ఇడుపులపాయ ట్రిపుల్‌ఐటీలో ఆందోళన
కడప: వైఎస్ఆర్ కడప జిల్లా ఇడుపలపాయ ట్రిపుల్ ఐటీలో శుక్రవారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. అధ్యాపకుడు చేయి చేసుకున్నాడని విద్యార్థులు ధర్నాకు దిగడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇటీవలి కాలంలో కొత్తగా అమలులోకి వచ్చిన నిబంధనలను విద్యార్థులు అలక్ష్యం చేయడంతో.. కళాశాల సిబ్బంది ఈ అంశాన్ని అధ్యాపకుల దృష్టికి తీసుకెళ్లారు.
కళాశాలలో ఈ-4 చదువుతున్న విద్యార్థి శుక్రవారం యూనిఫాం, గుర్తింపు కార్డు లేకుండా కళాశాలకు వచ్చాడు. దీంతో సిబ్బంది అధ్యాపకులకు విషయం తెలియ జేశారు. ఆ విద్యార్థిని తన గదికి పిలిపించిన రూపక్ కుమార్ అతనికి సర్ది చెప్పడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో విద్యార్థులకు ఉపాధ్యాయుడికి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో రూపక్‌కుమార్ చేతి వాచీ విద్యార్థి తలకు తాకడంతో.. విద్యార్థికి తలకు గాయామైంది. దీంతో కోపోద్రిక్తులైన తోటి విద్యార్థులు ఆందోళనకు చేస్తున్నారు.