జూలై 1నుంచి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ఈనెల 19న అడ్వాన్స్‌డ్ ఫలితాలు
సాక్షి, హైదరాబాద్: ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే కౌన్సెలింగ్ తాత్కాలిక షెడ్యూలును జేఈఈ మెయిన్ సెంట్రల్ సీట్ అలొకేషన్ బోర్డు (సీఎస్‌ఏబీ) జారీ చేసింది. వ చ్చేనెల 1న ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌ను ప్రారంభించనున్నట్లు బోర్డు పేర్కొంది. జేఈఈ మెయిన్ పరీక్ష రాసిన విద్యార్థుల ఇంటర్మీడియట్ మార్కుల వివరాలను తమ వెబ్‌సైట్‌లో ఉంచింది. ఏమైనా తేడాలు ఉంటే ఈనెల 27లోగా తెలియజేయాలని సూచించింది. ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ఐటీల్లో ప్రవేశాల్లో ఇంటర్మీడియట్ మార్కులకు 40 శాతం వెయిటేజీ ఇస్తున్న నేపథ్యంలో మార్కుల్లో తేడాలుంటే సవరించుకోవాలని సూచించింది. మరోవైపు, వీటి అలిండియా ర్యాంకులను జూలై 7న ప్రకటిస్తామని గతంలోనే సీబీఎస్‌ఈ వెల్లడించింది. ఇక ఐఐటీల్లో ప్రవేశాలకోసం నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలను ఈనెల 19న వెల్లడించేందుకు ఏర్పాట్లు చేసింది.