students dharna
-
విద్యార్థినిల గోడు పట్టించుకోని బాబు సర్కార్
-
అనంతపురం: యూనివర్సిటీలో అర్ధరాత్రి విద్యార్థినుల ఆందోళన
సాక్షి, అనంతపురం: అనంతపురంలోని సెంట్రల్ యూనివర్సిటీ వద్ద అర్ధరాత్రి ఉద్రిక్తత చోటుచేసుకుంది. యూనివర్సిటీలో అమ్మాయి బాత్రూమ్లోకి కొందరు తొంగిచూశారని ఆరోపిస్తూ విద్యార్థినిలు ఆందోళన చేపట్టారు. దీంతో, పోలీసులు, విద్యార్థి సంఘాల నేతలు అక్కడికి చేరుకున్నారు.వివరాల ప్రకారం.. అనంతపురంలోని బుక్కరాయసముద్రంలో ఉన్న సెంట్రల్ యూనివర్సిటీ వద్ద అర్ధరాత్రి ఉద్రికత్త చోటుచేసుకుంది. సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థినిలు ఆందోళన దిగారు. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అమ్మాయి బాత్రూమ్ల్లోకి తొంగి చూశారని విద్యార్థినిలు ఆరోపించారు. దీంతో, వారంతా ఆందోళనకు దిగారు. అనంతరం, ఈ విషయాన్ని వీసీ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని వారంతా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో వీసీ తీరుకు నిరసనగా విద్యార్థులు, విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టారు. -
రహస్య వీడియోలపై విద్యార్థుల ఆగ్రహం
-
రాజోలు బీసీ బాయ్స్ హాస్టల్ లో విద్యార్థలు ఆకలి కేకలు
-
AP: విద్యారంగ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యం.. aకదం తొక్కిన విద్యార్థి లోకం
అనంతపురం అర్బన్/తిరుపతి అర్బన్/పార్వతీపురం టౌన్/సాక్షి, అమరావతి: విద్యారంగ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందంటూ విద్యార్థులు రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున బుధవారం ఉద్యమించారు. భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) ఆధ్వర్యంలో విద్యార్థులు కలెక్టరేట్ల మందు ర్యాలీ చేపట్టారు. ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలని, ఇంటర్ విద్యార్థులకూ మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని, వర్సిటీల్లో అధ్యాపక పోస్టులను భర్తీ చేయాలని..ఇలా సమస్యలను ప్రస్తావిస్తూ...వాటిని వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు.విద్యార్థులను ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకున్నారు. పలువురిని అరెస్ట్ చేశారు. అనంతపురంలోని కేఎస్ఆర్ కళాశాల నుంచి విద్యార్థులు ర్యాలీగా కలెక్టరేట్‌కు చేరుకున్నారు. అక్కడ బైఠాయించి ఆందోళన చేపట్టారు. కలెక్టరేట్ ముట్టడికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో తోపులాట జరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అ«ధ్యక్షుడు ప్రసన్న ఇతర నేతలను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. అనంతరం వారికి నోటీసులిచ్చి పంపించారు. విద్యార్థులు మాట్లాడుతూ..కూటమి ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వని కారణంగా విద్యార్థులు ఆందోళన చెందుతున్నారని, ఫీజుల కోసం విద్యార్థులను కళాశాలల యాజమాన్యాలు ఇబ్బంది పెడుతున్నాయన్నారు. ఇంటర్ విద్యార్థులకూ మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే, తిరుపతిలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. డిగ్రీలో మేజర్, మైనర్ విధానాన్ని రద్దు చేయాలని కోరారు. ఉన్నత విద్యను దూరం చేసే జీవో 77ను రద్దు చేయా లని డిమాండ్ చేశారు. తల్లికి వందనం కింద రూ.15,000ను ఈ ఏడాది నుంచే ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్‌కు వినతిపత్రాన్ని అందించారు. పార్వతీపురం మన్యం జిల్లాలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు నిరసన చేపట్టారు. తక్షణమే పెండింగ్‌లో ఉన్న విద్యా, వసతి దీవెన బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాలో యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని కోరారు. ఆశ్రమ పాఠశాలల్లో ఏఎన్ఎంలను నియమించాలని కోరుతూ ఆర్టీసీ కాంపెక్స్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్‌ను ముట్టడించారు. సమస్యల పరిష్కారంపై ప్రశ్నిస్తే కేసులు పెడతారా అని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కె. ప్రసన్నకుమార్, కార్యదర్శి ఎ.అశోక్ ప్రభుత్వాన్ని నిలదీశారు. -
గుడ్లవల్లేరు ఘటన.. విద్యార్థుల ఆందోళన ఉధృతం
సాక్షి,కృష్ణాజిల్లా: గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. విద్యార్ధులకు ఏబీవీపీ విద్యార్ధి సంఘం, మహిళా సంఘాలు మద్దతిచ్చాయి. మంత్రి కొల్లు రవీంద్ర,కలెక్టర్, జిల్లా ఎస్పీ హామీ ఇచ్చినా విద్యార్దులు వెనక్కి తగ్గలేదు. నేషనల్ హ్యూమన్ రైట్స్ దృష్టికి ఘటనను తీసుకెళతామని విద్యార్థులు తెలిపారు. ఎలాంటి విచారణ చేయకుండానే కెమెరాలు లేవని పోలీసులు చెప్పడంపై ఏబీవీపీ విద్యార్థి సంఘం నేతలు ఫైర్ అయ్యారు. ఘటనపై సాయంత్రంలోగా చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ నేతలు డిమాండ్ చేశారు. కాలేజి బాత్రూముల్లో హిడెన్ కెమెరాలు పెట్టిన విద్యార్ధి,అతనికి సహకరించిన విద్యార్ధినిపై చర్యలు తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. విచారణ సక్రమంగా జరగకపోతే రెండు రోజుల్లో రాష్ట్ర బంద్ చేపడతామని హెచ్చరించారు. వీలైనంత త్వరగా యాక్షన్ తీసుకుంటాం: మంత్రి కొల్లు రవీంద్రగుడ్లవల్లేరు కాలేజీలో విద్యార్ధుల ఆందోళన ఘటనపై పూర్తి విచారణ జరిపిస్తాం.హిడెన్ కెమెరాలు పెట్టారన్న ఆరోపణలను సీరియస్ గా తీసుకున్నాం.వీడియోలపై మూడు రోజుల క్రితమే యాజమాన్యానికి తెలిపామని విద్యార్ధినులు చెప్పారు.రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశాన్ని చాలా సీరియస్‌గా తీసుకుంది.విచారణకు ఐదుగురు మహిళా సిబ్బందితో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశాం.వీలైనంత త్వరగా యాక్షన్ తీసుకుంటాం విచారణలో ఆరోపణలు నిజమని తేలితే తీవ్రమైన చర్యలు ఉంటాయి.విద్యార్ధుల కెరీర్ కు ఎలాంటి సమస్య రాదు ఇందులో ఉన్నవారు ఎంతటి వారైనా వదిలేది లేదు.కళాశాల యాజమాన్యం విద్యార్ధులను వేధింపులకు గురిచేయకుండా సర్క్యులర్ జారీ చేయిస్తాం. విచారణ జరుగుతోంది.. కాలేజీ ప్రిన్సిపల్ కరుణాకర్గురువారం సాయంత్రం విద్యార్ధుల నుంచి నాకు కంప్లైంట్ వచ్చింది. విద్యార్ధులు చెబుతున్నట్లు వారంరోజుల క్రితం మాకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు. నిన్నటి నుంచి మేం విద్యార్ధులకు అందుబాటులోనే ఉన్నాం. గతంలో ఎప్పుడూ ఇలాంటి ఘటనలు మా కాలేజీలో చోటచేసుకోలేదు.విద్యార్ధులు చేస్తున్న ఆరోపణల పై విచారణ జరుగుతోంది. భవిష్యత్ లో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకుంటాం. -
కోల్‌కతాలో హైఅలర్ట్.. మూడు వలయాలుగా 6 వేలమంది పోలీసులు!
కోల్‌కతా: కోల్‌కతాలోని ఆర్జీ కర్ హాస్పిటల్లో జరిగిన జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటన.. దేశాన్ని కుదిపేసింది. న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ పలు విద్యార్థి సంఘాలు మంగళవారం 'నబన్న అభిజన్' (మార్చ్ టు సెక్రటేరియట్) పేరుతో నిరసనకు పిలుపునిచ్చాయి. సీఎం మమతా బెనర్జీ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో ఈ భారీ ర్యాలీ జరగనుంది. అయితే హింస చేలరేగే అవకాశం ఉండడంతో కోల్‌కతా పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. సెక్రటేరియట్ వద్ద సుమారు 6 వేల మంది పోలీసులతో మూడంచెల భద్రతా వలయాన్ని ఏర్పాటు చేశారు. విద్యార్థి సంఘాల ముసుగులో.. అరాచక శక్తులు ర్యాలీలో పాల్గొన వచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.#BreakingNews : कोलकाता डॉक्टर रेप-हत्या पर बड़ी खबर, भारी संख्या में छात्र आज करेंगे प्रदर्शन#KolkataDoctorDeathCase #KolkataDoctorDeath #CBI #KolkataDeathCase | @Nidhijourno @anchorjiya pic.twitter.com/mDjspQ4ons— Zee News (@ZeeNews) August 27, 2024క్రెడిట్స్: Zee News సామాన్య ప్రజలను రెచ్చగొట్టి అరాచకాలు సృష్టించేందుకు కుట్ర పన్నినట్లు తమకు సమాచారం అందిందని పోలీసులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే సుమారు 19 పాయింట్ల వద్ద భారీగా పోలీసులను మోహరించారు. 26 మంది డిప్యూటీ కమిషనర్లు పలు పాయింట్ల వద్ద ఎప్పటికప్పుడు పోలీసు భద్రతను పర్యవేక్షించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలు చోట్ల పోలీసులు బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటల నుంచి కోల్‌కతా, హౌరాలో పెద్ద ఎత్తున బలగాలను మోహరిస్తామని పోలీసులు అధికారులు తెలిపారు. యువ వైద్యురాలిపై హత్యాచార ఘటన తర్వాత.. ఆగస్టు 14 అర్ధరాత్రి చేపట్టిన నిరసన హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. అందుకే పోలీసులు ముందు జాగ్రత్తగా భారీ భద్రతకు ప్లాన్ చేశారు. మరోవైపు.. శాంతియుతంగా నిరసన తెలిపేవారిని అడ్డుకోవద్దని ఇటీవల సుప్రీం కోర్టు బెంగాల్ ప్రభుత్వానికి సూచించిన విషయం తెలిసిందే. -
మంత్రిగారూ.. ఇవిగో పులిహోరలో పురుగులు
కర్నూలు(సెంట్రల్): ‘అయ్యా మంత్రి మనోహర్ గారు... మీరు నాణ్యమైన బియ్యం సరఫరా చేస్తే పులిహోరలో పురుగులు ఎందుకు వస్తాయి?.. అన్నం ఎందుకు ముక్కిపోయి ముద్దగా ఉంటుంది. కుల్లిపోయిన కూరగాయలతో కూరలు చేసే దుస్థితి ఎందుకు వస్తుంది...’ అని కర్నూలు సిల్వర్ జూబ్లీ డిగ్రీ కళాశాల విద్యార్థులు మండిపడుతున్నారు. తమ కళాశాల మేనేజ్మెంట్ బాలుర, బాలికల హాస్టళ్లలో పురుగుల బియ్యంతో అన్నం వండుతున్నారని, కుళ్లిన కూరగాయలతో కూరలు చేస్తున్నారని, నాలుగైదు రోజులకొకసారి నీళ్లు వస్తుండడంతో స్నానాలు కూడా చేయకుండా కాలేజీకి వెళ్తున్నామని శుక్రవారం కర్నూలు కలెక్టరేట్ ఎదుట దాదాపు 700మంది సిల్వర్ జూబ్లీ కళాశాల విద్యార్థులు ధర్నా చేశారు.విద్యార్థుల ఆవేదనను వివరిస్తూ ‘అన్నమో చంద్రబాబూ’ అంటూ ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. దీనిపై శనివారం రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పందించారు. సిల్వర్ జూబ్లీ కళాశాలకు నాణ్యమైన బియ్యం సరఫరా చేశామని విజయవాడలో ఒక ప్రకటన విడుదల చేశారు. ‘సాక్షి’లో అసత్యాలు ప్రచారం చేస్తున్నారని అక్కసు వెళ్లగక్కారు. అదేవిధంగా ఈ ఘటనపై విచారణ చేయాలని కర్నూలు ఆర్డీవో, పౌరసరఫరాల సంస్థ డీఎంను ఆదేశించారు.అతి ప్రధానమైన కిలో బియ్యం రూపాయికే ఇచ్చే ప్రతిపాదనపై మాత్రం మంత్రి స్పష్టత ఇవ్వలేదు. ఉన్నత విద్యాశాఖ నుంచి ప్రతిపాదనలు వచ్చాయని, త్వరలోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు. దీంతో మంత్రి ప్రకటనపై విద్యార్థులు తీవ్రంగా మండిపడుతున్నారు. నాణ్యమైన బియ్యాన్ని సరఫరా చేస్తే శుక్రవారం ఉదయం వండిన పులిహోరలో పురుగులు ఎలా వచ్చాయని ప్రశ్నిస్తున్నారు. అన్నంలో పురుగులు వస్తున్నాయని, కుళ్లిన కూరగాయలతో వంట చేస్తున్నారనే విషయాన్ని తాము సాక్ష్యాధారాలతో కళ్లకు కట్టినట్లు ధర్నాలో వివరించినా మంత్రి వాస్తవాలు తెలుసుకోకుండా అన్నీ బాగానే ఉన్నట్లు ప్రకటన ఇవ్వడం మంచిది కాదని, వెంటనే తమ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రభుత్వాన్ని పలువురు విద్యార్థులు డిమాండ్ చేశారు. బుగ్గన చొరవతో రూపాయికే కిలో బియ్యం ఇచ్చేలా ఉత్తర్వులుసిల్వర్ జూబ్లీ డిగ్రీ కళాశాల హాస్టల్ విద్యార్థులు నెలకు ఒక్కొక్కరూ రూ.430 మెస్ చార్జీల కోసం చెల్లిస్తారు. దానిలో అత్యధిక భాగం బియ్యం కొనుగోలుకే సరిపోతుంది. ప్రస్తుతం కళాశాల మేనేజ్మెంట్ కిలో బియ్యం రూ.45 చొప్పున కొనుగోలు చేస్తోంది. ఈ క్రమంలో మెస్‌చార్జీల డబ్బులన్నీ బియ్యం కొనుగోలుకే సరిపోతుండడంతో గ్యాస్, నూనె, కూరగాయలు, ఇతర సరుకుల కొనుగోలుకు డబ్బులు సరిపోవడంలేదు.ఈ విషయాన్ని గత ప్రభుత్వంలో ఆర్థికశాఖ మంత్రిగా ఉన్న బుగ్గన రాజేంద్రనాథ్ ద్వారా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. వైఎస్ జగన్ స్పందించి సిల్వర్ జూబ్లీ డిగ్రీ కళాశాలకు రూపాయికే కిలో బియ్యం ఇవ్వాలని ఆదేశిస్తూ 2024, మార్చి ఒకటో తేదీన మెమో నంబర్ 976211/సీఈ/ఏ1/2019 జారీ చేశారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం దానిని అమలు చేయకపోవడంతోనే విద్యార్థులు అల్లాడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. -
నీట్ పై ఆగ్రహం.. రాజ్ భవన్ ముట్టడికి పిలుపు
-
మల్లారెడ్డి కాలేజ్ వద్ద ఉద్రిక్తత
సాక్షి, హైదరాబాద్: నగరంలోని మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీ వద్ద ఉద్రికత్త చోటుచేసుకుంది. యూనివర్సిటీకి చెందని విద్యార్థులు ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మల్లారెడ్డి దిష్టిబొమ్మను విద్యార్థులు దహనం చేశారు. వివరాల ప్రకారం.. విద్యార్థుల ఆందోళనలతో మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. పరీక్షలు ఒకటి, రెండు సబ్జెక్ట్‌లు ఫెయిల్ అయిన సుమారు 60 మంది విద్యార్థులను డిటైన్ చేయడంతో వారు ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా మల్లారెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ విద్యార్థులు, వారి పేరెంట్స్ ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ క్రమంలో ఘటనా స్థలానికి పోలీసులు చేరుకోగా.. పోలీసులు, విద్యార్థుల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. కాగా, ధర్నా చేస్తున్న విద్యార్థులకు కాంగ్రెస్ నేత మైనంపల్లి హన్మంతరావు మద్దతుగా నిలిచారు. -
ఆఫ్ఘానిస్తాన్ లో అమ్మాయిలకు నరకం చూపిస్తున్న తాలిబన్లు
-
నిజాం కాలేజ్ ఇష్యూ పై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందన
-
మూడు రాజధానులకు మద్దతుగా విశాఖలో విద్యార్థుల మానవహారం
-
ఇన్చార్జి వీసీ పోస్టు నుంచి తప్పించండి: బాసర ట్రిపుల్ ఐటీ వీసీ!
సాక్షి, హైదరాబాద్: బాసర ట్రిపుల్ ఐటీ ఇన్చార్జి వీసీ బాధ్యతల నుంచి తనను తప్పించాలని ప్రొఫెసర్ వి.వెంకటరమణ ప్రభుత్వాన్ని కోరినట్టు తెలిసింది. విద్యార్థుల నుంచి పెరుగుతున్న వ్యతిరేకత ఓవైపు.. అక్కడి ఆందోళనలను గట్టిగా అణచివేయాలని పైనుంచి వచ్చిన ఆదేశాలు మరోవైపు.. ఆయనపై ఒత్తిడి పెంచాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే తనను ఈ బాధ్యతల నుంచి తప్పించాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి, సీఎంవోలోని ఓ ముఖ్యమైన అధికారికి మొరపెట్టుకున్నట్టు సమాచారం. విద్యార్థుల ఆందోళనలు ఉధృతమై.. బాసర ట్రిపుల్ ఐటీకి కొన్నేళ్లుగా వైస్ చాన్స్‌లర్‌ను నియమించలేదు. అక్కడి తాత్కాలిక ఉద్యోగులు, భోజనాల కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. నాణ్యతలేని భోజనం పెడుతున్నారని, పురుగుల అన్నం పెట్టినా మాట్లాడే దిక్కులేకుండా పోయిందని నెల రోజులుగా విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. ఇటీవల ఆహారం కల్తీ అయి విద్యార్థులు అనారోగ్యం పాలవడంతో ఇది మరింత ఉధృతమైంది. గట్టిగా అణచివేయాలనే ఆదేశాలతో.. మరోవైపు గత నెలలో ఇన్చార్జి వీసీగా వెంకటరమణను ప్రభుత్వం నియమించింది. విద్యార్థుల డిమాండ్లను వేగంగా పరిష్కరిస్తానని ఆయన వచ్చిన కొత్తలో హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు విద్యార్థుల ఆందోళనపై కఠినంగా వ్యవహరించాలని పైనుంచి ఆదేశాలు అందాయి. ఈ క్రమంలోనే ఆందోళన బాటపట్టిన విద్యార్థులను సస్పెండ్ చేస్తామని వెంకటరమణ హెచ్చరించినట్టు అధికారవర్గాలు చెబుతున్నాయి. కానీ దీనివల్ల విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఎదుట తాను దోషిగా నిలబడాల్సి వస్తోందని ఆయన సన్నిహితుల వద్ద వాపోయినట్టు తెలిసింది. మెస్ కాంట్రాక్టు విషయంలోనూ.. బాసర ట్రిపుల్ ఐటీలో 6 వేల మంది విద్యార్థులు ఉన్నారు. వారికి భోజనాలు అందించేందుకు ముగ్గురు కాంట్రాక్టర్లున్నారు. వీరిలో ఒక్కరే కీలకమని, మిగతా ఇద్దరూ అతడి బినామీలేనని ఆరోపణలు ఉన్నాయి. భోజనాల పని కోసం మొత్తం 400 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. వారంతా బాసర పరిసర ప్రాంతాలకు చెందిన వారే. మరోవైపు విద్యార్థుల డిమాండ్ మేరకు ప్రస్తుత కాంట్రాక్టర్ ను తొలగించి.. మద్రాసుకు చెందిన మరో కాంట్రాక్టర్‌కు అప్పగించాలని విద్యా శాఖ నిర్ణయించినట్టు తెలిసింది. సదరు కాంట్రాక్టర్ ప్రస్తుతమున్న స్థానిక సిబ్బంది అందరినీ తొలగించాలని.. తాను వేరే ప్రాంతాల నుంచి సిబ్బందిని తెచ్చుకుంటానని షరతు పెట్టగా.. అధికారులు ఓకే చెప్పినట్టు సమాచారం. అయితే తనకు తెలియకుండానే విద్యా శాఖ ఈ నిర్ణయాలు తీసుకుందని.. స్థానికుల దృష్టిలో మాత్రం తానే తప్పుచేసినవాడిని అవుతున్నానని ఇన్చార్జి వీసీ ఆందోళనకు లోనవుతున్నట్టు తెలిసింది. కఠినంగా వ్యవహరించాలని ఆదేశాలు వచ్చాయి ఇక్కడ స్థానిక రాజకీయాలు ఇబ్బంది పెడుతున్నాయి. విద్యార్థులను రాజకీయాలకు వాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కాస్త కఠినంగా వ్యవహరించాలని పై నుంచి ఆదేశాలు వచ్చాయి. ప్రభుత్వ నిర్ణయం ఏదైనా అమలు చేయాలనే నిర్ణయించుకున్నాను. బాధ్యతల నుంచి తప్పుకొంటానని ఏమీ కోరలేదు. – ప్రొఫెసర్ వెంకటరమణ, ట్రిపుల్ ఐటీ ఇన్చార్జి వీసీ -
బాసర ట్రిపుల్ ఐటీ వద్ద ఉద్రిక్తత.. బీజేపీ ఎంపీ అరెస్ట్
Basara IIIT.. బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆదివారం కూడా ట్రిపుల్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. నిరసన తెలుపుతున్న విద్యార్థులకు పరామర్శించేందుకు బీజేపీ నేతలు లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో బాసరకు వస్తున్న బీజేపీ ఎంపీ సోయం బాపూరావును లోకేశ్వరం వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. ట్రిపుల్ లోపలికి వెళ్లేందుకు మరికొందరు బీజేపీ నేతలు ప్రయత్నించగా వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉండగా.. కొద్దిరోజుల కిత్రం బాసర ట్రిపుల్ ఐటీలో ఫుడ్ పాయిజన్ కారణంగా వందల సంఖ్యలో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో, దీనికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. భోజనశాలకు లైసెన్స్‌ను వెంటనే రద్దు చేసి కొత్త వారిని నియమించాలని శనివారం రాత్రి ఆందోళన చేపట్టారు. తమ డిమాండ్లను నెరవేరుస్తామని ఇచ్చిన హామీలను పక్కనపెట్టడంతో శనివారం రాత్రి భోజనం చేసేందుకు వెళ్లిన విద్యార్థులందరూ అన్నం తినకుండా నిరసన వ్యక్తం చేశారు. తమ సమస్యలను పరిష్కరించేంతవరకు భోజనం చేయబోమని పట్టబట్టారు. రాత్రంతా మెస్‌లోనే జాగారం చేశారు. బాసర IIITలో మళ్లీ విద్యార్థుల ఆందోళన. ఫుడ్ పాయిజన్ అయిన మెస్ పై చర్యలు తీసుకోక పోవడంతో మెస్ వద్ద నిరసనకు దిగిన విద్యార్థులు. అర్ధరాత్రి వరకు కొనసాగిన iiit బాసర విద్యార్థుల నిరసన.#iiitbasara@kcvenugopalmp @Allavaru @srinivasiyc @manickamtagore @revanth_anumula @IYCTelangana pic.twitter.com/0Kh4ACHBOP — Arun Valmiki (@Arun_valmiki_) July 31, 2022 ఇది కూడా చదవండి: ‘రామగుండం’లో కొలువుల స్కాం! -
HYD: ప్రధాని మోదీ సభ ఎఫెక్ట్.. ఓయూలో ఉద్రిక్తత
తెలంగాణలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్న వేళ ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి సంఘాలు ఆందోళనకు పిలుపునిచ్చాయి. వర్సిటీలో అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేయాలని విద్యార్థుల సంఘాలు ధర్నాకు దిగాయి. ఈ సందర్భంగానే నిరసనకారులపై పెట్టిన కేసులను కూడా ఎత్తివేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే పరేడ్ గ్రౌండ్లో జరుగుతున్న ప్రధాని మోదీ సభ వద్ద నిరసనలు తెలపాలని అటుగా వెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో, పోలీసులు అప్రమత్తమై విద్యార్థి సంఘాల నేతలను అదుపులోకి తీసుకున్నారు. ఇది కూడా చదవండి: బీజేపీ సమావేశాలు.. తెలంగాణ పోలీస్ అత్యుత్సాహం -
బాసర ట్రిపుల్ ఐటీ వద్ద మళ్ళీ ఉద్రిక్తత
-
బాసర ట్రిపుల్ ఐటీ వద్ద ఉద్రిక్తత
బాసర ట్రిపుల్ ఐటీ వద్ద విద్యార్థులు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. కాగా, ఆందోళనల్లో భాగంగా ఆదివారం ట్రిపుల్ ఐటీ వద్ద మరోసారి ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ఏబీవీపీ కార్యకర్తలు బాసర ట్రిపుల్ ఐటీలోకి దూసుకెళ్లారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. అనంతరం వారిని అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో ఏబీవీపీ కార్యకర్తలు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు ఓ మహిళా కార్యకర్తను ఈడ్చుకెళ్లినట్టు సమాచారం. అనంతరం వారిని పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కాగా, అక్రమ అరెస్టులపై ఏబీవీపీ నాయకులు.. పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది కూడా చదవండి: అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపై వైఎస్ షర్మిల కీలక ప్రకటన -
బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు డిమాండ్లు ఇవి
-
బాసర ఐఐఐటీ విద్యార్థుల నిరసనపై స్పందించిన మినిస్టర్ కేటీఆర్
-
బాసర ట్రిపుల్ ఐటీ: స్పందించిన కేటీఆర్.. ఆపై చర్చలు విఫలం..
బాసర ట్రిపుల్ ఐటీలో(రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం)లో విద్యార్థులు ఆందోళనలకు దిగారు. ట్రిపుల్లో తీవ్ర సమస్యలతో సతమతమవుతున్నామని విద్యార్ధులు.. కళాశాల అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ముందు బైఠాయించి నిరసనలు తెలుపుతున్నారు. కాగా, బుధవారం విద్యార్థులుతో అధికారులు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. అధికారుల ముందు విద్యార్థులు 12 డిమాండ్లను ఉంచారు. కాగా, విద్యార్థులు డిమాండ్లకు అధికారులు ఒప్పుకోకపోవడంతో చర్చలు విఫలమైనట్టు సమాచారం. దీంతో, విద్యార్థులు తలపెట్టిన ఆందోళనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అంతకుముందు విద్యార్థులు.. మెస్‌లో భోజనం సరిగా లేదని, కరెంట్ ఉండటం లేదని, వాటర్ సమస్య వెంటాడుతోంది ఆరోపించారు. అలాగే, విద్యార్థులకు కనీసం ల్యాప్ టాప్స్ కూడా ఇవ్వడంలేదని ఆదేవన వ్యక్తం చేశారు. ఇక, రెండు సంవత్సరాల నుండి బాసర ట్రిపుల్ ఐటీ లోపలికి మీడియాను అధికారులు అనుమతించడం లేదని తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నేతలు అక్కడికి చేరుకున్నారు. వారికి కూడా లోపలికి అనుమతించకపోవడంతో గేటు బయటే కూర్చుని నిరసనలు తెలిపారు. ఇదిలా ఉండగా.. గతంలోనూ విద్యార్థులకు పెట్టే భోజనంలో బొద్దింకలు, బల్లులు రావడంతో వారు ఆందోళన చేపట్టారు. మరోవైపు.. విద్యార్థుల ఆందోళనలపై ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ స్పందించారు. ట్రిపుల్ ఐటీలో సమస్యలను తెలంగాణ సీఎం కేసీఆర్, విద్యాశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్తానన్నారు. ట్రిపుల్ ఐటీ విద్యా నాణ్యతను పెంచేందుకు, సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నామని, ఆందోళన చెందకండి అంటూ ట్విట్టర్ వేదికగా హామీనిచ్చారు. ఈ నేపథ్యంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందిస్తూ.. ట్రిపుల్ ఐటీలో సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామన్నారు. ఈ విషయంపై బుధవారం.. వైస్ ఛాన్స్లర్(వీసీ)తో సమావేశం కానున్నట్టు తెలిపారు. Will take all the issues mentioned to the notice of Hon’ble CM KCR Garu & Education Minister @SabithaindraTRS Garu Kindly be assured that we are committed to resolving any challenges with respect to improving quality of education https://t.co/jNLkemAkMU — KTR (@KTRTRS) June 15, 2022 ఇది కూడా చదవండి: చదువు చెప్పే గురువులేరి? -
గురుకుల ప్రిన్సిపాల్‌ను తొలగించాలి
సాక్షి, మద్నూర్: గురుకుల ప్రిన్సిపాల్ శ్రీనివాస్ వివాదాస్పదంగా ఉంటూ మహిళా ఉద్యోగుల జీవితాలతో చెలగాటమాడేవాడని, అతడిని వెంటనే ఉద్యోగం నుంచి తొలగించి కఠిన చర్యలు తీసుకోవాలని యువకులు, పెద్దలు డిమాండ్ చేశారు. ప్రిన్సిపాల్ శ్రీనివాస్ లైంగిక వేధింపులకు నిరసనగా మండల కేంద్రంలోని పాత బస్టాండ్ వద్ద జాతీయ రహదారిపై మంగళవారం గ్రామస్తులు పెద్ద సంఖ్యలో బైఠాయించారు. ప్రిన్స్‌పాల్ డౌన్ డౌన్ అంటూ వారు నినదించారు. ప్రిన్స్‌పాల్‌ను జాబ్ నుంచి తొలగించకుండా హైదరాబాద్ కార్యాలయానికి అటాచ్ చేయడం ఏమిటని వారు ప్రశ్నించారు. బహిరంగ శిక్ష విధించాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం ప్రిన్సిపాల్ శ్రీనివాస్ దిష్టిబొమ్మ దహనం చేశారు. రాస్తారోకో, ధర్నాతో జాతీయ రహదారిపై రెండు వైపుల వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఎస్సై సురేశ్ రాస్తారోకో చేస్తున్న వారికి సముదాయించి ధర్నా విరమింపజేశారు. మద్నూర్‌లో జాతీయ రహదారిపై రాస్తారోకో చేస్తున్న గ్రామస్తులు పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. ప్రిన్స్‌పాల్ శ్రీనివాస్‌ను మంగళవారం ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకున్నామని ఎస్సై సురేశ్ తెలిపారు. పోలీస్‌స్టేషన్‌లో ఉన్న ప్రిన్సిపాల్‌తో పా టు మరో ముగ్గురు పాఠశాల సిబ్బంది ఎందుకు ఉన్నారని యువకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుడికి పోలీస్ స్టేషన్లో సెల్‌ఫోన్ మాట్లాడడం ఎలా అనుమతించారని యువకులు పోలీసులను ప్రశ్నించారు. దీంతో ఎస్సై ముగ్గురి ఉపాధ్యాయుల ను వెళ్లిపోవాలని సూచించారు. ప్రిన్సిపాల్ వద్ద ఉన్న రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అక్రమాలకు సహకరిస్తున్నారంటూ ముగ్గురు సి బ్బందిపై గ్రామస్తులు దాడి చేశారు. పోలీస్ వాహనంలో ముగ్గురి సిబ్బందిని పాఠశాలకు తరలిస్తుండ గా యువకులు, గ్రామస్తులు అడ్డుకున్నారు. పోలీసు లు యువకులను చెదరగొట్టారు. సెక్షన్ 354ఏ, 509, 506 ప్రకారం కేసు నమోదు చేసి శ్రీనివాస్‌ను రిమాండ్‌కు తరలించామని ఎస్సై వెల్లడించారు. హైదరాబాద్ కార్యాలయానికి సరెండర్ లైంగిక వేధింపులకు పాల్పడిన గురుకుల ప్రిన్సిపాల్ శ్రీనివాస్‌పై వేటు పడింది. ప్రిన్సిపాల్ బాధ్యతల నుంచి తప్పిస్తూ మరో ఉపాధ్యాయిని సునీతకు ఇన్చార్జిగా బాధ్యతలు అప్పగిస్తున్నట్లు పాఠశాలకు మెయిల్ వచ్చింది. ప్రిన్సిపాల్ శ్రీనివాస్‌ను హైదరాబాద్‌లోని గురుకుల సొసైటీ కార్యదర్శికి అటాచ్ చేశారు. ప్రిన్సిపాల్ తన ప్రాబల్యంతో పోస్టింగ్ తెచ్చుకుంటాడని యువకులు మండిపడుతున్నారు. -
అనంతలో.. చిరిగిన నారాయణ చొక్కా..!
సాక్షి, అనంతపురం: టీడీపీ నేత, మాజీ మంత్రి నారాయణ జిల్లా పర్యటన సందర్భంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. నారాయణ పర్యటనను విద్యార్థి సంఘాల నేతలు అడ్డుకున్నారు. అదేవిధంగా అధిక ఫీజులపై మాజీ మంత్రి నారాయణను విద్యార్థి సంఘాల నేతలు నిలదీశారు. ఈ క్రమంలో విద్యార్థిసంఘం నేతలపై నారాయణ అనుచరులు దాడికి దిగారు. దీంతో విద్యార్థులు ఎదురుదాడి చేయటంతో ఆ ఘటనలో నారాయణ చొక్కా చిరిగిపోయింది. కారు అద్దాలు కూడా ధ్వంసం అయ్యాయి. విద్యార్థులు అడ్డుకొని నిరసన చేయటంతో నారాయణ తన పర్యటనను రద్దు చేసుకున్నారు. తమపై దాడికి పాల్పడ్డ మాజీ మంత్రి నారాయణ, అతని అనుచరులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేశారు. -
యోగి వేమన యూనివర్సిటీ వద్ద ఉద్రిక్త పరిస్థితులు
సాక్షి, వైఎస్సార్: యోగి వేమన యూనివర్సిటీ వద్ద ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. వసతి గృహాల్లో తాము ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలంటూ విద్యార్థులు తిండి తిప్పలు మానేసి దీక్ష చేపట్టారు. యూనివర్సిటీ ప్రధాన గేటు ఎదురుగా బైఠాయించి అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలుపుతున్నారు. ఈ క్రమంలో వర్సిటీ లోపలికి ఎవరిని వెళ్లనివ్వకుండా అడ్డుకుంటున్నారు. తమ సమస్యలు పరిష్కరించే వరకూ దీక్ష విరమించేది లేదని విద్యార్థులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో యూనివర్సిటీ ప్రాంగణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు యాజమాన్యం భారీగా పోలీసులను మోహరించారు. -
బస్సుల కోసం విద్యార్థుల నిరసన
సాక్షి, రేగిడి(శ్రీకాకుళం) : విద్యార్థులకు రవాణా కష్టాలు మరింత కష్టతరం కావడంతో రోడ్డెక్కుతున్నారు. కళాశాలలకు వెళ్లే సమయంలో చాలినన్ని బస్సులు నడపకపోవడంతో ఇటీవల ఉణుకూరులో ఆందోళన చేపట్టిన ఘటన మరవక ముందే తోకలవలస జంక్షన్ వద్ద బుధవారం పలు గ్రామాల విద్యార్థులు నిరసనకు దిగారు. ఈ మేరకు మండలంలోని తోకలవలసతోపాటు లింగాలవలస, వావిలవలస, బుడితిపేట, చిన్నశిర్లాం తదితర గ్రామాల విద్యార్థులు రోడ్డుపై బైఠాయించారు. ఉదయం 7 నుంచి 9 గంటల వరకు రెండు బస్సులు మాత్రమే తిరుగుతున్నాయని, పాలకొండ నుంచి ఉంగరాడమెట్టకు వచ్చేసరికే పరిమితికి మించిన ప్రయాణికులతో ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. ఈ విషయమై పలుమార్లు ఆర్టీసీ అధికారులకు విన్నవించుకున్నా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఈ విషయం తెలుసుకున్న రేగిడి పోలీసులు అక్కడకు చేరుకుని విద్యార్థులకు నచ్చజెప్పి ఆందోళను విరమింపజేశారు. ఆ సమయంలోనే పాలకొండ నుంచి రాజాం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సులు విద్యార్థులు టాప్‌పైన ప్రయాణించే ప్రయత్నం కూడా చేశారు. నిత్యం ప్రాణాలతో చెలగాటమాడుతూ కళాశాలలకు వెళ్లాల్సి వస్తుందని, ఆర్టీసీ అధికారుల ఇప్పటికైనా స్పందించి అదనపు బస్సులను నడపాలని కోరుతున్నారు. -
ధర్నాలతో దద్దరిల్లిన కలెక్టరేట్
సాక్షి, కడప : తమకు ఏడు నెలలుగా నిలిపివేసిన జీతాలు, పారితోషికం వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ ఆశా వర్కర్లు సోమవారం కలెక్టరేట్ వద్ద ఏఐయూటీసీ ఆ«ధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షులు జి.వేణుగోపాల్, అధ్యక్షురాలు సుభాషిణి, ప్రధాన కార్యదర్శి అయ్యవారమ్మ ఈ సందర్బంగా మాట్లాడుతూ పెండింగ్ జీతాలు ఇవ్వాలని పలుమార్లు కోరినా గత ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని అన్నారు. ఇందువల్ల తాము ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తోందని వివరించారు. పాఠశాలలు ప్రారంభమై నెలరోజులైందని, పిల్లలకు ఫీజులు, పుస్తకాలు కొనలేక పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్ వేతనాలు ఇచ్చి ఆదుకోవాలని కోరారు. కేవలం రూ 150 పారితోషికంతో గత 15 ఏళ్ల నుంచి పనిచేస్తున్న ఆశా కార్యకర్తలు అనారోగ్య కారణాలుగా కొన్నిరోజులు విధులకు హాజరు కాలేదని, ఈ కారణంగా పీహెచ్సీ అధికారులు వారిని డ్రాపౌట్స్ చేశారని తెలిపారు. డ్రాపౌట్‌కు గురైన వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆశాలపై పీహెచ్సీ అధికారులు, రాజకీయ నాయకులు వేధింపులు ఆపాలని అన్నారు. కొంతమంది ఆశాలను విధులకు రావద్దని రాజకీయ నాయకులకు అనుకూలంగా పీహెచ్సీ అధికారులు ఆదేశాలు ఇవ్వడం సరికాదని చెప్పారు. స్థానిక రాజకీయ నాయకుల అనుచరులను ఆశాలుగా నియమించుకునే వీలును పీహెచ్సీ అధికారులు కల్పిస్తున్నారని ఆరోపించారు. ఆశాలు రాజీనామాలు చేయాలంటూ బెదిరింపులకు పాల్పడటాన్ని తక్షణమే ఆపాలన్నారు. వీటిపై విచారణ జరిపించి సంబంధిత అధికారులపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆశాలకు రూ. 10 వేలు జీతం, పాత పద్దతి ప్రకారం ఇస్తామన్న పారితోషికానికి సంబంధించిన జీఓలను విడుదల చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు కేసీ బాదుల్లా తదితరులు పాల్గొన్నారు. బిల్లులు చెల్లించాలని మధ్యాహ్న భోజన కార్మికులు.. కడప సెవెన్‌రోడ్స్ : మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న కార్మికులకు ఇవ్వాల్సిన ఆరు నెలల వేతనాలు, బిల్లులు తక్షణమే విడుదల చేయాలని ఏపీ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవా«ధ్యక్షులు ఎస్.చాన్‌బాషా, ఏఐటీయూసీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ కేసీ బాదుల్లా డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్ ఎదుట మధ్యాహ్న భోజన కార్మికులు నిర్వహించిన ధర్నాలో వారు మాట్లాడారు. గత 16 సంవత్సరాలుగా నామమాత్రపు గౌరవ వేతనంతో కొనసాగుతున్న కార్మికులు కనీస వేతనాలకు నోచుకోవడం లేదని తెలిపారు. విద్యార్థులకు ఇబ్బంది లేకుండా భోజనాలు వడ్డిస్తున్నారని చెప్పారు. కూరగాయల కోసం అప్పులు చేయాల్సి వస్తోందన్నారు. ప్రభుత్వాలు మారినపుడల్లా మధ్యాహ్న భోజన కార్మికులను తొలగించి వారి కార్యకర్తలను నియమించుకునే ప్రయత్నాలు సాగడం దురదృష్టకరమని అన్నారు. ఫిబ్రవరి నుంచి గౌరవ వేతనం రూ. 3 వేలకు పెంచుతూ గత ప్రభుత్వం జీఓ విడుదల చేసిందని, అయితే నేటికీ జీఓ అమలుకు నోచుకోలేదన్నారు. అనంతరం కలెక్టర్ హరి కిరణ్‌కు వినతిపత్రాన్ని సమర్పించారు. యూనియన్ అధ్యక్షురాలు రేణుకమ్మ, సులోచనమ్మ, వెంకట శివ, మేరి, అమరావతి, అబ్దుల్ ఘని, జాకోబ్ తదితరులు పాల్గొన్నారు. కడప సెవెన్‌రోడ్స్ మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న కార్మికులకు ఇవ్వాల్సిన ఆరు నెలల వేతనాలు, బిల్లులు తక్షణమే విడుదల చేయాలని ఏపీ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవా«ధ్యక్షులు ఎస్.చాన్‌బాషా, ఏఐటీయూసీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ కేసీ బాదుల్లా డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్ ఎదుట మధ్యాహ్న భోజన కార్మికులు నిర్వహించిన ధర్నాలో వారు మాట్లాడారు. గత 16 సంవత్సరాలుగా నామమాత్రపు గౌరవ వేతనంతో కొనసాగుతున్న కార్మికులు కనీస వేతనాలకు నోచుకోవడం లేదని తెలిపారు. విద్యార్థులకు ఇబ్బంది లేకుండా భోజనాలు వడ్డిస్తున్నారని చెప్పారు. కూరగాయల కోసం అప్పులు చేయాల్సి వస్తోందన్నారు. ప్రభుత్వాలు మారినపుడల్లా మధ్యాహ్న భోజన కార్మికులను తొలగించి వారి కార్యకర్తలను నియమించుకునే ప్రయత్నాలు సాగడం దురదృష్టకరమని అన్నారు. ఫిబ్రవరి నుంచి గౌరవ వేతనం రూ. 3 వేలకు పెంచుతూ గత ప్రభుత్వం జీఓ విడుదల చేసిందని, అయితే నేటికీ జీఓ అమలుకు నోచుకోలేదన్నారు. అనంతరం కలెక్టర్ హరి కిరణ్‌కు వినతిపత్రాన్ని సమర్పించారు. యూనియన్ అధ్యక్షురాలు రేణుకమ్మ, సులోచనమ్మ, వెంకట శివ, మేరి, అమరావతి, అబ్దుల్ ఘని, జాకోబ్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు కలెక్టరేట్ వద్ద ధర్నా ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి నరసింహా, డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి శివకుమార్ మాట్లాడుతూ కార్పొరేట్ విద్యా సంస్థల ఆగడాలకు అదుపు లేకుండా ఉందని అన్నారు. ఐఐటీ, టెక్నో, ఈ–టెక్నో, ఒలింపియాడ్, నేషనల్, ఇంటర్నేషనల్, ఏసీ క్యాంపస్ పేర్లతో విద్యార్థుల తల్లిదండ్రులను ప్రలోభ పెడుతున్నారని తెలిపారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా పుస్తకాలు, షూ, యూనిఫాం వంటివి పాఠశాలల్లోనే అమ్ముతూ విద్యాలయాలను వ్యాపార కేంద్రాలుగా మార్చారని ఆరోపించారు. విచ్చలవిడిగా ఫీజుల దందా కొనసాగిస్తున్నా విద్యాశాఖ అధికారులు పట్టించుకోకపోవడం దారుణమని అన్నారు. విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సంస్థల్లో 25 శాతం సీట్లకు ఉచిత విద్య అందించాలన్నారు. అమ్మ ఒడి పథకాన్ని ప్రభుత్వ పాఠశాలలకు మాత్రమే పరిమితం చేయాలని కోరారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనాన్ని కొనసాగించాలన్నారు. ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు.ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నాయక్, రాజేంద్ర, డీవైఎఫ్ఐ నాయకులు జగదీష్, స్టీఫెన్, ఎస్ఎఫ్ఐ నాయకులు సునీల్, ఐద్వా నాయకురాలు ఐఎన్ సుబ్బమ్మ తదితరులు పాల్గొన్నారు. -
పాఠాలు చెప్పాలని అడిగితే కేసులు పెడతారా?
సాక్షి, మెదక్ : పాఠాలు చెప్పాలని అడిగితే కేసులు పెడతారా? ఎకనామిక్స్ శ్రీనివాస్‌ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో శనివారం ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర కార్య సమితి సభ్యుడు ఫృథ్విరాజ్ మాట్లాడుతూ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎకనామిక్స్ లెక్చరర్‌గా పనిచేస్తున్న శ్రీనివాస్ విద్యార్థులకు పాఠాలు చెప్పకపోవడంతో వారు పరీక్షలు ఫేయిల్ కావడం జరిగిందని ఆరోపించారు. విద్యార్థులు వెళ్లి క్లాసులు నిర్వహించాలని అడిగితే శ్రీనివాస్‌తోపాటు ప్రిన్సిపల్ విద్యార్థులను దుర్బాషలాడుతూ వారిపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారన్నారు. ఈ విషయంపై స్పందించిన ఏబీవీపీ ఆధ్వర్యంలో ప్రిన్సిపల్ చాంబర్ ముందు ధర్నా నిర్వహించడం జరిగిందన్నారు. అనంతరం మెదక్ పట్టణ సీఐ అక్కడికి చేరుకొని విద్యార్థులపై పెట్టిన కేసులను తీసివేసి మళ్లి ఇలాంటివి జరగకుండా చూసుకుంటామని హామినిచ్చినట్లు ఫృథ్విరాజ్ తెలిపారు. దీంతో విద్యార్థులు ధర్నాను విరమించుకున్నట్లు తెలిపారు. లెక్చరర్ శ్రీనివాస్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శ్రీనివాస్‌గౌడ్, రాజేశ్వర్, సాయి, వంశీ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
కాకతీయ యూనివర్సిటీలో ఉద్రిక్తత
సాక్షి, వరంగల్: నగరంలోని కాకతీయ యూనివర్సిటీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పెంచిన పీహెచ్డీ అడ్మిషన్ ఫీజు తగ్గించాలని డిమాండ్ చేస్తూ స్కాలర్ విద్యార్థులు ఆందోళనకు దిగారు. వెంటనే ఫీజులు తగ్గించాలంటూ యూనివర్సిటీ పరిపాలన భవనం ముందు ధర్నా చేపట్టారు. ఆందోళన చేపట్టిన విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. ఈ ఘటనలో పరిపాలన భవనం అద్ధాలు ధ్వంసమయ్యాయి. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
కాకతీయ యూనివర్సిటీలో ఉద్రిక్తత
-
వరంగల్ కేయూలో విద్యార్థుల ఆందోళన
సాక్షి, వరంగల్ : కాకతీయ యూనివర్సిటీలోని హాస్టళ్ల విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని, నాణ్యమైన భోజనం అందించాలని డిమాండ్ చేస్తూ కామన్మెస్ విద్యార్థులు గురువారం క్యాంపస్‌లో ర్యాలీ నిర్వహించి, పరిపాలనాభవనం ఎదుట బైఠాయించి ధర్నా చేపట్టారు. కేయూ హాస్టళ్ల డైరెక్టర్ ఇస్తారి అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ అతడిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. మెనూచార్టును సక్రమంగా అమలు చేయటంలేదని విమర్శించారు. మెనూకు సంబంధించిన అవకతకవలపై ఆడిట్ అ«ధికారులతో అందరి సమక్షంలో సమగ్ర విచారణ జరిపించాలని, కామన్‌మెస్‌ను డివైడ్ చేయాలని డిమాండ్ చేశారు. కేయూ వీసీ అనుమతి లేకుండా యూనివర్సిటీలో పోలీసుల జోక్యం సరికాదన్నారు. స్టీమర్ రైస్‌ను తొలగించాలని కోరారు. హాస్టళ్లకు వెళ్లేదారిలో పూర్తిస్థాయిలో విద్యుద్ధీపాలు ఏర్పాటు చేయాలన్నారు. దివ్యాంగ విద్యార్థులకు ప్రత్యేకంగా మెస్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. వంకాయకూరలో పురుగులు వచ్చాయని రెండురోజుల క్రితం రాత్రివేళ వీసీ లాడ్జ్ వద్దకు వెళ్లేయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. అక్కడికి వచ్చిన రిజిస్ట్రార్ కె.పురుషోత్తమ్ కామన్‌మెస్‌లోని విద్యార్థుల సమస్యలపై చర్చిద్దామని సర్దిచెప్పారు. గురువారం మళ్లీ విద్యార్థులు ర్యాలీ నిర్వహించి ధర్నా చేశారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని లేనిఎడల పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఆందోళన చేస్తున్న విద్యార్థుల్లో ఓ విద్యార్థి అస్వస్థతకు గురై కిందపడిపోవడంతో ఆసుపత్రికి తరలించారు. రిజిస్ట్రార్ సమక్షంలో విద్యార్థులతో చర్చలు.. కాకతీయ యూనివర్సిటీ కామర్స్ అండ్‌బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాల సెమినార్‌హాల్‌లో సాయంత్రం కామన్ మెస్, హాస్టళ్ల విద్యార్థులతో రిజిస్ట్రార్ కె.పురుషోత్తమ్ సమక్షంలో క్యాంపస్ కళాశాల ప్రిన్సిపాల్ టి.రవీందర్‌రెడ్డి, హాస్టళ్ల డైరెక్టర్ డాక్టర్ ఎం.ఇస్తారి, దూరవిద్యాకేంద్రం డైరెక్టర్ జి.వీరన్న, కేయూ డెవలప్మెంట్ ఆఫీసర్ ఆచార్య వి.రాంచంద్రం చర్చలు జరిపారు. ఈ సందర్భంగా పలువురు విద్యారులు మాట్లాడుతూ ఒకే మెస్‌లో ఎక్కువమంది కాకుండా ఏ హాస్టల్‌కు అక్కడే మెస్‌ను విడివిడిగా ఏర్పాటు చేయాలని, మెస్‌లలో బయోమెట్రిక్‌ను ప్రవేశపెట్టాలని కోరారు. ప్రతివిద్యార్థి ఎన్నిరో జులు తింటే అన్ని రోజులకు మాత్రమే బిల్లు వేయాలన్నారు. ఇలా అనేక సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లారు. అక్రమాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని, నాణ్యమైన భోజనం అందించాలని కోరారు. అయితే విడివిడిగా మెస్‌లను వచ్చే విద్యాసంవత్సరంలో ఏర్పాటుకు పరిశీలిస్తామని ఆచార్యులు తెలిపారు. బయోమెట్రిక్ సాధ్యసాధ్యాలను పరిశీలిస్తామని పేర్కొంటూ ఒక మెస్‌లో ప్రయోగాత్మకంగా పెట్టి పరిశీలించాక మిగితా వాటిల్లో ప్రవేశపెట్టేందుకు యత్నిస్తామని సమాధానం ఇచ్చారు. -
రోడ్డు కోసం విద్యార్థుల ధర్నా
మనూరు(నారాయణఖేడ్): నాగల్గిద్ద మండలం మోర్గి రోడ్డును మరమ్మతులు చేపట్టాలని విద్యా ర్థులు శుక్రవారం పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమా న్ని నిర్వహించారు. మోర్గి మోడ్ నుంచి మోర్గి గ్రా మం వరకు నాలుగు కిలోమీటర్ల మేర రోడ్డు పూర్తి గా ఛిద్రమై గోతుల మయంగా మారిందని ఆందో ళన వ్యక్తం చేశారు. మోర్గిలో ఉన్న మోడల్ పాఠశాలకు వెళ్లేందుకు వాహనాలు రావడంలేదన్నా రు. తాము నిత్యం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆందోళన వ్యక్తం చేస్తూ మోర్గి, గోందేగాం, షాపూర్, నాగల్గిద్ద, ఎర్రబొగుడ, శేరిదామర్‌గిద్దకు చెందిన విద్యార్థుల తల్లిదండ్రులతోపాటు పలువురు గ్రామస్తులు సైతం ఆందోళనకు దిగారు. దీంతో ఉదయం 9గంటల నుంచి 11గంటలకు వరకు రోడ్డుపైన ఎక్కడికి అక్కడ ట్రాఫిక్ నిలిచిపోగా విద్యార్థులు రోడ్డు నిర్మించాలని ఆందోళన నినాదాలతో మారుమోగింది. విద్యార్థులకు మద్దతు తెలిపిన సంజీవ్‌రెడ్డి విద్యార్థులు ధర్నా చేస్తున్న విషయాన్ని తెలుసుకున్న టీపీసీసీ సభ్యుడు, ఖేడ్ ఎంపీపీ సంజీవ్‌రెడ్డి రాస్తారోకో కార్యక్రమంలో పాల్గొని సంఘీభావం తెలిపారు. గతంలో షాపూర్, ఎర్రబొగుడ గ్రామాలకు సంబంధించి రోడ్లు కావాలని తాము ధర్నా చెయ్యడంతోనే ఇటీవలే నిధులు మంజూరు అయ్యాయని అన్నారు. అనంతరం వారు నాగల్‌గిద్దలోని తహసీల్ కార్యాలయలో వినతి పత్రం అందచేశారు. కార్యక్రమంలో మనూరు మాజీ ఎంపీపీ శంకరయ్యస్వామి, న్యాయవాది సంగన్న, దారం శంకర్, పండరిరెడ్డి, వెంకట్‌రెడ్డి, గ్రామస్తులు అశోక్, శివ్‌శర్ణప్ప, శ్రీకాంత్, రామ్రావు, గుండేరావు, కుషల్‌రావుపాటిల్, సంజీవ్‌పాటిల్ మోడల్ పాఠశాల విద్యార్థులు తదిరతులు పాల్గొన్నారు. -
ఏయూలో విద్యార్థుల ఆందోళన
సాక్షి, విశాఖ: ఆంధ్ర విశ్వవిద్యాలయంలో శనివారం విద్యార్థులు ఆందోళనకు దిగారు. యూనివర్సిటీ హాస్టళ్లకు అధికారులు ఆదివారం నుంచి సెలవులు ప్రకటించారు. అయితే డీఎస్సీ నోటిఫికేషన్ దృష్ట్యా హాస్టళ్లను తెరిచే ఉంచాలని విద్యార్థులు కోరారు. అయితే యూనివర్సిటీ అధికారులు స్పందించకపోవడంతో విద్యార్థులు నిరసన తెలిపారు. -
ఓయూలో లంబాడీ విద్యార్థుల ధర్నా
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీలో లంబాడీ విద్యార్థులు ధర్నా చేపట్టారు. విద్యార్థులు శనివారం తరగతులు బహిష్కరించి ఆందోళన చేస్తున్నారు. ర్యాలీగా బయల్దేరిన విద్యార్థులు వీసీ ఛాంబర్ వద్ద బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. కాగా ఆదివాసీలు, లంబాడీలు శుక్రవారం పరస్పర దాడులకు దిగడంతో ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఏజెన్సీ అల్లకల్లోలంగా మారిన విషయం తెలిసిందే.ఏజెన్సీలోని నార్నూర్ మండలం బేతాల్‌గూడలో గురువారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు కుమురం భీం విగ్రహానికి చెప్పులదండ వేయడంతో వివాదం రాజుకుంది. -
ప్రిన్సిపల్ వేధింపుల వల్లే..
హైదరాబాద్: మల్లారెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్స్ కళాశాల ప్రిన్సిపల్‌ను విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ.. సోమవారం కళాశాల ప్రధాన ద్వారం వద్ద విద్యార్థులు ఆందోళనకు దిగారు. ప్రిన్సిపల్ డాక్టర్ కమలాదేవి వేధింపుల వల్లే రెండు రోజుల క్రితం కళాశాల లెక్చరర్ అర్జున్ ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడని.. వెంటనే ఆమెను విధుల నుంచి తొలగించాలని విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. -
విద్యార్థి సంఘాల ఆందోళన: ఉద్రిక్తత
హైదరాబాద్: డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలలో తీవ్రజాప్యాన్ని నిరసిస్తూ.. సోమవారం పలు విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. అప్పుడు ఇప్పుడు అంటూ నోటివికేషన్ విడుదలలో తీవ్ర జాప్యం చేస్తూ.. విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుకుంటున్నారని వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని సైఫాబాద్‌లోని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు. అప్రమత్తమైన పోలీసులు ఆందోళనకారులను అక్కడ నుంచి చెదరగొట్టారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తోపులాట జరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. -
బీటెక్ విద్యార్థినితో ప్రిన్సిపాల్ అసభ్య ప్రవర్తన
రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లాలోని అబ్దుల్లాపూర్‌మెట్ బ్రిలియంట్ ఇంజనీరింగ్ కళాశాల ఎదుట ఉద్రిక్తత చోటు చేసుకుంది. విద్యార్థినుల పట్ల కళాశాల సిబ్బంది అసభ్యంగా ప్రవర్తింస్తున్నారని ఆరోపిస్తూ.. సోమవారం ఉదయం విద్యార్థులు పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు. బీటెక్ విద్యార్థిని పట్ల ప్రిన్పిపల్ అసభ్యంగా ప్రవర్తించాడు. స్కాలర్ షిప్‌ల విషయంలోనూ ఫ్యాకల్టీ వేధింపులకు గురి చేస్తున్నట్లు విద్యార్థులు తెలిపారు. తరగతులను బహిష్కరించి కళాశాల ఎదుట ఆందోళన నిర్వహిస్తున్నారు. -
‘ఎగ్జిట్’కు నిరసనగా వైద్యవిద్యార్థుల ర్యాలీ
హైదరాబాద్: వైద్య విద్య పూర్తి చేసిన వారు ‘ఎగ్జిట్’ రాయాలని పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని మెడికల్ విద్యార్థులు వ్యతిరేకిస్తున్నారు. వైద్య పూర్తి చేసిన వారు వైద్యులుగా ప్రాక్టీసు ప్రారంబించేందుకు గతంలో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనుమతించేది. అయితే దాన్ని ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం రద్దుచేసి నేషనల్ మెడికల్ కౌన్సిల్‌ను అమలులోకి తెచ్చింది. వైద్య విద్య పూర్తి చేసిన వారు ‘ఎగ్జిట్’ అనే పరీక్ష రాస్తేనే ప్రాక్టీసుకు అనుమతించాలని కేంద్రం నిర్ణయించడంతో ఎల్లకాలం పరీక్షలు రాస్తూ కూర్చుంటే ప్రాక్టీసు ఎప్పుడు చేసుకుంటామంటూ విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. దీనివల్ల తాము నష్టపోతామంటున్నారు. అలాగే సర్వీసు కోటా కింద పీజీలో 50 శాతం సీట్లు పెంచాలన్న నిర్ణయాన్ని కూడా వవ్యతిరేకిస్తున్నారు. వీరికి ఐఎంఏ కూడా మద్దతు పలికింది. సుమారు 600 మంది వైద్య విద్యార్థులు ర్యాలీలో పాల్గొన్నారు. కాగా సికింద్రాబాద్‌లో గాంధీ ఆస్పత్రి మెడికల్ విద్యార్థులు కూడా ఐఎంఏ తెలంగాణ స్టేట్ బ్రాంచి ఆధ్వర్యంలో ‘ఎగ్జిట్’కు వ్యతిరేకంగా ధర్నా నిర్వహించారు. కరీంనగర్లో కలెక్టరేట్ గేటు ముందు మెడికల్ విద్యార్థులు మానవహారం చేపట్టారు. కాగా, హైదరాబాద్ ఎల్బీనగర్లోని కామినేని ఆస్పత్రి వైద్య విద్యార్థులు కూడా తరగతులు బహిష్కరించి భారీ ర్యాలీ చేపట్టారు. -
జేఎన్టీయూలో విద్యార్థుల భారీ ధర్నా
హైదరాబాద్: సమస్యలు పరిష్కరించాలంటూ కూకట్పల్లి జేఎన్టీయూ విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. పెంచిన పరీక్ష ఫీజులను వెంటనే తగ్గించాలని, హాస్టళ్లలో సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏబీవీపీ ఆధ్వర్యంలో శనివారం తరగతులు బహిష్కరించారు. యూజీసీ నిధుల దుర్వినియోగమయ్యాయని, ఇందులో అధికారుల వాటా ఎంత అని ప్రశ్నించారు. విద్యార్థుల నినాదాలతో యూనివర్సిటీ ప్రాంగణం దద్దరిల్లింది. -
బీచ్ లవ్ ఫెస్టివల్ వద్దు: విద్యార్థుల ఆందోళన
-
ఉద్యాన విద్యార్థుల ధర్నా
హైదరాబాద్: ఉద్యానశాఖలోని ఉద్యాన విస్తరణాధికారి పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరుతూ తెలంగాణ ఉద్యాన డిప్లొమా విద్యార్థుల సంఘం ఆందోళనకు దిగింది. సోమవారం మధ్యాహ్నం సంఘం ఆధ్వర్యంలో ఇందిరాపార్కు వద్ద విద్యార్థులు ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమానికి బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య మద్దతు తెలిపారు. విద్యార్థులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. -
అశ్లీల వీడియోలు : టీచర్ పై దాడికి యత్నం
-
అశ్లీల వీడియోలు : టీచర్ పై దాడికి యత్నం
ఆత్మకూరు: సూర్యాపేట జిల్లాలో విద్యార్థులకు అశ్లీల వీడియోలు చూపుతున్నాడంటూ ఓ ఉపాధ్యాయుడిపై గ్రామస్తులు దాడికి యత్నించారు. ఈ సంఘటన ఆత్మకూరు(ఎస్) మండలం శెట్టిగూడెం ప్రాథమికోన్నత పాఠశాలలో చోటుచేసుకుంది. కిరణ్ అనే ఉపాధ్యాయుడు పిల్లలకు అశ్లీల వీడియోలు చూపుతున్నాడంటూ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అతని పై కఠిన చర్యలు తీసుకోవాలంటూ గ్రామస్తులతో కలిసి విద్యార్థులు ధర్నాకు దిగారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
కస్తూర్బా విద్యార్థినుల ఆందోళన
తిప్పర్తి: కస్తూర్బా గాంధీ పాఠశాల విద్యార్థినులు సమస్యలు తీర్చాలని డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగారు. నల్లగొండ జిల్లా తిప్పర్తి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలలో సోమవారం మధ్యాహ్న భోజనం సరిగ్గా లేదని విద్యార్థినులు ఆందోళన చేపట్టారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో వసతుల విషయంలో ప్రిన్సిపల్‌ను ప్రశ్నించగా.. నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో.. ఆగ్రహించిన విద్యార్థినులు తరగతులను బహిష్కరించి ఆందోళన చేస్తున్నారు. -
బీసీ హాస్టళ్ల పునరుద్ధరణ కోసం ఆందోళన
గాలివీడు: వైఎస్సార్ జిల్లా గాలివీడు, చిన్నమండ్యంలలో ఎత్తివేసిన బీసీ హాస్టళ్లను పునరుద్ధరించాలని కోరుతూ రాయచోటిలో విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళనకు దిగారు. రాయచోటి తహశీల్దార్ కార్యాలయం వరకు విద్యార్థులు ర్యాలీ తీశారు. అనంతరం కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. ఆందోళనకు దిగిన విద్యార్థులకు ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి మద్ధతు తెలిపారు. విద్యార్ధుల సమస్యలపై పభుత్వంతో పోరాడతామని హామీ ఇచ్చారు. -
కోటగిరిలో ఏబీవీపీ రాస్తారోకో
కోటగిరి: నిజామాబాద్ జిల్లా కోటగిరిలో ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు రాస్తారోకోకు దిగారు. ఎంసెట్ లీకేజీ వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని ఆందోళనకు దిగారు. ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలు అధిక ఫీజులు వసూలు చేస్తూ పేదల నడ్డివిరుస్తున్నాయని, దీనిపై సీఎం కేసీఆర్ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. దీనికి నిరసనగా కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. -
హైకోర్టు విభజన కోసం ఢిల్లీలో ధర్నా
న్యూఢిల్లీ: తెలంగాణకు హైకోర్టును ఏర్పాటు చేయాలని శుక్రవారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు ధర్నాకు దిగారు. హైకోర్టు విభజనకు కేంద్రం వెంటనే చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. ఈ ధర్నాకు టీఆర్ఎస్ ఎంపీలు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీలు కొత్త ప్రభాకర్‌రెడ్డి, విశ్వేశ్వరరెడ్డి, బీబీ పాటిల్ మాట్లాడుతూ కేంద్రం తక్షణమే స్పందించి హైకోర్టును విభజన చేపట్టాలని కోరారు. -
ఆంధ్రా యూనివర్సిటీలో ఆందోళన
విశాఖపట్నం: విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీలో శుక్రవారం విద్యార్థులు ఆందోళనకు దిగారు. కొంత కాలంగా భోజన వసతులు అధ్వాన్నంగా ఉన్నాయంటూ వీసీ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. వెంటనే చర్యలు తీసుకుని వసతులు మెరుగుపర్చాలని డిమాండ్ చేశారు. విద్యార్థులతో యూనివర్సిటీ వీసీ నారాయణ భోజన వసతుల గురించి చర్చిస్తున్నారు. -
దద్దరిల్లిన జనగామ
జనగామ: వరంగల్ జిల్లా జనగామ సోమవారం విద్యార్థుల నినాదాలతో మారుమోగిపోయింది. కొత్తగా ప్రతిపాదించిన జిల్లాల జాబితాలో జనగామను కూడా చేర్చాలంటూ జాతీయరహదారిపై ఐకాస ఆధ్వర్యంలో విద్యార్థులు మానవహారం చేపట్టారు. రెండుగంటల పాటు జాతీయరహదారిపై రాస్తారోకో చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని, జనగామను జిల్లాగా చేయాలని నినాదాలు చేశారు.దీంతో పెద్ద ఎత్తున వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళన కారులను విరమింపజేశారు. -
బస్టాండ్ ముట్టడికి విద్యార్థుల యత్నం
ఇబ్రహీంపట్నం: ఆన్లైన్లో బస్‌పాస్‌లు జారీచేయడం వల్ల అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని.. కళాశాలలు ప్రారంభమై పది రోజులు పూర్తైన ఇప్పటి వరకు బస్సుపాసులు జారి చేయకపోవడంతో.. విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని ఎస్ఎఫ్ఐ నాయకులు బస్టాండ్ ఎదుట ఆందోళన చేశారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం బస్‌స్టేషన్ ఎదుట ఎస్ఎఫ్ఐ నాయకులు ఆధ్వర్యంలో విద్యార్థులు బస్టాండ్ ముట్టడికి ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని విద్యార్థులను అడ్డుకున్నారు. -
అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఆందోళన
హైదరాబాద్: రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో విద్యార్థులు మంగళవారం ధర్నాకు దిగారు. ఏఈఓ పోస్టులను అగ్రికల్చర్ విద్యార్థులకే కేటాయించాలని వారు ఆందోళన చేపట్టారు. యూనివర్సిటీలో తరగతులను బహిష్కరించి కాలేజీ గేటు ముందు బైఠాయించి విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. -
ఇడుపులపాయ ట్రిపుల్‌ఐటీలో ఆందోళన
కడప: వైఎస్ఆర్ కడప జిల్లా ఇడుపలపాయ ట్రిపుల్ ఐటీలో శుక్రవారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. అధ్యాపకుడు చేయి చేసుకున్నాడని విద్యార్థులు ధర్నాకు దిగడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇటీవలి కాలంలో కొత్తగా అమలులోకి వచ్చిన నిబంధనలను విద్యార్థులు అలక్ష్యం చేయడంతో.. కళాశాల సిబ్బంది ఈ అంశాన్ని అధ్యాపకుల దృష్టికి తీసుకెళ్లారు. కళాశాలలో ఈ-4 చదువుతున్న విద్యార్థి శుక్రవారం యూనిఫాం, గుర్తింపు కార్డు లేకుండా కళాశాలకు వచ్చాడు. దీంతో సిబ్బంది అధ్యాపకులకు విషయం తెలియ జేశారు. ఆ విద్యార్థిని తన గదికి పిలిపించిన రూపక్ కుమార్ అతనికి సర్ది చెప్పడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో విద్యార్థులకు ఉపాధ్యాయుడికి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో రూపక్కుమార్ చేతి వాచీ విద్యార్థి తలకు తాకడంతో.. విద్యార్థికి తలకు గాయామైంది. దీంతో కోపోద్రిక్తులైన తోటి విద్యార్థులు ఆందోళనకు చేస్తున్నారు. -
బస్సుల కోసం విద్యార్థుల ఆందోళన
యలమంచిలి: పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలి మండలం దొడ్డిపట్లలో మంగళవారం విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఆర్టీసీ యాజమాన్యం తమ గ్రామానికి రోజూ నడపుతున్న బస్సుల సంఖ్యను తగ్గించడంతో రోడ్డుపై ధర్నా చేశారు. వాహన రాకపోకలను అడ్డుకున్నారు. స్కూలు కు వెళ్తున్న విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్నందున బస్సుల సంఖ్య పెంచాల్సిందిగా డిమాండ్ చేశారు. విద్యార్థుల ధర్నాతో కాసేపు రాకపోకలకు అంతరాయమేర్పడింది. -
నాగార్జున యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళన
నాగార్జున యూనివర్సిటీ: హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఆత్మహత్యకు పాల్పడిన రోహిత్ కు మద్దతుగా గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ విద్యార్థులు బుధవారం బంద్ పాటిస్తున్నారు. రోహిత్ ఆత్మహత్య ఘటనకు నిరసనగా విద్యార్థి జేఏసీ బంద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు నాగార్జున విశ్వవిద్యాలయంలోనూ విద్యార్థులు, విద్యార్థి సంఘాలు బంద్‌లో పాల్గొంటున్నాయి. ఉద్యోగులను విధులకు హాజరుకాకుండా అడ్డుకున్నారు. -
జంబ్లింగ్ విధానం ఎత్తి వేయాలంటూ...
పిడుగురాళ్ల: ఇంటర్ మీడియట్ లో నిర్వహించే ప్రాక్టికల్ పరిక్షల్లో జంబ్లింగ్ విధానాన్ని ఎత్తివేయాలంటూ.. విద్యార్థులు రోడ్డెక్కారు. కళాశాలలను బహిష్కరించి సుమారు 800 మంది విద్యార్థులు ధర్నా చేపట్టారు. ఈ సంఘటన గుంటూరు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలో సోమవారం చోటు చేసుకుంది. ఈ మధ్య కాలంలోనే తెలంగాణ రాష్ట్రం జంబ్లింగ్ విధానాన్ని ఎత్తివేసిందని.. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఈ విధానం కొనసాగించడం సరైంది కాదని విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ రోజు పట్టణంలోని అన్ని కళాశాలలను బహిష్కరించి విద్యార్థులు ధర్నా చేశారు. -
ఉద్యోగాల భర్తీ కోసం వినూత్న నిరసన
హైదరాబాద్: వెంటనే ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ నాంపల్లిలోని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) కార్యాలయం ఎదుట బుధవారం మధ్యాహ్నం నిరుద్యోగుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామని, నిరుద్యోగ భృతి కల్పిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఆ మాటే మర్చిపోయిందని విమర్శించారు. ఉద్యోగాల్లో ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ పేపర్ ప్లేట్లతో చేసిన ప్లకార్డులతో నిరసన తెలిపారు. బాబు వచ్చే జాబు రాకపాయే.., గబ్బర్ సింగ్ మిస్సింగ్ అంటూ ప్లకార్డులు పట్టుకుని తమ నిరసన తెలియజేశారు. -
ఓయూలో ఉద్రిక్తత
హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీలో శనివారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. పీజీ పరీక్షలు వాయిదా వేయాలంటూ విద్యార్థలు ఆందోళనకు చేపట్టారు. అయితే విద్యార్థుల చేస్తున్న ఆందోళన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో విద్యార్థులు పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో అక్కడ ఉద్రక్తత చోటు చేసుకుంది. సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఎస్కే వర్సిటీలో విద్యార్థుల ధర్నా
అనంతపురం: కాంట్రాక్టు ఉద్యోగాల క్రమబద్ధీకరణ ప్రతిపాదనకు వ్యతిరేకంగా శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీ విద్యార్థులు సోమవారం భారీ ధర్నాకు దిగారు. అనంతరంపురంలోని వర్సిటీ సమీపంలో జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నా చేస్తున్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని, ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల ధర్నాతో రహదారిపై భారీగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. పోలీసులు అక్కడికి చేరుకుని విద్యార్థులతో చర్చిస్తున్నారు. -
మన్యం జోలికొస్తే తరిమికొడతాం
ఏయూ క్యాంపస్: విశాఖ మన్యంలో బాక్సైట్ తవ్వకాలకు ప్రభుత్వం విడుదల చేసిన జీవో 97ను నిరసిస్తూ విద్యార్థులు ప్రత్యక్ష పోరాటానికి దిగారు. సోమవారం ఉదయం ఆంధ్రా వర్సిటీలోని పరిశోధకులు, విశాఖలోని గిరిజన విద్యార్థులు ఏయూ మెయిన్‌గేట్ వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. గిరిజన విద్యార్థి సమాఖ్య అధ్యక్షుడు ఎస్.లోవరాజు, వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి తడబారికి సురేష్ కుమార్ తదితరలు ఈ దీక్షలో కూర్చున్నారు. ఈ సందర్భంగా విద్యార్థి నేతలు మాట్లాడుతూ.. మన్యం ప్రజల జోలికి వస్తే సహించేది లేదన్నారు. పచ్చని ప్రకృతిని నాశనం చేయాలనే శక్తులను ఆదివాసీలంతా ఏకమై తరిమికొడతారన్నారు. దీక్షకు అరకు ఎమ్మెల్యే (వైఎస్సార్సీపీ) కిడారి సర్వేశ్వరరావు మద్దతు తెలిపారు. ఆయన మాట్లాడుతూ గిరిజనుల హక్కుల పరిరక్షణకు అన్ని వర్గాలతో కలసి పని చేస్తామన్నారు. ఎమ్మెల్సీ శర్మ మాట్లాడుతూ అరకును టూరిజం హబ్‌గా చేస్తామని చెప్పిన సీఎం.. నేడు పర్యావరణానికి హాని చేసే విధంగా ప్రవర్తించడం ఎంతమాత్రం సమంజసం కాదన్నారు. ఏయూ వీసీ ఆచార్య జి.ఎస్.ఎన్ రాజులు విద్యార్థుల దీక్షకు సంఘీభావం తెలిపారు. గిరిజన ఉద్యోగ సంఘాల నేతలు, విశాఖలోని వివిధ కళాశాల విద్యార్థులు దీక్షలో పాల్గొని సంఘీభావం తెలిపారు. ఏయూ ఆచార్యుడు జర్రా అప్పారావు, పరిశోధకులు, గిరిజన సంఘాల, ఉద్యోగ సంఘాల నేతలు దీక్షకు మద్దతు తెలిపారు. -
కలెక్టరేట్ ఎదుట ధర్నా
కరీంనగర్: ‘లక్ష కొలువులు’ ఆశ చూపి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం నిరుద్యోగుల సమస్యలను గాలికి వదిలేసిందని విద్యార్థి సంఘం నాయకులు ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే ఉపాధ్యాయుల భర్తీ కోసం డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయాలని కోరుతూ కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట మైనార్టీ ఉద్యోగార్థులు, విద్యార్థులు ఆందోళనకు దిగారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ముస్లిం అభ్యర్థులు గురువారం కలెక్టరేట్ ఎదుట బైఠాయించి వెంటనే ప్రభుత్వం డీఎస్సీ ప్రకటన ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం విద్యార్థులను మభ్యపెడుతూ పబ్బం గడుపుతోందని విమర్శించారు. -
బాపట్ల వ్యవసాయ కళాశాల వద్ద ఉద్రిక్తత
గుంటూరు: గుంటూరు జిల్లా బాపట్ల వ్యవసాయ కళాశాలలో గురువారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. కళాశాలకు చెందిన అధ్యాపకులు రత్నప్రసాద్, కృష్ణ ప్రసాద్‌జీ, ప్రసూన రాణి తో పాటు మరొకరిని వెంటనే బదిలీ చేయాలని 10 రోజులుగా కాలేజీ విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. వైస్ ఛాన్సలర్, యూనివర్సిటీ యంత్రాంగం విద్యార్థులతో మాట్లాడినా విషయం సద్దుమణగకపోవడంతో భారీగా పోలీసులు మోహరించారు. వెంటనే సదరు అధ్యాపకులను బదిలీ చేసేంతవరకు ఆందోళన విరమించమని విద్యార్థులు తెలిపారు. -
బాపట్ల వ్యవసాయ కళాశాలలో ఉద్రిక్తత
బాపట్ల: గుంటూరు జిల్లా బాపట్లలోని వ్యవసాయ కళాశాల విద్యార్థులు యాజమాన్య తీరుకు నిరసనగా ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. కళాశాలలో ఆత్మహత్య చేసుకున్న సూర్యారావు(22) మృతిపై ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కమిటీ విచారణ చేపట్టి నివేదిక ఇచ్చింది. అయితే నివేదికలో ఉన్న అంశాలను బయటపెట్టాలని విద్యార్థులు కోరారు. అందుకు కళాశాల యాజమాన్యం స్పందించలేదు. అయితే కాలేజ్, హాస్టళ్లను మూసివేస్తున్నట్టు ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఉత్తర్వులు జారీ చేయడంపై విద్యార్థులు అసోసియేషన్ చాంబర్ ఎదుట ధర్నా చేపట్టారు. కాలేజ్ లోని మొత్తం 903 విద్యార్థులకు భోజన సదుపాయం నిలిపివేయడంతో వారు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కాలేజ్ లో ఐసీఏఆర్ నుంచి వివిధ రాష్ట్రాల 90 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. వారు ఇప్పడు ఎక్కడికి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. మామూలు సమయంలో ఇంటికి వెళ్లాలంటే రెండు నెలల ముందు రిజర్వేషన్ చేసుకోవాలని , ఇప్పుడు ఏం చేయాలో దిక్కుతోచడం లేదని విద్యార్థుల ఆవేదన చెందుతున్నారు. -
విద్యార్థులపై లాఠీచార్జ్.. అరెస్ట్
మహారాణిపేట: విశాఖ కలెక్టరేట్ వద్ద మంగళవారం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు చేపట్టిన ధర్నా ఉద్రిక్తంగా మారింది. జిల్లాలోని వసతి గృహాల్లో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సుమారు 400 మంది విద్యార్థులు కలెక్టరేట్ ముందు ధర్నాకు దిగారు. కలెక్టర్‌కు వినతిపత్రం ఇవ్వాలంటూ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకుని గేట్లను మూసివేశారు. దీంతో పోలీసులు, విద్యార్థుల మధ్య వాగ్యుద్ధం, తోపులాట జరిగింది. పోలీసులు విద్యార్థులను చెదరగొట్టేందుకు లాఠీలను ఝుళిపించారు. విద్యార్థులను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. -
ఎస్కే యూనివర్శిటీలో ఉద్రిక్తత
అనంతపురం: విశ్వవిద్యాలయాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఎస్ఎఫ్ఐ చేపట్టిన ధర్నా ఉద్రిక్తతకు దారి తీసింది. గురువారం మధ్యాహ్నం దాదాపు 200 మంది విద్యార్థులు శ్రీ కృష్ణ దేవరాయ యూనివర్సిటీలో ధర్నా చేపట్టారు. ప్రభుత్వం విద్యారంగాన్ని ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు యత్నిస్తోందని, పేదలకు చదువులు భారంగా మారే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం ర్యాలీగా యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ రాజగోపాల్ చాంబర్లోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు జరిపిన లాఠీ చార్జిలో ఐదుగురు విద్యార్థులు స్వల్పంగా గాయపడ్డారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. విద్యార్థుల నినాదాలతో ఆ ప్రాంతం హోరెత్తుతోంది. -
జేఎన్టీయూ వద్ద ఉద్రిక్తత: నిలిచిన కౌన్సెలింగ్
హైదరాబాద్: వైద్య కళాశాలల్లో పెంచిన ఫీజును వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ వివిధ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థులు జేఎన్టీయూ కళాశాలను ముట్టడించారు. బుధవారం నుంచి జేఎన్‌టీయూలోమెడికల్ కౌన్సెలింగ్ ప్రారంభమైంది. అయితే, ఇటీవల ప్రభుత్వం వైద్య కళాశాలల్లో ప్రవేశ ఫీజును పెంచిన విషయం విదితమే. ధనికులకు మాత్రమే వైద్య విద్య అందేలా ప్రభుత్వ విధానం ఉందని ఏబీవీపీ, పీడీఎస్‌యూ, ఎస్ఎఫ్ఐ శ్రేణులు కౌన్సెలింగ్‌ను అడ్డుకునేందుకు యత్నించాయి. దీంతో ఆందోళన కారులను పోలీసులు అడ్డుకోవటంతో ఉద్రిక్తత ఏర్పడింది. విద్యార్థి సంఘాల ఆందోళనతో అధికారులు కౌన్సిలింగ్ ను నిలిపివేశారు. అధికారులు ముందస్తు చర్యలు తీసుకోకపోవడం వల్లనే నిలిచిపోయినట్టు కౌన్సిలింగ్ కు వచ్చిన విద్యార్థులు ఆరోపిస్తున్నారు. -
తిరుపతి జువైనల్ హోమ్‌లో అలజడి
-
ప్రిన్సిపాల్‌ను తొలగించాలని విద్యార్థినుల ధర్నా
చిత్తూరు : అసభ్య పదజాలంతో దూషిస్తున్న ప్రిన్సిపాల్‌ను తొలగించాలని విద్యార్థినులు రోడ్డెక్కిన సంఘటన చిత్తూరు జిల్లా బి.కొత్తకోటలో మంగళవారం చోటుచేసుకుంది. కొత్తకోటలోని మోడల్ పాఠశాలలో ప్రిన్సిపాల్‌గా విధులు నిర్వర్తిస్తున్న కిరణ్ చంద్రకుమార్ అనే వ్యక్తి గత కొన్నిరోజులుగా అసభ్యంగా మాట్లాడుతున్నాడని మనస్థాపం చెందిన విద్యార్థినులు ఎమ్ఈవోకు వినతిపత్రం అందించారు. అనంతరం వెంటనే ప్రిన్సిపాల్‌ను తొలగించాలని డిమాండ్ చేస్తూ ఎమ్మార్సీ భవనం ఎదుట ధర్నాకు దిగారు. -
నిజాం హాస్టల్ వద్ద విద్యార్థుల ఆందోళన
హైదరాబాద్ : నిజాం కళాశాల హాస్టల్ విద్యార్థులు రోడ్డెక్కారు. నాసిరకం భోజనం పెడుతున్నారంటూ విద్యార్థులు మంగళవారం ఉదయం రోడ్డుపై బైఠాయించారు. నాణ్యమైన భోజనం పెట్టడం లేదంటూ విద్యార్థులు ఆరోపించారు. దీంతో భారీగా ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. పోలీసులు అక్కడకు చేరుకుని ఆందోళన విరమించాలని విద్యార్థులకు నచ్చచెబుతున్నారు. మరోవైపు వాహనాల రాకపోకలకు అంతరాయం కలగటంతో కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు.