‘పసిడి’కి పంచ్‌ దూరంలో... | Nikhat Zareen stormed into the final | Sakshi
Sakshi News home page

‘పసిడి’కి పంచ్‌ దూరంలో...

Dec 26 2022 6:08 AM | Updated on Dec 26 2022 6:08 AM

Nikhat Zareen stormed into the final - Sakshi

జాతీయ సీనియర్‌ మహిళల బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ అమ్మాయి నిఖత్‌ జరీన్‌ (50 కేజీలు) పసిడి పతకానికి విజయం దూరంలో నిలిచింది. భోపాల్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో నిజామాబాద్‌ జిల్లాకు చెందిన నిఖత్‌ ఫైనల్లోకి దూసుకెళ్లింది.

ఆదివారం జరిగిన సెమీఫైనల్లో నిఖత్‌ 5–0తో శివిందర్‌ కౌర్‌ (ఆలిండియా పోలీస్‌)పై ఘనవిజయం సాధించింది. నేడు జరిగే ఫైనల్లో అనామిక (రైల్వేస్‌)తో నిఖత్‌ తలపడుతుంది. 75 కేజీల విభాగంలో టోక్యో ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత లవ్లీనా బొర్గోహైన్‌ (అస్సాం) కూడా ఫైనల్‌ చేరింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement