Asian Para Games
-
చేతులు లేని తొలి మహిళా పారా ఆర్చర్! రెండు పతకాలతో ప్రపంచాన్నే..
జీవితంలో ఎదురయ్యే చిన్నాచితకా కష్టాల గురించి ఇక మీదట నేను యాగీ చేయను. తల్లీ నువ్వొక గురువువి’ అని ట్వీట్ చేశాడు ఆనంద్ మహీంద్ర, పారా ఆర్చర్ శీతల్ దేవి గురించి. అంతే కాదు తమ సంస్థ నుంచి కోరిన కారు తీసుకోమన్నాడు.రెండు చేతులూ లేకపోయినా విలువిద్య అభ్యసించి ఆసియా పారాగేమ్స్‌లో స్వర్ణాలు సాధించిన కశ్మీర్ అమ్మాయి శీతల్‌దేవి జీవితాన్ని ఎలా ఎదుర్కొనాలో తన పట్టుదలతో చూపించింది. ఆమె జీవితం ఒక ఆదర్శమైతే ఆమె నేర్పిన పాఠం సాకులు చెప్పేవారికి గుణపాఠం. 2021లో బెంగళూరుకు చెందిన ‘బీయింగ్ యు’ అనే సంస్థ శీతల్‌కు ప్రోస్థెటిక్ చేతులు పెట్టించడానికి ఏర్పాట్లు చేసింది. ‘ప్రొస్థెటిక్ చేతులు పెడితే నువ్వు చేసే మొదటి పని ఏమిటి?’ అని అడిగితే ‘గాజులు వేసుకుంటా’ అని టక్కున సమాధానం చెప్పింది శీతల్. నిజానికి ఆ అలంకరణకు తప్పితే మిగిలిన అన్ని పనులకు, తన జీవితాన్ని చక్కదిద్దుకోవడానికి శీతల్‌కు తన ఆత్మవిశ్వాసం చాలు. అందుకే ఆమె ప్రోస్థెటిక్ చేతులను పెద్దగా ఉపయోగించదు. దాదాపు పెట్టుకోదనే చెప్పాలి. ‘నేనెలా ఉన్నానో అలాగే ఉంటాను’ అంటుంది శీతల్. ఈ ధైర్యం ఎంతమందికి ఉంది? రికార్డులు తిరగరాసింది ఇటీవల చైనాలో ముగిసిన ‘ఆసియన్ పారా గేమ్స్’ (దివ్యాంగుల క్రీడలు)లో విలువిద్యలో రెండు స్వర్ణాలు, ఒక రజతం సాధించి రికార్డు సృష్టించింది శీతల్ దేవి. 16 ఏళ్ల వయసులో ఇలా మన దేశం నుంచి విలువిద్య లో రెండు స్వర్ణాలు సాధించిన క్రీడాకారులు లేరు. అది ఒక పెద్ద విశేషం అయితే అంతకన్నా పెద్ద విశేషం శీతల్‌కు రెండుచేతులూ లేకపోవడం. అయినా సరే కుడికాలితో విల్లు ఎత్తి, కుడి భుజంతో నారి సారించి, 50 మీటర్ల దూరంలో ఉండే లక్ష్యాన్ని గురి చూసి బాణం వదిలిందంటే కచ్చితంగా లక్ష్యాన్ని ఛేదించాల్సిందే. అర్జునుడు రెండు చేతులతో బాణాలు సంధిస్తాడు కాబట్టి సవ్యసాచి అన్నారు. శీతల్‌కు చేతులు లేకపోయినా రెండు కాళ్లతో బాణాలు సంధిస్తే ఏమని పిలవాలో. ‘నవ్యసాచి’ అనాలేమో! " You will need Arms to compete at Archery " Sheetal Devi : OKAY , WATCH ME !!! First Female Armless Archer to play World Final 🤯#AsianParaGames #Praise4Para pic.twitter.com/8qS2THRxM0 — The Khel India (@TheKhelIndia) October 27, 2023 జీవితం గొప్పది ‘జీవితంలో నువ్వు ఫలానాది ఎందుకు సాధించలేదు, జీవితం అంటే ఎందుకు ఆసక్తి కోల్పోయావు, జీవితాన్ని ఎందుకు వృథా చేస్తున్నావు’ అని ఎవరినైనా అడిగితే సవాలక్ష వంకలు చెబుతారు, అడ్డంకులొచ్చాయంటారు, కష్టాలు వచ్చాయంటారు, రోజువారి జీవితంలో వచ్చే చిన్నాచితకా సమస్యలకు చికాకు పడిపోతుంటారు, జీవితం నుంచి దూరంగా వ్యసనాల్లోకి పారిపోవాలనుకుంటారు... కాని శీతల్‌ను చూస్తే ఆ అమ్మాయికి మించిన కష్టమా? అయినా కూడా ఆ అమ్మాయి సాధించలేదా? మహీంద్రా అధినేత ఆనంద్ మహీంద్రా అదే అన్నాడు శీతల్‌ను చూసి– ‘తల్లి.. నిన్ను చూశాక జీవితం విలువ తెలిసింది’ అని! ఆమెకు కారు ఆఫర్ చేశాడు. కశ్మీర్ అమ్మాయి శీతల్ దిగువ మధ్యతరగతి కశ్మీర్ అమ్మాయి. వీళ్లది కిష్టవర్ జిల్లా లియోధర్ గ్రామం. తండ్రి మాన్ సింగ్ రైతు, తల్లి శక్తిదేవి కాసిన్ని గొర్రెలను సాకుతుంటుంది. వీరి పెద్దకూతురు శీతల్. చిన్న కూతురు శివాని. శీతల్‌కు పుట్టుకతో చేతులు ఏర్పడలేదు. ఇలాంటి స్థితిని వైద్యపరిభాషలో ‘ఫొకొమెలియా’ అంటారు. అయితే శీతల్ నిరాశలో కుంగిపోలేదు. తల్లిదండ్రులు ఆమెను బేలగా పెంచలేదు. శీతల్ తనకు లేని చేతుల లోటును కాళ్లతో పూడ్చడానికి ప్రయత్నించేది. ఆమెకు చేతులు లేకపోవడం వల్ల మిగిలిన శరీరం అంతా మరింత సూక్ష్మంగా, దృఢంగా తయారయ్యింది. రెండు చేతులూ లేకపోయినా శీతల్ చెట్లు ఎక్కి ఆడుకునేదంటే ఆశ్చర్యం. స్కూల్లో కూడా కాళ్లతోనే నోట్స్ రాసుకోవడం, ఫోన్‌ను ఉపయోగించడం నేర్చుకుంది. 2 year's before whn I visited to #SheetalDevi village in Loi Dhaar (Kishtwar), she totally surprised me by her actions. She was adopted by Indian Army 11 RR Col. Shishpal & thy mde efforts & tried to tie up with no. of NGO's. It ws difficult task bt nvr fr Army @NorthernComd_IA pic.twitter.com/b69zvkDaEl — Deepak Prem Thakur 🇮🇳 (@DeepakThakur_10) October 30, 2023 జీవితం అలాగే సాగిపోయేదేమో కాని కరోనా లాక్డౌన్ వల్ల ఇంటర్నెట్లో తనలాంటి దివ్యాంగులకు సాయం చేసే సంస్థ– బీయింగ్ యు గురించి తెలిసింది. ఆ సంస్థకు చెందిన ప్రీతి రాయ్.. శీతల్లోని క్రీడాకారిణిని గుర్తించింది. దివ్యాంగుల క్రీడల పోటీల్లో ఆమె ప్రతిభ చూపగలదని గ్రహించి, తన సంస్థ స్పాన్సర్షిప్ కింద కశ్మీర్‌లోని కత్రాలో దివ్యాంగుల క్రీడా శిక్షణా కేంద్రానికి పంపింది. ఆగస్టు 2022 నుంచి మాత్రమే శీతల్ విలువిద్య సాధన మొదలెట్టింది. 2023 అక్టోబర్ నాటికి అంతర్జాతీయ గుర్తింపు పొందింది. ఇంతకన్నా విజయం ఉందా? ‘నాకు ఎలాగైనా సాధించాలని ఉండేది. అందుకు ఏమిటి మార్గం అని మా కోచ్‌ను అడిగాను. కష్టపడాలి అన్నాడు. కష్టపడ్డాను. చాలా చాలా కష్టపడ్డాను’ అంటుంది శీతల్. అడ్డదారుల్లో వెళితే విజయం ఉండొచ్చు లేకపోవచ్చు. కాని కష్టపడితే? గెలుపు తథ్యం. శీతల్‌ను చూసి మన జీవితాల్లో లక్ష్యాన్ని గురి చూద్దాం. (చదవండి: ఎమర్జెన్సీపై ఇందిరా గాంధీ వ్యాఖ్యలు.. విలేకరుల ముఖంపై చిరునవ్వులు) -
111 పతకాలు... ఐదో స్థానం
హాంగ్జౌ: పారా ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్లు సత్తా చాటారు. మునుపెన్నడు లేని విధంగా ఈ క్రీడల్లో తొలిసారి పతకాల సెంచరీని సాధించారు. చైనా ఆతిథ్యమిచ్చిన ఈ ఆసియా మెగా ఈవెంట్లో ఏకంగా 111 పతకాలతో భారత్ టాప్–5లో నిలిచింది. ఇందులో 29 స్వర్ణాలు, 31 రజతాలు, 51 కాంస్య పతకాలున్నాయి. ఇటీవలే ఆసియా క్రీడల్లో భారత్ 107 పతకాలతో నాలుగో స్థానం సాధించగా...ఇప్పుడు భారత బృందానికి ఐదో స్థానం లభించింది. నీరజ్ స్వర్ణంతో... ఆఖరి రోజు శనివారం పోటీల్లో నీరాజ్ యాదవ్ జావెలిన్ త్రో (ఎఫ్55)లో 33.69 మీటర్లతో రికార్డు దూరం విసిరి బంగారం నిలబెట్టుకున్నాడు. 39 ఏళ్ల నీరజ్ గత 2018 పారా ఈవెంట్లోనూ పసిడి పట్టాడు. ఈ క్రీడల్లో సహచరుడు టెక్ చంద్ (30.36 మీ.) కాంస్యంతో తృప్తిపడ్డాడు. తర్వాత దిలిప్ మహాదు పురుషుల 400 మీటర్ల పరుగులో విజేతగా నిలిచాడు. మహిళల 1500 మీటర్ల రేసులో పూజ కాంస్యం నెగ్గింది. వ్యక్తిగత ర్యాపిడ్–6 బి1 ఈవెంట్లో సతీశ్ ఇనాని, ప్రధాన్ కుమార్, అశ్విన్‌భాయ్ కంచన్ వరుసగా స్వర్ణ, రజత, కాంస్య పతకాలతో క్లీన్‌స్వీప్ చేశారు. బి2/బి3 ఈవెంట్లో కిషన్ కాంస్యం, ఇదే టీమ్ ఈవెంట్లో కిషన్, ఆర్యన్, సోమేంద్రలతో కూడిన బృందం కాంస్య పతకం గెలుచుకుంది. మహిళల టీమ్ ఈవెంట్లో వృతి జైన్, హిమాన్షి, సంస్కృతి కాంస్యం నెగ్గారు. టాప్–5 పట్టికలో... ఆతిథ్య చైనా పారా అథ్లెట్లు 521 పతకాలతో పట్టికలో అగ్ర స్థానంలో నిలిచారు. రెండో మూడు స్థానాల్లో ఇరాన్ (131), జపాన్ (150) వరుసగా నిలిచాయి. దక్షిణ కొరియా (103) మనకన్నా తక్కువ పతకాలు సాధించినప్పటికీ ఒకే ఒక్క స్వర్ణం తేడాతో నాలుగో స్థానంలో నిలిచింది. కొరియా 30 బంగారు పతకాలు నెగ్గితే... భారత్ 29 గెలిచింది. -
నచ్చిన కారు తీసుకో.. ఆర్చర్ శీతల్ దేవికి ఆనంద్ మహీంద్ర ప్రశంస
అసాధారణమైన ప్రతిభను, పట్టుదలను ప్రోత్సహించడంలో ముందుంటారు మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా. అలాంటి వ్యక్తులకు తన అభిమానాన్ని, మద్దతును ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తుంటారు. తాజాగా ఆసియా పారా గేమ్స్ బంగారు పతక విజేత, ఆర్చర్ శీతల్ దేవిని ప్రశంసిస్తూ ‘ఎక్స్’ (ట్విటర్)లో పోస్ట్ పెట్టిన ఆనంద్ మహీంద్రా తమ కంపెనీ కార్లలో ఆమెకు నచ్చిన కారును తీసుకోవాలని కోరారు. దాన్ని ఆమె నడిపేందుకు వీలుగా తయారు చేసిస్తామని కూడా చెప్పారు. రెండు చేతులూ లేని శీతల్ దేవి ఆసియా పారా గేమ్స్‌లో ఒకే ఎడిషన్‌లో రెండు బంగారు పతకాలను గెలుచుకున్న మొదటి భారతీయ మహిళగా అవతరించింది. ‘జీవితంలో ఇంకెప్పుడూ చిన్న చిన్న పనికిమాలిన సమస్యల గురించి ఆలోచించను. శీతల్‌దేవీ.. నువ్వు అందరికీ స్ఫూర్తి ప్రదాతవు. నీ నుంచి ఎంతో నేర్చుకోవాలి. మా కంపెనీ కార్లలో నీకు నచ్చినది తీసుకో. దాన్ని నువ్వు నడిపేందుకు వీలుగా తయారు చేసిస్తాం’ అని ట్వీట్లో రాసుకొచ్చారు ఆనంద్ మహీంద్రా. ఆమె కఠోర సాధనకు సంబంధించిన వీడియోను షేర్ చేశారు. ఈ ట్వీట్‌కు యూజర్ల నుంచి విశేష స్పందన వచ్చింది. చాలా మంది ఆనంద్ మహీంద్రను అభినందిస్తూ కామెంట్లు చేశారు. I will never,EVER again complain about petty problems in my life. #SheetalDevi you are a teacher to us all. Please pick any car from our range & we will award it to you & customise it for your use. pic.twitter.com/JU6DOR5iqs — anand mahindra (@anandmahindra) October 28, 2023 -
Asian Para Games: భారత్ సరికొత్త చరిత్ర.. వందో పతకం గోల్డ్! ఎవరిదంటే
Asian para games 2023: ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్లో తొలిసారి వంద పతకాల మైలురాయిని అందుకుంది. చైనాలోని హోంగ్జూ వేదికగా జరుగుతున్న ఆసియా పారా క్రీడల్లో అథ్లెట్ దిలీప్ మహదు గవిత్ పసిడి గెలిచి సెంచరీ మెడల్స్ లాంఛనం పూర్తి చేశాడు. పురుషుల 400 మీటర్ల పరుగును 49.48 సెకన్లలో పూర్తి చేసిన దిలీప్.. భారత్ గర్వించదగ్గ మధుర జ్ఞాపకాల్లో తన పేరును ‘సువర్ణా’క్షరాలతో లిఖించుకున్నాడు. కాగా ఆసియా పారా క్రీడల్లో భారత్ ఇప్పటి వరకు 29 పసిడి, 31 రజత, 51 కాంస్యాలతో 111 పతకాలు కైవసం చేసుకుంది. తద్వారా పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతోంది. ఇక చైనా అత్యధికంగా 214 స్వర్ణాలు, 167 వెండి, 140 కంచు పతకాలతో మొత్తంగా 521 మెడల్స్‌తో ఎవరికీ అందనంత ఎత్తులో ఉంది. చైనా తర్వాత.. 131 పతకాలతో ఇరాన్ రెండో స్థానం ఆక్రమించింది. ప్రధాని మోదీ అభినందనలు ఆసియా పారా క్రీడల్లో తొలిసారిగా భారత క్రీడాకారులు 100 పతకాలు గెలవడంతో ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. పారా అథ్లెట్ల కఠిన శ్రమ, అంకిత భావం కారణంగానే సరికొత్త చరిత్ర ఆవిష్కృతమైందని పేర్కొన్నారు. దేశానికి గర్వకారణంగా నిలిచారంటూ.. ఇంతకంటే ఆనందం మరొకటి ఉండదంటూ అథ్లెట్లను మోదీ అభినందించారు. చదవండి: ఓవరాక్షన్ రిజ్వాన్.. అతడి గుండె పగిలింది! మేము ‘చోకర్స్’ కాదు.. అర్థమైందా? 100 MEDALS at the Asian Para Games! A moment of unparalleled joy. This success is a result of the sheer talent, hard work, and determination of our athletes. This remarkable milestone fills our hearts with immense pride. I extend my deepest appreciation and gratitude to our… pic.twitter.com/UYQD0F9veM — Narendra Modi (@narendramodi) October 28, 2023