‘షరీక్’ హోజాయ్!
ఎంటర్‌టైన్‌మెంట్
‘చిరుసవ్వడి-పెను ఘోష’ పియానో ప్రత్యేకత! సమకాలీన పియానిస్ట్‌లలో వరల్డ్‌క్లాస్ ఆర్టిస్ట్ షరీక్ హసన్. పియానోకు హిందుస్తానీ రాగాలనూ నేర్పాడు! ఫ్రాన్స్, అమెరికాలలో టాప్ మ్యూజిక్ కాలేజీల్లో జాజ్ సంగీతం నేర్చుకున్నాడు.
బ్లూస్-పాప్-హిందుస్తానీ క్లాసిక్స్‌తో తనదైన ‘ట్యూన్’ సాధించాడు!
హసన్ నేతృత్వంలో ఏర్పడిన - నెదర్లాండ్‌కు చెందిన ట్రంపెటీర్ ఫిలిప్ లెమ్-రోమ్‌కు చెందిన బాస్ వాద్య నిపుణుడు మార్కొ జెనిని-ఇండియాకు చెందిన శాక్సాఫోనిస్ట్ పవన్ బెంజిమిన్‌లు ‘షరీక్ హసన్ క్వార్టెట్’ గా ఏర్పడ్డారు! ఫ్రాన్స్, యుఎస్‌లలో మ్యూజిక్ లవర్స్‌ను ‘క్వార్టెట్’ ఫ్లాట్ చేసేసింది! రచ్చ గెలిచిన ఆ రాగాలను ఇంట విన్పించేందుకు ఇండియా టూర్ చేస్తున్నాడు షరీక్!
జూన్ 19న ముంబైలో ‘వోవ్’లు అందుకున్న ‘క్వార్టెట్’ నగరానికి ‘మాన్‌సూన్ రెగెటా’ (రాగ వర్షాలు) తెస్తోంది!
అంతేనా? మ్యూజిక్ లవర్స్ హసన్ హసన్ టీంతో షరీకయ్యే ఛాన్స్ కూడా ఉంది!
2న ‘హెచ్‌ిపీఎస్’లో వర్క్‌షాప్
యంగ్ మ్యుజీషియన్స్‌ను ఎంకరేజ్ చేసేందుకు హసన్ నేతృత్వంలోని ‘జాజ్ ట్రియో’ హైద్రాబాద్ పబ్లిక్ స్కూల్‌లో (హెచ్‌పిఎస్) జులై 2వ తేదీ సాయంత్రం 2-30 గంటల నుంచి 4-30 గంటల వరకూ వర్క్‌షాప్‌లో పాల్గొంటోంది. బాస్, డ్రమ్స్, పియానోలలో ఆసక్తి ఉన్నవారు, వీలైతే తమ సంగీత పరికరాలను తెచ్చుకుని వరల్డ్ ఫేం ట్రియోకు తమ ప్రావీణ్యతను ప్రదర్శించవచ్చు. సందేహాలను తీర్చుకోవచ్చు. సలహాలను గ్రహించవచ్చు. ఈ అవకాశాన్ని హైద్రాబాద్ వెస్ట్రన్ మ్యూజిక్ ఫౌండేషన్-గోథె జంత్రమ్ నగర యువతకు ఉచితంగా కల్పిస్తోంది.
3న మారియట్‌లో ‘క్వార్టెట్’
నలుగురు సభ్యుల మ్యూజికల్ బృందాన్ని క్వార్టెట్ అంటారు. హసన్ నేతృత్వంలో ఏర్పడిన - నెదర్లాండ్‌కు చెందిన ట్రంపెటీర్ ఫిలిప్ లెమ్-రోమ్‌కు చెందిన బాస్ వాద్య నిపుణుడు మార్కొ జెనిని-ఇండియాకు చెందిన శాక్సాఫోనిస్ట్ పవన్ బెంజిమిన్‌ల ‘షరీక్ హసన్ క్వార్టెట్’ ట్యాంక్‌బండ్ సమీపంలోని మారియట్ హోటల్‌లో 3వ తేదీ సాయంత్రం 7.30 గంటల నుంచి మాన్సూన్ జాజ్ విన్పించనుంది. హెదరాబాద్ యాచ్ క్లబ్, స్పోర్ట్స్ యాక్టివిటీస్‌కి సహాయంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. డోనర్ పాస్ (రూ.2,500-1000-250)లను ఆన్‌లైన్‌లో జ్ట్టిఞ://జీ.ఛౌౌజుఝడటజిౌఠీ.ఛిౌఝ/జిడఛ్ఛీట్చఛ్చఛీ గానీ, 040-23350473 నెంబర్‌కు ఫోన్ చేసి కానీ పొందవచ్చు.
షక్కర్ కే పాంచ్ దానే
రాజ్‌కుమార్ ... అతని కుటుంబంలోని నలుగురు వ్యక్తులు, ఒక ట్రక్కువాలా, ఐదు చక్కెర గుళికల చుట్టూ తిరిగే కథే షక్కర్ కే పాంచ్ దానే. మానవ్ కౌల్ దీనిని రూపొందించి, దర్శకత్వం వహించారు. సంగీతం కూడా అందించారు. కృష్ణ శుక్ల లైటింగ్ ఈ నాటికకు ప్రత్యేక ఆకర్షణ. సిద్ధేశ్ ధర్మాధికారి గంటపాటు ప్రదర్శించే ఈ హిందీ స్వగతం ఆలోచింపజేస్తుంది.
వేదిక : లామకాన్, బంజారాహిల్స్
సమయం : జులై 1,2 తేదీల్లో, రాత్రి 8 గంటలకు