హిసార్ (హరియాణా): తన పంచ్ పవర్ సత్తా చాటుకొని తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ జాతీయ సీనియర్ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. బుధవారం ముగిసిన ఈ మెగా ఈవెంట్‌లో నిజామాబాద్ జిల్లాకు చెందిన 25 ఏళ్ల నిఖత్ ఫైనల్లో 4–1తో మీనాక్షి (హరియాణా)పై గెలిచింది. ఆద్యంతం అద్భుత ప్రదర్శన చేసిన నిఖత్‌కు టోర్నీ ‘బెస్ట్ బాక్సర్’ పురస్కారం లభించడం విశేషం.
జాతీయ శిబిరానికి నిహారిక
66 కేజీల విభాగంలో తెలంగాణ బాక్సర్ గోనెళ్ల నిహారిక కాంస్య పతకం సాధించింది. అంతేకాకుండా జాతీయ శిక్షణ శిబిరంలో స్థానం సంపాదించింది. టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం నెగ్గిన లవ్లీనా బొర్గోహైన్‌కు నేరుగా ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే భారత జట్టులో చోటు ఇచ్చారు.
మిగతా 11 కేటగిరీల్లో స్వర్ణ పతకాలు గెలిచిన బాక్సర్లు ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తారని భారత బాక్సింగ్ సమాఖ్య (బీఎఫ్‌ఐ) ఈ టోరీ్నకి ముందు ప్రకటించింది. అయితే ఒకట్రెండు కేటగిరీల్లో ట్రయల్స్ నిర్వహించే అవకాశం ఉందని బీఎఫ్‌ఐ వర్గాలు తెలిపాయి.
చదవండి: SL VS AUS: శ్రీలంకతో మ్యాచ్‌కు ముందు ఆస్ట్రేలియాకు బిగ్ షాక్!
Comments
Please login to add a commentAdd a comment