IIIT
-
బిర్యానీలో కప్ప.. ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ఆగ్రహం
సాక్షి,హైదరాబాద్: గచ్చిబౌలి ట్రిపుల్ఐటీలోని కదంబ మెస్‌లో విద్యార్థులకు ఇటీవల పెట్టిన బిర్యానీలో కప్ప ప్రత్యక్షమైంది. దీంతో విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బిర్యానీలో కప్ప రావడానికి మెస్ నిర్వాహకుల నిర్లక్ష్యమే కారణమని విద్యార్థులు మండిపడుతున్నారు. మెస్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. బిర్యానీలో కప్ప ప్రత్యక్షమైన ఫొటోను విద్యార్థులు ట్విటర్లో షేర్ చేశారు. మెస్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఫుడ్‌సేఫ్టీ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు.Shocked and horrified! Found a frog in my friend's meal today at Kadamba Mess (IIIT Hyderabad). This is completely unacceptable and poses a serious health risk! @cfs_telangana, please take immediate action! #FoodSafety #Unhygienic #Hyderabad #IIITHyderabad pic.twitter.com/VCCKM0kuob— ram manohar (@manoharrocksss) October 17, 2024 ఇదీ చదవండి: అశోక్‌నగర్‌లో మరోసారి ఉద్రిక్తత -
ముగిసిన ‘వికీమీడియా టెక్నాలజీ సమ్మిట్’
రాయదుర్గం: ఇండిక్ మీడియా వికీ డెవలపర్స్ యూజర్ గ్రూప్, వికీమీడియా ఫౌండేషన్ సహకారంతో గచ్చిబౌలిలోని ట్రిపుల్ ఐటీ హైదరాబాద్‌లో నిర్వహించిన వికీమీడియా టెక్నాలజీ సమ్మిట్–2024 ముగిసింది. ఒక రోజు హ్యాకథాన్‌లో దేశం నలుమూలల నుంచి 130 మంది సాంకేతిక నిపుణులు, డెవలపర్లు, వికీ మీడియా ప్రాజెక్ట్‌ల స్వచ్ఛంద సహకారులు పాల్గొన్నారు.ఓపెన్ సోర్స్ టెక్నాలజీ, వికీ మీడియా ప్రాజెక్ట్‌లలో తాజా పోకడలు, ఆవిష్కరణల గురించి చర్చించారు. ఈ సందర్భంగా ట్రిపుల్ ఐటీలోని లాంగ్వేజ్ టెక్నాలజీ రీసెర్చ్ సెంటర్ హెడ్ ప్రొఫెసర్ వాసుదేవవర్మ మాట్లాడుతూ ఈ ఏడాది సమ్మిట్ వికీమీడియా ప్రాజెక్ట్‌లు, కమ్యూనిటీలలో టెక్నికల్ ఔట్రీచ్ ప్రోగ్రామ్‌ల ద్వారా లింగ అంతరాన్ని తగ్గించడంపై ప్రత్యేక దృష్టి పెట్టిందని గుర్తు చేశారు. వికీమీడియా ఉద్యమం ద్వారా ఊహించిన విధంగా ఉచిత జ్ఞానం కోసం మిషన్‌ను నెరవేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ అసోసియేట్ ప్రొఫెసర్ రాధికా మామిడి, వికీమీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ ఒత్తిడితో రాజీనామాలు చేసిన నలుగురు ట్రిపుల్ ఐటీ డైరెక్టర్లు
-
రూ.83 లక్షల ప్యాకేజీ.. బీటెక్ పాపకు గోల్డెన్ ఆఫర్
జీవితంలో ఏదైనా గొప్ప లక్ష్యాన్ని పెట్టుకుని, దానివైపే అడుగులు వేస్తే తప్పకుండా అనుకున్న గమ్యం చేరుతారని ఎంతోమంది నిరూపించారు. ఈ కోవకు చెందిన వారిలో ఒకరు బీహార్‌లోని భాగల్పూర్కు చెందిన 'ఇషికా ఝా'. ఇంతకీ ఈమె ఎవరు? ఈమె సాధించిన సక్సెస్ ఏంటనే వివరాలు ఈ కథనంలో చూసేద్దాం. భాగల్పూర్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IIIT)లో బీటెక్ మూడవ సంవత్సరం చదివే విద్యార్థిని 'ఇషికా ఝా' క్యాంపస్ ప్లేస్మెంట్ నుంచి ఏకంగా 83 లక్షల వేతనంతో జాబ్ ఆఫర్ పొందింది. చిన్నప్పటి నుంచి కంప్యూటర్లు, కోడింగ్ పట్ల మక్కువతోనే.. కోడింగ్ రాయడం ప్రారంభించింది. ఆ తరువాత కూడా ఎప్పటికప్పుడు టెక్నాలజీకి సంబంధించిన విషయాల్లో మెలుకువలు నేర్చుకుంటూ అనుకున్న విధంగానే జాబ్ కొట్టేసింది. 2020-24 సెషన్‌లోని బీటెక్ బ్యాచ్ చివరి సంవత్సరం కంటే.. కూడా ఈమె ఎక్కువ ప్యాకేజ్ పొంది రికార్డ్ బద్దలుకొట్టింది. గూగుల్ హ్యాకథాన్ చివరి రౌండ్లో.. ప్రాజెక్ట్ చేయడానికి 'ఎన్విరాన్మెంట్' టాపిక్ వచ్చిందని, ఆ సమయంలో ఇషికా ఝా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషీన్ లెర్నింగ్ అల్గారిథమ్‌లను ఉపయోగించి ఫారెస్ట్ ఫైర్ ప్రిడిక్షన్‌పై చేసిన ప్రాజెక్ట్ విజయ శిఖరాలను తాకేలా చేసింది. బీటెక్ ఫస్ట్ ఇయర్ నుంచే ఫైనల్ ఇయర్ క్యాంపస్ సెలక్షన్‌కి ప్రిపేర్ కావడం ప్రారంభించినట్లు ఇషికా ఝా వెల్లడించింది. గూగుల్ హ్యాకథాన్‌లో విజయం సాధించినందుకు తన సీనియర్లకు క్రెడిట్ ఇస్తూ, మాక్ ఇంటర్వ్యూలు నిర్వహించడం ద్వారా కూడా తాను ఎక్కువ నేర్చుకున్నట్లు పేర్కొంది. ఇదీ చదవండి: అనంత్ అంబానీ మనసు బంగారమే.. వీడియో చూస్తే మీరూ ఇదే అంటారు ప్రస్తుతం ఈమె టెక్నికల్ డొమైన్ నేయిపుణ్యాలను మెరుగుపరచుకోవడంలో, వెబ్ డెవలప్మెంట్ వంటి వాటిని నేర్చుకుంటున్నట్లు తెలుస్తోంది. వాస్తవ ప్రపంచ సమస్యలను పరిష్కరించడానికి సాంకేతికతను ఉపయోగించాలనే తన అభిరుచి తనను ఇతరులకు భిన్నంగా చేస్తుందని ఝా చెబుతోంది. -
ఆ ట్రిపుల్‌ఐటీలో అసలేం జరుగుతుంది? విద్యార్థిది హత్యా! లేక మరేంటి?
సాక్షి, ఆదిలాబాద్: బాసర ట్రిపుల్‌ఐటీలో ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న రామాటి ప్రవీణ్‌కుమార్(19) వసతిగృహంలోని గదిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నాగర్‌కర్నూలు జిల్లాకు చెందిన విద్యార్థి వ్యక్తిగత కారణాలతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు ట్రిపుల్ఐటీ అధికారులు చెబుతున్నారు. మృతదేహాన్ని భైంసా ఏరియా ఆస్పత్రిలోని పోస్టుమార్టం గదిలో భద్రపరిచారు. ఔట్‌పాస్ తీసుకుని.. ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న ప్రవీణ్‌కుమార్ శనివారం ఔట్‌పాస్ తీసుకున్నాడు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఓటు వేసేందుకు విద్యార్థులు ఇళ్లకు వెళ్తున్నారు. శనివారం ఔట్‌పాస్ తీసుకున్న విద్యార్థి ఆత్మహత్య ఎప్పుడు చేసుకున్నాడో అంతుచిక్కడం లేదు. అధికారులైతే ఆదివారం ఉదయం అల్పహారం చేశాడని చెబుతున్నారు. ఒక రోజు ఔట్‌పాస్ తీసుకున్న విద్యార్థి అక్కడే ఎందుకు ఉండిపోయాడనే విషయం అంతుపట్టని ప్రశ్న. ఔట్‌పాస్ తీసుకున్న విద్యార్థులు కళాశాలలో ఉన్నారో బయటికి వెళ్లిపోయారా అనే విషయాన్ని భద్రతా సిబ్బంది చూసుకుంటున్నారో లేదో అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఖాళీ గదిలో ఆత్మహత్య.. ప్రవీణ్‌కుమార్ బీహెచ్–1 వసతి గృహంలో ఉంటున్నాడు. ఆదివారం బీహెచ్–2 వసతి గృహంలోని ఖాళీ గదిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వసతి గృహంలోని ఖాళీ గదుల్లోనే గతంలో విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. వసతి గృహాల్లో ఖాళీ గదులకు తాళాలు ఎందుకు వేయడం లేదనే అనుమానం తలెత్తుతోంది. ఆత్మహత్యకు పాల్పడ్డ విద్యార్థి మెడ భాగం కమిలిపోయి ఉందని, ఆత్మహత్య ఎప్పుడు చేసుకున్నాడో తెలియడం లేదని పలువురు చెబుతున్నారు. పోలీసు భద్రత.. విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న వెంటనే మృతదేహాన్ని అంబులెన్సులో భైంసాకు తరలించారు. పోస్టుమార్టం గది వద్దకు ఎవరిని అనుమతించలేదు. మృతదేహాన్ని లోపల భద్రపరిచి తాళం వేశారు. ఆసుపత్రి వద్ద పోలీసు బందోబస్తు మోహరించారు. ట్రిపుల్‌ఐటీలో విద్యార్థుల ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయనే విషయం అంతుచిక్కడం లేదు. వ్యక్తిగత కారణాలతోనే.. నాగర్‌కర్నూలు జిల్లాకు చెందిన రామాటి ప్రవీణ్‌కుమార్ ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఔట్‌పాస్ తీసుకున్నాడు. ఉదయం వేళ అల్పహారం చేసిన ఈ విద్యార్థి బీహెచ్–2 వసతి గృహంలోని ఖాళీగదిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వ్యక్తిగత కారణాలతోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు భావిస్తున్నాం. ఈ విషయాన్ని కుటుంబీకులకు తెలియజేశాం. – ప్రొఫెసర్ వెంకటరమణ, వీసీ ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com ఇవి కూడా చదవండి: అడవిలో కట్టెలు తీసుకురావడానికి వెళ్లిన యువకుడిని కిరాతకంగా.. -
AP: నేటి నుంచి ట్రిపుల్ ఐటీల్లో కౌన్సెలింగ్
సాక్షి, నూజివీడు: రాష్ట్రంలోని రాజీవ్ గాంధీ సాంకేతిక వైజ్ఞానిక విశ్వవిద్యాలయం(ఆర్జీయూకేటీ) పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీల్లో 2023–29 సంవత్సరానికి ఆరేళ్ల సమీకృత ఇంజినీరింగ్ కోర్సులో ప్రవేశాలకు గాను ఈ నెల 20 నుంచి 25వ తేదీ వరకు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు అడ్మిషన్ల కన్వీనర్ ఆచార్య ఎస్‌ఎస్‌ఎస్‌వీ గోపాలరాజు బుధవారం తెలిపారు. నాలుగు ట్రిపుల్ ఐటీల్లో కలిపి 4,,400 సీట్లు ఉండగా, ప్రత్యేక కేటగిరీ సీట్లు మినహాయించి మిగిలిన 4,040 సీట్లకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను ఈ నెల 13న ప్రకటించామని పేర్కొన్నారు. వీరందరికీ కౌన్సెలింగ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఈ నెల 20, 21వ తేదీల్లో, ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో 21, 22వ తేదీల్లో, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలో 24, 25వ తేదీల్లో, ఒంగోలు ట్రిపుల్ ఐటీకి సంబంధించి ఇడుపులపాయ ట్రిపుల్ఐటీ క్యాంపస్‌లో 24, 25 తేదీల్లో కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అభ్యర్థులందరూ ఉదయం ఎనిమిది గంటల కల్లా ఆయా సెంటర్లకు హాజరు కావాలన్నారు. పదో తరగతికి సంబంధించి అన్ని రకాల ఒరిజినల్ ధ్రువపత్రాలు, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలను వెంట తెచ్చుకోవాలని చెప్పారు. సరి్టఫికెట్ల పరిశీలన అనంతరం సీటును కేటాయిస్తారని, సీటు పొందిన వెంటనే అడ్మిషన్ ఫీజు, రిఫండబుల్ కాషన్ డిపాజిట్ కలిపి ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.3,700, మిగిలిన కేటగిరీలకు చెందిన విద్యార్థులు రూ.4,200 చొప్పున చెల్లించాల్సి ఉంటుందని వివరించారు. ఇది కూడా చదవండి: కొత్త వైద్య కళాశాలల్లో సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు -
ట్రిపుల్ ఐటీలకు 38,100 దరఖాస్తులు
నూజివీడు(ఏలూరు): రాష్ట్రంలోని రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీల్లో పీయూసీ ప్రథమ సంవత్సరం ప్రవేశాల కోసం 38,100 దరఖాస్తులు వచ్చినట్టు అడ్మిషన్ల కన్వీనర్ ఆచార్య ఎస్‌ఎస్‌ఎస్‌వీ గోపాలరాజు తెలిపారు. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ సోమవారంతో ముగిసిందని పేర్కొన్నారు. ఒక్కో ట్రిపుల్ ఐటీలో 1000 సీట్లతో పాటు ఈడబ్ల్యూఎస్ కోటా కింద అదనంగా మరో 100 సీట్లు కలిపి 1100 సీట్లు ఉన్నాయని తెలిపారు. ఎంపికైన అభ్యర్థుల జాబితాను జూలై 13న ప్రకటించనున్నట్లు చెప్పారు. కాగా, కరోనా కారణంగా గత మూడేళ్లుగా ఎంట్రన్స్ పరీక్ష నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఈ ఏడాది పదో తరగతి పరీక్షలు నిర్వహించి మార్కులు ప్రకటించిన నేపథ్యంలో విద్యార్థులకు వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపికను నిర్వహించనున్నారు. చదవండి: మార్గదర్శి’లాంటి స్కాం ఇప్పటివరకు జరగలేదు -
నేడు ట్రిపుల్ ఐటీల్లో అడ్మిషన్లకు నోటిఫికేషన్
నూజివీడు: రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం(ఆర్జీయూకేటీ) పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలు ట్రిపుల్ ఐటీల్లో ఆరేళ్ల సమీకృత బీ.టెక్ ఇంజినీరింగ్ కోర్సులో ప్రవేశం కోసం శనివారం నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఆర్జీయూకేటీ చాన్సలర్ ఆచార్య కేసీ రెడ్డి తెలిపారు. స్థానిక ట్రిపుల్ ఐటీలో శుక్రవారం ఆయన అడ్మిషన్లకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. ఈ నెల 4 నుంచి 26వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు యూనివర్సిటీ వెబ్సైట్లో విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎంపికైనవారి జాబితాను జూలై 13న విడుదల చేస్తామని, ఆగస్టు మొదటి వారంలో తరగతులు ప్రారంభిస్తామని చెప్పారు. దివ్యాంగుల కోటాను 3 నుంచి 5 శాతానికి పెంచిన నేపథ్యంలో ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు అడ్మిషన్లు చేపడతామన్నారు. 40 శాతం కంటే ఎక్కువ వికలాంగత్వం ఉన్న వారు మాత్రమే ఈ కోటాలో అర్హులని చాన్సలర్ తెలిపారు. పీహెచ్సీ, క్యాప్, ఎన్సీసీ, స్పోర్ట్స్, భారత్ స్కౌట్స్ తదితర ప్రత్యేక కేటగిరీ కోటా విద్యార్థుల సర్టిఫికెట్లను నూజివీడు ట్రిపుల్ ఐటీలో జూలై 5 నుంచి 9వ తేదీ వరకు పరిశీలిస్తారని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదివిన విద్యార్థులకు 4 శాతం డిప్రివేషన్ స్కోర్‌ను జోడించి మెరిట్ ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేస్తామని వివరించారు. ఒక్కో క్యాంపస్‌లో ఉన్న వెయ్యి సీట్లకు అదనంగా ఈడబ్ల్యూఎస్ కోటాలో మరో వంద సీట్లు కూడా భర్తీ చేస్తామన్నారు. నాలుగు క్యాంపస్‌లలో కలిపి 4,400 సీట్లు భర్తీ చేస్తామని, ఇందులో 85 శాతం సీట్లు ఏపీ అభ్యర్థులకు, 15 శాతం సీట్లు తెలంగాణ, ఏపీ విద్యార్థులకు ఓపెన్ మెరిట్ కింద కేటాయిస్తామని తెలిపారు. వీటికి అదనంగా ఇతర రాష్ట్రాల విద్యార్థులకు 5 శాతం సూపర్‌న్యూమరరీ సీట్లు అందుబాటులో ఉన్నాయని, ఈ కోటాలో చేరినవారు ఏడాదికి రూ.1.50 లక్షలు చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. నూజివీడు, ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలకు ఎంపికైనవారికి జూలై 21, 22 తేదీల్లో, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలకు ఎంపికైన విద్యార్థులకు జూలై 24, 25 తేదీల్లో సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ నిర్వహిస్తామని వెల్లడించారు. ట్రిపుల్ ఐటీ అడ్మిషన్స్‌కు కన్వీనర్‌గా ఆచార్య ఎస్‌ఎస్‌ఎస్‌వీ గోపాలరాజును నియమించినట్లు తెలిపారు. -
‘జోసా’లో సీట్ల జోష్.. ఐఐటీ, ఎన్ఐటీలలో భారీగా పెరిగిన సీట్ల సంఖ్య
సాక్షి, అమరావతి: ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ), ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ) తదితర జాతీయస్థాయి విద్యాసంస్థలలో సీట్ల సంఖ్య భారీగా పెరగడంతో విద్యార్థులకు ఉన్నత సాంకేతిక విద్యావకాశాలు మరింత మెరుగవుతున్నాయి. 2023–24 విద్యా సంవత్సరానికి సంబంధించి ఐఐటీ, ఎన్ఐటీ, ఐఐఐటీలతో పాటు ప్రభుత్వ ఆర్థిక సహకారంతో నడిచే జీఎఫ్టీఐలలో 56,900ల వరకు సీట్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (జోసా) ఐఐటీ, ఎన్ఐటీ, ఐఐఐటీలలో సీట్ల కేటాయింపు ప్రక్రియకు సంబంధించిన ప్రాథమిక కసరత్తును చేపట్టింది. జూన్ 19 నుంచి ఐఐటీ, ఎన్ఐటీల్లో సీట్ల భర్తీ ప్రక్రియను చేపట్టనుంది. ఐదేళ్లలో 18వేలకు పైగా పెరిగిన సీట్లు గడచిన ఐదేళ్లలో ఐఐటీలు, ఎన్ఐటీలు, ఐఐఐటీల్లో సీట్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ రంగం విస్తృతంగా అభివృద్ధి చెందుతుండడం, యువతకు ఉపాధి మార్గాలు అత్యధికంగా అందులోనే లభిస్తుండడం వంటి కారణాలతో సాంకేతిక విద్యకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. 2019కు ముందువరకు ఈ సంస్థల్లో సీట్ల సంఖ్య నామమాత్రంగానే ఉండడంతో ఉన్నత ప్రమాణాలుగల సాంకేతిక నిపుణుల అందుబాటూ అంతంతమాత్రంగానే ఉండేది. ఈ విద్యకోసం ఏటా దాదాపు 8లక్షల మంది విద్యార్థులు వివిధ దేశాలకు వెళ్లేవారు. ఇందుకు లక్షలాది రూపాయలను వారు వెచ్చించాల్సి వచ్చేది. దీన్ని నివారించి దేశంలోనే అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యను వారికి అందుబాటులోకి తెచ్చేలా కేంద్రం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా.. 2024 నాటికి ఐఐటీ తదితర జాతీయ విద్యాసంస్థల సంఖ్యను పెంచడంతో పాటు సీట్ల సంఖ్యను 50% మేర పెంచేలా చర్యలు తీసుకుంది. అలాగే, 20 ప్రముఖ ఐఐటీ, ఇతర సంస్థలను ఇని స్టిట్యూట్స్ ఆఫ్ ఎమినెన్సు (ఐఓఈ)లుగా తీర్చిదిద్ది అత్య«దిక నిధులు కేటాయించింది. సంస్థలు, సీట్ల సంఖ్యను పెంచిన కేంద్రం ఇదిలా ఉండగా.. డీపీ సింగ్ ఇచ్చిన నివేదిక మేరకు కేంద్ర ప్రభుత్వం ఐఐటీలు, ఎన్ఐటీలు ఇతర సంస్థలు, సీట్ల సంఖ్యను 2020లో ఒక్కసారిగా పెంచింది. 2019లో దేశవ్యాప్తంగా ఐఐటీ, ఎన్ఐటీ, ఐఐఐటీల్లో, జీఎఫ్టీఐలలో 38,704 సీట్లు ఉండగా దాన్ని 2020లో ఒకేసారి 50,822కు పెంచింది. వివిధ రాష్ట్రాల్లో కొత్త విద్యాసంస్థల ఏర్పాటుతో పాటు అప్పటికే ఉన్న ఐఐటీ, ఎన్ఐటీల్లో సదుపాయాలను మెరుగుపరచి సీట్ల సంఖ్యను పెంచింది. ఆ తరువాత కూడా ఏటేటా అయా సంస్థల్లో రెండేసి వేల చొప్పున సీట్లను పెంచుకునేలా చేసింది. 2021లో 52,453 సీట్లు, 2022లో 54,477 సీట్లు అందుబాటులోకి వచ్చాయి. 2024 నాటికి 50 శాతం మేర సీట్లు పెంచాలన్న లక్ష్యం మేరకు 2023–24లో కూడా సీట్ల సంఖ్య పెరిగి 56,900 వరకు అందుబాటులోకి వస్తాయని అంచనా వేస్తున్నారు. ఈసారీ జోసా కటాఫ్ స్కోర్.. ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాల ప్రక్రియను జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (జోసా) చేపడుతుంది. జేఈఈ మెయిన్, అడ్వాన్సుడ్‌లో అత్యధిక స్కోరుతో మెరిట్ ర్యాంకులు సాధించిన వారికి వీటిల్లో ప్రవేశాలు కల్పిస్తారు. 2023 ప్రవేశాలకు సంబంధించి జేఈఈ మెయిన్ పరీక్షలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, జనవరి, ఏప్రిల్ నెలల్లో పూర్తిచేసి ఇటీవల తుది ర్యాంకులను కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. మెయిన్‌లో అర్హత సాధించిన టాప్ 2.5 లక్షల మందికి జేఈఈ అడ్వాన్సుడ్‌ను నిర్వహించనున్నారు. అడ్వాన్సుడ్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఏప్రిల్ 30 నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ దరఖాస్తులను మే 7 వరకు స్వీకరిస్తారు. జూన్ 4న జేఈఈ అడ్వాన్సుడ్ పరీక్ష జరుగుతుంది. ఈ ఫలితాలు జూన్ 18న విడుదలవుతాయి. అనంతరం జూన్ 19 నుంచి జోసా రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయి. ఈసారి కూడా గతంలో మాదిరిగానే ఆరు విడతలుగా కౌన్సెలింగ్ నిర్వహించి సీట్లు కేటాయించే అవకాశముందని తెలుస్తోంది. ఇందుకు జోసా కటాఫ్ ర్యాంకులు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. మహిళలకు 20 శాతం కోటా.. ఇక ఐఐటీల్లో మహిళల చేరికలు నామమాత్రంగా ఉండడంతో వారి సంఖ్యను పెంచేందుకు వీలుగా అన్ని ఐఐటీల్లో 2018–19 నుంచి 20% మేర అదనపు కోటాను పెంచి సూపర్ న్యూమరరీ సీట్లను కేంద్రం ఏర్పాటుచేయించింది. మూడేళ్లపాటు దీన్ని తప్పనిసరిగా అన్ని సంస్థల్లో కేంద్రం కొనసాగించింది. దీంతో 2021 నాటికే ప్రముఖ ఐఐటీల్లో మహిళల చేరికలు 20 శాతానికి పైగా పెరిగాయి. తరువాత మహిళలకు సూపర్ న్యూమరరీ సీట్లపై ఆయా ఐఐటీలే నిర్ణయం తీసుకునేలా చేసింది. -
పరిశోధనలు, ఆలోచనలకు పదును పెట్టాలి
సాక్షి, హైదరాబాద్: సాంకేతిక ప్రపంచంలో భారతదేశం తనదైన ముద్ర వేసినా ఆవిష్కరణలు లేకపోవడంతో దేశీయంగా అంతర్జాతీయస్థాయి ఉత్పత్తులు రావడం లేదని మంత్రి కేటీ రామారావు అన్నారు. దేశంలో ఆవిష్కరణల వాతావరణాన్ని బలోపేతం చేసేందుకు తమవంతుగా జరుగుతున్న ప్రయత్నంలో భాగస్వాము లు కావాలని విద్యార్థులను ఆహ్వానించారు. హైదరా బాద్ ట్రిపుల్ ఐటీ సిల్వర్ జూబ్లీ సందర్భంగా టాక్ సిరీస్‌ను ప్రారంభించిన కేటీఆర్ టెక్నాలజీ అభివృద్ధి–ఆర్థిక ప్రగతితో పాటు హైదరాబాద్‌కు సంబంధించిన పలు అంశాలపై ప్రసంగించారు. అనంతరం విద్యా ర్థులు, అధ్యాపకులతో మాట్లాడారు. ‘సాంకేతిక ఆధా రిత ఆవిష్కరణలపై పనిచేస్తున్న విద్యార్థులు, యువత దేశ భౌగోళిక ఆర్థిక సామాజిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగినపుడే విజయం సాధిస్తారు. నేటికీ భారత్ అభివృద్ధి చెందుతున్న పేదదేశంగా ఉందని గణాంకాలు చెప్తున్నాయి. భారత్‌కు వ్యవసాయం వంటి రంగాల్లో టెక్నాలజీ ఆధారిత పరిష్కారాలను చూపా ల్సిన అవసరముంది. ఉన్నత విద్యాసంస్థల్లో చదువు తున్న విద్యార్థులు ప్రపంచస్థాయి ఆవిష్కరణల కోసం సృజనాత్మకంగా ఆలోచించాలి. పరిశోధన, అభివృద్ధి రంగాలపై దేశంలో ఖర్చు పెంచాల్సిన అవసరముంది. ట్రిపుల్ ఐటీ లాంటి ఉన్నత విద్యాసంస్థల విద్యార్థులు తమ పరిశోధనలు, ఆలోచనలను మరింత పదును పెట్టాలి. పరిశోధన–అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చేలా పాఠ్య ప్రణాళికలు, విద్యా బోధన మార్చుకుంటే మెరుగైన ఫలితాలు సాధ్యం’ అని కేటీఆర్ సూచించారు. వచ్చే ఐదేళ్లలో వంద బిలియన్ డాలర్లకు లైఫ్‌సైన్సెస్ ‘హైదరాబాద్‌లో ఉన్న లైఫ్ సైన్సెస్ వాతావరణం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడుకొని ఉంది. ప్రస్తుతం 50 బిలియన్ డాలర్ల లైఫ్ సైన్సెస్ పరిశ్రమను 2028 నాటికి 100 బిలియన్ డాలర్ల స్థాయికి తీసుకు వెళ్లాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. భారతీయ యువత అన్ని రంగాల్లో వినూత్న ఆవిష్కరణల దిశగా పని చేయాలి. స్టార్టప్‌లు ఏర్పాటు చేసే యువత వాటిపై పెట్టుబడిదారులకు ప్రజెంటేషన్ ఇచ్చే విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. తమ ఉత్పత్తుల గురించి వివరించగలిగితే భారతీయ స్టార్టప్‌లలో అనేక అంతర్జాతీయ సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాయి.’ అని కేటీఆర్ వివరించారు. అనంతరం ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన రోబోటిక్స్, లాంగ్వేజ్ టెక్నాలజీ, కంప్యూటర్ విజన్, సస్టైనబిలిటీ, స్మార్ట్ సిటీస్ వంటి రంగాల్లో పలు స్టార్ట్ అప్స్ రూపొందించిన ప్రయోగాలు, ఉత్పత్తులను కేటీఆర్ పరిశీలించారు. సమావేశంలో ట్రిబుల్ ఐటీ హైదరాబాద్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ రాజిరెడ్డి, సభ్యులు జయేష్ రంజన్, అజిత్ రంగనేకర్, శ్రీని రాజు, చంద్రశేఖర్, ప్రొఫెసర్ లింగాద్రి తదితరులు హాజరయ్యారు. -
ఇంటర్లో 75 శాతం సాధిస్తేనే జేఈఈ మెయిన్‌కు అర్హత
సాక్షి, అమరావతి: జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్–2023లో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఈసారి పలు మార్పులు చేసింది. కరోనా సమయంలో సడలింపులిచ్చిన అంశాలను పునరుద్ధరించింది. కొన్ని కొత్త సడలింపులను ప్రకటించింది. జేఈఈ మెయిన్‌కు హాజరయ్యే అభ్యర్థులకు ఇంటర్మీడియెట్‌లో 75 శాతం మార్కులు సాధించి ఉండటం సహా పలు నిబంధనలను పెట్టింది. సెంట్రల్ సీట్ అలకేషన్ బోర్డు నిబంధనల ప్రకారం ఎన్ఐటీ, ఐఐఐటీ, సీఎఫ్‌ఐటీ తదితర సంస్థల్లో ప్రవేశానికి అభ్యర్థులు జేఈఈలో ఆలిండియా ర్యాంకుతో పాటు ఇంటర్మీడియెట్‌లో 75 శాతం మార్కులు సాధించి ఉండాలి. అలాగే ఇంటర్మీడియెట్‌లోని ప్రతి సబ్జెక్టులోనూ అభ్యర్థి నిర్ణీత అర్హత మార్కులను సాధించాలి. అందువల్ల మెయిన్‌కు 75 శాతం మార్కులు తప్పనిసరి చేసింది. మరికొన్ని నిబంధనలు జేఈఈ మెయిన్ తొలి దశ పరీక్షలు జనవరి 24 నుంచి 31 వరకు, రెండో దశ ఏప్రిల్ 6 నుంచి 12వ తేదీ వరకు జరగనున్నాయి. తొలి దశ పరీక్షలకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. రెండో దశ రిజిస్ట్రేషన్లు ఫిబ్రవరి 7న ప్రారంభమవుతాయి. అభ్యర్ధులు రెండు విడతల పరీక్షలకు వేర్వేరుగా దరఖాస్తు చేయాలి. ఒక సెషన్‌కు ఒక్క దరఖాస్తే సమర్పించాలి. ఒకటికి మించి దరఖాస్తులు ఇస్తే.. ఆ తరువాత ఎప్పుడు దాన్ని గుర్తించినా ఆ అభ్యర్థిపై కఠిన చర్యలు తీసుకుంటారని ఎన్టీఏ స్పష్టంచేసింది. 2021, 2022 సంవత్సరాల్లో ఇంటర్మీడియెట్, తత్సమాన బోర్డు పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈసారి వయోపరిమితిని విధించకుండా బోర్డు పరీక్షల్లో ఉత్తీర్ణతను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటోంది. అయితే, అడ్మిషన్ల సమయంలో విద్యా సంస్థలు నిర్ణయించే వయోపరిమితి నిబంధనలను అభ్యర్థులు అనుసరించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. అలాగే డ్రాపర్ల (గత ఏడాది మెయిన్‌లో ఫెయిలై, మళ్లీ ఈ ఏడాది రాసే వారు, ఇంటర్మీడియెట్ పూర్తి చేసి కొన్ని సంవత్సరాలు వ్యవధి ఇచ్చి జేఈఈకి దరఖాస్తు చేసేవారు)కు వయోపరిమితిని సడలించి వరుసగా మూడుసార్లు మెయిన్‌కు అవకాశం కల్పించింది. ముందుగానే రిజర్వు తేదీల ప్రకటన రెండు దశల పరీక్షల తేదీల్లో మార్పులు చేయాల్సి వచ్చినా, ఇతర పరీక్షలకు ఆటంకం లేకుండా కొన్ని రిజర్వు తేదీలను కూడా ఎన్టీఏ ఈసారి ముందుగానే ప్రకటించింది. తొలివిడత పరీక్షలకు ఫిబ్రవరి 1, 2, 3 తేదీలను రిజర్వుగా ప్రకటించింది. రెండో విడతకు ఏప్రిల్ 13, 15 తేదీలను రిజర్వు తేదీలుగా పేర్కొంది. తగ్గిన పరీక్ష కేంద్రాలు కరోనా సమయంలో భౌతిక దూరం పాటించడం, ఇతర నిబంధనల కారణంగా మెయిన్ పరీక్షలను ఎక్కువ నగరాల్లో నిర్వహించింది. గత ఏడాది కూడా దేశవ్యాప్తంగా 514 నగరాలు, పట్టణాల్లో నిర్వహించింది. ఈసారి వాటిని 399కు కుదించింది. ఇతర దేశాల్లో పరీక్షల కేంద్రాలు గత ఏడాది 24 కాగా ఈసారి 13కు తగ్గించింది. రిజిస్ట్రేషన్ల ఫీజు పెంపు రిజిస్ట్రేషన్ల ఫీజులను కూడా ఎన్టీఏ పెంచింది. జనరల్ కేటగిరీ అభ్యర్థుల ఫీజు రూ.650 నుంచి రూ.1,000కి పెంచింది. మహిళలకు రూ.800 చేసింది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ట్రాన్స్జెండర్లకు ఫీజును రూ.325 నుంచి రూ.500కు పెంచింది. ఇతర దేశాల అభ్యర్థుల ఫీజును రూ.3 వేల నుంచి రూ.5 వేలకు, మహిళల ఫీజును రూ.1500 నుంచి రూ.3 వేలకు పెంచింది. అభ్యర్థులు జేఈఈ మెయిన్ ఆన్లైన్ దరఖాస్తులో తల్లిదండ్రులు లేదా సంరక్షకుల ఈమెయిల్, మొబైల్ నంబర్లు తదితర వివరాలను తప్పనిసరిగా ఇవ్వాలని, లేదంటే రిజిస్ట్రేషన్ పూర్తి కాదని ఎన్టీఏ స్పష్టంచేసింది. ఇదిలా ఉండగా కరోనా పరిస్థితులు సద్దుమణిగినా గతంలోని పరిస్థితుల ప్రభావం ఇంకా ఉన్నందున, ఇంటర్మీడియెట్‌లో 75% మార్కుల నిబంధనను ఈసారి కూడా మినహాయించాలని అభ్యర్థులు కోరుతున్నారు. తొలివిడత సెషన్ పరీక్షలకు వ్యవధి తక్కువగా ఉందని, దీనినీ పునఃపరిశీలన చేయాలని అభ్యర్థిస్తున్నారు. -
ట్రిపుల్ ఐటీలకు 9 వరకు దసరా సెలవులు
నూజివీడు: రాష్ట్రంలోని ఆర్జీయూకేటీ పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలకు 9వ తేదీ వరకు దసరా సెలవులను ప్రకటించారు. దీంతో ట్రిపుల్ ఐటీలకు చెందిన విద్యార్థులందరూ శనివారం ఇంటిబాట పట్టారు. సెలవుల నేపథ్యంలో నూజివీడు ట్రిపుల్ ఐటీలోని విద్యార్థులందరూ నేరుగా వారి ప్రాంతాలకు చేరుకునేందుకు గాను ఆర్టీసీ నూజివీడు అధికారులు ట్రిపుల్ ఐటీ నుంచి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. దాదాపు 8 వేల మంది విద్యార్థులుండగా వారి కోసం రాజమండ్రి, అమలాపురం, రాజోలు, కాకినాడ, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, గుంటూరు, ఒంగోలు తదితర ప్రాంతాలకు 56 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. దీంతో ఈ బస్సలు శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు విద్యార్థులను వారి ప్రాంతాలకు తీసుకెళ్లాయి. అయితే దూర ప్రాంతాలకు చెందిన కొందరు విద్యార్థులు విజయవాడ, హనుమాన్ జంక్షన్ రైల్వేస్టేషన్లకు వెళ్లారు. -
ట్రిపుల్ ఐటీ ఎంట్రన్స్‌లో.. సర్కారు స్కూళ్ల సత్తా
సాక్షి, అమరావతి: రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (ఆర్జీయూకేటీ–ట్రిపుల్ ఐటీలు)లో ప్రవేశాలకు ఈసారి ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులే ఎక్కువమంది ఎంపికయ్యారు. సీట్లు సాధించిన వారిలో 76.97 శాతం మంది వీరే. ఇందులో బాలికల శాతం 66.04. టాప్–3 ర్యాంకులు సాధించిన వారు కూడా ప్రభుత్వ విద్యార్థులే కావడం విశేషం. రాష్ట్రంలోని నాలుగు ట్రిపుల్ ఐటీల్లో ఎంట్రన్స్ ఫలితాలను గురువారం విజయవాడలోని ఆర్జీయూకేటీ చాన్సలర్ కేసీ రెడ్డి, ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ కె.హేమచంద్రారెడ్డితో కలిసి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. టాప్–3 జెడ్పీ విద్యార్థులే.. ప్రకాశం జిల్లా సింగరాయకొండ జెడ్పీ పాఠశాలకు చెందిన జల్లెల నందిని మయూరి ఓపెన్ కేటగిరీలో ప్రథమ ర్యాంకు, శ్రీకాకుళం జిల్లా టెక్కలి జెడ్పీ పాఠశాలకు చెందిన చక్రపాణి బెహర రెండో ర్యాంకు, గుంటూరు జిల్లా మున్నంగి జెడ్పీ పాఠశాలకు చెందిన సోమిశెట్టి ఫణీంద్ర రామకృష్ణ మూడో ర్యాంకు సాధించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గ్రామీణ విద్యార్థులకు రాష్ట్రంలోని నాలుగు ఐఐఐటీల్లో ప్రవేశాలు కల్పిస్తున్నామని, 600 మార్కులకు గాను అన్ని క్యాంపస్‌లలో 93 నుంచి 95 శాతం మార్కులను కేటగిరీల వారీగా కటాఫ్‌గా నిర్ణయించామని వెల్లడించారు. ఈ ఏడాది నుంచి రాష్ట్రంలోని నాలుగు క్యాంపస్‌ల్లోను కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు బొత్స వెల్లడించారు. విద్యా రంగానికి ఎంతైనా ఖర్చుచేస్తాం మన విద్యార్థులను ప్రపంచస్థాయి నిపుణులుగా తీర్చిదిద్దాలని సీఎం వైఎస్ జగన్ సంకల్పించారని మంత్రి తెలిపారు. అందుకనుగుణంగా ఐఐఐటీల అభివృద్ధికి, వాటిల్లో వసతులు, ప్రమాణాల పెంపునకు ప్రభుత్వం తరఫున ఎంతైనా ఖర్చుపెట్టేందుకు సీఎం సిద్ధంగా ఉన్నారన్నారు. ఏటా ఎస్టీ కేటగిరీలో సీట్లు మిగులుతుండడంతో వాటిని ఎస్సీ కేటగిరీకి మార్చేవారమని, అయితే.. ఈసారి ఎస్టీ కేటగిరీలో అభ్యర్థుల సంఖ్య పెరగడం సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. న్యాయస్థానం సూచనల మేరకు ప్రస్తుతం రాష్ట్రంలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో చదివే విద్యార్థులకు అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సంకల్పంతో 2008లో ట్రిపుల్ ఐటీని నెలకొల్పారని, దీనిని ఆయన తన మానసపుత్రికగా భావించారన్నారు. ప్రస్తుతం ఒక్కో క్యాంపస్‌లో 1,100 సీట్ల చొప్పున మొత్తం 4,400 సీట్లు ఉన్నాయన్నారు. వీటిలో ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కింద 400 సీట్లు ఉన్నాయని, తద్వారా ప్రతిభ ఉండి ఆర్థికంగా వెనుకబడిన వర్గాల విద్యార్థులు కూడా వీటిల్లో చదువుకునే అవకాశం దక్కిందని మంత్రి బొత్స వివరించారు. విద్యా రంగంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకొచ్చిన సంస్కరణలతో ప్రభుత్వ పాఠశాలలు బలోపేతమయ్యాయని ఆర్జీయూకేటీ చాన్సలర్ కేసీ రెడ్డి తెలిపారు. ఇప్పటిదాకా తమ విద్యార్థులకు 93 శాతం ప్లేస్‌మెంట్స్ కల్పించామని, వీటిని మరింత పెంచేందుకు ప్రమాణాలను మెరుగుపరుస్తున్నట్లు ఆయన చెప్పారు. అంతర్జాతీయ స్థాయిలో పోటీపడేలా వారిని తీర్చిదిద్దేందుకు ల్యాప్‌టాప్, యూనిఫారతో సహా అన్ని వసతులను ఉచితంగా కల్పిస్తున్నట్లు కేసీ రెడ్డి చెప్పారు. కౌన్సెలింగ్ తేదీలివే.. అక్టోబర్ 12, 13 తేదీల్లో నూజివీడు, ఇడుపులపాయ క్యాంపస్‌లలో, 14, 15 తేదీల్లో ఒంగోలు క్యాంపస్‌వి ఇడుపులపాయలో, 15, 16 తేదీల్లో ఎచ్చెర్ల క్యాంపస్‌లో కౌన్సెలింగ్ నిర్వహించి, అక్టోబర్ 17 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని ఆర్జీయూకేటీ చాన్సలర్ కేసీ రెడ్డి తెలిపారు. అభ్యర్థుల మెరిట్ లిస్ట్‌ను www.rgukt.in వెబ్సైట్లో చూసుకోవచ్చని చెప్పారు. ఐఐఐటీ క్యాంపస్‌ల డైరెక్టర్లు ప్రొఫెసర్ జీవీఆర్ శ్రీనివాసరావు, ప్రొఫెసర్ బి. జయరామిరెడ్డి, ప్రొఫెసర్ పి. జగదీశ్వర్‌రావు, అడ్మిషన్ కన్వీనర్ ప్రొఫెసర్ గోపాలరాజు పాల్గొన్నారు. -
ట్రిపుల్ ఐటీ పిలుస్తోంది.. దరఖాస్తు చేసుకోండి ఇలా
సత్తెనపల్లి (పల్నాడు జిల్లా): రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయ (ఆర్టీయూకేటీ) పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలు ట్రిపుల్ ఐటీల్లో ఆరేళ్ల బీటెక్ సమీకృత ఇంజినీరింగ్ కోర్సులో ప్రవేశానికి ఇటీవలే నోటిఫికేషన్ విడుదలైంది. ఒక్కో సెంటర్లో 1100 సీట్లు (ఈడబ్ల్యూఎస్ కింద వంద సీట్లు అదనం) అందుబాటులో ఉన్నాయి. గతనెల 30 నుంచి ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. చదవండి: అది ‘ఐ–టీడీపీ’ పనే పదో తరగతిలో మెరిట్, రిజర్వేషన్ల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. నూజివీడు, ఇడుపులపాయలోని సీట్లలో 85 శాతం సీట్లు స్థానికంగా, మిగిలిన 15 శాతం సీట్లను మెరిట్ కోటాలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల విద్యార్థులకు కేటాయిస్తారు. ఎంపికైన విద్యార్థులకు ఈ–మెయిల్, మొబైల్‌కు సమాచారం ఇస్తారు. కౌన్సెలింగ్‌లో సమర్పించాల్సినవి కౌన్సెలింగ్ సమయంలో విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు సమర్పించినప్పుడు ఇచ్చిన రశీదు, పదో తరగతి హాల్ టికెట్, మార్కులలిస్టు, రెసిడెన్స్ సర్టిఫికెట్, సంబంధిత రిజర్వేషన్ల ధ్రువీకరణపత్రాలు సమర్పించాలి. అర్హతలు ♦అభ్యర్థులు ప్రథమ ప్రయత్నం లోనే 2022లో ఎస్ఎస్సీ, తత్సమాన పరీక్షలో రెగ్యులర్ విద్యార్థిగా ఉత్తీర్ణులై ఉండాలి. ♦ఈ ఏడాది సప్లిమెంటరీలో ఉత్తీర్ణులైన వారూ రెగ్యులర్‌గానే ప్రభుత్వం ప్రకటించినందున వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఇలా.. ♦ ఏపీ ఆన్లైన్ సెంటర్ ద్వారా ఆర్జీయూకేటీ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలి. ♦ ఓసీ, బీసీ అభ్యర్థులు దరఖాస్తు రుసుము రూ. 250, ఎస్సీ, ఎస్టీలు రూ. 150 చెల్లించాలి. ♦ రశీదును జాగ్రత్తగా పెట్టుకోవాలి, సర్వీసు చార్జి కింద ఆన్లైన్ సెంటర్‌కు అదనంగా రూ.25లు చెల్లించాలి. ఫీజుల వివరాలు ♦ రాష్ట్రంలోని పాఠశాలల్లో చదివిన విద్యార్థులు ♦ ట్యూషన్ ఫీజు కింద పీయూసీ–1, పీయూసీ–2లకు ఏడాదికి రూ.45వేలు, ఇంజినీరింగ్ నాలుగు సంవత్సరాలకు ఏడాదికి రూ.50వేలు చొప్పున చెల్లించాలి. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అర్హులైన విద్యార్థులు చెల్లించాల్సిన అవసరం లేదు. ♦ ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు ట్యూషన్ ఫీజు ఏడాదికి రూ.1.50 లక్షలు చెల్లించాలి ♦ ఎన్నారై, అంతర్జాతీయ విద్యార్థులు అయితే ఏడాదికి రూ.3 లక్షలు ట్యూషన్ ఫీజు చెల్లించాలి కోర్సులు పీయూసీ : గణితం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, ఇంగ్లిషు, తెలుగు, ఐటీ, బయాలజీ సబ్జెక్టులు ఉంటాయి. ఇంజినీరింగ్ : కెమికల్, మెటలర్జికల్ అండ్ మెటీరియల్ ఇంజినీరింగ్ (ఈ రెండు నూజివీడు, ఇడుపులపాయలో మాత్రమే ఉన్నాయి). సివిల్, సీఎస్ఈ, ఈఈఈ, ఈసీఈ, మెకానికల్ బ్రాంచ్‌లు. గుర్తుంచుకోవాల్సిన తేదీలు ఆన్లైన్ దరఖాస్తులకు గడువు : సెప్టెంబర్ 19 అర్హుల జాబితా విడుదల : సెప్టెంబర్ 29 కౌన్సెలింగ్ తేదీలు : అక్టోబరు 12 నుంచి 15 వరకు తరగతులు ప్రారంభం : అక్టోబరు 1 -
ట్రిపుల్ ఐటీ.. ట్రబుల్ లేకుండా ఎంట్రీ
సాక్షి, హైదరాబాద్: ఇంటర్లో చేరిన విద్యార్థుల్లో చాలా మంది జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో సీటు సాధించడంపై దృష్టిపెడతారు. ఆ లక్ష్యంతోనే చివరి వరకూ జేఈఈపై పట్టుకోసం ప్రయత్నిస్తారు. కొందరు సఫలమవుతారు. సాధారణంగా జేఈఈ మెయిన్స్ ర్యాంకు సాధించిన ప్రతీ ఒక్కరూ ఐఐటీ తర్వాత ఎన్ఐటీల్లో సీట్లు కోరుకుంటారు. ఆ తర్వాత ప్రాధాన్యమిచ్చేది ట్రిపుల్ ఐటీ (ఐఐఐటీ)లకే. వీటిల్లో ఎంత వరకు ర్యాంకువారికి సీటొస్తుంది? ఏ బ్రాంచ్‌కు ఎంత ర్యాంకు వరకు ప్రాధాన్యత ఇవ్వొచ్చనే సందేహాలు చాలా మంది విద్యార్థుల్లో ఉంటున్నాయి. ప్రాథమిక ర్యాంకుల అంచనాను ఎన్టీఏ వెల్లడించకపోవడం కూడా విద్యార్థుల గందరగోళానికి కారణమవుతుంది. ఈ నేపథ్యంలోనే గత కొన్నేళ్లుగా ట్రిపుల్ ఐటీల్లో సీట్ల భర్తీ ర్యాంకుల కటాఫ్‌లను గమనిస్తే సులువుగా అవగాహన వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఎంత వరకు అవకాశం? దేశవ్యాప్తంగా 11 ట్రిపుల్ ఐటీలు జేఈఈ ర్యాంకు ద్వారా సీట్లు కేటాయిస్తున్నాయి. వీటన్నింటిలో కలిపి మొత్తం 6,146 ఇంజనీరింగ్ సీట్లున్నాయి. బాలికలకు ప్రత్యేకంగా కేటాయించే సూపర్ న్యూమరరీ సీట్లు మరో 305 వరకు ఉంటాయి. మొత్తంగా రిజర్వేషన్లను అనుసరించి సీట్లు కేటాయిస్తారు. గత ఏడాది ఓపెన్ కేటగిరీలో బాలురకు 35వేల ర్యాంకు వరకు, బాలికలకు 40వేల ర్యాంకు వరకు సీట్లు దక్కాయి. ఓబీసీ, నాన్ క్రీమీలేయర్ కేటగిరీలో 60వేల ర్యాంకు వరకు సీఎస్సీలో, 65వేల ర్యాంకు వరకు ఈసీఈలో సీట్లు వచ్చాయి. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు 2.5లక్షల ర్యాంకు వరకు ట్రిపుల్ ఐటీల్లో సీట్లు లభించాయి. ఆప్షన్ల ఎంపికే కీలకం జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలకు సెప్టెంబర్ 12 నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ మొదలవుతుంది. ఈ సమయంలో ఆప్షన్ల ఎంపికే కీలకమని నిపుణులు సూచిస్తున్నారు. నిట్, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో నడిచే సంస్థల్లో ఏ ర్యాంకు వరకూ సీటు వస్తుందనే అవగాహనతోపాటు ట్రిపుల్ ఐటీల్లో సీటుకు కావాల్సిన ర్యాంకులను తెలుసుకోవాలని స్పష్టం చేస్తున్నారు. ఆ ర్యాంకులకు అనుగుణంగా ఆప్షన్లు ఇచ్చుకుంటే.. సులువుగా సీటు పొందే వీలు ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. వచ్చిన ర్యాంకుకు తగిన చోట సీటు లభించే ఆప్షన్లను ముందుగా ఎంచుకోవాలని.. లేకుంటే సీటు నష్టపోయే అవకాశం ఉంటుందని వివరిస్తున్నారు. తగిన వ్యూహం అవసరం ట్రిపుల్ ఐటీ సీట్లు పొందాలనుకునే వారు ర్యాంకుల ఆధారంగా ఆప్షన్లు ఇవ్వడంలో వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. జేఈఈ మెయిన్స్ అర్హులంతా ట్రిపుల్ ఐటీ బరిలో ఉండటం సహజమే. అయితే వచ్చిన ర్యాంకుకు ఎక్కడ సీటు వస్తుందనే అంచనాకు రాగలితే ప్రయోజనకరంగా ఉంటుంది. – ఎంఎన్ రావు, గణిత శాస్త్ర నిపుణుడు -
రోబోటిక్ పోటీ.. ట్రిపుల్ఐటీ మేటి
గచ్చిబౌలి (హైదరాబాద్): ట్రిపుల్ఐటీ–హైదరాబాద్ సత్తా చాటింది. గచ్చిబౌలిలోని ట్రిపుల్ఐటీ ప్రాంగణంలోని రోబోటిక్స్ రీసెర్చ్ సెంటర్ రెండు ప్రతిష్టాత్మక విజయాలను సాధించింది. ఇందులోని ‘సెరెబ్రస్’ టీమ్ ద్వితీయ స్థానం పొందగా, ‘లూమోస్’ తృతీయ స్థానం గెలుపొందింది. బెంగళూరులోని ఐఐఎస్సీలోని ఏఐ అండ్ రోబోటిక్స్ టెక్నాలజీ పార్కులో ‘ఓపెన్ క్లౌడ్ టేబుల్ ఆర్గనైజేషన్ చాలెంజ్’ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో 133 టీమ్‌లు పాల్గొన్నాయి. పోటీ ఇలా... కోవిడ్–19 వైరస్ వ్యాప్తితో పారిశుధ్య కార్మికులకు ఎదురయ్యే సవాళ్లను స్ఫూర్తిగా తీసుకుని ఈ పోటీలను నిర్వహించారు. వాష్‌రూమ్‌లో శుభ్రం చేసే పనుల కోసం రోబోను సృష్టించాలి. ఈ రోబో ద్వారా ఫ్లోర్‌పై ఉండే టిçష్యూపేపర్, చిన్న పేపర్ కప్పులు వంటి చెత్తను తొలగించడం, వాష్‌బేసిన్‌ను శానిటైజింగ్ లిక్విడ్‌తో శుభ్రపరచడం వంటి టాస్క్‌లు ఉన్నాయి. ఈ టాస్క్‌లను ఎంత సమయంలో పూర్తిచేస్తారు, సోప్ డిస్పెన్సర్, ఇతర వస్తువులు పడిపోకుండా శుభ్రం చేయడంలో రోబో ప్రదర్శించిన నైపుణ్యం, వినియోగించిన హార్డ్‌వేర్ తదితరాల ఆధారంగా బృందాలకు స్కోర్ ఇచ్చారు. 2021 మార్చిలో అధికారికంగా ప్రారంభమైన ఈ పోటీలో దేశవ్యాప్తంగా 29 డిజైన్లను షార్ట్‌లిస్ట్ చేశారు. వీటిలో నుంచి 4 బృందాలు గ్రాండ్ ఫినాలే కోసం ఎంపికయ్యాయి. ఇక్కడ ఒక్కో జట్టుకు రోబో రూపకల్పన కోసం రూ.4 లక్షల బడ్జెట్ ఇచ్చారు. సూరజ్ నేతృత్వంలో సెరెబ్రస్ సెరెబ్రస్కు పీహెచ్డీ స్కాలర్, డ్రోన్ స్టార్టప్ ఆర్కా ఏరోస్పేస్ వ్యవస్థాపకుడు సూరజ్ బోనగిరి నేతృత్వం వహించారు. ఇందులో వేదాంత్ ముందేదా, కరణ్ మిరాఖోర్, రాహుల్ కశ్యప్, శ్రీహర్ష పరుహురి, కర్నిక్ రామ్ ఉన్నారు. ‘ప్రతి బృందం అద్భుతమైన, ప్రత్యేకమైన డిజైన్లను రూపొందించింది. మా డిజైన్ రెండు అంశాల్లో ప్రత్యేకంగా నిలిచింది. రోబో పరిసరాలను గ్రహించడానికి, స్వయంప్రతిపత్తితో నావిగేట్ చేయడానికి లిడార్స్, రాడార్స్, కెమెరాలు, సెన్సర్లను ఉపయోగించాం. కెమెరా ఆధారిత సాంకేతికత ద్వారా మా రోబో అన్ని పనులను పూర్తి చేసింది’ అని సూరజ్ చెప్పారు. ఈ విజయం ఎంతో గర్వకారణమని రోబోటిక్స్ రీసెర్చ్ సెంటర్ అధినేత ప్రొఫెసర్ మాధవ కృష్ణ చెప్పారు. రెండో స్థానంలో నిలిచిన ఈ టీమ్ రూ.2.5 లక్షల నగదు పురస్కారాన్ని గెలుచుకుంది. లూమోస్ టీమ్ ఇలా.. ఈ పోటీలో ఆదిత్య అగర్వాల్, బిపాషాసేన్, విశాల్‌రెడ్డి మందడి, శంకర నారాయణన్‌తో కూడిన లూమోస్ జట్టు మూడవ స్థానంలో నిలిచి రూ.77వేలు గెలుచుకుంది. టీసీఎస్ రీసెర్చ్ ఇండియా సహకారంతో ప్రొఫెసర్ కృష్ణ మార్గనిర్దేశనంతో పోటీపడింది. ‘రోబోటిక్ పరిశోధనలో రోబో గ్రాస్పింగ్, మానిప్యులేషన్ ముఖ్యం. కేవలం వస్తువులను తీయడం, పట్టుకోవడంతోపాటు విసరడం, నొక్కడం, స్లైడింగ్ చేయడం, పేర్చడం వంటివి కూడా చేయాల్సి ఉంటుంది. ఇలాంటి అనేక పనులు చేయడానికి మనుషుల చేతుల మాదిరి నైపుణ్యం కలిగిన చేతులను రూపొందించడానికి అన్వేషణ కొనసాగుతోంది. ఇందులో మాదైన శైలిలో ప్రదర్శన చేసి మేము విజయం సాధించాం’ అని టీమ్ సభ్యులు చెప్పారు. -
రూ.1.2 కోట్ల జాక్‌పాట్..! ట్రిపుల్ఐటీ చరిత్రలోనే రికార్డు..!
లక్నోలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ (ఐఐఐటీ)కు చెందిన అభిజీత్ ద్వివేది అనే విద్యార్థి తన ప్రతిభతో అమెజాన్ సంస్థలో అత్యధిక వార్షిక వేతన ప్యాకేజీను పొంది రికార్డు సృష్టించాడు. అమెజాన్ అతడికి సుమారు రూ. 1.2 కోట్లను ప్యాకేజ్‌ను అందించిన్నట్లు తెలుస్తోంది. ఐర్లాండ్‌లోని డబ్లిన్‌లో అమెజాన్‌కు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్‌గా అభిజీత్ ద్వివేది నియమితులయ్యారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో బీ.టెక్ చివరి సంవత్సరం చదువుతున్న అభిజీత్...తన అద్భుతమైన ప్రతిభతో వార్షిక ప్యాకేజీతో మునుపటి ప్లేస్మెంట్ రికార్డులన్నింటినీ బద్దలు కొట్టాడు. కోవిడ్-19 ఉదృతి కాస్త తగ్గడంతో ఐఐఐటీ లక్నో విద్యార్ధులు అత్యధిక ప్యాకేజ్లతో 100 శాతం ప్లేస్మెంట్ సాధించారు. ఈ ఏడాది ప్లేస్‌మెంట్స్‌లో ఐఐఐటీ లక్నో రికార్డులను క్రియేట్ చేసింది. గత సంవత్సరాలతో పోలిస్తే... ఈ ఏడాది క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో ఐఐఐటీ లక్నో వార్షిక సగటు వేతనం రూ 26 లక్షలుగా ఉందని ట్రిపుల్ ఐటీ డైరక్టర్ డాక్టర్ అరుణ్ మోహన్ షేర్రీ వెల్లడించారు. చదవండి: అమెజాన్ బంపరాఫర్, ఉచితంగా 500కోర్సులు..అస్సలు మిస్సవ్వద్దు! -
‘మెయిన్’కు తగ్గిపోతున్నారు!
సాక్షి, అమరావతి: జాతీయస్థాయిలో ప్రతిష్టాత్మక విద్యా సంస్థలైన ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ), ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ)ల్లో ప్రవేశానికి నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్‌కు హాజరయ్యే అభ్యర్థుల సంఖ్య ఏటా తగ్గుతోంది. విద్యాసంస్థల సంఖ్య, సీట్ల సంఖ్య పెరుగుతున్నప్పటికీ ఈ పరీక్షలకు నమోదయ్యే విద్యార్థుల సంఖ్య మాత్రం పెరగకపోవడం విశేషం. గత పదేళ్ల గణాంకాలు పరిశీలిస్తే ఇది స్పష్టమవుతోంది. లక్ష నుంచి లక్షన్నర వరకు తగ్గుదల 2012లో 12.20 లక్షల మంది, 2014లో 13.56 లక్షల మంది అభ్యర్థులు మెయిన్‌కు నమోదుకాగా 2021లో ఆ సంఖ్య 10.48 లక్షలకు తగ్గిపోయింది. 2018 వరకు మెయిన్స్ పరీక్షను ఏడాదికి ఒకసారే నిర్వహించేవారు. ఈ విధానంవల్ల విద్యార్థులు అటు ఇంటర్ పరీక్షలు, ఆ తర్వాత మెయిన్ పరీక్షలతో తీవ్ర ఒత్తిడికి గురయ్యేవారు. పైగా ఈ సీట్ల సాధన కోసం అభ్యర్థులు లాంగ్‌టర్మ్ కోచింగ్ తీసుకోవడంవల్ల ఏడాదిపాటు నష్టపోతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని 2019 నుంచి ఏడాదికి రెండుసార్లు నిర్వహించే విధానాన్ని ప్రవేశపెట్టారు. కానీ, 2021లో కరోనావల్ల నాలుగుసార్లు నిర్వహించారు. అయితే.. 2021లో మినహా అంతకు ముందు సంవత్సరాల్లో మెయిన్‌కు నమోదైన విద్యార్థుల సంఖ్యను పరిశీలిస్తే తగ్గుదల స్పష్టంగా కనిపిస్తోంది. 2012లో 12.20 లక్షల మంది నమోదు కాగా.. 2013లో ఆ సంఖ్య 12.82 లక్షలకు పెరిగింది. 2014లో 13,56,805కు చేరింది. ఆ తర్వాత 2015 నుంచి విద్యార్థుల సంఖ్య క్రమేణా తగ్గుతూ వస్తోంది. 2015లో 13.04,495 మందికి తగ్గగా 2016కు వచ్చేసరికి 11,94,938కి.. 2017లో 11,86,454 మందికి పడిపోయింది. కానీ, 2018లో మాత్రం 12.59 లక్షల మంది నమోదు చేసుకున్నారు. ఆ తర్వాత మళ్లీ 2019నుంచి రెండుసార్లు నిర్వహించేలా జేఈఈ విధానాన్ని మార్చినప్పటికీ అభ్యర్థుల సంఖ్య పెరగకపోగా తగ్గడం విశేషం. 2019లో 9,35,741 మంది, 2020లో 9,21,261 మంది, 2021లో 10,48,012 మంది నమోదయ్యారు. సీట్లు పెరిగినా పెరగని అభ్యర్థుల సంఖ్య దేశంలో 2016 నాటికి మొత్తం ఐఐటీలు (23), ఎన్ఐటీలు (31), ఐఐఐటీలు (26), జీఎఫ్‌ఐటీ (18)లలో 28,000 సీట్లు ఉండగా అవి 2021 నాటికి 37,952కు పెరిగాయి. ఐఐటీలలో 2016–17లో 10,572 సీట్లు ఉండగా ప్రస్తుతం 16,053కు చేరాయి. పైగా ఐఐటీల్లో మహిళల సంఖ్యను పెంచేందుకు వారికోసం ఆయా సంస్థల్లో సూపర్ న్యూమరరీ కింద 20 శాతం మేర సీట్లు అదనంగా కేటాయిస్తోంది. హాజరవుతున్న వారూ తగ్గుముఖం మరోవైపు.. మెయిన్‌కు రిజిస్టర్ అవుతున్న వారి సంఖ్యతో పోలిస్తే పరీక్ష రాస్తున్న వారి సంఖ్య మరింత తక్కువగా ఉంటోంది. లక్ష మందికి పైగా హాజరవ్వడంలేదు. ► 2021లో నాలుగు సెషన్లలో జేఈఈ మెయిన్‌ను నిర్వహించగా దేశవ్యాప్తంగా మొత్తం 10,48,012 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 9,39,008 మంది మాత్రమే పరీక్షకు హాజరయ్యారు. ► 2020లో 9,21,261 మంది నమోదు చేసుకోగా 8,69,010 మంది హాజరయ్యారు. ► 2019లో 9,35,741 మందికి గాను 8,81,096 మంది రాశారు. ► 2018లో 12.59 లక్షల మంది నమోదు కాగా 10.50 లక్షల మందే పరీక్షకు హాజరయ్యారు. ► 2017లో 11,86,454 మందిలో 10.20 లక్షల మంది.. ► 2016లో 11,94,938కి గాను 11 లక్షల మంది మాత్రమే హాజరయ్యారు. ► ఇక 2015లో 13,04,495 మందికిగాను 12.34 లక్షల మంది రాశారు. జేఈఈకి ప్రత్యేకంగా తర్ఫీదు కావలసి ఉండడం, ఐఐటీలు సహ ఇతర సంస్థలు ఎక్కడో దూరంగా ఉండడం, పైగా ఆయా సంస్థలలో ఫీజులను భరించే స్థోమత లేకపోవడంతో ఎక్కువమంది విద్యార్థులు స్థానికంగా ఉండే ఇంజనీరింగ్ కాలేజీల్లో చేరేందుకు ఎక్కువగా మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. -
రెండు విడతలుగా జేఈఈ మెయిన్
సాక్షి, అమరావతి: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ) తదితర జాతీయ విద్యా సంస్థల్లో ప్రవేశాలకు నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్స్ – 2022 షెడ్యూల్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) మంగళవారం విడుదల చేసింది. రెండు విడతలుగా నిర్వహించే ఈ పరీక్షలు ఏప్రిల్‌లో 16, 17, 18, 19, 20, 21 తేదీల్లో జరుగుతాయి. రెండో విడత పరీక్షలు మే 24, 25, 26, 27, 28, 29 తేదీల్లో జరుగుతాయి. కంప్యూటర్ ఆధారితంగా పరీక్షలు నిర్వహిస్తారు. పరీక్షల దరఖాస్తు ప్రక్రియ మంగళవారం నుంచి ప్రారంభమైంది. మార్చి 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పేపర్–1, పేపర్–2 లుగా మెయిన్స్ ఉంటుంది. ప్రతి రోజూ ఉదయం, మధ్యాహ్నం పరీక్షలు నిర్వహిస్తారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పరీక్ష ఉంటుంది. బీఈ బీటెక్ కోర్సులకు పేపర్–1, బీఆర్క్, బీప్లానింగ్ కోర్సులలో ప్రవేశానికి పేపర్–2 పరీక్ష పెట్టనున్నారు. బీఆర్క్‌కు పేపర్–2ఏను, బీ ప్లానింగ్‌కు పేపర్–2బీ నిర్వహిస్తారు. పేపర్–2ఏ లోని పార్టు 3లో డ్రాయింగ్ టెస్టును పెన్ను, పేపర్‌తో ఆఫ్‌లైన్ మోడ్‌లో రాయాలి. పరీక్షలను ఇంగ్లీషు, హిందీ, తెలుగు, గుజరాతీ, అస్సామీ, బెంగాలీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళం, ఉర్దూ భాషల్లో నిర్వహిస్తారు. ఒకేసారి ఇంటర్మీడియట్, జేఈఈ పరీక్షలు ఒక పక్క ఇంటర్మీడియెట్ పరీక్షలు, మరోపక్క జేఈఈ పరీక్షలు ఒకేసారి జరుగనుండడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షలు ఏప్రిల్ 8 నుంచి 28 వరకు జరుగనున్నాయి. తొలి విడత జేఈఈ పరీక్షలు కూడా అవే తేదీల్లో జరగనున్నాయి. దీంతో రెండిటికీ సన్నద్ధం కావడం కష్టంగా మారనుంది. ఒకే సమయంలో జేఈఈ, బోర్డు పరీక్షలు రాయాల్సి రావడం వల్ల విపరీతమైన ఒత్తిడికి గురవుతామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనేక మంది తొలివిడత చాన్సును వదులుకోవలసి వస్తుందని చెబుతున్నారు. మేలో జరిగే రెండో విడత జేఈఈ మెయిన్స్‌కు మాత్రమే హాజరు కాగలుగుతామని అంటున్నారు. గతంలో జేఈఈ చాన్సులు నాలుగు ఉండడంతో బోర్డు, జేఈఈ పరీక్షలకు కొంత వ్యవధి తీసుకొని రాసే అవకాశం ఉండేది. ఈసారి చాన్సులను రెండుకు కుదించడంతో పాటు పరీక్షలను ఏప్రిల్, మేలలో పెడుతుండడంతో సమస్య ఏర్పడుతోంది. ఇవే కాకుండా జేఈఈకి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ, పీజుల చెల్లింపు, ధ్రువపత్రాల సమర్పణ వంటి పనులు పూర్తిచేయాలి. ఈ ప్రక్రియ, బోర్డు పరీక్షలకు సిద్ధం కావడం, జేఈఈ పరీక్షలకు సన్నద్ధం కావడం అన్నీ ఒకే సమయంలో చేయాల్సి ఉంటుందని, ఇది పరీక్షలలో విద్యార్థుల సామర్థ్యాలపై దుష్ప్రభావాన్ని చూపుతుందని అధ్యాపకులు, తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. కాలేజీలు ఆలస్యంగా తెరవడంతో బోధనకూ ఆటంకం 2021–22 విద్యా సంవత్సరంలో కాలేజీలను తెరవడం ఆలస్యమయింది. జూన్‌లో కాలేజీలు ఆరంభం కావలసి ఉండగా కరోనా కారణంగా అక్టోబర్‌లో తెరిచారు. ఆ తరువాత కూడా బోధన, అభ్యసన ప్రక్రియలు సరిగా సాగలేదు. గత రెండు మూడు నెలలుగా మాత్రమే బోధనకు అవకాశం ఏర్పడింది. కాలేజీలు ఆలస్యంగా ప్రారంభం కావడంతో ఇంటర్మీడియట్ బోర్డు సిలబస్‌ను 30 శాతం మేర తగ్గించింది. కానీ జేఈఈ సిలబస్‌లో మాత్రం ఎలాంటి మార్పూ ఉండదని ఎన్టీఏ ప్రకటించింది. అసలే సమయం లేక ఇంటర్ పరీక్షలు రాసేందుకు నానా అవస్థలు పడుతుంటే జేఈఈ మెయిన్స్ పూర్తి సిలబస్‌తో జరగడం వల్ల విద్యార్థులు నష్టపోయే అవకాశం ఉంటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
ట్రిపుల్ ఐటీలో విడతల వారీగా ఆఫ్‌లైన్ తరగతులు
వేంపల్లె (వైఎస్సార్ కడప జిల్లా): ఆర్జీయూకేటీ పరిధిలోని ఇడుపులపాయ ఆర్కే వ్యాలీ, ఒంగోలు ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు విడతల వారీగా ఆఫ్‌లైన్ తరగతులు నిర్వహిస్తున్నట్లు ఆర్జీయూకేటీ చాన్సలర్ కేసీ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కోవిడ్ థర్డ్ వేవ్, ఒమిక్రాన్ నేపథ్యంలో విద్యార్థులకు ఆఫ్‌లైన్, ఆన్లైన్ తరగతుల కోసం ఆప్షన్ ఇచ్చామని తెలిపారు. ప్రస్తుతం ఇంజనీరింగ్ (ఈ4) విద్యార్థులకు ఆఫ్‌లైన్ తరగతులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. నేటి నుంచి (సోమవారం) పీ2 (ఒంగోలు, ఆర్కే వ్యాలీ) ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు ఆఫ్‌లైన్ తరగతులు ప్రారంభమవుతాయన్నారు. ఇప్పటికే సుమారు 1,100 మంది విద్యార్థులు ఇడుపులపాయలోని ఆర్కే వ్యాలీ క్యాంపస్‌కు చేరుకున్నారన్నారు. ఈనెల 13వ తేదీ నుంచి పీ1 విద్యార్థులకు, 19వ తేదీ నుంచి ఈ3 విద్యార్థులకు ఆఫ్‌లైన్ తరగతులు నిర్వహిస్తామన్నారు. మార్చి 2వ తేదీలోపు ఈ1, ఈ2 విద్యార్థులకు ఆఫ్‌లైన్ తరగతులు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఇటీవల కొంతమంది విద్యార్థులు ఆన్లైన్ తరగతులు బహిష్కరిస్తున్నట్లు మెయిల్స్ పెట్టారని, అందుకు స్పందించి త్వరలోనే వారికి ఆఫ్‌లైన్ తరగతుల కోసం షెడ్యూల్ ఇచ్చామన్నారు. ట్రిపుల్ ఐటీలో ఖాళీల భర్తీ నూజివీడు (ఆగిరిపల్లి): కృష్ణా జిల్లా నూజివీడులోని ట్రిపుల్ ఐటీ ఆర్జీయూకేటీ క్యాంపస్‌లో మొదటి దశ కౌన్సెలింగ్‌లో ప్రవేశాలు పొంది, విద్యార్థులు చేరకపోవడంతో ఖాళీ అయిన 66 సీట్లకు కౌన్సెలింగ్ నిర్వహించి భర్తీ చేసినట్లు ఆర్జీయూకేటీ చాన్సలర్ ఆచార్య కేసీ రెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఒంగోలు క్యాంపస్‌లో 34, శ్రీకాకుళం క్యాంపస్‌లో 32 సీట్లకు 2021–22 విద్యా సంవత్సరానికి అడ్మిషన్ పూర్తయిందన్నారు. ఖాళీల కౌన్సెలింగ్ ప్రక్రియను ఆచార్య జి.వి.ఆర్.శ్రీనివాసరావు, అడ్మిషన్స్ కన్వీనర్ ఆచార్య గోపాలరాజు పర్యవేక్షించారు. -
జేఈఈ–2022 జాడేది?
సాక్షి, అమరావతి: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ), తదితర జాతీయ విద్యా సంస్థల్లో ప్రవేశానికి నిర్వహించే జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్, అడ్వాన్స్డ్–2022 షెడ్యూల్‌పై విద్యార్థుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. జేఈఈ షెడ్యూల్‌ను పరీక్షకు ఆరు నెలల ముందుగా ప్రకటించడం ఆనవాయితీ. అయితే కరోనా, తదితర కారణాలతో గత కొన్నేళ్లుగా షెడ్యూల్ ప్రకటనలో తీవ్ర జాప్యం చోటు చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో జేఈఈ మెయిన్–2022ను ఎప్పుడు నిర్వహిస్తారు? ఎన్ని దశల్లో పరీక్షలుంటాయి? పరీక్ష విధానంలో మార్పులేమైనా ఉంటాయా? అనే సందేహాలు విద్యార్థుల్లో తలెత్తుతున్నాయి. కరోనాతో అస్తవ్యస్తం.. 2019 జేఈఈ మెయిన్ షెడ్యూల్‌ను 2018 జూలై 7న ప్రకటించారు. 2019 జనవరి, ఏప్రిల్‌ల్లో రెండు దశల్లో ఈ పరీక్షను నిర్వహించారు. ఇక 2020 పరీక్షల షెడ్యూల్‌ను 2019 ఆగస్టు 28న ప్రకటించారు. 2020 జనవరిలో మొదటి సెషన్ పరీక్షలు పూర్తి చేసినా.. రెండో సెషన్ ఏప్రిల్ పరీక్షలను కరోనా కారణంగా సెప్టెంబర్‌లో నిర్వహించారు. ఇక 2021 జేఈఈ షెడ్యూల్‌ను 2020 డిసెంబర్ 16న ప్రకటించారు. 2020లో కరోనా కారణంగా ఇంటర్మీడియెట్ పరీక్షలు షెడ్యూల్ ప్రకారం పూర్తి కాకపోవడంతో పలువురు అభ్యర్థులు జేఈఈ మెయిన్‌కు హాజరు కాలేకపోయారు. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని 2021 జేఈఈ మెయిన్‌ను నాలుగు విడతల్లో.. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే నెలల్లో నిర్వహించేలా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) షెడ్యూల్ ఇచ్చింది. ఫిబ్రవరి, మార్చి సెషన్ల పరీక్షలు యథాతథంగా జరిగినా కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఏప్రిల్, మే సెషన్ల పరీక్షలు ఆలస్యమయ్యాయి. ఈ పరీక్షలు సెప్టెంబర్ 2కి గాని పూర్తికాలేదు. గత మూడేళ్లూ పరీక్షల షెడ్యూల్‌ను డిసెంబర్ మధ్య నాటికే ప్రకటించారు. 2022 జేఈఈ మెయిన్ షెడ్యూల్ మాత్రం ఇప్పటివరకు విడుదల కాకపోవడంతో విద్యార్థులు ఆందోళనలో ఉన్నారు. ఈసారి కూడా నాలుగు విడతలు ఉంటాయా? జేఈఈ మెయిన్‌ను రెండు విడతలకు బదులు 2021లో నాలుగు విడతల్లో నిర్వహించారు. 2022లో కూడా అదే విధానం ఉంటుందా? ఉండదా? అనే సందేహం వెంటాడుతోంది. నాలుగు విడతల వల్ల 2021లో ఐఐటీ అడ్మిషన్లు చాలా ఆలస్యమయ్యాయి. ఈ నేపథ్యంలో మార్పులు చేస్తారా? అనేదానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు కరోనా కారణంగా ఆయా రాష్ట్రాల ఇంటర్మీడియెట్ బోర్డుల పరీక్షలు ఆలస్యం కావడంతో ఇంటర్ మార్కుల వెయిటేజీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) తొలగించింది. ఈసారి కూడా ఇదే విధానం ఉంటుందా? లేదా అనేదానిపైనా విద్యార్థుల్లో సందేహాలు ఉన్నాయి. ఇలా అనేక అంశాలపై ఆధారపడి పరీక్షలకు సన్నద్ధమవ్వాల్సి ఉండటంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. గతంలో మాదిరిగా నాలుగు విడతల్లో జేఈఈ ఉంటే.. ముందు బోర్డు పరీక్షలకు సిద్ధమై తదుపరి జేఈఈకి సన్నద్ధం కావాలని యోచిస్తున్నారు. -
ట్రిపుల్ ఐటీ ఫలితాల్లో ప్రభుత్వ విద్యార్థుల హవా
ఒంగోలు మెట్రో: రాజీవ్ గాంధీ సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జేయూకేటీ) సెట్– 2021 పరీక్ష ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సత్తా చాటారు. తొలి ఆరు ర్యాంకులు వారే సొంతం చేసుకున్నారు. ఒంగోలు ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో ఆర్జేయూకేటీ వైస్ చాన్సలర్ కేసీ రెడ్డి నేతృత్వంలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి సురేష్, విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పాల్గొని ఫలితాలు విడుదల చేశారు. రాష్ట్రంలోని ఇడుపులపాయ, నూజివీడు, ఒంగోలు, శ్రీకాకుళంలోని ట్రిపుల్ ఐటీల్లో ఈ పరీక్షలో ప్రతిభ ఆధారంగా ప్రవేశాలు కల్పించనున్నారు. ఆగస్టు 18న నోటిఫికేషన్ వెలువరించి, సెప్టెంబర్ 6 వరకు దరఖాస్తులు స్వీకరించారు. పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 73,548 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఏపీలో 470, తెలంగాణలో 8 కేంద్రాల్లో పరీక్షను సెప్టెంబర్ 26న నిర్వహించారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 71,207 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. కాగా, నాలుగు ట్రిపుల్ ఐటీల్లో మొత్తం 4400 సీట్లు ఉండగా, ఒక్కో సీటుకు 18 మంది విద్యార్థులు పోటీ పడ్డారు. పరీక్ష నిర్వహించిన పది రోజుల్లోనే పరీక్షల ఫలితాలు విడుదల చేసి అధికారులు రికార్డు సృష్టించారు. త్వరలో కౌన్సెలింగ్ నిర్వహించి ప్రవేశాలు కల్పించనున్నారు. ఆటోమొబైల్ ఇంజనీర్ కావడమే లక్ష్యం రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంకు సాధించడానికి ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు ఎంతగానో ప్రోత్సహించారు. ట్రిపుల్ ఐటీ ఇడుపులపాయలోని కళాశాలలో చదవాలనుకుంటున్నా. ఆటోమొబైల్ ఇంజనీర్ కావడమే నా ముందున్న లక్ష్యం. – మద్దన గుణశేఖర్, 1వ ర్యాంక్ కలెక్టర్‌గా చూడాలని అమ్మానాన్న కోరిక 2వ ర్యాంక్ రావడం సంతోషంగా ఉంది. తల్లిదండ్రుల ప్రోత్సాహం, ఉపాధ్యాయుల సహకారంతోనే ఇది సాధ్యమైంది. మాది వ్యవసాయ కుటుంబం. నన్ను కలెక్టర్‌గా చూడాలన్నది అమ్మనాన్న కోరిక. వారి కలను సాకారం చేసే దిశగా లక్ష్యం వైపు అడుగులు వేస్తా. – కూశెట్టి శ్రీచక్రధరణి, 2వ ర్యాంక్ ఇంజనీరింగ్ చేస్తూ సివిల్స్‌కు సిద్ధమవుతా ఇంజనీరింగ్ (సీఈసీ) చదువుతూ సివిల్స్‌కు సిద్ధమవుతా. తండ్రి చనిపోయారు. తల్లి విభిన్న ప్రతిభావంతురాలు. తాతయ్యతో పాటు చిన్నాన్న మురళీ, మామయ్య కృష్ణారావులు చదువులో మార్గనిర్దేశం చేస్తున్నారు. ఇష్టంగా చదవడంతోనే పదో తరగతిలో 10/10 పాయింట్లు సాధించా. ఆర్జీయూకేటీ సెట్–21లో రాష్ట్రస్థాయిలో మూడో ర్యాంకు రావడం ఆనందంగా ఉంది. – మన్నెపూరి చంద్రిక, 3వ ర్యాంకు -
AP: ట్రిపుల్ ఐటీ ఫలితాలు విడుదల
సాక్షి, ఒంగోలు: రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన ట్రిపుల్ ఐటీ ప్రవేశ పరీక్ష-2021 ఫలితాలు విడుదల అయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ బుధవారం ఫలితాలను విడుదల చేశారు. ఒంగోలు ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో మంత్రి సురేష్ ఫలితాలను విడుదల చేశారు. సెప్టెంబర్ 26న పరీక్ష నిర్వహించగా.. రికార్డు సమయంలో 10 రోజుల్లోనే ఫలితాలు విడుదల చేయడం గమనార్హం. ఈ కార్యక్రమంలో మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ట్రిపుల్ ఐటీ ఫలితాల్లో తొలి ఐదుస్థానాల్లో నిలిచినవారు.. 1. ఎం. గుణశేఖర్ (ధర్మవరం, అనంతపురం) 2. శ్రీచక్రధరణి (మైదుకూరు, వైఎస్సార్ జిల్లా) 3. ఎం. చంద్రిక (విజయనగరం జిల్లా) 4. వెంకటసాయి సుభాష్ (జమ్మలమడుగు, వైఎస్సార్ జిల్లా) 5. జి. మనోజ్ఞ (మండపేట, తూ.గో జిల్లా) (ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
టిపుల్ఐటీ హైదరాబాద్‌లో కొత్త కోర్సు ప్రారంభం
రాయదుర్గం(హైదరాబాద్): ట్రిపుల్ఐటీ హైదరాబాద్ ఓ కొత్త కోర్సుకు శ్రీకారం చుట్టింది. రెండేళ్ల కాలపరిమితితో కూడిన ప్రొడక్ట్ డిజైన్ అండ్ మేనేజ్మెంట్(పీడీఎం)లో ఎంటెక్ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. టెక్నాలజీ, ప్రొడక్ట్స్, డిజైన్, ఇన్నోవేషన్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లో అభ్యర్థులు అవగాహన సాధించేలా ఈ కోర్సును రూపొందించా రు. ప్రారంభ కెరీర్లో ఉన్న ఐటీ గ్రాడ్యుయే ట్లు, వర్కింగ్ ప్రొఫెషనల్స్ మెరుగైన అనుభవాన్ని సాధించేందుకు, కొత్త ఉత్పత్తులు, కొత్త స్టార్టప్‌లు ప్రారంభించేలా అభ్యర్థులను సన్నద్ధులను చేయడంలో ఈ కోర్సు దోహదపడుతుంది. ఈ కోర్సు ఐటీసీ ఉత్పత్తులపై ప్రత్యేక దృష్టితో సాంకేతికత, డిజైన్, నిర్వహణ అం శా ల్లో సమతుల్యత కలిగి ఉందని పీడీఎం ప్రోగ్రా మ్ హెడ్ ప్రొ. రఘురెడ్డి తెలిపారు. శీతా కాల ప్రవేశాల్లో భాగంగా ఈ కోర్సులో చేరడానికి నవంబర్ 10 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. -
ఐఐఐటీ శ్రీసిటీలో టీచింగ్ కొలువులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరులో ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, శ్రీసిటీ(ఐఐఐటీ).. అసిస్టెంట్/అసోసియేట్ ప్రొఫెసర్లు (కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్), అసిస్టెంట్ ప్రొఫెసర్లు (మ్యాథమేటిక్స్/డేటాఅనలిటిక్స్) టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో పీహెచ్డీ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. ► ఎంపిక విధానం: విద్యార్హతలు, అనుభవం, స్పెషలైజేషన్ల ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థుల్ని ఇంటర్వ్యూకి పిలుస్తారు. ► దరఖాస్తు విధానం: ఈమెయిల్/ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తును ది రిజిస్ట్రార్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, శ్రీ సిటీ, చిత్తూరు, 630 జ్ఞాన్ మార్గ్, శ్రీ సిటీ, చిత్తూరు జిల్లా–517646, ఆంధ్రప్రదేశ్, ఇండియా చిరునామాకు పంపించాలి. ► ఈమెయిల్: careers.faculty@iiits.in ► దరఖాస్తులకు చివరి తేది: 11.06.2021 ► వెబ్సైట్: http://www.iiits.ac.in మరిన్ని నోటిఫికేషన్లు ఎన్జీఆర్ఐ, హైదరాబాద్‌లో ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టులు CDFD Recruitment 2021: సీడీఎఫ్‌డీ, హైదరాబాద్‌లో ఉద్యోగాలు సీడ్యాక్, హైదరాబాద్‌లో 44 ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టులు -
నేటి నుంచి జేఈఈ మెయిన్ రెండో విడత పరీక్షలు
సాక్షి, అమరావతి: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ (ఐఐఎస్ఈఆర్) తదితర విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ (జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్) మెయిన్ రెండో విడత (మార్చి సెషన్) పరీక్షలు నేటి (మంగళవారం) నుంచి రాష్ట్రవ్యాప్తంగా 20 కేంద్రాల్లో ప్రారంభం కానున్నాయి. ఈ నెల 18 వరకు మూడ్రోజుల పాటు రోజుకు రెండు సెషన్లలో వీటిని నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకు 5 లక్షల మంది వరకు విద్యార్థులు రిజిస్టర్ అయ్యారు. అభ్యర్థుల సంఖ్య తక్కువగా ఉండడంతో మార్చి సెషన్ పరీక్షలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మూడ్రోజులకు కుదించింది. పరీక్షల నిర్వహణలో ప్రతి ఒక్కరూ కరోనా ప్రొటోకాల్ నిబంధనలను పాటించేలా చర్యలు చేపట్టింది. సిబ్బందితో పాటు అభ్యర్థులు విధిగా మాస్కులు ధరించాలి. సిబ్బందికి గ్లౌజ్‌లను ఏర్పాటుచేస్తున్నారు. పరీక్ష కేంద్రాలను శానిటైజ్ చేయిస్తున్నారు. కాగా, పరీక్షలకు హాజరయ్యే వారు తమతోపాటు పారదర్శక బాటిల్లో శానిటైజర్ తెచ్చుకోవడానికి అనుమతిస్తున్నారు. సెల్ఫోన్లు, డిజిటల్ వాచీలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించరు. మొదటి సెషన్ ఉ.9 నుంచి 12 వరకు.. రెండో సెషన్ మ.3 నుంచి సా.6 వరకు జరుగుతుంది. మొదటి సెషన్ అభ్యర్థులు ఉ.7.30 నుంచి 8.30 గంటలలోపు.. రెండో సెషన్ అభ్యర్థులు మ.1.30 నుంచి 2.30 గంటలలోపు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి. అడ్మిట్ కార్డుతోపాటు ఫొటో ఐడెంటీటీ కార్డును తప్పనిరిగా తమతో పాటు తెచ్చుకోవాలి. -
రేపట్నుంచి జేఈఈ మెయిన్–2
సాక్షి, అమరావతి: ఐఐటీ, ఎన్ఐటీ, ఐఐఐటీ, ఐఐఎస్ఈఆర్ తదితర విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్ రెండో విడత పరీక్షలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈనెల 18వ తేదీ వరకు మూడు రోజుల పాటు రోజుకు రెండు సెషన్లలో ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. రెండో విడత పరీక్షలకు 5 లక్షల మంది వరకు విద్యార్థులు రిజిస్టర్ అయ్యారు. జేఈఈ మెయిన్‌ను 2021 నుంచి నాలుగు విడతల్లో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలల్లో 4 రోజుల చొప్పున మేలో 5 రోజుల పాటు ఈ పరీక్షలను కంప్యూటరాధారితంగా నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) గతంలో ప్రకటించింది. ఫిబ్రవరి 23 నుంచి 26 వరకు తొలి విడత పరీక్షలను నిర్వహించింది. ఆ సెషన్‌కు 6.5 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. మార్చి సెషన్‌ను 15 నుంచి 18 వరకు నిర్వహించేందుకు తొలుత షెడ్యూల్ ఇచ్చారు. రెండో విడత పరీక్షలకు రిజిస్టర్ అయిన అభ్యర్థుల సంఖ్య తక్కువగా ఉండడంతో మార్చి సెషన్ పరీక్షలను మూడు రోజులకు కుదించారు. 16 నుంచి 18 వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. ఏపీ నుంచి 53 వేల మంది రెండో విడత పరీక్షలకు హాజరుకానున్నారు. రాష్ట్రంలో 20 పరీక్ష కేంద్రాలను ఏర్పాటుచేశారు. అనంతపురం, భీమవరం, చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, నరసరావుపేట, ప్రొద్దుటూరు, సూరంపాలెంలలో పరీక్ష నిర్వహించనున్నారు. కోవిడ్ నిబంధనలు పాటించాల్సిందే.. పరీక్షల నిర్వహణలో కోవిడ్–19 నియమాలను పాటించేలా ఎన్టీఏ చర్యలు చేపట్టింది. సిబ్బందితో పాటు పరీక్షలురాసే వారంతా తప్పనిసరిగా మాసు్కలు ధరించి రావాలి. సిబ్బందికి గ్లౌజ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. పరీక్ష కేంద్రాలను శానిటైజేషన్ చేయిస్తున్నారు. పరీక్షలకు హాజరయ్యే వారు తమతో పాటు పారదర్శక బాటిళ్లలో ఉండే శానిటైజర్ తెచ్చుకోవడానికి అనుమతిస్తున్నారు. అలాగే పారదర్శక బాటిళ్లతో మంచినీరు, పారదర్శకంగా ఉండే బాల్‌పెన్నులను కూడా అభ్యర్థులు తెచ్చుకోవచ్చు. సెల్ఫోన్లు, డిజిటల్ వాచీలు, ఇతర ఎలక్ట్రానిక్ డివైజ్‌లను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించరు. మొదటి సెషన్ ఉదయం 9 నుంచి 12 వరకు, రెండవ సెషన్ మధ్యాహ్నం 3 నుంచి 6 వరకు జరుగుతుంది. అభ్యర్థులు ఉదయం 7.30 నుంచి 8.30 గంటల లోపు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి. వారి అడ్మిట్ కార్డుతోపాటు ఫొటో ఐడెంటిటీ కార్డును తెచ్చుకోవాలి. పరీక్షలకు సంబంధించి రఫ్‌వర్కు చేయడానికి అవసరమైన పత్రాలను పరీక్ష కేంద్రాల్లోనే ఇస్తారు. వాటిని తిరిగి పరీక్ష పత్రాలతోపాటు ఇన్విజిలేటర్లకు ఇవ్వాల్సి ఉంటుంది. -
జేఈఈ కటాఫ్ మార్కులు పెరిగే చాన్స్
సాక్షి, అమరావతి: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ) తదితర జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశానికి సంబంధించి ఫిబ్రవరిలో నిర్వహించిన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్–2021 ప్రాథమిక ‘కీ’ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) సోమవారం రాత్రి విడుదల చేసింది. దీనిని అనుసరించి జేఈఈ మెయిన్–2021లో కటాఫ్ మార్కులు గతంలో కన్నా స్వల్పంగా పెరిగే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. ఫిబ్రవరి 23నుంచి 26వ తేదీ వరకు కంప్యూటర్ ఆధారితంగా ఈ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. బీఈ, బీ.టెక్, బీ.ఆర్క్, బీ.ప్లానింగ్ కోర్సులకు సంబంధించి నిర్వహించిన ఈ పరీక్షలలో వచ్చిన ప్రశ్నల స్థాయిని అనుసరించి కోచింగ్ సెంటర్లు, కార్పొరేట్ విద్యాసంస్థలు ఇప్పటికే ఒక అంచనాకు వచ్చాయి. ప్రాథమిక ‘కీ’ కూడా విడుదల కావడంతో కటాఫ్ మార్కులపై వేర్వేరు అంచనాలలో తలమునకలవుతున్నాయి. అన్ని సెషన్ల పరీక్షలు పూర్తయ్యాకే కటాఫ్‌పై స్పష్టత జేఈఈలో కటాఫ్ మార్కులు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి ఐఐటీ విద్యాసంస్థల్లోకి ప్రవేశానికి ఉద్దేశించిన జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు అర్హత సాధించేందుకు అవసరమైన కటాఫ్ మార్కులు. జేఈఈ మెయిన్‌లో అభ్యర్థులు సాధించిన స్కోరును అనుసరించి ఈ కటాఫ్‌ను నిర్ణయిస్తారు. రెండోది ఇతర జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశానికి సంబంధించి జేఈఈ మెయిన్ స్కోరును అనుసరించి నిర్ణయించే కటాఫ్. ఈ నెల 7వ తేదీలోపు ప్రకటించే తుది ఫలితాలతో జేఈఈ అడ్వాన్స్డ్ కటాఫ్‌ను ఎన్టీఏ ప్రకటిస్తుంది. అయితే, ప్రస్తుతం నాలుగు సెషన్లలో ఫిబ్రవరి సెషన్ పరీక్షలలో అభ్యర్థులు సాధించే స్కోరును అనుసరించి మాత్రమే ఈ కటాఫ్, పర్సంటైల్ అంచనాలు వేస్తున్నా మార్చి, ఏప్రిల్, మే సెషన్ల పరీక్షలు ముగిశాక కానీ తుది కటాఫ్ తేలదు. అంతిమంగా మే సెషన్ ఫలితాల అనంతరమే దీనిపై ఒక స్పష్టత వస్తుందని అధ్యాపకులు పేర్కొంటున్నారు. ప్రతి సెషన్ పరీక్షలకు సంబంధించి తుది ఫలితాలతో పాటే వీటిని విడుదల చేస్తారు. జూన్‌లో కౌన్సెలింగ్ నిర్వహించి ప్రవేశాల ప్రక్రియను చేపడతారు. ఈ సందర్భంగా అడ్మిషన్ల కటాఫ్‌ను జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ ప్రకటిస్తుంది. విద్యాసంస్థల వారీగా ఓపెనింగ్, క్లోజింగ్ ర్యాంకులను అనుసరించి అడ్మిషన్ల కటాఫ్ మార్కులను ప్రవేశాల సమయంలో జోసా విడుదల చేయనుంది. మొత్తం అన్ని సెషన్ల పరీక్షలకు హాజరైన అభ్యర్థులు, అందుబాటులో ఉన్న సీట్లు, పరీక్షల్లో వచ్చే ప్రశ్నల కాఠిన్యత తదితరాలను అనుసరించి తుది కటాఫ్ తేలనుంది. ఫిబ్రవరి సెషన్‌కు 6,61,776 మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోగా.. 6,52,627 మంది పరీక్షలు రాశారు. ప్రాథమిక ‘కీ’ని అనుసరించి కటాఫ్ ఇలా ఈసారి కటాఫ్ గత ఏడాది జేఈఈ మెయిన్ కటాఫ్‌తో పోలిస్తే స్వల్పంగా పెరిగే అవకాçశం ఉందని కార్పొరేట్ విద్యాసంస్థ అధ్యాపకురాలు ఒకరు అభిప్రాయపడ్డారు. జనరల్ కటాఫ్ మార్కులు ఈసారి 90–95 శాతం వరకు ఉండవచ్చన్నారు. రిజర్వుడ్ కేటగిరీల్లో కూడా 60 నుంచి 70 శాతానికి పైగా మార్కుల స్కోరు సాధించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. 200 వరకు మార్కులు వచ్చే అభ్యర్థి 90–95 పర్సంటైల్ సాధించవచ్చన్నారు. జేఈఈ మెయిన్ వెబ్సైట్లో ప్రాథమిక కీ జేఈఈ మెయిన్–2021 ఫిబ్రవరి సెషన్ పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక ‘కీ’ని జేఈఈ మెయిన్ వెబ్సైట్లో పొందుపర్చినట్టు ఎన్టీఏ పేర్కొంది. ఆన్సర్ ‘కీ’, ప్రశ్నపత్రాలు, అభ్యర్థుల రెస్పాన్సు షీట్లను కూడా అందులో పొందుపరిచింది. అభ్యర్థులు తమ అభ్యంతరాలను బుధవారం సాయంత్రం 5 గంటలలోపు ఆన్లైన్లో పొందుపర్చవచ్చు. ఛాలెంజ్ చేసే ఒక్కొక్క ప్రశ్నకు రూ.200 చొప్పున రుసుము చెల్లించాల్సి ఉంటుంది. రుసుము చెల్లింపునకు బుధవారం సాయంత్రం 6 గంటల వరకు గడువు విధించారు. దరఖాస్తుల సమర్పణ, ఉపసంహరణకు అవకాశం మార్చి, ఏప్రిల్, మే సెషన్లకు సంబంధించిన జేఈఈ మెయిన్‌కు దరఖాస్తుల సమర్పణ, ఉపసంహరణకు ఎన్టీఏ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ సెషన్లకు ఇంతకుముందు దరఖాస్తు చేసిన వారు ఉపసంహరించుకోవడానికి లేదా తమ దరఖాస్తులో ఏమైనా మార్పులుంటే చేసుకోవడానికి అవకాశం కల్పిస్తోంది. మార్చి సెషన్‌కు కొత్తగా దరఖాస్తు చేసుకోదలచిన వారికి రిజిస్ట్రేషన్ గడువు ఈ నెల 6వ తేదీ వరకు ఇచ్చింది. మార్చి సెషన్‌కు సంబంధించిన పరీక్షలు 15, 16, 17, 18 తేదీల్లో జరుగుతాయి. దరఖాస్తులను ఈ నెల 6వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు ఆన్లైన్లో సమర్పించవచ్చు. రిజిస్టేషన్ ఫీజును 6వ తేదీ రాత్రి 11.50 గంటలలోపు చెల్లించాల్సి ఉంటుంది. ఏప్రిల్, మే సెషన్లకు సంబంధించి కొత్త దరఖాస్తులు, రిజిస్టేషన్ల ఫీజు గడువును ఆ తరువాత తెలియచేయనున్నట్టు ఎన్టీఏ వివరించింది. -
జేఈఈలో తొలివిడతకే ఎక్కువమంది..
సాక్షి, అమరావతి: ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ) ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ) తదితర జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశాలకు దేశవ్యాప్తంగా నిర్వహించే జేఈఈ (మెయిన్) తొలివిడత పరీక్షకే ఎక్కువమంది అభ్యర్థులు హాజరుకానున్నారు. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే నెలల్లో మొత్తం నాలుగు విడతల్లో ఆన్లైన్ విధానంలో నిర్వహించే ఈ పరీక్షలకు తొలివిడతకే 6,61,761 మంది రిజిష్టర్ చేసుకున్నారు. అతి తక్కువగా ఏప్రిల్ సెషన్‌కు 4,98,910 రిజిస్ట్రేషన్లు ఉండగా మార్చి సెషన్‌కు 5,04,540, మే సెషన్‌కు 5,09,972 మంది రిజిష్టర్ అయ్యారు. తొలివిడత సెషన్ పరీక్ష అడ్మిట్ కార్డులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) గురువారం రాత్రి విడుదల చేసింది. ఇక ఫిబ్రవరి 23 నుంచి 26 వరకు దేశవ్యాప్తంగా మొదటి విడత పరీక్షలు జరగనున్నాయి. అడ్మిట్ కార్డులు జరభద్రం అభ్యర్థులు అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకున్నాక వాటిని జాగ్రత్తగా భద్రపరుచుకోవాలని ఎన్టీఏ సూచించింది. అలాగే.. ► ‘జేఈఈమెయిన్.ఎన్టీఏ.ఎన్ఐసీ.ఐఎన్’ వెబ్సైట్ నుంచి వీటిని డౌన్లోడ్ చేసుకోవాలి. ► అడ్మిట్ కార్డులను అభ్యర్థులు తమ వ్యక్తిగత మెయిల్లో వెంటనే భద్రం చేసుకోవాలి. ఆ తర్వాత ఎలాంటి డూప్లికేట్లు జారీచేయరు. ► జేఈఈ అడ్మిషన్లు పూర్తయ్యేవరకు వీటిని దాచుకోవలసిన బాధ్యత అభ్యర్థులదే. ► అడ్మిట్‌కార్డులోని వివరాలన్నింటినీ అభ్యర్థులు తాము సమర్పించిన ఆన్లైన్ దరఖాస్తు ఫారంలోని వివరాలతో సరిపోతున్నాయో లేదో సరిచూసుకోవాలి. ► అడ్మిట్‌కార్డు డౌన్‌లోడ్‌లో సమస్యలు ఎదురైతే 0120–6895200 నెంబర్లో ఉ.10 నుంచి సా.5లోపు సంప్రదించవచ్చు. దరఖాస్తులో అసంపూర్ణ సమాచారాన్ని నింపిన వారికి అడ్మిట్‌కార్డు జారీచేయడంలేదని ఎన్టీయే పేర్కొంది. ఈ–మెయిల్ ఐడీ: ‘జేఈఈఎంఏఐఎన్–ఎన్‌టీఏఎట్‌దరేట్‌జీఓవీ.ఐఎన్’లో కూడా సంప్రదించవచ్చు. అభ్యర్థులకు ఎన్టీఏ సూచనలు.. ► పరీక్ష కేంద్రానికి జేఈఈ మెయిన్ అడ్మిట్ కార్డు, అందులో ఉన్నలాంటిదే మరో పాస్‌పోర్టు సైజ్ కలర్ ఫొటో తీసుకువెళ్లాలి. దాన్ని అటెండెన్సు షీటులో నిర్దేశిత ప్రాంతంలో అంటించాలి. ► పాన్‌కార్డు, ఆధార్‌కార్డు తదితర ఏదైనా ఒరిజినల్ ఫొటో గుర్తింపు కార్డును తీసుకువెళ్లాలి. ► ఎన్టీఏ వెబ్సైట్ నుంచి అండర్‌టేకింగ్ ప్రొఫార్మాను డౌన్లోడ్ చేసుకుని దానిపై సంతకం చేసి పరీక్ష కేంద్రంలో అందించాలి. ► కరోనా నేపథ్యంలో పారదర్శక బాటిళ్లలో శానిటైజర్, మంచినీటిని అనుమతిస్తారు. ► మధుమేహం ఉన్న అభ్యర్థులు తమతో పాటు పరీక్ష కేంద్రంలోకి పండ్లు, సుగర్ టాబ్లెట్లు తీసుకెళ్లొచ్చు. ► పారదర్శకంగా ఉండే బాల్‌పెన్నునే పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు. ► రఫ్‌వర్కు కోసం ఖాళీ పేపర్ షీట్లను పరీక్ష హాలులో అందిస్తారు. ► పరీక్షా హాల్ నుండి బయటకు వెళ్లే ముందు అభ్యర్థులు తమ పేరు, రోల్ నంబర్‌ను షీట్ పైభాగంలో రాసి వాటిని ఇన్విజిలేటర్‌కు అందించాలి. ► పరీక్ష ప్రారంభమైన తర్వాత ఏ అభ్యర్థినీ పరీక్షా కేంద్రంలోకి అనుమతించరు. అడ్మిట్ కార్డులేని వారినీ అనుమతించరు. నిర్ణీత సమయానికి ముందే చేరుకోవాలి అభ్యర్థులందరూ తప్పనిసరిగా నిర్ణీత సమయానికి 2 గంటలు ముందుగా పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి. ► పరీక్షలు ఉదయం సెషన్ 9 నుంచి 12వరకు, మధ్యాహ్నం సెషన్ 3 నుంచి 6 వరకు జరుగుతుంది. పరీక్ష కేంద్రాల్లోనికి ఉ.7.30 నుంచి 8.30 వరకు, మ. 2 నుంచి 2.30 వరకు పరీక్ష కేంద్రాల్లోకి అభ్యర్థులను అనుమతిస్తారు. ► ఉదయం సెషన్లో 8.30 నుంచి 8.50, మ.2.30 నుంచి 2.50 వరకు ఇన్విజిలేటర్లు సూచనలు చేస్తారు. ► అలాగే, ఉ.9 నుంచి.. మ.3 నుంచి పరీక్ష ప్రారంభం అవుతుంది. ► పరీక్షా హాలులోకి ప్రవేశించిన తర్వాత, ఇన్విజిలేటర్లు అభ్యర్థులకు అటెండెన్సు షీట్ అందిస్తారు. అభ్యర్థుల పేర్లతో ఉండే ఈ షీట్లో పేరు ముందు కేటాయించిన స్థలంలో సంతకం చేయాల్సి ఉంటుంది. షీట్లో సంతకం చేయని వారిని పరీక్షకు గైర్హాజరైనట్లుగా పరిగణిస్తారు. పరీక్షహాలులోకి వీటిని అనుమతించరు.. జామిట్రీ బాక్సు, హ్యాండ్‌బాగులు, పర్సులు, పేపర్లు, మొబైల్ ఫోన్, ఇయర్ ఫోన్, మైక్రోఫోన్, పేజర్, కాలిక్యులేటర్ వంటి ఎలక్ట్రానిక్ వస్తువులు.. డాక్యుపెన్, స్లైడ్ రూలర్, లాగ్ టేబుల్స్, కెమెరా, టేప్ రికార్డర్ వంటి పరికరాలు.. కాలిక్యులేటర్, ఎలక్ట్రానిక్ గడియారాలు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు సహా ఏ రకమైన ఎలక్ట్రానిక్ వస్తువులనూ అనుమతించరు. ఇంటర్/బోర్డు పరీక్షలకు ఇబ్బంది లేకుండా.. ఇదిలా ఉంటే.. మే 24, 25, 26, 27, 28 తేదీల్లో జరిగే నాలుగో విడత జేఈఈ మెయిన్ పరీక్షలకు ఎన్టీఏ ఇంతకుముందే షెడ్యూల్ ప్రకటించింది. అయితే, సీబీఎస్ఈతో పాటు వివిధ రాష్ట్రాల ఇంటర్మీడియెట్ బోర్డుల పరీక్షలు కూడా అదే సమయంలో ఉండడంతో విద్యార్థులకు ఇబ్బందిగా మారింది. దీనిపై వచ్చిన విజ్ఞప్తులకు స్పందిస్తూ ఎన్టీఏ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. మే 3 నుంచి 12 వరకు ఎన్టీఏ వెబ్‌సైట్‌లోని అభ్యర్థుల అప్లికేషన్ ఫారంలో తమ 12వ తరగతి రోల్ నెంబర్, బోర్డు పేరును నమోదు చేయాలని సూచించింది. మే సెషన్ జేఈఈ పరీక్షల తేదీలైన మే 24, 25, 26, 27, 28 తేదీల్లో ఏ రోజున ఆ అభ్యర్థి బోర్డు పరీక్షకు హాజరుకానున్నారో ఆన్లైన్ దరఖాస్తులో పొందుపరచాలని పేర్కొంది. దీనికి సంబంధించిన సమాచారానికి ఎన్టీఏ వెబ్‌సైట్‌లోని అప్డేట్ సమాచారాన్ని అనుసరించాలని సూచించింది. -
జేఈఈ మెయిన్ రిజిస్ట్రేషన్లు 21.75 లక్షలు
సాక్షి, అమరావతి: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ (ఐఐఎస్ఈఆర్) తదితర విద్యా సంస్థల్లోకి ప్రవేశాల కోసం నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్స్‌కు ఈ విద్యా సంవత్సరంలో దరఖాస్తులు వెల్లువెత్తాయి. గడువు ముగిసే సమయానికి 21,75,183 మంది అభ్యర్థులు జేఈఈ మెయిన్స్‌కు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. కరోనా నేపథ్యంలో విద్యార్థులకు మరిన్ని అవకాశాలు కల్పించే దిశగా కేంద్రం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ద్వారా ఈ విద్యా సంవత్సరంలో జేఈఈలో అనేక మార్పులకు శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా జేఈఈ పరీక్షలను 4 దశల్లో నిర్వహించే విధానం వల్ల విద్యార్థులు దీన్నొక అవకాశంగా మల్చుకోవడానికి పెద్ద ఎత్తున ఉత్సాహం చూపించారని తాజా రిజిస్ట్రేషన్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. కంప్యూటర్ ఆధారిత పరీక్షలు దేశ వ్యాప్తంగా ఈ పరీక్షలను కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహిస్తున్నారు. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే నెలల్లో నాలుగేసి రోజుల చొప్పున ఉదయం, సాయంత్రం 2 సెషన్లలో ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. ఈసారి జేఈఈ మెయిన్స్‌ను ఇంగ్లిష్తో పాటు హిందీ, తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, గుజరాతీ, ఒడియా, బెంగాలీ, మరాఠీ, పంజాబీ, ఉర్దూ, అస్సామి భాషల్లో ఈ పరీక్షలు జరగనున్నాయి. ప్రాంతీయ భాషల్లో ప్రశ్నపత్రాలు ఆ భాషతో పాటు ఆంగ్లంలో కూడా ఉంటాయి. çఇప్పటివరకు 21 లక్షల మంది రిజిస్టర్ అవ్వగా, వారిలో 1,49,597 మంది 10 స్థానిక భాషల్లో పరీక్షలు రాసేందుకు మొదటిసారి ఆప్షన్ ఇచ్చినట్లు ఎన్టీఏ గణాంకాలు చెబుతున్నాయి. వీరిలో సగం మంది హిందీని ఎంచుకున్నారు. గుజరాతీలో రాసేందుకు 44,094 మంది, బెంగాలీలో రాసేందుకు 24,841 మంది ఆప్షన్లు ఇచ్చారు. అయితే అత్యధికులు ఆంగ్లంలోనే పరీక్ష రాసేందుకు ఆప్షన్ ఇవ్వడం గమనార్హం. మొదటి దశ పరీక్షకు 6.6 లక్షల మంది దరఖాస్తు జేఈఈ మెయిన్స్‌ను నాలుగు దశల్లో నిర్వహించేందుకు నిర్ణయించడంతో అభ్యర్థులు వారికి నచ్చిన దశలో పరీక్ష రాయనున్నారు. తొలిదశ పరీక్షలకు 6,61,761 మంది దరఖాస్తు చేశారు. కొందరు నాలుగు దఫాలు రాయడానికి దరఖాస్తు చేయగా, కొందరు ఒకటి, రెండు దఫాల్లో పరీక్షలు రాసేందుకు వీలుగా దరఖాస్తు చేశారు. -
4 నుంచి ట్రిపుల్ ఐటీల అడ్మిషన్ల కౌన్సెలింగ్
సాక్షి, అమరావతి/నూజివీడు: రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జి టెక్నాలజీస్ (ఆర్జీయూకేటీ) పరిధిలోని నాలుగు ట్రిపుల్ఐటీల్లో ప్రవేశాల కౌన్సెలింగ్ జనవరి 4వ తేదీనుంచి ప్రారంభం కానుంది. కృష్ణాజిల్లా నూజివీడు, వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలోని ఆర్కేవ్యాలీ క్యాంపస్‌లలో సమాంతరంగా ఈ కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. ఈ రెండు కేంద్రాల్లో తమకు సమీపంలోని దేనికైనా అభ్యర్థులు హాజరుకావచ్చని అడ్మిషన్ల కన్వీనర్ ప్రొఫెసర్ ఎస్‌ఎస్‌ఎస్‌వీ గోపాలరాజు చెప్పారు. ఇటీవల నిర్వహించిన ఆర్జీయూకేటీ సెట్ ర్యాంకుల ఆధారంగా వర్సిటీ పరిధిలోని నూజివీడు, ఆర్కేవ్యాలీ, శ్రీకాకుళం, ఒంగోలు ట్రిపుల్ఐటీల్లో ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్ ప్రోగ్రామ్‌లో విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తారు. ప్రభుత్వ స్కూళ్లలో చదివిన విద్యార్థులకు డిప్రవేషన్ స్కోర్ కింద 0.4 మార్కులను కలిపి ర్యాంకులను ప్రకటించారు. ప్రత్యేక కేటగిరీలోని దివ్యాంగులు, ఎన్సీసీ, సీఏపీ, స్పోర్ట్సు మినహా ఇతర అభ్యర్థుల మెరిట్ జాబితాను విడుదల చేశారు. మెరిట్ ర్యాంకుల జాబితా, కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను యూనివర్సిటీ వెబ్సైట్ ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఆర్జీయూకేటీ.ఐఎన్’లో ఉంచారు. అభ్యర్థులు కౌన్సెలింగ్‌కు ఏ రోజున హాజరుకావాలో ఈమెయిల్, ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం అందిస్తారు. అభ్యర్థులు జనవరి 4 నుంచి 11వ తేదీ వరకు తమకు నిర్దేశించిన తేదీల్లో ఉదయం 8 గంటలకల్లా ఒరిజినల్ సర్టిఫికెట్లు, రెండేసి జిరాక్స్ కాపీలతో కౌన్సెలింగ్‌కు హాజరుకావాలి. జనవరి 18 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. ప్రత్యేక కేటగిరీ అభ్యర్థులలో ఎన్సీసీ, సీఏపీ, స్పోర్ట్సు అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన ఈనెల 28 నుంచి, దివ్యాంగుల ధ్రువపత్రాల పరిశీలన జనవరి 2న నూజివీడు క్యాంపస్‌లో చేపట్టనున్నారు. ఒక్కో ట్రిపుల్ ఐటీలో 1,100 సీట్లు భర్తీ చేస్తారు. దీన్లోనే కేంద్రప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ కోటా కింద అగ్రవర్ణ పేదలకు ఇచ్చిన 10 శాతం అదనపు కోటా కింద 100 సీట్లు ఉన్నాయి. 85 శాతం ఏపీ లోకల్, 15 శాతం ఏపీ, తెలంగాణ వారికి.. రాష్ట్రపతి ఉత్తర్వులు ఆర్టికల్ 371డీ ప్రకారం మొత్తం సీట్లలో 85 శాతం ఏపీ స్థానికత ఉన్న అభ్యర్థులకు, 15 శాతం సీట్లను ఓపెన్ కేటగిరీ కింద ఏపీ, తెలంగాణ విద్యార్థులకు మెరిట్ ప్రాతిపదికన కేటాయిస్తారు. 85 శాతం లోకల్ కోటాలో రిజర్వేషన్లను అనుసరించి ఎస్సీలకు 15, ఎస్టీలకు 6, బీసీ–ఏ 7, బీసీబీ 10, బీసీసీ 1, బీసీడీ 7, బీసీఈ 4 శాతం చొప్పున సీట్లు కేటాయిస్తారు. దివ్యాంగులకు 3 శాతం, సైనికోద్యోగుల పిల్లలకు 2 శాతం, ఎన్సీసీ కోటాలో 1 శాతం, స్పోర్ట్సు కోటాలో 0.5 శాతం సీట్లు కేటాయించనున్నారు. ఆయా కేటగిరీల్లోని సీట్లలో 33.1/3 శాతం సీట్లు బాలికలకు కేటాయిస్తారు. బాలికలు లేనట్లయితే అదే కేటగిరీ బాలురతో ఆ సీట్లు భర్తీచేస్తారు. ట్రిపుల్ఐటీల్లో కోర్సులు నూజివీడు, ఆర్కేవ్యాలీ, శ్రీకాకుళం, ఒంగోలు క్యాంపస్‌లలో సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ కోర్సులున్నాయి. నూజివీడు, ఆర్కేవ్యాలీ క్యాంపస్‌లలో అదనంగా కెమికల్ ఇంజనీరింగ్, మెటలర్జికల్, మెటీరియల్స్ ఇంజనీరింగ్ కోర్సులున్నాయి. కౌన్సెలింగ్‌కు తీసుకురావాల్సిన ధ్రువపత్రాలు ► ఆర్జీయూకేటీ సెట్ మార్కుల మెమో ► ఆర్జీయూకేటీ ర్యాంకు కార్డు ► టెన్త్ హాల్‌టికెట్ ► నివాస ధ్రువపత్రం (ఏపీ లోకల్) ► నివాస ధ్రువపత్రం లేదా పేరెంట్సు సర్వీస్ సర్టిఫికెట్ (నాన్‌లోకల్ కేటగిరీ) ► కుల ధ్రువీకరణపత్రం ► ఈడబ్ల్యూఎస్ ధ్రువపత్రం ► దివ్యాంగ ధ్రువపత్రం ► సీఏపీ ధ్రువపత్రం l ఎన్సీసీ, స్పోర్ట్సు ధ్రువపత్రాలు (ఆయా ధ్రువపత్రాలు ఆర్జీయూకేటీ నిర్దేశించిన ప్రొఫార్మాల్లో ఉండాలి) -
నేటి నుంచి సీఎస్ఏబీ ‘స్పెషల్’ కౌన్సెలింగ్
సాక్షి, అమరావతి: నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (ఐఐఈఎస్టీ), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ), గవర్నమెంట్ ఫండెడ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ (జీఎఫ్‌టీఐ)ల్లో ఖాళీ సీట్ల భర్తీకి సెంట్రల్ సీట్ అలొకేషన్ బోర్డ్ (సీఎస్ఏబీ) నిర్వహించే స్పెషల్ రౌండ్ కౌన్సెలింగ్ సోమవారం నుంచి ప్రారంభం కానుంది. జేఈఈ మెయిన్‌లో అర్హత సాధించిన అభ్యర్థులందరూ ఈ రెండు విడతల స్పెషల్ రౌండ్ కౌన్సెలింగ్‌కు అర్హులు. అయితే ఈ కౌన్సెలింగ్‌లో సీటు పొందిన అభ్యర్థి ఇంతకు ముందు సీటును పొంది ఉంటే దాన్ని కోల్పోతాడు. ఈ మేరకు ఇంతకు ముందు కేటాయించిన సీటును కోరబోమని కౌన్సెలింగ్‌లో పాల్గొనే అభ్యర్థులందరి నుంచి అఫిడవిట్ తీసుకోనున్నారు. ఈ ప్రత్యేక రౌండ్ కౌన్సెలింగ్‌కు సీట్ల ఖాళీలను సోమవారం ప్రకటించనున్నారు. జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ (జోసా) కౌన్సెలింగ్‌కు నమోదు చేసుకున్నవారు, సీట్లు పొంది రద్దు చేసుకున్నవారు, మధ్యలో విత్‌డ్రా అయినవారు, జేఈఈ మెయిన్‌లో అర్హత సాధించి జోసా కౌన్సెలింగ్‌కు రిజిస్టర్ చేసుకోనివారంతా కొత్తగా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులకు సూచనలు.. – అభ్యర్థులు ‘హెచ్‌టీటీపీఎస్://సీఎస్ఏబీ.ఎన్ఐసీ.ఐఎన్’ వెబ్ పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. – రిజిస్ట్రేషన్ సమయంలో అభ్యర్థులు తమ అర్హతలు, జాతీయత, జెండర్, కేటగిరీ తదితర అంశాలను నమోదు చేయాలి. – అభ్యర్థులు చాయిస్‌లను ఫిల్ చేస్తూ ఎప్పటికప్పుడు సేవ్ చేస్తూ ఉండాలి. సేవ్ చేయకపోతే అవి సర్వర్ నుంచి కనిపించకుండా పోయే ప్రమాదముంది. – నిర్ణీత సమయంలో అభ్యర్థులు తాము సేవ్ చేసిన వాటిని లాక్ చేయాలి. – చాయిస్ ఫిల్లింగ్ అనంతరం వాటిని సేవ్ చేయకపోతే సమయం ముగిశాక ఆ అభ్యర్థులకు సీట్ల కేటాయింపు జరగదు. – చాయిస్ ఫిల్లింగ్ సేవ్, లాక్ చేశాక ప్రింటవుట్‌ను తీసుకోవాలి. – జోసా నిర్వహించిన కౌన్సెలింగ్‌లో పాల్గొని సీట్లు పొందిన అభ్యర్థులు ఈ నెల 9 నుంచి 13 లోపు పాక్షిక ఫీజు చెల్లించి ఉండకపోతే వారి సీటు రద్దు అవుతుంది. వారు స్పెషల్ రౌండ్ కౌన్సెలింగ్‌లో పాల్గొనాల్సి ఉంటుంది. – జోసా కౌన్సెలింగ్‌లో సీటు వచ్చి పాక్షిక ఫీజు చెల్లించిన అభ్యర్థులు స్పెషల్ కౌన్సెలింగ్‌లో పాల్గొనని పక్షంలో ఈ నెల 16 నుంచి 21లోపు తమకు కేటాయించిన సంస్థల్లో చేరాల్సి ఉంటుంది. -
30% మందితోనే ట్రిపుల్ ఐటీ తరగతులు
సాక్షి, అమరావతి/నూజివీడు: రాష్ట్రంలోని ట్రిపుల్ ఐటీల్లో 2020–21 విద్యా సంవత్సరానికి సంబంధించిన తరగతుల నిర్వహణపై రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జి టెక్నాలజీ(ఆర్జీయూకేటీ) శనివారం మార్గదర్శకాలు విడుదల చేసింది. కోవిడ్–19 నేపథ్యంలో ఈ విద్యా సంవత్సరం బ్లెండెడ్ లెర్నింగ్(ఆన్లైన్, ఆఫ్‌లైన్) విధానంలో కొనసాగనుంది. తరగతిలో బోధన(ఆఫ్ లైన్)కు 30 శాతం మంది విద్యార్థులను అనుమతిస్తారు. మిగతా 70 శాతం మందికి ఆన్లైన్లో బోధిస్తారు. పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ కూడా ఇచ్చింది. కోవిడ్ నేపథ్యంలో స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ప్రకారం క్యాంపస్‌లను నిర్వహించాల్సి ఉంటుంది. మార్చి చివర్లో మొదటి సెమిస్టర్ పరీక్షలు మొదటి సెమిస్టర్లో బ్లెండెడ్ లెర్నింగ్ విధానాన్ని బోధన–అభ్యాస వ్యూహంగా అనుసరిస్తారు. మొత్తం విద్యార్థుల సంఖ్యలో 30 శాతం మందిని క్యాంపస్‌లోకి అనుమతిస్తారు. మిగిలిన వారికి ఆన్లైన్ బోధన ఉంటుంది. ఆర్జీయూకేటీ నాలుగు క్యాంపస్‌లలో నవంబర్ 2 నుంచి పీయూసీ–2, ఈ–2, ఈ–3, ఈ–4కు ఆన్లైన్ తరగతుల నిర్వహణకు షెడ్యూల్ ఇచ్చారు. 2019–20 పీయూసీ–2 బ్యాచ్ ప్రస్తుతం క్యాంపస్‌లలో జరిగే సెమిస్టర్–2కు సంబంధించిన పరీక్షలకు హాజరవ్వాలి. వీటి ఫలితాల ఆధారంగా ఇంజినీరింగ్ మొదటి సంవత్సరంలో వారికి ప్రవేశాలు జరుపుతారు. ఇక 2020–21 విద్యా సంవత్సరానికి సంబంధించిన మొదటి సెమిస్టర్ ముగింపు పరీక్షలు 2021 మార్చి చివర్లో జరుగుతాయి. 2వ సెమిస్టర్ ఏప్రిల్‌లో ప్రారంభమై ఆగస్టు నాటికి పూర్తవుతుంది. కరోనా భయంతో విద్యార్థులను పంపించేందుకు తల్లిదండ్రులు భయపడితే.. డిసెంబర్ మొదటి వారంలో నిర్వహించే పీయూసీ–2 పరీక్షలకు హాజరయ్యేందుకు వర్సిటీ మరో అవకాశమిస్తుంది. విద్యార్థులకు కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తారు. పాజిటివ్ ఉన్న విద్యార్థులను క్యాంపస్‌లోకి అనుమతించరు. కాగా, ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశానికి నిర్వహించనున్న ఏపీ ఆర్జీయూకేటీ సెట్ ఆన్లైన్ దరఖాస్తుల గడువును ఈ నెల 13 వరకు పొడిగించినట్లు వర్సిటీ తెలిపింది. రూ.1,000 అపరాధ రుసుంతో ఈనెల 16 వరకు గడువు ఇచ్చింది. ట్రిపుల్ ఐటీల్లో రోబోటిక్స్, మెషిన్‌లెర్నింగ్ నూతన బ్రాంచిలను ప్రవేశపెట్టనున్నట్లు వర్సిటీ చాన్స్‌లర్ ఆచార్య కేసీ రెడ్డి చెప్పారు. -
అక్టోబర్ 6 నుంచి ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలు
సాక్షి, అమరావతి: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ), తదితర జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్ అక్టోబర్ 6 నుంచి ప్రారంభం కానుంది. ఈ సంస్థల్లో బీఈ, బీటెక్ కోర్సుల్లో సీట్ల భర్తీకి జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ (జోసా) శుక్రవారం అర్ధరాత్రి కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల చేసింది. జేఈఈ మెయిన్ రెండో విడత (సెప్టెంబర్) ఫలితాలు అదే రోజు విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నెల 21 నుంచి జేఈఈ అడ్వాన్స్డ్ అడ్మిట్ కార్డులు ► జేఈఈ మెయిన్‌లో మెరిట్లో నిలిచిన 2.50 లక్షల మందిని జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు ఎంపిక చేస్తారు. ఈ నెల 27న ఐఐటీ– ఢిల్లీ ఈ పరీక్షను నిర్వహించనుంది. ► అడ్మిట్ కార్డులను ఈ నెల 21 నుంచి 27 వరకు https:// jeeadv.ac.in నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ► అడ్వాన్స్డ్ పరీక్షను రాష్ట్రంలో అమలాపురం, అనంతపురం, భీమవరం, చీరాల, చిత్తూరు, ఏలూరు, గుడ్లవల్లేరు, గూడూరు, గుంటూరు, కడప, కాకినాడ, కంచికచర్ల, కావలి, కర్నూలు, మచిలీపట్నం, మార్కాపూర్, మైలవరం, నరసరావుపేట, నెల్లూరు, ఒంగోలు, పుత్తూరు, రాజమహేంద్రవరం, సూరంపాలెం, తాడేపల్లిగూడెం, తిరుపతి, తిరువూరు, విజయవాడల్లో నిర్వహిస్తారు. ► ఈ నెల 29న ప్రొవిజినల్ ఆన్సర్ ‘కీ’ని విడుదల చేస్తారు. ► ఫైనల్ ఆన్సర్ ‘కీ’ని అక్టోబర్ 5న https://jeeadv.ac.inలో పెట్టి.. అదే రోజు ర్యాంకుల జాబితాను ప్రకటిస్తారు. ► బీఆర్కిటెక్చర్‌కు అభ్యర్థులు ప్రత్యేకంగా ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ రాయాలి. అక్టోబర్ 5, 6 తేదీల్లో ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలి. అక్టోబర్ 8న ఈ పరీక్ష నిర్వహిస్తారు. జోసా ప్రవేశాల షెడ్యూల్ ఇలా.. ఈసారి ఆరు విడతల కౌన్సెలింగ్ ద్వారా 23 ఐఐటీలు, 32 ఎన్ఐటీలు, 26 ఐఐఐటీలు, మరో 30 ఇతర సంస్థలు కలిపి మొత్తం 111 జాతీయ విద్యాసంస్థల్లోని సీట్లను భర్తీ చేస్తారు. మొదట విడత సీట్ల కేటాయింపు కంటే ముందు రెండుసార్లు నమూనా కౌన్సెలింగ్‌ను నిర్వహిస్తారు. దీనివల్ల అప్పటికే ఆప్షన్లు నమోదు చేసుకున్న వారు ఎక్కడ సీటు వస్తుందో తెలుసుకోవచ్చు. దాన్ని అనుసరించి అభ్యర్థులు తమ ఆప్షన్లు మార్చుకునేందుకు అవకాశం కల్పిస్తారు. సీట్లు పొందినవారు స్వయంగా వెళ్లి ఆయా విద్యా సంస్థల్లో రిపోర్ట్ చేయనవసరం లేదు. కరోనా దృష్ట్యా ఆన్లైన్లోనే ప్రక్రియంతా పూర్తి చేసేలా మార్పులు చేశారు. ముఖ్య తేదీలు: జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు.. ఆన్లైన్ రిజిస్ట్రేషన్: సెప్టెంబర్ 12 రిజిస్ట్రేషన్ ముగింపు: సెప్టెంబర్ 17 ఫీజు చెల్లింపు తుది గడువు: సెప్టెంబర్ 18 కౌన్సెలింగ్ షెడ్యూల్ తేదీలు ఇలా.. అక్టోబర్ 5: జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు అక్టోబర్ 6 నుంచి: జోసా కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ అక్టోబర్ 16: మొదటి విడత సీట్ల కేటాయింపు అక్టోబర్ 21: రెండో విడత సీట్ల కేటాయింపు అక్టోబర్ 26: మూడో విడత సీట్ల కేటాయింపు అక్టోబర్ 30: 4వ విడత సీట్ల కేటాయింపు నవంబర్ 3: 5వ విడత సీట్ల కేటాయింపు నవంబర్ 7: 6వ విడత సీట్ల కేటాయింపు ఏపీ నుంచి ముగ్గురికి 100 ఎన్టీఏ స్కోర్ కాగా.. జేఈఈ మెయిన్ ఫలితాల్లో ఆలిండియా స్థాయిలో 100 ఎన్టీఏ (నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ) స్కోర్ సాధించిన వారిలో రాష్ట్రం నుంచి ముగ్గురు చోటు దక్కించుకున్నారు. విజయనగరం జిల్లా చీపురుపల్లికి చెందిన లండా జితేంద్ర, విశాఖపట్నానికి చెందిన వైఎస్ఎస్ నరసింహనాయుడు, గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన తడవర్తి విష్ణు శ్రీ సాయి శంకర్లు ఈ ఘనత సాధించారు. వీరే కాకుండా 100 స్కోర్ సాధించిన ఆర్.శశాంక్ అనిరుధ్ (కడప), రొంగల అరుణ సిద్ధార్థ్ (తూర్పుగోదావరి) ఏపీకి చెందిన వారే అయినా హైదరాబాద్‌లో పరీక్ష రాయడంతో ఆ రాష్ట్ర కోటాలోకి చేరారు. -
ట్రిపుల్ ఐటీకి మహర్దశ
సాక్షి, ఒంగోలు: ప్రకాశం జిల్లా రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం బలోపేతంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. మౌలిక వసతులు, టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది నియామకాలకు ప్రాధాన్యమిస్తోంది. ఇప్పటికే ఆంధ్రకేసరి ప్రకాశం విశ్వవిద్యాలయానికి డీపీఆర్ ప్రకటించిన ప్రభుత్వం తాజాగా శ్రీకాకుళం, ఒంగోలు ట్రిపుల్ ఐటీలకు పోస్టులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ట్రిపుల్ ఐటీల విద్యా ప్రమాణాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ మేరకు ఒంగోలులోని ట్రిపుల్ ఐటీలో బోధన, భోదనేతర సిబ్బంది నియామకానికి సెప్టెంబర్ 31న ఉన్నత విద్యాశాఖ జీవో నంబర్ 30ని విడుదల చేసింది. దీనికి అనుగుణంగా త్వరలో నోటిఫికేషన్‌ను కూడా వెలువరించనున్నారు. ఒంగోలు ట్రిపుల్ ఐటీలో 210 టీచింగ్, 89 నాన్ టీచింగ్ పోస్టులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం డిప్యుటేషన్ మీద కొందరు, కాంట్రాక్టు ప్రాతిపదికన కొందరు విధులు నిర్వహిస్తున్నారు. టీచింగ్‌లో ప్రొఫెసర్, అసోషియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేయనున్నారు. విద్యారంగ పటిష్టతకు చర్యలు.. ప్రస్తుతం ట్రిపుల్ ఐటీని పూర్తి స్థాయిలో బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఛాన్సలర్‌గా ప్రొఫెసర్ కేసీ రెడ్డి బాధ్యతలు చేపట్టాక, రాష్ట్రంలోని అన్ని ట్రిపుల్ ఐటీల ఉన్నతికి చర్యలు తీసుకుంటున్నారు. ఇక దివంగత ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధతో, పేదల ఉన్నత సాంకేతిక విద్యకు అవకాశాలు కల్పిస్తూ ఏర్పాటు చేసిన ట్రిపుల్ ఐటీల మీద గత ప్రభుత్వం శీతకన్ను వేసింది. కాగా, ప్రస్తుత ప్రభుత్వం పేద వర్గాల ఉన్నత విద్య పట్ల ప్రత్యేక ఆసక్తిని ప్రదర్శిస్తూ కోట్లాది రూపాయలు కేటాయిస్తూ విద్యారంగాన్ని పటిష్టం చేస్తోంది. ఒంగోలు ట్రిపుల్ ఐటీలో మొత్తం ఆరువేల మంది విద్యార్థులు ఉండాల్సివుంది. అయితే గత కొన్నేళ్లుగా వైఎస్సార్ కడప జిల్లా ఇడుపులపాయలో ఒంగోలు ట్రిపుల్ ఐటీ తరగతులు నిర్వహిస్తున్నారు. గత ఏడాది నుంచి ఒంగోలులో తరగతులు ప్రారంభించగా, మొదటి సంవత్సర విద్యార్థులకు మాత్రమే ప్రస్తుతం తరగతులు ఇక్కడ నిర్వహిస్తున్నారు. రెండో సంవత్సరం నుంచి చివరి సంవత్సరం వరకు విద్యార్థులకు ఇడుపులపాయలో తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన జీవో 30ని అనుసరించి పోస్టులకు నోటిఫికేషన్ వేసి భర్తీ చేసే క్రమంలో పూర్తి స్థాయిలో ఒంగోలులో తరగతులు నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలని స్థానిక మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో పాటు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డిలు అధికారులకు సూచనలు చేశారు. అడ్మిషన్లపై కసరత్తు.. ఈ ఏడాది 2020–21 విద్యా సంవత్సరం ప్రవేశాలకు త్వరలో నోటిఫికేషన్ విడుదల చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. పదవ తరగతి ఉత్తీర్ణత ఆధారంగా ట్రిపుల్ ఐటీలో ప్రవేశాలు కల్పిస్తారు. జీపీఏ మెరిట్ ఆధారంగా గతంలో ప్రవేశాలు నిర్వహించేవారు. ఈ ఏడాది కోవిడ్–19 నేపథ్యంలో అందరికీ ఉత్తీర్ణ ధృవీకరణ పత్రాలు మంజూరు చేస్తున్నారు. మార్కులు ఇవ్వనందున ప్రవేశ పరీక్ష నిర్వహించి ప్రవేశాలు కల్పించే పరిస్థితులే అధికంగా కనిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ ఒంగోలు ట్రిపుల్ ఐటీ పూర్తి స్థాయిలో విద్యార్థులకు అందుబాటులోకి రానుంది. ఈ విషయమై విద్యార్థుల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. త్వరలో సొంత భవనాల నిర్మాణం.. ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి, విద్యాశాఖమంత్రి డాక్టర్ సురేష్‌లు ట్రిపుల్ ఐటీల బలోపేతానికి ప్రత్యేక చర్యలు చేపట్టారు. ప్రకాశం ట్రిపుల్ ఐటీకి స్థలం కూడా మంజూరు చేశారు. త్వరలో నిర్మాణాలు కూడా ప్రారంభించనున్నారు. ఈ క్రమంలో బోధన, బోధనేతర సిబ్బంది నియామకానికి కూడా నోటిఫికేషన్ వెలువరించనున్నారు. ఓ రకంగా ట్రిపుల్ ఐటీ ఈ ప్రాంత విద్యార్థులకు ఒక వరం. మన ప్రాంత విద్యావంతులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పుష్కలంగా లభించేందుకు ట్రిపుల్ ఐటీ తోడ్పాటుగా ఉంటుంది. మన ప్రాంత విద్యార్థులు ట్రిపుల్ ఐటీ విద్యను సద్వినియోగం చేసుకోవాలి. – డాక్టర్ సుధీర్ ప్రేమ్ కుమార్ డైరెక్టర్, ఒంగోలు ట్రిపుల్ ఐటీ -
మీ ప్రతిభను విన్నాం.. ఇప్పుడు స్వయంగా చూశాం
సాక్షి, కొత్తపేట: వైఎస్సార్ కడప జిల్లా ఇడుపులపాయ రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (ట్రిపుల్ ఐటీ) ప్రముఖ జాతీయ శిల్పి డి.రాజ్‌కుమార్ వుడయార్ శిల్పకళా ప్రతిభను ప్రశంసించింది. శిల్పి రాజ్‌కుమార్ తయారు చేసిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కాంస్య విగ్రహాన్ని ఈ నెల 8న ఆయన జయంతి సందర్భంగా ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ ప్రాంగణంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించిన విషయం తెలిసిందే. చాన్సలర్ కేసీ రెడ్డి శిల్పి రాజ్‌కుమార్‌ను సీఎం జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా ప్రత్యేకంగా సన్మానించేందుకు ఆ కార్యక్రమానికి ఆహ్వానించారు. అయితే కరోనా వైరస్ ఉద్ధృతి నేపథ్యంలో శిల్పి ఆ కార్యక్రమానికి హాజరుకాలేదు. దానితో ట్రిపుల్ ఐటీ తరఫున చాన్సలర్ డాక్టర్ కేసీ రెడ్డి శిల్పి రాజ్‌కుమార్ ప్రతిభను ప్రత్యేకంగా ప్రశంసిస్తూ లేఖ పంపారు. చిరునవ్వుతో జీవకళ ఉట్టిపడేలా విగ్రహాన్ని రూపొందించారని, మీరు ఎన్నో వైఎస్ విగ్రహాలు తయారుచేసి ఉండవచ్చు గానీ మీరు ఇచ్చిన విగ్రహం మా ట్రిపుల్ ఐటీకి మరింత శోభను తెచ్చిందని పేర్కొన్నారు. శిల్ప కళలో మీ ప్రతిభను విన్నాం.. ఈ విగ్రహం ద్వారా స్వయంగా చూశాం.. మీ ప్రతిభ ఎంతో ప్రశంసనీయం.. మీకు ఇంకా ఎంతో గొప్ప భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాం.. అని ఆ లేఖలో పేర్కొన్నారు. -
మరో 5 ఐఐఐటీలకు జాతీయ ప్రాధాన్య హోదా
న్యూఢిల్లీ: జాతీయ ప్రాధాన్య సంస్థ (ఇన్స్టిట్యూషన్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్) హోదాను మరో ఐదు ఐఐఐటీలకు కల్పిస్తూ పార్లమెంటులో ప్రవేశపెట్టిన బిల్లును లోక్‌సభ ఆమోదించింది. ఐదు ఐఐఐటీలను పీపీపీ (పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్) చట్టం–2017 కిందకు తీసుకొచ్చే ఉద్దేశంతో ఇండి యన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ) చట్టం (సవరణ) బిల్లు–2020ను తీసు కొచ్చారు. ఇప్పటికే ఈ జాబితాలో 15 ఐఐఐటీలు ఉన్నాయి. సూరత్, భోపాల్, భాగల్పూర్, అగర్తలా, రాయ్‌చూర్‌లతో ఉన్న ఐఐఐటీలకు తాజాగా జాతీయ ప్రాధాన్య హోదా ఇచ్చారు. దీంతో ఈ సంస్థల్లో బీటెక్, ఎంటెక్, పీహెచ్డీ డిగ్రీలను అందించే వెసులుబాటు కలుగుతుంది. ఐటీ రంగంలో నూతన పరిశోధనలు చేసేందుకు అవసరమైన విద్యార్థులు చేరే అవకాశం ఉంటుంది. ఇలాంటి విద్యాసంస్థల్లో 100 శాతం ప్లేస్మెంట్లు కల్పించిన రికార్డు ఉందని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రి రమేశ్ పోక్రియాల్ లోక్‌సభలో పేర్కొన్నారు. విద్యా వ్యవస్థలో నాణ్యత పెరుగుతోందని, దేశం పరిశోధనలు, అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని చెప్పారు. -
భాష ఏదైనా నో ప్రాబ్లం!
సాక్షి, సిటీబ్యూరో: మీరు ఆంగ్లభాషలోని ఓ వీడియో క్లిప్పింగ్ వీక్షిస్తున్నారనుకోండి. ఆ క్లిప్‌లో మాట్లాడుతున్న వ్యక్తి భాష, లిప్‌మూమెంట్ అర్థంకాక తల పట్టుకుంటున్నారా?.. ఇకపై ఆ అవస్థలు తీరనున్నాయి. భాష ఏదైనా, ఆ మాట్లాడే వ్యక్తి భావాన్ని యథాతథంగా తెలుగు ఆడియో క్లిప్ ద్వారా మీకందించే సరికొత్త టూల్‌ను ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ– హైదరాబాద్ (ఐఐఐటీ–హెచ్) రూపొందించింది. మిషన్ లెర్నింగ్ సాంకేతికతలో ఇదో సరికొత్త ఆవిష్కరణ అని ఐఐఐటీ వర్గాలు చెబుతున్నాయి. వీడియో క్లిప్‌ను ఒక భాష నుంచి మరో భాషలోకి తేలికగా అనువదించేందుకు ఈ టూల్ అద్భుతంగా పనిచేస్తుందని ఐఐఐటీ–హెచ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగం డీన్ సీవీ జవహర్ తెలిపారు. లిప్‌గాన్ మాడ్యూల్ డీన్ జవహర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇంగ్లిష్ భాష నుంచి పలు భారతీయ భాషల్లోకి వివిధ రకాలైన వీడియో క్లిప్‌లను ఈ టూల్ ద్వారా తర్జుమా చేసుకోవచ్చు. డబ్బింగ్ సినిమాలు, యానిమేషన్, మీడియా రంగాలకు ఈ టూల్ ఉపయుక్తంగా ఉంటుంది. పెదాల కదలికల ఆధారంగా జరిగే సంభాషణ కూడా ఎలాంటి పొరపాట్లు లేకుండా, లిప్ సింక్రనైజేషన్ మిస్ కాకుండా తర్జుమా చేసుకోవచ్చు. టెక్నాలజీ పరిభాషలో ఈ ఆవిష్కరణను ‘లిప్‌గాన్ మాడ్యూల్’అంటారు. తర్జుమా అయ్యే భాషకనుగుణంగా ఈ మాడ్యూల్ వీడియో క్లిప్‌లోని వ్యక్తి లిప్ మూమెంట్‌ను సరిచేస్తుంది. కొన్నిసార్లు డబ్బింగ్ సినిమాల్లో లిప్ మూమెంట్ సరిగ్గా లేక వీడియో క్లిప్ నాణ్యత అంతగా ఉండదు. లిప్‌గాన్ మాడ్యూల్తో అటువంటి అవస్థలుండవు. దీని ద్వారా గంటల నిడివి ఉన్న వీడియోలను సైతం సులభంగా భారతీయ భాషల్లోకి తర్జుమా చేసుకోవచ్చు. ఈ మెషీన్ టూల్‌పై ‘టువార్డ్స్ ఆటోమేటిక్ ఫేస్ టు ఫేస్ ట్రాన్స్లేషన్’పేరుతో పరిశోధన పత్రాన్ని సిద్ధం చేశారు. ఇటీవల ఫ్రాన్స్‌లో జరిగిన అంతర్జాతీయ మల్టీమీడియా సదస్సులోనూ దీన్ని సమర్పించారు. మరిన్ని పరిశోధనలు, ప్రయోగ పరీక్షల అనంతరం ఈ మిషన్ లెర్నింగ్ సాంకేతికతను ఆయా రంగాలు వినియోగించుకునేలా తీర్చిదిద్దుతారు. -
ఆయన సేవలు మాకొద్దు
సాక్షి, వేంపల్లె(కడప) : ఇడుపులపాయ ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీలో పనిచేస్తున్న సెక్యూరిటీ ఆఫీసర్ అర్జున్ నాయక్ సేవలు మాకొద్దంటూ ఆర్జీయూకేటీ చాన్స్‌లర్ కె.చెంచురెడ్డి, ట్రిపుల్ ఐటీ పరిపాలనా అధికారి మోహన్‌కృష్ణ చౌదరిలు పేర్కొన్నారు. బుధవారం ఆయన తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ట్రిపుల్ ఐటీలో అర్జున్ నాయక్ (సీఐ) మహిళా సెక్యూరిటీ గార్డులను లైంగికంగా వేధిస్తున్నారని ఫిర్యాదు అందాయన్నారు. గత రెండేళ్లుగా సెక్యూరిటీ ఆఫీసర్‌గా సీఐ కేడర్‌లో ఆయన విధులు నిర్వహిస్తున్నారన్నారు. అయితే ఇక్కడి అధికారులకు తెలియకుండానే బయోమెట్రిక్ యంత్రాలు ఒక్కరోజు రాత్రి ట్రిపుల్ ఐటీలోని తన గెస్ట్‌హౌస్‌కు షిప్టు చేశారని తెలిసింది. ఈ విషయం సెక్యూరిటీ ద్వారా తమ దృష్టికి వచ్చిందన్నారు. అంతేకాకుండా మహిళా సెక్యూరిటీ గార్డులపట్ల ఆయన అసభ్యకరంగా మాట్లాడుతున్నారని గత కొద్దిరోజుల నుంచి ఆరోపణలు రావడంతో బాధితులను పిలిపించి మాట్లాడామన్నారు. రెండు నెలల నుంచి ఆయన ఆరాచకాలు భరించలేకపోతున్నామని చెబితే తమ ఉద్యోగాలు ఎక్కడపోతాయోనని బాధితులు అధికారుల ముందు కన్నీరుమున్నీరు పెట్టుకున్నారు. దీంతో క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టిన అనంతరం అర్జున్ నాయక్ ఆరోపణలు నిజమేనని నిర్ధారణ కావదతడంతో విధుల నుంచి తొలగించినట్లు వారు తెలిపారు. అలాగే జిల్లా ఎస్పీ అన్బురాజన్‌కు ట్రిపుల్ ఐటీ అధికారులు లేఖ పంపనున్నట్లు వారు తెలిపారు. -
అమరావతికి అన్నీ ప్రతికూలతలే
సాక్షి, అమరావతి: రాజధానిగా అమరావతి ప్రాంతం ఏమాత్రం అనుకూలం కాదని అంతర్జాతీయంగా పేరొందిన ప్రముఖ సాంకేతిక సంస్థలు ఐఐటీ–చెన్నై, యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ యాంగ్లీయా–మాట్ మెక్ డొనాల్డ్–సీఈఈడబ్ల్యూ, ఎన్డీఎంఏ–ఐఐఐటీ (హైదరాబాద్) నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. అమరావతిలో 71 శాతం ప్రాంతానికి వరద ముప్పు ఉందని ఐఐటీ–చెన్నై స్పష్టం చేసింది. ఆ ప్రాంత వాతావరణంలో సమతుల్యత దెబ్బతిని అగ్నిగుండంగా మారుతుందని యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ యాంగ్లీయా–మాట్ మెక్ డొనాల్డ్–సీఈఈడబ్ల్యూ వెల్లడించింది. సెస్మిక్ జోన్–3 పరిధిలో ఉన్న ఈ ప్రాంతం భారీ భవనాల నిర్మాణానికి ఏమాత్రం అనువైనది కాదని ఎన్డీఎంఏ–ఐఐఐటీ (హైదరాబాద్) నివేదిక తేల్చి చెప్పింది. నివేదికల్లో ఆ సంస్థలు ఏం చెప్పాయంటే.. వరదొస్తే ముప్పే : ఐఐటీ–చెన్నై రాజధాని అమరావతి నిర్మాణం చేపట్టిన 29 గ్రామాల్లో కనీసం 71 శాతం గ్రామాలపై కృష్ణా నది వరదలు తీవ్ర ప్రభావం చూపుతాయని ఐఐటీ (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ)–చెన్నై తేల్చిచెప్పింది. కృష్ణా నదిలో వరద ప్రవాహం ఆరు, ఏడు లక్షల క్యూసెక్కులకు దాటితే రాజధాని గ్రామాల్లోకి వరద నీరు చేరి, 71 శాతం ప్రాంతాలను ముంచెత్తుతుందని వెల్లడించింది. కృష్ణా నది, కొండవీటి వాగులకు ఒకేసారి వరద వస్తే రాజధాని గ్రామాల్లో 0.5 నుంచి 1 మీటరు ఎత్తున నీరు ముంచెత్తుతుందని స్పష్టం చేసింది. ముంపు బారినుంచి రక్షించడానికి రాజధాని ప్రాంతంలోని భూములను 3 నుంచి 4 మీటర్ల ఎత్తున మట్టిపోసి అభివృద్ధి చేయాలని సీఆర్డీఏ (రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ) రూపొందించిన మాస్టర్ ప్లాన్‌లో పేర్కొనడాన్ని ఎత్తిచూపింది. నల్లరేగడి భూములు కావడం, రెండున్నర నుంచి 5 మీటర్ల లోతులో భూగర్భ జలాలు లభ్యం కావడం వల్ల రాజధాని గ్రామాల్లో భవన, రహదారుల నిర్మాణాల వ్యయం అధికమవుతుందని స్పష్టం చేసింది. ప్రభుత్వ భవనాల సముదాయం, స్పోర్ట్స్ కాంప్లెక్స్, ఫైనాన్స్ సిటీ, టూరిజం సిటీ పనులు చేపట్టిన ప్రాంతాలపై వరదల ప్రభావం ఎక్కువగా ఉంటుందని స్పష్టం చేసింది. ఈ భూముల్లో భవనాలను నిర్మించడానికి రాఫ్ట్ ఫౌండేషన్ (పునాదులు తవ్వి.. రెండు వైపులా ఇనుప రేకులు దించి.. కాంక్రీట్ వేయడం)కు పనికి రాదని స్పష్టం చేసింది. రాజధాని భూముల్లో 40 మీటర్ల లోతుకు తవ్వితేగానీ రాతి పొర తగలదని, ఈ ప్రాంతంలో భవనాలు నిర్మించాలంటే.. పైల్ ఫౌండేషన్ (రిగ్‌ల ద్వారా 40 మీటర్ల లోతుకు పిల్లర్లను దించి.. అక్కడి నుంచి కాంక్రీట్ వేయడం) అవసరమని తేల్చింది. పైల్ పౌండేషన్ విధానంలో పునాదుల నిర్మాణానికి భారీ వ్యయం అవుతుందని.. ఇది భవన నిర్మాణ వ్యయాన్ని రెట్టింపు చేస్తుందని స్పష్టం చేసింది. రాజధాని నిర్మాణానికి ఆ ప్రాంతం ఏమాత్రం అనుకూలం కాదని విస్పష్టంగా తేల్చి చెప్పింది. ఆ ప్రాంతం అగ్నిగుండమే : సీఈఈడబ్ల్యూ బహుళ పంటలు పండే భూముల్లో 217 చదరపు కిలోమీటర్ల పరిధిలో రాజధాని నిర్మాణం వల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందని యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ యాంగ్లీయా–మాట్ మెక్ డొనాల్డ్–కౌన్సిల్ ఆన్ ఎనర్జీ, ఎన్విరాన్మెంట్ అండర్ వాటర్ (సీఈఈడబ్ల్యూ) తేల్చిచెప్పింది. ప్రస్తుతం రాజధాని ప్రాంతంలో 1.20 లక్షల జనాభా ఉంది. సీఆర్డీఏ మాస్టర్ ప్లాన్ ప్రకారం.. 2050 నాటికి రాజధాని ప్రాంతంలో జనాభా 3.58 మిలియన్లకు చేరుకుంటుంది. పెరిగే జనాభా మేరకు నివాసం ఉండటానికి గృహాలు, రహదారులు, రైలు మార్గాలు నిర్మించాలి. గృహాల నిర్మాణంలో వినియోగించే స్టీలు, సిమెంటు, రహదారుల నిర్మాణంలో ఉపయోగించే బిటుమినస్ (బీటీ), ప్రజలు వినియోగించే ఏసీ (ఎయిర్ కండిషనర్ల)ల వల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందని విశ్లేషించింది. పర్యవసానంగా 2050 నాటికి ఉష్ణోగ్రత 3.7 డిగ్రీల మేర పెరుగుతుందని స్పష్టం చేసింది. 2030 నాటికి 1.7 డిగ్రీల ఉష్ణోగ్రత పెరుగుతుందని తేల్చిచెప్పింది. ప్రస్తుతం రాజధాని ప్రాంతంలో సాధారణంగా 30–42 డిగ్రీల మధ్య ఉష్ణోత్రలు నమోదవుతున్నాయి. మే 10, 2002న గరిష్టంగా 48.8 డిగ్రీలు, ఫిబ్రవరి 4, 2017న కనిష్టంగా 12.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వీటిని పరిగణనలోకి తీసుకుంటే.. రాజధాని ప్రాంతంలో 2050 నాటికి ఉష్ణోగ్రతలు 50 డిగ్రీలను దాటే అవకాశం ఉంటుందని స్పష్టీకరించింది. ప్రస్తుతం రాజధాని ప్రాంతంలో ఉష్ణ తీవ్రత అధికంగా ఉండే రోజులు 15. రాజధాని ప్రాంతంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవడం వల్ల ఉష్ణ తీవ్రత అధికంగా ఉండే రోజులు 52కు పెరగుతాయని.. అంటే అమరావతి అగ్నిగుండమవుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. అధిక ఉష్ణోగ్రతల వల్ల అకాల వర్షాలు, కుండపోత వానలు పడటం వల్ల కొండవీటి వాగు, కృష్ణా నది ఉప్పొంగి రాజధాని ప్రాంతాన్ని వరదలతో ముంచెత్తుతాయని తేల్చింది. ప్రపంచ వ్యాప్తంగా సాధారణ ఉష్ణోగ్రతల కంటే కేవలం 0.5 డిగ్రీలు పెరగడంతో 2018లో జన జీవనంపై తీవ్ర ప్రభావం చూపింది. పంటల దిగుబడులను తీవ్రంగా దెబ్బతీసింది. రాజధాని ప్రాంతంలో ఉష్ణోగ్రత 3.7 డిగ్రీలు పెరిగితే జన జీవనం తీవ్రంగా దెబ్బతింటుందని పర్యావరణ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఉష్ణ తీవ్రత ఉండే రోజులు 52కు పెరిగితే వడగాల్పుల వల్ల ప్రజలు పిట్టల్లా రాలిపోతారని ఆందోళన వ్యక్తం చేసింది. ఆకాశ హార్మ్యాలకు అనుకూలం కాదు : ఎన్డీఎంఏ–ఐఐఐటీ విజయవాడ చుట్టూ 150 చదరపు కిలోమీటర్ల పరిధిలో భూమి అడుగున నియో టెక్టానిక్ పొరల్లో 26 చోట్ల లోపభూయిష్టంగా (ఫాల్ట్ జోన్స్) ఉండటం.. ఈ పొరలలో కంపనాల తీవ్రత 9–10 హెర్డ్›్జలు ఉండటం వల్ల భూకంపాల ప్రభావం అత్యధికంగా ఉంటుందని ఎన్డీఎంఏ (నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ), ఐఐఐటీ (ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) హైదరాబాద్ తేల్చింది. రాజధాని ప్రాంతం 50 అంతస్తుల భవనాల నిర్మాణానికి ఏమాత్రం అనుకూలం కాదని ఆ సంస్థల ఉమ్మడి అధ్యయన నివేదిక స్పష్టం చేస్తోంది. సెస్మిక్ జోన్ (భూకంప ప్రభావిత ప్రాంతం) 3లో విజయవాడ ఉండటం వల్ల భూకంపాలు వస్తే ఆకాశహార్మ్యాల వల్ల ప్రాణనష్టం భారీగా ఉంటుందని హెచ్చరించింది. విజయవాడ పరిసర ప్రాంతాల్లో 1861 నుంచి ఇప్పటివరకూ అందుబాటులో ఉన్న రికార్డుల ఆధారంగా చూస్తే సుమారు 170 సార్లు భూకంపాలు, ప్రకంపనలు సంభవించాయి. వీటి తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 3.7 నుంచి 6 మ్యాగ్నిట్యూడ్‌ల వరకూ నమోదైంది. భూకంపం సంభవించినప్పుడు రిక్టర్ స్కేల్‌పై 6 మ్యాగ్నిట్యూడ్‌లకు మించి తీవ్రత నమోదైతే.. విజయవాడ పరిసర ప్రాంతాల్లో నిర్మించిన బహుళ అంతస్తుల్లో 80 శాతం కూలిపోయే ప్రమాదం ఉందని స్పష్టం చేసింది. -
అందుకు అమరావతి అనువైన ప్రాంతం కాదు
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి ప్రాంతం భారీ ఆకాశహార్మ్యాల నిర్మాణానికి ఏమాత్రం అనువైన ప్రాంతం కాదా? ఇళ్ల నిర్మాణంలో జాగ్రత్తలు తీసుకోకపోతే పెను ప్రమాదం తప్పదా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానం చెబుతోంది నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ(ఎన్డీఎంఏ), ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐఐఐటీ)–హైదరాబాద్ అధ్యయన నివేదిక. విజయవాడ చుట్టూ 150 చదరపు కిలోమీటర్ల పరిధిలో భూమి అడుగున నియో టెక్టానిక్ పొరల్లో 26 చోట్ల లోపభూయిష్టంగా(ఫాల్ట్ జోన్స్) ఉండటం.. ఈ పొరల్లో కంపనాల తీవ్రత 9–10 హెర్జ్‌లు ఉంటుందని తేల్చింది. అందుకే అమరావతి ప్రాంతంలో 50 అంతస్థుల ఆకాశహార్మ్యాల నిర్మాణం చేపట్టడం శ్రేయస్కరం కాదని స్పష్టం చేసింది. దేశంలో 50 నగరాల్లో ప్రస్తుత పరిస్థితి, విపత్తులను అధిగమించడానికి చేపట్టాల్సిన చర్యలపై ఎన్డీఎంఏ– ఐఐఐటీ(హైదరాబాద్) సంయుక్తంగా అధ్యయనం చేశాయి. అధ్యయనంలో వెల్లడైన అంశాలు కృష్ణా నది ఒడ్డున ఉన్న సముద్ర మట్టానికి 39 అడుగుల ఎత్తులో విజయవాడ నగరం ఉంది. విజయవాడ చుట్టూ 150 చదరపు కిలోమీటర్ల పరిధిలో భూమి అడుగున లోపభూయిష్టమైన నియో టెక్టానిక్ ప్లేట్లు విస్తరించి ఉన్నాయి. ఆ ప్రాంతం తేలికపాటి నేల స్వభావం కలిగి ఉంది. గుణదల, మంగళగిరి, మందడం, నిడమర్రు, తాడేపల్లి, నున్న ప్రాంతాల్లో భూగర్భం అడుగున పొరల్లో ఫాల్ట్ జోన్స్ ఉండటం అత్యంత ప్రమాదకరం. భూగర్భంలో నియో టెక్టానిక్ ప్లేట్స్ కంపనాల తీవ్రత 9–10 హెర్జ్లుగా ఉంది. ఈ ప్రాంతాల్లో జీ+1 విధానంలో భవనాలు నిర్మించడం శ్రేయస్కరం కాదు. అమరావతి ప్రాంతంలో ఆకాశహార్మ్యాల నిర్మాణాలు నిలువరించాలి. బోర్ల తవ్వకాలను నియంత్రించాలి. భవనాల నిర్మాణంపై స్థానిక సంస్థలు, బిల్డర్లకు అవగాహన కల్పించాలి. డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రణాళికను కార్యాచరణలోకి తీసుకురావాలి. -
కాగితం ముక్క కూడా అనుమతించం!
సాక్షి, హైదరాబాద్: ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీల్లో ప్రవేశాల కోసం ఈనెల 6వ తేదీ నుంచి 11వ తేదీ వరకు జేఈఈ మెయిన్ పరీక్షలను ఆన్లైన్లో నిర్వహించేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇటీవల మార్పు చేసిన ప్రశ్నపత్రాలతో మొదటిసారిగా ఈ పరీక్షలను నిర్వహించబోతోంది. ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు పర్సు, పెన్ను, పెన్సిళ్లే కాదు.. కనీసం కాగితం ముక్క కూడా వెంట తీసుకురావద్దని ఎన్టీఏ స్పష్టం చేసింది. ఎలక్ట్రానిక్ పరికరాలు, జామెట్రీ పరికరాలు, మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలేవీ వెంట తీసుకురావద్దని వెల్లడించింది.విద్యార్థులకు కావాల్సిన పెన్ను/పెన్సిల్, రఫ్ పేపరు పరీక్ష కేంద్రాల్లోనే అందజేస్తారు. విద్యార్థులు నిర్ణీత సమయంకంటే ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని, రిపోర్టింగ్ సమయం తరువాత గేట్ మూసివేశాక ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించేది ఉండదని వెల్లడించింది. ఈ పరీక్షలకు రాష్ట్రం నుంచి దాదాపు 75 వేల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. వారికోసం తెలంగాణలోని హైదరాబాద్, సికింద్రాబాద్, రంగారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నల్లగొండ, వరంగల్ జిల్లా కేంద్రాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసింది. విద్యార్థుల హాల్టికెట్లలో పేర్కొన్న గుర్తింపు కార్డుల్లో (ఆధార్, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్టు, ఫొటో కలిగిన ఇంటర్ పరీక్షల హాల్ టికెట్ తదితర) ఏదేని ఒక ఒరిజినల్ ఐడీ కార్డును, హాల్‌టికెట్‌ను తెచ్చుకోవాలి. అరగంట ముందే చేరుకోవాలి సోమవారం నుంచి 11వ తేదీ వరకు కంప్యూటర్ ఆధారితంగా పరీక్ష నిర్వహించనుంది. ప్రతి రోజూ ఉదయం, మధ్యాహ్నం 2 షిఫ్ట్‌లుగా పరీక్షలు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తోంది. మొదటి షిఫ్ట్ పరీక్ష ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు, రెండో షిఫ్ట్ పరీక్ష మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయం త్రం 5:30 గంటల వరకు ఉంటుం ది. మొదటి షిఫ్ట్ పరీక్షకు ఉదయం 7:30 గంటల నుంచి 9 గంటలలోపు, రెండో షిఫ్ట్ పరీక్షకు మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గం టలలోపే పరీక్ష హాల్లోకి అనుమతిస్తా రు.ఈ పరీక్షల ఫలితాలను ఈనెల 31వ తేదీలోగా వెల్లడించనుంది. 75 ప్రశ్నలు.. 300 మార్కులు ఇప్పటివరకు జేఈఈ మెయిన్‌లో 360 మార్కులకు 90 ప్రశ్నలు ఇచ్చేది. అవన్నీ ఆబ్జెక్టివ్ ప్రశ్నలే. వాటికి నెగటివ్ మార్కుల విధానం ఉంది. ఇప్పుడు మాత్రం 75 ప్రశ్నలతో 300 మార్కులకు పరీక్ష నిర్వహించబోతోంది. గణితంలో 25, ఫిజిక్స్‌లో 25, కెమిస్ట్రీలో 25 ప్రశ్నలు ఉంటాయి. ఆ మూడు సబ్జెక్టుల్లో 20 చొప్పున ప్రశ్నలకు ఆబ్జెక్టివ్ విధానంలో, 5 చొప్పున ప్రశ్నలను న్యూమరికల్ వ్యాల్యూ జవాబు వచ్చే ప్రశ్నలు ఇవ్వనుంది. న్యూమరికల్ వ్యాల్యూ ప్రశ్నలకు మాత్రం నెగటివ్ మార్కుల విధానం ఉండదు. అయితే ఈసారి విద్యార్థుల స్కోరింగ్‌లో న్యూమరికల్ వ్యాల్యూ ప్రశ్నలు కీలకం కానున్నాయి. -
జనవరి 6 నుంచి ఒక్కొక్కటిగా సెట్ పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: జనవరి 6 నుంచి ఒక్కొక్కటిగా పరీక్షలు ప్రారంభం కానున్నాయి. వచ్చే విద్యా సంవత్సరంలో (2020–21) వివిధ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షల (సెట్స్) తేదీలను జాతీయ సంస్థలు ఇప్పటికే ప్రకటించగా వివిధ రాష్ట్రాల విద్యా శాఖలు తేదీలను ఖరారు చేస్తున్నాయి. వాటిల్లో ఇప్పటికే కేరళ, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాలు ప్రవేశ పరీక్షల తేదీలను ఖరారు చేసి ప్రకటించాయి. జనవరి 6 నుంచి 11 వరకు దేశవ్యాప్తంగా ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు జేఈఈ మెయిన్ (మొదటి విడత) పరీక్షలు నిర్వహించేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) చర్యలు చేపట్టింది. అలాగే జాతీయ స్థాయి మేనేజ్మెంట్ విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం కామన్ మేనేజ్మెంట్ అడ్మిషన్ టెస్టు (సీమ్యాట్)ను జనవరి 28న నిర్వహించేందుకు ఏఐసీటీఈ చర్యలు చేపట్టింది. అదేరోజు జాతీయ స్థాయి ఫార్మసీ విద్యాసంస్థల్లో ఎంఫార్మసీ ప్రవేశాల కోసం జీప్యాట్ నిర్వహించేందుకు ఎన్టీఏ ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు జేఈఈ మెయిన్ రెండో విడత పరీక్షలను ఏప్రిల్ 3 నుంచి 9 వరకు ఆన్లైన్లో నిర్వహించేందుకు ఎన్టీఏ చర్యలు చేపట్టింది. వీటితోపాటు ఇతర రాష్ట్రాల్లో ప్రముఖ ప్రైవేటు విద్యా సంస్థలు కూడా ప్రవేశాలకు ఎంట్రన్స్ టెస్టుల నిర్వహణకు షెడ్యూలు జారీ చేశాయి. -
సోషల్ చెత్తకు చెక్
సాక్షి,హైదరాబాద్: సామాజిక మాధ్యమాల్లో అవాంఛనీయ సమాచారానికి చెక్ పెట్టేందుకు నగరంలోని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బృందం వినూత్న టూల్‌ను రూపొందించింది. ‘నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్’ పేరిట రూపొందించిన ఈ టూల్ అనవసర సమాచారాన్ని కట్టడి చేయడంతో పాటు అలాంటి సమాచారం వచ్చినప్పుడు అలర్ట్‌ను సైతం ఇస్తుంది. కౌమార దశలో ఉన్నవారు అవాంఛిత ఫొటోలు, సమాచారాన్ని చూసినప్పుడు వారిలో భావోద్వేగాలు విపరీత ప్రవర్తనకు దారితీస్తుంటాయి. ఈ అవాంఛనీయ సమాచారాన్ని కట్టడి చేసేందుకు ఈ టూల్‌ను రూపొందించింది. టూల్ పనిచేస్తుందిలా.. ఎన్ఎల్పీ టూల్‌ను పిల్లలు తరచూ వాడే మొబైల్ లేదా సిస్టమ్‌లో ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. ఈ టూల్ మొదట ఇన్‌స్ట్రాగామ్‌లో వచ్చే అవాంఛిత ఫొటోలు, సెక్స్ సంబంధిత దృశ్యాలు, జాతి విద్రోహ చర్యలు, ఇతర బావోద్వేగాలను రెచ్చగొట్టే ఫోటోలు, సమాచారాన్ని ఫిల్టర్ చేస్తుంది. వీటి నుంచి అవసరమైన సమాచారాన్ని మాత్రమే అందిస్తుందని ఈ టూల్ రూపొందించిన బృందంలోని సభ్యుడు వాసుదేవవర్మ ‘సాక్షి’కి తెలిపారు. వాంఛనీయం కాని సమాచారం వచ్చినప్పుడు ఆయా లింక్‌లు, ఫొటోలను ఓపెన్ చేయరాదన్న అలర్ట్‌ను ఇస్తుందని చెప్పారు. పాజిటివ్ సమాచారానికి సంబంధించిన అలర్ట్‌లు సైతం యూజర్లకు అందిస్తుందని తెలిపారు. ఇటీవలి కాలంలో కౌమార దశలో ఉన్న బాలబాలికల్లో సోషల్ మీడియా వినియోగం అనూహ్యంగా పెరిగిందని.. వీరిలో బావోద్వేగాలు అదుపులో ఉండని కారణంగా సుమారు 30 నుంచి 35 శాతం మందిలో విపరీత ప్రవర్తనలు, చెడు దారిపట్టడం, డిప్రెషన్‌కు గురవడం వంటి విపరిణామాలు సంభవిస్తున్నట్లు తాజా అధ్యయనాల్లో వెల్లడైందని చెప్పారు. త్వరలో మిగతా మాధ్యమాలకు.. ప్రయోగాత్మకంగా రూపొందించిన ఈ టూల్‌ను తొలుత ఇన్‌స్ట్రాగామ్‌కు మాత్రమే పరిమితం చేశామని.. ఇది సత్ఫలితాలను ఇస్తోందని వాసుదేవవర్మ తెలిపారు. కొన్ని రోజుల పాటు దీనిని పరిశీలించిన తర్వాత ట్విట్టర్, ఫేస్బుక్, స్నాప్‌చాట్ తదితర సామాజిక మాధ్యమాల్లోనూ వినియోగించే అంశంపై దృష్టిసారించామని చెప్పారు. దీనికి అనుగుణంగా ఈ టూల్లో మార్పుచేర్పులు చేస్తామని వెల్లడించారు. -
ట్రిపుల్ ఐటీ తరగతులు ప్రారంభానికి సిద్ధం
సాక్షి, ఒంగోలు: జిల్లాకు చెందిన ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు శుభవార్త. నాలుగో బ్యాచ్‌కు చెందిన జిల్లా విద్యార్థులు ఒంగోలులోనే ఉండి చదువుకునే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. ప్రతిష్టాత్మకమైన ట్రిపుల్ ఐటీ తరగతులు ఒంగోలులో ప్రారంభం కానుండటంతో వాటికి సంబంధించి ప్రాంగణాన్ని, భవనాలను అధికారులు ముస్తాబు చేస్తున్నారు. ట్రిపుల్ ఐటీ కాలేజీలోకి అడుగుపెట్టిన ప్రతి ఒక్కరికీ దాని ప్రత్యేకత తెలిసే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. 2016–2017 విద్యా సంవత్సరంలో ఒంగోలుకు ట్రిపుల్ ఐటీ కాలేజీ మంజూరైంది. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ట్రిపుల్ ఐటీగా దానికి పేరు పెట్టారు. ఒంగోలుకు ట్రిపుల్ ఐటీ కాలేజీ మంజూరైనప్పటికీ అందుకు సంబంధించిన కాలేజీ భవనాలు, ఇతర సౌకర్యాలు ఇక్కడ లేకపోవడంతో దానిని ఇడుపులపాడుకు తరలించారు. జిల్లాకు చెందిన మూడు బ్యాచ్‌ల విద్యార్థులు ఇడుపులపాడులోనే ట్రిపుల్ ఐటీ చదువుకుంటూ ఉన్నారు. 2019–2020 విద్యా సంవత్సరానికి సంబంధించి జిల్లా నుంచి నాలుగో బ్యాచ్ విద్యార్థులు సిద్ధంగా ఉన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే పాఠశాల విద్యతోపాటు ఉన్నత విద్యపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఒంగోలులోనే ట్రిపుల్ ఐటీ తరగతులు నిర్వహించాలంటూ ఆ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. దీంతో ఒంగోలులోని ట్రిపుల్ ఐటీ కాలేజీ ప్రతిపాదిత ప్రాంతమైన రావ్ అండ్ నాయుడు ఇంజనీరింగ్ కాలేజీ భవనాలను సిద్ధం చేశారు. కొంతకాలంగా ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ వెంకట్రావు ఒంగోలులోనే మకాం వేసి కాలేజీకి సరిపడే సౌకర్యాలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయడంలో నిమగ్నమయ్యారు. ముహూర్తం ఖరారు.. ఒంగోలు శివారులోని రావ్ అండ్ నాయుడు ఇంజనీరింగ్ కాలేజీలో నూతనంగా ఏర్పాటు చేయనున్న ట్రిపుల్ ఐటీ కాలేజీ ప్రస్తుత విద్యా సంవత్సరం మొదటి బ్యాచ్ తరగతులను ఈనెల 30వ తేదీ ఉదయం 7 గంటల నుంచి 9 గంటల్లోపు ప్రారంభించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. రాజీవ్‌గాందీ యూనివర్శిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ ఛాన్సలర్ కేసీ రెడ్డి తరగతుల ప్రారంభ కార్యక్రమానికి హాజరుకానున్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి ఒంగోలులోనే ట్రిపుల్ ఐటీ తరగతులు ప్రారంభం కానుండటంతో విద్యార్థులు, తల్లిదండ్రులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ బిడ్డలు తమకు అందుబాటులోనే ఉన్నత విద్యను అభ్యసించనున్నారన్న ఆనం దం ఆ తల్లిదండ్రుల నుంచి వ్యక్తం అవుతోంది. -
ట్రిపుల్ ఐటీలను మరింత అభివృద్ధి చేస్తాం
-
యావత్ దేశం మీవైపు చూసేలా చేస్తా: సీఎం జగన్
సాక్షి, శ్రీకాకుళం: రాష్ట్రంలోని ట్రిపుల్ ఐటీలను మరింత అభివృద్ధి పరిచి.. యావత్ దేశం ఆంధ్రప్రదేశ్ వైపు చూసే విధంగా మార్పులు తీసుకువస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. వందరోజుల పాలనను పురస్కరించుకుని వైఎస్ జగన్ శుక్రవారం శ్రీకాకుళం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా జిల్లాలోని ఎస్‌ఎమ్‌పురం ట్రిపుల్ ఐటీ కళాశాలలో తరగతి గదులను, హాస్టల్ బ్లాకులను ప్రారంభించారు. అనంతరం విద్యార్థులతో ముఖాముఖి సమావేశంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో ట్రిపుల్ ఐటీలు ఉద్యోగాల కల్పనకు కేంద్రంగా ఉండేవని, గత ప్రభుత్వాలు ట్రిపుల్ ఐటీలను పూర్తిగా నిర్వీర్యం చేశాయని విమర్శించారు. గడిచిన ఐదేళ్ల కాలంలో విద్యావ్యవస్థ తీవ్ర గడ్డు పరిస్థితిని ఎదుర్కొందని, విద్యాశాఖకు రావాల్సిన రూ.185 కోట్లను టీడీపీ ప్రభుత్వం పక్కదారి పట్టించిందని సీఎం మండిపడ్డారు. ట్రిపుల్ ఐటీలను అభివృద్ధి చేసే చిత్తశుద్ధి తమ ప్రభుత్వానికి ఉందని, దానిని మీకు స్పష్టం చేసేందుకే మీ ముందుకు వచ్చానని వైఎస్ జగన్ అన్నారు. ఇక్కడ పరిస్థితి, సమస్యల గురించి కళాశాల యాజమాన్యాన్ని అడిగి తెలుసుకున్నానని, వాటన్నింటినీ త్వరలోనే పరిష్కరిస్తానని సీఎం హామీ ఇచ్చారు. గ్రామీణ ప్రాంత పిల్లల్ని ఉన్నత ఉద్యోగులుగా తీర్చిదిద్దే ఉద్దేశంతో దివంగత వైఎస్సార్ గతంలో ఈ ప్రాంగణాన్ని నిర్మించారని సీఎం గుర్తుచేశారు. వేల మంది చదవాల్సిన ట్రిపుల్ ఐటీలో కేవలం 1500 మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారని, నూజివీడు ప్రాంగణంలో కూడా ఇదే పరిస్థితి ఉందని అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ముఖాముఖి సమావేశంలో వారు అడిగిన ప్రశ్నలకు సీఎం వైస్ జగన్ సమాధానాలు ఇచ్చారు. ఐటీ ఉద్యోగాల కల్పనలో ఏపీ ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకోబోతుంది?. ఈ ప్రశ్నకు సీఎం జగన్ సమాధానమిస్తూ.. 98శాతం ఐటీ ఉద్యోగాలు హైదరాబాద్ కేంద్రంగా సాగుతున్నాయి. రాష్ట్ర విభజనతో కేవలం రెండు శాతం మాత్రమే ఐటీ ఉద్యోగాలు ఏపీలో ఉన్నాయి. ఈ పరిస్థితితుల్లో మనం ఐటీని మరింత అభివృద్ధి చేయాల్సి ఉంది. విశాఖపట్నం కేంద్రంగా ఐటీని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దాని కొరకు ఇప్పటికే చర్యలను మొదలుపెట్టాం. ట్రిపుల్ ఐటీల నుంచే ఐటీ మేధావులను తీర్చిదిద్దాలి. అందుకే వాటిని మరింత అభివృద్ధి చేస్తాం. దేశమంతా ట్రిపుల్ ఐటీ విద్యార్థుల వైపు చూసే విధంగా తీర్చిదిద్దుతాం. వైఎస్సార్ స్కిల్ డెవల్ప్మెంట్ సెంటర్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి?. అక్కడ ఏవిధమైన ట్రైనింగ్‌ను ఇవ్వబోతున్నారు?. 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని ఇప్పటికే చట్టం చేశాం. ఏ పరిశ్రమ వచ్చినా మొదట ఉద్యోగాలు మనకే ఉంటాయి. ప్రతి లోక్‌సభ స్థానాన్ని ఓ యూనిట్‌గా గుర్తించి వాటిల్లో స్కిల్ డెవలెప్మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తాం. అక్కడి విద్యార్థుల సామర్థ్యాన్ని బట్టి వారికి ట్రైనింగ్ ఇస్తాం. పరిశ్రమల యాజమాన్యాలే వారికి కావాల్సిన ఉద్యోగులను ఎంపిక చేసుకుంటాయి. ఆ విధంగా వారే ట్రైనింగ్ ఇస్తారు. స్కిల్ డెవలెప్మెంట్ సెంటర్లను ఇంక్యుబేషన్ సెంటర్‌గా కూడా మారుస్తాం. ఇక్కడి నుంచి రాష్ట్రానికే కాకుండా దేశానికి కూడా ఐటీ సేవలను అందించే విధంగా ఆ సెంటర్లను తయారుచేస్తాం. గత ప్రభుత్వం చర్యల కారణంగా నిరుద్యోగం తీవ్ర స్థాయిలో పెరిగింది. ఉద్యోగాల కల్పనకు ఏపీ ప్రభుత్వం తీసుకోబోయే చర్యలు ఏమిటి? పాదయాత్రలో ఇచ్చిన మాటకు కట్టుబడి రెండు నెలల్లోనే 4 లక్షల ఉద్యోగాల నియామకానికి చర్యలు తీసుకున్నాం. గ్రామ వాలెంటీర్ల కింద రెండు లక్షలకు పైగా ఉద్యోగాలను ఇప్పటికే నియమించాం. రానున్న రోజుల్లో మరికొన్ని ఉద్యోగాలు రాబోతున్నాయి. మన పిల్లల మీద పూర్తిస్థాయి నమ్మకంతోనే 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే కల్పించే విధంగా అసెంబ్లీలో చట్టం తీసుకువచ్చాం. దేశ చరిత్రలోనే ఈ విధంగా చట్టం తీసుకురావడం తొలిసారి. ఇతర రాష్ట్రాల ఉద్యోగులతో మన విద్యార్థులు పోటీ పడాలి. ట్రిపుల్ ఐటీల ద్వారా అనేక ఉద్యోగాలను సృష్టించబోతున్నాం. ప్రతి జనవరిలో ఉద్యోగాల క్యాలెండర్‌ను విడుదల చేస్తాం. ఏడాదిలో ఏర్పడిన ఖాళీలను అదే ఏడాదిలో పూర్తి చేస్తాం. ప్రజా పథకాలను అమలు చేయాలనే ఆలోచన మీకు ఎలా వచ్చింది. మీకు స్ఫూర్తి ఎవరు?. గడిచిన ఐదేళ్లల్లో రాష్ట్రంలో రాష్ట్రమంతా తిరిగాను. పేదరికంను అతిదగ్గర నుంచి చూశాను. పాదయాత్ర చేసే రోజుల్లో అనేక సమస్యలు నా దృష్టికి వచ్చాయి. వాటిని చూసి చలించిపోయాను. పాదయాత్ర నుంచి వచ్చిన ఆలోచనలే ఈ ప్రజాపథకాలు. డబ్బులు లేవని ఏ పిల్లవాడు కూడా చదువు మానకూడదు. రాష్ట్రంలో నిరక్ష్యరాస్యులు 33శాతం ఉన్నారు. దానిని సున్నా శాతానికి తీసుకురావాలనేదే నా లక్ష్యం. నా స్ఫూర్తి అంతా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డినే. ఆయన బాటలోనే నడుస్తా. అంటూ సమాధానమిచ్చారు. -
టీడీపీ ప్రభుత్వం ట్రిపుల్ ఐటీలను నిర్వీర్యం చేసింది
సాక్షి, కృష్ణా : గత తెలుగు దేశం ప్రభుత్వం రాష్ట్రంలోని ట్రిపుల్ ఐటీలను నిర్వీర్యం చేసిందని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఆరోపించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రూ. 158 కోట్ల ట్రిపుల్ ఐటీ నిధులను చంద్రబాబు ప్రభుత్వం "పసుపు-కుంకుమ" పథకం కోసం ఖర్చుచేసిందని తెలిపారు. నిధులు తిరిగి వెనక్కి వచ్చేలాగా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. రాష్ట్రంలోని నాలుగు ట్రిపుల్ ఐటీలకు ప్రత్యేక నిధులు కేటాయించి పూర్తి స్థాయిలో మరింత ఆధునీకరిస్తామన్నారు. -
మూడేళ్లకు ముడి పడింది
సాక్షి, ఒంగోలు టౌన్: జిల్లాలోని ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చల్లటి వార్త చెప్పారు. 2019–2020 బ్యాచ్ విద్యార్థులకు ఒంగోలులోనే తరగతులు నిర్వహించాలని స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ఎప్పుడో మూడేళ్ల కిందటే కళాశాల మంజూరైనా ఎలాంటి మౌలిక వసతులు కల్పించకపోవడంతో వైఎస్సార్ కడప జిల్లాలోని ఇడుపులపాయకు వెళ్లి చదువుకోవాల్సి వచ్చేది. ప్రస్తుత ప్రభుత్వ నిర్ణయంతో విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సరిగ్గా మూడేళ్ల క్రితం ఒంగోలుకు ట్రిపుల్ ఐటీ కాలేజీ మంజూరైంది. దానికి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం పేరు పెట్టారు. ప్రతి ఏటా వెయ్యి మంది విద్యార్థులకు ఈ కాలేజీలో అడ్మిషన్లు ఇస్తున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకమైన ట్రిపుల్ ఐటీ కాలేజీ ఒంగోలుకు మంజూరైనప్పటికీ అప్పటి చంద్రబాబు ప్రభుత్వం దానికి సంబంధించి భవనాల నిర్మాణాలు, విద్యార్థులకు వసతి వంటి సౌకర్యాల కల్పించకపోవడంతో ఒంగోలు ట్రిపుల్ ఐటీ కాలేజీ ఇడుపులపాడుకు తరలింది. గత మూడేళ్ల నుంచి అక్కడే తరగతులు నిర్వహిస్తున్నారు. జిల్లాకు చెందిన విద్యార్థులు ఇడుపులపాడుకు వెళ్లి చదువుకోవాల్సిన దుస్థితి నెలకొంది. ప్రస్తుతం నాలుగో బ్యాచ్‌కు సంబంధించిన అడ్మిషన్లకు నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తాడేపల్లిలోని తన కార్యాలయంలో విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఒంగోలులోని ట్రిపుల్ ఐటీ కాలేజీ గురించి కూడా ముఖ్యమంత్రి సమీక్షించారు. మూడేళ్ల క్రితం ఒంగోలుకు ట్రిపుల్ ఐటీ కాలేజీ మంజూరైనప్పటికీ ఇంతవరకు దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్కు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై వెంటనే స్పందించారు. 2019–2020 బ్యాచ్‌కు సంబంధించి ఒంగోలులోనే తరగతులు నిర్వహించాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఆర్అండ్ఎన్ ఇంజనీరింగ్ కాలేజీలో ఏర్పాట్లు.. ఒంగోలులో ట్రిపుల్ ఐటీ కాలేజీని దక్షిణ బైపాస్‌రోడ్డులోని రావ్ అండ్ నాయుడు ఇంజనీరింగ్ కాలేజీలో ఏర్పాటు చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఇంజనీరింగ్ కాలేజీ కొన్నేళ్ల క్రితం మూతపడింది. ట్రిపుల్ ఐటీ తరగతుల నిర్వహణకు రావ్ అండ్ నాయుడు ఇంజనీరింగ్ కాలేజీలోని బ్లాక్‌లను ఉన్నతాధికారులు పరిశీలించారు. ప్రస్తుతం ఉన్న గదులను పరిశీలించిన అనంతరం ట్రిపుల్ ఐటీకి అనుకూలంగా ఉండేలా కొన్ని మార్పులు చేయాలని అధికారులు ఆదేశించారు. ఈ నేపథ్యంలో ట్రిపుల్ ఐటీ కాలేజీకి నిర్వహణకు సంబం«ధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. సీఎం ఆదేశాలతో ఈ పనులు మరింత ఊపందుకోనున్నాయి. ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి అడ్మిషన్ల ప్రక్రియ జరుగుతున్న నేపథ్యంలో ఆ ప్రక్రియ పూర్తయి తరగతులు ప్రారంభించే నాటికి ఈ కాలేజీని ట్రిపుల్ ఐటీకి సిద్ధం చేయనున్నారు. ఈ కాలేజీ రెండువేల మంది విద్యార్థులకు సరిపోతుంది. వాస్తవానికి నాలుగు వేల మంది విద్యార్థులకు కాలేజీ ఉండాలి. తాజా బ్యాచ్‌కు ఇక్కడ నుంచే తరగతులు నిర్వహించనున్నారు. రెండవ, మూడవ, నాల్గవ సంవత్సరం విద్యార్థులకు సంబంధించిన విషయమై ఉన్నతాధికారులు చర్చిస్తున్నారు. ఒంగోలుకు సమీపంలో స్థలాన్ని సేకరించి ట్రిపుల్ ఐటీకి శాశ్వత భవనాలు నిర్మించి పూర్తి స్థాయిలో తరగతులు నిర్వహించే విషయమై ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. అభద్రతకు గురిచేసిన చంద్రబాబు.. ఒంగోలు ట్రిపుల్ ఐటీ కాలేజీకి సంబంధించి చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో విద్యార్థులను, వారి తల్లిదండ్రులను అభద్రతా భావానికి గురిచేశారు. గత ఏడాది ఆగస్టు 7వ తేదీ జిల్లా పర్యటనకు వచ్చిన చంద్రబాబు పామూరులో 208.4 ఎకరాల భూమిలో ట్రిపుల్ ఐటీ నిర్మించేందుకు శిలాఫలకం వేశారు. ఒంగోలుతోపాటు పరిసర ప్రాంతాల్లో ట్రిపుల్ ఐటీ ఏర్పాటు చేస్తే విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు అనువుగా ఉండే ప్రాంతాన్ని వదిలేసి దూరంగా ఉన్న పామూరులో చంద్రబాబు శిలాఫలకం వేయడం విమర్శలకు తావిచ్చింది. పామూరులో తాగునీటి సమస్య ఉండటం, ఉన్న నీటిలో ఫ్లోరైడ్ శాతం ఎక్కువగా ఉండటంతో ట్రిపుల్ ఐటీ చదివేందుకు అక్కడకు వెళ్లి తమ పిల్లలు ఎక్కడ ఇబ్బంది పడతారోనని వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. శిలాఫలకం వేసినప్పటికీ దానికి సంబంధించిన నిధులను అప్పటి చంద్రబాబు ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో ఉన్నతాధికారులు ఇడుపులపాడులోనే తరగతులు నిర్వహిస్తూ వస్తున్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత విద్యాశాఖపై ప్రత్యేక దృష్టి సారించారు. అందులో భాగంగా ట్రిపుల్ ఐటీ తరగతులను ఒంగోలులోనే నిర్వహించాలంటూ స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో సంతోషం రెట్టింపైంది. -
ప్రణాళిక లోపం.. విద్యార్థులకు శాపం
సాక్షి, ఎచ్చెర్ల క్యాంపస్: ఒక ప్రతిష్టాత్మక విద్యాసంస్థ ప్రారంభించాలంటే అందుకు ప్రణాళిక ఎంతో కీలకం. బోధన సిబ్బంది నుంచి మౌలిక వసతుల వరకు అన్నింటా పక్కా ప్లానింగ్‌తో వ్యవహరించాలి. అలా చేయకపోతే శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలాగానే సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. శ్రీకాకుళంలో రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం ప్రధాన సమస్య వసతి. వాస్తవంగా ఎస్ఎంపురంలో అప్పటికే 500 మంది విద్యార్థులు వసతి, తరగతి నిర్వహణ సామర్థ్యం ఉన్న భవనాల్లో ప్రారంభించారు. లేదంటే ఇప్పటికీ ఇక్కడ తరగతులు నిర్వహన సాధ్యం అయ్యేది కాదు. 2016 అక్టోబర్ 10న శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీకి శంకుస్థాపప చేశారు. 200 ఎకరాల ప్రభుత్వ స్థలం కేటాయించారు. కనీసం 1000 మంది సామర్థ్యం గల భవనాలను మాత్రం నిర్మించలేకపోయారు. వాస్తవానికి ట్రిపుల్ ఐటీ ప్రారంభం నుంచి పక్కాగా బడ్జెట్ కేటాయింపులు, సామర్థ్యం ఉన్న సంస్థలకు టెండర్ల అప్పగింత, కాంట్రాక్టర్లకు సకాలంలో బిల్లుల చెల్లింపులు చెయ్యలేదనే విమర్శలు ఉన్నాయి. ఈ ప్రణాళిక లోపమే ఇప్పుడు విద్యార్థులకు శాపమవుతోంది. నాలుగో బ్యాచ్‌కు నొటిఫికేషన్ శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలో నాలుగో బ్యాచ్‌కు నొటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ మేరకు ఆగస్టు 9న తరగతులు ప్రారంభిస్తారు. ప్రస్తుతం 1000 మంది సామర్థ్యం గల భవనాలు నిర్మాణ దశలో ఉన్నాయి. ఈ భవనాలు నిర్మాణం పూర్తయితేనే ఇక్కడ తరగతుల నిర్వహణ సాధ్యమవుతుంది. రూ.33 కోట్లు భవనాలకు అంతర్గత పనులు నిర్వహిస్తున్నారు. 45 రోజుల్లో ఈ భవనాలు పూర్తిచేయాల్సి ఉంటుంది. కాంట్రాక్టర్ సామర్థ్యం, అధికారుల పర్యవేక్షణ ఉంటేనే సాధ్యం. మరో పక్క శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీ పారిపాలన, రెండు బ్యాచ్‌లకు తరగతులు నూజివీడులోనే సాగుతున్నాయి. విద్యార్థులు, బోధన సిబ్బంది శ్రీకాకుళం రావడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అక్కడ సౌకర్యాలు, తాగునీటి, రన్నింగ్ నీటి సౌకర్యం సైతం ప్రధాన సమస్యగా ఉన్నాయి. మరో పక్క ఇక్కడి బోధన సిబ్బందిని అక్కడికి బదిలీ చేసినా వెళ్లేందుకు ఆసక్తి చూపటం లేదు. అధికారులు రెండు పడవల ప్రయాణం చేస్తున్నారు. అధికారులు, విద్యార్థులు, బోధన సిబ్బంది అందరూ ఒక్కచోట ఉంటేనే ట్రిపుల్ ఐటీలో విద్యా ప్రమాణాల ప్రగతి సాధ్యమవుతుంది. శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీ ప్రవేశాలు పొందిన అన్ని బ్యాచ్‌ల నిర్వహణ ఎప్పటికి సాధ్యమవుతుందో నిరీక్షించాల్సిందే. మూడు బ్యాచ్‌ల్లో ప్రవేశాలు.. ఒక బ్యాచ్‌కు నొటిఫికేషన్ శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీకి సంబంధించి ఇప్పటికి మూ డు బ్యాచ్‌లకు ప్రవేశాలు కల్పించారు. ఈ ఏడాది ప్రవేశాలకు నొటిఫికేషన్ విడుదలైంది. ఆగస్టు 9 నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. మొదటి బ్యాచ్ 2016–17 శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీకి సంబంధించి మొదటి బ్యాచ్ 1000 మందికి 2016–17లో ప్రవేశాలు కల్పించారు. ప్రవేశాలు కల్పించిన నాటి నుంచి నూజివీడులో తరగతులు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఈ విద్యార్థులు ఇంజినీరింగ్ రెండో ఏడాదికి చేరుకున్నారు. పేరుకు శ్రీకాకుళం విద్యార్థులు అయినా శ్రీకాకుళం క్యాంపస్ సైతం వీరికి తెలీదు. రెండో బ్యాచ్ 2017–18 ఈ బ్యాచ్‌లో 1000 మందికి ప్రవేశాలు కల్పించారు. ప్రారంభంలో నూజివీడులో తరగతులు ప్రారంభించారు. ఏడాది పాటు అక్కడ తరగతులు నిర్వహించారు. శ్రీకాకుళం 2018 జనవరిలో ఇక్కడికి షిప్టు చేశారు. ఎప్ఎం పురం గురుకులంలో 500 మంది బాలికలకు, చినరావుపల్లిలో అద్దెకు తీసుకున్న మిత్రా ఇంజినీరింగ్ క్యాంపస్‌లో బాలురు 500 మందికి తరగతులు నిర్వహిస్తుంచారు. ప్రస్తుతం ఈ విద్యార్థులు ఇంజినీరింగ్ మొదటి ఏడాదికి చేరుకున్నారు. ఈ ఒక్క బ్యాచ్ మాత్రమే శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలో సాగుతోంది. ఇంజినీరింగ్ ప్రవేశాలు పొందిన ఈ విద్యార్థులకు ప్రస్తుతం ప్రేరణ తరగతులు నిర్వహిస్తున్నారు. మూడో బ్యాచ్ 2018–19 గత ఏడాది ఆగస్టులో 1000 మందితో ఈ బ్యాచ్ ప్రారంభించారు. మొదటి సంవత్సరం పీయూసీ నుంచి రెండో ఏడాదికి విద్యార్థులు చేరుకున్నారు. శ్రీకాకుళంలో అద్దె భవనాలు తీసుకోని ఇక్కడికి విద్యార్థులను తరలించాలని ప్రయత్నించారు. జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న శ్రీ శివానీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ భవనాలు అద్దెకు తీసుకున్నారు. అయితే తరలింపు మాత్రం సాధ్యం కాలేదు. ఎప్పటికి తరలిస్తారో తెలీని పరిస్థితి కొనసాగుతోంది. ఈ కళాశాలలో ప్రస్తుతం ఎన్నికల సామగ్రి ఉంది. ప్రయత్నిస్తున్నాం శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీ ప్రవేశాలు పొందిన అన్ని బ్యాచ్‌లకు తరగతులు ఇక్కడ నిర్వహించడానికి ప్రయత్నిస్తున్నాం. భూ సేకరణలో సమస్యల వల్ల భవనాల నిర్మాణం అనుకున్నంత వేగంగా ముం దుకు సాగలేదు. ప్రస్తుతం 200 ఎకరాలు ప్రభుత్వ అప్పగించింది. మూడు బ్యాచ్‌ల్లో ఇక్కడ ఇంజినీరింగ్ మొదటి ఏడాది తరగతులు జరుగుతున్నాయి. పీయూసీ రెండో ఏడాది బ్యాచ్ శివానీకి షిఫ్ట్ చేస్తాం. ప్రస్తుతం ఆగస్టు 9 నుంచి తరగతులు ప్రారంభించే బ్యాచ్ ఇక్కడే ప్రారంభిస్తాం. ఇంజినీరింగ్ రెండో ఏడాది బ్యాచ్ కోసం తాత్కాలిక భవనాలు నిర్మాణం చేపట్టే అంశాన్ని పరిశీలిస్తున్నాం. ఈ ఏడాదిలో నాలుగు బ్యాచ్‌లు ఇక్కడికి తరలించేందుకు ప్రయత్నిస్తున్నాం. - ప్రొఫెసర్ ఎస్.హరశ్రీరాములు, డైరెక్టర్, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీ -
అదనంగా 2,660 సీట్లు
సాక్షి, హైదరాబాద్: ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీ, ప్రభుత్వ ఆర్థిక సహకారంతో కొనసాగే జాతీయ స్థాయి విద్యా సంస్థల్లో (జీఎఫ్‌టీఐ) 2019–20 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు ఉమ్మడి ప్రవేశాల కౌన్సెలింగ్ ఆదివారం ప్రారంభమైంది. ముందస్తు షెడ్యూల్ ప్రకారం ఈ నెల 19 నుంచి విద్యార్థుల నుంచి చాయిస్ ఫిల్లింగ్‌కు (వెబ్ ఆప్షన్లు) అవకాశం కల్పిస్తామని జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (జోసా) ప్రకటించినా.. ఆదివారం నుంచే ప్రారంభించింది. మొత్తంగా ఏడు దశల్లో ప్రవేశాల కౌన్సెలింగ్ నిర్వహణకు చర్యలు చేపట్టింది. జూలై 23 వరకు ప్రవేశాల కౌన్సెలింగ్ నిర్వహించేలా ఆదివారం షెడ్యూల్‌ను విడుదల చేసింది. కౌన్సెలింగ్‌లో సీట్లు పొందిన విద్యార్థులు రిపోర్టు చేయాల్సిన రిపోర్టింగ్ కేంద్రాల వివరాలను జోసా వెబ్సైట్ లో ( https://josaa.nic.in) అందుబాటులో ఉంచింది. రిపోర్టింగ్ కేంద్రాల్లో నిర్ణీత తేదీల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్, సీట్ యాక్సెప్టె్టన్స్/సీట్ విత్‌డ్రాకు అవకాశం ఉంటుందని వివరించింది. అదనంగా 4,719 సీట్లు.. ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీల్లో కేంద్రం ఈసారి సీట్లను భారీగా పెంచింది. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ (ఈడబ్ల్యూఎస్) కోసం 10 శాతం రిజర్వేషన్లను అందుబాటులోకి తెచ్చిన కేంద్రం ప్రత్యేకంగా సీట్లను పెంచింది. మరోవైపు ఐఐటీ, ఎన్ఐటీల్లో మహిళల భాగస్వామ్యాన్ని పెంచేందుకు సూపర్ న్యూమరీ కోటా కింద ఏటేటా సీట్లను పెంచుతోంది. దీనిలో భాగంగా ఈసారి కూడా 2,059 సీట్లను పెంచింది. మరోవైపు ఈడబ్ల్యూఎస్ కింద 2,660 సీట్లను అదనంగా పెంచింది. ఇలా మొత్తంగా 4,719 సీట్లను ఈసారి అదనంగా పెంచింది. 107 విద్యా సంస్థల్లో 45,244 సీట్లు.. ఐఐటీలతోపాటు ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీ, జీఎఫ్‌ఐటీలలో ఈసారి సీట్లు ఎక్కువగా పెరిగాయి. మహిళల సూపర్ న్యూమరీ సీట్లతోపాటు ఈడబ్ల్యూఎస్ కోటా అదనంగా రావడంతో సీట్లు ఎక్కువగా పెరిగాయి. దేశంలోని 23 ఐఐటీలు, 31 ఎన్ఐటీలు, 25 ట్రిపుల్ఐటీ, 28 జీఎఫ్‌టీఐలు మొత్తంగా 107 విద్యా సంస్థల్లో గతేడాది 41 వేల వరకు అందుబాటులో ఉండగా, ఈసారి వాటి సంఖ్య 45,244కి పెరిగింది. ఎన్ఐటీల్లో ఎక్కువగా పెరుగుదల.. ఈడబ్ల్యూఎస్ కోటా కింద ఈసారి ఎన్ఐటీల్లో సీట్లు ఎక్కువగా పెరిగాయి. గతేడాది కంటే ఈసారి 1,384 సీట్లు అదనంగా వచ్చాయి. ఐఐటీల్లో ఈడబ్ల్యూఎస్ కోటాలో 638 సీట్లు పెరిగాయి. ఎన్ఐటీల్లో 50 శాతం సీట్లు హోంస్టేట్ కోటా కింద ఉన్నందున ఆయా రాష్ట్రాల వారికి ఈడబ్ల్యూఎస్ కోటా పెరిగిన సీట్లతో అధిక ప్రయోజనం చేకూరనుంది. మరోవైపు మహిళల భాగస్వామ్యం కోసం అదనంగా ఇస్తున్న సూపర్ న్యూమరీ సీట్ల సంఖ్య ఐఐటీల్లో ఎక్కువగా పెరిగింది. ఈసారి 1,221 సీట్లు ఐఐటీల్లోనే పెరిగాయి. కౌన్సెలింగ్ షెడ్యూల్.. 21–6–2019: ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూట్ టెస్టు రాసే వారికి చాయిస్ ఫిల్లింగ్ ప్రారంభం 25–6–2019: ఏఏటీ, ఇతరులందరికీ సాయంత్రం 5 గంటలకు చాయిస్ ఫిల్లింగ్ ముగింపు 27–6–2019: ఉదయం 10 గంటలకు మొదటి దశ సీట్ల కేటాయింపు 28–6–2019 నుంచి జూలై 2 వరకు: రిపోర్టింగ్ కేంద్రాల్లో డాక్యుమెంట్ల వెరిఫికేషన్, సీట్ యాక్సెప్టెన్స్, రిపోర్టింగ్ 3–7–2019: ఉదయం 10 గంటలకు భర్తీ అయిన సీట్లు, మిగిలిన సీట్ల డిస్ప్లే 3–7–2019: సాయంత్రం 5 గంటలకు రెండో దశ సీట్ల కేటాయింపు 4–7–2019 నుంచి 5–7–2019 వరకు: రిపోర్టింగ్ కేంద్రాల్లో డాక్యుమెంట్ల వెరిఫికేషన్, సీట్ యాక్సెప్టెన్స్/విత్‌డ్రా 6–7–2019: ఉదయం 10 గంటలకు భర్తీ అయిన సీట్లు, మిగిలిన సీట్ల డిస్ప్లే 6–7–2019: సాయంత్రం 5 గంటలకు మూడో దశ సీట్ల కేటాయింపు 7–7–2019 నుంచి 8–7–2019 వరకు: రిపోర్టింగ్ కేంద్రాల్లో డాక్యుమెంట్ల వెరిఫికేషన్, సీట్ యాక్సెప్టెన్స్/విత్‌డ్రా 9–7–2019: ఉదయం 10 గంటలకు భర్తీ అయిన సీట్లు, మిగిలిన సీట్ల డిస్ప్లే 9–7–2019: సాయంత్రం 5 గంటలకు నాలుగో దశ సీట్ల కేటాయింపు 10–7–2019 నుంచి 11–7–2019 వరకు: ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు రిపోర్టింగ్ కేంద్రాల్లో డాక్యుమెంట్ల వెరిఫికేషన్, సీట్ యాక్సెప్టెన్స్/విత్‌డ్రా 12–7–2019: ఉదయం 10 గంటలకు భర్తీ అయిన సీట్లు, మిగిలిన సీట్ల డిస్ప్లే 12–7–2019: సాయంత్రం 5 గంటలకు ఐదో దశ సీట్ల కేటాయింపు 13–7–2019 నుంచి 14–7–2019 వరకు: రిపోర్టింగ్ కేంద్రాల్లో డాక్యుమెంట్ల వెరిఫికేషన్, సీట్ యాక్సెప్టెన్స్/విత్‌డ్రా 15–7–2019: ఉదయం 10గంటలకు భర్తీ అయిన సీట్లు, మిగిలిన సీట్ల డిస్ప్లే, అదే రోజు సాయంత్రం 5 గంటలకు 6వ దశ సీట్లు కేటాయింపు 16–7–2019 నుంచి 17–7–2019: రిపోర్టింగ్ కేంద్రాల్లో డాక్యుమెంట్ల వెరిఫికేషన్, సీట్ యాక్సెప్టెన్స్/విత్‌డ్రా (ఐఐటీల్లో సీట్ విత్‌డ్రాకు ఇదే చివరి అవకాశం) 18–7–2019: ఉదయం 10 గంటలకు భర్తీ అయిన సీట్లు, మిగిలిన సీట్ల డిస్ప్లే, అదే రోజు మధ్యాహ్నం ఒంటి గంటకు 7వ దశ (చివరి) సీట్ల కేటాయింపు 19–7–2019: ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు రిపోర్టింగ్ కేంద్రాల్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్, కాలేజీల్లో చేరికలు 19–7–2019 నుంచి 23–7–2019 వరకు: ఎన్ఐటీ ఇతర విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం సర్టిఫికెట్ల వెరిఫికేషన్, సీట్ యాక్సెప్టెన్స్, ప్రవేశాలు. -
ట్రిపుల్ ఐటీ–హైదరాబాద్ ఆధ్వర్యంలో ‘స్టెప్’
హైదరాబాద్: పాఠశాల స్థాయి విద్యార్థులకు ట్రిపుల్ఐటీ–హైదరాబాద్ వినూత్న కార్యక్రమాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. పాఠశాల స్థాయిలోనే విద్యార్థులలో పోటీతత్వం, వినూత్న, విశ్లేషణాత్మకమైన ఆలోచనా విధానాలతో ముందుకుసాగేలా చేయడానికి సరికొత్త కార్యక్రమాన్ని వేసవి సెలవుల్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. 7 నుంచి 10వ తరగతి చదివే విద్యార్థుల కోసం స్టూడెంట్ టెక్నాలజీ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం (స్టెప్) కార్యక్రమాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఈ కార్యక్రమంలో చేరదలచుకున్న విద్యార్థులు ఏప్రిల్ 14వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. ఇందులో 7,8 తరగతుల విద్యార్థులకు కాంప్యిటేషనల్ థింకింగ్ అండ్ అప్లికేషన్స్ (సీటీఏ) కోర్సును, 9,10 తరగతుల విద్యార్థులకు కాంప్యిటేషనల్ థింకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ (సీటీపీఎస్) కోర్సును నిర్వహించాలని తలపెట్టారు. మొదట దరఖాస్తు చేసుకున్నవారికి తొలి అవకాశం కల్పించారు. తరగతులను మే 6 నుంచి 31 వరకు నిర్వహిస్తారు. అడ్మిషన్, ఇతర వివరాలకు వెబ్సైట్ https:// www. iiit. ac. in/ stel/ను సంప్రదించాలి. పాఠశాల స్థాయి విద్యార్థులలో విశ్లేషణాత్మకమైన నైపుణ్యాలను సైద్ధాంతికత ద్వారా పెంపొందించేలా చేయడం, మానసిక నైపుణ్యాలను ధృడంగా చేయడం ఈ కోర్సు ప్రధాన లక్ష్యం. ఈ కోర్సులు ట్రిపుల్ఐటీ– హైదరాబాద్ ఫ్యాకల్టీ, ఇతర విజిటింగ్ ఫ్యాకల్టీ ద్వారా నిర్వహిస్తారు. ఈకార్యక్రమంలో పాల్గొన్న పలువురు విద్యార్థులు జాతీయ స్థాయి ఒలంపియాడ్లలో అర్హత సాధించారు. కోర్సు పూర్తి చేసుకున్న తర్వాత విద్యార్థులకు సర్టిఫికెట్లను అందిస్తారు. -
ట్రిపుల్ ఐటీని వీడని కష్టాలు!
రాష్ట్ర విభజన సమయంలో శ్రీకాకుళం జిల్లాకు కేటాయించిన ఏకైక విద్యా సంస్థ ట్రిపుల్ ఐటీ ప్రగతిపై పాలకులు దృష్టిపెట్టలేదు. ఈ విశ్వవిద్యాలయాన్ని కష్టాలు వీడలేదు. ప్రధానంగా భవనాల కొరత వెంటాడుతోంది. ఏళ్ల తరబడి భవనాల నిర్మాణం కొనసాగుతూనే ఉంది. దీంతో అద్దెభవనాలే విద్యార్థులకు దిక్కయ్యాయి. శ్రీకాకుళం, ఎచ్చెర్ల క్యాంపస్:శ్రీకాకుళం రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయానికి సంబంధించిన కార్యాలయాన్ని 2016 అక్టోబర్ పదో తేదీన ఎస్.ఎం.పురంలో ఉన్న 21వ శతాబ్ది గురుకుల భవనాల్లో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీని వాసరావు ప్రారంభించారు. అలాగే 199.08 ఎకరాల స్థలాన్ని ట్రిపుల్ ఐటీ కోసం ప్రభుత్వం కేటాయించింది. ఇంతవరకూ బాగానే ఉన్నా.. ఇప్పటికీ విద్యా సంస్థకు సరిపడే వసతిని మా త్రం సర్కార్ కల్పించలేకపోయింది. ప్రస్తుతం 2001లో నిర్మించిన గురుకుల భవనాల్లోనే విద్యార్థినులకు వసతి, తరగతులు నిర్వహిస్తున్నారు. పరిస్థితి ఇలా.. శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలో మూడు వేల మంది విద్యార్థులతో తరగతులు కొనసాగాలి. మొదటి బ్యాచ్ 2016–17 విద్యా సంవత్సరంలో 1000 మందికి ప్రవేశాలు కల్పించి.. నూజివీడులోతరగతులు ప్రారంభించారు. ప్రస్తుతం ఈ విద్యార్థులు రెండేళ్ల పీయూసీ (ప్రీ యూనివర్సిటీ కోర్సు) పూర్తి చేసుకొని నాలుగేళ్ల ఇంజినీరింగ్ మొదటి ఏడాదిలో ప్రవేశించారు. న్యూజివీడులోనే తరగతులు కొనసాగుతున్నాయి. ఈ విద్యార్థులను శ్రీకాకుళం ట్రిపుల్ఐటీకి తరలించే అవకాశాలు కనిపించడం లేదు. నూజివీడులోనే విద్యార్థులను విడిచి పెట్టే అవకాశాలు ఉన్నాయి. భవిష్యత్తులో కూడా ఎలాంటి చర్యలు అధికారులు తీసుకుంటారో తెలియని పరిస్థితి. ♦ 2017–18 విద్యా సంవత్సరానికి సంబంధించి మరో వెయ్యి మందికి ప్రవేశాలు కల్పించారు. 2017 ఆగస్టులో వీరికి ప్రవేశాలు కల్పించగా, 2018 జనవరిలో ఈ బ్యాచ్‌ను శ్రీకాకుళం షిప్టు చేశారు. ఎస్.ఎం.పురం క్యాంపస్‌లో బాలికలకు, అద్దెకు తీసుకున్న చినరావుపల్లి మిత్రా ఇంజినీరింగ్ క్యాంపస్‌లో పురుషులకు తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ట్రిపుల్ ఐటీ పీయూసీ రెండో ఏడాది తరగతులు రెండు క్యాంపస్‌ల్లో జరుగుతున్నాయి. ♦ 2018–19 ఏడాదికి గత ఏడాది ఆగస్టులో 1000 మందికి పీయూసీ మొదటి ఏడాదిలో ప్రవేశాలు కల్పించారు. ప్రస్తుతం ఈ వెయ్యి మందికి నూజివీడులోనే తరగతులు నిర్వహిస్తున్నారు. శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలో మూడు వేల మందితో ఇంజినీరింగ్ మొదటి ఏడాది, పీయూసీ మొదటి, రెండో ఏడాది తరగతులు నిర్వహించాలి. అయితే తగినన్ని భవనాలు లేకపోవడంతో కేవలం రెండో ఏడాది పీయూసీ తరగతులు మాత్రమే ఇక్కడ నిర్వహిస్తున్నారు. వీటిని కూడా రెండు క్యాంపస్‌ల్లో నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొంది. ♦ ఎస్.ఎం.పురం పంచాయతీ పరిధిలోని 112 సర్వే నంబర్లో 8 బ్లాక్‌తో కూడిన గురుకుల భవనాలతో పాటు స్థలాలను కలిపి 199.08 ఎకరాలను ట్రిపుల్ ఐటీ కోసం సర్కార్ కేటాయించింది. గత ఏడాది ఆగస్టు నాటికి కనీసం 2000 మందికి సరిపడా వసతి, తరగతి నిర్వహణ ఏర్పాట్లు పూర్తచేస్తామని ప్రజా ప్రతినిధులు, అధికారులు చెప్పుకొచ్చారు. అయితే ప్రస్తుత పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. భవన నిర్మాణ పనుల్లో ప్రగతి కనిపించడం లేదు. ఇదే పరిస్థితి కొనసాగితే వచ్చే ఏడాది తరగతులకు సైతం ఇబ్బందులు తప్పేలాలేదు. బిల్లుల చెల్లింపులో సమస్యలు! ♦ భవనాల నిర్మాణం నత్తనడకన సాగడానికి కాంట్రాక్టర్‌కు బిల్లులు చెల్లించకపోవడం కూడా కారణంగా తెలిసింది. ప్రస్తుతం రూ.86.74 కోట్లుతో భవనాల నిర్మాణం జరుగుతోంది. అయితే శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీ కోసం అంటూ ప్రత్యేక నిధులు ప్రభుత్వం మంజూరు చేయలేదు. దీంతో నూజివీడు నుంచి నిధులు తెచ్చి ఖర్చు చేస్తున్నారు. అద్దె భవనాల్లో తరగతులు ♦ ప్రస్తుతం చినరావుపల్లి సమీపంలో మూత పడిన మిత్రా ఇంజినీరింగ్ కళాశాల భవనాలను అద్దెకు తీసుకోని పీయూసీ రెండో ఏదాది పురుషుల తరగతులను అందులో నిర్వహిస్తున్నారు. నెలకు రూ. 4.20 లక్షలు అద్దెగా చెల్లిస్తున్నారు. రెండేళ్ల లీజు పూర్తయ్యింది. ప్రస్తుతం నూజివీడులో ఉన్న మొదటి పీయూసీ 1000 మంది విద్యార్థులను శ్రీకాకుళం తరలించే కసరత్తులు అధికారులు చేస్తున్నారు. అయితే వసతి కొరత ఉండడంతో చిలకపాలెంలో మూతపడిన శివానీ ఇనిస్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ భవనాలను పరిశీలిస్తున్నారు. టెండర్ల ఆహ్వానం కూడా పూర్తయ్యింది. అయితే వెయ్యి మందికి తరగతులు, వసతికి సరిపడుతోందా..లేదా అనేది నిపుణల కమిటీ నిర్థారించాల్సి ఉంది. ఒకవేళ అన్ని అనుకూలంగా ఉంటే నెలకు రూ. 5 లక్షలు అద్దెగా చెల్లించి ఫిబ్రవరిలో నూజివీడు నుంచి ఇక్కడకు విద్యార్థులను తరలించేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. ట్రిపుల్ ఐటీ భవనాల నిర్మాణాలు మాత్రం అనుకున్న స్థాయిలో జరగటం లేదు. మరో క్యాంపస్ అద్దెకు తీసుకుంటే మూడు క్యాం పస్‌లు నిర్వహించ వల్సి ఉంటుంది. 2016 నుంచి ముందు చూపుతో వ్యవహరిస్తే పూర్తిస్థాయి తరగతులు నిర్వహనకు భవనాలు సిద్ధమయ్యేవి. అద్దెభవనాలు తీసుకున్నా ఇంజినీరింగ్ మొదటి బ్యాచ్ మాత్రం పూర్తిగా రిలీవ్ అయ్యే వరకు నూజివీడులోనే వదిలేసే అవకాశాలు కపిస్తున్నాయి. -
జేఈఈ ఫైనల్ ‘కీ’లో మార్పులు
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీ, ప్రభుత్వ నిధులతో నడిచే సాంకేతిక విద్యాసంస్థలు (జీఎఫ్‌టీఐ)లలో బీఈ/బీటెక్ ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ మెయిన్ ఆన్లైన్ పరీక్షల ఫైనల్ ‘కీ’ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) బుధవారం ప్రకటించింది. ప్రాథమిక ‘కీ’తో పోల్చితే అం దులో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. 11 ప్రశ్నలకు జవాబులు మారిపోగా 11 ప్రశ్నలను తొలగించినట్లు ఎన్టీఏ వెల్లడించింది. ఈ నెల 8 నుంచి 12 వరకు నిర్వహించిన ఈ పరీక్షలకు రాష్ట్రం నుంచి 70 వేల మంది సహా దేశవ్యాప్తంగా 8,74,469 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ పరీక్షలకు సంబంధించి విద్యార్థుల ఓఎంఆర్ రెస్పాన్స్ షీట్లను ఎన్టీఏ వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. ప్రాథమిక ‘కీ’ ప్రకటించి వాటిపై విద్యార్థుల అభ్యం తరాలను స్వీకరించింది. దీనికి సంబంధించిన ఎలాంటి సమాచారం లేకుండానే ఈ నెల 19న ఫలితాలను (విద్యార్థుల నార్మలైజేషన్ స్కోర్) ప్రకటించింది. అదే రోజు ఫైనల్ ‘కీ’ కూడా వెలువడుతుందని భావించినా ఎన్టీఏ దాన్ని బుధవారం ప్రకటించింది. ‘కీ’ని పరిశీలించిన జేఈఈ నిపుణులు ఉమాశంకర్ ప్రాథమిక ‘కీ’, ఫైనల్ ‘కీ’ మధ్య వ్యత్యాసం ఉందని అంచనా వేశారు. దీంతో 11 ప్రశ్నలను తొలగించడంతోపాటు మరో 11 ప్రశ్నలకు సంబంధించిన జవాబుల్లో మార్పులు చేసినట్లు తెలిపారు. తొలగిం చిన 11 ప్రశ్నలకు ఆయా షిప్ట్‌లలో పరీక్షలకు హాజరైన విద్యార్థులకు మార్కులను కేటాయిం చినట్లు ఎన్టీఏ తెలిపింది. అయితే 8 షిఫ్ట్‌లలో పరీక్షలు రాసిన విద్యార్థుల స్కోర్‌ను నార్మలైజేషన్ చేసి వారి పర్సంటైల్‌ను ఇటీవల ఎన్టీఏ ప్రకటించడం తెలిసిందే. దీనిలో భాగంగా 100 పర్సంటైల్‌లో సాధించిన వారు దేశవ్యాప్తంగా 15 మంది ఉన్నట్లు వెల్లడించింది. ఆ ఫలితాలను ఎన్టీఏ ఎలా వెల్లడించిందన్న విషయం లో అనుమానాలు నెలకొన్నాయి. ప్రాథమిక ‘కీ’పై ఇచ్చిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకొని ఫైనల్ ‘కీ’ని సిద్ధం చేసి ఫలి తాలను ప్రకటించిందా లేక వాటిని పరిగణనలోకి తీసుకోకుండానే ఫలితాలను ప్రకటించిందా? అనే గందరగోళం నెలకొంది. ఒకవేళ వాటిని పరిగణనలోకి తీసుకోకపోతే ఫైనల్ ‘కీ’ ప్రకారం 100 పర్సంటైల్లోకి వచ్చే తెలుగు విద్యార్థుల సంఖ్య మరింత పెరుగుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఇటీవల ప్రకటించిన 100 పర్సంటైల్ విద్యార్థుల్లో తెలుగువారు ఐదుగురు ఉండగా ఆ ఫలితాల్లో ఫైనల్ ‘కీ’ని పరిగణనలోకి తీసుకోకపోతే జరిగిన మార్పు లు, ఫైనల్ ‘కీ’మేరకు చూస్తే మరో 10 మంది వరకు తెలు గు విద్యార్థులు 100 పర్సంటైల్లోకి వచ్చే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఇవీ వివిధ షిఫ్ట్‌లలో జవాబుల మార్పు, ప్రశ్నల తొలగింపు.. ఈ నెల 9న జరిగిన మొదటి షిఫ్ట్ పరీక్షలో ఫిజిక్స్‌లో ఒక ప్రశ్నను తొలగించింది. కెమిస్ట్రీలో ఒక ప్రశ్నకు జవాబును మార్చింది. అలాగే మ్యాథ్స్‌లో ఒక ప్రశ్న కు జవాబును మార్పు చేసింది. అదే రోజు జరిగిన రెండో షిఫ్ట్‌లో ఫిజిక్స్‌లో రెండు ప్రశ్నల జవాబులను మార్చింది.10వ తేదీన జరిగిన మొదటి షిఫ్ట్ పరీక్షలో ఫిజిక్స్‌లో ఒక ప్రశ్నకు జవాబును మార్పు చేయగా ఒక ప్రశ్నను తొలగించింది. కెమిస్ట్రీలో ఒక ప్రశ్నను తొలగించగా, మ్యాథ్స్ లో ఒక ప్రశ్నకు జవాబును మార్పు చేయడంతోపాటు ఒక ప్రశ్నను తొలగించింది. అదే రోజు జరిగిన రెండో షిఫ్ట్ పరీక్షలో ఫిజిక్స్‌లో ఒక ప్రశ్నకు జవాబును మార్పు చేయగా ఒక ప్రశ్నను తొలగించింది. 11వ తేదీన మొదటి షిఫ్ట్ పరీక్షలో ఫిజిక్స్‌లో రెండు ప్రశ్నలకు జవాబులను మార్పు చేయగా ఒక ప్రశ్నను తొలగించింది. మ్యాథ్స్‌లో ఒక ప్రశ్నకు జవాబును మార్పు చేసింది. అదేరోజు మధ్యాహ్నం జరిగిన రెండో షిప్ట్ పరీక్షలో ఫిజిక్స్‌లో ఒక ప్రశ్నకు జవాబును మార్పు చేయగా ఒక ప్రశ్నను తొలగించింది. అలాగే మ్యాథ్స్‌లో ఒక ప్రశ్నను తొలగించింది.12వ తేదీన మొదటి షిఫ్ట్ పరీక్షలో కెమిస్ట్రీలో ఒక ప్రశ్నను తొలగించగా రెండో షిఫ్ట్‌లో ఫిజిక్స్‌లో రెండు ప్రశ్నలను తొలగించింది. -
చిట్టీ యాప్ లాంచ్ చేసిన ఐఐఐటి విద్యార్థులు
-
10/10 వచ్చినా.. ట్రిపుల్ ఐటీ సీటు రాలేదని..!
సాక్షి, కృష్ణా : కష్టపడి చదివి మంచి మార్కులు సాధించినా ట్రిపుల్ ఐటీలో సీటు రాలేదని ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మండల కేంద్రమైన చాట్రాయిలో చోటుచేసుకుంది. వివరాలు.. టెన్త్ క్లాస్‌లో 10/10 జీపీఏ సాధించినా ట్రిపుల్ ఐటీలో సీటు రాకపోవండంతో తీవ్ర మనస్తాపానికి గురైన మంజు మంగళవారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ట్రిపుల్ ఐటీ సీటు విషయమైన నిన్న రాత్రి మంజు తీవ్ర ఆవేదనతో మాట్లాడిందని ఆమె తల్లి భోరున విలపించింది. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
ట్రిపుల్ ఐటీల రెండో విడత కౌన్సెలింగ్‌లో ప్రతిష్టంభన!
నూజివీడు: రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) పరిధిలో రాష్ట్రంలో శ్రీకాకుళం, నూజివీడు, ఒంగోలు, ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీల్లో రెండో విడత కౌన్సెలింగ్ నిర్వహణలో ప్రతిష్టంభన నెలకొంది. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న విద్యార్థులకు సామాజిక విద్యా వెనుకబాటుతనం కింద అదనంగా కల్పించిన 0.4 డిప్రెవేషన్ స్కోర్ విషయమై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాకుండా తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఏ విధమైన చర్యలు చేపట్టవద్దని ఆదేశించడంతో రెండో విడత కౌన్సెలింగ్ నిలిచిపోయింది. గత నెల 4 నుంచి 7 వరకు మొదటి విడత కౌన్సెలింగ్ నిర్వహించగా నాలుగు ట్రిపుల్‌ఐటీలకు కలిపి 3,743 సీట్లకు 3,258 సీట్లు భర్తీ అయ్యాయి. 485 సీట్లు మిగిలాయి. ట్రిపుల ఐటీలవారీగా నూజివీడులో 90, ఇడుపులపాయలో 123, శ్రీకాకుళంలో 135, ఒంగోలులో 137 సీట్లు మిగిలాయి. అలాగే ప్రత్యేక కేటగిరీ కింద ఉన్న 257 సీట్లు కలిపి మొత్తం 742 సీట్లను భర్తీ చేయాల్సి ఉంది. అయితే వైఎస్సార్ జిల్లాకు చెందిన ఒక విద్యార్థిని తనకు మెరిట్ ఉన్నా ట్రిపుల్ ఐటీలో సీటు ఇవ్వలేదని హైకోర్టును ఆశ్రయించడంతో దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు డిప్రెవేషన్ స్కోర్ 0.4ను ఈ ఏడాది కూడా కలపడంపై రెండో విడత కౌన్సెలింగ్ నిర్వహించవద్దని ఆదేశించడంతో గత నెల 20 నుంచి 23 వరకు నిర్వహించాల్సిన రెండో విడత కౌన్సెలింగ్ నిలిచిపోయింది. 0.4 డిప్రెవేషన్ స్కోర్ వద్దంటూ గతంలోనే తీర్పు గతేడాది ఇదే అంశంపై డిప్రెవేషన్ స్కోర్ కలపడం రాజ్యాంగ విరుద్ధమని హైకోర్టు తీర్పు ఇచ్చింది. సామాజిక, ఆర్థిక వెనుకబాటు సూచీ కిందే రిజర్వేషన్లు అమలవుతున్నందున మళ్లీ అదే పేరుతో ప్రత్యేకంగా 0.4 డిప్రెవేషన్ స్కోర్ అవసరం లేదని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆర్జీయూకేటీ అధికారులు ఉన్నత విద్యామండలి ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరిపి వారి సూచనల మేరకు 0.4 డిప్రెవేషన్ స్కోర్ కలిపారు. ఈ ఏడాది ఇదే పద్ధతిలో ప్రవేశాలు నిర్వహించడంతో హైకోర్టు రెండో విడత కౌన్సెలింగ్ నిలిపేసింది. రెండో విడత కౌన్సెలింగ్ లేనట్టేనా! ప్రవేశాల వ్యవహారం హైకోర్టు పరిధిలో ఉన్నందున రెండో విడత కౌన్సెలింగ్ ఉంటుందా అనే దానిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు స్పోర్ట్స్, ఎన్సీసీ, పీహెచ్సీ, సైనికోద్యోగుల కోటా కింద సీట్లు ఎప్పుడు భర్తీ చేస్తారా అని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు. ఏదైనా కాలేజీలో చేరిన తర్వాత కౌన్సెలింగ్ నిర్వహిస్తే తాము చెల్లించిన వేలాది రూపాయలు తిరిగి రావనే ఆందోళనతో ఉన్నారు.అయితే రెండో విడత కౌన్సెలింగ్ తిరిగి ఎప్పుడు ఉంటుందో కోర్టు తీర్పుపైనే ఆధారపడి ఉంటుందని ట్రిపుల్ఐటీ అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. కోర్టు నుంచి స్పష్టత వచ్చాకే.. రెండో విడత కౌన్సెలింగ్ అంశం కోర్టు పరిధిలో ఉంది. దీనిపై ఇంకా కోర్టు నుంచి స్పష్టత రాలేదు. ఒకటి, రెండు వారాల్లో స్పష్టత వస్తుందనుకుంటున్నాం. అది రాగానే రెండో విడత కౌన్సెలింగ్ తేదీలను ప్రకటిస్తాం. – ఆచార్య వేగేశ్న రామచంద్రరాజు, ఆర్జీయూకేటీ వైస్‌చాన్సలర్ -
‘ఒంగోలు’ ఇడుపులపాయకెళ్లింది!
