yogi vemana university
-
యోగి వేమనా.. నీకు వందనం
వైవీయూ(వైఎస్సార్ జిల్లా): విశ్వదాభిరామ.. వినురవేమ.. అనేమాట వినని తెలుగువారు ఉండరు.. ‘‘వానకు తడవని వారు, ఒక వేమన పద్యం కూడా రాని తెలుగువారు ఉండరు’’ అని లోకోక్తి. ఆ మహాకవికి రాష్ట్ర ప్రభుత్వం సముచిత గౌరవం కల్పించింది. యోగివేమన జయంతిని రాష్ట్ర వేడుకగా ప్రతి సంవత్సరం జనవరి 19న అధికారికంగా నిర్వహించాలని గతనెలలో జీఓ నెంబర్ 164ను విడుదల చేసింది. దీంతో ప్రతియేటా జనవరి 19న వేమన జయంతి వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించేందుకు మార్గం సుగమమైంది. ∙ప్రజాకవి, తాత్వికవేత్త అయిన వేమన పేరుతో దేశంలో ఏర్పాటైన ఏకైక విశ్వవిద్యాలయం యోగివేమన విశ్వవిద్యాలయం. 2006లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేతుల మీదుగా ఏర్పాటైన ఈ విశ్వవిద్యాలయంలో 2014లో వేమన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ప్రతి యేటా జనవరి 18వ తేదీన వేమన జయంతి వేడుకలు నిర్వహిస్తూ వచ్చారు. వేమన జయంతి జనవరి 18 అనేందుకు చారిత్రక ఆధారాలు ఎక్కడా లేకపోవడంతో సాహితీవేత్తలు, చరిత్రకారుల అభిప్రాయాల మేరకు అప్పటి వీసీ ఆచార్య మునగల సూర్యకళావతి ఆదేశాల మేరకు గత రెండు సంవత్సరాలుగా వైవీయూలో జనవరి 19న నిర్వహిస్తూ వచ్చారు. తాజాగా ప్రభుత్వ ఉత్తర్వులు మేరకు జనవరి 19న రాష్ట్రవేడుకగా నిర్వహించేందుకు విశ్వవిద్యాలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రాంగణంలో వేమన పద్యాలు.. వేమన పద్యాలు ఎంత సరళంగా స్పష్టంగా, అర్థవంతంగా ఉంటాయో.. ఆ పద్యాలకు ఉన్న ఆదరణే తెలియజేస్తుంది. అయితే వేమన పేరుతో ఏర్పాటైన విశ్వవిద్యాలయంలో ఆయన నోటి నుంచి జాలువారిన పద్యాలను ఎంపిక చేసుకుని విశ్వవిద్యాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. విశ్వవిద్యాలయంలో ‘వేమన మాట’ పేరుతో వేమన పద్యాలను రాసి క్యాంపస్‌లో పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. నేడు వైవీయూలో.. యోగివేమన విశ్వవిద్యాలయంలో గురువారం వేమన జయంతి ఉత్సవం నిర్వహిస్తున్నట్లు తెలుగుశాఖ విభాగాధిపతి ఆచార్య జి. పార్వతి తెలిపారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏపీ ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య కె. హేమచంద్రారెడ్డి, సభాధ్యక్షులుగా వైస్ చాన్సలర్ ఆచార్య రంగ జనార్ధన, ప్రత్యేక ఆహ్వానితులుగా రిజిస్ట్రార్ ఆచార్య వై.పి. వెంకటసుబ్బయ్య, ప్రిన్సిపాల్ ఆచార్య కె. కృష్ణారెడ్డి హాజరవుతారని తెలిపారు. ప్రధానవక్తగా మైసూరులోని కర్ణాటక రాష్ట్ర సార్వత్రిక విశ్వవిద్యాలయం పీఠాధిపతి ఆచార్య ఎం. రామనాథంనాయుడు హాజరై కీలకోపన్యాసం చేస్తారని తెలిపారు. ఈ సందర్భంగా అతిథులు చేతుల మీదుగా వేమన విగ్రహానికి పుష్పమాలలతో అలంకరణ, వేమన చైతన్య యాత్ర, వేమన నాటికప్రదర్శన, పద్యగానం కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. -
Mallireddy Pattabhi Rama Reddy: చరిత్ర రచనకు సోపానం
భారతదేశంలో రాష్ట్ర స్థాయిలో హిస్టరీ కాంగ్రెస్ లేని రోజు ల్లోనే ‘ఆంధ్రప్రదేశ్ హిస్టరీ కాంగ్రెస్’ను స్థాపించడంలో ప్రధాన భూమిక పోషించినవారు మల్లిరెడ్డి పట్టాభి రామరెడ్డి. జనవరి 7, 8 తేదీల్లో కడప యోగి వేమన యూనివర్సిటీలో ఆ హిస్టరీ కాంగ్రెస్ తన 45వ వార్షిక సమావేశాన్ని నిర్వహించుకుంటోంది. ఈ సందర్భంగా పట్టాభి రామరెడ్డి గురించీ, ఏపీ హిస్టరీ కాంగ్రెస్ గురించీ సంక్షిప్తంగానైనా మాట్లాడుకోవలసి ఉంది. పట్టాభి రామరెడ్డి గొప్ప మేధావి. అసాధారణ అధ్యాపకుడు. చరిత్ర పరిశోధకునిగా ఆయన తన తరువాతి తరాలకు మార్గం చూపించారు. ఆయన తొలిసారిగా బీఏ, ఎంఏ కోర్సు లలోనూ, ఏపీపీఎస్సీ నిర్వహించే పోటీ పరీక్షలలోనూ ఆంధ్రుల చరిత్రను సిలబస్‌లో చేర్చేలా కృషి చేశారు. తెలుగు వారి చరిత్రను లోతుగా ఆధ్యయనం సాగించడానికి నెల్లూరు జిల్లా కావలి జవహర్ భారతి కాలేజీలో 1976 మే నెల ఒకటి, రెండు తేదీలలో ఆంధ్రప్రదేశ్ హిస్టరీ కాంగ్రెస్ తొలి స్థాపనా సమావేశాలను నిర్వ హించారు. ఆయన కోరుకున్న విధంగానే ఏపీ హిస్టరీ కాంగ్రెస్... ఆదిమ యుగాల నుంచి ఇప్పటివరకూ ఉన్న తెలుగు నేల చరిత్ర, సంస్కృతులను అధ్యయనం చేసి విలువైన సంపుటా లను ప్రచురించింది. ఇవ్వాళ దేశంలో ఏపీ హిస్టరీ కాంగ్రెస్ అంటే ఓ గౌరవం ఉంది. ఒక స్థాయి ఉంది. పట్టాభి రామరెడ్డి క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. ఎమ్ఎన్ రాయ్ ప్రభావానికి లోనై సోషలిస్టు పార్టీ రాజకీయాల్లో పాల్గొన్నారు. తాను చదువుకున్న మద్రాస్ పచ్చ యప్పాస్ కళాశాలలోనే అధ్యాపకుడిగా కొంతకాలం పని చేశారు. కావలి ‘జవహర్ భారతి’లో అధ్యాపకుడిగాచేరి అనేక హోదాల్లో పనిచేశారు. అలాగే శ్రీ వెంకటేశ్వరా యూనివర్సిటీ లోనూ పనిచేశారు. ఆయన నెల్లూరు చరిత్రపైనా, మొత్తంగా తెలుగువారి చరిత్రపైనా ఎన్నో గ్రంథాలు రాశారు. ఇంతటి ప్రతిభాశాలి 2004 మార్చి 30న తుదిశ్వాస విడిచారు. ఆయన కలల పంట ఏపీ హిస్టరీ కాంగ్రెస్ మాత్రం తెలుగువారి సేవలో తరిస్తోంది. (క్లిక్ చేయండి: ఆంధ్రా కురియన్‌కు నివాళి!) – ప్రొఫెసర్ దేవిరెడ్డి సుబ్రమణ్యం రెడ్డి రిటైర్డ్ చరిత్ర ఆచార్యులు, ఎస్వీ యూనివర్సిటీ -
వినుర వేమ.. ఏదైనా సరే రాజకీయమే ..!
-
వేమన విగ్రహానికి అగ్రస్థానం
వైవీయూ: యోగి వేమన విశ్వవిద్యాలయంలో వేమన విగ్రహానికి మరింత ప్రాధాన్యత కల్పించామని, దీనిని గుర్తించకుండా రాజకీయం చేయడం తగదని వైస్ చాన్సలర్ ఆచార్య మునగల సూర్యకళావతి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై ఆమె మీడియాతో మాట్లాడుతూ ‘విశ్వవిద్యాలయంలో ఎక్కడా కొత్త విగ్రహాలు ఏర్పాటు చేయలేదు. తొలగించనూ లేదు. వేమన విగ్రహాన్ని కొత్తగా నిర్మించిన ప్రధాన ముఖ ద్వారం వద్ద గత నెల 31న ఏర్పాటు చేయడంతో ఖాళీ అయిన స్థానంలో వైవీయూ వ్యవస్థాపకుడు వైఎస్సార్ విగ్రహం ఏర్పాటు చేశాం. ఈ మార్పు వల్ల వేమనకు మరింత ప్రాధాన్యత లభిస్తుంది. ఇదివరకు లోపలికి వస్తే కానీ కనిపించని వేమన విగ్రహం.. ఇప్పుడు ప్రధాన ద్వారం వద్దే అందరికీ బాగా కనిపిస్తుంది. ఈ వాస్తవం కళ్లెదుటే కనిపిస్తున్నా, దీనిని రాజకీయం చేయడం సరికాదు’ అని అన్నారు. ఇదిలా ఉండగా, ఆ పత్రికల్లో సాగిన దుష్ప్రచారంపై విశ్వవిద్యాలయం అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ‘మేము ఇక్కడే ఉంటున్నాం కాబట్టి ఆ పత్రికలు తప్పుడు వార్త ప్రచురించాయని తెలిసింది. వేరే ఊళ్లలో ఉంటున్న వారు అదే వాస్తవమని నమ్మే ప్రమాదం ఉంది. అమ్మో.. ఇంత భయంకరంగా, పచ్చిగా, నిస్సిగ్గుగా అబద్ధాలు చెబుతారా?’ అని అన్నారు. -
ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం.. విగ్రహం మార్పుపై వైవీయూ వీసీ క్లారిటీ
సాక్షి, వైఎస్సార్ కడప: యోగి వేమన యూనివర్శిటీలో వేమన విగ్రహ ఏర్పాటుని రాజకీయం చేయొద్దని యూనివర్శిటీ వైస్ ఛాన్స్లర్ ఆచార్య మునగాల సూర్యకళావతి కోరారు. న్యాక్ గ్రేడింగ్‌లో యూనివర్శిటీ అభివృద్ధి చూసే ఏ గ్రేడ్ ఇచ్చారని తెలిపారు. అభివృద్ధి పనులలో భాగంగానే వేమన విగ్రహాన్ని యూనివర్శిటీ ప్రధాన ద్వారం వద్ద ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన పేరుతో ఉన్న యూనివర్శిటీ కాబట్టి ప్రధానం ద్వారం వద్ద ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో అందరితో చర్చించే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. 'ఎవరికీ ఇబ్బంది లేకుండా వేమన విగ్రహాన్ని మూడు అడుగుల ఎత్తులో ఏర్పాటు చేశాము. యూనివర్సిటీ స్థాపకులు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కనుక ఖాళీ అయిన వేమన విగ్రహ స్థలంలో వైఎస్సార్ విగ్రహాన్ని పెట్టాము. కొత్త విగ్రహాలు ఏవీ తీసుకుని రాలేదు.. ఉన్న విగ్రహాలనే వేరేచోట మార్చడం జరిగింది. నూతన వైఎస్సార్ పరిపాలన భవనం అని పేరు పెట్టినందున వలన అక్కడే ఉన్న స్థలంలో విగ్రహం ఏర్పాటు చేశాం' అని వైస్ ఛాన్సలర్ మునగాల సూర్యకళావతి తెలిపారు. చదవండి: (యోగివేమన విశ్వవిద్యాలయంకు ‘విశ్వ’ఖ్యాతి) -
యోగివేమన విశ్వవిద్యాలయంకు ‘విశ్వ’ఖ్యాతి
కరువు సీమలో ఏర్పాటు చేసిన విశ్వవిద్యాలయం.. విశ్వఖ్యాతి పొందాలని.. వేలాది మంది విద్యార్థులు విద్యనభ్యసించి ఉన్నత స్థానాలకు చేరుకోవాలన్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తొలి పలుకులు నిజం చేస్తూ విశ్వవిద్యాలయ పాలకులు శ్రమించి ‘ఏ’ గ్రేడ్ సాధించారు. నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడేషన్ కౌన్సిల్(న్యాక్) కమిటీ బుధవారం విశ్వవిద్యాలయానికి 3.13 సీజీపీఎస్‌తో ‘ఏ’ గ్రేడ్‌ను ప్రకటించింది. న్యాక్ నూతన విధానంలో న్యాక్‌కు వెళ్లిన తొలి విశ్వవిద్యాలయం.. ఏ గ్రేడ్ సాధించిన విశ్వవిద్యాలయం యోగివేమన కావడం విశేషం. వైవీయూ : కడపలో 2006లో ఏర్పాటైన యోగివేమన విశ్వవిద్యాలయం ఇంతింతై వటుడింతై అన్న చందంగా ‘విశ్వ’ఖ్యాతిని పొందుతోంది. నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడేషన్ కౌన్సిల్ (న్యాక్) వారు బుధవారం విశ్వవిద్యాలయానికి 3.13 సీజీపీఎస్‌తో ‘ఏ’ గ్రేడ్ కేటాయిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఈనెల 2 నుంచి 4వ తేదీ వరకు న్యాక్ పీర్ టీం చైర్మన్ ఆచార్య ధర్మజిత్ సింఘ్ పర్మార్ నేతృత్వంలో ఆచార్య ఆర్. సోమశేఖర్, ఆచార్య ఖలీద్ ఫాజిల్, ఆచార్య జయతీరాజ్, ఆచార్య సి. మధుమతిల బృందం విశ్వవిద్యాలయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి నివేదిక సిద్ధం చేసి న్యాక్‌కు పంపారు. విశ్వవిద్యాలయం అధికారులు పంపిన సెల్ఫ్ స్టడీ రిపోర్ట్, న్యాక్ టీం ప్రత్యక్ష పరిశీలన అనంతరం ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా న్యాక్ వారు విశ్వవిద్యాలయానికి ఏ గ్రేడ్‌ను కేటాయించారు. నూతన విశ్వవిద్యాలయాల్లో తొలి ‘ఏ’ గ్రేడ్ విశ్వవిద్యాలయంగా వైవీయూ.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఏర్పాటైన 10 విశ్వవిద్యాలయాల్లో ‘ఏ’ గ్రేడ్ సాధించిన తొలి విశ్వవిద్యాలయంగా వైవీయూ నిలిచింది. న్యాక్ గ్రేడింగ్‌లో నూతన విధానాన్ని తీసుకువచ్చిన తర్వాత న్యాక్‌కు వెళ్లి ఏ గ్రేడ్ సాధించిన తొలి విశ్వవిద్యాలయంలో ఆంధ్రప్రదేశ్‌లో వైవీయూ నిలవడం విశేషం. 2020 జనవరి 10వ తేదీన వైస్ చాన్సలర్‌గా బాధ్యతలు చేపట్టిన సమయంలో విశ్వవిద్యాలయానికి ‘ఏ’ గ్రేడ్ తీసుకురావడమే తన ముందున్న లక్ష్యం అని ప్రకటించిన ఆచార్య మునగల సూర్యకళావతి శ్రమించి సాధించారు. బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి న్యాక్ సాధన కోసం ఐక్యూసెల్ను (అంతర్గత నాణ్యతా ప్రమాణాల విభాగం) సమాయత్తం చేశారు. ఐక్యూసెల్ ఆధ్వర్యంలో దాదాపు రెండు సంవత్సరాల పాటు శ్రమించి విశ్వవిద్యాలయానికి ఉత్తమ గ్రేడింగ్ తీసుకురావడంలో కృషిచేశారు. 2016 జనవరి వైవీయూకు న్యాక్ 2.54 సీజీపీఎస్‌తో బి ప్లస్ గ్రేడ్ కేటాయించింది. అప్పటి న్యాక్ కమిటీ సూచించిన లోపాలను సవరించుకుంటూ, అధునాతన సౌకర్యాలను కల్పిస్తూ, గూగుల్ క్యాంపస్‌గా తీర్చిదిద్దడంతో పాటు సాంకేతికత, హరిత విద్యాలయంగా తీర్చిదిద్దడంలో సఫలమయ్యారు. హర్షం వ్యక్తం చేసిన అధికారులు విశ్వవిద్యాలయానికి న్యాక్ ‘ఏ’ గ్రేడ్ లభించడం పట్ల విశ్వవిద్యాలయ వైస్ చాన్సలర్ ఆచార్య మునగల సూర్యకళావతితో పాటు వైవీయూ పూర్వపు వైస్ చాన్సలర్లు ఆచార్య అర్జుల రామచంద్రారెడ్డి, ఆచార్య బేతనభట్ల శ్యాంసుందర్, ఆచార్య అత్తిపల్లి రామచంద్రారెడ్డి తదితరులు కూడా హర్షం వ్యక్తం చేశారు. న్యాక్ రావడంలో కీలకపాత్ర.. 652 ఎకరాల్లో ఏర్పాటైన విశ్వవిద్యాలయం దాదాపు పచ్చదనంతో ఉండటం. మల్టీ డిసిప్లినరీ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ కేంద్ర పరిశోధన సంస్థలైన డీఎస్టీ–ఫిస్ట్, యూజీసీ, సీఎస్ఐఆర్, డీబీటీ తదితర సంస్థల నుంచి 10.26 కోట్ల మేర పరిశోధక ప్రాజెక్టులు. 99 శాతం మంది అధ్యాపకులు డాక్టరేట్ కలిగి ఉండటంతో పాటు బోధన, పరిశోధనలో అనుభవం కలిగిన అధ్యాపకులు ఉండటం. విశ్వవిద్యాలయంలో బాలికల నిష్పత్తి (54.92) బాలుర కంటే ఎక్కువగా ఉండటం. సిలబస్ రూపకల్పనలో ఎప్పటికప్పుడు వస్తున్న మార్పులను అందిపుచ్చుకోవడం, – పరిశ్రమలకు అనుబంధంగా సిలబస్ రూపకల్పన. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్‌లో 101 నుంచి 150 లోపు ఉండటం. అధ్యాపకులు అందరూ ఆధునిక బోధనా పద్ధతుల్లో బోధించడం. ఐసీటీ, ఈ–లెర్నింగ్, ఎల్ఎంఎస్, గూగుల్క్లాస్ రూం, సిస్కో, వెబెక్స్, మైక్రోసాఫ్ట్ టిమ్స్ ఉపయోగించడం. పరిశోధనల్లో ‘హెచ్’ ఇండెక్స్ 40 ఉండటం. అధ్యాపకులు, పరిశోధకుల జర్నల్స్, పరిశోధనలు 20 శాతం మేరకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రచురితం కావడం. విశ్వవిద్యాలయం 6 జాతీయ, అంతర్జాతీయ పేటెంట్స్ కలిగి ఉండటం. 950 కె.డబ్లు్య సోలార్‌ప్లాంట్ కలిగి ఉండటం. ఆంధ్రప్రదేశ్‌లోనే అతిపెద్ద బొటానికల్ గార్డెన్ ఉండటంతో పాటు, ప్రపంచంలోనే అతిపెద్ద పత్రాలు కలిగిన జెయింట్ వాటర్ లిల్లీ (విక్టోరియా అమేజోనికా) ఉండటం, మియావాకి విధానంలో మినీ ఫారెస్టు ఏర్పాటు చేయడం తదితర అంశాలను విశ్వవిద్యాలయ బలాలుగా న్యాక్ కమిటీ అభిప్రాయపడింది. వీటితో పాటు అధ్యాపకులు, సిబ్బంది కొరత తదితర కొన్ని అంశాలను సరిచేసుకునేలా సూచనలు చేశారు. -
కల కళలాడే.. కెరీర్
ఊహలకందని భావాలను ఆవిష్కరించే నైపుణ్యం.. ఎల్లలు లేని సృజనాత్మకత, కళలపై ఆసక్తి ఉన్నవారు చదవదగ్గ కోర్సు బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్. యోగివేమన విశ్వవిద్యాలయంలోఈ కోర్సులో ప్రవేశాల కోసం దరఖాస్తు, ఆప్షన్స్ ఇచ్చేందుకు ఈ నెల 31వ తేదీ వరకు అవకాశం ఉందని, ఆసక్తి గల విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని లలితకళల విభాగం అధ్యాపకులు కోరుతున్నారు. వైవీయూ(కడప): చిత్రలేఖనంలో రాణించాలనుకునే వారికి యోగివేమన విశ్వవిద్యాలయంలోని ఫైన్ఆర్ట్స్ విభాగం వేదికగా నిలుస్తోంది. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉపాధి అవకాశాలతో పాటు అభిరుచులకు ప్రాధాన్యత ఇస్తూ పెద్దపెద్ద నగరాలకే పరిమితమైన బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ఆర్ట్స్ (బీఎఫ్ఏ) యోగివేమన విశ్వవిద్యాలయంలో అందుబాటులో ఉండటం ఇక్కడి కళాకారులకు ఊతమిస్తోంది. ఆసక్తి, అభిరుచి కలిగిన విద్యార్థులు ప్రవేశాలు పొందేందుకు గడువు ఈనెల 31వ తేదీ వరకు ఉండటంతో విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని అధ్యాపకులు కోరుతున్నారు. 2010లో యోగివేమన విశ్వవిద్యాలయంలో ప్రారంభమైన ఈ కోర్సులో ఎందరో విద్యార్థులు చేరడంతో పాటు, కోర్సు పూర్తి చేసుకున్నవారంతా తమ అభిరుచికి తగ్గ రంగాల్లో స్థిరపడటం విశేషం. కోర్సు ద్వారా లభించే అవకాశాలు.. ఈ కోర్సులు చేయడం ద్వారా యానిమేషన్, ఫ్యాషన్, జ్యువెలరీ డిజైనింగ్ తదితర రంగాల్లో ఉపాధి అవకాశాలు ఉన్నాయి. అదే విధంగా అడ్వర్టయిజింగ్‌కు ఉన్న డిమాండ్‌ను బట్టి ఆయా ఏజన్సీల్లో సైతం ఉపాధి పొందవచ్చు. ఇంటీరియర్ డిజైనింగ్, ఫర్నిచర్ డిజైనింగ్, పిల్లల బొమ్మల తయారీ రంగాల్లో అవకాశాలు లభిస్తాయి. కార్పొరేట్ స్కూల్స్, విశ్వవిద్యాలయాల్లో అధ్యాపకులుగా, ప్రొఫెషనల్ ఆర్టిస్టుల్లా రాణించే అవకాశం ఉంది. అర్హతలు.. ప్రవేశం కోర్సు కాల వ్యవధి నాలుగు సంవత్సరాలు. ఇంటర్మీడియట్ లేదా తత్సమాన పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన వారు ఈ కోర్సుల్లో ప్రవేశం పొందవచ్చు. 90 శాతం ప్రాక్టికల్స్‌తో కూడిన కోర్సు. ఎటువంటి ఒత్తిడిలేని వాతావరణంలో విద్యను సాగించే వీలున్న కోర్సు. ప్రవేశాల కోసం ఎస్సీహెచ్ఈఏపీ.జీఓవి.ఇన్‌లో ఈ నెల 30వ తేదీ లోపు రిజిస్ట్రేషన్ చేసుకుని వెబ్ఆప్షన్స్ ద్వారా యోగివేమన విశ్వవిద్యాలయం లలితకళల విభాగాన్ని ఎంపిక చేసుకోవచ్చు. సాధించిన విజయాలు.. 2022లో నేషనల్ ట్రెడిషనల్ అండ్ ట్రైబల్ పెయింటింగ్ వర్క్‌షాపు ద్వారా వివిధ రాష్ట్రాల ట్రైబల్, ట్రెడిషనల్ ఆర్టిస్టులు వైవీయూకు విచ్చేసి వర్క్‌షాపులో పాల్గొన్నారు. 2020లో వైవీయూ, లలితకళా అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన పెయింటింగ్ వర్క్‌షాపులో 7 రాష్ట్రాల ఆర్టిస్టులు విచ్చేసి వారి ప్రతిభను కనబరిచారు. అదే యేడాది విజయవాడలో నిర్వహించిన ఆర్ట్స్ ఎగ్జిబిషన్లో ఎల్దరడో పెయింటింగ్ ఎగ్జిబిషన్లో వైవీయూ విద్యార్థులు 10 మంది పాల్గొని తమ పెయింటింగ్స్ ప్రదర్శించారు. 2020లో న్యూఢిల్లీలో నిర్వహించిన నేషనల్ యూత్ ఫెస్టివల్లో పోస్టర్ మేకింగ్, ఇన్స్టలేషన్ విభాగంలో వైవీయూ విద్యార్థులు రెండోస్థానంలో నిలిచారు. 2019లో అలగప్ప విశ్వవిద్యాలయంలో నిర్వహించిన దక్షిణభారత యువజనోత్సవాల్లో ఓవరాల్ చాంపియన్‌షిప్ సాధించారు. 2018 మార్చినెలలో విజయవాడలో నిర్వహించిన రాష్ట్రస్థాయి మహిళా చిత్రకారిణిల వర్క్‌షాపునకు బీఎఫ్ఏ విద్యార్థులు ఎన్.రేఖ, పి.గాయత్రి పాల్గొన్నారు. సాంస్కృతిక శాఖ సంచాలకుల చేతుల మీదుగా నగదు పురస్కారం, ఘన సన్మానం అందుకున్నారు. 2018 ఏప్రిల్ నెలలో విజయవాడ–అమరావతి కల్చరల్ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్యాలరీలో వైవీయూ ఫైన్ఆర్ట్స్ ఫైనలియర్ విద్యార్థులు చిత్రం, శిల్పకళాఖండాలు ప్రదర్శించారు. విద్యార్థుల ప్రతిభను మెచ్చుకుని రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ.10వేలు నగదు ప్రోత్సాహం అందించారు. విజయవాడ ఆంధ్ర లయోల కళాశాలలో నిర్వహించిన రాష్ట్రస్థాయి చిత్ర సంతలో విద్యార్థుల ప్రదర్శన, అమ్మకాలు నిర్వహించారు. 2018 ఫిబ్రవరిలో ‘ఇంటాగ్లియో’ ప్రింట్ మేకింగ్ విధానంపై వారంరోజుల వర్క్‌షాపు నిర్వహణ. 2018 అక్టోబర్‌లో 34వ సౌత్‌జోన్ యూత్ ఫెస్టివల్లో శిల్పం విభాగంలో బి.ఎఫ్.ఎ విద్యార్థి జి.సోమశేఖర్‌కు ప్రథమస్థానం. 2017లో ప్రపంచ పర్యాటక దినోత్సవం –2017లో రాష్ట్రస్థాయిలో ప్రథమస్థానం. 2015లో మధ్యభారతదేశ కళలు అన్న అంశంపై లలితకళా అకాడమీ న్యూఢిల్లీ వారి ఆర్థిక సహకారంతో తొలి జాతీయ సెమినార్ నిర్వహణ. 2013లో న్యూఢిల్లీలో నిర్వహించిన జాతీయస్థాయి పోటీల్లో ద్వితీయ బహుమతి రూ.10వేలు కైవసం చేసుకున్న వైవీయూ లలిత కళల విద్యార్థి వెంకటేశ్వర్లు. వీసీ, రిజిస్ట్రార్ల ప్రోత్సాహంతో.. యోగివేమన విశ్వవిద్యాలయంలో ఫైన్ఆర్ట్స్ కోర్సు దినదినాభావృద్ధి జరుగడానికి కారణం విశ్వవిద్యాలయ వైస్ చాన్సలర్, రిజిస్ట్రార్ల సంపూర్ణ సహకారమే. రాయలసీమలో తొలుత వైవీయూలోనే ఈ కోర్సు ప్రారంభించారు. ఇంటర్ తర్వాత కాస్త సృజనాత్మకంగా ఆలోచించేవారికి చక్కటి కోర్సు. ఆధునిక కాలపు ఒత్తిడిని దూరం చేసే విధంగా కోర్సు రూపకల్పన, బోధన జరుగుతోంది. చదువుకుంటూనే సంపాదించుకునే మంచి అవకాశం కూడా ఉంది. – డా. మూల మల్లికార్జునరెడ్డి, లలితకళల విభాగాధిపతి, వైవీయూ -
ముగిసిన వైవీయూ డిగ్రీ పరీక్షలు
వైవీయూ: యోగి వేమన విశ్వవిద్యాలయం ప్రథమ, తృతీయ సెమిస్టర్ పరీక్షలు శనివారం సాయంత్రంతో ముగిశాయి. జిల్లావ్యాప్తంగా 60 పరీక్షా కేంద్రాల్లో దాదాపు 10 రోజుల పాటు నిర్వహించిన పరీక్షల్లో మొత్తం మీద 90 మంది విద్యార్థులు డీబార్ అయ్యారు. కాగా రాయచోటిలోని హెచ్ఎం డిగ్రీ కళాశాలలో జరిగిన ఘటన మినహా మిగతా అన్ని చోట్ల పరీక్షలు ప్రశాంతంగా సాగాయి. ఈ పరీక్షలకు 25,301 మంది విద్యార్థులు హాజరయ్యారు. కాగా చివరిరోజు పరీక్షల్లో పలు కేంద్రాలను పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ ఎన్. ఈశ్వరరెడ్డి తనిఖీ చేశారు. రైల్వేకోడూరు, ఓబులవారిపల్లె, ఒంటిమిట్ట డిగ్రీ పరీక్షా కేంద్రాలను ఆయన తనిఖీ చేశారు. శనివారం పరీక్షల్లో నలుగురు డీబార్ అయినట్లు ఆయన తెలిపారు. వీసీ ఆచార్య మునగాల సూర్యకళావతి, రిజిస్ట్రార్ ఆచార్య డి. విజయరాఘవప్రసాద్ మార్గదర్శనంలో పరీక్షలను సజావుగా, కట్టుదిట్టంగా నిర్వహించామన్నారు. -
ఒక మంచి ఆలోచన సమాజాన్ని మారుస్తుంది
కాలేజ్‌లో సీటు, పరీక్షల్లో మంచి పర్సంటేజీలు తెచ్చుకున్నంత సులువు కాదు ఉద్యోగం సాధించడం. ఈ ఘట్టాన్ని సులభతరం చేయడానికి అనేక విద్యాసంస్థలు క్యాంపస్ ప్లేస్మెంట్లు నిర్వహిస్తుంటాయి. కానీ, నిరుద్యోగిత లెక్కలు మాత్రం ప్లేస్మెంట్ ప్రయత్నాలు సరిపోవడం లేదనే వాస్తవాన్ని ప్రతిబింబిస్తుంటాయి. ఈ గ్యాప్‌ను భర్తీ చేయడానికి ముందుకు వచ్చారు యోగి వేమన యూనివర్సిటీ వైస్‌చాన్స్‌లర్ సూర్య కళావతి. అమెరికన్ తెలుగు అసోసియేషన్, ఇండియా విభాగంతో కలిసి మెగా జాబ్‌మేళా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆమె సాక్షితో మాట్లాడారు. ‘‘మా యూనివర్సిటీ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం ఇదే మొదటిసారి. అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఏటీఏ), ఇండియా విభాగం గత కొన్ని నెలలుగా జాబ్‌మేళాలు నిర్వహిస్తోంది. ఈ సంగతి తెలిసిన తరవాత మా జిల్లా విద్యార్థులకు కూడా ఈ సదుపాయం అందుబాటులోకి రావాలనే ఉద్దేశంతో ఈ ప్రయత్నం చేస్తున్నాం. మే నెల రెండవ తేదీన మా యూనివర్సిటీ క్యాంపస్‌లో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నాం. ఏటీఏ ఇండియా చాప్టర్ సమన్వయం కుదిర్చిన అనేక పెద్ద పెద్ద కంపెనీలు వస్తున్నాయి. ఈ జాబ్‌మేళా టార్గెట్ ఆరువేల ఉద్యోగాలు. టెన్త్ క్లాస్ నుంచి పీజీ వరకు అందరికీ ఇది అనువైన వేదిక. గార్మెంట్ మేకింగ్ యూనిట్ల నుంచి మొబైల్ ఫోన్ తయారీ కంపెనీలు, ఆటోమొబైల్ కంపెనీలు, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ కంపెనీలు, ఫార్మా కంపెనీలు కూడా వస్తున్నాయి. టెక్నికల్ – నాన్ టెక్నికల్, ఐటీ, బీపీవో వరకు అన్ని రకాల ఉద్యోగాలకు అవకాశం ఉంటుంది. మంచి సహకారం మంచి పని కోసం మనం ఒక అడుగు ముందుకు వేస్తే... పదిమంది తలా ఒక చెయ్యి వేసి విజయవంతం చేస్తారని అంటారు. అదేవిధంగా మేము తలపెట్టిన ఈ కార్యక్రమానికి చాలామంది సహకారం అందిస్తున్నారు. ఆ రోజున వచ్చే వేలాదిమందికి ఆహారపానీయాలను సమకూర్చడానికి శ్రీ సంపద గ్రూప్ కంపెనీ, జీఎస్ఆర్ ఫౌండేషన్లు ముందుకు వచ్చాయి. ఏటీఏ చాలా శ్రద్ధగా మంచి కంపెనీలను అనుసంధానం చేసుకుంది. వాళ్లు ఉద్యోగులకు ఇన్సూరెన్స్, పీఎఫ్ వంటి సౌకర్యాలు కూడా కల్పిస్తున్నారు. వాళ్లిస్తున్న శాలరీ ప్యాకేజ్‌లు ఏడాదికి లక్షా పాతిక వేల నుంచి ఐదు లక్షల వరకు ఉన్నాయి. ఇది మా యూనివర్సిటీకి మాత్రమే కాదు, జిల్లాలో అందరికీ ఉపయోగపడుతుంది. ఇలాంటి కార్యక్రమాలు చిన్న పట్టణాల్లో చదివే వాళ్లకు పెద్ద భరోసా’’ అన్నారు సూర్య కళావతి. ప్రభుత్వం స్థాపించిన విద్యాసంస్థలు సామాజిక బాధ్యతను మరింతగా చేపట్టి ఇలాంటి కార్యక్రమాలకు వేదికలవుతుంటే యువతరం ఆలోచనలు కూడా ఆదర్శవంతంగా సాగుతాయి. మరోతరానికి స్నేహహస్తాలుగా మారుతాయి. వేలాది ఉద్యోగాలకు వేదిక! మా అమ్మది కడప జిల్లా బలపనూరు. నేను పుట్టింది అనంతపురం జిల్లా కదిరి. ఇంటర్ వరకు అక్కడే చదివాను. బీటెక్ కడపలోని కేఎస్ఆర్ఎమ్లో. ఎంటెక్ ఎస్వీయూ, పీహెచ్డీ జేఎన్టీయూ హైదరాబాద్, పోస్ట్ డాక్టరేట్ పిట్స్బెర్గ్లోని కార్నెగీ మెలన్ యూనివర్శిటీలో. నా ఉద్యోగ జీవితం కడపలో నేను చదువుకున్న కేఎస్ఆర్ఎమ్ కాలేజ్తోనే మొదలైంది. వీసీ బాధ్యతలు చేపట్టి రెండేళ్లు దాటింది. ఇప్పటివరకు మా యూనివర్సిటీ విద్యార్థుల కోసమే ఈ ప్లేస్ మెంట్ ప్రోగ్రామ్స్ నిర్వహించాం. ఇప్పుడు జిల్లా అంతటికీ ఉపయోగపడేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించాం. ‘చదువుకున్నాను, కానీ ఇంకా ఉద్యోగం రాలేదు’ అని ఎవరూ ఆందోళన చెందకూడదనేది నా అభిలాష. అందుకే ఏటీఏ గురించి తెలిసిన వెంటనే ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. – మునగాల సూర్యకళావతి, వైస్ చాన్స్‌లర్, యోగి వేమన యూనివర్సిటీ, కడప. అనూహ్యమైన స్పందన! అమెరికన్ తెలుగు అసోసియేషన్, ఇండియా విభాగం ఈ ఏడాది జాబ్‌మేళా కాన్సెప్ట్ తీసుకుంది. ఇప్పటివరకు కుప్పం, పుంగనూరు, తిరుపతి నగరాల్లో నిర్వహించాం. ఉద్యోగానికి ఎంపికైన వాళ్లు అదే రోజు అపాయింట్మెంట్ ఆర్డర్ అందుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు, తమిళనాడు, కేరళ, కర్ణాటక, పాండిచ్చేరి, మహారాష్ట్ర, గోవా, ఢిల్లీ కేంద్రంగా ఉద్యోగాలుంటాయి. మా ప్రయత్నానికి మంచి స్పందన వస్తోంది. మా టీమ్‌లో ఉన్న కిరణ్ రాయల్ అయితే ఉద్యోగాల్లో ఉండే సవాళ్ల గురించి ఓరియెంటేషన్ ఇస్తుంటారు. ఈ సోషల్ కాజ్లో అందరం ఉత్సాహంగా పని చేస్తున్నాం. యోగి వేమన యూనివర్సిటీ మెగా జాబ్ మేళా తర్వాత శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ, పుట్టపర్తి, కదిరి, బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లో కూడా జాబ్ మేళా నిర్వహించడానికి క్యాలెండర్ సిద్ధమవుతోంది. – జి. సూర్యచంద్రారెడ్డి, కో ఆర్డినేటర్, అమెరికన్ తెలుగు అసోసియేషన్, ఇండియా విభాగం – వాకా మంజులారెడ్డి -
ఇంతింతై.. కొలనంతై
సాక్షి, వైఎస్సార్: కొలనులో తేలియాడుతున్న ఈ ఆకులను ఆరంభదశలో చూస్తే సాధారణ కలువ ఆకులనే అనుకుంటారు. కానీ రోజు రోజుకూ పెరిగిపోతూ అతి తక్కువ కాలంలోనే ఇవి భారీ పత్రాలుగా రూపుదిద్దుకుని చూపరులను ఆకట్టుకుంటున్నాయి. మూడు నెలల వ్యవధిలో ఒక్కో ఆకు దాదాపు 2.5 మీటర్ల వెడల్పు పెరిగి 40 కేజీల వరకు బరువు మోయగలగడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. జెయింట్ వాటర్ లిల్లీ అనే ఈ మొక్కలు వైఎస్సార్ జిల్లాలోని యోగి వేమన విశ్వవిద్యాలయం బొటానికల్ గార్డెన్లో ఉన్నాయి. కొలను నిండుగా పత్రాలు నెమలి పింఛంలా ఉన్న పత్రం వెనుకభాగం వైవీయూ బొటానికల్ గార్డెన్ నిర్వాహకులు డాక్టర్ ఎ. మధుసూదన్‌రెడ్డి 2019లో కలకత్తా బొటానికల్ గార్డెన్ నుంచి వీటిని తీసుకొచ్చారు. రెండు మొక్కలు తీసుకువచ్చి గార్డెన్‌లోని కొలనులో వేసి సంరక్షించగా ప్రస్తుతం దాదాపు 100 మొక్కలు వరకు పెరిగాయి. విక్టోరియా కృజియానా అనే శాస్త్రీయ నామం కలిగిన ఈ మొక్క 1800 సంవత్సరంలో భారతదేశానికి వచ్చింది. – వైవీయూ మొక్క నాటిన తర్వాత తొలి దశలో పత్రాలు ఇలా.. -
‘పని ఉంది రా’.. ఉద్యోగినిపై ప్రొఫెసర్ అసభ్య ప్రవర్తన
సాక్షి, కడప: యోగివేమన విశ్వవిద్యాలయం విద్యారంగంలో అభివృద్ధి బాటలో నడుస్తుంటే కొందరు అధ్యాపకుల తీరువల్ల ప్రతిష్ట మసకబారుతోంది. విశ్వవిద్యాలయంలోని ‘ప్రధాన’ ఆచార్యుల కార్యాలయంలో సదరు ఆచార్యుడు అసభ్యకరంగా వ్యవహరించినట్లు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. విశ్వసనీయ సమాచారం మేరకు.. ఆదివారం రోజున కార్యాలయంలో పని ఉందని సిబ్బందిని పిలిపించుకున్న ఈ ఆచార్యుడు ఓ ఉద్యోగిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో ఆ ఉద్యోగిని ఏడ్చుకుంటూ బయటకి రావడంతో తోటి ఉద్యోగులు ఆమెకు బాసటగా నిలిచారు. ఆచార్యుడు మాట్లాడిన మాటలకు సంబంధించిన వాయిస్ రికార్డును బాధితురాలు ఓ అధ్యాపక సంఘం నాయకుడికి పంపడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఆచార్యుడిని, ఉద్యోగినిని వేర్వేరుగా పిలిచి ఉన్నతాధికారులు విచారించారు. దీంతో పాటు విశ్వవిద్యాలయం ఉమన్ ఎంపవర్మెంట్ కమిటీ సభ్యులు సైతం సమావేశమై ఈ విషయమై చర్చించినట్లు తెలిసింది. కాగా మరో ఉద్యోగినికి సైతం రాంగ్‌కాల్స్, అసభ్యకర కాల్స్ వస్తుండటంతో ఆమె కూడా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. వీటితో పాటు మూడు నెలల క్రితం ఓ అధ్యాపకుడు ఓ విద్యారి్థని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతో ఆమె తల్లిదండ్రులు వచ్చి సదరు అధ్యాపకుడికి వార్నింగ్ ఇచ్చి వెళ్లిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాగా ఈ ఫిర్యాదుల నేపథ్యంలో వీటన్నింటిపైనా కమిటీ వేసి విచారణ చేపట్టేందుకు అధికారులు సన్నద్ధం అవుతున్నట్లు సమాచారం. -
యోగివేమన వర్సిటీలో అరుదైన ‘జంపింగ్ స్పైడర్’
వైవీయూ (వైఎస్సార్ జిల్లా): అప్పుడెప్పుడో 1868 సంవత్సరానికి ముందు జీవించి, అంతరించిపోయిందనుకున్న అరుదైన సాలెపురుగు జాతి కీటకం మళ్లీ కనిపించింది. ఇంద్రధనస్సు వలే సప్తవర్ణశోభితంగా కనువిందు చేసింది. దీనికి వైఎస్సార్ జిల్లాలో ఉన్న యోగివేమన విశ్వవిద్యాలయంలోని బొటానికల్ గార్డెన్ వేదికైంది. ఒకటిన్నర శతాబ్ధం తర్వాత 2018లో కేరళలో ఈ కీటకాల ఉనికిని కనుగొనగా.. ఇప్పుడు వైఎస్సార్ జిల్లాలో దీని ఆచూకీ బయట పడింది.దీంతో ఈ కీటకం గురించి పరిశోధనలు చేసేందుకు శాస్త్రవేత్తలు సిద్ధమయ్యారు. -
వైవీయూ గూటికే ‘గురుకులం’
సాక్షి, వైవీయూ: యోగివేమన విశ్వవిద్యాలయం గూటికి 21వ శతాబ్ధపు గురుకులం భవనాలు వచ్చి చేరనున్నాయి. ఈ మేరకు ఉన్నతవిద్యాశాఖ ప్రత్యేక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సతీష్‌చంద్ర ఉత్తర్వులు జారీ చేశారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో 8 బ్లాక్‌లతో వైవీయూలో 21వ శతాబ్ధపు గురుకులం భవనాలు ఏర్పాటు చేశారు. ఈ భవనాల నుంచి ఇడుపులపాయ ట్రిపుల్ వరకు నాలెడ్జ్‌హబ్‌గా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో వీటిని ఏర్పాటు చేశారు. అయితే కాలక్రమంలో ఇడుపులపాయలో ప్రత్యేకంగా భవనాలు నిర్మించడంతో వీటి అవసరం లేకుండా పోయింది. దీంతో వీటిని వైవీయూ నుంచి వేరుచేసి స్కిల్‌డెవలప్‌మెంట్ వారికి అప్పజెప్పారు. దీంతో ఈ భవనాలను ఎన్జీఓల ఆధ్వర్యంలో నడుస్తున్న నైపుణ్యాభివృద్ధి సంస్థ వారు ఈ భవనాలను వినియోగించుకుంటున్నారు. అయితే గత కొద్ది సంవత్సరాలుగా ఈ భవనాల్లోని రెండు బ్లాక్‌లను మాత్రం వైవీయూ అధికారులు కామర్స్, మేనేజ్మెంట్ బ్లాక్‌లుగా, పరిశోధన అవసరాల కోసం వినియోగించుకుంటూ వచ్చారు. -
కడపలో అరుదైన శాసనం లభ్యం
సాక్షి, కడప : జిల్లాలో మరొక అరుదైన శాసనం వెలుగు చూసింది. ఈ ప్రాంతం రేనాటి రాజుల పాలనలో ఉండిందని దీని ద్వారా మరో మారు స్పష్టం అవుతోంది. జిల్లాలోని చిన్న దుద్యాల గ్రామంలో లభించిన దీని గురించి యోగి వేమన విశ్వవిద్యాలయం విద్యార్థులు వెలుగులోకి తెచ్చారు. అందిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లాకు శాసనాల ఖిల్లాగా పేరుంది. రాష్ట్రంలో లభించిన మొత్తం తెలుగు శాసనాలలో ఎక్కువ శాతం వైఎస్ఆర్ జిల్లాలోనే లభించిన విషయం తెలిసిందే. ఇటీవల జిల్లాలో లభించిన ఓ శాసనం ద్వారా జిల్లా పాలనలో తమదైన ముద్ర వేసిన రేనాటి చోళులు మన జిల్లా వారేనని స్పష్టం అయింది. ఇప్పుడు లభించిన శాసనం ద్వారా అది మరో మారు ధృవీకరింపబడింది. జిల్లాలోని ముద్దనూరు మండలం చిన్న దుద్యాల గ్రామంలో గల శివనారాయణరెడ్డి పొలంలో ఇటీవల ఓ శాసనం బయల్పడింది. దాని విలువను గ్రహించిన ఆయన దాని గురించిన సమాచారాన్ని తన మిత్రుడు వైవీయూ పరిశోధక విద్యార్థి నిఖిల్‌కు తెలిపారు. ఆయన తన సహచర పరిశోధక మిత్రుడైన వాసుదేవ రెడ్డికి శాసనం గురించి వివరించారు. వారిద్దరూ కలిసి వైవీయూ చరిత్ర పురావస్తు శాఖ ఆసిస్టెంట్ ప్రొఫెసర్ రామబ్రహ్మంకు సమాచారం అందించారు. ఆయన దాని గురించి పరిశీలించి భారత పురాతత్వ శాఖ దృష్టికి తీసుకెళ్లారు. శాసన పాఠం ఇలా..... శాసన లిపి పరిశోధకుల సమాచారం ప్రకారం చిన్న దుద్యాలలో వెలుగు చూసిన ఈ శాసనంలోని సమాచారం ఇలా ఉంది. దీన్ని క్రీస్తుశకం 8వ శతాబ్దంలో నాటి ఈ ప్రాంత పాలకులు రేనాటి చోళులు వేయించినట్లు కేంద్ర పురావస్తు శాఖ పరిశోధకులు తెలుపుతున్నారు. రాతి బండకు ఇరువైపులా అక్షరాలు ఉన్నాయి. ఇవి నాటి తెలుగు లిపిలో ఉన్నట్లు సమాచారం. రేనాటి ప్రభువు చోళులు చిన్న దుద్యాల గ్రామంలోని ఓ దేవాలయానికి చెందిన అర్చకులకు ఆరుమరŠుత్యల భూమిని దానంగా ఇచ్చినట్లు ఇందులో రాసి ఉంది. జిల్లాలో పాలించిన ప్రభువులలో రేనాటి పాలకులు తమదైన ముద్ర వేశారు. జిల్లాలోని కల్లమల్లలో లభించిన తొలి తెలుగు శాసనం రేనాటి ధనుంజయుడు 575లో వేయించినట్టు తెలుస్తోంది. తెలుగు భాష ఉనికిని జిల్లాలో చాటి చెప్పిన అపురూపమైన శాసనంగా దీనికి దేశంలో ముఖ్యంగా తెలుగునాట ఎంతో ప్రాముఖ్యత లభిస్తోంది. దీని ద్వారా మన ప్రాంతంలో తెలుగు భాషకు పట్టం కట్టిన వైనంతో పాటు రేనాటి ప్రభువుల సంక్షేమ పాలన గురించి కూడ స్పష్టంగా తెలియవస్తోంది. ఇప్పుడు చిన్న దుద్యాలలో లభించిన శాసనం ద్వారా ఈ విషయం మరోమారు స్పష్టం అవుతోంది. దీనిని వెలుగులోకి తెచ్చిన వైవీయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ రామబ్రహ్మం, పొలం యజమాని శివనారాయణరెడ్డి, పరిశోధక విద్యార్థులను చరిత్ర, పరిశోధక అభిమానులు ప్రత్యేకంగా అభినందిస్తున్నారు. -
వేమనకు ‘రక్షణ’గా!
వైఎస్ఆర్ జిల్లా, వైవీయూ : యోగివేమన విశ్వవిద్యాలయంలో గతంలో చోటుచేసుకున్న చోరీలు, మహిళా వసతిగృహాల్లో ఆగంతకుల చొరబాటు వంటి ఆగడాలకు చెక్ పెట్టేలా విశ్వవిద్యాలయంలో పోలీసు అవుట్ పోస్టును ఏర్పాటు చేస్తున్నారు. యోగివేమన విశ్వవిద్యాలయంలో గతంలో ప్రిన్సిపాల్ చాంబర్‌గా వినియోగించిన గదిని పోలీసు అవుట్ పోస్టు కేంద్రానికి కేటాయిస్తూ విశ్వవిద్యాలయ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. వాస్తవానికి ప్రతి విశ్వవిద్యాలయంలో పోలీసుస్టేషన్ లేదా కనీసం పోలీసు అవుట్ పోస్టు అయినా ఉంటుంది. అయితే వైవీయూ ఏర్పాటై 14 ఏళ్లు కావస్తున్నా కనీసం పోలీసు అవుట్ పోస్టు కూడా ఏర్పాటు చేయలేదు. గతంలో ఏర్పాటుకు ప్రయత్నించినప్పటికీ ముందు కు సాగ లేదు. అయితే మునగాల సూర్యకళావతి వైవీయూ వైస్ చాన్సలర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత విశ్వవిద్యాలయంలో పోలీసు అవుట్ పోస్టు ఆవశ్యకతను గుర్తించి ఎస్పీ కె.కె.ఎన్. అన్బురాజన్‌తో చర్చించారు. దీంతో జిల్లా ఎస్పీ వైవీయూలో పోలీసు అవుట్‌పోస్టును ఏర్పాటు చేసేందుకు అంగీకారం తెలపడంతో పాటు వైవీయూలో ప్రధానద్వారంకు సమీపంలో ఓ గదిని ఏర్పాటు చేయాలని కోరారు. దీనికి సమ్మతించిన వైవీయూ అధికారులు విధులు నిర్వహించే పోలీసుల కోసం అన్ని వసతులు ఉండే ఒక గదిని కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో మరి కొద్దిరోజుల్లోనే వైవీయూలో అవుట్‌పోస్టు ఏర్పాటు కానుంది. ఆగడాలకు అడ్డుకట్ట.. గతంలో విశ్వవిద్యాలయంలో పలు చోరీలు, నిర్మాణ రంగ సామగ్రి, కంప్యూటర్లు సైతం మాయమయ్యాయి. ఇంటిదొంగలే వాటిని పట్టుకెళ్లిన వైనంపై అప్పట్లో ‘సాక్షి’లో పలు కథనాలు ప్రచురితమయ్యాయి. దీంతో ఏదో ఒక సందర్భంలో గుర్తుతెలియని ఆగంతకులు వసతిగృహాల వైపు రావడంతో విద్యార్థినులు భయభ్రాంతులకు గురైన ఘటనలు ఉన్నాయి. వీటితో పాటు విద్యార్థుల ఆందోళనలు, రాస్తారోకో వంటి కార్యక్రమాలతో ఎప్పుడూ చైతన్యవంతంగా ఉండే విశ్వవిద్యాలయంలో పోలీసు అవుట్‌పోస్టు ఏర్పాటు చేయడం ద్వారా ఎంతో ప్రయోజనం నెరవేరుతుందని విద్యార్థులు, సిబ్బంది భావిస్తున్నారు. దీంతో పాటు పోలీసు నిఘా ఉంటే తుంటరి విద్యార్థులు, ఆకతాయిల గోల లేకుండా విద్యార్థినులు క్యాంపస్‌లో ప్రశాంతంగా విద్యనభ్యసించే వీలుంటుంది. దీంతో పాటు ర్యాగింగ్ రక్కసిని విశ్వవిద్యాలయం ప్రాంగణంలోకి రాకుండా ఉండటంతో పాటు మహిళా వసతిగృహాలకు సైతం పూర్తిస్థాయిలో రక్షణ లభిస్తుందని విద్యార్థినులు భావిస్తున్నారు. -
వైవీయూలో ఏం జరుగుతోంది..?
యోగివేమన విశ్వవిద్యాలయంలో గత కొద్దిరోజులుగా జరుగుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఓవైపు విద్యార్థులు, మరోవైపు అవుట్సోర్సింగ్ సిబ్బంది చేస్తున్న ఆందోళనలు అధికారులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. విశ్వవిద్యాలయంలో విద్యార్థులకు అవసరమైన వనరులను ఉన్నప్పటికీ వాటిని సక్రమంగా వినియోగించుకోవడంలో వైవీయూ యంత్రాంగం విఫలం కావడంతో విద్యార్థినులు వసతిలేక ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. సాక్షి, వైవీయూ(కడప) : యోగివేమన విశ్వవిద్యాలయం.. ఎన్నో ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు, మరెన్నో అవార్డులను కైవసం చేసుకుని రాష్ట్రస్థాయిలో ప్రత్యేకత చాటిచెప్పింది. గత ప్రభుత్వం వైఎస్ఆర్ జిల్లా పట్ల సవతిప్రేమను కొనసాగిస్తున్నప్పటికీ అధికారులు చాకచక్యంగా నిధులు రాబట్టుకుని విశ్వవిద్యాలయ ప్రగతిలో భాగస్వాములయ్యారు. దీంతో పాటు విశ్వవిద్యాలయాన్ని అకడమిక్‌గా ప్రగతిపథంలో నడుపుతుండటంతో విశ్వవిద్యాలయం పట్ల తల్లిదండ్రుల్లో నమ్మకం కలిగి ఈ యేడాది పెద్దసంఖ్యలో ప్రవేశాలు సైతం జరిగాయి. వరుస ఘటనలతో.. గత రెండేళ్లుగా నివురుగప్పిన నిప్పులా ఉన్న విశ్వవిద్యాలయం ఇటీవల జరిగిన పదవుల పంపకం తర్వాత ఆందోళనలకు నిలయంగా మారుతోంది. దీనికి తోడు వైస్ చాన్స్‌లర్ పదవీకాలం మరో 40 రోజుల్లో ముగియనుండటంతో కొందరు అధ్యాపకులు తెరవెనుక రాజకీయాలకు తెరలేపారు. ఇటీవల 10 మంది ఆచార్యులకు సంబంధించిన ఇంక్రిమెంట్ల వ్యవహారం విషయంలో అధికారులు, అధ్యాపకుల మధ్య పోరు నడిచింది. ఎట్టకేలకు ఇది సమసిపోయిందనుకునేలోపు అవుట్సోర్సింగ్ సిబ్బంది నాయకులు అక్రమంగా నియమితులైన కొందరు సిబ్బందిని తొలగించాలని ఆందోళనకు దిగారు. బోధనేతర సిబ్బంది నాయకులు వీరిని కొనసాగించండని లేఖ ఇవ్వడంతో వీరి మధ్య వివాదం రేగింది. దీంతో పాటు అధ్యాపకులు సమయపాలన పాటించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండటంతో అధికారులు సర్క్యులర్ జారీ చేసి సమయపాలన పాటించాలని ఆదేశించే పరిస్థితి వచ్చిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. పదవుల పందేరంలో పదవులు ఆశించిన కొందరు ఆచార్యులు అసంతృప్తిగా ఉంటూ తెరవెనుక మంత్రాంగం నడుపుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో పాటు గతంలో పనిచేసిన కీలకాధికారి పేషీలో ల్యాప్‌టాప్‌తో పాటు మరికొన్ని సామాన్లు కనిపించలేదు. ఈ విషయమై చూసుకోవాల్సిన ఇంజినీరింగ్ విభాగం నిర్లక్ష్యంగా వ్యవహరించడంపైనా దుమారం రేగుతోంది. మరోవైపు విశ్వవిద్యాలయ వసతిగృహంలో నెలకొన్న సమస్యలపై కొనసాగుతున్న ఆందోళనలో భాగంగా విద్యార్థులు శనివారం 6 గంటల పాటు వైవీయూ ప్రధానద్వారం వద్ద బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఇది చదవండి : యోగి వేమన యూనివర్సిటీ వద్ద ఉద్రిక్త పరిస్థితులు వనరులు ఉన్నా వినియోగం సున్నా.. వైవీయూలోని మహిళా వసతిగృహంలో పెద్దసంఖ్యలో విద్యార్థినులు చేరారు. దీంతో ఒక్కో గదిలో నలుగురు ఉండాల్సిన చోట 8 మందిని సర్దుబాటు చేసినట్లు విద్యార్థులు పేర్కొంటున్నారు. వాస్తవానికి మహిళా వసతిగృహం వెనుకవైపున పెన్నా వసతిగృహం ఉంది. ఇది గత ఐదేళ్లుగా నిరుపయోగంగా ఉంది. దీనిని వినియోగించుకుంటే విద్యార్థినుల వసతి సమస్య తీరుతుందన్న విషయం అధి కారులకు తెలియంది కాదు. అయితే పక్కనే ఉన్న భవనం పరిశోధక విద్యార్థులకు కేటాయించారు. కాగా ఇటీవల పరిశోధక విద్యార్థులను ఆహ్లాద్ గెస్ట్‌హౌస్ ప్రాంతంలోకి మారాలని సూచించారు. అయితే ఆ గెస్ట్‌హౌస్‌లో కొందరు అధ్యాపకులు నివాసం ఉంటుండటంతో అక్కడికి వెళ్లేందుకు సుముఖత వ్యక్తం చేయడం లేదు. కొందరు పరిశోధక విద్యార్థులు మాత్రం అధికారుల ఆదేశాలను కూడా పట్టించుకోకుండా అక్కడే ఉండటంతో పక్కనే ఉన్న మరో భవనాన్ని మహిళలకు కేటాయించడంలో ఇబ్బందులు తలెత్తుతున్నట్లు అధికారులు పే ర్కొంటున్నారు. ఇక మహిళల వసతిగృహంలో భోజనం చేసే విద్యార్థినులకు రూ.1400 నుంచి రూ.1800 వరకు నెలకు మెస్ బిల్ వస్తోంది. అదే బాలుర వసతిగృహంలో మాత్రం రూ.2,200 మొ దలు రూ.3 వేల వరకు వస్తోంది. దీంతో మెస్‌చార్జీలు తగ్గించాలని, దీని వెనుక జరుగుతున్న అవి నీతిని వెలికితీయాలంటూ ఆందోళనలు మొదలయ్యాయి. అయితే వసతిగృహాల్లో అతిథుల పేరుతో పూర్వ విద్యార్థులు, విద్యార్థి నాయకులు తిష్టవేశారని, వారికోసం కొందరు విద్యార్థులు భోజనం గదుల్లోకి తీసుకెళ్తుండటంతో ఆ భారం విద్యార్థులందరిపై పడుతోందని అధికారులు, హాస్టల్ సిబ్బంది పేర్కొంటున్నారు. కాగా శనివారం జరిగిన ఆందోళనలపై వైస్ చాన్స్‌లర్ అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. విద్యార్థుల సమస్యలన్నింటినీ పరిష్కరించాలని మరోసారి ఇలా జరగకుండా చూడాలని ఆదేశించారు. మొత్తానికి వైవీయూలో చోటుచేసుకున్న పరిణామాలు అందరినీ ఆందోళనకు గురి చేస్తున్నాయి. -
యోగి వేమన యూనివర్సిటీ వద్ద ఉద్రిక్త పరిస్థితులు
సాక్షి, వైఎస్సార్: యోగి వేమన యూనివర్సిటీ వద్ద ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. వసతి గృహాల్లో తాము ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలంటూ విద్యార్థులు తిండి తిప్పలు మానేసి దీక్ష చేపట్టారు. యూనివర్సిటీ ప్రధాన గేటు ఎదురుగా బైఠాయించి అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలుపుతున్నారు. ఈ క్రమంలో వర్సిటీ లోపలికి ఎవరిని వెళ్లనివ్వకుండా అడ్డుకుంటున్నారు. తమ సమస్యలు పరిష్కరించే వరకూ దీక్ష విరమించేది లేదని విద్యార్థులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో యూనివర్సిటీ ప్రాంగణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు యాజమాన్యం భారీగా పోలీసులను మోహరించారు. -
వైఎస్సార్‌తో వైవీయుకు విశ్వఖ్యాతి..
సాక్షి, వైఎస్సార్ : కరువు సీమలోని విద్యార్థులకు ఉన్నత విద్యను అందించాలన్న తలంపుతో ఏర్పాటైన యోగివేమన విశ్వవిద్యాలయం విశ్వఖ్యాతిని చాటి చెబుతోంది. 2006 మార్చి 9న పీజీ కేంద్రం నుంచి విశ్వవిద్యాలయంగా రూపాంతరం చెంది నేడు 29 కోర్సులతో విలసిల్లుతోంది. దాదాపు 1500 మందికి పైగా విద్యార్థులు 115 మంది అధ్యాపక బృందం, 150 మంది పైగా పరిశోధక విద్యార్థులతో ప్రగతి పథంలో దూసుకువెళ్తోంది. 1977 నవంబర్ 20న తిరుపతి శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం కడప నగరానికి సమీపంలో పీజీ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక 2006లో 652 ఎకరాల్లో విశ్వవిద్యాలయంగా రూపుదిద్దుకుంది. వైఎస్ఆర్ హయాంలో విశ్వవిద్యాలయానికి 100 కోట్లకు పైగా నిధుల వరద పారింది. ఇందులో భాగంగా 2008లో ప్రొద్దుటూరులో వైఎస్ఆర్ ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటైంది. అనంతరం వైవీయూకు 12బీ, నాక్ బి గ్రేడ్, ఎన్ఐఆర్ఎఫ్ నేషనల్ ర్యాంకింగ్ వంటి గుర్తింపుతోపాటు పలు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు, యంగ్ సైంటిస్టు అవార్డులను విశ్వవిద్యాలయ అధ్యాపక బృందం సొంతం చేసుకున్నారు. ఆయన స్వహస్తాలతో ప్రారంభించిన విశ్వవిద్యాలయం నేడు ఎందరికో ఉన్నతవిద్య, ఉపాధిని కల్పిస్తూ రాష్ట్రంలో తనకంటూ ప్రత్యేకతను చాటుకుంటోంది. కాగా వైఎస్ఆర్ మరణానంతరం పాలకులు విశ్వవిద్యాలయం పట్ల వివక్షతను చూపడంతో విశ్వవిద్యాలయంలో నిలిచిన నిర్మాణాలు నేటికీ అదే విధంగా మొండిగోడలతో దర్శనమిస్తున్నాయి. రానున్న రోజుల్లో.. రాజన్న తనయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సారధ్యంలో విశ్వవిద్యాలయం మరింత ప్రగతి సాధిస్తుందని.. ఆ సువర్ణకాలం మరికొన్ని రోజుల్లోనే తిరిగి వస్తుందని పలువురు విద్యార్థులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పరిశోధనలు చేసే అవకాశం లభించింది కడపలో యోగివేమన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయడం వల్లనే ఇక్కడికి వచ్చి పరిశోధనలు చేసే అవకాశం లభిస్తోంది. వైఎస్ఆర్ ఇక్కడ వైవీయూ ఏర్పాటు చేయకపోయి ఉంటే పొరుగు జిల్లాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. ఆయన చలువతో నేడు వైవీయూలో పరిశోధనలు చేయగలుగుతున్నాం. – పి.రోజారాణి, మైక్రోబయాలజీ విద్యార్థిని కరువు ప్రాంతంలో కల్పవృక్షం వైవీయూ కరువు ప్రాంతమైన కడప గడపలో విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయడమే ఒక గొప్ప విషయం. ఈ విశ్వవిద్యాలయం రాష్ట్రంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విశ్వవిద్యాలయాల జాబితాలో అగ్రస్థానంలో నిలిచిందంటే.. అది ఆనాడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ తీసుకున్న చొరవే కారణం. – డాక్టర్ కె.శృతి, వైవీయూ పరిశోధకురాలు గొప్ప అవకాశం లభించింది జిల్లాలో ప్రసిద్ధ తత్వవేత్త వేమన పేరుతో విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయడం జిల్లా వాసులుగా మనందరి అదృష్టం. వైఎస్ఆర్ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయడం వల్లే.. ప్రస్తుతం ఉన్నత విద్యను చదవడంతోపాటు పరిశోధనలు చేసే అవకాశం లభించింది. – ఎం. పావని, రాజంపేట, ఫిజిక్స్ స్కాలర్, వైవీయూ -
ఏపీ సైన్స్ కాంగ్రెస్‌కు సన్నద్ధం!
వైవీయూ : వేల సంఖ్యలో విద్యార్థులు, వందల సంఖ్యలో అధ్యాపకులు, పరిశోధకులు, ప్రఖ్యాత శాస్త్రవేత్తలు, శాంతిస్వరూప్ భట్నాగర్ అవార్డు గ్రహీతలు కలిసే సమ్మేళనం.. భవిష్యత్ పరిశోధనలకు నిర్మాణాత్మక మార్గదర్శనం చేసే ఏపీ సైన్స్‌కాంగ్రెస్–2018 నిర్వహణ అవకాశం వైవీయూకు దక్కడం అరుదైన అవకాశం. కొత్తగా ఏర్పాటైన విశ్వవిద్యాలయాల్లో వైవీయూకు మాత్రమే ఈ అరుదైన అవకాశం లభించడం విశేషం. కాగా గతేడాది ఆంధ్రా యూనివర్సిటీ నిర్వహించగా అంతకు ముందు ఎస్వీయూ, నాగార్జున విశ్వవిద్యాలయాలు నిర్వహించాయి. 2018 నవంబర్ 9 నుంచి 11వ తేదీ వరకు 4వ ఏపీ సైన్స్ కాంగ్రెస్ సమావేశాలు నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ సహకారంతో యోగివేమన విశ్వవిద్యాలయ అధికారులు సన్నద్ధమవుతున్నారు. సిద్ధమవువుతున్నారు ఇలా.. ఏపీ సైన్స్ కాంగ్రెస్–2018 నిర్వహణను వైవీయూ అధికారులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కాగా ఏపీ సైన్స్‌కాంగ్రెస్ ప్రారంభోత్సవానికి ముఖ్య మంత్రి, మానవవనరులశాఖ మంత్రి, శాస్త్రవేత్తలు, అధ్యాపకులు, పరిశోధకులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో నిర్వహణలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఉండేలా చూసేందుకు అధికారులు కసరత్తులు చేస్తున్నారు. మరో 28 రోజుల గడువు మాత్రమే ఉండటంతో పనులను వేగవంతం చేస్తున్నారు. సెషన్ల వారీగా కమిటీలను ఏర్పాటు చేశారు. రూసా నిధులతో సిద్ధం చేస్తున్న ఈ–క్లాస్ రూంలు అందుబాటులోకి తీసుకువచ్చారు. వైవీయూ ప్రధాన ద్వారాన్ని సుందరీకరణ చేస్తున్నారు. ఆర్ట్స్బ్లాక్కు వెళ్లేమార్గంలో కల్వర్టు నిర్మాణ పనులను రూ.4.9 లక్షలతో పూర్తి చేస్తున్నారు. దీంతో పాటు ఆర్ట్స్బ్లాక్లో ఉన్న మూడు సెమినార్హాల్స్ను, ప్రస్తుత ఏడీ బిల్డింగ్ వద్ద ఉన్న మరో సెమినార్హాల్ను ఏపీ సైన్స్‌కాంగ్రెస్ నాటికి అందుబాటులోకి తీసుకువచ్చేలా సిద్ధం చేస్తున్నారు. వీటితో పాటు విశ్వవిద్యాలయంలోని 9 విభాగాల విద్యార్థులను నూతనంగా నిర్మించిన ఆర్ట్స్బ్లాక్లోకి తరలించేందుకు రంగం సిద్ధం చేశారు. ఏపీ సైన్స్ కాంగ్రెస్ నిర్వహణకు ప్రభుత్వంతో పాటు ఇందులో భాగస్వాములయ్యే విశ్వవిద్యాలయాలు సైతం తమ వంతుగా రూ.2 లక్షల చొప్పున నిధులు అందజేసే అవకాశం ఉండటంతో విశ్వవిద్యాలయానికి మరిన్ని మౌలిక సదుపాయాలు ఒనగూరే అవకాశం ఉంది. విద్యార్థులకు ఉపయోగకరం.. ఇటువంటి ప్రతిష్టాత్మకమైన కాన్ఫరెన్స్‌లు విశ్వవిద్యాలయంలో నిర్వహించడం ద్వారా సైన్స్‌పై ఆకర్షితులవడంతో పాటు ఎన్నో నూతన విషయాలు తెలుసుకునే అవకాశం లభిస్తుంది. అలాగే నవంబర్ 9, 10 తేదీల్లో చిల్డ్రన్స్ సైన్స్ కాంగ్రెస్ పేరుతో రెండురోజుల పాటు సైన్స్ ప్రాజెక్ట్స్, ప్రదర్శనలు నిర్వహించనున్నారు. సైన్స్‌కాంగ్రెస్‌కు దాదాపు 2వేల మందికిపైగా పరిశోధకులు వస్తారని అంచనా. వీరితో పాటు 10 నుంచి 15 మంది వరకు ప్రఖ్యాతిగాంచిన శాస్త్రవేత్తలు, వివిధ రంగాల్లో ఖ్యాతి గడించిన ముఖ్య వక్తలు వచ్చే అవకాశం ఉంది. 9 సెషన్స్‌గా నిర్వహణ.. విశ్వవిద్యాలయంలో నిర్వహించే ఏపీ సైన్స్‌కాంగ్రెస్‌లో 9 సెషన్స్‌లో కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇప్పటివరకు 695 థీసిస్ పత్రాలు విశ్వవిద్యాలయానికి అందినట్లు సమాచారం. ప్రఖ్యాత శాస్త్రవేత్తల ప్రసంగాలు.. శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఇండియన్ నోబెల్‌గా భావించే శాంతిస్వరూప్ భట్నాగర్ పురస్కారాన్ని పొందిన ముగ్గురు ప్రఖ్యాత శాస్త్రవేత్తలు మోహన్‌రావు, వెంకటరత్నం, వెంకటకృష్ణారెడ్డి ఈ సైన్స్‌కాంగ్రెస్‌కు రానున్నారు. వీరితో పాటు విదేశాల నుంచి సైతం ఇద్దరు లేదా ముగ్గురు ప్రముఖ శాస్త్రవేత్తలు వచ్చే అవకాశం ఉంది. చాలెంజ్‌గా భావించి విజయవంతం చేస్తాం నూతన విశ్వవిద్యాలయాల్లో ఏపీ సైన్స్‌కాంగ్రెస్ నిర్వహించే అవకాశం వైవీయూకు లభించడం సంతోషంగా ఉంది. వచ్చిన అవకాశాన్ని చాలెంజ్‌గా తీసుకుని విశ్వవిద్యాలయ ఖ్యాతి చాటిచెప్పేలా సైన్స్కాంగ్రెస్ను విజయవంతం చేస్తాం. 10 నుంచి 15 మంది ప్రఖ్యాత శాస్త్రవేత్తలు ఈ సైన్స్‌కాంగ్రెస్‌కు వచ్చి మార్గదర్శనం చేయనున్నారు. – ఆచార్య అత్తిపల్లి రామచంద్రారెడ్డి, వైస్ చాన్సలర్, వైవీయూ -
యోగివేమన వర్సిటీలో ఉద్రిక్తత
సాక్షి, వైఎస్ఆర్ కడప: యోగివేమన విశ్వవిద్యాలయంలో ఉద్రిక్తత నెలకొంది. జిల్లా పర్యటనలో భాగంగా వర్సిటీకి వచ్చిన సీఎం చంద్రబాబు నాయుడిని విద్యార్థులు అడ్డుకున్నారు. సీఎం గోబ్యాక్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. పోలీసులు ఆందోళన చేస్తున్న విద్యార్థులను అరెస్ట్ చేసి సీకే దిన్నె పోలీస్ స్టేషన్‌కు తరిలించారు. అరెస్టు చేసిన విద్యార్థులను విడుదల చేయాలని కడప మాజీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథరెడ్డిలు స్టేషన్ ముందు ధర్నాకు దిగారు. దీంతో పీఎస్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఇక సీఎం వనం-మనం కార్యక్రమంలో భాగంగా యూనివర్సిటీలో మొక్కలు నాటారు. -
ఉన్నత విద్యకు నెలవు.. ఉపాధికి కొలువు
ఉద్యోగ, ఉపాధి కోర్సులకు యోగివేమన విశ్వవిద్యాలయం నెలవుగా మారుతోంది.. సంప్రదాయ కోర్సులతో పాటు వృత్తివిద్యా కోర్సులను విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావడంతో విశ్వవిద్యాలయంలో చేరే విద్యార్థుల సంఖ్య క్రమేణా పెరుగుతోంది. ప్రవేశపరీక్షను జూన్ మొదటివారంలో నిర్వహించేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. వైవీయూ : ప్రతిష్టాత్మక యోగివేమన విశ్వవిద్యాలయంలో ప్రవేశాలకు వైవీయూ సెట్–2018కు దరఖాస్తు చేసుకునే గడువు మరో 5 రోజుల్లో ముగియనుంది. 2006లో ప్రారంభించిన ఈ విశ్వవిద్యాలయం నేడు 32 రకాల కోర్సులు అందిస్తూ రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. వైవీయూసెట్–2018కి సంబంధించి ఆన్లైన్ రిజిస్ట్రేషన్, దరఖాస్తు చేసుకునేందుకు మే నెల 15తో గడువు ముగియనుంది. అపరాధ రుసుంతో ఈనెల 21వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఒక్కో సబ్జెక్టుకు రూ.500 చొప్పున ఆన్లైన్లో చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫీజు చెల్లించిన మరుసటి రోజు వెబ్సైట్లో వివరాలు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్, పూర్తిచేసిన దరఖాస్తులను మే నెల 23వ తేదీలోపు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసేందుకు డబ్ల్యూడబ్ల్యూడబ్లూయ.వైవీయూడీఓఏ.నెట్ వెబ్సైట్లో సంప్రదిస్తే పూర్తి వివరాలు లభిస్తాయి. జూన్ మొదటివారంలో ఈ పరీక్షను యోగివేమన విశ్వవిద్యాలయం క్యాంపస్‌లో మాత్రమే నిర్వహిస్తారు. లభించే కోర్సులు.. నిర్వహించే పరీక్షలు... యోగివేమన విశ్వవిద్యాలయం పరిధిలో 32 రకాల కోర్సులు అందుబాటులో ఉండగా వీటిలో ప్రవేశం పొందేందుకు 17 పరీక్షలను (సబ్జెక్ట్‌ల వారీగా) నిర్వహించనున్నారు. ఎంఎస్సీ బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, జెనిటిక్స్ అండ్ జీనోమిక్స్, మైక్రోబయాలజీ, ఎంఎస్సీ బోటనీ (ప్లాంట్‌సైన్స్), కెమిస్ట్రీ (ఆర్గానిక్), ఎంఎస్సీ ఎన్విరాన్మెంటల్ సైన్స్, ఎంకాం, ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్, ఎంఏ ఎకనామిక్స్, ఎంఈడీ, ఎంఏ ఇంగ్లిష్, ఎంఎస్సీ జియాలజీ, ఎంఏ హిస్టరీ అండ్ ఆర్కియాలజీ, ఎంఏ జర్నలిజం, ఎంఎస్సీ సైకాలజీ, ఎంఏ పొలిటికల్ సైన్స్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, మెటీరియల్ సైన్స్ అండ్ నానోటెక్నాలజీ, ఎంఎస్సీ ఫిజిక్స్, ఎంఎస్సీ మ్యాథమ్యాటిక్స్, ఎంఎస్సీ స్టాటిస్టిక్స్(కంప్యూటర్ అప్లికేషన్), ఎంపీఈడీ, ఎంఏ తెలుగు, ఎంఎస్సీ జువాలజీ (అనిమల్ సైన్స్), ఎంఎస్సీ బయోటెక్నాలజీ అండ్ బయోఇన్ఫర్మాటిక్స్ (5సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్సు), ఎంఎస్సీ ఎర్త్‌సైన్స్ (5సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్సు), ఎంఏ రూరల్ డెవలప్మెంట్, ఎంఏ ఉర్దూ, ఎంఎస్సీ ఫుడ్‌టెక్నాలజీ, ఎంఎస్సీ కంప్యూటేషనల్ డాటా సైన్స్ కోర్సుల్లో ప్రవేశాలకు పరీక్షలు నిర్వహించనున్నారు. బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ఆర్ట్స్ (బీఎఫ్ఏ)లో ప్రవేశానికి ఫైన్ఆర్ట్స్పేరుతో నైపుణ్య పరీక్ష నిర్వహిస్తారు. పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ థియేటర్ ఆర్ట్స్‌లో ప్రవేశానికి మౌఖిక పరీక్ష ద్వారా ప్రవేశాలు నిర్వహిస్తారు. ప్రవేశం పొందేందుకు అర్హులు ఎవరంటే.. ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకునేందుకు డిగ్రీలో సంబంధిత గ్రూపు సబ్జెక్టులో 40 శాతం మార్కులు, ఎంఈడీలో ప్రవేశాలకు బీఈడీలో 50 శాతం మార్కులు, ఎంపీఈడీలో ప్రవేశానికి బీపీఈడీలో 40 శాతం మార్కులు ఉండాలి. ఇంటర్మీడియట్ అర్హతతో 5 సంవత్సరాల ఇంటిగ్రేడెట్ కోర్సుల్లో చేరే అవకాశం కూడా విద్యార్థులకు ఉంది. ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లో 50 శాతం మార్కులు పొంది ఉంటే ప్రవేశాలు పొందవచ్చు. -
ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం పోరాటం
-
వర్సిటీ స్థల ఆక్రమణపై నివేదిక ఇవ్వండి
విశాఖపట్నం: యోగి వేమన విశ్వవిద్యాలయం(వైవీయూ) పరిధిలోని భూముల కబ్జా ఆరోపణలపై మంత్రి గంటా శ్రీనివాసరావు ఆరా తీశారు. వైవీయూ వీసీతో ఆయన మాట్లాడగా ప్రహరీ లేకపోవడంతో భూ ఆక్రమణ ప్రయత్నం జరిగిందని వీసీ తెలిపారు. వీసీల సమావేశంలో ప్రహరీ ఏర్పాటు చేసుకోవాలని యూనివర్సిటీలకు మంత్రి సూచిస్తునే ఉన్నారు. ఇప్పటికైనా అన్ని యూనివర్సిటీలు వెంటనే ప్రహరీలు నిర్మించుకోవాలని మంత్రి సూచిస్తున్నారు. ఈ భూ కబ్జా ఆరోపణలపై రెండు రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని, భూమి కబ్జాకు గురికాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని వీసీని మంత్రి ఆదేశించారు. -
యూనివర్సిటీలో తెలుగు తమ్ముళ్ల అక్రమాలు
-
యోగి వేమన వర్సిటీలో కలుషిత ఆహరం