gold medalist
-
స్వర్ణ పతకం నెగ్గిన జ్యోతిక శ్రీ
ఇండియన్ గ్రాండ్‌ప్రి–3 అథ్లెటిక్స్ మీట్లో ఆంధ్రప్రదేశ్ అథ్లెట్ దండి జ్యోతిక శ్రీ తన అత్యుత్తమ వ్యక్తిగత ప్రదర్శనను నమోదు చేసింది. బెంగళూరులో బుధవారం జరిగిన ఈ మీట్లో జ్యోతిక శ్రీ మహిళల 400 మీటర్ల రేసులో విజేతగా నిలిచింది. జ్యోతిక శ్రీ 400 మీటర్లను అందరికంటే వేగంగా 51.53 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. శుభా వెంకటేశ్ (తమిళనాడు; 52.34 సెకన్లు) రెండో స్థానంలో, పూవమ్మ రాజు (కర్ణాటక; 52.62 సెకన్లు) మూడో స్థానంలో నిలిచారు. -
నచ్చిన కారు తీసుకో.. ఆర్చర్ శీతల్ దేవికి ఆనంద్ మహీంద్ర ప్రశంస
అసాధారణమైన ప్రతిభను, పట్టుదలను ప్రోత్సహించడంలో ముందుంటారు మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా. అలాంటి వ్యక్తులకు తన అభిమానాన్ని, మద్దతును ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తుంటారు. తాజాగా ఆసియా పారా గేమ్స్ బంగారు పతక విజేత, ఆర్చర్ శీతల్ దేవిని ప్రశంసిస్తూ ‘ఎక్స్’ (ట్విటర్)లో పోస్ట్ పెట్టిన ఆనంద్ మహీంద్రా తమ కంపెనీ కార్లలో ఆమెకు నచ్చిన కారును తీసుకోవాలని కోరారు. దాన్ని ఆమె నడిపేందుకు వీలుగా తయారు చేసిస్తామని కూడా చెప్పారు. రెండు చేతులూ లేని శీతల్ దేవి ఆసియా పారా గేమ్స్‌లో ఒకే ఎడిషన్‌లో రెండు బంగారు పతకాలను గెలుచుకున్న మొదటి భారతీయ మహిళగా అవతరించింది. ‘జీవితంలో ఇంకెప్పుడూ చిన్న చిన్న పనికిమాలిన సమస్యల గురించి ఆలోచించను. శీతల్‌దేవీ.. నువ్వు అందరికీ స్ఫూర్తి ప్రదాతవు. నీ నుంచి ఎంతో నేర్చుకోవాలి. మా కంపెనీ కార్లలో నీకు నచ్చినది తీసుకో. దాన్ని నువ్వు నడిపేందుకు వీలుగా తయారు చేసిస్తాం’ అని ట్వీట్లో రాసుకొచ్చారు ఆనంద్ మహీంద్రా. ఆమె కఠోర సాధనకు సంబంధించిన వీడియోను షేర్ చేశారు. ఈ ట్వీట్‌కు యూజర్ల నుంచి విశేష స్పందన వచ్చింది. చాలా మంది ఆనంద్ మహీంద్రను అభినందిస్తూ కామెంట్లు చేశారు. I will never,EVER again complain about petty problems in my life. #SheetalDevi you are a teacher to us all. Please pick any car from our range & we will award it to you & customise it for your use. pic.twitter.com/JU6DOR5iqs — anand mahindra (@anandmahindra) October 28, 2023 -
డైనమిక్ అయ్యర్
సవాలును తలకెత్తుకోవడం అంటే ‘తలకు మించిన భారం’ అనుకుంటారు కొందరు. సవాలును స్వీకరించడం అనేది తమను తాము నిరూపించుకునే అపూర్వ అవకాశం అనుకుంటారు మరికొందరు. అపర్ణ అయ్యర్ రెండో కోవకు చెందిన వ్యక్తి. ‘సీఏ పరీక్ష పాస్ కావడం అంటే మాటలు కాదు’ లాంటి ప్రతికూల మాటలు అదేపనిగా వినిపించినా ‘సీఏ’ పై ఆసక్తిని ఎప్పుడూ కోల్పోలేదు. ఆ ఆసక్తే ఆమెను సీఏ బంగారు పతక విజేతను చేసింది. సవాలును చిరునవ్వుతో స్వీకరించే ఆమె ధైర్యం ‘విప్రో’ లాంటి పెద్ద సంస్థలో సీఎఫ్‌వో (చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్)గా బాధ్యతలు స్వీకరించేలా చేసింది.... లీడర్ అంటే ఎవరు? దారి తెలిసిన వారు, ఆ దారిలో ఆటంకాలు లేకుండా ప్రయాణించే వారు, అవసరమైతే కొత్త దారి చూపించేవారు. ఇలాంటి నాయకత్వ లక్షణాలు ఎన్నో అపర్ణ అయ్యర్‌లో దండిగా ఉన్నాయి కాబట్టే ఆమె మల్టీనేషనల్ ఐటీ కార్పోరేషన్ విప్రోలో ఎన్నో ఉన్నతస్థానాల్లో పనిచేసింది. విప్రోతో ఆమెది రెండు దశాబ్దాల అనుబంధం. సీనియర్ ఇంటర్నల్ ఆడిటర్‌గా విప్రోలోకి అడుగు పెట్టిన అపర్ణ అక్కడి ఫైనాన్స్ టీమ్‌తో పని చేస్తూ ఎన్నో అనుభవాలను సొంతం చేసుకుంది. ఒక్కో మెట్టు ఎక్కుతూ సీఎఫ్‌వో స్థాయికి చేరింది. ఫైనాన్షియల్ రిస్క్ మేనేజ్మెంట్, క్యాపిటల్ అలోకేషన్, ఫండ్ రైజింగ్, బిజినెస్ స్ట్రాటజీ అండ్ గ్రోత్... మొదలైన సబ్జెక్లలో అపర్ణ నిపుణురాలు. సబ్జెక్ట్‌లో నైపుణ్యం ఉండగానే సరిపోదు. వివిధ సందర్భాలలో ఆ నైపుణ్యాన్ని సృజనాత్మకంగా అన్వయించి మంచి ఫలితాలు సాధించగలగాలి. ఈ విషయంలో ఎప్పుడూ వెనకబడిపోలేదు అపర్ణ అయ్యర్. ఇంటర్నల్ ఆడిట్, బిజినెస్ ఫైనాన్స్, ఫైనాల్సియల్ ప్లానింగ్ అండ్ ఎనాలటిక్స్, కార్పోరేట్ ట్రెజరీ....ఇలా కంపెనీకి సంబంధించి ఎన్నో విభాగాలో కీలకపాత్ర పోషించింది. ముంబై నర్సీ మోంజీ కాలేజి నుంచి కామర్స్‌లో గ్రాడ్యుయేషన్ చేసిన అపర్ణ 2002 సీఏ (చార్టెట్ ఎకౌంటెంట్) గోల్డ్ మెడలిస్ట్. ‘అపర్ణ అయ్యర్‌లో అద్భుతమైన నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. తన ముందుచూపు, సాహసోపేతమైన నిర్ణయాలతో సంస్థ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోంది’ అంటున్నాడు విప్రో సీయివో డెలాపోర్ట్. ‘కీలకమైన సమయంలో సీఎఫ్‌వోగా బాధ్యతలు స్వీకరిస్తున్నందుకు సంతోషంగా ఉంది. మరిన్ని విజయాలు సాధించే లక్ష్యంతో మా ప్రయాణం కొనసాగుతుంది’ అంటుంది అపర్ణ అయ్యర్. -
CWG 2022: స్వర్ణ యుగం మొదలైంది.. మిమ్మల్ని చూసి దేశం గర్విస్తోంది: ప్రధాని మోదీ
Commonwealth Games 2022- న్యూఢిల్లీ: కామన్వెల్త్ క్రీడల్లో పతకాలు సాధించిన భారత క్రీడాకారులతో ప్రధాని నరేంద్ర మోదీ శనివారం భేటీ అయ్యారు. ప్రధాని అధికారిక నివాసంలో జరిగే ఈ కార్యక్రమంలో కొందరు మినహా దాదాపు విజేతలంతా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ క్రీడాకారులను ఉద్దేశించి ప్రసంగిస్తూ మీ అపూర్వ విజయాలు చూసి జాతి మొత్తం గర్విస్తోందని ప్రశంసించారు. స్వర్ణ యుగం మొదలైంది! ‘‘మీ షెడ్యూల్లో కొంత సమయాన్ని నాకు కేటాయించి నా నివాసానికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అందరు భారతీయుల్లాగే.. మీ గురించి మాట్లాడటం నాకూ గర్వంగా ఉంది. భారత క్రీడల్లో స్వర్ణ యుగం ఆరంభమైంది. ఇది కేవలం యువ శక్తి వల్లే సాధ్యమైంది. గడిచిన రెండు వారాల్లో అటు కామన్వెల్త్.. ఇటు చెస్ ఒలింపియాడ్ రూపంలో రెండు మెగా ఈవెంట్లు. కామన్వెల్త్ క్రీడల్లో చారిత్రాత్మక ప్రదర్శనతో పాటు చెస్ ఒలింపియాడ్‌కు మనం తొలిసారి ఆతిథ్యం ఇచ్చాము. ఈ మెగా ఈవెంట్లో విజయం సాధించిన వాళ్లందరికీ కూడా నా శుభాభినందనలు’’ అని ప్రధాని మోదీ విజేతలను కొనియాడారు. ఇక కామన్వెల్త్ క్రీడల్లో రజత పతకం సాధించిన భారత మహిళా క్రికెట్ జట్టు గురించి ప్రధాని మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. హర్మన్‌ప్రీత్ కౌర్ బృందాన్ని ప్రశంసల్లో ముంచెత్తిన ఆయన.. స్వర్ణ పతక విజేత బాక్సర్ నీతూ ఘంఘస్, బ్మాడ్మింటన్ స్టార్, గోల్డ్ మెడలిస్ట్ పీవీ సింధు, క్రికెటర్ రేణుకా సింగ్‌తో పాటు రెజ్లర్ పూజా గెహ్లోత్ పేరును ప్రస్తావించారు. భేటీలు భేష్! అమ్మాయిలంతా శెభాష్ అనిపించుకున్నారని, దేశమంతా గర్వించేలా చేశారని కొనియాడారు. అయితే, పూజా కాంస్యానికే పరిమితమైనందుకు కన్నీరు పెట్టుకున్నపుడు తాను వెంటనే స్పందించానన్న ప్రధాని మోదీ.. పతకం సాధించి దేశ ప్రతిష్టను ఇనుమడింపజేసినందుకు ఆనందించాలే తప్ప బాధపడవద్దంటూ క్రీడాకారులకు సూచించారు. కామన్వెల్త్ గేమ్స్‌లో సీనియర్ అథ్లెట్లు ముందుండి నడిస్తే.. యువ ఆటగాళ్లు వారి స్ఫూర్తితో పతకాలు సాధించారని కొనియాడారు. ప్రతిష్టాత్మక క్రీడా వేదికపై త్రివర్ణ పతాకం రెపరెపలాడినపుడు గర్వంతో గుండె ఉప్పొంగిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. కాగా యూకేకు బయల్దేరే ముందు కూడా క్రీడాకారులతో ప్రధాని మోదీ భేటీ అయిన విషయం తెలిసిందే. దేశాన్ని గర్వపడేలా చేస్తామని అప్పుడు తనకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారంటూ ప్రధాని మోదీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఇక ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్‌లో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో భారత్ 22 స్వర్ణాలు, 16 రజతాలు, 23 కాంస్యాలు (మొత్తం 61 పతకాలు) సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. రెజ్లింగ్‌లోనే మనకు 6 స్వర్ణాలు సహా మొత్తం 12 పతకాలు వచ్చాయి. చదవండి: Ind Vs Zim ODI Series: జింబాబ్వేకు పయనమైన టీమిండియా ఆటగాళ్లు.. The Great Khali: 'ది గ్రేట్ ఖలీ' కన్నీటి పర్యంతం.. అంతుచిక్కని ప్రశ్నలా! Elated to interact with our CWG 2022 contingent. Entire nation is proud of their outstanding achievements. https://t.co/eraViqKcnl — Narendra Modi (@narendramodi) August 13, 2022 -
Praveen Kumar Sobti: స్వర్ణ, రజత, కాంస్య పతకాలు గెలిచిన అథ్లెట్..భీముడిగా గుర్తింపు
Praveen Kumar Sobti:- న్యూఢిల్లీ: భారత క్రీడల్లో విజేయుడు... ‘మహాభారత్’లో భీముడు ప్రవీణ్ కుమార్ సోబ్టీ కన్నుమూశారు. 74 ఏళ్ల ప్రవీణ్ సోమవారం రాత్రి గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, కుమార్తె ఉన్నారు. పంజాబ్‌కు చెందిన ప్రవీణ్ బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడల్లో డిస్కస్ త్రో, హ్యామర్ త్రో ఈవెంట్లలో పతకాలు నెగ్గిన ఈ అలనాటి దిగ్గజం ఓ క్రీడాకారుడిగా కంటే విలక్షణ నటుడిగా సుపరిచితం. ఇప్పుడు ఒక్క కాంస్య పతకంతోనే రాత్రికి రాత్రే స్టార్ అవుతుండగా... ఆ కాలంలో స్వర్ణ, రజత, కాంస్య పతకాలతో విజయవంతమైన అథ్లెట్‌గా ఎదిగారు. అయినప్పటికీ క్రీడల్లో రాని గుర్తింపు, పేరు ప్రతిష్టలు ఒక్క ‘మహాభారత్’ సీరియల్‌తోనే వచ్చాయి. ఇవీ ఆయన ఘనతలు ►అమృత్‌సర్‌లో 1947 డిసెంబర్ 6న పుట్టిన ప్రవీణ్ 1960 నుంచి 1974 వరకు పలు మెగా ఈవెంట్లలో పతకాలతో మెరిశారు. ►1966 బ్యాంకాక్ ఆసియా క్రీడల్లో డిస్కస్ త్రోలో చాంపియన్‌గా నిలిచిన ప్రవీణ్ హ్యామర్ త్రోలో కాంస్యం నెగ్గారు. ►అదే ఏడాది కింగ్‌స్టన్‌లో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో హ్యామర్ త్రోలో రజతం గెలుపొందారు. ►1970 బ్యాంకాక్ ఆసియా క్రీడల్లో డిస్కస్ త్రో ఈవెంట్లో టైటిల్ నిలబెట్టుకున్న ప్రవీణ్ 1974 టెహ్రాన్ ఆసియా క్రీడల్లో రజతం గెలిచారు. ►1968 మెక్సికో, 1972 మ్యూనిక్ ఒలింపిక్స్ క్రీడల్లోనూ ప్రవీణ్ భారత్‌కు ప్రాతినిధ్యం వహించారు. భారతంలో భీముడు దూరదర్శన్‌లో 90వ దశకంలో ప్రసారమైన సుప్రసిద్ధ పౌరాణిక ధారావాహిక ‘మహాభారత్’లో పంచ పాండవుల్లో భీముడిగా ప్రవీణ్ దేశ ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు. తదనంతరం పలు హిందీ, తమిళ్, తెలుగు చిత్రాల్లో నటించారు. 2013లో రాజకీయాల్లోనూ ప్రవేశించి ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున ఢిల్లీలోని వాజిర్పూర్ అసెంబ్లీ నియోజక వర్గంలో పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత బీజేపీలో చేరారు. చదవండి: IND VS WI 2nd ODI: విరాట్ కోహ్లి ఖాతాలో మరో రికార్డు.. సచిన్, ధోని సరసన..! -
Vidya: చిన్న ఉద్యోగం ఎందుకు చేయాలి.. నేనే ఉద్యోగం ఇస్తాను..
ఎం.ఎస్.సి డిజిటల్ సొసైటీ కోర్స్‌లో గోల్డ్ మెడలిస్ట్ ఆమె. కాని ఆమె ఫ్రెండ్స్ అందరికీ క్యాంపస్ సెలక్షన్స్‌లో ఉద్యోగాలు వచ్చాయి. ఆమెకు రాలేదు. ‘మీరు చూడగలిగితే బాగుండు’ అన్నారు అంతా. విద్యా పుట్టుకతో అంధురాలు. కాని అందరూ నిరాకరిస్తున్నా మేథమెటిక్స్‌లో గొప్ప ప్రావీణ్యం సంపాదించింది. ‘నాకు ఉద్యోగం ఇవ్వడం కాదు.. నాలాంటి వారికి నేనే ఉద్యోగాలు కల్పిస్తాను’ అని స్వచ్ఛంద సంస్థను స్థాపించి ఉపాధి చూపిస్తోంది విద్య. ఆమె ఎదుర్కొన్న అడ్డంకులు అన్నీ ఇన్నీ కావు. ఆమె సాధిస్తున్న గెలుపులు కూడా. ‘ప్రపంచంలోని అంధుల జనాభాలో మూడొంతుల మంది భారతదేశంలో ఉన్నారు. వారిలో 70 శాతం మంది పల్లెల నుంచే ఉన్నారు. మన దేశంలో అంధ బాల బాలికల్లో 68 శాతమే చదువుకోవడానికి వెళుతున్నారు. వీరిలో మళ్లీ మేథ్స్, సైన్స్ వంటివి తీసుకోవడానికి స్కూల్స్ అంగీకరించవు. సాధారణ కోర్సులే వీళ్లు చదవాలి. ఏం? ఎందుకు వీళ్లు మేథ్స్ చదవకూడదు?’ అంటుంది విద్య. బెంగళూరుకు చెందిన ఈ పాతికేళ్ల అమ్మాయి ఎం.ఎస్.సిలో గోల్డ్ మెడల్ సాధించి ఇప్పుడు ‘విజన్ ఎంపవర్’ అనే సంస్థ స్థాపించి దేశంలోని అంధ విద్యార్థినీ విద్యార్థులకు మేథ్స్, సైన్స్ చదవడంలో మెటీరియల్ తయారు చేస్తోంది. వారి కోసం ట్యూషన్లు, క్లాసులు ఏర్పాటు చేస్తుంది. వారికై పని చేసే అంధ టీచర్లనే సిద్ధం చేస్తోంది. ఒకప్పుడు ఉద్యోగం ఇవ్వడానికి నిరాకరించారు విద్యకు. కాని ఇప్పుడు విద్యే తన సంస్థ ద్వారా అంధ విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. ప్రిమెచ్యూర్ రెటినోపతి విద్య బెంగళూరు సమీపంలోని పల్లెటూరిలో పుట్టింది. సాధారణ జననమే. కాని పుట్టాక మూడు నెలలు ఇంక్యుబేటర్‌లో పెట్టాల్సి వచ్చింది. ఆ సమయంలో ప్రిమెచ్యూర్ రెటినోపతి వల్ల ఆమె రెండు కళ్లకూ చూపు పోయింది. ప్రపంచ సాక్షరతా దినోత్సవం రోజు పుట్టడం వల్ల, ఆమెకు వైద్యం చేసిన డాక్టర్ ‘పాపకు ఎలాగూ కళ్లు రావు. కాని బాగా చదివిస్తే తన కాళ్ల మీద తాను నిలబడుతుంది’ అని సలహా ఇవ్వడం వల్ల తల్లిదండ్రులు ‘విద్య’ అని పేరు పెట్టారు. ‘సాధారణంగా మన దేశంలో జరిగే తప్పేమిటంటే అంధ పిల్లలకు భవిష్యత్తు ఉండదని వారిని బడికి పంపరు పల్లెటూళ్లలో. నా అదృష్టం నా తల్లిదండ్రులు నన్ను బెంగళూరులోని ఒక మిషనరీ స్కూల్లో 7 ఏళ్ల వయసులో వేశారు. అక్కడే నేను 7 వ క్లాస్ వరకూ స్పెషల్ స్టూడెంట్‌గా చదువుకున్నాను. కాని అసలు సమస్య నా 8 వ తరగతి నుంచి అందరిలాగే మామూలు బడిలో చదువుకునే సమయంలో మొదలైంది‘ అంటుంది విద్య. లెక్కల పిచ్చి విద్యకు చిన్నప్పటి నుంచి లెక్కల పిచ్చి. ఇంట్లో చేటలో తల్లి బియ్యం పోసిస్తే ప్రతి గింజను లెక్క పెట్టేది. బియ్యం ఏమిటి... ఆవాలు పోసిచ్చినా ప్రతి ఆవాల గింజను లెక్క పెట్టేది. తల్లిదండ్రులు ఆమె లెక్కల ఇష్టాన్ని గమనించారు. కాని హైస్కూల్లో లెక్కలు చదవడం ఆమెకు కష్టమైంది. క్లాసులన్నీ బోర్డు మీద రాతలతో ఉంటాయి. మేథమెటికల్ సింబల్స్ ఉంటాయి. డయాగ్రామ్స్ ఉంటాయి. వీటిని చూడకుండా అర్థం చేసుకోవడం అసాధ్యం. కాని విద్య పట్టుదలగా వాటిని తెలుసుకోవడానికి ప్రయత్నించేంది. ‘నేను చేయాల్సింది మరిన్ని గంటలు కష్టపడటమే అని అర్థం చేసుకున్నాను. ఉదయం నాలుగున్నరకు లేచి చదివేదాన్ని’ అంటుంది విద్య. డిగ్రీలో మేథ్స్, కంప్యూటర్ సైన్స్ తీసుకుని కంప్యూటర్లో ఆడియో మెటీరియల్ ద్వారా వీలైనంత చదువుకుంటూ పాస్ అయ్యింది. ఆ తర్వాత బెంగళూరులో ప్రతిష్టాత్మకమైన ట్రిపుల్ ఐటిలో ఎంఎస్సీ డిజిటల్ సొసైటీ కోర్సును టాపర్‌గా పాసైంది. ‘నా చదువుంతా నా ప్రయోగమే. నేను గణితాన్ని అర్థం చేసుకోవడానికి పడిన తపన, కష్టమే నా చదువు. ట్రిపుల్ ఐటి నుంచి మేథమేటిక్స్ ఆధారిత పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన తొలి స్టూడెంట్‌ని నేనే’ అంటుంది విద్య. అందరి కోసం విద్యకు ఉద్యోగం ఇవ్వడానికి కంపెనీలు నిరాకరించాయి ఆమె అంధత్వం వల్ల. చాలా కంపెనీలు దయతలిచి కాల్‌సెంటర్ ఆపరేటర్ ఉద్యోగాన్ని ఆఫర్ చేశాయి. ఇంత మేధ పెట్టుకుని చిన్న ఉద్యోగం ఎందుకు చేయాలి అనుకుంది విద్య. అసలు అంధులు అన్ని విధాలా మేథ్స్, కంప్యూటర్స్ చదివి పెద్ద ఉద్యోగాలు చేసేలా వారిని తయారు చేస్తాను అని ఉద్యోగప్రయత్నాలు మాని తానే ఉద్యోగాలు చూపే ‘విజన్ ఎంపవర్’ అనే సంస్థను బెంగళూరులో స్థాపించింది. నాలుగేళ్లుగా ఈ సంస్థ తన కార్యకలాపాలు నిర్వహిస్తోంది. అంధ విద్యార్థులకు బాసటగా నిలుస్తోంది. అంతేకాదు ప్రస్తుతానికి కర్నాటకలోని అంధ విద్యార్థులను ప్రపంచ అంధ విద్యార్థులతో, విద్యా సంస్థలతో అనుసంధానం చేస్తోంది. విద్య చేస్తున్న ఈ పనిని సమాజం గుర్తిస్తోంది. ఆమెను పిలిచి స్ఫూర్తివంతమైన ప్రసంగాలను వింటోంది. ‘అప్పుడే ఏమైంది. ఇది మొదలు మాత్రమే. చేయాల్సింది చాలా ఉంది’ అంటోంది విద్య. చాలా కంపెనీలు దయతలిచి కాల్‌సెంటర్ ఆపరేటర్ ఉద్యోగాన్ని ఆఫర్ చేశాయి. ఇంత మేధ పెట్టుకుని చిన్న ఉద్యోగం ఎందుకు చేయాలి అనుకుంది విద్య. అసలు అంధులు అన్ని విధాలా మేథ్స్, కంప్యూటర్స్ చదివి పెద్ద ఉద్యోగాలు చేసేలా వారిని తయారు చేస్తాను అని ఉద్యోగ ప్రయత్నాలు మాని తానే ఉద్యోగాలు చూపే సంస్థను స్థాపించింది. -
తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్‌కు గోల్డ్ మెడల్...
హిసార్ (హరియాణా): తన పంచ్ పవర్ సత్తా చాటుకొని తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ జాతీయ సీనియర్ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. బుధవారం ముగిసిన ఈ మెగా ఈవెంట్లో నిజామాబాద్ జిల్లాకు చెందిన 25 ఏళ్ల నిఖత్ ఫైనల్లో 4–1తో మీనాక్షి (హరియాణా)పై గెలిచింది. ఆద్యంతం అద్భుత ప్రదర్శన చేసిన నిఖత్‌కు టోర్నీ ‘బెస్ట్ బాక్సర్’ పురస్కారం లభించడం విశేషం. జాతీయ శిబిరానికి నిహారిక 66 కేజీల విభాగంలో తెలంగాణ బాక్సర్ గోనెళ్ల నిహారిక కాంస్య పతకం సాధించింది. అంతేకాకుండా జాతీయ శిక్షణ శిబిరంలో స్థానం సంపాదించింది. టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం నెగ్గిన లవ్లీనా బొర్గోహైన్‌కు నేరుగా ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే భారత జట్టులో చోటు ఇచ్చారు. మిగతా 11 కేటగిరీల్లో స్వర్ణ పతకాలు గెలిచిన బాక్సర్లు ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తారని భారత బాక్సింగ్ సమాఖ్య (బీఎఫ్ఐ) ఈ టోరీ్నకి ముందు ప్రకటించింది. అయితే ఒకట్రెండు కేటగిరీల్లో ట్రయల్స్ నిర్వహించే అవకాశం ఉందని బీఎఫ్ఐ వర్గాలు తెలిపాయి. చదవండి: SL VS AUS: శ్రీలంకతో మ్యాచ్‌కు ముందు ఆస్ట్రేలియాకు బిగ్ షాక్! -
ఆ విషయంలో సచిన్ నుంచి చాలా నేర్చుకున్నా: టోక్యో స్వర్ణ పతక విజేత
న్యూఢిల్లీ: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఆటతీరు తనపై తీవ్ర ప్రభావం చూపిందని టోక్యో పారాలింపిక్స్ బ్యాడ్మింటన్ గోల్డ్ మెడలిస్ట్ ప్రమోద్ భగత్ అన్నాడు. ప్రపంచ ఛాంపియన్షిప్ సహా ఎన్నో విజయాలకు సచినే కారణమని పేర్కొన్నాడు. ఒత్తిడిలోనూ ప్రశాంతంగా ఎలా ఉండాలో సచిన్ నుంచి నేర్చుకున్నానని తెలిపాడు. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో భగత్ మాట్లాడుతూ... చిన్నప్పుడు క్రికెట్ ఆడేవాడినని, దూరదర్శన్‌లో క్రికెట్ మ్యాచ్‌లు చూస్తూ పెరిగానని అన్నాడు. దిగ్గజ క్రికెటర్ సచిన్ చాలా ప్రశాంతంగా కనిపించేవాడని, మైదానంలో అతడి ప్రవర్తన నన్ను ఆకట్టుకునేదని, అది తనపై తీవ్ర ప్రభావం చూపిందని తెలిపాడు. సచిన్ క్రీడా స్ఫూర్తి తన లాంటి చాలామంది క్రీడాకారులపై ప్రభావం చూపిందని పేర్కొన్నాడు. SL3 విభాగంలో ప్రపంచ ఛాంపియన్ అయిన భగత్ గతవారం టోక్యోలో జరిగిన ఫైనల్లో గ్రేట్ బ్రిటన్ ఆటగాడు డేనియల్ బెతెల్‌ను ఓడించడం ద్వారా పసిడిని సొంతం చేసుకున్నాడు. హోరాహోరీగా సాగిన ఈ తుది సమరంలో ప్రమోద్ భగత్ నెమ్మదిగా ప్రారంభించినప్పటికీ.. ఆట కొనసాగే క్రమంలో దూకుడును ప్రదర్శించాడు. రెండో గేమ్‌లో ప్రత్యర్ధి అటాకింగ్ గేమ్ ఆడటంతో ఒకానొక సమయంలో ప్రమోద్ 8 పాయింట్లు వెనుకపడ్డాడు. అయినప్పటికీ అనూహ్యంగా పుంజుకుని దేశానికి స్వర్ణ పతకం అందించాడు. ఇదిలా ఉంటే, 33 ఏళ్ల ప్రమోద్ భగత్ నాలుగేళ్ల వయసులో ఉండగా.. పోలియో బారినపడ్డాడు. అయినా ఎంతో దైర్యం, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాడు. ఆటపై మక్కువ పెంచుకుని అందులో రాణించాడు. అందుకు ఫలితంగా విశ్వక్రీడల్లో గోల్డ్ మెడల్ దక్కింది. చదవండి: యూఎస్ ఓపెన్ ఫైనల్లో పెను సంచలనం.. ప్రపంచ నంబర్‌వన్‌కు షాక్ -
సెక్స్ లైఫ్ గురించి ప్రశ్న.. నీరజ్ చోప్రా ఎలా స్పందించాడో చూడండి..
న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్ జావెలిన్ త్రో క్రీడలో స్వర్ణ పతకం సాధించి భారత ఖ్యాతిని ఖండాంతరాలు దాటించిన నీరజ్ చోప్రా.. రాత్రిరాత్రి దేశంలో పెద్ద స్టార్ అయిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అతడిని ఇంటర్వ్యూ చేసేందుకు ప్రముఖ మీడియా సంస్థలు, జర్నలిస్ట్‌లు క్యూ కడుతున్నారు. తాజాగా ఓ ప్రముఖ ఆంగ్ల మీడియా సంస్థ నీరజ్‌ను ఆన్లైన్ ఇంటర్వ్యూకు ఆహ్వానించింది. ఇందులో పలువురు అతని వ్యక్తిగత, క్రీడా జీవితానికి సంబంధించిన ప్రశ్నలు అడిగారు. If you thought Malishka was Cringe WATCH Rajeev Sethi go a STEP FURTHER 😡 He asked Neeraj Chopra : "How Do you Balance your Sеx Life with your training??" Disgusted Neeraj replied "Aapke question se mera mann bhar gaya" #NeerajChopra #RajeevSethi pic.twitter.com/qwVd7hAot4— Rosy (@rose_k01) September 3, 2021 ఇదే క్రమంలో ప్రముఖ చరిత్రకారుడు రాజీవ్ సేథీ లైన్లోకి వచ్చి నీరజ్‌ను ఇబ్బంది పెట్టే ప్రశ్న ఒకటి సంధించాడు. 'అందమైన కుర్రాడివి.. నీ సెక్స్ జీవితాన్ని, అథ్లెటిక్స్ను ఎలా బ్యాలెన్స్ చేస్తున్నావంటూ' దిమ్మతిరిగిపోయే ప్రశ్న వేశాడు. ఓ ప్రముఖ వ్యక్తి అకస్మాత్తుగా ఇలాంటి ప్రశ్న వేసేసరికి నీరజ్ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. ఏం మాట్లాడాలో తెలీక కాసేపు గమ్మునుండిపోయాడు. అయితే ఈ షాక్ నుంచి తేరుకున్న అనంతరం నీరజ్ చాలా హుందాగా స్పందించాడు. 'సారీ సర్' అని సమాధానం ఇచ్చాడు. అయినా సరే రాజీవ్ సేథీ నీరజ్‌ను వదిలిపెట్టలేదు. ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వాలంటూ పట్టుపట్టాడు. అయినప్పటికీ నీరజ్ సహనం కోల్పోకుండా 'ప్లీజ్ సర్, మీ ప్రశ్నతో నా మనసు నిండిపోయిందంటూ' చాలా హుందాగా జవాబిచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది. నీరజ్‌కు ఇలాంటి ప్రశ్నను సంధించిన రాజీవ్ సేథి వైఖరిని చాలా మంది ప్రముఖులు తప్పుపట్టారు. ఈ వీడియోపై శివసేన రాజ్యసభ ఎంపీ ప్రియాంక చతుర్వేది స్పందించారు. 'ఎదుర్కొన్న చెత్త ప్రశ్నలకు కూడా సౌమ్యంగా సమధానం చెప్పిన నీరజ్ చోప్రాపై నాకు గౌరవం పెరిగిందని, నిజమైన స్పోర్ట్స్ పర్సన్ ఇలానే వ్యవహరిస్తాడని నీరజ్‌ను ఆకాశానికెత్తాడు. ఇలా చాలామంది నెటిజన్లు నీరజ్ వ్యవహరించిన తీరుకు ఫిదా అయ్యారు. ప్రస్తుతం ఈ అంశం సోషల్‌మీడియాలో ట్రెండ్ అవుతోంది. చదవండి: కపిల్ రికార్డు బద్దలు కొట్టిన టీమిండియా పేసు గుర్రం.. -
పాక్ అథ్లెట్ నా జావెలిన్‌ను ట్యాంపర్ చేయలేదు: నీరజ్ చోప్రా
న్యూఢిల్లీ: పాక్ జావెలిన్ త్రోయర్ అర్షద్ నదీమ్.. తన జావెలిన్‌ను ట్యాంపర్ చేయాలని ప్రయత్నించాడని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో నీరజ్ చోప్రా స్పందించాడు. ఈ వివాదంపై క్లారిటీ ఇస్తూ.. అతను ట్విటర్లో ఓ వీడియోను పోస్ట్ చేశాడు. అందులో అతను మాట్లాడుతూ.. దయచేసి నన్ను, నా కామెంట్లను వ్యక్తిగత ఎజెండాల కోసం వాడుకోవద్దని విజ్ఞప్తి చేశాడు. క్రీడాకారుల మధ్య ఎటువంటి వైరుధ్యాలు ఉండవని, దేశాలు, ప్రాంతాలకు అతీతంగా క్రీడలు అందరినీ ఏకం చేస్తాయని పేర్కొన్నాడు. मेरी आप सभी से विनती है की मेरे comments को अपने गंदे एजेंडा को आगे बढ़ाने का माध्यम न बनाए। Sports हम सबको एकजूट होकर साथ रहना सिखाता हैं और कमेंट करने से पहले खेल के रूल्स जानना जरूरी होता है 🙏🏽 pic.twitter.com/RLv96FZTd2 — Neeraj Chopra (@Neeraj_chopra1) August 26, 2021 ఇటీవల తాను చేసిన వ్యాఖ్యలపై కొంత మంది నెటిజన్లు ఉద్దేశపూర్వకంగా దుమారం రేపుతున్నారని, వారి కామెంట్లు నన్ను తీవ్రంగా బాధిస్తున్నాయని, అలాంటి వాటిని నిజమైన భారతీయులు పట్టించుకోవద్దని కోరాడు. నదీమ్ నా జావెలిన్‌ను పట్టుకోవడం పొరపాటుగా జరిగి ఉంటుందని, ఇందులో అతను ఉద్దేశపూర్వకంగా చేసిన తప్పేమీ ఉండదని భావిస్తున్నానని చెప్పుకొచ్చాడు. కాగా, కీలకమైన ఫైనల్‌కు ముందు జరిగిన ఓ ఆసక్తికర ఘటనకు సంబంధంచిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నీరజ్ స్పందించాల్సి వచ్చింది. ఆ వీడియోలో పాక్ అథ్లెట్ అర్షద్ నదీమ్ నీరజ్ చోప్రా జావెలిన్‌ను పట్టుకొని తిరగడం స్పష్టంగా కనబడింది. ఈ నేపథ్యంలో నదీమ్.. నీరజ్ జావెలిన్‌ను ట్యాంపర్ చేయాలని ప్రయత్నించాడని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇదిలా ఉంటే, టోక్యో ఒలింపిక్స్ 2020లో ఫైనల్లో నీరజ్ చోప్రా జావెలిన్‌ను 87.58 మీటర్లు విసిరి అథ్లెటిక్స్‌లో భారత్ 100 ఏళ్ల స్వర్ణ పతక నిరీక్షణకు తెరదించాడు. చదవండి: పతకం చేజార్చుకున్న 24 మంది ఒలింపియన్లకు టాటా కార్లు -
స్వప్న లోకంలో విహరిస్తున్నా అనుకున్నా: నీరజ్ చోప్రా
సాక్షి, న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకాన్ని గెల్చుకుని భారత్ అథ్లెట్స్‌లో వందేళ్ల కల సాకారం చేయడమే కాదు, అథ్లెటిక్స్‌లో ఒలింపిక్ స్వర్ణం గెలిచిన తొలి భారతీయుడిగా నిలిచిన జావెలిన్ త్రో సంచలనం నీరజ్ చోప్రా(23) ఆనందంలో మునిగి తేలుతున్నాడు. బంగారు పతకం సాధించడం ఇంకా కలగానే ఉంది. ఏదో స్పప్నలోకంలో విహరిస్తున్న అనుభవం కలిగిందంటూ సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బవుతున్నాడు. ఒలింపిక్ క్రీడల్లో అథ్లెటిక్స్‌లో బంగారు పతకంతో హీరోగా నిలిచిన నీరజ్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నిర్వహించిన మీడియా ఇంటరాక్షన్‌లో మంగళవారం మాట్లాడాడు. పతకాన్ని సాధించడం ప్రతీ అథ్లెట్ కల..అందులోనూ ఒలింపిక్ స్వర్ణం గెలవడం అంటే మామూలు విషయం కాదని నీరజ్ పేర్కొన్నాడు. అందుకే తాను బంగారు పతకాన్ని సాధించాను అన్న విషయాన్ని నమ్మలేకపోతున్నాను, కలగా ఉంది. దేశం కోసం గొప్ప పని చేశానని ఇండియాలో అడుగుపెట్టినపుడు, ఎయిర్‌పోర్ట్‌లో కోలాహలం చూసినపుడు మాత్రమే అర్థమైందన్నారు. భారత అథ్లెట్లలో ఆలోచన ఈసారి చాలా భిన్నంగా ఉందనీ, కేవలం పాల్గొనడంతోనే సరిపెట్టకుండా, అందరూ పతకం కోసం పోటీ పడ్డారని వ్యాఖ్యానించాడు. (Naresh Tumda: రోజుకూలీగా మారిన క్రికెట్ వరల్డ్ కప్ విన్నర్) గత వారం టోక్యోలో 87.58 మీటరలు విసిరి పురుషుల ఫైనల్లో సంచలనాత్మక విజయాన్ని సాధించాడు నీరజ్ చోప్రా. ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించి భారత గడ్డ మీద అడుగుపెట్టిన నీరజ్ చోప్రాతోపాటు అథ్లెట్లు, ఇతర పతక విజేతలకు ఢిల్లీ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. పానిపట్ ఖండ్రా గ్రామానికి చెందిన నీరజ్ చోప్రా జావెలిన్ త్రోలో 87.58 మీటర్లు విసిరి తన ఒలింపిక్ రికార్డును బద్దలు కొట్టి భారతదేశానికి అథ్లెటిక్స్‌లో చారిత్రాత్మక మొదటి ఒలింపిక్ స్వర్ణాన్ని సాధించిన సంగతి తెలిసిందే. చదవండి : షాకింగ్: పార్కింగ్ టిక్కెట్లు విక్రయిస్తున్న యువ బాక్సర్ -
బంగారు పతకం గెలిచిన ఆనందంలో ఆమె ఏం అనేసిందో వినండి..!
టోక్యో: పట్టరాని ఆనందంలో ఉన్నప్పుడు ఏదేదో వాగేస్తుంటాం. కాసేపయ్యాక విషయం తెలిసి నాలుక్కరుచుకుంటుంటాం. మనిషి నైజమే ఇది. ఇలాంటి ఘటనే టోక్యో ఒలింపిక్స్‌లో మంగళవారం చోటుచేసుకుంది. 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ స్విమ్మింగ్ పోటీల్లో స్వర్ణ పతకం నెగ్గిన ఆస్ట్రేలియన్ స్విమ్మర్ కేలీ మెక్‌కీన్.. పతకం నెగ్గిన ఆనందంలో నోరు జారింది. మెడల్ గెలిచాక ఓ మీడియా ప్రతినిధి.. గోల్డ్ మెడల్ గెలుచుకోవడం పట్ల ఎలా ఫీల్ అవుతున్నారని ప్రశ్నించగా, అప్పటికే ఆనంద డోలికల్లో తేలియాడుతున్న కేలీ పొరపాటున వాడకూడని ఓ బూతు మాటను(F**K) అనేసింది. Starting a “best daily moments of the Olympics” thread with this Hall of Fame entry from Kaylee McKeown after winning gold: pic.twitter.com/6NVuOnUfss — Josh Butler (@JoshButler) July 27, 2021 అయితే తాను తప్పుగా మాట్లాడానని గుర్తించి వెంటనే టాపిక్‌ను డైవర్ట్ చేసి, చాలా సంతోషంగా ఉందంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మెడల్ నెగ్గినందుకు కేలీకి కంగ్రాట్స్ చెబుతున్న నెటిజన్లు.. పట్టలేని సంతోషంలో ఉన్నప్పుడు ఇలాంటి పదాలు మాట్లాడటం సహజమేనని ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. భావోద్వేగాలకు ఎవరూ అతీతులు కాదనడానికి ఈ వీడియో ప్రత్యక్ష సాక్ష్యమని మరికొందరు నెటిజన్లు అంటున్నారు. అయితే కేలీ ఇలా లైవ్‌లో బూతు పదం వాడటంపై ఆమె తల్లి స్పందిస్తూ.. తనతో మాట్లాడతానని చెప్పడం విశేషం. కాగా, కేలీ.. 100 బ్యాక్‌స్ట్రోక్‌ను కేవలం 57.47 సెకన్లలో పూర్తి చేసి గోల్డ్ మెడల్‌ను సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే 20 ఏళ్ల కేలీ మెక్కీన్కు ఒలంపిక్స్‌లో మెడల్ సాధించడం ఇదే తొలిసారేమి కాదు. ఇప్పటి వరకు ఆమె ఏకంగా 4 మెడల్స్ గెలుచుకొని రికార్డు సృష్టించింది. -
మగువా నీకు సలామ్.. 8నెలల గర్భంతో గోల్డ్ మెడల్
అబూజా: క్రీడల్లో మహిళల ప్రాతినిధ్యం తగ్గుతూ వస్తున్న ప్రస్తుత తరుణంలో, నైజీరియాకు చెందిన అమినాత్ ఇద్రీస్ అనే 26 ఏళ్ల అథ్లెట్ ఎనిమిది నెలల గర్భంతో ఉండి కూడా తైక్వాండో పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించి సంచలనం సృష్టించింది. ప్రస్తుతం ఆమె పేరు సోషల్ మీడియాలో మార్మోగుతోంది. నైజీరియాలో జరిగిన నేషనల్ స్పోర్ట్స్ ఫెస్టివల్ పోటీల్లో భాగంగా తైక్వాండో మిక్స్డ్ పూమ్సే కేటగిరీలో ఆమె ఈ పతాకాన్ని కైవసం చేసుకొని చరిత్ర సృష్టించింది. దీంతో పాటు ఆమె ఇతర కేటగిరీల్లో సైతం పలు పతాకలు సాధించి ఔరా అనిపించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గర్భం దాల్చడానికి ముందు నుంచే తాను శిక్షణ తీసుకుంటున్నాని, అందువల్లే గర్భంతో ఉండి కూడా పోటీల్లో పాల్గొనడం సమస్యగా అనిపించలేదని పేర్కొంది. ఇద్రీస్ సాధించిన ఘనతకు సంబంధించిన వీడియోను నేషనల్ స్పోర్ట్స్ ఫెస్టివల్ సంస్థ ట్విట్టర్లో షేర్ చేయగా, నిమిషాల వ్యవధిలో వైరల్‌గా మారింది. ఎనిమిది నెలల గర్భిణి బంగారు పతకం సాధించి, స్ఫూర్తిదాయకంగా నిలిచిందని క్యాప్షన్ జోడించింది. ఈ వీడియోకు విపరీతమైన రెస్పాన్స్ రావడంతో నెటిజన్లు ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మగువా నీకు సలామ్ అంటూ తెగ ట్రోల్ చేస్తున్నారు. చదవండి: ద్రవిడ్‌ను ఇంత కోపంగా ఎప్పుడూ చూడలేదు.. -
డెలివరీ బాయ్‌గా మారిన అంతర్జాతీయ క్రికెటర్
ఒలింపిక్ చాంపియన్... ఈ ఒక్క మాట చాలు ఆటగాళ్ల రాతను మార్చేందుకు... మనలాంటి దేశంలో అయితే ఒలింపిక్ స్వర్ణం సాధించిన ఆటగాడు మిగతా జీవితం గురించి ఆలోచించాల్సిన, బెంగ పడాల్సిన పనే ఉండదు. కోట్ల రూపాయలు, కానుకలతో కనకాభిషేకం కురుస్తుంది. కానీ అన్ని దేశాల్లో ఇలాంటి పరిస్థితి ఉండదు. ఒలింపిక్ విజయం సాధించినా సరే... అవసరమైనప్పుడు బతుకుతెరువు కోసం ఎలాంటి చిన్న పనికైనా సిద్ధం కావాల్సిందే. అదీ వెనిజులా లాంటి దేశం నుంచి వచ్చిన ఆటగాడి పరిస్థితి అయితే మరీ ఇబ్బందికరం. లాడ్జ్ (పోలాండ్): దక్షిణ అమెరికా దేశం వెనిజులా... ఆ దేశం తరఫున ఇద్దరు ఆటగాళ్లు ఇప్పటి వరకు ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకాలు సాధించారు. 1968లో బాక్సర్ ఫ్రాన్సిస్కో రోడ్రిగ్స్ తర్వాత 2012 లండన్ ఒలింపిక్స్‌లో ఫెన్సింగ్ క్రీడాంశంలో రూబెన్ లిమార్డో గాస్కన్ బంగారు పతకం సాధించాడు. అయితే ఆ తర్వాత కూడా లిమార్డోకు పెద్దగా ఏమీ కలిసి రాలేదు. కానీ లోటు లేకుండా మాత్రం జరిగిపోయింది. 2016 రియో ఒలింపిక్స్‌లో విఫలమైనా... ఇప్పుడు మళ్లీ టోక్యో ఒలింపిక్స్ కోసం అతను సన్నద్ధమవుతున్నాడు. ఫుడ్ డెలివరీ బాయ్‌గా రూబెన్ లిమార్డో; ‘లండన్’ స్వర్ణంతో... రెండు ప్రపంచ చాంపియన్‌షిప్ రజతాలు కూడా గెలుచుకున్న 35 ఏళ్ల లిమార్డో... ఇందుకోసం యూరోపియన్ దేశం పోలాండ్‌లో శిక్షణ పొందుతున్నాడు. ఇంత కాలం ఒక ఆటగాడిగా స్పాన్సర్షిప్ నుంచే వచ్చే డబ్బులతో అంతా సవ్యంగానే సాగింది. అయితే కరోనా ఒక్కసారిగా అన్నీ మార్చేసింది. టోక్యో క్రీడలు వచ్చే ఏడాదికి వాయిదా పడటంతో పాటు స్పాన్సర్లు కూడా వెనక్కి తగ్గారు. ప్రస్తుత పరిస్థితుల్లో తాము అండగా నిలవలేమంటూ చేతులెత్తేశారు. ఒకవైపు శిక్షణ, మరోవైపు భార్య, ఇద్దరు పిల్లల బాధ్యత కూడా ఉంది. ఒక క్రీడాకారుడిగా ఇన్నేళ్లు గడిపిన తనకు మరో పని తెలీదు. దాంతో కుటుంబ పోషణ కోసం లిమార్డో ‘ఉబెర్ ఈట్స్’ డెలివరీ బాయ్ అవతారమెత్తాడు. ఉదయమే ప్రాక్టీస్ ముగించుకున్న అనంతరం తన సైకిల్‌పై ఫుడ్ ఆర్డర్లు అందించేందుకు బయల్దేరడం, సాయంత్రం వచ్చి మళ్లీ సాధన కొనసాగించడం అతని దినచర్య. అయితే డెలివరీ బాయ్‌గా పని చేయడం పట్ల తాను బాధ పడడం లేదని, కోవిడ్–19 కాలంలో కనీసం బతికేందుకు ఒక ఆధారం దొరికినందుకు సంతోషిస్తున్నానని చెప్పినప్పుడు లిమార్డోలో ఒక ఒలింపిక్ చాంపియన్ కాకుండా ఎలాగైనా పోరాటం సాగించాలనుకునే ఒక సామాన్యుడు కనిపించాడు. మరో ఒలింపిక్ పతకం తన కల అని, దానిని నెరవేర్చుకునేందుకు ఎంతౖకైనా కష్టపడతానని అతను చెబుతున్నాడు. అతని స్వదేశం వెనిజులా నుంచి అయితే అసలు ఆశించడానికి ఏమీ లేదు. తీవ్ర రాజకీయ సంక్షోభం కారణంగా ఆ దేశం ప్రస్తుతం కనీస ఆహారం, మందులు కూడా లేకుండా భయంకర పరిస్థితుల్లో ఉంది. ఇప్పుడు అక్కడ 1 యూఎస్ డాలర్ విలువ సుమారు 10 వేల వెనిజులన్ బొలీవర్స్కు పడిపోవడం దాని తీవ్రతను చూపిస్తోంది. అంతర్జాతీయ క్రికెటర్ కూడా... నెదర్లాండ్స్‌కు చెందిన 28 ఏళ్ల పాల్ ఆడ్రియాన్ వాన్ మీకెరన్ది కూడా ఇదే తరహా బాధ. నెదర్లాండ్స్ క్రికెట్ జట్టులో ప్రధాన ఆటగాడైన ఈ ఫాస్ట్ బౌలర్ జాతీయ జట్టు తరఫున 5 వన్డేలు, 41 టి20 మ్యాచ్‌లు ఆడాడు. 2020 టి20 వరల్డ్ కప్‌కు అర్హత సాధించిన నెదర్లాండ్స్ జట్టులో అతను కూడా సభ్యుడు. అయితే ఇప్పుడు టి20 ప్రపంచకప్ వాయిదా పడటం అతడికి సమస్య తెచ్చిపెట్టింది. సాధారణంగా నెదర్లాండ్స్ క్రికెటర్లు వేసవిలో మాత్రమే క్రికెట్ బరిలోకి దిగి ఆటకు అనువుగా ఉండని శీతాకాలంలో ఇతర ఉద్యోగాలు చేసుకుంటారు. అక్టోబర్–నవంబర్‌లో ఆస్ట్రేలియా గడ్డపై ప్రపంచ కప్ జరిగి ఉంటే వారికి డబ్బు వచ్చి ఉండేది. కానీ ఆ అవకాశం లేకపోవడంతో వాన్ మీకెరన్ కూడా ‘ఉబెర్ ఈట్స్’ డెలివరీ బాయ్‌గా పని మొదలు పెట్టాడు. ‘ఈ రోజు ప్రపంచకప్ క్రికెట్ ఆడుతూ ఉండాల్సింది. కానీ ఈ శీతాకాలంలో డబ్బుల కోసం ఉబెర్ ఈట్స్ డెలివరీలు చేయాల్సి వస్తోంది. పరిస్థితులు ఎలా మారిపోతాయో ఆలోచిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. అయితే బాధేమీ లేదు. అంతా నవ్వుతూ ఉండండి’ అని మీకెరన్ ట్వీట్ చేశాడు. -
తీరని అవమానం.. గోల్డ్‌మెడల్ నాకొద్దు!
-
తీరని అవమానం.. గోల్డ్‌మెడల్ నాకొద్దు!
పుదుచ్చేరి విశ్వవిద్యాలయంలో బంగారు పతక విజేత రుబీహాకు చేదు అనుభవం ఎందురైంది. 2018 మాస్ కమ్యూనికేషన్ (ఎంఏ) విభాగంలో గోల్డ్ మెడల్ సాధించిన రుబీహా కాన్వొకేషన్ కార్యక్రమానికి వెళ్లారు. కార్యక్రమానికి హాజరైన రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ వేదిక నుంచి వెళ్లేంత వరకు తనను తిరిగి హాల్లోకి అనుమతించలేదని రుబీహా ఆరోపించారు. రాష్ట్రపతి విశ్వవిద్యాలయం నుండి బయలుదేరే వరకు దాదాపు 20 నిమిషాలు బయటనే వేచి ఉండాల్సి వచ్చిందని వాపోయారు. స్నాతకోత్సవం ముగిసిన తరువాత ఆమె మీడియాతో మాట్లాడారు. రాష్ట్రపతి వచ్చినప్పుడు, తను హాలు నుంచి బయటికి (బలవంతం చేయనప్పటికీ) రావాలని కోరారని తెలిపారు. ఇది తనకు తీరని అవమానమని కేరళకు చెందిన రుబీహా కంట తడి పెట్టారు. సీఏఏకి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేయవచ్చనే అనుమానంతోనే తనను కాన్వొకేషన్ హాల్లోకి వెళ్లకుండా అడ్డుకున్నారన్నారు. దీనికి నిరసనగా తన సర్టిఫికెట్‌ను మాత్రమే తీసుకుని, గోల్డ్‌మెడల్‌ను తిరస్కరిస్తున్నట్టు వెల్లడించారు. అంతేకాదు, దేశవ్యాప్తంగా ఎన్ఆర్సీకి, సీఏఏకి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న ప్రతీ ఒక్కరికీ సంఘీభావంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసుల దారుణానికి వ్యతిరేకంగా తన బంగారు పతకాన్ని తీసుకోవడానికి నిరాకరిస్తున్నట్టు చెప్పారు. దీనిపై విద్యావంతులైన యువతగా తాము బలమైన వైఖరి తీసుకోవాలన్నారు. అయితే ఈ ఆరోపణలను విశ్వవిద్యాలయ అధికారులు ఖండించారు. కాగా, విశ్వవిద్యాలయంలో కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ర్యాలీలలో రుబీహా క్రమం తప్పకుండా పాల్గొనేవారని తెలుస్తోంది. ముఖ్యంగా గతంలో బీజేపీ నాయకుడు తరుణ్ విజయ్ క్యాంపస్ పర్యటనకు వ్యతిరేకంగా ఆమె నిరసనలకు నాయకత్వం వహించినట్టుగా సమాచారం. మరోవైపు బంగారు పతకాలను గెల్చుకున్న ఇతర విద్యార్థులు ఈ సమావేశాన్ని బహిష్కరించాలని నిర్ణయించారట. ఇందులో భాగంగా కొంతమంది కేవలం సర్టిఫికెట్లను మాత్రమే స్వీకరించారు. -
స్వర్ణంతో సీజన్ ముగించిన రెజ్లర్ వినేశ్
ఈ ఏడాది కామన్వెల్త్ గేమ్స్, ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాలతో మెరిసిన భారత స్టార్ రెజ్లర్ వినేశ్ పొగాట్ సీజన్‌ను మరో స్వర్ణంతో ముగించింది. ఉత్తరప్రదేశ్‌లో జరిగిన జాతీయ చాంపియన్‌షిప్‌లో 57 కేజీల విభాగంలో వినేశ్ చాంపియన్‌గా నిలిచింది. మోచేతి గాయం నుంచి కోలుకొని బరిలో దిగిన వినేశ్ మొత్తం టోర్నీలో ప్రత్యర్థులకు కేవలం 2 పాయింట్లు మాత్రమే సమర్పించుకుంది. ఫైనల్లో వినేశ్ 10–0తో బబితను మట్టి కరిపించింది. ఆమె గతంలో 2012 నుంచి 16 వరకు వరుసగా ఐదుసార్లు ఈ విభాగంలో చాంపియన్‌గా నిలవడం విశేషం. -
మేరీ‘గోల్డ్’
మేరీ కోమ్... మేరీ కోమ్... మేరీ కోమ్... ప్రేక్షకుల జయజయధ్వానాల మధ్య ఫేవరెట్‌గా బరిలో దిగిన భారత బాక్సింగ్ దిగ్గజం మేరీ కోమ్ ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో రికార్డు స్థాయిలో ఆరో స్వర్ణం సొంతం చేసుకొని నయా చరిత్ర లిఖించింది. పవర్ఫుల్ పంచ్‌లతో ప్రత్యర్థిని గుక్కతిప్పుకోనివ్వకుండా చేసిన మేరీ... తుదిపోరులో ఏకపక్ష విజయాన్ని సొంతం చేసుకుంది. 35 ఏళ్ల వయసులో... ముగ్గురు పిల్లల తల్లి అయినా... తన పంచ్‌లో పదును తగ్గలేదని మరోసారి నిరూపించి... ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ ప్రపంచ చాంపియన్‌గా మెరిసింది. న్యూఢిల్లీ: రికార్డు స్థాయిలో ఇప్పటికే ఐదు సార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన స్టార్ బాక్సర్ మేరీకోమ్ సొంతగడ్డపై జరిగిన మహిళల బాక్సింగ్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పసిడి సొంతం చేసుకుంది. శనివారం జరిగిన 48 కేజీల ఫైనల్లో మేరీ కోమ్ 5–0తో హనా ఒఖోటా (ఉక్రెయిన్) పై గెలుపొందింది. బరిలో దిగిన అన్ని బౌట్లలో ప్రత్యర్థిని బెంబేలెత్తించిన ఈ మణిపురి మణిపూస తుదిపోరులోనూ అదే రీతిలో చెలరేగి 30–27, 29–28, 29–28, 30–27, 30–27తో ఏకపక్ష విజయం సాధించింది. ఫైనల్ బౌట్లో మేరీ ఆరంభం నుంచే దూకుడు కనబర్చింది. తొలి రౌండ్లో తన పంచ్‌లతో ప్రత్యర్థిపై విరుచుకుపడింది. ఇక రెండో రౌండ్ ప్రారంభంలోనే బలమైన హుక్తో ప్రత్యర్థిపై పైచేయి సాధించింది. ఆ రౌండ్ పూర్తయ్యేసరికే ఆమె విజయం దాదాపుగా ఖాయమైంది. చివరిదైన మూడో రౌండ్లోనూ ఆధిపత్యం కొనసాగిస్తూ... సునాయాస విజయం సొంతం చేసుకుంది. ఈ పతకాన్ని దేశానికి అంకితమిచ్చిన మేరీ భావోద్వేగానికి గురై ఉబికి వస్తున్న కన్నీళ్లను ఆపుకుంటూ దేశ ప్రజలకు ధన్యవాదాలు తెలిపింది. ‘చాలా ఆనందంగా ఉంది. మీరు చూపే ఆదరాభిమానాలకు స్వర్ణం తప్ప మరేది నెగ్గకూడ దని అనుకున్నా. 2016 రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించ లేకపోవడం నన్ను ఇప్పటికీ బాధిస్తోంది. 2020 టోక్యో ఒలింపిక్స్ స్వర్ణం సాధించడమే నా ముందున్న లక్ష్యం. ఒలింపిక్స్‌లో ఈ (48 కేజీల) విభాగం లేదు. టోక్యోలో 51 కేజీల విభాగంలో బరిలో దిగుతా’అని 2012 లండన్ ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన మేరీకోమ్ చెప్పింది. సోనియాకు రజతం... బరిలో దిగిన తొలి ప్రపంచ చాంపియన్‌షిప్‌లోనే దుమ్మురేపే ప్రదర్శనతో ఫైనల్‌కు దూసుకొచ్చిన యువ బాక్సర్ సోనియా చహల్ తృటిలో స్వర్ణం చేజార్చుకుంది. 57 కేజీల ఫైనల్లో సోనియా 1–4తో ఒర్నెల్లా గాబ్రియల్ (జర్మనీ) చేతిలో ఓడింది. చివరివరకు హోరాహోరీగా పోరాడిన సోనియా 28–29, 28–29, 29–28, 28–29, 28–29తో పరాజయం పాలైంది. ‘నా శాయశక్తులా ప్రయత్నించాను. కానీ అది సరిపోలేదు. అయినా... బాధగా లేదు. రజతం గెలవడం సంతోషాన్నిచ్చింది. 2020 టోక్యో ఒలింపిక్స్ కోసం సిద్ధమవుతా’అని సోనియా వెల్లడించింది. ప్రధాని మోదీ, జగన్ అభినందనలు... ప్రపంచ మహిళా బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించిన మేరీ కోమ్కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభినందనలు తెలిపారు. ఆమె విజయం ప్రత్యేకమైందని, ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తుందని ప్రధాని అన్నారు. మరిన్ని విజయాలు సాధించాలి... సాక్షి, అమరావతి: ఆరో సారి ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన మేరీ కోమ్కు ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి విజయాలు అనేకం అందుకోవాలని ఆకాంక్షించారు. ఇప్పటి వరకు వరల్డ్ చాంపియన్‌షిప్‌లో ఆరు పతకాలు (5 స్వర్ణాలు, 1 రజతం) సాధించి ఐర్లాండ్‌కు చెందిన కేటీ టేలర్ (5 స్వర్ణాలు, 1 కాంస్యం)తో సమంగా ఉన్న మేరీ తాజా పసిడితో క్యూబా పురుషుల బాక్సింగ్ దిగ్గజం ఫెలిక్స్ సవాన్ (6 స్వర్ణాలు, 1 రజతం) సరసన నిలిచింది. మేరీ గతంలో 2002, 05, 06, 08, 10లలో స్వర్ణాలు... అరంగేట్ర 2001 చాంపియన్‌షిప్‌లో రజతం సాధించింది. ఆమె చివరిసారిగా 2010 బ్రిడ్జ్‌టౌన్‌లో జరిగిన మెగా టోర్నీలో విజేతగా నిలిచింది. -
హర్విందర్‌కు స్వర్ణం
జకార్తా: పారా ఆసియా క్రీడల్లో భారత దివ్యాంగ క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. హర్విందర్ సింగ్ ఆర్చరీలో భారత్‌కు తొలి పసిడి పతకాన్ని అందించాడు. ఐదో రోజు పోటీల్లో భారత్ ఈ స్వర్ణం సహా తొమ్మిది పతకాలను సాధించింది. ఇందులో నాలుగేసి చొప్పున రజత, కాంస్యాలున్నాయి. దీంతో భారత్ మొత్తం పతకాల సంఖ్య 37కు చేరింది. బుధవారం జరిగిన పురుషుల ఆర్చరీ డబ్ల్యూ2/ఎస్టీ కేటగిరీలో హర్విందర్ 6–0తో చైనాకు చెందిన జావో లిగ్జూను కంగుతినిపించి బంగారు పతకం అందుకున్నాడు. పురుషుల డిస్కస్ త్రో ఎఫ్11 కేటగిరీలో మోను ఘంగాస్, లాంగ్‌జంప్ టి42/టి61/టి63 కేటగిరీలో విజయ్ కుమార్ రజతాలు గెలిచారు. పురుషుల షాట్‌పుట్ ఎఫ్46 కేటగిరీలో మొహమ్మద్ యాసిర్‌కు కాంస్యం లభించింది. మహిళల టేబుల్ టెన్నిస్ డబుల్స్ ఫైనల్లో భవినబెన్ పటేల్–సోనల్‌బెన్ పటేల్ జోడీ 4–11, 12–14తో అసయుత్ దరరత్–పాటర్వడీ వరరిడంరొంకుల్ (ఇండోనేసియా) జంట చేతిలో ఓడింది. దీంతో భారత జోడీ రజతంతో తృప్తిపడింది. చెస్ మహిళల వ్యక్తిగత విభాగంలో రజతం గెలుపొందిన జెన్నిత అంటో... టీమ్ ఈవెంట్లో ప్రేమ కనిశ్రీతో కలిసి కాంస్యం నెగ్గింది. మహిళల టీమ్ ఈవెంట్లో మృణాళి, మేఘ, టైజన్ పునరం మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాలు గెలిచారు. పురుషుల పవర్‌లిఫ్టింగ్‌లో 80 కేజీల కేటగిరీలో పోటీపడిన సుధీర్ 192 కేజీల బరువెత్తి కాంస్యం చేజిక్కించుకున్నాడు. -
పసిడి పంట
జకార్తా: ఆసియా పారా క్రీడల్లో భారత క్రీడాకారులు తమ పతకాల వేటను కొనసాగిస్తున్నారు. పోటీల మూడో రోజు మంగళవారం భారత్ ఖాతాలో మూడు స్వర్ణాలు, మూడు రజతాలు, ఐదు కాంస్యాలతో కలిపి మొత్తం 11 పతకాలు చేరాయి. షూటింగ్లో పురుషుల 10 మీటర్ల పి–1 ఎయిర్ పిస్టల్ విభాగంలో మనీశ్ నర్వాల్ పసిడి పతకాన్ని సొంతం చేసుకున్నాడు. ఫైనల్లో మనీశ్ 235.9 పాయింట్లు స్కోరు చేశాడు. అథ్లెటిక్స్‌లో ఏక్తా భ్యాన్ మహిళల క్లబ్ త్రో (ఎఫ్ 32/51) విభాగంలో, పురుషుల 100 మీటర్ల (టి35) విభాగంలో నారాయణ్ ఠాకూర్ బంగారు పతకాలు గెల్చుకున్నారు. ఏక్తా ఇనుప గుండును 16.02 మీటర్ల దూరం విసిరి అగ్రస్థానంలో నిలిచింది. నారాయణ్ ఠాకూర్ 14.02 సెకన్లలో గమ్యానికి చేరి విజేతగా నిలిచాడు. పురుషుల షాట్‌పుట్ (ఎఫ్ 56/57)లో వీరేందర్, పురుషుల హైజంప్ (టి 45/46/47)లో రాంపాల్, డిస్కస్ త్రో (ఎఫ్ 43/44/62/64)లో సురేంద్రన్ పిళ్లై, అనీశ్ కుమార్ రజత పతకాలు గెలిచారు. పురుషుల షాట్‌పుట్ (ఎఫ్ 11)లో మోనూ ఘంగాస్, 200 మీటర్ల (టి 44/62/64)లో ఆనందన్ గుణశేఖరన్, డిస్కస్ త్రో (ఎఫ్ 46)లో గుర్జర్ సుందర్ సింగ్, డిస్కస్ త్రో (ఎఫ్ 43/44/62/64)లో ప్రదీప్, మహిళల 200 మీటర్ల పరుగు (టి 45/46/47)లో జయంతి బెహరా కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారు. ప్రస్తుతం భారత్ 6 స్వర్ణాలు, 9 రజతాలు, 13 కాంస్యాలతో కలిపి 28 పతకాలతో తొమ్మిదో స్థానంలోఉంది. -
డబుల్ ధమాకా
ఎట్టకేలకు నిరీక్షణ ముగిసింది. యూత్ ఒలింపిక్స్ క్రీడల చరిత్రలో భారత క్రీడాకారులు పసిడి ఖాతా తెరిచారు. ఒకేరోజు రెండు స్వర్ణాలతో అదరగొట్టారు. మొదట వెయిట్‌లిఫ్టింగ్‌లో జెరెమి లాల్రినుంగా... ఆ తర్వాత మను భాకర్ ‘పసిడి’ ప్రదర్శనతో మెరిశారు. బ్యూనస్ ఎయిర్స్ (అర్జెంటీనా): భారీ అంచనాలతో బరిలోకి దిగి... కీలకదశలో ఒత్తిడిని అధిగమించి... వెయిట్‌లిఫ్టర్ జెరెమి లాల్రినుంగా... షూటర్ మను భాకర్ యూత్ ఒలింపిక్స్‌లో పసిడి కాంతులు విరజిమ్మారు. పురుషుల వెయిట్‌లిఫ్టింగ్ 62 కేజీల విభాగంలో మిజోరం రాష్ట్రానికి చెందిన 15 ఏళ్ల జెరెమి 274 కేజీల బరువెత్తి చాంపియన్‌గా నిలిచాడు. ఈ క్రమంలో యూత్ ఒలింపిక్స్ చరిత్రలో భారత్‌కు స్వర్ణ పతకాన్ని అందించిన తొలి క్రీడాకారుడిగా కొత్త చరిత్ర లిఖించాడు. భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం జరిగిన ఈ ఈవెంట్లో జెరెమి స్నాచ్‌లో 124 కేజీలు... క్లీన్ అండ్ జెర్క్‌లో 150 కేజీలు బరువెత్తాడు. గత రెండేళ్లలో ప్రపంచ యూత్ చాంపియన్‌షిప్‌లో రజత పతకాలు గెలిచిన జెరెమి... ఈ ఏడాది ఆరంభంలో ఆసియా యూత్ చాంపియన్‌షిప్‌లో రజతం... ఆసియా జూనియర్ చాంపియన్‌షిప్‌లో కాంస్యం సాధించాడు. 2011లో ఎనిమిదేళ్ల ప్రాయంలో ఆర్మీ స్పోర్ట్స్ ఇన్స్టిట్యూట్ స్కౌట్స్‌లో చేరిన జెరెమి అక్కడే శిక్షణ తీసుకుంటున్నాడు. జెరెమి తండ్రి లాల్నీత్లువాంగా జాతీయస్థాయి బాక్సర్. ఆయన ఎనిమిది స్వర్ణాలు సాధించారు. మొదట్లో జెరెమి బాక్సర్ కావాలనుకున్న కోచ్‌ల సలహా మేరుకు వెయిట్‌లిఫ్టర్‌గా మారాడు. ‘స్వర్ణం సాధించినందుకు చాలా ఆనందంగా ఉంది. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొని భారత్‌కు పతకం అందించడమే నా లక్ష్యం’అని జెరెమి వ్యాఖ్యానించాడు. గురి అదిరింది... మహిళల షూటింగ్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో హరియాణాకు చెందిన 16 ఏళ్ల మను భాకర్ విజేతగా నిలిచింది. ప్రపంచకప్, కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణాలు గెలిచిన మను... ఆసియా క్రీడలు, ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో మాత్రం నిరాశ పరిచింది. అయితే యూత్ ఒలింపిక్స్‌లో స్వర్ణం నెగ్గి తన సత్తా చాటుకుంది. ఎనిమిది మంది షూటర్లు పాల్గొన్న ఫైనల్లో మను 236.5 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానంలో నిలిచింది. లానా ఎనీనా (రష్యా–235.9 పాయింట్లు) రజతం, నినో ఖుట్సిబెరిడ్జె (జార్జియా–214.6 పాయింట్లు) కాంస్యం సాధించారు. 20 మంది షూటర్లు బరిలోకి దిగిన క్వాలిఫయింగ్‌లో మను 576 పాయింట్లు స్కోరు చేసి ‘టాపర్’గా నిలిచింది. ‘ఈ విజయం నాకెంతో ప్రత్యేకం. ఆసియా క్రీడల్లో, ప్రపంచ చాంపియన్‌షిప్‌లో నిరాశాజనక ప్రదర్శన తర్వాత ఈ పతకంతో నా ఆత్మవిశ్వాసం రెట్టింపు అయింది. భవిష్యత్‌లో మరిన్ని పతకాలు సాధించాలనే లక్ష్యంతో ఉన్నాను’ అని మను వ్యాఖ్యానించింది. వైష్ణవి నిష్క్రమణ... మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్‌లో తెలుగమ్మాయి జక్కా వైష్ణవి రెడ్డి పోరాటం లీగ్ దశలోనే ముగిసింది. గ్రూప్ ‘ఎఫ్’లో ఆమె రెండో స్థానంతో సరిపెట్టుకోగా... ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచి అగ్రస్థానంలో నిలిచిన గాయ్ జెనీ (అమెరికా) క్వార్టర్ ఫైనల్ బెర్త్ దక్కించుకుంది. మంగళవారం రివా సపోనారా (పెరూ)తో జరిగిన మ్యాచ్‌లో వైష్ణవి 21–14, 21–8తో గెలిచింది. ఎనిమిది గ్రూప్‌ల్లో అగ్రస్థానంలో నిలిచిన వారు నేరుగా క్వార్టర్స్‌కు అర్హత సాధిస్తారు. -
‘అర్జున’కు బాక్సర్ అమిత్
న్యూఢిల్లీ: ఆసియా క్రీడల్లో బంగారు పతకం గెలిచిన బాక్సర్ అమిత్ పంఘాల్‌ను ‘అర్జున’ అవార్డు కోసం భారత బాక్సింగ్ సమాఖ్య (బీఎఫ్ఐ) నామినేట్ చేసింది. ఇండోనేసియా ఆతిథ్యమిచ్చిన క్రీడల్లో అతను లైట్ ఫ్లయ్ వెయిట్ (49 కేజీలు) ఫైనల్లో ఒలింపిక్ చాంపియన్ దుస్మతోవ్ (ఉజ్బెకిస్తాన్)ను కంగుతినిపించాడు. దీంతో అతన్ని క్రీడాపురస్కారానికి నామినేట్ చేసినట్లు బీఎఫ్ఐ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే సోనియా లాథర్, గౌరవ్ బిధూరిలను నామినేట్ చేశారు. 22 ఏళ్ల అమిత్ తన నామినేషన్‌పై సంతోషం వ్యక్తం చేశాడు. ‘నా పేరు నామినేట్ చేయడం గొప్ప గౌరవంగా భావిస్తున్నా. ఈ సంతోషాన్ని మాటల్లో చెప్పలేను. దీనిపై నాకంటే నా పతకమే బాగా మాట్లాడుతుంది’ అని చెప్పాడు. -
మనూ స్నాతకోత్సవంలో విద్యార్థులకు నో ఎంట్రీ
విద్యార్థి సంఘం నిరసన.. స్నాతకోత్సవాన్ని బహిష్కరించాలని నిర్ణయం సాక్షి, హైదరాబాద్: స్నాతకోత్సవం వేళ హైదరాబాద్‌లోని మౌలానా ఉర్దూ విశ్వవిద్యాలయం (మనూ) వివాదానికి వేదికగా మారింది. సోమవారం ప్రతిష్టాత్మకంగా జరగనున్న స్నాతకోత్సవానికి తమ విద్యార్థులకే ప్రవేశాన్ని నిరాకరించింది వర్సిటీ యాజమాన్యం. ఇదేమని ప్రశ్నించిన విద్యార్థులకు... సభా ప్రాంగణం సరిపోదని, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, గవర్నర్ నరసింహన్, బాలీవుడ్ స్టార్ షారుక్‌ఖాన్ వంటి ప్రముఖులు వస్తున్నందున భద్రతా కారణాలను సాకుగా చెబుతోంది. అతిథులతో పాటు వర్సిటీ పట్టభద్రులు, అవార్డు గ్రహీతలు, సిబ్బందిని మాత్రమే కార్యక్రమంలో పాల్గొనేందుకు అనుమతించాలని నిర్ణయించింది. దీనిపై వర్సిటీ విద్యార్థి సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. 15 వందల మంది సామర్థ్యం ఉన్న సభా ప్రాంగణంలో కొందరికే ప్రవేశం కల్పించడంపై అభ్యంతరం తెలుపుతున్నాయి. పట్టభద్రులు, అవార్డు గ్రహీతల కుటుంబ సభ్యులు, మిత్రులకు కూడా ఎంట్రీ పాస్‌లు ఇవ్వకపోవడాన్ని తప్పుపడుతున్నాయి. వెనుకబడిన రాష్ట్రం నుంచి వచ్చిన ఓ గోల్డ్ మెడలిస్టు... స్నాతకోత్సవానికి తన తల్లిదండ్రులను పిలిచాడు. అయితే వర్సిటీ వారిని అనుమతించకపోవడంతో నిరాశతో వారు ఇంటిముఖం పట్టారని, కుటుంబ సభ్యుల సమక్షంలో పతకం తీసుకోవాలన్న తన చిరకాల కోరిక నేరవేరడంలేదని సదరు విద్యార్థి ఆవేదన వ్యక్తం చేశాడు. ఇది అవమానకరం... వర్సిటీ క్యాంపస్‌లో స్నాతకోత్సవం నిర్వహించడం ఇదే తొలిసారి. విద్యార్థులకు సంబంధించిన కార్యక్రమంలో విద్యార్థులకు అనుమతి లేకపోవడాన్ని వర్సిటీ విద్యార్థి సంఘం నాయకులు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇది తమకు అవమనకరమని, దీనికి నిరసనగా స్నాతకోత్సవాన్ని బహిష్కరిస్తున్నట్టు మనూ విద్యార్థి సంఘం ప్రకటించింది. డిగ్రీలు, పతకాలు అందుకుంటున్నవారిని అభినందిస్తూనే... వర్సిటీ యాజమాన్యం వైఖరికి నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఓ ప్రకటనలో తెలిపింది. యాజమాన్యం వీఐపీ కల్చర్‌ను పెంచి పోషిస్తోందని సంఘం అధ్యక్షుడు తాజాముల్, కార్యదర్శి అమర్ అజామ్ ఆరోపించారు. వర్సిటీ యాజమాన్యం చెబుతున్న భద్రత కారణాలతో పాటు సభా ప్రాంగణం సరిపోదన్న వాదనలను కొట్టిపారేశారు. దీనిపై వీసీకి లేఖ రాసినా స్పందించలేదన్నారు. విద్యార్థుల పట్ల యాజమాన్యం వ్యవహరిస్తున్న నిరంకుశ వైఖరికి ఇది నిదర్శనమన్నారు. -
ఫోక్.. ఫీవర్
మైక్రోబయాలజీలో గోల్డ్ మెడలిస్ట్. భరతనాట్యంలో దిట్ట. ఇప్పుడు. ఫోక్ బ్యాండ్ రూపకర్త. ఫోక్ బ్యాండ్‌తో సంచలనాలు సృష్టిస్తున్న రఘుదీక్షిత్ ప్రాజెక్ట్ సమర్పించిన సంగీత సందడిలో నగరవాసులు మునిగితేలారు. తన ఆల్‌టైమ్ హిట్ జగ్ చంగాతో పాటుగా మైసూర్ సే ఆయే ఓ, హే భగవాన్, గుడుగుడియా సేడీ నోడో (కన్నడ) వంటి పాటలతో ఫోక్ ఫీవర్‌ని సృష్టించారు రఘు దీక్షిత్ అండ్ కో. హైడొరైట్ 100డేస్ లాంగెస్ట్ ఫెస్టివల్లో భాగంగా అప్పా జంక్షన్లో నిర్వహించినకార్యక్రమం ఆద్యంతం ఫోక్ లవర్స్‌ను ఆకట్టుకుంది. తనదైన శైలిలో సామాన్యుల భాషలో రఘు రచించిన పాటలు అతిథులకు వీనుల విందు చేశాయి. వేలాదిగా సంగీతాభిమానులు హాజరైన ఈ కార్యక్రమాన్ని హైడొరైట్ నిర్వాహకులు రామకృష్ణ, మనోజ్, ఆనంద్‌లు పర్యవేక్షించారు. -
చదువులో గోల్డ్‌మెడల్.. అందాల మోడల్
స్టడీస్‌లో వీక్‌గా ఉంటేనో, మెరిట్ ఆధారిత కెరీర్లో అవకాశాలు లేకపోతేనో.. మోడలింగ్‌ను ఎంచుకుంటారనేది చాలా మంది అభిప్రాయం. అటు పేరెంట్స్ మాత్రమే కాదు ఇటు స్టూడెంట్స్ కూడా అలాగే భావిస్తారు. అయితే సాక్షి అగర్వాల్ మాత్రం అందుకు పూర్తి భిన్నం. చదువులో టాపర్‌గా తనను తాను నిరూపించుకుని, ఎంతో మంచి కెరీర్ ఊరిస్తున్నా ఆసక్తికి అనుగుణంగా మోడలింగ్ ఎంచుకుందీ అమ్మాయి. గ్లామర్ రంగంలో అడుగుపెట్టి తక్కువ టైమ్‌లోనే పాపులారిటీ దక్కించుకుని మోడల్‌గానే కాదు సినిమా అవకాశాలు దక్కించుకోవడంలో సైతం దూసుకుపోతున్న సిటీ అమ్మాయి సాక్షి అగర్వాల్ చెప్పిన ముచ్చట్లివి... చదువులో టాపర్... మా నాన్న వ్యాపారవేత్త. అమ్మ గృహిణి. చెల్లెలు స్కూల్ విద్యార్థిని. నేను చెన్నైలోని అన్నా యూనివర్సిటీలో బి.టెక్ గోల్డ్‌మెడలిస్ట్‌ని. బెంగళూరులోని ఎక్స్ఎమ్ఈ వర్సిటీలో ఎంబీఏ మార్కెటింగ్ చేశాను. అక్కడా టాపర్‌గా నిలిచాను. పెద్ద కంపెనీల్లో ఐదంకెల జీతంతో పెద్ద హోదాతో జాబ్ ఆఫర్స్ వచ్చినా... గ్లామర్ రంగం నన్ను ఆకట్టుకోవడంతో గోల్డ్మెడళ్లూ, మెరిట్ లిస్ట్లూ పక్కన పెట్టి... ఫ్యాషన్ రంగంలో ఓనమాలు దిద్డడానికి సిద్ధపడ్డాను. ఫ్యాషన్‌లో సూపర్... ప్రాథమిక శిక్షణ పూర్తి చేసుకుంటుండగానే మోడలింగ్‌లో ఆఫర్లు వచ్చాయి. షట్టర్ క్లిక్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫొటోగ్రఫీ నుంచి ఫొటోస్మార్ట్ టైటిల్ గెలిచాను. ఫ్యాషన్ డైరీకి బెస్ట్ ఫేస్‌గా ఎన్నికయ్యాను. తిరుపూర్ ఫ్యాషన్ షోలో బ్యూటీ విత్ బ్రెయిన్స్ టైటిల్ గెలిచాను. ఈ టైటిల్స్ ఫలితంగా ఫ్యాషన్ పరిశ్రమలో మోడల్‌గా ఫెమినా, డీఎన్ఏ, శరవణ స్టోర్స్, మలబార్‌గోల్డ్.. వంటి పలు ప్రముఖ బ్రాండ్స్ అవకాశాలు అందుకున్నాను. మరిన్ని మంచి సంస్థలకు చేయాలనేది నా కోరిక. అలా సినిమాస్టార్... మోడలింగ్ నుంచి సినిమా అవకాశాలూ వచ్చాయి. రాజారాణి, నోపార్కింగ్ (తమిళం), హెద్దరి (కన్నడం) సినిమాల్లో నటించాను. తద్వారా లెదర్ కౌన్సిల్ బెస్ట్ అప్‌కమింగ్ యాక్ట్రెస్ ఆఫ్ ది సీజన్ 2013 అవార్డు గెలుచుకున్నాను. చిట్టారా మేగజైన్ ద్వారా మోస్ట్ ప్రామిసింగ్ యాక్టర్ ఆఫ్ ది ఇయర్, బిఒఎఫ్ నుంచి ప్రామిసింగ్ ఉమెన్ అవార్డు దక్కించుకున్నాను. గలాట్లా స్టూడియో స్క్రీనింగ్‌కు చీఫ్‌గెస్ట్‌గా హాజరయ్యాను. అంబేద్కర్ కాలేజ్‌లో, కేంబ్రిడ్జి కాలేజ్, డ్రీమ్జోన్... సెలబ్ జడ్జిగా వ్యవహరించాను. షార్ట్ ఫిల్మ్స్‌లోనూ, మ్యూజిక్ వీడియోల్లోనూ చేశాను. టాలీవుడ్... నా ఫ్యూచర్ మన దేశంలోనే అత్యధిక సంఖ్యలో సినిమాలు నిర్మించే టాలీవుడ్లో నన్ను నేను నిరూపించుకోవాలని ఉంది. మహేష్‌బాబు, రాజమౌళి వంటి సినీ ప్రముఖులతో పాటు సరైన ఆఫర్ వస్తే ఎవరితోనైనా కలిసి పనిచేయడానికి రెడీ. దీపిక పదుకునే నా రోల్‌మోడల్. ఆమె స్థిరంగా తనను తాను నిరూపించుకుంటూ ఎదుగుతోంది. అంతేకాకుండా వ్యక్తిగానూ తన మర్యాదను నిలబెట్టుకుంటోంది. ఏ అమ్మాయైనా తన వరకూ తాను ఒక వ్యక్తిగత గుర్తింపును సాధించాలి. నేను కూడా సాక్షి అగర్వాల్‌గా గుర్తుండిపోవాలనుకుంటున్నాను. ఒక గొప్ప అందమైన నటిగా, డ్యాన్సర్‌గా బయటి ప్రపంచంలోనూ, ఓ మంచి మనిషిగా సన్నిహిత ప్రపంచంలోనూ పేరు తెచ్చుకోవడమే ఆశయం. ఎంచుకున్న ప్రతి రంగంలోనూ అత్యున్నత శిఖరాలను అధిరోహించాలన్నదే నా లక్ష్యం.