కొత్త సర్కారుపై కోటి ఆశలు | Delivery of the new A Price | Sakshi
Sakshi News home page

కొత్త సర్కారుపై కోటి ఆశలు

Published Sat, Jun 7 2014 2:33 AM | Last Updated on Sat, Sep 2 2017 8:24 AM

కొత్త సర్కారుపై కోటి ఆశలు

కొత్త సర్కారుపై కోటి ఆశలు

ట్యాంకుల నిర్మాణం వేగవంతం చేయాలి.
గదులకు నీటి సరఫరా చేయాలి.
నీటి పైప్‌లైన్ లీకేజీలు అరికట్టాలి.

నిర్వహణ లేదు..

టిపుల్ ఐటీలో నీటి సమస్య పరిష్కారం కావడం లేదు. నీటి పథకం పనులు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం బాసర ట్రిపుల్ ఐటీలో ప్రవేశాలకు నోటిఫికేషన్ వెలువడింది. విద్యార్థుల తరగతులు కొనసాగుతున్నాయి. కొత్త విద్యార్థులు కళాశాలలో అడుగుపెట్టగానే నీటి సమస్య స్వాగతం పలికేలా ఉంది. ఇప్పుడు కళాశాలలో చదివే విద్యార్థులు క్యాంపస్ వద్ద ఆరుబయట నిర్మించిన ట్యాంకుల వద్ద బట్టలు ఉతుక్కుంటున్నారు. విద్యార్థినులు నీటి ట్యాంకుల వద్ద బకెట్లతో వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. ఇక విద్యార్థుల కోసం కేటాయించిన గదుల్లో పైప్‌లైన్‌లు వేసి నల్లాలు బిగించినా పనిచేయడం లేదు. తరగతులకు వెళ్లేముందు బకెట్లతో నీరు తెచ్చుకోవాల్సిన పరిస్థితి. వారానికి ఒకరోజు బట్టలు ఉతుక్కుంటున్నారు.

విద్యార్థులకు కేటాయించిన గదుల నిర్వహణ లేదు. బాత్‌రూంలు, మరుగుదొడ్లను శుభ్రపరచడం లేదు. గదుల్లో ప్లాస్టరింగ్ పగుళ్లు తేలా    యి. గదుల్లోకి వెళితే అపరిశుభ్ర వాతావరణం కనిపిస్తుంది. విద్యుత్ సరఫరా అస్తవ్యస్తంగా ఉంది. కిటికీల అద్దాలు పగిలి తలుపుల గొలుసులు ఊడినా ఎవరు పట్టించుకోవడం లేదు. కొన్ని గదుల్లో చీకటి ఆవరించి కనిపిస్తుంది. నిర్మించిన కొద్ది రోజులకే పాత భవనాల గదులు దర్శనమిస్తున్నాయి.

 గదుల నిర్వహణపై దృష్టిసారించాలి.
 నిర్మాణ పనులు చేపట్టిన సంస్థతో చర్చించాలి.
{పమాదకరంగా ఉన్న విద్యుత్ తీగలు సరిచేయాలి.
స్విచ్‌బోర్డులు ఏర్పాటు చేసి మరుగుదొడ్ల శుభ్రతపై దృష్టి సారించాలి.

 అస్తవ్యస్తంగా..

 ట్రిపుల్ ఐటీ అధికారులు పారిశుధ్య నిర్వహణలోనూ నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. కళాశాలకు రెండు కిలో మీటర్ల దూరంలో మహారాష్ట్ర ప్రాంతంలోని ఆల్కాహాల్ ఫ్యాక్టరీ వెదజల్లే దుర్గంధం పరిసరాల వాతావరణాన్ని కలుషితం చేస్తుంది. ఇదేగాలిని పీల్చి విద్యార్థులు అనారోగ్యం పాలవుతున్నారు. ఇక కళాశాల పక్కనే మెస్ వ్యర్థాలు గుట్టలుగా పోస్తున్నారు. సువిశాలంగా ఉన్న ట్రిపుల్ ఐటీ ఖాళీ స్థలంలో వర్షం నీరు నిలిచి దోమల ఆవాసంగా మారుతోంది. పరిసరాల్లోనూ అపరిశుభ్ర వాతావరణం కనిపిస్తుంది.
     
ఆల్కాహాల్ ఫ్యాక్టరీ గొట్టం ఎత్తు పెంచితే కాలుష్యం కొంతమేర నివారించవచ్చు. ఈ విషయంలో ఉన్నతాధికారుల బృందంతో నివేదిక తెప్పించుకుని మహారాష్ట్ర సర్కారుతో చర్చించాలి.మెస్ వ్యర్థాలు గుంతలుగా తవ్వి పూడ్చివేయాలి. కళాశాలలో వర్షపు నీరు నిల్వకుండా డ్రెయినేజీల్లోకి మళ్లించేలా చర్యలు తీసుకోవాలి. లోతట్టు ప్రాంతాల్లో మొరం వేసి చదును చేస్తే నీరు నిల్వకుండా ఉంటుంది.

 ప్రహరీ లేక..

కళాశాల చుట్టూ ఇప్పటికీ ప్రహరీ లేదు. దీంతో పిచ్చికుక్కలు, పందులు, మూగజీవాలు కళాశాలలోనికి చొచ్చుకువస్తున్నాయి. చుట్టూ ప్రహరీలేక పోవడంతో ఎవరైనా పంట పొలాల నుంచి లోనికివచ్చే అవకాశం ఉంది. ఇంత మంది విద్యార్థులు ఉన్న ఇక్కడ పోలీసు ఔట్ సోర్సింగ్ విభాగం లేదు. ప్రైవేటు సెక్యూరిటీతోనే నెట్టుకొస్తున్నారు. ఇక ట్రిపుల్ ఐటీలో ఉన్న ఆస్పత్రిలో పూర్తిస్థాయిలో సిబ్బంది లేరు. మహిళా వైద్యురాలు అందుబాటులో లేక విద్యార్థినులు ఇబ్బందులు పడుతున్నారు.
 
అత్యవసర సేవలు అందించేలా ఆస్పత్రిలో వైద్యులు అందుబాటులో ఉండేలా చూడాలి. మహిళా డాక్టర్‌ను నియమించాలి.పోలీసు ఔట్‌సోర్సింగ్ పోస్టును కేటాయించాలి.ముందుచూపు లేదు..

బాసర ట్రిపుల్ ఐటీలో సమస్యలు ఒకవైపు ఉం టే ఇక చదువుకునే విద్యార్థులకు మరిన్ని ఇబ్బం దులు వెంటాడుతున్నాయి. 2008లో ట్రిపుల్ ఐటీలో చేరిన 2 వేల మంది విద్యార్థులు 2014 వరకు తమ కోర్సును పూర్తి చేసుకున్నారు. ఇం దులో 200 మందికి ప్లేస్‌మెంట్‌లు వచ్చాయి. ఇంకా ఎంతో మంది విద్యార్థులు ప్లేస్‌మెంట్‌ల కోసం ఎదురుచూస్తున్నారు. సమస్యలతో చదువులు పూర్తిచేసిన విద్యార్థులు కొలువుల కోసం వేచి చూడాల్సిన దుస్థితి. ఇప్పటికైనా తెలంగాణ సర్కారు బాసర ట్రిపుల్ ఐటీపై ప్రత్యేక దృష్టి సారించాలి. సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తూ చదివే విద్యార్థులకు కొలువులపైన ముందుచూపుతో వ్యవహరిస్తుందన్న ఆశాభావాన్ని చదివే విద్యార్థులంతా వ్యక్తం చేస్తున్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement