Counseling Will Be Held From July 20 for the Year 2023-29 in IIIT Under RGUKT - Sakshi
Sakshi News home page

AP: నేటి నుంచి ట్రిపుల్‌ ఐటీల్లో కౌన్సెలింగ్‌ 

Published Thu, Jul 20 2023 7:12 AM | Last Updated on Thu, Jul 20 2023 7:59 PM

Counseling In IIITs From July 20 - Sakshi

సాక్షి, నూజివీడు: రాష్ట్రంలోని రాజీవ్‌ గాంధీ సాంకేతిక వైజ్ఞానిక విశ్వవిద్యాలయం(ఆర్జీయూకేటీ) పరిధి­లో­­ని నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకా­కుళం ట్రిపుల్‌ ఐటీల్లో 2023–29 సంవత్సరానికి ఆరేళ్ల సమీకృత ఇంజినీరింగ్‌ కోర్సులో ప్రవేశాలకు గాను ఈ నెల 20 నుంచి 25వ తేదీ వరకు కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నట్లు అడ్మిషన్ల కన్వీనర్‌ ఆచార్య ఎస్‌ఎస్‌ఎస్‌వీ గోపాలరాజు బుధవారం తెలిపారు. 

నాలుగు ట్రిపుల్‌ ఐటీల్లో కలిపి 4,,400 సీట్లు ఉండ­గా, ప్రత్యేక కేటగిరీ సీట్లు మినహాయించి మిగిలిన 4,040 సీట్లకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను ఈ నెల 13న ప్రకటించామని పేర్కొన్నారు. వీరందరికీ కౌన్సెలింగ్‌ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామన్నా­రు. నూజివీడు ట్రిపుల్‌ ఐటీలో ఈ నెల 20, 21వ తేదీల్లో, ఇడుపులపాయ ట్రిపుల్‌ ఐటీలో 21, 22వ తేదీల్లో, శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీలో 24, 25వ తేదీ­ల్లో, ఒంగోలు ట్రిపుల్‌ ఐటీకి సంబంధించి ఇడుపులపాయ ట్రిపుల్‌ఐటీ క్యాంపస్‌లో 24, 25 తేదీల్లో కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. 

అభ్యర్థులందరూ ఉదయం ఎనిమిది గంటల కల్లా ఆ­యా సెంటర్లకు హాజరు కావాలన్నారు. పదో తరగతికి సంబంధించి అన్ని రకాల ఒరిజినల్‌ ధ్రువపత్రాలు, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలను వెంట తెచ్చుకోవాలని చెప్పారు. సరి్టఫికెట్ల పరిశీలన అనంతరం సీటును కేటాయిస్తారని, సీటు పొందిన వెంటనే అడ్మిషన్‌ ఫీజు, రిఫండబుల్‌ కాషన్‌ డిపా­జిట్‌ కలిపి ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.3,700, మి­గి­లిన కేటగిరీలకు చెందిన విద్యార్థులు రూ.4,200 చొప్పున చెల్లించాల్సి ఉంటుందని వివరించారు. 

ఇది కూడా చదవండి: కొత్త వైద్య కళాశాలల్లో సెల్ఫ్‌ ఫైనాన్స్‌ సీట్లు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement