ నిమిషం)లో గోల్స్ చేయగా.. వేల్స్ తరపున గ్జెన్నా హ్యూజెస్(ఆట 45వ నిమిషం) గోల్ చేసింది. ఇక భారత్ తమ తర్వాతి మ్యాచ్ ఆగస్టు 2న ఇంగ్లండ్‌తో ఆడనుంది. ఇక టోక్యో ఒలింపిక్స్‌లో మంచి ప్రదర్శనతో ఆకట్టుకున్నప్పటికి భారత మహిళల జట్టు నాలుగో స్థానంలో నిలిచి తృటిలో పతకం చేజార్చుకుంది. కానీ ఈసారి ఎలాగైనా పతకం సాధించాలనే దృడ సంకల్పంతో ఉంది. మరోవైపు ఎలాగైనా స్వర్ణం సాధించాలని బరిలోకి దిగన భారత పురుషుల హాకీ జట్టు ఇవాళ ఘనాతో తమ తొలి మ్యాచ్ ఆడనుంది. టోక్యో ఒలింపిక్స్‌లో భారత పురుషుల జట్టు కాంస్యం గెలిచిన సంగతి తెలిసిందే. GOAL! And the avalanche of goals continues with #TeamIndia's third goal. IND 3:1 WAL #IndiaKaGame #HockeyIndia #B2022 #Birmingham2022 @CMO_Odisha @sports_odisha @IndiaSports @Media_SAI — Hockey India (@TheHockeyIndia) July 30, 2022 -
భారత్ ఖాతాలో నాలుగో పతకం.. వెయిట్లిప్టింగ్లో బింద్యారాణికి రజతం
కామన్వెల్త్ క్రీడల్లో భారత్ ఖాతాలో మరో పతకం వచ్చి చేరింది. వెయిట్‌లిఫ్టింగ్‌లో మహిళల 55 కిలోల విభాగంలో బింద్యారాణి దేవి రజతం గెలుపొందింది. 23 ఏళ్ల బింద్యారాణి స్నాచ్‌లో 86 కేజీలు, క్లీన్ అండ జెర్క్ కేటగిరిలో 116 కేజీలు.. మొత్తంగా 202 కేజీలు ఎత్తి రెండో స్థానంలో నిలిచింది. అయితే బింద్యారాణి క్లీన్ అండ్ జర్క్ రెండో ప్రయత్నంలో 114 కిలోలు ఎత్తడంలో విఫలమైంది. దీంతో అంతా ఆమెకు కాంస్యం వస్తుందని భావించారు. అయితే చివరి రౌండ్లో పుంజుకున్న బింద్యారాణి..116 కిలోలు ఎత్తి రజతం దక్కించుకున్నది. నైజీరియాకు చెందిన అడిజట్ ఒలారినోయ్ 117 కిలోల బరువెత్తి గోల్డ్ మెడల్ సాధించింది. ఒలారొనోయ్(స్నాచ్ 92 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 111 కేజీలు) మొత్తంగా 203 కేజీలు ఎత్తి స్వర్ణం చేజెక్కించుకుంది. కాగా కేవలం ఒక్క కేజీ కేజీ తేడాతో బింద్యారాణి రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక లోకల్ క్రీడాకారిణి ఫ్రేర్ మారో 196 కేజీలు(86 స్నాచ్, 109 క్లీన్ అండ్ జెర్క్) ఎత్తి కాంస్యం చేజెక్కించుకుంది. కాగా, బింద్యారాణి సాధించిన పతకంతో కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ పతకాల సంఖ్య నాలుగుకు చేరింది. ఈ నాలుగు వెయిట్‌లిఫ్టింగ్‌లోనే రావడం విశేషం. స్టార్ వెయిట్ లిఫ్టర్ మీరాబాయ్ చాను 49 కేజీల విభాగంలో స్వర్ణ పతకం ముద్దాడగా, 55 కేజీల విభాగంలో సంకేత్ మహదేవ్ సార్గర్ రజతం సాధించగా, 61 కేజీల విభాగంలో గురురాజ్ పూజారికి కాంస్యం లభించింది. SUPER SENSATIONAL SILVER FOR BINDYARANI 🔥🔥 Bindyarani Devi 🏋♀️wins 🥈in the Women's 55kg with a total lift of 202kg, after an amazing come back 💪💪 Snatch - 86 kg (PB & Equalling NR) Clean & Jerk - 116 kg (GR & NR) With this 🇮🇳 bags 4️⃣🏅 @birminghamcg22#Cheer4India pic.twitter.com/iFbPHpnBmK — SAI Media (@Media_SAI) July 30, 2022 చదవండి: Mirabai Chanu: మన 'బంగారు' మీరాబాయి -
CWG 2022 3rd Day: భారత ఆటగాళ్ల మ్యాచ్ షెడ్యూల్.. పూర్తి వివరాలు
కామన్వెల్త్ గేమ్స్ 2022లో ఆదివారం భారత్ ఆటగాళ్ల షెడ్యూల్.. పూర్తి వివరాలు ►1:00 PM: తానియా చౌదరి vs షానా ఓ నీల్ (నార్తర్న్ ఐలాండ్) (లాన్ బాల్స్) ►1:30 PM: యోగేశ్వర్ సింగ్ - పురుషుల ఆల్ అరౌండ్ ఫైనల్ (జిమ్నాస్టిక్స్) ►2:00 PM: జెరెమీ లాల్రిన్నుంగా - పురుషుల 67 KG (వెయిట్ లిఫ్టింగ్) ►2:00 PM: పురుషుల టీమ్ క్వార్టర్ ఫైనల్స్ (టేబుల్ టెన్నిస్) ►2:32 PM: ఎసోవ్ అల్బెన్, రొనాల్డో లైటోంజమ్, డేవిడ్ బెక్హాం – పురుషుల స్ప్రింట్ క్వాలిఫైయింగ్ (సైక్లింగ్) ►3:07 PM: సజన్ ప్రకాష్ – పురుషుల 200 మీటర్ల బటర్‌ఫ్లై హీట్ 3 (ఈత) ►3:27 PM: పురుషుల స్ప్రింట్ 1/8 ఫైనల్స్ (అర్హత ఉంటే) (సైక్లింగ్) ►3:30 PM: భారత్ vs పాకిస్థాన్ (క్రికెట్) ►3:31 PM: శ్రీహరి నటరాజ్ – పురుషుల 50 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ హీట్ 6 ►4:00 PM: భారతదేశం vs ఇంగ్లాండ్ - లాన్ బౌల్ పురుషుల పెయిర్స్ ►4:04 PM: పురుషుల స్ప్రింట్ క్వార్టర్ ఫైనల్స్ (అర్హత ఉంటే) (సైక్లింగ్) ►4:20/4:59 PM: వెంకప్ప కెంగళగుత్తి, దినేష్ కుమార్ – పురుషుల 15KM స్క్రాచ్ రేస్ క్వాలిఫైయింగ్ (సైక్లింగ్) ►4:45 PM: నిఖత్ జరీన్ vs హెలెనా ఇస్మాయిల్ బాగూ (MOZ) – 48 – 50KG (రౌండ్ ఆఫ్ 16) (బాక్సింగ్) ►5:15 PM: శివ థాపా vs రీస్ లించ్ (SCO) – 60 – 63.5KG (రౌండ్ ఆఫ్ 16) ►6:00 PM: జోష్నా చినప్ప vs కైట్లిన్ వాట్స్ (NZL) - మహిళల సింగిల్స్ రౌండ్ ఆఫ్ 16 (స్క్వాష్) ►6:30 PM: పాపీ హజారికా - మహిళల 59KG (వెయిట్ లిఫ్టింగ్) ►6:45 PM: సౌరవ్ ఘోసల్ vs డేవిడ్ బైలార్జన్ (CAN) - పురుషుల సింగిల్స్ రౌండ్ ఆఫ్ 16 (స్క్వాష్) ►7:00 PM: మహిళల ఆల్ అరౌండ్ ఫైనల్ ►7:30 PM: మహిళల నాలుగు క్వార్టర్ ఫైనల్స్ (లాన్ బాల్స్) ►7:40 PM: పురుషుల స్ప్రింట్ సెమీఫైనల్స్ (అర్హత ఉంటే) (సైక్లింగ్) ►8:30 PM: భారతదేశం vs ఘనా - పురుషుల పూల్ A (హాకీ) ►9:02 PM: త్రియషా పాల్, మయూరి లూట్ - మహిళల 500M టైమ్ ట్రయల్ ఫైనల్ (సైక్లింగ్) ►10:00 PM నుండి: మిక్స్డ్ టీమ్ క్వార్టర్ ఫైనల్స్ (బ్యాడ్మింటన్) ►10:12 PM: పురుషుల స్ప్రింట్ ఫైనల్స్ (అర్హత ఉంటే) (సైక్లింగ్) ►10:30 PM: పురుషుల పెయిర్ క్వార్టర్ ఫైనల్స్ (అర్హత ఉంటే) (లాన్ బాల్స్) ►10:30 PM: మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్ (అర్హత సాధిస్తే) (లాన్ బాల్స్) ►11:00 PM: అచింత షెయులీ - పురుషుల 73 KG (వెయిట్ లిఫ్టింగ్) ►11:12 PM: పురుషుల 15KM స్క్రాచ్ రేస్ ఫైనల్ (అర్హత ఉంటే) (సైక్లింగ్) ►11:37 PM: శ్రీహరి నటరాజ్ – పురుషుల 50 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ సెమీఫైనల్ (స్విమ్మింగ్) ►11:58 PM: సజన్ ప్రకాష్ – పురుషుల 200 మీటర్ల బటర్‌ఫ్లై ఫైనల్ (స్విమ్మింగ్) ►12:15 AM (AUG 1): సుమిత్ vs కల్లమ్ పీటర్స్ (AUS) – 71 – 75KG కంటే ఎక్కువ (రౌండ్ ఆఫ్ 16) ►1:00 AM (AUG 1): సాగర్ vs మాక్సిమ్ యెగ్నాంగ్ ఎన్జీయో (కామెరూన్) - 92KG కంటే ఎక్కువ ►1:30 AM (AUG 1): మహిళల టీమ్ సెమీఫైనల్స్ (టేబుల్ టెన్నిస్) -
మన 'బంగారు' మీరాబాయి
బర్మింగ్హమ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2022లో భారత్ ఖాతాలో తొలి పసిడి పతకం వచ్చి చేరింది. టోక్యో ఒలింపిక్స్‌లో వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో రజత పతకం సాధించిన మీరాబాయి చానూ కామన్వెల్త్ గేమ్స్‌లో బంగారు పతకం ఒడిసి పట్టింది. శనివారం 49 కేజీల విభాగంలో జరిగిన వెయిట్‌లిఫ్టింగ్ ఫైనల్లో మీరాబాయి చాను స్నాచ్‌లో 88 కేజీలు, క్లీన్ అండ్ జర్క్‌లో 113 కేజీలు (మొత్తం 201 కేజీలు) ఎత్తి పసిడి ఖాయం చేసుకుంది. టోక్యో ఒలింపిక్స్‌లో రజతం సాధించిన తొలి భారత వెయిట్‌లిఫ్టర్‌గా చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను తన ప్రయాణాన్ని ఎప్పటికప్పుడు సరికొత్తగా మార్చుకుంటూ వచ్చింది. అలసటను దరి చేరనీయలేదు.. ఏకాగ్రతను దూరం చేసుకోలేదు. వాస్తవానికి మీరాబాయి చానూ ఈసారి 55 కేజీల విభాగంలో పోటీ పడాల్సింది. ఈ సారి ఎక్కువ పతకాలు రావాలనే ఉద్దేశంతో భారత వెయిట్‌లిఫ్టింగ్ సమాఖ్య ఆమెను 55 కేజీల విభాగానికి మారాలని సూచించింది. దీంతో మీరాబాయి తన బరువును పెంచుకుంటూనే ఎంతోగానో శ్రమించింది. కానీ ఆఖరి క్షణంలో ఒక్క విభాగం నుంచి ఒక్కరే ఎంపికవుతారనే నిబంధన కారణంగా చాను తిరిగి 49 కేజీల విభాగానికి మారాల్సి వచ్చింది. అలా తనకు అచ్చొచ్చిన విభాగంలో పోటీ పడిన ఆమె స్నాచ్ విభాగంలో 90 కేజీల బరువు ఎత్తాలని టార్గెట్‌గా పెట్టుకుంది. కానీ స్నాచ్ మొదటి, రెండో ప్రయత్నంలో 84, 88 కేజీలు ఎత్తిన చాను మూడో ప్రయత్నంలో 90 కేజీలకు ప్రయత్నించి విఫలమైంది. క్లీన్ అండ్ జర్క్‌లో కూడా 109, 113 కేజీల తర్వాత 115 కేజీలకు ప్రయత్నించి ఎత్తలేకపోయింది. అయితే ఓవరాల్‌గా ఆమెకు, తర్వాతి స్థానంలో నిలిచిన లిఫ్టర్‌కు మధ్య ఉన్న అంతరం (29 కేజీలు) చూస్తే ఈ పోటీల్లో చాను స్థాయి ఏమిటో అర్థమవుతుంది. ఇక 2014 గ్లాస్కో గేమ్స్ రజతం.. 2018 గోల్డ్ కోస్ట్ గేమ్స్‌లో స్వర్ణం.. తాజాగా మరోసారి స్వర్ణంతో మెరిసి మువ్వన్నెల జెండాను రెపరెపలాడించింది. మరి వచ్చే పారిస్ ఒలింపిక్స్(2024)లో టోక్యోలో వచ్చిన రజతాన్ని స్వర్ణంగా మారుస్తుందేమో చూడాలి. Lifting 201kg never felt easy but thanks to the love and wishes of billions back home, every challenge is just an attempt away. 🇮🇳#WeAreTeamIndia #TeamIndia pic.twitter.com/GnyaftZkpv — Saikhom Mirabai Chanu (@mirabai_chanu) July 30, 2022 -
నాలుగేళ్ల కిందటి హామీ.. పతకధారిగా ‘పాన్వాలా’
నాలుగేళ్ల క్రితం... గోల్డ్‌కోస్ట్‌లో కామన్వెల్త్ క్రీడలు జరుగుతున్నాయి. వెయిట్‌లిఫ్టింగ్‌లో గురురాజ పుజారి పోటీ పడుతున్నాడు. తన ‘పాన్ షాప్’లో కూర్చొని ఈ ఈవెంట్‌ను సంకేత్ టీవీలో చూస్తున్నాడు. గురురాజ 56 కేజీల విభాగంలో రజతం సాధించాడు. ఆ సమయంలో సంకేత్ ‘నాలుగేళ్ల తర్వాత ఎలాగైనా నేనూ అక్కడికి వెళతాను. కష్టపడి కచ్చితంగా పతకం సాధిస్తాను’ అని తనకు తాను చెప్పుకున్నాడు. నిజంగానే అతను తన కల నెరవేర్చుకున్నాడు. 2013 నుంచి వెయిట్‌లిఫ్టింగ్‌లో ఉన్న ఆ కుర్రాడు ఇప్పుడు 22 ఏళ్ల వయసులో కామన్వెల్త్ పతకంతో సత్తా చాటాడు. మహారాష్ట్రలోని సాంగ్లీలో సంకేత్ తండ్రికి పాన్‌షాప్‌తో పాటు చిన్నపాటి టిఫిన్ సెంటర్ కూడా ఉంది. మొదటినుంచి తండ్రికి చేదోడువాదోడుగా ఉంటూనే అతను ఆటపై దృష్టి పెట్టాడు. క్రీడలపై ఆసక్తి ఉన్న తండ్రి ప్రోత్సాహంతో వెయిట్‌లిఫ్టింగ్ వైపు నడిచాడు. సాధారణ మధ్యతరగతి కుటుంబాల్లో వచ్చే ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదురైనా తండ్రి మహదేవ్ ఎప్పుడూ సంకేత్‌ను నిరుత్సాహపర్చలేదు. ఒక వైపు వెయిట్‌లిఫ్టర్‌గా గుర్తింపు వస్తున్న సమయంలో సంకేత్ కూడా ఏనాడూ పాన్‌షాప్‌లో కూర్చొని పని చేయడాన్ని తక్కువగా భావించలేదు. 2020లో కోల్‌కతాలో జరిగిన సీనియర్ నేషనల్స్‌లో సంకేత్ తొలిసారి స్వర్ణం గెలిచి అందరి దృష్టిలో పడ్డాడు. ఇదే ఏడాది సింగపూర్‌లో మొత్తం 256 కేజీల బరువు ఎత్తడంతో కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొనే అర్హత లభించింది. ఫిబ్రవరిలో పటియాలలోని నేషనల్ స్పోర్ట్స్ ఇన్స్టిట్యూట్లో ప్రవేశం లభించిన తర్వాత హెడ్ కోచ్ విజయ్ శర్మ పర్యవేక్షణలో మరింతగా రాటుదేలిన సంకేత్ ఇప్పుడు తన స్థాయిని మరింత పెంచుకున్నాడు. ‘ఇప్పటి వరకు అంతా సంకేత్ పాన్వాలా అని పిలిచేవారు. ఇప్పుడు కామన్వెల్త్ క్రీడల పతక విజేత సంకేత్ పాన్వాలా అని పిలుస్తారేమో’ అని ఉద్వేగంగా చెప్పాడు. సోదరుడి బాటలో వెయిట్‌లిఫ్టింగ్‌లో అడుగు పెట్టిన అతను చెల్లెలు కాజల్ ఇటీవలే ఖేలో ఇండియా గేమ్స్‌లో 40 కేజీల విభాగంలో స్వర్ణం గెలవడం విశేషం. -
CWG 2022: భారత్ ఖాతాలో మరో పతకం.. గురురాజ పూజారి కాంస్యం
బర్మింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో భారత్ సత్తా చాటుతుంది. రెండో రోజు భారత అథ్లెట్లు వెయిట్‌లిఫ్టింగ్‌లో రెండు పతకాలు సాధించారు. తొలుత పురుషుల 55 కేజీల విభాగంలో సంకేత్ సర్గార్ రజత పతకం సాధించగా.. తాజాగా 61 కేజీల (పురుషుల) విభాగంలో గురురాజ పుజారి కాంస్యం నెగ్గాడు. గురురాజ మొత్తం 269 కేజీల బరువును (స్నాచ్‌లో 118 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 153 కేజీలు) ఎత్తి మూడో స్థానంలో నిలువగా.. మలేషియాకు చెందిన అజ్నిల్ బిన్ బిడిన్ మహ్మద్ 285 కేజీలు (127, 158) ఎత్తి స్వర్ణ పతకాన్ని.. పపువా న్యూ గినియాకు చెందిన మోరియా బారు 273 కేజీలు (121, 152) ఎత్తి రజతం సాధించారు. కాగా, గురురాజకు కామన్వెల్త్ క్రీడల్లో ఇది వరుసగా రెండో పతకం కావడం విశేషం. అతను 2018 గోల్డ్ కోస్ట్ క్రీడల్లో 56 కేజీల విభాగంలో రజత పతకం సాధించాడు. 2️⃣nd medal for 🇮🇳 at @birminghamcg22 🤩 What a comback by P. Gururaja to bag 🥉 with a total lift of 269 Kg in the Men's 61kg Finals🏋♂️ at #B2022 Snatch- 118kg Clean & Jerk- 151kg With this Gururaj wins his 2nd consecutive CWG medal 🙂 Congratulations Champ!#Cheer4India pic.twitter.com/UtOJiShUvS — SAI Media (@Media_SAI) July 30, 2022 చదవండి: CWG 2022: బోణీ కొట్టిన భారత్.. వెయిట్ లిఫ్టింగ్‌లో తొలి పతకం -
CWG 2022: హిమ దాస్ స్వర్ణం గెలవలే.. నెట్టింట వైరలవుతున్న ఫేక్ ట్వీట్
బర్మింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్‌లో భారత స్టార్ అథ్లెట్ హిమ దాస్ స్వర్ణ పతకం (400 మీటర్ల పరుగు పందెం) నెగ్గిందన్న వార్త కొద్దిసేపటి క్రితం నెట్టింట హల్చల్ చేసింది. హిమ స్వర్ణం గెలిచిందన్న ఆనందంలో చాలామంది భారతీయులు ఆమెకు రకరకాల సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఈ వార్త ఫేక్ అని తేలడంతో వారంతా నాలుక్కరచుకుని తమ పోస్ట్‌లను డిలీట్ చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు. ఇలా చేసిన వారిలో మాజీ డాషింగ్ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ లాంటి చాలామంది ప్రముఖులు ఉన్నారు. సరైన ఫాలో అప్ లేక ఇలాంటి ఫేక్ సమాచారాన్ని ప్రచారం చేసినందుకు గాను వారంతా పశ్చాత్తాప పడుతున్నారు. అసలు కామన్వెల్త్ క్రీడల్లో ఇవాళ (జులై 30) హిమ దాస్ ఈవెంటే లేకపోవడం ఓ విషయమైతే.. హిమ స్వర్ణం నెగ్గినట్లు చెబుతున్న 400 మీటర్ల రేసులో ఆమె పాల్గొనకపోవడం మరో విశేషం. ఇదిలా ఉంటే, కామన్వెల్త్ క్రీడల్లో ఇవాళ భారత్ బోణీ కొట్టింది. పురుషుల వెయిట్ లిఫ్టింగ్ 55 కేజీల విభాగంలో సంకేత్ సర్గార్ రజత పతకం సాధించి భారత్‌కు తొలి పతకం అందించాడు. Hima das has not started her campaign yet. Why so hurry Mr Patra and Mr Sehwag. An old video is prompting many to tweet this fake news. Now they have deleted the tweet. She is participating in 200m and 4*100m relay. @sambitswaraj @virendersehwag #HimaDas #CommonwealthGames2022 pic.twitter.com/4dxegSWMca— Pankaj Priyadershi (@BBCPankajP) July 30, 2022 చదవండి: CWG 2022: బోణీ కొట్టిన భారత్.. వెయిట్ లిఫ్టింగ్‌లో తొలి పతకం -
CWG 2022: బోణీ కొట్టిన భారత్.. వెయిట్ లిఫ్టింగ్‌లో తొలి పతకం
Birmingham 2022: బర్మింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో భారత్ బోణీ కొట్టింది. పురుషుల వెయిట్ లిఫ్టింగ్ 55 కేజీల విభాగంలో సంకేత్ సర్గార్ రజత పతకం సాధించాడు. ఈ పోటీల్లో స్వర్ణమే లక్ష్యంగా బరిలోకి దిగిన సంకేత్.. మొత్తం 248 కేజీల బరువును (స్నాచ్‌లో 113 కేజీలు, సీ ఎండ్ జేలో 135 కేజీలు) ఎత్తి తన లక్ష్యానికి (స్వర్ణం) కేవలం ఒక్క కిలో దూరంలో నిలిచిపోయాడు. Braving through injury to win a medal for his country, we couldn't have asked for more from Sanket! ❤️🇮🇳#CommonwealthGames pic.twitter.com/btIYs9MEqx — The Bridge (@the_bridge_in) July 30, 2022 మలేషియాకు చెందిన బిబ్ అనిక్ 259 కేజీల బరువు ఎత్తి స్వర్ణ పతకం కైవసం చేసుకోగా.. శ్రీలంకకు చెందిన దిలంక యోడగే (225 కేజీలు) కాంస్యం సాధించాడు. సంకేత్.. సీ ఎండ్ జే రెండో ప్రయత్నంలో గాయపడటంతో రజతంతో సరిపెట్టుకున్నాడు. చదవండి: CWG 2022: ఎక్కడికెళ్లినా దొరికిపోవడమే.. వీడేం బాక్సర్ రా బాబు!.. కామన్వెల్త్ నుంచి సస్పెండ్ -
పాకిస్తాన్‌కు ఊహించని షాక్.. పసికూన చేతిలో ఓటమి
బర్మింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో మహిళల క్రికెట్‌కు తొలిసారి ప్రాతినిధ్యం లభించిన విషయం తెలిసిందే. మెగా ఈవెంట్లో భాగంగా నిన్న (ఏప్రిల్ 29) జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా ఆసీస్ చేతిలో ఓటమిపాలవ్వగా.. రెండో మ్యా్చ్లో కరీబియస్ జట్టైన బార్బడోస్ చేతిలో పాక్‌కు పరాభవం ఎదురైంది. హర్మన్ సేనను ఆసీస్ 3 వికెట్ల తేడా ఓడించగా.. పసికూన బార్బడోస్ 15 పరుగుల తేడాతో పాక్‌ను ఖంగుతినిపించింది. పాక్ మ్యాచ్ విషయానికొస్తే.. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన బార్బడోస్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. వికెట్‌కీపర్ కైసియా నైట్ (56 బంతుల్లో 62 నాటౌట్; 9 ఫోర్లు), కెప్టెన్ హేలీ మాథ్యూస్ (50 బంతుల్లో 51; 4 ఫోర్లు, సిక్స్) అర్ధసెంచరీలతో రాణించడంతో బార్బడోస్ గౌరవప్రదమైన స్కోర్ చేసింది. పాక్ బౌలర్లలో ఫాతిమా సనాకు 2 వికెట్లు దక్కగా.. డయానా బేగ్ ఓ వికెట్ పడగొట్టింది. అనంతరం ఛేదనలో పాక్ తడబాటుకు లోనై 129 పరుగులకే (20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి) పరిమితమైంది. నిదా దార్ (31 బంతుల్లో 50 నాటౌట్; 7 ఫోర్లు, సిక్స్) పాక్‌ను గెలిపించేందుకు విఫలయత్నం చేసింది. నిదాకు మిగతా బ్యాటర్ల నుంచి సహకారం అందకపోవడంతో పాక్ ఓటమిపాలైంది. నిదా మినహా మరే ఇతర బ్యాటర్లు రాణించలేకపోయారు. బార్బడోస్ బౌలర్లలో హేలీ మాథ్యూస్ పొదుపుగా బౌలింగ్ (4 ఓవర్లలో 1/13) చేయడంతో పాటు రెండు రనౌట్లు చేసి ఓ క్యాచ్ అందుకోగా.. షమీలియా కాన్నెల్, ఆలియా అల్లెన్, డియాండ్రా డొట్టిన్ తలో వికెట్ పడగొట్టారు. కాగా, గ్రూప్-బి మ్యాచ్‌ల్లో భాగంగా ఇవాళ మరో రెండు మ్యాచ్‌లు జరుగనున్నాయి. మధ్యాహ్నం మ్యాచ్‌లో న్యూజిలాండ్-సౌతాఫ్రికా.. రాత్రి మ్యాచ్‌లో ఇంగ్లండ్-శ్రీలంక జట్లు తలపడనున్నాయి. జులై 31న (ఆదివారం) గ్రూప్-ఏకి సంబంధించిన కీలక మ్యాచ్‌లో భారత్-పాకిస్తాన్ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. చదవండి: CWG 2022: రెప్పపాటులో తలకిందులు.. బిత్తరపోయిన ఆసీస్ బ్యాటర్! -
ఎక్కడికెళ్లినా దొరికిపోవడమే.. వీడేం బాక్సర్ రా బాబు!
Common Wealth Games 2022.. డోపింగ్ టెస్టులో అడ్డంగా దొరికిన ఘనా బాక్సర్ షాకుల్ సమద్‌ను కామన్వెల్త్ గేమ్స్ నిర్వాహకులు సస్పెండ్ చేశారు. మ్యాచ్‌కు ముందు నిర్వహించిన యాంటీ డోపింగ్ టెస్టులో పాజిటివ్‌గా తేలాడు. షాకుల్ నిషేధిత డ్రగ్(ఫ్యూరోసిమైడ్) తీసుకున్నట్లు యాంటీ డోపింగ్ కమిటీ నివేదిక ఇచ్చింది. దీంతో బాక్సర్ షాకుల్ సమద్‌పై కామన్వెల్త్ సస్పెన్షన్ వేటు విధించింది. కాగా ఇంతకముందు టోక్యో ఒలింపిక్స్‌లోనూ షాకుల్ సమద్ వెయిట్ విషయంలో ఒక్క మ్యాచ్ ఆడకుండానే బయటకు వెళ్లాల్సి వచ్చింది. అప్పుడు వెయిట్ కేటగిరి విషయంలో తప్పుడు రిపోర్ట్స్ ఇవ్వడంతో నిర్వాహకులు మ్యాచ్ ఆడేందుకు అనుమతించలేదు. దీంతో తన ప్రత్యర్థి ఆటగాడికి వాకోవర్ లభించింది. తాజాగా కామన్వెల్త్లో పతకం సాధిస్తాడనుకుంటే ఈసారి ఏకంగా డోపింగ్ టెస్టులో దొరికిపోయి గేమ్స్ నుంచి సస్పెండ్ అయ్యాడు. దీంతో ఈ ఘనా బాక్సర్ ఎక్కడికెళ్లినా దొరికిపోవడమే పనిగా పెట్టుకున్నాడంటూ అభిమానులు కామెంట్స్ చేయడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: CWG 2022: ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత స్విమ్మర్.. తొలి పతకం దక్కేనా! Common Wealth Games 2022: కామన్వెల్త్ గేమ్స్‌లో 14 ఏళ్ల భారత క్రీడాకారిణి సంచలనం -
CWG 2022: రెప్పపాటులో తలకిందులు.. బిత్తరపోయిన ఆసీస్ బ్యాటర్!
కామన్వెల్త్ క్రీడల్లో తొలిసారి ప్రవేశపెట్టిన మహిళల క్రికెట్లో భారత జట్టును ఆదిలోనే ఓటమి పలకరించింది. బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ వేదికగా శుక్రవారం ఆస్ట్రేలియా మహిళా జట్టుతో జరిగిన మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ సేన పరాజయం పాలైంది. మూడు వికెట్ల తేడాతో ఆసీస్ చేతిలో ఓటమి మూటగట్టుకుంది. గెలుపు కోసం భారత మహిళా జట్టు ఆఖరి వరకు పోరాడినా.. ఆష్లే గార్డ్నర్ 52 పరుగులతో అజేయంగా నిలిచి హర్మన్‌ప్రీత్ బృందం ఆశలపై నీళ్లు చల్లింది. దీంతో తొలి మ్యాచ్‌లోనే గెలిచి అరుదైన ఘనత సాధించాలనుకున్న భారత్‌కు నిరాశే ఎదురైంది. కాగా ఈ మ్యాచ్‌లో భారత్ ఓడినా.. బౌలర్ రేణుకా సింగ్ ఠాకూర్ అద్బుతమైన ప్రదర్శనతో ఆకట్టుకుంది. నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసిన ఆమె కేవలం 18 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు కూల్చింది. రేణుక ధాటికి ఆసీస్ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. మ్యాచ్ రెండో బంతికే ఓపెనర్ అలిసా హేలీను అవుట్ చేసి భారత్‌కు శుభారంభం అందించిన రేణుక.. వరుసగా బెత్ మూనీతో పాటు.. కెప్టెన్ మెగ్ లానింగ్, తాహిలా మెగ్రాత్ వికెట్లు పడగొట్టింది. ముఖ్యంగా ఐదో ఓవర్ మొదటి బంతికి మెగ్రాత్‌ను రేణుక అవుట్ చేసిన తీరు హైలెట్‌గా నిలిచింది. అద్భుతమైన ఇన్‌స్వింగర్‌తో మెగ్రాత్‌ను రేణుక బౌల్డ్ చేసింది. రేణుక సంధించిన బంతిని షాట్ ఆడేందుకు మెగ్రాత్ సమాయత్తమైంది. కానీ.. నమ్మశక్యం కాని రీతిలో బంతి మెగ్రాత్ ప్యాడ్, బ్యాట్ మధ్య నుంచి దూసుకెళ్లి స్టంప్‌ను ఎగురగొట్టింది. దీంతో బిత్తరపోయిన మెగ్రాత్ 14 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిరాశగా క్రీజును వీడింది. అయితే, గార్డ్నర్కు తోడు గ్రేస్ హ్యారిస్ 37 పరుగులతో రాణించడంతో విజయం ఆసీస్ సొంతమైంది. 𝗨𝗻𝘀𝘁𝗼𝗽𝗽𝗮𝗯𝗹𝗲! 🔥 Renuka Singh Thakur, everyone. 👏#INDvAUS | #B2022 pic.twitter.com/zfo50r1QLj — Olympic Khel (@OlympicKhel) July 29, 2022 కామన్వెల్త్ క్రీడలు 2022- మహిళా క్రికెట్(టీ20 ఫార్మాట్) ►భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా ►వేదిక: ఎడ్జ్‌బాస్టన్, బర్మింగ్‌హామ్ ►టాస్: భారత్- బ్యాటింగ్ ►భారత్ స్కోరు: 154/8 (20) ►ఆస్ట్రేలియా స్కోరు: 157/7 (19) ►విజేత: ఆస్ట్రేలియా... 3 వికెట్ల తేడాతో గెలుపు చదవండి: Ind Vs WI T20 Series: మొన్న పంత్.. నిన్న సూర్య.. కేవలం అతడి కోసమే ఈ మార్పులు! అయినా.. Common Wealth Games 2022: కామన్వెల్త్ గేమ్స్‌లో 14 ఏళ్ల భారత క్రీడాకారిణి సంచలనం -
ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత స్విమ్మర్.. తొలి పతకం దక్కేనా!
భారత స్టార్ స్విమ్మర్ శ్రీహరి నటరాజ్ కామన్వెల్త్ గేమ్స్‌లో అదరగొట్టాడు. పురుషుల స్విమ్మింగ్ 100 మీ బ్యాక్‌స్ట్రోక్ ఈవెంట్లో తొలిసారి ఫైనల్లో ప్రవేశించాడు. భారత కాలమాన ప్రకారం శనివారం తెల్లవారుజామున జరిగిన 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ ఈవెంట్ సెమీఫైనల్ హాట్-2లో రేసును 54.55 సెకన్లలో పూర్తి చేసిన నటరాజ్ నాలుగో స్థానంలో నిలిచాడు. ఓవరాల్‌గా ఏడో ప్లేయర్‌గా ఫైనల్లో అడుగుపెట్టిన నటరాజ్ పతకంపై ఆశలు పెంచాడు. ఇక ఫైనల్ రేసు ఆదివారం జరగనుంది. కాగా బెంగళూరుకు చెందిన నటరాజ్ కామన్వెల్త్ గేమ్స్‌లో ఫైనల్ చేరిన నాలుగో భారత స్విమ్మర్‌గా నిలిచాడు. ఇంతకముందు 2010 కామన్వెల్త్ గేమ్స్‌లో సందీప్ సెజ్వాల్, విరాద్వాల్ కాదేలు ఫైనల్ చేరగా.. 2018లో సాజన్ ప్రకాశ్ ఫైనల్లో అడుగుపెట్టినప్పటికి పతకాలు సాధించలేకపోయారు. మరి ఈసారైనా నటరాజ్ మెరిసి పతకం తెస్తాడని భారత అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే మరో ఇద్దరు భారత స్విమ్మర్లు విఫలమయ్యారు. సజన్ ప్రకాశ్ (50 మీ. బటర్‌ఫ్లయ్) హీట్స్‌లో 8వ స్థానంలో, కుశాగ్ర రావత్ (400 మీటర్ల ఫ్రీస్టయిల్) ఆఖరి స్థానంలో నిలిచి నిష్క్రమించారు. చదవండి: Common Wealth Games 2022: కామన్వెల్త్ గేమ్స్‌లో 14 ఏళ్ల భారత క్రీడాకారిణి సంచలనం -
కామన్వెల్త్ గేమ్స్‌లో 14 ఏళ్ల భారత క్రీడాకారిణి సంచలనం
బర్మింగ్హమ్ వేదికగా జరుగుతున్న 2022 కామన్వెల్త్ గేమ్స్‌లో 14 ఏళ్ల భారత స్క్వాష్ క్రీడాకారిణి అనహత్ సింగ్ సంచనలనం నమోదు చేసింది. భారత్ నుంచి కామన్వెల్త్ గేమ్స్‌లో పాల్గొంటున్న పిన్న వయస్కురాలిగా రికార్డు సృష్టించిన అనహత్ సింగ్ తొలి రౌండ్‌ను దిగ్విజయంగా ముగించింది. రౌండ్ ఆఫ్ 64.. స్క్వాష్ గేమ్‌లో భాగంగా మహిళల సింగిల్స్ మ్యాచ్ జరగ్గా.. సెయింట్ విన్సెంటి అండ్ గ్రెనడైన్స్కి చెందిన జాడా రాస్‌ను ఓడించిన అనహత్ సింగ్ రౌండ్ ఆఫ్ 32కు దూసుకెళ్లింది. మ్యాచ్ ఆరంభం నుంచి దూకుడు ప్రదర్శించిన అనహత్ జాడా రాస్‌ను 11-5,11-2,11-0తో వరుస గేమ్‌ల్లో ఓడించింది. తొలి రౌండ్ గేమ్‌లో జాడా రాస్ ఐదు పాయింట్లతో ఆధిక్యంలోకి వెళ్లినప్పటికి.. ఏ మాత్రం తడబడని అనహత్.. ఆ తర్వాత ఆధిక్యంలోకి వెళ్లడమే గాక ఆధిపత్యం ప్రదర్శిస్తూ వరుసగా మూడు గేమ్స్‌ను సొంతం చేసుకొని మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. ఇక రౌండ్ ఆఫ్ 32లో అనహత్ సింగ్.. వేల్స్‌కు చెందిన ఎమిలి విట్లాక్తో తలపడనుంది. చదవండి: Commonwealth Games 2022: బ్యాడ్మింటన్, టీటీలో జోరు -
Commonwealth Games 2022: బ్యాడ్మింటన్, టీటీలో జోరు
బర్మింగ్‌హామ్: కామన్వెల్త్ క్రీడల్లో మొదటి రోజు భారత ఆటగాళ్ల ప్రదర్శన అంచనాలకు అనుగుణంగానే సాగింది. బలహీన జట్లపై భారత బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్ టీమ్‌లు సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించగా... హాకీలోనూ ఘన విజయం దక్కింది. ఊహించినట్లుగానే స్విమ్మింగ్, సైక్లింగ్వంటి క్రీడల్లో మనోళ్లు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. ఓవరాల్‌గా ఆస్ట్రేలియా అగ్ర స్థానంతో రోజును ముగించింది. భారత్ ఫలితాలు మహిళల క్రికెట్: తొలిసారి కామన్వెల్త్ క్రీడల్లో ప్రవేశపెట్టిన మహిళల క్రికెట్లో భారత్‌కు తొలి మ్యాచ్‌లో ఓటమి ఎదురైంది. ఆస్ట్రేలియా 3 వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించింది. ముందుగా భారత్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 154 పరుగులు చేసింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ (34 బంతుల్లో 52; 8 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ సాధించగా, షఫాలీ వర్మ (33 బంతుల్లో 48; 9 ఫోర్లు) కూడా దూకుడుగా ఆడింది. అనంతరం ఆస్ట్రేలియా 19 ఓవర్లలో 7 వికెట్లకు 157 పరుగులు చేసింది. పేసర్ రేణుకా సింగ్ (4/18) దెబ్బకు ఆసీస్ 49 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. అయితే గార్డ్నర్ (35 బంతుల్లో 52 నాటౌట్; 9 ఫోర్లు), గ్రేస్ హారిస్ (20 బంతుల్లో 37; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) జట్టును గెలిపించారు. బ్యాడ్మింటన్: మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో భారత్ 5–0 తేడాతో పాకిస్తాన్‌ను చిత్తుగా ఓడించింది. పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్ 21–7, 21–12తో మురాద్ అలీపై, మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు 21–7, 21–6తో మహూర్ షహజాద్‌పై విజయం సాధించారు. పురుషుల డబుల్స్‌లో సాత్విక్–చిరాగ్ జోడి 21–12, 21–9 మురాద్ అలీ–ఇర్ఫాన్ సయీద్‌ను, మహిళల డబుల్స్‌లో గాయత్రి గోపీచంద్ – ట్రెసా జాలీ 21–4, 21–5తో మహూర్ షహజాద్–గజాలా సిద్దిఖ్‌ను ఓడించగా... మిక్స్డ్ డబుల్స్‌లో సుమీత్ రెడ్డి–పొన్నప్ప ద్వయం 21–9, 21–12తో ఇర్ఫాన్–గజాలా సిద్ధిక్‌పై ఆధిక్యం ప్రదర్శించింది. టేబుల్ టెన్నిస్: మహిళల టీమ్ విభాగంలో ముందుగా దక్షిణాఫ్రికాను 3–0తో, ఆపై ఫిజీని 3–0తో భారత్ చిత్తు చేసింది. పురుషుల టీమ్ విభాగంలో ముందుగా 3–0 తేడాతో బార్బడోస్పై నెగ్గింది. ∙ పురుషుల బాక్సింగ్ (63.5 కేజీలు) లో శివ థాపా 5–0తో సులేమాన్ బలూచ్ (పాకిస్తాన్)ను చిత్తు చేసి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. స్విమ్మింగ్: పురుషుల స్విమ్మింగ్‌లో శ్రీహరి నటరాజ్ (100 మీ. బ్యాక్‌స్ట్రోక్)లో సెమీ ఫైనల్లోకి ప్రవేశించాడు. 54.68 సెకన్ల టైమింగ్‌తో రేస్‌ను పూర్తి చేసిన అతను ముందంజ వేశాడు. అయితే మరో ఇద్దరు భారత స్విమ్మర్లు విఫలమయ్యారు. సజన్ ప్రకాశ్ (50 మీ. బటర్‌ఫ్లయ్) హీట్స్‌లో 8వ స్థానంలో, కుశాగ్ర రావత్ (400 మీటర్ల ఫ్రీస్టయిల్) ఆఖరి స్థానంలో నిలిచి నిష్క్రమించారు. సైక్లింగ్: మూడు ఈవెంట్లలోనూ భారత సైక్లిస్ట్‌లు ఫైనల్ చేరడంలో విఫలమయ్యారు. పురుషుల స్ప్రింట్ టీమ్ ఈవెంట్లో రొనాల్డో, రోజిత్, బెక్‌హామ్, ఎల్కొటొచొంగో బృందం క్వాలిఫికేషన్లో ఆరో స్థానంలో నిలవగా... శశికళ, త్రియాశ, మయూరి సభ్యులుగా ఉన్న మహిళల స్ప్రింట్ టీమ్ కూడా ఏడో స్థానంతో సరిపెట్టుకుంది. విశ్వజీత్, వెంకప్ప, దినేశ్ సభ్యులైన 4000 మీటర్ల పర్సా్యట్ టీమ్ కూడా ఆరో స్థానంలో నిలిచింది. ట్రయథ్లాన్: భారత్‌నుంచి పేలవ ప్రదర్శన నమోదైంది. పురుషుల వ్యక్తిగత స్ప్రింట్ ఫైనల్లో ఆదర్శ్ మురళీధరన్ 30వ స్థానంలో, విశ్వనాథ్ యాదవ్ 33 స్థానంలో నిలిచి నిష్క్రమించగా... మహిళల వ్యక్తిగత స్ప్రింట్ ఫైనల్లో ప్రజ్ఞా మోహన్ 26వ స్థానంతో, సంజన జోషి 28వ స్థానంతో సరిపెట్టుకున్నారు. హాకీ: మహిళల లీగ్ మ్యాచ్‌లో భారత్ 5–0తో ఘనాను చిత్తు చేసింది. భారత్ తరఫున గుర్జీత్ కౌర్ (3వ నిమిషం, 39వ ని.), నేహ (28వ ని.), సంగీతా కుమారి (36వ ని.), సలీమా టెటె (56వ ని.) గోల్స్ సాధించారు. ఇంగ్లండ్ ఖాతాలో తొలి స్వర్ణం బర్మింగ్‌హామ్: కామన్వెల్త్ క్రీడల్లో తొలి స్వర్ణం ఆతిథ్య ఇంగ్లండ్ ఖాతాలో చేరింది. పురుషుల ట్రయాథ్లాన్లో ఇంగ్లండ్‌కు చెందిన అలెక్స్ యీ విజేతగా నిలిచాడు. 50 నిమిషాల 34 సెకన్లలో పరుగు పూర్తి చేసిన యీ అగ్ర స్థానం అందుకోగా...హేడెన్ విల్డ్ (న్యూజిలాండ్), మాథ్యూ హాజర్ (ఆస్ట్రేలియా) రజత, కాంస్యాలు గెలుచుకున్నారు. తొలి రోజు ఆస్ట్రేలియా 2 స్వర్ణాలు, 1 కాంస్యం సాధించగా...ఇంగ్లండ్ 1 స్వర్ణం సహా మొత్తం 5 పతకాలు గెలుచుకుంది. స్కాట్లాండ్, బెర్ముడా ఖాతాలో కూడా ఒక్కో స్వర్ణం చేరాయి. -
గార్డనర్ మెరుపు ఇన్నింగ్స్.. ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓటమి
కామన్వెల్త్ గేమ్స్-2022లో భాగంగా ఆస్ట్రేలియా మహిళలతో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ మూడు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో కెప్టెన్ హర్మాన్‌ప్రీత్ కౌర్(52), షఫాలీ వర్మ(48) పరుగులతో టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఆస్ట్రేలియా బౌలర్లలో జానెసన్ నాలుగు వికెట్లు పడగొట్టగా..స్కాట్ రెండు వికెట్లు, బ్రౌన్ ఒక్క వికెట్ సాధించింది. అనంతరం 155 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కాగా లక్ష్యాన్ని చేధించే క్రమంలో ఆస్ట్రేలియా కేవలం 55 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. భారత యువ పేసర్ నాలుగు వికెట్లు పడగొట్టి ఆరంభంలోనే ఆసీస్‌ను దెబ్బకొట్టింది. ఇక ఆసీస్ ఓటమి ఖాయం అనుకున్న వేళ బ్యాటర్లు ఆష్లీ గార్డనర్, గ్రేస్ హ్యారీస్ భారత్‌పై ఎదురుదాడికి దిగారు. వీరిద్దరూ ఆరో వికెట్‌కు 51 పరుగులు జోడించారు. అనంతరం మేఘనా సింగ్ బౌలింగ్‌లో గ్రేస్ హారిస్ (20 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 37 పరుగులు) ఔటైంది. ఆ తర్వాత వచ్చిన జొనసేన్ ను 14వ ఓవర్లో దీప్తి శర్మ పెవిలియన్‌కు పంపింది. ఒక వైపు క్రమం తప్పకుండా వికెట్లు పడుతోన్న గార్డనర్ మాత్రం తన పోరాటాన్ని కొనసాగించింది. గార్డనర్ 52 పరుగులతో అఖరి వరకు నిలిచి ఆస్ట్రేలియాను విజయ తీరాలకు చేర్చింది. ఇక భారత్ తమ తదుపరి మ్యాచ్ జూలై 31న పాకిస్తాన్ తో ఆడనున్నది. చదవండి: IND vs WI: వెస్టిండీస్‌తో తొలి టీ20.. అరుదైన రికార్డుకు చేరువలో రోహిత్ శర్మ..! -
కామన్వెల్త్ గేమ్స్.. భారత క్రికెట్ జట్టుకు గుడ్ న్యూస్..!
కామన్వెల్త్ గేమ్స్-2022లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగే తొలి మ్యాచ్‌కు ముందు భారత్ మహిళల జట్టుకు గుడ్ న్యూస్ అందింది. కరోనా బారిన పడిన బ్యాటర్ సబ్భినేని మేఘన కోలుకుంది. తాజాగా నిర్వహించిన పరీక్షలలో ఆమెకు నెగిటివ్‌గా తేలింది. దీంతో మేఘన బర్మింగ్‌హామ్‌లో ఉన్న భారత జట్టలో చేరేందుకు సిద్దమైంది. ఇక ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా మేఘన దృవీకరించింది. ఇక మేఘనా తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో బర్మింగ్‌హామ్‌కు వెళ్లే తన ఫ్లైట్ బోర్డింగ్ పాస్ ఫోటోను షేర్ చేసింది. కాగా కామన్వెల్త్ గేమ్స్‌లో పాల్గొనడానికి భారత జట్టు బర్మింగ్‌హామ్‌కు పయనమయ్యే ఒక్క రోజు ముందు మేఘన, ఆల్ రౌండర్ పూజా వస్త్రాకర్ కరోనా బారిన పడ్డారు. దీంతో వీరిద్దరూ బర్మింగ్‌హామ్‌కు వెళ్లే ఫ్లైట్ ఎక్కకుండా బెంగళూరులో ఉండిపోయారు. అయితే పూజా ఇంకా కోలుకోలేనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆమె ఆస్ట్రేలియా, పాకిస్తాన్‌తో జరిగే లీగ్ మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశం ఉంది. ఇక కామన్వెల్త్ క్రీడల చరిత్రలో తొలి సారిగా మహిళల క్రికెట్ పోటీలు జరగనున్నాయి. ఈ టోర్నమెంట్ జూలై 29న బర్మింగ్‌హామ్ వేదికగా ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో ఎనిమిది జట్లను నాలుగు గ్రూపులుగా విభజించారు. ఆస్ట్రేలియా,పాకిస్తాన్ బార్బడోస్ జట్లతో కలిపి భారత్ గ్రూప్-ఎలో ఉంది. గ్రూప్-బిలో ఆతిథ్య ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, శ్రీలంక ఉన్నాయి. ఆయా గ్రూప్స్‌లో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్‌కు చేరుకుంటాయి. భారత తమ తొలి మ్యాచ్‌లో శుక్రవారం(జూలై 29) ఆస్ట్రేలియాతో తలపడనుంది. కామన్వెల్త్ గేమ్స్‌కు భారత జట్టు హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, ఎస్. మేఘన, తనియా భాటియా,యాస్తిక భాటియా, దీప్తి శర్మ, రాజేశ్వరి గయాక్వాడ్, పూజా వస్త్రాకర్, మేఘనా సింగ్, రేణుకా ఠాకూర్, జెమిమా రోడ్రిగ్స్, రాధా యాదవ్, హర్లీన్ డియోల్, స్నేహ రాణా చదవండి: PV Sindhu: ఆర్టీపీసీఆర్ ఫలితాల్లో వ్యత్యాసంతో అనుమానం.. ఐసోలేషన్‌కు తరలింపు -
Commonwealth games 2022: పీవీ సింధుకు కోవిడ్..?
కామన్వెల్త్ క్రీడల ప్రారంభానికి కొద్ది గంటల ముందు భారత బృందానికి సంబంధించి ఓ షాకింగ్ వార్త బయటకు వచ్చింది. ఓపెనింగ్ సెర్మనీలో పురుషుల హాకీ జట్టు కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్‌తో పాటు భారత ఫ్లాగ్ బేరర్‌గా వ్యవహరించాల్సిన బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు కోవిడ్ బారినపడినట్లు ప్రచారం జరుగుతుంది. సింధుకు సంబంధించిన ఆర్టీపీసీఆర్ ఫలితాల్లో తొలుత కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని, ఆతర్వాత మళ్లీ జరిపిన టెస్ట్‌లో ఫలితం మరోలా ఉందని, ఈ వ్యత్యాసం ఎందుకు వచ్చిందో ఎటు తేల్చుకోలేక ముందు జాగ్రత్తగా సింధును ఐసోలేషన్‌కు తరలించారని సమాచారం. సింధు విషయంలో జరుగుతున్న ఈ ప్రచారాన్ని భారత బృందానికి చెందిన ఓ కీలక వ్యక్తి నిర్ధారించారు. సింధుకు మరోసారి ఆర్టీపీసీఆర్ పరీక్ష చేశారని.. అందులో నెగిటివ్ ఫలితం వచ్చాకే ఆమెను కామన్వెల్త్ క్రీడా గ్రామంలో అనుమతిస్తామని సదరు వ్యక్తి తెలిపాడు. కాగా, భారత బృందంతో పాటు పీవీ సింధు జులై 25న హైదరాబాద్ నుంచి బర్మింగ్‌హామ్‌కు బయల్దేరిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లో ఫ్లైట్ ఎక్కడానికి ముందు, ఆతర్వాత లండన్‌లో ల్యాండయ్యాక జరిపిన కోవిడ్ పరీక్షల్లో సింధును నెగిటివ్ రిపోర్టే వచ్చింది. అయితే ఇవాళ సింధుకు కోవిడ్ అనుమానిత లక్షణాలు ఉండటంతో పరీక్ష నిర్వహించారని, అందులో ఫలితం కన్ఫ్యూజింగ్గా వచ్చిందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే, కామన్వెల్త్ క్రీడల ప్రారంభ వేడుకలు (ఓపెనింగ్ సెర్మనీ) భారత కాలమానం ప్రకారం ఇవాళ రాత్రి 11.30 గంటలకు ప్రారంభంకానున్నాయి. ఈ వేడుకల్లో మన్‌ప్రీత్ సింగ్‌తో పాటు పీవీ సింధు 214 మంది సభ్యుల భారత బృందానికి ప్రతినిధిగా త్రివర్ణపతాకాన్ని చేతపట్టుకొని ముందుండి నడిపించాల్సి ఉంది. చదవండి: పీవీ సింధుకు అరుదైన గౌరవం -
బర్మింగ్‌హామ్ వేదికగా కామన్వెల్త్ గేమ్స్