National Senior Boxing
-
‘పసిడి’కి పంచ్ దూరంలో...
జాతీయ సీనియర్ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్ (50 కేజీలు) పసిడి పతకానికి విజయం దూరంలో నిలిచింది. భోపాల్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో నిజామాబాద్ జిల్లాకు చెందిన నిఖత్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఆదివారం జరిగిన సెమీఫైనల్లో నిఖత్ 5–0తో శివిందర్ కౌర్ (ఆలిండియా పోలీస్)పై ఘనవిజయం సాధించింది. నేడు జరిగే ఫైనల్లో అనామిక (రైల్వేస్)తో నిఖత్ తలపడుతుంది. 75 కేజీల విభాగంలో టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత లవ్లీనా బొర్గోహైన్ (అస్సాం) కూడా ఫైనల్ చేరింది. -
నిఖత్‌కు స్వర్ణం
జాతీయ సీనియర్ బాక్సింగ్ గువహటి: జాతీయ సీనియర్ (ఎలైట్) మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ క్రీడాకారిణి నిఖత్ జరీన్ సత్తా చాటింది. చాంపియన్‌షిప్ ఫ్లయ్ వెయిట్ (48-51 కేజీలు) విభాగంలో జరీన్ విజేతగా నిలిచింది. అసోంలోని గువహటిలో ఈ పోటీలు జరుగుతున్నాయి. ఆదివారం జరిగిన ఫైనల్లో జరీన్ 3-0 స్కోరుతో వన్లాల్ దువాతి (మిజోరాం)ను చిత్తు చేసింది. నిజామాబాద్ జిల్లాకు చెందిన 19 ఏళ్ల జరీన్ తనకంటే సీనియర్ అయిన దువాతిని వరుస పంచ్‌లతో బెంబేలెత్తించి ఏకపక్ష విజయం సాధించడం విశేషం. అంతకుముందు జరీన్ సెమీఫైనల్లో జాహ్నవి (రైల్వేస్)ను 3-0తో ఓడించింది.