కామన్వెల్త్ గేమ్స్ మహిళల బాక్సింగ్‌లో భారత స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ (50 కేజీలు) క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. తొలి రౌండ్‌లో నిఖత్ పంచ్‌ల ధాటికి ప్రత్యర్థి హెలెనా (మొజాంబిక్) తట్టుకోలేక విలవిలలాడింది. దాంతో రిఫరీ మూడో రౌండ్ మధ్యలోనే బౌట్‌ను నిలిపివేసి నిఖత్‌ను విజేతగా ప్రకటించారు. నిఖత్ ఇటీవలే జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం నెగ్గి జోరుమీదున్న విషయం తెలిసిందే.
ఈ పోటీల్లోనూ నిఖత్ పసిడి పంచ్ విసరాలని పట్టుదలగా ఉంది. క్వార్టర్స్‌లో నిఖత్.. న్యూజిలాండ్‌కు చెందిన గార్టన్‌తో తలపడనుంది. మరోవైపు పురుషుల 63.5 కేజీల విభాగంలో భారత స్టార్ బాక్సర్ శివ థాపాకు అనూహ్య పరాజయం ఎదురైంది. ప్రిక్వార్టర్స్‌లో థాపా 1-4తో రిసీ లించ్ (స్కాట్లాండ్) చేతిలో ఓటమి పాలయ్యాడు.
Comments
Please login to add a commentAdd a comment