యోగి వేమన యూనివర్సిటీ వద్ద ఉద్రిక్త పరిస్థితులు | Tensionous Situation At Yogi Vemana University YSR Kudapa | Sakshi
Sakshi News home page

సమస్యలు పరిష్కరించాలంటూ ఆందోళనకు దిగిన విద్యార్థులు

Published Sat, Aug 24 2019 11:38 AM | Last Updated on Sat, Aug 24 2019 11:44 AM

Tensionous Situation At Yogi Vemana University YSR Kudapa - Sakshi

సాక్షి, వైఎస్సార్‌: యోగి వేమన యూనివర్సిటీ వద్ద ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. వసతి గృహాల్లో తాము ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలంటూ విద్యార్థులు తిండి తిప్పలు మానేసి దీక్ష చేపట్టారు. యూనివర్సిటీ ప్రధాన గేటు ఎదురుగా బైఠాయించి అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలుపుతున్నారు. ఈ క్రమంలో వర్సిటీ లోపలికి ఎవరిని వెళ్లనివ్వకుండా అడ్డుకుంటున్నారు. తమ సమస్యలు పరిష్కరించే వరకూ దీక్ష విరమించేది లేదని విద్యార్థులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో యూనివర్సిటీ ప్రాంగణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు యాజమాన్యం భారీగా పోలీసులను మోహరించారు.


No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement