భారత బాక్సర్ నిఖత్ జరీన్ ప్రపంచ సీనియర్ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో ఫైనల్లోకి దూసుకెళ్లింది. బుధవారం ఇస్తాంబుల్ వేదికగా జరిగిన 52 కేజీల విభాగం సెమీ ఫైనల్‌లో బ్రెజిల్‌కు చెందిన కరోలైన్ డి అల్మేడాను 5-0 పాయింట్ల తేడాతో నిఖత్ జరీన్ ఓడించింది. ఇక బంగారు పతకాన్ని కైవసం చేసుకునేందుకు ఆమె ఫైనల్‌లో థాయ్‌లాండ్‌కు చెందిన జుటామస్ జిట్‌పాంగ్‌తో తలపడనుంది.
ఇక ఇప్పటి వరకు మేరీకోమ్, సరితా దేవి, జెన్నీ ఆర్ఎల్, లేఖా సీ మాత్రమే ప్రపంచ టైటిల్స్ సాధించిన భారత మహిళా బాక్సర్లుగా ఉన్నారు. కాగా హైదరాబాద్‌కు చెందిన నిఖత్ జరీన్ ఫైనల్లో విజయం సాధిస్తే ఈ అరుదైన జాబితాలో చేరుతుంది.
చదవండి: Kaamya Karthikeyan: ఐదు ఖండాలను చుట్టేసిన కామ్య.. ఎన్నెన్నో అవార్డులు!
Comments
Please login to add a commentAdd a comment