నిఖత్‌కు స్వర్ణం | Telangana player nikhat Zareen | Sakshi
Sakshi News home page

నిఖత్‌కు స్వర్ణం

Published Mon, Nov 2 2015 12:33 AM | Last Updated on Sun, Sep 3 2017 11:50 AM

నిఖత్‌కు స్వర్ణం

నిఖత్‌కు స్వర్ణం

జాతీయ సీనియర్ బాక్సింగ్
గువహటి: జాతీయ సీనియర్ (ఎలైట్) మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ క్రీడాకారిణి నిఖత్ జరీన్ సత్తా చాటింది. చాంపియన్‌షిప్ ఫ్లయ్ వెయిట్ (48-51 కేజీలు) విభాగంలో జరీన్ విజేతగా నిలిచింది. అసోంలోని గువహటిలో ఈ పోటీలు జరుగుతున్నాయి. ఆదివారం జరిగిన ఫైనల్లో జరీన్ 3-0 స్కోరుతో వన్‌లాల్ దువాతి (మిజోరాం)ను చిత్తు చేసింది. నిజామాబాద్ జిల్లాకు చెందిన 19 ఏళ్ల జరీన్ తనకంటే సీనియర్ అయిన దువాతిని వరుస పంచ్‌లతో బెంబేలెత్తించి ఏకపక్ష విజయం సాధించడం విశేషం. అంతకుముందు జరీన్ సెమీఫైనల్లో జాహ్నవి (రైల్వేస్)ను 3-0తో ఓడించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement