మగువా నీకు సలామ్‌.. 8నెలల గర్భంతో గోల్డ్ మెడల్ | Eight Months Pregnant Athlete Wins Taekwondo Gold Medal | Sakshi
Sakshi News home page

మగువా నీకు సలామ్‌.. 8నెలల గర్భంతో గోల్డ్ మెడల్

Published Fri, Apr 9 2021 6:58 PM | Last Updated on Fri, Apr 9 2021 9:04 PM

Eight Months Pregnant Athlete Wins Taekwondo Gold Medal - Sakshi

అబూజా: క్రీడల్లో మహిళల ప్రాతినిధ్యం తగ్గుతూ వస్తున్న ప్రస్తుత తరుణంలో, నైజీరియాకు చెందిన అమినాత్ ఇద్రీస్ అనే 26 ఏళ్ల అథ్లెట్ ఎనిమిది నెలల గర్భంతో ఉండి కూడా తైక్వాండో పోటీల్లో గోల్డ్‌ మెడల్‌ సాధించి సంచలనం సృష్టించింది. ప్రస్తుతం ఆమె పేరు సోషల్‌ మీడియాలో మార్మోగుతోంది. నైజీరియాలో జరిగిన నేషనల్ స్పోర్ట్స్ ఫెస్టివల్ పోటీల్లో భాగంగా తైక్వాండో మిక్స్‌డ్‌ పూమ్సే కేటగిరీలో ఆమె ఈ పతాకాన్ని కైవసం చేసుకొని చరిత్ర సృష్టించింది. దీంతో పాటు ఆమె ఇతర కేటగిరీల్లో సైతం పలు పతాకలు సాధించి ఔరా అనిపించింది.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గర్భం దాల్చడానికి ముందు నుంచే తాను శిక్షణ తీసుకుంటున్నాని, అందువల్లే గర్భంతో ఉండి కూడా పోటీల్లో పాల్గొనడం సమస్యగా అనిపించలేదని పేర్కొంది. ఇద్రీస్ సాధించిన ఘనతకు సంబంధించిన వీడియోను నేషనల్ స్పోర్ట్స్ ఫెస్టివల్ సంస్థ ట్విట్టర్‌లో షేర్ చేయగా, నిమిషాల వ్యవధిలో వైరల్‌గా మారింది. ఎనిమిది నెలల గర్భిణి బంగారు పతకం సాధించి, స్ఫూర్తిదాయకంగా నిలిచిందని క్యాప్షన్‌ జోడించింది. ఈ వీడియోకు విపరీతమైన రెస్పాన్స్‌ రావడంతో నెటిజన్లు ఆమెపై ప్రశంసల వర్షం​ కురిపిస్తున్నారు. మగువా నీకు సలామ్‌ అంటూ తెగ ట్రోల్‌ చేస్తున్నారు.
చదవండి: ద్రవిడ్‌ను ఇంత కోపంగా ఎప్పుడూ చూడలేదు..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement