ఒకప్పుడు బాలీవుడ్‌లో మాఫియా డాన్‌ల హవా కొనసాగేది. దర్శక నిర్మాతలతో పాటు హీరోహీరోయిన్లతో కూడా వాళ్లకు పరిచయం ఉండేది. ఆ పరిచయం కొందరికి వరంగా మారితే..మరికొందరికి మాత్రం శాపంగా మారింది. మాఫియా డాన్‌తో ప్రేమలో పడి కెరీర్‌ని నాశనం చేసుకోవడమే కాదు.. జైలుకు కూడా వెళ్లింది ఓ హీరోయిన్. ఆ హీరోయిన్ పేరే మోనికా బేడి(Monica Bedi). పంజాబ్‌లోని హోషియార్‌పూర్ జిల్లా చబ్బేవాల్ గ్రామంలో జన్మించిన ఈ బ్యూటీ ఢిల్లీ విశ్వవిద్యాలయం విద్యాభ్యాసం పూర్తి చేసింది. ఆమె తల్లిదండ్రులు 1979లో నార్వేలోని డ్రామెన్‌కి మారారు.
డాన్‌తో ప్రేమలో..
మోనికా బేడి కెరీర్ పీక్స్‌లో ఉన్న సమయంలో మాఫియా డాన్ అబు సలేంతో ప్రేమలో పడింది. అది కూడా విచిత్రంగానే జరిగింది. అబు ఎవరనేది కూడా మొదట్లో మోనికాకు తెలియదు. అతను డాన్ అనే విషయం తెలియకుండానే ప్రేమలో పడిపోయానని ఓ ఇంటర్వ్యూలో మెనికా చెప్పింది. ‘దుబాయ్‌లో ఈవెంట్ కోసం నాకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. ఆ ఫోన్ చేసింది అబు సలేం. ఈవెంట్ కోసం నేను దుబాయ్ వెళ్లినప్పుడు మొదటి సారిగా అబుని కలిశాను. చాలా బాగా చూసుకున్నాడు. అప్పుడప్పుడు కాల్ చేసి మాట్లాడేవాడు. అలా 9 నెలల పాటు ఫోన్‌లోనే మాట్లాడుకున్నాం. అతని మాటలు, కేరింగ్ నచ్చి ప్రేమలో పడిపోయాను.అతని కోసం దుబాయ్ కూడా వెళ్లాను. ప్రేమలో ఉన్నప్పుడు గంటకోసారి ఫోన్ చేసేవాడు. అయితే అతను వ్యాపారవేత్త అనే నాకు తెలుసు. దుబాయ్‌లో బిజినెస్ చేస్తున్నాంటే నాతో చెప్పాడు. అతను డాన్ అనే విషయం నాకు తెలియదు. పేరు కూడా మార్చి చెప్పాడు’ అని మెనికా చెప్పింది.
ఐదేళ్లు జైలు శిక్ష!
అబుతో ప్రేమలో పడిన తర్వాత మెనికా ఇండస్ట్రీకి దూరం అవుతూ వచ్చింది. సినిమాలు తగ్గించి ఎక్కువ సమయం అతనితోనే గడిపింది. 2002లో సెప్టెంబరు 2002లో, నకిలీ పత్రాలపై దేశంలోకి ప్రవేశించినందుకు పోర్చుగల్ లో ఆమెతో పాటు అబూ సలేం అనే భారతీయ గ్యాంగ్‌స్టర్ అరెస్టు చేశారు. ఆ తరువాత ఆమె ఐదేళ్లు జైలు శిక్ష సైతం అనుభవించింది. ఇలా మాఫియా డాన్‌తో పరిచయమే ఆమె కెరీర్‌ని నాశనం చేసింది. లేదంటే మెనికా బాలీవుడ్‌లో ఓ స్టార్ హీరోయిన్‌గా కొనసాగేది.
తెలుగులోనూ సినిమాలు..
శ్రీకాంత్ హీరోగా నటించి తాజ్ మహల్ సినిమాతో హీరోయిన్ ఎంట్రీ ఇచ్చిన మోనికా.. త తర్వాత బాలీవుడ్‌కి వెళ్లి అక్కడ స్టార్ హీరోయిన్‌గా వెలుగొందింది. షారుఖ్, సల్మాన్ లాంటి బాలీవుడ్ స్టార్ హీరోలందరితోనూ నటించింది. అలాగే తెలుగులో శివయ్య , సోగ్గాడి పెళ్ళాం, సర్కస్ సత్తిపండు, చూడాలని వుంది (1998) సినిమాలతో అలరించింది. హిందీ బిగ్‌బాస్ సీజన్ 2 తో పాటు పలు టీవీ షోల్లో పాల్గొంది. ఈ మధ్య కాలంలో ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది. ప్రస్తుతం మెనికా ఎక్కడ ఉంది, ఏం చేస్తుందనే విషయాలు మాత్రం బయటకు రావడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment