సాక్షి,కృష్ణాజిల్లా: గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. విద్యార్ధులకు ఏబీవీపీ విద్యార్ధి సంఘం, మహిళా సంఘాలు మద్దతిచ్చాయి. మంత్రి కొల్లు రవీంద్ర,కలెక్టర్, జిల్లా ఎస్పీ హామీ ఇచ్చినా విద్యార్దులు వెనక్కి తగ్గలేదు. నేషనల్ హ్యూమన్ రైట్స్ దృష్టికి ఘటనను తీసుకెళతామని విద్యార్థులు తెలిపారు.
ఎలాంటి విచారణ చేయకుండానే కెమెరాలు లేవని పోలీసులు చెప్పడంపై ఏబీవీపీ విద్యార్థి సంఘం నేతలు ఫైర్ అయ్యారు. ఘటనపై సాయంత్రంలోగా చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ నేతలు డిమాండ్ చేశారు. కాలేజి బాత్‌రూముల్లో హిడెన్ కెమెరాలు పెట్టిన విద్యార్ధి,అతనికి సహకరించిన విద్యార్ధినిపై చర్యలు తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. విచారణ సక్రమంగా జరగకపోతే రెండు రోజుల్లో రాష్ట్ర బంద్ చేపడతామని హెచ్చరించారు.
వీలైనంత త్వరగా యాక్షన్ తీసుకుంటాం: మంత్రి కొల్లు రవీంద్ర
గుడ్లవల్లేరు కాలేజీలో విద్యార్ధుల ఆందోళన ఘటనపై పూర్తి విచారణ జరిపిస్తాం.
హిడెన్ కెమెరాలు పెట్టారన్న ఆరోపణలను సీరియస్ గా తీసుకున్నాం.
వీడియోలపై మూడు రోజుల క్రితమే యాజమాన్యానికి తెలిపామని విద్యార్ధినులు చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశాన్ని చాలా సీరియస్‌గా తీసుకుంది.
విచారణకు ఐదుగురు మహిళా సిబ్బందితో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశాం.
వీలైనంత త్వరగా యాక్షన్ తీసుకుంటాం విచారణలో ఆరోపణలు నిజమని తేలితే తీవ్రమైన చర్యలు ఉంటాయి.
విద్యార్ధుల కెరీర్ కు ఎలాంటి సమస్య రాదు ఇందులో ఉన్నవారు ఎంతటి వారైనా వదిలేది లేదు.
కళాశాల యాజమాన్యం విద్యార్ధులను వేధింపులకు గురిచేయకుండా సర్క్యులర్ జారీ చేయిస్తాం.
విచారణ జరుగుతోంది.. కాలేజీ ప్రిన్సిపల్ కరుణాకర్
- గురువారం సాయంత్రం విద్యార్ధుల నుంచి నాకు కంప్లైంట్ వచ్చింది.
- విద్యార్ధులు చెబుతున్నట్లు వారంరోజుల క్రితం మాకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు.
- నిన్నటి నుంచి మేం విద్యార్ధులకు అందుబాటులోనే ఉన్నాం.
- గతంలో ఎప్పుడూ ఇలాంటి ఘటనలు మా కాలేజీలో చోటచేసుకోలేదు.
- విద్యార్ధులు చేస్తున్న ఆరోపణల పై విచారణ జరుగుతోంది.
- భవిష్యత్ లో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకుంటాం.
Comments
Please login to add a commentAdd a comment