రేపట్నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు పాత పద్ధతిలోనే కేటాయింపు
హైదరాబాద్: ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వ విద్యాలయం(ఆర్‌జీయూకేటీ) నోటిఫికేషన్ వెలువరిం చింది. బాసర, నూజివీడు, ఇడుపులపాయలోని ట్రిపుల్ ఐటీల్లో 3వేల సీట్ల భర్తీకి నోటిఫికేషన్‌ను జారీ చేసినట్లు ఆర్‌జీయూకేటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ రాజ్‌కుమార్ సోమవారం విలేకరులకు తెలిపారు. పూర్తి వివరాలను ఠీఠీఠీ.టజఠజ్టు.జీ వెబ్‌సైట్‌లో చూడవచ్చు. బుధవారం నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకు తుది గడువు జూన్ 16వ తేదీ.
పాత పద్ధతిలోనే ప్రవేశాలు..
ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్టంలోని పదో షెడ్యూల్‌లో ఆర్‌జీయూకేటీ ఉన్నందున ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలు పాత పద్ధతిలోనే ఉంటాయని రాజ్‌కుమార్ తెలిపారు. ఉస్మానియా విశ్వ విద్యాలయం పరిధిలోని విద్యార్థులకు 42 శాతం, ఆంధ్రా విశ్వ విద్యాలయం పరిధిలోని వారికి 36 శాతం, శ్రీకృష్ణ దేవరాయ విశ్వ విద్యాలయం పరిధిలోని విద్యార్థులకు 22 శాతం సీట్లు కేటాస్తామన్నారు. పదో తరగతిలో సాధించిన గ్రేడ్ పాయింట్ యావరేజ్ (జీపీఏ) ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేస్తామన్నారు. నాన్ రెసిడెన్షియల్ ప్రభుత్వ పాఠశాలలు, జిల్లా పరిషత్తు, మున్సిపల్ స్కూళ్లలో చదివి సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు చెందిన విద్యార్థులకు 0.4 శాతం డిప్రివేషన్ స్కోర్ ఇస్తామన్నారు. వారు సాధించిన జీపీఏకు అదనంగా దీన్ని కలిపి మెరిట్ జాబితాలు రూపొందిస్తామన్నారు.
ఇదీ ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాల షెడ్యూల్...
1. మే 21 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
2. ఏపీ ఆన్‌లైన్/ ఠీఠీఠీ.టజఠజ్టు.జీ వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
3. రూ. 150 పరీక్ష ఫీజును డీడీ/చలానా రూపంలో చెల్లించాలి.
4. జూన్ 16వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి.
5. ఆన్‌లైన్‌లో పూర్తి చేసిన దరఖాస్తు ఫారం ప్రింట్‌కు డీడీ లేదా చలానా జత చేసి జూన్ 21వ తేదీలోగా ఆర్‌జీయూకేటీ రిజిస్ట్రార్‌కు పంపించాలి.
6. జూలై 8న ఎంపికైన విద్యార్థుల జాబితా ప్రకటన. దాంతోపాటే వెయిటింగ్ లిస్టునూ ప్రకటిస్తారు.
7. ఎంపికైన విద్యార్థులకు జూలై 23, 24వ తేదీల్లో కౌన్సెలింగ్.
8. 23, 24 తేదీల్లో హాజరు కాని వారి స్థానాల్లో వెయిటింగ్ లిస్టులో ఉన్న విద్యార్థులను ఎంపిక చేస్తారు.
9. 27వ తేదీన వెయిటింగ్ జాబితాలోని విద్యార్థుల్లో ఎంపికైన వారి వివరాల ప్రకటన.
10. జూలై 28 నుంచి తరగతులు ప్రారంభం.
11 జూలై 31తో ప్రవేశాల ప్రక్రియ పూర్తి.
ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్
Published Tue, May 20 2014 1:00 AM | Last Updated on Sat, Sep 2 2017 7:34 AM
Advertisement
Advertisement