పెళ్లి చెయ్యండి అని ఇంటికెళ్తే కుళ్ల బొడిచి గెంటేశారు: రాజ్ కుమార్ | Senior Actor VV Raj Kumar Love Story In Telugu | Sakshi
Sakshi News home page

తాళి కడితే తీసి పారేశారు.. కుళ్ల బొడిచి గెంటేశారు.. సీనియర్‌ నటుడు రాజ్‌ కుమార్‌ లవ్‌స్టోరీ!

Published Sun, Oct 8 2023 2:51 PM | Last Updated on Sun, Oct 8 2023 3:43 PM

Senior Actor VV Raj Kumar Love Story In Telugu - Sakshi

సీనియర్‌ నటుడు రాజ్‌ కుమార్‌ గురించి ఈ జనరేషన్‌కి పెద్దగా తెలియకపోవచ్చు కానీ నైంటీస్‌ కిడ్స్‌కి మాత్రం బాగా తెలుసు. అప్పట్లో ఆయనను బుల్లితెర మెగాస్టార్‌ అనేవాళ్లు. చూడ్డానికి చిరంజీవిలా ఉండటంతో ఆయనకి ఈ పేరు వచ్చింది. ‘అమ్మ రాజీనామా’ సినిమాతో వెండితెరపై అడుగు పెట్టాడు రాజ్‌ కుమార్‌. కొన్నాళ్ల తర్వాత చిరంజీవి పోలీకలు ఉండడంతో తెలుగులో అవకాశాలు రాలేదు. దీంతో కన్నడ ఇండస్ట్రీకి వెళ్లాడు.

ఇలా దక్షిణాది సినిమాలతో పాటు సీరియళ్లలో నటించి.. తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటీవల సినిమాలకు దూరంగా ఉంటున్న రాజ్‌ కుమార్‌  ఆ మధ్య  ఓ యూట్యూబ్‌ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ప్రేమ, పెళ్లి విషయాలను పంచుకున్నాడు. 

(చదవండి: నా కూతురిని చూసి గర్విస్తున్నా'.. బిగ్‌బాస్‌ గొడవపై స్పందించిన నటి!)

నాది ప్రేమ పెళ్లి. చెన్నైలో ఉన్నప్పడు.. నేను నేను ఉన్న ఇంటికి ఎదురుగా ఉన్న ఇంట్లో నా భార్య ఉండేది. రోజు కిటికిలో నుంచి ఇద్దరం చూసుకునే వాళ్లం కానీ మాట్లాడుకోలేదు. ఒక రోజు ఫోన్‌లో మాట్లాడుకొని పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. అంతే మరుసటి రోజు నుంచి ఆమె కనిపించలేదు. మా ప్రేమ గురించి వాళ్ల ఇంట్లో తెలియడంతో..వేరే ఏరియాకు షిఫ్ట్‌ అయ్యారు.

దాదాపు 5 ఏళ్లు దూరంగా ఉన్నాం. ఓ సారి ధైర్యం చేసి వాళ్లింటికి వెళ్లాను. మీ అమ్మాయిని నాకిచ్చి పెళ్లి చేయండి అని మా మాయయ్య అడిగితే.. కుళ్లబొడిచి బయటకు పంపించేశారు. కొన్నాళ్ల తర్వాత ఆమెనే ఫోన్‌ చేసి.. ఇంటికి వచ్చి డైరెక్ట్‌ తాళి కట్టు అని చెప్పింది. దీంతో వెంటనే ఇంటికెళ్లి ఆమె మెడలో తాళి కట్టి.. ఇంట్లో వాళ్ల ముందు నిలబడ్డాం.

అప్పుడు అంతా వచ్చి నన్ను కొట్టి.. ఆమెను తీసుకెళ్లారు. తాళి తీసి పారేశారు. మూడేళ్ల తర్వాత అంటే 1995లో ఇంట్లో చెప్పకుండా ఇద్దరం కలిసి లేచిపోయాం. దాదాపు ఏడాది పాటు ఎవరికి కనిపించకుండా ఉన్నాం. బాబు పుట్టిన తర్వాత మా అడ్రస్‌ వాళ్లకు తెలిసింది. కొన్నాళ్ల తర్వాత వాళ్లే మా దగ్గరకు వచ్చారు. ఆ తర్వాత మా మామయ్యకు నేను పెద్ద కొడుకును అయ్యాను’అని రాజ్‌ కుమార్‌ తన లవ్‌స్టోరీని చెప్పుకొచ్చాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement