Monica Bedi
-
మాఫియా డాన్‌తో ప్రేమాయణం.. జైలుకెళ్లిన ఈ నటి గుర్తుందా?
ఒకప్పుడు బాలీవుడ్లో మాఫియా డాన్ల హవా కొనసాగేది. దర్శక నిర్మాతలతో పాటు హీరోహీరోయిన్లతో కూడా వాళ్లకు పరిచయం ఉండేది. ఆ పరిచయం కొందరికి వరంగా మారితే..మరికొందరికి మాత్రం శాపంగా మారింది. మాఫియా డాన్‌తో ప్రేమలో పడి కెరీర్‌ని నాశనం చేసుకోవడమే కాదు.. జైలుకు కూడా వెళ్లింది ఓ హీరోయిన్. ఆ హీరోయిన్ పేరే మోనికా బేడి(Monica Bedi). పంజాబ్‌లోని హోషియార్పూర్ జిల్లా చబ్బేవాల్ గ్రామంలో జన్మించిన ఈ బ్యూటీ ఢిల్లీ విశ్వవిద్యాలయం విద్యాభ్యాసం పూర్తి చేసింది. ఆమె తల్లిదండ్రులు 1979లో నార్వేలోని డ్రామెన్‌కి మారారు.డాన్‌తో ప్రేమలో..మోనికా బేడి కెరీర్ పీక్స్‌లో ఉన్న సమయంలో మాఫియా డాన్ అబు సలేంతో ప్రేమలో పడింది. అది కూడా విచిత్రంగానే జరిగింది. అబు ఎవరనేది కూడా మొదట్లో మోనికాకు తెలియదు. అతను డాన్ అనే విషయం తెలియకుండానే ప్రేమలో పడిపోయానని ఓ ఇంటర్వ్యూలో మెనికా చెప్పింది. ‘దుబాయ్‌లో ఈవెంట్ కోసం నాకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. ఆ ఫోన్ చేసింది అబు సలేం. ఈవెంట్ కోసం నేను దుబాయ్ వెళ్లినప్పుడు మొదటి సారిగా అబుని కలిశాను. చాలా బాగా చూసుకున్నాడు. అప్పుడప్పుడు కాల్ చేసి మాట్లాడేవాడు. అలా 9 నెలల పాటు ఫోన్లోనే మాట్లాడుకున్నాం. అతని మాటలు, కేరింగ్ నచ్చి ప్రేమలో పడిపోయాను.అతని కోసం దుబాయ్ కూడా వెళ్లాను. ప్రేమలో ఉన్నప్పుడు గంటకోసారి ఫోన్ చేసేవాడు. అయితే అతను వ్యాపారవేత్త అనే నాకు తెలుసు. దుబాయ్‌లో బిజినెస్ చేస్తున్నాంటే నాతో చెప్పాడు. అతను డాన్ అనే విషయం నాకు తెలియదు. పేరు కూడా మార్చి చెప్పాడు’ అని మెనికా చెప్పింది.ఐదేళ్లు జైలు శిక్ష!అబుతో ప్రేమలో పడిన తర్వాత మెనికా ఇండస్ట్రీకి దూరం అవుతూ వచ్చింది. సినిమాలు తగ్గించి ఎక్కువ సమయం అతనితోనే గడిపింది. 2002లో సెప్టెంబరు 2002లో, నకిలీ పత్రాలపై దేశంలోకి ప్రవేశించినందుకు పోర్చుగల్ లో ఆమెతో పాటు అబూ సలేం అనే భారతీయ గ్యాంగ్‌స్టర్ అరెస్టు చేశారు. ఆ తరువాత ఆమె ఐదేళ్లు జైలు శిక్ష సైతం అనుభవించింది. ఇలా మాఫియా డాన్‌తో పరిచయమే ఆమె కెరీర్‌ని నాశనం చేసింది. లేదంటే మెనికా బాలీవుడ్లో ఓ స్టార్ హీరోయిన్గా కొనసాగేది. తెలుగులోనూ సినిమాలు..శ్రీకాంత్ హీరోగా నటించి తాజ్ మహల్ సినిమాతో హీరోయిన్ ఎంట్రీ ఇచ్చిన మోనికా.. త తర్వాత బాలీవుడ్‌కి వెళ్లి అక్కడ స్టార్ హీరోయిన్గా వెలుగొందింది. షారుఖ్, సల్మాన్ లాంటి బాలీవుడ్ స్టార్ హీరోలందరితోనూ నటించింది. అలాగే తెలుగులో శివయ్య , సోగ్గాడి పెళ్ళాం, సర్కస్ సత్తిపండు, చూడాలని వుంది (1998) సినిమాలతో అలరించింది. హిందీ బిగ్‌బాస్ సీజన్ 2 తో పాటు పలు టీవీ షోల్లో పాల్గొంది. ఈ మధ్య కాలంలో ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది. ప్రస్తుతం మెనికా ఎక్కడ ఉంది, ఏం చేస్తుందనే విషయాలు మాత్రం బయటకు రావడం లేదు. View this post on Instagram A post shared by Monica Bedi (@memonicabedi) -
కలిసిన కాసేపటికే కార్డు ఇచ్చి రమ్మన్నాడు.. చింపి పడేశా: తాజ్ మహల్ హీరోయిన్
తెలుగు సినిమా తాజ్ మహల్‌తో వెండితెరకు పరిచయమైంది మోనికా బేడీ. ఆ తర్వాత 1995లో వచ్చిన సురక్ష చిత్రంతో బాలీవుడ్లో అడుగుపెట్టింది. అక్కడే సినిమాలు చేసుకుంటూ బీ టౌన్లోనే సెటిలైపోయిన మోనికా తాజాగా ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకుంది. 'దర్శకుడు సుభాష్ ఘై హోలీ పార్టీలో రాకేశ్ రోషన్ నా దగ్గరకు వచ్చాడు. అతడు నటుడన్న విషయం నాకు తెలుసు. ఎందుకంటే అతడు యాక్ట్ చేసిన కొన్ని సినిమాలు చూశాను. కానీ అతడు దర్శకుడు, నిర్మాత కూడా అన్న విషయం మాత్రం తెలియదు. అతడు కాసేపు మాట్లాడాక విజిటింగ్ కార్డు ఇచ్చి రేపు ఒకసారి కలువు అని చెప్పాడు. నాకేం అర్థం కాలేదు. ఇతడు నన్నెందుకు రమ్మంటున్నాడు అని అనుమానించి ఆ కార్డును ముక్కలు ముక్కలు చేసి పడేశాను. కొన్ని నెలల తర్వాత నా మేనేజర్.. ఎందుకు రాకేశ్‌ను కలవలేదు? అని అడిగాడు. అతడు కరణ్ అర్జున్ సినిమా తీస్తున్నాడు. ఇందులో నీకు హీరోయిన్ ఛాన్స్ ఇవ్వాలనుకున్నాడు. సల్మాన్ ఖాన్ సరసన మమత కులకర్ణి నటిస్తున్న రోల్ నువ్వు చేయాల్సింది అని చెప్పాడు. అప్పుడు కానీ నేను చేసిన తప్పు అర్థం కాలేదు. డైరెక్టర్, నటుడు మనోజ్ కుమార్ కూడా తన కొడుతో తీస్తున్న సినిమాకు నన్ను సంప్రదించాడు. నాకు చాలా సంతోషమేసింది. కానీ తన సినిమా పూర్తయ్యేవరకు మరే సినిమా చేయడానికి వీల్లేదని అగ్రిమెంట్ మీద సంతకం చేయించుకున్నాడు. అయితే ఆ సినిమా వర్కవుట్ కాలేదు. అసలు షూటింగే జరగలేదు. ఇది అతడి తప్పు కాదు. కొన్ని సార్లు మనం అనుకున్నవన్నీ అనుకున్నట్లుగా జరగవంతే! అయితే ఈ అగ్రిమెంట్ వల్ల నేను ఏడాదిన్నరపాటు ఇంట్లోనే ఖాళీగా కూర్చున్నాను. ఆ తర్వాత సినిమా అయ్యేలా లేదని గ్రహించిన మనోజ్ తన కాంట్రాక్ట్ నుంచి నాకు విముక్తి కల్పించాడు' అని చెప్పుకొచ్చింది. ఇకపోతే మోనిక హిందీ బిగ్‌బాస్ రెండో సీజన్లోనూ పాల్గొంది. ఝలక్ దిక్లాజా మూడో సీజన్లోనూ పార్టిసిపేట్ చేసింది. చదవండి: నాగార్జున బ్లాక్‌బస్టర్ మూవీ.. ఆ డైరెక్టర్‌ను గుర్తుపట్టారా? -
అదృష్టం లిఫ్ట్ లాంటిది!
‘‘హార్డ్‌వర్క్ మెట్లదోవ లాంటిది. అదృష్టం లిఫ్ట్ లాంటిది. కొన్నిసార్లు లిఫ్ట్ ఫెయిల్ అవుతుంది. కానీ, మెట్లు మనల్ని పైపైకి తీసుకెళతాయి. నేనెప్పుడూ మెట్లనే నమ్ముకుంటా’’ అంటున్నారు మోనికా బేడీ. చేసిన సినిమాల కన్నా మాఫియా డాన్ అబూ సలేం ప్రియురాలిగానే ఎక్కువ ప్రాచుర్యం పొందారామె. తెలుగులో తాజ్‌మహల్, సోగ్గాడి పెళ్లాం.. ఇలా రెండు, మూడు చిత్రాల్లో నటించిన మోనికా హిందీ చలనచిత్ర సీమలో కొన్ని చిత్రాలు చేశారు. పాస్‌పోర్ట్ కుంభకోణం, మాఫియాతో సంబంధాల వల్ల జైలు శిక్షనూ అనుభవించారు. గతం గతః అనుకుని, భవిష్యత్తు గురించి బంగారు కలలు కంటున్నారు మోనికా. ఇటీవల పంజాబీ చిత్రం ‘రోమియో రాంఝా’లో డీఎస్పీగా పవర్ఫుల్ రోల్ చేశారామె. అలాగే, బుల్లితెర కోసం ‘బంధన్’ అనే షో చేస్తున్నారు. ఇది కాకుండా ‘సరస్వతీచంద్ర’ అనే ధారావాహికలో నెగటివ్ టచ్ ఉన్న రోల్ చేశారు. కథకు కీలకమైనవి అయితే, సినిమాల్లో కూడా ఈ తరహా పాత్రలు చేయడానికి సిద్ధంగా ఉన్నానని మోనికా తెలిపారు. లేడీ ఓరియంటెడ్ చిత్రాలకు అవకాశం వస్తే, తప్పకుండా చేస్తానని పేర్కొన్నారు.