Rajiv Gandhi University of Science Technology
-
నేడు ఆర్జీయూకేటీ సెట్
నూజివీడు: రాష్ట్రంలోని రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం పరిధిలో ఉన్న నాలుగు ట్రిపుల్ ఐటీ కాలేజీల్లో ప్రవేశాల కోసం ఆదివారం ఆర్జీయూకేటీ సెట్ నిర్వహిస్తున్నారు. ప్రవేశ పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని చాన్సలర్ ఆచార్య కేసీ రెడ్డి తెలిపారు. కృష్ణా జిల్లా నూజివీడులోని ట్రిపుల్ ఐటీలో ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. మొత్తం 75,283 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని.. పరీక్ష నిర్వహణకు ఏపీలో 467, తెలంగాణలో 8 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని వివరించారు. ఆదివారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష నిర్వహిస్తామని.. అభ్యర్థులు గంట ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. కోవిడ్ నిబంధనల మేరకు ఏర్పాట్లు చేశామని చెప్పారు. ఫలితాలను అక్టోబర్ 4న మంత్రి ఆదిమూలపు సురేష్ విడుదల చేస్తారని పేర్కొన్నారు. కోవిడ్ వల్ల 10వ తరగతి పరీక్షలు జరగనందున.. ట్రిపుల్ ఐటీల్లో సీట్ల భర్తీకి ఆర్జీయూకేటీ సెట్ నిర్వహిస్తున్నామని చెప్పారు. దరఖాస్తు చేసిన మొత్తం అభ్యర్థుల్లో 40,555 మంది బాలురు, 34,728 మంది బాలికలున్నారని తెలిపారు. ట్రిపుల్ ఐటీల్లో ఇంక్యుబేషన్ సెంటర్లు.. వచ్చే ఏడాదిలోగా నూజివీడు, శ్రీకాకుళం, ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీల్లో ఇంక్యుబేషన్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని ఆర్జీయూకేటీ చాన్సలర్ కేసీ రెడ్డి తెలిపారు. ట్రిపుల్ ఐటీ విద్యార్థులు అనేక కంపెనీల్లో ఉద్యోగాలు సాధించి.. మంచి ప్రతిభ కనబరుస్తున్నారని పేర్కొన్నారు. 2008–14 బ్యాచ్‌కు చెందిన జి.విద్యాధరి సివిల్ సర్వీసెస్‌లో 211వ ర్యాంకు, అలాగే 2012వ బ్యాచ్‌కు చెందిన చీమల శివగోపాల్‌రెడ్డి 263వ ర్యాంకు సాధించారని తెలిపారు. ఇడుపులపాయ, నూజివీడులో సోలార్ పవర్ ప్లాంట్లు అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. వీటివల్ల ఏడాదికి రూ.కోటికి పైగా నిధులు ఆదా అవుతున్నాయని తెలిపారు. శ్రీకాకుళంలో కూడా సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామన్నారు. బెంగళూరు కేంద్రంగా పనిచేసే అనలాగ్ డివైజెస్ కంపెనీ ఈ ఏడాది 50 మంది విద్యార్థులను ఇంటర్న్‌షిప్‌కు ఎంపిక చేసుకుందని చెప్పారు. మెంటార్లను రెగ్యులర్ చేయడానికి అవకాశం లేదని.. 4 ట్రిపుల్ ఐటీల్లో 400 వరకు లెక్చరర్ పోస్టులున్నాయని, వారిని ఆ పోస్టుల్లో నియమిస్తామని తెలిపారు. సమావేశంలో ఆర్జీయూకేటీ ఇన్చార్జ్ రిజిస్ట్రార్ కె.సామ్రాజ్యలక్ష్మి, సెట్ కన్వీనర్ డి.హరినారాయణ, నూజివీడు డైరెక్టర్ జి.వి.ఆర్.శ్రీనివాసరావు సెట్ కో–కనీ్వనర్ ఎస్.ఎస్.ఎస్.వి.గోపాలరాజు, ఏఓ భానుకిరణ్, డీన్ అకడమిక్స్ దువ్వూరి శ్రావణి పాల్గొన్నారు. -
ప్రవేశానికి వేళాయె!
ట్రిపుల్‌ఐటీలో ప్రవేశానికి నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ ఆన్లైన్ దరఖాస్తుల గడువు జూన్ 16 పోస్టల్ దరఖాస్తులకు జూన్ 21 జూలై 23, 24 తేదీల్లో కౌన్సెలింగ్ జూలై 28 నుంచి తరగతులు గ్రామీణ విద్యార్థులకు పెద్దపీట నూజివీడు, న్యూస్‌లైన్ : ట్రిపుల్ ఐటీలో ప్రవేశానికి దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం బుధవారం ప్రారంభం కానుంది. రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయ (ఆర్జీయూకేటీ) పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ(ఆర్కే వ్యాలీ), బాసర ట్రిపుల్ ఐటీలలో 2014-15 విద్యాసంవత్సర ప్రవేశాలకు విశ్వవిద్యాలయ కులపతి రాజ్‌కుమార్ నోటిఫికేషన్ విడుదల చేయడంతో దరఖాస్తుల స్వీకరణకు రంగం సిద్ధమైంది. ఆరు సంవత్సరాల సమీకృత బీటెక్ డిగ్రీ కోర్సుకు సంబంధించి మొదటి సంవత్సరంలో చేరేందుకు ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరించనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన పదోతరగతి విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణకు జూన్ 16 (రాత్రి 8 గంటల వరకు) ఆఖరు తేదీ కాగా, ముద్రిత దరఖాస్తులను జూన్ 21వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు విశ్వవిద్యాలయానికి పంపాల్సి ఉంటుంది. దరఖాస్తుతో పాటు రిజిస్ట్రేషన్ ఫీజు అయిన రూ.150 చెల్లించినట్లుగా తెలిపే బ్యాంక్ చలానా గాని, ఏపీ ఆన్లైన్ రసీదు గాని జతచేయాలి. పదోతరగతికి సంబంధించిన మార్కుల జాబితాను, హాల్‌టికెట్లను కూడా జతచేసి పంపాలి. దరఖాస్తు చేసుకున్నవారిలో ఎంపిక చేసిన జాబితాను జూలై ఎనిమిదిన ప్రకటిస్తారు. జూలై 23, 24 తేదీల్లో కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. 27న వెయిటింగ్ జాబితాలో వారికి కౌన్సెలింగ్ నిర్వహించి, జూలై 28 నుంచి తరగతులు ప్రారంభిస్తారు. సీట్ల కేటాయింపు జరిగేదిలా... రాష్ట్రంలోని మూడు ట్రిపుల్ ఐటీలకు కేటాయించిన మూడువేల సీట్లలో రెండు శాతం మాజీ సైనిక ఉద్యోగుల (కాప్) పిల్లలకు కేటాయిస్తారు. వికలాంగులకు మూడు శాతం, ఎన్సీసీ కోటా కింద ఒక శాతం, స్పోర్ట్స్ కోటా కింద 0.05 శాతం చొప్పున కేటాయించనున్నారు. నాలుగు కేటగిరీలకు కలిపి మొత్తం 195 సీట్లు పోగా మిగిలిన 2,805 సీట్లలో ఓపెన్ కేటగిరీ కింద 15 శాతం అంటే 421 సీట్లు కేటాయిస్తారు. మిగిలిన 2,384 సీట్లలో ఆంధ్రా యూనివర్సిటీ ప్రాంతానికి 1001 (42 శాతం) సీట్లు, ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంతానికి 858 (36 శాతం) సీట్లు, శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీ ప్రాంతానికి 525 (22 శాతం) సీట్లు కేటాయించారు. -
ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్
రేపట్నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు పాత పద్ధతిలోనే కేటాయింపు హైదరాబాద్: ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వ విద్యాలయం(ఆర్జీయూకేటీ) నోటిఫికేషన్ వెలువరిం చింది. బాసర, నూజివీడు, ఇడుపులపాయలోని ట్రిపుల్ ఐటీల్లో 3వేల సీట్ల భర్తీకి నోటిఫికేషన్‌ను జారీ చేసినట్లు ఆర్జీయూకేటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ రాజ్‌కుమార్ సోమవారం విలేకరులకు తెలిపారు. పూర్తి వివరాలను ఠీఠీఠీ.టజఠజ్టు.జీ వెబ్సైట్లో చూడవచ్చు. బుధవారం నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకు తుది గడువు జూన్ 16వ తేదీ. పాత పద్ధతిలోనే ప్రవేశాలు.. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని పదో షెడ్యూల్లో ఆర్జీయూకేటీ ఉన్నందున ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలు పాత పద్ధతిలోనే ఉంటాయని రాజ్‌కుమార్ తెలిపారు. ఉస్మానియా విశ్వ విద్యాలయం పరిధిలోని విద్యార్థులకు 42 శాతం, ఆంధ్రా విశ్వ విద్యాలయం పరిధిలోని వారికి 36 శాతం, శ్రీకృష్ణ దేవరాయ విశ్వ విద్యాలయం పరిధిలోని విద్యార్థులకు 22 శాతం సీట్లు కేటాస్తామన్నారు. పదో తరగతిలో సాధించిన గ్రేడ్ పాయింట్ యావరేజ్ (జీపీఏ) ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేస్తామన్నారు. నాన్ రెసిడెన్షియల్ ప్రభుత్వ పాఠశాలలు, జిల్లా పరిషత్తు, మున్సిపల్ స్కూళ్లలో చదివి సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు చెందిన విద్యార్థులకు 0.4 శాతం డిప్రివేషన్ స్కోర్ ఇస్తామన్నారు. వారు సాధించిన జీపీఏకు అదనంగా దీన్ని కలిపి మెరిట్ జాబితాలు రూపొందిస్తామన్నారు. ఇదీ ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాల షెడ్యూల్... 1. మే 21 నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. 2. ఏపీ ఆన్లైన్/ ఠీఠీఠీ.టజఠజ్టు.జీ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. 3. రూ. 150 పరీక్ష ఫీజును డీడీ/చలానా రూపంలో చెల్లించాలి. 4. జూన్ 16వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. 5. ఆన్లైన్లో పూర్తి చేసిన దరఖాస్తు ఫారం ప్రింట్కు డీడీ లేదా చలానా జత చేసి జూన్ 21వ తేదీలోగా ఆర్జీయూకేటీ రిజిస్ట్రార్‌కు పంపించాలి. 6. జూలై 8న ఎంపికైన విద్యార్థుల జాబితా ప్రకటన. దాంతోపాటే వెయిటింగ్ లిస్టునూ ప్రకటిస్తారు. 7. ఎంపికైన విద్యార్థులకు జూలై 23, 24వ తేదీల్లో కౌన్సెలింగ్. 8. 23, 24 తేదీల్లో హాజరు కాని వారి స్థానాల్లో వెయిటింగ్ లిస్టులో ఉన్న విద్యార్థులను ఎంపిక చేస్తారు. 9. 27వ తేదీన వెయిటింగ్ జాబితాలోని విద్యార్థుల్లో ఎంపికైన వారి వివరాల ప్రకటన. 10. జూలై 28 నుంచి తరగతులు ప్రారంభం. 11 జూలై 31తో ప్రవేశాల ప్రక్రియ పూర్తి.