నూతనంగా ఏర్పాటుచేసిన శ్రీకాకుళం, ఒంగోలు ట్రిపుల్‌ఐటీల్లో ప్రవేశాల కౌన్సెలింగ్ కృష్ణాజిల్లా నూజివీడు ట్రిపుల్‌ఐటీలో సోమవారం ప్రశాంతంగా ప్రారంభమైంది. రెండు ట్రిపుల్‌ఐటీలకు కలిపి 1872 మంది జనరల్ అభ్యర్థులను ఎంపికచేయగా.. తొలిరోజు 372 మందిని కౌన్సెలింగ్‌కు పిలిచారు.
256 మంది హాజరుకాగా, 116 మంది గైర్హాజరయ్యారు. వీరిలో శ్రీకాకుళం ట్రిపుల్‌ఐటీకి 137, ఒంగోలు ట్రిపుల్‌ఐటీకి 119 మందికి ప్రవేశాలు లభించాయి. కౌన్సెలింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6 గంటలకు ముగిసింది. నూజివీడు ట్రిపుల్‌ఐటీ డెరైక్టర్ ఆచార్య వీరంకి వెంకటదాసు, ఏవో ఆచార్య పి.అప్పలనాయుడు, అకడమిక్ డీన్ కోసూరి హనుమంతరావు, ఇడుపులపాయ ట్రిపుల్‌ఐటీ అకడమిక్ డీన్ వేణుగోపాలరెడ్డిల ఆధ్వర్యంలో అసిస్టెంట్ రిజిస్ట్రార్ మేరుగు అర్జునరావు పర్యవేక్షణలో అవాంతరాలు లేకుండా కౌన్సెలింగ్ జరిగింది. 9న మరో 500 మంది అభ్యర్థులకు కౌన్సెలింగ్ జరగనుంది.