
యోగి వేమన విశ్వవిద్యాలయంలో కొత్త సంవత్సరం సంక్రాంతి సంబరాలను మోసుకొచ్చింది. వై వి యు గురుకుల ప్రాంగణం ముత్యాల ముగ్గులు, గొబ్బెమ్మలతో అలరారగా, యువకులు ఉత్సాహంగా ఉట్టికొట్టడంలో పోటీ పడగా, సాంప్రదాయ కోలాటాలు, హరిదాసు సంకీర్తనలతో విశ్వవిద్యాలయంలో ముందస్తు సంక్రాంతి సంబరాలు కన్నుల పండుగ సాగాయి






