సాక్షి, కడప : పాలకుల నిర్లక్ష్యం...ప్రభుత్వ అలసత్వం..వెరసి విద్యార్థులకు ఇబ్బందులు తెచ్చి పెడుతున్నాయి. అత్యున్నత సాంకేతిక విద్య అందించేందుకు ట్రిపుల్ ఐటీని మంజూరు చేసే విషయంలో ఉన్న శ్రద్ధ వసతులు కల్పించడంలో లేదు. 2016లో టీడీపీ సర్కార్ కొత్తగా శ్రీకాకుళం, ఒంగోలు ట్రిపుల్ ఐటీల ఏర్పాటుకు పూనుకుంది. అనుకున్నదే తడువుగా తరగతులు ప్రారంభించేలా చర్యలు చేపట్టారు. అయితే సమస్యలు శాశ్వత పరిష్కారం దిశగా ఇప్పటివరకు అడుగులు పడకపోవడం గమనార్హం. ఇడుపులపాయలోనే రెండేళ్లు విద్యా సంవత్సరం దాటి మూడో ఏడాది అడ్మిషన్ల ప్రక్రియ నడుస్తున్నా ఇప్పటికీ ఒంగోలులో ప్రత్యేక బోధనకు బీజం పడలేదు. ప్రస్తుతం వేంపల్లె సమీపంలోని ఇడుపులపాయలోనే రెండు ట్రిపుల్ ఐటీల విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. వైఎస్సార్ జిల్లాకు చెందిన ట్రిపుల్ ఐటీ విద్యార్థులు సొంత భవనాల్లో విద్యను అభ్యసిస్తుండగా.. ఒంగోలు ట్రిపుల్ ఐటీ వారు పాత క్యాంపస్ (రేకుల షెడ్లు)లో ఉంటున్నారు. అక్కడ విద్యాబోధనతోపాటు హాస్టల్ వసతులు కల్పించారు. దివంగత సీఎం వైఎస్సార్ హయాంలో ఇడుపులపాయలో ట్రిపుల్ ఐటీ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ లభించింది.ఈ నేపథ్యంలో 2008లో తాత్కాలిక షెడ్లు వేసి ప్రారంభించారు. ప్రస్తుతం రెండేళ్ల ఇంటర్ విద్యను పూర్తి చేసుకుని ఇంజినీరింగ్‌లోకి అడుగు పెడుతున్న విద్యార్థులకు భవనాల్లో చదువు ఏర్పాట్లకు ఒంగోలు ట్రిపుల్ ఐటీ యాజమాన్యం చర్యలు చేపట్టింది. ప్రస్తుత సంవత్సరానికి సంబంధించి ఇంజినీరింగ్ విద్యార్థులను భవనాల్లో సర్దుబాటు చేయడం ద్వారా పాత క్యాంపస్‌లో రెండు వేల మందిని యథావిధిగా కొనసాగించేలా చర్యలు చేపడుతున్నారు. కొలిక్కి రాని ఒంగోలు వ్యవహారం ప్రస్తుతం ఎన్నికల హడావుడి ప్రారంభమవుతోంది.డిసెంబరులోనే ఎన్నికలు ఉంటాయని ప్రచారం జరుగుతోంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ ఒంగోలు ట్రిపుల్ ఐటీ శాశ్వత క్యాంపస్ ఏర్పాటు చేయలేదు. ప్రకాశం జిల్లాలో పలుచోట్ల భూముల అన్వేషణ ప్రారంభించింది. కనిగిరి నియోజకవర్గంలో దాదాపు 200కు పైగా ఎకరాల స్థలం సిద్ధంగా ఉన్నట్లు ప్రత్యేక బృందాలు గుర్తించాయి. ఈ విషయం మంత్రివర్గంలో చర్చించి జీఓ విడుదల చేయాల్సి ఉంది. ఇదంతా ఎప్పుడు కొలిక్కి వస్తుంది.. ఎప్పుడు ఆమోదముద్ర పడుతుందనేది అర్థం కావడం లేదు. ఎందుకంటే స్థలానికి సంబంధించి అన్ని అనుమతులు తీసుకోవాలంటేనే చాలా సమయం పడుతుంది. పైగా ఈ ఏడాది ఎన్నికల ఏడాదిగా భావిస్తున్న తరుణంలో యుద్ధ ప్రాతిపదికన పనులు జరగడం గగనమే. స్థల సేకరణకే దాదాపు రెండేళ్లుగా సమయం పడితే.. ఇక భవనాల నిర్మాణానికి ఎన్ని రోజులు వేచి చూడాల్సి వస్తుందోనని పలువురు విద్యార్థులు పేర్కొంటున్నారు. ఒంగోలు ట్రిపుల్ ఐటీలో 3 వేలమంది జిల్లాలోని ఇడుపులపాయలో ఏర్పాటు చేసిన ఒంగోలు ట్రిపుల్ ఐటీలో విద్యార్థులు మూడు వేల సంఖ్యను దాటుతున్నారు. మొదటి సంవత్సరం వెయ్యి మందితోపాటు అదనంగా మరో 150 మంది..రెండో ఏడాది మరో వెయ్యి కలుపుకుని 2150 మందికి పైగా ఉండగా, ప్రస్తుత సంవత్సరంలో కూడా వెయ్యి మందికి అడ్మిషన్లు ఇస్తున్నారు. ఈ నేప«థ్యంలో ఒంగోలు ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో మూడు వేల మంది మార్కును దాటుతున్నారు. ప్రస్తుతం ట్రిపుల్ ఐటీలో అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. విద్యార్థులకు తప్పని ఇబ్బందులు ఒంగోలు ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు ఇబ్బందులు తప్పడంలేదు. మొదటి, రెండు సంవత్సరాల వారికి మొదట్లో చాలా రోజులు ల్యాప్‌టాప్‌ల సమస్య వేధించింది. దీంతో స్క్రీన్ మీదనే పాఠాలు బోధిస్తూ ల్యాప్‌ట్యాప్‌లు లేకుండా విద్యా సంవత్సరాన్ని కొనసాగించారు. రేకుల షెడ్లలో సమస్యలు వెంటాడుతున్నాయి. తాత్కాలికం మాటున వారు అవస్థలు పడుతున్నారు. సొంత భవనాలు లేకపోవడంతో పాత క్యాంపస్‌లోనే ఉండాల్సి వస్తోంది. కోస్తాంధ్ర జిల్లాల్లోని ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు నూజివీడు, ఒంగోలు క్యాంపస్‌లు అనువుగా ఉంటాయి. ఉత్తరాంధ్ర జిల్లాల వారికి శ్రీకాకుళం, రాయలసీమ ప్రాంత విద్యార్థులకు ఇడుపులపాయ సౌకర్యంగా ఉంటుంది. అయితే శ్రీకాకుళం, ఇడుపులపాయ మినహాయిస్తే ఒంగోలు విద్యార్థులకు అటు, ఇటు వెళ్లిరావాలన్నా కూడా కష్టతరమైన పరిస్థితులు నెలకొన్నాయి. దూర ప్రయాణాలు చేయలేక అవస్థలు పడాల్సి వస్తోంది. సమస్యల్లేవు...భవనాల్లోకి మారుతున్నాం,ట్రిపుల్ ఐటీ ఇన్చార్జి డైరెక్టర్ నరసింహరాజు ఒంగోలు ట్రిపుల్ ఐటీలో విద్యను అభ్యసించే మూడో సంవత్సరం విద్యార్థులకు భవనాల్లో వసతి కల్పించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ట్రిపుల్ ఐటీ ఇన్చార్జి డైరెక్టర్ నరసింహారాజు తెలిపారు. సమస్యల విషయమై ‘సాక్షి’ ప్రతినిధి డైరెక్టర్‌ను వివరణ కోరగా పై విధంగా స్పందించారు. భవనాలకు సంబంధించి పనులు పూర్తయ్యాయని వెల్లడించారు. ప్రస్తుతం ఒంగోలు ట్రిపుల్ ఐటీలో ఎలాంటి సమస్యలు లేవు. తాత్కాలిక క్యాంపస్‌లోనే ఒకటి, రెండు సంవత్సరాల విద్యార్థులకు వసతి ఉంటుందన్నారు. ఒంగోలు ట్రిపుల్ ఐటీకి సంబంధించి కనిగిరి వద్ద స్థల సేకరణ పూర్తయిందని, జీఓ రావడమే తరువాయి అని తెలిపారు. ప్రస్తుతానికి అడ్మిషన్లు ఇడుపులపాయలోనే చేసుకుంటున్నామని తెలిపారు. -
ట్రిపుల్ఐటీకి రండి ఇలా...
సమీకృత ఇంజినీరింగ్ విద్యాబోధనకు నిలయమైన ట్రిపుల్‌ఐటీలో ఆహ్లాదకరమైన వాతావరణం, క్రమశిక్షణ, ఉత్తమ విద్యాబోధన నూజివీడు ట్రిపుల్ఐటీ సొంతం. ఆరుసంవత్సరాల కోర్సులో విద్యతో పాటు విద్యార్థుల మానసిక, శారీరక వికాసానికి గాను ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, క్రీడలు, శాస్త్రీయ సంగీతం, నాట్యం, యోగ వంటి కోర్సులు కూడా ఇక్కడ ప్రత్యేకం. నూజివీడు ట్రిపుల్‌ఐటీలో ఈనెల 4 నుంచి నుంచి 7వ తేదీ వరకు నూజివీడు, శ్రీకాకుళం ట్రిపుల్‌ఐటీలకు కౌన్సెలింగ్ నూజివీడు ట్రిపుల్‌ఐటీలో నిర్వహించనున్నారు. 2018–19 విద్యాసంవత్సరానికి ప్రవేశాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో అవగాహన కల్పించేందుకు ‘సాక్షి’ అందిస్తున్న సమగ్ర కథనం. నూజివీడు: నూజివీడు ట్రిపుల్‌ఐటీలో ప్రథమ సంవత్సరంలో ప్రవేశానికి నిర్వహిస్తున్న కౌన్సెలింగ్‌లో భాగంగా ఈనెల 4,5 తేదీల్లో నూజివీడు ట్రిపుల్ఐటీ అభ్యర్థులకు, 6,7న శ్రీకాకుళం ట్రిపుల్ఐటీ అభ్యర్థులకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఈ కౌన్సెలింగ్‌కు శ్రీకాకుళం నుంచి ప్రకాశం జిల్లా వరకు చెందిన విద్యార్థులు పాల్గొననున్నారు. కౌన్సెలింగ్‌కు రావాల్సిన అభ్యర్థులందరికీ ఇప్పటికే ట్రిపుల్ఐటీ అధికారులు కాల్‌లెటర్లు పంపడంతో పాటు వారి సెల్ఫోన్లకు మెస్సేజ్‌లు ఇచ్చారు. ♦ ఆరు సంవత్సరాల సమీకృత ఇంజినీరింగ్ విద్యలో మొదటి రెండు సంవత్సరాలు ఇంటర్‌కు సమానమైన పీయూసీ కోర్సును, తరువాత నాలుగు సంవత్సరాలు ఇంజినీరింగ్ విద్య బోధిస్తారు. ♦ ట్రిపుల్‌ఐటీలో చేరిన తరువాత విద్యార్థులు మొదటి రెండు సంవత్సరాలు ఏడాదికి రూ.36వేలు, తరువాత నాలుగు సంవత్సరాలు ఏడాదికి రూ.40వేలు చొప్పున చెల్లించాలి. ♦ ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అర్హత కలిగిన విద్యార్థులకు ప్రభుత్వమే చెల్లిస్తుంది. ప్రభుత్వం చెల్లించిన నగదు పోను మిగిలిన సొమ్మును విద్యార్థులే చెల్లించాల్సి ఉంటుంది. ♦ అన్ని సబ్జెక్టులకు ప్రతినెలా పరీక్షలు ఉంటాయి. నాలుగు నెలల తరువాత సెమిస్టర్ పరీక్షలు ఉంటాయి. ఆగస్టు ఒకటి నుంచి తరగతులు ప్రారంభమై నవంబరు 30 వరకు తరగతులు ఉంటాయి. అనంతరం సెమిస్టర్ పరీక్షలు ఉంటాయి. ♦ సెలవు రోజులలో తల్లిదండ్రులు వచ్చి తమ పిల్లలతో గడపడానికి అవకాశం ఉంది. అత్యవసర పరిస్థితులలో పిల్లలను అవసరమైతే ఇళ్లకు పంపుతారు. అయితే ఇచ్చిన గడువులోగా తిరిగి రాకపోతే ఫైన్ విధిస్తారు. ♦ విద్యార్థుల ఆరోగ్యానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. దీనికి గాను ట్రిపుల్ఐటీ ఆవరణలోనే 30 పడకల ఆస్పత్రి ఏర్పాటు చేశారు. అందులో 24గంటలు వైద్యులు అందుబాటులో ఉంటారు. ♦ ఫీజు రీయింబర్స్మెంట్ పథకం కిందకు రాని అభ్యర్థులకు రూ.36వేలు చెల్లించాల్సి ఉంది. కాబట్టి ‘ డైరెక్టర్, ఆర్జీయూట్రిపుల్ఐటీ నూజివీడు’ పేరున డీడీని ఏ జాతీయ బ్యాంకు నుంచైనా తీసుకుని ఇవ్వాలి. ♦ రిజిస్ట్రేషన్ ఫీజు కింద వెయ్యి రూపాయలు, ఎస్సీ, ఎస్టీలు అయితే రూ.500 చెల్లించాలి. అలాగే రిఫండబుల్ కాషన్ డిపాజిట్ కింద ప్రతి అభ్యర్థి రూ.2వేలు అడ్మిషన్ సమయంలో చెల్లించాలి. కౌన్సెలింగ్‌కు తీసుకురావాల్సినవి.. పదో తరగతి హాల్ టికెట్, గ్రేడ్‌షీట్, టీసీ, కాండక్ట్ సర్టిఫికెట్, స్టడీ సర్టిఫికెట్(4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు), మీసేవా కేంద్రం నుంచి తీసుకున్న కులధ్రువీకరణ పత్రం, ఈ ఏడాది ఏప్రిల్ తరువాత మీసేవా కేంద్రం ద్వారా తీసుకున్న ఆదాయ ధ్రువపత్రం, అభ్యర్థి, అతడి తండ్రిది గాని, తల్లిది కాని రెండు పాసుపోర్టు ఫొటోలు, రేషన్‌కార్డు, అభ్యర్థి ఆధార్‌కార్డు, విద్యార్థులకు ఎవరికైనా బ్యాంకు లోన్ అవసరమైతే పైన పేర్కొన్న సర్టిఫికెట్లన్నీ నాలుగు సెట్లు, అభ్యర్థి తండ్రి ఉద్యోగి అయితే ఐడెంటీ కార్డు, శాలరీ సర్టిఫికెట్, అభ్యర్థి తండ్రి పాన్‌కార్డు, ఆధార్‌కార్డు, ఓటర్ కార్డు తెచ్చుకోవాలి. ఎలా రావాలంటే.. ప్రకాశం, గుంటూరు జిల్లాల వైపు నుంచి వచ్చేవారు విజయవాడ బస్టాండుకు చేరుకున్న తరువాత అక్కడి నుంచి ప్రతి పది నిమిషాములకు నూజివీడుకు బస్సులున్నాయి. విజయవాడ నుంచి నూజివీడు 40కిలోమీటర్ల దూరం. నూజివీడు బస్టాండులో దిగిన తరువాత అక్కడి నుంచి మైలవరం రోడ్డులో ఉన్న ట్రిపుల్ఐటీకి నిత్యం ఆటోలు ఉంటాయి. జ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల నుంచి వచ్చే విద్యార్థులు హనుమాన్‌జంక్షన్ బస్టాండులో గాని, రైల్వేస్టేషన్లో గాని దిగి రావచ్చు. అక్కడి నుంచి నూజివీడుకు నిత్యం బస్సులు, ఆటోలు అందుబాటులో ఉన్నాయి. -
ట్రిపుల్ ఐటీలో ప్రవేశానికి ఎంపిక జాబితా విడుదల
వేంపల్లె : రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వ విద్యాలయం పరిధిలలోని నూజివీడు, శ్రీకా కుళం, ఇడుపులపాయ, ఒంగోలు ట్రిపుల్ ఐటీలకు 2018–19 విద్యా సంవత్సరానికి సంబం ధించి ప్రవేశానికి ఎంపిక జాబితా విడుదలైంది. ఈ మేరకు శుక్రవారం విశాఖపట్టణంలోని ఆం ధ్రా యూనివర్సిటీలో మంత్రి గంటా శ్రీనివాసరావు, ఆర్జీయూకేటీ వైస్ చాన్సలర్ రామచంద్రరాజు, కన్వీనర్ గోపాల్‌రాజుల ఆధ్వర్యంలో ఎంపిక జాబితాను విడుదల చేశారు. నాలుగు ట్రిపుల్ ఐటీలకు 4వేలు సీట్లు ఉండగా.. 50850 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. అందులో 257 సీట్లు స్పెషల్ కేటగిరీకి పోగా.. 3743 సీట్లు ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలోని 8 జిల్లాలకు, వెంకటేశ్వర యూనివర్శిటీ పరిధిలోని 5 జిల్లాలకు సమానంగా కేటాయించారు. ఆంధ్రా యూనివర్సిటీ పరిధిలోని 8జిల్లాలకు 1956సీట్లు, వెంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలోని 5జిల్లాలకు 1224 సీట్లు.. మిగిలిన 561సీట్లు ఇతర రాష్ట్రాలకు (నాన్ లోకల్) కేటాయించారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు 27,988 దరఖాస్తు చేసుకోగా.. ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు 22,862మంది దరఖాస్తు చేసుకున్నారు. అందులో ప్రభుత్వ పాఠశాలలోని 2915 మంది విద్యార్థులు పదికి 10జీపీఏ పాయింట్లు సాధించగా.. ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు 7505 మంది పదికి 10 పాయింట్లు సాధించారు. వీరికి జులై 4, 5 తేదీలలో నూజివీడు, ఆర్కే వ్యాలీ(ఇడుపులపాయ) క్యాంపస్‌లలో అడ్మిషన్ల ప్రక్రియ జరుగుతుంది. అలాగే 6, 7 తేదీలలో శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీకి సంబంధించి నూజివీడులో, ఒంగోలు ట్రిపుల్ ఐటీకి సంబంధించి ఆర్కే వ్యాలీ ఇడుపులపాయలలో అడ్మిషన్లు జరుగుతాయి. మొత్తం 3743 సీట్లకుగానూ 1358 మంది బాలురు, 2385 మంది బాలికలు ఉన్నారు. గ్రామీణ ప్రాంత పేద విద్యార్థులకు ఆరేళ్ల సమీకృత సాంకేతిక విద్యను అందించేందుకు ట్రిపుల్ ఐటీలను నెలకొల్పారని ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ ఇన్చార్జి డైరెక్టర్ అమరేంద్రకుమార్ తెలిపారు. అందులో భాగంగా ఇడుపులపాయ ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీకి సంబంధించి 936 సీట్లకు జులై 4, 5 తేదీలలో అడ్మిషన్ల ప్రక్రియ ఉంటుందని తెలిపారు. అందులో బాలురు 339 మంది, బాలికలు 597 మంది ఉన్నారని తెలిపారు. అదేవిధంగా ఇడుపులపాయ క్యాంపస్‌లో నిర్వహించే ఒంగోలు ట్రిపుల్ ఐటీకి సంబంధించి 936 సీట్లకు 6, 7 తేదీలలో అడ్మిషన్లు జరుగుతాయి. అందులో 320 మంది బాలురకు, 616 మంది బాలికలకు అడ్మిషన్లు జరుగుతాయి. జులై 16న ప్రత్యేక కేటగిరి విద్యార్థులకు అడ్మిషన్లు ఉంటాయి. 20వ తేదీన రెండవ జాబితా ఉంటుందని.. 24వ తేదీ నుంచి 31వ తేదీ వరకు సూపర్ న్యూమరీ అడ్మిషన్లతో పూర్తవుతాయని తెలిపారు. ఆగస్ట్ 1వ తేదీనుంచి తగరతులు ప్రారంభమవుతాయన్నారు. విద్యార్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు విద్యార్హత సర్టిఫికెట్లతోపాటు స్టడీ, ఇన్‌కం, రెసిడెన్షియల్, రేషన్‌కార్డు ఆధార్ కార్డు, ఆరు పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు, ఎస్బీఐ అకౌంటు పాసు పుస్తకం తీసుకుని రావాలని ఆయన తెలిపారు. -
గంటాపై చంద్రబాబుకు కందుకూరు ఎమ్మెల్యే ఫిర్యాదు
-
ట్రిపుల్ ఐటీ ఫ్యాకల్టీ నోటిఫికేషన్‌పై సందేహాలెన్నో?
రాష్ట్రంలోని నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీల్లో కాంట్రాక్టు పద్ధతిన ఫ్యాకల్టీల నియామకానికి ఇటీవల విడుదల చేసిన నోటిఫికేషన్లో పారదర్శకత లోపించడంతో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఉన్న సిబ్బంది, దరఖాస్తు చేసుకోవాలనుకునే వారిలో గందర గోళం ఉంది. నూజివీడు : రాష్ట్రంలోని నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీల్లో కాంట్రాక్టు పద్ధతిన ఫ్యాకల్టీల నియామకానికి ఇటీవల విడుదల చేసిన నోటిఫికేషన్లో పారదర్శకత లోపించడంతో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇంజినీరింగ్‌కు సంబంధించి సివిల్, మెకానికల్, ఈసీఈ, సీఎస్ఈ, కెమికల్, ఎంఎంఈ బ్రాంచిలకు, సైన్స్ సబ్జెక్టులైన గణితం, భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం, జంతుశాస్త్రం, హ్యుమానిటీస్, సోషల్ సైన్స్లకు ఫ్యాకల్టీలు కావాలని ఈనెల 15న నోటిఫికేషన్ జారీచేశారు. వీటికి అర్హులైన వారు ఈనెల 29 సాయంత్రం 5గంటల లోపు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ నోటిఫికేషన్‌పై ప్రస్తుతం ఉన్న సిబ్బందిలోను, దరఖాస్తు చేసుకోవాలనుకునే వారిలోను అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రోస్టర్ పాయింట్ పాటిస్తారా...లేదా..? ఏ ప్రభుత్వ విద్యాసంస్థ అయినా కాంట్రాక్టు పద్ధతిపై నియామకాలు చేస్తున్నప్పుడు కచ్చితంగా రోస్టర్‌పాయింట్ పాటించాలి. ఆర్జీయూ కేటీ విడుదల చేసిన నోటిఫికేషన్లో రోస్టర్ పాయింట్ విధానం అమలుచేస్తారా, లేదా అనేది పేర్కొనలేదు. అభ్యర్థులు అనేక సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ రోస్టర్‌పాయింట్ విధానం అమలైతే దరఖాస్తుతోపాటు కుల ధ్రువీకరణ పత్రాలను కూడా జతచేయాల్సి ఉంటుంది. ఈ వివరాలేమీ నోటిఫికేషన్లో పేర్కొనకపోవడంతో అభ్యర్థుల్లో గందరగోళం నెలకొంది. పోస్టులపై స్పష్టత లేదు నాలుగు ట్రిపుల్ ఐటీలలో కలిపి 300పోస్టులపైనే ఫ్యాకల్టీలను కాంట్రాక్టు పద్ధతిలో తీసుకుంటామని పేర్కొన్నారే తప్పితే ఏ సబ్జెక్టుకు ఎంతమంది అనే వివరాలు పొందుపరచలేదు. ఇంజినీరింగ్‌కు సంబంధించి సివిల్, కంప్యూటర్ సైన్స్, కెమికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్, కెమికల్, మెటీరియల్స్ అండ్ మెటలర్జికల్స్ బ్రాంచిలతోపాటు గణితం, భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం, జంతుశాస్త్రం, ఇంగ్లీష్, తెలుగు, మేనేజ్మెంట్, ఫైన్ఆర్ట్స్, యోగా, సైకాలజీ, ఫిజికల్ ఎడ్యుకేషన్, లైబ్రరీ సైన్స్ తదితర సబ్జెక్టులకు ఫ్యాకల్టీలను నియమిస్తున్నామని తెలిపారే తప్పితే ఏ సబ్జెక్టుకు ఎంత మంది అవసరమో తెలపలేదు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ట్రిపుల్‌ఐటీల వారీగా నోటిఫికేషన్ జారీచేయకుండా అన్నిటికి కలిపి ఒకే నోటిఫికేషన్ జారీచేశారు. అంతేగాకుండా ఇంజినీరింగ్ ఫ్యాకల్టీకి, పీయూసీ ఫ్యాకల్టీలకు ఎంతెంత జీతాలు చెల్లిస్తారో కూడా పేర్కొనలేదు. దరఖాస్తులో ఏ ట్రిపుల్ఐటీకి దరఖాస్తు చేసుకుంటున్నారనే ఆప్షన్ కూడా ఇవ్వలేదు. గతంలో ఏ ట్రిపుల్ఐటీకి ఆ ట్రిపుల్ఐటీనే నోటిఫికేషన్ జారీచేసి ఫ్యాకల్టీలను నియమించుకునే వారు. అందుకు భిన్నంగా ఇప్పుడు యూనివర్శిటీనే భర్తీ చేస్తున్నప్పటికీ నోటిఫికేషన్ పారదర్శకంగా లేకపోవడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
శ్రీకాకుళం ట్రిపుల్ఐటీ ఇక్కడేనా..!
నూజివీడు : రెండేళ్లుగా నూజివీడు ట్రిపుల్ఐటీ క్యాంపస్‌లో తాత్కాలికంగా నిర్వహిస్తున్న శ్రీకాకుళం ట్రిపుల్‌ఐటీని రాబోయే విద్యాసంవత్సరానికి కూడా శ్రీకాకుళం జిల్లాలోని ఎస్‌ఎంపురానికి తరలించే సూచనలు కనిపించడం లేదు. ఆగస్టు ఒకటో తేదీ నుంచి పీయూసీ ప్రథమ సంవత్సరం తరగతులు ప్రారంభంకానున్న నేపధ్యంలో శ్రీకాకుళం ట్రిపుల్ఐటీ విద్యార్థుల సంఖ్య 3వేలకు చేరనుంది. దీనికి తోడు నూజివీడు ట్రిపుల్ఐటీ విద్యార్థులు 6500 మందిని కలిపితే మొత్తం విద్యార్థుల సంఖ్య 9500లకు చేరనుంది. అయితే ఇంత మంది విద్యార్థులకు తరగతులు నిర్వహించడానికి తరగతి గదులు, ఉండటానికి హాస్టల్ గదులు అందుబాటులో ఉన్నప్పటికీ, ఇతర విషయాల్లో సమస్యలు మాత్రం పెద్ద ఎత్తున ఎదురయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వేధించనున్న నీటి సమస్య... నూజివీడు ట్రిపుల్‌ఐటీలో గత కొన్ని నెలలుగా నీటి సమస్య వేధిస్తోంది. ఈ పరిస్థితుల్లో దాదాపు 10 వేలకు చేరుతున్న విద్యార్థులకు సరిపడా నీటి లభ్యత లేని పరిస్థితులు ఉన్నాయి. 9500 మంది విద్యార్థులకు, క్యాంపస్‌లోనే ఉంటున్న సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు కలిపి మరో 1000 మంది ఉన్నారు. వీరందరికి రోజుకు కనీసం 12 లక్షల నుంచి 15 లక్షల లీటర్ల నీళ్లు అవసరమవుతాయి. ప్రస్తుతం క్యాంపస్‌లో 23 బోర్లు ఉండగా ఈ బోర్ల మోటర్లు 12 గంటలు పనిచేస్తే కేవలం 4 లక్షల లీటర్లు మాత్రమే వస్తున్నాయి. పురపాలకసంఘంకు చెందిన కృష్ణాజలాల ప్రాజెక్టు నుంచి రోజుకు 5నుంచి 6 లక్షల లీటర్లు వస్తున్నాయి. ఈ రెండు వనరుల నుంచి కేవలం 10 లక్షల లీటర్లు మించి రావడం లేదు. ఇంకా 5 లక్షల లీటర్లు నీళ్లు అవసరమై ఉంది. నూతన బోర్లు వేస్తున్నా భూగర్భజలాలు లేక బోర్లలో నీళ్లు పడటం లేదు. ఈ పరిస్థితుల్లో ప్రధానంగా నీటి సమస్య ఉత్పన్నమయ్యే పరిస్థితి నెలకొంది. శ్రీకాకుళంకు పాత క్యాంపస్ కేటాయింపు శ్రీకాకుళం ట్రిపుల్‌ఐటీలో ఈ విద్యాసంవత్సరం నుంచి ఇంజినీరింగ్ ప్రథమ సంవత్సరం కూడా ప్రారంభంకానున్న నేపథ్యంలో నూజివీడు ట్రిపుల్ఐటీతో సంబంధం లేకుండా గతంలో నూజివీడు ట్రిపుల్ఐటీకి చెందిన పీయూసీ తరగతులు నిర్వహించిన ప్రీఫ్యాబ్ క్యాంపస్‌ను శ్రీకాకుళంకు అప్పగించారు. దీంతో ప్రీఫ్యాబ్ దీనిలో పీయూసీ తరగతులు నిర్వహించడానికి, హాస్టల్ గదుల ఏర్పాటుకు, స్టాఫ్ గదులకు, ల్యాబ్‌లకు సరిపోతుంది. ఎందుకు తరలించలేకపోతున్నారు... రాష్ట్ర ప్రభుత్వం శ్రీకాకుళం ట్రిపుల్‌ఐటీని ఏర్పాటు చేసి రెండేళ్లవుతున్నా ఇక్కడ నుంచి శ్రీకాకుళం జిల్లాకు మార్చడంలో మాత్రం తీవ్ర జాప్యం జరుగుతోంది. శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్ల మండలం ఎస్ఎంపురంలో ప్రభుత్వం స్థలంతో పాటు 21వ శతాబ్దం గురుకులం భవనాలను సైతం ట్రిపుల్ఐటీకి కేటాయించింది. అంతేగాకుండా ఎచ్చెర్లలోని ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలను నెలకు రూ.4లక్షలకు అద్దెకు సైతం తీసుకుని గత ఏడాది అక్టోబర్ నుంచి అద్దె చెల్లిస్తున్నారు. అయినప్పటికీ శ్రీకాకుళం ట్రిపుల్‌ఐటీని మాత్రం తరలించడం లేదు. 21వ శతాబ్దం గురుకులం భవనాల్లోను, అద్దెకు తీసుకున్న ఇంజినీరింగ్ కళాశాల భవనాలలో 5వందల మందిని మాత్రమే ఉంచడానికి కుదురుతుంది. దీంతో అక్కడే రెండు క్యాంపస్‌లు నిర్వహించాలంటే పరిపాలనా పరంగా తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ నేపధ్యంలో పూర్తిస్థాయిలో భవనాలు అందుబాటులోకి వచ్చిన తరువాతే అక్కడకు మారాలని ఛాన్సలర్ పేర్కొనట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ ఏడాది కూడా ఇక్కడే తరగతులు కొనసాగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. -
కస్తూర్బా బాలికలకు ట్రిపుల్ ఐటీ కలేనా?
ప్రకాశం, కందుకూరు అర్బన్:గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేద విద్యార్థినులు రాష్ట్ర విద్యాశాఖ చేస్తున్న తప్పిదాల వల్ల ఉన్నత చదువుకు దూరమయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి. నూజివీడు, బాసర, పులివెందుల ట్రిపుల్ ఐటీ కళాశాలల్లో ప్రవేశానికి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నా.. కస్తూర్బా గాంధీ విద్యాలయాలకు చెందిన బాలికలు మాత్రం దరఖాస్తు చేసుకోలేకపోతున్నారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన ఎంతో మంది విద్యార్థులు ట్రిపుల్ ఐటీ కళాశాలల్లో చదివి ఉద్యోగాల్లో స్థిరపడటంతో ఈ కాలేజీల్లో చదువుకోవాలని బాలికలు ఉత్సాహం చూపుతున్నారు. ముఖ్యంగా కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో చదివి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు ట్రిపుల్ ఐటీల్లో చేరి ఉజ్వల భవిష్యత్ పొందాలని కలలు కంటున్నారు. కానీ వారి కళ నేరవేరేటట్లు కనిపించడం లేదు. ప్రభుత్వం ఈ ఏడాది ట్రిపుల్ ఐటీలో ప్రవేశాల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ప్రకటించింది. అయితే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి వెళ్లిన విద్యార్థులు నిరాశతో వెనుదిరుగుతున్నారు. అప్లికేషన్ ఆన్లైన్ చేసే సమయంలో జిల్లా, మండలం, స్కూల్ పేర్లతోపాటు 4 తరగతి నుంచి 10వ తరగతి వరకు ఎక్కడ చదివారో వివరాలు నమోదు చేయాల్సి రావడమే ఇందుకు కారణం. ఆన్లైన్లో దరఖాస్తు చేస్తున్న సమయంలో కొన్ని ప్రభుత్వ, రెసిడెన్షియల్ స్కూళ్లు మాత్రమే కనిపిస్తున్నాయి. దీంతో ఆన్లైన్లో పొందుపరిచిన స్కూల్స్‌కు చెందిన విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఈ జాబితాలో ప్రభుత్వం రెసిడెన్షియల్ కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం పేర్లు లేకపోవడంతో ఏం చేయాలో తెలియక విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ స్కూళ్లు, కస్తూర్బా గాంధీ బాలికల విద్యార్థులు ఎలా దరఖాస్తు చేసుకోవాలో కనీస సమాచారం కూడా ఉన్నతాధికారులు తెలియజేయలేదు. జిల్లాలో 37 కస్తూరిభా గాంధీ బాలికల విద్యాలయాలు ఉన్నాయి. ఈ ఏడాది కస్తూర్బా విద్యాలయాల్లో 1206 మంది బాలికలు 10వ తరగతి పరీక్షలు రాయగా వారిలో 1154 మంది ఉత్తీర్ణత సాధించారు. 25 కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో నూరు శాతం ఉత్తీర్ణత నమోదైంది. అనేక మంది బాలికలు 10కి10 జీపీఏ, 9.8, 9.6 జీపీఏ సాధించారు. వీరిలో కొంత మంది మధ్యలో బడిమానేసి మళ్లీ చదువు కొనసాగించాలని కొండంత ఆశతో కస్తూర్బా గాంధీ పాఠశాలల్లో చేరి మంచి మార్కులు సాధించారు. ‘లక్షల రూపాయలు ఖర్చుపెట్టి ప్రైవేటు కళాశాలల్లో చదువుకునే స్థోమత మాకు లేదు. ట్రిపుల్ ఐటీ కళాశాలల్లో చేరేందుకు అవకాశం కల్పించండి’ అని బాలికలు ప్రాధేయపడుతున్నారు. జూన్ 8వ తేదీతో ట్రిపుల్ ఐటీ కాలేజీల్లో ప్రవేశానికి దరఖాస్తు గడువు ముగియనుంది. ఉన్నతాధికారులు స్పందించి ఆన్లైన్లో సమస్యను పరిష్కరించాలని విద్యార్థినులు కోరుతున్నారు. -
ట్రిపుల్‌ఐటీలో పెరగనున్న సీట్లు!
బాసర(ముథోల్): బాసర ట్రిపుల్ ఐటీలో 2018–19 సంవత్సరానికి గాను రాష్ట్ర ప్రభుత్వం 500 సీట్లు పెంచే యోచనలో ఉన్నట్లు సమాచారం. 2008లో 2000 మంది విద్యార్థులతో బాసర ట్రిపుల్‌ఐటీని ప్రారంభించారు. గత ప్రభుత్వ హయాంలో 2వేల సీట్ల నుంచి వెయ్యి సీట్లకు కుదించారు. స్థానిక ప్రజాప్రతినిధులు మళ్లీ సీట్ల సంఖ్య పెంచాలంటూ ప్రభుత్వానికి, ఉన్నతాధికారులకు పలుసార్లు ప్రతిపాదనలు పంపారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం సీట్లు పెంచే యోచనలో ఉన్నట్లు తెలిసింది. ప్రస్తుతం ట్రిపుల్‌ఐటీలో 6వేల మంది విద్యార్థులు అభ్యసిస్తున్నారు. ఇక్కడ ఆరేళ్లు విద్యాభ్యాసం పూర్తి చేసిన వందలాదిమందికి ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో కొలువులు సాధించారు. ప్రస్తుతం 500 సీట్లు పెరగనుండడంతో గ్రామీణ విద్యార్థులకు న్యాయం జరగనుంది. సీట్ల పెంపు సమాచారంపై స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామీణ విద్యార్థుల్లో హర్షం వ్యక్తమవుతోంది. -
ఉన్నత చదువు ఎక్కడైనా ఉచితం
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల ఉన్నత చదువుల కోసం రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దేశంలోని ప్రముఖ విద్యాసంస్థల్లో ఎక్కడ చదివినా వారి ఫీజులను సర్కారే భరించనుంది. ప్రస్తుతం ఉన్నత, సాంకేతిక విద్య అభ్యసించే వారికి ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అందుబాటులో ఉంది. కానీ ఇది కేవలం రాష్ట్ర పరిధిలోని విద్యా సంస్థల వరకే పరిమితం. సెట్ (కామన్ ఎంట్రన్స్ టెస్ట్) రాసిన తర్వాత కన్వీనర్ కోటాలో వచ్చే సీట్లకు మాత్రమే ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తోంది. ప్రతిభావంతులైన ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు కొందరు ఇతర రాష్ట్రాల్లోని ప్రఖ్యాత విద్యా సంస్థల్లో సీట్లు సాధిస్తున్నా.. ఆర్థిక పరమైన ఇబ్బందుల వల్ల అందులో చేరలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ఇతర రాష్ట్రాల్లోని కేంద్ర ప్రభుత్వ విద్యాసంస్థలు, యూనివర్సిటీలు, ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ఐటీల్లో ప్రవేశాలు పొందిన ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల ఫీజులను భరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వాస్తవానికి ఈ పథకం 2017–18 విద్యా సంవత్సరం నుంచే అందుబాటులోకి వచ్చినా.. కేటగిరీల వారీగా విద్యాసంస్థలు, వర్సిటీల పేర్లను పేర్కొంటూ ఎస్సీ అభివృద్ధి శాఖ రూపొందించిన ప్రతిపాదనలను ప్రభుత్వం తాజాగా ఆమోదించింది. ఏటా 4 వేల మందికి లబ్ధి ఇతర రాష్ట్రాల్లో ఉన్నత చదువులపై తెలంగాణ విద్యార్థులు ఆసక్తి కనబరుస్తున్నారు. ట్రిపుల్ఐటీ, ఐఐటీ సీట్లలో రాష్ట్ర విద్యార్థుల సంఖ్య ఏటా పెరుగుతోంది. మరోవైపు సంక్షేమ శాఖల పరిధిలోని గురుకుల పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు సైతం పలు పోటీ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తూ.. ప్రఖ్యాత వర్సిటీలు, విద్యా సంస్థల్లో సీట్లు సంపాదిస్తున్నారు. గతేడాది సంక్షేమ గురుకుల పాఠశాలల నుంచి ఏకంగా 260 మంది విద్యార్థులు ఢిల్లీ యూనివర్సిటీ, అజీమ్ ప్రేమ్‌జీ యూనివర్సిటీ, ట్రిపుల్ఐటీ, నిట్ తదితర విద్యా సంస్థల్లో సీట్లు దక్కించుకున్నారు. విద్యాశాఖ గణాంకాల ప్రకారం పొరుగు రాష్ట్రాల్లోని యూనివర్సిటీలు, విద్యా సంస్థల్లో సీట్లు పొందుతున్న వారి సంఖ్య 20 వేల పైమాటే. వీరిలో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు దాదాపు 4 వేల మంది ఉంటారని అంచనా. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో ఈ విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 230 విద్యా సంస్థల్లో ప్రవేశాలకు ఫీజు రీయింబర్స్మెంట్ పథకం వర్తిస్తుందని, దీనిపై విస్తృత ప్రచారం చేయనున్నట్లు ఎస్సీ అభివృద్ధిశాఖ సంచాలకుడు పి.కరుణాకర్ ‘సాక్షి’తో పేర్కొన్నారు. -
వనపర్తిలో ట్రిపుల్ ఐటీ!
వనపర్తి: తెలంగాణ రాష్ట్రంలో మరో ట్రిపుల్ ఐటీ కళాశాల ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఉమ్మడి రాష్ట్రానికి రెండు ట్రిపుల్ ఐటీలు మంజూరైతే.. నాడు తెలంగాణ ప్రాంతంలోని బాసరలో ఒకటి, ఆంధ్రా ప్రాంతంలోని నూజివీడులో మరోటి ఏర్పాటు చేశారు. రాష్ట్ర విభజన తర్వాత రెండు రాష్ట్రాలకు ఒక్కో ట్రిపుల్ ఐటీ కళాశాలలు వచ్చాయి. ప్రస్తుతం ఉత్తర తెలంగాణలోని బాసరలో మాత్రమే ట్రిపుల్ ఐటీ ఉంది. దక్షిణ తెలంగాణలో బాసర యూనివర్సిటీ అనుబంధంగా మరో కళాశాల ఏర్పాటు చేయాలని ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది. ఈ మేరకు విషయం తెలుసుకున్న రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి వనపర్తిలో సంస్థానాధీశుల నుంచి విద్యకు ఇస్తున్న ప్రాముఖ్యతను వివరిస్తూ ట్రిపుల్ ఐటీని వనపర్తిలో ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ లేఖరాశారు. వనపర్తి రోడ్ రైల్వేస్టేషన్, 130కిలోమీటర్ల దూరంలో అంతర్జాతీయ విమానాశ్రయం, 15 కిలోమీటర్ల దూరంలో 44 జాతీయ రహదారి ఉన్నాయని నిరంజన్‌రెడ్డి రాసిన లేఖలో పేర్కొన్నారు. ఈ మేరకు ప్రతిపాదనలను ప్రభుత్వం పరిగణంలోకి తీసుకుని ట్రిపుల్ ఐటీ కళాశాల ఏర్పాటుకు కావాల్సిన వనరులు, స్థలం, భవనా లు ఉన్నాయా అనే విషయం పరిశీలించాలని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ టి.పాపిరెడ్డి అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేసింది. స్థలాలు, భవనాల పరిశీలన ట్రిపుల్ ఐటీ కళాశాల ఏర్పాటుకు కావాల్సిన వనరులు, స్థలాలు, భవనాలు ఇతర అంశాలను పరిశీలించేందుకు సోమవారం ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ టి.పాపిరెడ్డి, వైస్‌చైర్మన్ లింభాద్రి, సభ్యులు నరసింహారెడ్డి వనపర్తికి వచ్చారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి వారికి వనపర్తిలో ప్రభుత్వ భవనాలు, స్థలాలు, విద్యుత్, నీటివసతి, రహదారులు, ఇదివరకే ఇక్కడ ఉన్న విద్యాలయాల వివరాలను వెల్లడించారు. తాత్కాలికంగా ట్రిపుల్ ఐటీ కళాశాల ఏర్పాటుకు కావాల్సిన భవనాలు ప్రస్తుత ప్రభుత్వ పాలిటెక్నిక్ భవనాన్ని చూపించారు. అలాగే, శాశ్వత నిర్మాణానికి కావాల్సిన ప్రభుత్వ స్థలాలను ప్రస్తుతం కొత్తగా నిర్మిస్తున్న సమీకృత కలెక్టరేట్ భవనాల పక్కనే ఉన్నాయని వివరించారు. ఈ సందర్భంగా పరిశీలనకు వచ్చిన అధికారులు సంతృప్తి వ్యక్తంచేశారు. అనంతరం వారు నిరంజన్‌రెడ్డి నివాసంలో విలేకరులతో మాట్లాడారు. అంతా ఓకే... బాసరలో ట్రిపుల్ ఐటీ యూనివర్సిటీకి అనుబంధంగా కళాశాల ఏర్పాటుకు కావాల్సిన అన్నిసౌకర్యాలు వనపర్తిలో ఉన్నాయని ప్రొఫెసర్ పాపిరెడ్డి అభిప్రాయపడ్డారు. ఇదే విషయం ప్రభుత్వానికి నివేదిక ఇస్తామన్నారు. దక్షిణ తెలంగాణ ప్రాంతంలోని గ్రామీణ పేద విద్యార్థులకు ఉన్నత విద్య చేరువ అవుతుందన్నారు. మండల, గ్రామీణ ప్రాంతాల్లో పదవ తరగతిలో ఫలితాల మెరిట్ ఆధారంగా ట్రిపుల్ ఐటీలో సీట్ల ఎంపిక ఉంటుందని తెలిపారు. పదో తరగతి తర్వాత ఆరేళ్ల పాటు రెసిడెన్షియల్ వసతితో ఉన్నత సాంకేతిక విద్యను పేద విద్యార్థులకు అందిస్తామన్నారు. వనపర్తి తాత్కాలిక, శాశ్విత కళాశాల ఏర్పాటు, అధ్యాపకులు, సిబ్బంది నివాసానికి యోగ్యమైన ప్రాంతంగా గుర్తించామన్నారు. రవాణా పరంగా హైదరాబాద్– బెంగుళూరు హైవే, వనపర్తి రోడ్ రైల్వేస్టేషన్ తదితర సౌకర్యాలు ఉన్నాయన్నారు. అంతకుముందు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ నిర్వహణ కొనసాగుతున్న సంస్థానాధీశుల రాజమహల్‌ను, కొత్త కలెక్టరేట్ భవన నిర్మాణం పక్కనే ఉన్న ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించారు. వారితో పాటు జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ బి.లక్ష్మయ్య, మున్సిపల్ చైర్మన్ రమేష్‌గౌడ్, కౌన్సిలర్లు, నాయకులు ఉన్నారు. ట్రిపుల్ఐటీ వస్తే.. పరిశ్రమలు పరిశ్రమల్లో పని చేసేందుకు కావాల్సిన మ్యాన్‌పవర్ ట్రిపుల్ ఐటీ నుంచి వస్తుందని నిరంజన్‌రెడ్డి అన్నారు. ట్రిపుల్ ఐటీ ఏర్పాటు అయితే ఇక్కడ కొత్తగా పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు కార్పొరేట్ సంస్థలు ముందుకు వస్తాయని తెలిపారు. విశ్వవిద్యాలయాల సమతుల్యతల మేరకు ప్రస్తుతం ఉత్తర తెలంగాణలో ట్రిపుల్ ఐటీ యూనివర్సిటీ ఉండడంతో రెండోది దక్షిణ తెలంగాణలో ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉందని వెల్లడించారు. పాలమూరు జిల్లాలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల సహకారంతో వనపర్తిలో ట్రిపుల్ ఐటీ ఏర్పాటుకు ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. -
వనపర్తిలో ట్రిపుల్ ఐటీ!
సాక్షి, వనపర్తి : రాష్ట్రంలో మరో ట్రిపుల్ ఐటీ కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ కళాశాలను వనపర్తి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. దీనిపై సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ టి.పాపిరెడ్డి అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో పాపిరెడ్డి నేతృత్వంలోని బృందం సభ్యులు సోమవారం వనపర్తికి వచ్చారు. వనపర్తిలో ప్రభుత్వ భవనాలు, స్థలాలు, విద్యుత్, నీటివసతి, రహదారులు, ఇదివరకే ఇక్కడ ఉన్న విద్యాలయాల వివరాలను ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి వారికి వెల్లడించారు. తాత్కాలికంగా ట్రిపుల్ ఐటీ కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వ పాలిటెక్నిక్ భవనాన్ని చూపించారు. అలాగే శాశ్వత భవనాల నిర్మాణాలకు కావాల్సిన ప్రభుత్వ స్థలాలు ప్రస్తుతం కొత్తగా నిర్మిస్తున్న సమీకృత కలెక్టరేట్ భవనాల పక్కనే ఉన్నాయని తెలిపారు. ఈ వివరాలపై పరిశీలనకు వచ్చిన అధికారులు సంతృప్తి వ్యక్తంచేశారు. అనంతరం పాపిరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ త్వరలోనే వనపర్తిలోని వసతులపై ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని వెల్లడించారు. -
ట్రిపుల్‌ఐటీని నెలకోసారి సందర్శిస్తా
నూజివీడు: ప్రత్యేక లక్ష్యంతో ఏర్పాటుచేసిన ట్రిపుల్ఐటీల్లో జరుగుతున్న పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు నెలకోసారి సందర్శిస్తానని రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. స్థానిక ట్రిపుల్‌ఐటీని సందర్శించిన మంత్రి విద్యుత్ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేసే పనులను పరిశీలించారు. అనంతరం విద్యార్థుల మెస్‌లను తనిఖీ చేయడంతో పాటు విద్యార్థులను వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ట్రిపుల్ఐటీల్లో సంస్కరణలు తీసుకురావాల్సి ఉందన్నారు. శ్రీకాకుళం ట్రిపుల్‌ఐటీని కనీసం వెయ్యి మంది విద్యార్థులతో వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభమయ్యే ఆగస్టు నాటికి ఎచ్చెర్ల సమీపంలోని ఎస్ఎం పురంలో నిర్వహిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి ఏటా బడ్జెట్లో రూ.25 వేల కోట్లు ఖర్చుచేస్తుందన్నారు. విద్యార్థులకు నీటి సమస్యలేకుండా కలెక్టర్‌తో మాట్లాడి చర్యలు తీసుకుంటామన్నారు. విలేకర్ల సమావేశంలో ఆర్జీయూకేటీ వీసీ ఆచార్య వేగేశ్న రామచంద్రరాజు, నూజివీడు, శ్రీకాకుళం డైరెక్టర్లు ఆచార్య వీరంకి వెంకటదాసు, హరశ్రీరాములు పాల్గొన్నారు. నేడు నూజివీడు ట్రిపుల్ఐటీకి త్రిసభ్య కమిటీ రాష్ట్రంలోని ట్రిపుల్ఐటీల్లో జరుగుతున్న అవకతవకలు, అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీ ఈనెల 12న నూజివీడు ట్రిపుల్ఐటీకి వస్తున్నట్లు ఆర్జీయూకేటీ వైస్ చాన్సలర్ ఆచార్య వేగేశ్న రామచంద్రరాజు తెలిపారు. ఈ త్రిసభ్య కమిటీలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సీబీఎస్ వెంకటరమణ చైర్మన్‌గా, జేఎన్టీయూ కాకినాడ ఇంజినీరింగ్ కాలేజీలో సివిల్ ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్ హెచ్‌వోడీ ఎం స్వరూపారాణి, రిటైర్డ్ ఇంజినీర్ ఇన్ చీఫ్ ఎంకే రహమాన్‌లను సభ్యులుగా ఉన్నారు. ఈకమిటీని గతనెల మొదట్లో ప్రభుత్వం నియమించిందన్నారు. విచారణ చేసి 15రోజుల్లో నివేదికను ఇవ్వాలని కూడా ఉత్తర్వుల్లో పేర్కొంది. -
‘ట్రిపుల్’ కష్టాలు
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: రెండేళ్ల క్రితం రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం పేరుతో ట్రిపుల్ ఐటీ మంజూరు చేసినా జిల్లాలో వసతుల కల్పనను గాలికొదిలేయడంతో విద్యార్థుల ఇక్కట్లు అన్నీ ఇన్నీ కావు. వసతుల లేమితో జిల్లాకు కేటాయించిన ట్రిపుల్ ఐటీని తరగతులను ప్రస్తుతం వైఎస్సార్ కడప జిల్లాలో ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో నిర్వహిస్తున్నారు. దీంతో రెండేళ్లుగా ఒంగోలు ట్రిపుల్ ఐటీ ఇడుపులపాయలోనే నడుస్తోంది. 6 వేల మంది సామర్థ్యం మాత్రమే ఉన్న ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో ప్రస్తుతం ఒంగోలు ట్రిపుల్ ఐటీ విద్యార్థులతో కలిపి 8 వేల మంది ఉన్నారు. వచ్చే ఏడాది మరో వెయ్యి మంది పైనే విద్యార్థులున్నారు. ఈ లెక్కన మొత్తం విద్యార్థుల సంఖ్య 9 వేలకు చేరుతుంది. దీంతో ఇప్పటికే అక్కడ వసతుల్లేవు. విద్యార్థులకు గదుల కొరతతో పాటు మంచాలు, కంప్యూటర్ల కొరత తీవ్రంగా ఉంది. ఒంగోలు విద్యార్థులకు ట్యాబ్లిస్తామన్న ప్రభుత్వం ఇప్పటికీ పూర్తి స్థాయిలో అందజేయలేదు. ఇక ఫ్యాకల్టీ కొరత వేధిస్తోంది. మరోవైపు ఉన్న ఫ్యాకల్టీ సైతం ఒంగోలు ప్రాంతానికి చెందినవారు కావడంతో ఇడుపులపాయలో ఉండలేని పరిస్థితి ఏర్పడింది. వారు ఉండేందుకు వసతుల్లేకపోవడంతో బయట ప్రాంతాలలో ఉండి బోధనకు ఇడుపులపాయకు వెళ్లాల్సి వస్తోంది. శని, ఆదివా రాలు సెలవు తీసుకోవాలన్న రెండు రోజుల వ్యవధిలో ఒంగోలు ప్రాంతానికి వచ్చి వెళ్లలేని పరిస్థితి. దీంతో ఫ్యాకల్టీ సైతం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక విద్యార్థులది అదే పరిస్థితి. వసతుల లేమితో వారి చదువులు సజావుగా సాగడం లేదు. అయితే వసతుల లేమితో ఇక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ అక్కడి అధికారులు ఇప్పటికే తేల్చి చెప్పడంతో ఒంగోలు ట్రిపుల్ ఐటీ విద్యార్థుల పరిస్థితి ఆడకత్తెరలో పోకచెక్కలా మారింది. ఒంగోలు ట్రిపుల్ ఐటీ పరిధిలో 2016–17 విద్యా సంవత్సరంలో వెయ్యి మంది విద్యార్థులు, 2017–18 విద్యాసంవత్సరంలో వెయ్యి మందితో పాటు సూపర్ న్యూమరరీ కోటా కింద మరో 114 మంది మొత్తం 2114 మంది విద్యార్థులున్నారు. వీరందరికీ ప్రస్తుతం వైఎస్సార్ కడప జిల్లా ఇడుపులపాయలో తరగతులు నిర్వహిస్తున్నారు. ఇక రానున్న విద్యా సంవత్సరానికి సంబంధించి ఆగస్టు నెలలో మరో వెయ్యి సీట్లతో పాటు సూపర్ న్యూమరరీ కింద 140 సీట్లు మొత్తం 1140 సీట్లు భర్తీ చేయాల్సి ఉంది. ఈ లెక్కన ట్రిపుల్ ఐటీలో మొత్తం 3254 మంది విద్యార్థులవుతారు. అయితే వీరందరికీ అక్కడ తరగతులు నిర్వహించడం ఇబ్బందిగా మారింది. దీంతో అక్కడ అధికారులు ఒంగోలు ట్రిపుల్ ఐటీని ఒంగోలులోనే నిర్వహించుకోవాలంటూ ఒత్తిడి పెంచారు. ఇటీవల మీరు కచ్చితంగా వెళ్లాల్సిందేనంటూ మరింత ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. దీంతో విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఎటూ తేల్చని సర్కారు: ఒంగోలు ట్రిపుల్ ఐటీకి వంద ఎకరాలకుపైగా స్థలం కేటాయిస్తున్నట్లు అధికారులతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు ప్రకటించారు. ఆ తర్వాత ఒంగోలు మండలం యరజర్ల కొండ ప్రాంతాన్ని ట్రిపుల్ ఐటీకి కేటాయిస్తున్నట్లు గతేడాది అక్టోబర్‌లో జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో నిర్ణయించారు. ఈ మేరకు గ్రామ సర్వే నెం.418లో 200 ఎకరాలకుపైగా స్థలాన్ని డి–నోటిఫై చేసేందుకు రెవెన్యూ అధికారులు ప్రతిపాదించారు. ట్రిపుల్ ఐటీకి వంద ఎకరాలు కేటాయించనున్నట్లు చెప్పారు. అయితే ఈ ప్రాంతంలో 2 వేల ఎకరాలకుపైగా భూములను ఇనుప ఖనిజం తవ్వకాల కోసం రాష్ట్ర ప్రభుత్వం లీజుకిచ్చింది. అయితే ఇందులోనే ట్రిపుల్ ఐటీకి స్థలం కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదించారు. అయితే ఇనుప ఖనిజం ఉన్న ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాతే భూములు కేటాయిస్తామని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపింది. అయితే ఈ వ్యవహారం ఇప్పటికీ పూర్తి కాలేదు. దీంతో ట్రిపుల్ ఐటీ స్థల కేటాయింపు, భవనాల నిర్మాణం ఇప్పట్లో జరిగేది కాదని తేలిపోయింది. తాత్కాలికంగా అద్దె భవనాల్లో ట్రిపుల్ ఐటీ తరగతులు నిర్వహించాలని అధికారులు, ప్రజాప్రతినిధులు నిర్ణయించినా అది ముందుకు సాగలేదు. సరైన అద్దె భవనాలు దొరకలేదని ఇటు అధికారులు, అటు ప్రజాప్రతినిధులు చేతులు దులుపుకున్నారు. దీంతో వచ్చే ఏడాది కూడా జిల్లాలో ట్రిపుల్ ఐటీ తరగతుల నిర్వహణ సాధ్యమయ్యేలా కనిపించటం లేదు. ఇప్పటికే ఇడుపులపాయలో తరగతులు నిర్వహించటం కుదరదని అక్కడి అధికారులు తేల్చి చెబుతున్న నేపథ్యంలో ట్రిపుల్ ఐటీ విద్యార్థుల భవితవ్యం గందరగోళంలో పడింది. ఈ పరిస్థితుల్లో అధికారులు ఏం చేస్తారన్నది వేచి చూడాల్సిందే...! ఇడుపులపాయలో మరింత ఇబ్బందిగా ఉంది.. 6 వేల మంది విద్యార్థుల సామర్థ్యం ఉన్న ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో ఇప్పటికే విద్యార్థులు 8 వేల మంది ఉన్నారు. దీంతో విద్యార్థులు అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. ఫ్యాకల్టీ సైతం కష్టాలు పడాల్సి వస్తోంది. తక్ష ణం ఒంగోలులో ట్రిపుల్ ఐటీకి స్థల కేటాయిం పు లేదా తాత్కాలికంగానైనా అద్దె భవనాలు చూడాలని ప్రభుత్వానికి విన్నవించాం. కానీ ఇంత వరకు సమస్య పరిష్కారం కాలేదు. వచ్చే ఏడాది మరో వెయ్యి మంది విద్యార్థులు పెరుగుతారు. దీంతో మరిన్ని ఇబ్బందులు తప్పవు. ప్రకాశం జిల్లా ప్రజాప్రతినిధులు తక్షణం స్పందించి వచ్చే ఏడాదికైనా తరగతులు నిర్వహించుకునేలా ప్రయత్నించాలి. – వెంకట బసవరావు,ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ -
మూడేళ్ల తర్వాత పేరు పెడతారా?
ఒంగోలు టౌన్: జిల్లాకు ట్రిపుల్ ఐటీ ప్రకటించిన మూడేళ్ల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం పేరు పెట్టడాన్ని ఎస్ఎఫ్ఐ జిల్లా శాఖ తీవ్రంగా ఆక్షేపించింది. ట్రిపుల్ ఐటీ మంజూరు చేసిన తర్వాత ప్రకటించాల్సిన పేరును మూడేళ్ల తర్వాత ప్రభుత్వం ప్రకటించడాన్ని చూస్తుంటే ఉన్నత విద్య పట్ల పాలకులకు ఏ పాటి చిత్తశుద్ధి ఉందో అర్థమవుతోందని పేర్కొంది. ఆదివారం స్థానిక ఎల్బీజీ భవన్లో నిర్వహించిన ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సమావేశంలో జిల్లా కార్యదర్శి సీహెచ్ సుధాకర్ మాట్లాడుతూ జిల్లాకు ట్రిపుల్ ఐటీ ప్రకటించి మూడేళ్లు అవుతున్నా దాన్ని ఇక్కడ ఏర్పాటు చేయకుండా అబ్దుల్ కలాం పేరు పెడుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. జిల్లాకు యూనివర్శిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా పెండింగ్‌లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కోట్లాది రూపాయలను ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో వాటిపై ఆధారపడిన విద్యార్థుల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారిందన్నారు. ఒకవైపు కామన్ పరీక్షలు ముంచుకొస్తున్న తరుణంలో ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడంతో వాటిని చెల్లించాలంటూ కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులపై ఒత్తిళ్లు తీసుకొస్తున్నాయన్నారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే పెద్ద ఎత్తున విద్యార్థులను సమీకరించి ఉద్యమిస్తామని సుధాకర్ హెచ్చరించారు. సమావేశంలో ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు ఆర్.చంద్రశేఖర్, కె.చిన్నపరెడ్డి, జి.ఆదిత్య, పి.విజయ్, ఎం.రవికుమార్, ఎస్.ఓబుల్‌రెడ్డి, సుబ్బారావు, వందనం, రాజయ్య, పి.వెంకట్రావు పాల్గొన్నారు. -
ట్రిపుల్ ఐటీలో దొంగల హల్చల్
వైఎస్సార్ జిల్లా : వేంపల్లి మండలం ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో దొంగలు హల్చల్ చేశారు. ఎస్బీఐ బ్రాంచ్ ఏటీఎంను ధ్వంసం చేసి నగదు ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించారు. నగదు రాకపోవడంతో సీసీ కెమెరా, పుటేజీ సహా రెండు కంప్యూటర్లను దొంగలు ఎత్తుకెళ్లారు. ఏటీఎం వెనుక వైపు నుంచి దొంగలు చొరబడినట్లు గుర్తించారు. బ్యాంకు అధికారులు మంగళవారం గుర్తించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బ్యాంకు అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
ఇడుపులపాయలో విద్యార్థుల ఆందోళన
కడప: వైఎస్సార్ కడప జిల్లాలోని ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. భోజనం సరిగ్గా ఉండటం లేదంటూ తరగతులు బహిష్కరించి మెస్‌ల ముందు బైఠాయించారు. శుక్రవారం ఉదయం కళాశాల ప్రారంభమయ్యే సమయంలో విద్యార్థులంతా కలిసి మెస్‌ల ఎదుట ఆందోళనకు దిగారు. భోజనం సరిగ్గా ఉండటం లేదని.. దాని వల్లే తరచు అనారోగ్యం పాలవుతున్నామని విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. -
ట్రిపుల్ ఐటీలో అధ్యాపకుల ఆందోళన
వేంపల్లె : వైఎస్సార్ జిల్లా వేంపల్లె మండలంలోని ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో అధ్యాపకుడు నాగరాజు మృతికి నిరసనగా తోటి అధ్యాపకులు మంగళవారం ఆందోళనకు దిగారు. నాగరాజు మృతికి ఆర్ జె యూ కె టి యూనివర్సిటీ అధికారులే బాధ్యత వహించాలని రోడ్డుపై బైఠాయించారు. వెస్ట్ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెంకు చెందిన బి. నాగరాజు ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో మెకానికల్ విభాగంలో కాంట్రాక్ట్ అధ్యాపకునిగా పనిచేసేవాడు. పర్మనెంట్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ ప్రకటించగా దరఖాస్తు చేసుకున్నారు. రిజర్వేషన్ ప్రకారం తనకు రావాల్సిన ఉద్యోగం వేరే వ్యక్తికి రావడంతో మనస్థాపం చెందాడు. సమాచార హక్కు చట్టం ద్వారా అవకతవకలు జరిగాయని యూనివర్సిటీపై హై కోర్టులో పిటిషన్ వేశాడు. కానీ యూనివర్సిటీ అధికారులు హైకోర్టును గడువు కోరారు. దీంతో ఈ ఏడాది జులై 19న ట్రిపుల్ ఐటీ ఉన్న తన నివాసంలో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. కడప రిమ్స్ లో చికిత్స పొంది ప్రాణాలతో బయట పడ్డాడు. కానీ మూడు నెలల తర్వాత మళ్ళీ నాగరాజు తన స్వగ్రామంలో తాడేపల్లి గూడెంలో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆదివారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఇదిలా ఉండగా నాగరాజు మృతికి ట్రిపుల్ ఐటీ అధికారులు సంతాప సూచకంగా చిత్ర పటానికి నివాళులు అర్పించేందుకు సన్నాహాలు చేస్తుండగా మంగళవారం తోటి అధ్యాపకులు అడ్డుకుని ఆందోళనకు దిగారు. మూడు నెలల కిందట నాగరాజు ఆత్మహత్యకు పాల్పడి ప్రాణాలతో బయటపడితే అప్పుడైన నాగరాజుకు న్యాయం చేసి ఉంటే అతను బతికి వుండే వాడని, అధికారులు నిర్లక్ష్యం వల్లే చనిపోయాడని అధ్యాపకులు ఆవేదన వ్యక్తం చేశారు. -
ఇడుపులపాయ త్రిబుల్ ఐటీ విద్యార్థిని అదృశ్యం
-
ఈ‘సారీ’.. అంతే!
► ఈ ఏడాదీ ట్రిపుల్ ఐటీ తరగతులు లేనట్లే? ► ఇప్పటికీ పూర్తికాని స్థల కేటాయింపులు ► రాష్ట్ర మానవ వనరుల శాఖకు కొరవడిన ముందస్తు ప్రణాళిక ఎచ్చెర్ల క్యాంపస్ : జిల్లాకు ప్రతిష్టాత్మకమైన ట్రిపుల్ ఐటీని గత ఏడాది రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. అయితే తరగతులు మాత్రం కృష్ణా జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీలో నిర్వహిస్తోంది. ఈ ఏడాది శ్రీకాకుళం జిల్లాలో తరగతులు ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. గత ఏడాది వెయ్యి మంది, ఈ ఏడాది ప్రవేశాలు కల్పించనున్న వెయ్యిమందితో కలిపి.. మొత్తం రెండు వేల మందితో తరగతులు ప్రారంభించాలి. అయితే ఈ ఏడాది సైతం తరగతుల నిర్వహణ సాధ్యమయ్యే పరిస్థితి కనిపించడం లేదు. జిల్లాకు మంజూరు చేసిన ట్రిపుల్ ఐటీ అనేక మలుపులు తిరుగుతోంది. అయినా సంస్థ ప్రారంభం మాత్రం సాధ్యం కావడం లేదు. రాష్ట్ర మానవ వనరుల శాఖ ప్రత్యేక దృష్టి పెట్టకపోవడం, ప్రభుత్వం ప్రత్యేక నిధులు మంజూరు చేయకపోవడం, స్థల సేకరణ రోజుకో మలుపు తిరగడం వంటి అంశాలు ప్రధాన అవరోధాలుగా మారాయి. మరోవైపు నూజివీడులో సైతం వసతి కొరత వెంటాడుతోంది. అక్కడ ఆరువేల మంది విద్యార్థులు ప్రస్తుతం చదువుతున్నారు. జిల్లాకు చెందిన రెండు వేల మందికి అదనపు వసతి కల్పించాలి. తరగతులు, వసతిగృహం, ల్యాబ్‌లు.. ఇలా అదనపు వసతి అవసరం. అక్కడ అదనంగా నిర్మాణాలు చేపట్టినా.. నిరుపయోగమే. ఎందుకంటే శ్రీకాకుళానికి చెందిన విద్యార్థులను భవిష్యత్‌లో ఇక్కడికి తరలించాల్సిందే! ఇదీ ప్రస్తుత పరిస్థితి.. జిల్లాకు మంజూరు చేసిన విద్యాసంస్థను ఇక్కడికి తరలించి, ఎలాగైనా తరగతులు ప్రారంభించాలని ప్రభుత్వంతోపాటు, అధికారులు భావించారు. అందుకే ప్రస్తుతం ఏపీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నిర్వహిస్తున్న ఎచ్చెర్ల సమీపంలోని 21వ శతాబ్ది గురుకుల భవనాలు, 47 ఎకరాల స్థలం ట్రిపుల్ ఐటీకి అప్పగిస్తూ.. స్వాధీన ధ్రువీకరణ పత్రాన్ని గత మార్చి 18న అప్పగించారు. అయితే ఇక్కడ వసతి, తరగతుల నిర్వహణ 600 మందికి మాత్రమే సాధ్యం. ప్రస్తుతం తరగతులు ప్రారంభించాలంటే 2 వేల మందికి వసతి, తరగతుల నిర్వహణ సామర్థ్యం, మరో 500 మంది సిబ్బందికి నివాస సముదాయం ఉండాలి. జూన్‌లో ప్రవేశాలు, ఆగస్టు నుంచి తరగతులు ప్రారంభించాలి. రెండో ఏడాది తరగతులు జూన్ నుంచే ప్రారంభించాలి. జిల్లాలో ట్రిపుల్ ఐటీ తరగతులు ప్రారంభించాలంటే ప్రస్తుతం వసతి అత్యవసం. రెండు, మూడు నెలల్లో వసతి కల్పన సాధ్యం కాదు. ట్రిపుల్ ఐటీ, రాష్ట్ర మావన వనరులు, ఇంజినీరింగ్ అధికారులు సుదీర్ఘ సమీక్ష సమావేశం సైతం ఇక్కడ నిర్వహించారు. భవనాలు, సౌకర్యాలను పరిశీలించారు. అద్దె భవనాలు తీసుకోవాలన్న ప్రతిపాదన కూడా వచ్చింది. అయితే, ప్రస్తుతం అద్దె భవనాలు తీసుకోవడం కంటే.. నూజివీడులో తరగతుల నిర్వహణ మేలన్నది అధికారుల అభిప్రాయం. మొదటి ఏడాది తరగతులు ప్రారంభం కూడా 21 శతాబ్ది గురుకులంలో సాధ్యం కాదని నిర్ణయానికి వచ్చారు. 2 వేల మందికి తరగతుల నిర్వహణ, వసతి కోసం అద్దెకు జిల్లాలో విద్యా సంస్థలు ఉన్నాయి. అయితే, ఏడాదికి మాత్రమే అద్దెకు ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ముందస్తు ప్రణాళిక లేకనే.. విద్యాసంవత్సరం ముంచుకొస్తున్న నేపథ్యంలో హడావుడి ప్రదర్శిస్తున్న రాష్ట్ర మానవ వనరుల శాఖ అధికారులు.. మందస్తు చర్యలు మాత్రం తీసుకోలేదు. స్థల సేకరణ సైతం అనేక మలుపులు తిరగాయి. స్థానిక ప్రజా ప్రతినిధులు, రాష్ట్ర మానవ వనరుల శాఖ అధికారుల మధ్య సమన్వయం సైతం కొరవడింది. గత ఏడాది అక్టోబర్ 9న 21వ శతాబ్ది గురుకులంలో కార్యాలయాన్ని రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రారంభించారు. అనంతరం అదే ఏడాది డిసెంబర్ 19న 340 ఎకరాలు కేటాయిస్తూ జీఓ నంబరు 1164 విడుదల చేశారు. ఈ ఏడాది జనవరి 2న ఆ జీఓ రద్దు చేశారు. జనవరి 12న 47 ఎకరాలు కేటాయిస్తూ జీఓ విడుదల చేశారు. మార్చి 18న స్థల స్వాధీన ధ్రువీకరణ పత్రం అందజేశారు. ప్రస్తుతం మరో 23 ఎకరాలు అందజేసేందుకు రెవెన్యూ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికీ ట్రిపుల్ ఐటీకి ఏర్పాట్లు పూర్తి చేయలేకపోయారు. ఈ విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధి చూపించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది తరగతుల మాటెలా ఉన్నా.. వచ్చే విద్యా సంవత్సరం నాటికైనా సాధ్యమయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. పరిశీలిస్తున్నాం.. ప్రస్తుతం ఇక్కడికి ట్రిపుల్ ఐటీ తరలించేందుకు కసరత్తులు జరుగుతున్నాయి. 2 వేల మందికి వసతి, తరగతుల నిర్వహణకు అకడమిక్ బ్లాక్‌లు అవసరం. తాత్కాలిక పద్ధతిలో నిర్మాణం సాధ్యమా? అద్దె భవనాలు తీసుకోవాలా? అన్న అంశాన్ని పరిశీలిస్తున్నాం. సాధ్యం కాకపోతే నూజివీడులో తరగతుల నిర్వహణను సైతం పరిశీలిస్తున్నాం. – ప్రొఫెసర్ పప్పల అప్పలనాయుడు, శ్రీకాకుళం ట్రిపుట్ ఐటీ డైరెక్టర్ -
ట్రిపుల్ ఐటీలో విద్యార్థిని ఆత్మహత్య
బాసర(నిర్మల్): నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం మర్లగడ్డ క్యాంప్‌నకు చెందిన కె. రాధ ట్రిపుల్ ఐటీ నాలుగో సంవత్సరం చదువుకుంటోంది. శుక్రవారం ఉదయం ఆమె హాస్టల్లోని తన గదిలో ఉరి వేసుకుంది. మధ్యాహ్నం గమనించిన తోటివారు సిబ్బందికి సమాచారం అందిచారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని తల్లిదండ్రులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. విద్యార్థిని బలవన్మరణానికి కారణాలు తెలియాల్సి ఉంది. -
ట్రిపుల్ ఐటీలో సంక్షేమం గాలికి
వేంపల్లె: వేంపల్లె మండలం ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల సంక్షేమం గాలిలో దీపంలా మారింది. ఇక్కడి అధికారుల నిర్లక్ష్యం అడుగడుగునా కొట్టొచ్చినట్లు కనిపిస్తోందనే విమర్శలు ఉన్నాయి. ప్రధానంగా విద్యార్థుల సంక్షేమ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు కానీ.. ఏ ఒక్కరు కూడా బాధ్యతాయుతంగా విద్యార్థుల సంక్షేమానికి పాటుపడలేదన్న అపవాదు తెచ్చుకున్నారు. అధికారులు సక్రమంగా విధులు నిర్వహించకపోవడంతో ట్రిపుల్ ఐటీలో ఇప్పటికే ముగ్గురు విద్యార్థులు వివిధ కారణాలవల్ల బలవన్మరణాలకు పాల్పడ్డారు. గత నాలుగేళ్ల కాలంలో దాదాపు ఐదారు మంది విద్యార్థులు ఆత్మహత్యకు యత్నించారు. కొంతమంది తీవ్ర గాయాలతో చదువులకు దూరమైన పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం రాజేష్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. కానీ చనిపోయిన విషయాన్ని తల్లిదండ్రులకు ఆలస్యంగా తెలియజేయడంతో అధికారులపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. విద్యార్థుల సంక్షేమం గాలికి.. ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో స్టూడెంట్ వెల్ఫేర్ డీన్ కార్యాలయం పేరుకు మాత్రమే ఉంది. స్టూడెంట్ వెల్ఫేర్ డీన్‌గా రత్నకుమారి కొనసాగుతుండగా.. డిప్యూటీ వార్డెన్లు అందరూ కలిపి దాదాపు 30మంది దాకా ఇక్కడ ఉన్నారు. కానీ వీరందరూ ఫ్యాకల్టీగా, మెంటర్స్గా ఉంటూ అదనపు బాధ్యతలు చేపడుతున్నారు. నిబంధనల ప్రకారం ట్రిపుల్ ఐటీలో దాదాపు 6వేల మందికిపైగా విద్యార్థులు ఉన్నారు. ప్రధానంగా వార్డెన్లు తరగతి గదులకు వెళ్లకుండా హాస్టల్లో ఉన్న విద్యార్థులను నిశితంగా పరిశీలిస్తూ ఉండాలి. ఒకవేళ దిగాలుగా కనిపిస్తే వారికి కౌన్సెలింగ్ నిర్వహించి వారి మనసు మార్చే ప్రయత్నం చేయాలి. తీరని సమస్య అయితే తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వాలి. కానీ నిబంధనల ప్రకారం ఏ ఒక్కటి కూడా ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో జరగలేదని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. గతంలో జరిగిన సంఘటనలు ఇలా.. – 2015 ఆగస్టు 10వ తేదీన కర్నూలు జిల్లా కొమిలిగుండ్ల గ్రామానికి చెందిన వడ్డే భారతి (ఈ3 విద్యార్థిని) విషద్రావణం మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. – 2015 అక్టోబరు 30వ తేదీన తూర్పు గోదావరి జిల్లా అప్పనపల్లె గ్రామానికి చెందిన ఉమా జ్యోతి(ఈ3 విద్యార్థిని) ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. – 2017 ఫిబ్రవరి 15వ తేదీన చిత్తూరు జిల్లా ఐరాల మండలం తాళంబేడువారిపల్లెకు చెందిన కొత్త రాజేష్(ఈ4 విద్యార్థి) ఫ్యానుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. – 2016 ఫిబ్రవరి 6వ తేదీన సౌందర్య, నవీన్ అనే విద్యార్థులు శేషాచలం అడవుల్లోకి పారిపోయి మూడు రోజుల తర్వాత పొలతల వద్ద పోలీసుల గాలింపు చర్యలలో పట్టుబడ్డారు. వారం రోజులక్రితం జమ్మలమడుగుకు చెందిన పీ1 విద్యార్థిని మాస్ కాపీయింగ్‌కు పాల్పడటంతో దండించారని యాంటీ బయాటిక్ మాత్రలను మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఇలాంటి సంఘటనలు కొన్ని తెరపైకి రాగా.. వెలుగు చూడని సంఘటనలు మరెన్నో ఉన్నాయని పలువురు పేర్కొంటున్నారు. -
ట్రిపుల్ఐటీ విద్యార్థి ఆత్మహత్య
వేంపల్లె(వైఎస్సార్ జిల్లా): ఇడుపులపాయ ఐఐఐటీలో ఫైనల్ ఇయర్ చదువుతున్న రాజేష్(20) అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం మధ్యాహ్న సమయంలో హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రేమవ్యవహారామే ఆత్మహత్యకు కారణమని తెలుస్తోంది. ఆత్మహత్యకు పాల్పడ్డ రాజేష్ స్వస్థలం చిత్తూరు జిల్లా. తోటి విద్యార్థులు చూసి అక్కడే ఉన్న ఆసుపత్రిలో చేర్పించారు. కానీ అప్పటికే రాజేష్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. -
12మంది ఉద్యోగాలకు ఎంపిక
వేంపల్లె(ఇడుపులపాయ) : ఆర్కె వ్యాలీ ఇడుపులపాయ ట్రిపుల్ ఐటిలో శనివారం టెక్ మహేంద్ర సంస్థ ఇంటర్వ్యూలు నిర్వహించింది. 12మంది విద్యార్థులు ఉద్యోగాలు పొందారని డైరెక్టర్ ఆచార్య భగవన్నారాయణ తెలిపారు.ఈసీఈ విభాగం నుంచి 8మంది,మెకానికల్ నుండి ముగ్గురు,సివిల్ నుంచి ఒకరు ఎంపికయ్యారు.వీరికి ఏడాదికి రూ.3.25 లక్షలు వేతనం అందజేయనున్నట్లు టెక్ మహేంద్ర అధికారులు శ్రీధర్,సుధాకర్,శ్యామ్‌సుందర్‌లు తెలిపారు. విద్యార్థులను డైరెక్టర్ భగవన్నారాయణ,కెయల్‌యన్ రెడ్డి,వేణుగోపాల్ రెడ్డి,ప్లేస్ మెంట్ అధికారులు లక్ష్మణ్ నాయక్,అశోక్ తదితరులు అభినందించారు. -
ట్రిపుల్ ఐటీలో చిరుత సంచారం
వేంపల్లె : ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ పరిసర ప్రాంతాలలో చిరుత సంచారం మొదలైంది. గురు, శుక్రవారాలలో వీరన్నగట్టుపల్లె, ట్రిపుల్ ఐటీ రహదారి మధ్యలో ఉన్న ఓ వంతెన వద్ద చిరుత కనిపించిందని అక్కడ ఉన్న మెంటర్స్.. ట్రిపుల్ ఐటీ అధికారులకు తెలియజేశారు. దీంతో ఏవో అమరేంద్రకుమార్ వేంపల్లె అటవీ శాఖాధికారి పీసీ రెడ్డయ్య, ఆర్కె వ్యాలీ ఎస్ఐ మస్తాన్‌బాషా, ట్రిపుల్ ఐటీ సెక్యూరిటీ ఆఫీసర్ రెడ్డిశేఖరరెడ్డిలకు చిరుత సంచారం గురించి శుక్రవారం తెలిపారు. ట్రిపుల్ ఐటీలో మెస్‌ల వద్ద కుక్కల తాకిడి ఎక్కువైందని.. దీంతో కుక్కలను తినేందుకు చిరుత ఆ ప్రాంతానికి వచ్చి ఉంటుందని అటవీ శాఖాధికారి రెడ్డయ్య తెలిపారు. అక్కడ కుక్కలను లేకుండా చూడాలని ట్రిపుల్ ఐటీ అధికారులకు తెలిపామని ఆయన పేర్కొన్నారు. ఇడుపులపాయ నుంచి పొలతల ఫారెస్ట్ వరకు ప్రతి కిలోమీటరుకు ఒక చిరుత ఉంటుందన్న అభిప్రాయం ఉందని రేంజర్ తెలిపారు. ఇదిలా ఉండగా.. ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌కు ఇంతవరకు సక్రమంగా ప్రహరీ లేనందున చిరుతలు లోపలికి వచ్చే అవకాశం ఉంది. భద్రమైన రక్షణ గోడ నిర్మించుకొని పెన్సింగ్ వాల్ ఏర్పాటు చేసుకుంటే అక్కడికి చిరుతలు రావని అటవీ శాఖాధికారులు తెలిపారు. -
ట్రిపుల్ఐటీ నిర్వహణకు వసతుల పరిశీలన
ఎచ్చెర్ల: శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీ తరగతుల నిర్వహణకు అవసరమైన వసతులపై ఎచ్చెర్ల సమీపంలోని 21వ శతాబ్ది గురుకులాన్ని శనివారం పరిశీలించారు. శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీ ఇన్చార్జి అప్పలనాయుడు, శ్రీకాకుళం ఆర్డీవో బి.దయానిధిలు ఇక్కడి భవనాలను, వసతులను పరిశీలించారు. ప్రస్తుతం శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీ తరగతులు నూజువీడులో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. గురుకుల వసతి గృహం, తరగతి గదులు, వసతి, కిచెన్ వంటి అంశాలను పరిశీలించారు. గురుకులంలో వసతులపై అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఇక్కడ తరగతులు నిర్వహించాలా, లేకుంటే నూజువీడులోనే కొనసాగించాలా? అన్న అంశంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని అధికారులు చెప్పారు. -
తెల్లారిన ట్రిపుల్ ఐటీ విద్యార్థి బతుకు
హనుమాన్ జంక్షన్ రూరల్ : ఎన్నో ఆశలతో ట్రిపుల్ ఐటీలో చేరిన విద్యార్థి రైలు పట్టాలపై శవమై తేలడం కలకలం రేపుతోంది. గుంటూరు జిల్లా నర్సారావు పేట మండలం కొండ కొవ్వూరుకు చెందిన బాలోజు శివ ఇటీవల నూజివీడు ట్రిపుల్ ఐటీలో సీటు సాధించాడు. ఈ నేప«థ్యంలో శుక్రవారం శివ మృతదేహం నూజివీడు స్టేషన్‌కు సమీపంలో రైలు పట్టాలపై ప్రత్యక్షమైంది. గత నెల 16వ తేదీన శివ ట్రిపుల్ ఐటీలో చేరాడని, తండ్రి లేకపోవటంతో తల్లి కష్టపడి శివను చదివిస్తున్నట్లు తెలుస్తోంది. ఏ కారణాలతో శివ మరణించాడో తెలియరాలేదు. ఇది హత్య, ఆత్మహత్య అన్నది కూడా స్పష్టంగా తేలాల్సి ఉంది. ఏలూరు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనతో ట్రిపుల్ ఐటీ విద్యార్థుల్లో భయం నెలకొంది. సెక్యూరిటీ వైఫల్యమేనా...! విద్యార్థి మృతిపై అనేక అనుమానాలు చెలరేగుతున్నాయి. గురువారం రాత్రి 11.30గంటల వరకు తనకు కేటాయించిన ఐ2 హాస్టల్లోని గదిలో ఉన్న అతను బయటకు ఎలా వెళ్ళాడు, ఎప్పుడు వెళ్ళాడు, ఎటువైపు నుంచి వెళ్ళాడనే విషయాలు అంతుబట్టడం లేదు. ప్రతిషిఫ్టుకు 40 నుంచి 50 మంది సెక్యూరిటీ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నా హాస్టల్ గదిలో నుంచి బయటకు ఎలా వెళ్ళాడనే దానిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. విషయం తెలిసిన వెంటనే నూజివీడు, శ్రీకాకుళం ట్రిపుల్ఐటీ డైరెక్టర్లు ఆచార్య వీరంకి వెంకటదాసు, ఆచార్య పప్పల అప్పలనాయుడు ఏలూరులోని రైల్వే పోలీసుల వద్దకు వెళ్ళారు. -
ట్రిపుల్ ఐటీలో ఎంపిక విధానాన్ని మార్చలేం
వేంపల్లె (కడప) : గ్రామీణ విద్యార్థులకు సాంకేతిక విద్యను అందించాలన్న ఉద్దేశంతో ట్రిపుల్ ఐటీలను నెలకొల్పామని ఆర్జీయూకేటీ చాన్స్‌లర్ ఆచార్య రాజిరెడ్డి వెల్లడించారు. సోమవారం ఆయన వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో డైరెక్టర్ ఆచార్య భగవన్నారాయణ, ఏవో ఆచార్య విశ్వనాథరెడ్డి, అకడమిక్ డీన్ వేణుగోపాల్‌రెడ్డిలతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ఎంపిక విధానాన్ని నేరుగా కాకుండా పోటీ పరీక్ష నిర్వహించి తీసుకోవాలని వస్తున్న అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోబోమన్నారు. అలా చేస్తే పట్టణ ప్రాంత విద్యార్థులకు ఎక్కువ సీట్లు వస్తాయని, అందువల్ల ఎంపిక విధానాన్ని మార్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. వచ్చే ఏడాది రాయలసీమకు సంబంధించి అనంతపురంలో కొత్త ట్రిపుల్ ఐటీని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ప్రతి మండలానికి నాలుగు సీట్లు దక్కే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. -
బాసర ట్రిపుల్‌ఐటీలో స్వచ్ఛభారత్
బాసర : కేంద్రప్రభుత్వం, ఎన్ఎస్ఎస్ పిలుపు మేరకు శుక్రవారం బాసర ట్రిపుల్‌ఐటీలో స్వచ్ఛభారత్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వర్సిటీ వైస్ చాన్స్‌లర్ సత్యనారాయణ విద్యార్థులతో స్వచ్ఛభారత్‌పై ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం కళాశాల ఆవరణలో చీపుర్లు చేతపట్టి పరిసరాలు శుభ్రం చేశారు. ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను శుభ్రంగా ఉంచి, స్వచ్ఛభారత్ సాధన దిశగా కషిచేయాలని పిలుపునిచ్చారు. కళాశాల విద్యార్థులు మానవహారంగా ఏర్పడ్డారు. ర్యాలీ నిర్వహించారు. ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ డైరెక్టర్ బి.శ్యాంబాబు, ఆఫీసర్ విజయ్‌కుమార్, అనిత, నరేశ్, విద్యార్థులు పాల్గొన్నారు. -
అంతా మాఇష్టం
ట్రిపుల్‌ఐటీలో అనధికార ఉద్యోగులు ఈసీ నిర్ణయం బేఖాతరు ఇష్టారాజ్యంగా పరిపాలన ట్రిపుల్ ఐటీలో పాలన గడితప్పుతోంది. కొందరు ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్నారు. కాంట్రాక్టు పోస్టుల్లో ఇష్టారాజ్యంగా సిబ్బందితో నింపేశారు. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఆమోదం లేకుండానే సిబ్బంది పనిచేయడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. నూజివీడు : ట్రిపుల్ ఐటీలో ఆరు వేల మంది విద్యార్థులున్నారు. వెయ్యి మంది వరకు సిబ్బంది ఉన్నారు. ఔట్ సోర్సింగ్ సిబ్బంది నియామకం వివాదస్పదమవుతోంది. ఈసీ అనుమతి లేకుండానే రెండు నెలల క్రితం డైరెక్టర్ ఆచార్య వీరంకి వెంకటదాసు దాదాపు వంద మంది ఔట్సోర్సింగ్ సిబ్బందిని నియమించారు. ఇంతమంది ఉద్యోగులను ఔట్‌సోర్సింగ్‌లో నియమించుకోవాలంటే తప్పనిసరిగా ఈసీ అనుమతి ఉండాలి. ఈసీ అనుమతినివ్వనప్పటికీ బేఖాతరు చేస్తూ నియామకాలు జరపడం సంచలనంగా మారింది. సిబ్బంది నియామకంపై.. ఎనిమిది వేల మంది విద్యార్థులు ఉన్నప్పుడు సరిపోయిన సిబ్బంది ఆరువేల మందికి తగ్గినప్పుడు ఎందుకు సరిపోరనే వాదనను పలువురు తెచ్చిన లెక్కచేయకుండా కొందరు అధికారపార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులను సంతృప్తి పరచడానికి అత్యుత్సాహంతో ఈ నియామకాలకు తెరలేపినట్లు ట్రిపుల్‌ఐటీలో వినికిడి. ఔట్‌సోర్సింగ్‌లో ఉద్యోగులను తీసుకునేటప్పుడు ఈ ప్రాంతంలోని వారికి ఉద్యోగాలు ఇవ్వకుండా ఇతర జిల్లాల వారికి ఎలా ఇస్తారని నూజివీడు పట్టణానికి చెందిన ప్రజాప్రతినిధులు డైరెక్టర్‌ను ప్రశ్నించారు. రెండు నెలలుగా జీతాలు లేవు.. ఈసీ నిర్ణయాలను బేఖాతరు చేస్తూ ట్రిపుల్‌ఐటీలో సొంతంగా నియమించుకున్న దాదాపు వంద మంది అనధికార వ్యక్తులకు రెండు నెలలు గడిచినా ఇంత వరకు జీతాలు చెల్లించలేదు. అసలు మా పోస్టులు ఉంటాయా, ఉండవా..? పనిచేసిన కాలానికైనా జీతాలు ఇస్తారా, ఇవ్వరా...? ఆందోళన చెందుతున్నారు. ప్రతి ఏటా దాదాపు రూ.వంద కోట్ల ప్రజాధనాన్ని కేటాయిస్తున్న విద్యాసంస్థలో నియామకాలను ఒక పద్ధతి లేకుండా నియమించుకోవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. నియామకాలకు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అనుమతి లేదు: ఉన్నం వెంకయ్య, ఆర్జీయూకేటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు నియామకాలకు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అనుమతి లేదు. నియమించుకున్న వారిని వెంటనే తొలగించమని కూడా చెప్పడం జరిగింది. -
ప్రశాంతంగా ట్రిపుల్ ఐటీ కౌన్సెలింగ్
నూతనంగా ఏర్పాటుచేసిన శ్రీకాకుళం, ఒంగోలు ట్రిపుల్ఐటీల్లో ప్రవేశాల కౌన్సెలింగ్ కృష్ణాజిల్లా నూజివీడు ట్రిపుల్‌ఐటీలో సోమవారం ప్రశాంతంగా ప్రారంభమైంది. రెండు ట్రిపుల్‌ఐటీలకు కలిపి 1872 మంది జనరల్ అభ్యర్థులను ఎంపికచేయగా.. తొలిరోజు 372 మందిని కౌన్సెలింగ్‌కు పిలిచారు. 256 మంది హాజరుకాగా, 116 మంది గైర్హాజరయ్యారు. వీరిలో శ్రీకాకుళం ట్రిపుల్ఐటీకి 137, ఒంగోలు ట్రిపుల్ఐటీకి 119 మందికి ప్రవేశాలు లభించాయి. కౌన్సెలింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6 గంటలకు ముగిసింది. నూజివీడు ట్రిపుల్ఐటీ డెరైక్టర్ ఆచార్య వీరంకి వెంకటదాసు, ఏవో ఆచార్య పి.అప్పలనాయుడు, అకడమిక్ డీన్ కోసూరి హనుమంతరావు, ఇడుపులపాయ ట్రిపుల్ఐటీ అకడమిక్ డీన్ వేణుగోపాలరెడ్డిల ఆధ్వర్యంలో అసిస్టెంట్ రిజిస్ట్రార్ మేరుగు అర్జునరావు పర్యవేక్షణలో అవాంతరాలు లేకుండా కౌన్సెలింగ్ జరిగింది. 9న మరో 500 మంది అభ్యర్థులకు కౌన్సెలింగ్ జరగనుంది. -
20 నుంచి ట్రిపుల్ ఐటీ కౌన్సెలింగ్
కృష్ణా జిల్లా నూజివీడులోని ట్రిపుల్ ఐటీకి ఈ ఏడాదికి ఎంపికైన విద్యార్థులకు ఈనెల 20వ తేదీ నుంచి ధ్రువపత్రాల పరిశీలన ప్రారంభమవుతుందని డెరైక్టర్ ఆచార్య వీరంకి వెంకటదాసు తెలిపారు. ఎంపికైన మొత్తం 1151 విద్యార్థుల్లో 20వ తేదీన 576 మందికి, 21వ తేదీన 575 మందికి కౌన్సెలింగ్ ఉంటుందని ఆయన వివరించారు. ఎంపికైన విద్యార్థులు కౌన్సెలింగ్‌కు హాజరు కాలేకుంటే ముందుగా అధికారులకు సమాచారం అందించాలని కోరారు. లేకుండా ఎంపిక రద్దు చేస్తామని తెలిపారు. -
ట్రిపుల్ ఐటీ కౌన్సెలింగ్ ప్రశాంతం
ముథోల్ మండలం బాసర గ్రామంలోని ట్రిపుల్ ఐటీ క్యాంపస్ లో శుక్రవారం కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. 500 మంది విద్యార్థులకు గాను 452 మంది హాజరయ్యూరు. ఈ ప్రక్రియను యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ సత్యనారాయణ ప్రారంభించారు. వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థులు తల్లిదండ్రులతోపాటు హాజరు కావడంతో కళాశాల ఆవరణలో సందడి నెలకొంది. విద్యార్థితోపాటు మరొకరికి యూనివర్సిటీ తరఫున ఉచిత భోజన సదుపాయం కల్పించారు. బ్యాంకు చలాన్ల కోసం భారీ సంఖ్యలో బారులు తీరారు. యూనివర్సిటీ అధికారులు రెండే కౌంటర్లు ఏర్పాటు చేయడంతో ఇబ్బందులకు గురయ్యారు. -
ఏపీలో మరో రెండు ట్రిపుల్ ఐటీలు
► ఒంగోలు, శ్రీకాకుళంలో ఏర్పాటు ► వారం రోజుల్లో అడ్మిషన్లకు నోటిఫికేషన్ ► రాష్ట్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అమరావతి : ఈ విద్యాసంవత్సరం నుంచే కొత్తగా మరో రెండు ట్రిపుల్ ఐటీలను ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. ఒంగోలు, శ్రీకాకుళంలలో ఏర్పాటు చేస్తున్న ఈ ట్రిపుల్ ఐటీలకు సంబంధించి త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేయనుందని, ఆ వెంటనే ఈ రెండు కేంద్రాలకు సంబంధించి అడ్మిషన్స్ నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. నూజివీడు, ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను మంత్రి శుక్రవారం విజయవాడలో విడుదల చేశారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత విద్యార్థుల కోసం ప్రవేశపెట్టిన ట్రిపుల్ ఐటీలకు మంచి స్పందన ఉందని, ఇందులో బీటెక్ పూర్తి చేసిన విద్యార్థుల్లో 60 శాతం మందికి క్యాంపస్ నియామకాలు లభిస్తున్నాయన్నారు. దీంతో మరో రెండు కొత్త కాలేజీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించామని, ఈ విద్యాసంవత్సరానికి ఒంగోలు కాలేజీకి ఎంపికైన వారికి ఇడుపులపాయలో, శ్రీకాకుళం కళాశాలకు ఎంపికైన వారికి నూజివీడులో తరగతులు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆగస్టు 1 నుంచి తరగతులు నూజివీడు, ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో అడ్మిషన్ల కోసం 15,974 మంది దరఖాస్తు చేసుకోగా అందులో 13,546 అర్హమైనవిగా ఉన్నట్లు తెలిపారు. ఇందులో రిజర్వేషన్ల ప్రకారం కటాఫ్ మార్కులను నిర్ణయించి నూజివీడు కాలేజీకి 1,230 మందిని, ఇడుపులపాయకు 721 మందిని ఫేజ్1లో ఎంపిక చేసినట్లు తెలిపారు. ఈ కాలేజీలకు జూలై 20 నుంచి కౌన్సెలింగ్ మొదలవుతుంది. ఫేజ్2 జాబితాను జూలై 23న విడుదల చేసి వారికి కౌన్సెలింగ్ 29తో పూర్తి చేస్తామన్నారు. జూలై 30లోగా విద్యార్థులు కాలేజీల్లో చేరాల్సి ఉంటుందని, ఆగస్టు 1 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని మంత్రి వివరించారు. ఇంజినీరింగ్ ఫీజులు ఖరారు ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంజినీరింగ్, ఫార్మసీ ఫీజులను రాష్ట్ర ప్రభుత్వం ఖరారుచేసింది. ఈ నెల 27 నుంచి ఇంజినీరింగ్ క్లాసులు ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నా, ఫీజుల నిర్ణయంపై ఆలస్యం కావడంతో జూలై 1కి వాయిదా వేసినట్లు మంత్రి తెలిపారు. కొత్తగా నిర్ణయించిన కాలేజీ ఫీజుల వివరాలు శుక్రవారం సాయంత్రం నుంచి ఆదివారం సాయంత్రం ఆరు గంటల వరకు అందుబాటులో ఉంటాయి. ఫీజుల ఆధారంగా వెబ్ ఆప్షన్లో కాలేజీలను మార్చుకోవడానికి జూన్ 26 సాయంత్రం ఆరుగంటల వరకు సమయాన్ని ఇచ్చారు. జూన్ 27 ఉదయం 8 గంటల నుంచి సీట్ల కేటాయింపు మొదలై జూన్ 28 మధ్యాహ్నం ఒంటిగంటతో పూర్తవుతుందన్నారు. అదేరోజు సాయంత్రానికి ఎంపికైన విద్యార్థుల జాబితాను విడుదల చేస్తామని, జూన్ 29న నుంచి విద్యార్థులు కాలేజీలో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుందన్నారు. జూలై 1 నుంచి క్లాసులు ప్రారంభమవుతాయని మంత్రి వివరించారు. -
ట్రిపుల్ ఐటీలకు భారీగా దరఖాస్తులు
నూజివీడు (కృష్ణా జిల్లా) : ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశానికి కృష్ణాజిల్లా నూజివీడు, వైఎస్సార్ కడప జిల్లా ఇడుపులపాయలలో ఉన్న ట్రిపుల్ ఐటీలకు భారీగా దరఖాస్తులు అందుతున్నాయి. ఇప్పటికే రెండుచోట్ల కలిపి 20 వేల దరఖాస్తులు అందినట్లు ఆర్జీయూకేటీ వర్గాల ద్వారా తెలిసింది. ట్రిపుల్ ఐటీలలో ఉన్న ఆరు సంవత్సరాల సమీకృత ఇంజినీరింగ్ కోర్సులో చేరేందుకు ఈ నెల 13న ఆర్జీయూకేటీ నోటిఫికేషన్ జారీ చేసి 16 నుంచి దరఖాస్తులను స్వీకరిస్తోంది. పదో తరగతి ఈ ఏడాది మార్చిలో రెగ్యులర్‌గా ఉత్తీర్ణులైనవారు ఆన్లైన్లో యూనివర్సిటీ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. ఈ నేపథ్యంలో నూజివీడు, ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలకు దరఖాస్తులు భారీగా వస్తున్నాయి. సోమవారం సాయంత్రం 5 గంటలకు నూజివీడు ట్రిపుల్ఐటీకి 10,067 దరఖాస్తులు రాగా అందులో బాలురు 4809మంది, బాలికలు 5258 మంది ఉన్నారు. ఇడుపులపాయ ట్రిపుల్ఐటీకి 9917మంది దరఖాస్తు చేసుకున్నారు. జూన్ పదో తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉన్నందున ఈ సంఖ్య 25 వేలు దాటవచ్చని ఆర్జీయూకేటీ వర్గాలు భావిస్తున్నాయి. గతేడాది రెండు ట్రిపుల్ఐటీల్లో 20 వేల దరఖాస్తులు వచ్చాయి. -
పేదింట్లో చదువుల ‘జాబిలి’
♦ బాల్య వివాహం వద్దని..గొప్ప చదువులే ముద్దని.. ♦ టెన్త్‌లో 10 జీపీఏ సాధించింది ♦ మెతుకు సీమలో మెరిసిన మమత పాపన్నపేట: పేదింట్లో చదువుల జాబిలి వికసించింది. పేదరికం పరిహసిస్తుంటే పట్టుదలతో పుస్తకం పట్టింది. లక్ష్య సాధన కోసం నిరంతర శ్రామికురాలిగా మారింది. బాల్య వివాహం వద్దంటూ.. గొప్ప చదువులే ముద్దంటూ కన్న వారిని ఎదిరించింది. చదువే లోకంగా.. ఏకాగ్రతే అస్త్రంగా సన్నద్ధమై పదో తరగతి పరీక్షలు రాసి జిల్లా టాపర్‌గా నిలిచింది. మరి ఇప్పుడు పెద్ద చదువులకే దారేది అంటూ దిక్కులు చూస్తుంది మమత. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం కొడుపాక గ్రామానికి చెందిన ఉప్పరి కిష్టయ్య, శంకరమ్మ దంపతుల పెద్ద కుమార్తె మమత చిన్నప్పటి నుంచే చదువుల్లో రాణించడంతో రెండవ తరగతి వరకు లక్ష్మీనగర్‌లోని ఓ ప్రైవేట్ స్కూల్లో చదివించారు. కాని అలవి కాని ఆ ఫీజులు భరించలేక మూడు నుంచి కొడుపాక ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు. అయితే, పేదరికం పరిహసిస్తుంటే మమతలో పట్టుదల పెరిగింది. స్నేహితులంతా పాఠశాల నుంచి విహారయాత్రలకు వెళ్తుంటే.. ఇంటి పరిస్థితి తెలసిన మమత మౌనంగా రోదించేది. తోటి వాళ్లు రంగు రంగుల కొత్త బట్టలు వేసుకొస్తే .. ఉన్నవాటితోనే తృప్తిపడేది. కానీ ఈ ఆర్థిక అంతరాలు మమత మనసుపై చెరగని ముద్ర వేశాయి. చదువులపై పట్టుదలను పెంచాయి. క్లాస్మేట్స్ గైడ్లు కొనుక్కొంటే.. ఉచిత పుస్తకాలనే జల్లెడ పట్టేది. బాల్య వివాహాన్ని ఎదిరించి.. నిరుపేద తల్లి దండ్రులకు పెద్ద కుటుంబం శాపంగా మారింది. వర్షాలు లేక మంజీరమ్మ తడారి పోవడంతో వీరి వ్యవసాయ భూమి ఎడారిలా మారింది. ఇద్దరు ఆడపిల్లలు ఉండటంతో ఈ యేడు పెద్దమ్మాయి పెళ్లి చేసి కాస్త బరువు దించుకోవాలనుకున్నారు. వారి నిర్ణయం వినగానే మమత నిప్పు కణికలా రగిలింది. ‘అవసరమైతే నా బతుకు నేను బతకగలను.. నన్ను మాత్రం నేను చదివినంత వరకు చదివించండి. అదే జన్మకు పదివేల’ంటూ ప్రాథేయ పడింది. ఫ్రీ సీటు వస్తేనే చదివిస్తారట.. పట్టుదలతో చదివి పదో తరగతిలో 10 జీపీఏ సాధించా. ట్రిపుల్ ఐటీలో చేరి మంచి ఇంజనీర్ కావాలనుంది. కాని మావాళ్లు మాత్రం ఫ్రీ సీటు వస్తేనే చదివిస్తామంటున్నారు. డబ్బులు కట్టడం మా వల్ల కాదంటున్నారు. ఇంతకీ ట్రిపుల్ ఐటీ పూర్తి చేయడానికి ఎన్ని డబ్బులు అవసరమవుతాయో.. నా లక్ష్యాన్ని ఎలా చేరుతానో తెలియక తీవ్ర ఆందోళనకు గురవుతున్నాను. మనసున్న మారాజు లెవరైనా నాకు దారి చూపి గమ్యం చేర్చాలని వేడుకుంటున్నా. - మమత -
ట్రిపుల్ఐటీ ఫలితాల విడుదల
నూజివీడు: నూజివీడు ట్రిపుల్ ఐటీ ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. ట్రిపుల్ ఐటీలో జరిగిన కార్యక్రమంలో డెరైక్టర్ ఆచార్య వీరంకివెంకటదాసు, పరిపాలనాధికారి ఆచార్య పి.అప్పలనాయుడు 2015-16 విద్యాసంవత్సరం రెండో సెమిస్టర్ ఫలితాలను విడుదల చేశారు. 2015-16 సంవత్సరం బ్యాచ్ ఫలితాలను కూడా ఈ సందర్భంగా ప్రకటించారు. ఈ ఫలితాలు గతం కంటే మెరుగవ్వడం విశేషం!. పీయూసీ ప్రథమ సంవత్సరం నుంచి ఇంజినీరింగ్ నాలుగో సంవత్సరం వరకు మొత్తం ఆరు సంవత్సరాల ఫలితాలను విడుదల చేశారు. విడుదల చేసిన ఫలితాలు ఆర్జీయూకేటీ వెబ్సైట్లో ఈనెల 16నుంచి అందుబాటులో ఉంటాయని తెలిపారు. -
నేడు జేఈఈ మెయిన్ ఫలితాలు
సాక్షి, హైదరాబాద్: ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు ఈ నెల 3న ఆఫ్‌లైన్‌లో, 9, 10 తేదీల్లో ఆన్లైన్లో నిర్వహించిన పరీక్ష ఫలితాలను ఈ నెల 27న విడుదల చేసేందుకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ చర్యలు చేపట్టింది. బుధవారం ఉదయం 10 గంటలకు ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది. ఫలితాల లింక్‌ను జేఈఈ వెబ్సైట్లో అందుబాటులో ఉంచనుంది. ఈ స్కోర్ ఆధారంగా జేఈఈ అడ్వాన్స్డ్ రాసే టాప్ 2 లక్షల మందిని ఎంపిక చేయనుంది. ఈ నెల 29 నుంచి జేఈఈ అడ్వాన్స్డ్ కోసం దరఖాస్తులు స్వీకరించేందుకు గువాహటి ఐఐటీ చర్యలు చేపట్టింది. -
కర్నూలులో ట్రిపుల్ ఐటీకి 151 ఎకరాలు
హైదరాబాద్: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ట్రిపుల్ ఐటీ) నిర్మాణం కోసం ప్రభుత్వం కర్నూలు జిల్లాలో 151.51 ఎకరాలు కేటాయించింది. కర్నూలు మండలంలోని దిన్నెదేవరపాడులో ట్రిపుల్ ఐటీ కోసం 151.51 ఎకరాల ప్రభుత్వ భూమిని ఉచితంగా కేటాయించినట్లు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి జేసీ శర్మ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. -
ఇడుపులపాయ ట్రిపుల్‌ఐటీలో ఆందోళన
కడప: వైఎస్ఆర్ కడప జిల్లా ఇడుపలపాయ ట్రిపుల్ ఐటీలో శుక్రవారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. అధ్యాపకుడు చేయి చేసుకున్నాడని విద్యార్థులు ధర్నాకు దిగడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇటీవలి కాలంలో కొత్తగా అమలులోకి వచ్చిన నిబంధనలను విద్యార్థులు అలక్ష్యం చేయడంతో.. కళాశాల సిబ్బంది ఈ అంశాన్ని అధ్యాపకుల దృష్టికి తీసుకెళ్లారు. కళాశాలలో ఈ-4 చదువుతున్న విద్యార్థి శుక్రవారం యూనిఫాం, గుర్తింపు కార్డు లేకుండా కళాశాలకు వచ్చాడు. దీంతో సిబ్బంది అధ్యాపకులకు విషయం తెలియ జేశారు. ఆ విద్యార్థిని తన గదికి పిలిపించిన రూపక్ కుమార్ అతనికి సర్ది చెప్పడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో విద్యార్థులకు ఉపాధ్యాయుడికి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో రూపక్కుమార్ చేతి వాచీ విద్యార్థి తలకు తాకడంతో.. విద్యార్థికి తలకు గాయామైంది. దీంతో కోపోద్రిక్తులైన తోటి విద్యార్థులు ఆందోళనకు చేస్తున్నారు. -
వైఎస్ఆర్ జిల్లాలో పోలీసుల ఓవరాక్షన్
కడప: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం వైఎస్ఆర్ జిల్లాలో పర్యటించనున్నారు. ఇడుపలపాయ ట్రిపుల్ ఐటీ స్నాతకోత్సవంలో ఆయన పాల్గొంటారు. అయితే సీఎం పర్యటన సందర్భంగా స్థానిక పోలీసులు ఓవరాక్షన్ ప్రదర్శిస్తున్నారు. ముఖ్యమంత్రి పర్యటనను అడ్డుకుంటారంటూ సీపీఐ, సీపీఎం నేతలను ముందుగా అరెస్టు చేశారు. అదే విధంగా వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే అంజద్ బాషా, మేయర్ సురేష్ బాబును హౌజ్ అరెస్టు చేశారు. దీంతో వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. అదుపులో 26 మంది వైఎస్సార్ జిల్లాలోని అలంఖాన్‌పల్లి గ్రామంలో జరగనున్న జన్మభూమి బహిరంగ సభలో పాల్గొనడానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రానున్న నేపథ్యంలో ఐదు పోలీస్స్టేషన్ల పరిధిలో వైఎస్సార్సీపీ, కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ పార్టీలకు చెందిన 26 మంది నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. -
వైఎస్ఆర్ జిల్లాలో పోలీసుల ఓవరాక్షన్
-
టీ హబ్‌లో స్టార్టప్‌ల జోరు
♦ 140 స్టార్టప్ కంపెనీల కార్యకలాపాలు షురూ ♦ నెల రోజుల్లో రంగంలోకి మరో 60 స్టార్టప్‌లు ♦ పని వాతావరణం బాగుందని నిపుణుల కితాబు ♦ ‘సాక్షి’ పరిశీలనలో వెల్లడి సాక్షి, హైదరాబాద్: సాంకేతిక రంగంలో నూత న ఆలోచనలు, సరికొత్త ఆవిష్కరణలతో ముందుకొచ్చే ఔత్సాహికులకు వేదికగా నిలిచేందుకు ఏర్పడిన టీ హబ్ క్యాటలిస్ట్ భవనంలో స్టార్టప్ కంపెనీల కార్యకలాపాలు జోరందుకున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో నవంబర్ 5న ప్రారంభమైన టీ హబ్‌లో సాఫ్ట్వేర్, ఆర్కిటెక్చర్, ఇంటీరియర్, ఈ-కామర్స్, అడ్వర్టైజింగ్, సర్వీస్ ప్రొవైడర్స్ వంటి వినూత్న సేవలందించే స్టార్టప్‌లు పనిచేస్తున్నాయి. అంతర్జాతీయ హంగులతో హైదరాబాద్ గచ్చిబౌలిలోని ట్రిపుల్ ఐటీ ప్రాంగణంలో ఐదంతస్తుల్లో నెలకొల్పిన ఈ భవనంలో ప్రతీదీ విశేషమే. సుమారు 200 స్టార్టప్‌లు కార్యకలాపాలు ప్రారంభించాల్సి ఉండగా ప్రస్తుతానికి 140 కార్యకలాపాల్లో నిమగ్నమయ్యాయి. మరో నెల రోజుల్లో 60 స్టార్టప్‌లు సేవలు ప్రారంభించనున్నాయి. ఈ నేపథ్యంలో టీ హబ్‌లో స్టార్టప్‌ల పనితీరు గురించి తెలుసుకునేందుకు స్టార్టప్‌ల యజమానులు, ఉద్యోగులను ‘సాక్షి’ పలకరించింది. ఇక్కడి పని వాతావరణం, సాంకేతిక నిపుణులకు అందుతున్న సహాయ సహకారాల గురించి అడిగి తెలుసుకుంది. త్వరలో రెండో దశ..? మొదటి దశ టీ-హబ్ ప్రాజెక్టు విజయవంతం కావడంతో ఇదే స్ఫూర్తితో రెండో దశ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టేందుకు రాష్ట్ర ఐటీ శాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. రాయదుర్గం ఇనార్బిట్ మాల్ సమీపంలో సుమారు 3 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించనున్న భవనంలో టీహబ్ రెండో దశను ప్రారంభించనున్నట్లుఐటీశాఖ కార్యదర్శి జయేశ్‌రంజన్ తెలిపా రు. త్వరలో టెండర్ల ప్రక్రియ పూర్తవుతుందని, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ఈ నెల 28న టీ-హబ్‌ను సందర్శించే అవకాశం ఉందన్నా రు. కాగా, స్టార్టప్‌లు పెట్టాలనుకునేవారికి అన్ని రకాల మౌలిక వసతులను కల్పిస్తున్నామని, రిజిస్ట్రేషన్ నుంచి పనులు మొదలుపెట్టే వరకు వారి వెన్నంటి ఉండి అన్ని విషయాల్లో సహాయ సహకారాలు అందిస్తున్నామని టీ హబ్ ఇన్చార్జి శ్రీనివాస్ కొల్లిపర వివరించారు. ఏం జరుగుతోంది..? ► నూతన ఆలోచనలతో స్టార్టప్‌లు పెట్టేలా ప్రోత్సహించడం ► సదస్సులు, చర్చల ద్వారా స్టార్టప్‌ల పరిధి విస్తరించడం ► ఇతర దేశాల స్టార్టప్‌లనూ ఆకర్షించడం ► ఐటీ, వివిధ పరిశోధన సంస్థల భాగస్వామ్యంతో మెరుగైన ఫలితాల సాధన ► అనుమతులు,పేటెంట్లు పొందేందుకు సహకారం ► స్టార్టప్‌లకు అవసరమైన వనరులన్నీ ఒకేచోట అందుబాటులో ఉంచడం మరికొన్ని ప్రత్యేకతలు... విద్యుత్, నీరు పొదుపుగా వినియోగించేలా ఇందులో ఏర్పాట్లున్నాయి. ఉద్యోగులు లోనికి వచ్చేటప్పుడు లైట్లు వెలగడం.. బయటకు వెళ్లగానే ఆరిపోయేలా సెన్సార్లున్నాయి. భవనం వెలుపలి అద్దాలు 95 శాతం వేడిని బయటే నిరోధిస్తాయి. బల్లలు, కుర్చీలు అవసరాలకు అనుగుణంగా మార్చుకోవచ్చు. సిలికాన్ వ్యాలీని తలపిస్తోంది టీ-హబ్ సిలికాన్ వ్యా లీని తలపిస్తోంది. వస తులు అంతర్జాతీయ ప్ర మాణాలతో ఉన్నాయి. ప్రస్తుతం మా స్టార్టప్‌లో 18 మంది ఉన్నారు. వివాహాది శుభకార్యాల నిర్వాహకులకు సకల సేవలను ఒకే గవాక్షం ద్వారా అందించే ప్రోగ్రామ్ సిద్ధం చేస్తున్నాం. - ప్రణవ్ (గుజరాత్), ఫ్లాట్ పెబుల్ స్టార్టప్ టీ హబ్ గురించి యజమానులు, ఉద్యోగులు ఏం చెప్పారంటే.. చక్కని పని వాతావరణం టీ-హబ్‌లో సృజనాత్మకంగా పనిచేసుకునేం దుకు అనువైన వాతావరణముంది. నూతన సాఫ్ట్వేర్ సృష్టించే పనిలో నిమగ్నమయ్యాం. మా ఆలోచనలను ఆవిష్కరించేందుకు సరైన మార్గదర్శకులు, నిపుణులు అందుబాటులో ఉన్నారు. - వెంకీ (చెన్నై), అక్యూరా స్టార్టప్ అవకాశాల స్వర్గం నేను సాఫ్ట్వేర్ డెవలపర్‌గా పనిచేస్తున్నాను. భవిష్యత్‌లో నాకు మరిన్ని అవకాశాలు లభిస్తాయన్న ఆత్మవిశ్వాసం పెరిగింది. మెంటర్లు, ఇన్వెస్టర్లు ఇక్కడే ఉండటంతో మా ఆవిష్కరణలకు ఆకాశమే హద్దుగా భావిస్తున్నా. - విశాల్(అహ్మదాబాద్), క్యూ8 సాఫ్ట్వేర్ స్టార్టప్ సహకారం బాగుంది టీ-హబ్‌లో పనిచేసుకునేందుకు అందరి సహా య సహకారాలు లభిస్తున్నాయి. ఆరుగురున్న బృందం ఆన్లైన్లో యాడ్స్ ఇచ్చే సంస్థలకు నూతన సాఫ్ట్‌వేర్‌ను సిద్ధం చేస్తున్నాము. మా సంస్థకు అమెరికా నుంచి బెస్ట్ సెర్చ్ అవార్డు దక్కింది. - గీతాంజలి(యూపీ), ఆప్టిమైజర్ స్టార్టప్ ఉత్సాహం నింపుతోంది... మా స్టార్టప్‌లో 13 మంది పనిచేస్తున్నారు. మా సంస్థ 30 దేశాల్లో సేవలందిస్తోంది. ఆర్కిటెక్చర్, ఇంటీరియర్ డిజైనింగ్‌కు సంబంధించిన సాఫ్ట్‌వేర్‌ను రూ పొందిస్తున్నాం. ఇక్కడి వాతావరణం ఉత్సాహంగా ఉంది. - మెహర్(అమెరికా), స్కిల్ఓ సాఫ్ట్వేర్ -
ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల తరగతుల బహిష్కరణ
వేంపల్లె: ఇంటర్న్‌షిప్ వ్యవధి తగ్గించాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ జిల్లా ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ విద్యార్థులు మంగళవారం తరగతులను బహిష్కరించారు. నాలుగేళ్ల ఇంజనీరింగ్ కోర్సులో చివరి రెండేళ్లలో ఇంటర్న్‌షిప్ పేరిట కొద్ది రోజులు కళాశాల వెలుపల ప్రాజెక్టు వర్క్ చేయాలని ఇటీవల నిబంధనలు రూపొందించారు. ఇప్పటి వరకు చివరి ఏడాది మాత్రమే ఇంటర్న్‌షిప్ విధానం అమల్లో ఉంది. ఈ విషయంపై వారం రోజులుగా నూజివీడు ట్రిపుల్ ఐటీలో విద్యార్థులు నిరసన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో ఈ1, ఈ2, ఈ3 విద్యార్థులు సైతం మంగళవారం తరగతులు బహిష్కరించి ల్యాబ్ కాంప్లెక్స్‌లో సమావేశమయ్యారు. ఈ4 విద్యార్థులు మాత్రం వారాంతపు పరీక్షకు హాజరయ్యారు. రెండు మార్లు ఇంటర్న్‌షిప్ తమకు భారం అని విద్యార్థులు వాదిస్తుండగా, సులభంగా ఉద్యోగావకాశాలు లభిస్తాయని అధ్యాపక వర్గాలు చెబుతున్నాయి. కాగా, ఈ నిబంధన తప్పనిసరి కాదని, ఇష్టం లేని వారు ఇక్కడే ఉండి చదువుకోచ్చని అధ్యాపకులు అంటున్నారు. -
ట్రిపుల్ ఐటీకి అబ్దుల్ కలాం పేరు
-
పేదింట పూసిన విద్యాకుసుమాలు
♦ పిల్లలిద్దరికీ ట్రిపుల్ ఐటీలో సీటు ♦ గతేడాది ఒకరికి.. ఈ యేడాది మరొకరికి ♦ ఆనందంలో తల్లిదండ్రులు కామారెడ్డి : రెక్కాడితేగాని డొక్కాడని కుటుంబం వారిది. వారికి ఇద్దరు పిల్లలు. కామారెడ్డి పట్టణంలోని శ్రీరాంనగర్ కాలనీలోని ఓ అద్దె ఇంట్లో ఉంటూ ఇద్దరు పిల్లల్ని జెడ్పీహెచ్ఎస్ గంజ్ ఉన్నత పాఠశాలలో చదివించారు. పిల్లలిద్దరూ కష్టపడి చదివారు. గత యేడాది వారి కూతురు ట్రిపుల్ ఐటీకి ఎంపికైతే, ఈ యేడాది కొడుకు ఎంపికై నేనేం తక్కువ కాదని నిరూపించాడు. ఇంకేముంది, ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేకుండా పోరుుంది. పిట్లంకు చెందిన జంపగల్ల నగేశ్, అన్నపూర్ణ దంపతులు ఇరువై ఏళ్ల క్రితం బతుకుదెరువు కోసం కామారెడ్డి పట్టణానికి వ చ్చారు. ఇద్దరూ చెరో పనిచేసుకుంటూ పిల్లలిద్దరిని పోషిస్తున్నారు. చేసిన పనికి వచ్చే కూలీ డబ్బులు తిండికే సరిపోతుండడంతో ప్రైవేట్ పాఠశాలలో చదివించే స్తోమత లేకుండా పోరుుంది. కానీ, వారి నమ్మకాన్ని పిల్లలు వమ్ము చేయలేదు. కష్టపడి చదివారు ఇద్దరూ ట్రిపుల్ ఐటీలో సీటు సాధించారు. ‘తమ కష్టాన్ని పిల్లలు గుర్తించి తగిన ఫలితం ఇచ్చారని’ చెమర్చిన కళ్లతో నగేశ్, అన్నపూర్ణ దంపతులిద్దరూ ‘సాక్షి’తో తమ ఆనందాన్ని పంచుకున్నారు. పిల్లలే మా వెలుగు... మా ఇద్దరికీ చదువు రాదు. పిల్లలను సర్కారు బడిలో చది వించాం. పిల్లలిద్దరూ కష్టపడి చదివి మంచి మార్కులు సాధించారు. ఇద్దరూ ట్రిపుల్ ఐటీకి ఎంపికవడం ఆనందం గా ఉంది. మా బావమర్ది చంద్రకాంత్ పిల్లలను ఎంతగానో ప్రోత్సహించారు. ఉపాధ్యాయులు కూడా ఎంతో సహకా రం అందించారు. పిల్లలే మాకు వెలుగు. నగేశ్,అన్నపూర్ణ, తల్లితండ్రులు నాకు తోడుగా తమ్ముడు ట్రిపుల్ ఐటీకి ఎంపికైన నాకు ఇప్పుడు తమ్ముడు తోడయ్యాడు. ఎంతో సంతోషంగా ఉంది. ఇద్దరం మంచిగా చదువుకుని అమ్మానాన్నకు మంచి పేరు తీసుకొస్తాం. వాళ్లు పడే కష్టం రోజూ చూసి కష్టపడి చదివాం. నందిని, కూతురు ఉపాధ్యాయులు ప్రోత్సాహించారు పదో తరగతిలో 9.7 జీపీఏ రావడానికి మా సార్ల ప్రోత్సాహం ఎంతో ఉంది. అమ్మా, నాన్నతో పాటు మామయ్య ప్రోత్సహించారు. మంచి చదువులు చదివి కుటుంబానికి అండగా ఉంటాం. నితీష్, కుమారుడు -
ట్రిపుల్ ఐటీలో ప్రవేశాలకు నోటిఫికేషన్
భైంసా: తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఏకైక ట్రిపుల్ఐటీ బాసరలో ప్రవేశాల ప్రక్రియకు ప్రభుత్వం ప్రకటన జారీ చేసింది. మన రాష్ట్రంలో మొదటిసారిగా ఆదిలాబాద్ జిల్లా బాసర ట్రిపుల్‌ఐటీలో గురువారం నుంచి దరఖాస్తుల స్వీక రణ ప్రారంభమైంది. పదో తరగతి ఉత్తీర్ణులైన పల్లె విద్యార్థులకు అత్యుత్తమ ఐటీ విద్యనందించే లక్ష్యంతో ఆర్జేయూకేటీ ట్రిపుల్‌ఐటీలో విద్యార్థుల ప్రవేశానికి నోటిఫికేషన్ జారీ చేసిం ది. తెలంగాణ రాష్ట్రంలోని ఏకైక బాసర ట్రిపుల్‌ఐటీలో 1000 సీట్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 2015-16 విద్యాసంవత్సరానికి సంబంధించి గురువారం నుంచి జూన్ 19 వరకు విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవచ్చని ఇప్పటికే యూనివర్సిటీ అధికారులు ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు రాష్ట్రపతి, ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం 85 శాతం సీట్లు, 15శాతం అన్రిజర్డ్వ్ సీట్లను కేటాయించారు. దరఖాస్తు చేసుకునే విధానం... ట్రిపుల్‌ఐటీలో చేరాలనుకునే విద్యార్థులు ఆన్లైన్ ప్రక్రియలో ఆర్జీయూకేటీకి దరఖాస్తు చేసుకోవాలి. వెబ్సైట్ www.rgujt.inÌZ admissions 2015.rgukt.in లింక్ ద్వారా అప్లికేషన్లను నమోదు చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన దరఖాస్తు ప్రతి వెబ్సైట్లో అందుబాటులో ఉంటుంది. అందులోని కాలంలో అడిగే వివరాలు పూర్తి చేసి దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాలి. బాసర ట్రిపుల్ఐటీ క్యాంపస్ పేరును నమోదు చేయాలి. అనంతరం ఆన్లైన్లో సమర్పించిన దరఖాస్తు ప్రింట్ తీసుకుని పదో తరగతి ధ్రువీకరణ పత్రాల జిరాక్స్ కాపీలు, రూ.150 విలువ గల బ్యాంకు డిమాండ్ డ్రాఫ్ట్‌ను ఒరిజినల్ జత పరిచి, రిజిస్ట్రార్ ట్రిపుల్ఐటీ క్యాంపస్ గచ్చిబౌలి హైదరాబాద్ చిరునామాకు రిజిస్ట్రార్ ద్వారా లేదా స్పీడ్ పోస్టు ద్వారా పంపాలి. వెనుకబడిన విద్యార్థులు రూ.100 డిమాండ్ డ్రాఫ్ట్ జత చేస్తే సరిపోతుంది. ప్రవేశానికి అర్హతలు... పదో తరగతి లేదా దానికి సమానమైన పరీక్షల్లో ఉత్తీర్ణులై ఉండాలి. 2015 సంవత్సరంలో రెగ్యూలర్ విద్యార్థులుగా మొదటి ప్రయత్నంలోనే ఉత్తీర్ణులు కావాలి. డిసెంబర్ 31, 2015 నాటికి 18 ఏళ్ల వయసు దాటకూడదు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 21 సంవత్సరాల వరకు మినహాయింపు ఉంది. ఎంపిక ప్రక్రియ... ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదివిన వారెవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు వెనుకబాటు సూచి కింద 0.4 జీపీఏ అదనంగా కలుపుతారు. ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదివిన వారికి వెనుకబాటు సూచి పాయింట్లు ఉండవు. వచ్చిన దరఖాస్తుల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థుల వడపోతను ఆరంభిస్తారు. అనంతరం పదో తరగతి జీపీఏ ఆధారంగా రిజర్వేషన్లను పాటిస్తూ విద్యార్థులను ఎంపిక చేస్తారు. తెలంగాణ రాష్ట్రంలోనూ అన్ని మండలాలకు ప్రాతినిధ్యం ఉండేలా అధికారులు ఎంపిక ప్రక్రియ చేపడుతారు. ఎంపికైన విద్యార్థులకు ఉత్తరాలు, సెల్‌ఫోన్ ద్వారా సమాచారం అందజేస్తారు. జీపీఏ సమానంగా ఉంటే... దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల జీపీఏ సమానంగా ఉంటే గ్రేడ్ పాయింట్ల ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేస్తారు. ఒకేరకమైన పాయింట్లు ఉన్న వారు వేలల్లో ఉంటారు. అలాంటప్పుడు గణితంలో ఎక్కువ మార్కులు ఉన్నవారికి మొదటిప్రాధాన్యం ఇస్తారు. అక్కడ కూడా సమానంగా ఉంటే భౌతికశాస్త్రం.. అప్పు డూ సమానమైతే రసాయనశాస్త్రం చివరగా ఆంగ్లం మార్కులను పరిగణలోకి తీసుకుంటారు. అప్పటికీ ఎక్కువ మంది సమానంగా ఉంటే పుట్టిన తేదీ ఆధారంగా ఎక్కువ వయసు ఉన్న వారికి ప్రవేశం కల్పిస్తారు. ప్రవేశం తర్వాత... ట్రిపుల్‌ఐటీలో ప్రవేశం పొందిన విద్యార్థులకు ఆరేళ్ల కోర్సు ఉంటుంది. మొదటి రెండేళ్లు ప్రీ యూనివర్సిటీ కోర్సు(పీయూసీ) ఉంటుంది. ఇది ఇంటర్మీడియట్‌తో సమానం. రెండేళ్ల కోర్సు తర్వాత ఇక్కడ చదివే విద్యార్థులకు అవకాశాలు వస్తే బయటకు వెళ్లిపోవచ్చు. వారికి పీయూసీ ఉత్తీర్ణత పత్రం ఇస్తారు. మిగిలిన నాలుగేళ్లు ఇంజినీరింగ్ విద్య ఉంటుంది. నాలుగేళ్ల బీటెక్ కోర్సును సెమిస్టార్ విధానం ద్వారా పూర్తి చేయాల్సి ఉంటుంది. బీటెక్‌లో ఆర్జీయూకేటీ సివిల్, కెమికల్, కంప్యూటర్, ఎలక్ట్రానిక్స్, ఐటీ, ఈసీఈ, ఎంఎంఈ కోర్సులు అందిస్తోంది. పీయూసీలో సాధించిన మార్కులే బీటెక్‌లో కోర్సుల కేటాయింపునకు కీలకం అవుతాయి. ట్రిపుల్‌ఐటీల ప్రధాన లక్ష్యం ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్ కావడంతో ఎక్కువ మంది విద్యార్థులు కోర్సు ఇక్కడే పూర్తిచేసేందుకు ఆసక్తి కనబరుస్తారు. బోధన రుసుము.. గ్రామీణ ప్రాంత నిరుపేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి ఇంజినీరింగ్ విద్యను అందించే ఉద్దేశంతో ప్రారంభించిన ట్రిపుల్ఐటీల్లో కుటుంబ ఆదాయం రూ.లక్షలోపు ఉంటే ప్రభుత్వమే ఉచితంగా విద్యా, వసతి కల్పిస్తుంది. లక్షలోపు ఆదాయం ఉన్న విద్యార్థులు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. కేవలం రూ.3 వేలు కాషన్ డిపాజిట్ చెల్లించాలి. కోర్సు పూర్తయ్యాక అది విద్యార్థులకే తిరిగి ఇచ్చేస్తారు. లక్ష ఆదాయం దాటిన కుటుంబాలకు చెందిన విద్యార్థులకు ఏడాదికి రూ.36 వేలు బోధన రుసుము చెల్లించాలి. మేజర్‌తోపాటు మైనర్ సబ్జెక్టు... బీటెక్‌లో ప్రవేశించాక విద్యార్థులు ఆరు శాఖల్లో ఒక దానిని ప్రధాన(మేజర్) సబ్జెక్టుగా ఎంచుకుంటారు. దీంతోపాటు తప్పని సరిగా విద్యాంతర నైపుణ్యాలు పొందేందుకు మైనర్ సబ్జెక్టును ఎంచుకోవాలి. ఇందులో సంగీతం, నృత్యం, హ్యూమానిటిస్, గణితం, ఇంజినీరింగ్ సైన్స్ వంటి వాటిలో ఒకదానిని ఎంచుకోవచ్చు. మేజర్ డిగ్రీతోపాటు అదనంగా యూనివర్సిటీ మైనర్ డిగ్రీని విద్యార్థులకు ప్రదానం చేస్తుంది. -
ట్రిపుల్ ఐటీలో ప్రవేశాలకు నోటిఫికేషన్
పేద విద్యార్థులకు సదావకాశం దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం భైంసా : తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఏకైక ట్రిపుల్ఐటీ బాసరలో ప్రవేశాల ప్రక్రియకు ప్రభుత్వం ప్రకటన జారీ చేసింది. మన రాష్ట్రంలో మొదటిసారిగా ఆది లాబాద్ జిల్లా బాసర ట్రిపుల్‌ఐటీలో గురువారం నుంచి దరఖాస్తుల స్వీకర ణ ప్రారంభమైంది. పదో తరగతి ఉత్తీర్ణులైన పల్లె విద్యార్థులకు అత్యుత్తమ ఐటీ విద్యన ందించే లక్ష్యంతో ఆర్జేయూకేటీ ట్రిపుల్‌ఐటీలో విద్యార్థుల ప్రవేశానికి నోటిఫికేషన్ జారీ చేసింది. తెలంగాణ రాష్ట్రంలోని ఏకైక బాసర ట్రిపుల్‌ఐటీలో 1000 సీట్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 2015-16 విద్యాసంవత్సరానికి సంబంధించి గురువారం నుంచి జూన్ 19 వరకు విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవచ్చని ఇప్పటికే యూనివర్సిటీ అధికారులు ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు రాష్ట్రపతి, ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం 85 శాతం సీట్లు, 15శాతం అన్రిజర్డ్వ్ సీట్లను కేటాయించారు. దరఖాస్తు చేసుకునే విధానం... ట్రిపుల్‌ఐటీలో చేరాలనుకునే విద్యార్థులు ఆన్లైన్ ప్రక్రియలో ఆర్జీయూకేటీకి దరఖాస్తు చేసుకోవాలి. వెబ్సైట్ ఠీఠీఠీ.టజఠ్జ్ట.జీల్చోఛీఝజీటటజీౌట 2015.టజఠజ్టు.జీ లింక్ ద్వారా అప్లికేషన్లను నమోదు చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన దరఖాస్తు ప్రతి వెబ్సైట్లో అందుబాటులో ఉంటుంది. అందులోని కాలంలో అడిగే వివరాలు పూర్తి చేసి దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాలి. బాసర ట్రిపుల్ఐటీ క్యాంపస్ పేరును నమోదు చేయాలి. అనంతరం ఆన్లైన్లో సమర్పించిన దరఖాస్తు ప్రింట్ తీసుకుని పదో తరగతి ధ్రువీకరణ పత్రాల జిరాక్స్ కాపీలు, రూ.150 విలువ గల బ్యాంకు డిమాండ్ డ్రాఫ్ట్‌ను ఒరిజినల్ జత పరిచి, రిజిస్ట్రార్ ట్రిపుల్ఐటీ క్యాంపస్ గచ్చిబౌలి హైదరాబాద్ చిరునామాకు రిజిస్ట్రార్ ద్వారా లేదా స్పీడ్ పోస్టు ద్వారా పంపాలి. వెనుకబడిన విద్యార్థులు రూ.100 డిమాండ్ డ్రాఫ్ట్ జత చేస్తే సరిపోతుంది. ప్రవేశానికి అర్హతలు... పదో తరగతి లేదా దానికి సమానమైన పరీక్షల్లో ఉత్తీర్ణులై ఉండాలి. 2015 సంవత్సరంలో రెగ్యూలర్ విద్యార్థులుగా మొదటి ప్రయత్నంలోనే ఉత్తీర్ణులు కావాలి. డిసెంబర్ 31, 2015 నాటికి 18 ఏళ్ల వయసు దాటకూడదు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 21 సంవత్సరాల వరకు మినహాయింపు ఉంది. ఎంపిక ప్రక్రియ... ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదివిన వారెవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు వెనుకబాటు సూచి కింద 0.4 జీపీఏ అదనంగా కలుపుతారు. ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదివిన వారికి వెనుకబాటు సూచి పాయింట్లు ఉండవు. వచ్చిన దరఖాస్తుల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థుల వడపోతను ఆరంభిస్తారు. అనంతరం పదో తరగతి జీపీఏ ఆధారంగా రిజర్వేషన్లను పాటిస్తూ విద్యార్థులను ఎంపిక చేస్తారు. తెలంగాణ రాష్ట్రంలోనూ అన్ని మండలాలకు ప్రాతినిధ్యం ఉండేలా అధికారులు ఎంపిక ప్రక్రియ చేపడుతారు. ఎంపికైన విద్యార్థులకు ఉత్తరాలు, సెల్‌ఫోన్ ద్వారా సమాచారం అందజేస్తారు. జీపీఏ సమానంగా ఉంటే... దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల జీపీఏ సమానంగా ఉంటే గ్రేడ్ పాయింట్ల ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేస్తారు. ఒకేరకమైన పాయింట్లు ఉన్న వారు వేలల్లో ఉంటారు. అ లాంటప్పుడు గణితంలో ఎక్కువ మార్కులు ఉన్నవారికి మొదటిప్రాధాన్యం ఇస్తారు. అక్కడ కూడా సమానంగా ఉం టే భౌతికశాస్త్రం.. అప్పు డూ సమానమైతే రసాయనశాస్త్రం చివరగా ఆంగ్లం మార్కులను పరిగణలోకి తీసుకుంటారు. అప్పటికీ ఎక్కువ మంది సమానంగా ఉంటే పుట్టిన తేదీ ఆ ధారంగా ఎక్కువ వయసు ఉన్న వారికి ప్రవేశం కల్పిస్తారు. ప్రవేశం తర్వాత... ట్రిపుల్‌ఐటీలో ప్రవేశం పొందిన విద్యార్థులకు ఆరేళ్ల కోర్సు ఉంటుంది. మొదటి రెండేళ్లు ప్రీ యూనివర్సిటీ కోర్సు(పీయూసీ) ఉంటుంది. ఇది ఇంటర్మీడియట్‌తో సమానం. రెండేళ్ల కోర్సు తర్వాత ఇక్కడ చదివే విద్యార్థులకు అవకాశాలు వస్తే బయటకు వెళ్లిపోవచ్చు. వారికి పీయూసీ ఉత్తీర్ణత పత్రం ఇస్తారు. మిగిలిన నాలుగేళ్లు ఇంజినీరింగ్ విద్య ఉంటుంది. నాలుగేళ్ల బీటెక్ కోర్సును సెమిస్టార్ విధానం ద్వారా పూర్తి చేయాల్సి ఉంటుంది. బీటెక్‌లో ఆర్జీయూకేటీ సివిల్, కెమికల్, కంప్యూటర్, ఎలక్ట్రానిక్స్, ఐటీ, ఈసీఈ, ఎంఎంఈ కోర్సులు అందిస్తోంది. పీయూసీలో సాధించిన మార్కులే బీటెక్‌లో కోర్సుల కేటాయింపునకు కీలకం అవుతాయి. ట్రిపుల్‌ఐటీల ప్రధాన లక్ష్యం ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్ కావడంతో ఎక్కువ మంది విద్యార్థులు కోర్సు ఇక్కడే పూర్తిచేసేందుకు ఆసక్తి కనబరుస్తారు. బోధన రుసుము.. గ్రామీణ ప్రాంత నిరుపేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి ఇంజినీరింగ్ విద్యను అందించే ఉద్దేశంతో ప్రారంభించిన ట్రిపుల్ఐటీల్లో కుటుంబ ఆదాయం రూ.లక్షలోపు ఉంటే ప్రభుత్వమే ఉచితంగా విద్యా, వసతి కల్పిస్తుంది. లక్షలోపు ఆదాయం ఉన్న విద్యార్థులు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. కేవలం రూ.3 వేలు కాషన్ డిపాజిట్ చెల్లించాలి. కోర్సు పూర్తయ్యాక అది విద్యార్థులకే తిరిగి ఇచ్చేస్తారు. లక్ష ఆదాయం దాటిన కుటుంబాలకు చెందిన విద్యార్థులకు ఏడాదికి రూ.36 వేలు బోధన రుసుము చెల్లించాలి. మేజర్‌తోపాటు మైనర్ సబ్జెక్టు... బీటెక్‌లో ప్రవేశించాక విద్యార్థులు ఆరు శాఖల్లో ఒక దానిని ప్రధాన(మేజర్) సబ్జెక్టుగా ఎంచుకుంటారు. దీంతోపాటు తప్పని సరిగా విద్యాంతర నైపుణ్యాలు పొందేందుకు మైనర్ సబ్జెక్టును ఎంచుకోవాలి. ఇందులో సంగీతం, నృత్యం, హ్యూమానిటిస్, గణితం, ఇంజినీరింగ్ సైన్స్ వంటి వాటిలో ఒకదానిని ఎంచుకోవచ్చు. మేజర్ డిగ్రీతోపాటు అదనంగా యూనివర్సిటీ మైనర్ డిగ్రీని విద్యార్థులకు ప్రదానం చేస్తుంది. -
'ముందు.. నా ప్రశ్నకు సమాధానం చెప్పు'
రాయ్ బరేలీ: చాలాకాలం తర్వాత తొలిసారి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ కుమార్తె ప్రియాంక గాంధీ రాజకీయ అంశాన్ని తలకెత్తుకున్నారు. ఆమె కేంద్రమంత్రి స్మృతి ఇరానీపై విమర్శల వర్షం కురిపించారు. కేంద్ర మానవ వనరులశాఖామంత్రి అమేథీలో ఎందుకు ఇప్పటివరకు ఐఐఐటీని ఏర్పాటుచేయడం లేదని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు ఆమె తప్పక సమాధానం చెప్పి తీరాలని డిమాండ్ చేశారు. ఒక విద్యా మంత్రి అయి ఉన్న ఆమెను ఏకారణం ఐఐఐటీని ఏర్పాటులచేయకుండా ఆపుతుందో వివరించాలని కోరారు. స్మృతి ఆ శాఖను నిర్వహిస్తున్నప్పటి నుంచి ఎంతో మంది యువత సమస్యలు ఎదుర్కొంటున్నారని, ఆవిషయం ఆమె ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. నియోజకవర్గంలో ప్రజలు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్న పట్టించుకోవడం కరువైందని అన్నారు. ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా స్మృతి ఇరానీ రాహుల్ నియోజకవర్గంలో పర్యటించి తీవ్ర విమర్శలు చేసింది. గాంధీ కుటుంబ పాలనలో అమేథీ, రాయ్ బరేలీ సమస్యల్లో కూరుకుపోయాయని, అభివృద్ధి ఆగిపోయిందని విమర్శించింది. దీంతో ఈ వ్యాఖ్యలపై ప్రియాంకగాంధీ స్పందించారు. ఆమె ప్రస్తుతం రాయ్ బరేలీ పర్యటనలో ఉన్నారు. -
నాసా విద్యార్థులకు కేసీఆర్ భరోసా
-
ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీకి చేయూత
అమెరికాకు చెందిన అప్లయిడ్ మెటీరియల్స్ సంస్థకు మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి హైదరాబాద్: రాష్ట్రంలో ఇంజనీరింగ్ విద్య అంతర్జాతీయ ప్రమాణాలను అందిపుచ్చుకునేందుకు వీలుగా ట్రిపుల్ ఐటీ, ఎన్ఐటీ సంస్థలను పరిశోధనల్లో భాగస్వాములను చేసుకోవాలని అమెరికాలోని ప్రముఖ కంపెనీ అప్లయిడ్ మెటీరియల్స్‌ను పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కె.తారకరామారావు కోరారు. (సెమీకండక్టర్ల తయారీ పరిశ్రమకు అవసరమయ్యే పరికరాలు, సేవలు, సాఫ్ట్‌వేర్‌ను ఈ సంస్థ సరఫరా చేస్తుంది.) అమెరికా పర్యటనలో భాగంగా కేటీఆర్ శుక్రవారం పలు ఎలక్ట్రానిక్ సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అప్లయిడ్ మెటీరియల్స్ సంస్థ సీనియర్ అధికారులతో మాట్లాడుతూ వారిని తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. తెలంగాణ నుంచి వెళ్లి అప్లయిడ్ మెటీరియల్స్ సంస్థకు చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్‌గా వ్యవహరిస్తున్న ఓంకారం నల్లమాసును కేటీఆర్ అభినందించారు. అలాగే ఆ సంస్థ జనరల్ పార్ట్నర్గా ఉన్న కిట్టూ కొల్లూరి మెదక్ జిల్లావాసి అని తెలిసి అభినందనలు తెలిపారు. అనంతరం బే ఏరియాలో ఎన్నారైలతో ఏర్పాటు చేసిన ములాఖత్‌కు కేటీఆర్ హాజరయ్యారు. వాటర్‌గ్రిడ్‌పై ఆరా: ప్రభుత్వం చేపట్టిన వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టు పనుల పురోగతిపై అమెరికా పర్యటనలో ఉన్న కేటీఆర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో సమీక్ష నిర్వహించారు. సీఎం ప్రకటించిన విధంగా మూడేళ్లలోపే ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలన్నారు. ప్రాజెక్టుకు సంబంధించిన ఇన్‌టేక్ వెల్స్ నిర్మాణ పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. జిల్లా స్థాయిలో పనుల సమీక్షకు కలెక్టర్ల ఆధ్వర్యంలో సమన్వయ కమిటీలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. -
జూన్ 24నే తుది ర్యాంకులు
ముందస్తుగా జేఈఈ మెయిన్ ఆల్ ఇండియా ర్యాంకులు ఉమ్మడి ప్రవేశాల కోసం ర్యాంకుల వెల్లడి తేదీల మార్పు ఈనెల 24న జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష.. జూన్ 25 నుంచి విద్యార్థుల ఆప్షన్ల స్వీకరణ జూలై 1న ఎన్ఐటీ, ఐఐటీల్లో సీట్ల కేటాయింపు జూలై 16 నుంచి ఐఐటీల్లో, 23 నుంచి ఎన్ఐటీల్లో తర గతులు షెడ్యూలు ప్రకటించిన జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ హైదరాబాద్: జాతీయ స్థాయి విద్యా సంస్థలైన ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీ, ఐఐటీల్లో ప్రవేశాలను త్వరగా పూర్తి చేసి, సకాలంలో తరగతులను ప్రారంభించేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. ప్రతి ఏటా ప్రవేశాల్లో జాప్యం జరుగుతుండటంతో తరగతుల ప్రారంభం ఆలస్యమవుతోంది. దీంతో విద్యా సంవత్సరంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈసారి నిర్ణీత వ్యవధిలోనే (జూలై) తరగతులను ప్రారంభించేందుకు చర్యలు చేపట్టింది. దీంతోపాటు ఎన్ఐటీ, ఐఐటీ, ట్రిపుల్‌ఐటీలకు వేర్వేరుగా ప్రవేశాల కౌన్సెలింగ్ చేపట్టడం వల్ల సీట్లు మిగిలిపోతుండటంతో అలా జరగకుండా ఒకేసారి కౌన్సెలింగ్ నిర్వహించేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా జేఈఈ మెయిన్ ఆల్ ఇండియా ర్యాంకులను ముందస్తుగా వెల్లడించేందుకు మంగళవారం షెడ్యూలు ప్రకటించింది. సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) ముందుగా ఇచ్చిన షెడ్యూలు ప్రకారం ఏప్రిల్ 4న ఆఫ్‌లైన్, 10, 11 తేదీల్లో జరిగిన ఆన్లైన్ పరీక్షల్లో విద్యార్థుల స్కోర్‌ను ఏప్రిల్ 27న ప్రకటించింది. ఆల్ ఇండియా ర్యాంకులను జూలై 7న వెల్లడించాల్సి ఉంది. అయితే ఉమ్మడి కౌన్సెలింగ్ నేపథ్యంలో జేఈఈ మెయిన్ ఆల్ ఇండియా ర్యాంకులను జూన్ 24నే ప్రకటించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇటీవల జేఈఈ మెయిన్‌కు చెందిన సెంట్రల్ సీట్ అలొకేషన్ బోర్డు, జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు చెందిన జాయింట్ అడ్మిషన్ బోర్డు సంయుక్తంగా జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీగా ఏర్పడి ఉమ్మడి కౌన్సెలింగ్‌కు చర్యలు చేపట్టాయి. ఈనెల 24న నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష ఆల్ ఇండియా ర్యాంకులను జూన్ 18న ప్రకటించాలని నిర్ణయం తీసుకున్నాయి. మరోవైపు జూన్ 24న జేఈఈ మెయిన్ ఆల్ ఇండియా ర్యాంకులను కూడా వెల్లడించి, 25వ తేదీ నుంచే విద్యార్థుల నుంచి ఆప్షన్ల నమోదుకు చర్యలు చేపట్టింది. మొత్తానికి జూలై 16 నుంచి ఐఐటీల్లో, 23 నుంచి ఎన్ఐటీల్లో తరగతులను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసింది. జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష షెడ్యూలు - ఈనెల 7 వరకు: ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ - మే 11-14 వరకు: హాల్ టికెట్ల (అడ్మిట్ కార్డు) డౌన్లోడ్ - మే 24: రాత పరీక్ష (ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పేపరు-1, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు పేపరు-2) - జూన్ 8: ఆన్లైన్లో జవాబుల కీ - 8 -11 వరకు: జవాబుల కీపై అభ్యంతరాలు స్వీకరణ - 13: మార్కుల విడుదల - 18: జేఈఈ అడ్వాన్స్డ్ ఆల్ ఇండియా ర్యాంకులు ప్రకటన ఇదీ సీట్ల కేటాయింపు షెడ్యూలు జూన్ 24: జేఈఈ మెయిన్ ఆల్ ఇండియా ర్యాంకులు 25-29 వరకు: విద్యార్థులు కాలేజీలను ఎంచుకునేందుకు ఆప్షన్లు (చాయిస్) 28: ఆప్షన్లను బట్టి మాక్ సీట్ అలొకేషన్ ప్రదర్శన 30: ఐఐటీ/ఎన్ఐటీల్లో సీట్ల కేటాయింపు, పరిశీలన జూలై 1: మొదటి దశ సీట్లు కేటాయింపు ప్రకటన 2-6 వరకు: విద్యార్థుల నుంచి అంగీకారం తీసుకోవడం 7: భర్తీ అయిన సీట్లు, మిగిలిన సీట్లు ప్రకటన. రెండో దశ సీట్ల కేటాయింపు 8-11 వరకు: విద్యార్థుల అంగీకారం తీసుకోవడం 12: భర్తీ అయిన సీట్లు, మిగిలిన సీట్ల వివరాల ప్రకటన. మూడో దశ సీట్లు కేటాయింపు 13 -15 వరకు: విద్యార్థుల అంగీకారం తీసుకోవడం 16 నుంచి: ఐఐటీల్లో తరగతులు ప్రారంభం. భర్తీ అయిన, మిగిలిన సీట్ల వివరాల ప్రకటన. నాలుగో దశ సీట్లు కేటాయింపు 17- 20 వరకు: విద్యార్థుల నుంచి అంగీకారం తీసుకోవడం 23 నుంచి: ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీల్లో తరగతుల ప్రారంభం ఇదీ ఐఐటీ ప్రవేశ అర్హత విధానం ఐఐటీల్లో సీటు పొందాలంటే జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ఆల్ ఇండియా ర్యాంకుతోపాటు అర్హత పరీక్ష అయిన 12వ తరగతి/ఇంటర్మీడియట్ బోర్డులో టాప్-20 పర్సంటైల్‌లో ఉండాలి. లేదా అర ్హత పరీక్షలో 75 శాతం (జనరల్), ఓబీసీ, 70 శాతం (ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు) మార్కులు సాధించి ఉండాలి. ఈ రెండింటిలో ఏ ఒక్క నిబంధనకు అర్హత సాధించినా ఐఐటీలో చేరేందుకు అర్హులే. ఆ విద్యార్థి సాధించిన ర్యాంకు ఆధారంగా సీట్లు కేటాయింపు ఉంటుంది. ఇదీ ఎన్ఐటీలో ప్రవేశాల విధానం విద్యార్థి జేఈఈ మెయిన్‌లో సాధించిన స్కోర్‌కు 60 శాతం వెయిటేజీ, 12వ తరగతి/ఇంటర్మీడియట్ సాధించిన మార్కులకు 40 శాతం వెయిటేజీ ఇచ్చి సదరు విద్యార్థి ఆల్ ఇండియా తుది ర్యాంకును ఖరారు చేస్తారు. విద్యార్థి చాయిస్‌ను బట్టి, తుది ర్యాంకు ఆధారంగా ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీల్లో సీట్లను కేటాయిస్తారు. ఏ రాష్ట్రంలో ఎన్ఐటీ ఉన్నా.. ఆ రాష్ట్ర బోర్డు నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు రాసిన విద్యార్థులకే హోమ్‌స్టేట్ కోటా కింద 50 శాతం సీట్లను కేటాయిస్తారు. -
జేఈఈ మెయిన్-2015 రాత పరీక్ష ప్రారంభం
హైదరాబాద్: ఎన్ఐటీ/ట్రిపుల్ఐటీల్లో ప్రవేశాల కోసం జేఈఈ మెయిన్-2015 రాత పరీక్ష శనివారం నిర్వహిస్తున్నారు. ఉదయం 9:30 గంటలకు పరీక్ష ప్రారంభమైంది. పేపరు-1 పరీక్ష ఉదయం 9:30 గంటలకు, పేపరు-2 పరీక్ష మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం అవుతుంది. నిర్ణీతసమయం తరువాత వచ్చే వారిని నిమిషం ఆలస్యమైనా అనుమతించరు. తెలంగాణ నుంచి ఈ పరీక్షకు 70 వేల మందికిపైగా విద్యార్థులు హాజరుకానున్నారు. తెలంగాణలోని హైదరాబాద్, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో పరీక్ష కేంద్రాలను సీబీఎస్ఈ ఏర్పాటు చేసింది. విద్యార్థులూ మరచిపోవద్దు.. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు తమ క్వాలిఫైయింగ్(ఇంటర్) పరీక్షలకు సంబంధించిన ఆధారం (డాక్యుమెంట్) మరిచిపోవద్దు. దానిని ఇన్విజిలేటర్‌కు అందజేయాలి. 2013, 2014ల్లోనే ఇంటర్ పాసైన వారైతే మార్కుల షీట్ జిరాక్స్ కాపీని అందజేయాలి. 2013, 2014ల్లోనే ఇంటర్మీడియట్ పాస్ అయినా ప్రస్తుతం అన్ని సబ్జెక్టుల్లో ఇంప్రూవ్మెంట్ రాస్తున్న వారైతే ఇంప్రూవ్‌మెంట్‌కు సంబంధించిన హాల్‌టికెట్‌ను అందజేయాలి. ప్రస్తుతం (2015లో) ఇంటర్మీడియట్ పరీక్షలను మొదటిసారిగా రాస్తున్న వారైతే తమ హాల్‌టికె ట్ను అందజేయాలి. -
నేడు జేఈఈ మెయిన్
సాక్షి, హైదరాబాద్: ఎన్ఐటీ/ట్రిపుల్ఐటీల్లో ప్రవేశాల కోసం జేఈఈ మెయిన్-2015 రాత పరీక్ష శనివారం జరగనుంది. ఈ పరీక్ష సందర్భంగా విద్యార్థులను అరగంట ముందుగానే పరీక్ష హాల్లోకి అనుమతిస్తారు. పేపరు-1 పరీక్ష ఉదయం 9:30 గంటలకు, పేపరు-2 పరీక్ష మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం అవుతుంది. నిర్ణీతసమయం తరువాత వచ్చే వారిని నిమిషం ఆలస్యమైనా అనుమతించరు. తెలంగాణ నుంచి ఈ పరీక్షకు 70 వేల మందికిపైగా విద్యార్థులు హాజరుకానున్నారు. తెలంగాణలోని హైదరాబాద్, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో పరీక్ష కేంద్రాలను సీబీఎస్ఈ ఏర్పాటు చేసింది. విద్యార్థులూ మరచిపోవద్దు.. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు తమ క్వాలిఫైయింగ్(ఇంటర్) పరీక్షలకు సంబంధించిన ఆధారం (డాక్యుమెంట్) మరిచిపోవద్దు. దానిని ఇన్విజిలేటర్‌కు అందజేయాలి. 2013, 2014ల్లోనే ఇంటర్ పాసైన వారైతే మార్కుల షీట్ జిరాక్స్ కాపీని అందజేయాలి. 2013, 2014ల్లోనే ఇంటర్మీడియట్ పాస్ అయినా ప్రస్తుతం అన్ని సబ్జెక్టుల్లో ఇంప్రూవ్మెంట్ రాస్తున్న వారైతే ఇంప్రూవ్‌మెంట్‌కు సంబంధించిన హాల్‌టికెట్‌ను అందజేయాలి. ప్రస్తుతం (2015లో) ఇంటర్మీడియట్ పరీక్షలను మొదటిసారిగా రాస్తున్న వారైతే తమ హాల్‌టికె ట్ను అందజేయాలి. -
'నాకు చదువు వద్దు..ఏమోద్దు'
విజయవాడ : విద్యావిధానం సరిగాలేదని లేఖ రాసి ఒక ఇంజనీరింగ్ విద్యార్థి అదృశ్యమయ్యాడు. ఈ సంఘటన గురువారం కృష్ణాజిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీలో చోటు చేసుకుంది. వివరాలు..కలిదండి మండలం మూలలంక గ్రామానికి చెందిన పువ్వాడ కిరణ్ కుమార్ నూజివీడులోని ట్రిపుల్ ఐటీలో ఇంజనీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. కాలేజీలో ఏ సమస్య వచ్చిన ముందుండే కిరణ్ గురువారం మధ్యాహ్నం నుంచి కనిపించడం లేదు. దీంతో స్నేహితులు కాలేజీ యాజమాన్యానికి తెలిపారు. సాయంత్రం వరకు రాకపోవడంతో తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. వారు బంధువులను ఆరా తీసిన పలితం లేకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు హాస్టల్లో తనిఖీ చేయగా కిరణ్ రాసిన లేఖ బయటపడింది. 'నాకు చదువు వద్దు ఏమోద్దు నేను వెళ్లి పోతున్నాను' అని కిరణ్ ఆ లేఖలో రాశాడు. దాంతో పోలీసులు కేసు నమోదు చేసి... కిరణ్ అచూకి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. -
బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల ధర్నా
ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. మెస్ నిర్వహణ సరిగా లేదని గురువారం ఉదయం నుంచి ధర్నా చేశారు. ట్రిపుల్ ఐటీ డెరైక్టర్ అప్పలనాయుడు సంఘటన స్థలానికి చేరుకుని విద్యార్థులతో చర్చలు జరిపారు. సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పినా విద్యార్థులు వినలేదు. మెస్ నిర్వాహకులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. (బాసర) -
తెలంగాణకు తొలిదశలో 400 ఐటీ కంపెనీలు: కేటీఆర్
రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ఐటీ పాలసీని ప్రవేశపెడతామని ఐటీ శాఖమంత్రి కేటీఆర్ చెప్పారు. గచ్చిబౌలిలోని ట్రిపుల్ ఐటీలో శుక్రవారం టీ హబ్ భూమి పూజ చేశారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. ఐటీ పాలసీ ముసాయిదా తయారు చేశామని, జూన్ రెండులోపు మొదటి దశ తెలంగాణ హబ్ పనులు పూర్తవుతాయని చెప్పారు. మొదటిదశలో నాలుగు వందల కంపెనీలలో మూడు వేల మందికి ఉద్యోగవకాశాలు కల్పిస్తామని కేటీఆర్ అన్నారు. 2018లో జరిగే ఐటీ కాంగ్రెస్ నాటికి ఐటీ హబ్ రెండో దశ పనులు పూర్తిచేస్తామన్నారు. రెండో దశలో సుమారు 10 వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. -
'టీ-హబ్'కు ముహూర్తం ఖరారు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో టీ-హబ్‌కు శుక్రవారం ముహూర్తం ఖరారైంది. త మేరకు రాష్ట్ర ఐటీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు శుక్రవారం ఉదయం ట్రిపుల్ ఐటీ ప్రాంగణంలో భూమిపూజ చేయనున్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో పరిశోధనలకు అనువైన వాతావరణం కల్పించడమే లక్ష్యంగా టీహబ్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. యువతకు మరింత ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉందని ఆయన చెప్పారు. -
రాయలసీమకే ట్రిపుల్ ఐటీ: కేఈ కృష్ణమూర్తి
హైదరాబాద్: రాయలసీమలోనే ట్రిపుల్ ఐటీ ఏర్పాటు చేయనున్నట్టు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి చెప్పారు. రెవెన్యూ శాఖలో సంస్కరణల కోసం ఉన్నత స్థాయి కమిటీని వేస్తున్నట్టు కేఈ వెల్లడించారు. రెవెన్యూ శాఖలో పనులు చాలా జాప్యంగా జరుగుతున్నాయని తెలిపారు. రెవెన్యూ, రిజిస్ట్రేషన్లు, సర్వే శాఖల మధ్య సమన్వయానికి సలహాలు కమిటీ సలహాలు ఇస్తుందని చెప్పారు. రైతులకు పట్టాదారు పుస్తకాలు ఇవ్వడంలో జాప్యం చేస్తే అధికారులకు ఫైన్ వేస్తామని కేఈ తెలిపారు. -
ఫ్రెండ్స్ ఫర్ సేవ
‘సదా మీ సేవలో..’ అంటూ సాక్షి సిటీప్లస్ ఇచ్చిన పిలుపునకు స్వచ్ఛంద సంస్థల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. సిటీ జీన్స్‌లోనే చారిటీ ఉందంటూ.. నగరం వేదికగా తాము నిర్వహిస్తున్న సామాజిక సేవా కార్యక్రమాల వివరాలను పంపిస్తున్నాయి. సదా మీ సేవలో మేము సైతం అంటూ చేతులు కలిపి... తమ చేతల వివరాలను పంచుకుంటున్నాయి.ఈ వరుసలో ప్రచురితమవుతున్న ఏడవ కథనమిది. అన్నార్తుల ఆకలి తీర్చడం.. రక్తమిచ్చి ప్రాణాలు నిలపడం.. చేతనైనంతలోసాటి వారిని ఆదుకోవడం.. ఇవే లక్ష్యాలుగా ముందుకు సాగుతున్న ‘ఫ్రెండ్స్ ఫర్ సేవ’ చారిటీ ఆర్గనైజేషన్ గురించి పరిచయం... గచ్చిబౌలిలో ఐఐఐటీ (ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) విద్యార్థుల మనసుకు అద్దమే ‘ఫ్రెండ్స్ ఫర్ సేవా’. మూడేళ్ల క్రితం ఫణీంద్ర అనే ఐఐఐటీ స్టూడెంట్‌కి ఏదో ఒక సేవా కార్యక్రమం చేయాలనే ఆలోచన వచ్చింది. వెంటనే స్నేహితులందరినీ కూర్చోబెట్టి విషయం చెప్పాడు. ‘దాదాపు రెండు వేల మంది విద్యార్థులుండే మా ఇన్స్టిట్యూట్.. ఫ్రెండ్స్ ఫర్ సేవకి ఒక కొత్త అర్థం చెప్పింది. మొదట అనాథాశ్రమాలు విజిట్ చేయడంతో మొదలుపెట్టిన మా కార్యక్రమాలు రక్తదానాల వరకూ వెళ్లింది. మూడేళ్లలో ఊహించిన రీతిలో కొనసాగిన మా సేవా కార్యక్రమాలకు మా ఆలోచనే పెట్టుబడి. తీరిక సమయమే మా చారిటీ’ అని చెప్పారు బాలకృష్ణ అనే సభ్యుడు. ఐఐఐటీలో రీసెర్చ్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న బాలకృష్ణ స్టూడెంట్స్‌ని ఈ సంస్థలో చేర్చడంలో చురుకైన పాత్ర పోషించారు. ఆసుపత్రులే వేదికగా.. ‘మా సంస్థ తరపు నుంచి రక్తదానం చేయడానికి దాదాపు వెయ్యి మందికి పైగా సభ్యులు అందుబాటులో ఉంటారు. నగరంలో ఓ ఇరవై ఆసుపత్రుల్లోని బ్లెడ్బ్యాంకుల్లో మా కాంటాక్ట్ నంబర్లను పెట్టాం. అక్కడ ఎవరికైనా రక్తం అవసరమైతే వెంటనే మా సంస్థ యాక్టివ్ మెంబర్లకు కబురు వస్తుంది. మేం వెంటనే స్పందించి అందుబాటులో ఉన్న వ్యక్తిని అక్కడికి పంపిస్తాం. ఇప్పటి వరకు దాదాపు మూడు వేల మందికి రక్తం అందించాం. రక్తంతో పాటు ప్లేట్లెట్ల దానానికి కూడా మా సంస్థ సభ్యులు సిద్ధంగా ఉన్నారు’ అని చెప్పారు ఫణీంద్ర. నిజానికి రక్తదానం అంటే ఒక ఆఫీసు...బ్యాంకు వంటి హంగామా లేకుండా ఆసుపత్రుల్లోని బ్యాంకులనే తమ వేదికలుగా మలుచుకున్న తీరు ఫ్రెండ్స్ ఫర్ సేవ ప్రత్యేకతను తెలియజేస్తున్నాయి. విజిటింగ్ హోమ్స్.. మూడేళ్ల నుంచి తన సేవల్ని అందిస్తున్న ‘ఫ్రెండ్స్ ఫర్ సేవ’ గత ఏడాది నుంచి మరిన్ని సేవలకు వేదికైంది. నగరంలోని అనాథ, వృద్ధాశ్రమాలను ప్రతీ వారంతా సందర్శించడం ‘విజిటింగ్ హోమ్స్’ కార్యక్రమం ఉద్దేశం. దీని కోసం ఐఐఐటీలో గ్రూపులుగా విడిపోయి పనిచేస్తున్నారు. ఏదో వెళ్లి అక్కడి వారిని చూసి రావడం కాకుండా రోజంతా అక్కడే ఉండి వారి జీవన విధానం, చదువు, ఆరోగ్యం వంటి విషయాల గురించి వివరాలు కనుక్కుని వారికి ఏ విధంగా సాయపడగలరో తెలుసుకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో అవసరమైతే వెంటనే స్పందించి వారికి తగిన సాయం చేస్తున్నారు. పేద పిల్లల పుస్తకాలకు, బట్టలకు ఆర్థికసాయం చేయడం వంటివీ చేస్తున్నారు. షేరింగ్ ఫుడ్.. షేరింగ్ ఫుడ్ అనేది ‘ఫ్రెండ్స్ ఫర్ సేవా’ ప్రధాన ఉద్దేశం అంటారు బాలకృష్ణ. ఈ సేవా కార్యక్రమం కోసం వీరంతా ఐఐఐటీ క్యాంటీన్ నిర్వాహకులతో మాట్లాడి.. అక్కడ మిగిలిన భోజనంతో పాటు కొన్ని డబ్బులిచ్చి ప్రత్యేకంగా భోజనం వండించుకుని వాటిని ప్యాకింగ్ చేసి అనాథాశ్రమాలకు తీసుకెళ్లి పంచుతున్నారు. అప్పుడప్పుడు రోడ్లపై కనిపించే యాచకులకూ వీటిని అందజేస్తున్నారు. ‘అన్ని దానాల్లోకెల్లా గొప్పది, అవసరమైంది అన్నదానమే కదా! మా ఇన్స్టిట్యూట్లో చాలామంది విద్యార్థులు క్యాంటీన్లో తినకుండా బయటికెళ్లి తినొస్తుంటారు. దాంతో బోలెడంత ఫుడ్ వృథా అవుతోంది. అది గమనించిన మేము ముందుగానే క్యాంటీన్ వారితో మాట్లాడి మరి కొంత ఫుడ్‌ని తయారుచేయించుకుని మేమే స్వయంగా ప్యాకింగ్ చేసుకుని తీసుకెళ్లి అనాథలకు, యాచకులకు పంచుతున్నాం. కొన్ని అనాథాశ్రమాల్లో ఫుడ్ తీసుకోరు. వారికి డబ్బులిచ్చి అక్కడే వండించి పెడుతున్నాం. మా సంస్థ చేస్తున్న కార్యక్రమాల క్రెడిట్ మా ఇన్స్టిట్యూట్లో చదువుకుంటున్న, పనిచేస్తున్న వారందరిది. ఎందుకుంటే ఏ సందర్భంలో ఎవరిని ఏ సాయం అడిగినా కాదనకుండా ముందుకొస్తారు’ అని గర్వంగా చెప్పారు బాలకృష్ణ. ఒకచోట చదువుకునే విద్యార్థులు, ఒకచోట పనిచేసే ఉద్యోగస్తులు దాదాపు కుటుంబసభ్యుల్లాంటి వారు. వారి ఆలోచనలు కలిస్తే ఆచరణ పెద్ద విషయం కాదు. మంచి సేవా కార్యక్రమానికి వారు నడుంబిగిస్తే వారి చుట్టుపక్కలున్న సాయం కోసం ఎదురుచూసే ప్రతి ఒక్కరు అదృష్టవంతులకిందే లెక్క. దానికి ‘ఫ్రెండ్స్ ఫర్ సేవా’ చేస్తున్న సేవే నిదర్శనం. డేటాబేస్.. ఏదో ఒక ఆసుపత్రి నుంచి రక్తం కావాలంటూ ఫోన్ కాల్ రాగానే గంటల వ్యవధిలో దాతను అందుబాటులోకి తేవడం చిన్న విషయం కాదు. ఫ్రెండ్స్ ఫర్ సేవా సభ్యులు దీనికోసం ప్రత్యేకంగా ఒక డేటాబేస్‌ని తయారు చేసుకున్నారు. దానిద్వారా ఏ గ్రూప్ బ్లెడ్ డోనర్నైనా నిమిషాల్లో అందుబాటులోకి తేగలుగుతున్నారు. ‘దీనికోసం మా ఇన్స్టిట్యూట్లో స్టూడెంట్స్‌కి కౌన్సెలింగ్ కూడా ఇస్తున్నాం. రక్తదానం ఎంత అవసరమో తెలియజేసే మా క్లాసులు వారిని ఫ్రెండ్స్ ఫర్ సేవా కార్యక్రమాల్లో మరింత చురుగ్గా పాల్గొనేలా చేస్తున్నాయి’ అంటారు ప్రదీప్. లక్ష్మణ్, శ్రీకాంత్, సాయిరామ్, నితీష్...మరికొందరు ఈ సంస్థకు సంబంధించి మిగతా కార్యక్రమాలకు పూర్తిస్థాయిలో తమ సేవల్ని అందిస్తున్నారు. -
నేటి నుంచి జేఈఈ మెయిన్ రిజిస్ట్రేషన్
సాక్షి, హైదరాబాద్: ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీల్లో ప్రవేశాల కోసం 2015 ఏప్రిల్ 6వ తేదీన నిర్వహించే ఆఫ్‌లైన్ పరీక్ష, అదే నెల 9, 11, 12, 19 తేదీల్లో నిర్వహించే ఆన్లైన్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు శుక్రవారం నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. పరీక్ష ఏర్పాట్లను చూస్తున్న సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) ఫీజు చెల్లింపునకు కూడా అవకాశం కల్పించింది. ఇందుకోసం వెబ్ పోర్టల్‌ను (jeemain. nic.in/jeemainapp/root/loginpage.aspx) ఏర్పాటు చేసింది. సమగ్ర వివరాలతో కూడిన జేఈఈ మెయిన్ సమాచార బ్రోచర్‌ను సీబీఎస్ఈ శుక్రవారం నుంచి అందుబాటులో ఉంచనుంది. విద్యార్థులు వెబ్‌పోర్టల్‌లోకి వెళ్లి వివరాలను పొందవచ్చు. దరఖాస్తు విధానానికి సంబంధించిన కొన్ని సూచనలను కూడా ఇన్స్ట్రక్షన్స్ అనే ప్రత్యేక లింక్‌లో పొందుపరిచింది. 12వ తరగతి/ తత్సమాన/ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం చదు వుతున్న విద్యార్థులు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీర్/ బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ కోసం పేపరు-1 పరీక్షను, బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్/బ్యాచిలర్ ఆఫ్ ప్లానింగ్ కోసం జేఈఈ మెయిన్ పేపరు-2 పరీక్ష రాయాల్సి ఉంటుంది. విద్యార్థులు రిజిస్ట్రేషన్ సమయంలో పరీక్ష ఫీజును క్రెడిట్‌కార్డు/డెబిట్‌కార్డు/ఈ-చలానా రూపంలో చెల్లించవచ్చు. -
ట్రిపుల్ ఐటీలకు స్వయం ప్రతిపత్తి
వేంపల్లె: వైఎస్ఆర్ జిల్లాలోని ఇడుపులపాయ, కృష్ణా జిల్లాలోని నూజివీడు, అదిలాబాద్ జిల్లాలో ఉన్న బాసరలో ఉన్న మూడు ట్రిపుల్ ఐటీలకు స్వయం ప్రతిపత్తి(అటానమీ) కల్పించారు. ఈనెల 14వ తేదీన హైదరాబాద్‌లోని ఆర్జీయూకేటీ ప్రధాన కార్యాలయంలో జరిగిన గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ట్రిపుల్ ఐటీలో పనిచేసే సిబ్బంది జీతాలు, నిర్వహణ ఖర్చులు, పరిపాలన వారే స్వయంగా చూసుకోవాల్సి ఉంటుంది. పర్యవేక్షణ మాత్రం వర్సిటీ పరిధిలో ఉంటుంది. విద్యార్థుల పరీక్ష విధానానికి వస్తే... ఆన్లైన్లో మూడు ట్రిపుల్ ఐటీల విద్యార్థులకు ఒకేసారి జరిగి ఫలితాలూ అలాగే విడుదలయ్యేవి. ఇప్పుడు ఆ పరిస్థితి ఉండదు. ఆ ట్రిపుల్ఐటీ పరిధిలో పరీక్ష విధానం, ఫలితాల విడుదల ఉండే అవకాశాలు ఉన్నాయి. -
జేఈఈ మెయిన్‌లో మనోళ్ల జయకేతనం
సాక్షి, హైదరాబాద్: ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించిన జేఈఈ మెయిన్‌లో తెలుగు విద్యార్థులకు ర్యాంకుల పంట పండింది. ఆల్ ఇండియా టాప్-10 ర్యాంకర్లలో ఎక్కువ మంది మనవాళ్లే ఉన్నారు. సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) మంగళవారం రాత్రి జేఈఈ మెయిన్ ర్యాంకులను ప్రకటించింది. బీటెక్ విభాగంలో టాప్-10 ర్యాంకర్లలో నలుగురు తెలుగు విద్యార్థులు ఉండగా, బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్(బీఆర్క్) విభాగంలో టాప్-10లో ఏడుగురు తెలుగు వారే కావడం విశేషం. బీటెక్‌లో ఆల్ ఇండియా ప్రథమ ర్యాంకును బెంగళూరుకు చెందిన శ్రీనిధి ప్రభు సాధించారు. తెలుగు విద్యార్థులకు 2, 4, 7, 9వ ర్యాంకులు దక్కాయి. నెల్లూరుకు చెందిన డి.శ్రీలేఖ రెండో ర్యాంకు సాధించగా, ఖమ్మం జిల్లాకు చెందిన గీతాంజలికి 4వ ర్యాంక్, మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్‌కు చెందిన పి.సింధూజకు 7వ ర్యాంకు(ఈమెకే బీఆర్క్‌లో ఐదో ర్యాంకు లభించింది), హైదరాబాద్‌లోని ఎల్బీనగర్కు చెందిన మాగంటి నిఖిల్ హర్షకు 9వ ర్యాంకు వచ్చింది. ఇక బీఆర్క్‌లో హైదరాబాద్‌కు చెందిన ఆశిష్ టాపర్‌గా నిలిచారు. రెండో ర్యాంకును నిశ్చయ్, 4వ ర్యాంకును గడ్డెం సూరజ్, ఐదో ర్యాంకును సింధూజ, 6వ ర్యాంకును కర్నూలుకు చెందిన దివాకర్‌రెడ్డి సాధించారు. డి.శ్రీలేఖ(బీటెక్‌లో 2వ ర్యాంకర్)కు 8వ ర్యాంక్, దీపక్‌కు 10వ ర్యాంక్ వచ్చింది. అలాగే బీటెక్‌లో 14, 27, 48, 51 ర్యాంకులు కూడా తెలుగు వారికే దక్కాయి. మొత్తానికి జేఈఈ మెయిన్‌లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో ర్యాంకులు సాధించినట్లు హైదరాబాద్‌లోని ఐఐటీ నిఫుణులు ఎ.కృష్ణకుమార్ తెలిపారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులు తమ పూర్తి ఫలితాలను జేఈఈ మెయిన్ వెబ్సైట్లో (jeemain.nic.in)పొందవచ్చు. -
నేడు జేఈఈ మెయిన్ ఆలిండియా ర్యాంకులు?
హైదరాబాద్: నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీల్లో(ట్రిపుల్ఐటీ) ప్రవేశాలకోసం నిర్వహించిన జేఈఈ మెయిన్ ఆలిండియా ర్యాంకులను సోమవారం వెల్లడించే అవకాశం ఉంది. ఒకవేళ ఇప్పుడు వీలుకాకపోతే రెండు మూడు రోజులు ఆలస్యం కానుంది. సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) నిర్వహించిన ఈ పరీక్షకు రాష్ట్రం నుంచి లక్ష మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో విద్యార్థులు సాధించిన మార్కులను సీబీఎస్ఈ గతనెల 26నే ప్రకటించింది. ఆలిండియా ర్యాంకులను ఈనెల 7న ప్రకటిస్తామని పేర్కొంది. ర్యాంకుల నిర్ధారణలో ఇంటర్ మార్కులకు 40 శాతం వెయిటేజీ ఉంటుంది. వాటిని పరిగణనలోకి తీసుకొని ర్యాంకులను ఖరారు చేస్తారు. అయితే ఇంటర్లో వచ్చిన మార్కులను విద్యార్థులు ఆన్లైన్లో నిర్ధారించేందుకు గతనెల 27 వరకు ఇచ్చిన గడువును తొలుత 30వ తేదీ వరకు, ఆ తర్వాత ఈనెల 3 వరకు పొడిగించింది. ఈ నేపథ్యంలో సోమవారం ఆలిండియా ర్యాంకులను వెల్లడిస్తుందా లేదా అనే విషయం ఇంకా తేలలేదు. -
ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్ షెడ్యూలు జారీ
-
ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్ షెడ్యూలు జారీ
జూలై 1నుంచి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఈనెల 19న అడ్వాన్స్డ్ ఫలితాలు సాక్షి, హైదరాబాద్: ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే కౌన్సెలింగ్ తాత్కాలిక షెడ్యూలును జేఈఈ మెయిన్ సెంట్రల్ సీట్ అలొకేషన్ బోర్డు (సీఎస్ఏబీ) జారీ చేసింది. వ చ్చేనెల 1న ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌ను ప్రారంభించనున్నట్లు బోర్డు పేర్కొంది. జేఈఈ మెయిన్ పరీక్ష రాసిన విద్యార్థుల ఇంటర్మీడియట్ మార్కుల వివరాలను తమ వెబ్సైట్లో ఉంచింది. ఏమైనా తేడాలు ఉంటే ఈనెల 27లోగా తెలియజేయాలని సూచించింది. ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీల్లో ప్రవేశాల్లో ఇంటర్మీడియట్ మార్కులకు 40 శాతం వెయిటేజీ ఇస్తున్న నేపథ్యంలో మార్కుల్లో తేడాలుంటే సవరించుకోవాలని సూచించింది. మరోవైపు, వీటి అలిండియా ర్యాంకులను జూలై 7న ప్రకటిస్తామని గతంలోనే సీబీఎస్ఈ వెల్లడించింది. ఇక ఐఐటీల్లో ప్రవేశాలకోసం నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలను ఈనెల 19న వెల్లడించేందుకు ఏర్పాట్లు చేసింది. -
కొత్త సర్కారుపై కోటి ఆశలు
ట్యాంకుల నిర్మాణం వేగవంతం చేయాలి. గదులకు నీటి సరఫరా చేయాలి. నీటి పైప్‌లైన్ లీకేజీలు అరికట్టాలి. నిర్వహణ లేదు.. టిపుల్ ఐటీలో నీటి సమస్య పరిష్కారం కావడం లేదు. నీటి పథకం పనులు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం బాసర ట్రిపుల్ ఐటీలో ప్రవేశాలకు నోటిఫికేషన్ వెలువడింది. విద్యార్థుల తరగతులు కొనసాగుతున్నాయి. కొత్త విద్యార్థులు కళాశాలలో అడుగుపెట్టగానే నీటి సమస్య స్వాగతం పలికేలా ఉంది. ఇప్పుడు కళాశాలలో చదివే విద్యార్థులు క్యాంపస్ వద్ద ఆరుబయట నిర్మించిన ట్యాంకుల వద్ద బట్టలు ఉతుక్కుంటున్నారు. విద్యార్థినులు నీటి ట్యాంకుల వద్ద బకెట్లతో వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. ఇక విద్యార్థుల కోసం కేటాయించిన గదుల్లో పైప్లైన్లు వేసి నల్లాలు బిగించినా పనిచేయడం లేదు. తరగతులకు వెళ్లేముందు బకెట్లతో నీరు తెచ్చుకోవాల్సిన పరిస్థితి. వారానికి ఒకరోజు బట్టలు ఉతుక్కుంటున్నారు. విద్యార్థులకు కేటాయించిన గదుల నిర్వహణ లేదు. బాత్రూంలు, మరుగుదొడ్లను శుభ్రపరచడం లేదు. గదుల్లో ప్లాస్టరింగ్ పగుళ్లు తేలా యి. గదుల్లోకి వెళితే అపరిశుభ్ర వాతావరణం కనిపిస్తుంది. విద్యుత్ సరఫరా అస్తవ్యస్తంగా ఉంది. కిటికీల అద్దాలు పగిలి తలుపుల గొలుసులు ఊడినా ఎవరు పట్టించుకోవడం లేదు. కొన్ని గదుల్లో చీకటి ఆవరించి కనిపిస్తుంది. నిర్మించిన కొద్ది రోజులకే పాత భవనాల గదులు దర్శనమిస్తున్నాయి. గదుల నిర్వహణపై దృష్టిసారించాలి. నిర్మాణ పనులు చేపట్టిన సంస్థతో చర్చించాలి. {పమాదకరంగా ఉన్న విద్యుత్ తీగలు సరిచేయాలి. స్విచ్‌బోర్డులు ఏర్పాటు చేసి మరుగుదొడ్ల శుభ్రతపై దృష్టి సారించాలి. అస్తవ్యస్తంగా.. ట్రిపుల్ ఐటీ అధికారులు పారిశుధ్య నిర్వహణలోనూ నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. కళాశాలకు రెండు కిలో మీటర్ల దూరంలో మహారాష్ట్ర ప్రాంతంలోని ఆల్కాహాల్ ఫ్యాక్టరీ వెదజల్లే దుర్గంధం పరిసరాల వాతావరణాన్ని కలుషితం చేస్తుంది. ఇదేగాలిని పీల్చి విద్యార్థులు అనారోగ్యం పాలవుతున్నారు. ఇక కళాశాల పక్కనే మెస్ వ్యర్థాలు గుట్టలుగా పోస్తున్నారు. సువిశాలంగా ఉన్న ట్రిపుల్ ఐటీ ఖాళీ స్థలంలో వర్షం నీరు నిలిచి దోమల ఆవాసంగా మారుతోంది. పరిసరాల్లోనూ అపరిశుభ్ర వాతావరణం కనిపిస్తుంది. ఆల్కాహాల్ ఫ్యాక్టరీ గొట్టం ఎత్తు పెంచితే కాలుష్యం కొంతమేర నివారించవచ్చు. ఈ విషయంలో ఉన్నతాధికారుల బృందంతో నివేదిక తెప్పించుకుని మహారాష్ట్ర సర్కారుతో చర్చించాలి.మెస్ వ్యర్థాలు గుంతలుగా తవ్వి పూడ్చివేయాలి. కళాశాలలో వర్షపు నీరు నిల్వకుండా డ్రెయినేజీల్లోకి మళ్లించేలా చర్యలు తీసుకోవాలి. లోతట్టు ప్రాంతాల్లో మొరం వేసి చదును చేస్తే నీరు నిల్వకుండా ఉంటుంది. ప్రహరీ లేక.. కళాశాల చుట్టూ ఇప్పటికీ ప్రహరీ లేదు. దీంతో పిచ్చికుక్కలు, పందులు, మూగజీవాలు కళాశాలలోనికి చొచ్చుకువస్తున్నాయి. చుట్టూ ప్రహరీలేక పోవడంతో ఎవరైనా పంట పొలాల నుంచి లోనికివచ్చే అవకాశం ఉంది. ఇంత మంది విద్యార్థులు ఉన్న ఇక్కడ పోలీసు ఔట్ సోర్సింగ్ విభాగం లేదు. ప్రైవేటు సెక్యూరిటీతోనే నెట్టుకొస్తున్నారు. ఇక ట్రిపుల్ ఐటీలో ఉన్న ఆస్పత్రిలో పూర్తిస్థాయిలో సిబ్బంది లేరు. మహిళా వైద్యురాలు అందుబాటులో లేక విద్యార్థినులు ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర సేవలు అందించేలా ఆస్పత్రిలో వైద్యులు అందుబాటులో ఉండేలా చూడాలి. మహిళా డాక్టర్‌ను నియమించాలి.పోలీసు ఔట్సోర్సింగ్ పోస్టును కేటాయించాలి.ముందుచూపు లేదు.. బాసర ట్రిపుల్ ఐటీలో సమస్యలు ఒకవైపు ఉం టే ఇక చదువుకునే విద్యార్థులకు మరిన్ని ఇబ్బం దులు వెంటాడుతున్నాయి. 2008లో ట్రిపుల్ ఐటీలో చేరిన 2 వేల మంది విద్యార్థులు 2014 వరకు తమ కోర్సును పూర్తి చేసుకున్నారు. ఇం దులో 200 మందికి ప్లేస్మెంట్లు వచ్చాయి. ఇంకా ఎంతో మంది విద్యార్థులు ప్లేస్మెంట్ల కోసం ఎదురుచూస్తున్నారు. సమస్యలతో చదువులు పూర్తిచేసిన విద్యార్థులు కొలువుల కోసం వేచి చూడాల్సిన దుస్థితి. ఇప్పటికైనా తెలంగాణ సర్కారు బాసర ట్రిపుల్ ఐటీపై ప్రత్యేక దృష్టి సారించాలి. సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తూ చదివే విద్యార్థులకు కొలువులపైన ముందుచూపుతో వ్యవహరిస్తుందన్న ఆశాభావాన్ని చదివే విద్యార్థులంతా వ్యక్తం చేస్తున్నారు. -
ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్
రేపట్నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు పాత పద్ధతిలోనే కేటాయింపు హైదరాబాద్: ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వ విద్యాలయం(ఆర్జీయూకేటీ) నోటిఫికేషన్ వెలువరిం చింది. బాసర, నూజివీడు, ఇడుపులపాయలోని ట్రిపుల్ ఐటీల్లో 3వేల సీట్ల భర్తీకి నోటిఫికేషన్‌ను జారీ చేసినట్లు ఆర్జీయూకేటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ రాజ్‌కుమార్ సోమవారం విలేకరులకు తెలిపారు. పూర్తి వివరాలను ఠీఠీఠీ.టజఠజ్టు.జీ వెబ్సైట్లో చూడవచ్చు. బుధవారం నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకు తుది గడువు జూన్ 16వ తేదీ. పాత పద్ధతిలోనే ప్రవేశాలు.. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని పదో షెడ్యూల్లో ఆర్జీయూకేటీ ఉన్నందున ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలు పాత పద్ధతిలోనే ఉంటాయని రాజ్‌కుమార్ తెలిపారు. ఉస్మానియా విశ్వ విద్యాలయం పరిధిలోని విద్యార్థులకు 42 శాతం, ఆంధ్రా విశ్వ విద్యాలయం పరిధిలోని వారికి 36 శాతం, శ్రీకృష్ణ దేవరాయ విశ్వ విద్యాలయం పరిధిలోని విద్యార్థులకు 22 శాతం సీట్లు కేటాస్తామన్నారు. పదో తరగతిలో సాధించిన గ్రేడ్ పాయింట్ యావరేజ్ (జీపీఏ) ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేస్తామన్నారు. నాన్ రెసిడెన్షియల్ ప్రభుత్వ పాఠశాలలు, జిల్లా పరిషత్తు, మున్సిపల్ స్కూళ్లలో చదివి సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు చెందిన విద్యార్థులకు 0.4 శాతం డిప్రివేషన్ స్కోర్ ఇస్తామన్నారు. వారు సాధించిన జీపీఏకు అదనంగా దీన్ని కలిపి మెరిట్ జాబితాలు రూపొందిస్తామన్నారు. ఇదీ ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాల షెడ్యూల్... 1. మే 21 నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. 2. ఏపీ ఆన్లైన్/ ఠీఠీఠీ.టజఠజ్టు.జీ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. 3. రూ. 150 పరీక్ష ఫీజును డీడీ/చలానా రూపంలో చెల్లించాలి. 4. జూన్ 16వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. 5. ఆన్లైన్లో పూర్తి చేసిన దరఖాస్తు ఫారం ప్రింట్కు డీడీ లేదా చలానా జత చేసి జూన్ 21వ తేదీలోగా ఆర్జీయూకేటీ రిజిస్ట్రార్‌కు పంపించాలి. 6. జూలై 8న ఎంపికైన విద్యార్థుల జాబితా ప్రకటన. దాంతోపాటే వెయిటింగ్ లిస్టునూ ప్రకటిస్తారు. 7. ఎంపికైన విద్యార్థులకు జూలై 23, 24వ తేదీల్లో కౌన్సెలింగ్. 8. 23, 24 తేదీల్లో హాజరు కాని వారి స్థానాల్లో వెయిటింగ్ లిస్టులో ఉన్న విద్యార్థులను ఎంపిక చేస్తారు. 9. 27వ తేదీన వెయిటింగ్ జాబితాలోని విద్యార్థుల్లో ఎంపికైన వారి వివరాల ప్రకటన. 10. జూలై 28 నుంచి తరగతులు ప్రారంభం. 11 జూలై 31తో ప్రవేశాల ప్రక్రియ పూర్తి. -
ఐఐటీ ఇక్కడే!
సాక్షి, విశాఖపట్నం: ఐఐఐటీ, ఐఐటీ, ఐఎస్బీ, నిఫ్ట్, ఐఐఎస్టీ, ఐఐసీటీ, నైపర్.. ఇవన్నీ ప్రఖ్యాత ఇంజినీరింగ్, సైన్స్ క్యాంపస్‌లు. ఇందులో సీటు వస్తే విద్యార్థుల భవిష్యత్తు బంగారుమయమైపోతుంది. అందుకే వీటిలో సీటు కోసం లక్షలాది మంది విద్యార్థులు ఏటా పోటీపడుతుంటారు. ఇకపై ఇక్కడి విద్యార్థులు నగరంలోనే కోరుకున్న క్యాంపస్‌లో చదువుకునే రోజులు ఎంతో దూరంలో లేవు. ప్రస్తుతం హైదరాబాద్‌కే పరిమితమైన కీలక వర్సిటీలను విభజన కారణంగా సీమాంధ్రలోనూ స్థాపించేందుకు కేంద్రంకసరత్తు చేస్తోంది. సీమాంధ్రలో సకల వసతులున్న ప్రాంతంలో వీటిలో కొన్ని నెలకొల్పడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రఖ్యాత జాతీయస్థాయి క్యాంపస్‌ల స్థాపనకు పూర్తి అర్హత ఉన్న ఏకైక నగరంగా విశాఖ అందరి దృష్టి ఆకర్షిస్తోంది. అన్నీ అనుకూలాంశాలే... సువిశాల క్యాంపస్‌లకు కావలసిన వందలాది ఎకరాల భూములు, ఎయిర్‌పోర్టు, రైలు కనెక్టవిటీ, క్యాంపస్ విద్యార్థుల ప్రయోగాలకు వేదికగా చెంతనే రకరకాల పరిశ్రమలు..ఇవన్నీ ఏ యూనివర్సిటీ స్థాపనకైనా అవసరం. ఇవన్నీ కలబోతగా ఉన్న విశాఖను క్యాంపస్‌ల స్థాపనకు అర్హతల పరంగా ముందువరుసలో ఉండేలా చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు కొత్తగా విశాఖకు ప్రముఖ క్యాంపస్‌లు వచ్చే అవకాశం ఉంది. ఐఐటీ, ఐఐఐటీ, ఐఎస్బీ తదితర క్యాంపస్‌ల కోసం కేంద్రం ఇప్పుడు అనువైన ప్రాంతాలను అన్వేషిస్తోంది. తొలి ప్రాధాన్యం విశాఖకే ఇచ్చే వీలుంది. ఒక్కో వర్సిటీకి కనీసం 500 ఎకరాలు అవసరం. అంతర్జాతీయ నిపుణులు, ప్రాజెక్టుల ప్రతినిధులు, గెస్ట్, రీసెర్చ్ ఫ్యాకల్టీ తదితరులు రావడానికి అనువుగా అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయం ఉండాలి. విద్యార్థులు రీసెర్చ్, ప్రాజెక్టు వర్క్, క్యాంపస్‌లు, పరిశ్రమలు కలిసి పరిశోధనలు చేయడానికి అనువుగా నగరం చుట్టుపక్కల కంపెనీలుండాలి. రీసెర్చ్‌కు ల్యాబ్లుండాలి. ఈ సదుపాయాలన్నీ విశాఖలోనే ఉన్నాయి. తక్షణమే భూ లభ్యత కూడా ఉండడంతో కేంద్రం విశాఖనే ప్రాథమ్యంగా ఎంచుకునే అవకాశం ఉంటుందని నిపుణులు వివరిస్తున్నారు. త్వరలో విశాఖకు ప్రతిష్టాత్మక క్యాంపస్‌లు వచ్చే వీలుందని అంటున్నారు. ఇప్పటికైనా రావలసిందే... వాస్తవానికి విశాఖకు ప్రఖ్యాత క్యాంపస్‌లు ఎప్పుడో మంజూరు కావలసి ఉంది. కానీ ఆచరణలో అనేక ఏళ్లుగా అన్యాయం జరుగుతూనే ఉంది. గతంలో నగరానికి ఐఐఎఫ్‌టీ, ఐఐటీ, ఐఐఐటీ, ఇన్నోవేషన్ వర్సిటీ, ఐఐఎం వచ్చే అవకాశం ఏర్పడింది. ఆ సమయంలో ఎంపీగా ఉన్న పురందేశ్వరితో పాటు ఇతర నేతలు వీటిని విశాఖకు తీసుకువచ్చేందుకు పూర్తిస్థాయిలో మనసు పెట్టలేదు. కనీసం విశాఖలో ఉన్న సౌకర్యాలను వివరిస్తూ ప్రతిపాదనలు పంపడంలో విఫలమయ్యారు. దీంతో హైదరాబాద్ తర్వాత విశాఖలో కొత్త, అదనపు వర్సిటీల ఏర్పాటుకు ఎన్నో అవకాశాలున్నా నేతల గట్టి ప్రయత్నాలు లేక ఏ ఒక్కటీ ఇక్కడికి రాలేదు. వాస్తవానికి ఇన్నోవేషన్ యూనివర్సిటీ విశాఖకు మంజూరైందని ప్రకటించారు. భూ సేకరణ చేయాలని కలెక్టర్ ప్రయత్నించారు. కానీ దానికి అతీగతి లేదు. యూజీసీ కొత్త పాలసీ ప్రకారం ఇన్నోవేషన్ యూనివర్సిటీలను దేశవ్యాప్తంగా 10 చోట్లకుపైగా ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. హైదరాబాద్‌లో భూముల లభ్యత సమస్య కారణంగా విశాఖకు ఇది వచ్చే వీలు ఏర్పడింది. విశాఖకు కావాలి అని అడిగేవారు లేక ఇదికాస్తా పోయింది. ఐఐఐటీ విశాఖకు వచ్చేస్తోందని ఎప్పటినుంచో నేతలు ప్రచారం చేశారు. అది కూడా కాకినాడకు పోయింది. ఇప్పుడు గట్టిప్రయత్నం జరిగితే నగరానికి క్యాంపస్‌లు క్యూకట్టడం ఎంతో దూరంలో లేదని చెప్పవచ్చు. -
జాతీయ స్థాయి విద్యా సంస్థల ఏర్పాటుకు చర్యలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన ప్రక్రియలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ స్థాయి విద్యా సంస్థలను ఏర్పాటు చేస్తామని పేర్కొన్న కేంద్రప్రభుత్వం అందుకు చర్యలు ప్రారంభించింది. వీటికి అవసరమయ్యే స్థలాల సేకరణకు సంబంధించి చర్యలు చేపట్టాలని ఉన్నత విద్యా శాఖకు లేఖ రాసింది. ఐఐటీ, ఎన్ఐటీ, ఇండియన్ ఇనిస్టిట్యూట్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐఐఎస్ఈఆర్) సెంట్రల్ యూనివర్సిటీ, కేంద్ర ట్రిపుల్ ఐటీల ఏర్పాటు విషయమై పలు సూచనలు చేసింది. రోడ్డు, రైలు, ఆకాశయాన మార్గాలకు అనుగుణంగా ఈ స్థలాల ఎంపిక చేయాలని పేర్కొంది. ప్రాథమిక సమాచారం ప్రకారం ఐఐటీకి 300 ఎకరాలు, ఎన్ఐటీకి 300 ఎకరాలు, ఐఐఎస్ఈఆర్కు 200 ఎకరాల చొప్పున స్థలం అవసరమని పేర్కొంది. -
కొంచెం ఖేదం.. కొంచెం మోదం..
జేఈఈ-మెయిన్..నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్), ఐఐఐటీలు, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే సాంకేతిక విద్యాసంస్థలు, ఇతర ప్రతిష్టాత్మక ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించే పరీక్ష.. సెంట్రల్ బోర్డ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) ఆఫ్‌లైన్ (పేపర్-పెన్ బేస్డ్), ఆన్లైన్ (కంప్యూటర్ బేస్డ్) రెండు విధాలుగా ఈ పరీక్షను నిర్వహిస్తుంది.. ఈ క్రమంలో ఆఫ్‌లైన్ పరీక్ష ఈ నెల 6న జరిగింది.. దేశవ్యాప్తంగా దాదాపుగా 14 లక్షల మంది విద్యార్థులు రాసిన ఈ పరీక్షకు మన రాష్ట్రం నుంచి 1,07,046 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ క్రమంలో ఆఫ్‌లైన్‌లో జరిగిన జేఈఈ-మెయిన్ పరీక్ష తీరుతెన్నులు ఏ విధంగా ఉన్నాయి? ఏయే అంశాలకు ఎక్కువ వెయిటేజీ లభించింది? కటాఫ్ ఎంత ఉండొచ్చు? తదితర అంశాలపై సబ్జెక్ట్ నిపుణుల విశ్లేషణ.. జేఈఈ-మెయిన్‌ను మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్ట్‌లలో నిర్వహించారు. ప్రతి సబ్జెక్ట్ నుంచి 30 ప్రశ్నల చొప్పున మొత్తం 90 ప్రశ్నలు ఇచ్చారు. మొత్తం మార్కులు 360. అన్ని ప్రశ్నలు ఆబ్జెక్టివ్ పద్ధతిలో ఉన్నాయి. సరైన సమాధానానికి 4 మార్కులు. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. ప్రతి తప్పుకు 1 మార్కు కోత విధిస్తారు. ఈ సారి అసెర్షన్ -రీజన్ తరహా ప్రశ్నలు అడగలేదు. అన్నీ సింగిల్ కరెక్ట్ మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలే. గతంతో పోల్చితే ప్రశ్నల సరళి కూడా మారింది. ఒక్కో ప్రశ్నకు జవాబులుగా పేర్కొనే నాలుగు ఆప్షన్లను ఒక్కో సిరీస్ ప్రశ్నపత్రంలో ఒక్కో రకంగా ఇచ్చారు. కెమిస్ట్రీ కెమిస్ట్రీలో ఇచ్చిన 30 ప్రశ్నల్లో 18 ప్రశ్నలు సులభంగా ఉన్నాయి. మిగిలిన ప్రశ్నల్లో 8 మధ్యస్తంగా ఉంటే.. 4 మాత్రం క్లిష్టమైనవి. కెమిస్ట్రీ.. ఫిజికల్, ఆర్గానిక్, ఇనార్గానిక్ కెమిస్ట్రీ అనే మూడు విభాగాలుగా ఉంటుంది. ఈ క్రమంలో విభాగాల వారీగా వచ్చిన ప్రశ్నల శాతాన్ని పరిశీలిస్తే.. ఫిజికల్ కెమిస్ట్రీ: 40 శాతం, ఆర్గానిక్ కెమిస్ట్రీ: 30 శాతం, ఇనార్గానిక్ కెమిస్ట్రీ: 30 శాతం. అధిక శాతం ప్రశ్నలు నిర్దేశించిన సిలబస్ మేరకు ఉండడమే కాకుండా టెక్ట్స్ పుస్తకాల నుంచి నేరుగా ఇవ్వడం జరిగింది. తరగతుల వారీగా ప్రశ్నల విభజనను చూస్తే..11వ తరగతి నుంచి దాదాపుగా 11 ప్రశ్నలు, 12వ తరగతి నుంచి దాదాపుగా 16 ప్రశ్నలు వచ్చాయి.రెండు ప్రశ్నలు మాత్రం అస్పష్టంగా ఉన్నాయి. అంతేకాకుండా వీటి క్లిష్టత స్థాయి కూడా ఇంటర్మీడియెట్ కంటే ఎక్కువగా ఉండటం గమనార్హం. మొత్తంగా పరిశీలిస్తే కెమిస్ట్రీ పేపర్ సులభంగానే అనిపి స్తుంది. కానీ ఇచ్చిన ఆప్షన్లు రెండు ఒకే విధంగా ఉండడం కారణంగా వాటిని సాధించడానికి సహేతుకమైన ఆలోచన అవసరం. కానీ చాలామంది విద్యార్థులు పేపర్ సులభంగానే ఉందనే ఉద్దేశంతో అన్ని ప్రశ్నలను యత్నించారు. దాంతో తప్పులు చేసే అవకాశమెక్కువ. కాబట్టి ఫలితాల్లో కెమిస్ట్రీ నిర్ణయాత్మకంగా ఉండొచ్చు. ఎలక్ట్రో కెమిస్ట్రీ, కెమికల్ బాండింగ్ చాప్టర్ల నుంచి (నాలుగు చొప్పున) ఎక్కువ ప్రశ్నలు వచ్చాయి. ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి అడిగిన ప్రశ్నలు ప్రాథమిక అంశాలపైన ఉన్నాయి. వీటిని టెక్ట్స్‌బుక్స్ నుంచి నేరుగా అడగటం జరిగింది. ఇనార్గానిక్ కెమిస్ట్రీకి ప్రాధాన్యత ఇచ్చారు. ఇందులో ప్రశ్నల క్లిష్టత కూడా ఎక్కువగా ఉంది. 70-80 105 యావరేజ్ స్కోర్ బెస్ట్ స్కోర్ -టి.కృష్ణ, (ఆర్ కే క్లాసెస్, హైదరాబాద్) ఫిజిక్స్ ఫిజిక్స్‌లో మొత్తం 30 ప్రశ్నలు ఇచ్చారు. ఇంటర్మీడియెట్ మొదటి, రెండు సంవత్సరాల సిలబస్‌కు సమప్రాధాన్యతనిచ్చారని చెప్పొచ్చు. మొదటి సంవత్సరంలో మెకానిక్స్ నుంచి అత్యధిక ప్రశ్నలు వచ్చాయి. ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం నుంచి 16 ప్రశ్నలు, ద్వితీయ సంవత్సరం నుంచి 14 ప్రశ్నలు ఇచ్చారు. మొదటి సంవత్సరం నుంచి టాపిక్ల వారీగా వచ్చిన ప్రశ్నలను పరిశీలిస్తే: మెకానిక్స్-5 ప్రశ్నలు; ఫ్లూయిడ్ మెకానిక్స్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ -3 ప్రశ్నలు; సింపుల్ హార్మోనిక్ మోషన్ అండ్ వేవ్స్-2 ప్రశ్నలు; థర్మోడైనమిక్స్-3 ప్రశ్నలు; యూనిట్ డెమైన్షన్స్, ఎర్రర్ మెజర్మెంట్స్-2 ప్రశ్నలు; గ్రావిటేషన్-1 ప్రశ్న. ద్వితీయ సంవత్సరం నుంచి టాపిక్ల వారీగా వచ్చిన ప్రశ్నలు: ఎలక్ట్రిసిటీ అండ్ మాగ్నటిజం-6 ప్రశ్నలు; జియోమెట్రికల్ అండ్ వేవ్ టాపిక్స్, ఈఎం వేవ్స్-5 ప్రశ్నలు; మోడ్రన్ ఫిజిక్స్-2 ప్రశ్నలు; సెమీకండక్టర్ డివెజైస్-1 ప్రశ్న. మొత్తం మీద చూస్తే ఫిజిక్స్ క్లిష్టంగానే ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే..కొన్ని ప్రశ్నలు సమస్యాధారితంగా (ప్రాబ్లమ్ బేస్డ్) ఉన్నాయి. కొన్ని ప్రశ్నలను సాధించడానికి సుదీర్ఘమైన కాలిక్యులేషన్స్ చేయాల్సిన అవసరం వచ్చింది.పశ్నలను సాధించే పద్ధతిపై అవగాహన ఉన్నప్పటికీ.. సుదీర్ఘ కాలిక్యులేషన్స్ కారణంగా అధిక శాతం సమయాన్ని వెచ్చించాల్సి వచ్చింది.రెండు, మూడు కాన్సెప్ట్‌లు కలిపి మల్టిపుల్ కాన్సెప్ట్‌లుగా ఇచ్చిన ప్రశ్నల సంఖ్య ఎక్కువగా ఉంది.సాధారణంగా విద్యార్థులు నిర్లక్ష్యం చేసే సర్ఫేస్ టెన్షన్, ఎలాస్ట్టిసిటీ, ఎలక్ట్రోమాగ్నటిక్ వేవ్స్ వంటి అంశాలకు ఈ సారి ప్రాధాన్యత లభించింది. పధాన చాప్టర్లుగా భావించే ఎలక్ట్రో స్టాటిస్టిక్స్, కరెంట్ ఎలక్ట్రిసిటీ నుంచి అడిగిన ప్రశ్నలు స్వల్పంగానే ఉన్నాయి. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుంటే విద్యార్థులు అన్ని టాపిక్‌లకు ప్రాధాన్యతనివ్వాల్సిన అవసరం ఉంది. 50 80-90 యావరేజ్ స్కోర్ బెస్ట్ స్కోర్ -రామకృష్ణ, (ఆర్ కేస్ ఫ్రేమ్స్ ఆఫ్ ఫిజిక్స్, హైదరాబాద్) మ్యాథమెటిక్స్ గతేడాదితో పోల్చితే ఈ ఏడాది మ్యాథమెటిక్స్ పేపర్ సులభంగానే ఉందని చెప్పొచ్చు. ఇంటర్మీడియెట్ మొదటి, రెండు సంవత్సరాలకు సమ ప్రాధాన్యత లభించింది. ఇంటర్మీడియెట్‌లో సబ్జెక్ట్‌పై మంచి అవగాహన ఉన్న విద్యార్థి సులభంగా 18 ప్రశ్నలను సాధించగలడు. అసెర్షన్-రీజన్ టైప్ ప్రశ్నలు లేని కారణంగా విద్యార్థులు ఒత్తిడి లేకుండా సమాధానాలు ఇచ్చారని చెప్పొచ్చు. మొత్తం 30 ప్రశ్నల్లో.. సులభమైనవి-10, సుదీర్ఘ ప్రశ్నలు-7, కాన్సెప్ట్ బేస్డ్ ప్రశ్నలు-8, క్లిష్టమైనవి-5. గత ప్రశ్నపత్రాల నుంచి 7 ప్రశ్నలు వచ్చాయి. నిర్దేశించిన సిలబస్ నుంచి ప్రత్యేకంగా 4 ప్రశ్నలు ఇచ్చారు. కాలిక్యులస్ నుంచి వచ్చిన 7 ప్రశ్నల్లో 4 సులభమైనవి. ఆల్జీబ్రా నుంచి అడిగిన 10 ప్రశ్నల్లో 6 సులభమైనవి. కోఆర్డినేట్ జ్యామెట్రీ నుంచి వచ్చిన 5 ప్రశ్నల్లో 3 సులభమైనవి. మెట్రీలో రెండు ప్రశ్నలు మాత్రమే సులభంగా ఉన్నాయి. మీన్ వాల్యూ, ట్రిగ్నోమెట్రీ, వెక్టార్స్, డీఆర్ఎస్-డీసీఎస్, ప్రొబబిలిటీ, స్ట్రైట్ లైన్, మ్యాట్రిక్స్, సెట్స్ నుంచి అడిగిన ప్రశ్నలు కాన్సెప్ట్ బేస్డ్గా డెరైక్ట్‌గా ఉన్నాయి. వీటిని సాధించడం సులభం.మిక్స్డ్ కాన్సెప్ట్ ప్రశ్నలు (ఇన్వర్స్+డిఫరెన్షియెషన్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్+ఇంటీజర్), బైనామిల్ థీరమ్పై వచ్చిన ప్రశ్నలు క్లిష్టంగా ఉండడమే కాకుండా సుదీర్ఘమైనవి. మిగతా చాప్టర్ల నుంచి అడిగిన ప్రశ్నలు ఒక మోస్తరుగా ఉన్నాయి. 60-70 115-120 యావరేజ్ స్కోర్ బెస్ట్ స్కోర్ -ఎం.ఎన్.రావు,(శ్రీ చైతన్య విద్యా సంస్థలు, హైదరాబాద్), బి.వాసు, (డాక్టర్ ఆర్ కే క్లాసెస్, హైదరాబాద్). 310 బెస్ట్ మార్క పైనే ఉండొచ్చు ఫలితాల వెల్లడి: మే 3, 2014 వెబ్సైట్: http://jeemain.nic.in -
ట్రిపుల్ ఐటీ సిబ్బంది నియామకాల్లో తప్పిదాలు!
సాక్షి, హైదరాబాద్: రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) ఆధ్వర్యంలోని ట్రిపుల్ ఐటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాల వ్యవహారంలో తప్పిదాలు జరిగినట్లు విచారణ కమిటీ నిర్ధారణకు వచ్చింది. లెక్చరర్ పోస్టులను అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులుగా ప్రభుత్వం మార్పు చేయకున్నా.. వాటిని కూడా అసిస్టెంట్ ప్రొఫెసర్లుగానే ప్రకటించి భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టింది. పోస్టులకు అభ్యర్థుల ఎంపిక వ్యవహారంలో రిజర్వేషన్, రోస్టర్ పాయింట్లకు తూట్లు పొడిచినట్లు విచారణ కమిటీ పేర్కొంది. ఇంటర్వ్యూ మార్కులను కేటాయించిన తరువాత వాటిని దిద్ది తప్పిదాలకు పాల్పడినట్లు ప్రభుత్వానికి అందజేసిన నివేదికలో స్పష్టం చేసింది. గత ఏడాది చేపట్టిన 246 పోస్టుల భర్తీ వ్యవహారంలో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో ప్రభుత్వం కల్పించుకొని ఇంటర్వ్యూలు పూర్తయిన వారికి పోస్టింగ్ ఆర్డర్లు ఇవ్వకుండా నిలిపివేసింది. అవకతవకలపై గత ఏడాది అక్టోబరు 26న విచారణకు ఆదేశించింది. మాజీ వైస్ ఛాన్స్లర్లు సీఆర్ విశ్వేశ్వరరావు, తిరుమలరావు, ఉన్నత విద్యా మండలి వైస్ ఛైర్మన్ విజయప్రకాష్లతో కూడిన కమిటీ పోస్టుల భర్తీ వ్యవహారంపై విచారణ జరిపి ఫిబ్రవరి మొదటివారంలో నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. నివేదికలో పేర్కొన్న పలు తప్పిదాలు ఆర్జీయూకేటీలో ఆధ్వర్యంలోని మూడు ట్రిపుల్ ఐటీల్లో బోధన సిబ్బంది నియామకాలకు చర్యలు చేపట్టింది. అందులో 118 అసిస్టెంట్ ప్రొఫెసర్, 118 లెక్చరర్ పోస్టులు ఉన్నాయి. ఈ రెండు కేటగిరీల పోస్టులకు వేతనాలు ఒకటైనా సర్వీసు రూల్స్ వేరు. దీంతో ఆ 118 లెక్చరర్ పోస్టులను కూ డా అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా మార్పు చేయమని (కన్వర్ట్) ప్రభుత్వానికి రాసింది. ప్రభుత్వం నుంచి అనుమతి రాకముందే వాటిని అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా పేర్కొంటూ నోటిఫికేషన్ జారీ చేసింది. రాత పరీక్ష నిర్వహించి, ఇంటర్వ్యూలు పూర్తి చేసింది. ఇంటర్వ్యూల్లో మార్కులు వేసిన తరువాత 90 శాతం అభ్యర్థులకు మార్కుల షీట్ల విషయంలో తప్పులు జరిగాయి. మొదట వేసిన మార్కులను తరువాత దిద్దారు. కంప్యూటర్ సైన్స్ సబ్జెక్టులో ఓసీ మహిళకు వచ్చిన మార్కుల ప్రకారం ఆమె ఓసీ జనరల్ కేటగిరీలో ఎంపిక చేయాలి. కాని ఆమెను ఓసీ మహిళ కేటగిరీలో ఎంపిక చేశారు. ఒక ఎస్సీ అభ్యర్థి విషయంలోనూ అలాగే చేశారు. మెకానికల్ ఇంజనీరింగ్‌లోనూ ఓసీ మహిళను మెరిట్ ప్రకారం ఓసీ జనరల్‌లో ఎంపిక చేయాల్సి ఉండగా, ఓసీ మహిళ కేటగిరీలో ఎంపిక చేశారు. ఓసీ జనరల్‌లో ఎంపిక చేయాల్సిన బీసీ-డీ అభ్యర్థిని రిజర్వేషన్లో ఎంపిక చేశారు. ఈఈఈ సబ్జెక్టులోనూ ఓసీ మహిళ విషయంలో అలాగే చేశారు. రోస్టర్ పాయింట్స్‌లో తేడాలు చూపారు. ఈసీఈలో ఓసీ జనరల్‌లో ఎంపిక చేయాల్సిన ఎస్సీ అభ్యర్థిని రిజర్వేషన్లో ఎంపిక చేశారు. పోస్టు కోసం కడపలోని ఆర్కే వ్యాలీ అప్షన్ ఇవ్వకపోయినా ఒకరిని అక్కడి పోస్టింగ్ జాబితాలో చేర్చారు. -
నాసాకు ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ఎంపిక
బాసర, న్యూస్‌లైన్ : ఆదిలాబాద్ జిల్లా బాసరలోని ట్రిపుల్ ఐటీ కళాశాలకు చెందిన ఐదుగురు విద్యార్థులు నాసాకు ఎంపికయ్యారు. ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉద్యోగావకాశాలు కల్పిం చేందుకు అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన అమత్య్రా కంపెనీ నాసా ఆధ్వర్యంలో నాసా ఆర్బిటాళ్ల స్పేస్ సెటిల్మెంట్ ప్రాజెక్ట్‌కు ట్రిపుల్ ఐటీ రెండో(పీయూసీ-2) సంవత్సరం విద్యార్థులు ఐదుగురు ఎంపికయ్యారని బాసర ట్రిపుల్ ఐటీ ఇన్చార్జి సత్యనారాయణ తెలిపారు. హైదరాబాద్‌లోని తిరుమలగిరికి చెందిన షేక్ మనీషా బానూ, డి.చెన్నరాయుడు, మల్కాజ్‌గిరికి చెందిన సంతోష్, షేక్‌పేట మండలం ద్వారకానగర్‌కు చెందిన నవ్య గోసిక, రంగారెడ్డి జిల్లాకు చెందిన పల్లవీరావు నాసాకు ఎంపికైన వారిలో ఉన్నారు. -
బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య
భైంసా/బాసర, న్యూస్‌లైన్: ఆదిలాబాద్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థి భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు యత్నించాడు. దీంతో తీవ్రగాయాలపాలైన అతడిని నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్సపొందుతూ మృతి చెందాడు. అతడి మృతికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని విద్యార్థులు ఆందోళనకు దిగారు. వివరాల్లోకి వెళ్తే... నల్లగొండ జిల్లా కనగల్ మండలం గౌరరాం గ్రామానికి చెందిన బి.నాగరాజు బాసర ట్రిపుల్ ఐటీలో ఇంజినీరింగ్ నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. ఆదివారం ఉదయం ఏడు గంటల ప్రాంతంలో బీహెచ్-1 భవనం నాలుగో అంతస్తు నుంచి కిందికి దూకాడు. ఇది గమనించిన విద్యార్థులు ఆవరణలోనే ఉన్న ఆస్పత్రికి సమాచారం ఇచ్చారు. అయితే, ఆస్పత్రిలో వైద్యులు, సిబ్బందితోపాటు అంబులెన్సు అందుబాటులోలేదు. ట్రిపుల్ ఐటీ అధికారులూ వెంటనే స్పందించకపోవడంతో తీవ్ర జాప్యం జరిగింది. విద్యార్థులు సమాచారం ఇచ్చిన 40 నిమిషాలకు వ్యానును పంపించారు. కానీ, వ్యాను బయటకు వెళ్లేందుకు అనుమతి తీసుకోలేదంటూ సెక్యూరిటీ సిబ్బంది కొద్దిసేపు నిలువరించారు. మరోవైపు తీవ్ర రక్తస్రావం కావడంతో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న నాగరాజును నిజామాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స చేస్తుండగానే పరిస్థితి విషమించి నాగరాజు మృతిచెందాడు. విషయం తెలిసిన విద్యార్థులు దాదాపు ఆరు వేల మంది ఉదయం 11 గంటలకు భైంసా-బాసర ప్రధాన రహదారిపై బైఠాయించారు. అధికారుల వేధింపులకు తాళలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడని విద్యార్థులు ఆరోపించారు. వీటితోపాటు తాము అనేక సమస్యలతో సతమతమవుతున్నామని, ఎవరికి చెప్పినా పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఇలాంటి వాతావరణంలో ఇమడలేకనే నాగరాజు బలవన్మరణానికి పాల్పడ్డాడని చెప్పారు. బాధ్యులను తొలగిస్తేనే ఆందోళన విరమిస్తామని విద్యార్థులు భైంసా డీఎస్పీకి స్పష్టంచేశారు. ఎలాంటి సమాధానం రాకపోవడంతో ఆందోళన కొనసాగించారు. కాగా, నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం నాగరాజు మృతదేహాన్ని బంధువులు స్వగ్రామానికి తీసుకువెళ్లారు. ఐదుగురు అధికారుల సస్పెన్షన్ విద్యార్థులు ఉదయం నుంచి ఆందోళన నిర్వహిస్తుండటం, రాత్రి వరకు కూడా విరమించకపోవడంతో ఆర్జీయూకేటీ రిజిస్ట్రార్ సోమయ్య బాసరకు వచ్చారు. విద్యార్థులతో చర్చించి వారి డిమాండ్ మేరకు ట్రిపుల్ ఐటీ డెరైక్టర్ రాజేంద్రసాహూ, ఓఎస్డీ నారాయణ, డీఈ రాజేశ్వర్, సీఎస్‌వో వాజుద్దీన్, కార్యాలయ అధికారి బద్రిలను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించడంతో విద్యార్థులు శాంతించారు. పది రోజుల్లో పెళ్లి జరగాల్సి ఉండగా... బొమ్మపాల నాగరాజుకు ఇటీవలే మేనత్త కూతురితో పెళ్లి కుది రింది. ఈ నెల 26న వివాహం జరగాల్సి ఉండగా అనివార్య కారణాలతో నిలిచిపోయింది. ఇదే విషయమై శనివారం రాత్రి 8 గం టల సమయంలో తల్లిదండ్రులు వెంకటయ్య, జయమ్మలతో మాట్లాడాడు. మార్చి 5న లగ్నం పెట్టుకోవాలని నాగరాజు తమతో చెప్పాడని తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. కూలీనాలీ చేసుకుంటూ కొడుకును చదివించామని, అతని ఇష్టప్రకారమే పెళ్లి నిశ్చయం చేశామని వారు రోదించారు. ఇంతలోనే కనిపించని లోకాలకు వెళ్లిపోయాడని వారు కన్నీరుమున్నీరయ్యారు. కాగా, నాగరాజు మృతిపై అతని కుటుంబ సభ్యులు, బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. శనివారం రాత్రి సంఘటన జరిగితే ఆదివారం ఉదయం వరకు చెప్పలేదన్నారు. కళాశాల యాజమాన్యం సరైన సమాచారం ఇవ్వడంలేదని వారు తెలిపారు. -
విద్యాబోధనపై యూజీసీ సంతృప్తి
నూజివీడు, న్యూస్‌లైన్ : ట్రిపుల్‌ఐటీలో ఆరేళ్ల సమీకృత ఇంజినీరింగ్ విద్యకు సంబంధించి బోధనాపద్ధతులపై యూజీసీ నిపుణుల బృందం సంతృప్తి వ్యక్తం చేసింది. ఈ బృందం చైర్మన్, పంజాబ్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ అరుణ్‌కుమార్ గ్రోవర్ నేతృత్వంలో బృందం సభ్యులు ఆదివారం స్థానిక ట్రిపుల్‌ఐటీని సందర్శించారు. తొలుత ప్రాంగణంలోని సమావేశ మందిరంలో డెరైక్టర్ ఇబ్రహీంఖాన్, ఆర్జీయూకేటీ వైస్ చాన్సలర్ వి.రాజకుమార్‌లతో బృందం సమావేశమైంది. వీసీ రాజకుమార్ ట్రిపుల్ ఐటీ లక్ష్యం, ప్రగతి, విద్యార్థులకు బోధిస్తున్న విద్యావిధానం, సదుపాయాలు, విద్యార్థుల నాసా పర్యటన, ఇటీవల జరిగిన ప్రాంగణ ఎంపికలు తదితర అంశాలపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వారికి వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లోని 80 శాతం పైన ప్రతిభ కలిగిన విద్యార్థులకు అత్యున్నత ప్రమాణాలతో ఇంజినీరింగు విద్యను అందజేస్తున్నామన్నారు. విద్యాబోధన, వసతులపై ఆరా... బృంద సభ్యులు ప్రాంగణంలో విద్యార్థులకు ఏర్పాటుచేసిన సౌకర్యాలు, సదుపాయాలను పరిశీలించారు. తరగతి గదులు, హాస్టల్లో వసతి ఏర్పాట్లు, ఒక్కొక్క గదికి ఉంటున్న విద్యార్థులు ఎంతమంది తదితర అంశాలను డెరైక్టర్ ఇబ్రహీంఖాన్‌ను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల కోసం ఏర్పాటుచేసిన ఆస్పత్రి, అందులో ఏర్పాటుచేసిన సౌకర్యాలపై వైద్యుల నుంచి వివరాలు సేకరించారు. అనంతరం మెస్‌ను సందర్శించి పిల్లలకు నాణ్యమైన ఆహారం పెడుతున్నారా లేదా అని పరిశీలించారు. చివరగా ఇంజినీరింగు విద్యకు సంబంధించి ప్రయోగశాలలు, వాటిలోని పరికరాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులు, మెంటార్లతో సమావేశమై విద్యావిధానంపై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. శిక్షణ విభాగం ఏర్పాటు చేయండి... ఏడువేల మంది విద్యార్థులు ట్రిపుల్ఐటీలలో చదువుకుంటున్న నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న ప్లేస్మెంట్ సెల్ల తరహాలో విద్యార్థుల ప్రయోజనార్థం కోచింగ్ సెల్ (శిక్షణ విభాగం)ను కూడా ఏర్పాటుచేసి అన్ని రకాల ప్రవేశపరీక్షలకు శిక్షణ కూడా ఆయా ప్రాంగణాల్లోనే నిర్వహించాలని అరుణ్‌కుమార్ గ్రోవర్ సూచించారు. దీనివల్ల వారి సమయం, డబ్బు ఆదా అవుతుందన్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆరు నెలల క్రితం ఆర్జీయూకేటీ అధికారులు యూజీసీ స్టేటస్ కోసం దరఖాస్తు చేసుకున్నారని, ఈ మేరకు ట్రిపుల్ ఐటీని సందర్శించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్జీయూకేటీ రిజిస్ట్రార్ ఆచార్య సోమయ్య, సీనియర్ ప్రొఫెసర్లు ఆచార్య రామనర్శింహం, డాక్టర్ రామ తదితరులు పాల్గొన్నారు. సమస్యలు వెల్లడించిన మెంటార్లు... ట్రిపుల్ ఐటీ మెంటార్లు తాము ఎదుర్కొంటున్న సమస్యలను యూజీసీ బృందం దృష్టికి తీసుకెళ్లారు. ఆరేళ్లుగా తాము ఒకే జీతంతో పనిచేస్తున్నామని, తమకు ఉద్యోగ భద్రత లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై వారు తమకు అనుకూలంగా స్పందించారని, ట్రిపుల్ఐటీ విద్యకు పునాది వేసేది మెంటార్లే కాబట్టి మీ ఉద్యోగాలను పర్మినెంట్ చేయాల్సిన అవసరం ఉందని తెలిపారని మెంటార్లు వివరించారు. -
కాకినాడ ట్రిపుల్ ఐటీ భాగస్వామిగా జీఎంఆర్!
సాక్షి, హైదరాబాద్: తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఏర్పాటు చేయతలపెట్టిన ట్రిపుల్ ఐటీకి ప్రైవేటు భాగస్వామిగా జీఎంఆర్ కన్సార్టియంను ఎంపిక చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఎంపిక కమిటీ సిఫారసు చేసింది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య విధానం(పీపీపీ)లో దేశవ్యాప్తంగా 20 కేంద్ర ట్రిపుల్ ఐటీలు ఏర్పాటు చేయాలని కేంద్ర మానవవనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ నిర్ణయించగా.. అందులో ఒకటి కాకినాడలో ఏర్పాటు కానుంది. ఇందుకు కేంద్రం 50 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 35 శాతం నిధులు సమకూర్చుతాయి. ప్రైవేటు భాగస్వామి 15 శాతం నిధులు వెచ్చించాల్సి ఉంటుంది. జీఎంఆర్(కాకినాడ)సెజ్, గోదావరి ఇన్స్టిట్యూట్, అశోకా బిల్డ్‌కాన్.. ఈ మూడు సంస్థలు కలిసి కన్సార్టియంగా ఏర్పడి దరఖాస్తు చేశాయి. దీనితోపాటు వచ్చిన ఇతర దరఖాస్తులను ఎంపిక కమిటీ పరిశీలించిన అనంతరం జీఎంఆర్ కన్సార్టియంను సిఫారసు చేసింది. -
జోరుతగ్గని పోరు
సాక్షి నెట్వర్క్ : సమైక్యపోరు.. అలుపెరగకుండా 45రోజులుగా సాగుతున్న ఉద్యమం జోరు తగ్గడంలేదు. అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని ఉద్యమాన్ని ఉరకలెత్తిస్తున్నారు. సమైక్య, సంఘటిత శక్తిని ప్రదర్శిస్తున్నారు. ధర్నాలు, ర్యాలీలు, రహదారుల దిగ్బంధం, మానవహారాలు, సమైక్య నినాదాలతో శుక్రవారం సీమాంధ్ర జిల్లాలు దద్దరిల్లాయి. అనంతపురంలో ఇటలీ దెయ్యాన్ని పారదోలుతామంటూ అధ్యాపక జేఏసీ నేతలు వేపమండలతో నిరసన ర్యాలీ నిర్వహించారు. విద్యుత్ ఉద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించారు. రామగిరి మండలం పేరూరు నుంచి సమైక్యవాదులు ధర్మవరానికి బైకు ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులో వెయ్యిమీటర్ల జెండాతో ర్యాలీ చేపట్టారు. ట్రిపుల్ ఐటీలో విద్యార్థులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. పోరుమామిళ్ల, ప్రొద్దుటూరు, రాజంపేటలలో వైఎస్సార్ సీపీ నేతృత్వంలో దీక్షలు సాగుతున్నాయి. ఆర్టీసీ కార్మికులు పట్టణంలో వెనక్కి నడుస్తూ నిరసన తెలిపారు. రైల్వేకోడూరులో మోకాళ్లపై నడిచారు. చిత్తూరు జిల్లా పీలేరులో ఆర్యవైశ్యులు కుటుంబ సమేతంగా క్రాస్ రోడ్డులో బైఠాయించి శాస్త్రోక్తకంగా మంత్రాలు పఠించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా పుత్తూరు బంద్ నిర్వహించారు. తిరుపతిలో రుయా వైద్యులు, నర్సులు విభజనపరుల మాస్క్‌లు ధరించి, విద్యుత్ షాక్ ట్రీట్మెంట్ ఇచ్చి నిరసన తెలిపారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ కర్నూలులో సాయి భక్తులు ప్రార్థించారు. ఆత్మకూరులో మంత్రి ఏరాసు ఇంటి ఎదుట జేఏసీ నేతలు నిరసన తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో ఉపాధ్యాయులు 48 గంటల నిరవధిక దీక్ష చేశారు. చీరాలలో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి. యర్రగొండపాలెంలో యాదవులు భారీ ర్యాలీ నిర్వహించారు. నెల్లూరులో విద్యార్థి జేఏసీ నేతలపై దాడికి నిరసనగా సమైక్య రాష్ట్ర పరిరక్షణ కమిటీ ప్రతినిధులు ఎస్పీ కాార్యాలయాన్ని ముట్టడించారు. ఆర్టీసీ బంద్‌తో పాటు, విద్యుత్ ఉద్యోగుల 72 గంటల సమ్మె కొనసాగుతోంది. ఇంటింటా సమైక్య జెండా తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఉద్యోగులు భారీ ప్రదర్శన నిర్వహించారు. రాజానగరం నియోజకవర్గంలో ప్రతి ఇంటిపై సమైక్య జెండా ఎగురవేశారు. ఇంటర్ విద్యార్థిని సునంద ఎనిమిది కిలోమీటర్ల సమైక్య పరుగు చేపట్టింది. పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు రైల్వేస్టేషన్ సెంటరులో సమైక్యవాదులు మానవహారం నిర్వహించారు. ఏలూరులో పంచాయతీరాజ్ మినిస్టీరియల్ ఉద్యోగులు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. తాళ్లపూడిలో విద్యార్థులు కోలాట భేరి నిర్వహించారు. తాడేపల్లిగూడెంలో పొలికేక పేరుతో వినూత్న కార్యక్రమాలు చేపట్టారు. విశాఖ జిల్లా అరకులో ఆకులు తింటూ జేఏసీ నిరసన వ్యక్తం చేసింది. నర్సీపట్నంలో మునిసిపాల్టీ పరిధిలోని డ్వాక్రా సంఘాలు ర్యాలీ నిర్వహించాయి. నక్కపల్లి జేఏసీ దీక్షలు ముగిసాయి. విజయనగరం జిల్లా చీపురుపల్లిలో కాంగ్రెస్, టీడీపీల వ్యక్తిగత దూషణలు చేసుకుని పోటాపోటీగా దిష్టిబొమ్మలు దహనం చేయటంతో ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామిని గరివిడిలో జేఏసీ ప్రతినిధులు అడ్డుకున్నారు. పలాసలో వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు గంగిరెద్దులతో ప్రదర్శన చేశారు. శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రిలో వైద్యులు ఆరుబయటే సేవలు అందించారు. టెక్కలిలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో రోడ్డుపైనే వంటావార్పు నిర్వహించారు. రాజాంలో మహిళా ఉపాధ్యాయులు కళ్లకు గంతలు కట్టుకొని ర్యాలీ చేశారు. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ముట్టడి ఏపీఎన్జీవో సంఘం పిలుపు మేరకు సీమాంధ్ర జిల్లాలో శుక్రవారం కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడించారు. బీఎస్ఎన్ఎల్, తపాలా, సెంట్రల్ ఎక్సైజ్, జీవితబీమా, భారత ఆహారసంస్థ, బ్యాంకులు తదితర కార్యాలయాల్లో కార్యకలాపాలను స్తంభింపచేశారు. కొన్నిచోట్ల కార్యాలయాలకు తాళాలు వేశారు. అందులో పనిచేసే ఉద్యోగులు, సిబ్బంది విధులను బహిష్కరించి ఉద్యమానికి మద్దతు తెలిపారు. జై సమైక్య నినాదాలు చేశారు. తూర్పు గోదావరి జిల్లాలో ఓఎన్జీసీ, రిలయన్స్ చమురు, గ్యాస్ ఉత్పత్తి కే ంద్రాలను ఏపీఎన్జీవోలు ముట్టడించారు. ఆయా కార్యాలయాల్లోకి చొచ్చుకుని వెళ్లేందుకు యత్నించగా.. పోలీసులు వారిని అడ్డుకున్నారు. విశాఖలోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయాన్ని ముట్టడించిన 12 మంది ఉద్యమకారులను అదుపులోకి తీసుకున్నారు.