ప్రేమించుకుందాం.. రా | Valentine Day 2025: Here's The List Of 12 Upcoming Love Story Movies In Tollywood, Read Full Story | Sakshi
Sakshi News home page

Upcoming Love Movies List: ప్రేమించుకుందాం.. రా

Published Fri, Feb 14 2025 2:05 AM | Last Updated on Fri, Feb 14 2025 8:57 AM

Upcoming Movies on Love Story in Tollywood: Valentine Day 2025

తెలుగు చిత్రపరిశ్రమ(Telugu Film Industry) వెండితెర ప్రేమతో నిండిపోనుంది. అరడజనుకు పైగా ప్రేమకథలు(Love Story) ఈ ఏడాది తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. మరి... ప్రేమించుకుందాం.. రా! అంటూ వెండితెర కోసం ప్రేమలో పడిన నటీనటుల గురించి ఈ ప్రేమికుల దినోత్సవం(Valentine Day) సందర్భంగా మీరూ ఓ లుక్‌ వేయండి.

సాగర్‌ లవ్స్‌ మహాలక్ష్మి
సాగర్‌గా కాలేజీకి వెళ్తున్నారు రామ్‌. కాలేజీలో మహాలక్ష్మిని ప్రేమించాడు. మరి... సాగర్‌ లవ్‌ సక్సెస్‌ అయ్యిందా? అతని చదువు ఏమైంది? అన్న ఆసక్తికరమైన అంశాలను థియేటర్స్‌లో చూడాలి. రామ్‌ హీరోగా పి. మహేశ్‌బాబు దర్శకత్వంలో ఓ పీరియాడికల్‌ యూత్‌పుల్‌ డ్రామా రూపొందుతోంది. ఈ చిత్రంలో కాలేజీ స్టూడెంట్‌ సాగర్‌గా రామ్, మహాలక్ష్మీగా భాగ్యశ్రీ బోర్సే నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ రాజమండ్రిలో జరుగుతోంది. రామ్, భాగ్యశ్రీలతో పాటు ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశా లను చిత్రీకరిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్న ఈ మూవీ ఈ ఏడాదే రిలీజ్‌ కానుంది.

నారీ నారీ నడుమ మురారి 
ఇద్దరు అమ్మాయిల ప్రేమలో శర్వానంద్‌ ఇరుక్కున్నారు. ఫైనల్‌గా ఏ అమ్మాయి ఈ హీరో ప్రేమను దక్కించుకుంది? అనే ప్రశ్నకు సమాధానం ‘నారీ నారీ నడము మురారి’ సినిమా చూసి తెలుసుకోవాలి. శర్వానంద్‌ హీరోగా, సంయుక్త, సాక్షీ వైద్య హీరోయిన్లుగా నటిస్తున్న రొమాంటిక్‌ లవ్‌ అండ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ మూవీ ‘నారీ నారీ నడము మురారి’. ‘సామజ వరగమన’ మూవీతో హిట్‌ అందుకున్న రామ్‌ అబ్బరాజు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అనిల్‌ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలోనే రిలీజ్‌ కానుంది.

యాక్షన్‌ లవ్‌ స్టోరీ
‘హలో, మిస్టర్‌ మజ్ను, మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’ వంటి లవ్‌స్టోరీ మూవీస్‌లో నటించి, ఆడియన్స్‌ను మెప్పించారు అక్కినేని అఖిల్‌. తాజాగా ఈ యంగ్‌ హీరో మరో లవ్‌స్టోరీకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారని తెలిసింది. కిరణ్‌ అబ్బవరంతో ‘వినరో భాగ్యము విష్ణు కథ’ వంటి సక్సెస్‌ఫుల్‌ మూవీ తీసిన దర్శకుడు మురళీ కిశోర్‌ అబ్బూరు తెరకెక్కించనున్న నెక్ట్స్‌ ఫిల్మ్‌లో అఖిల్‌ హీరోగా చేస్తున్నారని తెలిసింది.

