ఫోక్.. ఫీవర్
మైక్రోబయాలజీలో గోల్డ్ మెడలిస్ట్. భరతనాట్యంలో దిట్ట. ఇప్పుడు. ఫోక్ బ్యాండ్ రూపకర్త. ఫోక్ బ్యాండ్‌తో సంచలనాలు సృష్టిస్తున్న రఘుదీక్షిత్ ప్రాజెక్ట్ సమర్పించిన సంగీత సందడిలో నగరవాసులు మునిగితేలారు. తన ఆల్‌టైమ్ హిట్ జగ్ చంగాతో పాటుగా మైసూర్ సే ఆయే ఓ, హే భగవాన్, గుడుగుడియా సేడీ నోడో (కన్నడ) వంటి పాటలతో ఫోక్ ఫీవర్‌ని సృష్టించారు రఘు దీక్షిత్ అండ్ కో. హైడొరైట్ 100డేస్ లాంగెస్ట్ ఫెస్టివల్‌లో భాగంగా అప్పా జంక్షన్‌లో నిర్వహించినకార్యక్రమం ఆద్యంతం ఫోక్ లవర్స్‌ను ఆకట్టుకుంది.
తనదైన శైలిలో సామాన్యుల భాషలో రఘు రచించిన పాటలు అతిథులకు వీనుల విందు చేశాయి. వేలాదిగా సంగీతాభిమానులు హాజరైన ఈ కార్యక్రమాన్ని హైడొరైట్ నిర్వాహకులు రామకృష్ణ, మనోజ్, ఆనంద్‌లు పర్యవేక్షించారు.