Nikhat Zareen
-
DSP నిఖిత్ జరీన్.. హైదరాబాద్ లో సరైన ట్రైనింగ్ సెంటర్ లేదు
-
త్వరలోనే DSPగా బాధ్యతలు చేపడతా: నిఖత్ జరీన్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి భారత బాక్సర్ నిఖత్ జరీన్ ధన్యవాదాలు తెలిపింది. తన ప్రతిభను గుర్తించి డిప్యూటీ సూపరింటెండెట్ ఆఫ్ పోలీస్(డీఎస్పీ) పోస్ట్ ఇవ్వడం పట్ల కృతజ్ఞతాభావం చాటుకుంది. క్రీడాకారులను ప్రభుత్వం ఇలా ప్రోత్సహిస్తే తనలాగే మరికొంత మంది కూడా ముందుకు వస్తారని పేర్కొంది.కాగా తెలంగాణలోని నిజామాబాద్‌కు చెందిన నిఖత్ జరీన్ వరల్డ్ చాంపియన్‌గా ఎదిగింది. ఒలింపిక్ పతకమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. అయితే, ఇటీవల ప్యారిస్ ఒలింపిక్స్-2024లో భాగంగా తొలిసారి విశ్వక్రీడల బరిలో దిగిన నిఖత్‌కు నిరాశే ఎదురైంది. మహిళల 50 కేజీల విభాగంలో పోటీపడిన ఆమె.. ప్రాథమిక దశలోనే వెనుదిరిగింది. చైనాకు చెందిన వూ యు చేతిలో ఓడి ఇంటిబాట పట్టింది.సీఎం సానుకూలంగా స్పందించారుఅయితే, ప్రపంచ వేదికలపై సత్తా చాటిన నిఖత్ జరీన్‌ను తెలంగాణ ప్రభుత్వం అభినందించడంతో పాటు డీఎస్పీగా పోస్టు ఇచ్చింది. ఈ విషయంపై స్పందించిన నిఖత్ సాక్షి టీవీతో మాట్లాడుతూ.. హర్షం వ్యక్తం చేసింది. ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలపడంతో పాటు.. తెలంగాణ రాష్ట్రంలో బాక్సింగ్ అకాడమీ లేకపోవడం బాధాకరమని పేర్కొంది. ఈ విషయం గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లానన్న నిఖత్.. ఆయన సానుకూలంగా స్పందించినట్లు తెలిపింది.సిరాజ్‌కు కూడా‘‘తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అన్ని సహాయ సహకారాలు అందిస్తోంది. త్వరలోనే డీఎస్పీ ట్రైనింగ్ తీసుకుంటాను. డీజీపీ జితేందర్ గారు ట్రైనింగ్ సమాచారం ఇస్తామని చెప్పారు’’ అని నిఖత్ తెలిపింది. ఇక ప్యారిస్‌లో ఓడిపోవడం బాధ కలిగించిందన్న నిఖత్ జరీన్ వచ్చే ఒలింపిక్స్‌లో కచ్చితంగా మెడల్ సాధిస్తానని ధీమా వ్యక్తం చేసింది. కాగా నిఖత్‌తో పాటు టీ20 ప్రపంచకప్-2024 సాధించిన భారత క్రికెట్ జట్టులో సభ్యుడైన హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్‌కు సైతం ప్రభుత్వం డీఎస్పీ పోస్ట్ ఇచ్చింది. చదవండి: ఆమె నిజాయితీని అమ్ముకుంది.. మండిపడ్డ బబిత.. వినేశ్ స్పందన ఇదే -
అది తలచుకుంటేనే బాధేస్తుంది: బాక్సర్ నిఖత్ జరీన్
న్యూఢిల్లీ: పారిస్ ఒలింపిక్స్ నుంచి చేదు ఫలితంతో తిరిగొచ్చిన ప్రపంచ చాంపియన్, తెలంగాణ స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ త్వరలోనే పంచ్ పవర్‌ను పెంచుకొని రింగ్‌లోకి దిగుతానని చెప్పింది. ఇందుకోసం వ్యక్తిగత కోచ్ అవసరమని... ప్రస్తుతం కోచ్‌ను నియమించుకునే పనిలో నిమగ్నమైనట్లు నిఖత్ వెల్లడించింది. మహిళల 50 కేజీల ఈవెంట్లో భారత్ ఆమెపై ఆశలు పెట్టుకుంది. ఈ చాంపియన్ బాక్సర్ తప్పకుండా పతకం సాధిస్తుందనే అంచనాలతో బరిలోకి దిగగా ఊహించని స్థాయిలో భారత శిబిరానికి నిరాశ ఎదురైంది. ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన ఆరుగురిలో అందరికంటే ముందుగా బెర్తు సాధించిన తెలంగాణ స్టార్... పారిస్‌లో ప్రిలిమినరీ దశలో ఆసియా క్రీడల చాంపియన్ వూ యు (చైనా) చేతిలో కంగుతింది.‘లోపాలు లేకుండా ఎవరూ ఉండరు. పైగా ఆ రోజు నాకు కలిసిరాలేదు. నేను అన్‌సీడెడ్ ప్లేయర్ కాబట్టి ఆరంభంలోనే నాకు క్లిష్టమైన ప్రత్యర్థి ఎదురైంది. చిత్రమేమిటంటే ఈ ఒలింపిక్స్‌లో పతకాలు గెలిచిన వారెవరైతే ఉన్నారో వాళ్లను గతంలో నేను ఓడించాను. ఇది తలచుకుంటేనే బాధేస్తుంది. ఏదేమైనా జీవితంలో అన్నింటిని స్వీకరించాలి గెలుపైనా... ఓటమైనా! నాతో ఎలాంటి ప్రణాళిక లేదు. కానీ ఎలా ఎదగాలో... ఎలా పుంజుకోవాలో తెలుసు. ఇప్పటివరకు నాకు వ్యక్తిగత కోచ్ లేడు. నేను నా శక్తిసామర్థ్యాలు పెంచుకోవాలంటే కోచ్ కావాల్సిందే. అతని శిక్షణతో రాటుదేలాలి. ఉత్తమ బాక్సర్‌గా ఎదగాలంటే మంచి కోచ్ వద్ద ట్రెయినింగ్ తప్పనిసరి. సుశిక్షితుడైన కోచ్ దొరికితే ఎలా సన్నద్ధం కావాలో నాకు తెలుసు’ అని రెండుసార్లు ప్రపంచ చాంపియన్ అయిన నిఖత్ జరీన్ వివరించింది.చదవండి: మహారాజు కాబోతున్న టీమిండియా మాజీ క్రికెటర్.. ఎవరంటే?భిన్నశైలి బాక్సర్లతో విభిన్నమైన పద్ధతుల్లో తలపడితేనే ఆటతీరు మారుతుందని ఆమె ఆశిస్తోంది. తనలో లోపాలున్న చోట సరిదిద్దుకునే పనిలో ఉన్నానని ముందుగా బలంగా తయారయ్యేందుకు ప్రాధాన్యమిస్తున్నట్లు చెప్పింది. తద్వారా పంచ్ పవర్‌ను పెంచుకోవచ్చని తెలిపింది. -
రెడీ.. సెట్.. గో..! మరో 4 రోజుల్లో.. హైదరాబాద్ మారథాన్!
సాక్షి, సిటీబ్యూరో: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మోస్ట్ అవెయిటెడ్ ఎన్ఎండీసీ హైదరాబాద్ మారథాన్ ఈవెంట్ మరో నాలుగు రోజుల్లో జరగనుంది. ప్రతి సంవత్సరం కంటే ఈసారి సరికొత్తగా మన ముందుకు రానుంది. నగరంలోని ఓ హోటల్లో మారథాన్‌కు సంబంధించి టీషర్ట్, మెడల్స్ లాంచ్ ఈవెంట్ మంగళవారం జరిగింది. ఇందులో ఎన్ఎండీసీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అమితవ ముఖర్జీ, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంకు హెడ్ బ్రాంచ్ బ్యాంకింగ్ సౌత్ నిరీశ్ లలన్, ప్రముఖ బాక్సర్ నిఖత్ జరీన్ పాల్గొన్నారు.13వ ఎడిషన్ మారథాన్‌కు వర్లడ్ అథ్లెటిక్స్ గుర్తింపు రావడంతో మరింత ప్రత్యేకత సంతరించుకుందని రేస్ డైరెక్టర్ రాజేశ్ వెచ్చా పేర్కొన్నారు. 30 రాష్ట్రాల నుంచి దాదాపు ఈ ఏడాది 25,500 మంది మారథాన్‌లో పాల్గొనేందుకు రిజిస్టర్ చేసుకున్నారని తెలిపారు. ఈ మారథాన్‌కు ప్రపంచస్థాయి ఏర్పాట్లు చేశామని వివరించారు. మారథాన్‌లో పాల్గొనే రన్నర్ల సంఖ్య పరంగా చూసుకుంటే.. భారత్‌లోనే అతిపెద్ద రెండో పరుగు ఇదని పేర్కొన్నారు.ప్రైజ్‌మనీ.. రూ.48 లక్షలుఈ మారథాన్‌లో 42 కిలోమీటర్ల దూరం రన్నర్లు పరుగెత్తనున్నారు. ఫుల్ మారథాన్‌తో పాటు హాఫ్ మారథాన్, 10 కిలోమీటర్లు, 5 కిలోమీటర్ల పరుగు కూడా ఉంటుంది. ఇటీవలే ఈ మారథాన్ డ్రైరన్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. ఈ మారథాన్‌లో మొత్తం రూ.48 లక్షల ప్రైజ్‌మనీ ఇవ్వనున్నారు. మారథాన్ మొదటి రోజైన 24వ తేదీన ఉదయం 7 గంటలకు ఫన్ రన్ పేరుతో 5కే రన్ ఉంటుంది. ఇది అసలు మారథాన్‌కు కర్టెన్‌రైజర్ లాంటిది. ప్రతిఒక్కరూ రన్నింగ్‌ను సెలబ్రేట్ చేసుకునేందుకు ఈ ఫన్ రన్ ఏర్పాటు చేశారు.ఇది హైటెక్స్‌లో ఉంటుంది. ఇక మరుసటి రోజు అసలు ఫుల్ మారథాన్ ప్రారంభం అవుతుంది. పీపుల్స్ ప్లాజా వద్ద ఉదయం మారథాన్ ప్రారంభం అవుతుంది. రాజ్‌భవన్ రోడ్డు, పంజాగుట్ట ఫ్లైఓవర్, కేబీఆర్ పార్కు, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి, మైండ్ స్పేస్ జంక్షన్, బయోడైవర్సిటీ జంక్షన్, గచి్చ»ౌలి ఫ్లైఓవర్, హెచ్‌సీయూ మీదుగా గచి్చబౌలి అథ్లెటిక్ స్టేడియం వద్ద ముగుస్తుంది. హాఫ్ మారథాన్ పీపుల్స్ ప్లాజా వద్ద ప్రారంభమై.. 21 కి.మీ. దూరం ఉండేలా నిర్దేశించిన మార్గంలో రన్ ఉంటుంది. గచ్చిబౌలి స్టేడియం వద్ద ముగుస్తుంది. -
సిరాజ్, నిఖత్ జరీన్‌కు గ్రూప్-1 ఉద్యోగాలు.. తెలంగాణ కేబినెట్ నిర్ణయం
టీ20 వరల్డ్‌కప్ 2024 గెలిచిన భారత జట్టులోని సభ్యుడు మొహమ్మద్ సిరాజ్‌కు తెలంగాణ ప్రభుత్వం గ్రూప్-1 ఉద్యోగం ఆఫర్ చేసింది. సిరాజ్‌తో పాటు రెండు సార్లు వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్ అయిన నిఖత్ జరీన్ కూడా గ్రూప్-1 ఉద్యోగం ఇవ్వాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది. ఇవాళ (ఆగస్ట్ 1) జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ అంశంపై తీర్మానం చేశారు. సిరాజ్, జరీన్‌కు గ్రూప్-1 కేడర్‌లోని డీఎస్పీ ఉద్యోగంతో పాటు ఆర్ధిక సాయం అందజేయనున్నట్లు తెలుస్తుంది.కాగా, సిరాజ్ ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉన్న భారత జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. జరీన్ ప్రస్తుతం పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొంటుంది. జరీన్ ఇవాళ జరిగిన ప్రి క్వార్టర్స్ మ్యాచ్‌లో చైనాకు చెందిన టాప్ సీడ్ వు యు చేతిలో ఓటమిపాలై ఒలింపిక్స్ బరి నుంచి నిష్క్రమించింది. ఓటమి అనంతరం జరీన్ తీవ్ర భావోద్వేగానికి లోనై కన్నీటిపర్యంతమైంది -
Olympics: ముగిసిన ప్రయాణం.. నిఖత్ జరీన్ కన్నీటి పర్యంతం
ప్యారిస్ ఒలింపిక్స్-2024లో భారత మహిళా స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ పోరాటం ముగిసింది. ప్రి క్వార్టర్స్‌లో చైనాకు చెందిన టాప్ సీడ్ వు యు చేతిలో నిఖత్ ఓటమిపాలైంది. నార్త్ ప్యారిస్ ఎరీనాలో గురువారం నాటి బౌట్లో వు యు 5-0తో నిఖత్‌ను ఓడించింది. కాగా రెండుసార్లు ప్రపంచ చాంపియన్, తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్‌కు ఇవే తొలి ఒలింపిక్స్. కన్నీటి పర్యంతంమహిళల 50 కేజీల విభాగంలో పోటీపడిన ఆమె.. తొలి రౌండ్ బౌట్లో 5–0తో మ్యాక్సీ కరీనా క్లోట్జెర్ (జర్మనీ)ని ఓడించి రౌండ్ ఆఫ్ 16(ప్రి క్వార్టర్స్)కు అర్హత సాధించింది. ప్రత్యర్థిపై ఆది నుంచే పంచ్‌లు విసరుతూ పైచేయి సాధించింది. అయితే, కీలక పోరులో వు యు రూపంలో సవాల్ ఎదురుకాగా.. నిఖత్ అధిగమించలేకపోయింది. ప్యారిస్‌లో పతకం సాధించాలన్న కల చెదిరిపోవడంతో కన్నీటి పర్యంతం అయింది.క్షమించండి.. నిఖత్ భావోద్వేగం‘‘సారీ.. ఈ అనుభవం నాకు కొత్త పాఠం నేర్పింది. నేను ఇంతకుముందు వు యుతో తలపడలేదు. తను చాలా వేగంగా కదిలింది. పొరపాటు ఎక్కడ జరిగిందో సరిచూసుకోవాలి. ఎంతో కష్టపడి ఇక్కడిదాకా చేరుకున్నాను. శారీరకంగా.. మానసికంగా ఒలింపిక్స్‌కి సన్నద్దమయ్యాను. రెట్టించిన ఉత్సాహంతో తిరిగి వస్తాను’’ అని 28 ఏళ్ల నిజామాబాద్ అమ్మాయి నిఖత్ జరీన్ భావోద్వేగానికి గురైంది. లవ్లీనాపైనే ఆశలన్నీభారత ఒలింపిక్స్ క్రీడల చరిత్రలో ముగ్గురికే సాధ్యమైన ఘనతను సాధించేందుకు మహిళా స్టార్ బాక్సర్ లవ్లీనా బొర్గొహైన్ ఒక్క విజయం దూరంలో ఉంది. వరుసగా రెండో ఒలింపిక్స్‌లో పోటీపడుతున్న ఈ అస్సాం బాక్సర్ ఆడిన తొలి బౌట్‌లోనే ఏకపక్ష విజయంతో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. బుధవారం జరిగిన 75 కేజీల విభాగం ప్రిక్వార్టర్ ఫైనల్లో లవ్లీనా 5–0తో (29–28, 30–27, 29–28, 30–27, 29–28) సునీవా హాఫ్స్టడ్ (నార్వే)ను చిత్తుగా ఓడించింది.కాంస్య పతకానికి అడుగుదూరంలోఇక ఆదివారం జరిగే క్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ లీ కియాన్ (చైనా)తో లవ్లీనా తలపడుతుంది. ఈ బౌట్లో గెలిస్తే లవ్లీనాకు కనీసం కాంస్య పతకం ఖాయమవుతుంది. తద్వారా వ్యక్తిగత క్రీడాంశంలో రెండు ఒలింపిక్ పతకాలు గెలిచిన నాలుగో భారతీయ ప్లేయర్‌గా లవ్లీనా గుర్తింపు పొందుతుంది. ఇప్పటి వరకు భారత్ తరఫున రెజ్లర్ సుశీల్ కుమార్ (2008 బీజింగ్–కాంస్యం; 2012 లండన్–రజతం), షట్లర్ పీవీ సింధు (2016 రియో–రజతం; 2020 టోక్యో–కాంస్యం), పిస్టల్ షూటర్ మనూ భాకర్ (2024 పారిస్–2 కాంస్యాలు) రెండు ఒలింపిక్ పతకాల చొప్పున సాధించారు.క్వార్టర్ ఫైనల్లో లవ్లీనా సత్తాకు అసలు పరీక్ష 2020 టోక్యో ఒలింపిక్స్‌లో 69 కేజీల విభాగంలో పోటీపడి కాంస్య పతకం నెగ్గిన లవ్లీనా ఈసారి ‘పారిస్’లోనూ మెడల్ ఫేవరెట్స్‌లో ఒకరిగా బరిలోకి దిగింది. సునీవాతో జరిగిన బౌట్లో లవ్లీనా పక్కా వ్యూహంతో ఆడి ప్రత్యరి్థకి ఏ దశలోనూ అవకాశం ఇవ్వలేదు. తన ఎత్తును ఉపయోగించుకొని నార్వే బాక్సర్ ముఖంపై నిలకడగా పంచ్‌లు కురిపించింది. నిర్ణీత మూడు రౌండ్లలోనూ లవ్లీనా పూర్తి ఆధిపత్యం చలాయించింది.దాంతో బౌట్‌ను పర్యవేక్షించిన ఐదుగురు జడ్జిలు లవ్లీనాయే పైచేయి సాధించినట్లు నిర్ణయించారు. క్వార్టర్ ఫైనల్లో లవ్లీనా సత్తాకు అసలు పరీక్ష ఎదురుకానుంది. చైనా బాక్సర్ లీ కియాన్ టోక్యో ఒలింపిక్స్‌లో 75 కేజీల విభాగంలో రజత పతకం సాధించింది. 2016 రియో ఒలింపిక్స్‌లో స్వర్ణం సొంతం చేసుకుంది. గత ఏడాది జరిగిన ఆసియా క్రీడల్లో లీ కియాన్ పసిడి పతకాన్ని దక్కించుకుంది. ఫలితంగా లవ్లీనా తన అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేస్తేనే చైనా బాక్సర్‌పై పైచేయి సాధించే అవకాశం ఉంటుంది. పోరాడి ఓడిన ప్రీతి మరోవైపు మహిళల 54 కేజీల విభాగంలో భారత బాక్సర్ ప్రీతి పవార్ పోరాటం ముగిసింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రీతి పవార్ 2–3తో (29–28, 29–28, 30–27, 30–27, 28–29) రెండో సీడ్ మార్సెలా అరియస్ కాస్టనెడా (కొలంబియా) చేతిలో పోరాడి ఓడిపోయింది. చదవండి: Olympics 2024: భారత్ ఖాతాలో మూడో పతకం Olympics 2024: భారత్ జైత్రయాత్రకు బ్రేక్.. బెల్జియం చేతిలో ఓటమి -
ఒలింపిక్స్: నిఖత్ ‘పంచ్’ సూపర్...
పారిస్: తొలిసారి ఒలింపిక్స్‌లో పోటీపడుతున్న భారత స్టార్ బాక్సర్, తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్ తన పంచ్‌పవర్ చాటింది. మహిళల 50 కేజీల విభాగంలో తిరుగులేని ఆధిపత్యం కనబర్చిన నిఖత్ ప్రిక్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. ఆదివారం జరిగిన తొలి రౌండ్ బౌట్లో నిఖత్ 5–0తో మ్యాక్సీ కరీనా క్లోట్జెర్ (జర్మనీ)పై విజయం సాధించింది. రెండుసార్లు ప్రపంచ చాంపియన్ నిఖత్ బౌట్ ఆరంభం నుంచే ప్రత్యరి్థపై పంచ్‌ల వర్షం కురిపించగా... తన ఎత్తును సద్వినియోగ పర్చుకుంటూ జర్మనీ బాక్సర్ కూడా దీటైన పంచ్‌లు విసిరింది. అయితే రెండో రౌండ్లో తేరుకున్న నిఖత్.. కీలక సమయాల్లో హుక్స్, జాబ్స్‌తో పాయింట్లు కొల్లగొట్టి విజేతగా నిలిచింది. గురువారం జరగనున్న ప్రిక్వార్టర్స్‌లో ఫ్లయ్ వెయిట్ ప్రపంచ చాంపియన్ వూ యూ (చైనా)తో నిఖత్ తలపడనుంది. మరోవైపు మహిళల 54 కేజీల విభాగంలో భారత బాక్సర్ ప్రీతి పవార్ కూడా ప్రిక్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. తొలి రౌండ్లో ప్రీతి 5–0తో వియత్నాం బాక్సర్ వో థీ కిమ్‌పై ఏకపక్ష విజయం సాధించింది. -
Olympics 2024: నిఖత్ జరీన్‌కు కఠినమైన డ్రా.. తెలుగు బిడ్డకు బిగ్ ఛాలెంజ్
ఒలింపిక్స్‌లో పతకమే లక్ష్యంగా ప్యారిస్‌లో అడుగుపెట్టిన వరల్డ్ ఛాంపియన్, తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్‌కు కఠినమైన డ్రా లభించింది. ఒలింపిక్స్ 2024 బాక్సింగ్ డ్రాను నిర్వహకులు శుక్రవారం విడుదల చేశారు. 50 కేజీల బాక్సింగ్ ఈవెంట్ తొలి రౌండ్లో నిఖత్ జరీన్ జర్మనీ సంచలనం కరీనా క్లొయెట్జర్‌తో తలపడనుంది. క్లొయెట్జర్పై విజయం సాధిస్తే రెండో రౌండ్లో జరీన్‌కు ప్రపంచ ఛాంపియన్షిప్ స్వర్ణ పతక విజేత, టాప్ ర్యాంకర్ వూ యూ(చైనా) నుంచి గట్టి సవాల్ ఎదురుకానుంది. నిఖత్ జరీన్‌తో పాటు మరో భారత మహిళా బాక్సర్, టోక్యో ఒలింపిక్ కాంస్య పతక విజేత లోవ్లినా బోర్గోహైన్కు కూడా కష్టమైన డ్రా లభించింది. 75 కేజీల విభాగంలో తొలి రౌండ్లో నార్వేకు చెందిన సున్నివా హాఫ్‌స్టాడ్‌తో లోవ్లినా తలపడనుంది. ఒకవేళ ఆమె ఫస్ట్ రౌండ్లో విజయం సాధిస్తే.. రెండు సార్లు ఒలింపిక్స్ మెడలిస్ట్, చైనా స్టార్ బాక్సర్ లి కియాన్‌తో అమీతుమీ తెల్చుకోనుంది. అదేవిధంగా మహిళల 54 కేజీల విభాగంలో మరో భారత బాక్సర్ జైస్మిన్ లంబోరియా తొలి రౌండ్లో టోక్యోలో సిల్వర్ గెలిచిన ఫిలిప్పీన్స్ బాక్సర్ నెస్తీ పెటెసిను ఢీకొట్టనుంది. మరోవైపు పురుషుల విభాగంలో పోటీ పడుతున్న బాక్సర్లు నిషాంత్ దేవ్(71 కిలోలు), అమిత్ పంగల్ (52 కిలోలు)కు మాత్రం బై దక్కింది. ఇక శనివారం నుంచి(జూలై 27) బాక్సింగ్ పోటీలు షురూ కానున్నాయి. -
సచిన్ టెండూల్కర్‌ని కలిసిన బాక్సింగ్ క్వీన్ (ఫొటోలు)
-
Paris Olympics 2024: భారత బాక్సర్లకు చివరి అవకాశం
పారిస్ ఒలింపిక్స్ బాక్సింగ్ వరల్డ్ క్వాలిఫయింగ్ చివరి టోర్నీ శుక్రవారం నుంచి బ్యాంకాక్‌లో జరగనుంది. ఈ టోర్నీలో సెమీఫైనల్ చేరిన బాక్సర్లకు పారిస్ ఒలింపిక్స్ బెర్త్ ఖరారవుతుంది. భారత్ నుంచి పురుషుల విభాగంలో ఏడుగురు బాక్సర్లు (అమిత్ పంఘాల్–51 కేజీలు, సచిన్–57 కేజీలు, అభినాశ్ జమ్వాల్–63.5 కేజీలు, నిశాంత్ దేవ్–71 కేజీలు, అభిమన్యు–80 కేజీలు, సంజీత్–92 కేజీలు, నరేందర్ –ప్లస్ 92 కేజీలు)... మహిళల విభాగంలో ముగ్గురు బాక్సర్లు (జాస్మిన్–57 కేజీలు, అంకుశిత–60 కేజీలు, అరుంధతి–66 కేజీలు) బరిలో ఉన్నారు. ఇదిలా ఉంటే.. భారత్‌కు విశ్వ క్రీడల బాక్సింగ్ విభాగంలో ఇప్పటికే మూడు బెర్తులు ఖరారయ్యాయి. నిఖత్ జరీన్(50 కేజీలు), ప్రీతి పవార్(54 కేజీలు), టోక్యో కాంస్య పతక విజేత లవ్లీనా బొర్గోహెయిన్(75 కేజీలు) ఒలింపిక్స్-2024 పోటీలకు అర్హత సాధించారు. -
నిఖత్ జరీన్‌కు స్వర్ణం
అస్తానా (కజకిస్తాన్): ప్రపంచ చాంపియన్ బాక్సర్ నిఖత్ జరీన్ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఎల్డోరా కప్ టోర్నమెంట్లో నిఖత్ స్వర్ణ పతకం గెలుచుకుంది. 52 కేజీల విభాగంలో శనివారం జరిగిన ఫైనల్లో నిఖత్ 5–0 పాయింట్ల తేడాతో స్థానిక బాక్సర్, కజకిస్తాన్‌కు చెందిన జజీరా ఉరక్‌బయెవాపై ఘన విజయం సాధించింది. మరో భారత బాక్సర్ మీనాక్షి కూడా పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. 48 కేజీల విభాగం ఫైనల్లో మీనాక్షి 4–1తో రహ్మొనొవా సైదాహొన్ (ఉజ్బెకిస్తాన్)ను ఓడించింది. అయితే ఫైనల్లో ఓడిన మరో ఇద్దరు భారత బాక్సర్లు అనామిక (50 కేజీలు), మనీషా (60 కేజీలు) రజత పతకాలతో సరిపెట్టుకున్నారు. ఓవరాల్‌గా ఈ టోర్నమెంట్లో భారత్ మొత్తం 12 పతకాలతో తమ అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసింది. ఇందులో 2 స్వర్ణాలు, 2 రజతాలు, 8 కాంస్యాలు ఉన్నాయి. -
ఫైనల్లో నిఖత్ జరీన్
ఎలోర్డా కప్ అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్లో భారత స్టార్ నిఖత్ జరీన్ (52 కేజీలు) ఫైనల్లోకి దూసుకెళ్లింది. కజకిస్తాన్‌లోని అస్తానా నగరంలో జరుగుతున్న ఈ టోర్నీలో గురువారం జరిగిన సెమీఫైనల్లో ప్రపంచ చాంపియన్ నిఖత్ 5–0తో తొమిరిస్ మిర్జాకుల్ (కజకిస్తాన్)పై ఘన విజయం సాధించింది. భారత్‌కే చెందిన మీనాక్షి (48 కేజీలు), అనామిక (50 కేజీలు), మనీషా (60 కేజీలు) కూడా ఫైనల్లోకి ప్రవేశించారు. సెమీఫైనల్స్‌లో మీనాక్షి 5–0తో గుల్నాజ్ బురిబయేవా (కజకిస్తాన్)పై, మనీషా 5–0తో టాంగటార్ అసెమ్ (కజకిస్తాన్)పై గెలిచారు. మరోవైపు సోనూ (63 కేజీలు), మంజు బంబోరియా (66 కేజీలు) సెమీఫైనల్లో నిష్క్రమించి కాంస్య పతకాలతో సరిపెట్టుకున్నారు. పురుషుల విభాగంలో భారత బాక్సర్లు సొయిబమ్ సింగ్ (48 కేజీలు), అభిషేక్ యాదవ్ (67 కేజీలు), విశాల్ (86 కేజీలు), గౌరవ్ చౌహాన్ (ప్లస్ 92 కేజీలు) నేడు సెమీఫైనల్స్‌లో పోటీపడనున్నారు. -
నిఖత్ విదేశీ శిక్షణకు క్రీడా శాఖ ఆమోదం
పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన తెలంగాణ స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్‌తోపాటు ప్రీతి, పర్వీన్, లవ్లీనా విదేశీ గడ్డపై శిక్షణ తీసుకోనున్నారు. ఒలింపిక్స్ సన్నాహాల కోసం ఈ నలుగురు బాక్సర్లు టర్కీ వెళ్లనున్నారు. ఈ నలుగురు బాక్సర్ల శిక్షణకు అయ్యే మొత్తం ఖర్చును భరిస్తామని కేంద్ర క్రీడా శాఖ ప్రకటించింది. క్రొయేషి యా, చెక్ రిపబ్లిక్లో జరిగే అంతర్జాతీయ టోర్నీల్లో పాల్గొనేందుకు భారత టేబుల్ టెన్నిస్ స్టార్ మనిక బత్రాకు అయ్యే ఖర్చులు భరిస్తామని క్రీడా శాఖ తెలిపింది. -
Strandja Memorial Boxing: నిఖత్‌కు రజతం
సోఫియా- Amit Panghal and Sachin win Gold: బల్గేరియాలో జరిగిన స్ట్రాంజా స్మారక అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నీలో భారత్‌కు రెండు స్వర్ణాలు, నాలుగు రజతాలు లభించాయి. మహిళల 50 కేజీల ఫైనల్లో తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ 2–3తో సబీనా (ఉజ్బెకిస్తాన్) చేతిలో, 66 కేజీల ఫైనల్లో అరుంధతి 1–4తో లి యంగ్ (చైనా) చేతిలో ఓడి రజత పతకాలను దక్కించుకున్నారు. పురుషుల 51 కేజీల ఫైనల్లో అమిత్ 5–0తో తష్కెంబే (కజకిస్తాన్)పై, 57 కేజీల ఫైనల్లో సచిన్ 5–0తో షఖ్జోద్ (ఉజ్బెకిస్తాన్)పై నెగ్గి స్వర్ణాలు సాధించారు. ఫైనల్స్‌లో బరున్ సింగ్ (48 కేజీలు), రజత్ (67 కేజీలు) ఓడి రజత పతకాలు గెలిచారు. Take a look at 🇮🇳's #Silver🥈& #Bronze🥉medalists of the 7⃣5⃣th Strandja Cup, 🇧🇬 *Nikhat: 🥈in 51kg weight category * Arundhati:🥈in 66kg weight category * Barun:🥈in 48kg weight category * Rajat: 🥈in 67kg weight category * Akash:🥉in 67kg weight category * Naveen:🥉in… pic.twitter.com/K0LqKHM8FT — SAI Media (@Media_SAI) February 11, 2024 -
ఫైనల్లో నిఖత్ జరీన్
సోఫియా: భారత టాప్ బాక్సర్ నిఖత్ జరీన్ స్ట్రాంజా మెమోరియల్ బాక్సింగ్ టోర్నీలో తన జోరు కొనసాగిస్తూ తుది పోరుకు అర్హత సాధించింది. రెండు సార్లు ప్రపంచ చాంపియన్ అయిన నిఖత్ ఏకపక్ష సమరంలో గెలిచి ఈ టోర్నమెంట్లో ఫైనల్లోకి ప్రవేశించింది. 50 కేజీల విభాగంలో శనివారం జరిగిన సెమీస్‌లో నిఖత్ 5–0 స్కోరుతో స్థానిక బాక్సర్ జ్లాటిస్లోవ్ చుకనోవాపై విజయం సాధించింది. తొలి రౌండ్లో నిఖత్ జాగ్రత్తగా ఆడగా బల్గేరియా బాక్సర్ కూడా పోటీనిచ్చింది. దాంతో స్కోరు 3–2తో ముగిసింది. అయితే తర్వాతి రెండు రౌండ్లలో ఆమెకు ఎదురు లేకుండా పోవడంతో 5–0, 5–0తో రౌండ్లు సొంతమయ్యా యి. ఓవరాల్ స్కోరింగ్‌తో చివరకు 5–0తో నిఖత్‌దే పైచేయి అయింది. నేడు జరిగే ఫైనల్లో ఉజ్బెకిస్తాన్‌కు చెందిన సబీనా బొ»ొకులోవాతో నిఖత్ తలపడుతుంది. 66 కేజీల విభాగంలో మరో భారత బాక్సర్ అరుంధరి చౌదరి కూడా ఫైనల్‌కు చేరగా...పురుషుల 51 కేజీల విభాగంలో భారత బాక్సర్ అమిత్ పంఘాల్ కూడా ఫైనల్లోకి అడుగుపెట్టాడు. -
సెమీఫైనల్లో నిఖత్ జరీన్
సోఫియా (బల్గేరియా): రెండుసార్లు ప్రపంచ చాంపియన్, తెలంగాణ స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ స్ట్రాంజా స్మారక అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నీలో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. మహిళల 50 కేజీల క్వార్టర్ ఫైనల్లో ఆమె 5–0తో ఖదిరి వాసిల (ఫ్రాన్స్)పై గెలిచి కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకుంది. 66 కేజీల క్వార్టర్స్‌లో అరుంధతి 5–0తో సెర్బియాకు చెందిన మిలెనాపై గెలుపొందింది. 57 కేజీల క్వార్టర్స్‌లో సాక్షి 2–3 తో మమజొనొవా (ఉజ్బెకిస్తాన్) చేతిలో ఓడిపోయింది. పురుషుల కేటగిరీలో దీపక్ (75 కేజీలు), నవీన్ (92 కేజీలు) క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. దీపక్ 5–0తో సుల్తాన్ (కిర్గిజిస్తాన్)పై, నవీన్ 5–0తో వొయిస్నరొవిక్ (లిథువేనియా)పై గెలుపొందారు. చదవండి: ఆస్ట్రేలియాతో ఫైనల్ పోరు.. టీమిండియా ప్రతీకారం తీర్చుకుంటుందా? -
నిఖత్ జరీన్‌కు చుక్కెదురు
కచ్చితంగా స్వర్ణ పతకంతో తిరిగి వస్తుందనుకున్న భారత స్టార్ బాక్సర్, ప్రపంచ చాంపియన్ నిఖత్ జరీన్‌కు ఆసియా క్రీడల్లో అనూహ్య ఓటమి ఎదురైంది. ఆదివారం జరిగిన మహిళల 50 కేజీల విభాగం సెమీఫైనల్లో నిఖత్ 2–3తో రక్సత్ చుథామట్ (థాయ్‌లాండ్) చేతిలో ఓడిపోయింది. దాంతో ఈ తెలంగాణ బాక్సర్ కాంస్య పతకంతో సరిపెట్టుకుంది. ఈ ఏడాది ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రక్సత్‌ను అలవోకగా ఓడించిన నిఖత్‌కు ఈసారి గట్టిపోటీ ఎదురైంది. పక్కా ప్రణాళికతో ఈ బౌట్లో దిగిన రక్సత్ భారత బాక్సర్‌ను నిలువరించింది. కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం, ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రెండుసార్లు స్వర్ణాలు నెగ్గిన నిఖత్ ఆసియా క్రీడల్లో కాంస్య పతకంతో సంతృప్తి పడింది. మరోవైపు భారత్‌కే చెందిన పర్వీన్ హుడా (63 కేజీలు) సెమీఫైనల్ చేరుకొని కనీసం కాంస్య పతకం ఖాయం చేసుకోవడంతోపాటు పారిస్ ఒలింపిక్స్ క్రీడలకు అర్హత సాధించింది. క్వార్టర్ ఫైనల్లో పర్విన్ హుడా 5–0తో తుర్దిబెకోవా సితోరా (ఉజ్బెకిస్తాన్)పై గెలిచింది. అయితే జాస్మిన్ (60 కేజీలు) పోరాటం క్వార్టర్ ఫైనల్లో ముగిసింది. ఉంగ్యోంగ్ వన్ (ఉత్తర కొరియా) సంధించిన పంచ్‌లకు జాస్మిన్ తట్టుకోలేకపోయింది. దాంతో రిఫరీ రెండో రౌండ్లో బౌట్‌ను ముగించి ఉంగ్యోంగ్ను విజేతగా ప్రకటించారు. -
Nikhat Zareen: సాహస యాత్రలకు సిద్ధం: వరల్డ్ బాక్సింగ్ చాంపియన్
భారత స్టార్ బాక్సర్, వరల్డ్ చాంపియన్ నిఖత్ జరీన్‌కు మహీంద్రా కంపెనీ స్పోర్ట్ యుటిలిటి వెహికిల్‌ను బహూకరించింది. తమ కంపెనీకి చెందిన ప్రఖ్యాత ఎస్యూవీ ‘థార్’ను బహుమతిగా అందించింది. మహీంద్ర ఎమర్జింగ్ బాక్సింగ్ ఐకాన్ విజేతగా నిలిచిన తెలంగాణ ముద్దుబిడ్డ నిఖత్‌కు థార్‌ను ప్రదానం చేసింది. మహీంద్రా కంపెనీ సౌత్ జోనల్ హెడ్ రాయ్, రీజినల్ సేల్స్ హెడ్ అభిషేక్, కొత్తగూడ మహీంద్రా వీవీసీ షోరూం ఎండీ వీవీ రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా నిఖత్‌కు ఎస్‌యూవీని అందజేశారు. ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్-2023లో విజేతగా నిలిచిన నిఖత్‌కు థార్‌ను గిఫ్ట్‌గా అందిస్తామని ఈ ఏడాది మార్చిలో ప్రకటించిన మహీంద్రా కంపెనీ.. తాజాగా ఆమెకు ఎస్యూవీ తాళాలను అందజేసింది. ఈ ఈవెంట్లో కంపెనీ ఉద్యోగులతో పాటు కస్టమర్లు కూడా పాల్గొన్నారు. నిఖత్ జరీన్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక తనకు ప్రతిష్టాత్మక మహీంద్ర ఎమర్జింగ్ బాక్సింగ్ ఐకాన్ అవార్డు రావడం పట్ల నిఖత్ జరీన్ సంతోషం వ్యక్తం చేసింది. ప్రస్తుతం తనకైతే డ్రైవింగ్ రాదని.. త్వరలోనే ‘థార్’తో తన ప్రయాణం మొదలుకానుందని పేర్కొంది. తన ప్యాషన్‌కు అనుగుణంగా ఈ ఎస్‌యూవీతో సాహసయాత్రలు చేస్తానంటూ చెప్పుకొచ్చింది. ప్రపంచ సీనియర్ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో నిఖత్ జరీన్ (50 కేజీలు) ఈ ఏడాది మరోసారి చాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. వరుసగా రెండో ఏడాది పసిడి సాధించి సత్తా చాటింది. ఢిల్లీలో జరిగిన ఫైనల్లో ఎన్గుయెన్ థిటామ్ను ఓడించి విజేతగా అవతరించి.. ప్రపంచ చాంపియన్‌షిప్ చరిత్రలో రెండు స్వర్ణాలు గెలిచిన రెండో భారత బాక్సర్‌గా నిలిచింది. -
Mahindra Thar Gifted To Nikhat Zareen: వరల్డ్ చాంపియన్ నిఖత్ జరీన్‌కు మహీంద్రా ‘థార్’ గిఫ్టు (ఫొటోలు)
-
నిఖత్ జరీన్‌కు రూ.2 కోట్లు.. ‘ఒలింపిక్స్’ శిక్షణ కోసం సీఎం కేసీఆర్ సాయం
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ నిఖత్ జరీన్ రాబోయే ఒలింపిక్స్ క్రీడల్లో స్వర్ణపతకాన్ని సాధించి తెలంగాణతోపాటు భారత దేశ ఘనకీర్తిని మరోసారి విశ్వానికి చాటాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆకాంక్షించారు. నిఖత్ జరీన్‌కు రాబోయే ఒలింపిక్స్ పోటీల్లో పాల్గొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. గురువారం సచివాలయంలో నిఖత్ జరీన్, సీఎం కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఒలింపిక్ క్రీడల్లో పాల్గొనేందుకు అవసరమైన శిక్షణ, ప్రయాణ ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని సీఎం స్పష్టం చేశారు. ఇందుకోసం ముఖ్యమంత్రి రూ.2 కోట్లను ప్రకటించారు. అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు వి.శ్రీనివాస్‌గౌడ్, మహమూద్ అలీ, ప్రశాంత్ రెడ్డి, మల్లారెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, బాల్క సుమన్, విఠల్ రెడ్డి, సీఎంవో కార్యదర్శి భూపాల్ రెడ్డి, క్రీడాశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా నిఖత్ జరీన్‌ను సందీప్ కుమార్ సుల్తానియా సచివాలయంలోని తన చాంబర్లో నిఖత్‌కు శాలువా కప్పి సత్కరించారు. చదవండి: లకారం ట్యాంక్‌బండ్‌పై ఎన్టీఆర్ విగ్రహం.. హైకోర్టు స్టే.. కీలక మార్పులు! -
ఎల్బీ స్టేడియంలో కేసీఆర్ ‘ఇఫ్తార్ విందు’.. హాజరైన ప్రముఖులు (ఫొటోలు)
-
బాక్సింగ్‌కి హైదరాబాద్‌లో సౌకర్యాలు లేవని అన్నారు
-
నిఖత్ జరీన్‌కు ఘనస్వాగతం
శంషాబాద్: ప్రపంచ మహిళా బాక్సింగ్ చాంపియన్ షిప్ గెలుచుకున్న నిఖత్ జరీన్‌కు శంషాబాద్ విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. శనివారం ఉదయం శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న నిఖత్‌కు రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ చాంపియన్‌న్‌షిప్ సాధించిన నిఖత్ యువతకు ఆదర్శమని ప్రశంసించారు. అనంతరం ఓపెన్‌టాప్ జీప్‌లో ఆమెతో పాటు ప్రయాణించారు. ఈ సందర్భంగా క్రీడాభిమానులు పెద్ద ఎత్తున ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. నిఖత్‌కు స్వాగతం పలికిన వారిలో క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ ఆంజనేయగౌడ్, రాష్ట్ర బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు చాముండేశ్వరీనాథ్, మాజీ ఎంపీ వేణుగోపాలాచారి, రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఉన్నతాధికారులు ఉన్నారు. -
Nikhat Zareen Photos: బాక్సర్ నిఖత్ జరీన్‌కు ఘన స్వాగతం (ఫొటోలు)
-
Nikhat Zareen: ఇండియన్ గోల్డెన్ గర్ల్‌కి మరో అరుదైన గిఫ్ట్!
ఢిల్లీలో జరుగుతున్న ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో గోల్డ్ మెడల్ సాధించిన 'నిఖత్ జరీన్' (Nikhat Zareen)పై సర్వత్ర ప్రశంసల వర్షం కురుస్తోంది. 50 కేజీల విభాగంలో వియత్నాం బాక్సర్ ఎన్‌గెయెన్ థి టామ్‌పై జరీన్ పూర్తి ఆధిపత్యం కొనసాగించి 5-0తో విజయం సాధించింది. ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిష్ చరిత్రలో నిఖత్ జరీన్‌కు ఇది రెండో స్వర్ణ పతకం విశేషం. ఇప్పటికే ఈమె 2022లో 52కేజీల విభాగంలో మొదటిసారి వరల్డ్ చాంపియన్‌గా మారింది. అయితే ఇప్పుడు పొందిన విజయంతో ఈమె ‘మహీంద్రా ఎమర్జింగ్ బాక్సింగ్ ఐకాన్’ అవార్డును కూడా గెలుచుకుంది. భారత క్రీడా చరిత్రలో ఎదురులేకుండా నిలిచి కొత్త అధ్యాయానికి నాంది పలికిన నిఖత్ జరీన్‌ను ప్రశంసిస్తూ కంపెనీ థార్ SUV గిఫ్ట్‌గా ఇచ్చింది. దీనికి సంబంధించిన సమాచారాన్ని మహీంద్రా ఆటోమోటివ్ ట్వీట్ చేసింది. (ఇదీ చదవండి: ఎమ్ఆర్పి ధరల్లో జరిగే మోసాలకు ఇలా చెక్ పెట్టండి) మహీంద్రా థార్ విషయానికి వస్తే, భారతీయ మార్కెట్లో ప్రజాదరణ పొందిన ఆఫ్-రోడ్ కార్లలో ఇది ఒకటి. ఇది అద్భుతమైన డిజైన్, అంతకు మించిన ఫీచర్స్ కలిగి పర్ఫామెన్స్ విషయంలో కూడా మంచి పనితీరుని అందిస్తుంది. ఇందులో రెండు డీజిల్ ఇంజిన్స్, ఒక పెట్రోల్ ఇంజిన్ ఆప్సన్స్ అందుబాటులో ఉంటాయి. -
Womens World Boxing Championships 2023: ప్రపంచాన్ని గెలిచిన మన బంగారాలు
ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్(ఐబీఏ) న్యూదిల్లీలో (మార్చి15–మార్చి26) నిర్వహించిన ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో నిఖత్ జరీన్ (50 కేజీల విభాగం), స్వీటీ బూరా (81 కేజీల విభాగం), లవ్లీనా (75 కేజీల విభాగం), నీతూ గంగాస్ (48 కేజీల విభాగం) స్వర్ణ పతకాలు గెలుచుకున్నారు. నిఖత్ నుంచి నీతూ వరకు ఎవరిదీ నల్లేరు మీద నడక కాదు. అడుగడుగునా సవాళ్లు ఎదురయ్యాయి. వాటికి దీటుగా పంచ్‌లు ఇచ్చి తమను తాము నిరూపించుకున్న ఈ స్వర్ణవిజేతలు ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు... నిఖత్ జరీన్: పదమూడేళ్ల వయసులోనే బాక్సింగ్ బరిలోకి దిగింది తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్‌కు చెందిన నిఖత్ జరీన్. నిఖత్లోని ప్రతిభ సంగతి పక్కనపెట్టి ‘మగరాయుడిలా ఈ ఆటలు ఏమిటి’ అన్న వాళ్లే ఎక్కువ. ‘ఎందుకొచ్చిన తలనొప్పి’ అని ఆమె తండ్రి నిఖత్‌ను ఆట మానిపించి ఉంటే విశ్వ విజేతగా నిఖత్‌ను చూసేవాళ్లం కాదు. రింగ్‌లో ఒత్తిడి ఎదురైతే బిత్తరపోయే రకం కాదు నిఖత్. ఆ ఒత్తిడినే బలంగా చేసుకునే నైజం ఆమెది. ఆటకు సంబంధించిన వ్యూహాల పైనే కాదు ఆహార నియమాల విషయంలోనూ దృష్టి సారించే నిఖత్ ప్రతికూల వ్యాఖ్యల గురించి పట్టించుకోలేదు. ఆటలో వ్యూహ ప్రతివ్యూహాలపైనే తన ఆసక్తి. వరుసగా రెండో ఏడాది ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌గా నిలిచి తన ప్రత్యేకత చాటుకుంది నిఖత్. మేరీ కోమ్ తరువాత ఒకటి కంటె ఎక్కువ స్వర్ణాలు గెలిచిన బాక్సర్‌గా నిలిచింది. పోరాటమే తన మార్గం. బలం. స్వీటీ బురా: హరియాణాలోని హిసార గ్రామీణ ప్రాంతానికి చెందిన స్వీటీ బురా తండ్రి మహేంద్రసింగ్ ఒకప్పటి బాస్కెట్‌బాల్ ప్లేయర్. తండ్రి ప్రభావంతో ఆటలపై స్వీటిలో ఆసక్తి మొదలైంది. బాక్సింగ్‌లో ఓనమాలు నేర్చుకోవడానికి ముందు స్వీటీ రాష్ట్ర స్థాయి కబడ్డీ ప్లేయర్. కబడ్డీలో స్వీటీ దూకుడు చూసి తండ్రితో సహా చాలామంది ‘ఈ అమ్మాయికి బాక్సింగ్ అయితే కరెక్ట్’ అనుకున్నారు. తండ్రి సూచనతో బాక్సింగ్ వైపు వచ్చింది స్వీటీ. ఒక ఆటలో ‘సూపర్’ అనిపించుకున్నవారికి కొత్తగా వేరే ఆటలోకి వెళ్లి నిరూపించుకోవడం అంత సులువైన విషయం ఏమీ కాదు. స్వీటీ బడ్డింగ్ బాక్సర్‌గా ఉన్నప్పుడు తనకు పెద్దగా సౌకర్యాలు ఉండేవి కావు. ఎక్కడైనా ఖాళీ స్థానం కనిపిస్తే కోచ్ అక్కడ శిక్షణ ఇచ్చేవాడు. పొలం భూముల్లో నేర్చుకున్నామా, పట్టణంలోని ప్రసిద్ధ కోచింగ్ సెంటర్లో నేర్చుకున్నామా అనేదాన్ని స్వీటీ ఎప్పుడూ మనసు మీదికి తీసుకోలేదు. గురువు చెప్పినదానికి తనదైన వ్యూహాన్ని జోడించి ఆటలో రాణించేది. ఒకసారి బాక్సింగ్ రింగ్‌లో ఉన్నప్పుడు స్వీటీకి ప్రత్యర్థి గట్టి పంచ్ ఇచ్చింది. ‘చుక్కలు కనిపించి ఉంటాయి నీకు’ అని తమ్ముడు అరిచాడు. అతను ఎగతాళిగా అన్నాడా, వ్యూహాత్మకంగా అన్నాడా అనేది వేరే విషయంగానీ తమ్ముడు చేసిన కామెంట్‌తో స్వీటీకి బాగా కోపం వచ్చింది. ఆ కోపం బలంగా మారి ప్రత్యర్థికి చుక్కలు చూపించింది! స్వీటీ పంచింగ్ గ్రామర్‌ను చూసి ప్రేక్షకులు వేనోళ్ల పొగిడారు. ఆ విజయంతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో బాక్సింగ్‌లో స్వీటీ విజయపరంపర కొనసాగుతూనే ఉంది. ‘ఆట అనేది నా రక్తంలోనే ఉంది’ అని సగర్వంగా చెప్పే స్వీటీ బురాకు రాబోయే ఒలింపిక్స్ అనేది లక్ష్యం. నీతూ గంగాస్: హరియాణా రాష్ట్రంలోని బివానీ జిల్లాలోని ఒక గ్రామంలో పుట్టింది నీతూ గంగాస్. తల్లి మాటల్లో చెప్పాలంటే చిన్నప్పుడు నీతూ చిలిపి అమ్మాయి. స్కూల్లో తగాదాలు, ఫైట్లు! బాక్సింగ్‌లో ఓనమాలు తెలియకపోయినా ప్రత్యర్థులకు బాక్సర్‌లా పంచ్‌లు ఇచ్చేది. ఇది చూసిన తండ్రి జై భగవాన్ కుమార్తెకు బాక్సింగ్‌లో శిక్షణ ఇప్పించడం ప్రారంభించాడు. అప్పుడు నీతూ వయసు 12 సంవత్సరాలు. శిక్షణ తీసుకుంటోందన్న మాటేగానీ బాక్సింగ్‌లో ఎలాంటి ప్రతిభా చూపేది కాదు. ఎప్పుడూ ఎవరో ఒకరి చేతిలో ఓడిపోతూనే ఉండేది. ఒకరోజు ‘ఇక నా వల్ల కాదు నాన్నా. నాకు బాక్సింగ్ వద్దు’ అని ధైర్యంగా తండ్రితో చెప్పింది. ‘అలాగే తల్లీ’ అని ఆయన అని ఉంటే కొత్త చరిత్ర ఆవిష్కరణ అయ్యేది కాదు. కుమార్తెను బాక్సర్‌గా తీర్చిదిద్దడం కోసం చేస్తున్న ఉద్యోగానికి సెలవు(నాన్–పెయిడ్ లివ్) పెట్టి మరీ కుమార్తె ట్రైనింగ్ నుంచి డైట్ వరకు దగ్గరుండి పర్యవేక్షించాడు. కొంతకాలం తరువాత ప్రసిద్ధ బాక్సింగ్ కోచ్, బివానీ బాక్సింగ్ క్లబ్ (బీబీసి) వ్యవస్థాపకుడు జగ్దీష్ సింగ్ దృష్టిలో పడింది నీతూ. ‘బీబీసి’లో చేరడం నీతూకు టర్నింగ్ పాయింట్‌గా మారింది. నిజంగా చెప్పాలంటే అసలు సిసలు శిక్షణ అప్పుడే మొదలైంది. బాక్సింగ్‌లోని మెలకువలను ఔపోసన పట్టి రింగ్‌లో ప్రత్యర్థులను మట్టి కరిపించడం ప్రారంభించింది. గత సంవత్సరం కామన్వెల్త్ గేమ్స్‌లో బంగారు పతకం గెలుచుకొని ప్రపంచ దృష్టిని ఆకర్షించింది నీతూ. లవ్లీనా బోర్గో హెయిన్: అస్సాంలోని గోలగాట్ జిల్లాకు చెందిన టికెన్ బోర్గోహెయిన్ చిన్న వ్యాపారి. ‘పాపం ఈయనకు ముగ్గురూ ఆడపిల్లలే’ అని ఎప్పుడూ ఎవరో ఒకరు అకారణ సానుభూతి చూపుతుండేవారు. ముగ్గురు కుమార్తెలలో చిన్న అమ్మాయి లవ్లీనా బోర్గో హెయిన్ అక్కలను స్ఫూర్తిగా తీసుకొని బాక్సింగ్ నేర్చుకుంది. ‘మనకెందుకు బాక్సింగ్’ అని తల్లిదండ్రులు ఎప్పుడూ అనలేదు. ఒకవైపు ఆర్థిక ఇబ్బందులు ఉన్నా చిన్న కుమార్తెను బాక్సింగ్ ఛాంపియన్‌గా చూడాలని కలులు కనేవాడు తండ్రి. 2018, 2019 ఉమెన్ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకాలు గెలుచుకొని తల్లిదండ్రుల కళ్లలో వెలుగులు నింపింది లవ్లీనా. గత సంవత్సరం ఏషియన్ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకం గెలుచుకుంది. అంతర్జాతీయ స్థాయిలో బాక్సర్‌గా పేరు తెచ్చుకున్నా తన మూలాలు మరిచిపోలేదు లవ్లీనా. ఇప్పటికీ తండ్రికి వ్యవసాయ పనుల్లో సహాయం చేస్తుంటుంది. పాదాలెప్పుడూ నేల మీదే ఉండాలనేది తన సిద్ధాంతం. 2020 ఒలింపిక్స్‌లో కాంస్యం గెలుచుకుంది లవ్లీనా. ఒలింపిక్స్‌లో బంగారు పతకం గెలుచుకోవాలనేది తన కల. -
తెలంగాణకు నిఖత్ గర్వకారణం: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: న్యూఢిల్లీలో ఆదివారం జరిగిన మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్ ఫైనల్లో 50 కిలోల విభాగంలో తెలంగాణకు చెందిన నిఖత్ జరీన్ స్వర్ణ పతకం సాధించడంపట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు హర్షం వ్యక్తం చేశారు. ఆమెకు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. నిఖత్ జరీన్ తెలంగాణ గర్వించదగ్గ బిడ్డ అని కొనియాడారు. క్రీడాభివృద్ధికి, క్రీడాకారుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఈ దిశగా తమ కృషిని కొనసాగిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. సాధారణ కుటుంబం నుంచి వచ్చినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో అంతర్జాతీయస్థాయి ఖ్యాతిగడించే ప్రదర్శన చేస్తున్న బాక్సర్ నిఖత్ జరీన్ స్వశక్తికి నిదర్శనమని రాష్ట్ర క్రీడల మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. జరీన్‌ను ఢిల్లీలో మంత్రి అభినందించారు. -
ఇదే కఠినమైన బౌట్.. నా దేశం కోసం ఈ పతకం: నిఖత్ జరీన్ ఉద్వేగం
Nikhat Zareen- World Boxing Championship: ‘‘రెండోసారి ప్రపంచ చాంపియన్‌గా నిలవడం చాలా సంతోషంగాఉంది. అందులోనూ ఒలింపిక్ కేటగిరీలో స్వర్ణం గెలవడం ఇంకా సంతృప్తినిచ్చింది. టోర్నీలో సహజంగానే నా దృష్టిలో ఇదే కఠినమైన బౌట్. ఆమె ఆసియా చాంపియన్. హోరాహోరీగా తలపడ్డాం. కామన్వెల్త్ క్రీడల్లో నేను పెద్దగా పోటీని ఎదుర్కోలేదు. ఈ తర్వాత ఇక్కడే మళ్లీ బరిలోకి దిగాను. కానీ ఇక్కడ ప్రపంచ స్థాయి ప్రత్యర్థులతో వరుస బౌట్లలో తలపడాల్సి వచ్చింది. అందుకే కొన్నిసార్లు నేను వేగంగా కదల్లేకపోయాను. ఫైనల్లో మాత్రం చివరి బౌట్ కాబట్టి పూర్తి శక్తిసామర్థ్యాలు వాడాలని నిశ్చయించుకున్నా. వంద శాతంకంటే ఎక్కువ ప్రయత్నించా. గత ఏడాది పతకంతో పోలిస్తే ఇది ఎక్కువ శ్రమతో వచ్చింది. దీని కోసం బరువు తగ్గించుకొని ఎంతో కష్టపడాల్సి వచ్చింది. సన్నాహానికి సమయం తక్కువగా ఉన్నా పూర్తి ఏకాగ్రతతో సాధన చేశా. ఉత్తమ బాక్సర్‌గా మహీంద్రా థార్ వాహనం బహుమతిగా వచ్చింది కాబట్టి ప్రస్తుతానికి నాకు వచ్చిన ప్రైజ్‌మనీతో అమ్మా, నాన్నను హజ్ యాత్రకు పంపిస్తా’’ అని భారత బాక్సర్ నిఖత్ జరీన్ తెలిపింది. బెస్ట్ బాక్సర్‌గా ప్రపంచ సీనియర్ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో నిఖత్ జరీన్ (50 కేజీలు) మరోసారి చాంపియన్‌గా అవతరించిన విషయం తెలిసిందే. న్యూఢిల్లీలో ఆదివారం జరిగిన ఫైనల్లో వియత్నాం బాక్సర్ థి టామ్‌ను ఓడించి విజేతగా నిలిచింది. అంతేకాకుండా టోర్నీ ఆసాంతం నిలకడగా రాణించి బెస్ట్ బాక్సర్‌గా నిలిచింది. ఈ క్రమంలో వరుసగా రెండోసారి స్వర్ణ పతకం సాధించిన తెలంగాణ బాక్సర్ నిఖత్ విజయం అనంతరం ఈ మేరకు స్పందించింది. ఎన్నో అడ్డంకులు ఎదురైనా తాను ఇక్కడిదాకా చేరుకోవడంలో తన తల్లిదండ్రుల పాత్రను గుర్తు చేసుకుంటూ ఉద్వేగానికి లోనైంది. ఈ సందర్భంగా తనకు అండగా నిలబడ్డ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపిన నిఖత్.. ఈ పతకాన్ని దేశానికి అంకితమిస్తున్నట్లు పేర్కొంది. చదవండి: BCCI: బీసీసీఐ కాంట్రాక్ట్‌ల ప్రకటన.. జడ్డూకు ప్రమోషన్.. రాహుల్‌కు షాక్.. భరత్‌కు చోటు SA vs WI: చరిత్ర సృష్టించిన దక్షిణాఫ్రికా.. ప్రపంచంలోనే తొలి జట్టుగా Nikhat Zareen: అంచనాలు లేవు.. ఫర్వాలేదన్నవారే తప్ప అద్భుతం అనలేదు! కానీ ఇప్పుడు.. 2️⃣x World Champion 🇮🇳 @nikhat_zareen ’s reaction right after scripting history 🥳🔥@AjaySingh_SG l @debojo_m#itshertime #WorldChampionships #WWCHDelhi @Media_SAI @anandmahindra @IBA_Boxing @Mahindra_Auto @MahindraRise @NehaAnandBrahma https://t.co/29Wd7lBDfx pic.twitter.com/kLcmJzLdcw — Boxing Federation (@BFI_official) March 26, 2023 -
అంచనాలు లేవు.. ఫర్వాలేదన్నవారే తప్ప అద్భుతం అనలేదు! కానీ ఇప్పుడు..
మే 19, 2022... నిఖత్ జరీన్ తొలిసారి ప్రపంచ చాంపియన్‌గా నిలిచింది. అప్పటి వరకు ఆమెకు ఉన్న గుర్తింపు వేరు. ఒకసారి యూత్ వరల్డ్ చాంపియన్‌గా, మరోసారి రన్నరప్‌గా నిలిచినా సరే, సీనియర్ స్థాయికి వచ్చేసరికి కనుమరుగైన వారి జాబితాలో ఆమె కూడా చేరుతుందని చాలా మంది అనుకున్నారు. ఆసియా చాంపియన్‌షిప్‌లో కాంస్యంతో పాటు మరో ఆరు అంతర్జాతీయ పతకాలు సాధించినా నిఖత్‌పై ఎక్కువగా అంచనాలు లేవు. ఆమె ప్రదర్శనపై కూడా ఫర్వాలేదన్నవారే తప్ప అద్భుతం అని, మున్ముందు గొప్ప విజయాలు సాధించగలదని ఎవరూ ఊహించలేదు. అందుకు కారణం అప్పటికే ఉత్తరాది, ముఖ్యంగా హరియాణా బాక్సర్లతోనే భారత బృందం నిండి ఉంది. ఆటా వారిదే, ఫలితాలు వారి నుంచే అన్నట్లుగా పరిస్థితి ఉంది. పైగా మేరీకోమ్‌తో పోటీ పడేందుకు సిద్ధపడి అదేదో తప్పు చేసినట్లుగా తన ప్రమేయం లేకుండానే చాలా మంది దృష్టిలో నిఖత్ జరీన్ విలన్‌గా మారిపోయింది. కానీ... కానీ... ఒక్క అద్భుత ప్రదర్శన అంతా మార్చేసింది... వరల్డ్ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలవడంతో నిఖత్ సత్తా అందరికీ అర్థమైంది. నిఖత్ ప్రతిభను ప్రపంచం గుర్తించింది. భారత్ నుంచి విశ్వ వేదికపై నిలబడగల అథ్లెట్ల జాబితాలో ఆమె కూడా చేరింది. అసలు కర్తవ్యంపైనే దృష్టి... గత వరల్డ్ చాంపియన్‌షిప్ స్వర్ణం నుంచి నిఖత్ ప్రయాణం కొత్తగా మొదలైంది. ఎందుకంటే అగ్రశ్రేణి ఆటగాళ్లు విజయాలు సాధించడం మాత్రమే కాదు, వాటిని కొనసాగించడం, నిలబెట్టుకోవడం కూడా చాలా ముఖ్యం. గొప్ప ఘనతల తర్వాత వచ్చే కీర్తి కనకాదులు, ప్రచారాలు ప్లేయర్లను ఒక్కసారిగా ఆటకు దూరం చేసిన ఘటనలు గతంలో ఎన్నో జరిగాయి. సరిగ్గా ఈ విషయంలోనే నిఖత్ తడబడలేదు. వరల్డ్ చాంపియన్‌గా నిలిచిన తర్వాత ఎన్నో ప్రచార, బ్రాండింగ్ కార్యక్రమాలు, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యక్రమాలకు ఆహ్వానాలు, ప్రారంభోత్సవాలు, ఆపై టీవీ, సినిమా షోలు, అవార్డుల స్వీకరణ... ఇలా ఒక్కసారిగా నిఖత్ బిజీగా మారిపోయింది. అయితే ఈ సమయంలోనూ ఆమె తన అసలు కర్తవ్యాన్ని మరచిపోలేదు. వెయిట్ కేటగిరీ మారినా... గత విజయం తర్వాత నిఖత్ ముందు నిలిచిన పెద్ద సవాల్ వెయిట్ కేటగిరీ! 2022 వరల్డ్ చాంపియన్‌షిప్‌లో ఆమె 52 కేజీల విభాగంలో టైటిల్ సాధించింది. దాంతో పారిస్ ఒలింపిక్స్–2024 అనేది అసలు లక్ష్యంగా మారింది. అయితే వచ్చే ఏడాది పారిస్ ఒలింపిక్స్‌లో 52 కేజీల విభాగం లేకపోవడంతో తప్పనిసరిగా దానిని మార్చుకోవాల్సి వచ్చింది. ముందుకెళితే 54 కేజీల్లో అప్పటికే అక్కడ సత్తా చాటుతున్న అంతర్జాతీయ స్టార్ బాక్సర్లు, అనుభవజ్ఞులు ఉంటారు. దాంతో తన పంచ్ పవర్ పదును పని చేసేందుకు వెయిట్ తగ్గడమే సరైందని భావించి 50 కేజీలకు మారింది. దానికి అనుగుణంగా తన బరువును మార్చుకొని తీవ్రంగా సాధన చేసింది. భారత కోచ్ జాన్ వార్‌బర్టన్ సాధన విషయంలో నిఖత్‌కు అన్ని రకాలుగా సరైన దిశానిర్దేశం చేశారు. ఆమె శ్రమ ఫలితం బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ క్రీడల్లో కనిపించింది. వరల్డ్ చాంపియన్‌గా తన స్థాయిని ప్రదర్శిస్తూ అక్కడ సునాయాసంగా స్వర్ణం గెలుచుకుంది. అదీ తాను కొత్తగా మొదలుపెట్టిన 50 కేజీల కేటగిరీలో కావడంతో తన ఆత్మవిశ్వాసం మరింత పెరిగింది. ఆపై మరో ఐదు నెలలకు వచ్చిన జాతీయ చాంపియన్‌షిప్‌లో నిఖత్‌కు మొదటి స్థానం లాంఛనమే అయింది. ఈ ఏడాది వ్యవధిలో ఆమె ఈ రెండు ఈవెంట్లు మినహా మరే టోర్నీలోనూ పాల్గొనలేదు. విదేశాల్లో కొన్ని టోర్నమెంట్లకు ఆహ్వానాలు అందినా... తన ఆట మెరుగవ్వాలంటే అలాంటి టోర్నీలలో ఆడి ‘విజేత’ అనిపించుకోవడంకంటే ప్రాక్టీస్ చేయడమే సరైందని జరీన్ భావించింది. చివరకు దాంతో ఫలితాన్ని అందుకుంది. ఆద్యంతం ఆధిపత్యం... సొంతగడ్డపై జరిగిన ఈ టోర్నీలో ఆద్యంతం నిఖత్ ఆధిపత్యం కనిపించింది. సెమీస్ మినహా మిగిలిన బౌట్లలో ఎక్కడా తడబాటు లేకుండా ఆమె అలవోక విజయాలు అందుకుంది. ఒక బౌట్లో ఆర్ఎస్సీ (రిఫరీ స్టాప్స్ ద కంటెస్ట్), 4 బౌట్లలో 5–0తో నెగ్గిన ఆమె ఒక్క సెమీస్‌లో 5–2తో ప్రత్యర్థికి కాస్త అవకాశం ఇచ్చింది. తాజా విజయంతో ఈ కేటగిరీలో నిఖత్ తన స్థానాన్ని దాదాపు ఖాయం చేసుకుంది. ఇకపై పారిస్ ఒలింపిక్స్‌లో పతకమే లక్ష్యంగా ఆమె ముందుకు సాగాల్సి ఉంది. ఇదే తరహా ఆటను కొనసాగిస్తే ప్రపంచంలోని అత్యుత్తమ, మెగా ఈవెంట్లో కూడా పతకం అందుకోవడం అసాధ్యం కాబోదు! -సాక్షి క్రీడా విభాగం చదవండి: WPL 2023 Winner: విజేత ముంబై ఇండియన్స్.. Congratulations to @nikhat_zareen for her spectacular victory at the World Boxing Championships and winning a Gold. She is an outstanding champion whose success has made India proud on many occasions. pic.twitter.com/PS8Sn6HbOD — Narendra Modi (@narendramodi) March 26, 2023 -
Nikhat Zareen: నిఖత్ తడాఖా
సొంతగడ్డపై భారత మహిళా బాక్సర్లు పసిడి పంచ్‌లతో అదరగొట్టారు. ఈ మెగా ఈవెంట్ చరిత్రలో తమ అత్యుత్తమ ‘స్వర్ణ’ ప్రదర్శనను సమం చేశారు. ఆదివారం ముగిసిన ప్రపంచ సీనియర్ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్ నాలుగు బంగారు పతకాలతో తమ ప్రస్థానాన్ని ముగించింది. శనివారం నీతూ (48 కేజీలు),స్వీటీ (81 కేజీలు) పసిడి పతకాలు సాధించగా... ఆదివారం నిఖత్ జరీన్ (50 కేజీలు), లవ్లీనా బొర్గోహైన్ (75 కేజీలు) ‘గోల్డెన్’ ఫినిషింగ్ ఇచ్చారు. న్యూఢిల్లీ: గత ఏడాది తాను సాధించిన ప్రపంచ చాంపియన్‌షిప్ పసిడి పతకం గాలివాటమేమీ కాదని భారత స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ నిరూపించింది. ఈ తెలంగాణ అమ్మాయి వరుసగా రెండో ఏడాది ప్రపంచ సీనియర్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకంతో మెరిసింది. న్యూఢిల్లీలో ఆదివారం ముగిసిన ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో 26 ఏళ్ల నిఖత్ 50 కేజీల విభాగంలో విజేతగా అవతరించింది. ఫైనల్లో నిఖత్ 5–0తో రెండుసార్లు ఆసియా చాంపియన్‌గా నిలిచిన ఎన్గుయెన్ థి టామ్ (వియత్నాం)పై గెలుపొందింది. గత ఏడాది తుర్కియేలో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో నిఖత్ 52 కేజీల విభాగంలో బంగారు పతకం గెలిచింది. తాజా ప్రదర్శనతో నిఖత్ ప్రపంచ చాంపియన్‌షిప్ చరిత్రలో రెండు స్వర్ణ పతకాలు గెలిచిన రెండో భారతీయ బాక్సర్‌గా గుర్తింపు పొందింది. దిగ్గజ బాక్సర్ మేరీకోమ్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఆరు స్వర్ణాలు, ఒక రజతంతో కలిపి ఏడు పతకాలు సాధించింది. 2006లో న్యూఢిల్లీయే ఆతిథ్యమిచ్చిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత్ నాలుగు స్వర్ణాలు, ఒక రజతంతో కలిపి ఐదు పతకాలు గెలిచింది. దూకుడుగా... థి టామ్‌తో జరిగిన ఫైనల్లో నిఖత్ ఆద్యంతం దూకుడుగా ఆడింది. ఒకవైపు అవకాశం దొరికినపుడల్లా ప్రత్యరి్థపై పంచ్‌ల వర్షం కురిపించింది. మరోవైపు ప్రత్యర్థి విసిరిన పంచ్‌లను కాచుకుంది. తొలి రౌండ్లో నిఖత్‌ను ఒడిసిపట్టుకొని కింద పడేసినందుకు వియత్నాం బాక్సర్‌కు రిఫరీ పెనాల్టీ పాయింట్ విధించారు. ఆ తర్వాత నిఖత్ ఎదురుదాడికి దిగి రెండు రైట్ హుక్ పంచ్‌లతో, ఆ తర్వాత స్ట్రెయిట్ పంచ్‌లతో విరుచుకుపడింది. ఫలితం తొలి రౌండ్లో నిఖత్‌దే పైచేయిగా నిలిచింది. రెండో రౌండ్లో థి టామ్ పుంజుకుంది. నిర్ణాయక మూడో రౌండ్లో నిఖత్ మళ్లీ జోరు పెంచింది. నిఖత్ సంధించిన పంచ్‌కు వియత్నాం బాక్సర్‌కు దిమ్మదిరిగిపోయేలా చేసింది. చివరకు నిఖత్ అదే జోరు కొనసాగించి విజయాన్ని ఖరారు చేసుకుంది. టోర్నీ మొత్తం నిలకడగా రాణించిన నిఖత్‌కు ‘బెస్ట్ బాక్సర్’ అవార్డు కూడా లభించింది. విజేతగా నిలిచిన నిఖత్‌కు లక్ష డాలర్లు (రూ. 82 లక్షల 34 వేలు) ప్రైజ్‌మనీతోపాటు ‘బెస్ట్ బాక్సర్’ పురస్కారం కింద ‘మహీంద్రా థార్’ వాహనం లభించింది. ఓవరాల్ చాంపియన్ భారత్ ఆతిథ్య భారత్ నాలుగు స్వర్ణ పతకాలతో ఓవరాల్ చాంపియన్‌గా నిలిచింది. చైనా మూడు స్వర్ణాలు, ఒక రజతం, మూడు కాంస్యాలతో ఏడు పతకాలతో రన్నరప్‌గా నిలిచింది. ర్యాంక్ వర్గీకరణలో నెగ్గిన స్వర్ణ పతకాల సంఖ్యను పరిగణనలోకి తీసుకుంటారు. రష్యా ఒక స్వర్ణం, ఒక రజతం, ఒక కాంస్యంతో మూడు పతకాలతో మూడో స్థానంలో నిలిచింది. మొత్తం 12 వెయిట్ కేటగిరీలలో 48 పతకాల కోసం బౌట్లు జరగ్గా... 20 దేశాలు కనీసం ఒక్క పతకమైనా సాధించాయి. రష్యా బాక్సర్లను అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం (ఐబీఏ) ఈ మెగా ఈవెంట్లో పాల్గొనేందుకు అవకాశం ఇవ్వడంపై పలు దేశాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఐబీఏ నిర్ణయాన్ని నిరసిస్తూ 17 దేశాలు ఈ పోటీలకు దూరంగా ఉన్నాయి. లవ్లీనా తొలిసారి... అస్సాం బాక్సర్ లవ్లీనా బొర్గోహైన్ మూడో ప్రయత్నంలో ప్రపంచ చాంపియన్‌గా అవతరించింది. 2018, 2019 ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో సెమీఫైనల్లో ఓడి కాంస్య పతకాలతో సరిపెట్టుకున్న లవ్లీనా ఈసారి మాత్రం విశ్వవిజేతగా నిలిచింది. ఫైనల్లో లవ్లీనా 5–2తో కైట్లిన్ పార్కర్ (ఆ్రస్టేలియా)పై విజయం సాధించింది. చాంపియన్‌గా నిలిచిన లవ్లీనాకు లక్ష డాలర్లు (రూ. 82 లక్షల 34 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి. -
చరిత్ర సృష్టించిన నిఖిత్ జరీన్.. భారత్ ఖాతాలో మూడో బంగారు పతకం
మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్ 2023లో భారత్ ఖాతాలో మూడో బంగారు పతకం చేరింది. ఆదివారం జరిగిన ఫైనల్లో భారత బాక్సర్ నిఖిత్ జరీన్ వియత్నాంకు చెందిన థామ్ గుయేన్‌ను 5-0 తేడాతో చిత్తు చేసి పసిడి పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది. మహిళల 50 కేజీల విభాగంలో నిఖిత్ ఈ ఘనత సాధించింది. తొలి రౌండ్ నుంచి ప్రత్యర్ధిపై పూర్తి అధిపత్యం చెలాయించిన నిఖిత్ రెండో సారి వరల్డ్ ఛాంపియన్‌గా నిలిచింది. ఇక రెండువ సారి ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన నిఖిత్ జరీన్ అరుదైన రికార్డు సాధించింది. ఒకటి కంటే ఎక్కవ ప్రపంచ ఛాంపియన్ షిప్స్ టైటిల్ నెగ్గిన రెండో భారత బాక్సర్‌గా నిఖిత్ జరీన్ నిలిచింది. ఈ ఘనత సాధించిన జాబితాలో భారత బాక్సర్ మేరీకోమ్ తొలి స్థానంలో ఉంది. -
నిఖత్ పంచ్ అదిరె...
న్యూఢిల్లీ: సొంతగడ్డపై భారత మహిళా బాక్సర్లు తమ పంచ్ పవర్‌ను ప్రదర్శించారు. ప్రపంచ సీనియర్ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షి ప్లో ఏకంగా నలుగురు భారత బాక్సర్లు ఫైనల్లోకి దూసుకెళ్లారు. తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్ (50 కేజీలు), నీతూ (48 కేజీలు), లవ్లీనా బొర్గోహైన్ (75 కేజీలు), స్వీటీ బూరా (81 కేజీలు) తుది పోరుకు అర్హత సాధించి స్వర్ణ పతకాలకు విజయం దూరంలో నిలిచారు. గురువారం జరిగిన సెమీఫైనల్స్‌లో నిఖత్ జరీన్ 5–0తో 2016 రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత ఇన్‌గ్రిత్ వలెన్సియా (కొలంబియా)ను చిత్తుగా ఓడించగా... నీతూ 5–2తో ఆసియా చాంపియన్ అలువా బల్కిబెకోవా (కజకిస్తాన్)పై, లవ్లీనా 4–1తో లీ కియాన్ (చైనా)పై, స్వీటీ 4–3తో స్యు ఎమ్మా గ్రీన్‌ట్రీ (ఆ్రస్టేలియా)పై గెలుపొందారు. గత ఏడాది ప్రపంచ చాంపియన్‌షిప్‌లో 52 కేజీల విభాగంలో పోటీపడి స్వర్ణం సాధించిన నిఖత్ ఈసారి 50 కేజీల విభాగంలో బరిలోకి దిగింది. టోక్యో ఒలింపిక్స్‌లో భారత దిగ్గజ బాక్సర్ మేరీకోమ్‌ను ఓడించిన వలెన్సియాను నిఖత్ తక్కువ అంచనా వేయకుండా ఆరంభం నుంచే పక్కా ప్రణాళికతో ఆడింది. రింగ్‌లో వేగంగా కదులుతూనే అవకాశం దొరికినపుడల్లా వలెన్సియాపై పంచ్‌లు విసిరింది. ప్రత్యర్థి తనపై ఆధిపత్యం చలాయించకుండా కూడా నిఖత్ జాగ్రత్త పడింది. ముందుగా తొలి రెండు రౌండ్లలో ఎదురుదాడి చేసి స్పష్టమైన ఆధిక్యం సంపాదించిన నిఖత్ మూడో రౌండ్లో మాత్రం ప్రత్యర్థి కి పుంజుకునే అవకాశం ఇవ్వకుండా రక్షణాత్మకంగా ఆడి కట్టడి చేసింది. 2 ఒకే ప్రపంచ చాంపియన్‌షి ప్లో నలుగురు లేదా అంతకంటే ఎక్కువమంది భారత బాక్సర్లు ఫైనల్ చేరడం ఇది రెండోసారి. 2006లో న్యూఢిల్లీయే ఆతిథ్యమిచి్చన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఐదుగురు భారత బాక్సర్లు (మేరీకోమ్, సరితా దేవి, జెన్నీ, లేఖ, నగిశెట్టి ఉష) ఫైనల్ చేరారు. ఉష రజతం నెగ్గగా, మేరీకోమ్, సరిత, జెన్నీ, లేఖ స్వర్ణ పతకాలు గెలిచారు. 3 మేరీకోమ్ తర్వాత ప్రపంచ చాంపియన్‌షి ప్లో కనీసం రెండుసార్లు ఫైనల్‌కు చేరిన భారత బాక్సర్లుగా నిఖత్ జరీన్, స్వీటీ గుర్తింపు పొందారు. మేరీకోమ్ ఏకంగా ఏడుసార్లు ఫైనల్‌కు చేరి ఆరుసార్లు స్వర్ణం, ఒకసారి రజతం సాధించింది. నిఖత్ గత ఏడాది, స్వీటీ 2014లో ఫైనల్‌కు చేరారు. నేడు విశ్రాంతి దినం. శనివారం, ఆదివారం ఫైనల్స్ జరుగుతాయి. శనివారం సాయంత్రం 6 గంటలకు మొదలయ్యే ఫైనల్స్‌లో లుత్సయిఖాన్ అల్టాంట్సెట్సెగ్ (మంగోలియా)తో నీతూ... లీనా వాంగ్ (చైనా)తో స్వీటీ తలపడతారు. ఆదివారం సాయంత్రం 6 గంటలకు మొదలయ్యే ఫైనల్స్‌లో ఎన్గుయెన్ థి టామ్ (వియత్నాం)తో నిఖత్ జరీన్... కైట్లిన్ పార్కర్ (ఆ్రస్టేలియా)తో లవ్లీనా పోటీపడతారు. -
ఫైనల్లో నీతూ, నిఖత్.. భారత్‌కు కనీసం 2 సిల్వర్ మెడల్స్ ఖాయం
మహిళల బాక్సింగ్ వరల్డ్ ఛాంపియన్షిప్స్-2023లో భారత్‌కు కనీసం రెండు రజత పతకాలు ఖాయమయ్యాయి. ఇవాళ (మార్చి 23) జరిగిన సెమీ ఫైనల్లో కామన్వెల్త్ గేమ్స్ ఛాంపియన్ బాక్సర్ నీతూ ఘంగాస్ (48 కేజీలు), ప్రస్తుత వరల్డ్ ఛాంపియన్ నిఖత్ జరీన్ (50 కేజీలు) ప్రత్యర్ధులపై విజయాలు సాధించి ఫైనల్‌కు చేరారు. నీతూ.. కజకిస్తాన్‌కు చెందిన అలువా బాల్కిబెకోవాపై విజయం సాధించగా, తెలంగాణ అమ్మాయి నిఖత్.. కొలంబియా బాక్సర్ ఇంగ్రిడ్ వెలెన్సియాను మట్టికరిపించింది. ఈ పోటీల్లో భారత్‌కు మరో 2 పతకాలు కూడా వచ్చే అవకాశం ఉంది. నిన్న జరిగిన క్వార్టర్స్‌లో లోవ్లినా బోర్గోహైన్ (75 కేజీలు), సావీటీ బూరా (81 కేజీలు) విజయాలు సాధించి కనీసం కాంస్యం పతాకన్ని ఖరారు చేశారు. ఇవాళ రాత్రి 8:15 గంటలకు జరిగే సెమీఫైనల్లో లవ్లీనా.. లీ కియాన్ (చైనా)ను, రాత్రి 8: 30 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్‌లో సావీటీ.. సూ ఎమ్మా గ్రీన్‌ట్రీ (ఆస్ట్రేలియా)తో తలపడనున్నారు. ఈ బౌట్లలో వీరిరువురు విజయాలు సాధిస్తే, భారత్‌కు మరో 2 రజత పతకాలు ఖాయమవుతాయి. -
భారత్‌కు తొలి పతకం ఖాయం చేసిన నీతూ ఘంగాస్
మహిళల బాక్సింగ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో భారత్‌కు తొలి పతకం ఖాయమైంది. కామన్వెల్త్ గేమ్స్ ఛాంపియన్ బాక్సర్ నీతూ ఘంగాస్ (48 కేజీలు) భారత్‌కు పతకం ఖరారు చేసింది. ఇవాళ (మార్చి 22) జరిగిన క్వార్టర్ ఫైనల్ బౌట్లో జపాన్‌కు చెందిన మడోకా వాడాకు మట్టికరిపించిన నీతూ.. సెమీఫైనల్‌కు అర్హత సాధించి భారత్‌కు కనీసం కాంస్య పతకం ఖాయం చేసింది. తొలి రౌండ్ నుంచే దూకుడుగా ఆడి ప్రత్యర్ధిపై పంచ్‌ల వర్షం కురిపించడంతో రెండవ రౌండ్లో రిఫరీ బౌట్‌ను నిలిపివేసి RSC (రిఫరీ స్టాప్స్ కాంటెస్ట్) ద్వారా నీతూను విజేతగా ప్రకటించాడు. ఈ పోటీల్లో నీతూ RSC ద్వారానే మూడు బౌట్లలో విజయం సాధించడం విశేషం. మరోవైపు, ఇవాళ జరుగబోయే బౌట్లలో మరో ఏడుగురు భారత బాక్సర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ప్రస్తుత వరల్డ్ ఛాంపియన్ నిఖత్ జరీన్ (50 కేజీలు), సాక్షి చౌదరి (52 కేజీలు), మనీషా మౌన్ (57 కేజీలు), జైస్మిన్ లంబోరియా (60 కేజీలు), లోవ్లినా బోర్గోహైన్ (75 కేజీలు), సావీటీ బూరా (81 కేజీలు) (+81 కేజీలు) (+81 కేజీలు) క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లు ఆడనున్నారు. -
అమ్మాయిల పంచ్ అదిరింది.. క్వార్టర్ ఫైనల్లో నిఖత్, నీతూలతో పాటు..
World Boxing Championship 2023- న్యూఢిల్లీ: ప్రపంచ సీనియర్ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో మంగళవారం భారత బాక్సర్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న డిఫెండింగ్ చాంపియన్, తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ (50 కేజీలు), మనీషా మౌన్ (57 కేజీలు), నీతూ (48 కేజీలు), జాస్మిన్ (60 కేజీలు) క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. క్వార్టర్ ఫైనల్లో గెలిచి సెమీఫైనల్ చేరితే ఈ నలుగురికీ కనీసం కాంస్య పతకాలు ఖాయమవుతాయి. మరోవైపు శశి చోప్రా (63 కేజీలు), మంజు బంబోరియా (66 కేజీలు) ప్రిక్వార్టర్ ఫైనల్లో ఓడిపోయా రు. ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో నిఖత్ 5–0తో పాట్రిసియా అల్వారెజ్ (మెక్సికో)పై, సుమయా కొసిమోవా (తజికిస్తాన్)పై నీతూ, నూర్ ఎలిఫ్ తుర్హాన్ (తుర్కియే)పై మనీషా, సమదోవా (తజికిస్తాన్)పై జాస్మిన్ గెలుపొందారు. శశి చోప్రా 0–4తో మాయ్ కిటో (జపాన్) చేతిలో, నవ్బఖోర్ ఖమిదోవా (ఉజ్బెకిస్తాన్) చేతిలో మంజు ఓడిపోయారు. చదవండి: WPL 2023: ఢిల్లీ క్యాపిటల్స్ సంచలనం.. ఫైనల్ చేరిన తొలి జట్టుగా.. పాపం ముంబై! SA Vs WI: క్లాసెన్ విశ్వరూపం; 29 ఓవర్లలోనే టార్గెట్‌ను ఊదేశారు Quarterfinals Ready 🔥💥 🇮🇳 champs acing it at the #WWCHDelhi Tomorrow ⏳ Book your tickets now to not miss the action 🔗:https://t.co/k8OoHXoAr8@AjaySingh_SG l @debojo_m#itshertime #WWCHDelhi #WorldChampionships @IBA_Boxing @Media_SAI @paytminsider pic.twitter.com/KeXDKSuC90 — Boxing Federation (@BFI_official) March 21, 2023 -
Nikhat Zareen: ప్రిక్వార్టర్ ఫైనల్లో నిఖత్
Women's World Boxing Championship- న్యూఢిల్లీ: ప్రపంచ సీనియర్ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్లు తమ ఆధిపత్యాన్ని చాటుకుంటున్నారు. ఆదివారం బరిలోకి దిగిన ఇద్దరు భారత బాక్సర్లు నిఖత్ జరీన్ (50 కేజీలు), మనీషా మౌన్ (57 కేజీలు) తమ ప్రత్యర్థులపై ఏకపక్ష విజయాలు నమోదు చేసి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగిన తెలంగాణకు చెందిన నిఖత్ జరీన్ రెండో రౌండ్ బౌట్లో 5–0తో ఆఫ్రికా చాంపియన్ బూఆలమ్ రుమేసా (అల్జీరియా)ను ఓడించగా... మనీషా 5–0తో రహీమి టీనా (ఆస్ట్రేలియా)పై గెలిచింది. చదవండి: IND vs AUS: మా ఓటమికి ప్రధాన కారణమిదే.. అస్సలు ఊహించలేదు! వారిద్దరూ అద్భుతం -
నిఖత్ జరీన్ తొలి 'పంచ్' అదిరింది..
తెలంగాణ మహిళా బాక్సర్ నిఖత్ జరీన్ ఢిల్లీ వేదికగా జరుగుతున్న మహిళల బాక్సింగ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో శుభారంభం చేసింది. 50 కేజీల విభాగంలో అజర్‌బైజాన్‌కు చెందని ఇస్మయిలోవా అనఖానిమ్‌ను చిత్తు చేసి రౌండ్ ఆఫ్ 32లోకి ప్రవేశించింది. మ్యాచ్ మొదలవగానే తన పంచుల వర్షం కురిపించిన నిఖత్ ఎక్కడా ప్రత్యర్థికి చాన్స్ ఇవ్వలేదు. తొలి బౌట్‌లోనే ఆధిపత్యం చూపించిన నిఖత్ ఇస్మయిలోవా మొహంపై పంచ్‌లతో అటాక్ చేసింది. అయితే రిఫరీ అడ్డుకొని ఆర్ఎస్సీ(Referee Stops Contest) కింద నిఖత్ గెలిచినట్లు ప్రకటించాడు. ఇక నిఖత్ జరీన్ రౌండ్ ఆఫ్ 32లో ఆఫ్రికాకు చెందిన రౌమైసా బౌలమ్ను ఎదుర్కోనుంది. మరోవైపు సాక్షికూడా కొలంబియాకు చెందిన జోస్ మారియాను 5-0తో చిత్తు చేసింది. #IND's🇮🇳 @nikhat_zareen starts off her campaign in style at IBA Women's World Boxing Championships 2023 🥊#WorldChampionships #Boxing pic.twitter.com/srfduaVL88 — Doordarshan Sports (@ddsportschannel) March 16, 2023 -
నిఖత్‌పైనే దృష్టి
న్యూఢిల్లీ: సొంతగడ్డపై ‘పసిడి పంచ్’ కొట్టాలనే లక్ష్యంతో భారత స్టార్, తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్ ప్రపంచ సీనియర్ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో బరిలోకి దిగనుంది. బుధవారం ప్రారంభోత్సవ వేడుకలు జరగ్గా... నేటి నుంచి బౌట్లు మొదలవుతాయి. 50 కేజీల విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ నిఖత్ జరీన్ తొలి రౌండ్లో అనాఖానిమ్ ఇస్మేలియోవా (అజర్బైజాన్)తో తలపడుతుంది. నిఖత్‌తోపాటు సాక్షి చౌదరీ (52 కేజీలు), ప్రీతి (54 కేజీలు), నుపుర్ (ప్లస్ 81 కేజీలు) తొలి రోజు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. గాయం కారణంగా భారత జట్టులో ఒక మార్పు చోటు చేసుకుంది. 70 కేజీల విభాగంలో సనామాచ చాను స్థానంలో శ్రుతి యాదవ్ జట్టులోకి వచ్చింది. టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత లవ్లీనా బొర్గోహైన్ (75 కేజీలు)కు తొలి రౌండ్లో ‘బై’ లభించింది. 65 దేశాల నుంచి 324 మంది బాక్సర్లు ఈ మెగా ఈవెంట్లో పోటీపడుతున్నారు. -
ప్రపంచ మహిళల బాక్సింగ్ పోటీలకు భారత జట్టు
న్యూఢిల్లీ: వచ్చే నెల 15 నుంచి 26 వరకు స్వదేశంలో జరిగే ప్రపంచ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే భారత జట్టును ప్రకటించారు. న్యూఢిల్లీ వేదికగా జరిగే ఈ మెగా ఈవెంట్లో 12 వెయిట్ కేటగిరీల్లో భారత బాక్సర్లు పోటీపడతారు. గత ఏడాది టర్కీలో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో 50 కేజీల విభాగంలో తాను సాధించిన స్వర్ణ పతకాన్ని న్యూఢిల్లీలోనూ నిలబెట్టుకునేందుకు తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ బరిలోకి దిగనుంది. భారత జట్టు: నీతూ ఘంఘాస్ (48 కేజీలు), నిఖత్ జరీన్ (50 కేజీలు), సాక్షి చౌదరీ (52 కేజీలు), ప్రీతి (54 కేజీలు), మనీషా మౌన్ (57 కేజీలు), జాస్మిన్ లంబోరియా (60 కేజీలు), శశి చోప్రా (63 కేజీలు), మంజు బంబోరియా (66 కేజీలు), సనమచ చాను (70 కేజీలు), లవ్లీనా బొర్గోహైన్ (75 కేజీలు), సవీటి బూరా (81 కేజీలు), నుపర్ షెరాన్ (ప్లస్ 81 కేజీలు). -
నిఖత్ పసిడి పంచ్..
భోపాల్: తెలంగాణ స్టార్ బాక్సర్, ప్రపంచ చాంపియన్ నిఖత్ జరీన్ జాతీయ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో టైటిల్ నిలబెట్టుకుంది. ఈ పోటీల్లో పాల్గొన్న టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత లవ్లీనా బొర్గొహైన్ కూడా బంగారు పతకం సాధించింది. సోమవారం ముగిసిన ఈ సీనియర్ మహిళల (ఎలైట్) జాతీయ బాక్సింగ్ పోటీల్లో పది పతకాలతో రైల్వే జట్టు (ఆర్ఎస్పీబీ) ఓవరాల్ చాంపియన్‌గా నిలిచింది. ఆఖరి రోజు పోటీల్లో టైటిల్ వేటలో... రైల్వే స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డు (ఆర్ఎస్పీబీ) బాక్సర్ల హవా కొనసాగినప్పటికీ తెలంగాణ అమ్మాయి పంచ్ ముందు రైల్వే బాక్సర్ తలవంచక తప్పలేదు. 50 కేజీల ఫైనల్లో నిఖత్‌కు అనామిక (ఆర్ఎస్పీబీ) నుంచి గట్టీపోటీ ఎదురైంది. కానీ 26 ఏళ్ల నిజామాబాద్ బాక్సర్ మాత్రం తన పంచ్ పవర్‌తో ప్రత్యర్థిని ఓడించింది. నిఖత్ 4–1తో గెలిచి టైటిల్‌ను నిలబెట్టుకుంది. 75 కేజీల తుది పోరులో అస్సామ్ మేటి బాక్సర్ లవ్లీనా 5–0తో సర్వీసెస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డు (ఎస్‌ఎస్‌సీబీ)కు చెందిన అరుంధతీ చౌదరిపై అలవోక విజయం సాధించింది. 2019 ప్రపంచ చాంపియన్‌షిప్ రజతం పతక విజేత మంజు రాణి 48 కేజీల ఫైనల్లో 5–0తో కళైవాణి (తమిళనాడు)పై ఏకపక్ష విజయం సాధించింది. శిక్ష (54 కేజీలు), పూనమ్ (60 కేజీలు), శశి చోప్రా (63 కేజీలు), నుపుర్ (ప్లస్ 81 కేజీలు) కూడా బంగారు పతకాలు సాధించారు. ఆర్ఎస్పీబీ జట్టు బాక్సర్లలో మరో ముగ్గురు రజతాలు పొందగా, ఇద్దరికి కాంస్య పతకాలు లభించాయి. 2021 యూత్ ప్రపంచ చాంపియన్ సనమచ తొక్చొమ్ (మణిపూర్) 70 కేజీల తుదిపోరులో 3–2తో శ్రుతి యాదవ్ (మధ్యప్రదేశ్)పై గెలిచింది. 12 కేటగిరీల్లో వివిధ రాష్ట్రాలకు చెందిన 302 మంది మహిళా బాక్సర్లు ఈ చాంపియన్‌షిప్‌లో తలపడ్డారు. అతిథిగా హాజరైన కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ విజేతలకు బహుమతులు అందజేశారు. జాతీయ చాంపియన్‌గా నిలిచిన నిఖత్ జరీన్‌ను తెలంగాణ క్రీడల మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ అభినందించారు. ఘనమైన సంవత్సరం ఈ ఏడాది మార్చిలో సోఫియా (బల్గేరియా)లో జరిగిన ప్రతిష్టాత్మక స్ట్రాన్జా మెమోరియల్ బాక్సింగ్ టోర్నమెంట్లో నిఖత్ జరీన్ స్వర్ణం గెలిచింది. అయితే ఈ విజయం సాధించినప్పుడు ఈ ఏడాది మున్ముందు ఆమె మరింత వేగంతో దూసుకుపోగలదని ఎవరూ ఊహించి ఉండరు. ఎందుకంటే స్ట్రాన్జా టోర్నీ గెలవడం చాలా మందికి పెద్దగా ఆశ్చర్యం కలిగించలేదు. అప్పటికే రెండు సార్లు ఇదే టోర్నీని గెలిచిన నిఖత్ మూడో సారి టైటిల్ సొంతం చేసుకోవడంతో పాటు ఇంకా వర్ధమాన బాక్సర్‌గానే ఆమెకు గుర్తింపు ఉండటం కూడా మరో కారణం. అయితే మార్చినుంచి మే నెలకు వచ్చే సరికి నిఖత్ ‘ప్రపంచం’ ఒక్కసారిగా మారిపోయింది. ఇస్తాన్‌బుల్‌లో జరిగిన వరల్డ్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో చాంపియన్‌గా నిలిచి ఆమె ఒక్కసారిగా అందరి దృష్టినీ ఆకర్షించింది. ఈ ఘనత సాధించిన ఐదో భారత బాక్సర్‌గా నిలిచిన నిఖత్‌పై అన్ని వైపులనుంచి ప్రశంసల వర్షం కురవడంతో పాటు నిఖత్ పంచ్ పదునేమిటో కూడా తెలిసింది. అయితే దీని తర్వాత వెంటనే నిఖత్‌కు మరో సవాల్ ఎదురైంది. విశ్వ విజేతగా నిలిచిన కేటగిరీ 52 కేజీలు కాగా... ఇందులోనే కొనసాగితే పారిస్‌లో జరిగే 2024 ఒలింపిక్స్‌లో పాల్గొనడం అసాధ్యంగా మారింది. రాబోయే ఒలింపిక్స్‌లో 52 కేజీల కేటగిరీలో లేకపోవడంతో ఒలింపిక్ పతకం లక్ష్యంగా కొత్తగా సాధన చేయాల్సిన పరిస్థితి. ఇలాంటి సమయంలో ఆమె తక్కువ వెయిట్ కేటగిరీకి మారింది. మున్ముందు 50 కేజీల విభాగంలో పోటీ పడాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో మొదటి ప్రయత్నం కామన్వెల్త్ క్రీడల రూపంలో వచ్చింది. ఆగస్టులో బర్మింగ్‌హామ్‌లో జరిగిన ఈ పోటీల్లోనూ సత్తా చాటి నిఖత్ స్వర్ణాన్ని అందుకుంది. దాంతో రివార్డులతో పాటు కేంద్ర క్రీడా పురస్కారం ‘అర్జున’ కూడా ఆమె చెంతకు చేరింది. ఇప్పుడు సీనియర్ నేషనల్స్ వంతు. వరల్డ్ చాంపియన్ జాతీయ స్థాయి పోటీల్లో పతకం గెలవడం చూస్తే తక్కువగా కనిపించవచ్చు. కానీ కొత్తగా దూసుకొచ్చే యువ బాక్సర్లు నేషనల్స్‌లో సంచలనాలు సృష్టించడం కొత్త కాదు. అలాంటి స్థితిలో తన 50 కేజీల కేటగిరీలో నిఖత్ ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంటూ విజయాన్ని అందుకుంది. తొలి మూడు రౌండ్లు ‘నాకౌట్’ కాగా, సెమీస్‌లో 5–0తో, ఫైనల్లో 4–1తో ఆమె గెలిచింది. అద్భుతంగా సాగిన ఈ ఏడాది స్ఫూర్తితో మున్ముందు మరిన్ని ఘనతలు అందుకోవాలని నిఖత్ పట్టుదలగా ఉంది. ‘2022 నాకు అద్భుతంగా సాగింది. వరుసగా మూడు అంతర్జాతీయ స్వర్ణాల తర్వాత ఇప్పుడు జాతీయ చాంపియన్‌షిప్ పసిడి కూడా దక్కడం అదనపు ఆనందాన్నిచ్చింది. దీనికి కారణమైన నా కుటుంబ సభ్యులు, కోచ్‌లు వార్‌బర్టన్, భాస్కర్భట్లకు కృతజ్ఞతలు’ అని ఆమె వ్యాఖ్యానించింది. -సాక్షి క్రీడా విభాగం -
‘పసిడి’కి పంచ్ దూరంలో...
జాతీయ సీనియర్ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్ (50 కేజీలు) పసిడి పతకానికి విజయం దూరంలో నిలిచింది. భోపాల్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో నిజామాబాద్ జిల్లాకు చెందిన నిఖత్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఆదివారం జరిగిన సెమీఫైనల్లో నిఖత్ 5–0తో శివిందర్ కౌర్ (ఆలిండియా పోలీస్)పై ఘనవిజయం సాధించింది. నేడు జరిగే ఫైనల్లో అనామిక (రైల్వేస్)తో నిఖత్ తలపడుతుంది. 75 కేజీల విభాగంలో టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత లవ్లీనా బొర్గోహైన్ (అస్సాం) కూడా ఫైనల్ చేరింది. -
సెమీ ఫైనల్లో నిఖత్ జరీన్
మహిళల జాతీయ బాక్సింగ్ (ఎలైట్) చాంపియన్‌షిప్‌లో తెలంగాణ బాక్సర్, వరల్డ్ చాంపియన్ నిఖత్ జరీన్ సెమీఫైనల్లోకి ప్రవేశించింది. 50 కేజీల విభాగంలో క్వార్టర్ ఫైనల్ విభాగంలో నిఖత్ ‘ఆర్ఎస్సీ’ ద్వారా తనిష్క చావర్ (గోవా)ను చిత్తు చేసింది. నిఖత్ పంచ్‌ల ధాటికి తనిష్క తట్టుకోలేకపోవడంతో రిఫరీ బౌట్‌ను నిలిపివేసి ఆమెను విజేతగా ప్రకటించారు. సెమీస్‌లో శ్విందర్ కౌర్‌ను నిఖత్ ఎదుర్కొంటుంది. -
నిఖత్ పంచ్‌ల ధాటిని తట్టుకోలేని ప్రత్యర్థి.. బౌట్ నిలిపివేసి మరీ!
National Boxing Championships 2022: భోపాల్‌లో జరుగుతున్న జాతీయ సీనియర్ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ (50 కేజీలు) శుభారంభం చేసింది. తమిళనాడు బాక్సర్ అభినయతో జరిగిన తొలి రౌండ్ బౌట్లో నిఖత్ పంచ్‌ల ధాటికి అభినయ తట్టుకోలేకపోవడంతో రిఫరీ బౌట్‌ను తొలి రౌండ్లోనే నిలిపి వేశారు. ఈ క్రమంలో ప్రిక్వార్టర్స్‌కు అర్హత సాధించిన నిఖత్.. గురువారం నాటి బౌట్లో మేఘాలయకు చెందిన ఇవా మార్బనియంగ్తో తలపడనుంది. మరోవైపు.. పంజాబ్ బాక్సర్, వరల్డ్ చాంపియన్‌షిప్స్ కాంస్య పతక విజేత సిమ్రన్‌జీత్ కౌర్ సైతం ముందడుగు వేసింది. రౌండ్ ఆఫ్ 32లో లఢక్ బాక్సర్ నిల్జయా ఆంగ్మోతో జరిగిన హోరాహోరీ పోరులో ప్రత్యర్థిని ఓడించింది. ఇక సిమ్రన్ ప్రిక్వార్టర్స్‌లో జార్ఖండ్‌కు చెందిన పూజా బెహ్రాతో పోటీ పడనుంది. ఇది కూడా చదవండి: టాటా ఓపెన్ బరిలో సాకేత్ భారత్‌లో జరిగే ఏకైక ఏటీపీ–250 టెన్నిస్ టోర్నీ టాటా ఓపెన్‌లో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ సాకేత్ మైనేని భారత్‌కే చెందిన యూకీ బాంబ్రీతో కలిసి బరిలోకి దిగనున్నాడు. వచ్చే ఏడాది జనవరి 2 నుంచి 7 వరకు పుణేలో ఈ టోర్నీ జరుగుతుంది. ఈ ఏడాది సాకేత్–యూకీ ఏటీపీ చాలెంజర్ టోర్నీలో ఆరు డబుల్స్ టైటిల్స్ సాధించారు. ఏటీపీ డబుల్స్ ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం సాకేత్ 84వ స్థానంలో ఉన్నాడు. డిఫెండింగ్ చాంపియన్ జోడీ బోపన్న, రామ్‌కుమార్ ఈసారి వేర్వేరు భాగస్వాములతో కలసి ఆడనున్నారు. చదవండి: వచ్చీ రాగానే మొదలెట్టేశాడు.. సూర్యకుమార్ ఊచకోత కొనసాగింపు India Players- Ranji Trophy: ఇంట్లో కూర్చోవద్దు.. బీసీసీఐ ఆదేశాలు! మొన్న సంజూ, ఇషాన్.. ఇప్పుడు సూర్య, చహల్ -
రాష్ట్రపతి భవన్లో ఘనంగా క్రీడా పురస్కారాల ప్రదానోత్సవం
ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జాతీయ క్రీడా పురస్కారాల ప్రదానోత్సవం బుధవారం(నవంబర్ 30న) కన్నుల పండువగా జరిగింది. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా క్రీడాకారులు పురస్కారాలు అందుకున్నారు. క్రీడల్లో అత్యున్నత పురస్కారమైన ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న అవార్డును టేబుల్ టెన్నిస్ స్టార్ ఆచంట శరత్ కమల్ అందుకోగా.. 25 మంది క్రీడాకారులు అర్జున అవార్డు అందుకున్నారు. వీరిలో బాక్సర్ నిఖత్ జరీన్, బ్యాడ్మింట్న్ స్టార్ హెచ్ ప్రణయ్, చెస్ సంచలనం ఆర్ ప్రజ్ఞానంద, ఆకుల శ్రీజ తదితరులు ఉన్నారు. ఇక 8 మంది కోచ్‌లకు ద్రోణాచార్య అవార్డులను అందజేశారు.భారత క్రీడా మంత్రిత్వ శాఖ ఈ ఏడాది క్రీడా అవార్డులను నవంబర్ 14న ఈ అవార్డులను ప్రకటించింది. విజేతల జాబితా: మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు: ఆచంట శరత్ కమల్ అర్జున అవార్డులు: సీమా పూనియా (అథ్లెటిక్స్), ఆల్డస్ పాల్ (అథ్లెటిక్స్), అవినాష్ సాబుల్ (అథ్లెటిక్స్), లక్ష్య సేన్ (బ్యాడ్మింటన్), హెచ్ఎస్ ప్రణయ్ (బ్యాడ్మింటన్), అమిత్ (బాక్సింగ్), నిఖత్ జరీన్ (బాక్సింగ్), భక్తి కులకర్ణి (చెస్) , ఆర్ ప్రజ్ఞానంద (చెస్), దీప్ గ్రేస్ ఇక్కా (హాకీ), సుశీలా దేవి (జూడో), సాక్షి కుమారి (కబడ్డీ), నయన్ మోని సైకియా (లోన్‌బాల్), సాగర్ ఓవల్కర్ (మల్కాంబ్), ఎలవెనిల్ వలరివన్ (షూటింగ్), ఓంప్రకాష్ మిథర్వాల్ (షూటింగ్) శ్రీజ ఆకుల (టేబుల్ టెన్నిస్), వికాస్ ఠాకూర్ (వెయిట్ లిఫ్టింగ్), అన్షు (రెజ్లింగ్), సరిత (రెజ్లింగ్), పర్వీన్ (వుషు), మాన్సీ జోషి (పారా బ్యాడ్మింటన్), తరుణ్ ధిల్లాన్ (పారా బ్యాడ్మింటన్), స్వప్నిల్ పాటిల్ (పారా స్విమ్మింగ్), జెర్లిన్ అనికా జె (చెవిటి బ్యాడ్మింటన్) ద్రోణాచార్య అవార్డు (రెగ్యులర్ విభాగంలో కోచ్‌లకు): జీవన్‌జోత్ సింగ్ తేజ (ఆర్చరీ), మహ్మద్ అలీ కమర్ (బాక్సింగ్), సుమా షిరూర్ (పారా-షూటింగ్) మరియు సుజిత్ మాన్ (రెజ్లింగ్) జీవితకాల పురస్కారం: దినేష్ లాడ్ (క్రికెట్), బిమల్ ఘోష్ (ఫుట్‌బాల్), రాజ్ సింగ్ (రెజ్లింగ్) ధ్యాన్ చంద్ లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు: అశ్విని అక్కుంజీ (అథ్లెటిక్స్), ధరమ్వీర్ సింగ్ (హాకీ), బిసి సురేష్ (కబడ్డీ), నీర్ బహదూర్ గురుంగ్ (పారా అథ్లెటిక్స్) President Droupadi Murmu presents the Arjuna award to Badminton players Lakshya Sen and Prannoy HS at the National Sports and Adventure Awards 2022 ceremony at Rashtrapati Bhavan. pic.twitter.com/Tv4QLAPbtj — ANI (@ANI) November 30, 2022 President Droupadi Murmu presents the Arjuna award to Chess player R Praggnanandhaa at the National Sports and Adventure Awards 2022 ceremony at Rashtrapati Bhavan. pic.twitter.com/1OPxS7DaoW — ANI (@ANI) November 30, 2022 చదవండి: FIFA WC: దేశాల మధ్య మాత్రమే యుద్ధం.. ఆటగాళ్లకు కాదు -
శరత్ కమల్‌కు ఖేల్‌రత్న.. శ్రీజ, నిఖత్‌లకు అర్జున
న్యూఢిల్లీ: తెలంగాణ క్రీడాకారిణులు నిఖత్ జరీన్, ఆకుల శ్రీజ ‘అర్జున’ విజేతలయ్యారు. అంతర్జాతీయ మెగా ఈవెంట్లలో పతకాలతో సత్తా చాటుకుంటున్న తెలంగాణ మహిళా చాంపియన్లను కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. జాతీయ క్రీడా పురస్కారాల్లో భాగంగా బాక్సర్ నిఖత్, టేబుల్ టెన్నిస్ (టీటీ) ప్లేయర్ శ్రీజలను ‘అర్జున’ అవార్డుకు ఎంపిక చేసింది. శ్రీజ ‘మిక్స్డ్’ భాగస్వామి, స్టార్ టీటీ ప్లేయర్ అచంట శరత్ కమల్‌కు దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ‘మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న’ లభించింది. ఈ నెల 30న రాష్ట్రపతి భవన్లో జరిగే వేడుకలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డుల్ని అందజేయనున్నారు. కొన్నేళ్లుగా ‘ఖేల్‌రత్న’ అవార్డుకు ముగ్గురు, నలుగురేసి క్రీడాకారులను ఎంపిక చేస్తున్నారు. కానీ ఈసారి శరత్ మాత్రమే ఆ అవార్డుకు ఎంపికయ్యాడు. తమిళనాడుకు చెందిన 40 ఏళ్ల శరత్ కమల్ నాలుగు ఒలింపిక్స్ క్రీడల్లో (204 ఏథెన్స్, 2008 బీజింగ్, 2016 రియో, 2020 టోక్యో) భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఐదుసార్లు కామన్వెల్త్ గేమ్స్‌లో పాల్గొని ఏడు స్వర్ణాలు, మూడు రజతాలు, మూడు కాంస్య పతకాలు సాధించాడు. ఆసియా క్రీడల్లో రెండు కాంస్యాలు, ఆసియా చాంపియన్‌షిప్‌లో రెండు కాంస్యాలు గెల్చుకున్నాడు. మొత్తం 25 మంది క్రీడాకారులకు ‘అర్జున’ దక్కింది. ఇందులో నలుగురు పారాథ్లెట్లున్నారు కానీ ఒక్క భారత మహిళా, పురుష క్రికెటర్ లేడు. ఆటగాళ్లను తీర్చిదిద్దే కోచ్‌లకు ఇచ్చే ద్రోణాచార్య రెగ్యులర్ అవార్డుకు జీవన్‌జోత్ సింగ్ తేజ (ఆర్చరీ), మొహమ్మద్ అలీ ఖమర్ (బాక్సింగ్), సుమ షిరూర్ (పారా షూటింగ్), సుజీత్ మాన్ (రెజ్లింగ్)... ద్రోణాచార్య ‘లైఫ్ టైమ్’ అవార్డుకు దినేశ్ లాడ్ (క్రికెట్), బిమల్ ఘోష్ (ఫుట్‌బాల్), రాజ్ సింగ్ (రెజ్లింగ్) ఎంపికయ్యారు. అశ్విని అకుంజీ (అథ్లెటిక్స్), ధరమ్వీర్ (హాకీ), సురేశ్ (కబడ్డీ), నీర్ బహదూర్ (పారాథ్లెటిక్స్) ధ్యాన్‌చంద్ జీవిత సాఫల్య పురస్కారం అందుకోనున్నారు. తెలంగాణ స్టార్లకు... ఇంటాబయటా అంతర్జాతీయ టోర్నీల్లో పతకాలతో మెరిసిన ఆకుల శ్రీజ ఈ ఏడాది కెరీర్లోనే అత్యుత్తమ సాఫల్యాన్ని బర్మింగ్‌హామ్‌లో సాకారం చేసుకొంది. ఈ ఏడాది అక్కడ జరిగిన ప్రతిష్టాత్మక కామన్వెల్త్ గేమ్స్‌లో వెటరన్ స్టార్ శరత్ కమల్‌తో కలిసి మిక్స్డ్ డబుల్స్‌లో బంగారు పతకం సాధించింది. 2019లో జరిగిన దక్షిణాసియా క్రీడల్లో ఆమె మహిళల డబుల్స్, టీమ్ ఈవెంట్లలో పసిడి పతకాలు నెగ్గింది. నిఖత్ ఈ ఏడాది ఇస్తాంబుల్‌లో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో, బర్మింగ్హమ్ కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణ పతకాలు సాధించింది. 2019లో బ్యాంకాక్‌లో జరిగిన ఆసియా చాంపియన్ షిప్లో కాంస్య పతకంతో మెరిసింది. అవార్డీల జాబితా మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న: శరత్ కమల్ (టేబుల్ టెన్నిస్). అర్జున: నిఖత్ జరీన్, అమిత్ (బాక్సింగ్), శ్రీజ (టేబుల్ టెన్నిస్), సీమా పూనియా, ఎల్డోస్ పాల్, అవినాశ్ సాబ్లే (అథ్లెటిక్స్), లక్ష్య సేన్, ప్రణయ్ (బ్యాడ్మింటన్), భక్తి కులకర్ణి, ప్రజ్ఞానంద (చెస్), దీప్గ్రేస్ ఎక్కా (హాకీ), సుశీలా దేవి (జూడో), సాక్షి కుమారి (కబడ్డీ), నయన్ మోని సైకియా (లాన్ బౌల్), సాగర్ కైలాస్ (మల్లకంబ), ఇలవేనిల్ వలరివన్, ఓంప్రకాశ్ మిథర్వాల్ (షూటింగ్), వికాస్ ఠాకూర్ (వెయిట్‌లిఫ్టింగ్), అన్షు, సరిత (రెజ్లింగ్), పర్వీన్ (వుషు), మానసి జోషి, తరుణ్ థిల్లాన్, జెర్లిన్ అనిక (పారా బ్యాడ్మింటన్), స్వప్నిల్ పాటిల్ (పారా స్విమ్మింగ్). -
‘నువ్వు గెలిస్తే ఆ కారును నేనే బహుమతిగా ఇస్తా’
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ప్రపంచ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ స్టార్ బాక్సర్, డిఫెండింగ్ చాంపియన్ (ఫ్లయ్ వెయిట్) నిఖత్ జరీన్ టైటిల్ నిలబెట్టుకుంటే ఖరీదైన ‘మెర్సిడెజ్ బెంజ్’ కారు కొంటానని చెప్పింది. అయితే అక్కడే ఉన్న అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం (ఐబీఏ) అధ్యక్షుడు ఉమర్ క్రెమ్లెవ్ ఆమె గెలిస్తే కొనాల్సిన అవసరం లేకుండా నిఖత్ కోరుకున్న కారును బహుమతిగా ఇస్తానని చెప్పారు. భారత్‌కు 2023 మహిళల చాంపియన్‌షిప్ ఆతిథ్య హక్కులు కట్టబెట్టిన సందర్భంగా ఈ ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది. ఈ మేరకు ఐబీఏ చీఫ్ క్రెమ్లెవ్, భారత బాక్సింగ్ సమాఖ్య (బీఎఫ్ఐ) అజయ్ సింగ్‌లు ఆతిథ్య హక్కుల ఒప్పందంపై సంతకాలు చేశారు. వచ్చే మార్చి, ఏప్రిల్ నెలల్లో ఈ బాక్సింగ్ మెగా ఈవెంట్ జరగనుంది. తేదీలను తర్వాత ఖరారు చేయనున్నారు. టోర్నీ ప్రైజ్‌మనీ పెరగడంతో విజేతకు రూ. 81 లక్షలు అందజేయనున్నారు. ఈ నేపథ్యంలో డిఫెండింగ్ చాంపియన్ హోదాలో పాల్గొన్న నిఖత్ మాట్లాడుతూ ‘ప్రస్తుత టైటిల్ ప్రైజ్‌మనీతో హైదరాబాద్‌లో ఇల్లు కొనే ప్రయత్నంలో ఉన్నాను. వచ్చే ఏడాది కూడా గెలిస్తే దాంతో బెంజ్ కారు కొంటాను. అందులో క్రెమ్లెవ్తో హైదరాబాద్‌లో సిటీ రైడ్‌కు వెళ్తాను’ అని తెలిపింది. -
సూపర్ స్టార్‌తో నిఖత్ జరీన్.. కల నెరవేరిందట!
ముంబై: బాక్సర్ నిఖత్ జరీన్ ఎట్టకేలకు తన కలను నెరవేర్చుకుందట. అదీ ఆటల పరంగా కాదు. ఫ్యాన్‌మూమెంట్‌ను తీర్చుకోవడం ద్వారా. తన ఫేవరెట్ స్టార్ హీరోను కలవడమే కాదు.. ఏకంగా ఆయనతో ఓ రీల్ వీడియోను సైతం చేసిందామె. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్‌ను కలిసిన నిఖత్ జరీన్.. ఆయన ఐకానిక్ సాంగ్ ‘సాథియా తూనే క్యా కియా’ను రీక్రియేట్ చేసింది. ఈ మేరకు తన ట్విట్టర్ హ్యాండిల్లో ఆమె వీడియోను పంచుకున్నారు. వీడియోలో సల్మాన్‌తో పాటు ఆమె కూడా పాటకు పెదాలు కదిలిస్తూ.. మూమెంట్లు ఇచ్చారు. .. ఇంతేజార్ ఖతం హువా అంటూ ట్విటర్లో ఆమె వీడియోను పోస్ట్ చేశారు. సౌత్ డైరెక్టర్ సురేష్ కృష్ణ డైరెక్షన్లో సల్మాన్ ఖాన్, రేవతి జోడిగా రూపొందిన ‘లవ్’(1991) మ్యూజికల్ హిట్‌గా నిలిచింది. తెలుగులో వెంకటేష్ రేవతిల ‘ప్రేమ’(1989) చిత్రానికి ఇది హిందీ రీమేక్. Finallyyyyy intezar khatam hua❤️@BeingSalmanKhan #fanmoment#dreamcometrue#salmankhan pic.twitter.com/pMTLDqoOno — Nikhat Zareen (@nikhat_zareen) November 8, 2022 Just don’t knock me out 😂😁. Lots of love .. Keep doing what u doing n keep punching like my hero Sylvester Stallone…. https://t.co/u8C74LpgMp — Salman Khan (@BeingSalmanKhan) May 20, 2022 -
ఖేల్‌రత్నకు శరత్ కమల్.. అర్జున బరిలో నిఖత్ జరీన్, ఆకుల శ్రీజ
2022 ఏడాదికి గానూ భారత్ టేబుల్ టెన్నిస్ స్టార్ ఆచంట శరత్ కమల్‌ను సెలక్షన్ కమిటీ ప్రతిష్టాత్మక మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న అవార్డుకు సిఫార్సు చేసింది. ప్రతిష్టాత్మక పురస్కారానికి ఈ ఏడాది శరత్ కమల్ మినహా మరెవరిని ఎంపిక చేయకపోవడం విశేషం. దీంతో శరత్ కమల్‌కు ఖేల్‌రత్న అవార్డు రావడం గ్యారంటీ. ఇక 40 ఏళ్ల ఆచంట శరత్ కమల్ ఈ ఏడాది టేబుల్ టెన్నిస్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు. కామన్వెల్త్ గేమ్స్‌లో నాలుగు పతకాలు సాధించగా.. ఇందులో మూడు స్వర్ణాలు, ఒక రజతం ఉంది. అలాగే శరత్ కమల్ ఏషియన్ గేమ్స్‌లో రెండుసార్లు పతకాలు సాధించిన తొలి టేబుల్ టెన్నిస్ క్రీడాకారుడిగా చరిత్రకెక్కాడు. ఇక అర్జున అవార్డుకు 25 మంది పేర్లను సిఫార్సు చేసినట్లు సెలక్షన్ కమిటీ ప్రకటించింది. వీరిలో తెలంగాణకు చెందిన మహిళా బాక్సర్ నిఖత్ జరీన్ కూడా ఉంది. జరీన్‌తో పాటు బ్యాడ్మింటన్ క్రీడాకారుడు లక్ష్యసేన్, చెస్ సంచలనం ఆర్ ప్రజ్ఞానంద, రెజ్లర్ అన్షు మాలిక్ తదితరులు ఉన్నారు. అయితే ఈసారి అర్జున అవార్డుకు సిఫార్సు చేసిన జాబితాల ఒక్క క్రికెటర్ కూడా లేకపోవడం గమనార్హం. ఇక తెలంగాణకు చెందిన బాక్సర్ నిఖత్ జరీన్ కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించింది. అంతకముందు టర్కీలోని ఇస్తాంబుల్ వేదికగా జరిగిన వరల్డ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించి దేశ ఖ్యాతిని పెంపొందించింది. ఇక తెలంగాణకే చెందిన టేబుల్ టెన్నిస్ సంచనలం ఆకుల శ్రీజ కూడా అర్జున అవార్డు బరిలో ఉంది. ఖేల్ రత్న అవార్డు సిఫార్సు: ఆచంట శరత్ కమల్ అర్జున అవార్డు సిఫార్సులు: సీమా పునియా (అథ్లెటిక్స్), ఎల్దోస్ పాల్ (అథ్లెటిక్స్), అవినాష్ సేబుల్ (అథ్లెటిక్స్), లక్ష్య సేన్ (బ్యాడ్మింటన్), హెచ్ఎస్ ప్రణయ్ (బ్యాడ్మింటన్), అమిత్ పంఘల్ (బాక్సింగ్), నిఖత్ జరీన్ (బాక్సింగ్), భక్తి కులకర్ణి (చెస్), ఆర్ ప్రజ్ఞానంద (చెస్), దీప్ గ్రేస్ ఎక్కా (హాకీ), శుశీలా దేవి (జూడో), సాక్షి కుమారి (కబడ్డీ), నయన్ మోని సైకియా (లాన్ బౌల్స్), సాగర్ ఓవల్కర్ (మల్లాఖాంబ్), ఎలవేనిల్ వలరివన్ (షూటింగ్), ఓం ప్రకాష్ మిథర్వాల్ (షూటింగ్), శ్రీజ అకుల (టేబుల్ టెన్నిస్), వికాస్ ఠాకూర్ (వెయిట్ లిఫ్టింగ్), అన్షు మాలిక్ (రెజ్లింగ్), సరితా మోర్ (రెజ్లింగ్), పర్వీన్ (వుషు), మనాషి జోషి (పారా బ్యాడ్మింటన్), తరుణ్ ధిల్లాన్ (పారా బ్యాడ్మింటన్), స్వప్నిల్ పాటిల్ (పారా స్విమ్మింగ్), జెర్లిన్ అనికా (డెఫ్ బ్యాడ్మింటన్) చదవండి: 144లో ఒక్కటి కూడా ఒరిజినల్ కాదు.. అందుకే సీజ్ ఐపీఎస్ ఆఫీసర్‌పై పిటిషన్ దాఖలు చేసిన ధోని -
నిఖత్ జరీన్‌ను అభినందించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
-
నిఖత్ జరీన్‌ను అభినందించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
సాక్షి, హైదరాబాద్: కామన్వెల్త్ క్రీడలు- 2022లో బంగారు పతకం సాధించిన తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్‌ను ఎమ్మెల్సీ కవిత బుధవారం తన నివాసంలో కలిశారు. ప్రతిష్టాత్మక క్రీడల్లో పసిడి పంచ్ విసిరి దేశ ప్రతిష్టను ఇనుమడింపజేసిన నిఖత్‌ను అభినందించారు. ఈ సందర్భంగా కవిత సాయం చేసిన విషయాన్ని నిఖత్ గుర్తు చేసుకున్నారు. తనను సీఎం కేసీఆర్ వద్దకు తీసుకెళ్లి ఆర్థికంగా ఆదుకోవాలని కోరారని.. ఇందుకు స్పందించిన ముఖ్యమంత్రి కేసీఆర్ 2014లో రూ.50 లక్షలు మంజూరు చేశారని ఆమె అన్నారు. అదే విధంగా రూ.2 కోట్లు మంజూరు చేయడం, నివాస స్థలం కేటాయించినందుకు సీఎం కేసీఆర్‌కు ప్రపంచ చాంపియన్ నిఖత్ జరీన్ కృతజ్ఞతలు తెలిపారు. ఇక నిఖత్ విజయాలను ప్రస్తావిస్తూ.. నిజామాబాద్ జిల్లాకు చెందిన నిఖత్ ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌గా నిలవడం గర్వకారణమని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఆమె సాధించిన విజయాలు యువ క్రీడాకారులకు స్ఫూర్తిదాయకమని ఎ ప్రశంసించారు. కాగా కామన్వెల్త్ గేమ్స్-2022 మహిళల 50 కిలోల బాక్సింగ్ విభాగంలో నిఖత్ స్వర్ణం గెలిచిన విషయం తెలిసిందే. చదవండి: IPL- Punjab Kings: మయాంక్ అగర్వాల్‌పై వేటు! స్పందించిన పంజాబ్ ఫ్రాంఛైజీ! ఇంతకీ ఏం చెప్పినట్టు? KL Rahul Wedding: టీమిండియా వైస్ కెప్టెన్ పెళ్లి ఆమెతోనే! ధ్రువీకరించిన ‘మామగారు’.. కానీ ట్విస్ట్ ఏంటంటే! -
నిఖత్ జరీన్‌కు అరుదైన గౌరవం
బర్మింగ్‌హామ్: ఆటలు ముగిశాయి. వేడుకలు అంబరాన్నంటాయి. మిరుమిట్లు గొలిపే బాణాసంచా వెలుగులు స్టేడియంపై విరజిమ్మాయి. అంగరంగ వైభవంగా మొదలైన బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్ ఆట్టహాసంగా ముగిశాయి. భయపెట్టే కోవిడ్ కేసులు లేకుండా ముచ్చటపరిచే రికార్డులతో అలరించిన ఆటల షోకు భారత కాలమానం ప్రకారం మంగళవారం తెల్లవారుజామున తెరపడింది. 72 దేశాలకు చెందిన 4500 పైచిలుకు అథ్లెట్లు తమ ప్రదర్శనతో కామన్వెల్త్కు కొత్త శోభ తెచ్చారు. బ్రిటన్ యువరాజు ప్రిన్స్ ఎడ్వర్డ్ మాట్లాడుతూ బర్మింగ్‌హామ్ ఆటలకు తెరపడిందని లాంఛనంగా ప్రకటించారు. 2026 ఆతిథ్య వేదిక విక్టోరియా (ఆస్ట్రేలియా)లో కలుద్దామని అన్నారు. భారతీయ భాంగ్రా స్టేడియాన్ని ఊపేసింది. భారత సంతతికి చెందిన సుప్రసిద్ధ గేయరచయిత, గాయకుడు ‘అపాచి ఇండియన్’గా ఖ్యాతి పొందిన స్టీవెన్ కపూర్ ‘భాంగ్రా’ పాటలను హుషారెత్తించే గళంతో పాడాడు. ముగింపు వేడుకల్లో భారత బృందానికి తెలంగాణ స్టార్ బాక్సర్ నిఖత్ , టేబుల్ టెన్నిస్ స్టార్ శరత్ కమల్ పతాకధారులుగా వ్యవహరించారు. -
బాక్సింగ్ లో స్వర్ణం సాధించిన తెలంగాణ బిడ్డ
-
పసిడి పంచ్ విసిరిన తెలంగాణ బిడ్డ.. అభినందనలతో ముంచెత్తిన కేసీఆర్
బర్మింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న 22వ కామన్వెల్త్ క్రీడల్లో భారత బాక్సర్ల హవా కొనసాగుతుంది. ఇవాళ ఒక్క రోజే భారత బాక్సర్లు మూడు స్వర్ణ పతకాలు సాధించారు. మహిళల 48 కేజీల మినిమమ్ వెయిట్ విభాగంలో నీతూ గంగాస్ స్వర్ణంతో బోణీ కొట్టగా, ఆతర్వాత నిమిషాల వ్యవధిలోనే పురుషుల 48-51 కేజీల విభాగంలో అమిత్ పంగాల్ పసిడి పంచ్ విసిరాడు. తాజాగా మహిళల 48-50 కేజీల లైట్ ఫ్లై విభాగంలో తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్ మరో స్వర్ణం సాధించింది. HAR PUNCH MEIN JEET! 🔥🔥🔥 Reigning World Champion @nikhat_zareen 🥊 dominates a tricky opponent Carly MC Naul (NIR) via UNANIMOUS DECISION and wins the coveted GOLD MEDAL 🥇 in the Women's 50kg event at #CWG2022 Extraordinary from our Champ 💪💪#Cheer4India#India4CWG2022 pic.twitter.com/4RBfXi2LQy — SAI Media (@Media_SAI) August 7, 2022 ఫైనల్లో జరీన్.. నార్త్రన్ ఐర్లాండ్ బాక్సర్ కార్లీ మెక్‌నౌల్‌ను 5-0 తేడాతో మట్టికరిపించి, భారత్‌కు మూడో బాక్సింగ్ స్వర్ణాన్ని అందించింది. జరీన్ పసిడి పంచ్‌తో బాక్సింగ్‌లో భారత్ పతకాల సంఖ్య 5కు (3 స్వర్ణాలు, 2 కాంస్యాలు) చేరగా, ఓవరాల్‌గా భారత పతకాల సంఖ్య 48కి (17 స్వర్ణాలు, 12 రజతాలు, 19 కాంస్యాలు) చేరింది. పురుషుల ఫెదర్వెయిట్ 57 కేజీల విభాగంలో మహ్మద్ హుస్సాముద్దీన్, పురుషుల 67 కేజీల వెల్టర్‌వెయిట్ విభాగంలో రోహిత్ టోకాస్‌లు ఇదివరకే కాంస్య పతకాలు గెలిచారు. కాగా, జరీన్.. ఇటీవల జరిగిన వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లోనూ స్వర్ణం సాధించిన విషయం తెలిసిందే. కామన్వెల్త్ గేమ్స్‌లో నిఖత్ జరీన్ స్వర్ణం గెలవడం పట్ల ప్రధాని మోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. వీరిరువురు నిఖత్‌ను అభినందనలతో ముంచెత్తారు. నిఖత్.. భారత్‌కు గర్వకారణమని, భవిష్యత్తులో ఆమె మరిన్ని విజయాలు సాధించాలని ప్రధాని.. నిఖత్ గెలుపుతో తెలంగాణ కీర్తి విశ్వవ్యాప్తమైంది, నిఖత్.. తన విజయపరంపరను కొనసాగించాలని కేసీఆర్ ఆకాంక్షించారు. చదవండి: జావెలిన్ త్రోలో తొలి పతకం.. చరిత్ర సృష్టించిన అన్నూ మాలిక్ -
Commonwealth Games 2022: ‘పసిడి’కి పంచ్ దూరంలో...
బాక్సింగ్ ఈవెంట్లో నిఖత్ జరీన్ (50 కేజీలు), నీతూ (48 కేజీలు), అమిత్ పంఘాల్ (51 కేజీలు) ఫైనల్లోకి దూసుకెళ్లి పసిడి పతకాలకు విజయం దూరంలో నిలిచారు. మహిళల విభాగం సెమీఫైనల్స్‌లో నిఖత్ 5–0తో స్టబ్లీ అల్ఫియా సవానా (ఇంగ్లండ్)పై నెగ్గగా... నీతూ పంచ్‌ల ధాటికి ప్రత్యర్థి ప్రియాంక ధిల్లాన్ (కెనడా) చేతులెత్తేయడంతో రిఫరీ మూడో రౌండ్లో బౌట్‌ను నిలిపి వేశారు. పురుషుల విభాగం సెమీఫైనల్లో అమిత్ 5–0తో చిన్యెంబా (జాంబియా)పై నెగ్గాడు. మహిళల 60 కేజీల సెమీఫైనల్లో జాస్మిన్ (భారత్) 2–3తో జెమ్మా రిచర్డ్సన్ (ఇంగ్లండ్) చేతిలో, పురుషుల 57 కేజీల సెమీఫైనల్లో తెలంగాణ బాక్సర్ హుసాముద్దీన్ 1–4తో జోసెఫ్ కామె (ఘనా) చేతిలో ఓడిపోయి కాంస్య పతకాలను దక్కించుకున్నారు. -
వైరల్‌గా మారిన నిఖత్ జరీన్ చర్య.. ఏం జరిగింది?
భారత మహిళా బాక్సర్.. తెలంగాణ ముద్దుబిడ్డ నిఖత్ జరీన్ కామన్వెల్త్ గేమ్స్ 2022లో కనీస కాంస్య పతకం ఖాయం చేసుకుంది. మహిళల బాక్సింగ్ 50 కేజీల లైట్ ఫ్లైవెయిట్ విభాగంలో బుధవారం జరిగిన క్వార్టర్‌ఫైనల్ బౌట్లో 5–0తో హెలెన్ జోన్స్ (వేల్స్)పై గెలిచి సెమీస్‌కు ప్రవేశించింది. ఈ క్రమంలో మ్యాచ్ గెలిచిన అనంతరం నిఖత్ జరీన్ చర్య సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విషయంలోకి వెళితే.. బుధవారం నిఖత్ జరీన్ తల్లి పర్వీన్ సుల్తానా పుట్టినరోజు. తల్లి పుట్టినరోజు నాడే క్వార్టర్స్ మ్యాచ్ గెలిచి కనీసం కాంస్య పతకం ఖరారు చేయడంతో నిఖత్ మొహం సంతోషంతో వెలిగిపోయింది. రింగ్ నుంచి కిందకు దిగగానే.. ''హ్యాపీ బర్త్‌డే అమ్మీ.. ఐ లవ్ యూ.. అల్లా నిన్ను సంతోషంగా ఉంచాలి'' అంటూ గట్టిగా అరిచింది. ఈ విజయాన్ని పర్వీనా సుల్తానాకు అంకితం చేసిన నిఖత్ జరీన్ తన తల్లిపై ఉన్న ప్రేమను ఈ విధంగా చూపించింది. ఇక నిఖత్ జరీన్‌తో పాటు మరో తెలంగాణ బాక్సర్ హుసాముద్దీన్(57 కేజీలు) కూడా సెమీస్‌లోకి ప్రవేశించాడు. వీరితో పాటు హరియాణా అమ్మాయి నీతూ (48 కేజీలు) క్వార్టర్ ఫైనల్స్‌లో నికోల్ క్లయిడ్ (నార్తర్న్ ఐర్లాండ్)ను ఓడించింది. అయితే కచ్చితంగా పతకం తెస్తుందని ఆశించిన లవ్లీనా బొర్హంగైన్ మాత్రం నిరాశపరిచింది. మిడిల్ వెయిట్ క్వార్టర్ఫైనల్లో వేల్స్‌కు చెందిన రోసీ ఎక్లెస్ చేతిలో 3-2తో ఓడిపోయింది. మరో బాక్సర్ ఆశిష్ కుమార్(80 కేజీలు) ఇంగ్లండ్‌కు చెందిన ఆరోన్ బోవెన్ చేతిలో 4-1తో ఓడి క్వార్టర్స్‌లోనే వెనుదిరిగాడు. The beautiful thing by @nikhat_zareen after winning QF.. "Happy Birthday ammi, Allah aapko khush rakhe" ❤️😍 #B2022 #boxing #NikhatZareen #CommonwealthGames2022 #CWG2022 #TeamIndia @WeAreTeamIndia @Media_SAI pic.twitter.com/lqp4fVkhoX — Sagar 🕊️ (@imperfect_ocean) August 3, 2022 చదవండి: CWG 2022: హైజంప్‌లో భారత్‌కు కాంస్యం.. తొలి అథ్లెట్‌గా రికార్డు Suryakumar Yadav: 'సూర్యుడి'లా వెలిగిపోతున్నాడు.. ఆపడం కష్టమే -
నిఖత్ పంచ్ అదిరె.. పతకం దిశగా దూసుకెళ్తున్న తెలంగాణ చిచ్చర పిడుగు
కామన్వెల్త్ గేమ్స్ మహిళల బాక్సింగ్‌లో భారత స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ (50 కేజీలు) క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. తొలి రౌండ్లో నిఖత్ పంచ్‌ల ధాటికి ప్రత్యర్థి హెలెనా (మొజాంబిక్) తట్టుకోలేక విలవిలలాడింది. దాంతో రిఫరీ మూడో రౌండ్ మధ్యలోనే బౌట్‌ను నిలిపివేసి నిఖత్‌ను విజేతగా ప్రకటించారు. నిఖత్ ఇటీవలే జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం నెగ్గి జోరుమీదున్న విషయం తెలిసిందే. ఈ పోటీల్లోనూ నిఖత్ పసిడి పంచ్ విసరాలని పట్టుదలగా ఉంది. క్వార్టర్స్‌లో నిఖత్.. న్యూజిలాండ్‌కు చెందిన గార్టన్తో తలపడనుంది. మరోవైపు పురుషుల 63.5 కేజీల విభాగంలో భారత స్టార్ బాక్సర్ శివ థాపాకు అనూహ్య పరాజయం ఎదురైంది. ప్రిక్వార్టర్స్‌లో థాపా 1-4తో రిసీ లించ్ (స్కాట్లాండ్) చేతిలో ఓటమి పాలయ్యాడు. -
ఆగస్ట్‌లో హైదరాబాద్ మారథాన్, టైటిల్ స్పాన్సర్‌గా ఎన్ఎండీసీ!
తెలంగాణ ప్రభుత్వం, ఎన్ఎండీసీ లిమిటెడ్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ లిమిటెడ్, హైదరాబాద్ రన్నర్స్ సొసైటీలు సంయుక్తంగా 11వ ఎడిషన్ ఎన్ఎండీసీ హైదరాబాద్ మారథాన్ - 2022 ప్రారంభం కానున్నాయి. ఆగస్ట్ 27న 5కె ఫన్ రన్, ఆగస్టు 28న 10 కె, హాఫ్ మారథాన్ 21.095కె , ఫుల్ మారథాన్ 42.195కెలు జరగనున్నట్లు నిర్వాహాకులు తెలిపారు. ఇందుకోసం 15వేల మందికి పైగా రన్నర్లు, 3500 మందికి పైగా వాలంటీర్లు, 250 మంది వైద్య సిబ్బంది పాల్గొననున్నారు. ఇక ఈ హైదరాబాద్ మారథాన్ టైటిల్ స్పాన్సర్ షిప్‌ను ఎన్ఎండీసీ అందిస్తున్నట్లు ఆ సంస్థ రేస్ డైరెక్టర్ ప్రశాంత్ మోర్పారియా తెలిపారు. హైదరాబాద్ మారథాన్‌లో పాల్గొనేవారికి ప్రపంచ స్థాయి అనుభవాన్ని అందించే దిశగా కృషి చేస్తామని అన్నారు. మారథాన్ ఈవెంట్‌కు ప్రపంచ మహిళల బాక్సింగ్ చాంపియన్ నిఖత్ జరీన్ ఫేస్ ఆఫ్ ది ఈవెంట్‌గా వ్యవహరించనున్నారు. ఈ సందర్భంగా నిఖత్ జరీన్ మాట్లాడుతూ.. ఎన్ఎండీసీ హైదరాబాద్ మారథాన్ 2022 ఎడిషన్‌లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని తెలిపారు. నగరంలో జరిగే అతిపెద్ద కమ్యూనిటీ ఫిట్నెస్ ఈవెంట్‌ను విజయవంతం చేయాలని నిఖత్ జరీన్ పిలుపునిచ్చారు. -
కామన్వెల్త్ క్రీడలకు నిఖత్ జరీన్
న్యూఢిల్లీ: ప్రపంచ చాంపియన్, తెలంగాణకు చెందిన బాక్సర్ నిఖత్ జరీన్ కామన్వెల్త్ క్రీడలకు అర్హత సాధించింది. సెలక్షన్ ట్రయల్స్‌లో సత్తా చాటిన నిఖత్ తొలిసారి ఈ మెగా ఈవెంట్ బరిలోకి దిగనుంది. 50 కేజీల విభాగంలో శనివారం జరిగిన ఫైనల్ ట్రయల్ పోరులో నిఖత్ 7–0తో మీనాక్షి (హరియాణా)పై నెగ్గింది. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో 52 కేజీల విభాగంలో విజేతగా నిలిచిన నిఖత్ కామన్వెల్త్ గేమ్స్ కోసం 50 కేజీల విభాగానికి మారింది. టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత లవ్లీనా (70 కేజీలు), నీతూ (48 కేజీలు), జాస్మిన్ (60 కేజీలు) కూడా ఫైనల్ బౌట్లలో విజయాలు సాధించి కామన్వెల్త్ గేమ్స్‌కు వెళ్లే భారత బృందంలో చోటు దక్కించుకున్నారు. జూలై 28 నుంచి ఆగస్టు 8 వరకు ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్‌లో కామన్వెల్త్ క్రీడలు జరుగుతాయి. -
క్రీడాకారులకు అండగా ఉంటాం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ క్రీడాకారులకు ఎల్లవేళలా అండగా ఉంటానని సీఎం కేసీఆర్ చెప్పారు. క్రీడారంగాన్ని ప్రోత్సహించి, రేపటి తరాలను శారీకంగా, మానసికంగా దృఢంగా తీర్చిదిద్దడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. తెలంగాణ గడ్డకు కీర్తి ప్రతిష్టలు తెచ్చిన బాక్సర్ నిఖత్ జరీన్, షూటర్ ఇషా సింగ్‌లను చూసి తెలంగాణ యువతీ యువకులు స్ఫూర్తి పొందాలని పిలుపునిచ్చారు. నిఖత్, ఇషా సింగ్‌లతో పాటు వారి తల్లిదండ్రులను గురువారం మధ్యాహ్నం ప్రగతి భవన్‌కు ఆహ్వానించిన ఘనంగా సన్మానించి, ఆతిధ్యం ఇచ్చారు. వారితో కలిసి భోజనం చేశారు. కాసేపు ముచ్చటించారు. బాక్సింగ్ క్రీడపట్ల చిన్నతనం నుంచే మక్కువ చూపించడానికి గల కారణాలను, గోల్డ్ మెడల్ సాధించడానికి పడిన శ్రమను నిఖత్‌ను అడిగి తెలుసుకున్నారు. శిక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం అందించిన ప్రోత్సాహం, చేసిన ఆర్థిక సాయం తనలో ఎంతో ఆత్మస్థైర్యాన్ని నింపిందంటూ ధన్యవాదాలు తెలిపారు. నిఖత్ పట్టుదల, ఆత్మస్థైర్యాన్ని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అభినందించారు. మరొకసారి కేసీఆర్ ‘పంచ్’ 2014లో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా నగదు బహుమతిగా తనకు రూ.50 లక్షల చెక్కును అందిస్తూ, తన అభ్యర్థన మేరకు సీఎం బాక్సింగ్ పంచ్ పోజిచ్చిన విషయాన్ని నిఖత్ గుర్తు చేశారు. ‘మీరిచ్చిన స్ఫూర్తితోనే ఇంతటి విజయాన్ని సాధించాను. నేను విజయంతో తిరిగి వచ్చినందుకు మరోసారి ఆరోజు మాదిరి పిడికిలి బిగించండి’అని సీఎంను కోరారు. ఆమె విన్నపాన్ని అంగీకరించిన కేసీఆర్ పిడికిలి బిగించి ఫొటో దిగారు. రూ.2 కోట్ల నగదు బహుమతిని అందించి, విలువైన నివాస స్థలాన్ని ఇస్తున్నందుకు ఆమె తల్లిదండ్రులు జమీల్ అహ్మద్, పర్వీన్ సుల్తానా సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. కాగా, ఇషాతో కూడా సీఎం మాట్లాడారు. ఆమె తల్లిదండ్రు లు సచిన్ సింగ్, శ్రీలతను అభినందించారు. -
ప్రధాని మోదీని కలుసుకున్న నిఖత్ జరీన్.. ఫోటోలు వైరల్
ప్రపంచ మహిళల బాక్సింగ్ చాంపియన్.. తెలంగాణ ముద్దుబిడ్డ నిఖత్జరీన్ బుధవారం భారత ప్రధాని నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలుసుకుంది. నిఖత్ జరీన్‌తో పాటు యువ బాక్సర్లు మనీష్ మౌన్, పర్వీన్ హుడాలు కూడా ఉన్నారు. మోదీని కలిసిన నిఖత్ జరీన్ తాను సాధించిన స్వర్ణ పతకాన్ని చూపిస్తూ ప్రధానితో సెల్ఫీ దిగింది. ఆ తర్వాత మనీష్ మౌన్, పర్వీన్ హుడా, నిఖత్ జరీన్‌లతో కలసి ఫోటో దిగిన మోదీజీ వారితో కాసేపు ముచ్చటించారు. దీనికి సంబంధించిన ఫోటోలను నిఖత్ జరీన్ తన ట్విటర్లో షేర్ చేయగా వైరల్‌గా మారాయి.''ప్రధాని మోదీ జీ.. మిమ్మల్ని కలుసుకోవడం ఆనందంగా ఉంది.. థాంక్యూ సర్'' అంటూ క్యాప్షన్ జత చేసింది. ఇటీవలే టర్కీ వేదికగా జరిగిన ప్రపంచ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణకు చెందిన నిఖత్ జరీన్ స్వర్ణం సాధించి చాంపియన్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. 52 కేజీల విభాగంలో జరిగిన ఫైనల్లో నిఖత్ జరీన్.. థాయిలాండ్‌కు చెందిన జిట్‌పోంగ్ జుట్మస్ను 5-0(30-27, 29-28, 29-28,30-27, 29-28)తో పంచ్‌ల వర్షం కురిపించింది. 2018లో మేరీకోమ్ తర్వాత ప్రపంచ మహిళల బాక్సింగ్ చాంపియన్‌లో ఒక భారత బాక్సర్ స్వర్ణం గెలడవం మళ్లీ ఇదే. కాగా నిఖత్ జరీన్ భారత్ తరపున ప్రపంచ మహిళల బాక్సింగ్ చాంపియన్‌గా నిలిచిన ఐదో మహిళగా రికార్డులకెక్కింది. నిఖత్ జరీన్ కంటే ముందు మేరీకోమ్(ఐదుసార్లు), సరితాదేవి, జెన్నీ ఆర్ఎల్, లేఖా కేసీలు ఉన్నారు. ఇక 57 కేజీల విభాగంలో మనీషా మౌన్.. 63 కేజీల విభాగంలో పర్వీన్ హుడాలు కాంస్య పతకం సాధించారు. 73 దేశాల నుంచి 310 మంది బాక్సర్లు పాల్గొన్న ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో 12 మంది భారత మహిళా బాక్సర్లు పాల్గొన్నారు. వీరిలో 8 మంది కనీసం క్వార్టర్ ఫైనల్ చేరడం విశేషం. టర్కీ వేదికగా జరిగిన ప్రపంచ మహిళల బాక్సింగ్ చాంపియన్‌లో భారత్ సాధించిన మూడు పతకాలతో మొత్తం పతకాల సంఖ్య 39కి చేరింది. ఇందులో 10 స్వర్ణాలు, 8 రజతాలు, 21 కాంస్యాలు ఉన్నాయి. ప్రపంచ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్ పతకాల పట్టికలో రష్యా(60), చైనా(50) తర్వాతి స్థానంలో భారత్(39) ఉండడం విశేషం. చదవండి: బాక్సర్ నిఖత్ జరీన్, షూటర్ ఇషాసింగ్‌కు తెలంగాణ సర్కార్ భారీ నజరానా An honour to meet our Hon’ble PM @narendramodi sir. Thank you sir😊🙏🏻 pic.twitter.com/8V6avxBG9O — Nikhat Zareen (@nikhat_zareen) June 1, 2022 Prime Minister Narendra Modi meets the women boxers Nikhat Zareen, Manisha Moun and Parveen Hooda who won medals in the World Boxing Championships.#PMModi #nikhat_zareen pic.twitter.com/4dSmhvgmcV — Omprakash Narayana Vaddi (@omprakashvaddi) June 1, 2022 -
బాక్సర్ నిఖత్ జరీన్, షూటర్ ఇషాసింగ్‌కు తెలంగాణ సర్కార్ భారీ నజరానా
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ క్రీడల్లో విజేతలకు తెలంగాణ సర్కార్ భారీ నజరానా ప్రకటించింది. తెలంగాణకు చెందిన బాక్సర్ నిఖత్ జరీన్, షూటర్ ఇషా సింగ్‌లకు రూ. 2కోట్ల చొప్పున నగదు బహుమతి ప్రకటించింది. నగదు బహుమతితో పాటు ఇంటిస్థలం కూడా కేటాయించాలని నిర్ణయం తీసుకుంది. ఇటీవలే ప్రపంచ మహిళల బాక్సింగ్ చాంపియన్‌లో స్వర్ణం గెలిచి నిఖత్ జరీన్ చరిత్ర సృష్టించింది. ఇక దేశం తరపున నిఖత్ జరీన్ ఐదో మహిళా బాక్సింగ్ చాంపియన్‌గా నిలిచింది. ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ వరల్డ్‌కప్ షూటింగ్ పోటీల్లో ఈషా సింగ్ గోల్డ్ మెడల్ సాధించింది. సీఎం కెసీఆర్ ఆదేశాల మేరకు బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నగదు బహుమతితో పాటు వీరికి బంజారాహిల్స్ లేదా జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో నివాసయోగ్యమైన ఇంటిస్థలాన్ని కేటాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. -
Nikhat Zareen: నిఖత్ జరీన్‌కు బహుమతిగా కారు
ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌గా నిలిచిన నిఖత్ జరీన్‌కు తెలంగాణ బ్యాడ్మింటన్ సంఘం ఉపాధ్యక్షుడు వి.చాముండేశ్వరీనాథ్ ప్రోత్సాహక బహుమతిగా కారును ప్రకటించారు. ఆదివారం హైదరాబాద్‌లో భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ చేతుల మీదుగా దీనిని అందజేశారు. కాగా తెలంగాణ మహిళా బాక్సర్ నిఖత్ జరీన్ ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. 52 కేజీల ఫ్లయ్ వెయిట్ విభాగంలో ఆమె జగజ్జేతగా నిలిచింది. ఇస్తాంబుల్‌లో జరిగిన ఫైనల్లో థాయ్‌లాండ్ బాక్సర్ జిత్‌పాంగ్ జుతమాస్‌తో జరిగిన టైటిల్ పోరులో 5–0తో గెలుపొంది ‘స్వర్ణ’ చరిత్ర లిఖించింది. యావత్ భారతావని పులకించేలా ‘పసిడి పంచ్’తో మెరిసింది. చదవండి 👇 IPL 2022 Prize Money: ఐపీఎల్ ‘విజేతలు’.. ఎవరెవరి ప్రైజ్‌మనీ ఎంతంటే! IPL 2022 Final - Hardik Pandya: శెభాష్.. సీజన్ ఆరంభానికి ముందు సవాళ్లు.. ఇప్పుడు కెప్టెన్‌గా అరుదైన రికార్డు! -
నిఖత్ జరీన్‌కు హైదరాబాద్‌లో అపూర్వ స్వాగతం ( ఫోటోలు)
-
నిఖత్‌కు నీరాజనం
శంషాబాద్: ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం సాధించిన రాష్ట్ర క్రీడాకారిణి నిఖత్ జరీన్‌కు హైదరాబాద్‌లో అపూర్వ స్వాగతం లభించింది. నిఖత్ జరీన్‌తోపాటు జర్మనీలో జరిగిన జూనియర్ ప్రపంచకప్ షూటింగ్ టోర్నీలో మూడు స్వర్ణ పతకాలు సాధించిన షూటర్ ఇషాసింగ్, జాతీయ మహిళల ఫుట్‌బాల్ లీగ్‌లో టైటిల్ గెలిచిన కేరళ గోకులం క్లబ్ జట్టుకు ఆడిన గుగులోత్ సౌమ్య కూడా శుక్రవారం నగరానికి వచ్చారు. వీరికి శంషాబాద్ విమానాశ్రయంలో క్రీడలు, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఘనస్వాగతం పలికారు. అనంతరం విమానాశ్రయం నుంచి ఓపెన్‌టాప్ జీప్‌లో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. పలు పాఠశాలలకు చెందిన క్రీడాకారులు కూడా రహదారి వెంట ఆత్మీయ స్వాగతం పలికారు. జాతీయ పతాకాలు చేతబట్టి నినాదాలు చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర క్రీడా కార్యదర్శి సందీప్ సుల్తానియా, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు. క్రీడలకు పెద్ద పీట ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. ప్రపంచస్థాయిలో తెలంగాణ అమ్మాయిలు రాష్ట్రం, దేశం గర్వపడేలా పతకాలు సాధించారంటూ కితాబునిచ్చారు. క్రీడారంగానికి తెలంగాణ ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని, దేశానికి మంచి క్రీడాకారులను ఇవ్వడానికి నిరంతరం కృషి చేస్తోందని చెప్పారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఊరూరా క్రీడా మైదానాల ఏర్పాటుకు రంగం సిద్ధం చేసినట్లు తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో క్రీడారంగానికి ప్రా«ధాన్యత తక్కువగా ఉండేదన్నారు. అన్ని రంగాల్లో బాగుపడుతున్న రాష్ట్ర ప్రగతిని చూసి ఢిల్లీ నుంచి వస్తున్న కొందరు కాళ్లలో కట్టెలు పెడుతున్నారని ధ్వజమెత్తారు. ఈ రాష్ట్రానికి ఏమి చేయలేని వారు.. వారి సొంత రాష్ట్రాల్లో బాగుచేయలేక విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. నిఖత్ జరీన్, ఇషాసింగ్, సౌమ్య ముగ్గురు కూడా నిజామాబాద్ బిడ్డలు కావడం జిల్లాకు గర్వకారణంగా ఉందని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. మరింత వన్నె తెస్తా: నిఖత్ జరీన్ తాను సాధించిన పతకం దేశానికి, రాష్ట్రానికి పేరు తీసుకొచ్చిందని ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ నిఖత్ జరీన్ అన్నారు. భవిష్యత్తులో దేశానికి, రాష్ట్రానికి మరింత వన్నె తెచ్చేలా పతకాలు సాధిస్తానని ధీమా వ్యక్తంచేశారు. సీఎం కేసీఆర్, మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఎంతగానో ప్రోత్సాహం అందించా రని చెప్పారు. ఎమ్మెల్సీ కవిత ప్రోత్సాహంతోనే తాను ఈ స్థాయిలో ఉన్నానన్నారు. -
కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు.. తిట్టిన నోరు మెచ్చుకునేలా చేసింది
కాలం ఎప్పుడు ఒకేలా ఉండదని చెప్పడానికి ఇప్పుడు చెప్పుకునే సంఘటన ఒక నిదర్శనం. ఒకప్పుడు మెచ్చుకోవడానికి రాని నోరు.. ఇవాళ ప్రశంసలు కురిపించేలా చేసింది. ఏ చేతులైతే షేక్ హ్యాండ్ ఇవ్వడానికి నిరాకరించాయో అవే చేతులు ఇవాళ ఆమె భుజంపై చేతులు వేసి ఫోటో దిగేలా చేశాయి. ఈ పాటికే మీకు అర్థమయిదనుకుంటా ఎవరా వ్యక్తి అని.. అవునండి.. ఆమె భారత దిగ్గజ మహిళ బాక్సర్ మెరీ కోమ్. మేరీ కోమ్ చేత మెచ్చుకొని ఫోటో దిగిన వ్యక్తి పేరు నిఖత్ జరీన్. ఇటీవల జరిగిన ప్రపంచ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం పతకం సాధించి అందరి దృష్టిని ఒక్కసారిగా తనవైపు తిప్పుకుంది తెలంగాణ ముద్దుబిడ్డ నిఖత్ జరీన్. భారత్ తరఫున ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన ఐదో మహిళా బాక్సర్‌గా నిఖత్ జరీన్ రికార్డులకెక్కింది. మేరీకోమ్ చివరి సారిగా 2018లో గెలిచాకా మళ్లీ నాలుగేళ్ల తర్వాత ప్రపంచ బాక్సింగ్ వేదికపై తెలుగుతేజం భారత మువ్వన్నెలను సగర్వంగా రెపరెప లాడించింది. అయితే నిఖత్ జరీన్‌కు మేరీకోమ్ అంటే విపరీతమైన అభిమానం. మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో ఆరుసార్లు చాంపియన్‌గా నిలిచిన మేరీ కోమ్ అంటే తనకు ఆదర్శమని నిఖత్ చాలాసార్లు చెప్పుకొచ్చింది. తనకు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి నిరాకరించిన వ్యక్తిని నిఖత్ జరీన్ స్వయంగా కలుసుకుంది. అయితే మేరీ కోమ్ పాత గొడవలన్నీ మరిచిపోయి నిఖత్‌పై ప్రశంసల వర్షం కురిపించింది. తన సంతోషాన్ని పంచుకున్న నిఖత్ ఆమెతో దిగిన ఫోటోను ట్విటర్లో పంచుకుంది. నిఖత్ పోస్ట్ చేసిన మరుక్షణంలోనే సోషల్ మీడియాలో ఆ ఫోటో వైరల్‌గా మారింది. అంతకముందే మేరీ కోమ్ నిఖత్‌కు శుభాకాంక్షలు చేస్తూ ట్వీట్ చేసింది.'' గోల్డ్ మెడల్ గెలిచినందుకు కంగ్రాట్స్ నిఖత్ జరీన్. నీ ప్రదర్శన చారిత్రాత్మకం.. ఎంతో గర్వంగా ఉంది. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా'' అంటూ ట్వీట్ చేసింది. ఇద్దరి మధ్య వివాదం.. నిఖత్ జరీన్ ఎవరు’... తనతో పోటీకి సై అన్న ఒక యువ బాక్సర్ గురించి మేరీ కోమ్ చేసిన వ్యాఖ్య ఇది. టోక్యో ఒలింపిక్స్‌కు తనకు నేరుగా అర్హత ఇవ్వాలంటూ మేరీ కోమ్ కోరగా, ట్రయల్స్‌లో ఆమెతో తలపడేందుకు అవకాశం ఇవ్వాలని నిఖత్ విజ్ఞప్తి చేసింది. చివరకు నిఖత్ విజ్ఞప్తి చెల్లగా...మేరీకోమ్ చేతిలో మాత్రం ఓటమి ఎదురైంది. కనీసం క్రీడాస్ఫూర్తితో షేక్ హ్యాండ్ కూడా ఇవ్వకుండా మేరీ తన ఆగ్రహాన్ని ప్రదర్శించింది. ''నేను ఎందుకు షేక్ హ్యాండ్ ఇవ్వాలి? ఒకవేళ ఆమెకు గౌరవం కావాలంటే ముందు జూనియర్‌గా తనే ఇవ్వడం నేర్చుకోవాలి. అలాంటి వారిని నేను అంతగా ఇష్టపడను. కేవలం నీ సత్తా ఏంటో రింగ్‌లో నిరూపించుకో.. అంతేకానీ బయట ప్రపంచంలో కాదు'' అంటూ ఆగ్రహంతో పేర్కొనడం విమర్శలకు దారి తీసింది. చదవండి: World Boxing Championship: ప్రతికూలతలను బద్దలు కొట్టి... Nikhat Zareen: జగజ్జేత నిఖత్ జరీన్ No victory is complete without your idol’s blessings😇🙌🏻@MangteC #HappyMorning#HappyMe#HappyUs pic.twitter.com/uXJFcK9nMu — Nikhat Zareen (@nikhat_zareen) May 25, 2022 Congratulations @nikhat_zareen for winning Gold medal. So proud of you on your historic performances and all the best for your future endeavors. pic.twitter.com/M3RouNCaPs — M C Mary Kom OLY (@MangteC) May 20, 2022 -
ఒలంపిక్ పతకం సాధిస్తా.. నాకు మరింత మద్దతు కావాలి: నిఖత్ జరీన్
సాక్షి, న్యూఢిల్లీ: వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ స్వర్ణ పతక విజేత నిఖత్ జరీన్‌కు కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ సన్మానం చేశారు. ఆమెతో పాటు ఇండియన్ బాక్సింగ్ అసోసియేషన్ నేతృత్వంలో పలువురు బాక్సర్లను సన్మానించారు. కాంస్య పతక విజేతలు మనీషా , పర్వీన్‌కు ఆయన సన్మానం చేశారు. ఈ సందర్భంగా నిఖత్ జరీన్ మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో ఒలంపిక్ పతకం సాధిస్తానని విశ్వాసం వ్యక్తం చేశారు. ‘‘వరల్డ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం సాధించడం ఆనందంగా ఉంది. నా తదుపరి లక్ష్యం కామన్వెల్త్ పోటీలు. ఇక ఒలంపిక్ పతకం సాధించేందుకు రెట్టింపు కృషి అవసరం. ఇందుకు నాకు ఇంకా చాలా మద్దతు కావాలి. ముస్లిం మహిళగా ఈ క్రీడల్లో రాణించే అంశంపై ఇబ్బందులు ఎదురైనా అన్నింటినీ అధిగమించాను. మా నాన్న కేవలం ఆటపై మాత్రమే దృష్టి సారించమన్నారు. రోజూ ఉదయం రెండు గంటలు, సాయంత్రం రెండు గంటల పాటు సాధన చేశా. నా కుటుంబం ఇచ్చిన ప్రోత్సాహం, స్పాన్సర్లు మద్దతుతో ఇక్కడి వరకు రాగలిగాను. 2014లో తెలంగాణ ప్రభుత్వం నాకు ఆర్థిక సహాయం చేసింది. ఒలంపిక్స్ కోసం తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తుందని ఆశిస్తున్నా’’ అని జరీన్ పేర్కొన్నారు. చదవండి👉🏾IPL 2022- CSK: వచ్చే ఏడాది జడేజా కెప్టెన్‌గా ఉండబోడు.. 16 కోట్లు మిగులుతాయి.. కానీ! చదవండి👉🏾Hijab Row: హిజాబ్‌పై స్పందించిన నిఖత్ జరీన్.. ఆమె ఏమన్నారంటే..? -
ఇది ఆరంభం మాత్రమే.. అదే నా లక్ష్యం
న్యూఢిల్లీ: పారిస్ ఒలింపిక్స్‌లో దేశానికి పతకం సాధించడమే తన అంతిమ లక్ష్యమని మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్ తెలిపారు. ఒలింపిక్స్ పతకం కోసం సాధన కొనసాగిస్తానని చెప్పారు. ఇస్తాంబుల్‌లో జరిగిన ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకం సాధించి స్వదేశానికి తిరిగి వచ్చిన ఆమెకు ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘ఇది ప్రారంభం మాత్రమే. పారిస్ ఒలింపిక్స్‌లో దేశానికి పతకం సాధించడమే నా లక్ష్యం. ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకం గెలవడం నా జీవితంలో ఒక కీలక ఘట్టం. ఈ సంతోషాన్ని నా స్నేహితులు, కుటుంబ సభ్యులతో పంచుకోవాలనుకుంటున్నాను. అమ్మాయిలు వివిధ క్రీడల్లో దేశం గర్వించేలా విజయాలు సాధిస్తున్నార’ని నిఖత్ జరీన్ అన్నారు. అపూర్వ స్వాగతం ఇస్తాంబుల్ నుంచి ఆదివారం సాయంత్రం ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న నిఖత్ జరీన్‌కు క్రీడా శాఖ అధికారులు ఘనస్వాగతం పలికారు. (క్లిక్: అదే నన్ను ఈ స్థాయికి చేర్చింది) -
Nikhat Zareen: ఓనమాలు నేర్పిన విశాఖ.. ఇక్కడే మొదలైన ప్రస్థానం!
విశాఖ స్పోర్ట్స్ : 2009లో ఓ బక్క పలుచని అమ్మాయి తండ్రి చేయిపట్టుకుని నిజమాబాద్‌లో బయలుదేరింది. పెద్ద కుటుంబం, ఆర్థికంగా వెనుకబడి ఉండటంతో తండ్రి బంధువు ప్రోత్సాహంతో సరదాగా నేర్చుకున్న బాక్సింగ్‌లో తర్ఫీదు పొందేందుకు విశాఖ చేరుకుంది. అప్పట్లో ఇక్కడి సాయ్ కోచింగ్ సెంటర్లోనే బాక్సింగ్ రెసిడెన్షియల్ కోచింగ్ కోసం ఎంపికలు ప్రారంభమయ్యాయి. అందులో ప్రతిభ చూపి క్రీడా సంస్థలో శిక్షణకు ఎంపికైంది. తండ్రి పెళ్లిళ్లకు ఫొటోగ్రాఫర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. శిక్షణతో పాటు మెరుగైన వసతులుండటంతో ఆ అమ్మాయిని విశాఖలో వదిలి తిరిగి నిజామాబాద్ చేరుకున్నాడు. బాక్సింగ్‌లో ఇక్కడే ఓనమాలు దిద్దిన ఆ అమ్మాయే నేడు ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌గా ఎదిగింది. ఆమే నిఖత్ జరీన్. 2011లో జూనియర్ వుమెన్ ఇండియా కోచ్ వెంకటేశ్వర పర్యవేక్షణలో టర్కీలో జరిగిన జూనియర్ వరల్డ్ బాక్సింగ్ చాంపియన్‌షిప్ 51 కేజీల ఫ్లై వెయిట్ కేటగిరీలో తొలిసారిగా పాల్గొంది. తన పంచ్‌లతో ప్రత్యర్థిపై ఆధిపత్యం సాధించి స్వర్ణాన్ని సాధించింది. పంచ్‌లు విసరడంలో ప్రత్యర్థిని బట్టి పంథా మార్చుకునే విధానంలో ఉన్న ఆసక్తిని గమనించిన కోచ్ మరింతగా రాటుదేలేందుకు శిక్షణ ముమ్మరం చేశారు. కోచ్‌గానే కాక ఎంపిక చేసిన జట్టును విదేశాల్లో టోర్నీలకు తీసుకెళ్లేది ఆయనే కావడంతో.. నిఖత్ వరసగా పతకాలు సాధించడంతో పాటు యూత్ వరల్డ్ చాంపియన్‌షిప్‌తో యూత్ ఒలింపిక్స్‌లో క్వాలిఫై అయ్యే స్థాయికి ఎదిగింది. పోలీస్ అవుదామనుకుంది అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నీల్లో పతకాలు సాధిస్తూనే పోలీస్ కావాలనే ఉద్దేశంతో రైల్వేలో వచ్చిన ఉద్యోగాన్ని కాదనుకుంది. చివరికి బ్యాంక్‌లో ఉద్యోగంతో ఆర్థికంగా కుటుంబం నిలదొక్కుకోవడంతో సీనియర్ ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌పై దృష్టి పెట్టింది. అయితే అప్పటి వరకు 51 కేజీల ఫ్లై వెయిట్ కాస్త 52 కేజీల వెయిట్‌గా మారింది. లెఫ్ట్ హుక్తో పంచ్‌లు మానసికంగా దృఢంగా వుండే నిఖత్ రిస్క్ బౌట్ చేసి అగ్రెసివ్‌గా పంచ్‌లు విసరడంలో దిట్టగా మారింది. డైయాగ్నిల్ రైట్‌తో సడన్‌గా లెఫ్ట్ హుక్తో పంచ్‌లు విసిరి విజయాలను సొంతం చేసుకుంది. హుక్ మూవ్‌మెంట్‌తో ప్రత్యర్థి బలాల్ని రింగ్‌లోనే పసిగట్టి సమయానుకులంగా పంచ్ చేయడం, డూ ఆర్ డైగా ఎదుర్కొవడం జరీన్‌కు కలిసివచ్చింది. గేమ్‌ను ఆస్వాదిస్తూనే ఉద్రేకపడకుండా కంబైన్డ్ అటాకింగ్‌తో నేడు ఏకంగా సీనియర్ ప్రపంచ బాక్సింగ్ చాంప్‌గా నిలిచింది. విశాఖలో శిక్షణ పొందేప్పుడే మిజోరాంకు చెందిన లాలంగివల్లి 48 కేజీల్లో, జరీనా 51 కేజీల్లో స్పారింగ్ చేస్తూ టర్కీల్లో జరిగిన పోటీల్లో స్వర్ణాలు సాధించారు. సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్సీ జూనియర్, యూత్ స్థాయిలోనే సాయ్ సెంటర్స్‌లో శిక్షణ ఉంటుంది. సీనియర్ స్థాయిలో తలపడేందుకు ఎక్స్‌లెన్సీలో చేరడమే మంచిదని కోచ్ వెంకటేశ్వరరావు సలహాతో జిందాల్ ఎక్స్‌లెన్స్ అకాడమీకి చేరింది. అక్కడ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్సీలోనే కాంబినేషన్స్‌లో హుక్ చేయడం, పంచ్ విసరడం లాంటి టెక్నిక్స్‌తో ఏకంగా సీనియర్ వరల్డ్ బాక్సింగ్ చాంపియన్‌గా నిలిచింది. తొలినాళ్లలో విశాఖలోనే నిఖత్ జరీన్ ప్రస్థానం ప్రారంభమై జూనియర్, యూత్ వుమెన్ బాక్సింగ్ వరల్డ్ చాంపియన్‌షిప్.. నేడు సీనియర్స్ వరల్డ్‌కప్ బాక్సింగ్‌లో సత్తా చాటి దేశ ఖ్యాతిని ఇనుమడించే స్థితికి చేరుకుంది. ఆమె విజయంతో దేశ ప్రజలతో పాటు నగరవాసులు సంబరాలు జరుపుకుంటున్నారు. చదవండి👉🏾Nikhat Zareen On Commonwealth Games: ‘ఓటమిని ఎప్పుడూ ఒప్పుకోలేదు’ 👉🏾ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
Nikhat Zareen: ‘ఓటమిని ఎప్పుడూ ఒప్పుకోలేదు’
న్యూఢిల్లీ: ఐదేళ్ల క్రితం నిఖత్ జరీన్ భుజానికి గాయమైంది. శస్త్ర చికిత్స కూడా చేయాల్సి రాగా, ఏడాది పాటు ఆమె ఆటకు దూరమైంది. కోలుకున్న తర్వాత కూడా పూర్తి ఫిట్‌గా లేకపోవడంతో 2018 ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడలతో పాటు ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కూడా పాల్గొనలేకపోయింది. దాంతో ఒక్కసారిగా ఆమె కెరీర్ ఇబ్బందుల్లో పడేలా కనిపించింది. అయితే పట్టుదలతో మళ్లీ బరిలోకి దిగిన నిఖత్ అత్యుత్తమ ప్రదర్శనతో మళ్లీ రింగ్‌లోకి దూసుకొచ్చింది. ‘ఆ సమయంలో కూడా నాపై నాకు నమ్మకం ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటమిని అంగీకరించరాదని, చివరి వరకు పోరాడాలని నిర్ణయించుకున్నాను. దాని ఫలితంగానే ఈ రోజు ప్రపంచ చాంపియన్‌గా నిలవగలిగాను. 2019లో పునరాగమనం చేసిన తర్వాత మళ్లీ వెనుదిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. ఆడిన ప్రతీ టోర్నీలోనూ నా అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాను’ అని నిఖత్ వ్యాఖ్యానించింది. గత రెండేళ్లలో తన ఆటలో లోపాలు సరిదిద్దుకోవడంపై ప్రత్యేక దృష్టి పెట్టానని ఆమె చెప్పింది. ‘2019 నుంచి పూర్తిగా నా ఆటను మెరుగుపర్చుకోవడానికే ప్రయత్నించా. బలాలు, బలహీనతలను దృష్టిలో ఉంచుకుంటూ సాధన చేశా. అందుకోసం కఠినంగా శ్రమించా. నా జీవితంలో ఎదుర్కొన్న అవాంతరాలు నన్ను దృఢంగా మార్చాయి. మున్ముందు ఏం జరిగినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాల ని మానసికంగా సన్నద్ధమయ్యా’ అని జరీన్ పేర్కొంది. రాబోయే కామన్వెల్త్ క్రీడల్లో పతకం సాధించడం తన ప్రస్తుత లక్ష్యమన్న ఈ తెలంగాణ బాక్సర్... 2024లో జరిగే పారిస్ ఒలింపిక్స్ కోసం ఏ కేటగిరీలో బరిలోకి దిగాలో నిర్ణయిం చుకోలేదని వెల్లడించింది. ‘ఒలింపిక్స్లాగే కామన్వెల్త్ క్రీడల్లోనూ 52 కేజీల కేటగిరీ లేదు. 50 కేజీలు లేదా 54 కేజీల్లో ఏదో ఒకటి తేల్చుకోవాలి. ప్రస్తుతానికి నేనైతే 50 కేజీల కేటగిరీలో పతకం కోసం ప్రయత్నిస్తా. నాకు సంబంధించి ఎక్కువ బరువును ఎంచుకోవడం కంటే తక్కువకు రావడం కొంత సులువు. కాబట్టి దానిపైనే దృష్టి పెడతా’ అని జరీన్ స్పష్టం చేసింది. -
ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ నిఖత్ జరీన్ ( ఫోటోలు)
-
World Boxing Championship: ప్రతికూలతలను బద్దలు కొట్టి...
సాధారణ మధ్యతరగతి, సాంప్రదాయ కుటుంబం... నలుగురు కూతుళ్లలో ఒకరిగా పెరిగిన వాతావరణం...ఇలాంటి నేపథ్యంనుంచి వచ్చిన ఆ అమ్మాయి అన్ని అడ్డంకులను ఛేదించింది. భారత క్రీడల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని కల్పించుకుంది. బాక్సింగ్‌లో పుష్కర కాలంలో ఎన్నో ఆటుపోట్లను తట్టుకొని ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన నిఖత్ జరీన్ ఘనత అసమానం. (సాక్షి క్రీడా విభాగం) అటాక్...అటాక్...అటాక్...ఇప్పుడు రింగ్‌లో నిఖత్ జరీన్ పఠిస్తున్న మంత్రం ఇదొక్కటే! కొన్నాళ్ల క్రితం వరకు కూడా నిఖత్ బ్యాక్‌ఫుట్ బాక్సర్. కానీ ఆమె తన ఆటను మార్చుకుంది. ఒక పంచ్ విసరడంతో పాటు వెంటనే మరో కౌంటర్ పంచ్‌తో సిద్ధమైపోయే ఫ్రంట్‌ఫుట్ ఆటతో నిఖత్ ఆట ఇప్పుడు ఆమెను ప్రపంచ చాంపియన్‌గా నిలిపింది. సరిగ్గా చెప్పాలంటే టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించే ప్రయత్నంలో ట్రయల్స్‌తో మేరీకోమ్‌తో తలపడి వివాదంలో భాగంగా మారిన తర్వాతినుంచి ఆమె ‘కొత్త కెరీర్’ను మొదలుపెట్టింది. సీనియర్ స్థాయిలో చెప్పుకోదగ్గ విజయాలు సాధిస్తే తప్ప జూనియర్‌గా సాధించిన విజయా లకు విలువ, గుర్తింపు లేదని గుర్తించిన నిఖత్ తనను తాను సరికొత్తగా ఆవిష్కరించుకుంది. కుటుంబం అండదండలతో... నిఖత్ స్వస్థలం నిజామాబాద్. ఆమె కెరీర్ ఈ స్థాయికి చేరడానికి ముఖ్య కారణం ఆమె తండ్రి జమీల్ అహ్మద్ పట్టుదల, సహకారం. నలుగురు అమ్మాయిలలో మూడోదైన నిఖత్‌ను ఆయన తన ఇష్టప్రకారం క్రీడల్లో ప్రోత్సహించాడు. అథ్లెట్‌గా మొదలు పెట్టిన నిఖత్ బాక్సర్‌గా ఎదిగింది. నిజామాబాద్‌లో ప్రముఖ బాక్సింగ్ కోచ్‌గా గుర్తింపు ఉన్న శంషముద్దీన్ ఆమెలో ప్రతిభను చూసి సత్తా చాటేందుకు సరైన వేదిక కల్పించాడు. దాంతో 13 ఏళ్ల వయసులో ఆటను మొదలు పెట్టిన నిఖత్ ఆరు నెలల వ్యవధిలోనే రాష్ట్ర స్థాయిలో విజేతగా నిలవడంతో పాటు రూరల్ నేషనల్స్‌లో కూడా పాల్గొని స్వర్ణం సాధించింది. ఆ తర్వాత మరో మూడు నెలలకే జాతీయ సబ్ జూనియర్ స్థాయిలో బెస్ట్ బాక్సర్‌గా నిలిచింది. ఆ తర్వాత స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా జాతీయ క్యాంప్‌లోకి ఎంపిక కావడంతో నిఖత్‌కు తన భవిష్యత్తు ఏమిటో స్పష్టమైంది. కీలక విజయాలు... ఇప్పుడు ప్రపంచాన్ని గెలిచిన టర్కీలోనే నిఖత్ 2011లో జూనియర్ వరల్డ్ చాంపియన్‌గా కూడా నిలిచింది. అదే ఆమె విజయాలకు పునాది. ఈ గెలుపుతో జాతీయ బాక్సింగ్‌లో నిఖత్‌పై అందరి దృష్టి పడింది. జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ ఆర్థిక సహకారం అందించడంతో ఆమె ఆటకు ఎలాంటి ఇబ్బంది రాలేదు. ఇదే జోరులో యూత్ బాక్సింగ్‌లో రజతం, నేషన్స్ కప్, థాయిలాండ్ ఓపెన్లలో పతకాలు వచ్చాయి. ప్రతిష్టాత్మక స్ట్రాండ్జా మెమోరియల్ టోర్నీలో 2019లో స్వర్ణం గెలవడంతో భవిష్యత్ తారగా గుర్తింపు దక్కింది. అవరోధాలని దాటి... ‘నిఖత్ జరీన్ ఎవరు’... తనతో పోటీకి సై అన్న ఒక యువ బాక్సర్ గురించి మేరీ కోమ్ చేసిన వ్యాఖ్య ఇది. టోక్యో ఒలింపిక్స్‌కు తనకు నేరుగా అర్హత ఇవ్వాలంటూ మేరీ కోమ్ కోరగా, ట్రయల్స్‌లో ఆమెతో తలపడేందుకు అవకాశం ఇవ్వాలని నిఖత్ విజ్ఞప్తి చేసింది. చివరకు నిఖత్ విజ్ఞప్తి చెల్లగా...మేరీకోమ్ చేతిలో మాత్రం ఓటమి ఎదురైంది. కనీసం క్రీడాస్ఫూర్తితో షేక్ హ్యాండ్ కూడా ఇవ్వకుండా మేరీ తన ఆగ్రహాన్ని ప్రదర్శించింది. దిగ్గజ బాక్సర్తో తలపడేందుకు ప్రయత్నించిందంటూ నిఖత్‌పై ప్రతికూల విమర్శలు వచ్చాయి. అలాంటి స్థితినుంచి ఆమె మళ్లీ పట్టుదలగా పైకి లేచింది. అంతకు ముందు ఏడాది పాటు గాయం కారణంగా ఆటకు దూరమైంది. కోలుకొని మళ్లీ ఎలా ఆడగలనో అనే భయం ఉన్నా... ఏ దశలోనూ ఓటమిని అంగీకరించని తత్వంతో దూసుకొచ్చింది. జాతీయ చాంపియన్‌షిప్‌లో విజయంతో పాటు స్ట్రా్టండ్జా టోర్నీని మరోసారి గెలిచిన నిఖత్...ఇప్పుడు నేరుగా వరల్డ్ చాంపియన్‌గా నిలిచింది. మరో సవాల్... పారిస్‌లో జరిగే 2024 ఒలింపిక్స్‌లో పతకం లక్ష్యంగా నిఖత్ సిద్ధమవుతోంది. అయితే ఆమె పతకం గెలిచిన కేటగిరీ 52 కేజీలు ఒలింపిక్స్‌లో లేదు. 50 కేజీలు లేదా 54 కేజీలకు మారాల్సి ఉంటుంది. దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టి ఆమె సాధన చేయాల్సి ఉంది. తెలంగాణ సీఎం అభినందనలు ప్రతిష్టాత్మక ప్రపంచ మహిళా బాక్సింగ్ ఛాంపియన్ షిప్లో నిజామాబాద్ కు చెందిన నిఖత్ జరీన్ విశ్వ విజేతగా నిలవడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు. బంగారు పతకాన్ని సాధించిన జరీన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. భారత కీర్తి పతాకాన్ని విశ్వ క్రీడా వేదిక మీద ఎగరేసిన తెలంగాణ బిడ్డ నిఖత్ జరీన్ ను మనస్ఫూర్తిగా అభినందించారు. ప్రభుత్వ ప్రోత్సాహాన్ని అందిపుచ్చుకుని నిఖత్ జరీన్ బాక్సింగ్ క్రీడలో విశ్వ విజేతగా నిలవడం గర్వించదగిన విషయమని అన్నారు. మా ఆనందాన్ని వర్ణించేందుకు మాటలు రావడం లేదు. ఇన్నేళ్ల మా శ్రమ ఫలితాన్నిచ్చింది. భావోద్వేగాలను నిలువరించలేకపోతున్నాం. నిఖత్ పెద్ద విజయం సాధించాలని ఎన్నో ఏళ్లుగా కోరుకున్నాం. ఇప్పుడు మా ప్రార్థనలు ఫలించాయి. మున్ముందు మా అమ్మాయి మరిన్ని విజయాలు అందుకోవాలి’ –నిఖత్ తల్లిదండ్రులు జమీల్, పర్వీన్ -
Nikhat Zareen: జగజ్జేత జరీన్
న్యూఢిల్లీ: తెలంగాణ మహిళా బాక్సర్ నిఖత్ జరీన్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ‘స్వర్ణ’చరిత్ర లిఖించింది. 52 కేజీల ఫ్లయ్ వెయిట్ కేటగిరీలో జగజ్జేతగా నిలిచింది. ఇస్తాంబుల్‌లో జరిగిన ఫైనల్లో నిఖత్ ‘పంచ్’కు ఎదురే లేకుండా పోయింది. గురువారం థాయ్‌లాండ్ బాక్సర్ జిత్‌పాంగ్ జుతమాస్‌తో జరిగిన టైటిల్ పోరులో తెలంగాణ తేజం జరీన్ 5–0తో జయభేరి మోగించిది. తనపై భారతావని పెట్టుకున్న ఆశల్ని వమ్ము చేయకుండా ‘పసిడి’పతకం తెచ్చింది. ఒక్క ఫైనల్లోనే కాదు... ప్రతీ బౌట్లోనూ నిఖత్ పట్టుదలగా ఆడింది. తనకెదురైన ప్రత్యర్థులపై కచ్చితమైన పంచ్‌లు విసురుతూ పాయింట్లను సాధించింది. ఫైనల్లోనూ ఆమె పంచ్‌లకే జడ్జీలంతా జై కొట్టారు. మూడు రౌండ్లపాటు జరిగిన ఈ బౌట్లో జరీన్ ఆధిపత్యమే కొనసాగింది. దీంతో జడ్జీలు 30–27, 29–28, 29–28, 30–27, 29–28లతో తెలంగాణ అమ్మాయికి అనుకూలంగా పాయింట్లు ఇచ్చారు. భారత్ తరఫున ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన ఐదో మహిళా బాక్సర్‌గా నిఖత్ జరీన్ రికార్డులకెక్కింది. మేరీకోమ్ చివరి సారిగా 2018లో గెలిచాకా మళ్లీ నాలుగేళ్ల తర్వాత ప్రపంచ బాక్సింగ్ వేదికపై తెలుగుతేజం భారత మువ్వన్నెలను సగర్వంగా రెపరెప లాడించింది. 🚨 BREAKING: @nikhat_zareen wins gold at the Women's Boxing World Championships in Turkey. She becomes India's fifth gold medallist in the history of the tournament, joining a club featuring Mary Kom, Sarita Devi, Jenny RL and Lekha KC. #IBAWWC2022 | #BoxingNews pic.twitter.com/hljjcAaUKR — Sportstar (@sportstarweb) May 19, 2022 -
Womens World Boxing Championships: పసిడికి పంచ్ దూరంలో...
న్యూఢిల్లీ: తన కెరీర్లో సీనియర్ విభాగంలో తొలిసారి ప్రపంచ చాంపియన్ కావడానికి భారత యువ బాక్సర్ నిఖత్ జరీన్ విజయం దూరంలో నిలిచింది. టర్కీలో జరుగుతున్న ప్రపంచ సీనియర్ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో ఈ తెలంగాణ అమ్మాయి 52 కేజీల విభాగంలో ఫైనల్లోకి దూసుకెళ్లింది. బుధవారం జరిగిన సెమీఫైనల్లో నిజామాబాద్ జిల్లాకు చెందిన 25 ఏళ్ల నిఖత్ 5–0తో కరోలైన్ డి అల్మెదా (బ్రెజిల్)పై ఘనవిజయం సాధించింది. మరోవైపు భారత్‌కే చెందిన మనీషా (57 కేజీలు), పర్వీన్ (63 కేజీలు) ఓటమిపాలై కాంస్య పతకాలతో సంతృప్తి చెందారు. సెమీఫైనల్స్‌లో మనీషా 0–5తో ఇర్మా టెస్టా (ఇటలీ) చేతిలో... పర్వీన్ 1–4తో అమీ సారా బ్రాడ్‌హర్ట్స్ (ఐర్లాండ్) చేతిలో ఓడిపోయారు. కరోలైన్‌తో జరిగిన సెమీఫైనల్లో ఆద్యంతం దూకుడుగా ఆడిన నిఖత్ నిర్ణీత మూడు రౌండ్లలోనూ పైచేయి సాధించింది. నేడు జరిగే ఫైనల్లో థాయ్‌లాండ్ బాక్సర్ జిట్‌పోంగ్ జుటామస్‌తో నిఖత్ తలపడుతుంది. 2011లో టర్కీలోనే జరిగిన ప్రపంచ జూనియర్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో నిఖత్ జరీన్ 50 కేజీల విభాగంలో స్వర్ణ పతకం నెగ్గి విశ్వవిజేతగా నిలిచింది. సెమీఫైనల్లో బ్రెజిల్ బాక్సర్‌ను ఆమె సహజశైలిలో ఆడేందుకు అవకాశం ఇవ్వకూడదనే వ్యూహంతో బరిలోకి దిగాను. స్వర్ణ పతకంతో స్వదేశానికి రావాలని పట్టుదలతో ఉన్నాను. నా ఫైనల్ ప్రత్యర్థి థాయ్‌లాండ్ బాక్సర్తో గతంలో ఒకసారి తలపడ్డాను. ఆమెను ఎలా ఓడించాలో హెడ్ కోచ్‌తో కలిసి వ్యూహం రచిస్తా. –నిఖత్ జరీన్ -
వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కి చేరిన నిఖత్ జరీన్
భారత బాక్సర్ నిఖత్ జరీన్ ప్రపంచ సీనియర్ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో ఫైనల్లోకి దూసుకెళ్లింది. బుధవారం ఇస్తాంబుల్ వేదికగా జరిగిన 52 కేజీల విభాగం సెమీ ఫైనల్లో బ్రెజిల్‌కు చెందిన కరోలైన్ డి అల్మేడాను 5-0 పాయింట్ల తేడాతో నిఖత్ జరీన్ ఓడించింది. ఇక బంగారు పతకాన్ని కైవసం చేసుకునేందుకు ఆమె ఫైనల్లో థాయ్‌లాండ్‌కు చెందిన జుటామస్ జిట్‌పాంగ్‌తో తలపడనుంది. ఇక ఇప్పటి వరకు మేరీకోమ్, సరితా దేవి, జెన్నీ ఆర్ఎల్, లేఖా సీ మాత్రమే ప్రపంచ టైటిల్స్ సాధించిన భారత మహిళా బాక్సర్లుగా ఉన్నారు. కాగా హైదరాబాద్‌కు చెందిన నిఖత్ జరీన్ ఫైనల్లో విజయం సాధిస్తే ఈ అరుదైన జాబితాలో చేరుతుంది. చదవండి: Kaamya Karthikeyan: ఐదు ఖండాలను చుట్టేసిన కామ్య.. ఎన్నెన్నో అవార్డులు! -
Nikhat Zareen: ఒలింపిక్స్ పతక విజేత లవ్లీనాతో పాటు మన అమ్మాయి కూడా
Asian Games- Telangana Boxer Nikhat Zareen- న్యూఢిల్లీ: తెలంగాణ యువ బాక్సర్ నిఖత్ జరీన్ ఆసియా క్రీడల్లో పాల్గొనేందుకు అర్హత సాధించింది. క్వాలిఫయింగ్ కోసం నిర్వహించిన ట్రయల్స్ ఫైనల్లో నిఖత్ (51 కేజీల విభాగం) 7–0 తేడాతో మంజురాణిపై ఘన విజయం సాధించింది. ఇటీవలే స్ట్రాండ్జా మెమోరియన్ టోర్నీలో విజేతగా నిలిచిన నిఖత్... ఏషియాడ్‌లోనూ సత్తా చాటుతానని నమ్మకంతో ఉంది. ఈ ఏడాది సెప్టెంబర్ 10–25 వరకు చైనాలోనూ హాంగ్జూలో ఆసియా క్రీడలు జరుగుతాయి. నిఖత్‌తో పాటు టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత లవ్లీనా బొర్గొహైన్ (69 కేజీలు), జాస్మీన్ (60 కేజీ), మనీశా (57 కేజీ), సవీటీ బూరా (75 కేజీ) కూడా ఆసియా క్రీడలకు క్వాలిఫై అయ్యారు. స్వర్ణపతకంతో తిరిగి రావాలి ఏషియాడ్‌కు అర్హత సాధించిన నిఖత్ జరీన్‌ను అభినందించిన తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ (సాట్స్) చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర రెడ్డి... ఆమె స్వర్ణపతకంతో తిరిగి రావాలని ఆకాంక్షించారు. చదవండి: Ind Vs Sl 2nd Test- WTC: దక్షిణాఫ్రికాలో ఓడటం మన అవకాశాలను దెబ్బ తీసింది.. కానీ: రోహిత్ శర్మ -
ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్స్కు అర్హత సాధించిన తెలంగాణ అమ్మాయి
Nikhat Zareen Into World Boxing Championships: ఇటీవల జరిగిన స్ట్రాండ్జా స్మారక అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నీలో పసిడి పతకం సాధించి జోరు మీదున్న తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్.. మే 6న ఇస్తాంబుల్ వేదికగా ప్రారంభమయ్యే మహిళల ప్రపంచ ఛాంపియన్షిప్స్కు అర్హత సాధించింది. ఈ పోటీల్లో జరీన్ 52 కేజీల విభాగంలో బరిలో దిగనుంది. సెలక్షన్ ట్రయల్స్‌లో జరీన్ 7-0తో మీనాక్షిను(హరియాణా) చిత్తుచేసి మెగా ఈవెంట్‌కు అర్హత సాధించింది. మరోవైపు టోక్యో ఒలింపిక్స్ కాంస్య విజేత లవ్లీనా బోర్గొహైన్ కూడా ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో (70 కేజీల విభాగం) పోటీపడేందుకు అర్హత సాధించింది. ట్రయల్స్‌లో అరుంధతిని ఓడించిన లవ్లీనా టోక్యో ఒలింపిక్స్ తర్వాత పోటీపడే తొలి టోర్నీ ఇదే. ఈ ఈవెంట్‌కు నిఖత్ జరీన్, లవ్లీనాతో పాటు నీతు, అనామికా, శిక్ష, మనీశ, జాస్మైన్, పర్వీన్, అంక్షిత బొరో, సవిటీ బూర, పూజ రాణి, నందిని కూడా అర్హత సాధించారు. వాస్తవానికి వరల్డ్ ఛాంపియన్షిప్స్ పోటీలు గతేడాది డిసెంబర్లోనే జరగాల్సి ఉన్నా.. కరోనా వ్యాప్తి కారణంగా వాయిదా పడ్డాయి. చదవండి: పీవీ సింధుకు ఘోర పరాభవం.. -
నిఖత్ ‘పసిడి’ పంచ్
సాక్షి, హైదరాబాద్: స్ట్రాండ్జా స్మారక అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నీలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ స్వర్ణ పతకంతో అదరగొట్టింది. బల్గేరియా రాజధాని సోఫియాలో ఆదివారం ముగిసిన ఈ టోర్నీలో నిజామాబాద్ జిల్లాకు చెందిన నిఖత్ 52 కేజీల విభాగంలో చాంపియన్‌గా నిలిచింది. ఫైనల్లో నిఖత్ 4–1తో తెతియానా కోబ్ (ఉక్రెయిన్)పై విజయం సాధించింది. తద్వారా 73 ఏళ్ల చరిత్ర కలిగిన స్ట్రాండ్జా టోర్నీలో రెండు స్వర్ణ పతకాలు నెగ్గిన తొలి భారతీయ మహిళా బాక్సర్‌గా నిఖత్ గుర్తింపు పొందింది. 2019లోనూ నిఖత్ బంగారు పతకం సాధించింది. ఇదే టోర్నీలో మహిళల 48 కేజీల విభాగంలోనూ భారత్‌కు స్వర్ణ పతకం లభించింది. హరియాణాకు చెందిన నీతూ ఫైనల్లో 5–0తో ఎరికా ప్రిసియాండ్రో (ఇటలీ)పై గెలిచింది. పసిడి పతకాలు నెగ్గిన నిఖత్, నీతూలకు 4 వేల డాలర్ల (రూ. 3 లక్షలు) చొప్పున ప్రైజ్‌మనీ లభించింది. స్వర్ణం నెగ్గిన నిఖత్‌ను తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ (శాట్స్) చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర రెడ్డి అభినందించారు. నన్ను స్ట్రాండ్జా టోర్నీ రాణి అని పిలవచ్చు. రెండోసారి స్వర్ణం సాధించినందుకు చాలా సంతోషంగా ఉన్నా. ఈసారి పసిడి పతకం నాకెంతో ప్రత్యేకం. ఎందుకంటే టైటిల్ గెలిచే క్రమంలో సెమీఫైనల్లో టోక్యో ఒలింపిక్స్ రజత పతక విజేత బుసెనాజ్ సాకిరోగ్లు (టర్కీ)ను ఓడించాను. ఈ ఏడాది మూడు ప్రముఖ ఈవెంట్స్ ప్రపంచ చాంపియన్‌షిప్, కామన్వెల్త్ గేమ్స్, ఆసియా క్రీడలు ఉన్నాయి. తాజా విజయం ఈ మెగా ఈవెంట్స్‌కు ముందు నాలో ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసిందనడంలో సందేహంలేదు. –నిఖత్ జరీన్ -
ఒలింపిక్ సిల్వర్ మెడలిస్ట్‌కు షాకిచ్చిన తెలంగాణ బాక్సర్
Nikhat Zareen Enters Finals Of Strandja Memorial Boxing: బల్గేరియా వేదికగా జరుగుతున్న 73వ ఎడిషన్ స్టాంజా మెమోరియల్ బాక్సింగ్ టోర్నీలో తెలంగాణ యువ బాక్సర్ నిఖత్ జరీన్ (25) పంజా విసిరింది. శుక్రవారం జరిగిన మహిళల 52 కేజీల విభాగం సెమీస్‌లో టోక్యో ఒలింపిక్ సిల్వర్ మెడలిస్ట్ బుసె నాజ్ కకిరోగ్లు (టర్కీ)పై 4-1 తేడాతో విజయం సాధించి, ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఈ పోరులో ఆది నుంచే పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన నిఖత్.. తనదైన పంచ్‌లతో విరుచుకుపడి ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేసింది. నిఖత్ చివరిసారిగా 2019లో ఈ టోర్నీ ఛాంపియన్‌గా నిలిచింది. మరోవైపు 48 కేజీల విభాగంలో నీతు గంగాస్ (హర్యానా) కూడా ఫైనల్లోకి అడుగుపెట్టింది. నీతు.. సెమీస్‌లో ఉక్రెయిన్ బాక్సర్, 2018 వరల్డ్ ఛాంపియన్షిప్స్ రజత పతక విజేత హన్నా ఒఖోతాను చిత్తుగా ఓడించి స్వర్ణ పతక పోరుకు అర్హత సాధించింది. నీతు పంచ్‌ల ధాటికి ప్రత్యర్థి రెండో రౌండ్లో కుప్పకూలిపోయింది. ఇక ఇదే టోర్నీలో యూత్ ప్రపంచ ఛాంపియన్ అరుంధతి చౌదరీ (70 కేజీలు), పర్వీన్ (63 కేజీలు)లకు నిరాశ తప్పలేదు. క్వార్టర్స్‌లో అరుంధతి 1-4తో ఒలింపిక్ ఛాంపియన్ బుసెనాజ్ సుర్మెనెలి (టర్కీ) చేతిలో, పర్వీన్ 2-3తో నటాలియా (రష్యా) చేతిలో ఓటమిపాలయ్యారు. చదవండి: గెలిస్తే నిఖత్‌కు పతకం ఖాయం -
గెలిస్తే నిఖత్‌కు పతకం ఖాయం
స్ట్రాండ్జా స్మారక అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నీలో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ మహిళా బాక్సర్ నిఖత్ జరీన్‌కు (52 కేజీలు) తొలి రౌండ్లో ‘బై’ లభించింది. బల్గేరియాలో జరుగుతున్న ఈ టోర్నీలో నిఖత్ నేరుగా క్వార్టర్ ఫైనల్ బౌట్లో బరిలోకి దిగుతుంది. ఈ బౌట్లో గెలిస్తే నిఖత్‌కు కనీసం కాంస్యం లభిస్తుంది. 2019లో ఈ టోర్నీలో నిఖత్ స్వర్ణం సాధించింది. ఈనెల 27 వరకు జరిగే ఈ టోర్నీలో భారత్ నుంచి 17 మంది బాక్సర్లు పోటీపడుతున్నారు. -
Nikhat Zareen:నలుగురు అమ్మాయిలు.. నాన్న ప్రోత్సాహం.. బాక్సర్.. బ్యాంకు జాబ్!
Boxer Nikhat Zareen Successful Journey In Telugu: నిజామాబాద్ జిల్లాలో పుట్టిపెరిగిన నిఖత్ జరీన్ క్రీడాప్రస్థానం అక్కడి కలెక్టర్ గ్రౌండ్స్‌లో మొదలైంది. అది కూడా కాకతాళీయంగానే. నిఖత్... వంద మీటర్లు, రెండు వందల మీటర్ల పరుగులో ప్రాక్టీస్ చేయడం కూడా అసంకల్పితంగానే జరిగింది. తనను అథ్లెట్‌గా పరుగులు పెట్టించిన గ్రౌండ్స్‌ను, బాక్సింగ్ ఆకర్షించిన వైనాన్ని వివరించింది నిఖత్. ‘‘మేము నలుగురం అమ్మాయిలం. మా చిన్నప్పుడు నాన్న విదేశాల్లో ఉద్యోగం చేస్తుండేవారు. దాంతో మేమంతా అమ్మమ్మగారింట్లో పెరిగాం. నాన్న ఇండియాకి వచ్చిన తర్వాతనే మా జీవితంలోకి స్పోర్ట్స్ వచ్చాయి. ఇంట్లో అక్కలిద్దరూ చదువుకుంటూ ఉంటే నేను అల్లరి చేస్తూ విసిగిస్తుండేదాన్ని. అక్కల చదువుకు ఇబ్బందవుతోందని నాన్న నన్ను రోజూ ఉదయాన్నే గ్రౌండ్‌కి తీసుకువెళ్లేవారు. ఒక కోచ్ నా ఫిట్నెస్ బాగుందని, రన్నింగ్‌లో ఒడుపు ఉందని గమనించి... నాతో మాట్లాడారు. మా నాన్నను చూపించాను. నాన్నని చూసి ఆశ్చర్యపోయిన ఆయన నన్ను స్పోర్ట్స్‌లో ఎంకరేజ్ చేయమని చెప్పారు. నాన్న పేరు జమీల్ అహ్మద్. కాలేజ్ డేస్‌లో ఆయన కూడా స్పోర్ట్స్ పర్సనే. అప్పుడు నాన్నకు తెలిసిన వ్యక్తే నన్ను గుర్తించిన ఆ కోచ్. అప్పటి నుంచి సీరియస్‌గా ప్రాక్టీస్ మొదలైంది. వంద మీటర్లు, రెండు వందల మీటర్ల రన్నింగ్ రేస్‌లో మెడల్స్ కూడా వచ్చాయి. ఆ రకంగా గ్రౌండ్‌కి వెళ్లడం నాన్నకు, నాకూ డైలీ రొటీన్ అయింది. ఆ గ్రౌండ్లో క్రీడాకారులు, పిల్లలు రకరకాల ఆటల్లో ప్రాక్టీస్ చేస్తుండేవాళ్లు. అన్ని ఆటల్లోనూ అబ్బాయిలు, అమ్మాయిలు ఇద్దరూ కనిపించేవారు. కానీ బాక్సింగ్ రింగ్‌లో ఎప్పుడూ అబ్బాయిలే కనిపించేవారు. ఓ రోజు ‘నాన్నా! అమ్మాయిలు బాక్సింగ్ చేయరా, అమ్మాయిలు బాక్సింగ్ చేయకూడదా’ అని నాన్నను అడిగాను. ‘చేయవచ్చు, కానీ బాక్సింగ్ చేయాలంటే చాలా బలం ఉండాలి. అందుకే అమ్మాయిలు ఇష్టపడరు’ అని చెప్పారు. అప్పుడు నాన్న చెప్పిన సమాధానమే నన్ను బాక్సింగ్ వైపు మళ్లించింది. వెంటనే... ‘నేను చేస్తాను’ అని చెప్పాను. మొదట్లో నాన్న కూడా లైట్‌గానే తీసుకున్నారు. కానీ రోజూ బాక్సింగ్ చేస్తానని మొండికేయడం, కోచ్ కూడా ‘ఈ రంగంలో అమ్మాయిలు ఆసక్తి చూపించడం లేదు. మీ అమ్మాయికి కోచింగ్ ఇప్పించండి. ఫస్ట్ జనరేషన్ ఉమన్ బాక్సర్ అవుతుంది’ అని చెప్పడంతో నాన్న కూడా ఒప్పుకున్నారు. ఆడపిల్ల ఏంటి? పొట్టి దుస్తులు వేసుకుని ప్రాక్టీస్ చేయడమేంటని బంధువులు, స్నేహితుల్లో కొందరన్నారు. కానీ నాన్న వెనుకడుగు వేయలేదు. నాన్న ఆలోచనలు విస్తృతంగా సాగుతాయి. అందుకే అలా అన్న వాళ్లందరినీ సమాధానపరచ గలిగారు. ఒకసారి బాక్సింగ్‌లోకి వచ్చిన తర్వాత ఇక వెనక్కి తిరిగి చూసుకున్నది లేదు. ఇది నాకు నేనుగా తీసుకున్న చాలెంజ్. ఒక్కొక్క లక్ష్యాన్ని ఛేదిస్తూ వస్తున్నాను. చాంపియన్షిప్స్కి వెళ్తే స్వర్ణం, రజతం, కాంస్యం... ఏదో ఒక పతకంతో వస్తానని మా కోచ్‌లకు నా మీద నమ్మకం. ఇప్పటి వరకు వాళ్ల నమ్మకాన్ని నిలబెడుతూ వచ్చాను. ఇకపై కూడా నిలబెడతాను’’ అంటోంది నిఖత్ జరీన్. అన్నట్లు ఆమె చెల్లి అఫ్నాన్ జరీన్. ఆమె బ్యాడ్మింటన్ ప్లేయర్. బ్యాంకు ఉద్యోగం నిఖత్ జరీన్‌కి స్పోర్ట్స్ కోటాలో బ్యాంక్ ఉద్యోగం వచ్చింది. ఇప్పుడామె హైదరాబాద్‌లోని బ్యాంక్ ఆఫ్ ఇండియా జోనల్ ఆఫీస్‌లో జూనియర్ మేనేజర్. ఉద్యోగం చేస్తూ బాక్సింగ్ ప్రాక్టీస్ కొనసాగిస్తోంది. ఆమె ఆడిన మూడు వరల్డ్ చాంపియన్‌షిప్స్‌లో ఒక స్వర్ణం, ఒక రజతం సాధించింది. 51 కిలోల విభాగంలో శిక్షణ పొందిన నిఖత్‌కు బల్గేరియాలో 54 కిలోల విభాగంలో పోటీ పడాల్సి వచ్చింది. ఊహించని పరిణామాన్ని సంభాళించుకుని బరిలో దిగిన నిఖత్ అందులో క్వార్టర్ ఫైనల్స్ వరకు వెళ్లగలిగింది. ఆమెను తడబాటుకు గురిచేసిన ఏకైక సంఘటన అది. ఇప్పుడు ఒలింపిక్స్ కోసం ప్రాక్టీస్ చేయడంతోపాటు రాబోయే మార్చిలో ఇస్తాంబుల్‌లో జరిగే ప్రపంచ స్థాయి చాంపియన్‌షిప్స్‌లో పాల్గొనడానికి సిద్ధమవుతోంది. రిటైర్ అయిన తర్వాత... బాక్సింగ్‌లో తన లక్ష్యాలను సాధించిన తర్వాత మాత్రమే రిటైర్ అవుతానని, రిటైర్ అయిన తర్వాత బాక్సింగ్ కోసం శిక్షణ కేంద్రాన్ని స్థాపించే ఆలోచన చేస్తానని చెప్పింది నిఖత్. బాక్సింగ్ శిక్షణలో అమ్మాయిలను ప్రోత్సహించడం మీద ప్రత్యేక శ్రద్ధ పెడతానని కూడా చెప్పింది. అయితే ప్రస్తుతం తన లక్ష్యం 2024 ఒలింపిక్స్ అనీ, అప్పటి వరకు మరే విషయాన్నీ మెదడులోకి రానివ్వనని చెప్పింది. ముదితల్ నేర్వగరాని విద్య గలదె... ముద్దార నేర్పింపగన్... అనే పద్యాన్ని స్ఫూర్తి పొందాల్సిన స్థితి నుంచి మహిళలు అనేక వందల సోపానాలను చేరుకున్నారు. అయినప్పటికీ మహిళలు ఛేదించాల్సిన పరిధులు ఇంకా ఉన్నాయని నిఖత్ జరీన్ వంటి వాళ్లను చూసినప్పుడు అనిపిస్తుంది. ఒక్కో సరిహద్దును చెరిపేస్తూ విజయపథంలో పరుగులు తీస్తున్న మహిళలకు మరో తాజా ప్రతీక నిఖత్ జరీన్. జరీన్ తాజా లక్ష్యం ఒలింపిక్స్! టర్కీలో ‘ఉమెన్స్ జూనియర్ అండ్ యూత్ వరల్డ్ బాక్సింగ్ చాంపియన్ షిప్స్ (2011)’లో బంగారు పతకం, బల్గేరియాలో జరిగిన ‘యూత్ వరల్డ్ బాక్సింగ్ చాంపియన్‌షిప్స్(2014)’లో రజతం, ‘సీనియర్ ఉమన్ నేషనల్ బాక్సింగ్ చాంపియన్‌షిప్’లో బంగారం, ‘నేషన్స్ కప్ ఇంటర్నేషనల్ బాక్సింగ్ టోర్నమెంట్’లో మరో బంగారు పతకం... ఇలా ఈ అమ్మాయి స్పోర్ట్స్ ఖాతాలో జాతీయ, ప్రపంచస్థాయి పతకాలు పాతిక వరకున్నాయి. గడచిన అక్టోబర్‌లో హరియాణాలో జాతీయస్థాయి బంగారు పతకంతోపాటు బెస్ట్ బాక్సర్ అవార్డుతో రాష్ట్రానికి వచ్చింది నిఖత్ జరీన్. ఇప్పుడు రాబోయే ఒలింపిక్స్ (2024)కి సిద్ధమవుతూ తదేక దీక్షతో ప్రాక్టీస్ చేస్తోంది. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్‌కు గోల్డ్ మెడల్...
హిసార్ (హరియాణా): తన పంచ్ పవర్ సత్తా చాటుకొని తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ జాతీయ సీనియర్ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. బుధవారం ముగిసిన ఈ మెగా ఈవెంట్లో నిజామాబాద్ జిల్లాకు చెందిన 25 ఏళ్ల నిఖత్ ఫైనల్లో 4–1తో మీనాక్షి (హరియాణా)పై గెలిచింది. ఆద్యంతం అద్భుత ప్రదర్శన చేసిన నిఖత్‌కు టోర్నీ ‘బెస్ట్ బాక్సర్’ పురస్కారం లభించడం విశేషం. జాతీయ శిబిరానికి నిహారిక 66 కేజీల విభాగంలో తెలంగాణ బాక్సర్ గోనెళ్ల నిహారిక కాంస్య పతకం సాధించింది. అంతేకాకుండా జాతీయ శిక్షణ శిబిరంలో స్థానం సంపాదించింది. టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం నెగ్గిన లవ్లీనా బొర్గోహైన్‌కు నేరుగా ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే భారత జట్టులో చోటు ఇచ్చారు. మిగతా 11 కేటగిరీల్లో స్వర్ణ పతకాలు గెలిచిన బాక్సర్లు ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తారని భారత బాక్సింగ్ సమాఖ్య (బీఎఫ్ఐ) ఈ టోరీ్నకి ముందు ప్రకటించింది. అయితే ఒకట్రెండు కేటగిరీల్లో ట్రయల్స్ నిర్వహించే అవకాశం ఉందని బీఎఫ్ఐ వర్గాలు తెలిపాయి. చదవండి: SL VS AUS: శ్రీలంకతో మ్యాచ్‌కు ముందు ఆస్ట్రేలియాకు బిగ్ షాక్! -
జాతీయ మహిళల బాక్సింగ్ ఛాంపియన్‌గా నిజామాబాద్ అమ్మాయి
సాక్షి, నిజామాబాద్: మహిళల సీనియర్ జాతీయ బెస్ట్ బాక్సర్ ఛాంపియన్షిప్ విజేతగా నిజామాబాద్‌కు చెందిన నిఖత్ జరీన్ నిలిచింది. హర్యానాలోని హిస్సార్‌లో ఈ నెల 21 నుంచి టోర్నమెంట్ నడుస్తోంది. బుధవారం టోర్నీ ఫైనల్ ముగిసింది. హర్యానాకు చెందిన మీనాక్షిని జరీన్ 4–1 తేడాతో ఓడించింది. మొదటి రౌండ్లో గోవాకు చెందిన దియా వాల్కేను నాకౌట్ చేసింది. క్వార్టర్ ఫైనల్లో ఒడిశాకు చెందిన సంధ్యారాణిని 5–0 తేడాతో ఓడించింది. సెమీఫైనల్లో ఉత్తరప్రదేశ్‌కు చెందిన మంజును 5–0 తేడాతో ఓడించింది. ఫైనల్లో మీనాక్షిపై విజయం సాధించింది. వచ్చే డిసెంబర్ రెండోవారంలో టర్కీలోని ఇస్తాంబుల్‌లో జరుగనున్న మహిళల బాక్సింగ్ ప్రపంచ ఛాంపియన్షిప్ టోర్నీకి జరీన్ ఎంపికైంది. 2014లో ఇస్తాంబుల్‌లో జరిగిన జూనియర్ బాక్సింగ్ ప్రపంచ ఛాంపియన్‌గా జరీన్ నిలిచింది. నిజామాబాద్‌కు చెందిన సమ్‌సమ్ జరీన్‌కు కోచ్‌గా ఉన్నారు. నిఖత్ జరీన్‌ను, ఆమె కోచ్ సమ్సమ్ను మాజీ 400, 800 మీటర్ల నేషనల్ మెడలిస్ట్ సయీద్ ఖైసర్ అభినందించారు. చదవండి: నీరజ్, మిథాలీకి ఖేల్‌రత్న.. ధవన్‌కు అర్జున అవార్డులు..! -
సెమీఫైనల్లో నిఖత్ జరీన్
జాతీయ సీనియర్ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకుంది. హిస్సార్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో నిజామాబాద్ జిల్లాకు చెందిన నిఖత్ 52 కేజీల విభాగంలో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. క్వార్టర్ ఫైనల్లో నిఖత్ 5–0తో మంజు బసుమతిరి (అస్సాం)పై నెగ్గింది. 48 కేజీల విభాగం క్వార్టర్ ఫైనల్ బౌట్లో ప్రపంచ చాంపియన్‌షిప్ రజత పతక విజేత మంజు రాణి 5–0తో మీనాక్షి (పంజాబ్)పై గెలిచింది. -
ఆ పంచ్ నా భర్తపై ప్రయోగిస్తా: దీపికా పల్లికల్
ముంబై: ''మీరు చెప్పే హుక్ పంచ్‌ను నా భర్త దినేశ్ కార్తిక్‌పై ప్రయోగిస్తానంటూ'' ఇండియన్ స్క్వాష్ ప్లేయర్ దీపికా పల్లికల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బాక్సర్ నిఖత్ జరీన్ అడిగిన ప్రశ్నకు దీపిక ఈ విధంగా సమాధానమిచ్చింది. అసలు విషయంలోకి వెళితే.. ప్రముఖ అడ్వర్టైజింగ్ సంస్థ అడిడాస్ నిర్వహించిన ఒక ఈవెంట్‌కు దీపికా పల్లికల్‌తో పాటు 2017 మిస్ వరల్డ్ మానుషి చిల్లర్, ఇండియన్ బాక్సర్ నిఖత్ జరీన్‌లు హాజరయ్యారు. అడిడాస్ నిర్వహించిన వాచ్ అస్ మూవ్ క్యాంపెయిన్ కార్యక్రమంలో పాల్గొన్న వీరి మధ్య సరదా సంభాషణ జరిగింది. బాక్సర్ నిఖత్ జరీన్ తన ఫేవరెట్ షాట్ అయిన హుక్ పంచ్‌ను ప్రస్తావించిది. తాను ఆ పంచ్‌ను ఎలా ఉపయోగిస్తాననేది దీపికా, మానుషి చిల్లర్‌కు వివరించింది. ఈ నేపథ్యంలో ''దీపికా.. మీరు హుక్ పంచ్‌ను ఎవరిపై ప్రయోగిస్తారు'' అని నిఖత్ జరీన్ ప్రశ్నించింది. నిఖత్ ప్రశ్నకు దీపిక వెంటనే స్పందిస్తూ '' వేరే వాళ్లపై ప్రయోగిస్తే ఊరుకోరు.. అందుకే నేను ఈరోజే నా భర్త కార్తిక్‌పై ప్రయోగిస్తా..'' అంటూ చెప్పడం అక్కడున్న వారందరికి నవ్వు తెప్పించింది. ఇంటికి వెళ్లగానే కార్తిక్‌కు హుక్ పంచ్ గురించి వివరించి దానిని అమలు పరిచేలా చూస్తానని దీపికా తెలిపింది. ఇండియన్ స్క్వాష్ ప్లేయర్‌గా గుర్తింపు పొందిన దీపికా పల్లికల్ 2013లో క్రికెటర్ దినేశ్ కార్తిక్‌ను పెళ్లాడింది. ఇప్పటివరకు ఎన్నో మెడల్స్ సాధించిన ఆమె మూడు మెడల్స్‌ను కామన్వెల్త్ గేమ్స్‌లో.. మరో నాలుగు పతకాలు ఏషియన్ గేమ్స్‌లో గెలుచుకుంది. ఇక టీమిండియా జట్టుకు చాలాకాలంగా దూరమైన దినేశ్ కార్తిక్ ఐపీఎల్ 14వ సీజన్‌కు సిద్ధమవుతున్నాడు. గతేడాది కేకేఆర్‌కు కెప్టెన్‌గ వ్యవహరించిన కార్తిక్ లీగ్ మధ్యలో కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో కేకేఆర్ యాజమాన్యం ఇంగ్లండ్ ఆటగాడు ఇయాన్ మోర్గాన్‌కు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించింది. 2019లో చివరిసారిగా వన్డే ఆడిన కార్తిక్ టీమిండియా తరపున 94 వన్డేల్లో 1752 పరుగులు, 32 టీ20ల్లో 399 పరుగులు, 26 టెస్టుల్లో 1025 పరుగులు సాధించాడు. చదవండి: శుభ్‌మన్ గిల్‌కు వీవీఎస్ లక్ష్మణ్ వార్నింగ్! రూల్స్ పక్కన పెట్టండి, నచ్చింది చేయండి: జడేజా -
‘ఇలాంటి స్వభావం ఉన్నవారు నాకు నచ్చరు‘
నిఖత్ జరీన్ తెలంగాణ అమ్మాయి. బాక్సర్. 24 ఏళ్లు. నిజామాబాద్. 2019లో మేరీ కోమ్‌తో తలపడి ఓడిపోయింది. ముందు అనుకున్న విధంగా ఒలింపిక్స్ జరిగి ఉంటే.. జరీన్ మీద గెలిచిన మేరీ కోమ్ టోక్యోకి వెళ్లి ఉండేవారు. కోమ్‌కి, జరీన్‌కి అప్పట్లో జరిగిన పోటీ 51 కేజీల బౌట్. ఆరుసార్లు వరల్డ్ ఛాంపియన్ అయిన కోమ్.. జరీన్‌ని తేలిగ్గా పడగొట్టేశారు. అసలు వాళ్ల మధ్య ఆ పోటీ జరగాల్సిందే కాదు. అప్పటికే ట్రయల్స్ ఏమీ లేకుండానే ఒలింపిక్స్‌కి మేరీ కోమ్ సెలక్ట్ అయి ఉన్నారు. జరీన్ వచ్చి ‘అలా ఎలా చేస్తారు? ట్రయల్ జరగాల్సిందే. అవకాశం న్యాయంగా రావాలి. సీనియర్ అని రాకూడదు’ అని వాదించింది. అధికారులకు తప్పలేదు. ఇద్దరికీ మ్యాచ్ పెట్టారు. జరీన్ 1–9 తో ఓడిపోయింది. రింగులోనే కోమ్‌కి షేక్‌హ్యాండ్ ఇవ్వబోయింది. హగ్ కూడా చేసుకోబోయింది. ‘హు..’ అని కోమ్ ఆమెను పట్టించుకోకుండా రింగ్ దిగి వెళ్లిపోయారు. అప్పట్నుంచీ వీళ్లిద్దరికీ పడటం లేదని అంటారు. మళ్లీ ఇప్పుడెవరో అదే విషయం జరీన్‌ని అడిగారు. ‘పడకపోవడం అంత పెద్దదాన్ని కాదు. ఆమె నా ఆరాధ్య బాక్సర్. ఒలింపిక్స్‌లో కోమ్ పతకం సాధించాలని ఆశిస్తున్నా’ అంది జరీన్. ఇప్పుడు జరీన్ 2022 లో జరిగే కామన్ వెల్త్, ఏషియన్ గేమ్స్ కోసం ప్రాక్టీస్ చేస్తోంది. ఢిల్లీలో కోమ్‌కి, జరీన్‌కి జరిగిన ఆ ఒలింపిక్ క్వాలిఫయర్స్ ట్రయల్ బౌట్ లో.. జరీన్‌కు షేక్‌హ్యాండ్, హగ్ నిరాకరించడంపై కోమ్, ‘ఇలాంటి స్వభావం ఉన్నవారు నాకు నచ్చరు‘ అన్నారు. ‘కానీ సెలక్షన్ న్యాయంగానే జరగాలి. అందుకే నేను పోటీ కోసం పట్టుపట్టాను‘ అని జరీన్. జరీన్ కరెక్ట్ అనిపిస్తోంది. అయితే కోమ్ కూడా డైరెక్ట్ ఎంట్రీకి పట్టుపట్టలేదు. బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా తీసుకున్న నిర్ణయం అది. కోమ్ని ట్రయల్స్ లేకుండానే సెలెక్ట్ చేయాలని. -
క్వార్టర్స్‌లో నిఖత్ జరీన్
సోఫియా (బల్గేరియా): స్ట్రాండ్జా స్మారక అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్లో భారత మహిళా బాక్సర్ నిఖత్ జరీన్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాకు చెందిన నిఖత్ బుధవారం జరిగిన 51 కేజీల విభాగంలో సెవ్దా అసెనోవ (బల్గేరియా)పై విజయం సాధించింది. బౌట్ తొలి రౌండ్లోనే అసెనోవా వైదొలగడంతో నిఖత్ గెలుపు ఖాయమైంది. పురుషుల తొలి రౌండ్ బౌట్లో తెలంగాణ బాక్సర్ మొహమ్మద్ హుస్సాముద్దీన్ (57 కేజీలు) 4–1తో ఎంజో గ్రౌ (ఫ్రాన్స్)పై గెలుపొందారు. పురుషుల 63 కేజీల రెండో రౌండ్ బౌట్లో శివ థాపా 5–0తో పావెల్ పొలాకోవిచ్ (పోలాండ్)పై గెలిచి క్వార్టర్ ఫైనల్ చేరాడు. -
నేను హత్తుకోవాలనుకున్నా...
న్యూఢిల్లీ: భారత దిగ్గజ బాక్సర్ మేరీకోమ్ టోక్యో ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ టోర్నీకి అర్హత పొందిన సంగతి తెలిసిందే. శనివారం జరిగిన మహిళల 51 కేజీల ట్రయల్ ఫైనల్ బౌట్లో ఆమె 9–1 పాయింట్ల తేడాతో తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్‌ను ఓడించింది. దీంతో ఈ కేటగిరీలో ఒలింపిక్ క్వాలిఫయర్స్‌లో మేరీ పోటీపడనుంది. కాగా, బౌట్ ముగిసిన తర్వాత మేరీకోమ్ ప్రవర్తించిన తీరు ఆశ్చర్య పరిచింది. కనీసం నిఖత్‌తో షేక్ హ్యాండ్ ఇవ్వడానికి కూడా ఇష్టపడలేదు. తనకు నిఖత్ తీరు నచ్చకే షేక్ హ్యాండ్ ఇవ్వలేదని మేరీకోమ్ తెలిపింది. నిఖత్ తీరు నాకు నచ్చలేదు... ‘ఔను... పోరు ముగిశాక చేయి కలపలేదు. మరి ఆమె ఏం చేసిందో మీకు తెలియదా? బయటికి మాత్రం మేరీ నా అభిమాన, ఆరాధ్య బాక్సర్ అని... మార్గదర్శి అని చెప్పుకునే ఆమెకు ఎవరితో ఎలా ప్రవర్తించాలో తెలియదా? ఇతరుల నుంచి గౌరవ మర్యాదలు పొందాలనుకుంటున్న నిఖత్‌కు ఎదుటి వారికి కూడా కనీస గౌరవం ఇవ్వాలన్న ఇంగితం లేదా? నన్ను నేరుగా క్వాలిఫయర్స్‌కు పంపాలని భారత బాక్సింగ్ సమాఖ్య నిర్ణయం తీసుకుంది. నన్నే పంపించాలని నేనేమీ వారిని కోరలేదు. ఈ అంశంపై ఏదైనా ఉంటే బాక్సింగ్ రింగ్‌లో తేల్చుకోవాలి. కానీ ఆమె ఏం చేసింది... మీడియాలో రచ్చ రచ్చ చేసింది. కేంద్ర క్రీడల మంత్రికి లేఖ రాసి నానాయాగీ చేసింది. ఆటగాళ్లు రింగ్‌లో తలపడాలి. బయట కాదు..! అలాంటి ప్రత్యర్థి తీరు నాకు నచ్చలేదు. అందుకే షేక్‌హ్యాండ్ ఇవ్వలేదు’ అని మేరీకోమ్ పేర్కొంది. నేను హత్తుకోవాలనుకున్నా... ‘నా శక్తిమేర రాణించాను. ఈ ప్రదర్శన పట్ల సంతోషంగానే ఉన్నా. కానీ బౌట్ ముగిశాక మేరీకోమ్ ప్రవర్తన ఏమాత్రం బాగోలేదు. ఓ సీనియర్ బాక్సింగ్ దిగ్గజం నా ప్రదర్శనకు మెచ్చి హత్తుకుంటుందనుకుంటే కనీసం చేయి కూడా కలపలేదు. ఇది నన్ను తీవ్రంగా బాధించినా... దీనిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయబోను. ఈ ఒక్క ట్రయల్‌తో నా ‘టోక్యో’ దారి మూసుకుపోలేదు. ఆమె ఒక వేళ ఫిబ్రవరిలో జరిగే ఒలింపిక్ క్వాలిఫయర్స్‌లో విఫలమైతే... ప్రపంచ క్వాలిఫయర్స్ కోసం మే నెలలో జరిగే ట్రయల్స్ ద్వారా మరో అవకాశముంటుంది. అప్పుడు మరింత శ్రమించి బరిలోకి దిగుతాను. –నిఖత్ జరీన్ -
మేరీనే క్వాలిఫయర్స్‌కు...
-
వీడియో వైరల్: బౌట్ తర్వాత మేరీకోమ్ ఇలా..
-
బౌట్ తర్వాత మేరీకోమ్ ఇలా.. వీడియో వైరల్
న్యూఢిల్లీ: తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్‌పై ఘన విజయం సాధించి వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగబోయే ఒలింపిక్స్ క్వాలిఫయర్స్‌కు అర్హత సాధించిన మేరీకోమ్.. బౌట్ తర్వాత అసహనాన్ని ప్రదర్శించింది. భారత బాక్సింగ్‌లో తనదైన ముద్ర వేసిన మేరీకోమ్.. నిఖత్ జరీన్‌తో బౌట్ తర్వాత క్రీడా స్ఫూర్తిని మాత్రం మరిచింది. ఆ బౌట్లో గెలిచిన మేరీకోమ్‌కు షేక్‌హ్యాండ్ ఇవ్వడానికి జరీన్ చేయి చాపగా దాన్ని తిరస్కరించింది. నిఖత్ జరీన్ చేతిని విదిల్చుకుని మరీ వెళ్లిపోయింది. గతంలో ఈ బౌట్ కోసం జరిగిన రాద్దాంతాన్ని మనసులో పెట్టుకున్న మేరీకోమ్ హుందాగా వ్యవహరించడాన్ని మరచిపోయింది. దీనిపై బౌట్ తర్వాత వివరణ కోరగా తాను ఎందుకు షేక్ హ్యాండ్ ఇవ్వాలంటూ మీడియాను ఎదురు ప్రశ్నించింది మేరీకోమ్. ‘ ఆమెకు నేను ఎందుకు షేక్ హ్యాండ్ ఇవ్వాలి. మిగతా వాళ్ల నుంచి ఆమె గౌరవం కోరితే తొలుత గౌరవం ఇవ్వడం నేర్చుకోవాలి. ఆ తరహా మనుషుల్ని ఇష్టపడను. నేను కేవలం రింగ్‌లో మాత్రమే ఆమెతో అమీతుమీ తేల్చుకోవాలి. అంతేకానీ బయట కాదు కదా’ అంటూ మేరీకోమ్ వ్యాఖ్యానించింది.(ఇక్కడ చదవండి: ట్రయల్స్‌లో జరీన్‌పై మేరీకోమ్‌దే పైచేయి) ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ ట్రయల్స్‌లో భాగంగా 51 కేజీల విభాగంలో ఈరోజు(శనివారం) జరిగిన పోరులో మేరీకోమ్ 9-1 తేడాతో నిఖత్ జరీన్‌పై గెలుపొందారు. ఫలితంగా మేరీకోమ్ ఫిబ్రవరిలో జరుగనున్న ఒలింపిక్స్ క్వాలిఫయర్స్‌కు నేరుగా అర్హత సాధించారు. 51 కేజీలో విభాగంలో ఒలింపిక్ క్వాలిఫయర్స్‌కు భారత్‌నుంచి బాక్సర్‌ను పంపే విషయంలో వివాదం రేగడంతో మేరీకోమ్, నిఖత్ మధ్య పోటీ అనివార్యమైంది. మేరీకోమ్ ఇప్పటికే సాధించిన ఘనతలను బట్టి ఆమెనే పంపిస్తామని బాక్సింగ్ సమాఖ్య అధ్యక్షుడు అజయ్ సింగ్ వ్యాఖ్యానించడంతో వివాదం మొదలైంది. మేరీకోమ్ కోసం నిబంధనలు కూడా మార్చే ప్రయత్నం చేశారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన నిఖత్ తనకు న్యాయం చేయాలంటూ, ట్రయల్స్‌లో తన సత్తా నిరూపించుకునేందుకు అవకాశం ఇవ్వాలని కేంద్ర క్రీడా మంత్రికి లేఖ రాయడంతో సమస్య తెరపైకి వచ్చింది. ఒక దశలో ఎంతో సీనియర్ అయిన మేరీకోమ్ కూడా అసహనంతో నిఖత్‌పై పలు అభ్యంతరకర వ్యాఖ్యలు చేసింది. ఇప్పుడు మళ్లీ గెలిచిన తర్వాత కూడా నిఖత్ ట్రయల్స్ పెట్టాలనే నిర్ణయాన్ని మేరీకోమ్ ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతోంది. ఆరుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన మేరీకోమ్‌కు సాటి బాక్సర్ పట్ల ఎలా వ్యవహరించాలో నేర్పించాలని కామెంట్లు వస్తున్నాయి. Mary Kom defeated Nikhat Zareen to book her spot in the Olympic qualifiers. She doesn't shake Zareen's hand after the fight 😬😬pic.twitter.com/BiVAw9PCSd — MMA India (@MMAIndiaShow) December 28, 2019 -
ట్రయల్స్‌లో జరీన్‌పై మేరీకోమ్‌దే పైచేయి
న్యూఢిల్లీ: ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ ట్రయల్స్‌లో భాగంగా తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్‌తో జరిగిన పోరులో ఆరు సార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన మేరీకోమ్ ఘన విజయం సాధించారు. 51 కేజీల విభాగంలో ఈరోజు(శనివారం) ఇందిరా గాంధీ స్టేడియంలో జరిగిన పోరులో మేరీకోమ్ 9-1 తేడాతో నిఖత్ జరీన్‌పై గెలుపొందారు. ఫలితంగా మేరీకోమ్ ఫిబ్రవరిలో జరుగనున్న ఒలింపిక్స్ క్వాలిఫయర్స్‌కు నేరుగా అర్హత సాధించారు. ఏకపక్షంగా సాగిన పోరులో మేరీకోమ్ పూర్తి ఆధిపత్యం కనబరిచారు. తనకంటే వయసులో ఎంతో చిన్నదైన నిఖత్‌కు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా విజయాన్ని సొంతం చేసుకున్నారు. 51 కేజీలో విభాగంలో ఒలింపిక్ క్వాలిఫయర్స్‌కు భారత్‌నుంచి బాక్సర్‌ను పంపే విషయంలో వివాదం రేగడంతో మేరీకోమ్, నిఖత్ మధ్య పోటీ అనివార్యమైంది. మేరీకోమ్ ఇప్పటికే సాధించిన ఘనతలను బట్టి ఆమెనే పంపిస్తామని బాక్సింగ్ సమాఖ్య అధ్యక్షుడు అజయ్ సింగ్ వ్యాఖ్యానించడంతో వివాదం మొదలైంది. మేరీకోమ్ కోసం నిబంధనలు కూడా మార్చే ప్రయత్నం చేశారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన నిఖత్ తనకు న్యాయం చేయాలంటూ, ట్రయల్స్‌లో తన సత్తా నిరూపించుకునేందుకు అవకాశం ఇవ్వాలని కేంద్ర క్రీడా మంత్రికి లేఖ రాయడంతో సమస్య తెరపైకి వచ్చింది.ఈ క్రమంలోనే శుక్రవారం జరిగిన తమ తొలి రౌండ్ మ్యాచ్‌లలో విజయాలు సాధించి వీరిద్దరు తుది పోరుకు సన్నద్ధమయ్యారు. నిఖత్ 10–0తో ప్రస్తుత జాతీయ చాంపియన్ జ్యోతి గులియాను, మేరీకోమ్ 10–0తో రితు గ్రేవాల్‌ను ఓడించారు. కాగా, ట్రయల్స్‌లో మాత్రం మేరీకోమ్‌దే పైచేయి అయ్యింది. -
మేరీకోమ్ X నిఖత్
న్యూఢిల్లీ: తెలంగాణ యువ బాక్సర్ నిఖత్ జరీన్ పట్టుదల నెగ్గింది. భారత దిగ్గజం మేరీకోమ్‌తో ఒలింపిక్స్ సెలక్షన్ ట్రయల్స్ పోరు నిర్వహించాలనే ఆమె మొరను కేంద్ర క్రీడాశాఖ, భారత బాక్సింగ్ సమాఖ్య (బీఎఫ్ఐ) ఆలకించాయి. ఇద్దరి మధ్య ట్రయల్ బౌట్ పెట్టాలని బీఎఫ్ఐని క్రీడాశాఖ ఆదేశించింది. దీంతో బీఎఫ్ఐ డిసెంబర్ 29, 30 తేదీల్లో మహిళా బాక్సర్లందరికీ సెలక్షన్ బౌట్లను నిర్వహించేందుకు సిద్ధమైంది. ఇటీవల బీఎఫ్ఐ ఆరుసార్లు ప్రపంచ చాంపియన్ అయిన మేరీకోమ్‌కి అనుకూలంగా వ్యవహరించింది. ట్రయల్స్ లేకుండానే 51 కేజీల కేటగిరీలో మేరీకోమ్‌ని ఒలింపిక్స్ క్వాలియఫర్స్కు ఎంపిక చేసింది. ఇది వివాదం రేపింది. తన ఒలింపిక్స్ అవకాశాల్ని ఇలా తుంచేయడాన్ని సహించలేకపోయిన నిఖత్ ఏకంగా కేంద్ర క్రీడాశాఖ మంత్రికి లేఖ రాసింది. ఒలింపిక్స్ సెలక్షన్ ట్రయల్స్ నిర్వహించాలని అందులో కోరింది. దీనిపై ఎట్టకేలకు స్పందించిన క్రీడాశాఖ ట్రయల్స్ నిర్వహించాల్సిందేనని స్పష్టం చేసింది. దీంతో డిసెంబర్ 29, 30 తేదీల్లో మహిళా బాక్సర్లకు ట్రయల్స్ పోటీలు జరుగనున్నాయి. 51 కేజీల కేటగిరీలో మేరీకోమ్, నిఖత్ల మధ్య నిర్వహించే ట్రయల్స్ బౌట్లో నెగ్గిన బాక్సర్... ఒలింపిక్స్ క్వాలిఫయర్స్‌కు అర్హత సంపాదిస్తుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో చైనాలో ఈ క్వాలిఫయర్స్ పోటీలు జరుగుతాయి. 51 కేజీల విభాగంతోపాటు 57, 60, 69, 75 కేజీల విభాగాల్లో కూడా సెలెక్షన్ ట్రయల్స్ బౌట్లు ఉంటాయి. ఆ ఇద్దరికి మినహాయింపు... ఇక పురుషుల విభాగంలో ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రజతం నెగ్గిన అమిత్ పంఘాల్ (52 కేజీలు), కాంస్యం సాధించిన మనీశ్ కౌశిక్ (63 కేజీలు)లకు ఎలాంటి ట్రయల్స్ లేకుండానే నేరుగా జట్టులోకి ఎంపిక చేయనున్నారు. మిగతా ఆరు కేటగిరీల్లో (57, 69, 75, 81, 91, ప్లస్ 91 కేజీలు) మాత్రం డిసెంబర్ 27, 28 తేదీల్లో ట్రయల్స్ ఉంటాయి. -
మేరీకోమ్-నిఖత్ జరీన్ల ‘మెగా’ ఫైట్!
న్యూఢిల్లీ: గత కొంతకాలంగా నువ్వెంత అంటే నువ్వెంత అనేంతగా భారత మహిళా స్టార్ బాక్సర్లు మేరీకోమ్-నిఖత్ జరీన్ల మధ్య మాటల యుద్ధం నడుస్తూ ఉంది. వచ్చే ఏడాది టోక్యో వేదికగా జరుగనున్న ఒలింపిక్స్‌లో భాగంగా చైనాలో జరిగే క్వాలిఫయింగ్ ఈవెంట్‌కు 51 కేజీల కేటగిరీలో మేరీకోమ్‌ను పంపడానికి బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(బీఎఫ్ఐ) నిర్ణయించగా, దాన్ని మరో స్టార్ బాక్సర్, తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్ తీవ్రంగా వ్యతిరేకించింది. తాను కూడా 51 కేజీల విభాగంలో ఉండటంతో తమ మధ్య ఒలింపిక్స్ సెలక్షన్ ట్రయల్ నిర్వహించాలంటూ కోరుతూ వస్తోంది. ఈ క్రమంలోనే జరీన్‌పై మేరీకోమ్ తీవ్రంగా ధ్వజమెత్తడం, దానికి నిఖత్ కూడా అదే స్థాయిలో సమాధానం ఇవ్వడం జరుగుతూ వస్తున్నాయి. అయితే ఈ వివాదాన్ని పెద్దది చేయడం ఇష్టం లేని బీఎఫ్ఐ.. వారి మధ్య సెలక్షన్ ట్రయల్ నిర్వహించడానికి సిద్ధమవుతోంది. ఆరుసార్లు వరల్డ్ చాంపియన్ మేరీకోమ్‌తో యువ స్టార్ బాక్సర్ జరీన్‌తో పోరు నిర్వహించాలనే యోచనలో ఉంది. దీనిపై అధికారిక ప్రకటన రాకపోయినా, విశ్వసనీయ సమాచారం ప్రకారం డిసెంబర్ చివరి వారంలో వీరిద్దరికీ మధ్య ఫైట్ నిర్వహించడానికి యత్నిస్తోంది. డిసెంబర్ 2వ తేదీ నుంచి 21వ తేదీ వరకూ ఆలిండియా బాక్సింగ్ లీగ్(ఐబీఎల్) జరుగనున్న తరుణంలో ఆ తర్వాత మేరీకోమ్-జరీన్లకు మెగా ఫైట్ ట్రయల్స్ ఏర్పాటు చేసేంందుకు దాదాపు రంగం సిద్ధమైంది. దిగ్గజ మహిళా బాక్సర్ మేరీకోమ్‌తో ట్రయల్స్ నిర్వహించిన తర్వాత ఒలింపిక్స్ క్వాలిఫయింగ్‌కు ఎంపిక చేయాలని తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ కొన్ని రోజులుగా డిమాండ్ చేస్తున్నారు. ఎటువంటి పోటీ లేకుండా మేరీకోమ్‌ను నేరుగా క్వాలిఫయింగ్ టోర్నీకి పంపడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలోనే క్రీడాశాఖా మంత్రి కిరణ్ రిజ్జుకు సైతం నిఖత్ లేఖ కూడా రాశారు. దీనిపై తానేమీ చేయలేనని, ఇది బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(బీఎఫ్ఐ) తీసుకున్న నిర్ణయం కావడంతో దానికి కట్టుబడి ఉండాల్సిందేనన్నారు. ఈ క్రమంలోనే వారి మధ్య వివాదం మరింత రాజుకుంది. నిఖత్ జరీన్‌కు భారత విఖ్యత షూటర్ అభినవ్ బింద్రా మద్దతుగా నిలవడం కూడా మేరీకోమ్‌కు ఆగ్రహం తెప్పించింది. ‘నాకు మేరీకోమ్‌తో పోటీ ఏంటి. అభివన్ నువ్వు బాక్సింగ్ విషయంలో తలదూర్చుకు. ఇది షూటింగ్ కాదు. నీ షూటింగ్ పని నువ్వు చూసుకో’ అంటూ మేరీకోమ్ విరుచుకుపడింది. కాగా, దీనిపై బీఎఫ్ఐ కాస్త మెట్టుదిగినట్లే కనబడుతుండటంతో మేరీకోమ్-జరీన్ల మధ్య పోటీ దాదాపు ఖాయమేనని అనిపిస్తోంది. ఒకవేళ ఈ సెలక్షన్ ట్రయల్స్ జరిగితే అందులో గెలిచిన బాక్సర్ ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ ఈవెంట్‌కు అర్హత సాధిస్తారు. -
బీఎఫ్ఐ ఆదేశిస్తే... నిఖత్‌తో బౌట్‌కు సిద్ధమే
న్యూఢిల్లీ: ‘నిఖత్ జరీన్‌తో తలపడేందుకు నాకెలాంటి భయం లేదు’ అని భారత దిగ్గజ బాక్సర్ మేరీకోమ్ ప్రకటించింది. ‘భారత బాక్సింగ్ సమాఖ్య (బీఎఫ్ఐ) ఆదేశిస్తే... ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీ కోసం నిర్వహించే సెలక్షన్ ట్రయల్స్ బౌట్లో నిఖత్‌ను ఓడించి లాంఛనం పూర్తి చేస్తాను’ అని రికార్డుస్థాయిలో ఎనిమిదిసార్లు ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పతకాలు సాధించిన ఈ మణిపూర్ బాక్సర్ స్పష్టం చేసింది. శనివారం ఓ సన్మాన కార్యక్ర మంలో పాల్గొనేందుకు వచ్చిన మేరీకోమ్ తాజా వివాదంపై స్పందించింది. ‘బీఎఫ్ఐ తీసుకున్న నిర్ణయాన్ని, నిబంధనలను నేను మార్చలేను. పోటీపడటమే నాకు తెలుసు. బీఎఫ్ఐ తీసుకున్న నిర్ణయాన్ని శిరసావహిస్తాను. వారు నిఖత్‌తో ట్రయల్స్ బౌట్లో తలపడాలని ఆదేశిస్తే తప్పకుండా పోటీపడతాను’ అని 36 ఏళ్ల మేరీకోమ్ తెలిపింది. -
సత్తా చాటుతున్న మన బా'క్సింగ్'లు
సాక్షి, నిజామాబాద్ : పంచ్ పడిందంటే పతకం రావాల్సిందే.. రింగ్‌లోకి దిగారంటే ప్రత్యర్థులు మట్టికరవాల్సిందే.. బాక్సింగ్‌లో అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతూ మువ్వన్నెల పతకాన్ని రెపరెపలాడిస్తున్నారు. జిల్లాకే కాకుండా రాష్ట్రానికి.. దేశానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెడుతున్నారు మన ఇందూరు బిడ్డలు..వారే నిఖత్ జరీన్, హుసా ముద్దీన్లు. దశాబ్ద కాలంగా రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో పతకాలు సాధించారు. శనివారం థాయ్‌లాండ్ ఓపెన్ బాక్సింగ్ టోర్నీలో ఇద్దరూ రజతాలు సాధించి మరోసారి దేశ కీర్తి పతాకను ఎగురవేశారు. పేదరికాన్ని జయించి.. పట్టుదల.. కృషి.. సాధించాలన్న తపన.. ఉంటే ఎంతటి పేదరికాన్ని అయినా జయించవచ్చు.. నిరంతరం సాధన చేస్తూ.. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ బాక్సింగ్‌లో దూసుకుపోతోంది నగరంలోని వినా యక్నగర్కు చెందిన నిఖత్ జరీన్. ఇప్పటికే 6 బంగారు పతకాలు సాధించింది. అలాగే రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరెన్నో పతకాలు సొంతం చేసుకుంది. ప్రస్తుతం థాయ్‌లాండ్‌లో జరిగిన అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నీలో రజత పతకం సాధించింది. కుటుంబ నేపథ్యం.. పేద కుటుంబంలో పుట్టి నలుగురు అమ్మాయిల్లో ఒకరిగా పెరిగిన నిఖత్జరీనా ఈ స్థాయికి రావడం వెనక ఎంతో కృషి ఉంది. నిజామాబాద్ నగరంలోని వినాయక్‌నగర్ కాలనీకి చెందిన ఎండీ జమీల్ అహ్మద్, ఫర్వీన్ సుల్తానాలకు నలుగురు కూతుళ్లు, నిఖత్ జరీన్ 3వ సంతానం. తండ్రి జమీల్ బతుకుదెరువు కోసం గతంలో సౌదీ అరేబియాలోని స్పోర్ట్స్ దుకాణంలో పనిచేశాడు. ఫుట్‌బాల్ క్రీడాకారుడైన జమీల్ తిరిగి వచ్చాక తన మూడో కూతురు నిఖత్జరీనాకు ఆటలపై ఉన్న ఆసక్తిని గమనించి బాక్సింగ్‌లో ప్రోత్సహించాడు. కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగాలేనప్పటికీ అనేక కష్టనష్టాలకు ఓర్చి కూతురుకు బాక్సింగ్‌లో శిక్షణను ఇప్పించాడు. బాక్సింగ్ కోచ్ శంషోద్దీన్ సూచనలతో నిఖత్‌ను బాక్సింగ్ రింగ్‌లోకి దింపారు. ప్రతిరోజూ నాలుగు గంటల పాటు కఠోర శిక్షణ అందించారు. గతంలో అమ్మాయిలు బాక్సింగ్‌పై ఆసక్తి చూపకపోవడంతో నిఖత్ అబ్బాయిలతో పాటు సాధన సాగించేది. నిఖత్ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన తర్వాత ప్రస్తుతం ఆమెను ఆదర్శంగా తీసుకొని బాలికలు బాక్సింగ్ ఆటపై ఆసక్తికనబరుస్తున్నారు. విద్యాభ్యాసం.. నిర్మల హృదయ బాలికల పాఠశాలలో చదివిన నిఖత్ ఇంటర్లో కాకతీయ, డిగ్రీ దోమలగూడ ఏవీ కాలేజ్ చదువుకుంది. గవర్నమెంట్ గిరిరాజ్ కాలేజీలో ఎంఏ సైకాలజీ మొదటి సంవత్సరం చదువుతోంది. బాక్సింగ్ మొదలు పెట్టిన మూడు నెలల్లోనే రాష్ట్ర స్థాయి పైకా క్రీడల్లో బంగారు పతకం సాధించింది. తక్కువ కాలంలోనే అంతర్జాతీయ స్థాయిలో రాణించి అందరి ప్రశంసలు అందుకుంది. అంతర్జాతీయ స్థాయిలో పతకం సాధించిన నిఖత్ జిల్లా క్రీడాభిమానులే కాక రాష్ట్ర, జాతీయ స్థాయిలో అభినందనలు అందుకుంటోంది. రానున్న రోజుల్లో మరిన్ని విజయాలు సాధిస్తానని నిఖత్ జరీన్ ధీమాగా చెబుతోంది. సాధించిన విజయాలు 2012లో జనవరిలో సెర్బియా దేశంలో జరిగిన ఇంటర్నేషనల్ బాక్సింగ్‌లో సిల్వర్ మెడల్ సాధించింది. 2013 సెప్టెంబరులో జరిగిన యూత్ వరల్డ్ బాక్సింగ్‌లో వెండి పతకం సాధించింది. 2014 సెర్బియాలో జరిగిన ఇంటర్నేషనల్ ఉమెన్స్ బాక్సింగ్ టోర్నీ అండర్–19లో గోల్డ్‌మెడల్ సాధించింది. జూలైలో జరిగిన సువోటికా ఇంటర్నేషనల్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో మరో బంగారు పతకం తన ఖాతాలో వేసుకుంది. 2015 పంజాబ్ జలంధర్‌లో జరిగిన ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో గోల్డ్ మెడల్ సాధించింది. దీంతో పాటు బెస్ట్ బాక్సర్ అవార్డును సొంతం చేసుకుంది. 2015లో గోవాలో జరిగిన ఇండో– శ్రీలంక టోర్నమెంట్లో బంగారు పతకం సాధించింది. అసోంలో జరిగిన సీనియర్ జాతీయ స్థాయి చాంపియన్‌షిప్‌లో గోల్డ్‌మెడల్ సాధించింది. 2016లో సాప్ నిర్వహించిన పోటీల్లో బ్రాంజ్ మెడల్ సొంతం చేసుకుంది. 13 ఏఐబీఏ ఉమెన్స్ వరల్డ్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. 2016లో ఎలైట్ సీనియర్స్ ఉమెన్స్ చాంపియన్‌షిప్‌లో బ్రాంజ్ మెడల్ సొంతం చేసుకుంది. 2018 జనవరిలో జరిగిన ఎలైట్ సీనియర్ నేషనల్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో బ్రాంజ్ మెడల్ సాధించింది. జనవరి 2018 ఇండియన్ ఓపెన్ బాక్సింగ్‌లో పాల్గొంది. 2018లో ఏప్రిల్ జరిగిన బెల్గ్రేడ్ బాక్సింగ్ టోర్నమెంట్లో గోల్డ్ మెడల్ సాధించింది. జనవరి 2019లో జరిగిన ఎలైట్ సీనియర్స్ బాక్సింగ్ పోటీల్లో సిల్వర్ మెడల్ దక్కించుకుంది. ఫిబ్రవరి 2019లో జరిగిన బల్గేరియా అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నీలో 51కేజీల విభాగంలో బంగారు పతకం సొంతం చేసుకుంది. 2019 ఏప్రిల్‌లో జరిగిన బ్యాంకాక్‌లో జరిగిన అంతర్జాతీయ ఏషియన్ బాక్సింగ్ టోర్నీలో కాంస్య పతకం సాధించింది. 2019 మేలో జరిగిన అసోంలోని గౌహతిలో జరిగిన అంతర్జాతీయ ఓపెన్ బాక్సింగ్ టోర్నీలో కాంస్య పతకం సాధించింది. ప్రస్తుతం ఈ నెలలో జరుగుతున్న థాయ్‌లాండ్ అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నీలో ఫైనల్‌కు చేరింది. బంగారు పతకం సాధించడానికి కృషి చేస్తోంది. చిన్నప్పటి నుంచే.. నిజామాబాద్‌స్పోర్ట్స్: తనే తండ్రి తనకు గురువు.. ఆడుతూ పాడుతూ తిరిగే వయస్సులోనే చేతులకు బాక్సింగ్ గ్లౌజులు వేసుకున్నాడు.. చిన్ననాటి నుంచే బాక్సింగ్‌లో శిక్షణ తీసుకున్నాడు.. 5వ తరగతి నుంచే ప్రతినిత్యం బాక్సింగ్‌లో మెలకువలు నేర్చుకున్నాడు.. తండ్రి, అన్నయ్యలు సైతం బాక్సింగ్‌లో రాణించడంతో తన మనస్సులో మరింత బలంగా బాక్సింగ్‌లో రాణించాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నాడు.. పాఠశాల స్థాయి నుంచే కాంస్య, రజత, బంగారు పతకాలు సాధించాడు నగరానికి చెందిన ఎండీ హుస్సాముద్దీన్. ఆర్మీలో చేరి క్రీడల్లో రాణిస్తూ దేశానికి, రాష్ట్రానికి, ఇందూర్ జిల్లాకు పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెడుతున్నాడు. కుటుంబ నేపథ్యం.. బాక్సింగ్ కోచ్ శంషొద్దీన్, తల్లి షైనాబేగంలకు ఆరుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. ఇందులో 5వ వాడు హుస్సాముద్దీన్, తండ్రితో పాటు ముగ్గురు కుమారులు బాక్సింగ్‌లో పతకాలు సాధించారు. హుస్సాముద్దీన్ నగరంలోని గోల్డెన్‌జూబ్లీ స్కూల్లో 10వ తరగతి వరకు చదివాడు. ఇంటర్, డిగ్రీ హైదరాబాద్‌లో చదివాడు. 5వ తరగతి నుంచే బాక్సింగ్‌లో తండ్రి, అన్నయ్యల వద్ద బాక్సింగ్‌లో శిక్షణ తీసుకున్నాడు. చిన్నప్పటి నుంచే బాక్సింగ్‌లో కఠోరంగా శ్రమించడంతో పాఠశాల స్థాయి నుంచే రాష్ట్ర, జాతీయస్థాయిలో పతకాలు సాధించాడు. 16ఏళ్ల వయస్సులోనే ప్రతిభతో ఆర్మీకి ఎంపికయ్యాడు. అయితే వయస్సు తక్కువగా ఉండడంతో రెండేళ్ల వరకు ఆర్మీ నుంచే చదువుకోవడానికి స్కాలర్షిప్లు వచ్చాయి. తదనంతరం ఆర్మీలో చేరారు. అప్పటి నుంచి దేశం తరపున అంతర్జాతీయ స్థాయి బాక్సింగ్ టోర్నీలో రాణిస్తూ పతకాలు సాధిస్తున్నాడు. రాష్ట్రస్థాయిలో.. 2008 సంవత్సరంలో ఎస్జీఎఫ్ వరంగల్‌లో జరిగిన బాక్సింగ్ టోర్నీలో బంగారు పతకం సాధించాడు. 2011యూత్ బాక్సింగ్యూత్ బాక్సింగ్‌చాంపియన్‌షిప్‌లో బంగారు పతకం గెలుపొందాడు. 2012 జూనియర్ బాక్సింగ్షిప్ నల్గొండలో జరుగగా బంగారు పతకం సొంతం చేసుకున్నాడు. 2017 ఎలైట్ బాక్సింగ్ చాంపియన్‌షిప్ హైదరాబాద్‌లో జరుగగా బంగారు పతకం సాధించాడు. ఇంటర్ సర్వీస్ లెవల్.. 2014 ఇంటర్ సర్వీసెస్ బాక్సింగ్ చాంపియన్‌షిప్ షిమ్లాలో జరగగా రజత పతకం సాధించాడు. 2016లో ఇంటర్ సర్వీసెస్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో పూణెలో బంగారు పతకం, అలాగే బెంగుళూరులో జరిగిన బాక్సింగ్ చాంపియన్సిప్లో బంగారు పతకం సొంతం చేసుకున్నాడు. 2017లో షిమ్లాలో జరిగిన బాక్సింగ్‌చాంపియన్‌షిప్‌లో రజత పతకం సాధించాడు. జాతీయస్థాయిలో.. 2007, 2008 సంవత్సరాల్లో జాతీయస్థాయి బాక్సింగ్‌లో పాల్గొన్నాడు. 2009లో జూనియర్ బాక్సింగ్ చాంపియన్‌షిప్ మహారాష్ట్రలో జరగగా కాంస్య పతకం సాధించాడు. 2010 పైకా జాతీయస్థాయి టోర్నీ పంజాబ్‌లో జరగగా అందులో రజత పతకం సొంతం చేసుకున్నాడు. 2011లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన యూత్ జాతీయస్థాయి బాక్సింగ్‌లో రజత పతకం సాధించాడు. 2012 యూత్ జాతీయస్థాయి చాంపియన్‌షిప్ పటియాలలో జరగగా రజత పతకం సాధించాడు. ఎలైట్ జాతీయస్థాయి బాక్సింగ్చాంపియన్షీప్ అస్సాంలోని గౌహతిలో జరగగా బంగారం పతకం గెలుపొందాడు. అంతర్జాతీయస్థాయిలో.. 2011 క్యూబా, 2012 ఫిన్లాండ్, 2014 చైనా తదితర దేశాలో జరిగిన అంతర్జాతీయస్థాయి బాక్సింగ్‌లో పాల్గొన్నాడు. 2015లో కొరియాలో జరిగిన అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నీలో కాంస్య పతకం సాధించాడు. 2016లో అసోంలోని గౌహతిలో జరిగిన అంతర్జాతీయస్థాయి బాక్సింగ్‌లో బంగారు పతకం గెలిచాడు. 2017లో బల్గేరియాలో జరిగిన అంతర్జాతీయస్థాయి బాక్సింగ్‌లో రజత పతకం సాధించాడు. ఇదే ఏడాది మంగోలియాలో జరిగిన అంతర్జాతీయస్థాయి టోర్నీలో కాంస్య పతకం సొంతం చేసుకున్నాడు. 2018లో ఢిల్లీలో జరిగిన అంతర్జాతీయస్థాయి బాక్సింగ్‌లో కాంస్య పతకం సాధించాడు. ఇదే సంవత్సరం సోఫియా, ఆస్ట్రేలియాలో జరిగిన టోర్నీలో వరుసగా కాంస్య పతకాలు సాధించాడు. తాజాగా జరిగిన థాయ్‌లాండ్ బాక్సింగ్ టోర్నీలో రజత పతకం సొంత చేసుకున్నాడు. -
నిఖత్, హుసాముద్దీన్‌లకు రజతాలు
బ్యాంకాక్: ఈ ఏడాది మరో అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్లో భారత బాక్సర్లు పతకాల పంట పండించారు. శనివారం ముగిసిన థాయ్‌లాండ్ ఓపెన్ అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్లో భారత్‌కు స్వర్ణం, నాలుగు రజతాలు, మూడు కాంస్యాలతో కలిపి మొత్తం ఎనిమిది పతకాలు లభించాయి. 37 దేశాల నుంచి పలువురు మేటి బాక్సర్లు ఈ టోర్నీలో పాల్గొన్నారు. భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన తెలంగాణ బాక్సర్లు నిఖత్ జరీన్ (మహిళల 51 కేజీలు), మొహమ్మద్ హుసాముద్దీన్ (పురుషుల 56 కేజీలు) రజత పతకాలతో సంతృప్తి పడ్డారు. భారత్‌కే చెందిన దీపక్ సింగ్ (48 కేజీలు), బ్రిజేశ్ యాదవ్ (81 కేజీలు) రజత పతకాలు నెగ్గగా... ఆశిష్ కుమార్ (75 కేజీలు) పసిడి పతకంతో అదరగొట్టాడు. సెమీఫైనల్లో ఓడిన మంజు రాణి (48 కేజీలు), ఆశిష్ (69 కేజీలు), భాగ్యబతి కచారి (75 కేజీలు) కాంస్య పతకాలు సొంతం చేసుకున్నారు. ఈ ఏడాది ఫిన్లాండ్లో జరిగిన ‘గీ–బీ’ టోర్నీలో, పోలాండ్‌లో జరిగిన ఫెలిక్స్ స్టామ్ టోర్నీలో రజత పతకాలు నెగ్గిన హుసాముద్దీన్ మూడోసారీ రజతంతో సరిపెట్టుకున్నాడు. చట్‌చాయ్ డెచా బుత్‌దీ (థాయ్‌లాండ్)తో జరిగిన ఫైనల్లో హుసాముద్దీన్ 0–5తో ఓడిపోయాడు. ఇతర ఫైనల్స్‌లో దీపక్ సింగ్ 0–5తో మిర్జాఖెమెదోవ్ నోదిర్‌జోన్ (ఉజ్బెకిస్తాన్) చేతిలో... బ్రిజేశ్ యాదవ్ 1–4తో అనావత్ థోంగ్‌క్రాటోక్ (థాయ్‌లాండ్) చేతిలో పరాజయం పాలయ్యారు. మహిళల 51 కేజీల ఫైనల్లో నిఖత్ జరీన్ 0–5తో ఆసియా క్రీడల స్వర్ణ పతక విజేత చాంగ్ యువాన్ (చైనా) చేతిలో ఓటమి చవిచూసింది. 75 కేజీల ఫైనల్లో ఆశిష్ 5–0తో కిమ్ జిన్జే (కొరియా)పై నెగ్గి పసిడి పతకాన్ని గెల్చుకున్నాడు. తొమ్మిది స్వర్ణాలపై గురి... ఇండోనేసియాలో జరుగుతున్న ప్రెసిడెంట్స్ కప్ బాక్సింగ్ టోర్నమెంట్లో తొమ్మిది విభాగాల్లో భారత బాక్సర్లు ఫైనల్‌కు చేరుకున్నారు. మహిళల విభాగంలో దిగ్గజ బాక్సర్ మేరీకోమ్ (51 కేజీలు), జమున (54 కేజీలు), సిమ్రన్‌జిత్ కౌర్ (60 కేజీలు), మోనిక (48 కేజీలు)... పురుషుల విభాగంలో గౌరవ్ బిధురి (56 కేజీలు), అనంత ప్రహ్లాద్ (52 కేజీలు), దినేశ్ డాగర్ (69 కేజీలు), అంకుశ్ (64 కేజీలు), నీరజ్ స్వామి (49 కేజీలు) నేడు స్వర్ణ పతకాల కోసం పోటీపడనున్నారు. -
నిఖత్, హుసాముద్దీన్‌లకు పతకాలు ఖాయం
బ్యాంకాక్: థాయ్‌లాండ్ ఓపెన్ అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్లో భారత బాక్సర్ల జోరు కొనసాగుతోంది. భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ బాక్సర్లు నిఖత్ జరీన్ (మహిళల 51 కేజీలు), హుసాముద్దీన్ (పురుషుల 56 కేజీలు)లతోపాటు మంజు రాణి (49 కేజీలు), ఆశిష్ (69 కేజీలు), బ్రిజేశ్ యాదవ్ (81 కేజీలు), దీపక్ సింగ్ (49 కేజీలు) కూడా సెమీస్ చేరి కనీసం కాంస్య పతకాలను ఖాయం చేసుకున్నారు. క్వార్టర్ ఫైనల్స్‌లో నిఖత్ 5–0తో సిటోరా షాగ్‌దరోవా (ఉజ్బెకిస్తాన్)పై, హుసాముద్దీన్ 5–0తో లీ యెచాన్ (దక్షిణ కొరియా)పై విజయం సాధించారు. -
నిఖత్, ప్రసాద్‌లకు కాంస్యాలు
గువాహటి: ఇండియా ఓపెన్ అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన ఆంధ్రప్రదేశ్ బాక్సర్ పొలిపల్లి లలితా ప్రసాద్ (పురుషుల 52 కేజీలు), తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్ (మహిళల 51 కేజీలు) కాంస్య పతకాలు సాధించారు. గురువారం జరిగిన సెమీఫైనల్స్‌లో దిగ్గజ బాక్సర్ మేరీకోమ్ 4–1తో నిఖత్‌ను ఓడించగా... లలితా ప్రసాద్ 0–5తో ఆసియా చాంపియన్ అమిత్ పంఘల్ (భారత్) చేతిలో పరాజయం పాలయ్యాడు. ఓవరాల్‌గా పురుషుల విభాగంలో 31 పతకాలు... మహిళల విభాగంలో 26 పతకాలు భారత్‌కు ఖాయమయ్యాయి. పురుషుల 52 కేజీల విభాగం ఫైనల్లో అమిత్‌తో భారత్‌కే చెందిన సచిన్ సివాచ్ తలపడతాడు. సెమీస్‌లో సచిన్ 5–0తో గౌరవ్ సోలంకిపై గెలిచాడు. పురుషుల 60 కేజీల విభాగంలో వరుసగా నాలుగు ఆసియా చాంపియన్‌షిప్‌లలో పతకాలు నెగ్గిన శివ థాపా (భారత్), మనీశ్ కౌశిక్ (భారత్) స్వర్ణ పతక పోరుకు సిద్ధమయ్యారు. సెమీఫైనల్స్‌లో శివ థాపా 5–0తో క్రిస్టియన్ జెపాన్‌స్కీ (పోలాండ్)పై, మనీశ్ 5–0తో అంకిత్ (భారత్)పై విజయం సాధించారు. పురుషుల 49 కేజీల విభాగంలోనూ ఇద్దరు భారత బాక్సర్లు దీపక్, గోవింద్ కుమార్ ఫైనల్లోకి ప్రవేశించారు. సెమీస్‌లో కరోలో పాలమ్ (ఫిలిప్పీన్స్) నుంచి దీపక్‌కు వాకోవర్ లభించగా... తషీ వాంగ్డి (భూటాన్)పై గోవింద్ నెగ్గాడు. 56 కేజీల విభాగం సెమీఫైనల్స్‌లో కవిందర్ బిష్త్ 4–1తో మదన్ లాల్ (భారత్)పై, చాట్‌చాయ్ డెచా (థాయ్‌లాండ్) 5–0తో గౌరవ్ బిధురి (భారత్) పై విజయం సాధించారు. భారత్‌కే చెందిన రోహిత్ (64 కేజీలు), ఆశిష్ (69 కేజీలు), దుర్యోధన్ సింగ్ (69 కేజీలు), ఆశిష్ కుమార్ (75 కేజీలు), బ్రిజేశ్, మనీశ్ పవార్ (81 కేజీలు) ఫైనల్‌కు చేరారు. -
నిఖత్ జరీన్‌కు పతకం ఖాయం
గువాహటి: ఇండియా ఓపెన్ అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్లో తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ పతకాన్ని ఖాయం చేసుకుంది. మహిళల 51 కేజీల విభాగంలో ఈ నిజామాబాద్ జిల్లా బాక్సర్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. మంగళవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో నిఖత్ 5–0తో భారత్‌కే చెందిన అనామికపై విజయం సాధించింది. సెమీఫైనల్లో భారత దిగ్గజ బాక్సర్ మేరీకోమ్‌తో నిఖత్ తలపడనుంది. మరో క్వార్టర్ ఫైనల్లో మేరీకోమ్ 5–0తో మాలా రాయ్ (నేపాల్)పై గెలుపొందింది. సరితా దేవి (60 కేజీలు), అంకుశిత బోరో (64 కేజీలు), మంజు రాణి (48 కేజీలు) కూడా సెమీఫైనల్‌కు చేరి పతకాలను ఖాయం చేసుకున్నారు. క్వార్టర్ ఫైనల్స్‌లో సరిత 5–0తో ప్రీతి బెనివాల్ (భారత్)పై, అంకుశిత 4–1తో లలిత (భారత్)పై, క్లియో తెసారా (ఫిలి -
నిఖత్ సంచలనం
బ్యాంకాక్: ఆసియా సీనియర్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ సంచలనం సృష్టించింది. మహిళల 51 కేజీల విభాగం క్వార్టర్ ఫైనల్లో ఈ నిజామాబాద్ జిల్లా బాక్సర్ గతంలో రెండుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన నాజిమ్ కైజబే (కజకిస్తాన్)ను బోల్తా కొట్టించింది. తద్వారా ఈ మెగా ఈవెంట్లో తొలిసారి సెమీఫైనల్లోకి దూసుకెళ్లి కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకుంది. మంగళవారం జరిగిన బౌట్లో నిఖత్ 5–0తో నాజిమ్‌ను ఓడించింది. నిఖత్‌తోపాటు సరితా దేవి (60 కేజీలు), మనీషా (54 కేజీలు), సిమ్రన్‌జిత్ (64 కేజీలు) కూడా సెమీఫైనల్లోకి చేరి పతకాలను ఖాయం చేసుకున్నారు. క్వార్టర్ ఫైనల్స్‌లో 37 ఏళ్ల సరితా దేవి 3–2తో రిమ్మా వొలసెంకో (కజకిస్తాన్)పై, మనీషా 5–0తో పెటిసియో నైస్ జా (ఫిలిప్పీన్స్)పై, సిమ్రన్4–1తో హా తిన్ లిన్ (వియత్నాం)పై గెలిచారు. శివ థాపా కొత్త చరిత్ర పురుషుల విభాగంలో శివ థాపా (60 కేజీలు), ఆశిష్ కుమార్ (75 కేజీలు), ఆశిష్ (69 కేజీలు), సతీశ్ కుమార్ (ప్లస్ 91 కేజీలు) సెమీఫైనల్లోకి దూసుకెళ్లారు. క్వార్టర్ ఫైనల్లో శివ 5–0తో రుజాక్రన్ జున్త్రోంగ్ (థాయ్‌లాండ్)ను ఓడించాడు. ఈ క్రమంలో ఆసియా చాంపియన్‌షిప్‌లో వరుసగా నాలుగోసారి పతకాన్ని ఖాయం చేసుకున్న తొలి భారతీయ బాక్సర్‌గా చరిత్ర సృష్టించాడు. గతంలో శివ 2013లో స్వర్ణం, 2015లో కాంస్యం, 2017లో రజతం సాధించాడు. మిగతా క్వార్టర్ ఫైనల్స్‌లో ఆశిష్ కుమార్ 5–0తో ఒముర్బెక్ (కిర్గిస్తాన్)పై, ఆశిష్ 5–0తో త్రాన్ డుక్ థో (వియత్నాం)పై, సతీశ్ 3–2తో దోయోన్ కిమ్ (కొరియా)పై గెలిచారు. ఓవరాల్‌గా భారత్ నుంచి 13 మంది బాక్సర్లు సెమీఫైనల్‌కు చేరుకున్నారు. బుధవారం విశ్రాంతి దినం తర్వాత గురువారం సెమీఫైనల్ బౌట్లు జరుగుతాయి. -
ఆసియా బాక్సింగ్ పోటీలకు నిఖత్
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక ఆసియా మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్ పోటీల్లో సత్తా చాటుకునేందుకు తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ సిద్ధమైంది. ఈనెల 17 నుంచి థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌లో జరిగే ఈ మెగా ఈవెంట్లో పాల్గొనేందుకు పది మంది సభ్యులుగల భారత మహిళల బృందం సోమవారం ఢిల్లీ నుంచి బయలుదేరి వెళ్లింది. ఈ ఏడాది జరిగే ప్రపంచ చాంపియన్‌షిప్ పోటీలకు ఆసియా చాంపియన్‌షిప్‌ను సన్నాహకంగా భారత బాక్సర్లు భావిస్తున్నారు. 2001లో మొదలైన ఆసియా మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు మెరుగైన రికార్డు ఉంది. ఇప్పటి వరకు ఈ టోర్నీ చరిత్రలో భారత మహిళా బాక్సర్లు 19 స్వర్ణాలు, 21 రజతాలు, 20 కాంస్యాలతో కలిపి మొత్తం 60 పతకాలను సాధించారు. భారత మహిళల బాక్సింగ్ జట్టు: నీతూ (48 కేజీలు), నిఖత్ జరీన్ (51 కేజీలు), మనీషా (54 కేజీలు), సోనియా చహల్ (57 కేజీలు), సరితా దేవి (60 కేజీలు), సిమ్రన్‌జిత్ కౌర్ (64 కేజీలు), లవ్లీనా బొర్గొహైన్ (69 కేజీలు), నుపుర్ (75 కేజీలు), పూజా రాణి (81 కేజీలు), సీమా పూనియా (ప్లస్ 81 కేజీలు). -
పసిడి పోరుకు నిఖత్
సోఫియా (బల్గేరియా): స్ట్రాంజా స్మారక అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్లో భారత బాక్సర్లు నిఖత్ జరీన్ (51 కేజీలు), అమిత్ పంగల్ (49 కేజీలు), మంజు రాణి (48 కేజీలు), మీనా కుమారి దేవి (54 కేజీలు) స్వర్ణ పతక పోరుకు అర్హత సాధించారు. సోమవారం జరిగిన సెమీఫైనల్స్‌లో తెలంగాణ బాక్సర్ నిఖత్ 3–2తో సాండ్రా డ్రాబిక్ (పోలాండ్)పై... అమిత్ 3–2తో సైద్ మొర్తాజీ (మొరాకో)పై గెలిచారు. ఇతర బౌట్స్‌లో ఎమి మారి తొడొరోవా (బల్గేరియా)పై మంజు రాణి... ఎకతెరీనా సిచెవా (రష్యా)పై మీనా విజయం సాధించారు. మరోవైపు ప్విలావో బాసుమతారి (64 కేజీలు), నీరజ్ (60 కేజీలు), లవ్లీనా బొర్గొహైన్ (69 కేజీలు) సెమీఫైనల్లో పరాజయం పాలై కాంస్య పతకాలతో సరిపెట్టుకున్నారు. -
సెమీస్‌లో నిఖత్
న్యూఢిల్లీ: స్ట్రాంజా స్మారక అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ మహిళా బాక్సర్ నిఖత్ జరీన్‌కు పతకం ఖాయమైంది. బల్గేరియాలోని సోఫియాలో జరుగుతున్న ఈ టోర్నీలో నిఖత్‌తోపాటు అమిత్ ఫంగల్ (49 కేజీలు), మంజు రాణి (48 కేజీలు), లవ్లీనా బొర్గొహైన్ (69 కేజీలు), నీరజ్ (60 కేజీలు) కూడా సెమీఫైనల్‌కు చేరి పతకాలను ఖాయం చేసుకున్నారు. ఆదివారం జరిగిన క్వార్టర్ ఫైనల్స్‌లో నిఖత్ 5–0తో బుర్యామ్ యానా (బెలారస్)పై... మంజు రాణి 5–0తో బొనాటి రొబెర్టా (ఇటలీ)పై... లవ్లీనా 5–0తో సోరెజ్ బీట్రిజ్ (బ్రెజిల్)పై... అమిత్ 3–2తో నజర్ కురోత్‌చిన్ (ఉక్రెయిన్)పై గెలిచారు. -
అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నీలకు నిఖత్ జరీన్, ప్రసాద్
న్యూఢిల్లీ: గతేడాది కామన్వెల్త్ గేమ్స్, ఆసియా క్రీడల్లో మెరిసిన భారత బాక్సర్లు కొత్త సీజన్లోనూ సత్తా చాటుకోవాలనే పట్టుదలతో ఉన్నారు. ఈ నేపథ్యంలో వచ్చే నెల రోజుల్లో భారత బాక్సర్లు మూడు అంతర్జాతీయ టోర్నీల్లో బరిలోకి దిగనున్నారు. బల్గేరియాలో జరిగే స్ట్రాండ్జా టోర్నీలో... ఆ తర్వాత ఇరాన్లో జరిగే టోర్నీలో... ఫిన్లాండ్లో జరిగే టోర్నీలో భారత బాక్సర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. స్ట్రాండ్జా టోర్నీలో భారత్ తరఫున మహిళల విభాగంలో 10 మంది... పురుషుల విభాగంలో తొమ్మిది మంది పోటీపడుతున్నారు. తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ 51 కేజీల విభాగంలో బరిలోకి దిగనుంది. ఫిబ్రవరి 22 నుంచి 28 వరకు ఇరాన్లో జరిగే టోర్నీలో పాల్గొనే భారత పురుషుల జట్టులో ఆంధ్రప్రదేశ్ బాక్సర్ పొలిపల్లి లలితా ప్రసాద్ ఎంపికయ్యాడు. అతను 52 కేజీల విభాగంలో పోటీపడతాడు. -
నిఖత్‌కు రజతం
సాక్షి, హైదరాబాద్: జాతీయ సీనియర్ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ (51 కేజీలు) రజత పతకం సాధించింది. కర్ణాటకలోని విజయనగరలో ఆదివారం ముగిసిన ఈ పోటీల ఫైనల్లో నిఖత్ 2–3తో పింకీ రాణి జాంగ్రా (హరియాణా) చేతిలో పోరాడి ఓడిపోయింది. నిఖత్ ప్రదర్శనకు గుర్తింపుగా ఆమెకు ‘బెస్ట్ చాలెంజింగ్ బాక్సర్’ పురస్కారం లభించింది. టోర్నీ ‘బెస్ట్ బాక్సర్’గా సిమ్రన్‌జిత్ కౌర్... ‘బెస్ట్ ప్రామిసింగ్ బాక్సర్’గా కళైవాణి (తమిళనాడు–48 కేజీలు) నిలిచారు. మొత్తం 10 విభాగాల్లో ఫైనల్స్ జరుగగా.. రైల్వేస్, హరియాణా బాక్సర్లు మూడు చొప్పున స్వర్ణాలు సాధించారు. పంజాబ్ ఖాతాలో రెండు పసిడి పతకాలు చేరాయి. ఆలిండియా పోలీస్, అస్సాం బాక్సర్లకు ఒక్కో బంగారు పతకం లభించింది. రైల్వేస్ తరఫున సోనియా లాథెర్ (57 కేజీలు), నీతూ (75 కేజీలు), సీమా పూనియా (ప్లస్ 81 కేజీలు)... హరియాణా తరఫున పింకీ రాణి (51 కేజీలు), నీరజ్ (60 కేజీలు), పూజా రాణి (81 కేజీలు)... పంజాబ్ తరఫున మంజు రాణి (48 కేజీలు), సిమ్రన్‌జిత్ కౌర్ (64 కేజీలు) చాంపియన్లుగా నిలిచారు. ఆలిండియా పోలీస్ జట్టుకు మీనా కుమారి దేవి (54 కేజీలు), అస్సాం జట్టుకు లవ్లీనా బొర్గొహైన్ (69 కేజీలు) ఒక్కో స్వర్ణం అందించారు. ఆరుసార్లు ప్రపంచ చాంపియన్, భారత మేటి బాక్సర్ మేరీకోమ్ ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు బహుమతులు అందజేశారు. -
సెమీస్‌లో నిఖత్
సాక్షి, హైదరాబాద్: జాతీయ సీనియర్ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ (51 కేజీలు) సెమీఫైనల్‌కు చేరి పతకాన్ని ఖాయం చేసుకుంది. కర్ణాటకలోని విజయనగరలో జరుగుతోన్న ఈ పోటీల్లో శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో నిఖత్ జరీన్ 5–0తో మాన్సీ శర్మ (ఉత్తరప్రదేశ్)పై గెలుపొందింది. 81 కేజీల విభాగం క్వార్టర్ ఫైనల్లో తెలంగాణకే చెందిన సారా ఖురేషి మహారాష్ట్ర బాక్సర్ మోహిని చేతిలో ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించింది. -
నిఖత్ జరీన్‌కు స్వర్ణం
సాక్షి, హైదరాబాద్: చెన్నైలో జరిగిన ఆలిండియా మెట్రో కప్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్ విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో ఆమె కేరళకు చెందిన అల్ఫాన్సా మరియా థామస్‌ను కంగుతినిపించింది. -
జాతీయ మహిళల బాక్సింగ్‌లో నికత్
-
నిఖత్‌కు చేయూత
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ స్థాయిలో బాక్సింగ్‌లో సత్తా చాటుతున్న తెలంగాణ మహిళా బాక్సర్ నిఖత్ జరీన్‌కు చేయూతనందించేందుకు జేఎస్‌డబ్ల్యూ స్టీల్ గ్రూప్ సంస్థ ముందుకొచ్చింది. స్పోర్ట్స్ ఎక్సలెన్స్ ప్రోగ్రామ్ ద్వారా దేశంలోని వివిధ క్రీడలకు చెందిన 28 మంది అథ్లెట్లకు జేఎస్‌డబ్ల్యూ సహకారమందిస్తోంది. వీరిలో నిఖత్ కూడా చేరింది. జేఎస్‌డబ్ల్యూ సహకారం అందుకుంటున్న 12 మంది అథ్లెట్లు త్వరలో గ్లాస్గోలో ప్రారంభం కానున్న కామన్వెల్త్ క్రీడల్లోనూ పాల్గొననున్నారు. కాగా, నిజామాబాద్‌కు చెందిన బాక్సర్ నిఖత్.. రెండేళ్లుగా పలు అంతర్జాతీయ పోటీల్లో పతకాలు సాధిస్తోంది. గత ఏడాది సెర్బియాలో జరిగిన నేషన్స్‌కప్‌లో విజేతగా నిలిచిన నిఖత్.. ఇటీవల సెర్బియాలోనే జరిగిన ‘గోల్డెన్ గ్లవ్ ఆఫ్ వోజ్వోదినా’ అంతర్జాతీయ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలుచుకోవడం ద్వారా మరోసారి సత్తా చాటింది. -
నిఖత్ జరీన్‌కు స్వర్ణం
వోజ్వోదినా (సెర్బియా): ‘గోల్డెన్ గ్లవ్ ఆఫ్ వోజ్వోదినా’ అంతర్జాతీయ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ పసిడితో మెరిసింది. సెర్బియాలోని సుబోటికా వోజ్‌వోదినాలో జరిగిన ఈ పోటీల్లో నిఖత్ 54 కేజీల విభాగంలో స్వర్ణ పతకం గెలుచుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో ఆమె ఆర్ఎస్సీ (రిఫరీ స్టాప్స్ కాంటెస్ట్)తో ఫెరెన్జ్ జూడిత్ (హంగేరీ)ని చిత్తు చేసింది. తొలి రౌండ్లోనే జరీన్ పంచ్‌లను తట్టుకోలేక ప్రత్యర్థి కుప్పకూలడంతో బౌట్‌ను నిలిపివేసి భారత బాక్సర్‌ను విజేతగా ప్రకటించారు. గతంలో కూడా సెర్బియాలోనే జరిగిన నేషన్స్ కప్‌లో ఈ బాక్సర్ విజేతగా నిలిచింది. ‘ఈ విజయం ఎంతో ప్రత్యేకం. దేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ సెర్బియాలో మరోసారి స్వర్ణం నెగ్గడం చాలా సంతోషంగా ఉంది’ అని జరీన్ ఆనందం వ్యక్తం చేసింది. -
నిఖత్ శుభారంభం
ప్రపంచ యూత్ బాక్సింగ్ సోఫియా (బల్గేరియా): ప్రపంచ యూత్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్లు శుభారంభం చేశారు. మహిళల 51 కేజీల విభాగంలో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి నిఖత్ జరీన్ రెండో రౌండ్లోకి ప్రవేశించింది. పురుషుల విభాగంలో శ్యామ్ కకారా (49 కేజీలు), సతీశ్ కుమార్ (56 కేజీలు) కూడా ముందంజ వేశారు. గత చాంపియన్‌షిప్‌లో రజతం నెగ్గిన నిఖత్ తొలి రౌండ్ బౌట్లో 3-0తో ఇస్తిక్ నెరిమాన్ (టర్కీ)పై గెలిచింది. బుధవారం జరిగే రెండో రౌండ్లో లీ సుక్‌యోంగ్ (కొరియా)తో నిఖత్ తలపడుతుంది. పురుషుల విభాగంలో శ్యామ్ తన ప్రత్యర్థి అబ్దుల్లా అల్ముల్లా (యూఏఈ)ని ‘టెక్నికల్ నాకౌట్’ చేయగా... సతీశ్ 3-0తో నాందోర్ సోస్కా (హంగేరి)పై గెలిచారు. శ్యామ్ పంచ్‌ల ధాటికి అబ్దుల్లా రెండు రౌండ్ల తర్వాత బౌట్‌ను కొనసాగించలేని పరిస్థితిలోకి వెళ్లాడు. దాంతో రిఫరీ ‘టెక్నికల్ నాకౌట్’ పద్ధతిలో శ్యామ్‌ను విజేతగా ప్రకటించారు. గౌరవ్ సోలంకి (52 కేజీలు), నీల్ కమల్ సింగ్ (75 కేజీలు), మన్జీత్ (69 కేజీలు)... మహిళల విభాగంలో మంజూ బొంబారియా (75 కేజీలు) లకు తొలి రౌండ్ ‘బై’ లభించింది. భారత బాక్సింగ్ సమాఖ్యపై నిషేధం కొనసాగుతున్న కారణంగా ఈ మెగా ఈవెంట్లో భారత బాక్సర్లు అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం (ఏఐబీఏ-ఐబా) పతాకం కింద పోటీపడుతున్నారు. -
నిఖత్ ‘పసిడి’ పంచ్
వోజ్వొదినా (సెర్బియా): తన విజయపరంపర కొనసాగిస్తూ ఆంధ్రప్రదేశ్ బాక్సర్ నిఖత్ జరీన్ అంతర్జాతీయ స్థాయిలో మరోసారి పసిడి పంచ్ విసిరింది. నేషన్స్ కప్ బాక్సింగ్ టోర్నమెంట్లో నిఖత్ స్వర్ణం చేజిక్కించుకుంది. ఆదివారం ఇక్కడ జరిగిన యూత్ బాలికల విభాగం 51 కేజీల కేటగిరీ ఫైనల్లో నిఖత్ 3-0 పాయింట్ల తేడాతో పల్త్‌సెవా ఎకతెరీనా (రష్యా)ను చిత్తు చేసింది. ఈ టోర్నమెంట్లో నిఖత్ తన ప్రత్యర్థులకు ఒక్క పాయింట్ కూడా సమర్పించుకోకపోవడం విశేషం. 2010లో జాతీయ బెస్ట్ బాక్సర్‌గా గుర్తింపు తెచ్చుకున్న 17 ఏళ్ల జరీన్ ఆ తర్వాత తన ప్రదర్శనను మరింత మెరుగు పర్చుకుంది. మూడేళ్ల క్రితం జూనియర్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచిన ఈ నిజామాబాద్ బాక్సర్ గత కొంత కాలంగా నిలకడగా రాణిస్తోంది. గత సెప్టెంబర్‌లో బల్గేరియాలో జరిగిన మహిళల యూత్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో కూడా రజతం సాధించి నిఖత్ సంచలనం సృష్టించింది. -
ఫైనల్లో నిఖత్ జరీన్
వోజ్వొదినా (సెర్బియా): నేషన్స్ కప్ అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ బాక్సర్ నిఖత్ జరీన్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. శనివారం జరిగిన యూత్ బాలికల విభాగం 51 కేజీల సెమీఫైనల్లో నిఖత్ 5-0 పాయింట్ల తేడాతో బాలంటీన్ తన్సియా (నెదర్లాండ్స్)ను ఓడించింది. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో ఈ నిజామాబాద్ జిల్లా బాక్సర్ 3-0తో అబ్దీ మలికా (అల్జీరియా)పై విజయం సాధించింది. -
‘ట్రాక్’ నుంచి ‘రింగ్’లోకి...
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ యూత్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో రజత పతకం నెగ్గిన ఆంధ్రప్రదేశ్ అమ్మాయి నిఖత్ జరీన్ అందరి దృష్టినీ ఆకర్షించింది. రెండేళ్ల క్రితం జూనియర్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచిన ఈ నిజామాబాద్ అమ్మాయి... మళ్లీ చెలరేగి తన గత విజయం గాలివాటం కాదని నిరూపించింది. అమ్మాయిలకు ఆటలేంటి... అందులోనూ ముస్లిం అమ్మాయికి బాక్సింగ్ ఏమిటి... అంటూ అన్ని వైపుల నుంచి ఎదురైన ప్రతికూలతలపై ‘పంచ్’ విసిరింది. క్రీడాభిమాని అయిన తండ్రి జమీల్ అహ్మద్ ప్రోత్సాహంతో 17 ఏళ్ల నిఖత్ పట్టుదలగా ముందుకు వెళుతోంది. నాలుగు నెలల శిక్షణతో... ఆటలపై ఆసక్తి పెంచుకున్న నిఖత్ ఆరంభంలో అథ్లెటిక్స్ ఆడింది. 2008లో జిల్లా స్థాయిలో అన్ని స్ప్రింట్, రిలే, లాంగ్‌జంప్ పోటీల్లో విజేతగా నిలిచింది. అనంతరం రాష్ట్ర స్థాయిలో నాలుగో స్థానం అందుకుంది. అయితే అనంతరం బాక్సింగ్ వైపు ఆమె చూపు మళ్లింది. స్వస్థలం నిజామాబాద్‌లో బాక్సింగ్ శిక్షణ కేంద్రానికి ఒకే ఒక అమ్మాయి వచ్చేది. నిఖత్‌లో చురుకుదనం చూసి ఆమె ఈ ఆటలో ప్రోత్సహించింది. గాయాల భయంతో ముందుగా కుటుంబసభ్యులు వెనుకాడినా తర్వాత ప్రోత్సహించారు. కోచ్ సమ్‌సమ్ అండగా నిలవడంతో శిక్షణ ప్రారంభించిన నాలుగు నెలల్లోనే రాష్ట్ర స్థాయిలో, ఆ తర్వాత జాతీయ స్థాయిలో కూడా నిలకడగా రాణించి పతకాలు గెల్చుకుంది. ‘ప్రస్తుతం నేను అబ్బాయిలతో కలిసి ప్రాక్టీస్ చేస్తూ నా ప్రదర్శనను మరింతగా మెరుగు పర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. భవిష్యత్తులో సీనియర్ విభాగంలోనూ రాణిస్తా’ అని నిఖత్ చెప్పింది. -
ఫైనల్లో నిఖత్
న్యూఢిల్లీ: తన పంచ్ పవర్ కొనసాగిస్తూ ఆంధ్రప్రదేశ్ బాక్సర్ నిఖత్ జరీన్ ప్రపంచ మహిళల యూత్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో ఫైనల్లోకి దూసుకెళ్లింది. భారత్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న 17 ఏళ్ల ఈ నిజామాబాద్ అమ్మాయి 54 కేజీ విభాగంలో స్వర్ణ పతక పోరుకు అర్హత సాధించింది. బల్గేరియాలోని అల్బెనా నగరంలో జరుగుతున్న ఈ పోటీల్లో నిఖత్ 54 కేజీల సెమీఫైనల్లో 2011 జూనియర్ వరల్డ్ చాంపియన్ విక్టోరియా విర్ట్ (ఉక్రెయిన్)పై విజయం సాధించింది. ఫైనల్లో యూంజీ యువాన్ (చైనా)తో నిఖత్ పోటీపడుతుంది. 2011 జూనియర్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఫ్లయ్ వెయిట్ కేటగిరీలో స్వర్ణ పతకం గెల్చుకున్న నిఖత్ ఫైనల్లోనూ ఇదే జోరును కొనసాగిస్తానని తెలిపింది. మరోవైపు 60 కేజీల విభాగంలో సిమ్రాన్‌జిత్ కౌర్... జూనియర్ విభాగంలోని 48 కేజీల కేటగిరీలో ఆశా రోకా సెమీఫైనల్లో ఓటమిపాలై కాంస్య పతకాలతో సరిపెట్టుకున్నారు.