ఆల్రెడీ చిత్రీకరణ మొదలుపెట్టుకున్న ఈ యాక్షన్‌ లవ్‌స్టోరీ మూవీలో అఖిల్‌ సరసన శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్నట్లు  తెలిసింది. రాయలసీమ నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కనుందట. అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ సంస్థలు ఈ మూవీని నిర్మిస్తున్నాయని తెలిసింది. అయితే ఈ చిత్రం గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.  

లవ్వుకు లైఫ్‌ ఇద్దామా...
‘లవ్వే లైఫ్‌ అందామా... లవ్వుకు లైఫ్‌ ఇద్దామా’ అంటూ తన లవ్‌ను సూపర్బ్‌గా ప్రపోజ్‌ చేశారు సందీప్‌ కిషన్‌. మరి... సందీప్‌ లవ్‌స్టోరీ సక్సెస్‌ అయ్యిందా? ఎటువంటి సవాళ్లను ఎదుర్కొని సందీప్‌ తన లవ్‌ను సాధించుకున్నారు? అన్నది ‘మాజాకా’ మూవీలో చూడాలి. సందీప్‌ కిషన్, రీతూ వర్మ జంటగా నటించిన యూత్‌ఫుల్‌ రొమాంటిక్‌ లవ్‌స్టోరీ మూవీ ‘మజాకా’. ఈ చిత్రంలో రావు రమేశ్, అన్షు కీలక పాత్రల్లో నటించారు.

నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో రాజేశ్‌ దండా నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 26న రిలీజ్‌ కానుంది. తండ్రీకొడుకుల అనుబంధం, తండ్రి లవ్‌స్టోరీకి కొడుకు ఏ విధంగా హెల్ప్‌ చేశాడు? కొడుకు లవ్‌స్టోరీకి తండ్రి ఏ విధంగా సపోర్ట్‌ చేశాడు? అన్న అంశాల నేపథ్యంలో ‘మాజాకా’ మూవీ ఉంటుందని సమాచారం.

ఇద్దరు అమ్మాయిల ప్రేమలో... 
ఒక అబ్బాయిని ఇద్దరు అమ్మాయిలు ప్రేమిస్తారు. కానీ ఆ అబ్బాయి మాత్రం ఎవర్నీ ప్రేమించడు. మరి... ఆ ఇద్దరు అమ్మాయిలు ఆ అబ్బాయి ప్రేమకోసం ఏం చేశారు? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌. శ్రీవిష్ణు హీరోగా, కేతికా శర్మ, ఇవానా హీరోయిన్లుగా నటిస్తున్న యూత్‌ఫుల్‌ లవ్‌స్టోరీ మూవీ ‘హాష్‌ ట్యాగ్‌ సింగిల్‌’. అల్లు అరవింద్‌ సమర్పణలో కార్తీక్‌ రాజు దర్శకత్వంలో విద్యా కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్‌ చౌదరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాదే రిలీజ్‌ కానుంది.

ముక్కోణపు ప్రేమకథ 
సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న లేటెస్ట్‌ మూవీ ‘తెలుసు కదా’. ఈ ఫీల్‌గుడ్‌ లవ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ స్టోరీలో ‘కేజీఎఫ్‌’ ఫేమ్‌ శ్రీనిధీ శెట్టి, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. కాస్ట్యూమ్‌ డిజైనర్‌ నీరజ కోన ఈ సినిమాతో దర్శకురాలిగా మారారు. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది. ట్రయాంగిల్‌ లవ్‌స్టోరీగా ఈ చిత్రం ఉంటుందనే టాక్‌ వినిపిస్తోంది. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాదే రిలీజ్‌ కానుంది.

మాజీ ప్రేమికుల కథ
కొంత కాలం ప్రేమించుకుని, విడిపోయిన తర్వాత మళ్లీ ఆ ప్రేమికులు కలుసుకోవాల్సి వస్తే? కలిసి ఓ క్రైమ్‌ చేయాల్సి వస్తే? ఎలా ఉంటుంది? అనే కథాంశంతో రూపొందుతున్న సినిమా ‘డెకాయిట్‌: ఏ లవ్‌స్టోరీ’. అడివి శేష్, మృణాల్‌ ఠాకూర్‌ ఈ చిత్రంలో హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీలో విడిపోయిన ప్రేమికులుగా అడివి శేష్, మృణాల్‌ ఠాకూర్‌ కనిపిస్తారు. ఈ సినిమాకు షానిల్‌ డియో దర్శకత్వం వహిస్తున్నారు. 

అన్నపూర్ణ స్టూడియోస్‌ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాదే రిలీజ్‌ కానుంది. ఈ సంగతి ఇలా ఉంచితే... ఈ సినిమాలో హీరోయిన్‌గా తొలుత శ్రుతీహాసన్‌ను తీసుకున్నారు. కొన్ని కారణాల వల్ల ఆమె ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో ఆమె ప్లేస్‌లో మృణాల్‌ ఠాకూర్‌ ఫైనలైజ్‌ అయ్యారు.  

ప్రేమ బాధ భయంకరం
‘ప్రేమ చాలా గొప్పది... కానీ అది ఇచ్చే బాధే భయంకరంగా ఉంటుంది’’ అంటున్నారు యంగ్‌ హీరో కిరణ్‌ అబ్బవరం. ప్రేమకథా చిత్రం ‘దిల్‌ రుబా’ కోసమే కిరణ్‌ అబ్బవరం ఈ డైలాగ్‌ చెప్పారు. కిరణ్‌ అబ్బవరం హీరోగా విశ్వ కరుణ్‌ దర్శకత్వంలో రూపొందిన రొమాంటిక్‌ లవ్‌స్టోరీ మూవీ ‘దిల్‌ రుబా’. ఈ చిత్రంలో రుక్సర్‌ థిల్లాన్‌ హీరోయిన్‌గా నటించగా, నాజియా డేవిసన్‌ మరో లీడ్‌ రోల్‌లో నటించారు. రవి, జోజో జోస్, రాకేశ్‌ రెడ్డి, సారెగమ నిర్మించారు. 

లవ్‌లో ఫెయిలై, మళ్లీ లవ్‌లో పడే ఓ కుర్రాడి కథగా ‘దిల్‌ రుబా’ చిత్రం రూపొందినట్లుగా తెలుస్తోంది. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ సినిమాను ఫిబ్రవరి 14న రిలీజ్‌ చేయాలనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల ఈ చిత్రం రిలీజ్‌ వాయిదా పడింది. మార్చిలో ప్రేక్షకుల ముందుకు వచ్చే చాన్స్‌ ఉంది. అలాగే రవి నంబూరి అనే కొత్త దర్శకుడు తీస్తున్న లవ్‌ స్టోరీ మూవీలోనూ కిరణ్‌ అబ్బవరం హీరోగా నటించనున్నట్లుగా తెలిసింది. ‘కలర్‌ ఫోటో’ ఫేమ్‌ సాయి రాజేశ్‌ ఈ సినిమాకు కథ అందిస్తున్నారట.

ప్రేమలో సంఘర్షణ
ఓ కాలేజీ అమ్మాయి ప్రేమ, ఆ ప్రేమ కారణంగా ఆ యువతి ఎదుర్కొనే సంఘర్షణల నేపథ్యంలో రూపొందిన సినిమా ‘ది గర్ల్‌ఫ్రెండ్‌’. హీరోయిన్‌ రష్మికా మందన్నా ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ మూవీలో, దీక్షిత్‌ శెట్టి మరో లీడ్‌ రోల్‌లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రేమలో సంఘర్షణకు గురయ్యే అమ్మాయి పాత్రలో రష్మికా మందన్నా నటిస్తున్నారు. రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వంలో అల్లు అరవింద్‌ సమర్పణలో ధీరజ్‌ మొగిలినేని, విద్యా కొప్పినీడి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.  

మిడిల్‌ క్లాస్‌ లవ్‌స్టోరీ
మిడిల్‌ క్లాస్‌ బాయ్‌ లవ్‌స్టోరీ ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాలంటున్నారు హీరో ఆనంద్‌ దేవరకొండ. ‘90స్‌’ వెబ్‌ సిరీస్‌తో ఆడియన్స్‌ను అలరించిన ఆదిత్యా హాసన్‌ డైరెక్షన్‌లో ఓ లవ్‌స్టోరీ మూవీ రూపొందనుంది. ఈ చిత్రంలో ఆనంద్‌ దేవరకొండ హీరోగా నటించనుండగా,  వైష్ణవీ చైతన్య హీరోయిన్‌గా నటించనున్నారు. సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మించనున్న ఈ చిత్రం షూటింగ్‌ త్వరలోనే ప్రారంభం కానుంది.

‘బేబీ’ వంటి బ్లాక్‌బస్టర్‌ మూవీ తర్వాత ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవీ చైతన్య కాంబినేషన్‌లో వస్తున్న ఈ మూవీపై అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాతో పాటు ‘డ్యూయెట్‌’ అనే మరో లవ్‌స్టోరీ ఫిల్మ్‌ కూడా చేస్తున్నారు ఆనంద్‌ దేవరకొండ. రితికా నాయక్‌ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్నారు. తమిళ దర్శకుడు ఏఆర్‌ మురుగదాస్‌ దగ్గర అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా వర్క్‌ చేసిన మిథున్‌ వరదరాజకృష్ణన్‌ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని కేజీ జ్ఞానవేల్‌ రాజా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఈ ఏడాదే రిలీజ్‌ కానుంది.

ప్రేమ తుఫాన్‌! 
‘ఎవరి తుఫాన్లు వారికి ఉంటాయి లోపల. కొందరు బయట పడతారు, ఇంకొందరు ఎప్పటికీ పడరు’ అంటూ ఓ ఇంటెన్స్‌ లవ్‌ డైలాగ్‌ చెప్పారు హీరోయిన్‌ అనంతికా సనీల్‌కుమార్‌. ‘మను’ ఫేమ్‌ ఫణీంద్ర నర్సెట్టి డైరెక్షన్‌లో అనంతికా సనీల్‌ కుమార్, హను రెడ్డి లీడ్‌ రోల్‌లో నటించిన చిత్రం ‘8 వసంతాలు’. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ ఈ ఇంటెన్స్‌ లవ్‌స్టోరీ సినిమాను నిర్మించారు.

ప్రేమలో బ్రేక్‌ అప్‌ అయిన తర్వాత లైఫ్‌లో ఓ అమ్మాయి ఎలా మూవ్‌ ఆన్‌ అయ్యింది? అసలు ఆమె ప్రేమ ఎందుకు విఫలమైంది? అనే అంశాల నేపథ్యంలో ఈ సినిమా ఉండనున్నట్లుగా తెలుస్తోంది. రవితేజ దుగ్గిరాల, సంజన, కన్నా, స్వరాజ్, రెబ్బా ప్రగడ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీ త్వరలో రిలీజ్‌ కానుంది.

తెలంగాణ లవ్‌స్టోరీ 
‘నీది నాది ఒకే కథ, విరాటపర్వం’ వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన వేణు ఉడుగుల నిర్మాతగా మారి, రాహుల్‌ మోపిదేవితో కలిసి నిర్మిస్తున్న చిత్రం ‘రాజు వెడ్స్‌ రాంబాయి’. ఖమ్మం–వరంగల్‌ సరిహద్దుప్రాంతాల్లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న గ్రామీణ ప్రేమకథా చిత్రం ఇది. నూతన నటీనటులు నటిస్తున్నారు. ఈ సినిమా ఈ ప్రేమికుల రోజు సందర్భంగా రిలీజ్‌ కావాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల రిలీజ్‌ వాయిదా పడింది. వీరే కాదు... మరికొంతమంది హీరోలు–హీరోయిన్లు కూడా లవ్‌స్టోరీ మూవీస్‌ చేస్తున్నారు.       – ముసిమి శివాంజనేయులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement