Controversy: Girls Dancing Infront Of Neeraj Chopra In Zoom Call - Sakshi
Sakshi News home page

నీరజ్‌ చోప్రా ముందు అసభ్యకర డ్యాన్స్‌లు; ఫ్యాన్స్‌ ఆగ్రహం

Published Sat, Aug 21 2021 10:00 AM | Last Updated on Sat, Aug 21 2021 10:44 AM

Major Backlash On Twitter RJ Malishka And Girls Dance For Neeraj Chopra - Sakshi

టోక్యో ఒలింపిక్స్‌ గోల్డ్‌ మెడలిస్ట్‌ నీరజ్‌ చోప్రా ముందు యువతులు చేసిన అసభ్యకర డ్యాన్స్‌ వివాదాస్పదంగా మారింది. దేశానికి గోల్డ్‌ మెడల్‌ తెచ్చిన వ్యక్తితో ఇలాగేనా ప్రవర్తించేది అంటూ నెటిజన్లు ఏకిపారేశారు. వివరాల్లోకి వెళితే.. ఒలింపిక్స్‌లో గోల్డ్‌ మెడల్‌ సాధించిన నీరజ్‌ చోప్రాను శుక్రవారం రేడియో జాకీ మలిష్కా మెండోన్సా జూమ్‌ యాప్‌ ద్వారా ఇంటర్య్వూ చేసింది.
చదవండి: Neeraj Chopra: గర్ల్‌ఫ్రెండ్‌ విషయంపై నీరజ్‌ చోప్రా క్లారిటీ

ఇంటర్య్వూలో భాగంగా మలిష్కాతో పాటు కొందరు యువతులు లాప్‌టాప్‌లో నీరజ్‌ చోప్రాను చూస్తూ 1957 బాలీవుడ్‌ సినిమా ''నయా దౌర్‌''లోని ''ఉడెన్‌ జబ్‌ జబ్‌ దల్హే తేరీ'' పాటకు అసభ్యకర డ్యాన్స్‌లు చేశారు. ఆ తర్వాత మలిష్కా నీరజ్‌కు కొన్ని ప్రశ్నలు వేసింది. దీనికి సంబంధించిన వీడియోనూ మలిష్కా తన ట్విటర్‌లో షేర్‌ చేసింది. ఇంకేముంది ఇది చూసిన నెటిజన్లు యువతులను ఒక ఆట ఆడుకున్నారు. ''దేశానికి పతకం తెచ్చిన వ్యక్తితో ఇలాగేనా ప్రవర్తించేది.. మీ ప్రవర్తనతో తల దించుకునేలా చేశారు... అతనికి మీరిచ్చే గౌరవం ఇదేనా'' అంటూ నెటిజన్లు కామెంట్లు పెట్టారు. 

ఇక నీరజ్‌ చోప్రా టోక్యో ఒలింపిక్స్‌లో అద్భుతం చేసి చూపించాడు. స్వర్ణం గెలిచి  అంతర్జాతీయ వేదికపై భారత్‌ త్రివర్ణ పతకాన్ని రెపరెపలాడించాడు. జావెలిన్‌ త్రో ఫైనల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన నీరజ్‌ చోప్రా ఏకంగా స్వర్ణం కొల్లగొట్టాడు. ఫైనల్లో  నీరజ్‌ రెండో రౌండ్‌లో 87.58 మీటర్లు విసిరి సీజన్‌ బెస్ట్‌ నమోదు చేసి స్వర్ణం గెలిచి భారత్‌కు గోల్డెన్‌ ముగింపు ఇచ్చాడు.

చదవండి: స్వర్ణ విజేత నీరజ్‌ చోప్రాకు తీవ్ర జ్వరం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement