సెక్స్‌ లైఫ్‌ గురించి ప్రశ్న.. నీరజ్‌ చోప్రా ఎలా స్పందించాడో చూడండి.. | Viral: Asked About Sex Life In Interview, Neeraj Chopra Kept Calm And Carried On | Sakshi
Sakshi News home page

Neeraj Chopra: సెక్స్‌ లైఫ్‌ గురించి దిమ్మతిరిగిపోయే ప్రశ్న వేసిన చరిత్రకారుడు

Published Mon, Sep 6 2021 8:54 PM | Last Updated on Mon, Sep 6 2021 8:54 PM

Viral: Asked About Sex Life In Interview, Neeraj Chopra Kept Calm And Carried On - Sakshi

న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌ జావెలిన్ త్రో క్రీడలో స్వర్ణ పతకం సాధించి భారత ఖ్యాతిని ఖండాంతరాలు దాటించిన నీర‌జ్ చోప్రా.. రాత్రిరాత్రి దేశంలో పెద్ద స్టార్‌ అయిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అతడిని ఇంటర్వ్యూ చేసేందుకు ప్రముఖ మీడియా సంస్థలు, జర్నలిస్ట్‌లు క్యూ కడుతున్నారు. తాజాగా ఓ ప్రముఖ ఆంగ్ల మీడియా సంస్థ నీరజ్‌ను ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూకు ఆహ్వానించింది. ఇందులో పలువురు అతని వ్యక్తిగత, క్రీడా జీవితానికి సంబంధించిన ప్రశ్నలు అడిగారు. 

ఇదే క్రమంలో ప్రముఖ చరిత్రకారుడు రాజీవ్‌ సేథీ లైన్‌లోకి వచ్చి నీరజ్‌ను ఇబ్బంది పెట్టే ప్రశ్న ఒకటి సంధించాడు. 'అందమైన కుర్రాడివి.. నీ సెక్స్‌ జీవితాన్ని, అథ్లెటిక్స్‌ను ఎలా బ్యాలెన్స్‌ చేస్తున్నావంటూ' దిమ్మతిరిగిపోయే ప్రశ్న వేశాడు. ఓ ప్రముఖ వ్యక్తి అకస్మాత్తుగా ఇలాంటి ప్రశ్న వేసేసరికి నీరజ్‌ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. ఏం మాట్లాడాలో తెలీక కాసేపు గమ్మునుండిపోయాడు.

అయితే ఈ షాక్‌ నుంచి తేరుకున్న అనంతరం నీరజ్‌ చాలా హుందాగా స్పందించాడు. 'సారీ సర్‌' అని సమాధానం ఇచ్చాడు. అయినా సరే రాజీవ్‌ సేథీ నీరజ్‌ను వదిలిపెట్టలేదు. ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వాలంటూ పట్టుపట్టాడు. అయినప్పటికీ నీరజ్‌ సహనం కోల్పోకుండా 'ప్లీజ్‌ సర్‌, మీ ప్రశ్నతో నా మనసు నిండిపోయిందంటూ' చాలా హుందాగా జవాబిచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది.

నీరజ్‌కు ఇలాంటి ప్ర‌శ్నను సంధించిన రాజీవ్ సేథి వైఖ‌రిని చాలా మంది ప్ర‌ముఖులు తప్పుపట్టారు. ఈ వీడియోపై శివసేన రాజ్యసభ ఎంపీ ప్రియాంక చతుర్వేది స్పందించారు. 'ఎదుర్కొన్న చెత్త ప్రశ్నలకు కూడా సౌమ్యంగా సమధానం చెప్పిన నీరజ్‌ చోప్రాపై నాకు గౌరవం పెరిగిందని, నిజమైన స్పోర్ట్స్‌ పర్సన్‌ ఇలానే వ్యవహరిస్తాడని నీరజ్‌ను ఆకాశానికెత్తాడు. ఇలా చాలామంది నెటిజన్లు నీరజ్‌ వ్యవహరించిన తీరుకు ఫిదా అయ్యారు. ప్రస్తుతం ఈ అంశం సోషల్‌మీడియాలో ట్రెండ్‌ అవుతోంది.
చదవండి: కపిల్‌ రికార్డు బద్దలు కొట్టిన టీమిండియా పేసు గుర్రం..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement