అదృష్టం లిఫ్ట్ లాంటిది! | Monica Bedi: I am ready to do negative roles even in films | Sakshi
Sakshi News home page

అదృష్టం లిఫ్ట్ లాంటిది!

Published Thu, Dec 18 2014 11:26 PM | Last Updated on Sat, Sep 2 2017 6:23 PM

అదృష్టం లిఫ్ట్ లాంటిది!

అదృష్టం లిఫ్ట్ లాంటిది!

‘‘హార్డ్‌వర్క్ మెట్లదోవ లాంటిది. అదృష్టం లిఫ్ట్ లాంటిది. కొన్నిసార్లు లిఫ్ట్ ఫెయిల్ అవుతుంది. కానీ, మెట్లు మనల్ని పైపైకి తీసుకెళతాయి. నేనెప్పుడూ మెట్లనే నమ్ముకుంటా’’ అంటున్నారు మోనికా బేడీ. చేసిన సినిమాల కన్నా మాఫియా డాన్ అబూ సలేం ప్రియురాలిగానే ఎక్కువ ప్రాచుర్యం పొందారామె. తెలుగులో తాజ్‌మహల్, సోగ్గాడి పెళ్లాం.. ఇలా రెండు, మూడు చిత్రాల్లో నటించిన మోనికా హిందీ చలనచిత్ర సీమలో కొన్ని చిత్రాలు చేశారు. పాస్‌పోర్ట్ కుంభకోణం, మాఫియాతో సంబంధాల వల్ల జైలు శిక్షనూ అనుభవించారు.
 
  గతం గతః అనుకుని, భవిష్యత్తు గురించి బంగారు కలలు కంటున్నారు మోనికా. ఇటీవల పంజాబీ చిత్రం ‘రోమియో రాంఝా’లో డీఎస్‌పీగా పవర్‌ఫుల్ రోల్ చేశారామె. అలాగే, బుల్లితెర కోసం ‘బంధన్’ అనే షో చేస్తున్నారు. ఇది కాకుండా ‘సరస్వతీచంద్ర’ అనే ధారావాహికలో నెగటివ్ టచ్ ఉన్న రోల్ చేశారు. కథకు కీలకమైనవి అయితే, సినిమాల్లో కూడా ఈ తరహా పాత్రలు చేయడానికి సిద్ధంగా ఉన్నానని మోనికా తెలిపారు. లేడీ ఓరియంటెడ్ చిత్రాలకు అవకాశం వస్తే, తప్పకుండా చేస్తానని పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement