నచ్చిన కారు తీసుకో.. ఆర్చర్‌ శీతల్ దేవికి ఆనంద్‌ మహీంద్ర ప్రశంస | Anand Mahindra Lauds Asian Para Games Gold Medalist Sheetal Devi offers car | Sakshi
Sakshi News home page

నచ్చిన కారు తీసుకో.. ఆర్చర్‌ శీతల్ దేవికి ఆనంద్‌ మహీంద్ర ప్రశంస

Published Sat, Oct 28 2023 10:59 PM | Last Updated on Sat, Oct 28 2023 11:05 PM

Anand Mahindra Lauds Asian Para Games Gold Medalist Sheetal Devi offers car - Sakshi

అసాధారణమైన ప్రతిభను, పట్టుదలను ప్రోత్సహించడంలో ముందుంటారు మహీంద్రా గ్రూప్‌ చైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా. అలాంటి వ్యక్తులకు తన అభిమానాన్ని, మద్దతును ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియా ద్వారా తెలియజేస్తుంటారు. 

తాజాగా ఆసియా పారా గేమ్స్‌ బంగారు పతక విజేత, ఆర్చర్‌ శీతల్ దేవిని ప్రశంసిస్తూ ‘ఎక్స్‌’ (ట్విటర్‌)లో పోస్ట్‌ పెట్టిన ఆనంద్‌ మహీంద్రా తమ కంపెనీ కార్లలో ఆమెకు నచ్చిన కారును తీసుకోవాలని కోరారు. దాన్ని ఆమె నడిపేందుకు వీలుగా తయారు చేసిస్తామని కూడా చెప్పారు. 

రెండు చేతులూ లేని శీతల్ దేవి ఆసియా పారా గేమ్స్‌లో ఒకే ఎడిషన్‌లో రెండు బంగారు పతకాలను గెలుచుకున్న మొదటి భారతీయ మహిళగా అవతరించింది. ‘జీవితంలో ఇంకెప్పుడూ చిన్న చిన్న పనికిమాలిన సమస్యల గురించి ఆలోచించను. శీతల్‌దేవీ.. నువ్వు అందరికీ స్ఫూర్తి ప్రదాతవు. నీ నుంచి ఎంతో నేర్చుకోవాలి. మా కంపెనీ కార్లలో నీకు నచ్చినది తీసుకో. దాన్ని నువ్వు నడిపేందుకు వీలుగా తయారు చేసిస్తాం’ అని ట్వీట్‌లో రాసుకొచ్చారు ఆనంద్‌ మహీంద్రా. ఆమె కఠోర సాధనకు సంబంధించిన వీడియోను షేర్‌ చేశారు. ఈ ట్వీట్‌కు యూజర్ల నుంచి విశేష స్పందన వచ్చింది. చాలా మంది ఆనంద్‌ మహీంద్రను అభినందిస్తూ కామెంట్లు చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement