Raj kumar
-
ఆప్ ఎమ్మెల్యే రాజ్‌కుమార్ ఆనంద్‌పై అనర్హత వేటు
సాక్షి, ఢిల్లీ: ఆప్ ఎమ్మెల్యే రాజ్‌కుమార్ ఆనంద్‌పై అనర్హత వేటు పడింది. బీఎస్పీ తరపున ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసిన రాజ్‌కుమార్.. విచారణకు హాజరుకావాలని స్పీకర్ ఆదేశించారు. విచారణకు హాజరుకాకపోవడంతో రాజ్‌కుమార్ అసెంబ్లీ సభ్యత్వంపై అనర్హత వేటు వేసినట్టు స్పీకర్ రామ్ నివాస్ గోయెల్ శుక్రవారం తెలిపారు. జూన్ 11న విచారణకు హాజరుకావాలని నోటీస్ ఇచ్చినా కానీ ఆయన హాజరుకాలేదని గోయెల్ పేర్కొన్నారు. మరోసారి జూన్ 14న హాజరుకావాలని ఆదేశించినా స్పందించలేదన్నారు. ఈ క్రమంలో ఆయన అసెంబ్లీ సభ్యత్వాన్ని రద్దు చేసినట్టు స్పీకర్ తెలిపారు.'ఆప్' సారథ్యంలోని ఢిల్లీ ప్రభుత్వంలో పలు మంత్రిత్వ శాఖలను రాజ్‌కుమార్ ఆనంద్ నిర్వహించారు. అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ దళితులకు సరైన ప్రాతినిధ్యం ఇవ్వడం లేదని ఆరోపిస్తూ.. గత ఏప్రిల్‌లో మంత్రి పదవికి రాజీనామా చేశారు. అనంతరం ఆమ్ ఆద్మీ పార్టీని కూడా వీడారు. ఆప్‌లోని దళిత ఎమ్మెల్యేలు, మంత్రులు, కౌన్సిలర్లకు ఎలాంటి గౌరవం ఇవ్వడం లేదంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన.. గత మేలో బీఎస్పీలో చేరారు. బీఎస్పీ తరఫున ఎంపీ ఎన్నికల్లో రాజ్‌కుమార్ పోటీ చేశారు. -
జ్యోతిక మనసు ఎలాంటిదో ఈ ఇంటర్వ్యూ చూస్తే చాలు..
-
వర్మపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి
బాపట్ల: ప్రముఖ సినీ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ వికాస అధ్యక్షుడు టి.అనిల్‌కుమార్, నాయకుడు పి.రాజ్‌కుమార్ గురువారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఈనెల 26న ఓ టీవీ నిర్వహించిన చర్చలో పాల్గొన్న తాడికొండకు చెందిన కొలికపూడి శ్రీనివాసరావు రాంగోపాల్ వర్మ తల నరికి తీసుకొస్తే కోటి రూపాయలు నజరానా ఇస్తానని వ్యాఖ్యలు చేయటం పౌర సమాజాన్ని తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరి అభిప్రాయాలను వారు చెప్పుకునే స్వేచ్ఛ ఉందని, బాధ్యతాయుతమైన పౌరునిగా ఉండాల్సిన వ్యక్తులు చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పిలుపునివ్వడంపై ఆందోళన వ్యక్తం చేశారు. రాంగోపాల్ వర్మ గతంలో తీసిన రాజకీయ చిత్రాలకు ఎటువంటి అభ్యంతరాలు చెప్పని నాయకులు ప్రస్తుతం రాజకీయ చిత్రాలను తీసేందుకు తన అభిప్రాయాలను వెల్లడిస్తుంటే తప్పేముందని అభిప్రాయం వ్యక్తం చేశారు. బెదిరించే విధంగా వ్యాఖ్యలు చేసిన వ్యక్తులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులకు విజ్ఞప్తి చేశారు. ఇవి చదవండి: Fact Check: విద్యపై ఎల్లోమీడియా విషపు కథలు -
ఢిల్లీ మంత్రికి ఈడీ షాక్
-
పెళ్లి చెయ్యండి అని ఇంటికెళ్తే కుళ్ల బొడిచి గెంటేశారు: రాజ్ కుమార్
సీనియర్ నటుడు రాజ్ కుమార్ గురించి ఈ జనరేషన్‌కి పెద్దగా తెలియకపోవచ్చు కానీ నైంటీస్ కిడ్స్‌కి మాత్రం బాగా తెలుసు. అప్పట్లో ఆయనను బుల్లితెర మెగాస్టార్ అనేవాళ్లు. చూడ్డానికి చిరంజీవిలా ఉండటంతో ఆయనకి ఈ పేరు వచ్చింది. ‘అమ్మ రాజీనామా’ సినిమాతో వెండితెరపై అడుగు పెట్టాడు రాజ్ కుమార్. కొన్నాళ్ల తర్వాత చిరంజీవి పోలీకలు ఉండడంతో తెలుగులో అవకాశాలు రాలేదు. దీంతో కన్నడ ఇండస్ట్రీకి వెళ్లాడు. ఇలా దక్షిణాది సినిమాలతో పాటు సీరియళ్లలో నటించి.. తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటీవల సినిమాలకు దూరంగా ఉంటున్న రాజ్ కుమార్ ఆ మధ్య ఓ యూట్యూబ్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ప్రేమ, పెళ్లి విషయాలను పంచుకున్నాడు. (చదవండి: నా కూతురిని చూసి గర్విస్తున్నా'.. బిగ్‌బాస్ గొడవపై స్పందించిన నటి!) నాది ప్రేమ పెళ్లి. చెన్నైలో ఉన్నప్పడు.. నేను నేను ఉన్న ఇంటికి ఎదురుగా ఉన్న ఇంట్లో నా భార్య ఉండేది. రోజు కిటికిలో నుంచి ఇద్దరం చూసుకునే వాళ్లం కానీ మాట్లాడుకోలేదు. ఒక రోజు ఫోన్లో మాట్లాడుకొని పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. అంతే మరుసటి రోజు నుంచి ఆమె కనిపించలేదు. మా ప్రేమ గురించి వాళ్ల ఇంట్లో తెలియడంతో..వేరే ఏరియాకు షిఫ్ట్ అయ్యారు. దాదాపు 5 ఏళ్లు దూరంగా ఉన్నాం. ఓ సారి ధైర్యం చేసి వాళ్లింటికి వెళ్లాను. మీ అమ్మాయిని నాకిచ్చి పెళ్లి చేయండి అని మా మాయయ్య అడిగితే.. కుళ్లబొడిచి బయటకు పంపించేశారు. కొన్నాళ్ల తర్వాత ఆమెనే ఫోన్ చేసి.. ఇంటికి వచ్చి డైరెక్ట్ తాళి కట్టు అని చెప్పింది. దీంతో వెంటనే ఇంటికెళ్లి ఆమె మెడలో తాళి కట్టి.. ఇంట్లో వాళ్ల ముందు నిలబడ్డాం. అప్పుడు అంతా వచ్చి నన్ను కొట్టి.. ఆమెను తీసుకెళ్లారు. తాళి తీసి పారేశారు. మూడేళ్ల తర్వాత అంటే 1995లో ఇంట్లో చెప్పకుండా ఇద్దరం కలిసి లేచిపోయాం. దాదాపు ఏడాది పాటు ఎవరికి కనిపించకుండా ఉన్నాం. బాబు పుట్టిన తర్వాత మా అడ్రస్ వాళ్లకు తెలిసింది. కొన్నాళ్ల తర్వాత వాళ్లే మా దగ్గరకు వచ్చారు. ఆ తర్వాత మా మామయ్యకు నేను పెద్ద కొడుకును అయ్యాను’అని రాజ్ కుమార్ తన లవ్‌స్టోరీని చెప్పుకొచ్చాడు. -
హీరోయిన్‌కు ముద్దు.. ఘాటుగానే స్పందించిన డైరెక్టర్!
రాజ్ తరుణ్, మాల్వీ మల్హోత్రా, మన్నారా చోప్రా హీరో, హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం 'తిరగబడరాసామీ'. ఈ చిత్రానికి ఎస్. రవికుమార్ చౌదరి దర్శకత్వం వహిస్తున్నారు. సురక్ష్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై మల్కాపురం శివకుమార్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్ రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు మేకర్స్. హైదరాబాద్‌లో జరిగిన ఈవెంట్లో పలువురు చిత్ర యూనిట్ సభ్యులు కూడా పాల్గొన్నారు. (ఇది చదవండి: కోలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇస్తోన్న రాజ్ తరుణ్ హీరోయిన్!) ముద్దు సీన్‌తో వివాదం అయితే ఈ ఈవెంట్‌కు హాజరైన ప్రేక్షకులకు ఊహించని సంఘటన ఎదురైంది. ఈవెంట్‌కు హాజరైన హీరోయిన్ మన్నారా చోప్రాకు దర్శకుడు రవికుమార్ బహిరంగంగా ముద్దుపెట్టడం వివాదానికి దారితీసింది. ఆయన తీరుపై పలువురు నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో డైరెక్టర్ తీరును నెటిజన్స్ విమర్శించారు. కాగా.. గతంలో ఇలానే కాజల్ స్టేజీపై మాట్లాడుతుండగా సినిమాటోగ్రాఫర్ చోటా. కె. నాయుడు ముద్దుపెట్టేశాడు. మీకేం ఇబ్బంది? అయితే తాజాగా ఈ విషయంపై స్పందించారు. తాను హీరోయిన్‌కు ముద్దుపెట్టడంతో తప్పేంటని రవికుమార్ ప్రశ్నిస్తున్నారు. ఆమె పట్ల అప్యాయతతోనే అలా చేశానని చెప్పుకొచ్చారు. నా కూతురికి కూడా అలాగే ముద్దుపెడతా అంటూ వివరణ ఇచ్చారు. అయినా ఆమెకు, మా ఫ్యామిలీకి లేని ఇబ్బంది మీకేంటని నెటిజన్లను నిలదీశారాయన. నా సినిమాలో మన్నారా చోప్రా ఆమె చేసిన వర్క్ నచ్చడం వల్లే అలా చేశానని రవికుమార్ వెల్లడించారు. ఏదేమైనా ఈవెంట్లో అందరిముందు అలా ముద్దులు పెట్టడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. (ఇది చదవండి: రాఖీ సంబురాల్లో కాబోయే మెగా కోడలు.. సోషల్ మీడియాలో వైరల్!) Director kisses an actress earlier today!pic.twitter.com/JzyBbau45d — Manobala Vijayabalan (@ManobalaV) August 28, 2023 -
రజనీకాంత్ నా కుటుంబానికి ఎంతో సాయం చేశాడు: కన్నడ సూపర్ స్టార్
కన్నడ సూపర్ స్టార్స్ పునీత్ రాజ్‌కుమార్, శివ రాజ్‌కుమార్‌లకు ఎంతోమంది వీరాభిమానులున్నారు. వీరి తండ్రి, దివంగత నటుడు డాక్టర్ రాజ్‌కుమార్ కూడా పెద్ద నటుడు. కన్నడ ఇండస్ట్రీలో స్టార్‌గా వెలుగొందిన ఈయనను అప్పట్లో గంధపు చెక్కల దొంగ వీరప్పన్ కిడ్నాప్ చేశాడు. ఇప్పటికీ కన్నడ ప్రజలు ఆ సంఘటనను అంత ఈజీగా మర్చిపోలేరు. రజనీకాంత్‌ను ఎప్పుడెప్పుడు కలుద్దామా.. తండ్రి రాజ్ కుమార్‌ను కిడ్నాప్ చేసిన సమయంలో రజనీకాంత్ తమ కుటుంబానికి ఎంతో అండగా ఉన్నాడని చెప్పుకొచ్చాడు శివ రాజ్‌కుమార్. ఆయన ఇటీవల కీలక పాత్రలో నటించిన జైలర్ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. రజనీకాంత్‌ను ఎప్పుడెప్పుడు కలుద్దామా? అని ఉందని చెప్పుకొచ్చాడు. తండ్రిని వీరప్పన్ కిడ్నాప్ చేసిన సమయంలో రజనీ తన కుటుంబానికి ఎంతో సాయం చేశాడని పేర్కొన్నాడు. ఆయన చేసిన సాయాన్ని ఎప్పటికీ మర్చిపోలేనని తెలిపాడు. అసలేం జరిగిందంటే.. 2000 జూలై 30న రాత్రి 9.30 గంటలకు వీరప్పన్ గాజనూరు ఫాంహౌస్ నుంచి రాజ్‌కుమార్‌ను కిడ్నాప్ చేశాడు. రాజ్‌కుమార్‌తో పాటు ఆయన అల్లుడు గోవింద్రాజ్, బంధువు నగేష్, అసిస్టెంట్ దర్శకుడు నాగప్పను కూడా కిడ్నాప్ చేశాడు. అక్కడి నుంచి వారిని సత్యమంగళ అడవిలోకి తీసుకెళ్లాడు. అప్పట్లో ఈ సంఘటన దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. రాజ్‌కుమార్‌కు భద్రత కల్పించడంలో తమిళనాడు ప్రభుత్వం దారుణంగా విఫలమైందని, ఇది క్షమించరాని నేరమని సుప్రీం కోర్టు సైతం ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వంపై ఒత్తిడి వీరప్పన్.. రాజ్‌కుమార్‌ను టార్గెట్ చేశాడని 1999లోనే ప్రత్యేక దర్యాప్తు బృందం ప్రభుత్వాన్ని హెచ్చరించింది. అయినా ప్రభుత్వం రాజ్‌కుమార్‌కు భద్రత కల్పించడంలో అలసత్వం వహించింది. రాజ్ కుమార్ కిడ్నాప్ అయిన సమయంలో ఆయన కోసం లక్షలాది మంది అభిమానులు పెద్ద ఎత్తున ధర్నాలు చేశారు. ప్రభుత్వంపై ఒత్తిడి పెరగడంతో చివరకు వీరప్పన్‌తో చర్చలు జరిపింది. అటు వీరప్పన్.. ఏకంగా రూ.900 కోట్లు విలువచేసే బంగారం, రూ.100 కోట్ల నగదు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. లైఫ్ అండ్ ఫాల్ ఆఫ్ వీరప్పన్ పుస్తకంలో పేర్కొన్నదాని ప్రకారం.. అప్పటి ముఖ్యమంత్రి ఎస్ఎం.కృష్ణ ప్రభుత్వం మూడు విడతలుగా మొత్తం రూ.15.22 కోట్లను వీరప్పన్‌కు అందజేసినట్లు తెలుస్తోంది. 108 రోజుల తర్వాత నవంబర్ 15న రాజ్‌కుమార్‌ను విడుదల చేశాడు. 2004 అక్టోబర్ 18న వీరప్పన్ ఎన్కౌంటర్లో చనిపోయాడు. చదవండి: Niharika: నిహారిక మీద బ్యాడ్ కామెంట్.. నోరు అదుపులో పెట్టుకో అంటూ మెగా హీరో వార్నింగ్ -
ఆ స్టార్ కిడ్ నా వెంటపడుతోంది, నా వల్ల కాదని: బాలీవుడ్ హీరో
హీరోలను ఇష్టపడటం సహజమే, కొందరైతే అభిమానం హద్దులు దాటి ఆరాధిస్తారు కూడా! కానీ ఈ మితిమీరిన అభిమానం కొన్నిసార్లు స్టార్స్‌ను ఇబ్బందులపాలు చేస్తుంది. అందుకు ఇప్పుడు చెప్పబోయే సంఘటన ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తుంది. కాకపోతే ఇక్కడో ట్విస్ట్ ఉంది. అదేంటో తెలుసుకుందాం.. బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ అంటే పడి చచ్చే లేడీ ఫ్యాన్స్ చాలామందే ఉన్నారు. 'ఇష్క్ విష్క్' సినిమాతో చాక్లెట్ బాయ్‌గా పేరు తెచ్చుకున్న అతడు తక్కువ కాలంలోనే ఎంతోమంది ఫ్యాన్స్‌ను సంపాదించుకున్నాడు. అతడు మీరా రాజ్‌పుత్‌ను పెళ్లి చేసుకున్నప్పుడు ఎంతోమంది మహిళా అభిమానుల గుండె ముక్కలైంది. వారిలో దివంగత నటుడు రాజ్ కుమార్ కూతురు వాస్తవిక్త కూడా ఒకరు. ఆమెకు షాహిద్ అంటే పిచ్చి ప్రేమ. అతడు కనిపిస్తే చాలు హీరోనే చూస్తూ తన్మయత్వానికి లోనవుతుంది. షైమక్ డావర్ డ్యాన్స్ క్లాసులో తొలిసారి షాహిద్‌ను నేరుగా చూసింది. తొలిచూపులోనే అతడు తెగ నచ్చేశాడట. తనకు తెలియకుండానే అతడితో ప్రేమలో కూడా పడిందట! కానీ నటుడు మాత్రం తనకేమీ పట్టనట్లుగా ఉండిపోయేవాడు. ఎంతమందిలో ఉన్నా ఆమె చూపులు మాత్రం షాహిద్పైనే ఉండేవట. పైగా తనను షాహిద్ భార్యగా కూడా చెప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇది హీరోకు ఇబ్బందికరంగా అనిపించింది. మొదట నచ్చజెప్పి చూశాడు, కానీ ఆమె వినిపించుకోలేదట. పైగా తను ఎక్కడికి వెళ్తే అక్కడికి ఫాలో అవడంతో ఓపిక నశించిన హీరో ఏకంగా పోలీసులను ఆశ్రయించినట్లు తెలుస్తోంది. సినిమా సెట్స్‌కు రావడం, బయటకు వెళ్తే ఫాలో కావడం, ఏకంగా తన ఇంటి పక్క ఇంట్లోకి షఫ్ట్ కావడం.. ఇవన్నీ చిరాకు తెప్పించడంతో 2012లో షాహిద్.. వాస్తవిక్తపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఓ వార్త వైరల్ అవుతోంది. ఈ ఫిర్యాదు తర్వాత ఆమె మరెన్నడూ షాహిద్‌ను ఫాలో కాలేదట. ఇకపోతే వాస్తవిక్త 1996లో యాక్టింగ్ కెరీర్‌ను ప్రారంభించింది. తండ్రి రాజ్‌కుమార్ అందుకున్న పేరు ప్రతిష్టలు తనకెలాంటి సక్సెస్ తెచ్చిపెట్టలేకపోయాయి. ఫలితంగా ఇండస్ట్రీలో నిలదొక్కుకోలేక సినిమాలకు గుడ్‌బై చెప్పేసిందీ నటి. చదవండి: అవార్డులే అనుకున్నా ఆస్కార్ కూడా కొనేశారు కదరా! -
జనాభా ప్రాతిపదికన అవకాశాలివ్వాలి: ఆర్.కృష్ణయ్య
హైదరాబాద్: ప్రజాస్వామ్య వ్యవస్థలో అన్ని కులాలు, సామాజిక వర్గాలకు జనాభా ప్రాతిపదికన విద్య, ఉద్యోగ తదితర రంగాల్లో అవకాశాలు కల్పించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్య క్షుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. బీసీలందరూ ఏకమై రాజ్యాధికారం కోసం పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. గురువారం బీసీ యువజన సంఘం రాష్ట్ర కన్వీనర్ రాజ్‌కుమార్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. గడిచిన 75 ఏళ్లలో ఏ రంగంలోనూ బీసీలకు కనీస వాటా కూడా లభించలేదని విమర్శించారు. ఏపీలో సీఎం జగన్మోహన్రెడ్డి బీసీలకు అన్ని రంగాలలో జనాభా ప్రకారం వాటా ఇచ్చారని, రాజకీయ రంగంలో బీసీలకు 50 శాతం వాటాను అన్ని స్థాయిల్లో కల్పించారన్నారు. పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం త్వరలో చేపట్టబోయే జనాభా గణనలో బీసీ కులగణన చేపట్టాలన్నారు. పంచాయతీరాజ్ సంస్థలో బీసీ రిజర్వేషన్లను 34 శాతం నుంచి 52 శాతానికి పెంచాలని కోరారు. ఈ రిజర్వేషన్లకు రాజ్యాంగ భద్రత కల్పించాలన్నారు. బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించేందుకు రాజ్యాంగ సవరణ చేయాలని కోరారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం కన్వీనర్ గుజ్జకృష్ణ, బీసీ యువజన సంఘం రాష్ట్ర కన్వీనర్ రాజ్‌కుమార్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుధాకర్, రాష్ట్ర కార్యదర్శి నరసింహగౌడ్, బీసీ వి ద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అంజి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. -
ప్రత్యక్ష ప్రసారం ప్రజాస్వామ్యానికి బలం
రాజ్యాంగ ధర్మాసనం చేపట్టే కీలకమైన కేసుల విచారణను భారత ప్రజలు ప్రత్యక్షంగా చూడటానికి సుప్రీంకోర్టు గత నెలలో అనుమతించింది. న్యాయ, సామాజిక వ్యవస్థల్లో సమూల మార్పు జరిగే గొప్ప ప్రజాస్వామిక నిర్ణయాన్ని తీసుకున్నందుకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులను అభినందించాలి. ఇది భారత న్యాయ, రాజ్యాంగపరమైన చరిత్రలో అత్యంత ప్రభావశీలమైన నిర్ణయాల్లో ఒకటిగా నిలిచిపోతుంది. దేశ అత్యున్నత న్యాయస్థానం పనితీరును ఎలాంటి అవరోధాలూ లేకుండా దేశ సగటు పౌరులు చూసే వీలు కల్పించడం వల్ల మన న్యాయవ్యవస్థపై విశ్వాసం బలపడుతుంది. న్యాయవ్యవస్థ పనితీరు గురించి విమర్శనాత్మకమైన చర్చను ఇది పెంచి పోషిస్తుంది. న్యాయ ప్రక్రియలోని పారదర్శకత దేశ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తుంది. రాజ్యాంగ ధర్మాసనం చేపట్టే కీలకమైన కేసుల విచారణను ప్రత్యక్ష ప్రసారం చేసే ప్రక్రియను సుప్రీంకోర్టు సెప్టెంబర్ 27న ప్రారంభించింది. అయితే ముఖ్యమైన విచారణలను లైవ్ టెలికాస్ట్‌కి అనుమతిస్తూ సుప్రీంకోర్టు 2018 సెప్టెంబర్ 27నే నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు కీలకమైన కేసుల విచారణను పూర్తి స్థాయిలో ప్రత్యక్షంగా ప్రసారం చేయాలని తీసుకున్న నిర్ణయానికి అదే నాంది అయింది. అప్పటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎమ్ ఖాన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్ కోర్టుల్లో జరిగే విచారణలను ప్రజాప్రయోజనం రీత్యా ప్రత్యక్ష ప్రసారం చేయవచ్చని నిర్ణయం తీసుకున్నారు. వారు సూచించినట్లుగానే ప్రత్యక్ష ప్రసారాలు ప్రజల్లో రాజ్యాంగ విలువ లను, ప్రజాస్వామ్యాన్ని, పౌరసత్వాన్ని బలోపేతం చేయడంలో న్యాయపరమైన కృషికి జీవం పోస్తాయి. ఆనాడు వారు ప్రదర్శించిన ఆ దార్శనికతకు తదనంతర ప్రధాన న్యాయమూర్తులు ఎన్వీ రమణ, యుయు లలిత్‌ల పూర్తి మద్దతు లభించింది. నాలుగేళ్ల అనంతరం రాజ్యాంగ ధర్మాసనం చేపట్టే కీలకమైన విచారణలను ప్రత్యక్ష ప్రసారాలు చేయాలని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ యుయు లలిత్ నేతృత్వంలోని సుప్రీకోర్టు విస్తృత ధర్మాసనం ఈ సెప్టెంబర్ 20న ఏకగ్రీవ నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టు ఈ–కమిటీ చైర్పర్సన్, ప్రత్యక్ష ప్రసారాలు మొదలెట్టడానికి వెనుక చోదక శక్తిగా ఉన్న జస్టిస్ చంద్రచూడ్, ఆ రోజు తన కోర్టులో విచా రణను మొదలు పెడుతూ ‘మేం ఇప్పుడు వర్చువల్’ అని ప్రకటిం చారు. ఒక్కమాటలో చెప్పాలంటే భారత సర్వోన్నత న్యాయస్థానం మనసా వాచా ఒక గొప్ప పనికి పూనుకుంది. ‘ఇంతకు ముందు ఎన్నడూ చేయలేని పనిని మనం చేయలేకపోతే మనం ఏదీ సాధిం చలేం. తక్కిన ప్రపంచం ముందుకెళుతుంటే న్యాయం మాత్రం యథా తథంగా స్తంభించిపోయి ఉంటుంది. ఇది ప్రపంచానికీ, న్యాయానికీ కూడా మంచిది కాదు’ అని దశాబ్దాల క్రితమే సుప్రసిద్ధ బ్రిటన్ న్యాయమూర్తి లార్డ్ డెన్నింగ్ చెప్పిన గొప్పమాటలను భారత సుప్రీంకోర్టు స్ఫూర్తిగా తీసుకుని ఆచరణను ప్రారంభించింది. రాజ్యాంగ ధర్మాసనం చేపట్టే కేసుల విచారణను భారత ప్రజలు ప్రత్యక్షంగా చూడటానికి అనుమతించడం ద్వారా... కీలక మలుపు తిప్పగలిగే గొప్ప ప్రజాస్వామిక నిర్ణయాన్ని తీసుకున్నందుకు గత, ప్రస్తుత చీఫ్ జస్టిస్లను, సుప్రీంకోర్టు జడ్జీలను అభినందించాల్సి ఉంటుంది. దానికి వారు అర్హులు కూడా అని చెప్పాలి. ఇది భారత న్యాయ, రాజ్యాంగపరమైన చరిత్రలో అత్యంత ముఖ్యమైన, ప్రభావ శీలమైన నిర్ణయాల్లో ఒకటిగా నిలిచిపోతుంది. దీనికి కింది కారణా లను మనం చూపించవచ్చు. ఒకటి: దేశ అత్యున్నత న్యాయస్థానం పనితీరును ఎలాంటి అవరోధాలు లేకుండా దేశ సగటు పౌరులు చూసే వీలు కల్పించడం వల్ల మన న్యాయవ్యవస్థపై విశ్వాసం బలపడుతుంది. అలాగే న్యాయవ్యవస్థ పనితీరు గురించి విమర్శనాత్మకమైన చర్చను ఇది పెంచి పోషిస్తుంది. ప్రజలకు అందుతున్న న్యాయ ప్రక్రియలోని పారదర్శకత, సౌలభ్యత దేశ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తాయి. సుప్రీంకోర్టు విచారణల ప్రత్యక్ష ప్రసారాలను పౌరులకు అందు బాటులోకి తేవడం అనేది సమాచారాన్ని ఎల్లెడలా నింపుకున్న పౌరు లను అభివృద్ధి చేయడంలో అతి ముఖ్యమైన దశగా చెప్పాలి. రెండు: ఈ నిర్ణయం చట్టపాలన ప్రాధాన్యతను ప్రజలు అర్థం చేసుకునేలా చేస్తుంది. దరిద్ర నారాయణుల, చారిత్రకంగా వెనుక బడిపోయిన, సాధికారతకు దూరమైపోయిన వర్గాల హక్కులను న్యాయవ్యవస్థ గట్టిగా పరిరక్షిస్తుందని ప్రజలు విశ్వసించడానికి ఈ నిర్ణయం తోడ్పడుతుంది. సత్యాన్ని శక్తిమంతంగా మాట్లాడడం కంటే మించిన ఉత్తమ మార్గం మరొకటి లేదు. దీని ప్రత్యక్ష ప్రభావం వెంటనే బయటపడక పోవచ్చు కానీ చట్టబద్ధపాలనను గౌరవించే సంస్కృతిని నిర్మించే శక్తి ఈ నిర్ణయానికి ఉందని చెప్పితీరాలి. మూడు: న్యాయ నిర్ణయ విధానంలో పారదర్శకతను ఇది ప్రోత్సహిస్తుంది. న్యాయమూర్తులు తీసుకునే నిర్ణయాలను సాధారణ ప్రజలు పూర్తిగా అర్థం చేసుకోవడం అరుదుగానే జరుగుతుంటుంది. చట్టం, న్యాయం అనేవి న్యాయవాదులకూ, న్యాయమూర్తులకూ మాత్రమే వదిలివేయాల్సిన ముఖ్యమైన విషయాలుగా మాత్రమే ఉండేవి. ఇప్పుడు కోర్టు విచారణలను ప్రత్యక్షంగా చూడడం వల్ల లక్షలాది సామాన్య భారతీయులు తాము శిక్షణ పొందిన న్యాయ వాదులు కాకున్నప్పటికీ, న్యాయమూర్తులు తీసుకున్న నిర్ణయాలలోని నేపథ్యాన్నీ, సందర్భాన్నీ అర్థం చేసుకోవడమే కాదు... న్యాయనిర్ణయ క్రమంలో తటస్థించే... పోటీ పడే విలువలు, ఘర్షించే హక్కులను కూడా వారు ప్రశంసించగలుగుతారు. కోర్టు విచారణల ప్రక్రియను పారదర్శకంగా ఉంచడం ద్వారా సుప్రీంకోర్టు బలీయమైన విశ్వాసాన్ని పాదుకొల్పింది. నాలుగు: ఈ నిర్ణయం న్యాయవాద వృత్తి నాణ్యతను, ప్రమా ణాలను పెంచగలుగుతుంది. లాయర్లు కోర్టుముందు కనిపించడానికి చక్కగా సిద్ధమవుతారు. బాధ్యతారహితమైన వ్యాఖ్యలను చేయ కూడదనే వివేచనతో ఉంటారు. ఇప్పుడు తమ వాదనలను ప్రజలు నేరుగా చూడటం పట్ల లాయర్లలో సానుకూల వైఖరి పెరుగుతుంది. న్యాయాన్ని అందించే యంత్రాంగాలను న్యాయవాదులు గతంలో కంటే మరింత సీరియస్‌గా తీసుకునే అవకాశం ఉంది. యువ న్యాయవాదుల సన్నద్ధత, మేధో కుశలత కూడా స్పష్టంగా అందరికీ తెలుస్తుంది కాబట్టి వారి న్యాయవాద వృత్తికి అది ఉన్నత స్థాయిని కట్టబెడుతుంది. భారతదేశంలో న్యాయవాద విద్యలో నెలకొన్న సంక్షోభాన్ని న్యాయవాద కళాశాలల్లో నాణ్యమైన బోధనను, పరిశోధనను పెంచడం ద్వారా మాత్రమే పరిష్కరించవచ్చు. న్యాయవాద వృత్తిలోని వ్యాజ్యాలకు సంబంధించిన అంశంలో ప్రవేశించడానికి చాలామంది న్యాయవాద పట్టభద్రులు ఆసక్తి చూపని ధోరణి చాలా సంవత్స రాలుగా కలవరపెడుతోంది. కార్పొరేట్ లావాదేవీల ప్రపంచానికి వ్యతిరేకంగా... కఠిన షరతులు, ఉదాసీనత కారణంగా మన యువ న్యాయవాదులు లావాదేవీల బార్లో చేరడానికి సంసిద్ధత తెలుపడం లేదు. లాయర్ల వాస్తవ వాదనలను తిలకించడం, న్యాయమూర్తులు సంధించే ప్రశ్నలకు సమాధానాలు వెతకడం వంటి విచారణలను తిలకించడం వల్ల, సాపేక్షంగా నిర్లక్ష్యానికి గురైన ఈ క్షేత్రంలోకి న్యాయవాద విద్యార్థులు వచ్చేలా ప్రభావితం చేయవచ్చు. జ్యుడీషి యరీ, న్యాయవాద వృత్తి పనితీరుకు సంబంధించిన నూతన స్కాలర్ షిప్, పరిశోధనా రంగాలపై పనిచేసేలా లా ఫ్యాకల్టీ సభ్యులు, న్యాయ పరిశోధకులు ప్రేరణ పొందవచ్చు. టెక్నాలజీ అనేది సంఘీభావాన్ని బలోపేతం చేసి, దూరానికి సంబంధించిన అవరోధాలను అధిగమించడంలో గొప్ప ఉపకరణంగా ఉంటుంది. కోర్టు విచారణలను ప్రత్యక్ష ప్రసారం చేయడం ఈ లక్ష్యాన్ని నెరవేరుస్తుందని ఆశిద్దాము. పైగా చట్టబద్ధమైన న్యాయాన్ని ప్రజల వద్దకు, వారి రోజువారీ చర్చల వరకు తీసుకెళ్లడంలో కూడా ఇది తోడ్పడుతుందని ఆశిద్దాము. అమెరికా సుప్రీంకోర్టు విశిష్ట న్యాయమూర్తి జస్టిస్ అలివర్ వెండెల్ హోమ్స్ గతంలో ఒక అద్భుత వ్యాఖ్య చేశారు. ‘ప్రపంచంలో అతిగొప్ప విషయం ఏమిటంటే, మనం ఎక్కడ నిలిచామన్నది కాదు; మనం ఏ దిశగా వెళుతున్నామన్నదే ప్రధానమైనది.’ మనం నిజంగానే సరైన దిశలో పయనిస్తున్నామని భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఇప్పుడు హామీ ఇచ్చారు. సి. రాజ్ కుమార్ వ్యాసకర్త వ్యవస్థాపక వైస్ చాన్స్‌లర్, ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ (‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ సౌజన్యంతో) -
రాజ్ కుటుంబాన్ని వెంటాడుతున్న గుండె జబ్బులు
మైసూరు: కన్నడ కంఠీరవ డాక్టర్ రాజ్‌కుమార్ కుటుంబ సభ్యులందరికీ గుండెకు సంబంధించిన సమస్యలు ఉన్నాయని, బెంగళూరు జయదేవ హృద్రోగ, పరిశోధన సంస్థ డైరెక్టర్ డాక్టర్. సీఎస్. మంజునాథ్ తెలిపారు. శుక్రవారం మైసూరు నగరంలో ఆయన గుండెకు సంబంధించిన సమస్యలపై మీడియాతో మాట్లాడారు. పునీత్‌రాజ్‌కుమార్, అతని సోదరులు రాఘవేంద్ర రాజ్‌కుమార్, శివరాజ్‌కుమార్ ఇద్దరికీ కూడా గుండెకు సంబంధించిన ఇబ్బందులు ఉన్నాయని, అది వారికి వంశపారం పర్యంగా ఉందన్నారు. ఆ సమస్యతోనే ఇటీవల పవర్‌స్టార్ పునీత్ గుండెపోటుతో మృతి చెందారని గుర్తు చేశారు. బెంగళూరు నగరంలో మరో వారం రోజుల్లో జయదేవ హృద్రోగ సంస్థ మరో యూనిట్‌ను ప్రారంభిస్తామని చెప్పారు. మైసూరు జయదేవలో ప్రతి నెల 1000 మందికి ఆంజియోగ్రామ్ చికిత్స చేస్తున్నామని, అదే విధంగా నెలరోజుల వ్యవధిలో హుబ్లీలో ఓ ఆస్పత్రిని ప్రారంభిస్తామని చెప్పారు. చదవండి: (‘ఆ అమ్మాయి నా కూతురే కాదు’) -
కేజీఎఫ్ మేకర్స్ భారీ సర్ప్రైజ్.. యువరాజ్ కుమార్ తెరంగేట్రం!
కేజీఎఫ్ చిత్రం ఎంత పెద్ద హిట్టైందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రాకింగ్ స్టార్ యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కేజీఎఫ్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రికార్డులు సృష్టించింది. ఇక దానికి సీక్వెల్‌గా వచ్చిన కేజీయఫ్ చాప్టర్-2 ఇటీవలే విడుదలయి కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఈ చిత్రంతో దర్శకుడు ప్రశాంత్ నీల్, హీరో యష్‌కు ఎంత పేరు వచ్చిందో ఆ చిత్ర నిర్మాణ సంస్థ అయిన 'హోంబలే ఫిలిమ్స్'కు కూడా అంతే పేరు వచ్చింది. ప్రస్తుతం హోంబలే ఫిలిమ్స్ పేరు దేశవ్యాప్తంగా మార్మోగుతోంది. కాగా తమ తదుపరి చిత్రాన్ని ప్రకటించి హోంబలే ఫిలిమ్స్ సర్ప్రైజ్ ఇచ్చింది. కన్నడ కంఠీరవ, లెజెండరీ నటుడు రాజ్ కుమార్ మనవడు, దివంగత పునీత్ రాజ్ కుమార్ సోదరుడు, యాక్టర్ రాఘవేంద్ర రాజ్ కుమార్ కుమారుడు యువరాజ్ కుమార్‌తో హోంబలే ఫిలిమ్స్ కొత్త సినిమా అంటూ యువరాజ్ లుక్‌తో కూడిన పోస్టర్లను విడుదల చేశారు. ఈ సినిమాతోనే యువరాజ్ కుమార్ హీరోగా వెండి తెరకు పరిచయం అవుతున్నాడు. యువరాజ్ ఇంట్రడక్షన్ పోస్టర్లను విడుదల చేస్తూ దానికి వారసత్వం కొనసాగుతుందని క్యాప్షన్ ఇచ్చారు. పునీత్ రాజ్ కుమార్‌కు 'యువరత్న' లాంటి బ్లాక్ బాస్టర్ హిట్ ఇచ్చిన సంతోష్ ఆనంద్రమ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నాడు. ಅಭಿಮಾನದಿಂದ ಅಭಿಮಾನಕ್ಕಾಗಿ ಈ ನಮ್ಮ ಪಯಣ. ಇರಲಿ ನಿಮ್ಮ ಅಪ್ಪುಗೆ The legacy continues..@yuva_rajkumar @SanthoshAnand15 @VKiragandur @hombalefilms#IntroducingYuvaRajKumar #YuvaRajKumar pic.twitter.com/c4vsklAYFj — Hombale Films (@hombalefilms) April 27, 2022 -
ఐపీఓకి ముందు ఎల్ఐసీ కీలక నిర్ణయం..!
న్యూఢిల్లీ: దేశంలోని ప్రభుత్వ భీమా రంగ సంస్థ ఎల్ఐసీ త్వరలో ఐపీఓకి వచ్చేందుకు సిద్దం అవుతున్న సంగతి తెలిసిందే. అయితే, ఇలాంటి కీలక సమయంలో సంస్థ మరో కీలక నిర్ణయం తీసుకుంది. లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) చైర్మన్ పదవీకాలాన్ని ప్రభుత్వం మరో ఏడాది పొడిగించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. అంతేకాకుండా, మేనేజింగ్ డైరెక్టర్లలో ఒకరైన రాజ్ కుమార్ పదవీకాలాన్ని కూడా ప్రభుత్వం ఒక సంవత్సరం పొడిగించింది. ఈ పొడిగింపుతో ఎం.ఆర్. కుమార్ 2023 మార్చి వరకు ఛైర్మన్ హోదాలో కొనసాగనున్నారు. ఎల్ఐసీ వైర్మన్ పదవీకాలాన్ని పొడిగించడం ఇది రెండోసారి. గత ఏడాది జూన్‌లోనూ ఎం.ఆర్.కుమార్‌కు 9 నెలల పొడిగింపునిచ్చారు. ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఐపీఓకి వచ్చేందుకు ఎల్ఐసీ సిద్దం అవుతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ ప్రక్రియ సాఫీగా సాగాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఎల్ఐసీ ఐపీఓకి వీలుగా లైఫ్ ఇన్ఫూరెన్స్ కార్పొరేషన్ చట్టానికి ప్రభుత్వం ఇప్పటికే కొన్ని మార్పులు చేసింది. అవన్నీ గత ఏడాది జూన్ 30 నుంచే అమల్లోకి వచ్చాయి. ఎల్ఐసీ ఐపీఓలో జాబితా చేసిన తర్వాత రూ.8-10 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువతో దేశంలో అతిపెద్ద సంస్థగా మారే అవకాశం ఉంది. (చదవండి: వామ్మో! సెకండ్ హ్యాండ్ మొబైల్స్ మార్కెట్ విలువ ఇన్ని కోట్లా..!) -
ఏసీబీకి చిక్కిన విద్యుత్ శాఖ ఏఏఈ
మంథని: పెద్దపల్లి జిల్లాలో ఓ అవినీతి అధికారి ఏసీబీకి చిక్కారు. ఎన్పీడీసీఎల్ ఎక్లాస్పూర్ సెక్షన్ అదనపు అసిస్టెంట్ ఇంజనీర్ ఏఏఈ కాసర్ల రాజ్‌కుమార్ ట్రాన్స్ఫార్మర్ను బిగించడం కోసం ఓ రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా శనివారం ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెండ్‌గా పట్టుకున్నారు. వరంగల్ ఏసీబీ డీఎస్పీ మధుసూదన్ కథ నం ప్రకారం.. మంథని మండలం ఆరెంద గ్రామానికి చెందిన ఎండీ షౌకత్ అలీ గోదావరిఖని ఫైర్స్టేషన్లో హోంగార్డుగా పనిచేస్తున్నారు. బాధితుడు షౌకత్ అలీ ఆయన తన వ్యవసాయ భూమిలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ లైన్ కోసం 2020లో దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం ట్రాన్స్ఫార్మర్ మంజూరు కావడంతో అధికారులు, ఏఏఈ రాజ్‌కుమార్‌ను కలవాలని లైన్‌మన్ ద్వారా సమాచారం అందించారు. షౌకత్ అలీ ఏఏఈని కలవగా ట్రాన్స్ఫార్మర్ను బిగించడానికి రూ.25 వేలు డిమాండ్ చేశారు. బాధితుడు ప్రాధేయపడడంతో రూ.20 వేలకు అంగీకరించారు. ఈ నేపథ్యంలో షౌకత్ అలీ ఏసీబీని ఆశ్రయించంతో అధికారులు, సబ్‌స్టేషన్‌లో ఏఏఈ రూ.20 వేలు తీసుకుంటుం డగా పట్టుకున్నారు. ఏఏఈ రాజ్‌కుమార్‌ను అదుపులోకి తీసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు. వివరాలు వెల్లడిస్తున్న ఏసీబీ డీఎస్పీ మధుసూదన్ -
కన్నీరు పెట్టిస్తున్న పునీత్ రాజ్‌కుమార్ పెయింటింగ్..
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ కన్నుమూసి వారం రోజులు గడుతున్నా ఇప్పటికి ఆయన మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన సమాధిని దర్శించుకు రోజు వందల్లో అభిమానులు తరలివస్తున్నారు. ఎంతో ఫిట్‌గా ఉండే అప్పు అకస్మాత్తుగా ఈ లోకాన్ని విడిచి వెళ్లడం తీవ్రం కలచివేస్తోంది. ఆయనను తలచుకుంటూ కన్నీరుపెట్టుకుంటున్నారు. చూస్తుంటే దీని నుంచి కన్నడ పరిశ్రమ కానీ, అభిమానులు కానీ ఇప్పడే బయట పడేలా కనిపించడం లేదు. చదవండి: పునీత్ సమాధి వద్ద కన్నీటి పర్యంతరమైన హీరో ఆయన మరణ వార్త ఒక్క శాండల్‌వుడ్‌కు మాత్రమే కాదు భారత సినీ పరిశ్రమను షాక్‌కు గురి చేసింది. ఇదిలా ఉంటే తాజాగా పునీత్ అభిమాని వేసిన ఓ పెయింటింగ్ ప్రతి ఒక్కరిని హత్తుకుంటోంది. కరణ్ ఆచార్య అనే ఓ వ్యక్తి గీసిన ఈ పెయింటింగ్‌లో పునీత్ తండ్రి, కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్ స్వర్గంలో కూర్చొని ఉండగా.. ఆయన వెనక నుంచి వెళ్లిన పునీత్ కళ్లు మూసి తండ్రిని సర్ప్రైజ్ చేశారు. ఈ చిత్రం చూడగానే అందరి కళ్లు ఒక్కసారిగా చెమ్మగిల్లుతున్నాయి. ఇందులో వారిద్దరిని చూసి అభిమానులంతా కన్నీరు పెట్టుకుంటున్నారు. ఈ చిత్రంపై తమదైన శైలిలో స్పందిస్తూ భావోద్వేగానికి లోనవుతున్నారు. చదవండి: పునీత్ ఇంటి సీసీటీవీ ఫుటేజ్ వైరల్, ఇవే అప్పు చివరి క్షణాలు! -
సీసీఎస్ అదుపులో స్కామ్ సూత్రధారులు?
సాక్షి, హైదరాబాద్: తెలుగు అకాడమీలో చోటు చేసుకున్న రూ.63.47 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్స్ స్కామ్‌లో సూత్రధారులు హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) పోలీసులకు చిక్కినట్లు సమాచారం. మొత్తం నలుగురిలో ఇద్దరిని ఆదివారం అర్ధరాత్రి పట్టుకున్నారని తెలిసింది. మరోపక్క ఈ స్కామ్ దర్యాప్తులో భాగంగా పోలీసులు ఆదివారం అకాడమీ అధికారులతో పాటు కెనరా బ్యాంక్ సిబ్బందిని ప్రశ్నించారు. ఈ స్కామ్‌కు సూత్రధారుల్లో ఒకరైన రాజ్‌కుమార్‌కు మరో రెండు మారుపేర్లు ఉన్నట్లు పోలీసులు చెప్తున్నారు. అకాడమీకి చెందిన రూ.కోట్ల చెక్కులను రూపొందించేది అకౌంట్స్ ఆఫీసర్ రమేష్ అయినా.. వాటిని నిర్వహించేది ఔట్ సోర్సింగ్ ఉద్యోగి రఫీక్ అని తెలిసింది. ఇతడి ద్వారానే యూబీఐ, కెనరా బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేయాల్సిన మొత్తాలకు సంబంధించిన చెక్కులు, కవరింగ్ లెటర్స్ రాజ్‌కుమార్‌కు చేరాయి. ఇదే అదునుగా భావించిన రాజ్‌కుమార్.. సోమశేఖర్, శ్రీనివాస్‌తో పాటు మరొకరి సాయంతో స్కామ్‌కు ప్లాన్ చేశాడు. అధికారుల నిర్లక్ష్యం... అకాడమీ నిధుల విషయంలో అధికారులు, సిబ్బంది పూర్తి నిర్లక్ష్యంగా ఉన్నారని సీసీఎస్ పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆదివారం మాజీ డైరెక్టర్ సోమిరెడ్డి, అకౌంట్స్ అధికారి రమేష్‌తో పాటు రఫీక్‌ను సీసీఎస్ పోలీసులు సుదీర్ఘంగా ప్రశ్నించారు. అకాడమీ నిధుల నిర్వహణ విషయంలో ఉద్దేశపూర్వక నిర్లక్ష్యంపై ఆరా తీశారు. రఫీక్, రాజ్‌కుమార్ మధ్య ఉన్న సంబంధాలపై దృష్టి పెట్టారు. వీరిలో కొందరికి నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. గడిచిన నెల రోజుల్లో అకాడమీలోని సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఫీడ్ మొత్తం తమకు అప్పగించాల్సిందిగా పోలీసులు అధికారులను కోరారు. అయితే దాన్ని ఇప్పటికే ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీకి అందించామని వాళ్లు వివరణ ఇచ్చారు. దీన్ని పరిశీలిస్తే రాజ్‌కుమార్ అకాడమీకి ఎప్పుడెప్పుడు వచ్చాడు? ఎవరెవరిని కలిశాడు? అనేదానిపై స్పష్టత వస్తుందని అధికారులు చెప్తున్నారు. ఈ కేసులో అదనపు ఆధారాలు సేకరించడానికి ఇప్పటికే అరెస్టు చేసిన నిందితులైన ఏపీ మర్కంటైల్ కో–ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ చైర్మన్ సత్యనారాయణరావు, మేనేజర్లు పద్మావతి, మెహినుద్దీన్లతో పాటు యూబీఐ బ్యాంకు కార్వాన్ బ్రాంచ్ మాజీ ఛీప్ మేనేజర్ మస్తాన్‌వలీ సాబ్‌ను న్యాయస్థానం అనుమతితో కస్టడీకి తీసుకోవా లని నిర్ణయించి పిటిషన్ దాఖలు చేశారు. -
వీరప్పన్‌కు ఇచ్చింది రూ.15 కోట్లు!
బనశంకరి: ఒకప్పటి కన్నడ సూపర్‌స్టార్ డాక్టర్ రాజ్‌కుమార్‌ను అపహరించిన గంథపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్‌కు ఆయన విడుదల కోసం కర్ణాటక సర్కారు భారీగా నగదు ముట్టజెప్పిందని ఎప్పటి నుంచో పుకార్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సమాచార పాత్రికేయుడు శివ సుబ్రమణ్యన్ రాసిన పుస్తకంలో పలు కొత్త అంశాలు వెలుగుచూశాయి. రాజ్‌కుమార్ విడుదల కోసం మూడు విడతులుగా మొత్తం రూ.15.22 కోట్లను అప్పటి ముఖ్యమంత్రి ఎస్ఎం.కృష్ణ ప్రభుత్వం వీరప్పన్‌కు అందజేసిందని పుస్తకంలో పేర్కొన్నారు. వీరప్పన్ జీవితంపై లైఫ్ అండ్ ఫాల్ ఆఫ్ వీరప్పన్ అనే పుస్తకాన్ని శివసుబ్రమణ్యన్ విడుదల చేశారు. 2000 జూలై 30 రాత్రి గాజనూరు ఫాంహౌస్ నుంచి రాజ్‌కుమార్‌తో పాటు మరో ముగ్గురిని వీరప్పన్ అపహరించి సత్యమంగళ అడవిలోకి తీసుకెళ్లాడు. 108 రోజుల తరువాత నవంబర్ 15న విడుదల చేశాడు. ఆ సమయంలో రాజ్‌కుమార్ కోసం లక్షలాదిమంది అభిమానులు పెద్దఎత్తున ధర్నాలకు దిగారు. రాజ్‌కుమార్ విడుదల కోసం మొదట డిమాండ్ చేసింది కోటి రూపాయలు. క్రమంగా ఆ మొత్తం పెరుగుతూ పోయింది. రూ.900 కోట్లు విలువచేసే బంగారం, రూ.100 కోట్ల నగదు అందించాలని డిమాండ్ పెట్టాడు. ఎస్ఎం కృష్ణ శాటిలైట్ ఫోన్లో వీరప్పన్‌తో చర్చలు జరిపి రెండుసార్లు రూ.5 కోట్లు చొప్పున, తుది విడతగా రూ.5.22 కోట్ల నగదును పంపించారని పుస్తకంలో తెలిపారు. కాగా, 2004, అక్టోబర్ 18న వీరప్పన్ ఎన్కౌంటర్లో చనిపోవడం తెలిసిందే. చదవండి: సీఎం కుర్చీ నుంచి నన్నెవరూ దింపలేరు -
మాజీ ఎమ్మెల్యే భిక్షపతి కుమారుడు మృతి
గచ్చిబౌలి: శేరిలింగంపల్లి మాజీ ఎమ్మెల్యే ఎం.భిక్షపతి యాదవ్ చిన్న కుమారుడు రాజ్ కుమార్ (35) అనారోగ్యంతో ఆదివారం రాత్రి జూబ్లీహిల్స్ అపోలో హస్పిటల్లో తుదిశ్వాస విడిచారు. భిక్షపతియాదవ్‌కు ఇద్దరు కూతుళ్లు, ముగ్గురు కొడుకులు ఉన్నారు. చిన్న కొడుకు రాజ్ కుమార్ కొంత కాలంగా కేన్సర్‌తో బాధపడుతూ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మసీద్‌బండలోని నివాసంలో పార్థీవదేహాన్ని ఉంచారు. సోమవారం మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహించారు. రాజ్‌కుమార్‌కు భార్య, ఓ కుమారుడు(25) ఉన్నారు. భిక్షపతి యాదవ్‌కు బంధువైన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మసీద్‌బండలో రాజ్‌కుమార్ అంతిమయాత్రలో పాల్గొన్నారు. ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు ఆరెకపూడి గాంధీ, జైపాల్ యాదవ్, బాల్క సుమన్, శ్రీధర్ బాబు, మాజీ మంత్రి కె.జానా రెడ్డి, మాజీ ఏపీ పీసీసీ అధ్యక్షులు రఘువీరా రెడ్డి, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మాజీ మంత్రి గడ్డం ప్రసాద్, మాజీ ఎమ్మెల్యేలు పద్మావతి, వంశీచందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకులు యోగానంద్, కార్పొరేటర్లు రాగం నాగేందర్‌యాదవ్, హమీద్‌పటేల్, జగదీశ్వర్ గౌడ్, బొబ్బ నవతా రెడ్డి, దొడ్ల వెంకటేష్ గౌడ్, వివిధ పార్టీల నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు రాజ్ కుమార్ యాదవ్ పార్థీవ దేహం పై పూల మాలలు ఉంచి నివాళులర్పించారు. భిక్షపతియాదవ్ కుటుంబ సభ్యులను పలువురు పరామర్శించారు. -
పునాదిరాళ్లు డైరెక్టర్ రాజ్‌కుమార్ కన్నుమూత
-
చిరంజీవి తొలి సినిమా దర్శకుడు మృతి
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు గూడపాటి రాజ్‌కుమార్ కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం ఉదయం హైదరాబాద్‌లో తుది శ్వాస విడిచారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన తొలి సినిమా ‘పునాదిరాళ్లు’ కు రాజ్‌కుమార్ దర్శకత్వం వహించారు. దర్శకుడిగా ఆయనకు కూడా పునాదిరాళ్లు మొదటి సినిమా. తొలి సినిమాకే ఐదు నంది అవార్డులు దక్కాయి. 1977లో ‘పునాదిరాళ్లు’కు కథ రాసుకోగా, 1978లో ఈ సినిమాను తెరకెక్కించారు. ఆ తర్వాత ఈ సమాజం నాకొద్దు, మన ఊరి గాంధీ, మా సిరిమల్లెతో కలిపి దాదాపు ఎనిమిది సినిమాలకు దర్శకుడిగా వ్యవహరించారు. (చదవండి : ‘పునాదిరాళ్ల’కు పుట్టెడు కష్టం) చిరంజీవితో రాజ్‌కుమార్ కాగా కొన్ని రోజుల నుండి గుడిపాటి రాజ్ కుమార్ అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దీంతో ఈ విషయం తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి ఇటీవలే ఆయనకు అపోలో ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. ప్రసాద్స్ క్రియేటివ్ మెంటర్స్ ఫిలిం మీడియా స్కూల్ మేనేజింగ్ పార్ట్నర్ సురేష్‌రెడ్డి రూ.41వేలు, ‘మనం సైతం’ తరపున నటుడు కాదంబరి కిరణ్‌కుమార్ రూ.25 వేలు, దర్శకుడు పూరీ జగన్నాథ్ రూ.50 వేలు, మరో దర్శకుడు మెహర్ రమేష్ రూ.10 వేలు, సినీయర్ డైరెక్టర్ కాశీవిశ్వనాథ్‌రూ.5 వేలు చొప్పున గుడిపాటి రాజ్ కుమార్‌కు ఆర్థిక సహాయం అందించారు. ఇటీవల గుడిపాటి రాజ్ కుమార్ పెద్ద కుమారుడు అనారోగ్యంతో మృతి చెందగా.. ఆ బాధ తట్టుకోలేక ఆ తర్వాత భార్య చనిపోవడం రాజ్ కుమార్‌ను ఒంటరివాడిని చేసింది. ఒంటిరి బతుక్కు తోడు సంపాదన లేక అద్దె ఇంట్లో బాధలు పడుతూ వెళ్లదీస్తున్న దర్శకుడు ఈరోజు ఉదయం మృతిచెందారు. (చదవండి : రాజ్‌కుమార్‌కు సినీ ప్రముఖుల చేయూత) కృష్ణాజిల్లా ఉయ్యూరుకు చెందిన రాజ్‌కుమార్ విజయవాడలో డిగ్రీ పూర్తి చేసి 1966లో హైదరాబాద్‌కు వచ్చారు. ఇక్కడ ఫిజికల్ ఎడ్యుకేషన్‌లో శిక్షణ పొంది రెండేళ్ల పాటు నారాయణగూడ కేశవ మెమోరియల్ స్కూల్లో ఫిజికల్ డైరెక్టర్‌గా పని చేశారు. ఆ సమయంలోనే సినిమాలపై ఇష్టం పెరిగింది. మంచి ఇతివృత్తాలతో సినిమా తీస్తే బాగుంటుందని భావించారు. కాలేజీ చదివే రోజుల్లోనే నాటకాలు వేస్తూ పాటలు కూడా పాడేవారు. ఆ అనుభవాన్ని సినిమాల్లో రంగరించాలనుకున్నారు. పాతబస్తీ జహనుమాలోనా సదరన్ మూవీస్ స్టూడియోలోకి అడుగుపెట్టారు. తన ఆశయాన్ని నిర్వాహకులతో చెప్పారు. సతీ అనసూయ, రహస్యం సినిమాలకు కో–డైరెక్టర్‌గా పని చేశారు. ఆ స్టూడియోలో మరాఠీ, హిందీ సినిమాల షూటింగ్‌లు జరుగుతుండేవి. రాజ్‌కుమార్ ఆసక్తిని గమనించిన ఆ సినిమాల దర్శకులు కో–డైరెక్టర్‌గా అవకాశమిచ్చారు. అక్కడి నుంచి రాజ్‌కుమార్‌కు సినిమాలపై నమ్మకం పెరిగింది. తన అనుభవంతో ‘పునాదిరాళ్లు’ అనే సినిమాకు కథ రాసుకున్నారు. 1977లో ఈ సినిమా కథ రాసుకోగా, 1978లో ఈ సినిమా నిర్మాణానికి పూనుకున్నారు. (చదవండి : టాలీవుడ్లో మరో విషాదం) -
తోడబుట్టిన అన్నే తల నరికాడు!
సాక్షి, పుట్లూరు : పొలాన్ని ఇతరులకు కౌలుకు ఇవ్వడాన్ని జీర్ణించుకోలేని ఓ అన్న సొంత తమ్ముడి తలను తెగనరికి పొలాల్లోకి విసిరేసిన ఘటన అనంతపురం జిల్లా పుట్లూరు మండలంలో శనివారం ఉదయం చోటు చేసుకుంది. శనగలగూడూరు గ్రామానికి చెందిన రాజ్‌కుమార్ తన పొలాన్ని అన్న రామాంజినేయులుకు 10 సంవత్సరాలుగా కౌలుకు ఇస్తున్నాడు. అయితే అతను పంట పండించుకుంటున్నా కౌలు డబ్బు ఇవ్వకపోవడంతో ఇద్దరి మధ్య మనస్పర్థలు చోటు చేసుకున్నాయి. ఈ ఏడాది రాజ్‌కుమార్ తన భూమిని అన్నకు కాకుండా గ్రామానికి చెందిన ఇతరులకు కౌలుకు ఇవ్వడంతో రామాంజినేయులు జీర్ణించుకోలేకపోయాడు. రాజ్‌కుమార్ భూమిని కౌలుకు తీసుకున్న వ్యక్తులు ఆ పొలంలో పప్పుశనగను సాగు చేశారు. అయితే వర్షాభావం వల్ల పప్పుశనగకు పొలం పక్కనే ఉన్న నీటికుంట ద్వారా తడులు అందించడానికి కౌలుదారులు ప్రయత్నించగా రామాంజినేయులు అడ్డుకున్నాడు. ఇదే విషయాన్ని కౌలుదారులు చెప్పడంతో శనివారం పొలం వద్దకు వెళ్లిన రాజ్‌కుమార్‌తో పాటు కౌలుదారులైన వెంకటరెడ్డి, శ్రీనివాసులరెడ్డి కళ్లలో కారం కొట్టిన రామాంజినేయులు అతని కుమారుడు మధుతో కలిసి అత్యంత దారుణంగా రాజ్‌కుమార్ తలను వేరు చేసి పొలాల్లోకి విసిరేశాడు. హత్య జరిగిన ప్రదేశాన్ని తాడిపత్రి రూరల్ సీఐ దేవేంద్రకుమార్, ఎస్ఐ వెంకటప్రసాద్ పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలిస్తున్నారు. సొమ్మసిల్లిన భార్య.. రాజ్‌కుమార్ హత్య విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. తల లేని భర్త మొండేన్ని చూసి భార్య లక్ష్మిదేవి సొమ్మసిల్లి పడిపోయింది. మృతుడి ఇద్దరు కుమార్తెలు తిరుపతిలో చదువుకుంటున్నారు. -
రెండు రోజులుగా రైలు టాయిలెట్లోనే..
సాక్షి, నరసాపురం: రైల్వే సిబ్బంది నిర్లక్ష్యం ఓ వ్యక్తి ప్రాణాల మీదకు తెచ్చింది. టాయిలెట్‌కు వెళ్లి స్పృహతప్పి పడిపోయిన వ్యక్తి రెండు రోజులు అందులోనే ఉండిపోయాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించి గురువారం బాధితుడి కుమారుడు రాజ్‌కుమార్ తెలిపిన వివరాలు.. హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న రాజ్‌కుమార్ వద్దకు అతని తండ్రి నర్సీరావు తరచూ వెళ్లి వస్తుంటాడు. గత నెల 31న రాత్రి ఏడు గంటలకు నరసాపూర్ ఎక్స్‌ప్రెస్‌లో హైదరాబాద్ బయలుదేరాడు. అయితే మార్గం మధ్యలో టాయిలెట్‌కు వెళ్లిన ఆయన అందులోనే స్పృహతప్పి పడిపోయాడు. మర్నాడు ఉదయం 6 గంటలకు రైలు నాంపల్లి స్టేషన్‌కు చేరుకుంది. అక్కడ బోగీలను తనిఖీచేసి, శుభ్రం చేసే సిబ్బంది లోపల గడియపెట్టి ఉన్న బోగీని పట్టించుకోలేదు. అదే రోజు రాత్రి నాంపల్లి నుంచి బయలుదేరిన రైలు రెండో తేదీ ఉదయం నరసాపురం చేరుకుంది. అక్కడ బోగీని కడిగే సమయంలో సిబ్బంది.. టాయిలెట్ లోపల ఎవరో ఉండిపోయారన్న విషయాన్ని గుర్తించారు. గడియ పగులగొట్టి లోపల అపస్మారక స్థితిలో ఉన్న నర్సీరావును నరసాపురంలోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. ఆయన జేబులో ఉన్న బుక్‌లో ఫోన్ నంబరు ఆధారంగా కుమారుడికి సమాచారం ఇచ్చారు. తన తండ్రిని ఎవరూ పట్టించుకోలేదని.. ఫోన్, డబ్బులు అపహరించారని రాజ్‌కుమార్ వాపోయాడు. రైలు ఎక్కిన తన తండ్రి హైదరాబాద్ రాకపోవడంతో ఒకటో తేదీనే రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పాడు. -
వైభవంగా యువరాజ్ వివాహం
యశవంతపుర: కన్నడ కంఠీరవుడు, దివంగత రాజ్‌కుమార్ ఇంటిలో పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. రాఘవేంద్ర రాజ్ కుమార్ కుమారుడు యువరాజ్ కుమార్ వివాహం మైసూరుకు చెందిన శ్రీదేవితో ఆదివారం బెంగళూరు ప్యాలెస్ మైదానంలో వైభవంగా జరిగింది. వివాహానికి సినిమా రంగానికి చెందిన పలువురు ప్రముఖులు, బంధుమిత్రులు పెద్ద ఎత్తున హాజరై వధూవరులను ఆశీర్వదించారు. శనివారం రాఘవేంద్ర రాజ్‌కుమార్ ఇంటిలో పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. ఆదివారం రాత్రి రిసెప్షన్లో తమిళ, తెలుగు, హిందీ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. -
వైద్యులు... ఇక్కడ విద్యార్థులు!!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ‘నిరంతర విద్యార్థి’.. ఇది వైద్యులకు పక్కాగా వర్తిస్తుంది. ఎందుకంటే? వైద్య రంగంలో వస్తున్న మార్పులు, అధునాతన శస్త్ర చికిత్స విధానాలు, మెడికల్ టెక్నాలజీ, వ్యాధులు, చికిత్స మార్గాలు వంటివి నేర్చుకుంటూ ఉండాలి. మరి డాక్టర్లు వృత్తిని వదిలి.. పుస్తకాలు పట్టుకొని రోజూ శిక్షణ తరగతులకు వెళ్లాలా? అవసరమే లేదంటోంది బెంగళూరుకు చెందిన మెడినిట్. జస్ట్! వైద్యులు మెడినిట్‌లో నమోదైతే చాలు.. ప్రపంచంలోని ప్రముఖ డాక్టర్లు, వైద్య వర్సిటీలు, మెడికల్ అసోసియేషన్స్ ప్రచురించే జర్నల్స్, వైద్య కోర్సుల కంటెంట్, ఆడియో, వీడియో వంటివన్నీ పొందొచ్చు. డాక్టర్లకే శిక్షణ ఇస్తున్న మెడినిట్ గురించి మరిన్ని వివరాలు ఫౌండర్ డాక్టర్ భాస్కర్ రాజ్ కుమార్ ‘స్టార్టప్ డైరీ’తో పంచుకున్నారు. 2010లో రష్యాలో రేడియాలజీలో ఎండీ పూర్తయ్యాక.. బెంగళూరులోని పలు కార్పొరేట్ ఆసుపత్రుల్లో చేరా. ఆ తర్వాత ఓ ప్రముఖ హెల్త్‌కేర్ టెక్నాలజీ కంపెనీలో ఆరేళ్లు పనిచేశా. మెడికల్ టెక్నాలజీ మీద శిక్షణ నిమిత్తం వందలాది డాక్టర్లను కలిసేవాణ్ణి. అప్పుడు తెలిసిందేంటంటే.. నేర్చుకునే సమయం, సరైన వేదిక రెండూ లేకపోవటంతో చాలా మంది డాక్టర్లు సంపాదనకే వృత్తిని అంకితం చేస్తున్నారని!. ఇదే మెడినిట్కు బీజం వేసింది. స్నేహితుడు సురేందర్ పరుసురామన్తో కలిసి 2016లో రూ.45 లక్షల పెట్టుబడితో బెంగళూరు కేంద్రంగా మెడినిట్ను ప్రారంభించాం. ప్రపంచంలోని ప్రముఖ డాక్టర్లు, సంఘాలు, వర్సిటీలు రూపొందించే వైద్య కోర్సులు, వెలువరించే జర్నల్స్, కంటెంట్, రకారకాల వ్యాధులు, చికిత్స మార్గాలకు సంబంధించిన వీడియోలు వంటివి మెడినిట్‌లో పొందే వీలుండటమే మా ప్రత్యేకత. ప్రస్తుతం 28; ఏడాదిలో 65 కోర్సులు.. ప్రస్తుతం మెడినిట్‌లో 28 రకాల వైద్య కోర్సులున్నాయి. డిప్లొమా ఇన్ మినిమల్ యాక్సెస్ సర్జరీ, ఫెలోషిప్ ఇన్ మినిమల్ యాక్సెస్ సర్జరీ, ఏఏఎస్ స్కిల్ కోర్స్ బేసిక్ అండ్ అడ్వాన్స్డ్ ఆర్థోస్కోపిక్ సర్జరీ: నీ అండ్ షోల్డర్, ఫెలోషిప్ ఇన్ డయాబెటిక్ ఫుట్ మేనేజ్మెంట్, సర్టిఫికెట్ కోర్స్ ఇన్ మేనేజ్మెంట్ ఆఫ్ డిమోన్టియా వంటివి వీటిల్లో కొన్ని. రిజిస్టర్ చేసుకున్న డాక్టర్స్ అభ్యర్థులు ఆయా కోర్సుల ఆడియో, వీడియో కంటెంట్‌తో పాటూ వైద్య సంఘాల లెక్చర్స్, సెమినార్స్ పొందవచ్చు. కోర్సుల కాల పరిమితి 3 వారాల నుంచి ఏడాది వరకుంటుంది. కోర్సు, కాలపరిమితిని బట్టి ధరలు రూ.5 వేల నుంచి రూ.1.5 లక్షల వరకుంటాయి. వచ్చే ఏడాది 65 కోర్సులను అందుబాటులోకి తీసుకురావటంతో పాటూ అగ్మెంటెడ్ రియాలిటీ(ఏఆర్), వర్చువల్ రియాలిటీ(వీఆర్) టెక్నాలజీ ఆధారిత కంటెంట్‌నూ అందుబాటులోకి తీసుకురానున్నాం. వర్సిటీలు, సంఘాలు, ఆసుపత్రులతో జట్టు కోర్సుల రూపకల్పన, వ్యాధుల రకాలు, నివారణ, టెక్నాలజీ వంటి వాటిపై శిక్షణ కోసం మన దేశంతో పాటూ సింగపూర్, ఫిలిప్పీన్స్, మలేషియా, ఆస్ట్రేలియా దేశాల్లోని ప్రముఖ మెడికల్ యూనివర్సిటీలు, వైద్య సంఘాలతో ఒప్పందం చేసుకున్నాం. మన దేశంలో జీఈఎం టెలివర్సీటీ, కాలేజ్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ మినిమల్ యాక్సెస్ సర్జన్స్ ఆఫ్ ఇండియా, డిమెన్షియా అకాడమీ, ఇండియన్ నేషనల్ అసోసియేషన్ ఫర్ లివర్ (ఐఎన్ఏఎస్ఎల్), ఇంటర్నేషనల్ హిపాటో పాన్క్రీటో బిలియరీ అసోసియేషన్ (ఐహెచ్‌పీబీఏ), ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ డర్మటాలజిస్ట్, వెనిరోలాజిస్ట్ అండ్ లెప్రోలాజిస్ట్, ఇండియన్ రేడియాలజీ అండ్ ఇమేజింగ్ అసోసియేషన్(ఐఆర్‌ఐఏ), అసోసియేషన్ ఆఫ్ ఓరల్ అండ్ మాక్సిలోఫేసియల్ సర్జన్స్ ఆఫ్ ఇండియా (ఏఓఎంఎస్ఐ), ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ వంటి సంఘాలున్నాయి. రూ.20 కోట్ల ఆదాయం.. ప్రస్తుతం మెడినిట్‌లో 65 వేల మంది వైద్యులు నమోదయ్యారు. వీరిలో 2,500 మంది వార్షిక సబ్స్క్రిప్షన్ డాక్టర్స్. తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 7 వేల మంది వైద్యులుంటారు. గ్లోబల్, కేర్, కిమ్స్, ఏసియన్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ వంటి ఆసుపత్రులతో పాటూ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ గ్యాస్ట్రోటెస్టినల్ ఎండ్రో సర్జన్స్ (ఐఏజీఈఎస్), సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అసోసియేషన్ వంటి సంఘాలతో ఒప్పందాలున్నాయి. ఏడాది కాలంలో 2 లక్షల మంది వైద్యుల నమోదు, మరో 30 సంఘాలను జత చేయాలన్నది టార్గెట్. 2 నెలల్లో రూ.72 కోట్ల నిధుల సమీకరణ.. గతేడాది రూ.3 కోట్ల ఆదాయాన్ని ఆర్జించాం. వచ్చే ఏడాది రూ.20 కోట్లు లకి‡్ష్యంచాం. త్వరలోనే మధ్య ప్రాచ్యం, దుబాయ్, అబుదాబి దేశాల్లో సేవలందించనున్నాం. ఆ తర్వాత అమెరికా, యూకేలకు విస్తరిస్తాం. ‘‘ప్రస్తుతం కంపెనీలో 41 మంది ఉద్యోగులున్నారు. జూన్‌కి మరో 100 మందిని నియమించుకోనున్నాం. ఇప్పటివరకు ఏంజిల్ ఇన్వెస్టర్ల నుంచి రూ.3 కోట్లను సమీకరించాం. 2 నెలల్లో రూ.72 కోట్లను సమీకరించనున్నాం. మన దేశంతో పాటూ విదేశాల్లోని వీసీ ఇన్వెస్టర్లతో చర్చ లు జరుగుతున్నాయని’’ భాస్కర్ వివరించారు. వైజాగ్‌లో శిక్షణ కేంద్రం.. ప్రస్తుతం బెంగళూరు, ఢిల్లీలో స్థానిక వైద్య సంఘాలతో కలిసి ఆఫ్‌లైన్‌లో శిక్షణ కేంద్రాలున్నాయి. తొలిసారిగా సొంతంగా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. ఇటీవలే ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలతో చర్చిం చాం. ఏపీ ప్రభుత్వంతో కలిసి విశాఖపట్నం లోని మెడ్‌టెక్ జోన్లో రూ.50 కోట్ల పెట్టుబడులతో సిమ్యులేషన్ జోన్‌ను ఏర్పాటు చేయనున్నాం. జనవరి నుంచి కార్యకలాపాలు ప్రారంభమవుతాయి. మౌలిక వసతులు, రాయితీలు కల్పిస్తే తెలంగాణలోనూ ఏర్పాటు చేస్తాం. -
రాజ్‌కుమార్‌కు అమితాబ్ అభిమాని
యశవంతపుర: దివంగత నటుడు రాజ్‌కుమార్‌కు తన తండ్రి అభిమాని అని ప్రఖ్యాత బాలీవుడ్ హీరో అమితాబచ్చన్ తనయుడు అభిషేక్ బచ్చన్ అన్నారు. ఆయన బుధవారం తను నటించిన కొత్త సినిమా మన్ మర్జియా సినిమా ప్రచారం కోసం బెంగళూరుకు వచ్చారు. ఈ సందర్భంగా కన్నడ కంఠీరవ– అమితాబ్‌ల మధ్యనున్న అనుబంధాన్ని అభిషేక్ జ్ఞాపకం చేసుకున్నారు. తన తండ్రి అమితాబ్ రాజ్‌కుమార్ అభిమాని, ఆయనంటే మాకు కూడా ఎంతో గౌరవం ఉందన్నారు. తను కూడా రాజ్‌కుమార్‌కు అభిమానినని తెలిపారు. దక్షిణాదిలో కూడా మంచి సినిమాలు విడుదలవుతున్నట్లు చెప్పారు. రాజ్‌కుమార్ హిందీ సినిమాలలో నటించి ఉంటే తనకు ఇన్ని సినిమాలో నటించే అవకాశం వచ్చేవి కాదని అమితాబ్ చెప్పేవారని అన్నారు.