telugu film industry
-
ప్రేమించుకుందాం.. రా
తెలుగు చిత్రపరిశ్రమ(Telugu Film Industry) వెండితెర ప్రేమతో నిండిపోనుంది. అరడజనుకు పైగా ప్రేమకథలు(Love Story) ఈ ఏడాది తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. మరి... ప్రేమించుకుందాం.. రా! అంటూ వెండితెర కోసం ప్రేమలో పడిన నటీనటుల గురించి ఈ ప్రేమికుల దినోత్సవం(Valentine Day) సందర్భంగా మీరూ ఓ లుక్ వేయండి.సాగర్ లవ్స్ మహాలక్ష్మిసాగర్గా కాలేజీకి వెళ్తున్నారు రామ్. కాలేజీలో మహాలక్ష్మిని ప్రేమించాడు. మరి... సాగర్ లవ్ సక్సెస్ అయ్యిందా? అతని చదువు ఏమైంది? అన్న ఆసక్తికరమైన అంశాలను థియేటర్స్‌లో చూడాలి. రామ్ హీరోగా పి. మహేశ్‌బాబు దర్శకత్వంలో ఓ పీరియాడికల్ యూత్‌పుల్ డ్రామా రూపొందుతోంది. ఈ చిత్రంలో కాలేజీ స్టూడెంట్ సాగర్‌గా రామ్, మహాలక్ష్మీగా భాగ్యశ్రీ బోర్సే నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ రాజమండ్రిలో జరుగుతోంది. రామ్, భాగ్యశ్రీలతో పాటు ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశా లను చిత్రీకరిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ మూవీ ఈ ఏడాదే రిలీజ్ కానుంది.నారీ నారీ నడుమ మురారి ఇద్దరు అమ్మాయిల ప్రేమలో శర్వానంద్ ఇరుక్కున్నారు. ఫైనల్‌గా ఏ అమ్మాయి ఈ హీరో ప్రేమను దక్కించుకుంది? అనే ప్రశ్నకు సమాధానం ‘నారీ నారీ నడము మురారి’ సినిమా చూసి తెలుసుకోవాలి. శర్వానంద్ హీరోగా, సంయుక్త, సాక్షీ వైద్య హీరోయిన్లుగా నటిస్తున్న రొమాంటిక్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ ‘నారీ నారీ నడము మురారి’. ‘సామజ వరగమన’ మూవీతో హిట్ అందుకున్న రామ్ అబ్బరాజు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలోనే రిలీజ్ కానుంది.యాక్షన్ లవ్ స్టోరీ‘హలో, మిస్టర్ మజ్ను, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ వంటి లవ్‌స్టోరీ మూవీస్‌లో నటించి, ఆడియన్స్‌ను మెప్పించారు అక్కినేని అఖిల్. తాజాగా ఈ యంగ్ హీరో మరో లవ్‌స్టోరీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిసింది. కిరణ్ అబ్బవరంతో ‘వినరో భాగ్యము విష్ణు కథ’ వంటి సక్సెస్ఫుల్ మూవీ తీసిన దర్శకుడు మురళీ కిశోర్ అబ్బూరు తెరకెక్కించనున్న నెక్ట్స్ ఫిల్మ్‌లో అఖిల్ హీరోగా చేస్తున్నారని తెలిసింది.ఆల్రెడీ చిత్రీకరణ మొదలుపెట్టుకున్న ఈ యాక్షన్ లవ్‌స్టోరీ మూవీలో అఖిల్ సరసన శ్రీలీల హీరోయిన్గా నటిస్తున్నట్లు తెలిసింది. రాయలసీమ నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కనుందట. అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు ఈ మూవీని నిర్మిస్తున్నాయని తెలిసింది. అయితే ఈ చిత్రం గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. లవ్వుకు లైఫ్ ఇద్దామా...‘లవ్వే లైఫ్ అందామా... లవ్వుకు లైఫ్ ఇద్దామా’ అంటూ తన లవ్‌ను సూపర్బ్‌గా ప్రపోజ్ చేశారు సందీప్ కిషన్. మరి... సందీప్ లవ్‌స్టోరీ సక్సెస్ అయ్యిందా? ఎటువంటి సవాళ్లను ఎదుర్కొని సందీప్ తన లవ్‌ను సాధించుకున్నారు? అన్నది ‘మాజాకా’ మూవీలో చూడాలి. సందీప్ కిషన్, రీతూ వర్మ జంటగా నటించిన యూత్‌ఫుల్ రొమాంటిక్ లవ్‌స్టోరీ మూవీ ‘మజాకా’. ఈ చిత్రంలో రావు రమేశ్, అన్షు కీలక పాత్రల్లో నటించారు.నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో రాజేశ్ దండా నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 26న రిలీజ్ కానుంది. తండ్రీకొడుకుల అనుబంధం, తండ్రి లవ్‌స్టోరీకి కొడుకు ఏ విధంగా హెల్ప్ చేశాడు? కొడుకు లవ్‌స్టోరీకి తండ్రి ఏ విధంగా సపోర్ట్ చేశాడు? అన్న అంశాల నేపథ్యంలో ‘మాజాకా’ మూవీ ఉంటుందని సమాచారం.ఇద్దరు అమ్మాయిల ప్రేమలో... ఒక అబ్బాయిని ఇద్దరు అమ్మాయిలు ప్రేమిస్తారు. కానీ ఆ అబ్బాయి మాత్రం ఎవర్నీ ప్రేమించడు. మరి... ఆ ఇద్దరు అమ్మాయిలు ఆ అబ్బాయి ప్రేమకోసం ఏం చేశారు? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. శ్రీవిష్ణు హీరోగా, కేతికా శర్మ, ఇవానా హీరోయిన్లుగా నటిస్తున్న యూత్‌ఫుల్ లవ్‌స్టోరీ మూవీ ‘హాష్ ట్యాగ్ సింగిల్’. అల్లు అరవింద్ సమర్పణలో కార్తీక్ రాజు దర్శకత్వంలో విద్యా కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాదే రిలీజ్ కానుంది.ముక్కోణపు ప్రేమకథ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘తెలుసు కదా’. ఈ ఫీల్‌గుడ్ లవ్ ఎంటర్టైన్మెంట్ స్టోరీలో ‘కేజీఎఫ్’ ఫేమ్ శ్రీనిధీ శెట్టి, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన ఈ సినిమాతో దర్శకురాలిగా మారారు. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది. ట్రయాంగిల్ లవ్‌స్టోరీగా ఈ చిత్రం ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాదే రిలీజ్ కానుంది.మాజీ ప్రేమికుల కథకొంత కాలం ప్రేమించుకుని, విడిపోయిన తర్వాత మళ్లీ ఆ ప్రేమికులు కలుసుకోవాల్సి వస్తే? కలిసి ఓ క్రైమ్ చేయాల్సి వస్తే? ఎలా ఉంటుంది? అనే కథాంశంతో రూపొందుతున్న సినిమా ‘డెకాయిట్: ఏ లవ్‌స్టోరీ’. అడివి శేష్, మృణాల్ ఠాకూర్ ఈ చిత్రంలో హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీలో విడిపోయిన ప్రేమికులుగా అడివి శేష్, మృణాల్ ఠాకూర్ కనిపిస్తారు. ఈ సినిమాకు షానిల్ డియో దర్శకత్వం వహిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాదే రిలీజ్ కానుంది. ఈ సంగతి ఇలా ఉంచితే... ఈ సినిమాలో హీరోయిన్గా తొలుత శ్రుతీహాసన్‌ను తీసుకున్నారు. కొన్ని కారణాల వల్ల ఆమె ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో ఆమె ప్లేస్‌లో మృణాల్ ఠాకూర్ ఫైనలైజ్ అయ్యారు. ప్రేమ బాధ భయంకరం‘ప్రేమ చాలా గొప్పది... కానీ అది ఇచ్చే బాధే భయంకరంగా ఉంటుంది’’ అంటున్నారు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం. ప్రేమకథా చిత్రం ‘దిల్ రుబా’ కోసమే కిరణ్ అబ్బవరం ఈ డైలాగ్ చెప్పారు. కిరణ్ అబ్బవరం హీరోగా విశ్వ కరుణ్ దర్శకత్వంలో రూపొందిన రొమాంటిక్ లవ్‌స్టోరీ మూవీ ‘దిల్ రుబా’. ఈ చిత్రంలో రుక్సర్ థిల్లాన్ హీరోయిన్గా నటించగా, నాజియా డేవిసన్ మరో లీడ్ రోల్లో నటించారు. రవి, జోజో జోస్, రాకేశ్ రెడ్డి, సారెగమ నిర్మించారు. లవ్‌లో ఫెయిలై, మళ్లీ లవ్‌లో పడే ఓ కుర్రాడి కథగా ‘దిల్ రుబా’ చిత్రం రూపొందినట్లుగా తెలుస్తోంది. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ సినిమాను ఫిబ్రవరి 14న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల ఈ చిత్రం రిలీజ్ వాయిదా పడింది. మార్చిలో ప్రేక్షకుల ముందుకు వచ్చే చాన్స్ ఉంది. అలాగే రవి నంబూరి అనే కొత్త దర్శకుడు తీస్తున్న లవ్ స్టోరీ మూవీలోనూ కిరణ్ అబ్బవరం హీరోగా నటించనున్నట్లుగా తెలిసింది. ‘కలర్ ఫోటో’ ఫేమ్ సాయి రాజేశ్ ఈ సినిమాకు కథ అందిస్తున్నారట.ప్రేమలో సంఘర్షణఓ కాలేజీ అమ్మాయి ప్రేమ, ఆ ప్రేమ కారణంగా ఆ యువతి ఎదుర్కొనే సంఘర్షణల నేపథ్యంలో రూపొందిన సినిమా ‘ది గర్ల్‌ఫ్రెండ్’. హీరోయిన్ రష్మికా మందన్నా ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ మూవీలో, దీక్షిత్ శెట్టి మరో లీడ్ రోల్లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రేమలో సంఘర్షణకు గురయ్యే అమ్మాయి పాత్రలో రష్మికా మందన్నా నటిస్తున్నారు. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో అల్లు అరవింద్ సమర్పణలో ధీరజ్ మొగిలినేని, విద్యా కొప్పినీడి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మిడిల్ క్లాస్ లవ్స్టోరీమిడిల్ క్లాస్ బాయ్ లవ్‌స్టోరీ ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాలంటున్నారు హీరో ఆనంద్ దేవరకొండ. ‘90స్’ వెబ్ సిరీస్‌తో ఆడియన్స్‌ను అలరించిన ఆదిత్యా హాసన్ డైరెక్షన్లో ఓ లవ్‌స్టోరీ మూవీ రూపొందనుంది. ఈ చిత్రంలో ఆనంద్ దేవరకొండ హీరోగా నటించనుండగా, వైష్ణవీ చైతన్య హీరోయిన్గా నటించనున్నారు. సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మించనున్న ఈ చిత్రం షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది.‘బేబీ’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత ఆనంద్ దేవరకొండ, వైష్ణవీ చైతన్య కాంబినేషన్లో వస్తున్న ఈ మూవీపై అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాతో పాటు ‘డ్యూయెట్’ అనే మరో లవ్‌స్టోరీ ఫిల్మ్ కూడా చేస్తున్నారు ఆనంద్ దేవరకొండ. రితికా నాయక్ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్నారు. తమిళ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా వర్క్ చేసిన మిథున్ వరదరాజకృష్ణన్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని కేజీ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఈ ఏడాదే రిలీజ్ కానుంది.ప్రేమ తుఫాన్! ‘ఎవరి తుఫాన్లు వారికి ఉంటాయి లోపల. కొందరు బయట పడతారు, ఇంకొందరు ఎప్పటికీ పడరు’ అంటూ ఓ ఇంటెన్స్ లవ్ డైలాగ్ చెప్పారు హీరోయిన్ అనంతికా సనీల్‌కుమార్. ‘మను’ ఫేమ్ ఫణీంద్ర నర్సెట్టి డైరెక్షన్లో అనంతికా సనీల్ కుమార్, హను రెడ్డి లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘8 వసంతాలు’. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ ఇంటెన్స్ లవ్‌స్టోరీ సినిమాను నిర్మించారు.ప్రేమలో బ్రేక్ అప్ అయిన తర్వాత లైఫ్‌లో ఓ అమ్మాయి ఎలా మూవ్ ఆన్ అయ్యింది? అసలు ఆమె ప్రేమ ఎందుకు విఫలమైంది? అనే అంశాల నేపథ్యంలో ఈ సినిమా ఉండనున్నట్లుగా తెలుస్తోంది. రవితేజ దుగ్గిరాల, సంజన, కన్నా, స్వరాజ్, రెబ్బా ప్రగడ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీ త్వరలో రిలీజ్ కానుంది.తెలంగాణ లవ్‌స్టోరీ ‘నీది నాది ఒకే కథ, విరాటపర్వం’ వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన వేణు ఉడుగుల నిర్మాతగా మారి, రాహుల్ మోపిదేవితో కలిసి నిర్మిస్తున్న చిత్రం ‘రాజు వెడ్స్ రాంబాయి’. ఖమ్మం–వరంగల్ సరిహద్దుప్రాంతాల్లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న గ్రామీణ ప్రేమకథా చిత్రం ఇది. నూతన నటీనటులు నటిస్తున్నారు. ఈ సినిమా ఈ ప్రేమికుల రోజు సందర్భంగా రిలీజ్ కావాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల రిలీజ్ వాయిదా పడింది. వీరే కాదు... మరికొంతమంది హీరోలు–హీరోయిన్లు కూడా లవ్‌స్టోరీ మూవీస్ చేస్తున్నారు. – ముసిమి శివాంజనేయులు -
రాయలసీమ రమ్మంటోంది
రాయలసీమ నేపథ్యం సినిమాలంటే ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌తో వచ్చిన ఎన్నో సినిమాలు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో బ్లాక్‌బస్టర్ హిట్స్‌గా నిలిచాయి. ఇటీవలి కాలంలో బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన అల్లు అర్జున్ ‘పుష్ప: ది రూల్’ కూడా రాయలసీమ నేపథ్యంలో రూపొందిన సినిమాయే. కాగా ప్రస్తుతం ‘రాయలసీమ రమ్మంటోంది’ అంటూ కొందరు తెలుగు హీరోలు రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో సినిమాలు చేస్తున్నారు. ఈ సినిమాల వివరాల్లోకి వెళితే...అఖండ తాండవంబాలకృష్ణ కెరీర్లో రాయలసీమ నేపథ్యంలో రూపొందిన ‘సమరసింహారెడ్డి, నరసింహారెడ్డి, ఇటీవలి కాలంలో ‘అఖండ, డాకు మహారాజ్’ వంటి సినిమాలు ప్రేక్షకులను అలరించాయి. హీరో బాలకృష్ణ–దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందిన ‘అఖండ’ (2021) మూవీ అనంతపురం నేపథ్యంలో ఉన్న సంగతి గుర్తుండే ఉంటుంది. ఈ మూవీకి సీక్వెల్‌గా బాలకృష్ణ– బోయపాటి శ్రీను కాంబినేషన్లోనే ‘అఖండ 2: తాండవం’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇందులో హీరోయిన్ సంయుక్త ఓ కీ రోల్ చేస్తున్నారు. ఎం. తేజస్విని నందమూరి సమర్పణలో రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్న ఈ మూవీ చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. కాగా ‘అఖండ 2: తాండవం’ కూడా ‘అఖండ’ సినిమా మాదిరి అనంతపురం నేపథ్యంలోనే ఉంటుందని ఊహించవచ్చు. ఈ సినిమాను సెప్టెంబరు 25న రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ఆల్రెడీ ప్రకటించిన సంగతి తెలిసిందే. నవ్వించేకి వస్తుండా! ‘కదిరి నరసింహ సామి సాచ్చిగా ఈ తూరి నవ్వించేకి వస్తుండా!’ అని ఇటీవల తన కొత్త సినిమా గురించి వరుణ్ తేజ్ ‘ఎక్స్’లో షేర్ చేశారు. దీంతో వరుణ్ తేజ్ నెక్ట్స్ మూవీ రాయలసీమ నేపథ్యంలో ఉంటుందని స్పష్టమైపోయింది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ వియత్నాంలో జరుగుతున్నాయి. పనిలో పనిగా ఈ మూవీ చిత్రీకరణ కోసం లొకేషన్లను కూడా వెతుకుతున్నారు మేకర్స్. ఈ పనుల కోసం హీరో వరుణ్ తేజ్, దర్శకుడు మేర్లపాక గాంధీ ప్రస్తుతం వియత్నాంలోనే ఉన్నారు. హారర్–కామెడీ జానర్లో రూపొందనున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ మార్చి మొదటి వారంలో ప్రారంభం కానుంది. ఈ సినిమా ప్రధానంగా అనంతపురం నేపథ్యంలో ఉంటుందని, ‘కొరియన్ కనక రాజు’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారని తెలిసింది. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు నిర్మించనున్నాయి.19వ శతాబ్దంలో...‘టాక్సీవాలా’ (2018) వంటి హిట్ ఫిల్మ్ తర్వాత హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ కాంబినేషన్లో మరో చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించనున్న ఈ పీరియాడికల్ యాక్షన్ మూవీ రాయలసీమ నేపథ్యంలో సాగుతుంది. 19వ శతాబ్దంలో 1854–1878 మధ్య కాలంలో జరిగిన కొన్ని చారిత్రక వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం రూపొందనున్నట్లుగా తెలుస్తోంది. భారతదేశంలో బ్రిటిష్ పరిపాలన కాలంలో జరిగిన కొన్ని చారిత్రక అంశాలను ఈ మూవీలో ప్రస్తావించనున్నట్లు తెలిసింది. వచ్చే నెలలో ఈ సినిమా రెగ్యులర్ షూట్ ప్రారంభం కానుందట. ఈ మూవీలో రష్మికా మందన్నా హీరోయిన్గా నటించనున్నట్లు ప్రచారం సాగుతోంది. గతంలో ‘గీత గోవిందం, డియర్ కామ్రేడ్’ చిత్రాల్లో విజయ్ దేవరకొండ, రష్మికా మందన్నా జంటగా నటించిన విషయం తెలిసిందే. అలాగే ఈ చిత్రంలోని ప్రధాన పాత్రలకు అమితాబ్ బచ్చన్, హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లూలను మేకర్స్ సంప్రదించారనే వార్త ప్రచారంలో ఉంది. ఈ విషయాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. యాక్షన్ లవ్‌స్టోరీ ‘ఏజెంట్’ మూవీ తర్వాత అక్కినేని అఖిల్ తర్వాతిప్రాజెక్ట్పై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. కానీ అఖిల్ తర్వాతి చిత్రం చిత్రీకరణ ఆల్రెడీ మొదలైందని, రాయలసీమ నేపథ్యంలో సాగే ఈ లవ్‌స్టోరీ ఫిల్మ్‌కి ‘లెనిన్’ అనే టైటిల్ అనుకుంటున్నారని ఫిల్మ్‌నగర్ సమాచారం. ఈ చిత్రంలో అఖిల్ సరసన శ్రీలీల హీరోయిన్గా నటిస్తున్నారని తెలిసింది. ‘వినరో భాగ్యము విష్ణుకథ’ ఫేమ్ దర్శకుడు మురళీ కిశోర్ ‘లెనిన్’ని తెరకెక్కిస్తున్నట్లుగా తెలిసింది. అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు ఈ మూవీని నిర్మిస్తున్నాయని సమాచారం. మాస్ సంబరాలు ‘ఏటి గట్టు సాచ్చిగా చెబ్తాండ ఈ తూరి నరికినానంటే అరుపు గొంతులో నుంచి కాదు... తెగిన నరాలొన్నించొచ్చాది!... ‘సంబరాల ఏటిగట్టు’ చిత్రం కోసం సాయిదుర్గా తేజ్ చెప్పిన డైలాగ్ ఇది. దాదాపు రూ. 100 కోట్లకు పైగా బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ ఇంటెన్స్ యాక్షన్ ΄్యాక్డ్ మూవీని కొత్త దర్శకుడు రోహిత్ కేపీ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం రాయలసీమ నేపథ్యంలో ఉంటుందని తెలిసింది. ఐశ్వర్యా లక్ష్మి హీరోయిన్గా నటిస్తున్నారు. కాగా రెండు భాగాలుగా రూపొందుతోన్న ఈ చిత్రం తొలి భాగం సెప్టెంబరు 25న రిలీజ్ కానుంది.రాజకీయం... ప్రతీకారం అప్సరా రాణి, విజయ్ శంకర్, వరుణ్ సందేశ్ లీడ్ రోల్స్‌లో నటించిన చిత్రం ‘రాచరికం’. సురేశ్ లంకలపల్లి దర్శకత్వంలో ఈశ్వర్ నిర్మించిన ఈ మూవీ ఫిబ్రవరి 1న విడుదల కానుంది. పూర్తిగా రాయలసీమ నేపథ్యంలో సాగే ఫిల్మ్ ఇది. లవ్, యాక్షన్, రాజకీయాలు, ప్రతీకారం వంటి అంశాలతో ఈ చిత్రం రూపొందింది. రాయలసీమ నేపథ్యంలో మరికొందరు కుర్ర హీరోలు సినిమాలు చేస్తున్నారు. ఇంకొందరు రాయలసీమ కథలు వింటున్నారు. – ముసిమి శివాంజనేయులు -
మంత్రిగారూ ఇదేం తీరు?
సాక్షి, హైదరాబాద్: సినీహీరో అక్కినేని నాగార్జున కుటుంబంతోపాటు సినీనటి సమంతపై అటవీశాఖ మంత్రి కొండా సురేఖ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల వివాదం ఇంకా సద్దుమణగలేదు. మంత్రి వ్యాఖ్యలను తప్పుబడుతూ చలనచిత్ర ప్రముఖులు గురువారం తీవ్రస్థాయిలో స్పందించారు. అక్కినేని కుటుంబంతోపాటు నటి సమంతకు బాసటగా నిలిచారు. మంత్రి తన వ్యాఖ్యలను బేషరతుగా వెనక్కి తీసుకున్నారని, సినీ ప్రముఖులు దీనిని ఇంతటితో వదిలేయాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ విజ్ఞప్తి చేసినా సోషల్ మీడియా వేదికగా సినీ ప్రముఖుల విమర్శల వరద ఆగలేదు. తెలుగు సినీ పరిశ్రమతోపాటు ఇతర భాషల నటీనటులు కూడా స్పందించారు. మెగాస్టార్ చిరంజీవి, హీరోలు వెంకటేశ్, మహేశ్‌బాబు, రాంచరణ్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రవితేజ, నరేశ్, నాని, విజయ్ దేవరకొండతోపాటు సీనియర్ నటి విజయశాంతి, హీరోయిన్ రకుల్‌ప్రీత్ సింగ్, దర్శకులు రాజమౌళి, హరీశ్ శంకర్, తమిళ నటి కుష్బూ తదితరులు కూడా మంత్రి సురేఖ వ్యాఖ్యలను తప్పుపడుతూ ‘ఎక్స్’, ఇన్స్టాలలో పోస్టులు పెట్టారు. సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ సైతం మంత్రి వ్యాఖ్యలను తప్పుబట్టారు. సురేఖ వ్యాఖ్యల్ని తప్పుబడుతూ ‘మా’ లేఖ.. సినీ పరిశ్రమకు చెందిన సభ్యుల వ్యక్తిగత జీవితాలతో ముడిపడి ఉన్న సున్నితమైన అంశాలపై ఎవరు మాట్లాడినా తగిన చర్యలకు ఉపక్రమిస్తామని తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ స్పష్టం చేసింది. తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు మంచు విష్ణు.. అసోసియేషన్ తరపున కొండా సురేఖ వ్యాఖ్యలను తప్పుపడుతూ అధికారికంగా సుదీర్ఘ లేఖ విడుదల చేశారు. మరోవైపు తన మాటలు సినీనటి సమంత మనోభావాలను దెబ్బతీశాయని తెలిసి ఆ వ్యాఖ్యలను వెనక్కు తీసుకుంటున్నట్లు మంత్రి కొండా సురేఖ పోస్ట్ చేయడాన్ని ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తప్పుపట్టారు. ‘కొండా సురేఖ కేవలం సమంతకి క్షమాపణ చెప్పడం ఏంటి.. అక్కడ అత్యంత జుగుప్సాకరంగా అవమానించింది నాగార్జునని, నాగ చైతన్యని’ అని ‘ఎక్స్’లో తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆ వ్యాఖ్యల్ని ఉపసంహరించుకోవాలని సురేఖకు టీపీసీసీ చీఫ్ సూచన! మంత్రి కొండా సురేఖ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో మరింత నష్టం జరగకుండా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్‌గౌడ్ నష్ట నివారణ చర్యలు చేపట్టారు. కొండా సురేఖతో మాట్లాడి తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని ఆయన సూచించినట్లు సమాచారం. రాజకీయ విమర్శల్లో సినీ కుటుంబాన్ని, మహిళా నటిని కించపరిచేలా వ్యాఖ్యానించడం ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని.. అగ్ర నాయకత్వానికి సంజాయిషీ చెప్పుకోవాల్సి వస్తుందని ఆయన చెప్పినట్లు తెలిసింది. దీంతో సురేఖ తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకుంటున్నట్లు ‘ఎక్స్’ లో పోస్టు చేశారు. ‘నా వ్యాఖ్యల ఉద్దేశం మహిళలపట్ల ఒక నాయకుడి చిన్నచూపు ధోరణిని ప్రశ్నించడమేగానీ గౌరవ నటి సమంత మనోభావాలను దెబ్బతీయడం కాదు. స్వయం శక్తితో మీరు ఎదిగిన తీరు నాకు కేవలం అభిమానం మాత్రమే కాదు, ఆదర్శం కూడా. నా వ్యాఖ్యలపట్ల మీరు కానీ, మీ అభిమానులు కానీ మనస్తాపానికి గురైనట్లయితే బేషరతుగా నా వ్యాఖ్యలను పూర్తిగా ఉపసంహరించుకుంటున్నాను.. అన్యదా భావించవద్దు’ అని పేర్కొన్నారు. నాగార్జున పరువునష్టం దావా.. మంత్రి కొండా సురేఖపై సినీనటుడు అక్కినేని నాగార్జున నాంపల్లి కోర్టులో పరువునష్టం దావా వేశారు. నటి సమంత, నాగచైతన్య విడాకులు తీసుకోవడంలో తన ప్రమేయం ఉందంటూ మంత్రి చేసిన వ్యాఖ్యలపై నాగార్జున కోర్టును ఆశ్రయించారు. తన కుటుంబ సభ్యుల పరువుకు మంత్రి భంగం కలిగించారని నాగార్జున పేర్కొన్నారు. ఆమెపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరారు. మరోవైపు కొండా సురేఖపై పలువురు బీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్లు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేటీఆర్‌తోపాటు సినీ ప్రముఖులపై చేసిన ఆరోపణలకుగాను ఆమెపై కేసు పెట్టాలని కోరారు. కేటీఆర్‌పై ఆమె చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని, బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మూసీ మురికంతా వాళ్ల నోట్లోనే ఉందన్న కేటీఆర్ మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తనదైన శైలిలో స్పందించారు. ‘మూసీ మురికి అంతా వాళ్ల నోట్లోనే ఉంది. ఇంకా శుద్ధి ఎందుకు.. లక్షన్నర కోట్లు ఖర్చు ఎందుకు?’ అని ప్రశ్నించారు. కాగా, కేటీఆర్ వ్యాఖ్యలను నిరసిస్తూ మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో నాంపల్లి వద్ద ధర్నా నిర్వహించారు. స్పందించని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యల దుమారం రేగుతున్నా... ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. నగరంలో జరిగిన డిజిటల్ కార్డులు సమావేశంలో మిగిలిన విషయాలు మాట్లాడినా ఈ వివాదంపై ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోవడం గమనార్హం. నాగార్జున పరువునష్టం దావా మంత్రి కొండా సురేఖపై సినీనటుడు అక్కినేని నాగార్జున నాంపల్లి కోర్టులో పరువునష్టం దావా వేశారు. నటి సమంత, నాగచైతన్య విడాకులు తీసుకోవడంలో తన ప్రమేయం ఉందంటూ మంత్రి చేసిన వ్యాఖ్యలపై నాగార్జున కోర్టును ఆశ్రయించారు. తన కుటుంబ సభ్యుల పరువుకు మంత్రి భంగం కలిగించారని నాగార్జున పేర్కొన్నారు. ఆమెపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరారు. మరో వైపు కొండా సురేఖపై పలువురు బీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్లు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేటీఆర్‌తోపాటు సినీ ప్రముఖులపై చేసిన ఆరోపణలకుగాను ఆమెపై కేసు పెట్టాలని కోరారు. కేటీఆర్‌పై ఆమె చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని, బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. -
Tollywood: మేము సైతం
ఆపదలో ఉన్నవారిని ఆదుకునేందుకు తెలుగు చిత్ర పరిశ్రమ ఎప్పుడూ ముందుంటుంది. ఇటీవల కేరళలో సంభవించిన వరదల సమయంలో తెలుగు నటులు కొందరు భారీ విరాళాలు ప్రకటించారు. తాజాగా తెలుగు రాష్ట్రాల్లోని వరద బాధితుల సహాయార్థం తెలుగు హీరోలు, నిర్మాతలు, హీరోయిన్లు ‘మేము సైతం’ అంటూ విరాళాలు ప్రకటించారు.‘‘తెలుగు రాష్ట్రాల్లో వరద ప్రభావం వల్ల ప్రజలకు కలిగిన, కలుగుతున్న కష్టాలు కలచివేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల నిర్దేశంలో రెండు ప్రభుత్వాలు శాయశక్తులా పరిస్థితిని మెరుగుపరచడానికి కృషి చేస్తున్నాయి. మనందరం ఏదో విధంగా సహాయక చర్యల్లో ΄ాలుపంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇందులో భాగంగా రెండు రాష్ట్రాలలో ప్రజల ఉపశమనానికి తోడ్పాటుగా నా వంతు కోటి రూ΄ాయలు (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కి 50 లక్షలు చొప్పున) విరాళంగా ప్రకటిస్తున్నాను’’ అంటూ ‘ఎక్స్’లో షేర్ చేశారు చిరంజీవి.→ ‘‘అక్కినేని నాగేశ్వరరావు గారు ఆపదలో ఆదుకోవడానికి, ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రజలకు అండగా నిలవడానికి ఎప్పుడూ ముందుండేవారు. వరద బాధితులని ఆదుకునేందుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రుల సహాయ నిధికి యాభై లక్షల రూ΄ాయల చొప్పున విరాళంగా అందిస్తున్నాం. ఈ సంక్షోభంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలకు అండగా నిలుస్తాం. వరద దృశ్యాలు హృదయ విదారకంగా ఉన్నాయి’’ అని అక్కినేని కుటుంబం పేర్కొంది. విశాఖపట్నంలోని అలు ఫ్లోరైడ్ లిమిటెడ్, హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్, అక్కినేని కుటుంబానికి చెందిన గ్రూప్ కంపెనీస్ ఈ విరాళాన్ని అందజేస్తున్నాయి.→ తెలుగు రాష్ట్రాల్లోని వరద బాధితుల సహాయార్థం రూ. 6 కోట్ల విరాళం ప్రకటించారు నటుడు, జనసేన అధ్యక్షుడు, ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్. ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. కోటి, ఏపీ పంచాయతీ రాజ్ మంత్రిగా ఉన్నందున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వరద ముంపు బారిన పడిన 400 పంచాయితీలకు రూ. 1 లక్ష చొప్పున రూ. 4 కోట్లు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. కోటి, ఇలా మొత్తంగా రూ. ఆరు కోట్లను పవన్ కల్యాణ్ విరాళంగా అందించనున్నారు. → తెలుగు రాష్ట్రాల్లోని వరద బాధితుల సహాయార్థం ప్రభాస్ రూ. 2 కోట్లు విరాళాన్ని అందజేయనున్నట్లుగా ఆయన సిబ్బంది వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రుల సహాయనిధికి కోటి రూ΄ా యల చొప్పున విరాళం అందించనున్నట్లుగా ప్రభాస్ టీమ్ పేర్కొంది.→ ‘‘వర్షాలు, వరదల వల్ల ఇబ్బందులు పడుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు మనం చేయూత అందించాల్సిన సమయం ఇది. నా వంతు బాధ్యతగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్‌కు కోటి రూ΄ాయలు విరాళంగా ప్రకటిస్తున్నా’’ అంటూ రామ్‌చరణ్ ‘ఎక్స్’లో షేర్ చేశారు.→ ‘‘తెలగు రాష్ట్రాల్లోని వరద పరిస్థితులను చూస్తుంటే బాధగా ఉంది. నా వంతుగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి కోటి రూ΄ాయల విరాళం అందిస్తున్నాను’’ అంటూ ‘ఎక్స్’లో షేర్ చేశారు అల్లు అర్జున్.→ తెలుగు రాష్ట్రాల్లోని వరదల కారణంగా ప్రజలు పడుతున్న కష్టాల్ని చూసి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రుల సహాయ నిధులకు రూ. 10 లక్షల చొప్పున 20 లక్షలు... అలాగే విజయవాడలోని అమ్మ ఆశ్రమం, ఇతర స్వచ్ఛంద సంస్థలకు రూ .5 లక్షలు.. ఇలా మొత్తంగా రూ. 25లక్షలను విరాళంగా ప్రకటిస్తున్నట్లుగా వెల్లడించారు సాయిదుర్గా తేజ్.→ తెలుగు రాష్ట్రాల్లో వరదల కారణంగా నెలకొన్న విపత్కర పరిస్థితుల నేపథ్యంలో తన వంతుగా సహాయ కార్యక్రమాలు చేస్తున్నానని, తన సిబ్బంది వరద బాధితులకు ఆహారం, తాగునీరు, మెడికల్ కిట్స్ అందిస్తూ, సహాయ కార్యక్రమాల్లో ముమ్మరంగా ΄ాల్గొంటున్నారని సోనూసూద్ తెలి΄ారు. బుధవారం పైన పేర్కొన్న నటులు విరాళం ప్రకటించగా, అంతకుముందు విరాళం ప్రకటించినవారి వివరాల్లోకి వెళితే... ఏపీ, తెలంగాణ సీఎంల సహాయ నిధికి రూ. 50 లక్షలు చొప్పున కోటి రూ΄ాయలు బాలకృష్ణ, మహేశ్‌బాబు, ఎన్టీఆర్ విరాళంగా ప్రకటించారు. దర్శకుడు త్రివిక్రమ్– ఎస్. రాధాకృష్ణ–ఎస్. నాగవంశీ ఏపీ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 25 లక్షలు, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 25 లక్షలు అందజేస్తున్నట్లుగా తెలి΄ారు. తెలుగు రాష్ట్రాలకు 15 లక్షల రూ΄ాయల చొప్పున మొత్తంగా రూ. 30 లక్షలు విరాళంగా ప్రకటించారు సిద్ధు జొన్నలగడ్డ. విశ్వక్ సేన్, దర్శకుడు వెంకీ అట్లూరి మొత్తంగా పది లక్షలు, హీరోయిన్ అనన్య నాగళ్ల 5 లక్షలు (ఏపీ 2.5 లక్షలు, తెలంగాణకు 2.5 లక్షలు) విరాళం ప్రకటించారు. దర్శకుడు–నటుడు తల్లాడ సాయికృష్ణ రూ. లక్షా యాభై వేలుని ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలకు విరాళంగా ప్రకటించారు. -
తెలుగు చిత్ర పరిశ్రమకు ఐబొమ్మ స్ట్రాంగ్ వార్నింగ్..!
-
యాసలందు అన్ని యాసలూ లెస్స
ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో ‘యాస’ల ట్రెండ్ నడుస్తోంది. పాత్రలకు తగ్గట్టు స్టార్స్ ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల యాసలు పలకడానికి ‘యస్’ చెబుతున్నారు. ఏ యాసకి ఆ యాస ఆడియన్స్‌ని థియేటర్స్‌కి రప్పించడానికి ఉపయోగపడుతోంది. అందుకే ‘యాసలందు అన్ని యాసలూ లెస్స’ అని చెప్పాలి. ప్రస్తుతం ‘పుష్ప 2, హరోం హర’తో పాటు విశ్వక్ సేన్ చిత్రం, అనన్య నాగళ్ల మూవీ వంటి పలు సినిమాలు ఆయా ప్రాంత యాసల నేపథ్యంలో రూపొందుతున్నాయి.. వాటిపై ఓ లుక్కేద్దాం. పుష్పగాడి రూలు ‘పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఫైరు’... ‘తగ్గేదే లే’ అంటూ ‘పుష్ప’ తొలి భాగం ‘పుష్ప: ది రైజ్’లో హీరో అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్ ఎంత పాపులర్ అయిందో చెప్పక్కర్లేదు. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో హిట్ అయింది. ఈ చిత్రంలో హీరో, హీరోయిన్ సహా దాదాపు అన్ని పాత్రలు రాయలసీమలోని చిత్తూరు యాసలో మాట్లాడతాయి. ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘పుష్ప 2: ది రూల్’ కూడా చిత్తూరు యాసలో రూపొందుతోంది. అల్లు అర్జున్, రష్మికా మందన్న జంటగా సుకుమార్ దర్శకత్వంలో నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఇక ‘అడవిలో జంతువులు రెండడుగులు ఎనక్కి ఏసినాయంటే పులి వచ్చుండాదని అర్థం.. అదే పులి రెండడుగులు ఎనక్కి ఏసినాదంటే పుష్ప వచ్చుండాడని అర్థం’, ‘పుష్పగాడి రూలు’ వంటి డైలాగులు ‘పుష్ప 2: ది రూల్’ గ్లింప్స్‌లో ఉన్నాయి. ఇంగ సెప్పేదేం లేదు.. సేసేదే సుధీర్‌బాబు హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘హరోం హర’. జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో సుమంత్ జి. నాయుడు నిర్మిస్తున్నారు. చిత్తూరు జిల్లా కుప్పంలో జరిగిన 1989 నాటి కథతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా టీజర్లో ‘సుబ్రహ్మణ్యం అన్న.. జనాలు నీ కోసం సూస్తా ఉండారు.. అట్లా కదలకుండా ఉంటే ఎట్లా.. ఏందోకటి సెప్పు’, ‘ఇంగ సెప్పేదేం లేదు.. సేసేదే’ వంటి చిత్తూరు యాస డైలాగులు వినిపించాయి. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమా డిసెంబర్ 22న విడుదల కానుంది బ్లాక్.. వైట్ ఉండదు.. ‘సామాజిక నిబంధనలను ధిక్కరించే ప్రపంచంలో బ్లాక్ ఉండదు, వైట్ ఉండదు, గ్రే మాత్రమే ఉంటుంది’ అంటూ ‘వీఎస్ 11’ (వర్కింగ్ టైటిల్) చిత్రం వీడియో రిలీజ్ అయింది. విశ్వక్ సేన్ హీరోగా కృష్ణ చైతన్య దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లోని చీకటి సామ్రాజ్యం నేపథ్యంలో పీరియాడిక్ చిత్రంగా ఈ సినిమా రూపొందుతోంది. ఇందులో విశ్వక్ సేన్ గోదావరి యాసలో మాట్లాడతారు. శ్రీకాకుళం యాసతో... అనన్య నాగళ్ల, రవి మహాదాస్యం జంటగా ‘వెన్నెల’ కిశోర్ కీలక పాత్రలో రాజా రామ్మోహన్ చల్లా దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది. బేబీ లాస్య రెడ్డి సమర్పణలో వెన్నపూస రమణారెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కథాంశం శ్రీకాకుళం యాస నేపథ్యంలో సాగుతుంది. నెల్లూరి నెరజాణ డైరెక్టర్ నాగ్ అశ్విన్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసిన చిగురుపాటి సుబ్రమణ్యం స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘నెల్లూరి నెరజాణ’. ఎంఎస్ చంద్ర, హరి హీరోలుగా, అక్షా ఖాన్ హీరోయిన్గా నటించిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ చిత్రం పక్కా నెల్లూరు యాసలో రూపొందినట్లు చిగురుపాటి సుబ్రమణ్యం తెలిపారు. ఇవే కాదు.. మరికొన్ని చిత్రాల్లో కూడా ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ యాస వినిపించనుంది. -
రాజకీయాల్లో సినిమావాళ్ల విలువ ఎంతంటే..
రాజకీయాలలో సినిమా వాళ్ల పాత్ర ఏమిటి?.. వాళ్లు ప్రచారం చేసినంత మాత్రాన గెలిచిపోతారా? ప్రతిసారి ఎన్నికల సమయంలో ఇలాంటి చర్చలు సహజంగానే జరుగుతుంటాయి. తెలుగు సినీ ప్రముఖుడు బ్రహ్మానందం కర్నాటకలోని చిక్ బళ్లాపూర్ నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేశారు. ఆయనను చూడడానికి జనం కూడా బాగానే వచ్చారు. కానీ, ఆయన మద్దతు ఇచ్చిన బిజెపి అభ్యర్ధి డాక్టర్ సుధాకర్ మాత్రం పరాజయం చెందారు!. అయితే.. డాక్టర్ సుధాకర్.. 2018 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధిగానే ఇక్కడ గెలిచారు. కాని.. ఆ తర్వాత పరిణామాలలో పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరి ఉప ఎన్నికలో పోటీచేసి సుమారు 35 వేల ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. అంత మెజార్టీ వచ్చింది కదా అనే ధీమాతో.. తాజా అసెంబ్లీ ఎన్నికలో కూడా గెలుస్తాననే భావనలో కూరుకుపోయిన సుధాకర్‌కు చిక్ బళ్లాపూర్ ఓటర్లు షాక్ ఇచ్చారు. సుమారు 10,500 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారాయన. తెలుగువారు కూడా గణనీయంగా ఉండే ఆ నియోజకవర్గంలో బ్రహ్మానందం ప్రచారం కూడా ఉపయోగపడుతుందని ఆశించారు. దాని వల్ల ఏమనా కాంగ్రెస్ అభ్యర్ధి అయ్యర్ మెజార్టీ కాస్త తగ్గిందేమో తెలియదు కాని, బిజెపి ఓటమి మాత్రం తప్పలేదు. నిజానికి బ్రహ్మానందం రాజకీయ మిషన్ తో అక్కడ ప్రచారం చేయలేదు. తనకు వ్యక్తిగత సంబంధాలు ఉండడంతో ఆ నియోజకవర్గంలో ప్రచారం చేసి వచ్చారట. ఇలా కొన్నిసార్లు యాక్టర్ లు సిద్దాంతాలు,పార్టీలతో నిమిత్తం లేకుండా తమకు ఉన్న సంబంధ, బాంధవ్యాల రీత్యా ప్రచారం చేస్తుంటారు. అన్నిసార్లు వాటి వల్ల ఉపయోగం ఉంటుందని చెప్పలేం కాని, కొన్నిసార్లు కొంత ప్రయోజనం ఉండవచ్చు. అంతమాత్రాన వారే రాజకీయాలు శాసించే పరిస్తితి లేదనే చెప్పాలి. ఇందుకు కొన్ని మినహాయింపులు ఉండవచ్చు. 👉 తమిళనాడులో అన్నాదురై, కరుణానిది, ఎమ్.జి.ఆర్, జయలలిత వంటివారు ఆ రాష్ట్ర రాజకీయాలను శాసించారు. తమకు ఉన్న సినిమా పాపులారిటీతో పాటు పార్టీ సిద్దాంతం కూడా వారికి కలిసి వచ్చింది. ప్రజలలో మమేకం అయ్యే వారి లక్షణం ఉపయోగపడింది. కానీ, అక్కడే మరో నటుడు విజయకాంత్ రాణించలేకపోయారు. కమల్ హసన్‌ది అయితే మరీ దయనీయం. రజినీకాంత్ రాజకీయాలలోకి రావాలో ,వద్దో తేల్చుకోలేక చివరికి ఆ వైపు వెళ్లరాదని నిర్ణయించుకున్నారు. 👉 ఏపీలో ఎన్టీఆర్(దివంగత) వచ్చేవరకు సినిమావారికి విశేష ప్రాధాన్యం లేదనే చెప్పాలి. కళావాచస్పతి కొంగర జగ్గయ్య ఒకసారి లోక్ సభకు మాత్రం కాంగ్రెస్ పక్షాన ఎన్నికయ్యారు. అది 1971 లో ఇందిరాగాంధీ వేవ్ లో అని గుర్తించాలి. ఆ తర్వాత ఆయన ఒకసారి అసెంబ్లీకి పోటీచేసి ఘోరంగా ఓటమి చెందారు. ఆయన ఒక్కరే కాదు. ప్రముఖ నటుడు కృష్ణ, జమున,కైకాల సత్యనారాయణ, కోట శ్రీనివాసరావు, శారద, మురళీమోహన్, రామానాయుడు ఇలా పలువురు సినిమావారు ఎన్నికల రాజకీయాలలో ఒకసారికే పరిమితం అయ్యారు. విజయనిర్మల ఆ ఒక్కసారి కూడా విజయం సాధించలేకపోయారు. మరో నటుడు నరేష్ తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు కాని సఫలం కాలేదు. 👉 తెలుగుదేశం పార్టీ పెట్టిన ఎన్.టి.రామారావు 1983లో రెండు చోట్ల, 1985లో మూడు చోట్ల పోటీచేసి విజయం సాధించి రికార్డు సృష్టించారు. కాని 1989 లో ఆయన రెండు చోట్ల పోటీచేసి ఆశ్చర్యంగా ఒకచోట ఓటమి చెందారు. మళ్లీ 1994లో రెండు చోట్ల పోటీచేసి గెలిచారు. తొమ్మిది చోట్ల పోటీచేసి ఎనిమిదింట గెలవడం ఒక రికార్డే అయినా, ఒకసారి ఓటమి మాత్రం ఆయన ప్రతిష్టను దెబ్బతీసింది. ఆయన ఒక సిద్దాంతంతో ప్రజల ముందుకు రావడం, అప్పట్లో రాజకీయ శూన్యత ఉండడం కలిసి వచ్చింది. అయితే ఎన్.టి.ఆర్.ను 1989లో ఓడించడంలో కొంతమంది సినిమావారి ప్రచార ప్రభావం కూడా కొంత ఉపయోగపడింది. అంటే జనంలో ప్రభుత్వంపై, లేదా ఒక రాజకీయ పార్టీపై వ్యతిరేకత ఏర్పడినప్పుడు సినిమావారి ప్రచారాలు అదనంగా కలిసి వస్తాయని అనుకోవచ్చు. అదే ప్రభుత్వంపై లేదా రాజకీయ పార్టీ పై వ్యతిరేకత లేనప్పుడు ఎంత పెద్ద సినీ నటుడు ప్రచారం చేసినా ప్రయోజనం ఉండదని అనుభవం చెబుతుంది. 👉 ప్రముఖ నటుడు చిరంజీవి సొంతంగా పార్టీ పెట్టి రెండు చోట్ల పోటీచేసి ఒకచోట మాత్రమే గెలవగలిగారు. ఆ తర్వాత ఎక్కువకాలం ఆయన పార్టీని నడపలేకపోయారు. చిరంజీవి సభలకు జనం పోటెత్తినా ఆశించిన ఓట్లు రాలేదు. ఆయనకు రాజకీయ వ్యూహం కొరవడడమే కారణం అని చెప్పాలి. ఆయన సోదరుడు పవన్ కళ్యాణ్ 2014లో జనసేన పార్టీని స్థాపించి కేవలం ప్రచారానికి పరిమితం అయ్యారు. టీడీపీ గెలుపునకు ఆయనే కారణమని అభిమానులు భావించేవారు. అదే పవన్ కళ్యాణ్ 2019లో మరో రాజకీయ కూటమి ఏర్పాటు చేసి పోటీలో దిగి రెండు చోట్ల పోటీచేస్తే , ఆ రెండిట ఓడిపోవడం విశేషం. ఆయన ఫెయిర్ రాజకీయాలు చేయకపోవడం, తెలుగుదేశంతో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో అంటకాగడం, ఆయనను నమ్ముకున్న అబిమానులు, కాపు సామాజికవర్గ నేతల అబిప్రాయాలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవడం వంటి కారణాల వల్ల ఆయన రాజకీయంగా సఫలం కాలేకపోయారు. తిరిగి 2024లో కూడా టిడిపికి తోక పార్టీగానే ఉండాలని ఆయన నిర్ణయించుకోవడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇంతకాలం ఆయనను సి.ఎమ్.,సి.ఎమ్.అంటూ నినదించిన అభిమానులకు ఆశాభంగం కలిగిస్తూ చంద్రబాబుకు ఆయన ఆ విషయంలో సరెండర్ అయిపోయి తనకు బలం లేదని చెప్పేసుకుని దెబ్బతిన్నారు. ఒక్క ఎమ్మెల్యేగా గెలిస్తే చాలన్న ఆయన కోరిక 2024లో నెరవేరుతుందా?లేదా? అన్నది చూడాల్సి ఉంది. 👉 వైఎస్సార్సీపీ పక్షాన పోటీచేసి మరో ప్రముఖ నటి రోజా మంత్రి కాగలిగారు. ఆమె ఇప్పటికి రెండుసార్లు విజయం సాధించారు. ఒక ప్రముఖ పార్టీలో కొనసాగి,నాయకుడి పట్ల విధేయతతో ఉండడం , ఒక సిద్దాంతానికి కట్టుబడి ఉండడం వంటి కారణాలు ఆమె రాజకీయ సాఫల్యానికి కారణాలుగా కనిపిస్తాయి. మరో ప్రముఖ నటి జయప్రద ఏపీ నుంచి తొలుత రాజ్యసభ సభ్యురాలైనా, ఆ తర్వాతకాలంలో ఆమె యూపీ నుంచి రెండుసార్లు లోక్ సభ కు ఎన్నికై సంచలనం సృష్టించారు. యుపిలో మాజీ ముఖ్యమంత్రి మూలాయం సింగ్ యాదవ్ తో పాటు , ఆయన పార్టీలోని కొందరి అండ ఉండడంతోనే అది సాద్యమైంది. 👉👉జాతీయ రాజకీయాలలోకాని, ఆయా రాష్ట్రాలలో కాని సినీ ప్రముఖులు పూర్తి స్థాయిలో రాణించిన సందర్భాలు తక్కువేనని చెప్పాలి. కాకపోతే యాక్టర్ లకు ఉండే అడ్వాంటేజ్ ఏమిటంటే వారు తమ సినిమాల ద్వారా ప్రజలను కొంత ప్రభావితం చేస్తారు. జనంలోకి వస్తే వారిని తేలికగా గుర్తు పడతారు. వారి గ్లామర్ ఆ రకంగా ఉపయోగపడుతుంది. అందుకే ఏదైనా వ్యాపార సంస్థ ప్రారంభోత్సవానికి కూడా సినీ నటులను అతిధులుగా ఆహ్వానిస్తుంటారు. అంతమాత్రాన ఆ వ్యాపారాలు సక్సెస్ అయిపోతాయని కాదు. వారి వ్యూహంతో పాటు, ప్రజలలో తేలికగా బ్రాండ్ ఇమేజీ తెచ్చుకోవడానికి సినీ నటులు ఉపయోగపడతారని భావించడమే. అలాగే రాజకీయాలలో కూడా వీరు కొంత బ్రాండ్ ఇమేజీకి పనికి వస్తారు కాని, సిద్దాంత పునాది, పెద్ద రాజకీయ పార్టీ మద్దతు లేకుండా వీరు రాణిస్తారని, వీరి ప్రచారంతోనే అభ్యర్ధులు గెలిచిపోతారని అనుకుంటే అది భ్రమేనని పలు అనుభవాలు తెలియచేస్తున్నాయి. ::: కొమ్మినేని శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్ మీడియా అకాడమీ ఛైర్మన్ -
తెలుగు సినిమాల్లో సరిగ్గా 91 ఏళ్ల కిందట..
తొలి పూర్తి తెలుగు టాకీ సినిమా ‘భక్త ప్రహ్లాద’ విడుదలై నేటికి సరిగ్గా 91 ఏళ్లు నిండాయి. ఇది తెలుగు సినిమా పరిశ్రమలో ఒక చరిత్రాత్మక సంఘటన. అంతకు ముందు సగం తెలుగు, సగం తమిళంతో 1931 అక్టోబర్ 31న తొలి దక్షిణ భారతీయ భాషా టాకీ ‘కాళిదాస్’ వచ్చింది. ఆ పైన పూర్తిగా తెలుగు మాటలు, పాటలతో ‘భక్త ప్రహ్లాద’ 1932 ఫిబ్రవరి 6న విడుదలై సంచలనం సృష్టించింది. అందుకే ఫిబ్రవరి 6న మొదటి పూర్తి తెలుగు టాకీ ఆవిర్భావ సంబరాలు జరుపుకొంటారు. గతంలో ఈ సినిమా సెప్టెంబరు 15న విడుదల అయినట్టు ప్రచారం జరిగింది. కాని సీనియర్ జర్నలిస్టు డా‘‘ రెంటాల జయదేవ ఎన్నో యేళ్ళు ఊరూరా తిరిగి, ఎంతో పరిశోధించి, సాక్ష్యాలు సేకరించి, ఈ సినిమా 1932 జనవరి 21న బొంబాయిలో సెన్సారై, ఫిబ్రవరి 6న అక్కడే తొలిసారి విడుదలై నట్లు ఆధారాలతో నిరూపించారు. ఆ విధంగా 1932 ఫిబ్రవరి 6న బొంబాయి శ్రీకృష్ణా సినిమా ధియేటర్లో విడుదలైన తర్వాత, విజయవాడ, రాజమండ్రి తదితర ప్రాంతాలకు వెళ్ళి, విజయవంతంగా ఆడింది. 1932 ఏప్రిల్ 2న మద్రాసులోని ‘నేషనల్ పిక్చర్ ప్యాలస్’లో విడుదల చేశారు. ఈ చిత్ర దర్శకుడు హెచ్ఎమ్ రెడ్డి. సురభి కళాకారులు సహా పలువురిని బొంబాయి తీసుకెళ్ళి అక్కడ స్టూడియోలో 20 రోజుల్లో షూటింగ్ పూర్తిచేశారు. ఆ రోజుల్లో.. చిత్ర నిర్మాణా నికి సుమారు రూ. 20 వేలు ఖర్చయింది. ఈ సినిమా సహజంగానే అనేక రికార్డులు నమోదు చేసుకుంది. ఇందులో లీలావతిగా నటించిన ‘సురభి’ కమలాబాయి తొలి తెలుగు తెర ‘కథా నాయిక’. ఈ చిత్ర నిర్మాణానికి ప్రధాన కారకులు పూర్ణా మంగరాజు. ఆంధ్రాలో తొలి సినీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ‘క్వాలిటీ పిక్చర్స్’ వ్యవస్థాపకుడు. ఈ చిత్ర గీత రచయిత ‘చందాల కేశవదాసు’. ఆ విధంగా తొలి పూర్తి తెలుగు సినిమా తయారై సంచలనం సృష్టించింది. దురదృష్టవశాత్తూ ఈ ఫిల్మ్ ప్రింట్ ఇప్పుడు లభ్యం కావడం లేదు. నిజానికి, టాకీలు రావడానికి చాలాకాలం ముందే మూకీల కాలం నుంచి మన సినీ పితామహులు రఘుపతి వెంకయ్య నాయుడు వంటివారెందరో మన గడ్డపై సినిమా నిలదొక్కు కొని, అభివృద్ధి చెందడానికి ఎంతో కృషి చేశారు. అప్పట్లోనే తన కుమారుడు ప్రకాశ్‌ని విదేశాలకు పంపి ప్రత్యేక సాంకేతిక శిక్షణనిప్పించి, సినిమాలు తీసి తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధికి దోహదం చేశారు వెంకయ్య. ఇలాంటి వారి గురించి ముందు తరాల వారికి తెలియజేసే కార్యక్రమాలను సినిమా పెద్దలు, ఫిల్మ్ ఛాంబర్ లాంటి సంస్థలు, పాలకులు నిర్వహించాలి. తెలుగు సినిమా ఆవిర్భావ దినాన్ని ఒక ఉత్సవంగా నిర్వహించి... భావి తరాలకు తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధికి సంబంధించిన విషయాలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. అలాగే పాత చిత్రాలు అన్నీ సేకరించి ఒక సినీ మ్యూజియం ఏర్పాటు చేయాలి. ఇటువంటిది దేశంలో పుణేలో ఉంది. ప్రపంచ ఉత్తమ చిత్రాలు ప్రదర్శిస్తున్న వైజాగ్ ఫిలిం సొసైటీ ‘తెలుగు టాకీ సినిమా ఆవిర్భావ దినోత్సవం’ సందర్భంగా ఫిబ్రవరి 6 నుండి 8 వరకు క్లాసిక్ చిత్రాలు ప్రదర్శిస్తోంది. ఉచిత ఫిల్మ్ వర్క్‌షాప్ నిర్వహిస్తోంది. (‘భక్త ప్రహ్లాద’ విడుదలై నేటికి 91 ఏళ్లు) ::: నరవ ప్రకాశరావు; గౌరవ కార్యదర్శి, వైజాగ్ ఫిలిం సొసైటీ -
విజయలక్ష్మికి తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఘనంగా సత్కారం ( ఫొటోలు)
-
మల్టీ హంగామా.. ఆ సినిమాలపై ఓ లుక్ వేయండి!
ఈ ఏడాది మల్టీస్టారర్ ట్రెండ్ తెలుగులో బాగా కనిపించింది. ‘ఆర్ఆర్ఆర్’, ‘భీమ్లానాయక్’, ‘బంగార్రాజు, ‘ఆచార్య’ వంటి మల్టీస్టారర్ సినిమాలు వచ్చాయి. ఇద్దరు స్టార్ హీరోలు కనిపించిన ఈ ‘మల్టీ హంగామా’లను ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేశారు. వచ్చే ఏడాది మరికొన్ని మల్టీస్టారర్ ఫిల్మ్స్ రానున్నాయి. ప్రస్తుతం సెట్స్‌లో ఉన్న ఆ సినిమాలపై ఓ లుక్ వేయండి. దాదాపు ఇరవైరెండు సంవత్సరాల తర్వాత హీరో చిరంజీవి, రవితేజ స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. కేఎస్ రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో రూపొందుతున్న ‘వాల్తేరు వీరయ్య’ (ప్రచారంలో ఉన్న టైటిల్) సినిమాలోనే స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు చిరంజీవి, రవితేజ. ఇంతకుముందు ఈ ఇద్దరూ కలిసి ‘అన్నయ్య’ (2000) సినిమా చేశారు. ఆ చిత్రంలో చిరంజీవి తమ్ముడు పాత్ర చేశారు రవితేజ. ఇప్పుడు వాల్తేరు వీరయ్య’ చిత్రంలో కూడా చిరంజీవి, రవితేజ బ్రదర్స్‌గానే కనిపిస్తారనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. ఇందులో రవితేజ పోలీసాఫీసర్ పాత్రలో నటిస్తున్నారని సమాచారం. చిరంజీవి, రవితేజల కాంబినేషన్ సీన్స్ చిత్రీకరణ కూడా ఇటీవల వైజాగ్‌లో జరిగింది. ఇక అప్పుడు ‘అన్నయ్య’ చిత్రం జనవరిలో సంక్రాంతి పండక్కి రిలీజ్ కాగా, ఇప్పుడు ‘వాల్తేరు వీరయ్య’ సినిమా కూడా సంక్రాంతి సందర్భంగానే రిలీజ్ కానుండటం విశేషం. మైత్రీ మూవీమేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రుతీహాసన్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఇక వెంకటేష్, సల్మాన్ ఖాన్, రామ్‌చరణ్‌లు కలిసి సిల్వర్ స్క్రీన్‌పై ఒకేసారి కనిపిస్తే వారి అభిమానులు విజిల్స్ వేయాల్సిందే. ఈ ముగ్గురూ కలిసి హిందీ చిత్రం ‘కిసీ కీ భాయ్ కీసీ కీ జాన్’ అనే సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. సల్మాన్ ఖాన్, వెంకటేశ్ లీడ్ హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రంలో రామ్‌చరణ్‌ది అతిథి పాత్ర. ఓ పాటలో మాత్రమే చరణ్ కనిపిస్తారు. ఫర్హాద్ సామ్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే, జగపతిబాబు ఇతర లీడ్ రోల్స్ చేస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది రంజాన్‌కి రిలీజ్ చేయాలనుకుంటున్నారు. మరోవైపు ‘మనం’, ‘బంగార్రాజు’ చిత్రాల్లో పెద్ద కుమారుడు నాగచైతన్యతో కలిసి నటించిన నాగార్జున ఇప్పుడు చిన్న కుమారుడు అఖిల్‌తో ఓ సినిమా చేయనున్నారు. అక్కినేని నాగేశ్వరరావు–నాగార్జున– నాగచైతన్య నటించిన ‘మనం’లో అఖిల్ ఓ గెస్ట్ రోల్లో కనిపించిన విషయం తెలిసిందే. ఇప్పుడు నాగార్జున, అఖిల్ హీరోలుగా మోహన్‌రాజా దర్శకత్వంలో ఓ భారీ మల్టీస్టారర్ ఫిల్మ్ తెరకెక్కనుంది. ఇంకోవైపు ‘అగ్ని నక్షత్రం’ కోసం తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు తండ్రీకూతురు మంచు మోహన్ బాబు, మంచు లక్ష్మి. ప్రతీక్ ప్రజోష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విశ్వంత్, చిత్రా శుక్లా, మలయాళ నటుడు సిద్ధిఖ్ ఇతర లీడ్ రోల్స్ చేస్తున్నారు. శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, మంచు ఎంటర్టైన్ మెంట్‌పై ఈ చిత్రం రూపొందుతోంది. మలయాళ హిట్ ‘ఆండ్రాయిడ్ కుంజప్పన్ వెర్షన్ 5.25’ తెలుగు రీమేక్ హక్కులను హీరో– నిర్మాత విష్ణు మంచు దక్కించు కున్నారని తెలిసింది. ఈ సినిమాలో తండ్రి పాత్రలో మోహన్‌బాబు నటించనున్నారు. తనయుడు పాత్రలో టాలీవుడ్‌లోని ఓ యంగ్ హీరో కనిపిస్తారట. ఒకవేళ మంచు విష్ణుయే ఈ పాత్రనూ చేస్తే అది మరో మల్టీస్టారర్ అవుతుంది. ఇంకోవైపు మేనమామ... మేనల్లుడు పవన్ కల్యాణ్– సాయిధరమ్ తేజ్‌లు స్క్రీన్ షేర్ చేసుకోనున్నారనే వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. తమిళంలో విజయం సాధించిన ‘వినోదాయ సిత్తమ్’ తెలుగులో రీమేక్ కానుందని, ఈ చిత్రంలోనే పవన్ కల్యాణ్, సాయిధరమ్ నటించనున్నారన్నది ఫిల్మ్ నగర్ టాక్. సముద్రఖని ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తారట. ఇంకోవైపు మీడియమ్ రేంజ్ హీరోల మల్టీస్టారర్ మూవీస్ కూడా రానున్నాయి. హీరో సత్య దేవ్, డాలీ ధనంజయ (‘పుష్ప’ సినిమాలో యాక్ట్ చేశారు) కలిసి ఓ మల్టీస్టారర్ ఫిల్మ్ చేస్తున్నారు. ఈ సినిమాకు ఈశ్వర్కార్తీక్ దర్శకుడు. అలాగే రాజ్ తరుణ్, ‘జార్జిరెడి’్డ ఫేమ్ సందీప్ మాధవ్ ‘మాస్ మహా రాజు’ అనే సినిమా చేస్తున్నారు. ఇవేకాదు.. మరికొన్ని మల్టీస్టారర్ ఫిల్మ్స్‌కి కాంబినేషన్ సెట్ అవుతోందని తెలిసింది. -
తెలుగు పరిశ్రమలో కొత్త మార్గదర్శకాలు
కరోనా తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి (టీఎఫ్‌సీసీ–తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్) ఇటీవల నాలుగు కమిటీలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. షూటింగ్‌లు నిలిపివేసి, సుదీర్ఘ చర్చలు జరిపిన అనంతరం సెస్టెంబర్ 1 నుంచి చిత్రీకరణ పునః ప్రారంభించుకోవచ్చని తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి ఆధ్వర్యంలో నిర్మాత ‘దిల్’ రాజు పేర్కొన్నారు. షూటింగ్‌లు కూడా ఆరంభం అయ్యాయి. తాజాగా పారితోషికం, ఓటీటీ, థియేట్రికల్ అండ్ ఎగ్జిబిషన్, ఫెడరేషన్‌కు సంబంధించిన కొత్త మార్గదర్శకాలను ప్రకటిస్తూ, టీఎఫ్‌సీసీ ఓ లేఖను విడుదల చేసింది. ఈ మార్గదర్శకాలు సెప్టెంబరు 10 నుంచి అమలులోకి వస్తాయన్నట్లుగా టీఎఫ్సీపీ పేర్కొంది. కాగా ఇండస్ట్రీకి చెందిన ప్రతినిధులతో విస్తృత స్థాయి సమావేశాలు జరిపాకే ఈ కొత్త మార్గదర్శకాలను నిర్ణయించినట్లుగా టీఎఫ్‌సీసీ ఆ లేఖలో స్పష్టం చేసింది. ఆ లేఖలో పేర్కొన్న మార్గదర్శకాలు ఈ విధంగా.... ప్రొడక్షన్‌కు సంబంధించిన గైడ్‌లైన్స్ ► నటీనటులకు, సాంకేతిక నిపుణులకు రోజువారీ వేతనాలు ఉండవు. ► నటీనటులు వారి పారితోషికంలోంచే వ్యక్తిగత సిబ్బంది వేతనాలు చెల్లించుకోవాలి. అలాగే స్థానిక రవాణా, బస, స్పెషల్ ఫుడ్ వంటివి నటీనటులే సమకూర్చుకోవాలి. ఒప్పందాల ప్రకారమే నిర్మాతలు ఆర్టిస్టులకు పారితోషికాలను చెల్లిస్తారు. నటీనటులతో పాటు ప్రధాన సాంకేతిక నిపుణులకూ ఇవే నియమాలు వర్తిస్తాయి. ► సినిమా షూటింగ్ ప్రారంభించడా నికి ముందే పారితోషికాలకు సంబంధించిన ఒప్పందాలు పూర్తవుతాయి. వీటి ప్రకారమే చెల్లింపులు ఉంటాయి. ► కాల్షీట్స్ టైమింగ్, సెట్స్‌లో క్రమశిక్షణకు సంబంధించిన నియమాలు కఠినంగా అమలు చేయబడతాయి. నిర్మాతల సౌకర్యార్థం సినిమాకు సంబంధించిన షూటింగ్ రిపోర్ట్‌ను ఎప్పటికప్పుడు నమోదు చేయాలి. ఓటీటీ : ► ఓ సినిమా ఏ టీవీ చానెల్లో ప్రసారం కానుంది? ఏ ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ కానుంది? అనే అంశాలను టైటిల్స్‌లో కానీ, సినిమా ప్రదర్శనల్లో కానీ, ప్రమోషన్స్‌లో కానీ బహిర్గతం చేయకూడదు. ► థియేటర్స్‌లో రిలీజైన ఓ సినిమా ఎనిమిది వారాల తర్వాతే ఓటీటీలో స్ట్రీమింగ్ కావాలి. థియేట్రికల్ అండ్ ఎగ్జిబిషన్ ► వీపీఎఫ్ (వర్చ్యువల్ ప్రింట్ ఫీ)కి సంబంధించిన చార్జీల విషయమై డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్స్‌తో నేడు జరగాల్సిన సమావేశం 6కి వాయిదా పడింది. ► తెలంగాణలో మల్టీప్లెక్స్‌లకు ఎంత పర్సంటేజ్ ఇస్తున్నారో ఇకపై ఆంధ్రప్రదేశ్‌లోనూ అంతే ఇస్తారు. సినీ కార్మికుల సంఘం: ► కార్మికులకు సంబంధించిన సమస్యలపై తుది చర్చలు జరుగుతున్నాయి. రేట్ కార్డ్స్ ఫైనలైజ్ అయ్యాక వీటి వివరాలు అన్ని నిర్మాణ సంస్థలకు పంపించడం జరుగుతుంది. ప్రొడ్యూసర్స్ గిల్డ్, తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి తీసుకున్న నిర్ణయాల విషయమై ‘మా’ (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) అధ్యక్షుడు మంచు విష్ణుతో చర్చలు జరిపారని భోగట్టా. కొత్త మార్గదర్శకాలను ‘మా’కి లేఖ రూపంలో పంపారని సమాచారం. నటీనటుల వ్యక్తిగత సిబ్బంది పారితోషికం, సొంత రవాణా ఖర్చులు వంటివాటిపై ‘మా’ సుముఖత వ్యక్తపరిచిందట. కొత్త మార్గదర్శకాలను నటీనటులందరికీ ‘మా’ త్వరలో అధికారికంగా పంపనుందని సమాచారం. ► కొత్త మార్గదర్శకాల్లో రోజువారీ వేతనాల గురించిన అంశం ఒకటి. మామూలుగా క్యారెక్టర్ ఆర్టిస్టుల్లో పెద్ద రేంజ్ ఉన్నవారు రోజువారీ వేతనాలు తీసుకుంటారు. అయితే ఇకపై వారికి కూడా సినిమాకి ఇంత అని పారితోషికం నిర్ణయించాలనుకుంటున్నారు. మరి.. రోజువారీ వేతనాలు తీసుకునేది ఎవరూ అంటే.. అట్మాస్ఫియర్ కోసం సీన్లో నిలబడేవాళ్లు, అటూ ఇటూ కదులుతూ కనిపించేవాళ్లు, డైలాగ్స్ చెప్పే జూనియర్ ఆర్టిస్టులు .. ఇలా చిన్న స్థాయి కళాకారులు రోజువారీ వేతనాల కిందకు వస్తారు. -
అడగకపోతే... అవార్డులూ రావు!
2020వ సంవత్సరానికి గాను తాజా 68వ జాతీయ అవార్డుల ప్రకటన తెలుగు సినీ రంగానికి కొంత సంతోషమిచ్చినా, తమిళం (10 అవార్డులు), మలయాళం (9 అవార్డులు)తో పోలిస్తే, మన ఫీచర్ ఫిల్మ్‌లకు నాలుగే అవార్డులు దక్కాయన్న అసంతృప్తినీ మిగిల్చింది. సంఖ్యాపరంగా, బాక్సాఫీస్ లెక్కల పరంగా దేశాన్ని ఊపేస్తున్న తెలుగు సినిమాకు తగిన న్యాయం జరగలేదా? తాజా జాతీయ అవార్డుల తుది నిర్ణాయక సంఘంలో ఏకైక తెలుగు సభ్యుడు – ప్రముఖ దర్శకుడు వి.ఎన్. ఆదిత్యతో ‘సాక్షి’ ప్రత్యేక భేటీ... ► ఈ అవార్డుల ఎంపికలో మీ పాత్ర ఏమిటి? జాతీయ అవార్డ్స్‌లో రెండు విడతల వడపోతతో ఫీచర్ ఫిల్మ్‌ల అవార్డుల నిర్ణయం ఉంటుంది. ఈసారి తొలి వడపోతలో నార్త్, ఈస్ట్, వెస్ట్‌లకు ఒక్కొక్కటీ, సౌత్‌కు రెండు – మొత్తం 5 ప్రాంతీయ జ్యూరీలున్నాయి. ప్రతి జ్యూరీలో అయిదుగురు సభ్యులు. ఇలా 25 మంది వచ్చిన మొత్తం ఎంట్రీల నుంచి బాగున్న ఆయా భాషా చిత్రాలను ప్రాథమికంగా ఎంపిక చేశారు. అలా తొలి వడపోతలో మిగిలిన ఎంట్రీలను ఫైనల్ జ్యూరీ రెండో వడపోత చేసి, తుది అవార్డులు ప్రకటించింది. ఫీచర్ ఫిల్మ్స్ విభాగంలో 30 భాషల్లో కలిపి 305 దాకా ఎంట్రీలొచ్చాయి. ప్రాంతీయ జ్యూరీల దశ దాటి ఫైనల్స్‌కు వచ్చినవి 67 సినిమాలే. ఫైనల్ జ్యూరీలో ప్రాంతీయ జ్యూరీల ఛైర్మన్లు అయిదుగురు, మరో ఆరుగురు కొత్త సభ్యులుంటారు. వారిలో ఒకరు ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. ఆ ఫైనల్ జ్యూరీ 11 మందిలో ఏకైక తెలుగువాడిగా బాధ్యత నిర్వహించా. ► మీ బాధ్యత, పాత్ర మీకు తృప్తినిచ్చాయా? చిన్నప్పుడు బెజవాడలో సినిమాపై పిచ్చిప్రేమతో టికెట్ల కోసం హాళ్ళ దగ్గర కొట్టుకొని చూసిన సామాన్య ప్రేక్షకుడి స్థాయి నుంచి ఇవాళ ప్రభుత్వ సౌకర్యాలతో రోజూ ఉదయం 8 నుంచి రాత్రి 10 దాకా దేశంలోని ఉత్తమ సినిమాలెన్నో చూసే స్థాయికి రావడం ఫిల్మ్ లవర్‌గా నాకు మరపురాని అనుభూతి, అనుభవం. ► తమిళ, మలయాళాలతో పోలిస్తే బాగా తక్కువగా తెలుగుకు నాలుగు అవార్డులే వచ్చాయేం? ప్రాంతీయ జ్యూరీకి మొత్తం ఎన్ని తెలుగు ఎంట్రీలు వచ్చాయో తెలీదు. ఫైనల్స్‌లో మా ముందుకొచ్చినవి ‘కలర్ ఫోటో’, ‘నాట్యం’, ‘ప్లేబ్యాక్’, ‘సీజన్ ఆఫ్ ఇన్నోసెన్స్’, అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’, నితిన్ ‘భీష్మ’, విష్వక్సేన్ ‘హిట్–1’, – ఇలా ఏడెనిమిది తెలుగు సినిమాలే. ఆ లెక్కన 4 అవార్డులు మరీ తక్కువేం కాదు. ఒకప్పుడు ఉత్తమ ప్రాంతీయ చిత్రం మినహా మరే అవార్డూ దక్కని తెలుగు సినిమాకు ఇప్పుడిన్ని రావడం గమనార్హం. ► తప్పు ఎక్కడ జరిగిందంటారు? అవార్డుల ఎంపికలో అయితే కానే కాదు. కరోనాతో 2020లో సినిమాలు, ఎంట్రీలూ తగ్గాయి. కాకపోతే, సౌత్ ప్రాంతీయ జ్యూరీలు రెండిట్లోనూ తెలుగువారెవరూ లేకపోవడంతో, ఫైనల్స్‌కు మనవి ఎక్కువ చేరలేదేమో! బయట నేను చూసిన కొన్ని బాగున్న సినిమాలు కూడా ఫైనల్స్ పోటీలో రాలేదు ఎందుకనో! రెండు తెలుగు రాష్ట్రాలున్నా, ఇన్ని సినిమాలు తీస్తున్నా... ఒకే సభ్యుణ్ణి తీసుకోవడం తప్పే! ఇద్దరేసి వంతున రెండు రాష్ట్రాలకూ కలిపి నలుగురుండాలని చెప్పాను. కొన్ని రాష్ట్రాల నుంచి అవగాహన ఉన్న మంచి జర్నలిస్టులూ సభ్యులుగా వచ్చారు. అలా మన నుంచి ఎందుకు పంపరు? ► మన భాషకు న్యాయం జరగలేదని ఒప్పుకుంటారా? నా వాదన ఎంట్రీలు చూసిన సభ్యుల సంఖ్య విషయంలోనే! అవార్డుల సంగతికొస్తే కాసేపు తెలుగును పక్కనపెట్టి చూడండి. ఈసారి ప్రమాణాలు లేవని ఉత్తమ క్రిటిక్, గుజరాతీ, ఒడియా భాషల్లో ఉత్తమ ప్రాంతీయ చిత్రం అవార్డులే ఇవ్వలేదు. బాగున్న కొన్ని మారుమూల భాషలకూ అవార్డులిచ్చారు. ప్రోత్సహించాలంటూ ప్రమాణాలు లేకున్నా ప్రతి కేటగిరీలో ఎవరో ఒకరికి అవార్డులు ఇవ్వడం సరికాదని ఛైర్మన్ మొదటి నుంచీ గట్టిగా నిలబడ్డారు. జ్యూరీ పారదర్శకంగా, నిజాయతీగా చర్చించి అర్హులైనవారికే అవార్డులిచ్చింది. ► ఇతర భాషలతో పోలిస్తే మనం ఎక్కడున్నాం? ఇతర భాషలకు ఎక్కువ అవార్డులొచ్చాయి గనక మనమేమీ చేయట్లేదనుకోవడం తప్పు. మనం ఎక్కువ వినోదం, వసూళ్ళ మోడల్లో వెళుతున్నాం. ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేసే అంశంలో మనమే ముందున్నాం. సాంకేతికంగా, నిర్మాణపరంగా, ఈస్థటికల్గా, ప్రేక్షకుల కిచ్చే వినోదపరంగా మన తెలుగు సినిమా చాలా బాగుంది. మనకు ప్రతిభకు కొదవ లేదు కానీ, అవార్డుల మీద ఫోకస్సే లేదు. కొన్నిసార్లు హీరో ఇమేజ్ కోసం కథలో కాంప్రమైజ్ కావడం, పాటలు, ఫైట్లు పెట్టడం లాంటివి మనకు ఎక్కువ. అలా చేయని మల యాళ, తదితర భాషా చిత్రాలకు మనకన్నా అవార్డులు ఎక్కువ రావచ్చు. అయినా, అవార్డు అనేది ఆ ఒక్క సినిమాకే వర్తిస్తుంది. మొత్తం పరిశ్రమకు కాదు. సహజత్వానికి దగ్గరగా తీసే సినిమాలకు వసూళ్ళు వచ్చే మోడల్ తమిళ, మలయాళాల్లో లాగా మన దగ్గరుంటే, మనమూ అలాంటి సినిమాలు తీయగలం. ► అవార్డుల్లోనూ దేశం తెలుగు వైపు తలతిప్పేలా చేయాలంటే...? (నవ్వుతూ...) మరిన్ని మంచి సినిమాలు తీయాలి. వాటిని అవార్డ్స్‌కు ఎంట్రీలుగా పంపాలి. ‘జాతీయ అవార్డులు మనకు రావులే’ అని ముందుగానే మనకు మనమే అనేసుకుంటే ఎలా? అప్లయ్ చేస్తేనేగా అవార్డొచ్చేది! తమిళ, మలయాళ, కన్నడ, చివరకు అస్సామీకి వచ్చినన్ని ఎక్కువ ఎంట్రీలు మనకు రాలేదు. ప్రయత్నలోపం మనదే! మనకు నాలుగే అవార్డులు రావడానికి అదే కారణం. అలాగే, అవార్డులకు అప్లికేషన్ సరిగ్గా నింపకపోవడం, పూర్తి వివరాలు ఇవ్వకపోవడం, సరైన కేటగిరీకి ఎంట్రీగా పంపకపోవడం, పంపిన సినిమాల్లోనూ టెక్నికల్ సమస్యల వల్ల కూడా తెలుగు సినిమాలు ఛాన్స్ పోగొట్టుకుంటున్నాయి. దీనిపై మన ఫిల్మ్ ఛాంబర్, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ద్వారా విస్తృత ప్రచారం చేసి, అవగాహన పెంచాలని నా అభ్యర్థన. నా వంతుగా నేనూ పరిస్థితులు వివరించేందుకు కృషి చేస్తా! ► మీరు ఒంటరి కాబట్టి, నేషనల్ అవార్డులకై కొట్లాడాల్సి వచ్చిందా? జ్యూరీ అంతా సినీ అనుభవజ్ఞులే. ప్రతి ఒక్కరి అభిప్రాయం తీసుకుంటారు. ఓటింగ్ కూడా ఉంటుంది. స్నేహంగానే ఎవరి పాయింట్ వారు వినిపించాం. ప్రతి తెలుగు ఎంట్రీకీ దానికి తగ్గ కేటగిరీలో అవార్డు వచ్చేందుకు నా వాదన నేనూ వినిపించా. సహజత్వానికీ దగ్గరగా ఉన్నందుకు అత్యధిక ఓట్లతో ‘కలర్ ఫోటో’కూ, స్క్రీన్‌ప్లేలో భాగమయ్యేలా పాటలకు సంగీతాన్నిచ్చి కోట్లమందికి చేరిన ‘అల వైకుంఠపురములో...’కూ, పాశ్చాత్య – సంప్రదాయ రీతుల మేళవింపుగా పూర్తి డ్యాన్స్ ఫిల్మ్ తీసి, మేకప్‌లోనూ వైవిధ్యం చూపిన ‘నాట్యం’కి – ఇలా 4 అవార్డులొచ్చాయి. సహజంగానే అన్నిటికీ రావుగా! అయితే, మన గొంతు మనం బలంగా వినిపించకపోతే, మనకు రావాల్సినవి కూడా రావు. అవార్డుల్లోనే కాదు అన్నిటా అది చేదు నిజం! – రెంటాల జయదేవ -
చిరంజీవి, మోహన్ బాబుల కీలక సమావేశం
టాలీవుడ్లో సంచలన సమావేశానికి ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ వేదిక కానుంది. కొంతకాలంగా ఉప్పు, నిప్పుల్లా వ్యవహరించిన చిరంజీవి, మోహన్ బాబులు ఒకే వేదికకు రానుండటంతో ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక ఇండస్ట్రీలోని 24 క్రాఫ్టులకు సంబందించిన ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొననున్నట్టు తెలుస్తోంది. వివరాలివి.. ప్రస్తుతం తెలుగు చిత్రపరిశ్రమ ఎదుర్కొంటున్న అనేక సమస్యల పరిష్కారానికి ఎట్టకేలకు అన్ని విభాగాలు ఒక్కతాటిపైకి వచ్చే ప్రయత్నానికి ముహుర్తం ఖరారైంది. ఫిలం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్లో ఆదివారం ఈ కీలక సమావేశం జరుగనున్నట్టు తెలుస్తోంది. కరోనా సమయంలో ఇండస్ట్రీ ఎదుర్కొన్న అనేక ఆటంకాలతో పాటు ఇటీవల తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు జారీ చేసిన జీవోలు, సినీ కార్మికుల సంక్షేమం తదితర అంశాలపై సమావేశంలో చర్చించనున్నట్టు సమాచారం. ఇక ఈ సమావేశానికి ఫిలిం ఛాంబర్లోని అన్ని సంఘాలకు సంబందించిన దాదాపు 200 మంది ప్రతినిధులు హాజరవుతారని అంచనా. సినీ పెద్దలు చిరంజీవి, మోహన్ బాబు, మురళీ మోహన్, తమ్మారెడ్డి భరద్వాజలతో పాటు మా అధ్యక్షుడు మంచు విష్ణు హాజరుకానున్నట్లు తెలుస్తోంది. అయితే చాలా కాలం తరువాత చిరంజీవి, మోహన్ బాబులు ఒకే వేధికపై కన్పించనుండటంతో ఈ సమావేశంపై ఉత్కఠ నెలకొంది. -
చిన్న ‘బంగార్రాజు’ సరికొత్త రికార్డు
తెలుగు సినీ పరిశ్రమలో టాప్ హీరోలను వదిలేస్తే.. వాళ్ళ తర్వాత మిడ్ రేంజ్ హీరోలున్నారు. అంటే వాళ్లతో మీడియం బడ్జెట్ సినిమాలు హాయిగా చేసుకోవచ్చు అన్నమాట. వారిలో రవితేజ, నాగ చైతన్య, విజయ్ దేవరకొండ, నాని, రామ్ లాంటి హీరోలుంటారు. వాళ్ల సినిమాలు హిట్టైతే 50 కోట్ల షేర్ వచ్చే అవకాశం ఉంటుంది.అయితే వీళ్ల సినిమాలు ఎప్పుడూ మినిమమ్ 30 నుంచి 40 కోట్ల షేర్ మధ్య వసూలు చేస్తుంటాయి. నాగ చైతన్యకు కూడా 30 కోట్ల మార్కెట్ ఉంది. హిట్ అయితే కచ్చితంగా 30 కోట్లు వసూలు చేయడం ఖాయం. అయితే ప్రస్తుతం చైతన్య సరికొత్త రికార్డు సృష్టించాడు. మీడియం రేంజ్ హీరోలలో వరసగా నాలుగు 50 కోట్ల గ్రాస్ అందుకున్న సినిమాలున్న హీరోగా నిలిచాడు. మీడియం రేంజ్ హీరోలలో ఈ రికార్డు ఎవరికీ సాధ్యం కాలేదనే చెప్పాలి. చైతన్య నటించిన గత నాలుగు చిత్రాలు మంచి విజయాలు సాధించడం తెలిసిందే. అందులో రెండు మల్టీస్టారర్స్ (వెంకీ మామ, బంగార్రాజు) కాగా రెండు సోలో విజయాలు. వాటిలో సమంతతో కలిసి నటించిన మజిలీ సినిమా 40 కోట్ల షేర్ వసూలు చేసింది. ఆ సినిమా 70 కోట్ల వరకు గ్రాస్ వసూలు చేసి నాగ చైతన్య కెరీర్లో బిగ్గెస్ట్ సోలో హిట్‌గా నిలిచింది. అలాగే వెంకటేష్‌తో కలిసి నటించిన వెంకీ మామ కూడా 58 కోట్ల చేసింది. ఇక శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లవ్ స్టోరితో 60 కోట్ల గ్రాస్ వసూలు చేసి ఔరా అనిపించాడు. సంక్రాంతికి రిలీజైన బంగార్రాజులో తన తండ్రి నాగార్జునతో పాటు నటించి చిన బంగార్రాజుగా అదరగొట్టాడు నాగ చైతన్య. ఈ సినిమా విడుదలైన మూడు రోజుల్లోనే 50 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్టు తెలుస్తుంది. అయితే ఇలా మీడియం రేంజ్ హీరోలలో వరసగా నాలుగు సార్లు 50 కోట్లు గ్రాస్ అందుకున్న సినిమాలు ఒక్క నాగ చైతన్య కెరీర్లో మాత్రమే ఉన్నాయి. -
Roundup-2021: కరోనా కాటేసినా కోలుకున్న టాలీవుడ్.. హిట్ మూవీస్ ఇవే
గత ఏడాది 65 చిత్రాలతో సరిపెట్టుకుంది. ఈ ఏడాది స్ట్రయిట్, డబ్బింగ్‌తో కలిపి దాదాపు 225 చిత్రాలతో ముగుస్తోంది. ఓటీటీ, కరోనా భయం కారణంగా ప్రేక్షకులు థియేటర్స్‌కు వస్తారా? రారా అనే సందేహాల మధ్య 2021 ఆరంభమైంది. అయితే వెండితెర అనుభూతిని పొందాలని కరోనా భయాన్ని పక్కనపెట్టి ప్రేక్షకులు థియేటర్లకు వచ్చారు. 50 శాతం సీటింగ్... నైట్ కర్ఫ్యూల ప్రభావం వసూళ్లపై పడినా ఆ తర్వాత 100 శాతం ఆక్యుపెన్సీతో కొన్ని బ్లాక్బస్టర్లు ఇండస్ట్రీని మళ్లీ గాడిలో పెట్టాయి. నూతనోత్సాహంతో నూతన సంవత్సరానికి ఆహ్వానం పలికేలా చేశాయి. 2021 రౌండప్ చూద్దాం. 2021 జనవరి 1న నాని ‘వి’, రాజ్ తరుణ్ ‘ఒరేయ్ బుజ్జిగా..’, ఎమ్మెస్ రాజు తెరకెక్కించిన ‘డర్టీహరి’, (2020లో ఇవి ఓటీటీలో విడుదలయ్యాయి) థియేటర్స్‌లోకి వచ్చాయి. లాక్డౌన్ నుంచి తేరుకుని అప్పుడప్పుడే ప్రేక్షకులు థియేటర్లకు వస్తున్న నేపథ్యంలో అసలు సిసలైన సందడి మొదలైంది మాత్రం సంక్రాంతి పండక్కే. రవితేజ ‘క్రాక్’, రామ్ ‘రెడ్’, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ‘అల్లుడు అదుర్స్’ సంక్రాంతికి విడుదలయ్యాయి. మిగతా రెండు చిత్రాలతో పోల్చితే ఈ సంక్రాంతి సినిమాల్లో ‘క్రాక్’ బాక్సాఫీసు దుమ్ము దులిపింది. ఆ తర్వాతి నెలలో వచ్చిన 23 చిత్రాల్లో చిరంజీవి మేనల్లుడు వైష్ణవ్ తేజ్, కృతీ శెట్టిల తొలి చిత్రం ‘ఉప్పెన’ ఘనవిజయం అందుకుంది. అలాగే ‘అల్లరి’ నరేశ్ ‘నాంది’ కూడా బాక్సాఫీస్ దగ్గర భేష్ అనిపించుకుంది. మార్చిలో వచ్చిన 20 చిత్రాల్లో శర్వానంద్ ‘శ్రీకారం’, శ్రీ విష్ణు ‘గాలి సంపత్’, నవీన్ పొలిశెట్టి ‘జాతి రత్నాలు’, కార్తికేయ ‘చావు కబురు చల్లగా..’, మంచు విష్ణు ‘మోసగాళ్ళు’, ఆది సాయికుమార్ ‘శశి’, నితిన్ ‘రంగ్ దే’, రానా ‘అరణ్య’, శ్రీసింహా ‘తెల్లవారితే గురువారం’ వంటివి ఉన్నాయి. కాగా చిన్న చిత్రాల్లో ఘనవిజయం సాధించిన చిత్రంగా ‘జాతి రత్నాలు’ టాప్ ప్లేస్‌ను దక్కించుకుంది. సమ్మర్ అంటే ఇండస్ట్రీకి మంచి సీజన్. కానీ ఈ సీజన్ కరోనా భయంతో స్టార్ట్ కావడంతో థియేటర్స్‌లో పెద్దగా సినిమాలు రాలేదు. ఏప్రిల్ నెలలో విడుదలైన 12 చిత్రాల్లో గుర్తుంచుకోదగినవి నాగార్జున ‘వైల్డ్ డాగ్’, పవన్ కల్యాణ్ ‘వకీల్ సాబ్’. ‘వైల్డ్ డాగ్’ ఫర్వాలేదనిపించుకుంది. ‘వకీల్ సాబ్’ మంచి వసూళ్లు రాబట్టాడు. కాగా, కరోనా విజృంభణతో మే, జూన్ నెలల్లో థియేటర్లకు తాళం పడింది. బ్రేక్ తర్వాత: లాక్ డౌన్ తర్వాత జూలై చివర్లో తెర సందడి ఆరంభమైంది. సత్యదేవ్ ‘తిమ్మరుసు’, తేజా సజ్జా ‘ఇష్క్’ వంటి చిత్రాలు విడుదలయ్యాయి. ఆ తర్వాతి నెలలో వచ్చిన చిత్రాల్లో కిరణ్ అబ్బవరం ‘ఎస్ఆర్ కల్యాణమండపం’, విశ్వక్ సేన్ ‘పాగల్’, శ్రీ విష్ణు ‘రాజ రాజ చోర’ వంటివి ఆదరణ పొందాయి. సుధీర్‌బాబు ‘శ్రీదేవి సోడా సెంటర్’ ఫర్వాలేదనిపించుకుంది. బాక్సాఫీస్ ఓ మోస్తరు విజయాలతో సాగుతున్న నేపథ్యంలో సెప్టెంబరులో గోపీచంద్ ‘సీటీమార్’ మోత బలంగా వినిపించింది. నాగచైతన్య ‘లవ్‌స్టోరీ’ కూడా మంచి వసూళ్లు రాబట్టింది. ఇదే ఉత్సాహాన్ని అక్టోబరులో సాయిధరమ్ తేజ్ ‘రిపబ్లిక్’, అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’, రోషన్ ‘పెళ్లి సందడి’ కొనసాగించాయి. నవంబరులో దాదాపు 23 చిత్రాలు వచ్చినా ఆశించిన ఫలితాన్ని సాధించలేకపోయాయి. ఇక డిసెంబరు ఆరంభమే ‘అఖండ’ చిత్రంతో బాక్సాఫీసును ఓ మోత మోగించారు బాలకృష్ణ. ఆ సక్సెస్ ఊపును అల్లు అర్జున్ ‘పుష్ప’, నాని ‘శ్యామ్ సింగరాయ్’ కొనసాగించాయి. ఈ నెలాఖర్లో అరడజనకు పైగా చిత్రాలు రిలీజ్‌కు రెడీ అయ్యాయి. వీటిలో రానా ‘1945’, శ్రీ విష్ణు ‘అర్జుణ ఫల్గుణ’, కీర్తీ సురేష్ ‘గుడ్‌లుక్ సఖి’ ప్రధానమైనవి. కానీ కొన్ని వాయిదా పడే చాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. డబ్బింగ్ బొమ్మ.. ఈ ఏడాది రిలీజైన 225 చిత్రాల్లో అనువాద చిత్రాలు 50 వరకూ ఉన్నాయి. ఈ డబ్బింగ్ బొమ్మల్లో హీరో విజయ్ ‘మాస్టర్’ ఫర్వాలేదనిపించుకుంది. అలాగే దర్శన్ ‘రాబర్ట్’, కార్తీ ‘సుల్తాన్’ , ఏఆర్ రెహమాన్ నిర్మించిన ‘99 సాంగ్స్’, సిద్ధార్థ్ ‘ఒరేయ్...బామ్మర్ది’, విజయ్ సేతుపతి ‘లాభం’, విజయ్ ఆంటోనీ ‘విజయ రాఘవన్’ విడుదలయ్యాయి. అయితే కంగనా రనౌత్ ‘తలైవి’, శివ కార్తికేయన్ ‘వరుణ్ డాక్టర్’లు ఆకట్టుకోగలిగాయి. పెద్ద చిత్రాల్లో రజనీకాంత్ ‘పెద్దన్న’, శివరాజ్‌కుమార్ ‘జె భజరంగీ’, మోహన్‌లాల్ ‘మరక్కర్’ చిత్రాలు ఆశించిన ఫలితాలను అందుకోలేకపోయాయి. హాలీవుడ్ తెలుగు అనువాదాల్లో ‘గాడ్జిల్లా వర్సెస్ కింగ్ కాంగ్’, ‘స్పైడర్ మ్యాన్: నో వే హోమ్’ సూపర్ కలెక్షన్స్‌ను సాధించాయి. ఇంకా ‘డోంట్ బ్రీత్’, ‘జేమ్స్ బాండ్’ (నో టైమ్ టు డై), ‘ది కంజ్యూరింగ్’, ‘వెనోమ్, ‘రెసిడెంట్ ఈవిల్’ వంటి సిరీస్‌ల్లోని తాజా చిత్రాలను ఇంగ్లిష్ మూవీ లవర్స్ చూశారు. నెట్టింట్లోకి.. కరోనా ఎఫెక్ట్‌తో ఓటీటీలకు వీక్షకుల సంఖ్య పెరిగింది. ఈ కారణంగా ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో సినిమాలు బాగానే విడుదలయ్యాయి. కానీ ప్రధానంగా చెప్పుకోదగ్గ సినిమాలు మాత్రం కొన్నే. వెంకటేశ్ ‘నారప్ప’, ‘దృశ్యం 2’, తెలుగులోకి అనువాదమైన సూర్య ‘జై భీమ్’ మంచి ఆదరణ దక్కించుకున్నాయి. నితిన్ ‘మ్యాస్ట్రో’ ఫర్వాలేదనిపించుకుంది. చిన్నవాటిలో ‘థ్యాంక్యూ బ్రదర్’, ‘బట్టల రామస్వామి బయోపిక్కు’, ‘సినిమా బండి’లకు ఆదరణ లభించింది. నాని ‘టక్ జగదీష్’, రాజ్ తరుణ్ ‘పవర్ ప్లే’, సంతోష్ శోభన్ ‘ఏక్ మినీ కథ’, శివానీ రాజశేఖర్ ‘అద్భుతం’, ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ’, సుహాస్ ‘ఫ్యామిలీ డ్రామా’, సత్య ‘వివాహభోజనంబు’, అవసరాల శ్రీనివాస్, ప్రియదర్శిల ‘అన్‌హార్డ్’, నవీన్‌చంద్ర ‘సూపర్ ఓవర్’, ‘చిల్ బ్రో’, సముద్రఖని ‘ఆకాశవాణి’, కార్తీక్‌రత్నం ‘అర్ధ శతాబ్దం’, రామ్స్ ‘పచ్చీస్’, బిగ్‌బాస్ ఫేమ్ దివ్య చేసిన ‘క్యాబ్ స్టోరీస్’ వంటివి నెట్టింట్లోకి వచ్చాయి. -
దసరా సినిమా జోష్.. బోలెడన్ని అప్డేట్స్
కొత్త పోస్టర్లు, టీజర్ విడుదలలు.. ఇలా బోలెడన్ని అప్డేట్స్తో తెలుగు చిత్రసీమలో దసరా జోష్ కనిపించింది. సిద్ధమవుతున్న శంకర్... చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందనున్న ‘బోళా శంకర్’ సినిమా షూటింగ్ నవంబరులో ప్రారంభం కానుంది. ఏకే ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మించనుంది. శుక్రవారం (అక్టోబరు 15) మహతి స్వరసాగర్ బర్త్ డే. ఈ సందర్భంగా ఈ చిత్రానికి మహతి సంగీతదర్శకుడు అనే విషయాన్ని వెల్లడించారు. వాసు రెడీ... డిసెంబరులో థియేటర్స్‌కు వస్తున్నాడు వాసు. నాని హీరోగా రాహుల్ సంకృత్యాన్ దర్శక త్వంలో వెంకట్ బోయనపల్లి నిర్మించిన చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’. ఇందులో వాసు పాత్రలో కనిపిస్తారు నాని. ఈ సినిమా మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. బేబీ స్టార్ట్... ఆనంద్ దేవరకొండ హీరోగా రూపొంద నున్న చిత్రం ‘బేబీ’. సాయిరాజేష్ దర్శకత్వంలో ఎస్కేఎన్, దర్శకుడు మారుతి నిర్మిస్తున్నారు. సుకుమార్ కెమెరా స్విచ్ఛాన్ చేయగా, అల్లు అరవింద్ క్లాప్ ఇచ్చారు. మారుతి గౌరవ దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి సహ నిర్మాత: ధీరజ్ మోగిలినేని. శ్రుతి ట్విస్టులు... ‘‘ప్రతి మగాడి విజయం వెనక ఓ మహిళ ఉన్నట్లే.. ప్రతి మహిళ సంఘర్షణ వెనక ఓ మగాడు ఉంటాడు’’ అంటున్నారు శ్రుతి. హన్సిక హీరోయిన్గా శ్రీనివాస్ ఓంకార్ దర్శకత్వంలో బురుగు రమ్యప్రభాకర్ నిర్మిస్తున్న చిత్రం ‘మై నేమ్ ఈజ్ శ్రుతి’. ఈ చిత్రంలో శ్రుతి పాత్రలో నటిస్తున్నారు హన్సిక. ‘‘సర్ప్రైజ్లు, ట్విస్టులతో ఈ సినిమా కథనం సాగుతుంది’’ అన్నారు దర్శక–నిర్మాతలు. గీత కథ... సునీల్, హెబ్బా పటేల్ హీరో హీరోయిన్లుగా వీవీ వినాయిక్ శిష్యుడు విశ్వా ఆర్. రావు దర్శకుడిగా పరిచయమవుతున్న చిత్రం ‘గీత’. ఇందులో సాయికిరణ్ విలన్. ఆర్. రాచయ్య నిర్మించిన ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. విభిన్నంగా... నోయల్, విశాఖ ధీమాన్, పోసాని కృష్ణమురళి, శ్రీకాంత్ అయ్యంగార్ ప్రధాన పాత్రల్లో లక్ష్మీ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘14’. ఈ సినిమా టీజర్‌ను శ్రీ విష్ణు విడుదల చేశారు. ‘14’ డిఫరెంట్ చిత్రం’’ అన్నారు నోయల్. టీజర్ విడుదల కార్యక్రమంలో చిత్రదర్శకుడు లక్ష్మీ శ్రీనివాస్, నిర్మాతలు సుబ్బరావు రాయణ, శివకృష్ణ నిచ్చెనమెట్ల పాల్గొన్నారు. -
పవన్ కల్యాణ్ పెద్ద సుత్తి కేసు: పేర్ని నాని
-
మా సన్నాసి పీకే గాడు నేను ఇలాగే తిట్టుకుంటాం
-
దోపిడీకి అడ్డుకట్ట పడుతుందని ఆక్రోశం: పేర్ని నాని
సాక్షి, అమరావతి: ఆన్లైన్ టికెట్ విధానం అమల్లోకి వస్తే.. బ్లాక్‌లో అధిక రేట్లకు టికెట్లు అమ్ముకునే అవకాశం ఉండదనే ఆక్రోశంతోనే జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని సమాచార, రవాణా శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) మండిపడ్డారు. రెండుచోట్ల ఎమ్మెల్యేగా నిలుచుని, ఒక్కచోట కూడా గెలవని సన్నాసిన్నర సన్నాసి అతనేనని, ఈ వెధవన్నర వెధవకు తిక్క కాదు.. ఒళ్లంతా ఉన్నది లెక్క పిచ్చే అని నిప్పులు చెరిగారు. దోపిడీదారులకు ఈ ప్రభుత్వం సింహ స్వప్నమని, నువ్వు దోపిడీ చేస్తున్నావు కాబట్టే నీకు ఈ ప్రభుత్వం సింహస్వప్నంగా కనిపిస్తోందని విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో 800 థియేటర్లలో సినిమాలు ప్రదర్శిస్తుంటే కనిపించడం లేదా? అని ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ‘సినిమాలను ఏపీ ప్రభుత్వం తొక్కేస్తోందంటావా.. మా (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) ఎన్నికల్లో ఓట్ల కోసమే కదా ఈ పిచ్చి మాటలు. ఈ పిచ్చి మాటలను నీతో మాట్లాడిస్తోంది ఎవరు?’ అని నిలదీశారు. మంత్రి ఇంకా ఏమన్నారంటే.. 800 థియేటర్లు తెరుచుకున్నాయ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమా హాళ్లను మూసివేయించిందని, తెలంగాణ ప్రభుత్వం మాత్రం తెరిపించిందని పవన్ కల్యాణ్.. కక్ష, ఈర‡్ష్యతో రాజకీయ దురుద్దేశంతో మాట్లాడటం దుర్మార్గం. ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 1,100 థియేటర్లు రన్నింగ్ కండిషన్లో ఉంటే ప్రస్తుతం 800 థియేటర్లలో సినిమాలు ఆడుతున్నాయి. తెలంగాణలో 519 థియేటర్లకు గానూ 413 థియేటర్లలో మాత్రమే సినిమాలు ప్రదర్శిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 510 థియేటర్లలో ‘లవ్‌స్టోరీ’ సినిమా ఆడుతోంది. మొదటి రోజు ఆ సినిమా ప్రొడ్యూసర్‌కు అన్ని ఖర్చులు పోనూ మిగిలిన షేర్ రూ.3.88 కోట్లు. తెలంగాణలో రూ.3 కోట్లు మాత్రమే వచ్చాయి. టికెట్ రేటు పెంచుకోవడం, ఫ్లెక్సీ రేట్లు, ఎన్ని షోలు అంటే అన్ని షోలు అక్కడ. ఆంధ్రప్రదేశ్‌లో రెండో రోజు రూ.2.67 కోట్లు ప్రొడ్యూసర్ షేర్. అదే తెలంగాణలో వచ్చిన షేర్ రూ.2.49 కోట్లు మాత్రమే. ఒకవేళ నేను చెప్పేది అసత్యమైతే ప్రొడ్యూసర్ సునిల్ నారాయణను క్షమాపణలు కోరతాను. విష ప్రచారమే పవన్‌కల్యాణ్ మాట్లాడిన అవాకులు చెవాకులు కేవలం జగన్‌పై విష ప్రచారమే అన్న వాస్తవాన్ని సినీ పెద్దలు అంగీకరించాలి. రాష్ట్రంలో సినీ పరిశ్రమను జగన్మోహన్రెడ్డి ఏం ఇబ్బంది పెట్టారో చెప్పండి. పవన్ నాయుడు నన్ను సన్నాసి అన్నారు. ఆయన, మేం చుట్టాలం. కాపు వాళ్లం. నేను సన్నాసిని అయితే ఆయన సన్నాసిన్నర. సాయిధరమ్‌తేజ యాక్సిడెంట్ గురించి కూడా ఈ వెధవన్నర మాట్లాడుతూ.. మీడియాను తప్పుబట్టాడు. ఆ రోజు తెలంగాణ పోలీసులు ఏం చెప్పారో మీడియా అదే రాసింది. ఇక్కడ తెలంగాణ పోలీసులను తప్పు పట్టాలి. కానీ నీవు ఆ పని చేయలేదు. ఎందుకు నీకు భయమా. జగన్ అంటే నీకు లోకువా. కేసీఆర్‌ను ఏమీ అనలేవా. పోటుగాడివి అని చెబుతావు కదా. దమ్ము, ధైర్యం లోపలికి పోయాయా. కేసీఆర్‌ను తిట్టాలంటే ప్యాంట్లో కారిపోతుందా. ఇది రిపబ్లిక్ ఇండియా అందుకే.. నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఇది రిపబ్లిక్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కాదు. రిపబ్లిక్ ఇండియా. అందుకే మనం పిచ్చవాగుడు ఏది వాగినా కూడా చలామణి అయిపోతుంది. నీ సోది అంతా మాకు తెలియదా. నాని, జూనియర్ ఎన్టీఆర్‌పై కపట ప్రేమ ఏమిటి. చంద్రబాబు దగ్గరికి వచ్చి కాళ్లు పట్టుకుంటావు. మోదీ కాళ్లు పట్టుకుంటావు. జగన్మోహన్రెడ్డిని జగన్‌రెడ్డి అంటావు. ఆన్లైన్ విధానాన్ని సినీ పెద్దలే కోరారు 2003 నుంచే సినీ పరిశ్రమ పెద్దలు ఆన్లైన్ టికెట్ విధానం ప్రవేశపెట్టాలని కోరుతున్నారు. తెలుగు సినిమా చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యదర్శి దామోదర్ ప్రసాద్ 2016 డిసెంబర్ 24న ఆన్లైన్ టికెట్ విధానాన్ని ప్రవేశపెట్టాలని కోరుతూ ప్రభుత్వానికి వినతిపత్రం ఇచ్చారు. ఇదే అంశంపై 2018 నవంబర్ 1న తెలుగు సినిమా చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యదర్శి రాందాస్ మరోసారి వినతిపత్రం ఇచ్చారు. ఈ నెల 20న సినీ పరిశ్రమ పెద్దలు నన్ను కలిసి అత్యంత పారదర్శకమైన ఆన్లైన్ టికెట్ విధానాన్ని ప్రవేశపెట్టాలని కోరారు. వారి కోరిక మేరకే ఆన్లైన్ టికెటింగ్ పోర్టల్‌ను ప్రభుత్వం ప్రవేశపెడుతోంది. టికెట్లను ప్రభుత్వం విక్రయించదు. థియేటర్లే అమ్ముతాయి. ఆ మరుసటి రోజు నిర్మాతకు, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్, థియేటర్ యజమానులకు వారి వారి ఖాతాల్లో నగదు జమ అవుతుంది. జీఎస్టీ, వినోద పన్ను రూపంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఖజానాకు చేరాల్సిన పన్ను మొత్తం జమ అవుతుంది. నువ్వు తీసుకునేది రూ.పది కోట్లేనా! పవన్ నాయుడూ.. ఒక సినిమాకు రెమ్యునరేషన్ రూపంలో రూ.పది కోట్లు తీసుకుంటున్నట్టు సినిమా ఫంక్షన్లో చెప్పావ్. మరి 2019లో రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ప్రజల కోసం ఏడాదికి రూ.100 కోట్లు సంపాదనను వదులుకున్నానన్నావ్. 2012 నుంచి ఇప్పటిదాకా చూస్తే తొమ్మిదేళ్లలో నువ్వు చేసింది 8 సినిమాలే. ఒరేయ్ సన్నాసిన్నర సన్నాసి పవన్ నాయుడూ.. మనలో మన మాట ఏడాదికి రూ.వంద కోట్లు సంపాదిస్తానని నువ్వు చెప్పింది తప్పేనా? పోనీ.. నీ సినిమాల్లో ఘన విజయం సాధించినవి ఏమున్నాయ్. నీ కంటే చిన్న పిల్లలు హీరోలుగా చేసిన సినిమాలకే 60 శాతం ఎక్కువ కలెక్షన్లు వస్తున్నాయ్. ఏముంది నీ గొప్ప. అధికారంలో లేకపోతే బరితెగింపా! అధికారంలో ఉన్నవారు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలి. అంటే అధికారంలో లేకపోతే బరితెగించి నీలా మాట్లాడాలా. నీవు ఏం చెప్పావు. 2012లో పార్టీ పెడతానని చంద్రబాబు దగ్గరకు పోతే, ఆయన పార్టీ పెట్టొద్దు అన్నాడని నీవే చెప్పావు. ఆ చంద్రబాబు కొడుకును గుంటూరు సభలో బండ బూతులు తిట్టావు. నేను చిన్నప్పటి నుంచే కమ్యూనిస్టుని అని కూడా చెప్పావు. 2019 ఎన్నికల్లో చంద్రబాబుకు అనుకూలంగా పార్టీ టికెట్లు ఇచ్చుకున్నావు. మంగళగిరిలో ఏం చేశావో అందరికీ తెలుసు.అలాంటి నీవు కులం, మతం గురించి మాట్లాడుతున్నావు. ఇకనుంచైనా ఒళ్లు దగ్గర పెట్టుకుంటే మంచిది. కేంద్రాన్ని అడుగు.. కేంద్రానికి ఫిర్యాదు చెయ్ సీఎం వైఎస్ జగన్‌పై కోడి కత్తితో దాడి చేసిన ఘటనపై ఎన్ఐఏ దర్యాప్తు చేస్తోంది. ఆ కేసు దర్యాప్తు ఏమైందని ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాను ప్రశ్నించు. ప్రశ్నించడానికే పార్టీ పెట్టానన్నావ్ కదా? వారిని ప్రశ్నించాలంటేనే ప్యాంటు తడిసిపోతోందా. ఇడుపులపాయ నేలమాళిగలలో డబ్బులు దాచి ఉంటే కేంద్రానికి ఫిర్యాదు చెయ్. ఎందుకీ ఒట్టి మాటలు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సినిమా థియేటర్లు కట్టించు సీఎం జగన్ అని వ్యంగ్యోక్తులు విసురుతావా? ఏం అగ్రవర్ణాల వారికే సినిమా థియేటర్లు ఉండాలా. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమం కోసం సీఎం వైఎస్ జగన్ పాటుపడుతుంటే నీకెందుకు కడుపుమంట. రానున్న రోజుల్లో ప్రభుత్వానికి ఆదాయం పెరిగితే నువ్వన్నట్టుగానే వారికి థియేటర్లు కట్టిస్తాం. బోయలను ఎస్టీల్లో, మత్స్యకారులను ఎస్సీల్లో చేర్చుతానని అప్పట్లో చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆ హామీని అమలు చేసేలా చంద్రబాబును అప్పట్లో ఎందుకు నిలదీయలేదు. కాపులను బీసీల్లో చేరుస్తానన్న చంద్రబాబు మాట తప్పితే ఎందుకు నిలదీయలేదు. అప్పుడు నోట్లో ఏం పెట్టుకున్నావ్. నువ్వు భీమవరం, గాజువాక నియోజకవర్గాల నుంచి పోటీ చేసి ఘోరంగా ఓడిపోయావ్. రెండుచోట్ల ఓడావ్ కాబట్టి నువ్వు సన్నాసిన్నర సన్నాసివి. మేం కూడా చిరంజీవి అభిమానులం. ఆయనను అన్నయ్య అంటాం. సురేఖను వదినమ్మ అంటాం. ఏరా పీకే ఆ రోజు వదినమ్మ నిన్ను బాగా చదువుకోమంది. అయినా నువ్వు ఆ పని చేయలేదు. చదవండి: (రాజకీయాల్లో పనికి మాలిన స్టార్ పవన్ కల్యాణ్) -
Andhra Pradesh: అధ్యయనం చేశాకే ‘ఆన్లైన్ సినిమా టికెట్లు’
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్లను ఆన్లైన్లో విక్రయించే అంశంపై ఉన్నత స్థాయి కమిటీతో అధ్యయనం చేయిస్తున్నామని రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, రవాణా శాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు. ఈ విషయంలో సినీ పరిశ్రమ ప్రతినిధులతో చర్చించాకే ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. మంగళవారం సచివాలయంలో మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. ఇటీవల తెలుగు సినీ రంగ ప్రతినిధులు సీఎం వైఎస్ జగన్‌ను కలిసినప్పుడు పలు అంశాలపై చర్చించారని చెప్పారు. ఇందులో భాగంగా సినిమా టికెట్లను ఆన్లైన్లో విక్రయించే అంశాన్ని పరిశీలించాలని వారు విజ్ఞప్తి చేశారన్నారు. ఈ మేరకు త్వరలోనే సీఎం సమక్షంలో సినీ రంగ ప్రతినిధులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. తెలుగు సినీ పరిశ్రమను రాష్ట్రానికి తీసుకొచ్చేలా సీఎం జగన్ అనేక చర్యలు తీసుకుంటున్నారని వివరించారు. ఇందులో భాగంగా కోవిడ్ సమయంలో పలు రాయితీలను కూడా ప్రకటించారని గుర్తు చేశారు. ఆన్లైన్ సినిమా టికెట్ల విక్రయంతో పన్ను ఎగవేతకు, బాక్ల్ టికెట్ దందాకు చెక్ పెట్టొచ్చన్నారు. అనధికార షోలు, టికెట్ ధర నియంత్రణతో ప్రజలు తక్కువ రేటుకే వినోదం అందుతుందని తెలిపారు. రాష్ట్రంలో అన్ని థియేటర్లను అనుసంధానం చేస్తూ ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించే ఆలోచనలో ఉన్నామన్నారు. ప్రతిపక్షాలది రాద్ధాంతం.. సినిమా టికెట్లను ఆన్లైన్లో విక్రయించాలన్న ప్రభుత్వ ఆలోచనపై ప్రతిపక్షంలో మేధావులుగా భావించేవారు కూడా నానా రాద్ధాంతం చేస్తుండటంపై పేర్ని నాని మండిపడ్డారు. ఈ అంశం గత రెండు దశాబ్దాలుగా నడుస్తోందన్నారు. 2002లోనే ఆన్లైన్ సినిమా టికెట్లపై కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు లేఖలు రాసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 2003లో విజయవాడకు చెందిన విశ్వ మీడియా ఎంటర్ప్రైజెస్, 2004లో విశాఖకు చెందిన గెలాక్సీ ఎంటర్‌ప్రైజెస్‌లు ఆన్లైన్లో టికెట్ల విక్రయానికి ముందుకు వచ్చాయన్నారు. 2006లో అప్పటి ప్రభుత్వం ఆన్లైన్ టికెట్ల విక్రయంపై గెజిట్ కూడా విడుదల చేసిందని చెప్పారు. 2009లో గెలాక్సీ ఎంటర్‌ప్రైజెస్‌కు అనుమతి ఇచ్చినా ఈ ప్రక్రియ మొదలుకాలేదన్నారు. ఈ అంశంపై 2017లో టీడీపీ ప్రభుత్వం.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన కమిటీని నియమించిందని గుర్తు చేశారు. మళ్లీ అదే ఏడాది హోంశాఖ కార్యదర్శి నేతృత్వంలో ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ (ఎఫ్డీసీ) ఎండీ, తెలుగు సినీ పరిశ్రమ చైర్మన్, తదితరులుతో కమిటీని ఏర్పాటు చేసిందన్నారు. 2018లో కమిటీ ఆన్లైన్లో టికెట్ల అమ్మకానికి ఆమోదం తెలిపిందని చెప్పారు. తమ ప్రభుత్వం గతేడాది అక్టోబర్ 22న ఆర్థికశాఖ కార్యదర్శి, ఎఫ్డీసీ చైర్మన్, ఏపీటీఎస్ ప్రతినిధులతో సమావేశం నిర్వహించాక కార్యాచరణ ప్రారంభించిందని తెలిపారు. అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నాకే ప్రభుత్వం ఆన్లైన్లో సినిమా టికెట్ల అమ్మకం చేపట్టాలని భావిస్తోందన్నారు. కొంతమంది వారి స్వార్థ ప్రయోజనాల కోసం ప్రభుత్వంపై బురద చల్లేందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు. ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్న ప్రభుత్వంపై అనవసర విమర్శలు చేయడం సబబు కాదని హితవు పలికారు. -
టాలీవుడ్లోకి మరో వారసురాలు!
-
టాలీవుడ్లో కొత్త రెపరెపలు!
స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా దేశంలో మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. కొత్త సినిమాల ప్రారంభోత్సవాలు, కొత్త పోస్టర్లు, విడుదల తేదీల ప్రకటనలు.. ఇలా పలు అప్డేట్స్తో తెలుగు చలన చిత్ర పరిశ్రమ రెపరెపలాడింది. ఆ అప్డేట్స్ విశేషాలు.. హిందీ హిట్ ‘అంధాధున్’ తెలుగులో ‘మ్యాస్ట్రో’గా రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. నితిన్, నభా నటేష్ జంటగా, తమన్నా ప్రధాన పాత్రలో నటించిన ‘మ్యాస్ట్రో’ కొత్త పోస్టర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని సుధాకర్‌రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మించారు. ఇక కెరీర్లో తొలిసారి ‘లక్ష్య’ చిత్రంలో విలుకాడుగా కనిపించనున్నారు నాగశౌర్య. ఈ చిత్రం కొత్త పోస్టర్ రిలీజైంది. నారాయణ్ దాస్ కె. నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు, శరత్ మరార్ నిర్మించిన ఈ చిత్రానికి ధీరేంద్ర సంతోష్ జాగర్లపూడి దర్శకుడు. మరోవైపు సుధీర్‌బాబు ‘శ్రీదేవి సోడా సెంటర్’, సుశాంత్ ‘ఇచట వాహనములు నిలుపరాదు’ కొత్త పోస్టర్స్ వచ్చాయి. అలాగే జిల్లా కలెక్టర్ పంజా అభిరామ్‌గా థియేటర్స్‌లో చార్జ్ తీసుకోనున్నారు సాయిధరమ్ తేజ్. దేవ కట్టా దర్శకత్వం వహిస్తున్న ‘రిపబ్లిక్’లో కలెక్టర్ అభిరామ్‌గా చేస్తున్నారు సాయితేజ్. జె.భగవాన్, జె. పుల్లారావు, జీ స్టూడియోస్, జేబీ ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున్న ‘రిపబ్లిక్’ గాంధీ జయంతి సందర్భంగా అక్టోబరు 1న విడుదల కానుంది. ఇక తన కెరీర్లో తొలిసారిగా నిఖిల్ గూఢచారి అవతారం ఎత్తనున్నారు. ‘గూఢచారి’, ‘ఎవరు’వంటి సినిమాలకు ఎడిటర్‌గా వర్క్ చేసిన గ్యారీ బి.హెచ్ ఈ స్పై థ్రిల్లర్ మూవీతో దర్శకుడిగా మారుతున్నారు. ఈ సినిమాకు కె. రాజశేఖర్‌రెడ్డి నిర్మాత. ఇంకోవైపు గొడవలంటే భయపడే ఓ అబ్బాయి ఒక అమ్మాయి ప్రేమకోసం విశాఖపట్నంలో ‘గల్లీరౌడీ’గా మారాడు. సందీప్ కిషనే ఈ వెండితెర గల్లీరౌడీ. ప్రముఖ రచయిత, నిర్మాత కోన వెంకట్ సమర్పణలో ఎంవీవీ సత్యానారాయణ నిర్మించిన ‘గల్లీరౌడీ’ చిత్రాన్ని సెప్టెంబరు 3న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ఆదివారం అధికారికంగా ప్రకటించింది. నేహాశెట్టి హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి సహ నిర్మాత జీవీ. జి. నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే కూడా అందించారు కోన వెంకట్. ఇటు ఆది సాయి కుమార్ ఫుల్‌స్వింగ్‌లో ఉన్నారు. వరుస సినిమాలు కమిట్ అవుతున్నారు. ఇప్పటికే ‘కిరాతక’, ‘బ్లాక్’ వంటి సినిమాలు చేస్తున్న ఆది సాయికుమార్ తాజా చిత్రం ప్రారంభోత్సవం ఆదివారం జరిగింది. ఇందులో పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్. టీఎమ్‌టీ వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమాను కల్యాణ్ జి. గోగణ డైరెక్ట్ చేస్తున్నారు. నాగం తిరుపతి రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకు తిరుమల్ రెడ్డి యెల్లా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. సత్యదేవ్;సాయిధరమ్ తేజ్; సందీప్ కిషన్, నేహాశెట్టి టాలీవుడ్లో తనదైన శైలి యాక్టింగ్‌తో ప్రేక్షకుల మనసు గెలుచుకున్న సత్యదేవ్ ‘హబీబ్’ చిత్రంతో బాలీవుడ్‌కు పరిచయం అవుతున్నారు. తన కొడుకు కోసం ఆఫ్ఘనిస్తాన్ వెళ్లిన ఓ ఆర్మీ ఆఫీసర్ కథే ‘హబీబ్’. సత్యదేవ్ ఆర్మీ ఆఫీసర్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి జెన్నీఫర్ అల్ఫోన్స్ దర్శకురాలు. ఆదివారం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ సినిమాలోని పాటను విడుదల చేశారు. వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను హబీబ్ సఫీ, కోటి రావ్ నిర్మిస్తున్నారు. ఆది, పాయల్ రాజ్‌పుత్; సుధీర్‌బాబు, ఆనంది; సుశాంత్, మీనాక్షి; ఇటు ‘బుజ్జి.. ఇలారా’ చిత్రం కోసం సీఐ కేశవ్ నాయుడిగా చార్జ్ తీసుకున్నారు ధన్‌రాజ్. ఇందులో సునీల్ మరో హీరో. ‘గరుడవేగ’ అంజి డైరెక్షన్లో సైకలాజికల్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ మూవీ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. రూపా జగదీష్ సమర్పణలో అగ్రహారం సంజీవరెడ్డి, నాగిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక డా.మోహన్, నవీన్‌చంద్ర, శ్రీకాంత్ అయ్యంగార్, కోటి ప్రధాన పాత్రధారులుగా రూపొందిన మూవీ ‘1997’. ఈ సినిమాలోని నవీన్‌చంద్ర లుక్‌ను హీరో విశ్వక్సేన్ విడుదల చేశారు. ఈ చిత్రానికి మీనాక్షీ రమావత్ ప్రొడ్యూసర్. ‘కోతికొమ్మచ్చి’ తర్వాత హీరో మేఘాంశ్ శ్రీహరి తాను నటించనున్న తర్వాతి సినిమాను తన తండ్రి, ప్రముఖ నటులు శ్రీహరి జయంతి సందర్భంగా ఆదివారం ప్రకటించారు. సి.కల్యాణ్ నిర్మించనున్న ఈ సినిమాకు ‘రాసి పెట్టుంటే’ టైటిల్‌ను ఖరారు చేశారు. నందు మల్లెల ఈ సినిమాకు దర్శకుడు. ఇంకా ‘వంగవీటి’, ‘జార్జిరెడ్డి’ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న సందీప్ మాధవ్ హీరోగా నటిస్తున్న తాజా మూవీ ‘గంధర్వ’ ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్ విడుదలయ్యాయి. అప్సర్ డైరెక్ట్ చేస్తున్న ‘గంధర్వ’ సినిమాను ఎమ్ఎన్ మధు నిర్మిస్తున్నారు. మరోవైపు ‘సింధూరపువ్వు’ రాంఖీ, హర్షిత్‌రెడ్డి, వికాస్ వశిష్ట, రాఖీ ప్రధాన పాత్రల్లో అమర్నాథ్ రెడ్డి గుంటక దర్శకత్వంలో ఆర్కే రెడ్డి నిర్మిస్తున్న ‘గగనవీధి’ సినిమా టైటిల్ ఫస్ట్‌లుక్‌ను లాంచ్ చేశారు.1980 బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈ సినిమా యువత తలచుకుంటే ఏదైనా సాధించగలరనే సందేశంతో వస్తుందని చిత్రయూనిట్ పేర్కొంది. ఇక ‘1948: అఖండ భారత్’ సినిమా పోస్టర్స్, లిరికల్ వీడియోను ఆదివారం విడుదల చేశారు. ‘ది మర్డర్ ఆఫ్ మహాత్మాగాంధీ’ అనేది ఈ చిత్రం ట్యాగ్‌లైన్. ఈ చిత్రంలో రఘునందన్, ఆర్యవర్ధన్‌రాజ్, శరద్ దద్భావల, ఇంతియాజ్, జెన్నీ, సమ్మెట గాంధీ ప్రధాన పాత్రధారులు. ఈశ్వర్ డి.బాబు దర్శకత్వంలో ఈ సినిమాను ఎమ్.వై. మహర్షి నిర్మించారు. గాంధీని గాడ్సే ఎందుకు చంపాల్సి వచ్చింది?, కోర్టులో గాడ్సే వాదనలు ఏంటి? అనే అంశాల నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందని చిత్రబృందం తెలిపింది. ‘అజాద్ హింద్’ పేరుతో అమరవీరులు, స్వాతంత్య్ర సమరయోధుల జీవితాలను ఓ ఫ్రాంచైజీలా నిర్మించనున్నట్లు వెల్లడించారు నిర్మాత విష్ణువర్ధన్. ఇందులో భాగంగా దుర్గా భాయ్ జీవితాన్ని ఫస్ట్ తెరకెక్కించనున్నట్లు ఆయన వెల్లడించారు. ‘ఆర్ఎక్స్ 100’, ‘కల్కి’, ‘జాంబీరెడ్డి’ సినిమాలకు మాటలు అందించిన సయ్యద్ ఈ చిత్రం ద్వారా దర్శకునిగా మారనున్నారు. కోవిడ్ బ్రేక్ తర్వాత థియేటర్లు రీ ఓపెన్ అయి, వరుసగా సినిమాలు విడుదలవుతుంటే మరోవైపు నిర్మాణంలో ఉన్న చిత్రాల షూటింగ్స్, కొత్త సినిమాల అప్డేట్స్తో టాలీవుడ్ కళకళలాడటం ఆనందించదగ్గ విషయం. -
నా తర్వాతి సినిమాలో తెలుగమ్మాయే హీరోయిన్
‘‘1990 వరకూ తెలుగు నుంచి చాలామంది హీరోయిన్లు వచ్చి స్టార్లు అయ్యారు. ఆ తర్వాత కాలంలో ప్రతిభావంతమైన తెలుగమ్మాయిలు వచ్చినా మంచి అరంగేట్రం దొరక్క, అనుకున్నంత స్థాయిలో మెరవలేక మరుగున పడిపోతున్నారు. నా తర్వాతి చిత్రానికి తెలుగమ్మాయినే కథానాయికగా పరిచయం చేస్తా. తను స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకుంటే హ్యాపీ’’ అని దర్శక–నిర్మాత వైవీఎస్ చౌదరి అన్నారు. ‘సీతారాముల కళ్యాణం చూతము రారండి, సీతారామరాజు, యువరాజు, లాహిరి లాహిరి లాహిరిలో, సీతయ్య, దేవదాసు, ఒక్కమగాడు, సలీం, నిప్పు, రేయ్’ వంటి చిత్రాలతో దర్శకుడిగా ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు వైవీఎస్ చౌదరి. ఆదివారం ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా వైవీఎస్ మాట్లాడుతూ – ‘‘చదువులో నేను ఫస్ట్ ర్యాంకర్‌ని. నందమూరి తారక రామారావుగారి స్ఫూర్తితో చదువును వదిలి చిత్రపరిశ్రమలోకి వచ్చాను.. సంతృప్తిగా ఉన్నాను. సినిమా ఓ అనిర్వచనీయమైన వ్యామోహం. ఈ రంగంలో ప్రతి శుక్రవారం సబ్జెక్టు మారుతుంది.. దానికి తగ్గట్లు సినిమాలు నిర్మించడం అన్నది పెద్ద ఛాలెంజ్. దర్శకునిగా నా కెరీర్ మొదలైన 23 ఏళ్లలో 10 సినిమాలే చేశా. రచయితగా, దర్శకునిగా, నిర్మాతగా మూడు బాధ్యతలు నిర్వర్తిస్తున్నా. ఒత్తిడి లేకుండా సినిమాలు చేయాలనుకుంటాను. అందుకే సినిమా సినిమాకి గ్యాప్ వస్తుంటుంది. ఎన్టీఆర్, మహేశ్‌బాబు వంటి స్టార్లతో సినిమా చేయాలని ఎవరికి ఉండదు? అన్నీ కలిసిరావాలి. నా తర్వాతి సినిమాకి కథ రెడీ. కోవిడ్ ఉధృతి తగ్గాక ప్రారంభిస్తా’ అన్నారు. -
ఇప్పుడు నాకు ఫ్యాన్స్ ఎక్కువయ్యారు!
నాయకుడు.. ప్రతినాయకుడు... హాస్యనటుడు.. సహాయనటుడు... ఇలా నటుడిగా చంద్రమోహన్ గుర్తుండిపోయే పాత్రల్లో జీవించారు. ఐదున్నర దశాబ్దాల కెరీర్లో నాలుగు భాషల్లో, నాలుగు తరాల నటులతో సినిమాలు చేసిన ఘనత చంద్రమోహన్‌ది. హీరోగా 175 సినిమాలు చేశారు. కెరీర్ మొత్తంలో 932 సినిమాలు చేశారు. ఈ విలక్షణ నటుడి పుట్టినరోజు నేడు (మే 23). 80 ఏళ్లు పూర్తి చేసుకుని, 81లోకి అడుగుపెడుతున్న చంద్రమోహన్ చెప్పిన విశేషాలు. ► కెరీర్లో స్థిరపడటం, ఆర్థిక స్థిరత్వం.. కెరీర్ తొలినాళ్లల్లో వీటిపైనే నా దృష్టి. ఈ రెండూ నెరవేరాక నేను కావాలని కోరుకున్న దర్శకుల కోసం సినిమాలు చేశాను. ►వినోదం పండించడం చాలా కష్టం. కమెడియన్‌కి గుర్తింపు రావాలంటే డైలాగుల్లో పంచ్ ఉండాలి. ప్రేక్షకుల నాడి తెలుసుకుని నటించాలి. అలాగే మరో సవాల్ ఏంటంటే.. వ్యక్తిగతంగా ఎలాంటి మూడ్‌లో ఉన్నా అది కెమెరా ముందు కనిపించనివ్వకూడదు. మరో కష్టం ఏంటంటే.. చేసినట్లే చేస్తే స్టేల్ అయ్యే ప్రమాదం ఉంది. కొత్తగా ప్రయత్నించాల్సి ఉంటుంది. కష్టమైన హాస్య పాత్రలను కూడా నేను పండించడానికి కారణం నా ఫ్యామిలీ. మా నాన్న, అక్కయ్యలు, తమ్ముడు, నేను.. మాకు మేం నవ్వకుండా ఇతరులను నవ్వించే అలవాటు ఉంది. ►నటుడిగా అన్ని రకాల పాత్రలు చేయాలనుకుని, ‘గంగ మంగ’, ‘లక్ష్మణ రేఖ’, ఇంకో సినిమాలో నెగటివ్ పాత్రలు చేశాను. ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే ఆల్ రౌండర్ అనిపించుకోవాలని గ్రహించాక అన్ని రకాల పాత్రలు చేయడం మొదలుపెట్టాను. హీరోగానే అనుకుని ఉంటే సినిమాల్లో 50 ఏళ్లకు పైగా ఉండగలిగేవాడిని కాదు. ►ఓ 50 ఏళ్లు నిర్విరామంగా సినిమాలు చేసిన నేను ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేశాను. ఎవరైనా ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకో అంటే, ‘ఇనుముకు చెదలు పడుతుందా?’ అనేవాణ్ణి. ఆ నిర్లక్ష్యమే నా ఆరోగ్యాన్ని ఇబ్బందుల్లో పడేసింది. ‘రాఖీ’లో ఎమోషనల్ సీన్ చేసి, బైపాస్ సర్జరీ కోసం ఆసుపత్రిలో చేరాను. ‘దువ్వాడ జగన్నాథమ్’ అప్పుడు ఆరోగ్యం బాగాలేకపోవడంతో షూటింగ్ వాయిదా వేయాల్సి వచ్చింది. అందుకే రిటైర్మెంట్ తీసుకోవాలనుకున్నాను. అయితే టీవీలోనో, యూ ట్యూబ్‌లోనో నా సినిమాలు వస్తున్నాయి.æగతంలో కన్నా ఇప్పుడు ఫ్యాన్స్ ఎక్కువ కావడం ఆశ్చర్యంగా అనిపించినా ఆనందంగా ఉంది. ఈ జన్మకు ఇది చాలు అనిపిస్తుంది. అయితే సినీజీవితం చాలా నేర్పించింది. పేరు, డబ్బు, బంధాలు శాశ్వతం కాదని నేర్పింది. నమ్మకద్రోహులకు దూరంగా ఉండాలని, ఆర్థికంగా జాగ్రత్తగా ఉండకపోతే ప్రమాదమని నేర్పింది. చెప్పుకోలేని చేదు నిజాల్ని ఎలా గుండెల్లో దాచుకోవాలో చెప్పింది. వృత్తి జీవితంలో ఎలాంటి లోటు లేదు. వ్యక్తిగత జీవితం కూడా అంతే. నా భార్య జలంధర మంచి రచయిత్రి అని అందరికీ తెలిసిందే. నాకు కోపం ఎక్కువ, ఆమెకు సహనం ఎక్కువ. దేవుడు ఆమెకు అంత సహనం ఇచ్చింది నా కోపాన్ని తగ్గించడానికేనేమో అనిపిస్తుంటుంది. మా ఇద్దరమ్మాయిలకు పెళ్లిళ్లయిపోయాయి. పెద్దమ్మాయి మధుర మీనాక్షి సైకాలజిస్ట్. ఆమె భర్త బ్రహ్మ అశోక్ ఫార్మాసిస్ట్. అమెరికాలో స్థిరపడ్డారు. చిన్నమ్మాయి మాధవి వైద్యురాలు. ఆమె భర్త నంబి కూడా డాక్టరే. చెన్నైలో ఉంటున్నారు. చంద్రమోహన్ సినిమాల్లో ఆయనకు నచ్చిన 30 పాటలు. 1. ఝుమ్మంది నాదం – సిరి సిరి మువ్వ 2. మావిచిగురు తినగానే – సీతామాలక్ష్మి 3. మేడంటే మేడా కాదు – సుఖ దుఃఖాలు 4. కలనైనా క్షణమైనా – రాధా కళ్యాణం 5. మల్లెకన్న తెల్లన – ఓ సీత కథ 6. లేత చలిగాలులు– మూడు ముళ్లు 7. దాసోహం దాసోహం – పెళ్లి చూపులు 8. సామజవరాగమనా – శంకరాభరణం 9. ఈ తరుణము – ఇంటింటి రామాయణం 10. ఇది నా జీవితాలాపన – సువర్ణ సుందరి 11. పంట చేలో పాలకంకి – 16 ఏళ్ల వయసు 12. నాగమల్లివో తీగమల్లివో – నాగమల్లి 13. పక్కింటి అమ్మాయి పరువాల – పక్కింటి అమ్మాయి 14. కంచికి పోతావ కృష్ణమ్మా – శుభోదయం 15. ఏమంటుంది ఈ గాలి – మేము మనుషులమే 16. బాబా... సాయిబాబా – షిర్డీసాయి బాబా మహత్యం 17. నీ పల్లె వ్రేపల్లె గా – అమ్మాయి మనసు 18. చిలిపి నవ్వుల నిన్ను – ఆత్మీయులు 19. నీలి మేఘమా జాలి – అమ్మాయిల శపధం 20. వెన్నెల రేయి చందమామా – రంగుల రాట్నం 21. అటు గంటల మోతల – బాంధవ్యాలు 22. ఏదో ఏదో ఎంతో చెప్పాలని – సూర్యచంద్రులు 23. ఏది కోరినదేదీ – రారా కృష్ణయ్య 24. ఏ గాజుల సవ్వడి – స్త్రీ గౌరవం 25. ఏమని పిలవాలి – భువనేశ్వరి 26. మిడిసిపడే దీపాలివి– ఆస్తులు– అంతస్తులు 27. పాలరాతి బొమ్మకు– అమ్మాయి పెళ్లి 28. ఐ లవ్ యు సుజాత– గోపాల్ రావ్ గారి అమ్మాయి 29. నీ తీయని పెదవులు– కాంచనగంగ 30. నీ చూపులు గారడీ– అమాయకురాలు. -
ఫ్రేమ్ మారినా.... ప్రేమ అలాగే ఉంది!
బ్లాక్ అండ్ వైట్ డేస్ గాన్. ఈస్ట్‌మన్ కలర్ రోజులు పోయే. సినిమాస్కోప్ కే దిన్ చల్ బసే. కాని ప్రేమ అలాగే ఉంది. పోస్టర్ మారింది. ప్రేమ అలాగే ఉంది. అక్కినేని లేడు. ప్రేమ అలాగే ఉంది. ప్రభాస్ వచ్చాడు. ప్రేమ అలాగే ఉంది. ‘నిన్నా నేడూ నీదే ధ్యానం’ వేటూరి లేడు. ప్రేమ అలాగే ఉంది. ‘నీ కాళ్లను పట్టుకుని వదలవన్నవి’.. ఇల సినీపురములో ప్రేమ అలాగే ఉంది. ప్రేమ లేకుండా బుకింగ్స్ ఓపెన్ కావు. కలెక్షన్లు క్లోజూ కావు. ఫిబ్రవరి 14 ప్రేమగులాబీలు విరబూస్తాయి. ట్రెండ్ మారుతూ వచ్చిన ప్రేమకథలను గుర్తు చేస్తాయి. తొలి రోజుల్లో సినిమా ప్రేమ రక్త సంబంధీకుల మధ్యో, ఇరుగూ పొరుగుల మధ్యో ఉండేది. అపరిచితులను కలిసే చాన్స్ తక్కువ. ‘మల్లీశ్వరి’లో బావామరదళ్లైన ఎన్.టి.ఆర్, భానుమతి ప్రేమించుకుంటారు. కాని ‘ప్రేమ’ అనే మాట ఎక్కడిది అప్పట్లో. అనురాగం, ఆరాధన, మనసు పడటం... ఇవే. ఆ అనురాగాన్ని కూడా నేరుగా చెప్పుకుంటారా? ‘మనసున మల్లెల మాలలూగెనె’ అని మల్లెలనో పున్నమినో తోడు తెచ్చుకుంటారు. ‘దేవదాసు’లో నాగేశ్వరరావు ‘పల్లెకు పోదాం పారును చూదాం’ అంటాడు తప్పితే పారును ప్రేమిద్దాం అనడు. ఆమె లేకపోతే తాను లేడన్న సంగతి మాత్రమే తెలుసు అతనికి. దాని పేరు ప్రేమ అని తర్వాత పాత్రలకు, ప్రేక్షకులకు చెబుతూ వచ్చారు. పారు, దేవదాసు కలిసినప్పుడు కూడా ‘నా ఎదుటే నీ బడాయి’ అని ఆమె ‘జీవితమే ఓ లడాయి’ అని అతడు దెప్పిపొడుచుకుంటారు తప్ప ప్రేమను వ్యక్తపరచడం ఎలాగో తెలుసుకోరు. చంద్రుడే రాయబారి పాత రోజుల్లో అబ్బాయి అమ్మాయిలకు చంద్రుడే రాయబారి. వారి ప్రేమ, కోపం, అలక చంద్రుడితో చెప్పుకునేవారు. ‘రావోయి చందమామ... మా వింతగాధ వినుమా’ అని ‘మిస్సమ్మ’లో ఎన్.టి.ఆర్ సావిత్రి మీద ఉన్న ప్రేమను చంద్రుడితో మొత్తుకుని చెప్పుకుంటాడు. ఆమెకు అతనిపై ప్రేమ కలిగినా ‘ఏమిటో ఈ మాయా ఓ నెలరాజా చల్లని రాజా’ అని చంద్రుడికే చెప్పుకుంటుంది తప్ప అతనితో కాదు. ‘ముద్దబంతి పువ్వులో మూగకళ్ల ఊసులు’ కాలం అది. కాని అలా రాసిన ఆత్రేయే మరికొన్నాళ్లకు కుండబద్దలు కొట్టాడు. ‘ప్రేమనగర్’ సినిమా నుంచి ప్రేమను ముందుకు తెచ్చాడు. హీరో హీరోయిన్లు కూడా ప్రేమ అనే మాటను పలకడం మొదలెట్టారు. ‘నీ కోసం వెలసింది ప్రేమమందిరం’ అని హీరో పాడాడు. ఇప్పుడు ప్రేమ బట్టబయలు అయిపోయింది. హీరో అయితే ప్రేమించనన్నా ప్రేమిస్తాడు లేదంటే తన తల్లిదండ్రులను చంపిన విలన్‌పై పగసాధిస్తాడు. ప్రేమించిన వాడిని మహిళా ప్రేక్షకులు ఎక్కువగా ప్రేమించారు. చదువు తెచ్చిన ప్రేమ పాత రోజుల్లో అంతంతమాత్రంగా ఉండే చదువులు ఇప్పుడు ఎక్కువగా అందుబాటులోకి వచ్చాయి. కాలేజీలు వచ్చాయి. అబ్బాయిలు అమ్మాయిలు ఒకేచోట కూచుని చదువుకోవడం మొదలెట్టారు. చదువయ్యాక నిరుద్యోగం ఒక సమస్యగా తీసుకుని కుర్రాళ్లు తిరగబడే కథలతో వచ్చిన సినిమాలు ఒకవైపు అబ్బాయిలు అమ్మాయిలు ప్రేమలో మెరుపులై మెరిసే కథలు ఒకవైపు ఊపందుకున్నాయి. అక్కినేని ‘ప్రేమాబిషేకం’ తీసి ‘నా కళ్లు చెబుతున్నాయి నిను ప్రేమించానని’ అని పెద్ద హిట్ కొట్టాక కుర్రాళ్లు ఊరుకోలేదు. జంధ్యాల వల్ల ‘ముద్దమందారం’, ‘నాలుగు స్తంభాలాట’ వంటి ప్రేమకథలను చూపించారు. ‘చినుకులా రాలి నదులుగా సాగి వరదలై పొంగు నీ ప్రేమ నా ప్రేమ’ అని ప్రేమపాఠం చదివారు. అదే సమయంలో డబ్బింగ్ చిత్రంగా వచ్చిన ‘ప్రేమ సాగరం’ పెద్ద దుమారం రేపింది. ‘నామం పెట్టు నామం పెట్టు కాలేజీకి చిన్నదాని చెయ్యే పట్టు మ్యారేజీకి’ అని కొత్త దిశను చూపింది. కాలేజీకి వెళ్లామంటే లవ్ చేయాల్సిందే అని కుర్రాళ్లు అనుకునేదాకా ఈ ప్రేమమత్తు ఎక్కిది. సినిమా వాళ్లు కూడా సామాన్యులు కారు. డబ్బులొస్తాయంటే ప్రేమను పట్టుకుంటారు. కలెక్షన్లు బాగున్నాయంటే పగనూ పట్టుకుంటారు. మరో చరిత్ర ఓ.కే. ప్రేమించుకున్నాం సరే. మరి దాని సమస్యలు. ప్రేమలో ఉన్న పెద్ద విశేషం ఏమంటే దాని నిర్ణయం అబ్బాయి అమ్మాయి తీసుకుంటారు. కాని అది చేరాల్సిన రేవు పెళ్లి అయితే గనక దానికి టికెట్ కొట్టాల్సిన వాళ్లు పెద్దవాళ్లవుతారు. ‘ప్రేమా లేదూ దోమా లేదూ’ అని ఈసడించే పెద్దవాళ్ల ముందు ప్రేమ పవిత్రత, శక్తి చూపి నాలుగు రూకలు సంపాదిద్దాం అనుకున్నాడు దర్శకుడు కె.బాలచందర్. ‘మరో చరిత్ర’ తీశాడు. ఇరుపక్షాల పెద్దలకు పెళ్లి ఇష్టం లేదు. సంవత్సరం పాటు ఒకరినొకరు చూసుకోకుండా ఉంటే అప్పుడు మీ ప్రేమను నమ్ముతాం అని చెబుతారు. ఏం షరతు ఇది. అమ్మాయిలందరూ సరితలో తమను చూసుకున్నారు. అబ్బాయిలందరూ కమలహాసన్‌లో తమను. ‘ఏ తీగ పువ్వునో ఏ కొమ్మ తేటినో కలిపింది ఏ వింత అనుబంధమౌనో’ అని వాళ్లు పాడుకుంటే చూడ్డానికి క్లాసులెగ్గొట్టి వచ్చారు. సరే.. వీళ్లది కులాల మధ్య పుట్టిన సమస్య. ‘సీతాకోకచిలుక’ వచ్చి మతాల మధ్య సమస్యను చెప్పింది. అబ్బాయి అమ్మాయికి ప్రేమలో పడే సమయంలో ఎవరు ఏ మతమో తెలియదు. కాని పెద్దలకు తెలుసు కదా. ‘నేనే నీవుగా పువ్వూ తావిగా సంయోగాల సంగీతాల విరిసేవేళలో’ అని వారు పాడుకుని ఈ సాంగత్యాన్ని వదలం అని ప్రేమను గెలుచుకున్నారు. సినిమాను గెలిపించుకున్నారు. ఇప్పుడు తెలుగు సినిమా ప్రేక్షకుల్లో ప్రేమ పూర్తిగా ఎస్టాబ్లిష్ అయినట్టే. ఒక్క ప్రేమ ఎన్ని రంగులో... ప్రేమ ఒక సక్సెస్ ఫార్ములా అయ్యాక దానికి ఎన్ని కోణాలు, ఎన్ని పార్శా్వలు ఉన్నాయో వెతకడం మొదలెట్టారు సినీ కథకులు. ఒక అమ్మాయి ఒక అబ్బాయి కామన్. కాని సమస్య కొత్తది కావాలి. లేదా కొత్తగా చెప్పాలి. అసలు లోపల ప్రేమ పెట్టుకుని ఎప్పటికీ చెప్పలేని అబ్బాయి కథను సినిమాగా తీస్తే అనుకుని ‘హృదయం’ తీశాడు దర్శకుడు కదిర్. ‘ఊసులాడే ఒక జాబిలట’.. అని పాడతాడు. పెద్ద హిట్. తీరా ప్రేమ సంగతి చెప్పడానికి వచ్చేసరికి అతనికి గుండెపోటు వచ్చి చచ్చిపోతాడు. ఇంత సుకుమార ప్రేమ కూడా ఉంటుందని జగానికి తెలిసింది. ఇలాంటి కథే ఇటీవల తెలుగులో శర్వానంద్ హీరోగా ‘జాను’ పేరుతో వచ్చింది. ప్రేమించిన అమ్మాయిని అనుమానిస్తే ఆ ప్రేమ ఎలా భగ్నం అవుతుందో నాగార్జున ‘మజ్నూ’లో చూపిస్తాడు. తనతో జరగాల్సిన తొలిరాత్రి మరెవరికో జరుగుతుంటే ‘ఇది తొలిరాత్రి’ అని పాడి కుమిలిపోతాడు. అమ్మాయి తండ్రికి ప్రేమ ఇష్టం లేకపోతే అబ్బాయి మీద రౌడీలను పంపిస్తాడు. కాని తల్లికి ఇష్టం లేకపోతే? ‘ప్రేమ’ సినిమాలో వెంకటేశ్ తన కూతురు రేవతిని ప్రేమించడం మంజులకు ఇష్టముండదు. అమ్మాయి తల్లి గట్టిగా నిలబడినా కూడా పెద్ద చిక్కే ప్రేమకు. ‘ఈనాడే ఏదో అయ్యింది’ అని మధురంగా పాడుకోవడమే పాపం ఆ జంటకు మిగులుతుంది. సరే... ఒకమ్మాయిని ఇద్దరు ప్రేమిస్తే? ఆ ఇద్దరూ ఒకరికొకరు స్నేహితులయ్యి ఆ అమ్మాయి వారిద్దరికీ స్నేహితురాలైతే? ఈ ప్రేమ గొడవ మనకెందుకురా హాయిగా ముగ్గురం ఫ్రెండ్స్‌గా ఉందాం అని ఆ అమ్మాయి నిర్ణయం తీసుకుంటుంది. ‘ప్రేమదేశం’ కుర్రకారును మరోదేశంలో తిప్పి వదిలింది. ‘నా నీడ నన్ను విడిపోయిందే నీ శ్వాసలోన అది చేరిందే ప్రేమా...’ అని ప్రేమ భావనను గాఢంగా చెప్పిన సినిమా ఇది. అసలు ప్రేమ అనే ఈ పిచ్చిలో పడి చదువు మానేసి, అయిన వారికి దూరమయ్యి జీవితం నాశనం చేసుకోవడం ఏమిటి ఇలా అక్కర్లేదు... ప్రేమ కోసం సర్వం కోల్పోవాల్సిన పని లేదు అని ‘సుస్వాగతం’ వంటి కథలూ వచ్చాయి. బొమ్మరిల్లు ప్రేమ బొమ్మరిల్లు ఫాదర్ ఉన్నట్టే బొమ్మరిల్లు ప్రేమ కూడా ఉంది. అదేమిటంటే మనం ప్రేమించిన అమ్మాయిని మన పెద్దలు నచ్చేంత వరకూ ఓపిక పట్టడం, వారికి పరిచయం చేసి, నచ్చేలా చేయడం. ‘అపుడో ఇపుడో ఎపుడో కలగన్న’ చెలిని నిజ జీవితంలో సొంతం చేసుకోవడం. మరో ప్రేమ కూడా ఉంది. ‘నా ప్రేమ నీకు తెలిసే దాకా ప్రేమిస్తానని... ఫీల్ మై లవ్’ అని చెప్పి ప్రేమను పొందే ‘ఆర్య’ మార్కు ప్రేమ. ఇది అన్నిసార్లు క్లిక్ కాకపోవచ్చు. పైగా మనం కటకటాల్లో పడొచ్చు. ఇక తొలిచూపులోనే ప్రేమ పుడుతుంది అంటారు. పుట్టొచ్చు. కాని అమ్మాయి, అబ్బాయి ఇద్దరూ తమను తాము ఒకరినొకరు అర్థం చేసుకునేలా ఎదిగి ప్రేమ ఎదిగేలా చేసుకుని ఒక్కటవ్వాలి. ‘ఏ మాయ చేసావే’ చెప్పింది ఇదే. ఇక అర్జున్ రెడ్డి మార్కు ప్రేమ కూడా ఉంది. ప్రేమను సంపూర్ణం గా అనుభవించడం. వియోగాన్ని సంపూర్ణం గా అనుభవించడం. ఏ విధంగా అయినా పూర్తిగా ప్రేమలో మునగడం ఇది. ఏమైనా ప్రేమ జగత్తుకు రాజు, రాణి అబ్బాయి, అమ్మాయిలే. వారి రాజ్యాన్ని వారు విస్తరించుకుంటూ వెళుతుంటారు. ఆ రాజ్యం తక్కువసార్లే ఓడిపోగలదు. ఎక్కువసార్లు అది చెప్పేమాట– అమరం అఖిలం ప్రేమ. – సాక్షి ఫ్యామిలీ -
సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు
తెలుగు చలనచిత్ర రంగానికి చెందిన స్టూడియోలు, నటీనటులు, దర్శకులు, ఇతర సాంకేతిక నిపుణులకు కావల్సిన మౌలిక సదుపాయాలు మరియు గృహనిర్మాణాల కోసం భూమిని కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రభుత్వాల్ని అభ్యర్థించటం జరిగిందని తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి పేర్కొంది. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సకాలంలో స్పందించి తమ ప్రభుత్వంలోని ఆయా శాఖాధికారులకు తదుపరి చర్యల నిమిత్తం పంపించటం జరిగిందని తెలియచేస్తూ, నిర్మాతల మండలికి లెటర్‌ను పంపించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మా ప్రతిపాదనలకు స్పందించినందుకు సీయం వైఎస్ జగన్మోహన్ రెడ్డిగారికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నామని గురువారం ఓ పత్రికా ప్రకటనను విడుదల చేసింది నిర్మాతల మండలి. తమ అవసరాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన మేనేజింగ్ డైరెక్టర్ టి.విజయ్‌కుమార్ రెడ్డికి, ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ అండ్ టీవీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, ‘మా’ నటుడు, నిర్మాత విజయ్‌చందర్‌కు కూడా కృతజ్ఞతలు తెలియజేసింది. -
ఆ ఒక్క మాటతో మీ వెంట ఉంటానన్నాను
తెలుగు ఫిలిం ఫ్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్, నిర్మాత సి.కల్యాణ్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సి. కల్యాణ్ మాట్లాడుతూ– ‘‘గతేడాది నా 60వ పుట్టినరోజును చిరంజీవి, బాలకృష్ణ తదితర ప్రముఖుల ఆధ్వర్యంలో ఆనందంగా జరుపుకున్నాను. అది నా జీవితంలో మరచిపోలేని పుట్టినరోజు. కానీ, ఈ ఏడాది పుట్టినరోజు చేసుకోవటం లేదు. ఏ చిత్రసీమ నన్ను ఈ రేంజ్‌కు తీసుకొచ్చిందో ఆ చిత్రసీమ కార్మికుల కోసం, వారి సమస్యలను తీర్చటం కోసం చిత్రపురి హౌసింగ్ కో ఆపరేటివ్ సొసైటీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను. చిత్రపురి కాలనీవాసులు ‘మీరు ఈ ఎన్నికల్లో పోటీ చేయాలి, మమ్మల్ని ఆదుకోవాలి’ అని అడిగినప్పుడు, మీ వైపు నుండి కూడా ఎన్నో తప్పులు ఉన్నాయి అన్నాను. అందుకు వారు గురువు దాసరిగారు ఉంటే ఇలాంటి పరిస్థితుల్లో మమ్మల్ని వదిలేసేవారా? అన్నారు. ఆ ఒక్క మాటతో ‘నేను మీ వెంట ఉంటాను’ అని చెప్పి నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఇది నాకు చాలా బాధ్యతాయుతమైన పుట్టినరోజు. తెలుగు చిత్ర పరిశ్రమ మీద అవగాహన ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్. ఆయన సినీ కార్మికుల కోసం ఎన్నో వరాలను ఇస్తున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిగారిని కలిసినప్పుడు ‘తెలుగు సినిమా పరిశ్రమను వైజాగ్‌లో కూడా డెవలప్ చేయండి. మీకు ఏం సాయం కావాలో అడగండి’ అన్నారు. అప్పుడు నేను జగన్‌గారితో ‘వైజాగ్‌లో సినిమా పరిశ్రమ అభివృద్ధి కావాలనేది వై.యస్. రాజశేఖర్ రెడ్డిగారి కల. మీకోసం రెండొందల ఎకరాల్లో సినిమా పరిశ్రమను రూపుదిద్దుతాను అని సీయం రాజశేఖర్ రెడ్డిగారు అన్నప్పుడు ఆరోజు ఆయనతో పాటు ఉన్నవాళ్లల్లో నేనూ ఒకడిని’ అని చెప్పటం జరిగింది. తెలుగు సినిమాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదలయితేనే చిత్రపరిశ్రమకు మంచిది. ప్రస్తుతం నేను రానాతో తీసిన పీరియాడికల్ లవ్‌స్టోరీ ‘1945 లవ్‌స్టోరీ’ విడుదలకు సిద్ధంగా ఉంది. సత్యదేవ్ హీరోగా ‘బ్లఫ్‌మాస్టర్’ చిత్రాన్ని తెరకెక్కించిన గోపీ గణేశ్ దర్శకత్వంలో ఓ సినిమాను ఫిబ్రవరిలో ప్రారంభిస్తున్నాం. కె.యస్. రవికుమార్ చౌదరి దర్శకత్వంలో ఓ స్టార్ హీరోతో సినిమా ఉంటుంది. ఇవి కాక బాలకృష్ణగారితో ఓ సినిమా చేస్తున్నాను’’ అన్నారు. -
బాబాయ్.. అబ్బాయ్.. ఓ మల్టీస్టారర్
తెలుగు చిత్రపరిశ్రమలో మల్టీస్టారర్స్‌కు క్రేజ్ తీసుకొచ్చిన హీరోల్లో వెంకటేశ్ ఒకరు. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాలో మహేశ్‌బాబుతో, ‘గోపాల గోపాల’ చిత్రంలో పవన్ కల్యాణ్‌తో కలిసి నటించారాయన. గత ఏడాది మేనల్లుడు నాగచైతన్యతో ‘వెంకీ మామ’ సినిమా చేశారు. ఇప్పుడు అన్న సురేశ్‌బాబు కొడుకు రానాతో సినిమా చేయనున్నారని టాక్. తమిళంలో ఘనవిజయం సాధించిన ఓ చిత్రానికి ఇది తెలుగు రీమేక్ అని, తెలుగుకి అనుగుణంగా కథని మార్చి, పక్కా స్క్రిప్ట్ రెడీ చేశారనే మాటలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రానికి వీరూ పోట్ల దర్శకత్వం వహిస్తారని సమాచారం. డిసెంబర్ 13న వెంకటేశ్ పుట్టినరోజు సందర్భంగా బాబాయ్–అబ్బాయ్ సినిమా ప్రకటన వెలువడే అవకాశం ఉందట. కాగా క్రిష్ దర్శకత్వంలో రానా హీరోగా తెరకెక్కిన ‘కృష్ణం వందే జగద్గురుం’ సినిమాలో ‘బళ్లారి బావ..’ పాటలో రానాతో కలసి వెంకటేశ్ సందడి చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు ఫుల్ సినిమాలో ఇద్దరూ కనిపిస్తే సందడి డబుల్ అనొచ్చు. రియాలిటీ షోలో.. మల్టీస్టారర్ సినిమా కంటే ముందు వెంకటేశ్–రానా ఓ రియాలిటీ షో చేయనున్నట్లు టాక్. ఇటీవల రానా ఓ యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించారు. దానికోసం ఈ ఇద్దరూ ఓ షో చేయనున్నారట. అలాగే ఓ ఎంటర్టైన్మెంట్ చానల్ వీరి కాంబినేషన్లో ఓ రియాలిటీ షోకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. -
విక్టరీ వెంకటేష్ స్పెషల్ ఫోటోలు
-
అక్షరాన్ని మార్చగలరు.. అభిమానాన్ని కాదు
‘సౌత్ వాళ్లకు నడుము అంటే ప్రత్యేక ఆసక్తి’ అంటూ ఓ ఇంగ్లిష్ వీడియో ఇంటర్వ్యూలో పూజా హెగ్డే చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీసిన విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో పలు విమర్శలు ఎదుర్కొన్నారు పూజా. ఆదివారం ఈ విషయం గురించి స్పందించారామె. దీనికి సంబంధించి ఓ నోట్‌ను విడుదల చేశారు. అందులో ఈ విధంగా రాసుకొచ్చారు. ‘‘నేను ఒక ఇంటర్వ్యూలో అన్న మాటలను వేరే సందర్భానికి అన్వయించారు. అక్షరాన్ని మార్చగలరేమో కానీ, అభిమానాన్ని కాదు. నాకు ఎప్పటికీ తెలుగు చలన చిత్రపరిశ్రమ ప్రాణసమానం. ఇది నా చిత్రాలను అభిమానించేవారికీ నా అభిమానులకూ తెలిసినా ఎటువంటి అపార్థాలకు తావివ్వకూడదనే నేను మళ్లీ చెబుతున్నాను. నాకెంతో ఇచ్చిన తెలుగు ఇండస్ట్రీకి ఎప్పటికీ రుణపడి ఉంటాను’’ అని పేర్కొన్నారు పూజా హెగ్డే. అలాగే తాను ఇచ్చిన పూర్తి వీడియో ఇంటర్వ్యూను కూడా చూడమని కోరారు. -
బిగ్‌బాస్ 4 స్వాతి దీక్షిత్ గ్లామర్ ఫోటోలు
-
పైడి జయరాజ్ సేవలు మరువలేనివి
‘‘తెలంగాణ ముద్దుబిడ్డ, తొలి తరం ఇండియన్ సూపర్ స్టార్, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుగ్రహీత పైడి జయరాజ్ భారతీయ సినిమాకు అందించిన సేవలు మరువలేనివి. ఆయన పేరు తెలుగు చిత్ర పరిశ్రమలో మరింత మారుమ్రోగేందుకు నా వంతు కృషి చేస్తా’’ అని తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. పైడి జయరాజ్ 111వ జయంతి ఉత్సవాలు హైదరాబాద్‌లోని తెలుగు ఫిల్మ్ ఛాంబర్లో ‘జై తెలంగాణ ఫిల్మ్ జేఏసీ’ చైర్మన్ పంజాల జైహింద్ గౌడ్ సారధ్యంలో జరిగాయి. ఈ సందర్భంగా పంజాల జైహింద్ గౌడ్ మాట్లాడుతూ– ‘‘తెలంగాణ లో సినిమా పరిశ్రమకు ఇచ్చే అవార్డులు పైడి జయరాజ్ పేరిట ఇవ్వాలి. అంతేకాకుండా హైదరాబాద్–కరీంనగర్ హైవేకి పైడి జయరాజ్ హైవేగా నామకరణం చేయాలి’’ అని డిమాండ్ చేశారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు మనవడు ఎన్.వి. సుభాష్, ఎం.ఎల్.సి. నారపురాజు రామచంద్రరావు, నటుడు బాబూమోహన్, ‘తెలుగు నిర్మాతల మండలి’ ప్రధాన కార్యదర్శి తుమ్మల ప్రసన్న కుమార్, ‘ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్’ అధ్యక్షులు మోహన్ గౌడ్, హీరో పంజాల శ్రావణ్ కుమార్ గౌడ్ తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు. -
కృష్ణార్జున యుద్ధం హీరోయిన్ రుక్షర్ ధిల్లాన్ ఫోటోస్..
-
టాలీవుడ్ నెంబర్ వన్: కంగనా రనౌత్
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ఈ మధ్య తరచూ వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు. సుశాంత్ ఆత్మహత్య మొదలు మహారాష్ట్ర సీఎంను ప్రశ్నించడం వరకు ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో నానుతూనే ఉన్నారు. కాగా దేశంలోనే అతి పెద్ద ఫిల్మ్ సిటీని నోయిడాలో నిర్మించాలని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అధికారులను శుక్రవారం ఆదేశించిన విషయం తెలిసిందే. దీనిపై కంగనా స్పందిస్తూ చిత్ర పరిశ్రమపై కీలక వ్యాఖ్యలు చేశారు. "దేశంలో బాలీవుడ్ చిత్ర పరిశ్రమ అగ్రస్థానంలో ఉందనుకోవడం పొరపాటు. ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమ దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉంది. అక్కడ ప్యాన్ ఇండియా లెవల్లో, పలు భాషల్లో సినిమాలు తీస్తున్నారు. అలాగే చాలా హిందీ సినిమాలు కూడా హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుపుకుంటున్నాయి." (చదవండి: నిరూపిస్తే ట్విటర్ నుంచి వైదొలుగుతా: కంగనా) "ఏదైమేనా యోగి ఆదిత్యనాథ్ మంచి నిర్ణయం తీసుకున్నారు. దేశంలో ఒక్కో భాషకు ఒక్కో చిత్ర పరిశ్రమ ఉండటం వల్ల హాలీవుడ్ లాభపడుతోంది. కాబట్టి అన్ని చిత్రపరిశ్రమలు అఖండ భారత్‌లా ఒక్కటై భారతీయ సినీపరిశ్రమగా అవతరించాలి. దీన్ని ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలపాలి" అని చెప్పుకొచ్చారు. కాగా కంగనా తెలుగులో ప్రభాస్ సరసన 'ఏక్ నిరంజన్' చిత్రంలో నటించారు. తర్వాత బాలీవుడ్‌కు మకాం మార్చారు. ఇదిలా వుంటే కంగనా మరోసారి బాలీవుడ్‌ను తక్కువ చేసి మాట్లాడినందుకు సెలబ్రిటీలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. (చదవండి: డ్రగ్స్ కేసు: ప్రముఖుల జాబితా సిద్ధం) -
హీరో రామ్ చరణ్ తేజ ఫోటోలు
-
అదిరిపోయే శ్రీముఖి న్యూ స్టిల్స్
-
జయప్రకాష్‌రెడ్డి హఠాన్మరణం
గుంటూరు ఈస్ట్ /సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, అమరావతి: సుప్రసిద్ధ విలక్షణ నటుడు జయప్రకాష్‌రెడ్డి (74) మంగళవారం తెల్లవారుజామున కన్నుమూశారు. గుంటూరు విద్యానగర్‌లోని ఆయన నివాసంలో బాతురూమ్కు వెళ్లగా ఆకస్మికంగా గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కుప్పకూలి తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య రాజ్యలక్ష్మి, కుమారుడు చంద్రప్రకాష్‌రెడ్డి, కుమార్తె మల్లిక ఉన్నారు. జయప్రకాష్‌రెడ్డి భౌతికకాయానికి పలువురు ప్రముఖులు, అభిమానులు ఘన నివాళులు అర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. సోదరులు, ఇతర బంధువులంతా అమెరికాలో ఉన్నారు. కొడుకు, కోడలు హోమ్ ఐసోలేషన్‌లో ఉండడంతో పీపీఈ కిట్లు ధరించి భౌతికకాయం వద్దకు వచ్చారు. కొరిటెపాడులోని హిందూ శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. అభిమానుల కన్నీటి వీడ్కోలు జయప్రకాష్‌రెడ్డికి ఆయన అభిమానులు కన్నీటి వీడ్కోలు పలికారు. నటనా రంగాన్ని వేదికగా చేసుకుని సమాజాన్ని చైతన్యపరచడానికి నిరంతరం పోరాడిన ఆ యోధునికి పుష్పాంజలి ఘటించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు గౌతంరెడ్డి, మద్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి, వైఎస్సార్సీపీ గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త మోదుగుల వేణుగోపాలరెడ్డి, ఎమ్మెల్యేలు షేక్ ముస్తఫా, మద్దాళి గిరిధరరావు, కిలారి రోశయ్య, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి తదితరులు ఆయన భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. జయప్రకాష్‌రెడ్డి మృతికి తెలంగాణ సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. విలక్షణ నటుడుగా గుర్తింపు.. ప్రతి నాయకుడిగా, హాస్య నటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, రంగస్థల దిగ్గజంగా దాదాపు ఆరు దశాబ్దాలపాటు నటనా రంగంలో అలుపెరగకుండా చేసిన కృషి ఆయనను నటనా రంగంలో లెజెండ్‌గా నిలిపింది. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో 340 సినిమాలు, 3 వేల నాటకాల్లో నటించి విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్నారు. రాయలసీమ యాసతో ఆయన నటనకు ఎనలేని గుర్తింపు వచ్చింది. సినీ లోకానికి తీరనిలోటు జయప్రకాష్‌రెడ్డి హఠాన్మరణంపై ప్రధాని సంతాపం తెలుగు చలనచిత్ర విలక్షణ నటుడు జయప్రకాష్‌రెడ్డి మరణంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తంచేశారు. ‘జయప్రకాష్‌రెడ్డి తనదైన నటనా శైలితో ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నారు. ఆయన మరణం సినిమా ప్రపంచానికి తీరనిలోటు. ఆయన కుటుంబానికి, ఆయన అభిమానులకు కలిగిన శోకంలో నేను సైతం పాలుపంచుకుంటున్నాను’.. అని మంగళవారం ఒక ట్వీట్లో మోదీ పేర్కొన్నారు. అలాగే, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కూడా జయప్రకాష్‌రెడ్డి మరణంపట్ల విచారం వ్యక్తం చేశారు. గవర్నర్ విశ్వభూషణ్ విచారం జయప్రకాష్‌రెడ్డి మృతిపట్ల రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కూడా ఒక ప్రకటనలో విచారం వ్యక్తంచేశారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. సీఎం వైఎస్ జగన్ సంతాపం ప్రఖ్యాత నటుడు జయప్రకాష్‌రెడ్డి మృతిపట్ల సీఎం వైఎస్ జగన్ తీవ్ర విచారం వ్యక్తంచేశారు. ఈ మేరకు మంగళవారం ఆయన ట్వీట్ చేశారు. తన హావభావాలు, డైలాగులు చెప్పే విధానంతో ఆయన సినీ పరిశ్రమలో సరికొత్త స్థానాన్ని సంపాదించుకున్నారని కొనియాడారు. జయప్రకాష్‌రెడ్డి మృతికి సీఎం సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. జయప్రకాష్‌రెడ్డి హఠాన్మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని వైఎస్సార్పీపీ నేత వి. విజయసాయిరెడ్డి విచారం వ్యక్తంచేశారు. తెలుగు సినీ పరిశ్రమ, రంగస్థలం ఓ అద్భుతమైన నటుడిని కోల్పోయిందన్నారు. -
గుంటూరు: నటుడు జయప్రకాశ్‌రెడ్డికి నివాళులు
-
సిటీ ఆఫ్ సినీ డెస్టినీ.. విశాఖ
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: విశ్వ కీర్తికి లంగరెత్తిన ఉక్కు నగరి విశాఖ.. ప్రకృతి కాంత పురివిప్పి నాట్యమా డే సాగర సోయగాల ఇలాకా విశాఖ.. ఇప్పుడది వెండి తెరకు వెలుగు రేఖగా మారనుంది. యారాడ కొండ పైనుంచి చూస్తే విశాఖ అందం తనను రోజుకో విధంగా సమ్మోహన పరుస్తుందని, ఎప్పటికైనా ఈ నగరంపై 18 ఆశ్వాసాల మహాకావ్యాన్ని రచిస్తానన్నారు మహా కవి శ్రీశ్రీ. అలనాటి దిగ్గజ దర్శకుడు బాలచందర్ చెన్నైలోని మెరీనా బీచ్‌ను కాదని విశాఖ ఆర్కే బీచ్‌పైనే మక్కువ చూపించి.. ‘మరో చరిత్ర’ సృష్టించారు. ఎన్టీఆర్ డ్రైవర్ రాముడు.. నలభై శాతానికి పైగా షూటింగ్ విశాఖ మన్యంలోనే జరిగింది. ఏఎన్ఆర్ ఖాతాలోని సూపర్ హిట్ సినిమాలైన.. బంగారు బాబు, ప్రేమ కానుక చిత్రీకరణ అరకు లోయలోనే పూర్తి చేసుకుంది. చిరంజీవి సినిమాల్లో చరిత్ర సృష్టించిన జగదేకవీరుడు.. అతిలోక సుందరి సినిమాలోని కీలక సన్నివేశాలే కాదు.. చిరు కెరీర్ తొలినాళ్లలోని అభిలాష, ఛాలెంజ్ మొదలు.. ఘరానా మొగుడు, ముఠామేస్త్రి సినిమాల్లోని సూపర్ డూపర్ హిట్ పాటల షూటింగ్‌కు విశాఖ తీరమే వేదిక. బాలకృష్ణ, నాగార్జున మొదలు ఇప్పటి ఎందరో హీరోల చిత్రాలకు ప్రాణవాయువు అం దించిన అందమైన నగరం. జంధ్యాల మార్కు సినిమాలు, రాజమౌళికి విశ్వవ్యాప్త గుర్తింపు తెచ్చిన బాహుబలిలోని సన్నివేశాలు ఇక్కడే రూపుదిద్దుకున్నాయి. విదేశాలకు వెళ్లకుండా.. అందమైన లొకేషన్లు కావాలంటే ఎవరైనా విశాఖ వైపే చూడాల్సిందే. మళ్లీ తెరపైకి వచ్చిన విశాఖ చెన్నపట్నం నుంచి భాగ్యనగరి హైదరాబాద్‌కు చేరిన తెలుగు సినీ పరిశ్రమ.. తన వైభవాన్ని కొనసాగించేందుకు విశాఖపట్నానికి తరలివచ్చే తరుణం ఆసన్నమైంది. తెలుగు సినీరంగ ప్రముఖులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఇటీవల కలవడంతో విశాఖ నగరం సినీ హబ్ కావడానికి గల అవకాశాలు మళ్లీ చర్చనీయాంశమయ్యాయి. విశాఖలో చిత్ర పరిశ్రమకు పెద్దపీట వేయాలని ప్రభుత్వం భావిస్తోంది. విశాఖలో స్టూడియోల నిర్మాణాలకు ప్రభుత్వం సహకరిస్తుందని సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని నాని ప్రకటించారు. సింగిల్ విండో విధానంలో సినిమా షూటింగ్‌లకు అనుమతులను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఇతర ప్రోత్సాహకాలను కూడా ప్రభుత్వం అందిస్తుందన్నారు. సినీ దిగ్గజాల నగరి మహాకవి శ్రీ శ్రీ, ఆరుద్ర, గానకోకిల సుశీల, గొల్లపూడి మారుతీరావు, సిరివెన్నెల సీతారామశాస్త్రి, మిశ్రో, వంకాయల వంటి నిష్ణాతులు విశాఖ తీరం నుంచే ప్రస్థానం మొదలుపెట్టారు. కొండవలస లక్ష్మణరావు, పూర్ణిమ, గౌతమి, వైజాగ్ ప్రసాద్, కళ్లు చిదంబరం, రాజ్‌తరుణ్, బట్టల సత్యం (పీలా మల్లికార్జునరావు), సుమన్‌శెట్టి, పూరీ జగన్నాథ్, గుణశేఖర్, గేయ రచయిత కులశేఖర్, రాజా, సుత్తివేలు, ప్రిన్స్.. వీళ్లే కాకుండా ఎందరో బుల్లి తెర నటులు, యాంకర్లు, హీరోలు, హీరోయిన్లు ఇక్కడి వారే. ప్రస్తు తం సినీ పరిశ్రమలో ఎందరో హీరోలకు శిక్షణనిచ్చిన స్టార్ మేకర్ సత్యానంద్ వంటి గురువులకు నివాస కేంద్రం కూడా విశాఖే. అగ్ర నిర్మాత టి.సుబ్బరామిరెడ్డి విశాఖలోనే స్థిర నివాసం ఏర్పరుచుకున్నా రు. ఇక మెగాస్టార్ చిరంజీవికి విశాఖతో ప్రత్యేకమైన అనుబంధం ఉంది. వైఎస్ హయాంలో అంకురార్పణ గతంలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి చొరవతో విశాఖలో చిత్ర పరిశ్రమకు అంకురార్పణ జరిగింది. ఆయన ప్రోద్బలంతోనే ప్రముఖ సినీ నిర్మా త, మూవీ మొఘల్ డాక్టర్ రామానాయుడు బీచ్ రోడ్డులోని రుషికొండకు సమీపంలో 35 ఎకరాల్లో స్టూడియో నిర్మించారు. ఇది మొ దలు హైదరాబాద్‌కు దీటు గా సినిమా రంగాన్ని ఇక్కడ అభివృద్ధి చేయాలని వైఎస్ సంక ల్పించారు. ఆయన హఠాన్మరణంతో వి శాఖలో సినీరంగ ప్రస్థానానికి ఆదిలోనే బ్రేక్ పడింది. తెలుగుదేశం ప్రభుత్వ ఐదేళ్ల కాలంలో రాష్ట్ర ప్ర‘గతి’ మాదిరిగానే విశాఖలోను సినీ పరిశ్రమ అభివృద్ధీ అడుగంటింది. చంద్రబాబు అట్టహాసంగా.. ఆర్భాటంగా హామీలిచ్చిన ఫిల్మ్ నగర్ కల్చరల్ సొసైటీకి భూముల కేటాయింపు, భవనాలు, కళాకారుల ఇళ్ల నిర్మాణాలు అటకెక్కాయి. అందిపుచ్చుకోవడమే ఆలస్యం ► వైఎస్ జగన్ నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను అందిపుచ్చుకుని సినీ పరిశ్రమలోని 24 విభాగాలను విశాఖలో స్థిరపడేలా చేస్తే రాష్ట్రానికి, తెలుగు సినీ పరిశ్రమకు మేలు కలుగుతుంది. ► విశాఖ పరిసర ప్రాంతాల్లో వెయ్యి ఎకరాల్లో సినీ హబ్ ఏర్పాటు చేసి.. దక్షిణాది సినీ నిర్మాతలందరికీ గమ్యస్థానంగా మార్చేందుకు వైఎస్ జగన్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ► తెలుగు, తమిళ, మలయాళ, ఒడియా, బెంగాలీ చిత్రాల నిర్మాణ కేంద్రంగా విశాఖ నగరాన్ని తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం, తెలుగు సినీ పరిశ్రమ కలసికట్టుగా ముందడుగు వేయాల్సి ఉంది. ► ఇటీవల తనను కలిసిన సినీ పెద్దలకు అడిగిందే తడవుగా షూటింగులకు అనుమతులివ్వడమే కాకుండా, ఇంకేం కావాలో చెప్పండని సీఎం వైఎస్ జగన్ అడిగి వారిని సంభ్రమాశ్చర్యాలకు గురిచేశారు. సీఎం చొరవ అభినందనీయం విశాఖలో చిత్ర పరిశ్రమ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చూపిస్తున్న చొరవ అభినందనీయం. సింగి ల్ విండో విధానంలో ఉచితంగా సినిమా షూటింగ్‌లకు అనుమ తులు ఇవ్వడం హర్షణీయం. దీనివల్ల చిత్రీకరణ అనుమతులు వేగంగా రావడంతో పాటు ఖర్చు కూడా తగ్గుతుంది. విశాఖకు ఎడిటింగ్ రూమ్‌లు, డబ్బింగ్ థియేటర్లు, ఆధునిక రికార్డింగ్ థియేటర్లు.. 24 క్రాఫ్ట్స్ వచ్చే విధంగా మార్గదర్శకాలు రూపొందించి చర్యలు తీసుకోవాలి. – సత్యానంద్, ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అధినేత జగన్ నిర్ణయం హర్షణీయం ఆంధ్రప్రదేశ్‌లో సినీ రంగాన్ని ప్రోత్సహించేందుకు అన్నివిధాలా సహకరిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించడం హర్షణీయం. మనస్ఫూర్తిగా ఆయనకు ధన్యవాదాలు. విశాఖ జిల్లా సినిమాల చిత్రీకరణకు ఎంతో బాగుంటుంది. ఇక్కడ సినీ పరిశ్రమ అభివృద్ధి చెందితే ఎంతోమంది కళాకారులకు పుట్టినిల్లయిన ఉత్తరాంధ్రలో వేలాది కళాకారులకు ఉపాధి దొరుకుతుంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఇతర రంగాలకు చెందిన వారూ లబ్ధి పొందుతారు. – మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ -
సీఎం జగన్‌కు ధన్యవాదాలు: చిరంజీవి
సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌లో కూడా సినిమా షూటింగ్‌లు జరుపుకునేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అనుమతిచ్చారని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రితో సినీ ప్రముఖులు భేటీ అయ్యారు. సీఎం జగన్‌తో జరిగిన ఈ భేటిలో చిరంజీవితో పాటు మంత్రి పేర్ని నాని, టాలీవుడ్ ప్రముఖులు నాగార్జున, దిల్ రాజు, త్రివిక్రమ్, రాజమౌళి, సురేశ్ బాబు, సి, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. దాదాపు అరగంటకు పైగా జరిగిన ఈ సమావేశంలో ముఖ్యంగా సినీ పరిశ్రమ అభివృద్దిపై చర్చించారు. ఈ సమావేశం అనంతరం మెగాస్టార్ చిరంజీవి మీడియా సమావేశంలో మాట్లాడారు. కరోనా లాక్డౌన్ కారణంగా సినిమా షూటింగ్‌లు నిలిచిపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని అయితే ఇక్కడ కూడా సీఎం జగన్ షూటింగ్‌లకు అనుమతి ఇవ్వడం సంతోషకరమన్నారు. (లైట్స్.. కెమెరా.. యాక్షన్) ‘టాలీవుడ్ ప్రముఖలంతా ఏడాది కాలంగా సీఎం జగన్‌ను కలవాలని అనుకున్నాం.. కానీ కుదరలేదు. ఈ రోజు కలిశాం. ముందుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు. ఏపీలోనూ షూటింగ్‌లకు అనుమతిచ్చారు. థియేటర్లలో మినిమం ఫిక్స్డ్ ఛార్జీలు ఎత్తేయాలని కోరాం. నంది వేడుకలు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రభుత్వం నుంచి మేము ప్రోత్సాహం కోరుకుంటాం. 2019-20కి అవార్డుల వేడుక జరుగుతుందని భావిస్తున్నాం. టికెట్ల ధరల ఫ్లెక్సీ రేట్లపై దృష్టి పెట్టాలని కోరాం. పరిశీలిస్తామని సీఎం జగన్ అన్నారు. అదే జరిగితే పారదర్శకత ఉంటుంది. మాకు చాలా మేలు జరుగుతుంది. తెలుగు సినిమా పరిశ్రమ అభివృద్దికి తాను వెన్నంటి ఉంటానని సీఎం చెప్పడం మాకు ఆనందం కలిగించింది. విశాఖపట్నంలో స్టూడియోకు దివంగత మహానేత వైఎస్సార్ భూమి ఇచ్చారు. అక్కడ పరిశ్రమ అభివృద్ధికి కృషి చేస్తాం’ అని చిరంజీవి పేర్కొన్నారు. ‘కేంద్రం అనుమతిచ్చాకే థియేటర్లు తెరుస్తాం’ తెలుగు సినీ పరిశ్రమకు తోడుగా ఉంటామని మంత్రి పేర్ని పేర్కొన్నారు. జులై 15 తర్వాత సినిమా షూటింగ్‌లు జరుపుకునేందుకు అనుమతి ఇచ్చినట్లు మంత్రి తెలిపారు. సీఎం జగన్‌తో సినీ పెద్దల సమావేశం అనంతరం మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. థియేటర్ల మినిమం ఫిక్స్‌డ్‌ఛార్జీలు ఎత్తివేయాలని సినీ పెద్దలు కోరిన అంశాన్ని పరిశీలిస్తామన్నారు. సినిమా టికెట్లను ఆన్లైన్ చేసే ఆలోచన చేస్తున్నామన్నారు. కేంద్రం అనుమతి ఇచ్చికే థియేటర్లు తెరుస్తామన్నారు. 2019-20 నంది అవార్డులకు విధివిధానాలు రూపొందించాలని సీఎం జగన్ ఆదేశించారన్నారు. చిన్న సినిమాల రాయితీల విడుదలకు సీఎం ఆదేశించనట్లు తెలిపారు. విశాఖపట్నంలో సెటిల్ అవ్వాలనుకునేవారికి ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు. -
సీఎం జగన్‌తో సినీ పెద్దల భేటీ
-
సీఎం జగన్‌తో సినీ పెద్దల భేటీ
సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో సినీ ప్రముఖుల సమావేశం ప్రారంభం అయింది. తెలుగు సినీ పరిశ్రమ అభివృద్దిపై చర్చించేందుకు మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు తాడేపల్లిలోని సీఎం క్యాంపు ఆఫీస్‌లో చిరంజీవి నేతృత్వంలోని టాలీవుడ్ బృందం ముఖ్యమంత్రిని కలిశారు. ఏపీలో షూటింగ్‌లకు సింగిల్ విండో అనుమతి ఇవ్వడంపై సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలపనున్నారు. అదేవిధంగా ప్రస్తుతం టాలీవుడ్‌లోని సమస్యలపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఈ సమావేశానికి మెగాస్టార్ చిరంజీవితో పాటు నాగార్జున, సురేష్ బాబు, త్రివిక్రమ్, రాజమౌళి, సి.కళ్యాణ్, దిల్ రాజు తదితరులు హాజరయ్యారు. -
రేపు సీఎం జగన్‌తో సినీ ప్రముఖుల భేటీ
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో రేపు (మంగళవారం) తెలుగు సినీ ప్రముఖులు భేటీ కానున్నారు. ఈ సమావేశంలో మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, శ్యామ్ ప్రసాద్ రెడ్డి, జెమిని కిరణ్, రాజమౌళి, జీవిత, త్రివిక్రమ్, కొరటాల శివ, సి.కళ్యాణ్, దామోదర ప్రసాద్, ప్రసన్న కుమార్‌లతో పాటు మొత్తం 25 మంది సభ్యుల బృందం పాల్గొననుంది. ఈ సందర్భంగా కరోనా లాక్డౌన్ కారణంగా నిలిచిపోయిన సినిమా షూటింగ్‌లకు అనుమతితో పాటు థియేటర్ల ఓపెన్, తదితర అంశాల గురించి కూడా సీఎం జగన్‌తో చర్చించే అవకాశం ఉంది. ( తెలంగాణలో షూటింగ్‌లకు అనుమతులు) కాగా, తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో సినిమా, టీవీ షూటింగులకు అనుమతించిన సంగతి తెలిసిందే. కోవిడ్-19 మార్గదర్శకాలు, లాక్ డౌన్ నిబంధనలు పాటిస్తూ రాష్ట్రంలో సినిమా, టీవీ కార్యక్రమాల షూటింగులు కొనసాగించుకోవచ్చని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వెల్లడించారు. దీనికి సంబంధించిన ఫైలుపై సీఎం కేసీఆర్ సోమవారం సంతకం చేశారు. -
9న సీఎం జగన్‌తో సినీ పెద్దల భేటీ
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో ఈ నెల 9న సినీ పెద్దలు సమావేశం కానున్నట్లు నిర్మాత సి. కళ్యాణ్ తెలిపారు. ఏపీలో సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం చర్చించేందుకు ఈ నెల 9న మధ్యాహ్నం 3 గంటలకు సీఎం జగన్‌తో భేటీ కానున్నామని పేర్కొన్నారు. ఈ సమావేశానికి మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణతో సహా టాలీవుడ్‌కు చెందిన అందరినీ ఆహ్వానించామన్నారు. అయితే జూన్ 10న బాలకృష్ణ 60వ పుట్టినరోజు వేడుకలు ఉండటంతో ఆయన ఈ సమావేశానికి రావటం లేదన్నారు. సీఎం జగన్‌తో భేటీ అనంతరం మీడియా సమావేశం నిర్వహించి అన్ని విషయాలు చెబుతామని సి. కళ్యాణ్ పేర్కొన్నారు. (‘ఇంట్లో పెళ్లి కాదు.. బొట్టు పెట్టి పిలవడానికి’) ఇక ఇదే సమావేశంలో కరోనా లాక్డౌన్ కారణంగా నిలిచిపోయిన సినిమా షూటింగ్‌లకు అనుమతితో పాటు థియేటర్ల ఓపెన్, తదితర అంశాల గురించి కూడా సీఎం జగన్‌తో చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే ఇవే అంశాలపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సినీ పెద్దలు సమావేశం అయిన విషయం తెలిసిందే. అంతకుముందు చిరంజీవి నివాసంలో తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో కూడా సినిమా షూటింగ్‌ల అనుమతిపై చర్చించారు. అయితే ఈ సమావేశాలకు తనను ఆహ్వానించలేదని బాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు పలు వివాదస్పద వ్యాఖ్యలు చేయడంతో టాలీవుడ్లో పెద్ద దుమారమే చెలరేగింది. దీంతో ఈ సారి ఎలాంటి వివాదాలకు చోటివ్వకుండా అందరినీ ఆహ్వానించినట్లు తెలుస్తోంది. (బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు..) -
S.V. కృష్ణారెడ్డి బర్త్ డే స్పెషల్..
-
బాలయ్యకు మద్దతు తెలిపిన నిర్మాత
సాక్షి, హైదరాబాద్ : సినీ ఇండస్ట్రీకి మంచి జరుగుతుందని అనుకుంటే మెగాస్టార్ చిరంజీవనే కాకుండా ఎవ్వరితోనైనా కలిసి నడుస్తామని దర్శకనిర్మాత తమ్మరెడ్డి భరద్వాజ స్పష్టం చేశారు. చిరంజీవి ఇంట్లో సమావేశం ఆయన స్వలాభం కోసం పెట్టలేదని, ఈ భేటీని పెద్ద వివాదంగా చేస్తున్నారని తప్పుపట్టారు. ఇలాంటి సమావేశాలు గతంలో దాసరి నారాయణరావు ఇంట్లో అనేకం జరిగాయని గుర్తుచేశారు. (‘ఇంట్లో పెళ్లి కాదు.. బొట్టు పెట్టి పిలవడానికి’) నటులు బాలకృష్ణ, నాగబాబు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు తెలిపారు. బాలకృష్ణ చేయని వ్యాఖ్యలను చేసినట్లు చూపుతున్నారని మండిపడ్డారు. ఇక అయన వ్యక్తిగత వ్యాఖ్యల గురించి స్పందించనని అన్నారు. చిరంజీవి, బాలకృష్ణల మధ్య ఎలాంటి మనస్పర్థలు లేవని, వారిద్దరు మంచిగా ఉన్నారన్నారు. ఈరోజు బాలకృష్ణ, చిరంజీవిలతో మాట్లాడామని ఈ సమస్య ఇక్కడే పరిష్కారం అయిందనే అనుకుంటున్నట్లు తమ్మారెడ్డి తెలిపారు. (నన్ను ఒక్కడూ పిలవలేదు : బాలకృష్ణ) బాలకృష్ణ అభిప్రాయం అందరిదీ: ప్రసన్న కుమార్ సినీ పెద్దల సమావేశంపై నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలను నిర్మాత ప్రసన్నకుమార్ సమర్థించారు. బాలకృష్ణ అభిప్రాయమే తమందరిలోనూ ఉందన్నారు. ఈ సమావేశం గురించి నరేశ్, జీవితా రాజశేఖర్, ఫిలిమ్ ఛాంబర్, కౌన్సిల్‌లోని సభ్యులెవరికీ తెలియదన్నారు. చిరంజీవి, బాలకృష్ణ ఇద్దరూ ఇండస్ట్రీకి రెండు కళ్లని, ఇండస్ట్రీ సమస్య అందరిదన్నారు. (ఆ తర్వాత ఏలియన్స్ దాడులా?: వర్మ) -
‘ఇంట్లో పెళ్లి కాదు.. బొట్టు పెట్టి పిలవడానికి’
సాక్షి, హైదరాబాద్ : మెగాస్టార్ చిరంజీవి నివాసంలో కరోనా క్రైసిస్ ఛారిటీ(సీసీసీ) సభ్యుల రివ్యూ సమావేశం ముగిసింది. ప్రస్తుతం టాలీవుడ్లో నెలకొన్న పరిస్థితులు, పేద సినీ కార్మికులకు అందిన సాయం, లోట్లుపాట్లపై సీసీసీ సభ్యుల మధ్య చర్చకు వచ్చినట్లు తెలుస్తుంది. ఈ సమావేశం అనంతరం దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మీడియాతో మాట్లాడారు. ఇటీవల సినీ పెద్దలు ప్రభుత్వంతో జరిపిన చర్చలపై నటుడు బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. (భూములు పంచుకుంటున్నారా?) ‘ఎవరి ఇంట్లో పెళ్లి కాదు, బొట్టు పెట్టి పిలవడానికి. పలానా వాళ్లని పిలవాలి అనేది లేదు నన్ను కూడా పిలవలేదు. ఈ విషయాన్ని ఇంత పెద్ద వివాదం చేయాల్సిన అవసరం లేదు. మహేశ్, వెంకటేశ్, ఇలా చాలా మందిని పిలువలేదు. మమ్మల్ని పిలవలేదు అంటే అర్థం లేదు. బాలకృష్ణ, నాగబాబు వ్యాఖ్యలు వారి వ్యక్తిగతం. ఆ వ్యాఖ్యలతో చిత్రపరిశ్రమకు సంబంధంలేదు. ఇప్పటివరకు నిర్మాతలుగా మేము చిత్రీకరణ కోసం ప్రభుత్వంతో సంప్రదిస్తున్నాము. ఈ సమావేశానికి చిరంజీవి, నాగార్జునలను లీడ్ తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. బాలయ్య లేకుండా సినీ ఇండస్ట్రీ ఉందనుకోవడం లేదు. ఆయన అవసరం ఉన్నప్పుడు తప్పకుండా పిలుస్తాం’ అని తమ్మారెడ్డి భరద్వాజ పేర్కొన్నారు. (బాలకృష్ణకు ఇక్బాల్ గట్టి కౌంటర్!) బాలయ్య అలా అనాల్సిందికాదు: సి.కళ్యాణ్ ‘ఈ రోజు చిరంజీవి ఇంట్లో సీసీసీ రివ్యూ మీటింగ్ సజావుగా జరిగింది. పలు విషయాలపై చర్చించాము. ఇక ప్రభుత్వంతో సినీ పెద్దలు జరిపిన సమావేశం రియల్ఎస్టేట్ సమావేశం అని ఎందుకు అన్నారో తెలియదు. అయితే బాలయ్య ఆలా అన్సాలింది కాదు. సమావేశానికి చిరంజీవి, నాగార్జునలను లీడ్ చేయమని సీఎం కేసీఆర్ చెప్పారు. ఆందుకే వాళ్లు సమావేశానికి వచ్చారు. ఇప్పటివరకు నిర్మాతలు, దర్శకులు మాట్లాడుకునే సమావేశాలే జరిగాయి’ అని నిర్మాత సి. కళ్యాణ్ వివరించారు. -
బాలకృష్ణకు ఇక్బాల్ గట్టి కౌంటర్!
-
జూన్ నుంచి సినిమా షూటింగ్‌లకు అనుమతి
-
సినిమా పరిశ్రమ బతకాలి
లాక్డౌన్ కారణంగా ఆగిపోయిన సినిమా షూటింగ్‌లు, పోస్ట్ ప్రొడక్షన్ పనులను దశలవారీగా పునరుద్ధరిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. లాక్డౌన్ నిబంధనలు, కోవిడ్ వ్యాప్తి నివారణ మార్గదర్శకాలను పాటిస్తూ షూటింగ్‌లు నిర్వహించేలా ఎవరికి వారు నియంత్రణ చర్యలను పాటించాల్సి ఉంటుందని కేసీఆర్ స్పష్టం చేశారు. సినిమా షూటింగ్‌లు ఎలా నిర్వహించాలనే విషయంలో విధి విధానాలను రూపొందించాలని అధికారులకు ఆదేశించారు. హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో శుక్రవారం సినిమా రంగ ప్రముఖులతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమయ్యారు. సినిమా షూటింగ్‌లు, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్, సినిమా థియేటర్ల పునఃప్రారంభం తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. సినిమా షూటింగ్‌లు, థియేటర్లను రీ ఓపెన్ చేసేందుకు అనుమతులు ఇవ్వాలన్న సినీ ప్రముఖుల విజ్ఞప్తికి సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. సినిమా పరిశ్రమపై ఆధారపడి లక్షలమంది జీవిస్తున్నందున పోస్ట్ ప్రొడక్షన్, షూటింగ్ నిర్వహణ, థియేటర్స్‌లో సినిమా ప్రదర్శనలను దశలవారీగా పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. ఇండోర్‌లో తక్కువమందితో పోస్ట్ ప్రొడక్షన్ పనులను మొదట ప్రారంభించుకోవాలని సీఎం చెప్పారు. తర్వాతి దశలో జూన్ నెలలో సినిమా షూటింగ్‌లు ప్రారంభించాలని చెప్పారు. సినిమా షూటింగ్‌లను వీలైనంత తక్కువమందితో చేయాలని చెప్పారు. షూటింగ్స్‌లో ఎంతమంది పాల్గొనాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తదితర అంశాలపై సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సమావేశమై చర్చించాలని సినీ రంగప్రముఖులను సీఎం కోరారు. ఆ తర్వాత కచ్చితమైన మార్గదర్శకాలను రూపొందించి ప్రభుత్వం షూటింగ్‌లకు అనుమతులు ఇస్తుందని సీఎం వెల్లడించారు. కొద్ది రోజులు షూటింగ్‌లు జరిపాక పరిస్థితిపై కొంత అంచనా వస్తుంది కాబట్టి సినిమా థియేటర్లను రీ ఓపెన్ చేసే విషయంపై నిర్ణయం తీసుకుంటామని సీఎం చెప్పారు. ఈ సమావేశంలో మంత్రులు తలసాని శ్రీనివాసయాదవ్, నిరంజన్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌లతో పాటు నటులు చిరంజీవి, నాగార్జున, నిర్మాతలు డి. సురేష్‌బాబు, సి. కల్యాణ్, అల్లు అరవింద్, ‘దిల్’రాజు, దామోదర ప్రసాద్, కిరణ్, దర్శకులు రాజమౌళి, ఎన్. శంకర్, మెహర్ రమేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్, రాధాకృష్ణ, కొరటాల శివ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు (శుక్రవారం) సినిమా, టీవీ, డిజిటల్ మీడియాకి సంబంధించిన సమస్యలను విని, వేలాదిమంది దినసరి వేతన కార్మికులకు ఊరట కలిగేలా త్వరలో నిర్ణయం తీసుకుంటామని తెలంగాణ ముఖ్య మంత్రి కేసీఆర్‌గారు అన్నారు. వినోద పరిశ్రమ పునఃప్రారంభించే విధి విధానాలను ప్రభుత్వం త్వరలోనే రూపొందించి, అందరికీ మేలు కలిగేలా చూస్తుందని హామీ ఇచ్చారు. సమస్యలను విని, భరోసా ఇచ్చిన సీఎంగారికి పరిశ్రమలోని యావన్మంది తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. – చిరంజీవి -
సినీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం
‘‘తెలుగు చలనచిత్ర పరిశ్రమ పట్ల తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడూ సానుకూల ధోరణితోనే ఉంటుంది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చేసుకోవడానికి వీలుగా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దేశంలోనే హైదరాబాద్ నగరం చిత్రరంగానికి హబ్‌గా నిలిచింది’’ అన్నారు తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్. కరోనా విపత్కర పరిస్థితుల నేపథ్యంలో సినిమా ఇండస్ట్రీ తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటోంది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు మొదలుపెట్టుకోవచ్చా? షూటింగ్‌లు ఎప్పుడు ఆరంభించాలి? థియేటర్లను ఎప్పుడు తెరవాలి? వంటి విషయాల గురించి చర్చించడానికి నటుడు చిరంజీవి నివాసంలో గురువారం జరిగిన సమావేశంలో తలసాని శ్రీనివాసయాదవ్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ‘‘అందరి సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకునే షూటింగ్‌లను నిలిపివేయడం జరిగింది. కానీ లాక్డౌన్ కారణంగా సినిమా షూటింగ్‌లు నిలిచిపోవడంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్న లక్షలాదిమంది ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకుని షూటింగ్స్ చేయవచ్చో వివరిస్తూ.. ఇండోర్, అవుట్డోర్ షూటింగ్‌లకు సంబంధించిన ఓ మాక్ వీడియోను ప్రభుత్వానికి సమర్పిస్తాం’’ అని ఈ సమావేశంలో పాల్గొన్న ప్రముఖులు తలసానికి వివరించారు. అలాగే కరోనా క్రైసిస్ చారిటీ (సీసీసీ) ద్వారా సినీ కార్మికులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేసిన విషయాన్ని తలసాని దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ– ‘‘కరోనా నియంత్రణ కోసం అమలులో ఉన్న లాక్డౌన్ వల్ల తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటోన్న సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్‌గారి దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తాం. సినిమా షూటింగ్‌ల నిర్వహణ, థియేటర్స్‌ను రీ ఓపెన్ చేయడం గురించి ముఖ్యమంత్రిగారితో చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటాం. అలాగే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌లో పాల్గొనే వారు ప్రభుత్వ ఆదేశానుసారంగా శానిటైజేషన్, మాస్క్‌లను ధరించడం, భౌతికదూరం వంటి కరోనా నియంత్రణ చర్యలను తప్పక పాటించాల్సి ఉంటుంది. మాక్ షూటింగ్ నిర్వహణకు అవసరమైన సహకారం అందిస్తాం’’ అని అన్నారు. అలాగే పరిశ్రమలోని 14వేల మంది కార్మికులకు తానే నిత్యావసర సరుకులను అందజేయనున్నట్లు తలసాని తెలిపారు. నటులు చిరంజీవి, నాగార్జున, నిర్మాతలు సి.కల్యాణ్, అల్లు అరవింద్, శ్యాంప్రసాద్ రెడ్డి, ‘దిల్’ రాజు, పి. కిరణ్, దర్శకులు ఎన్. శంకర్, వినాయక్, రాజమౌళి, త్రివిక్రమ్, కొరటాల శివ, ఎఫ్డీసీ మాజీ చైర్మన్ రామ్మోహన్ రావు పాల్గొన్నారు. -
షూటింగ్స్ గురించి జూన్‌లో మాట్లాడతాం
‘‘తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌గారి ఆదేశాల మేరకు తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధికి అవసరమైన ప్రణాళిక కోసం చిరంజీవి, నాగార్జునలతో ఇప్పటికే చర్చించాం. ఇండస్ట్రీ కోసం ప్రభుత్వం ఒక పాలసీని ప్రకటించనున్న సమయంలో కరోనా వైరస్ ప్రభావం ప్రారంభమైంది. రాబోయే రోజుల్లో చిత్ర పరిశ్రమ అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం ఉత్తమమైన విధానం తీసుకొస్తుంది’’ అని తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ అన్నారు. హైదరాబాద్‌లో మంగళవారం తలసాని విలేకరులతో మాట్లాడుతూృ ‘‘కరోనా వైరస్ వల్ల ప్రపంచం మొత్తం ఇబ్బందులు ఎదుర్కొంటోంది. లాక్డౌన్ వల్ల హైదరాబాద్‌కు ఆయువుపట్టుగా ఉన్న చలనచిత్ర పరిశ్రమ, థియేటర్లు మూతబడ్డాయి. ఈ కారణంగా వాటిపై ఆధారపడ్డ కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రేషన్ కార్డు ఉన్న కార్మికులకు ప్రభుత్వం రూ.1500లతో పాటు 12 కేజీల బియ్యం అందిస్తోంది. ఇండస్ట్రీ వారు ‘కరోనా క్రై సిస్ చారిటీ మనకోసం’ ద్వారా 14వేల మందికి నిత్యావసరాలు పంపిణీ చేయడం అభినందనీయం. లాక్డౌన్ ముగిసిన తర్వాత ఇండస్ట్రీలో సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు సినీ పెద్దలతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటాం. థియేటర్లలో భౌతిక దూరం, ఇండస్ట్రీకి పవర్ టారిఫ్‌లపై, మారిటోరియం విషయంపైనా చర్చించనున్నాం. తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, తెలంగాణ స్టేట్ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్, తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్.. ఇలా అన్నింటినీ ఒకే గొడుగు కిందకి తీసుకొచ్చేందుకు ఇప్పటికే చర్చించాం. జూన్‌లో సినిమా షూటింగ్స్, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలపై మాట్లాడతాం. టీవీ షూటింగ్‌లకు కూడా ప్రస్తుతానికి అనుమతులు ఇవ్వలేదు. తెలుగు చిత్ర పరిశ్రమ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నందున సినిమాలకు సంబంధించిన నిర్ణయాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతోనూ మాట్లాడి నిర్ణయాలు తీసుకుంటాం’’ అన్నారు. -
నిర్మానుష్యంగా మారిన స్టూడియోలు
-
కరోనా లాక్డౌన్: చిరు బాటలో నాగ్
సాక్షి, హైదరాబాద్ : ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న మహమ్మారి కరోనా వైరస్(కోవిడ్19) అన్ని రంగాలపై తీవ్రమైన ప్రభావం చూపుతోంది. వ్యాపార, సినిమా, క్రీడా రంగాలపై దీని ప్రభావం భారీగా ఉంది. ముఖ్యంగా సినిమా రిలీజ్లు వాయిదా పడటం.. షూటింగ్‌లు రద్దవ్వడంతో సినీ కార్మికులకు ఉపాధి కరువయింది. రెక్కాడితేగాని డొక్కాడని ఆ పేద సినీ కార్మికుల దైనందన జీవితం కష్టంగా మారింది. అయితే పేద సినీ కార్మికుల కోసం టాలీవుడ్ ప్రముఖులు తమ వంతు సాయాన్ని ప్రకటిస్తున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి పేద సినీ కార్మికుల కోసం రూ. కోటి విరాళం ఇవ్వగా.. సూపర్ స్టార్ మహేశ్ బాబు రూ. 25 లక్షలు ప్రకటించి తమ వంతు బాధ్యతను నిర్వర్తించారు. తాజాగా టాలీవుడ్ కింగ్ నాగార్జున సైతం తెలుగు చలనచిత్ర పరిశ్రమలో(టీఎఫ్ఐ)ని రోజువారి కూలీలకు, అలాగే తక్కువ సంపాదన ఉన్న వాళ్లకు తన వంతు సాయంగా రూ. కోటి విరాళం ప్రకటించారు. ఈ మొత్తాన్ని టీఎఫ్ఐకి అందించారు. ‘ప్రస్తుతం లాక్డౌన్ అనేది అవసరం. కరోనా వ్యాప్తిని నిరోధించాలంటే లాక్డౌన్ అవసరం. లాక్డౌన్ పాటిస్తున్న వారికి.. మద్దతుగా నిలుస్తున్న వారికి నా అభినందనలు. ఈ కష్టకాలంలో ప్రభుత్వానికి అండగా నిలుస్తున్న వారికి కూడా ధన్యవాదాలు. ఈ సమయంలో పేద సినీ కార్మికుల కోసం నా వంతుగా రూ. కోటి రూపాయలు విరాళంగా ప్రకటిస్తునన్నా. దేవుడు మనలను చల్లగా చూస్తాడు.. ఇంట్లోనే ఉండండి సురక్షితంగా ఉండండి’అంటూ నాగార్జున పేర్కొంటూ తన గొప్ప మనసును చాటుకున్నారు. ఇక చిత్ర పరిశ్రమలోని పేద కార్మికులకు సహాయం చేస్తూనే ప్రభుత్వానికి కూడా తమ వంతు ఆర్థిక సహాయాన్ని టాలీవుడ్ ప్రముఖులు ప్రకటించారు. ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ప్రభాస్, మహేశ్ బాబు, అల్లు అర్జున్, రామ్‌చరణ్, ఎన్టీఆర్, త్రివిక్రమ్, అనిల్ రావిపూడి, దిల్ రాజు, రాధాకృష్ణ, తదితరులు రెండు తెలుగు రాష్ట్రాలు సీఎం రిలీఫ్ పండ్‌కు విరాళాలు ప్రకటించారు. అయితే మరికొంత మంది ప్రధాన మంత్రి సహాయక నిధికి కూడా విరాళాలు ప్రకటించారు. చదవండి: ‘మాకు రాదులే’ అనుకోవడం ప్రమాదకరం ‘ఫస్ట్ టైమ్ నెలకు 1000 రోజులు’ -
సీఎంను కలిసిన టాలీవుడ్ నిర్మాతలు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో తెలుగు సినీ పరిశ్రమకు చెందిన అగ్ర నిర్మాతలు భేటీ అయ్యారు. బుధవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్మాతలు దగ్గుబాటి సురేష్, శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి, నల్లమలుపు బుజ్జి, జెమిని కిరణ్ తదితరులు ముఖ్యమంత్రిని కలిశారు. సమావేశానంతరం దగ్గుబాటి సురేష్ మాట్లాడుతూ.. ఆరేళ్ల క్రితం విశాఖపట్నంలో హుద్‌హుద్ తుపాను సృష్టించిన విలయానికి నిరాశ్రయులైన వారిని ఆదుకోవడంలో భాగంగా సినీ పరిశ్రమ నిధులు సేకరించి వాటితో విశాఖలో బాధితులకు ఇళ్లు కట్టించినట్లు తెలిపారు. దాదాపు రూ.15 కోట్ల నిధులు వచ్చాయని, ఈ మొత్తంతో గృహ సముదాయాన్ని నిర్మించామన్నారు. ఆ ఇళ్లను ప్రారంభించాలని సీఎం వైఎస్ జగన్‌ను కోరామని, ఇందుకు ఆయన సానుకూలంగా స్పందించారని చెప్పారు. ఈ కార్యక్రమంలో సినీ నిర్మాత, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పాల్గొన్నారు. -
తర్వాత ఏం జరుగుతుంది?
‘గద్దలకొండ గణేష్’ చిత్రంతో తెలుగు చిత్రపరిశ్రమకి పరిచయమయ్యారు తమిళ యువ నటుడు అధర్వ మురళి. ఆయన నటించిన తమిళ చిత్రం ‘బూమరాంగ్’ను అదే టైటిల్‌తో తెలుగులో విడుదల చేస్తున్నారు నిర్మాత సీహెచ్ సతీష్ కుమార్. ఆర్. కణ్ణన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మేఘా ఆకాశ్, ఇందుజా రవిచంద్రన్ కథానాయికలు. రేపు(3న) విడుదల కానున్న ఈ చిత్రం ట్రైలర్‌ను దర్శకుడు హరీష్ శంకర్ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘అధర్వ నాకు ఇష్టమైన హీరో. చాలా ప్యాషనేట్ హీరో.. యువత తలుచుకుంటే ఎలాంటి మార్పు తీసుకురావచ్చనే సందేశాన్ని ఈ చిత్రంలో చక్కగా చెప్పారు’’ అన్నారు. ‘‘ప్రేక్షకులు కోరుకునే అన్ని అంశాలు మా సినిమాలో ఉంటాయి. తర్వాత ఏం జరుగుతుందోనని ఊహించలేని విధంగా దర్శకుడు స్క్రీన్‌ప్లే రాశారు’’ అన్నారు నిర్మాత సీహెచ్ సతీష్ కుమార్. -
జగన్ రియల్ హీరో
-
జగన్ రియల్ హీరో
తెల్లారి లేస్తే హీరోలను కలిసే ఫొటోగ్రాఫర్ జనంలో తిరిగినప్పుడు ఒక రియల్ హీరోను చూశారు.జనం ఆ రియల్ హీరో గురించి మాట్లాడటం గమనించారు.జనం ఆ రియల్ హీరో కావాలనుకోవడం చూసి అబ్బుర పడ్డారు.జాతి, కులం, మతం, వర్గం తేడా లేకుండా మార్పు కోసం ఆ రియల్ హీరో కోసం జేజేలు పలకడం ఆయన గమనించారు.మార్పు రాబోతున్నది అనేది ఆయన విశ్వాసం. జగన్ వల్లే అది సాధ్యం అంటున్నారు చోటా కె నాయుడు. జగన్‌ను ఎందుకు రియల్ హీరో అంటున్నదిఆయన ఈ ఇంటర్వ్యూలో వివరించారు. మీరు ఇండస్ట్రీలోకి వచ్చి అప్పుడే 40 ఏళ్లు గడిచిపోయాయంటే ఆశ్చర్యంగా అనిపిస్తోంది. తెలుగు పరిశ్రమ, ప్రేక్షకులు మీతో సుదీర్ఘకాలం కనెక్ట్ అయి ఉన్నారు. మీకెలా అనిపిస్తోంది? చోటా: 1979 సెప్టెంబర్‌లో నేను సినిమా రంగంలో ప్రవేశించాను. ఇది 2019. ఇంత సుదీర్ఘమైన ప్రయాణం అంటే సర్ప్రైజింగ్గా ఉంది. మా నాన్నగారు నాటక రచయిత, దర్శకులు. నన్ను కెమెరామేన్‌గా చూడాలన్నది ఆయన కోరిక. నాన్నగారి సహకారంతోనే నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చాను. ఒక కెమెరామేన్ వద్ద అసిస్టెంట్‌గా చేరితే చాలు లైఫ్ సెటిల్ అయిపోద్దనుకున్నా, ఆ తర్వాత అక్కినేని నాగేశ్వరరావుగారిలాంటి హీరోతో ఓ సినిమాకి పనిచేస్తే చాలనుకున్నా. తర్వాత నాగార్జున, చిరంజీవిగారు, రజనీకాంత్‌గారితో ఒక్క సినిమా.. ఇలా అనుకున్నవన్నీ నెరవేరాయి. పిల్లల విజయం వాళ్ల అమ్మానాన్న చేసిన పుణ్యం మీద ఆధారపడి ఉంటుందంటారు. మా అమ్మానాన్న చేసిన పుణ్యం నాకు హెల్ప్ అయింది. అలాగే నా వైఫ్ సీతాదేవి కూడా. అంతేకానీ నా ప్రతిభ వల్లే ఇంత సక్సెస్ అయ్యానని అనుకోవడంలేదు. డెస్టినీయే కారణం అంటాను. ఇప్పటికీ ఏదైనా పెద్ద సినిమా అంటే ఛోటా కావాలంటున్నారు. అది మీ టాలెంట్ కాదా? (నవ్వుతూ) నో ఆన్సర్. అయితే ఒకటి చెబుతా. ఒకప్పుడు నా సక్సెస్ అంతా నా టాలెంట్ వల్లే అనుకున్నాను. కానీ వ్యక్తిగా సాధించిన అనుభవాలు ఆ తర్వాత దాన్ని డెస్టినీకి ఆపాదించేలా చేశాయి. ఇప్పటికి ఎన్ని సినిమాలు చేశారు? కరెక్టుగా తెలీదు. సెంచరీకి దగ్గరగా ఉన్నాను. సెంచరీ పూర్తయ్యాక ఇక చాలు వీడికి అంటారేమో అని కరెక్ట్ కౌంట్ చెప్పడానికి భయపడుతున్నా (నవ్వుతూ).‘దాసరిగారు నా గురువు’ అని చెబుతుంటారు. డైరెక్టర్స్‌లో ఆయన 150 సినిమాల రికార్డ్ సాధించారు గదా. మరి కెమెరామేన్‌గా మీరు కూడా...తలరాతలు బ్రహ్మ రాస్తాడు అంటారు. కానీ, నా రాతని దాసరి నారాయణరావుగారనే బ్రహ్మ రాశారు. నా రాత రాసేటప్పుడు 150 సినిమాలు చేయమని రాశారేమో తెలియదు. వందకు దగ్గరలో ఉన్నాను. ఆ తర్వాత ఆయన ఏం రాశారో. చూద్దాం.. డెస్టినీ అన్నది నన్ను ఎంతవరకూ తీసుకెళుతుందో. దాసరిగారితో మీ అనుబంధాన్ని ఓసారి గుర్తు చేసుకుంటారా? కెమెరామేన్ కె.ఎస్. హరిగారి ద్వారా దాసరిగారు పరిచయం. ఆ రోజు నుంచి నాకు సర్వం ఆయనే అయిపోయారు. ఆయన దగ్గరే నేను ఓనమాలు దిద్దుకున్నా. క్రమశిక్షణ, ముక్కుసూటిగా మాట్లాడటం... ఇవన్నీ అక్కడి నుంచే అలవడ్డాయి నాకు. ఇండస్ట్రీలో కొత్త నీరు రావడం చూసి మీరేమైనా ఫీలవుతున్నారా? ఎందుకు ఫీలవ్వాలి? కొత్తవాళ్లు రావాలి కదా. ఇళయరాజాగారు బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్. ఆయన తర్వాత ఏఆర్ రెహమాన్ వచ్చాడు. ఇప్పుడు అనిరు«థ్ అని ఇంకో అబ్బాయి వస్తున్నాడు. ఇళయరాజాగారు ఏమైనా అయిపోయారా? ఆయన ఆయనే.. నేను నేనే. వందమంది వచ్చినా, రెండొందల మంది వచ్చినా, ఎవరి స్టాండర్డ్ వారికి ఉంటుంది. సినిమాలు తప్ప మీకు మరో ప్రపంచం మీద ధ్యాస ఉండదనిపించింది. కానీ ఆ మధ్య ఓ చానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘జగన్‌గారు దమ్మున్న మగాడు’ అని స్టేట్మెంట్ ఇచ్చేశారు. పాలిటిక్స్‌ని ఫాలో అవుతారా? నిజమే. నేను రాజకీయాలకు దూరం. కానీ, రాజశేఖర్ రెడ్డిగారంటే అభిమానం. ఎలాగంటే ఓ సామాన్య పౌరుడిగా. నాలాగే కొన్ని కోట్ల మంది ఆంధ్రప్రదేశ్‌లో, తెలంగాణలో ఆయన్ను అభిమా నించేవారు ఉన్నారు. రాజశేఖర్ రెడ్డిగారి దమ్ము, లవ్ అండ్ ఎఫెక్షన్, టాలెంట్, పవర్.. ఇలా అన్నీ జగన్‌లో నేను చూశాను. ‘హీ ఈజ్ ఎ ఫైటర్’. ముందు జగన్‌ని ఓ ముఖ్యమంత్రి కొడుకుగానే చూశాను. ఆ తర్వాత ఆయనలో నాకో రియల్ హీరో కనిపించాడు. నాలా స్ట్రగుల్ అయి, పైకి వచ్చినవాళ్లందరికీ ఆయన హీరోలానే కనిపిస్తారు. ఆయనపై పెట్టిన కేసులు కానివ్వండి, ఆయన్ని ఇరికించిన విధానం.. వాటిని ఎదుర్కొంటున్న తీరు.. ఇవి చాలు ఆయన్ను దమ్మున్నోడు అనడానికి. నేను ఆయన్ను చూడటం మొదలుపెట్టినప్పుడు జగన్‌కి 34–35 సంవత్సరాలు ఉంటాయేమో. అప్పటినుంచి వ్యక్తిగా రోజురోజుకీ స్ట్రాంగ్ అవుతూ అన్నింటినీ ఎదుర్కొనే విధానం నాకు బాగా నచ్చింది. అందుకని నేను జగన్ దమ్మున్నోడు అన్నాను. ఆయనలాంటి వాళ్లు రావాలి. ఎందుకు రావాలి? అంటే మీరు చెప్పే సమాధానం? జగన్‌గారు యంగర్ జనరేషన్. హైలీ ఎడ్యుకేటెడ్. మాట తప్పని మనిషి. తండ్రికి తగ్గ తనయుడు. అద్భుతమైన వ్యక్తి. ఆయన సీఎం అయితే ఎలా ఉంటాడన్నది నాకున్న పరిజ్ఞానం, అనుభవం, జ్ఞానం మేరకు ఆయన అద్భుతం అని నేను అనుకుంటున్నా. గత డిసెంబరులో నా సినిమా విడుదలయ్యాక రెండు నెలలు నేను ఫ్రీగా ఉన్నాను. నిజం చెప్పాలంటే 40 ఏళ్ల తర్వాత నాకు ఓ హాలిడే దొరికింది. దాంతో ఆంధ్రప్రదేశ్‌లో నేను చాలా ప్లేసులకు వెళ్లాను. ఎక్కడికి వెళ్లినా ఎవరితో మాట్లాడినా ‘జగన్‌గారంటే అభిమానం’ అన్నారు. ‘ఒక్కసారి ఆయనకి అవకాశం ఇద్దామనుకుంటున్నాం’ అని ఎంతోమంది నాతో చెప్పారు. వాళ్లే కాదు.. నాతో సహా ఆయనకు ఒక్క అవకాశం ఎందుకు ఇద్దామనుకుంటున్నామంటే.. ఆయన ఆరోజు ఎలా ఉన్నారో ఈరోజూ అలాగే ఉన్నారు. ఆయన ఆ రోజు ఏం మాట్లాడారో ఇప్పుడూ అదే మాట్లాడుతున్నారు. వైఎస్‌గారి మరణానంతరం ‘ఓదార్పు యాత్ర’ అనే ఓ కాన్సెప్ట్ పెట్టుకున్న తర్వాత దాన్ని కొంతవరకూ పరిమితం చేయమన్నప్పుడు.. నేను చేయను అని వచ్చేసినప్పటి నుంచి నేను జగన్‌ని ఫాలో అవుతున్నా. నేను తిరిగిన మా ఊర్లు ఈస్ట్ గోదావరి, రాజమండ్రి, కాకినాడ, రామచంద్రాపురం, పాలకొల్లు ప్రాంతాల వాళ్లు చెబుతుంటే నేను కూడా వారిలాగా ఆయన గురించి ఆలోచించడం మొదలుపెట్టా. జగన్ వస్తే ఓ మార్పు వస్తుంది. కొత్త జనరేషన్, కొత్త ఐడియాలజీ ఇవి మాత్రమే కాకుండా.. ఆయనకు ఉన్న పవర్, ఎడ్యుకేషన్ చూసి ఒక గొప్ప వ్యక్తి రావాలి అనిపించింది. ‘జగన్ ఈజ్ ఫైటర్’ అనటం వల్ల ఇండస్ట్రీలో మీకు కొంతమంది దూరం అయ్యే అవకాశం ఉందా? మీకు అవకాశాలు తగ్గుతాయనుకోవచ్చా? మా సినిమా ఇండస్ట్రీకి, పాలిటిక్స్‌కి సంబంధం లేదు. టాలెంట్‌ని మాత్రమే పట్టించుకుంటుంది. అయినా ‘జగన్ ఈజ్ ఎ ఫైటర్’ అన్నానని నా గురించి ఎవరేం అనుకున్నా ఐ డోంట్ కేర్. కానీ నేను నమ్ముతున్నా. ఆయన ఎక్స్ట్రార్డినరీగా పని చేస్తారు. ఏపీ ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్ రావాలని కోరుకుంటున్నాను. నేనే కాదు.. చాలామంది మార్పు కోరుకుంటున్నారు. ఆ మార్పు జగన్వల్లే సాధ్యం అవుతుందని నమ్ముతున్నాను. జగన్‌గారిలో మీకు నచ్చిన విషయాలేంటి? మా నాన్నగారు ప్రవేశపెట్టిన 108, 104 సరిగ్గా నడవటం లేదు.. దాన్ని నేను సరిగ్గా గాడిలో పెడతా అన్నారు జగన్. అలాగే ఆరోగ్యశ్రీ. ఈ విషయంలో నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉంది. మా ఊరు రామచంద్రాపురంలో వైఎస్‌గారి ఆరోగ్యశ్రీ వల్ల ఓ వ్యక్తికి ఓపెన్‌హార్ట్ ఆపరేషన్ జరిగింది. ప్రతినెలా కొన్ని మందులు అతనికి అందేవి. వైఎస్‌గారు చనిపోయిన తర్వాత, ప్రభుత్వం మారాక ఆ మందులు ఆయనకు అందలేదు. ఇలా ఎన్నో ఫ్యామిలీలు ఎంతో ఇబ్బంది పడుతున్నాయి. ఎందుకు ఆయన రావాలి అంటే ఈ సంక్షేమ పథకాలన్నీ వైఎస్‌గారు ప్రవేశపెట్టారు కాబట్టి, జగన్‌గారు వస్తే మళ్లీ పక్కాగా అమలవుతాయన్నది నా నమ్మకం. అలాంటి పేదవాళ్లందరికీ హెల్ప్ చేయడానికి జగన్ రావాలి. ఫిల్మ్ ఇండస్ట్రీలో వారసులు వస్తున్నారు. వారసత్వ రాజకీయాల గురించి మీరేం చెబుతారు? తప్పేంటి? ఇందిరా గాంధీ మరణం తర్వాత పైలెట్‌గా ఉన్న రాజీవ్ గాంధీని తీసుకొచ్చి ప్రధానిని చేశారు.. ఆయన వారసుడు కాదా? మా ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ వారసులు వస్తున్నారు. అయితే టాలెంట్ ఉన్నవాళ్లే సూపర్‌స్టార్స్ అయ్యారు. రాజకీయాల్లో, సినిమాల్లో వారసత్వం అన్నది ఉన్నా నిరూపించుకోవడం అనేది ప్రతిభపైనే ఆధారపడి ఉంటుంది. జగన్.. వైఎస్‌గారి అబ్బాయి అని కాదు. ఆయనలోని క్వాలిటీస్ మనం చూడాలి కదా? రాజకీయాల్లో వారసులు లేరా? వారందరి పేర్లు చెబితే స్పేస్ వృథా అవుతుందని చెప్పడం లేదు. ఈ రెండు మూడు నెలల్లో నేను తిరిగిన ప్రాంతాల్లో జగన్ గురించి నేనేం ఫీలవుతున్నానో చాలా మంది అలానే ఫీలవుతున్నారు. ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీ ఓ రాజకీయ పార్టీకి ఫేవర్‌గా ఉండేదని చెప్పుకునేవారు. ఇప్పుడు కొంతమంది మరో పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు. ఆ పార్టీ నుంచి ఎందుకు డీవియేట్ అవుతున్నారు? నాకు తెలిసినంత వరకు సినిమా ఇండస్ట్రీలో అందరూ ఒకటే. రాజకీయాల విషయానికొస్తే మాత్రం ఎవరి ఇష్టం వారిది. మా గురువు దాసరిగారి విగ్రహాన్ని పాలకొల్లులో ఏర్పాటు చేసినప్పుడు వెళ్లాను. ఓ రోజంతా అక్కడే తిరిగా. వారందర్నీ జగన్ గురించి అడగలేదు. ఎన్నికలొస్తున్నాయి కదా ఎవరికి ఓటు వేస్తారని అడిగితే.. నాకు తెలిసి 80 శాతం మంది జగన్ పేరు చెప్పారు.ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్ నుంచి ఏం కోరుకుంటున్నారో అదే మా ఫిల్మ్ ఇండస్ట్రీవారు కూడా కోరుకుని ఆయన పార్టీలో చేరారనుకుంటున్నా. జగన్‌గారు వస్తే ఫిల్మ్ ఇండస్ట్రీ డెవలప్ అవుతుందని అనుకుంటున్నారా? ఏపీలో ఇంకా అభివృద్ధి చూడొచ్చనుకుంటున్నారా? సినిమా పరిశ్రమకు రాజశేఖర్ రెడ్డిగారు చాలా చాలా చేశారని నాకు తెలుసు. జగన్ కూడా అంతే. ఆయన మంచి విజన్ ఉన్న వ్యక్తి. కచ్చితంగా వైజాగ్‌లో ఫిల్మ్ ఇండస్ట్రీని డెవలప్ చేయొచ్చు? చేస్తారేమో? దానికంటే ముందు ఆయనకు ఎన్నో ఆలోచనలున్నాయి. వాటి ముందు మా ఇండస్ట్రీ విషయాన్ని రుద్దడం అవసరం లేదేమో అనిపిస్తోంది. ఇక్కడ కేసీఆర్‌గారు మమ్మల్ని బాగానే చూసుకుంటున్నారు. జగన్‌గారిని పర్సనల్‌గా ఎన్నిసార్లు కలిశారు? జగన్‌గారిని చాలాసార్లు పేపర్లో, టీవీల్లో చూశా. ఒకే ఒక్కసారి పాదయాత్రలో కలిశాను. ఆయనతో కలిసి ఐదుగంటలు పాదయాత్ర చేశా. ఓ పొలంలో కూలీ వాళ్లు పనులు చేసుకుంటున్నారు. జగన్ వస్తున్నారని వాళ్లకి ముందే తెలిసి ఉంటుంది కదా. ఆయన రాగానే పనులు మానుకుని పరుగెత్తుకుంటూ వచ్చి ఆయనతో కరచాలనం చేస్తూ మాట్లాడారు. అప్పుడు నేను ఆయన పక్కనే ఉండి గమనించాను. గోల్డెన్ స్పూన్‌తో పుట్టిన జగన్ వారితో ఎలా ఇంట్రాక్ట్ అవుతారా? ఏంటా? అని. వాళ్ల చేతులకి మట్టి ఉన్నా షేక్ హ్యాండ్ ఇచ్చారాయన. ఓ ముసలావిడ వచ్చి గట్టిగా పట్టుకుంటే ఆమె నుదటిపై ముద్దు పెట్టారు. ఇలాంటి దృశ్యాలు కంటిన్యూస్‌గా ఐదు గంటలు చూశా. నేను నడిచిన ఐదు గంటల్లో ఆయనతో మాట్లాడింది కేవలం ఐదు నిమిషాలే. నడిచినంత సేపు కూడా ఎక్కడా ఆయన మంచినీళ్లు తాగడం చూడలేదు. ఆయన భోజనం చేయడానికి క్యార్వాన్ వద్దకు వెళుతున్నప్పుడు కూడా చుట్టూ ఓ 500 మంది ఉన్నారు. ఎక్కడా విసుగు చెందకుండా వారిని ఆప్యాయంగా పలకరించారు. రాజశేఖర్ రెడ్డిగారు పాదయాత్ర చేసినప్పుడు టీవీల్లో చూశానే కానీ లైవ్‌లో చూడలేదు. వైఎస్‌గారు సీఎం అవకముందే జగన్‌గారు వ్యాపారవేత్త. అంచలంచెలుగా ఆయన ఎదిగారు. ఎంపీగా 5లక్షల పై చిలుకు ఓట్ల మెజారిటీతో నెగ్గిన వ్యక్తి ఆయన. ప్రపంచంలో అతి తక్కువమందికి సీటు దొరికే లండన్‌లోని ఓ కాలేజీలో వాళ్ల పాప చదువుకుంటోంది. ఆయన ఏజ్‌కి, డబ్బుకి హ్యాపీగా అక్కడికి వెళ్లిపోయి లైఫ్‌ని ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకండీ.. ఎవరో బురద చేతులతో మజ్జిగ అన్నం పెడుతున్నా సంతోషంగా తింటున్నారు? అది నేను ఒక్క ఎమ్జీఆర్ (దివంగత తమిళ నటుడు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి)లోనే చూశా. మళ్లీ ఇప్పుడు జగన్లోనే చూశా. ఆయనకి ఏం అవసరం అంటే అదొక కమిట్మెంట్. నాన్నగారు చనిపోయిన తర్వాత ఇంతమంది హఠాన్మరణం పొందారే, వారికి మేమున్నాం అంటూ భరోసా ఇవ్వడానికి ‘ఓదార్పు యాత్ర’ చేపట్టారు. పాదయాత్రలో అంత స్పీడుగా నడుస్తున్నా ఓ జెన్యూన్ సమస్యను పూర్తిగా విన్నారు. ఆ సమస్య తాలూకు పేపర్ని ఓ వ్యక్తి ఇస్తే తీసుకుని లంచ్ టైమ్‌లో దీని గురించి మాట్లాడాలి అన్నారు. ఆయన పాదయాత్ర చేస్తారా? సమస్యలు వింటారా? పేపర్లు తీసుకుంటారా? ఈసారి జగన్ సీఎం అయితే 100 శాతం రాబోయే కాలంలో ఇంకో వ్యక్తి రాలేడు. అంతటి అనుభవం ఆయనకి ఉంది. ఆయన నడిచిన నడకలో కొన్ని లక్షలకోట్ల ఫ్యామిలీలు వారి వారి పర్సనల్ ప్రాబ్లమ్స్ చెప్పాయి. నాయకుడు అనేవాడు హృదయంతో స్పందించాలి. ఆ స్పందన జగన్‌లో చూశా. అందుకే జగన్ అంటే ఇష్టం. ఫైనల్లీ... మీరు భవిష్యత్‌లో రాజకీయాల్లోకి వస్తున్నారా? అందరూ డైరెక్షన్ ఎప్పుడు అని అడుగుతుంటారు. మీరు రాజకీయాల్లోకి ఎప్పుడు అని అడుగుతున్నారు. డైరెక్షన్, రాజకీయాలు అన్నవి వెరీ టఫ్, చాలా కమిట్మెంట్తో ఉండాలి. జగన్‌లా నడవలేను.. ఎవరైనా ఏ చేత్తో పడితే ఆ చేత్తో పెడితే తినలేను. అందుకని.. ఎవరు చేయాల్సిన పనుల్లో వాళ్లు ఉండాలి. జగన్ అలానే ఉండాలి.. ఇండస్ట్రీలోని దర్శకులు అలానే ఉండాలి.. నేను కెమెరామేన్‌గా ఇలానే ఉండాలి. డి.జి. భవాని మీకు సినీరంగంలో అవకాశం ఇచ్చిన దాసరిగారు మీ గురువు. చిరంజీవి గారితో ఎక్కువగా ట్రావెల్ చేశారు. మీతో మంచి అనుబంధం ఉన్న పవన్ కల్యాణ్ ‘జనసేన’ పార్టీ పెట్టారు. మరి ఆయనకు సపోర్ట్ ఇవ్వకుండా జగన్‌గారికి ఎందుకు సపోర్ట్ ఇస్తున్నారు? గురువుగారు (దాసరి) నన్ను కెమెరామేన్‌గా పరిచయం చేసినా, నా బిగినింగ్ డేస్‌లో రామానాయుడుగారు ఓ తండ్రిలాగా నన్ను కాపాడుకుంటూ వచ్చారు. ఆయన బ్యానర్లో వరుసగా 9 సినిమాలు చేసే అవకాశమిచ్చారు. కేఎస్ రామారావుగారు కూడా నేను అసిస్టెంట్‌గా ఉన్నప్పుడే నన్ను కెమెరామేన్‌గా చేయమని చెప్పేవారు. సినిమాల వరకూ రామానాయుడుగారు నాకు దేవుడు, తండ్రిలాంటివారు. ఆయన బ్యానర్లో ఏ సినిమా మొదలెట్టినా ‘ఛోటా ఉన్నాడా? లేకపోతేనే వేరే కెమెరామేన్‌కి వెళ్లండి?’ అనేవారు. దాసరి, రామానాయుడు, దేవీవరప్రసాద్ అశ్వనీదత్, కేయస్ రామారావుగార్లు నన్ను ప్రోత్సహించారు. ఇక్కడ నా ఎదుగుదలకు అన్ని సామాజిక వర్గాలు సహకరించాయి. అందులో ఎలాంటి డౌట్ లేదు. నేను చాలా రఫ్‌గా ఉండేవాడిని. నన్ను ఓ కైండ్హార్టెడ్గా మార్చింది చిరంజీవిగారు. కల్యాణ్ (పవన్ కల్యాణ్) నాకు బ్లడ్ బ్రదర్‌లాంటివాడు. అతను గొప్ప వ్యక్తి. అతని ఆలోచనా విధానం, మాట్లాడే విధానం వేరే. పక్క వ్యక్తికి ఏదైనా సమస్య వచ్చినా అయ్యో అని ఫీలయిపోతాడు. రాజకీయాల్లోకి వెళ్లాక పవన్ సిద్ధాంతాలు ఇంకో రకంగా ఉన్నాయి. రాజకీయపరంగా మాత్రం జగన్ అంటేనే ఇష్టం. -
తరలివస్తోన్న తెలుగు చిత్ర పరిశ్రమ
సాక్షి, అమరావతి : తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు, నటులు జగన్‌కు జై కొడుతున్నారు. వారంతా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో టీడీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. సినీ పరిశ్రమపై టీడీపీ పట్టు కోల్పోవడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. రోజా, విజయ్‌చందర్ వంటి సీనియర్ నటులు మొదట్నుంచీ వైఎస్సార్సీపీలోనే ఉన్నారు. వీరితో పాటు పోసాని కృష్ణమురళీ తదితరులు పార్టీ తరఫున తమ గళం విన్పించేవారు. ఇటీవల ప్రముఖ హాస్యనటుడు పృథ్వీ, మరో నటుడు కృష్ణుడు చేరారు. తర్వాత సీనియర్ నటి జయసుధ, మరో ప్రముఖ హాస్యనటుడు అలీ, భానుచందర్, దాసరి అరుణ్‌కుమార్, చిన్ని కృష్ణ, రాజారవీంద్ర, తనీష్ వైఎస్సార్సీపీ కండువా కప్పుకున్నారు. దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి, నిర్మాత అచ్చిరెడ్డి తదితరులు జగన్‌కు మద్దతు పలికారు. తాజాగా ప్రముఖ నటుడు మోహన్‌బాబు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎన్నికలు దగ్గరపడే కొద్దీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు జోరుగా సాగుతున్నాయి. సోమవారం రాజశేఖర్, జీవిత, హేమ, టీవీ యాంకర్ శ్యామల దంపతులు జగన్ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరంతా టీడీపీకి వ్యతిరేకంగా గళం విప్పడంతో పాటు, జగన్‌కు ఒక్కసారి ముఖ్యమంత్రి అవకాశం ఇవ్వాలని తమ అభిమానులకు, ప్రజలకు విజ్ఞప్తి చేయడంతో టీడీపీ ఆందోళన చెందుతుంది. టీడీపీ, జనసేనను కాదని.. మొదట్నుంచి సినీ నేపథ్యం ఎక్కువగా ఉన్న తెలుగుదేశాన్ని, టాలీవుడ్ హీరో పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేనను కాదని నటులు, దర్శకులు, నిర్మాతలు వైఎస్సార్సీపీలోకి రావడం గమనార్హం. కొద్దికాలం క్రితం వరకూ టాలీవుడ్‌పై టీడీపీ ప్రభావం ఎక్కువగా ఉండేది. కొందరు బాహాటంగానే చంద్రబాబుకు మద్దతు పలికారు. రాఘవేంద్రరావు, అశ్వనీదత్ వంటి సినీ పెద్దలైతే సినీ పరిశ్రమ మొత్తం మీ వెంట ఉంటుందని చంద్రబాబుకు హామీ ఇచ్చారు. దీనిపై పోసాని కృష్ణమురళీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డులు సినీ పరిశ్రమలో చిచ్చురేపాయి. చంద్రబాబు కేవలం తన వర్గానికి చెందిన వారికే అవార్డులిచ్చారనే విమర్శలు వెల్లువెత్తాయి. ఏపీలో ఆధార్ లేని వాళ్లు మాట్లాడుతున్నారంటూ అప్పట్లో సీఎం కుమారుడు లోకేష్ అనడంపై విమర్శలు వెల్లువెత్తాయి. చంద్రబాబుకు మద్దతు పలికే సినీ ప్రముఖులెవరూ ఆ సమయంలో నోరు మెదపలేదు. మరోవైపు చిన్న సినిమాల విడుదలకు టీడీపీ ఏమాత్రం సహకారం అందించలేదు. తన కుటుంబంలోని జూనియర్ ఎన్టీఆర్ సినిమాలకు థియేటర్లు దక్కకుండా చేసేందుకు లోకేశ్ ప్రయత్నాలు చేశారు. ఏపీలో సినీ పరిశ్రమకు మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇవన్నీ టీడీపీపై వ్యతిరేకత పెంచేందుకు కారణమయ్యాయి. సినీనటుల్ని కించపర్చేలా టీడీపీ వ్యాఖ్యలు ఎన్నికల సమయంలో టీడీపీ నాయకులు పరిశ్రమ మొత్తాన్ని కించపర్చేలా ఎదురుదాడికి దిగారు. కేసీఆర్ వారితో మాట్లాడిస్తున్నారని, హైదరాబాద్‌లో ఆస్తులు కాపాడుకునేందుకే విమర్శిస్తున్నారని రకరకాల ఆరోపణలు చేశారు. వీటిపై టాలీవుడ్ నటులు మండిపడుతున్నారు. -
స్త్రీలోక సంచారం
♦ తెలుగు చలన చిత్ర పరిశ్రమలోని లైంగిక వేధింపులపై విచారణ జరిపించేందుకు ఒక అత్యున్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనపై ఇంతవరకు జరిగిన ప్రయత్నాలేమిటో వివరిస్తూ వారం లోపు లిఖితపూర్వకంగా సమాధానం ఇవ్వాలని చీఫ్ జస్టిస్ టి.బి.రాధాకృష్ణన్, జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన హైదరాబాద్ హైకోర్టు డివిజన్ బెంచ్ తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. వేధింపుల విచారణ కమిటీని ఏర్పాటు చేసే విషయమై ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని, తెలుగు చలన చిత్ర పరిశ్రమ తమ ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకోవడం లేదని ఆరోపిస్తూ వి.సంధ్యారాణి, ఇతరులు కలిపి వేసిన రిట్ పిటిషన్ ను పరిశీలించిన అనంతరం కోర్టు ఈ విధమైన ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వంలోని నిష్క్రియాప్రియత్వం వల్ల.. పని చేసే చోట లైంగిక వేధింపుల నుంచి మహిళలకు రాజ్యాంగం కల్పించిన హక్కు.. ఉల్లంఘనకు గురి అవుతోందని పిటిషనర్లు ఆందోళ వ్యక్తం చేయగా.. కమిటీ ఏర్పాటుకు ప్రభుత్వం, లైంగిక వేధింపుల నిరోధానికి తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ తీసుకున్న చర్యలేమిటో తెలియపరచాలని ఆ రెండు పక్షాలను కోర్టు ఆదేశించింది. ♦ లాన్స్ నాయక్ రంజీత్ సింగ్ భుట్యాల్ భారత సైనికుడు. ఆయన భార్య షిము దేవి గృహిణి. జమ్మూకశ్మీర్ జిల్లాలోని రంబన్ గ్రామం వారిది. పదేళ్ల క్రితం ఇద్దరికీ పెళ్లయింది. పదేళ్లుగా పిల్లల కోసం ఎదురు చూస్తున్నారు. చివరికి వారి ఆశ ఫలించింది. షిము దేవి గర్భిణి అయింది. నవమాసాలు నిండాయి. ఏ క్షణమైనా పురుటినొప్పులు వచ్చేలా ఉన్నాయి. ఈలోపు రంబన్ గ్రామానికి వార్త అందింది. రాజౌరీ జిల్లా సుందర్బని వాస్తవాధీన రేఖ దగ్గర ఆదివారం నాడు పాకిస్థాన్ చొరబాటు దారులతో జరిగిన పోరులో శత్రు మూకల బులెట్లకు ప్రాణాలు కోల్పోయిన ముగ్గురు సైనికులలో లాన్స్ నాయక్ రంజీత్ కూడా ఒకరన్నది ఆ వార్త. మంగళవారం నాడు అంత్యక్రియల కోసం లాన్స్ నాయక్ భౌతిక కాయాన్ని రంబన్ గ్రామానికి తెచ్చారు. ఆ అమరవీరుడి చితికి నిప్పు పెట్టడానికి కొన్ని గంటల ముందు.. ఉదయం 5 గంటలకు షిము దేవి ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చింది. పుట్టిన బిడ్డను చూడకుండా అమరుడైన జవానుకు ఆ గ్రామం నివాళులు అర్పించింది. ఏక కాలంలో సంతోషాన్ని, విషాదాన్ని మోయలేక షిము దేవి సొమ్మసిల్లి పడిపోయింది. ♦ భారతదేశపు మూడవ అతిపెద్ద ఐటీ కంపెనీ హెచ్.సి.ఎల్. సారథ్యంలోని ‘హెచ్.సి.ఎల్. టెక్’ వైస్ చైర్మన్‌గా రోష్నీ నాడార్ నియమితులయ్యారు. హెచ్.సి.ఎల్. వ్యవస్థాపకులు శివ్ నాడార్ ఏకైక సంతానం అయిన రోష్నీ నాడార్ మల్హోత్రాను హెచ్.సి.ఎల్. టెక్ డైరెక్టర్ల బోర్డు వైస్ చైర్మన్‌గా నియమించింది. 8.2 బిలియన్ డాలర్ల హెచ్.సి.ఎల్. గ్రూపు కంపెనీలలో హెచ్.సి.ఎల్. టెక్ అత్యంత కీలకమైనది. గతంలో ‘స్కై న్యూస్ యు.కె.’ న్యూస్ ప్రొడ్యూజర్‌గా పని చేసిన రోష్నీ.. ముగ్గురు పిల్లల తల్లి. ప్రస్తుతం ఆమె హెచ్.సి.ఎల్. కార్పోరేషన్ (హెచ్.సి.ఎల్. టెక్, హెచ్.సి.ఎల్. ఇన్ఫోసిస్టమ్స్, హెచ్.సి.ఎల్. హెల్త్‌కేర్) సీఈవోగా, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. హెచ్.సి.ఎల్. టెక్కు నాన్–ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కూడా. వీటన్నిటితో పాటు ఆమె ఇక నుంచీ కొత్త బాధ్యతలను కూడా నిర్వహిస్తారు. హెచ్.సి.ఎల్. టెక్ ప్రెసిడెంటుగా, సీఈవోగా ప్రస్తుతం సి.విజయకుమార్ ఉన్నారు. -
చిరంజీవి @ 41
దాదాపు నెల రోజుల పాటు జార్జియాలో యుద్ధం చేయనున్నారు ‘సైరా’. చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రూపొందుతున్న సినిమా ‘సైరా’. చిరంజీవి తనయుడు హీరో రామ్‌చరణ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా తాజా షెడ్యూల్ కోసం యూనిట్ జార్జియా వెళ్లిన సంగతి తెలిసిందే. సోమవారం మొదలయ్యే ఈ షెడ్యూల్ వచ్చే నెల 25వరకు.. అంటే దాదాపు నెల రోజులు జరుగుతుందని సమాచారం. ఒకే సీక్వెన్స్‌కు చెందిన క్లైమాక్స్ వార్‌ను షూట్ చేస్తారు. ఈ షూట్లో చిరంజీవి, విజయ్ సేతుపతి, జగపతిబాబు, సుదీప్, ముఖేష్ రిషిలు పాల్గొంటారు. ఆల్రెడీ జగపతిబాబు, ముఖేష్ రిషి లొకేషన్లో ల్యాండ్ అయ్యారు. నయనతార కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో అమి తాబ్ బచ్చన్, తమన్నాలు కూడా కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే.. నటుడు చిరంజీవి తెలుగు చిత్ర పరిశ్రమలో 41ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నారు. అందుకుని ఆయన తనయుడు రామ్‌చరణ్ ‘‘సినిమా, నేను మిమ్మల్ని ఎప్పుడూ లవ్ చేస్తూనే ఉంటాం’’ అని స్పందించారు. -
అనుభవం ఉన్న హీరోలా...
‘‘తెలుగు ఫిలిం ఇండస్ట్రీ గర్వంగా చెప్పుకునే ఫైట్‌మాస్టర్ విజయ్. మూడేళ్ల ముందు ఆయన కొడుకు రాహుల్ జిమ్నాస్టిక్స్ వీడియో చూసి స్టన్ అయిపోయా. అటువంటి రాహుల్ సినిమాకు నేను సమర్పకుడిగా వ్యవహరించడం ఆనందంగా, గర్వంగా ఉంది. భవిష్యత్తులో తను మంచి హీరోగా ఎదుగుతాడు’’ అని రచయిత, నిర్మాత కోన వెంకట్ అన్నారు. సీనియర్ ఫైట్ మాస్టర్ విజయ్ తనయుడు రాహుల్ విజయ్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘ఈ మాయ పేరేమిటో’. కావ్యా థాపర్ కథానాయిక. రాము కొప్పుల దర్శకత్వంలో దివ్యా విజయ్ నిర్మించారు. ఫైట్ మాస్టర్ విజయ్ మాట్లాడుతూ– ‘‘మా సినిమా చూసిన సెన్సార్ సభ్యులు మంచి సినిమా చేశారని అభినందించడం ఆనందంగా ఉంది. ఈ నెల 24న సినిమాను విడుదల చేద్దామనుకున్నాం. కానీ, కొన్ని కారణాల వల్ల విడుదల చేయడం లేదు. త్వరలోనే రిలీజ్ తేదీని ప్రకటిస్తాం’’ అన్నారు. ‘‘మా సినిమా ప్రివ్యూ చూస్తున్నప్పుడు కోనగారు ఏమంటారోనని చాలా టెన్షన్ పడ్డా. మూడు నాలుగు సినిమాలు చేసిన అనుభవం ఉన్న హీరోలా చేశావని అనగానే హ్యాపీగా అనిపించింది’’ అన్నారు రాహుల్ విజయ్. నిర్మాత దివ్యా విజయ్, హీరోయిన్ కావ్యా థాపర్ పాల్గొన్నారు. -
వివాదాల నేపథ్యంలో టాలీవుడ్ కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్ : సినిమా పరిశ్రమలోని గత కొంత కాలంగా చెలరేగుతున్న వివాదాలకు చెక్ పెట్టాలని సినీ ప్రముఖులు నిర్ణయించారు. పలు టీవీ ఛానెల్‌లలో టాలీవుడ్ తరపున అంటూ చాలా మంది డిబేట్లకు వెళ్తున్న నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా పరిశ్రమ కొంత మందిని టాలీవుడ్ అధికారిక ప్రతినిధులుగా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఏ విభాగం గురించైనా ఒక అంశంపై అధికారికంగా మాట్లాడవలసి వచ్చినప్పుడు ఈ ప్రతినిధులు టాలీవుడ్ పక్షాన అధికారిక ప్రతినిధులుగా మాట్లాడుతారని తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు పి కిరణ్ ఓ ప్రకటనలో తెలిపారు. సభ్యులు 1. పి. కిరణ్ , అధ్యక్షులు , తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ 2. ముత్యాల రాందాస్, గౌరవ కార్యదర్శి, తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ 3. కె. మురళీ మోహన్ అధ్యక్షులు, తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ 4. సునీల్ నారంగ్, గౌరవ కార్యదర్శి, తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ 5. డా.కె.ఎల్. నారాయణ, అధ్యక్షులు తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ 6. కొమర వెంకటేష్, అధ్యక్షులు , తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ 7. ఆర్. వెంకటేశ్వరరావు, జనరల్ కార్యదర్శి, తెలుగు ఫిలిం ఇండస్ర్టీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ 8. ఎన్. శంకర్, అధ్యక్షులు, తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ 9. డా. నరేష్ వి.కె, జనరల్ కార్యదర్శి, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ 10. తమ్మారెడ్డి భరద్వాజ 11. వి. వెంకటరమాణారెడ్డి (దిల్ రాజు) 12. బీవీ నందినీ రెడ్డి 13. ఝాన్సీ లక్ష్మి యలవర్తి -
టాలీవుడ్లో మరో వివాదం
సాక్షి, హైదరాబాద్: ‘క్యాస్టింగ్ కౌచ్’ వివాదం చల్లారకముందే తెలుగు సినిమా పరిశ్రమలో మరో గొడవ రేగింది. సినీ, టీవీ అవుట్డోర్ లైట్‌మెన్ యూనియన్ సభ్యులు ఆందోళనతో సినిమా షూటింగ్‌లకు అంతరాయం ఏర్పడే పరిస్థితి తలెత్తింది. నిర్మాత డీవీవీ దానయ్య ఇతర రాష్ట్రాల నుంచి లైట్‌మెన్లను తీసుకురావడంతో వివాదం మొదలైంది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిని లైట్‌మెన్ యూనియన్ నాయకులు గురువారం అడ్డుకున్నారు. వీరిపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో బాధితులు ఫిర్యాదు చేశారు. మరోవైపు కనీస వేతనాలు ఇవ్వకుండా ఎక్కువసేపు పని చేయించుకుంటున్నారని, ఇతర రాష్ట్రాల వారిని రప్పించుకుంటున్నారని ఆరోపిస్తూ లైట్‌మెన్ యూనియన్ సభ్యులు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ దగ్గర ఆందోళనకు దిగారు. మూడేళ్లకు ఒకసారి కనీస వేతనాలు పెంచాలన్న నిబంధనను పట్టించుకోకుండా తమకు అన్యాయం చేస్తున్నారని కార్మికులు ఆరోపించారు. తమ డిమాండ్ల సాధనకు షూటింగ్‌లను బహిష్కరించామని, తమకు సహకరించాలని అందరికీ విజ్ఞప్తి చేశారు. కనీస వేతనంపై రేపటిలోగా ప్రకటన చేయకుంటే నిరవధిక ఆందోళన దిగుతామని వారు హెచ్చరించారు. సినిమా పరిశ్రమ పెద్దలు జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని కోరారు. మరోవైపు సినీ, టీవీ అవుట్డోర్ లైట్‌మెన్ యూనియన్ సభ్యులు ఫిల్మ్ ఛాంబర్‌కు భారీగా తరలివస్తున్నారు. -
సుప్రియ కన్వీనర్ గా టాలీవుడ్ జేఏసీ
సాక్షి, హైదరాబాద్ : టాలీవుడ్లో జరుగుతున్న తాజా పరిణామాల నేపథ్యంలో కాస్టింగ్ కౌచ్, టాలీవుడ్ సమస్యలపై సినీ ప్రముఖులతో ఓ కమిటీని ఏర్పాటు అయింది. 21మంది సభ్యులతో ఏర్పాటు అయిన ఈ జాయింట్ యాక్షన్ కమిటీకి యార్లగడ్డ సుప్రియ కన్వీనర్‌గా నియమితులయ్యారు. ఈ కమిటీలో 24 విభాగాల అధ్యక్ష, కార్యదర్శులు సభ్యులుగా ఉంటారు. అలాగే దర్శకురాలు నందినీరెడ్డి, స్వప్నాదత్ సభ్యులుగా వ్యవహరిస్తారు. ఇకనుండి ఇండస్ట్రీకి సంబంధించిన ఏ నిర్ణయమైన ఈ కమిటీదే తుది నిర్ణయం. ప్రస్తుతం సుప్రియ అన్నపూర్ణ స్టూడియోస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టరుగా వున్నారు. క్యాష్ కమిటీ ఏర్పాటు ప్రక్రియ కూడా జరుగుతోందని, త్వరలో నివేదిక వెల్లడించనున్నట్లు తెలుస్తోంది. ఈ కమిటీలో 21 మంది సభ్యులు ఉంటారని, వారిలో సగం మంది బయటవాళ్లు (ప్రజా సంఘాలు,లాయర్లు) ఉంటారని సమాచారం. కాగా ఇండస్ట్రీలో జరుగుతున్న పరిణామాలపై దాదాపు రెండు గంటల పాటు వివిధ అంశాలపై సినీ ప్రముఖులు చర్చించినట్టుగా తెలుస్తోంది. శనివారం అన్నపూర్ణ స్టూడియోలో జరిగిన ఈ సమావేశంలో సినీరంగానికి చెందిన నిర్మాతలు, నటులు, దర్శకులతో పాటు 24 శాఖలకు చెందిన 80 మందికి పైగా సభ్యులు పాల్గొన్నారు. కాగా తెలుగు సినిమా పరిశ్రమలో ‘కాస్టింగ్ కౌచ్’కు వ్యతిరేకంగా గళమెత్తిన శ్రీరెడ్డిపై పలువురు సినిమా ప్రముఖులు మండిపడగా, జూనియర్ ఆర్టిస్టులు, మహిళా సంఘాల నాయకులు ఆమెకు బాసటగా నిలిచిన విషయం తెలిసిందే. అనంతరం ఈ అంశం కాస్త పవన్ కల్యాణ్ వ్యక్తిగత వివాదంగా మారి రోజుకో మలుపు తిరుగుతోంది. -
ఎందుకు పట్టించుకోవడం లేదు : పవన్
తెలుగు చిత్ర పరిశ్రమ పలుచన చేస్తూ.. నటీమణుల గౌరవానికి భంగం కలిగిస్తూ చిత్రసీమలో కుటుంబాలను అభాసు పాలు చేసేలా మీడియాలో కథనాలు వస్తుంటే చట్టపరంగా ఏమి చేస్తున్నారని ‘మా’ ని పవన్ కల్యాన్ ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్న మీడియా ద్వారా ప్రసారం చేయిస్తున్న కథనాలు, కుట్రపూరిత ధోరణిని శుక్రవారం తెల్లవారుజూము నుంచి పవన్ వరుస ట్వీట్లతో ఎండగడుతున్నారు. ‘అసలు రాష్ట్రానికి మేలు జరగాలని ఆశించకుండా మీ తెలుగుదేశం ప్రభుత్వం రావడానికి కృషి చేశాం. కానీ మీరు, మీ అబ్బాయి, అతని స్నేహితులు చేయూతనిచ్చిన చేతులను వెనుక నుంచి మీడియా శక్తుల ద్వారా విరిచేస్తుంటారు. మిమ్మల్ని ఎలా నమ్మడం?’ అని సూటిగా చంద్రబాబుని ప్రశ్నించారు. పవన్‌పై చేయించిన అనుచిత వ్యాఖ్యల వెనుక ఉన్న కుట్రపై ఆయన తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ‘నాపై ఆరోపణలు చేస్తున్న వారికి, చేయిస్తున్న వారికి అమ్మలు, అక్కలు, కోడళ్లు ఉన్నారు. కానీ వారి ఇంట్లో మహిళలే సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నారు. టీఆర్పీలు, రాజకీయ లాభాల కోసం వయసైపోతున్న నా 70 ఏళ్ల తల్లిని దూషిస్తున్నారు. మీరంతా టీఆర్పీల కోసం టీవీ షోలు నిర్వహిస్తున్నారు కదా? మంచిది. వీటన్నింటికంటే మించిన షోను మీకు చూపిస్తాను. నేను నటుడి కంటే ముందు, రాజకీయ నేత కంటే ముందు ఓ అమ్మకు బిడ్డను. ఓ కొడుకుగా నా తల్లి గౌరవాన్ని కాపాడలేకపోతే బతకడం కంటే చావడం మంచిది’ అంటూ చేసిన ట్వీట్ పవన్ మనోవేదనను తెలిజేస్తోంది. మీరంతా కలిసి సమాజంపై ఇన్ని అత్యాచారాలు చేస్తున్నా మీకు అండగా నిలబడ్డ మీ తల్లిదండ్రలకి, అక్కాచెల్లెళ్లకి, మీ కూతుళ్లకి, కోడళ్లకి, మీ ఇంటిల్లపాదికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఆత్మగౌరవంతో బతికేవాడు.. ఏ క్షణమైనా చనిపోవటానికి సిద్ధపడితే.. అసలు దేనికన్నా భయపడతాడా? వెనకడుగు వేస్తాడా.? అఅని ప్రశ్నించారు. ఫిల్మ్ ఛాంబర్లో పవన్ ఏమన్నారంటే.. ఈ రోజు ఉదయం 10 గంటలకు పవన్ కల్యాణ్ తెలుగు ఫిల్మ్ ఛాంబర్‌కు చేరుకున్నారు. తెలుగు సినిమా రంగాన్ని కించపరుస్తూ కొన్ని టీవీ ఛానళ్లు వ్యవహరిస్తున్న తీరు. వాటిపై పరిశ్రమ పరంగా ఏమీ చేస్తున్నారో ప్రశ్నించేందుకు ఆయన వెళ్లారు. పవన్ కల్యాణ్ ఛాంబర్‌కు చేరుకున్న విషయం తెలియడంతో మా, నిర్మాతల మండలి, ఫిల్మ్ ఛాంబఱ్, ఫెడరేషన్లతోపాటు వివిధ యూనియన్ల నాయకులు అక్కడికి హుటాహుటాన వచ్చారు. ఏ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ సినిమా నటీమణుల్ని, ఈ రంగంలో పనిచేస్తున్న మహిళల్ని కించపరిచేలా మాట్లాడుతుంటే ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. ఒక ఛానల్లో ‘సినిమా రంగంలో ల.. లేరా’ అని అవమానకరంగా మట్లాడితే ఏమి చేశారు? కాస్టింగ్ కౌచ్ పేరుతో మొత్తం తెలుగు చిత్రసీమను పలుచన చేసేలా వార్తలు, కథనాలు వస్తుంటే ఎందుకు అభ్యంతరం చెప్పడం లేదు. చట్టపరంగా పోరాడటానికి 24 క్రాఫ్ట్స్ ఒకే తాటిపైకి రావాలి. మహిళల ఆత్మాభిమానాన్ని కాపాడాలి. ఇందుకు అన్ని విభాగాలు కలిసి నిర్ణయం తీసుకోవాలి. తక్షణం దీనిపై ముందుకు కదలాలి’ అని అన్నారు. ఈ సందర్భంగా పలువురు నటీమణులు, డాన్సర్స్, జూనియర్ ఆర్టిస్ట్స్ ఈ తరహా కథనాల మూలంగా ఎరుర్కొంటున్న అవమానాల్ని, ఇబ్బందుల్ని తెలియచేశారు. నేడు చిత్ర పరిశ్రమ సమావేశం పవన్ కల్యాణ్‌తో ‘మా’ నాయకులు శివాజీ రాజా, హేమ, అనితా చౌదరి, ఏడిద శ్రీ రామ్, యువ కధానాయకులు రామ్ చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, అల్లు శిరీష్, కృష్ణుడు, దర్శకుల సంఘం తరఫున ఎన్ శంకర్, వినాయక్, మెహెర్ రమేష్, శ్రీకాంత్ అడ్డాల, వీర శంకర్, మారుతి, నిర్మాతల మండలి నుంచి సుధాకర్ రెడ్డి, దామోదర ప్రసాద్, అల్లు అరవింద్, సుప్రియ, కేఎస్ రామారావు, ఎన్వీ ప్రసాద్, నాగ అశోక్ కుమార్, ఎస్ రాధాకృష్ణ, సూర్యదేవర నాగవంశీ, పీడీ ప్రసాద్, ముత్యాల రాందాస్, కుమార్ చౌదరి, రచయితలు పరుచూరి బ్రదర్స్, విశ్వ, ఫెడరేషన్ నుంచి కోమర వెంకటేష్ తదితరులు వచ్చారు. ప్రస్తుత పరిణామాలపై పవన్ వ్యక్తం చేసిన నిరసనలపై శనివారం విస్తృత సమావేశం నిర్వహించాలని తెలుగు చిత్ర పరిశ్రమ నిర్ణయం తీసుకుంది. ఆ సమావేశంలో తీసుకునే నిర్ణయాలకు అనుగుణంగా కార్యచరణ ప్రకటిస్తారు. -
టాలీవుడ్ పెద్దలు వివరణ ఇవ్వాలి
సాక్షి, హైదరాబాద్ : ప్రత్యేక హోదా ఉద్యమానికి తెలుగు సినీ పరిశ్రమ మొత్తం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు మద్దతు తెలిపినట్లు వచ్చిన వార్తలపై టాలీవుడ్ పెద్దలు వివరణ ఇవ్వాలని వైఎస్సార్ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్, సినీనటుడు విజయచందర్ డిమాండ్ చేశారు. ఇటీవల సినీరంగ ప్రముఖులు సి.అశ్వనీదత్, కె.రాఘవేంద్రరావు, కేఎల్ నారాయణ, జెమినీ కిరణ్, వెంకటేశ్వరరావు తదితరులు అమరావతిలో చంద్రబాబును కలసి ప్రత్యేక హోదా విషయంలో సినీ పరిశ్రమ సంపూర్ణ మద్దతు ఉంటుందని సీఎంకు తెలిపినట్లుగా వార్తలొచ్చాయన్నారు. ఈ నేపథ్యంలో విజయచందర్ సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. నిర్మాతల సమావేశంలో తాను ఇదే విషయాన్ని కేఎల్ నారాయణ దృష్టికి తెచ్చి అందరి తరఫున ఎలా హామీ ఇస్తారని ప్రశ్నించానన్నారు. తాను వ్యక్తిగతంగా బాబుకు మద్దతు తెలిపానే తప్ప మొత్తం పరిశ్రమ తరఫున కాదన్నారన్నారు. మిగతా నలుగురు తమ వివరణలు ఇచ్చి తీరాలన్నారు. -
‘హీరో’యిన్
భూమి సూర్యుని చుట్టూ తిరగడం ఎంత కామనో.. తెలుగు సినిమా హీరోల చుట్టూ తిరగడం అంతే కామన్. కానీ ఈ ఫార్ములాను బ్రేక్ చేసిన తారలు కూడా మన ఇండస్ట్రీలో చాలా మందే ఉన్నారు. హీరోల చుట్టూ పరిగెడుతున్న కథా కథనాలు ఒక్క సినిమాతో తమవైపుకు తిప్పుకొని చూపించారు కొంత మంది తారలు. అలాంటి మహిళామణులు మనకు ప్రతి జనరేషన్‌లోనూ కనిపిస్తారు. ఎప్పుడూ కథానాయకుల చుట్టూ తిరిగే తెలుగు సినిమా కథ అప్పుడప్పుడు హీరోయిన్ల వైపు కూడా తిరుగుతుంది. కమర్షియల్ సినిమాలో హీరోయిన్ అంటే నాలుగు పాటలు, మరో నాలుగు సీన్స్‌కు మాత్రమే అంటూ అంటూ ఫిక్స్ అయిపోయిన రైటర్లు హీరోయిన్‌కి హీరో రేంజ్ కాన్వాసు ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. కేవలం హీరోతో ఆడి పాడే హీరోయిన్లు తామే లీడ్ రోల్స్‌గా మారి కథ నడిపిస్తే.. ఆ ఆలోచనతో సినిమాలు తెరకెక్కించిన దర్శక నిర్మాతలు కూడా ఉన్నారు. హీరోయిన్లకు హీరోయిజం చూపించే ట్రెండ్ కొత్తగా వచ్చిందేం కాదు.. సినిమా పుట్టిన దగ్గరనుంచి ఈ ట్రెండ్ ఉంది. భానుమతి, అంజలీ దేవిల నుంచి సూర్యకాంతం లాంటి నటీమణుల వరకు ఎందరో.. ఎన్నో అద్భుత చిత్రాల్లో లీడ్ రోల్స్ లో నటించారు. ఆయా సినిమాల సక్సెస్‌లో కీలక పాత్ర పోషించారు. హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు చేసిన ఆర్టిస్ట్ లలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన నటి భానుమతి. మల్టీ టాలెంటెడ్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న ఈ మహానటి ఎన్నో అద్భుత చిత్రాల్లో అంతా తానే అయి సినిమాలను విజయతీరాలకు చేర్చారు. భానుమతి తరువాత అదే స్థాయి గుర్తింపు తెచ్చుకున్న మరోనటి సూర్యకాంతం. హీరోయిన్ క్యారెక్టర్ చేయకపోయిన సినిమా అంతా తన చూట్టూ నడిచే ఎన్నో సినిమాలతో లేడీ క్యారెక్టర్‌కు హీరోయిజాన్ని ఆపాదించింది. అలాంటి ఓ సూపర్ హిట్ చిత్రమే గుండమ్మ కథ. కలర్ సినిమాలు వెండితెర మీదకు వస్తున్న రోజుల్లో కూడా ఎంతో మంది హీరోయిన్లు లేడిఓరియంటెడ్ సినిమాలతో వెండితెరకు కొత్త అందాలను తీసుకువచ్చారు. అందం అభినయంతో పాటు కాస్త డైనమిజాన్ని కూడా చూపించారు. అందాల తారలుగా పేరు తెచ్చుకున్న జయప్రద, శారద, భానుప్రియ, జయసుధ లాంటి వారు కూడా లేడీ ఓరియంటెండ్ సినిమాలతో మెప్పించారు. సౌత్ నార్త్ అన్న తేడా లేకుండా తన అందంతో భారతీయ సినీ ప్రేక్షకులను ఫిదా చేసిన శ్రీదేవి కూడా అప్పుడప్పుడు గ్లామర్ ఇమేజ్ను పక్కన పెట్టి ఛాలెంజింగ్ రోల్స్‌తో సత్తా చాటింది. కెరీర్ తొలినాళ్లలోనే పదహరేళ్ల వయసు, వసంత కోకిల లాంటి విభిన్న చిత్రాలతో అలరించారు. హీరోయిన్ అంటే హీరోకు ఏ మాత్రం తక్కువ కాదు అని నిరూపించిన మరో నటి విజయశాంతి. చాలా కాలం గ్లామర్ పాత్రలకే పరిమితమైన విజయశాంతి, తరువాత లేడీ ఓరియంటెండ్ సినిమాలపై దృష్టి పెట్టారు. ప్రతిఘటన, భారతనారి, కర్తవ్యం, రేపటి పౌరులు, ఒసెయ్ రాములమ్మ లాంటి సినిమాలు ఘనవిజయం సాధించటంతో సౌత్ ఇండియా లేడీ సూపర్ స్టార్‌గా ఎదిగారు. ఈ జనరేషన్ లోనూ లేడి ఓరియంటెడ్ సినిమాలు చేసిన నటీమణులకు కొదవేం లేదు. అనుష్క, నయనతార లాంటి తారలు యాక్షన్, థ్రిల్లర్ తరహా సినిమాలతో లేడీ ఓరియంటెండ్ సినిమాల హవాను ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. దర్శక నిర్మాతలు కూడా అప్పుడప్పుడు మహిళలకు పెద్ద పీట వేస్తూ సినిమాలు రూపొందించేందుకు తమ వంతు కృషి చేస్తున్నారు. -
అవకాశమే మహాప్రసాదం!
కళాతపస్వికి జీవితమే ఓ తపస్సు! క్రమశిక్షణ, కార్యదీక్ష ఉచ్ఛ్వాసనిశ్వాసలు! మనకు పూజంటే ధూప దీప నైవేద్యాలే కాని, ఆయనకు కళారాధనే ప్రార్థన. విశాలమైన ఆవరణ, ఏపుగా ఎదిగిన పచ్చని చెట్లు, కొమ్మల చివరన విరిసిన రంగుల పువ్వులు.. ఆ ఆహ్లాద ఆవరణలో కూర్చోవడానికి అనువుగా అరుగులు, వాటికి అందంగా తీర్చిదిద్దిన రంగవల్లికలు.. కళకళలాడుతున్న ఆ లోగిలిని చూస్తూ మెట్లు ఎక్కి పై అంతస్తుకు చేరుకున్నాక ఊయలలో కూర్చొని అభిమానులతో మాట్లాడుతూ కనిపించారు కళాతపస్వి కె.విశ్వనాద్. హైదరాబాద్ ఫిల్మ్‌నగర్‌లోని వారి నివాసంలో కలిసి దైవం గురించి అడిగితే ‘నా జీవితమే దైవ కృప’ అంటూ వివరించారు. 88 ఏళ్ల మీ జీవితం దైవాన్ని ఏ విధంగా చూసింది? తల్లి గర్భంలో బీజంగా చేరి బిడ్డ ఊపిరి పోసుకుంటుంది. ఆ బిడ్డకు రెండు చేతులు ఉండాలి, ఆ చేతులకు పది వేళ్లు ఉండాలనే నిర్ణయం ఎక్కడ జరిగింది. ఈ అవయం ఇక్కడే ఉండాలనే ఏర్పాటు ఎలా జరిగింది. ఆ పువ్వులను చూడండి. వాటికి ఆ రంగే ఉండాలని ఎవరు నిర్దేశించారు. ఈ పండులో ఈ రుచే ఉండాలని ఎవరు చెప్పారు. మనం పీల్చే గాలిలోనూ, చూసే కళలోనూ అంతటా ఆ దైవ శక్తి ఇమిడి ఉంది, నా బంధుమిత్రుల్లో కొందరు నాస్తికులు ఉన్నారు. కానీ, వారిలోనూ దైవత్వం కనిపించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. నాతో పనిచేసిన ప్రతివారిలో మంచిని చూశాను. లైట్ బాయ్ కావచ్చు, నాయకుడే కావచ్చు. స్థాయి బేధాలు లేవు. మంచి చిత్రాన్ని ఇవ్వాలి, మంచి నటన ఇవ్వాలి అనే నా తపనకు ఎందరో చేయూతనిచ్చారు. వారిందరిలో దైవత్వం ఉందని భావించాను. చూసే మనసును బట్టి దైవం కనిపిస్తుంది. మనం ఓ శక్తిని నమ్ముకుంటే అనుక్షణం ఆ శక్తి మనతోనే ఉంటుంది. అది ఏ రూపంగానయినా కావచ్చు. మీ పేరులోనే శివుడున్నాడు. ఈ పేరు వెనుక సంఘటన ఏమైనా ఉందా? నేను మా అమ్మ గర్భంలో ఉండగా మా తాతగారు కాశీలో ఉన్నారట. అప్పుడు ఆయనకు ఈ శుభవార్త తెలిసి ఆ పరమశివుడికి నమస్కరించుకున్నారట. స్వామీ, నీ సన్నిధిలో ఉండగా ఈ వార్త తెలిసింది. పుట్టబోయే వారికి నీ పేరే పెట్టుకుంటాను అనుకున్నారట. ఆ విధంగా నాకు విశ్వనాథ్ అని పెట్టారు. మా ఇంటి పేరుతో కలిసి కాశీనాథుని విశ్వనాథుడు నా పేరులో కలిసిపోయాడు. కళారంగానికి రావాలనుకున్నది మీ అభీష్టమా? దేవుడి నిర్ణయమేనంటారా? ముమ్మాటికి దైవనిర్ణయమే! యాదృశ్చికంగా ఈ రంగంలోకి వచ్చాను. ముందు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ని కావాలనుకున్నాను. ఫైళ్ల మీద సంతకాలు చేస్తూ ఒక ఆఫీసర్ హోదాలో ఉండాలనుకునేవాణ్ణి. కానీ, ఇలా వచ్చాను. అయితే, ఈ రంగంలోకి వచ్చినందుకు ఎక్కడా విచారం లేదు. ఇందులో ఒకటీ రెండు కాదు దైవం ఎన్నో అవకాశాలను ఇచ్చింది. ఇచ్చిన ప్రతీ అవకాశాన్ని శ్రద్ధగా వాడుకున్నాను. ఆ పనితో మమేకం అయ్యాను. అదే నన్ను ఇలా మీ అందరి ముందు నిలిపింది, మీ సినిమాలో దైవానికి సంబంధించిన సన్నివేశాలు తీస్తున్నప్పుడు ఏవైనా ఊహించని ఘటనలు జరిగిన సందర్భాలు ఉన్నాయా? సినిమాలో పలానా సన్నివేశం, ఫలానా నటుడి నటన అద్భుతమని ప్రేక్షకుడికి అనిపించాలి. అలా దర్శకుడిగా, నటుడిగా నా పనికి నేను న్యాయం చేయాలి. ఊహించని సన్నివేశాలతో అద్భుతం అనిపించాలి. అలా శ్రద్ధగా చేశానే తప్ప ఇదో మిరాకిల్ అన్నవి లేవు. ఈ ఫొటో చూడండి (ఆఫీసు గదిలోని తన ఫొటో చూపిస్తూ) బెంగుళూరులోని ఓ కళాకారుడు అద్భుతంగా చిత్రించి, ఫ్రేమ్ కట్టించి ఇచ్చాడు. ఇదిగో ఈ కళారూపం మా అమ్మనాన్నలది. ఓ చెక్కమీద అందంగా చెక్కి కళాకారుడు బహుకరించాడు. కళాకారుyì గా మా పనులకు జీవం పోయడానికే తపన పడుతుంటామే తప్ప అందులో అద్భుతాలను ఆశించం. కష్టాన్ని అధిగమించడానికి దైవాన్ని ఆసరా చేసుకున్న సందర్భాలు.. ఈ జీవితంలో దక్కాలనుకున్నది దక్కుతుందని ఓ నమ్మకం. కర్మ సిద్ధాంతాన్ని నమ్ముకున్నవారికి ఏడుపు ఉండదు. కష్టం అనిపించదు. కష్టం వచ్చినప్పుడు నేనేం పాపం చేశాను అని దేవుణ్ణి నిందించడం సరికాదు. అలాగే కాలం కలిసొచ్చినప్పుడు అంతా తమ ప్రతిభ అనుకోవడం సరికాదు. అలాంటి రెండు సందర్భాలు నాకు లేవు. కష్టానికి కుంగిపోయి, సుఖాలకు పొంగిపోయిన సంఘటనలు అస్సలు గుర్తులేవు. దైవం గురించి బాల్యంలో అమ్మనాన్నలు పరిచయం చేసినదానికి, ఇప్పుడు అర్ధం చేసుకున్నదానికి చాలా తేడా ఉంటుంది... మీరన్నట్టు అనుభూతి అనేది ఒక్కొక్క వయసులో ఒక్కో విధంగా ఉంటుంది. అప్పుడు దేవుడు ఏదో చేశాడు అనుకుంటాం. దేవుడంటే భయంగా ఉంటాం. పెద్దవుతున్న కొద్దీ మన ఆలోచనల్లో మార్పులు చోటు చేసుకుంటాయి. అవగాహన విస్తృతమవుతుంది. మనుషుల రూపంలోనే దేవుడు వస్తాడు సాయం చేయడానికి అని చాలా సందర్భాలలో తెలుస్తుంది. అయితే, దేవుడు దేవుడే! చిన్నప్పుడు నే చూసిన బాలాజీ అలాగే ఉన్నాడు. ఇప్పుడూ అలాగే ఉన్నాడు. అవే పూజలు, అభిషేకాలు. ఎప్పటికీ ఆయన అలాగే కనిపిస్తాడు. తరచూ దేవాలయ సందర్శన చేస్తుంటారా? ఏ దేవాలయం మీకు అమితంగా నచ్చుతుంది? అష్టోత్తర నామాలలో ఏ నామం నచ్చుతుందంటే ఏమని చెబుతాం. ఆలయాలు కూడా అంతే! అయితే, ఫలానా చోటుకి వెళుతూ ఈ దరిద్రం ఏంటి అనుకుంటే స్వర్గమైనా నరకంలాగే ఉంటుంది. అంతా భగవతేశ్చ అనుకుంటూ స్మశానికి వెళ్ళినా ఆ అనుభూతి అలాగే ఉంటుంది. ఒక్క శివుడు అనేకాదు అన్ని దేవతలను ఆరాధిస్తాను. అన్ని దేవాలయాలను సందర్శిస్తాను. అంతేకాదు చర్చి, మసీదులకు వెళ్లిన సందర్భాలూ ఉన్నాయి. ఏ మతమైనా దేవుళ్లంతా ఒక్కటే. మీ మనవళ్లకి, మనవరాళ్లకి దైవారాధనను ఎలా పరిచయం చేస్తుంటారు? మనం చెప్పింది వాళ్లు వినరు. మనం ఆచరించింది వాళ్లు చేస్తారు. మా అమ్మనాన్నలు విధిగా చేసిన కార్యక్రమాలను నేను ఆచరణలోకి తెచ్చుకున్నాను. ఆ ఆచరణ ఎలా ఉంటుందంటే వారి ఆశీర్వచనాలు ఇప్పటికీ నాతోనే ఉంటాయనే భావన కలిగిస్తుంది. మనసును దృఢం చేస్తుంది. అందుకే మన పెద్దలు పూజలను ఒక ఆచారంగా మనకు అందించారు. మనం భవిష్యత్తు తరాలకు అందించాలి. మీ దినచర్యలో ప్రార్థనాసమయం? అమ్మనాన్నలు నేర్పించిన లక్షణాలలో పూజ ఒకటి. సంధ్యావందనం చేయనిదే ఎలాంటి పదార్థమూ తీసుకోను. పూజామందిరంలో దీపం వెలిగిస్తాం. అంతకు మించి పూజలు ఉండవు. మా ఇంటికి దగ్గరలో శివాలయంలో అభిషేకాలకు వెళుతుంటాను. సంగీతం, నృత్యం దైవారాధనకు దగ్గరి దారి అంటారు. మీ సినిమాలో సంగీతం, నృత్యం ప్రధానాంశంగా ఉంటాయి. ఈ కళను ఎలా వంటపట్టించుకున్నారు? ప్రేమ, స్నేహం దగ్గర కావాలనుకున్నప్పుడు మనలో వారి కోసం ఓ తపన ఉంటుంది. ఆ అవసరం, తపన మనల్ని ప్రయత్నించేలా చేస్తుంది. అదృష్టం అంటే ఎక్కణ్ణుంచో రాదు. దేవుడు నీకు అవకాశాలు కల్పిస్తుంటాడు. వాటిని సద్వినియోగం చేసుకుంటూ ఉంటే అదే అదృష్టంగా నిన్ను వరిస్తుంది. మన ఎంచుకున్న వృత్తికి మనం నూటికి నూరు శాతం న్యాయం చేయాలి. అలా అనుకుంటే మనకేం అవసరమో అవే వంటపడతాయి. – నిర్మలారెడ్డి చిల్కమర్రి -
వరంగల్ వైపు..చిత్ర పరిశ్రమ చూపు..
రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత రెండో అతిపెద్ద నగరమైన ఓరుగల్లు అన్ని రంగాల్లో శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. సీఎం కేసీఆర్ కూడా వరంగల్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇందుకోసం ప్రతి బడ్జెట్లో నగర అభివృద్ధికి రూ.300 కోట్లు కేటాయిస్తున్నారు. అయితే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సినిమా ఇండస్ట్రీ దృష్టి కూడా వరంగల్ వైపు మళ్లింది. దాదాపు ఇక్కడ18 సినిమాల షూటింగ్‌లు, ప్రమోషన్ వర్క్, విజయోత్సవాలను ఇక్కడ నిర్వహించారు. ఒకప్పుడు వరంగల్‌లో సినిమా కార్యక్రమాలు చేయాలంటే సినీ ప్రముఖులు వెనుకడుగు వేసేవారు. ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదు. రోజు రోజుకు సినిమా ప్రమోషన్లు పెరిగిపోతున్నాయి. విడుదలకు ముందు సినిమా గురించి ప్రజలకు తెలిపేందుకు హైదరాబాద్, ఆంధ్ర ప్రాంతంలో మాత్రమే గతంలో ప్రమోషన్ వర్క్ నిర్వహించే వారు. ఇప్పుడు వరంగల్‌లో సైతం జరుగుతున్నాయి. వరంగల్ విద్యాసంస్థలకు నిలయంగా మారడంతో విద్యార్థులు, యువత తాకిడి ఎక్కువగా ఉంటోంది. నిట్, కేఎంసీ, ఇంజనీరింగ్ కళాశాలు ఎక్కువగా ఉండడంతో అన్ని ప్రాంతాల కల్చర్ వరంగల్‌కు వచ్చేసింది. గరుడవేగ సినిమా విజయోత్సవం సందర్భంగా వరంగల్‌లోని దేవి థియేటర్‌కు హీరో రాజశేఖర్ టీం వచ్చింది. హీరో నాని నటించిన ఎంసీఏ సినిమా సగం షూటింగ్ వరంగల్, రామప్ప, లక్నవరం, ఖిలా వరంగల్, నిర్వహించారు. బొల్లికుంటలోని వాగ్దేవి ఇంజనీరింగ్ కళాశాలలో లండన్ బాబులు సినిమాలోని ఒక సాంగ్‌ను విడుదల చేశారు. రాజుగారి గది టీం హన్మకొండలోని అమృత థియేటర్‌కు వచ్చింది. రుద్రమదేవి సినిమాలోని మూడు పాటలను ఖిలా వరంగల్‌లోని శిల్పాల మధ్య విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి హీరో అల్లు అర్జున్, హీరోయిన్ అనుష్క, దర్శకుడు గుణశేఖర్ వచ్చారు. పిల్ల నువ్వులేని జీవితం సినిమా హీరో సాయి ధరమ్ తేజ్, హీరోయిన్ రేజీనా వరంగల్‌లోని రాధిక, హన్మకొండలోని ఎషియన్ శ్రీదేవి మాల్‌కు వచ్చారు. గాలిపటం సినిమా విజయోత్సవం సందర్భంగా వరంగల్‌లోని రామ్‌లక్ష్మణ్ థియేటర్‌కు ప్రొడ్యూసర్ సంపత్ నంది, మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలి యో, హీరో, హీరోహీరోయిన్ వచ్చి ప్రేక్షకులతో సందడి చేశారు. హీరోయిన్లు రేజీనా, సుఖన్య, హీరో రాహుల్ రవీంద్రన్ ములుగు రోడ్డులోని టాటా గోల్డ్ ప్లస్‌కు యాడ్ చిత్రీకరణ కోసం వచ్చారు. రేపు ఎంసీఏ ప్రీ ఆడియో రిలీజ్ ఫంక్షన్ వెంకటేశ్వర క్రియేషన్స్ ఆధ్వర్యంలో వరంగల్‌లో చిత్రీకరించిన ఎంసీఏ సినిమా ప్రీ ఆడియో రిలీజ్ ఫంక్షన్‌ను హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల గ్రౌండ్లో శనివారం నిర్వహించనున్నారు. ఇక్కడికి డైరెక్టర్, హీరో లు, హీరోయిన్లు రానున్నారు. ఇప్పటికే నిర్వాహకులు అన్ని అనుమతుల కోసం దరఖాస్తు చేశారు. ఆడియో విడుదల కూడా.. గ్రేటర్ వరంగల్ నగరానికి సినీ తారల తాకిడి రోజురోజుకు పెరుగుతోంది. సినిమాల ప్రమోషన్స్ కోసం ఎంతోమంది నగరానికి వస్తున్నారు. దీంతో ఏ సినిమా ఎప్పుడు విడుదలవుతోందనే విషయం ప్రేక్షకులకు త్వరగా తెలుస్తోంది. సినిమాకు ముందు ప్రమోషన్, విడుదలైన అనంత రం విజయోత్సవ యాత్రలు కూడా వరంగల్‌లో చేస్తున్నారు. సినిమాలకు కలెక్షన్లు పెరిగే అవకాశం ఉండడంతో థియేటర్ల యాజమాన్యాలు, డిస్ట్రిబ్యూటర్లు ప్రమోషన్, విజయోత్సవ యాత్రలపై శ్రద్ధ చూపుతున్నారు. ఆడియో విడుదల సైతం వరంగల్‌లో ఉండే అభిమాన సంఘాల నాయకులతో చేయిస్తున్నారు. భీమవరం బుల్లోడు సినిమా ప్రమోషన్‌తోపాటు ప్లాటినం డిస్క్ ఫంక్షన్ హన్మకొండలోని శ్రీ దేవి మాల్లో జరిగింది. హీరో సునీల్, హీరోయిన్ ఎస్తేర్ తదితరులు వచ్చారు. చందమామ కథలు సినిమా ప్రమోషన్ నగర శివారులో వాగ్దేవి ఇంజనీరింగ్ కళాశాలలో జరిగింది. లెజెండ్ సినిమా విజయోత్సవ ర్యాలీ నగరంలో జరిగింది. సునీల్ థియేటర్లో హీరో బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి శ్రీను వచ్చి అభిమానులతో సందడి చేశారు. సినిమా తారలను చూసేందుకు, ఫొటోలు దిగేందుకు పోటీలు పడుతున్నారు. గోల్డ్, బట్టల షాపులు, ఇతర షాపుల ప్రారంభోత్సవాలకు సినీ తారలను తీసుకొస్తున్నారు. మహేష్‌బాబు నటించిన నంబర్ వన్ సినిమా పాటను అభిమాన సంఘం నాయకుడు గందె నవీన్ అవిష్కరించారు. -
విశాఖ బ్యూటిఫుల్లీ రీమేడ్ సిటీ.. అమరావతి ఫ్యూచర్ సిటీ
తెలుగు చలన చిత్ర పరిశ్రమను విశాఖ, అమరావతి ఎక్కడకు తరలించాలన్న అంశంపై అన్ని వర్గాలతో సమాలోచన చేస్తున్నామని, అయితే సాగర నగరం విశాఖకు తరలించాలని ఎక్కువ మంది కోరుతున్నారని.. రానున్న కాలంలో అమరావతి నగరం ప్రపంచంలోని ఐదు ఉత్తమ నగరాల్లో ఒకటి కానున్న నేపథ్యంలో సినీ పరిశ్రమ ఇక్కడ ఉంటేనే సమంజసంగా ఉంటుందని ఏïపీ సీఎం చంద్రబాబునాయుడు మంగళవారం సచివాలయంలో తనను కలిసిన సినీ ప్రముఖులకు తెలిపారు. తక్కువ బడ్జెట్ చిత్రాలకు పన్ను రాయితీ ఇవ్వాలన్న అంశాన్ని పరిశీలిస్తున్నామని, చిత్ర పరిశ్రమ శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని త్వరలో తగిన నిర్ణయం తీసుకుంటామన్నారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమ హైదరాబాద్‌లో నిలదొక్కుకునేందుకు అక్కడ అన్ని మౌలిక సదుపాయాలు తానే కల్పించానని, మళ్లీ ఇప్పుడు పరిశ్రమను అభివృద్ధి చేసే బాధ్యత తీసుకున్నానన్నారు. సహజ అందాలతో విలసిల్లే విశాఖ, గోదావరి జిల్లాలు ఒకప్పుడు తెలుగు, తమిళ సినిమాలకు ముఖ్య చిరునామాగా ఉండేవని సీఎం గుర్తు చేశారు. విశాఖ బ్యూటీఫుల్లీ రీమేడ్ సిటీ అయితే అమరావతి ఫ్యూచర్ సిటీ అని అభివర్ణించారు. చలన చిత్ర పరిశ్రమలో ఉండే వారంతా కొత్త రాష్ట్రంలో అవకాశాలను అందిపుచ్చుకోవాలన్నదే తన అభిలాష అన్నారు. త్వరలో ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్‌కు పూర్తి స్థాయి పాలకవర్గాన్ని నియమిస్తామన్నారు. చలన చిత్ర పరిశ్రమలో వేర్వేరు రంగాల్లో ఉన్న వారు తమ సృజనను ప్రదర్శించి, రాజధాని తరహా భారీ నిర్మాణాల్లో భాగస్వాములు కావాలని కోరారు. వచ్చే జనవరిలో వేడుక: 2014, 2015, 2016 సంవత్సరాలకు గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నంది పురస్కారాల ఎంపిక జాబితాలను జ్యూరీ తొలుత సీఎం చంద్రబాబుకు అందించాయి. వచ్చే ఏడాది జనవరిలో నంది చలన చిత్ర పురస్కారాల ప్రదానోత్సవాన్ని నిర్వహించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. -
రివ్యూ వివాదం: ఎవరి వాదన వారిదే!
హైదరాబాద్: చలనచిత్ర సమీక్షలపై సినిమా ప్రముఖులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సమీక్షలు బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారని జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యలు చేయడంతో సినిమా ప్రరిశ్రమకు చెందిన చాలా మంది ఇదేరకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. తాము ఎంతో కష్టపడి సినిమా తీస్తే ఒక్క రివ్యూతో తమ శ్రమను వృధా చేస్తున్నారన్నది వారి ఆవేదన. సినిమా బాగుందో, లేదో చెప్పే అధికారం సమీక్షలకు లేదన్న వాదన బలంగా వినిపిస్తున్నారు. తీర్పును ప్రేక్షకులకే వదిలేయాలని కోరుతున్నారు. తాజాగా హీరో మంచు విష్ణు, నిర్మాత శోభు యార్లగడ్డ కూడా సినిమా సమీక్షలపై స్పందించారు. కొంత మంది సినిమా చూస్తూనే అప్డేట్స్ ఇచ్చేస్తున్నారని, శ్రద్ధగా చూడకుండా రాసే సమీక్షలు ఎంతవరకు కచ్చితంగా ఉంటాయని మంచు విష్ణు ప్రశ్నించారు. సినిమా చూడకుండా రివ్యూ రాయడం సరైంది కాదని, సినిమా మధ్యలోనే సమీక్షలు రాసేస్తున్నారని శోభు యార్లగడ్డ అన్నారు. సమీక్ష రాసేముందు ఎంతో మంది శ్రమను గుర్తించాలని, ప్రతి సినిమాను నిశితంగా గమనించి రివ్యూలు రాయాలని ఆయన కోరారు. సినిమా బాగుంటే ఆడుతుందని, లేకుంటే ఆడదని సమీక్షలు అంటున్నారు. బాలేదని తాము రాసినంతమాత్రాన ప్రేక్షకులు ధియేటర్లకు వెళ్లడం మానుకోరని చెప్పారు. ‘ఆస్పత్రిలో అత్యవసర వార్డులో ఉన్న వ్యక్తి బతకడని తెలిసినప్పుడు.. బతుకుతాడు అని చెప్పినా ఎలాంటి ప్రయోజనం ఉండద’ని ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. సినిమాలు చూడొద్దని తాము చెప్పడం లేదని, సినిమాలో తప్పొప్పులను మాత్రమే ఎత్తి చూపుతున్నామని సమర్థించుకుంటున్నారు. మొదటి షో చూసిన ప్రేక్షకులు సినిమా ఎలా ఉందనేది సోషల్ మీడియా ద్వారా వెల్లడించేస్తున్నారన్న విషయాన్ని గుర్తు చేశారు. ఎవరేమన్నా మంచి సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారనేది ఎప్పటికప్పుడు రుజువవుతూనే ఉంది. -
పండుగ చూస్కో
దసరా పండగ కానుకల పండగ. ఇచ్చే పండగ.ఎదుటివారిని సంతోషపెట్టే పండగ. పిల్లలకు పప్పుబెల్లాలు కావాలి. పెద్దలకు మామూళ్లు కావాలి. ఇన్నీ పుచ్చుకుని ఇచ్చుకొని ఆనందంగా గడిపే పండగ ఇది.మరి పాఠకులకు ఏం ఇచ్చుకోవాలి? ఆలోచన చేశాం.ఇది సెలవుల కాలం. ఇంట్లో అందరూ తీరిగ్గా సోఫాల్లో కూలబడి కాలం గడిపే కాలం. టీవీ ఆన్‌లో ఉంటుంది. యూ ట్యూబ్‌కు కనెక్ట్ అయి ఉంటుంది. లేదంటే డీవీడీలు సంపాదించుకోవచ్చు. కాదంటే కేబుల్వాడికి చెప్పి కోరింది పొందవచ్చు. అందుకే సినిమాలు ఇవ్వాలనుకున్నాం. ఈ సెలవుల్లో పాఠకులంతా తెలుగు సినిమాను ఒక రౌండ్ అలా రౌండేసి రావాలని కోరుకున్నాం. తెలుగు సినిమాకు స్వర్ణయుగం ఉంది. సువర్ణ పరంపర కొనసాగుతూ ఉంది. అది పెద్దలు ఒకసారి పునశ్చరణ చేసుకుంటే బాగుంటుంది, కుటుంబానికి నాటి సినిమాల గొప్పతనం చూపిస్తే బాగుంటుంది అనుకున్నాం. అందుకే ఈ నూటపదహార్లు మీకు సవినయంగా చదివిస్తున్నాం. వీటిలో అరవై సినిమాలకు వ్యాఖ్యలు రాశాం. స్థలాభావం వల్ల మరో యాభై ఆరు సినిమాల లిస్ట్ మాత్రమే ఇచ్చాం. వ్యాఖ్య రాసినవి గొప్ప, రాయనివి తక్కువా కాదు. అన్నీ గొప్పవే. నూట పదహార్లు ఒక అచ్చ తెలుగు అంకె. అందుకనే అక్కడితో ఆగాం. నిజానికి తెలుగు సినిమాలు ఎంచడం మొదలుపెడితే అంతం అంటూ ఉందా? ఎన్నో ఆణిముత్యాలు... రతనాలు... మరకత మాణిక్యాలు. అయినప్పటికీ ఆచి తూచి అందరూ మెచ్చే పట్టికను సిద్ధం చేశాం. డబ్బింగ్ సినిమాలను మినహాయించాం. రీమేక్ సినిమాలు తగ్గించాం. ఇంకొన్ని గొప్పసినిమాలను ప్రస్తావించలేకపోతున్నందుకు చింతిస్తున్నాం. మా ప్రయత్నం మిమ్మల్ని సినిమా టూర్ చేయించడమే. ఈ స్టేషన్లు కానివి మీకు నచ్చిన స్టేషన్లకు కూడా మీరు వెళ్లిరండి. మన సినిమా పచ్చగా ఉండాలి. రెండు రాష్ట్రాల పాఠకులు కళకళలాడాలి. ఈ పండగ సెలవుల్లో అందరి ఇంటా ఆనందం తొణికిసలాడాలి. పదండి... పండగ చూసుకుందాం... మాలపిల్ల (1938) పౌరాణిక ఇతివృత్తాలను తీసుకొని మొదలైన తెలుగు మూకీ, టాకీ సినిమాల పరంపరను చెదరగొట్టి ఒక సమకాలీన సమస్యతో మొదలైన తొలి తెలుగు చిత్రం ‘మాలపిల్ల’. ఉన్నవ లక్ష్మీకాంతం రాసిన నవల ‘మాలపల్లి’ కథాంశం వేరు. ఈ కథ వేరు. రెంటికీ సంబంధం లేదు. ఇది చలం, తాపీ ధర్మారావుల సహకారంతో అల్లుకున్న కథ. అభ్యుదయ భావాలు కలిగిన దర్శకుడు గూడవల్లి రామబ్రహ్మం ఆ రోజుల్లో విజృంభించే స్థాయిలో ఉన్న హరిజనోద్యమానికి ఊతం ఇస్తూ తీసిన సినిమా ఇది. ఒక రకంగా బ్రాహ్మణిజాన్ని వ్యతిరేకిస్తూ తీసిన సినిమా. నటి కాంచనమాల ఈ సినిమాతో సూపర్‌స్టార్ అయ్యారు. ‘కొల్లాయి కట్టితే ఏమి మా గాంధీ మాలాడై తిరిగితే ఏమీ’ వంటి పాటలు ఈ సినిమాలో జనాన్ని ఉర్రూతలూగించాయి. చాందస బ్రాహ్మణులు కొందరు ఈ సినిమాని చూడరాదని తీర్మానం చేశారు. చూసిన తమ కుర్రాళ్లను మైలస్నానం చేయించి మరీ ఇళ్లల్లోకి రానిచ్చారు. సంస్కరణకు సినిమా శక్తివంతమైన సాధనం అని నిరూపించిన సినిమా మాలపిల్ల. విశేషం: దర్శకుడు గూడవల్లి రామబ్రహ్మం ఆ రోజులలో ‘జస్టిస్ పార్టీ’లో ముఖ్యమైన సభ్యుడు. ఆ పార్టీ ఆధ్వర్యంలోని పత్రికలకు ఆయన సంపాదకుడిగా కూడా వ్యవహరించేవారు.మాలపిల్లలో నటించిన కాంచనమాల మోడ్రన్‌లుక్ ఆ రోజుల్లో చాలా తెలుగు ఇళ్లల్లో క్యాలెండర్‌గా ఉండేది. ఇంతటి పేరు ప్రఖ్యాతులు ఉన్న కాంచనమాల కేవలం 11 సినిమాల్లోనే నటించారు. భక్త పోతన (1942) తెలుగులో టాప్ హీరోయిన్ కాంచనమాల అయితే టాప్ హీరోగా చిత్తూరు నాగయ్యను నిలబెట్టిన సినిమా భక్త పోతన. అప్పటి వరకూ రొమాంటిక్, సోషల్ పాత్రలనే పోషిస్తున్న నాగయ్యను ఒక గొప్ప భక్తుడిగా, అటువంటి పాత్రల కోసమే పుట్టిన కారణజన్ముడిగా నిలబెట్టిన సినిమా ఇది. కె.వి.రెడ్డి మొదటిసారి దర్శకత్వం వహించిన సినిమా కూడా. ఆ రోజులలో లక్ష రూపాయల ఖర్చుతో తీసిన ఈ సినిమా లాభాల తుఫాన్ సృష్టించింది. నాగయ్యకు ఎన్నో సత్కారాలు, సన్మానాలు అందేలా చేసింది. దీనికి కొనసాగింపుగా నాగయ్య ‘త్యాగయ్య’ సినిమా తీసి ఇంకా ఎక్కువ సంపదను పోగు చేసుకున్నారు. నాగయ్య సింగింగ్ స్టార్ మాత్రమే కాదు, గొప్ప మ్యూజిక్ కంపోజర్ కూడా అందుకు ‘పోతన’ సినిమాయే ఒక ఉదాహరణ. ఒకప్పుడు కోడంబాకంలో 52 ఎకరాలకు అధిపతి అయిన నాగయ్య ఆ తర్వాతి రోజుల్లో అంతా పోగొట్టుకోవడాన్ని చాలామంది తర్వాతి తరం నటులు ఒక గుణపాఠంగా స్వీకరించారు. విశేషం: రెండో ప్రపంచయుద్ధ రోజులలో చెన్నైకు బాంబుల భయం ఉండటం వల్ల ఈ సినిమా కొన్ని రోజులు షూటింగ్ ఆగిపోయింది. ఆ భయం సద్దుమణిగాకే తీశారు. బాలరాజు (1948) అక్కినేని నాగేశ్వరరావుకు స్టార్ ఇమేజ్ తెచ్చి పెట్టిన తొలి సినిమా ఇది. ఎస్.వరలక్ష్మి, అంజలీదేవి, కస్తూరి శివరావు... అందరూ పోటీ పడి నటించి జనాన్ని ఆకట్టుకున్నారు. దర్శకుడు ఘంటసాల బలరామయ్య అక్కినేనిని తెలుగు సినిమాకు ఇంట్రడ్యూస్ చేయడమే కాదు ఈ సినిమాతో స్టార్‌ని చేసి తన పట్ల జీవితాంతం కృతజ్ఞుడై ఉండేలా చేసుకున్నారు. జానపదంలో ఉన్న ఒక కథకు ఇంకొన్ని హంగులు దిద్ది తయారు చేసుకున్న ఈ సినిమా ఆ రోజుల్లో రిలీజైన థియేటర్లన్నింటిలో తీయకుండా ఆడుతూనే ఉండేసరికి కొత్తగా రిలీజ్ చేయాల్సిన సినిమాలకు థియేటర్లు లేక కొత్తవి కట్టాల్సి వచ్చింది. అదీ ఈ సినిమా రికార్డు. జనరంజకమైన కథ, పాటలు ఉంటే కాలక్షేపం ఆశించే ప్రేక్షకులు ఆదరిస్తారనడానికి చెక్కుచెదరని ఉదాహరణ ఈ సినిమా. విశేషం: తెలుగులో అక్కినేని ఈ సినిమాతోనే తొలి జానపద హీరోగా ప్రేక్షకులలో స్థిరపడ్డారు. అయితే అది కొనసాగలేదు. ‘పాతాళభైరవి’తో ఆ ఇమేజ్ను ఎన్.టి.ఆర్ పట్టుకెళ్లారు. అన్నట్టు అక్కినేనికి ఘంటసాల ప్లేబ్యాక్ పాడటం ఈ సినిమాతోనే మొదలైంది. పాతాళభైరవి (1951) రచయిత చక్రపాణి, నిర్మాత నాగిరెడ్డి ఒక ఉత్తమ జోడీగా మారాక తొలిసారిగా విజయా బ్యానర్‌పై ‘షావుకారు’ తీశారు. సంభాషణల్లో, నడతలో కొత్త పుంతలు తొక్కిన ఆ కథ బాగున్నా ప్రేక్షకులు అంతగా ఆదరించలేకపోయారు. ప్రేక్షకులకు మంచి విషయాలు తర్వాత చెబుదాం వారికి వినోదం మొదట అందిద్దామని స్నేహితులిద్దరూ ఎంచుకున్న కథ ‘పాతాళభైరవి’. కె.వి.రెడ్డి దర్శకత్వం, పింగళి రచన, ఘంటసాల సంగీతం ఈ సినిమాకు పునాదిగా నిలిచాయి. ‘మన దేశం’ (1949)తో వెండి తెరకు పరిచయం అయిన ఎన్.టి.రామారావును జానపద నాయకుడిగా, ధీరోదాత్త వీరుడిగా స్థిరపరిచిన సినిమా ఇదే. అక్కినేని నాగేశ్వరరావు జానపద హీరోగా అవైలబుల్గా ఉన్నా ఒకసారి ఆయనతో ఎన్.టి.రామారావు టెన్నిస్ ఆడుతుండగా ఎన్.టి.ఆర్ బాల్ని షాట్ కొడుతున్న స్టయిల్ని బట్టి ఆయన జానపద హీరోగా బాగుంటాడని కె.వి.రెడ్డి నిర్ణయించుకున్నారట. ఆ తర్వాతికాలంలో ఆ మాటే నిజమై అక్కినేని సోషల్ హీరోగా స్థిరపడాల్సి వచ్చింది. ఇందులో ఎస్వీఆర్ నేపాళ మాంత్రికుడిగా వేశాడు. ‘సాహసం చేయరా ఢింభకా’ లాంటి డైలాగులు ఇప్పటికీ ఫేమస్. పేదకుర్రాడు, రాకుమారిని ధైర్యంగా వలచవచ్చని చెప్పిన మొదటిసినిమా అలాంటి ప్రేమకథలకు మూలంగా నిలిచిన సినిమా ఇది. ‘ప్రేమ కోసమై వలలో పడెనే’ పాట ఎవరం మర్చిపోతాం? విశేషం: అప్పట్లో విజయావారి దగ్గర ‘హేమండ్ ఆర్గాన్’ అనే వాయిద్యం ఉండేది. మాంత్రికుడి గుహ వచ్చినప్పుడల్లా ఆ ఆర్గాన్‌తో చేసిన నేప«థ్య సంగీతం ప్రేక్షకులను ఆకట్టుకుంది. మల్లీశ్వరి (1951) తెలుగువారు క్లాసిక్స్ తీయగలరు అనీ, సినిమాలో కూడా కళాత్మకతను జోడించగలరని ‘మల్లీశ్వరి’ చాటి చెప్పింది. దర్శకుడు బి.ఎన్.రెడ్డి ఈ సినిమాతో అజరామరమైన కీర్తిని గడించారు. ఏదో సినిమా షూటింగ్ కోసం హంపీని దర్శించిన ఆయన అక్కడి శిల్పసౌందర్యానికి ముచ్చటపడి అదివరకు నుంచి ఉన్న శ్రీకృష్ణదేవరాయలిపై అభిమానాన్ని చాటుకునేందుకు ‘మల్లీశ్వరి’కి నడుం బిగించారు. దీనికి రచన దేవులపల్లి కృష్ణశాస్త్రే అయినా కథకు మూలం కథారచయిత బుచ్చిబాబు రాసిన ‘రాయల కరుణకృత్యం’ నాటిక అని కూడా అంటారు. ఎన్.టి.రామారావు, భానుమతిల నటన సాలూరి రాజేశ్వరరావు పాటలు సినిమాకు ఆయువు పట్టుగా నిలిచాయి. ‘పిలిచినా బిగువటరా’, ‘మనసున మల్లెల మాలలూగెనే’, ‘ఆకాశ వీధిలో హాయిగా ఎగిరేవు’... ఆ పాటల తియ్యదనం ఎంతటిదని. ఈ సినిమాను సర్వేపల్లి రాధాకృష్ణ చూశారట. మెచ్చుకున్నారట. ఆయనది ఏముంది కళాహృదయం ఉన్న ప్రతి ఒక్క తెలుగు ప్రేక్షకుడు ఇప్పటికీ ఈ సినిమా చూస్తున్నాడు ఇకపైనా చూస్తాడు. విశేషం: కృష్ణశాస్త్రి ఈ సినిమాకు స్క్రిప్ట్ సమకూర్చినా ఆ తర్వాతి రోజులలో ఆయన ప్రధానంగా పాట రచన మీదే దృష్టి పెట్టారు తప్ప స్క్రిప్ట్ పనికి పూనుకోలేదు. దేవదాసు (1953) భగ్నప్రేమకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన తొలి సినిమా, అక్కినేని నాగేశ్వరరావు కెరీర్‌ను జీవితాంతం ప్రభావితం చేసిన సినిమా దేవదాసు. బెంగాలీ రచయిత శరత్ ఏ ముహూర్తాన ఈ నవల రాశాడోకానీ ఎన్నో భారతీయ భాషల్లో ఇది నిర్మితమవుతూనే ఉంది. కానీ తెలుగు సినిమాకి తెలుగు హీరోగా అక్కినేనికీ వచ్చినంత పేరు ఎవరికీ రాలేదు. దర్శకుడు వేదాంతం రాఘవయ్య, సంగీత దర్శకుడు సి.ఆర్.సుబ్బురామన్, సముద్రాల గీత రచన సినిమాను ఎక్కడికో తీసుకెళ్లి కూచోబెట్టాయి. పార్వతిగా సావిత్రి, చంద్రముఖిగా లలిత, స్నేహితుడు భగవాన్‌గా పేకేటి శివరామ్ వీళ్లందరూ అలాగే గుర్తుండిపోతారు. ఇవాళ్టికీ ఎవరైనా ప్రేమలో విఫలమైతే ‘వాడో దేవదాసు’ అనేంతగా ఈ పాత్ర తెలుగువారి రక్తంలో జీర్ణించుకుపోయింది. ‘జగమే మాయ.. బ్రతుకే మాయ’, ‘కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్’, ‘చెలియ లేదు చెలిమి లేదు’, ‘అంతా భ్రాంతియేనా’... పాటలన్నీ రసగుళికలు. గాలివానను క్లైమాక్స్‌కు వాడిన మొదటి సినిమా ఇదే. నేటికీ ప్రేమకథలు ఎన్ని పుట్టినా ఇది మాత్రమే జేజమ్మ. విశేషం: ఈ సినిమాను దర్శకుడు వేదాంతం రాఘవయ్య ఎక్కువగా రాత్రి వేళల్లో షూట్ చేశారు. అందువల్ల నిద్రలేక అక్కినేని కళ్లు ఉబ్బినట్టయ్యాయి. దాంతో అవి తాగుబోతు కళ్ల వలే కనిపించి పాత్రకు నప్పి రాణించాయి. పెద్ద మనుషులు (1954) సమకాలీన సమాజంపై సెటైర్‌తో నిండిన కామెంట్ చేయవచ్చని మొదటిసారిగా నిరూపించిన సినిమా ‘పెద్ద మనుషులు’. దర్శకుడు కె.వి.రెడ్డిలో ఉండే సోషల్ అవేర్నెస్, పైకి పెద్దవాళ్లుగా అభినయిస్తూ లోన సమాజాన్ని దోచుకు తినేవారి పట్ల రోత ఈ సినిమాలో కనిపిస్తాయి. కమెడియన్ రేలంగి ఈ సినిమాలో విశ్వరూపం చూపుతారు. అలా పిచ్చివాడిగా ఉంటూ సమాజాన్ని తిట్టే ఆ పాత్రను కేంద్రంగా చేసుకొని తెలుగు సినిమాల్లో అనేక పాత్రలు వెలువడ్డాయి. ఇబ్సెన్ నాటకం ‘ది పిల్లర్స్ ఆఫ్ సొసైటీ’ ఆధారంగా వచ్చిన ఈ సినిమా ఆ రోజుల్లో ధర్మపరాయణులుగా కనిపిస్తూ పేదలను దోచుకు తినే పెద్దలపై ఈసడింపు. డి.వి.నరసరాజు ఈ సినిమాతోనే మాటల రచయిత అయ్యారు. ‘శివ శివమూర్తివి గణనాథ నీవు శివుని కుమారుడవు గణనాథా’.. పాట ఇందులోదే. విశేషం: ఆ తర్వాతి రోజులలో విశేష ప్రాధాన్యం సంతరించుకున్న ‘గ్రూప్ విలనిజం’కు ఈ సినిమాయే ఆద్యం. ఇందులో నలుగురు విలన్లుగా జంధ్యాల గౌరీనాథశాస్త్రి, ఏ.వి.సుబ్బారావు, వంగర వెంకట సుబ్బయ్య, చదలవాడ నటించారు. మిస్సమ్మ (1955) అచ్చ తెలుగు వినోదానికి ఎస్ అన్న చిత్రం మిస్సమ్మ. తమిళంలో, హిందీలో కూడా ఈ సినిమా ప్రేక్షకులను రంజింప చేసింది. ఎల్.వి.ప్రసాద్ దర్శకుడిగా గొప్పవాడనడానికి ఈ సినిమా ఒక్కటి సరిపోతుంది. ఎన్.టి.ఆర్ ఈ సినిమాలో కనిపించినంత అందంగా మరే సినిమాలోనూ కనిపించడు. మొదట భానుమతిని హీరోయిన్గా అనుకుని ఆమెను క్యాన్సిల్ చేసి సావిత్రిని పెట్టడం వల్ల ఆమె స్టార్ అయి ఆ తర్వాత తెలుగు ఇండస్ట్రీని ఏలింది. ఉద్యోగం దొరకడం కష్టమైన ఆ రోజుల్లో చిన్న నాటకమాడి ఉద్యోగం సంపాదించుకున్న ఒకమ్మాయి అబ్బాయిల గిలిగింతల ప్రేమ కథ ఇది. దొంగ బిచ్చగాడు దేవయ్యగా రేలంగికి నూటికి నూరు మార్కులు. ఎస్.వి. రంగారావు గొప్పతనం సరే కమెడియన్‌గా నాగేశ్వరరావు దుమ్ము దులిపేసి పగలబడి నవ్విస్తాడు. ‘రావోయి చందమామ మా వింత గాథ వినుమా’... ఈ వింతగాథను బోరు లేకుండా జనం చూస్తూనే ఉన్నారు. విశేషం: ఈ సినిమా హిందీలో ‘మిస్ మేరీ’గా చేస్తే సావిత్రి పాత్రను మీనాకుమారి పోషించారు. నటనలో ఇద్దరూ సమ ఉజ్జీలు. చెప్పాల్సిన సంగతి ఏమిటంటే ఇద్దరి జీవితమూ విషాదపరిస్థితుల్లో ముగిసింది. రోజులు మారాయి (1955) భూమిని గుత్తాధిపత్యంలో ఉంచుకుని కౌలు రైతుల రక్తం తాగే కామందుల రాజ్యం పోయిందని, రోజులు మారాయని ఇక మీదట దున్నేవాడిదే భూమి అని నిరూపించడానికి వచ్చిన సినిమా ‘రోజులు మారాయి’. ఈ సినిమా పేరెత్తగానే వహీదా రహెమాన్, ఆమె నర్తించిన ‘ఏరు వాకా సాగారో రన్నో చిన్నన్న’ పాట గుర్తుకు వస్తాయి. ‘మాస్టర్ వేణు’ సంగీతకారుడుగా ఒక గ్లామర్‌ను తెచ్చుకున్న సినిమా ఇది. అక్కినేని, షావుకారు జానకీలతో పాటు రేలంగి కూడా సినిమాలో మార్కులు కొట్టేశాడు. నిర్మించిన సారథి స్టూడియోవారికి, దర్శకత్వం వహించిన తాపీ చాణక్యకి చిరకీర్తి సంపాదించి పెట్టిన సినిమా ఇది. విశేషం: ఈ సినిమా హైదరాబాద్‌లో 100 రోజులు ఆడటంతో తెలుగు సినిమాలకు తెలంగాణలో ఆదరణ బయటపడింది. దాంతో మొదటిసారిగా సికింద్రాబాద్‌లో ఈ సినిమా పుణ్యమా అని డిస్ట్రిబ్యూషన్ ఆఫీసులు మొదలయ్యాయి. శ్రీ వేంకటేశ్వర మçహాత్మ్యం (1960) కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరుడి మీద తీసిన సినిమా అంటే ప్రేక్షకులు తండోపతండాలుగా వస్తారని నిరూపించిన సినిమా. దర్శకుడు పి.పుల్లయ్య ఇదే సినిమాను ఇంతకుమునుపు 1939లో నాటి తారాగణంతో ఒకసారి తీశారు. ఆ తర్వాత రామారావు వెండితెర దైవస్వరూపుడని కనిపెట్టి 1960లో రామారావుతో తిరిగి నిర్మించారు. ఎస్.వరలక్ష్మి శ్రీ మహాలక్ష్మిగా, సావిత్రి పద్మావతిగా, రామారావు శ్రీనివాసునిగా నటించిన సినిమా ఆ రోజుల్లో ప్రతి సినిమాహాలును మినీ తిరుమలగా చేసింది. అక్కడే వెంకటేశ్వరుని ప్రతిమలు పెట్టి జనం పూజించడం ప్రారంభించారు. ఘంటసాల పాడిన ‘శేషశైలావాస శ్రీవేంకటేశ’ పాట నాటికీ నేటికీ ఒక భక్తిగీతం. సినిమాలో ఆయనే ఈ పాట పాడుతూ కనిపిస్తారు. వెంకటేశ్వరస్వామిపై చిత్రాలకు పాదు వేసిన ఈ సినిమా వరుసలో మొన్నటి ‘నమో వెంకటేశాయ’ వరకూ వచ్చినవి ఎన్నో... రానున్నవి ఎన్నెన్నో. విశేషం: ఈ సినిమా పూర్తయ్యాక ‘శుభం కార్డు’ వేయకుండా తిరుమల విశేషాలను తెలిపే డాక్యుమెంటరీని జత చేసి ఆ రోజులలో ప్రదర్శించడాన్ని జనం బోనస్‌గా భావించారు. గుండమ్మ కథ (1962) విజయా వారి ఘన వైభవానికి ఆఖరి తార్కాణంగా ఈ సినిమాని చెప్పుకుంటారు. దీని తర్వాత విజయ బ్యానర్ మీద ఆ స్థాయి హిట్స్ రాలేదు. గుండమ్మ అనే దురుసు వితంతువు తన కన్న కూతురిని ఒకలాగా సవతి కూతురిని ఒకలాగా చూస్తూ ఉంటే ఆ తల్లినీ ఆమె గారాల పట్టీని దారికి తెచ్చి తమ ఇంటికి కోడళ్లుగా చేసుకున్న ఇద్దరు అన్నదమ్ముల కథ ఇది. ముందు కన్నడలో విఠలాచార్య తీస్తే తెలుగులో విజయా సంస్థ చక్రపాణి, డి.వి.నరసరాజు ఆధ్వర్యంలో మార్పు చేర్పులు చేసి కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో విడుదల చేసింది. తెలుగువాళ్లలో ‘గుండమ్మ’ అని ఎవరూ పెట్టుకోరు. అది కన్నడ పేరైనా బాగుందని అలాగే పెట్టేశారు. అన్నదమ్ములుగా అక్కినేని, ఎన్టీఆర్ వారి తండ్రిగా ఎస్వీ రంగారావు, వారు ఎంచుకున్న అమ్మాయిలుగా జమున, సావిత్రి కళ్లకు నిండుగా కన్నుల పండువగా కనిపిస్తారు. ఇది ఒక రకంగా ‘ఫీల్ గుడ్ మూవీ’ అని చెప్పుకోవాలి. మధ్యలో హరనాథ్, ఎల్.విజయలక్ష్మిల ఉపకథ కూడా నడుస్తుంటుంది. రమణారెడ్డి కీలకపాత్ర పోషించి సినిమాలో సుడిగాలి వలే వ్యవహరిస్తుంటారు. చివర్లో వచ్చే రాజనాల కూడా నవ్వు తెప్పిస్తారు. ఆబాల గోపాలాన్ని మెప్పించి అందరికీ పేరూ డబ్బు తెచ్చి పెట్టిన సినిమా ఇది. విశేషాలు: ఘంటసాల చేసిన పాటలన్నీ హిట్టే. కోలో కోలోయన్న కోలో నా సామీ, లేచింది నిద్ర లేచింది మహిళా లోకం, అలిగిన వేళనే చూడాలి... ఇక ‘ప్రేమ యాత్రలకు బృందావనము నందనవనము ఏలనో’ పాట ఒక జాతీయంలా స్థిరపడింది. దీనిని రీమేక్ చేయాలని బాలకృష్ణ– నాగార్జున జోడీతో జూ.ఎన్టీఆర్–నాగచైతన్య జోడీతో కొందరు ప్రయత్నించారు. సూర్యకాంతంను రీప్లేస్ చేసేవారు లేరని ఆ ప్రయత్నాలు మానుకున్నారు. మాయాబజార్ (1957) ‘బజార్’ అనే ఉర్దూ మాటను టైటిల్లో పెట్టి మరీ పౌరాణిక సినిమా తీసినా జనం అదేమీ పట్టించుకోకుండా బ్రహ్మరథం పట్టిన సినిమా ఇది. నాగిరెడ్డి, చక్రపాణి, కె.వి.రెడ్డి, పింగళి, ఘంటసాల, ఎన్.టి.ఆర్, ఏ.ఎన్.ఆర్, ఎస్వీఆర్, సావిత్రి, రేలంగి, సి.ఎస్.ఆర్... ఇలా సినిమాతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరూ చెరగని కీర్తి పొందిన సినిమా ఇది. పాండవులు సినిమాలో ఒక్కసారి కూడా కనిపించకుండా పాండవుల కథతో తీసిన విడ్డూరమైన సినిమా ఇది. మూలంలో లేని శశిరేఖా పరిణయంను కల్పితంగా కల్పించుకుని ఒక అందమైన రూపం ఇచ్చారు. ఇందులో మార్కస్ బాట్లే ట్రిక్ ఫొటోగ్రఫీ ఇప్పటి బాహుబలికి బాబు అని ఫీలయ్యేవారు ఉన్నారు. ‘ఎవరూ పుట్టించకుండా మాటలెలా పుడతాయి’, ‘రసపట్టులో తర్కం కూడదు’ వంటి డైలాగులు మురిపెం కలిగిస్తాయి. ‘చూపులు కలిసిన శుభవేళ’, ‘వివాహ భోజనంబు’, ‘అహ నా పెళ్లి అంట’, ‘నీవేనా నను పిలిచినది’... వంటి పాటలెన్నో. దర్శకుడు జంధ్యాల ఈ సినిమా ఆధారంగా కనీసం అరడజను సినిమా టైటిల్స్ పెట్టి సినిమాలు తీశారు. తెలుగువారు ఒక సినీ ఆస్తిగా ఫీలయ్యే సినిమా అంటే ఇదేనేమో. ఆబాల గోపాలాన్ని అలరించిన ఏకైక సినిమా ఇది. విశేషం: ఎన్.టి.ఆర్ ఇంతకుమునుపు ఒకసారి కృష్ణుడి వేషం వేస్తే జనం మెచ్చలేదు. దాంతో ఆయన కృష్ణుడి పాత్రంటేనే భయపడి మాయాబజార్లో కృష్ణుడి పాత్ర ఆఫర్‌ను వద్దనుకున్నారు. కాని కె.వి.రెడ్డి ఒప్పించి చేయించారు. ఈ సినిమా తర్వాత తెలుగువారికి కృష్ణుడంటే రామారావే అన్నట్టు స్థిరపడిపోయింది. నేటికీ ఆ పాత్రను ఎవరు వేసినా ఎన్‌టిఆర్‌తో పోల్చి నిరుత్సాహపడేవాళ్లు అనేకమంది ఉన్నారు. లవకుశ (1963) తెలుగులో పూర్తి కలర్లో తీసిన తొలి సినిమా. నిర్మాత శంకర్‌రెడ్డి ఈ సినిమా నిర్మించడానికే పుట్టారేమో తెలీదు. ఐదేళ్లు కష్టపడి భారీ ఖర్చుతో తీసిన ఈ సినిమా ఆ తర్వాత ఈ నాటి లెక్కల్లో అప్పుడే వెయ్యి కోట్లు కలెక్షన్లు సాధించిందని అంచనా. జన ఎడ్లబండ్లు కట్టుకుని వచ్చి మరీ ఈ సినిమా చూసేవారు. రావణుడు, యుద్ధము లేని ఈ సినిమా కేవలం సీతారాముల ఎడబాటు, సుపుత్రులతో సీతారాముల కలయికతో ఆకట్టుకుంది. దర్శకుడు సి.పుల్లయ్య సగం సినిమా పూర్తి చేయగా ఆయన అనారోగ్యం వల్ల ఆయన కుమారుడు సి.ఎస్.రావు మిగిలిన సినిమాను పూర్తి చేశారు. అంతవరకూ డాన్సింగ్ స్టార్‌గా ఉన్న అంజలీ దేవి సీతగా చేయడం ఏమిటి అన్నవారే సినిమా చూసి ఆమె కలియుగ సీతగా హారతులు పట్టారు. రాముడిగా ఎన్టీఆర్‌కు జేజేలు సిద్ధించాయి. ఇక కుశలవులుగా నటించిన నాగరాజు, సుబ్రహ్మణ్యం జీవితానికి సరిపడా కీర్తి సంపాదించారు. లక్ష్మణుడిగా వేసిన కాంతారావుకు ఈ సినిమా మరో వంద సినిమాల భిక్ష పెట్టింది. ‘వినుడు వినుడు రామాయణగాథ’, ‘శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా’, ‘ఏ నిమిషానికి ఏమి జరుగునో’... ఘంటసాల చేసిన పాటలు పల్లెపల్లెలో నేటికీ సుప్రభాత గీతాలుగా వినిపిస్తూ ఉన్నాయి. విశేషం: లవకుశ కోసం రిపీట్ రన్లతో సహా ఇప్పటికి పదిహేను కోట్ల టికెట్లు తెగి ఉంటాయని అంచనా. ఈ రికార్డు ఇప్పటికీ తెలుగులో ఈ సినిమాకే సొంతం. మూగ మనసులు (1964) ప్రేమనూ పునర్జన్మలనూ కలిపి ‘మ్యూజికల్ హిట్ లవ్‌స్టోరీ’లకు తెర తీసిన సినిమా ఇది. దర్శక దిగ్గజం ఆదుర్తి సుబ్బారావు విశ్వరూపం చూపి అంతవరకూ స్టూడియోలలో మగ్గుతున్న సినిమాను గోదారి ఒడ్డుకు తీసుకొచ్చి కొబ్బరిగాలి తగిలేలా చేసి ప్రేక్షకుల్ని పులకరింపజేశారు. రచయిత ముళ్లపూడి వెంకటరమణ ఈ సినిమా వెనుక గట్టి కృషి చేసినా చాలా క్రెడిట్ ఆత్రేయకు దక్కింది. హీరోను హీరోయిన్ ‘ఒరే’ అని పిలవడం ఈ సినిమాతోనే మొదలు. అక్కినేని, సావిత్రిలది హిట్ పెయిర్ అని మరోసారి నిరూపించిన సినిమా. సావిత్రి పక్కన పద్మనాభంను భర్తగా పెట్టి ధైర్యం చేశారు. జమున ఒక అల్లరి పిల్లలా అదరగొట్టేస్తుంది. ‘గోదారి గట్టుంది గట్టు మీద చెట్టుంది’, ‘నా పాట నీ నోట పలకాల చిలకా’, ‘ముద్దబంతి పువ్వులో’, ‘ఈనాటి ఈ బంధం ఏ నాటిదో’... ఇలా ప్రతి పాట సూపర్‌డూపర్ హిట్ చేసింది కె.వి.మహదేవన్. దీనిని హిందీలో ‘మిలన్’ పేరుతో రీమేక్ చేశారు. చాలా రోజుల తర్వాత అక్కినేని కుమారుడు నాగార్జున ఇదే కథతో ‘జానకి రాముడు’ చేశాడు. విశేషం: ఈ సినిమాకు హీరోగా ఆదుర్తి మొదటి ఛాయిస్ ఎన్.టి.ఆర్. అయితే ఆ రోజుల్లో ఆయన మద్రాసు స్టూడియోల్లోనే షూటింగ్ చేయడానికి ఇష్టపడేవారు. ఈ సినిమా పూర్తిగా ఔట్‌డోర్ చేయాలనుకుంటున్నందువల్ల చేయ నిరాకరించడంతో అవకాశం ఏ.ఎన్.ఆర్కు దక్కింది. అది ఆయన కెరీర్‌కు ఎంతో ప్లస్ అయ్యింది. రాముడు– భీముడు (1964) డబుల్ యాక్షన్ సినిమాల ఫార్ములాను ఖరారు చేసిన చిత్రం. దీనికి కారణం రచయిత డి.వి.నరసరాజు. ఇదే సినిమా హిందీలో, తమిళంలో రీమేక్ అయ్యి అక్కడా ఘన విజయం సాధించింది. దీనిని తిరగేసి సలీమ్ జావేద్‌లు ‘సీతా ఔర్ గీతా’ రాస్తే దానిని మళ్లీ తెలుగులో ‘గంగ – మంగ’గా తీశారు. ఇద్దరు హీరోలుంటే ఒక హీరో క్లాస్ మరో హీరో మాస్ అనే ‘రాముడు–భీముడు’ ఫార్ములాను ఇప్పటికీ ఫాలో అవుతూనే ఉన్నారు. నిర్మాత డి.రామానాయుడు ఈ సినిమాతో నిర్మాతగా స్థిరపడ్డారు. నాగార్జున సాగర్ నిర్మించే రోజులు కనుక అక్కడ తీసిన ‘దేశమ్ము మారిందోయ్ కాలమ్ము మారిందోయ్’ పాటలో ఆ నిర్మాణం చూడవచ్చు. ఎన్టీఆర్ డబుల్ యాక్షన్ చేసిన ఈ సినిమాలో ఆయన డూప్‌గా సత్యనారాయణ నటించారు. ‘ఉందిలే మంచికాలం ముందు ముందునా’, ‘తెలిసిందిలే తెలిసిందిలే’... హిట్ పాటలు. దీని దర్శకుడు తాపీ చాణక్య. విశేషం: ఈ సినిమాలో డాన్సర్ ఎల్.విజయలక్ష్మి ఒక హీరోయిన్గా అలరిస్తారు. తెలుగువారి ఇష్టమైన డాన్సర్ అయిన ఎల్.విజయలక్ష్మి ఆ తర్వాతి రోజులలో సినిమాలకు స్వస్తి చెప్పి, ప్రస్తుతం అమెరికాలో విశ్రాంత జీవితం గడుపుతున్నారు. తేనెమనసులు (1965) అంతా కొత్తవారితో ఒక సినిమా తీయవచ్చని, తీసి హిట్ చేయవచ్చని తెలుగులో మొదటిసారి నిరూపించిన చిత్రం. దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు ధైర్యం చేసి ఎంపిక చేసిన స్టార్లలో బుర్రిపాలెం నుంచి వచ్చిన కృష్ణ ఆ తర్వాత సూపర్ స్టార్ అవడమే కాక మహేశ్‌బాబు అనే మరో సూపర్‌స్టార్‌ను ఇండస్ట్రీకి ఇచ్చాడు. ఇందులో మరో హీరోగా నటించిన రామ్మోహన్ అతి కొద్ది సినిమాల్లో నటించి ఆ తర్వాత వేషాలు లేక తెరమరుగయ్యాడు. హీరోయిన్లుగా వేసిన సుకన్య, సంధ్యారాణి కూడా నిలువలేదు. ముళ్లపూడి వెంకటరమణ కథ అందించడమే కాక ‘తేనె మనసులు’ అనే టైటిల్ కూడా పెట్టారు. ఇవాళ దాదాసాహెబ్ ఫాల్కే అందుకున్న కె.విశ్వనాథ్ దీనికి కో డైరెక్టర్. కృష్ణ ఈ సినిమాలో బ్రిలియంట్‌గా, ఈజ్‌తో డైలాగ్స్ చెప్పడం మనం చూస్తాం. ‘దివి నుంచి భువికి దిగి వచ్చె దిగి వచ్చె’, ‘నా ఎదుట నీవు నీ ఎదుట నేను’ హిట్ సాంగ్స్ ఇందులోవే. విశేషం: ఈ సినిమాను మొదట కొంత బ్లాక్ అండ్ వైట్‌లో తీశారు. అయితే అప్పుడప్పుడే కలర్ సినిమాలు ఊపందుకుంటూ ఉండటంతో తీసింది పక్కన పెట్టి మొత్తం సినిమా తిరిగి కలర్లో తీశారు. ప్రేమనగర్ (1971) నవలా చిత్రాలు ఇంత పెద్ద హిట్ కాగలవని, సరిగ్గా మలుచుకుంటే కాసులు కుమ్మరిస్తాయని నిరూపించిన చిత్రం. అక్కినేనిని నవలా నాయకునిగా, వాణిశ్రీని నవలా నాయికగా ఈ సినిమా పర్మనెంట్‌గా నిలబెట్టింది. ప్రఖ్యాత నవలారచయిత్రి కోడూరి కౌసల్యాదేవి రాసిన ‘ప్రేమనగర్’ నవలను కొనుక్కున్న నిర్మాత రామానాయుడు దర్శకుడిగా కె.ఎస్.ప్రకాశరావును, రచయిత ఆత్రేయను, సంగీత దర్శకునిగా కె.వి.మహదేవన్ను ఎంచుకుని నేల క్లాసు ప్రేక్షకుడు మెచ్చే హంగులు జత చేసి తీసిన ఈ సినిమా రామానాయుడిని సినీ రంగంలో పెద్ద నిర్మాతగా కొనసాగే స్థయిర్యాన్ని ధైర్యాన్ని ఇచ్చింది. తాగుబోతు హీరోని సంస్కరించి దారిలో పెట్టే హీరోయిన్ అతను దారికి వచ్చాక ఆమె ఎడబాటు... ఈ ట్విస్ట్‌లన్నీ జనానికి నచ్చాయి. భారీ సెట్లు వేసి తీసిన ‘నీ కోసం వెలిసింది ప్రేమ మందిరం’, ‘ఎవరి కోసం ఎవరి కోసం’... ‘మనసు గతి ఇంతే’ విషాద గీతాలు పెద్ద హిట్. అలాగే ‘లే..లే.. లే నా రాజా’ పాట మాస్కు పట్టింది. ‘నేను పుట్టాను ఈ లోకం ఏడ్చింది’... అని రాయడం ఆత్రేయకే చెల్లు. ‘ఎందుకు చేశావు ఈ పని’ అని హీరో ఒక నిందను వేయడంతో హీరోయిన్ అతడికి దూరమవుతుంది. ఆ ఒక్క డైలాగూ ఫేమస్సే. బలమైన కథ, హిట్ పాటలు ఉంటే సినిమా భారీ విజయం సాధిస్తుందనడానికి ‘ప్రేమనగర్’ ఒక శాశ్వత ఉదాహరణ. విశేషం: ఈ సినిమాలో నటించిన వాణిశ్రీ హెయిర్ స్టయిల్, పొడవు చేతుల జాకెట్లు ఆరోజుల్లో పెద్ద క్రేజును సంపాదించుకున్నాయి. తమిళంలో శివాజీ గణేశన్‌తో, హిందీలో రాజేష్‌ఖన్నాతో రీమేక్ చేస్తే అక్కడా హిట్ అయ్యి రామానాయుడు పెద్దఎత్తున డబ్బు సంపాదించుకున్నారు ఈ సినిమాతో. మోసగాళ్లకు మోసగాడు (1971) క్రైమ్ సినిమాల ఘనాపాటి, డేరింగ్ డాషింగ్ హీరో కృష్ణ తెలుగువారికి అందించిన తొలి కౌబాయ్ చిత్రం ఇది. హాలీవుడ్లో విపరీతంగా పాపులర్ అయిన ఈ ధోరణి చిత్రాలను భారతదేశంలో అందునా దక్షిణభారతదేశంలో హిట్ ఫార్ములాగా మార్చింది కె.ఎస్.ఆర్ దాసే. క్లింట్ ఈస్ట్‌వుడ్ నటించిన ‘ది గుడ్ ది బ్యాడ్ అండ్ ది అగ్లీ’ కథను ఆధారంగా చేసుకుని తీసిన ఈ సినిమాలో విజయనిర్మల, జ్యోతిలక్ష్మి ముఖ్యపాత్రలు పోషించారు. నాగభూషణం ఇందులో ‘అగ్లీ’ని పోలిన పాత్రలో చెలరేగిపోయి నటించారు. రిలీజైన వెంటనే భారీ విజయం నమోదు చేసిన సినిమా ఆ తర్వాత అలాంటి సినిమాలెన్నింటికో పురుడు పోసింది. ఇందుకు రచయిత ఆరుద్రకు కూడా క్రెడిట్ ఇవ్వాలి. ‘కోరినది నెరవేరినది ఒహో కలలు నిజమాయే’ పాట ఇందులోదే. సంప్రదాయ సంగీతంలో ఘనాపాటి అయిన ఆదినారాయణరావు ఈ సినిమాకు వెస్టర్న్ తరహా సంగీతం అందించడం విశేషం. విశేషం: ఈ సినిమా మొత్తాన్ని రాజస్తాన్ చుట్టుపక్కల తీశారు. ఇందుకోసం ఒక ప్రత్యేక రైలులో తారాగణాన్నంతా పట్టుకుపోయారు. సినిమాకు ఆరుద్రనే డైరెక్టర్ చేద్దామనుకున్నారు. కాని ఆయన వారించడంతో అవకాశం కె.ఎస్.ఆర్.దాస్‌కు దక్కింది. ఈ సినిమా గొప్పగా రావడానికి కెమెరామెన్ వీఎస్ఆర్ స్వామిది కూడా ముఖ్యభూమికే. ముత్యాల ముగ్గు (1975) ఉత్తర రామాయణాన్ని సోషలైజ్ చేసి బాపు రమణలు హిట్ కొట్టిన సినిమా ఇది. బాపు దర్శకుడుగా రమణ రచయితగా ఒక జోడిని ఈ సినిమా తెలుగులో స్థిరపరిచింది. సహజమైన నుడికారం, సహజ వెలుతురులో చిత్రీకరణ, కొత్తరకం కథనం, పాటలు అన్నీ ఈ సినిమాకు అందంగా అమిరాయి. శ్రీధర్, సంగీత వీరితోపాటు కాంతారావు ఈ సినిమాలో ముఖ్యపాత్రలు పోషించారు. రావు గోపాలరావు ఈ సినిమాతోనే తెలుగులో మెయిన్ విలన్‌గా జెండా పాతారు. కట్టుకున్న భార్యను అనుమానించి వదులుకున్న భర్తను దారిలోకి తేవడానికి పిల్లలు రంగంలోకి దిగుతారు. ఇందులో ఆంజనేయస్వామి కూడా ముఖ్యపాత్రధారి కావడం విశేషం. ‘మడిసన్నాక తిని తొంగోవడం కాదు కాసింత కళాపోషణ ఉండాల’ అనే ఫేమస్ డైలాగ్ ఇందులోదే. ‘డిక్కీలో ఎట్టించేస్తాను’, ‘ఆ ముక్క లెక్కెట్టుకోక ముందు చెప్పాల’ లాంటి డైలాగులు జనం నోట నానాయి. ఆ రోజుల్లో కోటి రూపాయలు కలెక్ట్ చేసిన సినిమాగా చెప్పుకుంటారు. విశేషం: సుప్రసిద్ధ కవి గుంటూరు శేషేంద్రశర్మ తన జీవితంలో రాసిన ఒకే ఒక పాట ‘నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది’ ఇందులోదే. ఆరుద్ర రాసిన ‘ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ’ పాట ఇంటింటి మేలుకొలుపు పాటయ్యింది. అంతులేని కథ (1976) మధ్యతరగతి జీవితాల్లోని చేదును, వగరును, స్వార్థాన్ని, స్వలాభాన్ని నలుపు–తెలుపుల్లో వాస్తవిక ధోరణిలో చూపి ప్రేక్షకులను ఆకట్టుకున్న చిత్రం. 1970వ దశకంలో మధ్యతరగతి ఇళ్లల్లో ఒక్కరి మీద అందరూ ఆధారపడి బతికే ధోరణిని, మగవాళ్ల నిర్బాధ్యతను, ఆడవాళ్ల నలుగులాటను దర్శకుడు కె.బాలచందర్ ఈ సినిమాలో సమర్థంగా చూపించాడు. ఏ కుటుంబం కోసం సినిమా అంతా హారతిలా హరించుకుపోతుందో అదే కుటుంబం కోసం సినిమా చివరలో కూడా మళ్లీ దగ్ధమవ్వడానికి ముఖ్యనాయిక జయప్రద సిద్ధమవుతుంది. ఈ కుటుంబాన్ని వదిలి పారిపోయిన తండ్రి తిరిగి వస్తున్నాడని తెలిసి కుటుంబం అంతా వేయి కళ్లతో ఎదురు చూస్తే అతడు సన్యాసిలా తిరిగి వచ్చి అంతలోనే వెళ్లిపోయే సన్నివేశం కలచి వేస్తుంది. జయప్రద నటన, గణేశ్‌పాత్రో సంభాషణలు ముఖ్యం. ఈ సినిమాలో పాటలన్నీ హిట్. ‘తాళి కట్టు శుభవేళ’, ‘దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి’, ‘కళ్లలో ఉన్న నీరు కన్నులకే తెలుసు’... జనం మర్చిపోలేదు. విశేషాలు: ఈ సినిమాలో కనిపించిన కమలహాసన్, రజనీకాంత్ ఆ తర్వాత తమిళనాడుకే కాదు భారతదేశానికే సూపర్స్టార్లు అయ్యారు. ఇందులో రజనీకాంత్ సిగరెట్ ఎగరేసి తాగడం అప్పట్లో ఫ్యాషన్ అయ్యింది. జయప్రద స్లీవ్‌లెస్ జాకెట్స్ తొడుక్కోవడం కాక మధ్యతరగతి ఇళ్లల్లో చాలా సాధారణంగా కనిపించే బట్టలు మార్చుకునే సన్నివేశంలో మూడునాలుగుసార్లు కనిపిస్తుంది. అల్లూరి సీతారామరాజు (1974) హిందీలో షోలే వంటి భారీ సినిమాలు 1975లో వస్తే అంతకు ఒక సంవత్సరం ముందే సినిమాస్కోప్‌లో మన దగ్గర వచ్చిన భారీ సినిమా అల్లూరి సీతారామరాజు. విప్లవజ్యోతిగా, మన్నెం వీరుడుగా అల్లూరి సీతారామరాజు తెలుగువారి దృష్టిలో మరో భగత్‌సింగ్‌లా ఔన్నత్యం పొందారు. ఆయన కథను ఎన్టీఆర్ సినిమాగా తీయాలని ఎన్నోసార్లు ప్రయత్నించి విఫలమవగా ఆ అదృష్టం కృష్ణకు దక్కింది. ఆయనే నిర్మాతగా మారి హీరోగా నటించి వి.రామచంద్రరావు దర్శకత్వంలో ఆయన అకాల మరణం పొందగా కె.ఎస్.ఆర్. దాస్ సహాయంతో అంతా తానై సినిమాను ముగించారు. పాఠ్యపుస్తకాల్లో చదివిన దానికంటే తెలుగువారు ఈ సినిమా ద్వారానే సీతారామరాజును ఎక్కువగా తెలుసుకున్నారని చెప్పవచ్చు. ఈ సినిమా తీయడంతో కృష్ణ జన్మ ధన్యమైందని భావించినవారు ఉన్నారు. బ్రిటిష్ అధికారి రూథర్ఫోర్డ్గా జగ్గయ్య కంచు కంఠం మోగిస్తారు. సినిమా అంతా ఒకెత్తయితే క్లయిమాక్స్ ఒకెత్తు. ఆ సన్నివేశంలో సీతారామరాజుకు, రూథర్‌ఫోర్డ్‌కు జరిగిన సంవాదం సంభాషణా రచయిత త్రిపురనేని మహారథి కలం పదనుతో పతాక స్థాయికి వెళ్లింది. విడుదలై ఇన్నేళ్లయినా ప్రతి జెండా పండుగకూ టీవీలో ప్లే అవుతూ తెలుగువారి గుండెలను ఉప్పొంగేలా చేస్తున్న చిత్రమిది. మరువలేని చిత్రం. విశేషాలు: ఈ సినిమా విడుదలయ్యాక దీని ప్రభావంలో పడి దీని తర్వాత విడుదలైన 16 కృష్ణ సినిమాలను ప్రేక్షకులు ఫ్లాప్ చేశారు. ‘పాడిపంటలు’ సినిమాతో గాని మళ్లీ కృష్ణ హిట్ కొట్టలేదు. ఇందులోని పాటలు ‘వస్తాడు నా రాజు ఈ రోజు’, ‘తెలుగు వీర లేవరా’ పెద్ద హిట్. శ్రీ శ్రీ రాసిన తెలుగు వీర లేవరా పాట ఆయనకు జాతీయ పురస్కారం తెచ్చి పెట్టింది. భక్త కన్నప్ప (1976) ‘శ్రీకాళహస్తీశ్వర మహత్యం’ ఎప్పుడూ ప్రజలకు ఆసక్తికరమైనదే. కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్ హీరోగా 1954లో ఈ కథాంశం సినిమాగా వచ్చింది. అయితే బాపు రమణలు దీనిని ఇంకాస్త అందంగా తీర్చిదిద్ది భారీ హంగులతో తీసి ప్రేక్షకులను అలరించారు. కోయవాడైన తిన్నడు శివుడిపై భక్తితో తన రెండు కన్నులు అర్పించపూనుకుని ‘కన్న’ప్పగా మారడం కథ. ఈ గిరిజన కథ సినిమాగా విస్తరించడంలో భాగంగా ఊరు, విలన్‌గా రావు గోపాలరావు రంగప్రవేశం చేస్తారు. కమెడియన్ సారథి ఇందులో ముఖ్యమైన వేషం. వాణిశ్రీ హీరోయిన్గా సినిమాకు గ్లామర్ తేవడం చూస్తాం. సత్యం సంగీతంలో వచ్చిన పాటలు ‘ఎన్నియల్లో ఎన్నియల్లో చందమామ’, ‘ఆకాశం దించాలా’, ‘శివ శివ శంకర భక్తవశంకర’ పెద్ద హిట్. కృష్ణంరాజు స్వయంగా నిర్మించిన ఈ సినిమా ఆయనకు భారీగా లాభాలు తెచ్చి పెట్టింది. విశేషాలు: ‘బెన్–హర్’ సినిమా చూసి అలాంటి సినిమా తీయాలనే కృష్ణంరాజు ఆలోచనకు రూపం ఈ సినిమా అంటారు. ఆ ప్రభావం వల్లే కావచ్చు ఈ సినిమాలో కృష్ణంరాజు–శ్రీధర్ల మధ్య భారీ ఫైట్ ఉంటుంది. అలాగే ‘కండ గెలిచింది’ పాట ‘డ్రమ్స్ పాట’గా చాలా భారీస్థాయిలో తీశారు. దానవీరశూరకర్ణ (1977) అంతవరకూ వచ్చిన పౌరాణికాలను తిరగేసి శూద్రదృష్టితో భారతాన్ని దర్శించి కర్ణుణ్ణి హీరోగా నిలబెట్టి సంచలనం సృష్టించిన సినిమా. నిర్మాతగా, దర్శకుడిగా, నటుడిగా ఎన్.టి.రామారావు సర్వం తానై విశ్వరూపం చూపిన సినిమా ఇది. దాదాపు నాలుగు గంటల నిడివి ఉన్న ఈ సినిమాని 43 రోజులలో పూర్తి చేసినట్టు భోగట్టా. ఇవాళ్టి మేకింగ్‌తో పోల్చితే అదో పెద్ద రికార్డ్ కింద లెక్క. కర్ణుడు దుష్టుడు కాదని అతడు అర్జునుడి కంటే పరాక్రమవంతుడని దురదృష్టకరమైన కారణాల వల్ల, పాండవుల కాపట్యం వల్ల అతడు ఓడిపోయాడని ఈ కథ చెబుతుంది. వీరుడిగా ఓడినా దానగుణంలో అతడిని మించినవాడు లేడని ఈ కథలో చూపించారు. దుర్యోధనుడిగా, కృష్ణుడిగా, కర్ణుడిగా ఎన్.టి.రామారావు త్రిపాత్రాభినయం చేశారు. దుర్యోధనుడికి ఒక డ్యూయెట్ పెట్టవచ్చని, పెట్టినా జనం ఆదరిస్తారని ఎన్.టి.ఆర్ నిరూపించారు. ‘చిత్రం భళారే విచిత్రం’ డ్యూయెట్ ఈ సినిమాలోదే. మహా పండితుడైన కొండవీటి వేంకటకవి తొలిసారి సినీ రచన చేసిన ఈ సినిమాలోని డైలాగులు కేసెట్లుగా రికార్డులుగా వెలువడి వేలకొద్దీ అమ్ముడుపోయాయి. తిరుపతి వేంకటకవుల పద్యాలను కూడా సినిమాలో వీలు వెంబడి ఉపయోగించారు. ఫస్ట్ రన్, సెకండ్ రన్లో కూడా కోట్లు సంపాదించిన సినిమా ఇది. విశేషాలు: ఈ సమయంలోనే సూపర్‌స్టార్ కృష్ణ ఇదే కథాంశంతో ‘కురుక్షేత్రం’ తీశారు. దాంతో ఇండస్ట్రీలో పోటాపోటీ ఏర్పడింది. ఇందులో నటించినవాళ్లు అందులో నటించకూడదు అని రూల్ పెట్టారు. ఒక్క కైకాల సత్యనారాయణే దీని నుంచి మినహాయింపు పొంది రెంటిలోనూ నటించారు. రెండూ ఒకేసారి విడుదలైనా కృష్ణ సినిమా పరాజయం పొంది దానవీరశూరకర్ణ నిలిచి వెలిగింది. అడవిరాముడు (1977) తెలుగు సినిమా కమర్షియల్ వాల్యూస్‌ని తారస్థాయికి తీసుకెళ్లిన సినిమా. 1973లో కన్నడలో రాజ్‌కుమార్ నటించిన ‘గంధదగుడి’ అనే సినిమా విడుదలైంది. ఇది అడవి నేపధ్యంలో సాగుతుంది. అలాగే 1975లో ‘షోలే’ విడుదలైంది. ఈ రెంటి ప్రభావం నిర్మాతలు సత్యనారాయణ, సూర్యనారాయణల మీద అలాగే దర్శకుడు కె.రాఘవేంద్రరావు మీద పడింది. తెలుగులో ఒక భారీ కేన్వాస్ ఉన్న సినిమా తీయాలని నిశ్చయించుకుని ఈ కథల ప్రభావంతో ఒక కథ అల్లుకున్నారు. జంధ్యాల ఈ రచనకు తోడ్పడ్డారు. అంతవరకూ చిన్న సినిమాల హీరోయిన్గా ఉన్న జయప్రద ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన నటించి టాప్‌స్టార్ అయ్యారు. అడవిలో మొదట మారు వేషంలో వచ్చి ఫస్ట్ హాఫ్‌లో ఫారెస్ట్ ఆఫీసర్‌గా వచ్చి సెకండ్ హాఫ్‌లో ఎన్.టి.ఆర్ ప్రేక్షకులను అలరిస్తారు. ఏనుగులు కూడా ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించడం విశేషం. విన్సెంట్ ఫొటోగ్రఫీ, కె.వి.మహదేవన్ సంగీతం, వేటూరి గీత రచన సినిమాకు ఎస్సెట్ అయ్యాయి. నాగభూషణ్ విలన్‌గా ‘చరిత్ర అడక్కు చెప్పేది విను’ డైలాగ్ ఫేమస్. తెలుగులో సంవత్సరం పాటు ఆడిన సినిమాలలో ఇది ఒకటి. విశేషం: ఇందులో ‘ఆరేసుకోబోయి పారేసుకున్నాను’ పాట విని ‘సభ్య సమాజం’లో అనేక మంది హాహాకారాలు చేశారు. పాట స్థాయి దిగజారిందనే విమర్శలు వచ్చాయి. కాని ఆ పాటే పెద్ద హిట్టయ్యి ‘కోటి రూపాయల పాట’గా వాసికెక్కింది. ‘కృషి ఉంటే మనుషులు రుషులవుతారు’, ‘ఎన్నాళ్లకెన్నాళ్లకెన్నాళ్లకు’ తదితర పాటలు కూడా పెద్ద హిట్. శంకరాభరణం (1980) ‘పాశ్చాత్య సంగీతపు పెనుతుపానుకు రెపరెపలాడుతున్న శాస్త్రీయ సంగీతానికి అరచేతులు అడ్డుపెట్టిన’ సినిమా ఇది. తెలుగుదనం కోల్పోయి, నేల విడిచి సాము చేసే కథలతో మూసధోరణిలో కొట్టుకుపోతున్న సినిమా వీపుపై చరిచి ఉలిక్కిపడేలా చేసిన సినిమా. తెలుగు వారికి ఒక సంస్కృతి ఉంది, సంగీతం ఉంది, చక్కటి సంభాషణ కూడా ఉందని ఈ సినిమా చెప్పే ప్రయత్నం చేసింది. ఇది బ్రాహ్మణ నేపథ్యంలో సాగినా భావోద్వేగాలు సకల సమూహాలకు వర్తించి సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. దారిలో పాము ఎదురు పడితే ఎవరైనా కర్రతో కొట్టి చంపుతారు. అదే శంకరుని మెడలో ఉంటే (శంకరుని ఆభరణంగా మారితే) చేతులెత్తి మొక్కుతారు. ఈ సినిమాలో మంజుభార్గవి ఒక దుర్మార్గుడి అత్యాచారం వల్ల గర్భం దాల్చి బిడ్డను కంటుంది. ఒక రకంగా ఆ బిడ్డ పాము. ఆమె ఆ బిడ్డకు శాస్త్రీయ సంగీతం నేర్పించి, శంకరశాస్త్రి దగ్గర శిష్యుడిని చేసి, గొప్ప సంగీతకారుడిగా మార్చి శంకరుని మెడలో ఉన్న ఆభరణం వలే చేస్తుంది. అదే శంకరాభరణం కథ. పాములాంటి తులసి పాత్ర శంకరాభరణంగా మారే ప్రయాణమే ఈ కథ. జె.వి.సోమయాజులు ఈ పాత్ర కోసమే పుట్టారు. దర్శకుడు కె.విశ్వనాథ్ ఈ సినిమాతో తరించారు. విశేషాలు: ఇందులోని పాటలు సంస్కృతంతో నిండినప్పటికీ ఆబాలగోపాలాన్ని ఆకర్షించాయి. రిక్షావాళ్లు కూడా పాడుకున్నారు. ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం ఈ పాటలతోనే జాతీయ అవార్డు పొందారు. ‘శంకరా నాదశరీరాపరా’, ‘రాగం తానం పల్లవి’, ‘బ్రోచే వారెవరురా’... ఈ పాటలు ఇప్పటికీ వినిపించేవే. కరుణామయుడు (1978) అంతవరకూ తెలుగునాట చర్చిలలో ఉన్న క్రీస్తును సినిమా థియేటర్లకు తీసుకువచ్చి ప్రతి మతం వారికి పరిచయం చేసిన సినిమా ‘కరుణామయుడు’. క్రైస్తవం పట్ల ఏమాత్రం అవగాహన లేనివారు కూడా ఈ సినిమా చూసి ఓహో క్రీస్తు కథ ఇదన్నమాట అని తెలుసుకున్నారు. ఎన్.టి.ఆర్ రాముడు, కృష్ణుడు పాత్రలకు ఎలా ప్రసిద్ధమో నటుడు విజయచందర్ ఏసుక్రీస్తు పాత్రకు అలా ప్రసిద్ధమయ్యారు ఈ సినిమాకు. ఇంకోమాట చెప్పాలంటే మత ప్రవక్తలను మొదటిసారిగా తెలుగుతెర మీద తీసుకువచ్చిన సినిమా కూడా ఇది. క్రీస్తు జననం, దైవ కుమారుడిగా ఆయన చూపిన మహిమలు, ఆయనకు శిలువ వేయడం ఈ సినిమాలో వివరంగా ఉన్నాయి. ఆయన చూపిన మహిమలు నీటి మీద శిష్యుల నడక, కుష్టువ్యాధి నయం చేయడం ఇవన్నీ చూసి ప్రేక్షకులు పారవశ్యానికి లోనవుతారు. ఇందులోని మోదుకూరి జాన్సన్ రాసిన ‘కదిలింది కరుణరథం’ పాట చాలా ప్రసిద్ధం. దీనిని చిత్రీకరించేటప్పుడు శిలువ వేసిన విజయచందర్‌ను చూసి జూనియర్ ఆర్టిస్టులు నిజంగానే కన్నీరుమున్నీరు అయ్యారట. కరుణామయుడు విడుదల అయ్యాక కనీవినీ ఎరగని హిట్ అయ్యింది. భారతదేశంలో 14 భాషలలో అనువాదమై ప్రదర్శితమైంది. ఇవాళ్టికి తెలుగువారు క్రిస్మస్ వచ్చిందంటే తలుచుకునే సినిమా ‘కరుణామయుడు’. విశేషం: విడుదలైన మొదటి నాలుగురోజులు ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఐదో రోజు నుంచి విజయదుందుభి మోగించింది. జనం థియేటర్లలో కన్నీరు మున్నీరై చీమిడి చీదుతుండటంతో షోకు షోకు మధ్య కొన్నిచోట్ల హాళ్లను కడగాల్సి వచ్చేది. మా భూమి (1980) తెలంగాణ సాయుధపోరాటం అని చెప్పే తెలంగాణ దేశ్‌ముఖ్‌ల వ్యతిరేక పోరాటాన్ని, తెలంగాణ దొరల నుంచి విముక్తి కోసం ప్రజలు సాగించిన పోరాటాన్ని, భూమి పంపిణీ కోసం చేసిన పోరాటాన్ని వెండితెర మీద సమర్థంగా చూపించిన సినిమా. మరికొన్నాళ్లలో దేశానికి ఒకవైపు స్వాతంత్య్రం సిద్ధించే పరిస్థితులు ఉండగా మరోవైపు నిజాం పాలనలో తెలంగాణ గ్రామాల పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి. గ్రామదొరల పీడన పెరిగింది. దీని నుంచి విముక్తి కోసం కమ్యూనిస్టు పార్టీల ఆధ్వర్యంలో సాయుధ పోరాటం సాగింది. ఇది విజయవంతమై దాదాపు 30 వేల మంది రైతులు వెట్టిచాకిరి నుంచి విముక్తం అయ్యారు. పది లక్షల ఎకరాల భూపంపిణీ జరిగింది. దీన్నంతటినీ ఈ సినిమా చర్చించి చూపిస్తుంది. బి.నర్సింగరావు నిర్మాతకాగ సుప్రసిద్ధ బెంగాలీ దర్శకుడు గౌతం ఘోష్ దీనికి దర్శకత్వం వహించారు. సాయిచంద్, భూపాల్ ముఖ్య తారాగణంగా ఉన్నారు. ప్రఖ్యాత జానపద సంగీతకారిణి వింజమూరి సీత పాటలకు బాణీలు కట్టారు. సుద్దాల హనుమంతు రాసిన ‘పాలబుగ్గల జీతగాడా’, గద్దర్ పాపులర్ చేసిన ‘బండెనక బండి కట్టి’.. ఇందులోనే ఉన్నాయి. మెదక్ జిల్లాలోని చిన్న పల్లెలో కష్టనష్టాలకు ఓర్చి జరిగిన షూటింగ్ ప్రజలే నటీనటులుగా కొనసాగింది. విడుదలయ్యాక ఎన్నో ప్రశంసలకు పాత్రమైన ఈ సినిమా తెలుగులో వచ్చిన ఉత్తమ సినిమాలలో తప్పక ఒకటిగా నిలుస్తుంది. విశేషాలు: ఈ సినిమాకు నటుడు జగ్గయ్య వాయిస్ ఓవర్ ఇచ్చారు. ‘బండెనక బండి కట్టి’ పాటను గద్దర్ స్వయంగా పాడుతూ కనిపిస్తారు. తెలంగాణ నుడికారణం, సామెతలు, అచ్చమైన మాటల ధోరణి ఈ సినిమాలో కనిపిస్తాయి. ప్రేమాభిషేకం (1981) ‘కేన్సర్’ను ఒక విలన్‌గా చేసి కథను రక్తికట్టించే సినిమాలలో ముందు వరుసలో నిలిచే సినిమా. కేన్సర్ బారిన పడిన హీరో తాను ఎంతో గాఢంగా ప్రేమించిన హీరోయిన్ని దుర్భాషలాడి కావాలని దూరం చేసుకుని త్యాగం చేయడం ఈ కథ. పాత ‘దేవదాసు’, ‘ప్రేమనగర్’ కథలు ఈ సినిమా చూస్తుంటే గుర్తుకు వచ్చినా అక్కినేని, శ్రీదేవి, జయుసుధ తదితరుల నటన దర్శకుడు దాసరి నారాయణరావు డైలాగుల మాయాజాలం ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. సినిమా విడుదలయ్యాక కనీ వినీ ఎరగనంత పెద్ద హిట్ అయ్యింది. ‘నా కళ్లు చెబుతున్నాయి నిను ప్రేమించానని’, ‘కోటప్ప కొండకు వస్తానని మొక్కుకున్నా’, ‘వందనం అభివందనం’.., ‘ఆగదు ఏ నిమిషము నీ కోసము’... వంటి పాటలు పెద్ద హిట్ అయ్యాయి. క్లయిమాక్స్‌లో శ్రీదేవితో అక్కినేని ‘ఇవన్నీ ఎందుకు చేశానో తెలుసా... కావాలని కావాలని చేశాను... పగ... వెంజెన్స్’ అని చెప్పిన డైలాగులు రికార్డులుగా అమ్ముడుపోయాయి. మిమిక్రీ ఆర్టిస్టులు ఈ డైలాగును చెప్పి పొట్టపోసుకునేలా చేసిన సినిమా ఇది. విశేషం: ఈ సినిమాలో యువ ప్రేమికుడిగా అక్కినేని నటించే సమయానికి ఆయన వయసు 57. హీరోయిన్గా హైరేంజ్లో ఉన్న జయసుధ ‘వేశ్య’ పాత్రకు ఒప్పుకోవడం అప్పట్లో న్యూస్. దేవత (1982) మహిళా సెంటిమెంట్ కథను కమర్షియల్ హంగులతో చిత్రీకరిస్తే పెద్ద హిట్ అవుతుందని నిరూపించిన సినిమా. గతంలో వచ్చిన ‘పెళ్లికానుక’ (1960) సినిమా దీనికి స్ఫూర్తి అని అభిప్రాయం. శోభన్‌బాబు, శ్రీదేవి, జయప్రద నాటి మూడ్‌కు తగినట్టుగా ఆకర్షణీయంగా నటించి ఆకట్టుకున్నారు. నిర్మలమ్మ, మోహన్‌బాబు, రావు గోపాలరావు ఇతర ముఖ్యపాత్రల్లో వినోదం పంచుతారు. ముఖ్యంగా కామెడీ విలన్‌గా నటించిన మోహన్‌బాబుకు ఈ సినిమా మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇద్దరు అక్కచెల్లెళ్లు ఒకే హీరోని ఇష్టపడి ఒకరి కోసం మరొకరు త్యాగానికి సిద్ధపడటం ఈ కథ. నిర్మాత రామానాయుడుకి కాసులు, దర్శకుడు రాఘవేంద్రరావుకు పేరు తెచ్చి పెట్టింది. సత్యానంద్ రచన చేశారు. విశేషం: ఇందులోని ‘వెల్లువచ్చి గోదారమ్మ’ పాట ‘బిందెల పాట’గా చాలా పాపులర్ అయ్యింది. చిత్రీకర ణలో వందలాది బిందెలు వాడటం వల్ల ప్రేక్షకులు థ్రిల్ ఫీలయ్యారు. ఈ సినిమాను హిందీలో ‘తోఫా’గా రీమేక్ చేస్తే అక్కడా విజయం సాధించింది. ఖైదీ (1983) చిరంజీవిని ‘స్టార్’ను చేసిన సినిమా. ఆయన పూర్తిస్థాయి యాక్షన్ హీరోగా ఈ సినిమాతో మాస్కు చేరువయ్యారు. కొన్ని సినిమాలకు అన్నీ కుదురుతాయన్నట్టు ఈ సినిమాకు చిరంజీవి నటన, ఫైట్స్, పరుచూరి బ్రదర్స్ రచన, చక్రవర్తి సంగీతం, వేటూరి పాటలు, ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వం సరిగ్గా అమరాయి. అప్పట్లో సిల్వర్‌స్టర్ స్టాలెన్ నటించిన ‘ఫస్ట్‌బ్లడ్’ పెద్ద సంచలనం సృష్టించింది. దాని ఆధారంగా కేవలం ఒక్కరోజులో పరుచూరి వెంకటేశ్వరరావు ఈ కథను అల్లారని అంటారు. పెత్తందార్ల దోపిడీ వ్యవస్థపై, వారికి కాపు కాసే చట్ట వ్యవస్థపై తిరుగుబాటు చేసి కలకలం సృష్టించే ‘సూర్యం’గా చిరంజీవి కనిపిస్తారు. మాధవి హీరోయిన్. ఇందులోని పాటల్లో ‘రగులుతుంది మొగలిపొద’ ఆ రోజుల్లో సంచలనం రేపింది. సుమలతతో చేసిన ‘ఇదేమిటబ్బా ఇది అదేను అబ్బా..’ కూడా హిట్టే. విశేషం: ఈ సినిమాలో వచ్చే మొదటి ఫైట్ చాలా ఫేమస్. పోలీస్ స్టేషన్లో తప్పించుకోవ డానికి చిరంజీవి చేసే ఆ ఫైట్‌ను ఇటీవల అలీ మీద పూరి జగన్నాథ్ ‘దేశముదురు’లో తిరిగి యథాతథంగా చిత్రీకరించారు. కోదండ రామిరెడ్డి– చిరంజీవిల జోడి ఈ సినిమాతో కుదిరి ఆ తర్వాత వారి కాంబినేషన్లో 16 సినిమాలు రావడానికి కారణమైంది. మయూరి (1985) వ్యక్తులు జీవించి ఉండగానే వారి ‘బయోపిక్’లు తీయడానికి తెలుగులో అంకురార్పణ చేసిన సినిమా. డాన్సర్ సుధాచంద్రన్ యాక్సిడెంట్లో కాలు పోగొట్టుకున్నా పట్టుదలతో జైపూర్ కాలు అమర్చుకుని డాన్సర్‌గా కొనసాగడం ఉషాకిరణ్‌మూవీస్ అధినేత రామోజీరావుకు నచ్చి ఆ కథను సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో సినిమాగా తీస్తే అది అఖండ విజయం సాధించింది. సాధారణంగా ఒకరి బయోపిక్‌లో మరొకరు నటించడం ఆనవాయితీ. కానీ ఈ సినిమాలో సుధాచంద్రన్ తన పాత్రను తానే ధరించారు. గణేశ్ పాత్రో రచన, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం సంగీతం, వై.విజయ, నిర్మలమ్మ, పి.ఎల్.నారాయణ, ముక్కురాజు తదితరుల సపోర్టింగ్ ఈ సినిమాకు లాభించాయి. కాలో చేయో కోల్పోతే జీవితమే వృథా అని భావించే మనోస్థితి ఉన్న ఆ రోజుల్లో అటువంటివారిలో నిజానికి వేల మందిలో స్థయిరాన్ని నింపిన సినిమా ఇది. ఇందులోని పాటలు ‘ఈ పాదం ఇలలోని నాట్య వేదం’, ‘మౌనం గానం మధురం మంత్రాక్షరం’, ‘ఇది నా ప్రియనర్తన వేళ’ పాటలు బాగుంటాయి. విశేషం: ఈ సినిమాను తమిళంలో బాలసుబ్రహ్మణ్యం అనువాదం చేయగా తమిళనాడులో అదే వర్షన్ కేరళలో కూడా హిట్ అయ్యింది. హిందీలో రీమేక్ చేయగా ‘నాచె మయూరి’గా హిట్ అయ్యింది. ఈ స్ఫూర్తితో ఇలాంటి నిజ జీవిత కథలతో ఈ సంస్థ ఆ తర్వాతి రోజులలో ‘మౌన పోరాటం’, ‘అశ్వినీ’ సినిమాలు నిర్మించింది. ఎర్రమల్లెలు (1981) తెలంగాణ గ్రామాలలో దొరల పీడన ఉంటే ఆంధ్ర గ్రామాలలో పెత్తందార్ల పీడన అధికం. సర్పంచ్‌లు, మునసుబులు, ప్రెసిడెంట్లు... వీళ్లకు తోడు అప్పుడప్పుడే తలెత్తుతున్న పారిశ్రామికవేత్తలు ఇటు కార్మికులను, అటు కర్షకులను పీక్కు తినడం కొనసాగించారు. కార్మికులు, కర్షకులు ఏకమై ఈ విష వ్యవస్థను పెళ్లగించి ఆదర్శనీయమైన వ్యవస్థను సృష్టించుకోవాలనే లక్ష్యాన్ని వ్యక్తం చేసే సినిమా ‘ఎర్రమల్లెలు’. భార్యకు పూలు తీసుకువెళుతున్న కార్మిక నాయకుడు మురళీమోహన్ను ఫ్యాక్టరీ గూండాలు అడ్డగించి చంపడంతో ఆ పూలు రక్తసిక్తం అవుతాయి. అది చూసి ఊరంతా తిరగబడుతుంది. పూలే కాదు మనుషులూ తిరగబడాలని విప్లవ పంథాలో ఎర్రబడాలని సంకేతం. రంగనాథ్, సాయిచంద్, ‘అన్న’ వెంకటేశ్వర్లు, పి.ఎల్.నారాయణ ప్రధాన పాత్రలు పోషించారు. మాదాల రంగారావు రెబల్‌గా కనిపించి ఉత్తేజం కలిగిస్తారు. దర్శకుడిగా ధవళ సత్యంకు ఈ సినిమా పేరు తెచ్చి పెట్టింది. ‘నాంపల్లి టేషనుకాడి రాజాలింగో’, ‘హే.. లగ్జిగ్లంబాడి’... పాటలు ఈ సినిమాలోనివే. విశేషం: అప్పటికి ఇంకా పాపులర్ కాని సుత్తి వీరభద్రరావు ఇందులో లాయర్‌గా ముఖ్యపాత్రలో కనిపిస్తారు. అలాగే అప్పటికి ఇంకా దర్శకుడిగా మారని టి.కృష్ణ కూడా ఈ సినిమాలో ఒక పాత్రను, నిర్మాత పోకూరి బాబూరావు మరో పాత్రను పోషించారు. ప్రతిఘటన (1985) ఉషాకిరణ్ మూవీస్ సంస్థకు, దర్శకుడు టి.కృష్ణకు, నటి విజయశాంతికి విశేషమైన కీర్తి సంపాదించిపెట్టిన చిత్రం. అంత వరకూ చిన్న సినిమాలు చేస్తూ వచ్చిన టి.కృష్ణ ఈ సినిమాతో టాప్ డైరెక్టర్‌గా గుర్తింపు పొందారు. 80లలో కొన్ని టౌన్లలో పెచ్చరిల్లిన రౌడీయిజంను, ఆ రౌడీయిజంను అడ్డు పెట్టుకుని ఊరేగుతున్న రాజకీయ వ్యవస్థను కథాంశంగా తీసుకుని దానిని తుద ముట్టించే రెబల్ క్యారెక్టర్లో ఒక లెక్చరర్ పాత్రను పెట్టి ప్రేక్షకులలో గొప్ప ఎఫెక్ట్ సాధించారు. సినిమా విడుదలయ్యాక చాలామంది ఇది పలానా ఊరు కథ అంటే పలానావారి కథ అని అనుకున్నారు. ఎం.వి.ఎస్.హరనాథరావు మాటలు, వేటూరి పాటలు కూడా ఈ సినిమాకు ప్లస్ అయ్యాయి. అన్యాయాన్ని ఎదిరించే హీరోయిన్ను నడిరోడ్డు మీద వస్త్రాపహరణ చేస్తే ఆ తర్వాత సన్నివేశంలో స్టూడెంట్స్ అంతా ఆ విషయాన్ని గేలి చేస్తారు. అప్పుడు హీరోయిన్ పాడిన ‘ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీతీ లోకంలో’ పాట గొప్ప ఉద్వేగాన్ని కలిగిస్తుంది. క్లయిమాక్స్‌లో విలన్‌ను హీరోయిన్ గండ్రగొడ్డలితో నరికే సన్నివేశం కూడా. సినిమా విడుదలయ్యాక జనం తండోపతండాలుగా చూశారు. తమిళంలో, మలయాళంలో డబ్ అయితే అక్కడా విపరీతంగా చూశారు. సిప్పీలకు ‘షోలే’లా ఉషాకిరణ్ మూవీస్‌కు విపరీతంగా డబ్బు సంపాదించి ఇచ్చిన సినిమా ప్రతిఘటన. విశేషం: ఈ సినిమాలో తెలంగాణ యాస మాట్లాడి కోట శ్రీనివాసరావు మొదటిసారిగా జనం దృష్టిలో పడ్డారు. ఈ సినిమా తమిళంలో చూసిన కోయంబత్తూరు రౌడీలు ఇది మా కథే అని గొడవ చేశారు. సుత్తి వేలు ఈ సినిమాలో పిచ్చి కానిస్టేబుల్‌గా నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. స్వాతిముత్యం (1986) తెలివి మీరిపోయిన మనిషికి ఇన్నోసెన్స్ అనేదానిని గుర్తు చేసి స్వచ్ఛతతో ఉండటమే మనిషి ప్రాధమిక లక్షణమని తెలియచేసిన సినిమా. అమాయకత్వం అనేది దేవునికి సన్నిహితంగా ఉండేది, దానికి మొదట అపజయం కలిగినా అంతిమంగా దానికి మేలే జరుగుతుంది అని ఈ సినిమా చెబుతుంది. ఇందులో ‘స్వాతిముత్యం’గా కమలహాసన్ నటించి ‘మీరు కపటంతో కష్టపడి బతకండి. నేను అమాయకత్వంతో హాయిగా బతుకుతాను’ అని నిరూపిస్తాడు. మానసిక ఎదుగుదల సరిగా లేని కమలహాసన్ భర్తను కోల్పోయిన భార్య రాధికకు అండగా నిలిచి ఆమె జీవితానికి అర్థం కల్పించడం కథ. కె.విశ్వనాథ్ దర్శకత్వంలో కమల్ ‘సాగర సంగమం’ ఎంత పెద్ద హిట్ అయిందో స్వాతిముత్యం కూడా అంతే హిట్ అయ్యింది. ఇళయరాజా సంగీతం, సి.నారాయణరెడ్డి సాహిత్యం కలసి వచ్చాయి. ‘సువ్వీ సువ్వీ సువ్వాలమ్మ’, ‘వటపత్రశాయికి వరహాల లాలి’, ‘రామా కనవేమిరా’... పాటలన్నీ హిట్. నిర్మలమ్మ, సుత్తి వీరభద్రరావు, గొల్లపూడి, జె.వి.సోమయాజులు ఇతర ముఖ్యపాత్రల్లో కనిపిస్తారు. విశేషాలు: ఇందులో కమలహాసన్ చేయి పైకెత్తి వీపు వెనుగ్గా తీసుకెళ్లి కొట్టినట్టుగా చేసే మేనరిజం హిట్ అయ్యింది. అలాగే ఉద్యోగం ఇప్పిస్తానని మాటవరుసకు జె.వి. సోమయాజులు అంటే రేయింబవళ్లు ఆయన వెంట కమలహాసన్ పడటం తెలుగునాట స్థిరపడి ‘స్వాతిముత్యంలో కమలహాసన్‌లా వెంటపడ్డావేమిటిరా’ అనే జాతీయంలా వాడుకలోకి వచ్చింది. అహ నా పెళ్లంట (1987) గతంలో రామానాయుడుకి ‘ప్రేమనగర్’ సినిమా ఎంత మేలు చేసిందో ఆ తర్వాత ‘అహ నా పెళ్లంట’ సినిమా అంత మేలు చేసింది. ‘నా రామానాయుడు స్టుడియో నిర్మాణానికి దీని లాభాలు ఉపయోగపడ్డాయి’ అని రామానాయుడు చెప్పుకున్నారు. జంధ్యాల దర్శకత్వంలో రాజేంద్రప్రసాద్ హీరోగా రజనీ హీరోయిన్గా నటించిన ఈ సినిమా ఆంధ్రదేశమంతా నవ్వులు పువ్వులు పూయించింది. పరమ ఘోరమైన పిసినారిగా కోట శ్రీనివాసరావు ఈ సినిమాలో కనిపిస్తారు. ‘నాకేంటి’ అనే మేనరిజం ఫేమస్. పేపర్ని లుంగీలా చుట్టుకోవడాలు, పారేసిన అగ్గిపుల్లల్ని వంట చెరుకుగా వాడుకోవడాలు, కోడిని వేలాడగట్టి దానిని చూస్తు కోడి కూర తింటున్నట్టుగా ఫీలవడాలు ఈ సినిమాలు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించాయి. బ్రహ్మానందం ‘అరగుండు బ్రహ్మానందం’గా ఈ సినిమాతోనే ఫేమస్ అయ్యారు. విశేషం: 16 లక్షలు పెట్టి తీస్తే దాదాపు 5 కోట్ల రూపాయలు వసూలు చేసిన సినిమా ఇది. దీనిని తమిళంలో భాగ్యరాజా, హిందీలో అనిల్‌కపూర్ రీమేక్ చేద్దామనుకున్నారు కాని ఎందుకనో కుదర్లేదు. ఇందులో ఒక పాటను రేడియో జింగిల్స్‌తో కలిపి ఉపయోగించడం మరో హాస్యప్రయోగంగా చేప్పుకోవచ్చు. గీతాంజలి (1989) మణిరత్నం నేరుగా తెలుగులో తొలిసారి దర్శకత్వం వహించిన సినిమా. దృశ్య ప్రధానంగా కథ చెప్తే ప్రేక్షకులకు నిరూపించిన సినిమా. భావుకత్వంతో తీసిన సినిమా అని చెప్పుకోవచ్చు. సాధారణంగా హీరోకో హీరోయిన్‌కో కేన్సర్ ఉండే కథలు ఉంటాయి. కాని ఇందులో హీరోతో పాటు హీరోయిన్‌కూ కేన్సర్ ఉంటుంది. ఇద్దరూ ఒకరికొకరు పరిచయమై ఒకరి జబ్బు గురించి మరొకరు దాచిపెట్టి ప్రేమలో పడతారు. చివరకు ఒకరి పరిస్థితి మరొకరికి తెలిసినా ప్రేమను వదిలేది లేదనీ బతికినంతకాలం ప్రేమించుకుంటూ సంతోషంగా ఉంటామని అనుకోవడంతో కథ ముగుస్తుంది. నాగార్జున, గిరిజల నటన, పి.సి.శ్రీరామ్ కెమెరా పనితనం, ఇళయరాజా సంగీతం, వేటూరి పాటలు గొప్పగా ఉంటాయి. ‘లేచిపోదామన్న మొనగాడా ఎక్కడున్నావ్’ అనే డైలాగ్ ఫేమస్. ఇందులోని ‘ఒళ్లంత కవ్వింత కావాలిలే’ పాట పూర్తి స్లో మోహన్లో ఉంటే, ‘ఓం నమః నయన శృతులకు’ పాట రౌండ్ ట్రాలీలో ఒకే షాట్‌గా పిక్చరైజ్ చేశారు. ‘ఓ ప్రియా ప్రియా’, ‘ఓ పాపా లాలీ’ పాటలు కూడా పెద్ద హిట్. తెలుగులో వచ్చిన మంచి ప్రేమకథలను ఎంచాలనుకున్నప్పుడు తప్పనిసరిగా గుర్తుకు వచ్చే సినిమా యువత మెచ్చిన సినిమా గీతాంజలి. విశేషం: ఇందులో నటించిన గిరిజ ఆ తర్వాత ‘హృదయాంజలి’ అనే సినిమా చేసి సినిమాల నుంచి విరమించుకున్నారు. మణిరత్నం దీని తర్వాత తెలుగులో మళ్లీ దర్శకత్వం వహించలేదు. అప్పటికి డబ్బింగ్ రైటర్‌గా క్రేజ్‌లో ఉన్న రాజశ్రీ దీనికి మాటలు రాయడం విశేషం. కళ్లు (1988) గొల్లపూడి మారుతీరావు రాసిన ప్రసిద్ధ నాటకం ‘కళ్లు’ ఆధారంగా ఇది సినిమాగా రూపాంతరం చెంది ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోవడమే కాక పారలల్ సినిమాలకు తెలుగులో ఆదరణ ఉంటుంది అని నిరూపించింది. ఐదుగురు గుడ్డివాళ్ల కథ ఇది. అందులో మిగిలిన నలుగురు కష్టపడి ఒకతనికి కళ్లు తెప్పిస్తే అతడు లోకం పోకడలో పడి ఘోరమైన మనిషిగా తయారవుతాడు. కళ్లుండి పతనం కావడం కంటే కళ్లు లేకుండా ఉత్తమంగా జీవించడం మేలు అని భావించిన ఆ నలుగురు గుడ్డివాళ్లు ఎవరికైతే తాము కళ్లు తెప్పించారో అతడి కనుగుడ్లు పీకేస్తారు. ఈ కథను దర్శకుడు, సినిమాటోగ్రాఫర్ అయిన ఎం.వి.రఘు ఎంతో రియలిస్టిక్‌గా దాదాపు కొత్త తారాగణంతో తీసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. గుడ్డి బిచ్చగాళ్లుగా ఇందులో శివాజీరాజా, భిక్షు, రాజేశ్వరి తదితరులు నటించారు. ఎస్.పి.బాలసుబ్రహ్మాణ్యం సంగీతం అందించారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి ఇందులో ‘తెల్లారింది లెగండో కొక్కరొక్కో’ పాట స్వయంగా పాడారు. విశాఖలో పూర్తి ఔట్‌డోర్‌లో తీసిన ఈ సినిమా ఇవాళ్టికీ కొత్తగా ఉంటుంది. విశేషం: కమెడియన్ చిదంబరం ఈ సినిమాలో యాక్ట్ చేసి ‘కళ్లు’ చిదంబరం అయ్యారు. నటుడు కొండవలస కూడా ఈ సినిమాలో మొదటిసారి వేషం కట్టారు. ఇందులో హీరో చిరంజీవి పాత్ర అంతర్లీనంగా ఉంటుంది. అది తెర మీద కనిపించకపోయినా వినిపిస్తుంది. దానికి చిరంజీవే డబ్బింగ్ చెప్పారు. శివ (1989) తెలుగు సినిమా చరిత్ర ఈ సినిమాకు ముందు ఈ సినిమాకు తర్వాతగా విభజించబడింది. టేకింగ్, మేకింగ్, సౌండ్, క్యారెక్టర్ బిహేవియర్ వీటన్నింటినీ సమూలంగా మార్చిన సినిమా ఇది. యువతలో హింసా ప్రవృత్తిని రెచ్చగొట్టేలా ఉంది అనే విమర్శలు వస్తే వాటిని దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ కొట్టి పారేసినా ఆ రోజుల్లో చాలామంది కుర్రాళ్లు సైకిల్ చైన్లతో ఫొటోలు దిగిన మాట వాస్తవం. అప్పటికి ఇంకా కాలేజీలలో బ్యాన్ కాని ఎలక్షన్లు, వాటి మీద పెత్తనం చేయాలని చూసే రౌడీలు, వాళ్ల మీద అధికారం చలాయించే రాజకీయ నాయకులు... ఈ సైకిల్‌ను ఈ సినిమా బాగా పట్టుకుంది. నాగార్జునకు ఎంత పేరు వచ్చిందో విలన్‌గా రఘువరన్‌కు అంతే పేరు తెచ్చి పెట్టింది. ఒక కొత్త దర్శకుడు తన మొదటి సినిమాను ఇంత బాగా తీయగలగడం, దానిని ఇంత పెద్ద హిట్ చేయగలగడం ఆ రోజుల్లో సంచలనం అయ్యింది. అమల, తనికెళ్ల భరణి, సాయిచంద్, శుభలేఖ సుధాకర్ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. ‘బోటనీ పాఠముంది మేటనీ ఆట ఉంది’, ‘సరసాలు చాలు శ్రీవారు’ పాటలు హిట్. విశేషం: నటుడు చిన్నా ఈ సినిమాతోనే గుర్తింపు పొందారు. స్టడీ కామ్ కెమెరా ఈ సినిమాతోనే ఇండస్ట్రీకి తెలిసింది. ఆడియోగ్రఫీ చాలా ముఖ్యమైనది అని ఈ సినిమాలో మొదటి టైటిల్ కార్డ్‌గా వేయడం ద్వారా వర్మ ఒక కొత్త ఒరవడి దిద్దారు. కర్తవ్యం (1990) ఒక హీరోయిన్ను హీరో ఇమేజ్ స్థాయికి తీసుకెళ్లిన సినిమా. నటి విజయశాంతి ఈ సినిమాలో నటించాక ఆమె పేరుకు ముందు ‘లేడీ అమితాబ్’ అని బిరుదు పెట్టడం మొదలైంది. అప్పట్లో దేశమంతా గుర్తింపు పొందిన లేడీ ఐ.పి.ఎస్ ఆఫీసర్ కిరణ్ బేడీ స్ఫూర్తితో ఈ కథను అల్లుకున్నారు. ఒక రేప్ విక్టిమ్‌కు న్యాయం చేయడం కోసం విలన్‌తో హీరోయిన్ తలపడటం ఈ కథ. ఆ రోజులలో జరిగిన అనేక సంఘటనలను రచయితలు పరుచూరి బ్రదర్స్ సినిమాలో అందంగా ఇమిడ్చారు. దర్శకుడు మోహన్ గాంధీ, నిర్మాత ఎ.ఎం.రత్నం ఈ సినిమాతో పెద్ద పేరు సంపాదించారు. వినోద్ కుమార్, పరుచూరి వెంకటేశ్వరరావు ఇతర పాత్రలు పోషించారు. అప్పటికి ఇంకా ఫేమ్‌లోకి రాని మీనా ఇందులో రేప్ విక్టిమ్గా నటించింది. ‘మీ ఇంట్లో ఉప్మా తిన్నాను. నాతో ఉపకారం చేయించుకోమ్మా’లాంటి డైలాగులు బాగా పేలాయి. విశేషం: నిర్మాత పుండరీకాక్షయ్య ఈ సినిమాలో విలన్ వేషం వేశారు. అది బాగా సక్సెస్ అయ్యింది. ఇందులో హీరోయిన్ కాళ్లు విరగ్గొడితే ఆమె మళ్లీ ఫిజికల్‌గా ఫిట్ కావడానికి అప్పట్లో నిజంగానే కాళ్లు పోగొట్టుకున్న నూతన్‌ప్రసాద్ ఒక పాత్రగా ఉత్తేజం ఇవ్వడం కనిపిస్తుంది. తమిళంలో డబ్ అయ్యి పెద్ద హిట్ అయిన ఈ సినిమాని హిందీలో ‘తేజస్విని’ పేరుతో రీమేక్ చేశారు. జగదేకవీరుడు అతిలోక సుందరి (1990) లంకేశ్వరుడు, స్టేట్ రౌడీ, రుద్రనేత్ర, రాజా విక్రమార్క... ఈ సినిమాల పరాజయం నుంచి 1990లో విడుదలైన ‘కొండవీటి దొంగ’ ఓ మోస్తరుగా చిరంజీవిని గట్టున పడేస్తే ఆ తర్వాత విడుదలైన ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ చిరంజీవిని తిరిగి స్టార్డమ్లోకి తీసుకెళ్లింది. సోషియో ఫాంటసీ సబ్జెక్ట్ కావడం, శ్రీదేవి తోడుగా నిలవటం, రాఘవేంద్రరావు దర్శకత్వం, అశ్వినీదత్ భారీ నిర్మాణం, ఇళయరాజా పాటలు ఇలా అన్నీ కలిసొచ్చి సినిమాను ఎక్కడికో తీసుకెళ్లాయి. ఆబాలగోపాలం మెచ్చిన సినిమాగా నిలిచి కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇంద్రుడి కూతురు భూలోకం వచ్చి మానవుణ్ణి మనువాడటం కథ. దీనికి కమర్షియల్ హంగులన్నీ తోడయ్యాయి. అమ్రిష్పురీ విలనీ జనానికి నచ్చింది. ‘మానవా’, ‘తింగరబుచ్చి’ వంటి డైలాగులు హిట్ అయ్యాయి. ఇక ‘అబ్బ నీ తియ్యనీ దెబ్బ’ పాట ఒక ఊపు ఊపింది. చిరంజీవి అభిమానులను పులకింతలకు గురిచేసిన సినిమా నేటికీ టీవీలో జై చిరంజీవా అంటూ ప్రదర్శితమవుతూనే ఉంది. విశేషాలు: మే 9న ఈ సినిమా విడుదలైనప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో తుఫాన్ కొట్టింది. భారీ వర్షాలకు అంతా అతలాకుతలమైపోయింది. చాలా థియేటర్లకు కరెంట్ లేదు. అయినప్పటికీ సినిమా జనరేటర్ల మీదే బంపర్ కలెక్షన్లతో ఆడింది. ‘అబ్బ నీ తియ్యనీ దెబ్బ’ ట్యూన్‌ను హిందీలో అనిల్ కపూర్ ‘బేటా’కు వాడితే సినిమా పెద్ద హిట్ అయ్యింది. అదే పాటకు ‘శివాజీ’లో రజనీకాంత్ స్టెప్పులేయడం ఒక మురిపమైన జ్ఞాపకమే. బొబ్బిలిరాజా (1990) వెంకటేశ్‌కు స్టార్డమ్ తెచ్చి అతణ్ణి పెద్ద హీరోల సరసన నిలిపిన సినిమా. ‘గాడ్స్ మస్ట్ బీ క్రేజీ’ సినిమాలోని కొన్ని సన్నివేశాలనీ మామూలు ఫార్ములా కథనీ కలిపి పరుచూరి బ్రదర్స్ ఈ రెసిపీ తయారు చేస్తే దర్శకుడు బి.గోపాల్ దాని ఆధారంగా చక్కటి వంట వండి ప్రేక్షకుల చేత లొట్టలు వేయించేలా చేశారు. హీరోయిన్ దివ్యభారతికి ఇదే మొదటి సినిమా. దీని తర్వాత ఆమె టాప్ హీరోయిన్ అయ్యి అందరు పెద్ద హీరోల సరసనా నటించింది. వాణిశ్రీ ఇందులో అటవీశాఖ మంత్రిగా నటిస్తూ ‘రాష్ట్రాన్నైనా రాసిస్తాను గానీ’ అని చెప్పే ఊత డైలాగుతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఫస్ట్ హాఫ్‌లో అడవి అందాలు, సెకండ్‌హాఫ్‌లో నంద్యాల సమీపంలో రైల్వే ట్రాక్ మీద తీసిన క్లయిమాక్స్ సినిమాకు ప్లస్ అయ్యాయి. అంత వరకూ క్లాస్ పాటలు రాస్తారని పేరుబడ్డ సిరివెన్నెల ఈ సినిమాలో ‘బలపం పట్టి భామ బళ్లో’... రాసి కమర్షియల్ రైటర్‌గా మారారు. ఇళయరాజా చేసిన పాటలన్నీ కుర్రకారును అలరించాయి. వెంకటేశ్ కెరీర్లో తొలి సిల్వర్ జూబ్లీ హిట్ బొబ్బిలి రాజా. విశేషం: ఈ సినిమా హైదరాబాద్ సుదర్శన్‌లో డైరెక్టుగా 200 రోజులు ఆడింది. దివ్యభారతి ఫస్ట్‌హాఫ్ అంతా కేవలం పై ఆచ్ఛాదనగా ఒక షర్ట్‌తో కనిపించినా అశ్లీలత అనే అపవాదు రాలేదు. సీతారామయ్యగారి మనవరాలు (1991) యాక్షన్ సినిమాల దూకుడులో కూడా తెలుగు ప్రేక్షకులు కుటుంబ కథా చిత్రాలను ఆదరిస్తారు అని నిరూపించిన చిత్రం. మానవ సంబంధాలు, కుటుంబ అనుబంధాలు ఎప్పటికీ గొప్ప కథాంశమే అని ఈ సినిమా చెప్పింది. తాతా మనవడు కథాంశంతో ఇంతకు ముందు కథలు వచ్చినా తాతా మనవరాలు మధ్య ఉన్న అనుబంధాన్ని ఈ సినిమా చూపించింది. రచయిత మానస రాసిన ‘నవ్వినా కన్నీళ్లే’ అనే నవల ఆధారంగా రచయిత గణేశ్ పాత్రో స్క్రిప్ట్ రాస్తే, నిర్మాత దొరస్వామి రాజు దర్శకుడు క్రాంతి కుమార్ ద్వారా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. మొదటి రెండు వారాలు ఫ్లాప్ టాక్ తెచ్చుకుని మూడో వారం నుంచి కలెక్షన్లు అందుకుని 200 రోజులు ఆడిన సినిమా ఇది. తాతగా అక్కినేని నాగేశ్వరరావు విగ్ లేకుండా ఈ సినిమాలో నటించడం విశేషం. మనవరాలిగా నటించిన మీనా ఈ సినిమాతో కాబోయే స్టార్‌ని అని నిరూపించింది. నానమ్మగా నటించిన రోహిణి హట్టంగడి తెలుగు ప్రేక్షకులకు కొత్త అయినా ఆమెను వారు అభిమానించారు. గోదావరి ఒడ్డున అందమైన పల్లెటూళ్ల నడుమ తీసిన ఈ సినిమా అచ్చమైన తెలుగుదనంతో ఇప్పటికీ అలరిస్తూనే ఉంది. విశేషం: కీరవాణికి పేరు తెచ్చి పెట్టిన ‘పూసింది పూసింది పున్నాగ’ పాట ఇందులోదే. దీనిని హిందీలో ‘ఉధార్ కి జిందగీ’ అని రీమేక్ చేసే కాజోల్ మనవరాలి వేషం వేసింది. కన్నడ రీమేక్‌లో మాలశ్రీ, మలయాళ రీమేక్‌లో మళ్లీ మీనాయే నటించారు. తాతకు షష్టిపూర్తి మనవరాలు నిర్వహించడం ఈ సినిమా విశేషం. ఆదిత్య 369 (1991) టైమ్ మిషన్ అనే కాన్సెప్ట్‌ని, కాలంతో పాటు ప్రయాణించడం అనే ఊహని, భూత భవిష్యత్ కాలాల్లో హీరో కథకు అంతరాయం కలిగించడం అనే కల్పనని చేయడమే కాక సినిమాగా తీసి హిట్ చేయడం కచ్చితంగా తెలుగువారి సినీ చరిత్రలో ఒక విశేషం. దర్శకుడు సింగీతం శ్రీనివాసరావుకు, నిర్మాత కృష్ణప్రసాద్‌కు, హీరో బాలకృష్ణకు ఈ క్రెడిట్ దక్కుతుంది. సామాన్యుడికి కూడా సులభంగా అర్థమయ్యేలా టైమ్ ట్రావెల్‌ను తీసి అందులో మనవారు ఐడెంటిఫై అయ్యే రాయలవారి ఎపిసోడ్ పెట్టి కలెక్షన్లను రాబట్టగలిగాడు దర్శకుడు. దీని తర్వాత తెలుగులో ఇలాంటి సినిమా రాలేదని చెప్పొచ్చు. అందుకే దీని సీక్వెల్ కోసం ఇప్పటికీ జనం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మోహిని, టీనూ ఆనంద్, సుత్తివేలు, సిల్క్ స్మిత ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. భూతకాలంలోకి ప్రయాణించిన బాలకృష్ణ రాయలవారి సభలో తెనాలి రామకృష్ణకవి కంటే ముందే ఆయన పద్యాలు చెప్పడం థ్రిల్లింగ్‌గా ఉంటుంది. ఇళయరాజా సంగీతం వహించిన ఈ సినిమాలో జిక్కి పాడిన ‘జాణవులే నెర జాణవులే’ పాట హిట్. విశేషం: ముగ్గురు సీనియర్ ఫొటోగ్రాఫర్లు పి.సి.శ్రీరామ్, వి.ఎస్.ఆర్.స్వామి, కబీర్‌లాల్ పని చేసిన సినిమా ఇది. తాను డైలాగ్ స్పీడ్‌గా చెప్తాననే అపవాదును శ్రీకృష్ణదేవరాయలు పాత్రకు హుందాగా డైలాగులు చెప్పడం ద్వారా బాలకృష్ణ పోగొట్టుకోగలిగారు. తమిళంలో ‘అపూర్వశక్తి 369’ అని డబ్ అయి ఈ సినిమా అక్కడా విజయం సాధించింది. భైరవ ద్వీపం (1994) జానపదాలు ఇక తెలుగు సినిమాల్లో కనిపించవు అని అనుకుంటున్నప్పుడు, అది కాలం చెల్లిన జానర్ అని అంతా అనుకుంటున్నప్పుడు తిరిగి తెలుగు తెర మీద జానపదాలను సజీవం చేసి సూపర్ డూపర్ హిట్ అయిన సినిమా ‘భైరవ ద్వీపం’. ఒకప్పుడు ‘పాతాళభైరవి’, ‘జగదేకవీరుని కథ’ వంటి క్లాసిక్స్ జానపదాలు తీసిన విజయా ప్రొడక్షన్స్ వారసులు ‘విజయ చందమామ కంబైన్స్’ పతాకం మీద ఈ సినిమా తీసి ఆ పరంపరకు కొనసాగింపు ఉంది అన్న నమ్మకం కలిగించారు. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం, నటుడు రావి కొండలరావు రచనానుభవం సినిమాకు విశేషంగా పనికొచ్చాయి. అవన్నీ అలా ఉంచి తెలుగులో ఎన్టీఆర్ తర్వాత జానపద కథానాయకుడు తానే అని బాలకృష్ణ ఈ సినిమాతో నిరూపించుకున్నారు. రాకుమారునిగా, వీరునిగా, ప్రేమికునిగా చెలరేగి నటించారని చెప్పాలి. రోజా, కె.ఆర్.విజయ, బాబూ మోహన్ తదితరుల పాత్రలు రాణించాయి. మాధవపెద్ది సురేశ్ సంగీతం చాలా పేరు తెచ్చుకుంది. ‘విరిసినది వసంతగానం, ‘నరుడా ఓ నరుడా’, ‘శ్రీ తుంబుర నారద గానామృతం’, ‘ఘాటైన ప్రేమ ఘటన’ పాటలన్నీ హిట్. మాయలు, మంత్రాలు, గుర్రాలు, సాహసాలు... ఇవన్నీ నిండిన ఈ సినిమా సిసలైన తెలుగు కాలక్షేపం. హాౖయెన వినోద సమ్మేళనం. విశేషం: ఈ సినిమాలో ‘లిల్లీపుట్‘లను పోలిన మరుగుజ్జులను చూపిస్తారు. అది పిల్లలకు సరదగా అనిపిస్తుంది. ఏ హీరో కూడా చేయడానికి అంగీకరించని కురూపి వేషంలో బాలకృష్ణ కనిపిస్తారు. శాపవశాత్తు అలా మారే సన్నివేశం అది. అన్నట్టు ఈ సినిమాలో మాంత్రికుడుగా కనిపించినది ఎనభైయ్యవ దశకంలో రౌడీ వేషాలు విస్తృతంగా వేసిన రంగరాజా. కాని మధ్యలో గ్యాప్ తీసుకుని మలయాళంలో విలన్‌గా చేసి ఈ పెద్ద ఆఫర్‌ను చేజిక్కించుకున్నాడు. నిన్నే పెళ్లాడతా (1996) 1994లో సూరజ్ భరజ్యాతా ‘హమ్ ఆప్కే హై కౌన్’ వచ్చింది. మనుషులు కలసి కబుర్లు చెప్పుకుంటూ ఒకరి పట్ల ఒకరు ప్రేమ, ఆప్యాయత ప్రదర్శిస్తూ, సరదాగా ఉండటం కథ. ఇలా ఎవరూ ఉండరు. కాని ఇలా ఉంటే బాగుండు అనే కోరిక అందరికీ ఉంటుంది. దానిని స్క్రీన్ మీద చూపించడంతో తమ జీవితంలో లేనిది కనీసం తెర మీద అయినా చూసి ఆనందిద్దాం అనే భావనతో ఆ సినిమాను సూపర్‌డూపర్ హిట్ చేశారు జనం. దాని ఇన్స్పిరేషన్తో తెలుగులో కాపీలా కాకుండా పూర్తి నేటివిటీతో వచ్చి అంతే హిట్ అయిన సినిమా ‘నిన్నే పెళ్లాడతా’. కృష్ణవంశీ, నాగార్జునల ఇమేజ్ను ఎక్కడికో తీసుకుపోయిన సినిమా ఇది. రెండు కుటుంబాల మధ్యన స్నేహం, రెండు బంధుత్వాల మధ్య ప్రేమ... ఈ చిన్న పాయింట్‌ను చాలా ఫ్రెష్ సన్నివేశాలతో నేరేట్ చేసుకుంటూ పోయి పెద్ద సక్సెస్ సాధించాడు దర్శకుడు. నాగార్జున, టబూ, చలపతిరావు, చంద్రమోహన్, లక్ష్మి... అందరికీ సినిమాతో పేరు వచ్చింది. దీని వరుసలో చాలా సినిమాలే వచ్చినా ఈ మేజిక్ పునరావృతం కాలేదనే చెప్పాలి. విశేషాలు: ఇందులో టబూకు ‘పండు’ అనే నిక్‌నేమ్ ఉండటం ఆంధ్రదేశానికి నచ్చింది. ‘గ్రీకువీరుడు’... పాటతో అందగాడంటే గ్రీకువీరుడులా ఉండాలనే భావన తెలుగు నాట స్థిరపడింది. అంతవరకు నెగెటివ్ రోల్స్ చేస్తున్న చలపతిరావుకు ఈ సినిమా వంద సినిమాల మైలేజ్‌ను ఇచ్చింది. ‘ఎటో వెళ్లిపోయింది మనసు’ ఇందులో మరో హిట్ పాట. యమలీల (1994) ఎన్టీఆర్ హీరోగా 1977లో ‘యమగోల’ విడుదలైంది. అది వచ్చిన దాదాపు 20 ఏళ్ల తర్వాత ‘యమలీల’ విడుదలైంది. రెంటిలోనూ యముడుగా కైకాల సత్యనారాయణ నటించారు. యముడు మృత్యువుకు అధిపతి. అలాంటి దేవుడిని చూస్తే భయపడాలి. కాని తెలుగువారి అదృష్టం ‘యమగోల’ సినిమాతో ఆయనతో చనువుగా వ్యవహరించి హాస్యమాడేంత వీలు చిక్కింది. తెలుగులో యముడికి ఉన్న ఈ కామెడీ ఇమేజ్ను దృష్టిలో పెట్టుకుని ఎస్వీ కృష్ణారెడ్డి తన దర్శకత్వంలో జాక్ పాట్ కొట్టిన సినిమాయే యమలీల. తల్లి కోసం తనయుడు తపనపడే కథగా ఇది కనిపించినా యముడు భూలోకానికి వచ్చి వింతలూ విడ్డూరాలు చేయడమే ప్రధానాంశం. అంతవరకు కామెడీ పాత్రలు పోషిస్తున్న అలీ ఈ సినిమాతో హీరోగా మారి సిక్సర్ కొట్టారు. హీరోయిన్గా ఇంద్రజ, చిత్రగుప్తునిగా బ్రహ్మానందం, లోకల్ ఎస్.ఐ.గా కోట శ్రీనివాసరావు ఇందులో నవ్వులు పూయిస్తారు. దివాకర్‌బాబు మాటలు కూడా ప్లస్ పాయింట్. సెలవుల్లో హాయిగా చూసి ఎంజాయ్ చేయదగ్గ సినిమా ఇది. విశేషాలు: ఇందులో ‘హిమక్రీములు’ అంటూ యముడు ఐస్‌క్రీమ్‌లను లాగించడం ప్రేక్షకులకు నచ్చింది. పాటల విషయానికి వస్తే ‘నీ జీను ప్యాంటు చూసి బుల్లెమ్మో’ పెద్ద హిట్. లోకల్ రౌడీగా తనికెళ్ల భరణి ‘నా చెల్లి పెళ్లి జరగాలి మళ్లీ మళ్లీ’ అని కవిత రాసి తెగ నవ్విస్తారు. అన్నింటికీ మించి సూపర్ స్టార్ కృష్ణ ‘జుంబారే జూజుంబరే’ అంటూ స్పెషల్ సాంగ్ చేసి స్టెప్పులతో అదరగొడతారు. ఇవన్నీ ఎట్రాక్షన్సే. ఒసేయ్ రాములమ్మ (1997) తెలంగాణ అనే ఒక ప్రాంతం ఉంటుందని, అక్కడ ఒక సంస్కృతి ఉంటుందని, అక్కడ కూడా పీడితులకు పీడకులకు మధ్య సంఘర్షణ ఉంటుందని అదంతా కూడా సినిమాకు ఒక మంచి కథాంశమని చెప్పిన సినిమా ‘ఒసేయ్ రాములమ్మ’. అంతవరకు తెలంగాణను ఒక ప్రేక్షక సముదాయంగా చూసిన ఇండస్ట్రీకి అదొక బలమైన కథావరణం అని ఈ సినిమా ద్వారా తెలిసి వచ్చింది. దళితుల బాధలు తీసేవారు కరువు. అందునా దళిత స్త్రీల బాధలు చూపే వారు కరువు. అలాంటి స్త్రీలు తిరుగుబాటు బావుటా ఎగురవేస్తే అది ఏదైనా దినపత్రికలో చిన్న వార్తే తప్ప సినిమా వాళ్లకు కథ కాదు. కాని దాసరి నారాయణరావు ఆ సమకాలీన పరిస్థితిని కథగా స్వీకరించి సూపర్ డూపర్ హిట్ సాధించారు. తెలంగాణ ప్రాంతవాసులే కాదు యావదాంధ్ర ప్రేక్షకులు కూడా ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు. రాములమ్మగా విజయశాంతి తరగని కీర్తి సంపాదించుకున్నారు. ఇతర ముఖ్యపాత్రలలో కృష్ణ, దాసరి, రాంరెడ్డి ఆకట్టుకుంటారు. ప్రజల సాయుధ పోరాటాలను ప్రభుత్వాలు ఎంత ఉక్కుపాదంతో అణిచినా అణిగిపోవు. దేశంలో అణిగిపోలేదు కూడా. పీడన ఉన్న చోటల్లా అగ్గి రాజుకుంటూనే ఉంటుంది. అందుకు రుజువుగా ఒసేయ్ రాములమ్మ చిత్రాలకు దక్కిన విజయాన్ని చూడవచ్చు. తమలో ఉన్న తిరుగుబాటు స్వభావానికి రాములమ్మ ఒక ప్రతినిధి అని భావించడం వల్ల ఆ విజయం దక్కింది. విశేషాలు: ఒసేయ్ రాములమ్మలో పాటలన్నీ పెద్ద విజయం సాధించాయి. సినారె రాసిన ‘ఓ రాములమ్మ’ పాట మోగిపోయింది. వందేమాతరం శ్రీనివాస్ సంగీతం అందించారు. ‘చౌదరిగారికి రెడ్డిగారికి నాయుడుగారికి పేర్ల చివర ఆ తోకలెందుకు... ఊరి చివర దళితుల పాకలెందుకు?’ అని ఈ సినిమా ప్రశ్నించింది. అన్నమయ్య (1997) కమర్షియల్ సినిమాలతో మారుమోగిపోతున్న రోజుల్లో తెలుగు సినిమాలో అన్నమయ్య ఒక ప్రయోగం. అదీ మంచి కమర్షియల్ హీరోగా పేరున్న అక్కినేని నాగార్జున చేసిన ప్రయోగం. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు సినిమాలంటే మాస్ అంశాల మేళవింపు. అలాంటి దర్శకుడు పూర్తిగా భక్తిరస చిత్రం చేయడమే విశేషమంటే, అందులో నాగార్జున నటించడం ఇంకా విశేషం. శ్రీ వెంకటేశ్వరస్వామి భక్తుడు అన్నమయ్య పాత్రలో నాగార్జున కనిపించారిందులో! ఆ పాత్రలో పూర్తిగా ఒదిగిపోయిన నాగార్జున తన నటనతో అందరినీ కట్టిపడేశారు. అన్నమయ్య కీర్తనలు సినిమా ఆసాంతం వినిపిస్తూ, కనిపిస్తూ ఒక అద్భుతమైన అనుభూతిని కలిగిస్తాయి. ఎం.ఎం. కీరవాణి సమకూర్చిన ఒక్కో పాట ఒక్కో ఆణిముత్యం. అన్నమయ్య ఆల్బమ్.. నాటి నుంచి నేటివరకూ ఇంట్లో దేవుడి పాటల క్యాసెట్లలో భాగమైపోయిందంటేనే అదెంత పెద్ద సక్సెస్సో, ప్రేక్షకులు సినిమాను ఎంతలా ఓన్ చేసుకున్నారో చెప్పొచ్చు. వెంకటేశ్వరస్వామిగా నటించిన సుమన్ నిజంగా దేవుడిగానే కనిపించాడు. కమర్షియల్గానూ తిరుగులేని విజయం సాధించిన ఈ సినిమాకు టెక్నికల్‌గా ప్రతి ఒక్కరి పనితనం ఒక ఆభరణంగా వెలిగిపోయింది. విశేషం: ‘అన్నమయ్య’ సినిమాతో తెలుగులో భక్తుడి పాత్ర అంటే నాగార్జునే చేయాలి అన్న పేరు వచ్చేసింది. ఈ సినిమా తర్వాత ఆయన ‘శ్రీరామదాసు’, ‘ఓం నమో వెంకటేశాయ’ లాంటి సినిమాల్లో భక్తుడి పాత్రల్లో మెప్పించారు. తొలిప్రేమ (1998) నీ ప్రేమలో నిజాయితీ ఉంటే ఆ అమ్మాయి నీకు దక్కాలి అనే సంకల్పం నిజంగా ఉంటే ఎన్ని ఆటంకాలు వచ్చినా ఆ ప్రేమ సఫలమయ్యే తీరుతుంది అని చెప్పిన అందమైన ప్రేమ కథ ‘తొలి ప్రేమ’. ఇందులో పవన్‌కల్యాణ్ అల్లరి చిల్లరి కుర్రవాడు. కీర్తి రెడ్డి చాలా పెద్దింటికి చెంది పై చదువుల కోసం అమెరికా వెళ్లబోతున్న అమ్మాయి. పవన్ కల్యాణ్‌కు మంచి మనసు ఉంది. ఆ అమ్మాయికి అంతకన్నా మంచి సంస్కారం ఉంది. ఆమెను ఇష్టపడ్డ పవన్‌కల్యాణ్ సినిమా చివరి వరకూ తన మనసులోని మాట చెప్పలేక సతమతమవుతుంటాడు. కాని అతడి గుండెలోని ఆరాధన ఆమెను తాకే తీరుతుంది. ఆమె అతడి ప్రేమను అంతిమంగా స్వీకరిస్తుంది. దర్శకుడు కరుణాకర్ ఈ సినిమాతో తాను మరో భాగ్యరాజ్ అని నిరూపించుకున్నాడు. పవన్‌కల్యాణ్‌కు చాలామంచి పేరు, ప్రేక్షకుల అంగీకారం సంపాదించి పెట్టిన సినిమా ఇది. నగేశ్, అలీ, వేణుమాధవ్ వీళ్లందరి కంటే ముఖ్యంగా పవన్‌కల్యాణ్ చెల్లెలి పాత్ర వేసిన వాసుకి చాలా ఆకట్టుకుంటారు. తెలుగు టాప్ టెన్ ప్రేమ కథల్లో తప్పక ఈ చిత్రం నిలుస్తుంది. విశేషాలు: ఇందులో సిటీలో ఎంత మంది ఆడపిల్లలు ఉంటారు, వారిని ఎంత మంది ప్రేమించి ఉంటారు అనేదానికి వేణుమాధవ్ చెప్పే పొడుగు డైలాగ్ లెక్క చాలా హిట్. ఆర్థికంగా మంచి లాభాలు తెచ్చి పెట్టిన ఈ సినిమాను కన్నడంలో, హిందీలో రీమేక్ చేశారు. ఇందులోని ఒక పాటలో పవన్‌కల్యాణ్ గెటప్స్‌తో నితిన్ మరో చిత్రంలో కనిపిస్తాడు. ఒక్కడు (2003) ఒక కరడుగట్టిన రాయలసీమ ఫ్యాక్షనిస్ట్‌ని ధైర్యంగా ఎదిరించి అతడి పంజరంలో చిక్కుకున్న ఆడపిల్లకు రక్షకుడుగా ఒక యువకుడు నిలవడం కథ. వినడానికి ఒక్కలైనే అయినా కథనంతో గగుర్పొడిచే సన్నివేశాలతో దర్శకుడు గుణశేఖర్ సినిమాను బ్లాక్‌బస్టర్ చేశారు. హీరో మహేశ్‌బాబుకు ఈ సినిమాయే స్టార్‌డమ్‌ను తెచ్చిందని చెప్పవచ్చు. పాత బస్తీ అల్లరి కుర్రాడిగా అతడు, హీరోయిన్గా భూమిక, విలన్‌గా ప్రకాష్‌రాజ్ పోటీలు పడి నటించారు. ఇందులో హీరోయిన్ను హీరో చార్మినార్ పైన దాచి పెట్టడం విశేషం. మణిశర్మ చేసిన పాటలు రాణించాయి. ‘చెప్పవే చిరుగాలి’, ‘నువ్వేం మాయ చేశావో గాని’... హిట్. అలాగే ధర్మవరపు సుబ్రహ్మణ్యం యాక్ట్ చేసిన సెల్‌ఫోన్ సీన్ ‘నైన్ యెయిట్ ఫోర్ యెయిట్ జీరో’... అంటూ కడుపుబ్బ నవ్విస్తుంది. కథలో, నెరేషన్లో, డైలాగ్స్‌లో... అన్నింటిలో కొత్తపుంతలు తొక్కిన సినిమా ఇది. విశేషాలు: ఈ సినిమాలో చార్మినార్ కూడా ఒక క్యారెక్టర్. దాని మీద షూటింగ్ సాధ్యం కాదు కనుక నేరుగా చార్మినార్ సెట్‌ను వేసి సినిమా తీయడం ఆ రోజుల్లో విశేషంగా చెప్పుకున్నారు. ఈ సినిమాను చాలా భాషల్లో రీమేక్ చేశారు. ఇటీవల అర్జున్ కపూర్‌తో ‘తేవర్’ పేరుతో తీశారు. ఈ సినిమా ఇచ్చిన ఊపుతో ఈ హీరో డైరెక్టర్ కాంబినేషన్లో వచ్చిన తర్వాతి సినిమా ‘అర్జున్’ కోసం ఏకంగా మధుర మీనాక్షి టెంపుల్ సెట్‌ను భారీగా వేయడం మరో విశేషం. బొమ్మరిల్లు (2006) కొడుకు పట్ల తండ్రి ‘పొజెసివ్‌నెస్’ని ఒక కథాంశంగా తీసుకుని తండ్రీ కొడుకుల మధ్య ఉండాల్సిన ‘స్పేస్’ని డిస్కస్ చేసిన సినిమా. చాలా కాలం తర్వాత తెలుగులో ఒక మంచి స్క్రిప్ట్‌తో ఒక మంచి సినిమా వచ్చిందన్న భావనతో ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. కొడుకు తాను ప్రేమించిన అమ్మాయిని తండ్రి చేత ఒప్పించడానికి ఆమెను పెళ్లికి ముందే వారం రోజుల పాటు తన ఇంటికి తీసుకొని వస్తాడు. ఆ ప్రాసెస్‌లో తన వ్యక్తిత్వాన్ని తానే కోల్పోతాడు. అమ్మాయి ఇంట్లో వాళ్లకు నచ్చడం ఏమోకానీ అమ్మాయికి అసలు అబ్బాయే నచ్చకుండా పోతాడు. ఈ మలుపులు, కొత్తదనం సినిమాకు బిగి ఇచ్చాయి. హీరోగా సిద్ధార్థ, హీరోయిన్గా జెనీలియా మార్కులు కొట్టేశారు. వాళ్ల కంటే ఎక్కువగా తండ్రి పాత్ర వేసిన ప్రకాష్ రాజ్ కూడా. దర్శకుడు భాస్కర్‌కు ఇది తొలి సినిమాయే అయినా చాలా పేరు తెచ్చి పెట్టింది. కుటుంబకథా చిత్రాలు నిర్మిస్తారని దిల్ రాజు బేనర్‌కు దీనితో మరింత పునాది ఏర్పడింది. విశేషాలు: ఎవరైనా కటువుగా ఉంటే ‘అతడు బొమ్మరిల్లు ఫాదర్’ అని అనడం తెలుగిళ్లలో ఆనవాయితీగా మారింది. సిద్ధార్థ స్వయంగా పాడిన ‘అపుడో ఇపుడో ఎపుడో’ పాట పెద్ద హిట్ అయ్యింది. ‘కుదిరితే కప్పు కాఫీ లేకుంటే నాలుగు మాటలు’ డైలాగ్ ఇంటింటా మోగింది. నువ్వు నాకు నచ్చావ్ (2001) ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం విశేషం కాదు. కాని ఇంకొకరితో ఎంగేజ్మెంట్ అయిన అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవడం ఈ సినిమాలో చూస్తాం. ‘ఆర్య’ సినిమాలో మనసిచ్చిన అమ్మాయిని ప్రేమించమని బహిరంగంగా చెప్పే అబ్బాయి కనిపిస్తే, ‘నువ్వు నాకు నచ్చావ్’లో ఇంకొకరితో పెళ్లి కావాల్సిన అమ్మాయిని నిశ్శబ్దంగా ప్రేమించి ఆ అమ్మాయి వెంట పడుతున్నా కుటుంబ మర్యాద కోసం వద్దని వారించే అబ్బాయిని చూస్తాం. ఒక ఆడపిల్లకు కావల్సింది మణులు మాణిక్యాలు పై హోదాలో ఉండే కుర్రాడు కాదు మనసులో పెట్టుకుని చూసుకునేవాడు... పూరింట్లో అయినా సంతోషంగా ఉంచేవాడు అనే కాన్సెప్ట్‌ను ఈ సినిమా రొమాంటిక్ స్థాయిలో చూపించి ఆకట్టుకుంది. ఇవాళ దర్శకుడుగా ముందంజలో ఉన్న త్రివిక్రమ్ శ్రీనివాస్ రచయితగా ప్రతిభావంతంగా స్క్రిప్ట్ రూపొందించి దర్శకుడు విజయభాస్కర్ సక్సెస్ కొట్టేలా చేశారు. వెంకటేశ్‌కు ఈ సినిమా పేరు తెచ్చింది. హీరోయిన్గా ఆర్తి అగర్వాల్‌కు కూడా. ఎం.ఎస్. నారాయణ, ప్రకాశ్‌రాజ్, బ్రహ్మానందం, సునీల్ సినిమాలో నవ్వులు పూయించారు. ఇప్పటికీ ఇంటిల్లిపాది చూసి ఎంజాయ్ చేసే సినిమా ఇది. విశేషాలు: ఇందులో ప్రకాశ్‌రాజ్ తన తల్లి సూర్యకాంతంను తలుచుకుంటూ చదివే కవిత ఫేమస్. ‘అమ్మా... రాసుకోవడానికి పలక ఇచ్చావ్... గీసుకోవడానికి గడ్డమిచ్చావ్’ అని చదువుతుంటే ఒకటే నవ్వులు. అలాగే వెంకటేశ్ తాను భవిష్యత్తులో కలెక్టర్ అయ్యి వీడియో కాన్ఫరెన్స్‌లో ఉండి తన తండ్రిని గమనించి ‘చంద్రబాబూ... బయట మా బాబు వెయిటింగ్’ అంటాననడం కూడా చమక్కే. పాటలు బాగుంటాయి. ‘ఆకాశం దిగి వచ్చి’, ‘ఉన్నమాట చెప్పలేను’, ‘నువ్వే నువ్వే’... హిట్. పోకిరి (2006) తెలుగు కమర్షియల్ సినిమాకు ఒక కొత్త కళ తీసుకొచ్చిన సినిమా. ప్రిన్స్ మహేశ్ బాబును సూపర్‌స్టార్‌ను చేసిన సినిమా. ఈ సినిమాలోనే ఓ డైలాగ్ ఉంటుంది.. ‘‘200 సెంటర్స్ 100 డేస్’’ అని. దర్శక, రచయిత పూరీ జగన్నాథ్ ఏ ఉద్దేశంతో రాశారో కానీ, ఈ సినిమా నిజంగానే 200 సెంటర్స్‌లో హండ్రెడ్ డేస్ ఆడింది. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు పోకిరి అన్నది ఒక ఫార్ములా. ఈ ఫార్ములాను నమ్ముకొనే పదేళ్లు దాటినా నేటికీ ఏదో ఒక సినిమా వస్తోందంటే పోకిరి ప్రభావం తెలుగు సినిమాపై ఏ స్థాయిలో ఉందో చెప్పుకోవచ్చు. ఇందులో ఒక్కో డైలాగ్ ఒక్కో సెన్సేషన్. ‘ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయిపోద్దో.. ఆడే పండు గాడు’ అంటూ మహేశ్ చెప్పిన డైలాగ్ ఒక జనరేషన్ మొత్తాన్నీ ఊపు ఊపింది. ‘పండగచేస్కో’ అన్న డైలాగ్ అయితే వాడుకలోకే వచ్చేసింది. ఒక పోలీసాఫీసర్ క్రిమినల్స్‌తో కలిసిపోయి వారిని అంతం చేయడమనే కథతో వచ్చిన ఈ సినిమాలో మహేశ్‌ను పోలీసాఫీసర్‌గా రివీల్ చేసే సీన్ తెలుగు కమర్షియల్ సినిమాలో ఒక మర్చిపోలేని సీన్. మణిశర్మ సమకూర్చిన పాటలన్నీ సూపర్ హిట్. 40 కోట్ల రూపాయల మేర వసూళ్లు సాధించిన ‘పోకిరి’ అప్పటికి ఇండస్ట్రీ హిట్. విశేషం: ‘పోకిరి’ సినిమాని తమిళ, హిందీ, కన్నడ భాషల్లో రీమేక్ చేశారు. రీమేక్ అయిన అన్నిచోట్లా సినిమా పెద్ద హిట్ కావడం అతిపెద్ద విశేషం. గమ్యం (2008) ఎక్స్టర్నల్ జర్నీ సరే... కాని ఇంటర్నల్ జర్నీని సినిమా తీసే ప్రయత్నాలు తెలుగులో పెద్దగా జరగలేదు. ‘గమ్యం’ సినిమా పైకి ప్రేయసిని వెతుక్కుంటూ ప్రియుడు చేసే మోటార్ సైకిల్ యాత్రగా కనిపించినా ఒక రకంగా అది అతడి అంతర్గత ప్రయాణం. తనను తాను తెలుసుకుంటూ, సమాజాన్ని తెలుసుకుంటూ, సిసలైన సమాజం ఎలా ఉందో, దాని కోసం ఒక మనిషిగా తాను చేయవలసింది ఏమిటో, దాని కోసం ఇది వరకే రకరకాల పనులు చేస్తున్నవారిలో తప్పొప్పులు ఏమిటో... ఇవన్నీ కథానాయకుడు ఈ జర్నీలో డిస్కవర్ చేస్తాడు. దర్శకుడు క్రిష్ తన మొదటి సినిమాగా ‘గమ్యం’ తీసి వెంటనే ప్రేక్షకుల దృష్టిలో పడ్డారు. ఆ తర్వాత ఆయన తీసిన సినిమాలన్నీ దీని వల్ల వచ్చిన మంచి పేరును ఆధారంగా చేసుకొని కొనసాగుతున్నవే. శర్వానంద్, కమలినీ ముఖర్జీ సినిమాలో జంటగా నటించారు. కామెడీ హీరోగా అందరికీ తెలిసిన అల్లరి నరేష్ ఇందులో ‘గాలి శీను’గా ప్రత్యేకమైన పాత్రలో కనిపించి ఆకట్టుకుంటాడు. విశేషాలు: విప్లవ వీరుడు చే గువేరా పుస్తకం ‘ది మోటార్ సైకిల్ డైరీస్’ ప్రఖ్యాతం. దర్శకుడు క్రిష్ ఈ పుస్తకం నుంచి స్ఫూర్తి పొంది ఈ సినిమా రూపొందించారు. సీతారామశాస్త్రి రాసిన ‘ఎంత వరకు ఎంత వరకు’ పాట హిట్. ఇందులో ‘గమనమే నీ గమ్యమైతే బాటలోనే బతుకు దొరుకు’ అని రాయడంలో ఒక తాత్త్విక స్పర్శ ఉంది. అరుంధతి (2009) లేడీ ఓరియంటెడ్ సినిమాలు తెలుగులో కామనే! హీరోలకు దీటుగా తామేమీ తక్కువ కాదని హీరోయిన్లే సినిమాలను భుజాల మీద ఎత్తుకొని మోసిన సినిమాలు చాలానే వచ్చాయి. అరుంధతి ఈ కోవలో ఒక అడుగు ముందుకేసి భారీ బడ్జెట్తోనూ లేడీ ఓరియంటెడ్ సినిమాలు తీయొచ్చని పరిచయం చేసింది. అనుష్క ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు కోడి రామకృష్ణ దర్శకత్వం వహించారు. నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి భారీ బడ్జెట్‌తో విజువల్ ఫీస్ట్‌గా సినిమాను నిర్మించారు. విజువల్ ఎఫెక్ట్స్ సౌతిండియన్ సినిమా స్థాయిని ప్రపంచానికి పరిచయం చేసేలా ఉన్నాయని పేరొచ్చింది. స్టార్ హీరోలెవ్వరూ లేకున్నా బాక్సాఫీస్ వద్ద అరుంధతి కాసుల వర్షం కురిపించింది. అనుష్క తన పాత్రలో ప్రేక్షకులను అబ్బురపరిచింది. విలన్ పశుపతిగా నటించిన సోనూసూ«ద్ అదరగొట్టేశాడు. ఆయన రోల్ ఎంత పాపులర్ అంటే.. ‘అమ్మాళే.. ఎంద బొమ్మాళే..’ అన్న డైలాగ్ ఆ తర్వాత చాలా సినిమాల్లో వినిపించింది. ‘కమ్ముకున్న చీకట్లోనా..’ పాటతో పాటు కోటి సమకూర్చిన మిగతా పాటలన్నీ కూడా పెద్ద హిట్. విశేషం: ‘అరుంధతి’ సినిమాతో అనుష్క స్టార్ హీరో స్థాయికి వెళ్లిపోయింది. ఆమె ప్రధాన పాత్రలో నటించగా తర్వాత ‘రుద్రమదేవి’, ‘పంచాక్షరి’, ‘సైజ్ జీరో’ లాంటి లేడీ ఓరియంటెడ్ సినిమాలు వచ్చాయి. ఈగ (2012) ఈగ తెలుగు సినీ చరిత్రలో ఓ అద్భుత ప్రయోగం. హీరో ప్రధానంగా నడిచే ఇండస్ట్రీగా పేరున్న తెలుగులో ఒక ఈగతోనే సినిమా నడిపించి రాజమౌళి చేసిన సాహసం ఇండియన్ సినిమా నోరెళ్లబెట్టేలా చేసింది. విలన్ చేతిలో హత్య కాబడ్డ హీరో.. ఈగగా మళ్లీ పుట్టి ప్రతీకారం తీర్చుకోవడమే కథ. ఆ ఈగకు కనెక్ట్ అయిపోయి సినిమాను ఒక ప్రేక్షకుడు పూర్తిగా ఎంజాయ్ చేయగలిగాడంటే అది రాజమౌళి మ్యాజిక్కే! విజువల్ ఎఫెక్ట్స్ చూస్తూంటే ఇదొక ఇండియన్ సినిమానేనా అనిపించేలా ఉంటాయి. కొద్దిసేపే కనిపించినా నాని అందరికీ నచ్చేశాడు. హీరోయిన్గా చేసిన సమంత, విలన్‌గా చేసిన కిచ్చా సుధీప్ సినిమా స్థాయిని మరింత పెంచారు. తెలుగు, తమిళ భాషల్లో ఈగ పెద్ద హిట్. రాజమౌళి అన్న బ్రాండ్ దేశవ్యాప్తంగా మారుమోగిపోయిందంటే ఈగతోనే! విశేషం: ఈగను మొదట్లో ఐదారు కోట్లలో ఓ చిన్న బడ్జెట్ సినిమాగా చేయాలన్నది రాజమౌళి ప్లాన్. అయితే అది కాస్తా పెరుగుతూ పోయి ఓ పెద్ద హీరో సినిమా బడ్జెట్ స్థాయికి వెళ్లిపోయింది. రాజమౌళి బ్రాండ్‌తో బాక్సాఫీస్ వద్ద, పెద్ద హీరో లేకపోయినా వసూళ్ల వర్షం కురిసింది. మనం (2014) ఈ సినిమా గురించి ఒక ఆనందం ఉంది. అది ఇందులో మూడు తరాల నటులు అక్కినేని, నాగార్జున, నాగ చైతన్య కలిసి నటించడం. ఇలా ఒకే కుటుంబానికి చెందిన మూడు తరాల వాళ్లు కలిసి నటించడం హిందీలో రాజ్ కపూర్ కుటుంబానికి సాధ్యమైంది. తెలుగులో అక్కినేనికి. ఇక సినిమాకు ఒక విషాదం ఉంది. అది– దశాబ్దాలుగా తెలుగువారిని అలరించిన మహా నటుడు అక్కినేనికి ఇది ఆఖరు చిత్రం కావడం. ఈ సినిమా విడుదలకు ముందే ఆ మహనీయుడు పరమపదించారు. అందువల్ల ఈ సినిమా ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన సినిమాగా నిలిచింది. అదీ కాకుండా దీని కథాంశం పునర్జన్మలతో ముడి పడటం, అది మూడు కాలమానాలలో జరగడం విడ్డూరంగా ఉన్నా ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా కథను నేరేట్ చేయడంలో దర్శకుడు విక్రమ్ కుమార్ విజయం సాధించాడు. సమంత, శ్రేయ, అలీ తదితరులు సపోర్ట్ చేయగా అక్కినేని, నాగార్జున, నాగ చైతన్య ఒకరితో ఒకరు పోటీ పడి నటించారు. హర్షవర్ధన్ డైలాగులు, అనుప్ రూబెన్స్ సంగీతం రాణించాయి. విశేషాలు: అక్కినేని సూపర్ హిట్ ‘నేను పుట్టాను ఈ లోకం మెచ్చింది’ పాటకు ఈ సినిమాలో నాగార్జున, నాగ చైతన్య డ్యాన్స్ చేయడం ప్రేక్షకులకు నచ్చింది. సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ ఒక ముఖ్యసన్నివేశంలో తళుక్కున మెరుస్తారు. పిల్లలు పాడిన ‘కనిపించిన మా అమ్మకి’ పాట పెద్ద హిట్. క్లయిమాక్స్‌లో అక్కినేని అఖిల్ తెర ప్రవేశం చేసి థ్రిల్ కలిగించడం కూడా ఒక ముచ్చటే. మగధీర (2009) చిరంజీవి తనయుడు రామ్ చరణ్‌ను ఒక్కరోజులో స్టార్‌ను చేసేసిన సినిమా. దర్శకధీరుడు రాజమౌళి స్థాయిని సౌతిండియన్ సినిమాకు పరిచయం చేసిన సినిమా. అప్పటికి తెలుగులో ఇండస్ట్రీ హిట్ కొట్టిన సినిమానే 40 కోట్ల వసూళ్లు రాబడితే, 45 కోట్ల మేర ఖర్చు పెట్టి ఈ సినిమా తీశారు నిర్మాత అల్లు అరవింద్. దర్శక, నిర్మాతల గట్ ఫీలింగ్ అది. ఆ గట్ ఫీలింగే వాళ్లను ఎక్కడికో తీసుకెళ్లి కూర్చోబెట్టింది. ఒక జన్మలో ఒక్కటవ్వలేకపోయిన ఓ ప్రేమ జంట మరో జన్మలో ప్రేమను దక్కించుకోవడమనే మాస్ ఫాలోయింగ్ ఉన్న కథను ఈతరం ప్రేక్షకుడికి కిక్కిచ్చేలా తీర్చిదిద్దారు రాజమౌళి. భారీ ఫైట్లు, అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్ కలిసి ఈ సినిమాకు ఒక ప్రత్యేక స్థాయిని తెచ్చిపెట్టాయి. ఎమ్.ఎమ్. కీరవాణి పాటలన్నీ ఓ మ్యాజిక్. ‘బంగారు కోడిపెట్ట’ అంటూ చిరంజీవి సినిమా పాటనే మళ్లీ రీమిక్స్ చేశారు. ఈ పాటలో చిరు–చరణ్ వేసిన స్టెప్పులు టాప్ లేపేశాయి. తెలుగులో, తమిళంలో మంచి బాక్సాఫీస్ హిట్‌గా నిలిచిన ఈ సినిమా నేషనల్, ఫిల్మ్‌ఫేర్, నంది అవార్డుల్లోనూ ఇరగదీసింది. తెలుగు సినిమాకు ఓ కొత్త బాక్సాఫీస్ కళను తెచ్చిపెట్టింది మగధీర. విశేషం: ‘మగధీర’ తర్వాత సోషియో ఫాంటసీ అనే జానర్ తెలుగు సినిమాకు ఓ పిచ్చిలా పట్టుకుంది. 2009 నుంచి ఓ ఐదేళ్ల పాటు ఈ జానర్లో వరుస సినిమాలు వచ్చిపడ్డాయి. బాహుబలి (2015, 2017) ఇండియన్ సినిమాకు ఒక ఐడెంటిటీ బాహుబలి. ‘తెలుగు సినిమా పొరుగు రాష్ట్రానికి కూడా పరిచయం లేదు’ అన్న ఆలోచన నుంచి ఇండియన్ సినిమా ప్రైడ్ అని చెప్పుకోవడానికి ఒక తెలుగు సినిమా కారణం అయిందంటే అది బాహుబలి వల్లే! బాక్సాఫీస్ వసూళ్ల పరంగా ఈ సినిమా ఒక ప్రభంజనం. 2015లో వచ్చిన మొదటి భాగం ఎంత పెద్ద హిట్టో, 2017లో వచ్చిన రెండో భాగం అంతకు రెట్టింపు హిట్టు. బాహుబలితో రాజమౌళి మెయిన్ స్ట్రీమ్ కమర్షియల్ సినిమాలో తనదో తిరుగులేని బ్రాండ్ అని చాటిచెప్పుకున్నారు. ప్రభాస్, రానాలు నేషనల్ లెవెల్ స్టార్స్ అయిపోయారు. అనౌన్స్ అయిన రోజు ‘వంద కోట్ల బడ్జెట్టా?’ అన్నవారంతా రిలీజయ్యాక ‘వేల కోట్ల వసూళ్లా?’ అనుకున్నారంటే బాహుబలి ఎంత పెద్ద సక్సెస్సో చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? అన్న ప్రశ్న రెండేళ్ల పాటు ఇండియన్ సినీ అభిమానుల్లో ఓ చర్చాంశంగా నిలిచింది. విశేషం: బాహుబలి విశేషాలు అన్నీ ఇన్నీ కావు. బాక్సాఫీస్ లెక్కలే చూస్తే, ఇండియన్ సినిమాకు వెయ్యి కోట్ల వసూళ్లు సాధ్యమా? అన్న ఆలోచనను తుంచేసి 1,700 కోట్ల రూపాయలు వసూలు చేసి, ‘ఇదీ ఇండియన్ సినిమా మార్కెట్!’ అని ప్రపంచానికి పరిచయం చేసిందీ సినిమా. -
కేసీఆర్‌కు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ లేఖ
హైదరాబాద్: డ్రగ్స్ సమస్యను సున్నితంగా పరిష్కరించాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌ను తెలుగు సినిమా పరిశ్రమ కోరింది. డ్రగ్స్ వ్యవహారాన్ని వెలుగులోకి తెచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపింది. ఈ మేరకు బుధవారం లేఖ రాసింది. డ్రగ్స్ కేసు ప్రభావం వేలాది కుటుంబాలపై పడనుందని, సినిమా పరిశ్రమ ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని హుందాగా దర్యాప్తు సాగించాలని కోరుకుంటున్నామని తెలిపింది. దీనికి తమ వంతు సహకారం అందిస్తామని హామీయిచ్చింది. సమాజం, మీడియా నుంచి తాము సానుభూతి కోరుకుంటున్నామని వెల్లడించింది. డ్రగ్స్ కేసు విచారణ జరిగిన 10 రోజులు ఇండస్ట్రీకి చీకటిరోజులుగా వర్ణించింది. డగ్స్ వాడిన వారిపై తామే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని తెలిపింది. డ్రగ్స్ వ్యవహారం తమందరికీ ఓ కుదుపు, ఓ హెచ్చరిక అని తెలుగు సినిమా పరిశ్రమ పేర్కొంది. -
డ్రగ్స్ కేసులో ‘కొత్త’ ట్విస్టు
-
కథలో ‘కొత్త’ ట్విస్టు
15 మంది సినీ ప్రముఖుల పేర్లు బయటపెట్టిన నటుడు సుబ్బరాజు - డ్రగ్స్ వాడేవారిలో ప్రముఖ నిర్మాత ఇద్దరు తనయులు! - హీరోలు, హీరోయిన్లు, వారి సంబంధీకులు సహా మరో 13 మంది కూడా.. - పబ్బులు కేంద్రంగానే విచ్చలవిడిగా డ్రగ్స్ దందా - తాను మాత్రం డ్రగ్స్ తీసుకోలేదని వెల్లడి - సుబ్బరాజును 13 గంటల పాటు విచారించిన ఎక్సైజ్ సిట్ - ఆ 15 మందికి నోటీసులిచ్చేందుకు రంగం సిద్ధం సాక్షి, హైదరాబాద్: తవ్వుతున్న కొద్దీ డ్రగ్స్ వ్యవహారంలో సంచలన అంశాలు బయటికి వస్తున్నాయి. తెలుగు సినీ పరిశ్రమలో కీలకంగా వ్యవహరించే ఓ కుటుంబానికి చెందిన నిర్మాత ఇద్దరు తనయులు డ్రగ్స్ వినియోగిస్తారని నటుడు సుబ్బరాజు ఎక్సైజ్ సిట్ విచారణలో వెల్లడించినట్లు తెలిసింది. వారితోపాటు మరికొందరు నిర్మాతలు, హీరోలు, హీరోయిన్లు, వారి సంబంధీకులు విచ్చలవిడిగా డ్రగ్స్ వాడతారని చెప్పినట్లు సమాచారం. మొత్తంగా సినీ పరిశ్రమకు చెందిన దాదాపు 15 మంది పేర్లను సుబ్బరాజు వెల్లడించినట్లు తెలిసింది. ఈ డ్రగ్స్ దందా అంతా కూడా పబ్బులు కేంద్రంగా జరుగుతోందని బయటపెట్టినట్లు సమాచారం. తాను మాత్రం డ్రగ్స్ వినియోగించనని చెప్పినట్లు తెలుస్తోంది. లంచ్ వరకు.. ‘ఏమీ తెలియదు’! ఎక్సైజ్ సిట్ మూడో రోజు విచారణలో భాగంగా సినీ నటుడు సుబ్బరాజు శుక్రవారం ఉదయం 9.30 గంటలకు హైదరాబాద్‌లోని నాంపల్లిలో ఉన్న సిట్ కార్యాలయానికి వచ్చారు. ఉదయం 10.30 గంటలకు విచారణ ప్రారంభించిన అధికారులు సుబ్బరాజుపై వరుసగా ప్రశ్నల వర్షం కురిపించారు. కానీ మధ్యాహ్నం 1.15 గంటల వరకు కూడా సుబ్బరాజు ఏమాత్రం సమాధానాలు చెప్పలేదని తెలిసింది. ఆయన భోజనం కూడా చేయలేదని సమాచారం. దాంతో మధ్యాహ్న భోజన సమయం తర్వాత సిట్ అధికారులు ప్రశ్నల తీరు మార్చి.. దర్శకుడు పూరి జగన్నాథ్‌తో ఉన్న సంబంధాలపై ప్రధానంగా దృష్టి సారించినట్టు తెలిసింది. ‘పూరితో కలసి డ్రగ్స్ తీసుకున్నారా?.. ముమైత్‌ఖాన్, చార్మి తదితరులతో కలసి తరచూ చేసుకున్న పార్టీల్లో డ్రగ్స్ వినియోగించినట్టు ఆరోపణలున్నాయి.. వీటిపై మీ సమాధానం ఏమిటి..’అంటూ గట్టిగా ప్రశ్నించినట్టు తెలిసింది. అయితే ఈ ప్రశ్నలకు కూడా సుబ్బరాజు తనకేమీ తెలియదని, అల్లోపతి మందులే తీసుకోని తనకు డ్రగ్స్ అలవాటు చేసుకోవాల్సిన అవసరం లేదని చెప్పినట్టు సమాచారం. దీంతో సిట్ అధికారులు సుబ్బరాజు కెల్విన్‌తో కలసి దిగిన ఫొటోలు చూపించారని.. ‘అతడితో పరిచయం ఎందుకు? ఎవరు చేశారు? పూరి జగన్నాథ్ పరిచయం చేశారా? మరెవరితోనైనా కలిశారా..’అని ప్రశ్నలు గుప్పించారని తెలుస్తోంది. ఆ ఫొటోలపై స్పందించిన సుబ్బరాజు... కెల్విన్ ఈవెంట్ మేనేజర్ కావడంతో రెండు మూడు సార్లు పబ్బుల్లో కలిశానని, అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడేవాడని చెప్పినట్లు సమాచారం. అంతకు మించి తనతో కలిసింది లేదని, డ్రగ్స్ తీసుకున్నది లేదని పేర్కొన్నట్టు తెలిసింది. సాయంత్రానికి మారిన సీన్.. సిట్ విచారణలో సాయంత్రానికి పరిస్థితి వేడెక్కినట్టు తెలిసింది. అధికారులు పలు ఆధారాలు చూపుతూ, గట్టిగా ప్రశ్నించడంతో... చివరికి సుబ్బరాజు తరచూ డ్రగ్స్ తీసుకునే కొందరి పేర్లు వెల్లడించినట్టు తెలిసింది. తెలుగు సినీ పరిశ్రమలో కీలకంగా ఉన్న ఓ ప్రముఖ కుటుంబానికి చెందిన నిర్మాత ఇద్దరు తనయులు డ్రగ్స్ తీసుకుంటారని బయటపెట్టినట్లు సమాచారం. వారు మాత్రమే కాకుండా మరికొందరు నిర్మాతలు, హీరోలు, హీరోయిన్లు, వారి సంబంధీకులు కలిపి మరో 13 మంది కూడా డ్రగ్స్ విపరీతంగా వినియోగిస్తారని సుబ్బరాజు వాంగ్మూలంలో వెల్లడించినట్లు తెలిసింది. ఇక డ్రగ్ దందాకు వేదికగా మారిన మాదాపూర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లలోని పలు పబ్బుల పేర్లను కూడా సుబ్బరాజు బయటపెట్టినట్టుగా సిట్ వర్గాలు పేర్కొన్నాయి. అయితే మొత్తంగా ‘పూరి జగన్నాథ్ డ్రగ్స్ తీసుకుంటారా? ఆయనే మీకు డ్రగ్ సరఫరా చేస్తారా..’అన్న విషయంపై తిరిగి ప్రశ్నించినట్టు తెలుస్తోంది. విచారణ అనంతరం సుబ్బరాజు వాంగ్మూ లాన్ని రికార్డు చేసుకున్న అధికారులు... ఉస్మానియా వైద్య బృందంలో ఆధ్వర్యంలో రక్తం శాంపిల్స్, గోర్లు, వెంట్రుకలను పరీక్ష నిమిత్తం తీసుకున్నట్టు తెలిసింది. నలుగురు విద్యార్థులకు కౌన్సెలింగ్! డ్రగ్స్‌కు బానిసైన నలుగురు ఇంజనీరింగ్ విద్యార్థులకు ఎక్సైజ్ సిట్ అధికారులు శుక్రవారం కౌన్సెలింగ్ చేసినట్లు తెలిసింది. వారిలో ఓ ఐఏఎస్ అధికారి తనయుడు కూడా ఉన్నట్లు చెబుతున్నారు. 13 గంటల పాటు విచారణ సాధారణంగా సాయంత్రం 5 గంటల వరకే విచారణ ముగుస్తుందని భావించగా.. సుబ్బరాజు సరైన రీతిలో సమాధానాలు చెప్పకపోవడంతో మరింత సేపు విచారణ కొనసాగించాలని అకున్ సబర్వాల్ నిర్ణయించారు. దాంతో రాత్రి 11.10 గంటల వరకు సుబ్బరాజును ప్రశ్నించారు. అంటే సిట్ వర్గాలు సుబ్బరాజును దాదాపు 13 గంటల పాటు విచారించాయి. తొలిరోజున దర్శకుడు పూరి జగన్నాథ్‌ను 10 గంటలు, రెండో రోజున కెమెరామన్ శ్యాం కే నాయుడును 6 గంటలు విచారించిన సంగతి తెలిసిందే. ఇక పబ్బులపై పంజా! హైదరాబాద్‌లోని పబ్బుల ద్వారానే డ్రగ్స్ దందా విస్తరిస్తోందని ఎక్సైజ్ సిట్ గుర్తించింది. ఈ మేరకు పబ్బుల నిర్వాహకులను విచారించాలని నిర్ణయించింది. ఇప్పటి వరకు విచారణ ఎదుర్కొన్నవారు వెల్లడించిన సమాచారం ప్రకారం.. పబ్బుల్లోనే డ్రగ్ కల్చర్ నడుస్తున్నట్టు బయటపడిందని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ శుక్రవారం మీడియాకు వెల్లడించారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని 17 పబ్బుల నిర్వాహకులను విచారణకు పిలిచామని.. శనివారం ఉదయం 11 గంటలకు వారు ఎౖMð్సజ్ సిట్ కార్యాలయంలో హాజరుకావాల్సిందిగా నోటీసులు జారీ చేశామని తెలిపారు. ఇక సినీనటి ముమైత్‌ఖాన్ కూడా నోటీసులు స్వీకరించారని.. ఆమె ఈ నెల 27న విచారణకు హాజరవుతారని చెప్పారు. నేడు హీరో తరుణ్ విచారణ సిట్ దర్యాప్తులో భాగంగా నాలుగో రోజు శనివారం సినీ హీరో తరుణ్ విచారణకు హాజరవుతారని అకున్ సబర్వాల్ తెలిపారు. సిట్ విచారణకు అందరూ సహకరిస్తే త్వరగా దర్యాప్తు ముగుస్తుందని పేర్కొన్నారు. ఎంతటివారున్నా వదలం డ్రగ్స్ వ్యవహారంలో ప్రస్తుతం విచా రణ ఎదుర్కొంటున్న వారేకాకుం డా.. దర్యాప్తులో వెల్లడవుతున్న మిగతా సినీ ప్రముఖులను కూడా విచారిస్తా మని ఎక్సైజ్ సిట్ చీఫ్ అకున్ సబర్వాల్ తెలిపారు. సిట్ విచారణ తీరుపై వస్తున్న ఆరోపణల ను ఖండించారు. తాము చట్టప్రకారంగానే అన్ని ఆధారాలతో ముందుకెళుతున్నా మని.. తమ బృందంలో మంచి దర్యాప్తు అధికారులు ఉన్నారని పేర్కొన్నారు. డ్రగ్స్ వాడుతున్నట్టు ఆరోపణలు ఎదు ర్కొంటున్న మిగతా వారిని సైతం త్వరలోనే విచారిస్తామన్నారు. ఇక సుబ్బరాజు విచారణలో పలు కీలకమై న అంశాలు వెలుగులోకి వచ్చాయని ఎక్సైజ్ కమిషనర్ చంద్రవదన్ తెలిపారు. సుబ్బరాజు చెప్పిన అంశాల ఆధారం గా మిగతా వారిని విచారించాలని సిట్ భావిస్తోందని.. కేసు దర్యాప్తులో సిట్ బృందాలు కొత్త కోణాన్ని అన్వేషిస్తున్నా యని చెప్పారు. ఈ కేసులో తమపై ఎలాంటి ఒత్తిడీ లేదని, డ్రగ్స్‌ను నియంత్రించాలన్నదే ఎక్సైజ్ శాఖ ఉద్దేశమని పేర్కొన్నారు. – అకున్ సబర్వాల్ అన్ని సమాధానాలూ చెప్పా ‘‘నాకు వారం కింద నోటీసులు వచ్చాయి. అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాను. అవసరమైతే మళ్లీ విచారణకు రావడానికి సిద్ధం. కేసు విచారణ చాలా సీరియస్‌గా జరుగుతోంది. దీనిని నేను కూడా సపోర్ట్ చేస్తున్నా. చాలా మంది విద్యార్థులు డ్రగ్స్‌కు అలవాటు కావడం బాధాకరం. ఇది చాలా తీవ్రమైన సమస్య. డ్రగ్స్‌ను నియంత్రించాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది..’’ – నటుడు సుబ్బరాజు -
డ్రగ్స్ కేసు: ముగ్గురు హీరోలు, నిర్మాతలకు నోటీసులు
హైదరాబాద్ : రాజధానిలో సంచలనం సృష్టించిన డ్రగ్స్ మాఫియా కేసులో సిట్ అధికారులు బుధవారం తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన పదిమందికి నోటీసులు జారీ చేశారు. ఆరోజు రోజుల్లోగా సిట్ ముందు విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. నోటీసులు అందుకున్నవారిలో ముగ్గురు యువ హీరోలు, నలుగురు నిర్మాతలు, ఇద్దరు దర్శకులు, ఓ ఫైట్ మాస్టర్ ఉన్నారు. విచారణకు హాజరు కాకుంటే చర్యలు ఉంటాయని హెచ్చరించినట్లు తెలుస్తోంది. కాగా సినీ ఇండస్ట్రీతో పాటు ఎంఎన్సీ కంపెనీలకు డ్రగ్స్ కేసుతో సంబంధాలున్నాయన్న కోణంలోనూ పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. మరోవైపు డ్రగ్స్ రాకెట్లో పలువురు సినీ ప్రముఖుల ప్రమేయం ఉన్నట్టుగా వచ్చిన వార్తలపై తెలుగు సినీ పరిశ్రమ పెద్దలు స్పందించారు. కొంత మంది డ్రగ్స్ వాడటం వల్ల మొత్తం ఇండస్ట్రీకి చెడ్డ పేరు వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మా అధ్యక్షుడు శివాజీ రాజాతో పాటు నిర్మాతలు సురేష్ బాబు, అల్లు అరవింద్, హీరో శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. -
చిత్ర పరిశ్రమను తరలిస్తాం: బాలకృష్ణ
అమరావతి: చిత్ర పరిశ్రమను హైదరాబాద్ నుంచి తప్పకుండా తరలిస్తామని సినీ హీరో, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు. అయితే దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉందని చెప్పారు. సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారానికి శాసన సభ ఒక మంచి వేధిక కావాలని అభిప్రాయపడ్డారు. ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడానికి అసెంబ్లీ సమావేశాలు ఎంతో ఉపయోగపడతాయని చెప్పారు. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ అనే తేడా లేకుండా అందరూ ప్రజా సమస్యల పరిష్కారానికి ఐక్యంగా కృషి చేయాలన్నారు. -
ఇండస్ట్రీలో తొక్కేస్తారన్న భయం లేదు: హేమ
కాకినాడ : కాపుల రిజర్వేషన్ల అంశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్టించుకోవడం లేదని సినీ నటి హేమ అన్నారు. గురువారం కాకినాడలో జరిగిన కాపు మహిళ సదస్సులో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా హేమ మాట్లాడుతూ కాపు ఉద్యమనేత, ముద్రగడ పద్మనాభం ఉద్యమానికి తాను ఉడతాభక్తిగా సాయం అందించేందుకు సినీ పరిశ్రమ నుంచి తనకు తానుగా వచ్చినట్లు తెలిపారు. కాపు ఉద్యమంలో పాల్గొంటే చిత్ర పరిశ్రమలో అవకాశాలు రాకుండా తొక్కేస్తారన్న భయం తనకు లేవని హేమ అన్నారు. కాపులను బీసీల్లో చేరుస్తామని ఎన్నికల సందర్భంగా టీడీపీ మేనిఫెస్టోలో పెట్టినప్పుడు ఇతర కులాల నాయకులు ఎందుకు ఆ పార్టీ నుంచి పోటీ చేశారని ఆమె సూటిగా ప్రశ్నించారు. ఈ సదస్సులో పాల్గొన్నవారంతా కంచాలను గరిటలతో కొడుతూ మహిళలు తమ నిరసన తెలిపారు. కాగా గత అసెంబ్లీ ఎన్నికల్లో కిరణ్ కుమార్ రెడ్డి “జై సమైక్యాంధ్ర పార్టీ’’ తరపున హేమ ఎమ్మెల్యేగా పోటీ చేసిన విషయం తెలిసిందే. -
‘పాత’ నోటు చెల్లదు.. ‘కొత్త’ సినిమా ఆగదు!
‘దయచేసి టికెట్‌కి సరిపడా చిల్లర ఇవ్వగలరు’ - ఆర్టీసీ బస్‌లో ప్రయాణించే సామాన్యులకు ఈ మాటలు సుపరిచితమే. సినిమా బుకింగ్ టికెట్ కౌంటర్ల దగ్గర ఇప్పుడీ తరహాలో ‘కొత్త రూ.500, రూ.2,000 నోట్లు మాత్రమే తీసుకోబడును. లేదా టికెట్‌కి సరిపడా చిల్లర (రూ.100, రూ.50, రూ.20, రూ.10...) ఇవ్వగలరు’ అని బోర్డులు పెడితే...?? ఇప్పుడు సగటు సినీ ప్రేక్షకుడితో పాటు తెలుగు చిత్ర పరిశ్రమ ప్రముఖులను ఆలోచనలో పడేసిన విషయం ఇదే. రూ.500, 1,000 నోట్లను ఉపహరించాలని కేంద్రం తీసుకున్న నిర్ణయం తెలుగు చిత్ర పరిశ్రమలోనూ చర్చనీయాంశమైంది. తెలుగు సినిమాపై నోట్ల మార్పిడి అంశం ఎటువంటి ప్రభావం చూపుతుందోనని లెక్కలు వేస్తున్నారు. దేశ ప్రధాని మోదీ నిర్ణయం షూటింగ్‌లకు ఏమైనా బ్రేక్ వేస్తుందా? సినిమా వసూళ్లకు గండి కొడుతుందా? చిత్రసీమలో ముఖ్యమైన లావాదేవీలన్నీ బ్లాక్‌లోనే జరుగుతాయని ఎప్పట్నుంచో ఓ టాక్ ఉంది. ఇకపై ఆ అభిప్రాయానికి తావు లేకుండా అందరూ వైట్లోకి వచ్చేస్తారా? ఫిల్మ్ ఇండస్ట్రీలో అసలేం జరుగుతోంది - ‘సాక్షి’ సినిమా డెస్క్ మల్టీప్లెక్స్‌లో ఓ ముగ్గురు సినిమా చూడాలంటే టికెట్స్‌కి రూ.500 నోటు బయటకు తీయాల్సిందే. ఓ ఫ్యామిలీ అంతా సింగిల్ స్క్రీన్, బాల్కనీలో దర్జాగా సినిమా చూడాలన్నా రూ. 500 అవసరమే. ఆన్లైన్లో బుక్ చేసుకునే ప్రేక్షకులకు ఏ సమస్యా లేదు. థియేటర్ దగ్గర కౌంటర్లో టికెట్ కొనే ప్రేక్షకుడి చేతిలో కొత్త రూ.500, 2,000 నోట్లు లేదా చిల్లర మహాలక్ష్మి(వందలు) లేకపోతే తిప్పలు తప్పేట్లు కనిపించడం లేదు. హైదరాబాద్‌లో ప్రముఖ మల్టీప్లెక్స్ ప్రసాద్ ఐమ్యాక్స్ టికెట్స్‌ను ఆన్లైన్లో బుక్ చేసుకునేవారు 70 శాతం మంది ఉన్నారు. మిగతా 30 శాతం టికెట్స్ కౌంటర్లోనే అమ్ముడవుతున్నాయి. సింగిల్ స్క్రీన్లలో సీన్ రివర్స్‌లో ఉంది. ఇక్కడ ఆన్లైన్ టికెట్స్ బుక్ చేసుకునేవారి సంఖ్య 30 శాతమే. 70 శాతం మంది థియేటర్ దగ్గర కౌంటర్లో టికెట్స్ కొంటున్నారు. బ్యాంకుల దగ్గర గంటల పాటు లైన్లో నిలబడి చేతిలో ఉన్న పాత నోట్లు మార్చుకునే కొత్త నోటుతో ఎంతమంది ప్రేక్షకులు థియేటర్లకు వెళ్తారనే ప్రశ్నకు సమాధానం రానున్న రోజుల్లో సినిమా వసూళ్లు చెబుతారుు. నిర్మాతలకు కష్టమేనా!! పాత పెద్ద నోట్లు చెల్లకపోవడంతో సినిమా విడుదలకు ఇబ్బందులు ఉంటాయా? ఉండవా? అనే చర్చకు మిశ్రమ స్పందన వ్యక్తమైంది. మరి, షూటింగ్‌ల పరిస్థితి ఏంటి?.. ‘‘నా సినిమా షూటింగ్ మధ్యలో ఉంది. నెలాఖరు నుంచి కొత్త షెడ్యూల్ మొదలవుతుంది. ఫైనాన్షియర్ దగ్గర మొన్నే కోటి రూపాయలు తీసుకొచ్చా. ఆయనేమో ఇప్పుడు బ్యాంకులో నన్నే పాత నోట్లు మార్చి, కొత్త నోట్లు తీసుకోమని చెప్పాడు. ఈ లెక్కలు నేనెక్కడ సెట్ చేయాలి’’ అని ఓ నిర్మాత వాపోయారు. పేమెంట్స్, ఫైనాన్స, వడ్డీలు.. చిత్ర పరిశ్రమలో కొంత వరకూ బ్లాక్‌లో జరుగుతాయనే టాక్ ఉన్న విషయం తెలిసిందే!! ఇకపై, ఆ దందాలకు చెక్ పడుతుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. అసలు లెక్కలు బయటకు వస్తాయా? ఓ భారీ నిర్మాత, ‘మా సినిమా ఇండస్ట్రీ హిట్. రికార్డు వసూళ్లు సాధించింది’ అని ప్రకటించారు. మూడు రోజుల తర్వాత ఆదాయపు పన్ను అధికారులు సదరు నిర్మాత ఆఫీసుకి వెళ్లగా, ‘ప్రచారం కోసమే ఆ ప్రకటన చేశాం. అంత వసూలు చేయలేదు’ అనే సమాధానం వినిపించింది. ఓ స్టార్ హీరో సినిమా వంద కోట్లు సాధించిందని ఘనంగా ప్రకటించారు. అరుుతే.. హీరోకి సన్నిహితులైన డిస్ట్రిబ్యూటర్లు వ్యక్తిగత ప్రయోజనాల దృష్ట్యా లెక్కలు ఎక్కువ చేసి చూపించారని ఫిల్మ్ నగర్లో వినిపిస్తున్న గుసగుస. నిజానికి, ఎక్కువ శాతం నిర్మాతలు ప్రకటించే వసూళ్లకూ, ఆదాయపు పన్ను లెక్కల్లో చూపించే వసూళ్లకు సంబంధం ఉండదని కొందరు పరిశ్రమ వర్గీయులు అంటారు. ఆయా సినిమాలు అంత వసూలు చేయడం లేదా? లెక్కల్లో అసలు నొక్కేసి బ్లాక్‌లోకి పంపిస్తున్నారా? అనే సందేహాలు ఎప్పట్నుంచో ఉన్నాయి. మారిన పరిస్థితుల నేపథ్యంలో ఇకపై రాబోయే సినిమాల వసూళ్ల వ్యవహారం ‘బ్లాక్ అండ్ వైట్’లా కాకుండా పూర్తి ‘వైట్’లోనే ఉంటుందని భావిస్తున్నారు. చిక్కుల్లో చిన్న నిర్మాతలు పెద్ద సినిమాలు తీసే నిర్మాతలు దాదాపు ‘సేఫ్’గా ఉంటారు. కానీ, చిన్న చిత్రాల నిర్మాతలకు కష్టాలు తప్పవు. డబ్బు సమకూర్చుకుని సినిమా తీయడం, తీసిన తర్వాత థియేటర్లు దక్కించుకోవడం అంతా పెద్ద సమస్యే. ఇప్పుడు పాత నోట్ల స్థానంలో కొత్త నోట్లు రావడం కొంతమంది చిన్న నిర్మాతలకు ఇబ్బందిగా మారింది. రోజువారీ షూటింగ్ కోసం పెట్టుకున్న డబ్బులో పెద్ద నోట్లు ఇప్పుడు చెల్లకుండా పోయాయి. ఏటీయంలో తీసుకుందామన్నా రోజుకి 2000కు మించకూడదు కాబట్టి, ‘ఎనీ టైమ్ మనీ’ వల్ల కూడా ఉపయోగం లేదు. బ్యాంకుల్లో విత్‌డ్రా చేసుకోవడానికి పరిమితులున్నాయి. ఫలితంగా కొన్ని షూటింగ్స రద్దు అయ్యాయని ఫిల్మ్‌నగర్ టాక్. ఫైనల్‌గా చెప్పొచ్చేదేంటంటే... 100 రూపాయలు ఉన్నవాడే ఇవాళ ‘ధనవంతుడు’, పెద్ద నోట్లు ఉన్నవాడు ‘పేదవాడు’. లావాదేవీలకు ఇబ్బందే ‘‘చెక్స్ రూపంలో కాకుండా క్యాష్ రూపంలో లావాదేవీలు నడిపేవాళ్లు ఇబ్బందులు పడతారు. షూటింగ్‌కి అయ్యే డబ్బుకి ఇబ్బంది తప్పదు. ఈ కారణంగా షూటింగ్స రద్దయ్యే ప్రమాదం ఉంది. రానున్న రెండు నెలల్లో విడుదలయ్యే సినిమాల్లో కొన్నింటికి ఆటంకం ఏర్పడే అవకాశం ఉంది’’ - తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడు సి. కల్యాణ్ భవిష్యత్తులో ఇదే బాగుంటుంది ‘‘రానున్న రోజుల్లో విడుదల కాబోయే సినిమాల్లో నేను ఫైనాన్స చేసినవి కొన్ని ఉన్నారుు. సినిమా రిలీజు సమయంలో మొత్తం డబ్బు వెనక్కి ఇవ్వలేని పరిస్థితిలో నిర్మాతలు పడిపోయారు. నిర్మాతల పరిస్థితి కళ్లకు కట్టినట్లు కనిపిస్తోంది కాబట్టి.. డబ్బు చెల్లించాల్సిందేనని పట్టుబట్టలేం. గుడ్డి నమ్మకంతో వెళ్లిపోవడమే’’ - ఫైనాన్షియర్-పంపిణీదారుడు సాయిమహేశ్వర రెడ్డి వెనక్కి పంపించేశారు ‘‘బుధవారం రూ.500 నోటుతో థియేటర్‌కు వచ్చిన ప్రేక్షకుణ్ణి పలు చోట్ల వెనక్కి పంపించేశారు. ఎంతమంది దగ్గర వంద నోట్లుంటాయి చెప్పండి. దీని వల్ల వసూళ్లు తగ్గుతాయి. ‘మా సినిమా విడుదల చేయాలా? వద్దా?’ అని త్వరలో రాబోయే సినిమా నిర్మాతలు సలహా అడుగుతుంటే.. ఏం చెప్పలేని పరిస్థితి’’ - ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ ‘దిల్’ రాజు. ప్రభావం చూపించదు.. పెద్ద నోటు రద్దు చిత్రపరిశ్రమపై పెద్దగా ప్రభావం చూపించదనే అనుకుంటున్నా. లావాదేవీల విషయంలో కొంత ఇబ్బంది ఉండొచ్చు. ముఖ్యంగా ఫైనాన్షియర్లకు సమస్యే. మల్టీప్లెక్స్ ప్రేక్షకులు ఎక్కువ శాతం ఆన్లైన్లో కొనేస్తున్నారు. సామాన్య థియేటర్లలో టికెట్ ధర వంద లోపే ఉంటుంది కాబట్టి, నో ప్రాబ్లమ్. - నిర్మాత అనిల్ సుంకర కన్ఫ్యూజన్ కామన్ తెలుగు చిత్ర పరిశ్రమలో మాత్రమే కాదు, నగదుతో లావాదేవీలు ముడిపడిన ప్రతి రంగంలోనూ అవినీతి, నల్లధనం ఉన్నాయి. వాటిని అరికట్టడానికి ఇదో అద్భుత అవకాశం. ఇటువంటి సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నప్పుడు, ప్రారంభంలో కన్ఫ్యూజన్ ఉండటం కామన్. కానీ, ఆర్థిక లావాదేవీల్లో పారదర్శకత పెరుగుతుంది.- దర్శకుడు ఎన్.శంకర్ -
నయీమ్ కీ కహానీ!
స్వీయ చరిత్రను తెరకెక్కించేందుకు గ్యాంగ్‌స్టర్ యత్నాలు సాక్షి, హైదరాబాద్: రాజకీయాల్లోకి అడుగుపెట్టాలని భావించిన గ్యాంగ్‌స్టర్ నయీమ్ అం తకుముందే తన జీవిత చరిత్రను సినిమా రూపంలో తెరకెక్కించే ప్రయత్నాలు చేశాడా? ఆ చిత్రంలో తన నెగెటివ్ ఇమేజ్‌కు ముసుగేసి ‘పాజిటివ్’గా చూపించుకోవాలని ఆరాటపడ్డాడా? అందుకు తెలుగు సినీ పరిశ్రమలోనూ కొందరితో సంప్రదింపులు కూడా జరిపాడా? అవుననే అంటున్నారు పోలీసులు. నయీమ్ ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న డైరీల్లోని ఇందుకు సంబంధించిన విషయాలున్నాయని వారు చెబుతున్నారు. భువనగిరి అసెంబ్లీ సీటుపై కన్నేసిన నయీమ్ ఆ సన్నాహాల్లో భాగంగానే తన సినిమానూ ప్రచారాస్త్రంగా వాడుకోవాలని భావించినట్లు తెలిసింది. రాజకీయ సన్నాహాల్లో భాగంగానే.. కరుడుగట్టిన నేరగాడైన నయీమ్‌కు మాజీ మావోయిస్టుగా, గ్యాంగ్‌స్టర్‌గానే పేరుంది. ఇతడి ఆగడాలు, చేసిన దారుణాలకు అంతే లేకపోవడంతో స్థానికంగానూ చెడ్డపేరు ఉంది. ఈ ఇమేజ్‌తో రాజకీయాల్లో అడుగుపెట్టడం, రాణించడం కష్టమంటూ నయీమ్‌కు ‘సన్నిహితులు’ సలహా ఇచ్చారు. దీంతో నెగెటివ్ ఇమేజ్ పొగొట్టుకునే ప్రయత్నాల్లో భాగంగానే భువనగిరి నియోజకవర్గంలోని 30 వార్డుల్లో 30 వాటర్ ప్లాంట్స్ నిర్మాణానికి అతడు యత్నంచినా ఫలించలేదు. ఈ నేపథ్యంలోనే నయీమ్ దృష్టి రాయలసీమ ఫ్యాక్షనిజం ప్రధానంగా వచ్చిన ‘రక్త చరిత్ర’ చిత్రాలపై పడింది. అదే మాదిరిగా తన స్వీయచరిత్రను తెరకెక్కించాలని భావించాడు. నయీమ్ గతంలో జూబ్లీహిల్స్‌లోని ఓ క్లబ్‌కు తరచుగా వెళ్లేవాడు. ఇది సినీ ప్రముఖులు ఎక్కువగా వచ్చేది కావడంతో అక్కడ పరిచయమైన వారి ద్వారానే తన సినిమాను చిత్రీకరించాలని నిర్ణయించుకున్నాడని సమాచారం. ‘సక్సెస్’ కోణాన్ని చూపించుకోవాలని.. ఈ చిత్రంలో తనలోని నెగెటివ్ అంశాలను కాకుండా ‘పాజిటివ్’ అంశాలనే చూపించి, వాటినే ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని నయీమ్ భావించాడు. తన భూకబ్జాలు, దందాలు వంటి నేర జీవితాన్ని మినహాయించి మావోయిస్టుగా తాను చేసిన పనులు, ఉద్యమం నుంచి బయటకు వచ్చాక మావోయిస్టులకు వ్యతిరేకంగా చేపట్టిన ఆపరేషన్లతో పాటు పోలీసులకు ఇన్ఫార్మర్గా పని చేసినప్పుడు తన ద్వారా అధికారులు సాధించిన ‘సక్సెస్’లు మాత్రమే తెరకెక్కించాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఇందుకు తన డైరీల్లో రాసుకున్న అనేక కీలకాంశాలను నెమరు వేసుకున్నాడని సమాచారం. తెలుగు సినీ రంగానికి చెందిన ఇద్దరు ద్వితీయ శ్రేణి దర్శకులతో నయీమ్ సంప్రదింపులు జరిపాడు. చిత్ర నిర్మాణానికి అవసరమైన నిధులు తానే ఇస్తానని, సినిమా తీయాలని వారిని కోరినట్లు తెలిసింది. 2019లో రాజకీయాల్లోకి అడుగుపెట్టాలని భావిస్తున్న నేపథ్యంలో 2018 ద్వితీయార్థం లేదా 2019 ప్రథమార్ధంలో ఈ చిత్రం విడుదలయ్యేలా నయీమ్ ప్రణాళికలు రచించినట్లు తెలుస్తోంది. అక్కడా ఓ ‘పోలీసు’తో పరిచయం చిత్ర నిర్మాణంపై ప్రాథమిక చర్చలు గోవాలో నయీమ్‌కు ఉన్న కోకోనట్ గెస్ట్‌హౌస్‌లో జరిగినట్లు తెలిసింది. సదరు దర్శకులతో కలసి రోడ్డు మార్గంలో అక్కడకు వెళ్లిన నయీమ్ 3 రోజుల పాటు సినిమాపై చర్చించాడు. ఈ సందర్భంలో నయీమ్‌తోపాటు ఓ మహిళ కూడా కీలకంగా వ్యవహరించినట్లు సమాచారం. సదరు దర్శకుల్లో ఒకరి సలహా మేరకే... పోలీసులు గుర్తుపట్టకుండా ఉండేందుకు వేషం మార్చడం, మేకప్ కిట్స్ వినియోగించడంవంటివి ప్రారంభించినట్లు పోలీసులు చెబుతున్నారు. సినీ రంగంతో మంచి పరిచయాలున్న ఓ మాజీ పోలీసు ఉన్నతాధికారితో కూడా నయీమ్‌కు జూబ్లీహిల్స్ క్లబ్లో పరిచయం ఏర్పడింది. ఆ అధికారికి నయీమ్‌తో ఉన్న సంబంధాలు ఏమిటన్న అంశంపై పోలీసు వర్గాలు దృష్టి పెట్టి కూపీ లాగుతున్నాయి. -
తెలుగు వెండితెరపై మాజీ సీఎం తనయుడు!
బెంగళూరు: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్.డీ.కుమారస్వామి తనయుడు నిఖిల్ కుమార్ త్వరలో తెలుగు సినిమాల్లో నటించనున్నట్లు సమాచారం. కన్నడ సినీ రంగంలో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న జాగ్వార్ చిత్రం ద్వారా అతడు శాండల్ వుడ్‌కు పరిచయం కాబోతున్నాడు. కాగా ఊపిరి, బ్రహ్మోత్సవం తదితర చిత్రాలను నిర్మించి భారీ నిర్మాణ సంస్థగా పేరు పొందిన పీవీపీ నిర్మాణ సంస్థ ద్వారా నిఖిల్ కుమార్ తెలుగు చిత్రపరిశ్రమకు ఎంట్రీ ఇవ్వనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కొరటాల శివ దర్శకత్వంలో నిఖిల్ హీరోగా నటించనున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అటు దర్శకుడు కానీ, పీవీపీ నిర్మాణ సంస్థగానీ, హీరో నిఖిల్ కానీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. కాగా గతంలో దర్శకుడు పూరి జగన్నాథ్ కూడా నిఖిల్ హీరోగా ఓ చిత్రం చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. -
ఎందరో కమెడియన్లను పరిచయం చేశా
ప్రముఖ దర్శకుడు వంశీ మలికిపురం/సఖినేటిపల్లి : తెలుగు సినీ పరిశ్రమకు ఎంతో మంది కామెడీ నటులను పరిచయం చేసిన ఘనత తనకే దక్కిందని ప్రముఖ సినీ దర్శకుడు వంశీ అన్నారు. కొత్త సినిమా కథను రూపొందించే క్రమంలో సోమవారం ఆయన మలికిపురం, మోరి గ్రామాల్లో పర్యటించారు. తొలి రోజుల్లో రూపొందించిన సూపర్ హిట్ కామెడీ చిత్రాలు ‘లేడీస్ టైలర్, శ్రీకనకమహాలక్ష్మీ రికార్డింగ్ డాన్స్ ట్రూప్’లను ఆయన మోరి , శివకోడు గ్రామాల్లో చిత్రీకరించారు. ఆ గ్రామాలను కూడా ఆయన ప్రస్తుతం సందర్శించారు. ఈ సందర్భంగా తనను కలిసిన విలేకరులతో మాట్లాడుతూ తూర్పు గోదావరి జిల్లాతో తనది విడదీయరాని బంధం అన్నారు. గోదావరి నేపథ్యంలో అనేక సినిమాలు తీశానని, అవన్నీ విజయవంతం అయ్యాయని చెప్పారు. తాను రచించిన పసలపూడి కథలు ఎంతో ప్రాచుర్యం పొందాయన్నారు. కోటిపల్లి-కాకినాడ సింగిల్ రైలుపై తాను రాసిన కథ ఎంతో పేరు తెచ్చిందన్నారు. -
'బాబు బంగారం' యూత్‌కు కనెక్టయితే హిట్టే
సినీ దర్శకుడు మారుతి చిన్న సినిమాలు తీసి పెద్ద హిట్లు కొట్టి తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకుడు మారుతి. వరుసగా ఐదు హిట్ సినిమాలకు దర్శకత్వం వహించిన ఆయన తన సక్సెస్ సీక్రెట్‌ను చెప్పారు. యూత్ ఆలోచనలకు దగ్గరగా సినిమా ఉంటే హిట్టు గ్యారంటీ అని అన్నారు. ప్రస్తుతం తన పంథాను విడిచి పెద్ద హీరో అయిన వెంకటేష్‌తో ‘బాబు బంగారం’ అంటూ ప్రేక్షకుల ముందుకు వస్తున్న మారుతి.. భట్లపాలెం బీవీసీ కళాశాలలో జరుగుతున్న హోరైజన్-2కే16 ముగింపు ఉత్సవాలకు విచ్చేశారు. ఈ సందర్భంగా ‘సాక్షి’తో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. - అమలాపురం రూరల్ ‘‘మచిలీపట్నంలో డిగ్రీ చదివాను. నేమ్ బోర్డులు తయారు చేసేవాడిని. కంప్యూటర్ యానిమేషన్ కోర్సు చేసి హైదరాబాద్ వెళ్లాను. అలా తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాను. ఈరోజుల్లో... బస్టాప్ వంటి లో బడ్జెట్ సినిమాలు తీశాను. అవి మంచి విజయాన్ని తెచ్చిపెట్టాయి. దాంతో నిలదొక్కుకున్నాను. నాదంటూ ట్రెండ్ ఏమీ ఉండదు. మనం తీసిన సినిమా ప్రేక్షకులకు కనెక్టయితే తప్పకుండా విజయం సాధిస్తుంది. ప్రస్తుతం హీరో వెంకటేష్‌తో ‘బాబు బంగారం’ సినిమా తీస్తున్నాను. షూటింగ్ ప్రోగ్రెస్‌లో ఉంది. త్వరలోనే యానిమేషన్ చిత్రాలు తీయాలనుకుంటున్నాను. దర్శకుల్లో కళాతపస్వి కె.విశ్వనాథ్, జంధ్యాల, ప్రస్తుత తరంలో రాజమౌళి అంటే ఇష్టం. ఇక నాకంటూ ఓ స్టైల్ ఉంది. దానితోనే సక్సెస్ అవుతున్నాను. మెగాస్టార్ చిరంజీవి కుటుంబంతో సన్నిహిత సంబంధాలున్నాయి. చిరంజీవి, పవన్ కళ్యాణ్ సినిమాలు ఎక్కువగా చూసేవాడిని. వారితో కలిసి పనిచేశాను. కెరీర్లో స్థిరపడాలంటే యువత లక్ష్యం నిర్దేశించుకోవాలి. మనం ఏం చేస్తున్నా.. లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకుంటే సక్సెస్ అవుతాం.’’ -
లైలా నేర్పిన లీలలే!
ఆ సీన్ - ఈ సీన్ తెలుగు సినిమా పరిశ్రమలో కాపీ ప్రక్రియకు ఈ మధ్య కాలంలో కొత్త టచ్ ఇస్తున్నారు దర్శక, నిర్మాతలు. అయాచితంగా కథలను కాపీ కొట్టేస్తూ... అంతా తమ క్రియేటివిటీనే అని చెప్పుకొన్న ఫిల్మ్ మేకర్లు ఇప్పుడు... ఒరిజినల్ రచయితలకు క్రెడిట్ ఇవ్వడం కూడా మొదలుపెట్టారు. తాము తమ సినిమా కథను ఫలానా విదేశీ సినిమా నుంచి తెచ్చుకున్నామని, దాని స్ఫూర్తితో సినిమాను రూపొందిస్తున్నామని వీరు బహిరంగంగానే చెబుతున్నారు. పరిశోధకులకు ప్రత్యేక పని పెట్టకుండా ఒరిజినల్ మూవీ పేరును చక్కగా చెప్పేస్తున్నారు. అయితే ఈ ధైర్యం కొంతమందిలో మాత్రమే కనిపిస్తోంది. నేటికీ విదేశీ సినిమాల స్ఫూర్తితో కథలు తయారు చేసుకుని.. అసలు వాళ్లకు క్రెడిట్ ఇవ్వకుండా మార్కెట్లోకి చొరబడుతున్న సినిమాలు ఉన్నాయి. అలాంటి వాటిలో ఒకటి... ‘కుమారి 21 ఎఫ్’. ఇటీవలే విడుదలైన ఈ ‘బోల్డ్’ సినిమా 2004లో వచ్చిన ఫ్రెంచి సినిమా ‘లైలా సేస్’కు యథాతథ అనుకరణ అని చెప్పాలి. యువతలో మెచ్యూరిటీ గురించిన డిస్కషన్లా సాగే ‘కుమారి 21 ఎఫ్’ సినిమా... మెచ్యూరిటీ ఉన్నవాళ్లకు మాత్రమే నచ్చుతుందని, మెచ్యూరిటీ లేని వాళ్లకు బూతుగా అనిపిస్తుందన్న విశ్లేషణలు వినిపించాయి. ఈ సినిమా చూసే ప్రేక్షకుల థాట్ విషయం ఎలా ఉన్నా... సినిమా కాన్సెప్ట్ వెనుక అసలు థాట్ మాత్రం ఫ్రెంచి వాళ్లదే. తెలుగులో ’ఆర్య’ వంటి వన్ సైడ్ లవర్‌ను సృష్టించిన సుకుమార్... రచయితగా సృష్టించిన ‘కుమారి’కి అసలు ప్రేరణ ‘లైలా’ అని చెప్పాలి. 16 యేళ్ల లైలా తను కొత్తగా వచ్చి సెటిలైన ప్రాంతంలో నివసిస్తోన్న చిమో అనే టీనేజర్‌తో తొలి చూపులోనే ప్రేమలో పడుతుంది. తన ఆంటీతో కలిసి ఉండే లైలా చాలా స్వేచ్ఛగా ఉంటుంది. తనకు నచ్చిన వాడితో తన ప్రేమను గురించి మొహమాటం లేకుండా చెప్పేయడంతో పాటు... సెక్సీటాక్నే మొదలుపెడుతుంది. దీంతో కుర్రాడిలో కొత్త గుబులు మొదలవుతుంది. ఆమెపై ప్రేమ కలిగినా, ఆమె తీరుపై అనుమానపడతాడు. సరిగ్గా అదే సమయంలో హీరో ఫ్రెండ్స్ అతడిలో కొత్త అనుమానాలు రేపుతారు. ఆమెపై కన్నేసిన హీరో ఫ్రెండ్ ఒకడు హీరో మనసులో అనుమాన బీజాలు నాటి... ఆమె ప్రవర్తనను బట్టి ఆమె వర్జిన్ కాదనే డౌట్‌ను రెయిజ్ చేస్తాడు. ఒకవైపు ఆమెతో సన్నిహితంగా ఉంటూనే, ఆమె దగ్గరే తన అనుమానాలను వ్యక్తం చేసే హీరోకి క్లైమాక్స్‌తో జ్ఞానబోధ అవుతుంది. ‘లైలా సేస్’ సినిమాకు సంబంధించిన ఈ కథ, కథనమే.. ‘కుమారి 21ఎఫ్’లో యాథాతథంగా కొనసాగించారు. ఫ్రెంచ్ సినిమా వెర్షన్లో హీరో అల్లరి చిల్లరి ఫ్రెండ్స్‌తో తిరుగుతుంటాడు. హీరో ఫ్రెండ్స్‌లో ఒకడు హీరోయిన్ను బాగా వేధిస్తుంటాడు. చివర్లో వాడే హీరోయిన్‌పై అఘాయిత్యానికి పాల్పడతాడు. అప్పటికి అనుమానం అనే జాడ్యాన్ని వదిలించు కున్న హీరో ఆమెపై తన ప్రేమను వ్యక్తం చేస్తాడు. తెలుగులో వెర్షన్లో ఈ విషయంలో, ఈ సన్నివేశాల్లో ఎలాంటి మార్పులూ లేవు. అయితే హీరోయిన్ నేపథ్యంలో కొన్ని మార్పులు, హీరో నేపథ్యంలో చిన్ని చిన్ని మార్పులు చేశారు. హీరోయిన్ను ఒక మోడల్‌గా చూపించారు. ఆమె తన తాతయ్యతో కలిసి ఉన్నట్టుగా చూపారు. ఫ్రెంచి సినిమాలో హీరోయిన్ క్యారెక్టరైజేషన్లో మరింత ‘బోల్డ్నెస్’ ఉంటుంది. తెలుగు వెర్షన్లో హీరో చెఫ్ కావాలనే లక్ష్యాన్ని పెట్టుకుని ఉంటాడు. అయితే ఫ్రెంచి వెర్షన్లో హీరో రచయిత కావాలనే లక్ష్యంతో ఉంటాడు. ఆ లక్ష్యానికీ క్లైమాక్స్‌కు చాలా చక్కగా ముడి పెట్టారు. ప్రియురాలిపై తన ప్రేమను వ్యక్తం చేసిన హీరో రచయితగా తన ప్రేమకథనే రాసి సక్సెస్ అవుతాడు. తెలుగులో మాత్రం రివెంజ్ డ్రామాను యాడ్ చేశారు. ఫ్రెంచి నాగరికతలో యువతీ యువకుల ఆలోచనా తీరుకు దర్పణం పట్టింది ‘లైలా సేస్’. అలాంటి సినిమాను యథాతథంగా కాపీ కొట్టి.. తెలుగులో తీసేశారు. అలాంటప్పుడు మన సంస్కృతిలో ‘కుమారి’ వంటి క్యారెక్టర్ అన్‌న్యాచురల్ అనే విమర్శలు వచ్చాయంటే రావా మరి! - బి.జీవన్‌రెడ్డి -
చెన్నైని తెలుగు చిత్ర పరిశ్రమ ఆదుకుంటుంది
తిరుమల: తెలుగు చిత్ర పరిశ్రమ చెన్నై కేంద్రంగానే ప్రారంభమైందని, వరద విపత్తులో చిక్కుకున్న చెన్నైలోని బాధితులను ఆదుకునేందుకు తెలుగు సినీ చిత్ర పరిశ్రమ ముందుకొచ్చిందని సినీనటి జయప్రద అన్నారు. గురువారం ఆమె కుటుంబ సభ్యులతో కలసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. వరద కారణంగా చెన్నైలో తీవ్రమైన ఆస్తినష్టం, ప్రాణనష్టం సంభవించిందని ఆవేదన వ్యక్తంచేశారు. ఆ నష్టాన్ని ఎవరూ పూడ్చలేరని, తమవంతు బాధ్యతగా తెలుగు చిత్ర పరిశ్రమ ముందుకొచ్చిందని అన్నారు. సాధ్యమైనంత త్వరలోనే బాధితులను ఆదుకుంటామని తెలిపారు. శ్రీవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. -
వరద బాధితులను ఆదుకోండి: జగన్
సాక్షి, హైదరాబాద్: నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో కురుస్తున్న వర్షాలు, వరదలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలను ఆదుకోవాలని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్టీ నేతలను ఆదేశించారు. ఆయన బుధవారం ఆ జిల్లాల పార్టీ నేతలతో ఫోన్లో మాట్లాడి అక్కడి పరిస్థితులను తెలుసుకున్నారు. ఇబ్బందుల పడుతున్న వారి కోసం తక్షణం సహాయక చర్యలు చేపట్టాలని వారికి సూచించారు. మరింత అప్రమత్తంగా ఉండండి అధికారులు, ప్రజాప్రతినిధులకు సీఎం ఆదేశం సాక్షి, విజయవాడ బ్యూరో: వచ్చే రెండు రోజుల్లో భారీ వర్షాలు కురవనున్న నేపథ్యంలో మరింత అప్రమత్తంగా ఉండాలని చిత్తూరు, నెల్లూరు జిల్లాల కలెక్టర్లను సీఎం చంద్రబాబు ఆదేశించారు. బుధవారం గుంటూరు జిల్లా ఉండవల్లిలోని తన నివాసం నుంచి రెండు జిల్లాల కలెక్టర్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జన్మభూమి కమిటీలు, ప్రజాప్రతినిధులతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్షాలు, వరదల్లో చిక్కుకొని ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలను వెంటనే పునరావాస శిబిరాలకు తరలించాలని సూచించారు. వైద్య ఆరోగ్య శాఖ, గ్రామీణ నీటి సరఫరా, పారిశుధ్య విభాగాల అధికారులు బృందాలుగా ఏర్పడి క్లోరినేషన్, వైద్య శిబిరాల నిర్వహణలో పాల్గొనాలని చెప్పారు. బాధిత ప్రజలకు అందుబాటులో ఉండడం మినహా మరో ముఖ్యమైన కార్యక్రమం లేదని స్పష్టం చేశారు. తమిళనాడుకు మన వంతు సాయం చేద్దాం సీఎస్ రాజీవ్ శర్మకు సీఎం కేసీఆర్ ఆదేశం సాక్షి, హైదరాబాద్: చెన్నైలో కురిసిన భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తం కావడం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తమిళనాడు ప్రభుత్వానికి అవసరమైన సహాయమందించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు. తమిళనాడు అధికారులతో మాట్లాడి కావాల్సిన సాయం చేయాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మను ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జ్ఞాన్ దేసికన్తో రాజీవ్ శర్మ ఫోన్లో మాట్లాడారు. సీఎం కేసీఆర్‌కు, ప్రభుత్వానికి దేసికన్ కృతజ్ఞతలు తెలిపారు. తమ ప్రభుత్వాన్ని సంప్రదించి సహాయం కోరుతామని పేర్కొన్నారు. తమిళనాడుకు బాసటగా తెలుగు సినీ పరిశ్రమ తమిళనాడులో సంభవించిన తుపాను ఆ రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేస్తోంది. భారీ వర్షాల కారణంగా అక్కడి ప్రజలు ఇబ్బందులపాలవుతున్నారు. ఇప్పటికే తమిళ సినిమా తారలు ఆర్థిక సహాయంతో పాటు, ఆహారం అందజేయడం వంటివి చేస్తున్నారు. ‘మేము సైతం’ అంటూ మన తెలుగు తారలు కూడా సహాయానికి ముందుకొచ్చారు. ఇప్పటివరకూ మన తెలుగు,తమిళ పరిశ్రమల నుంచి తారల ఆర్థిక సహాయం వివరాలు రూపాయల్లో -
‘ప్రిన్స్’తో అవకాశమొస్తే...
తెలుగు సినిమాల్లో నటించాలనే కోరిక ఉందని.. అయితే ఆ అవకాశం మహేష్‌బాబు పక్కన దొరికితే అంతకుమించిన ఆనందం మరొకటి లేదని బాలీవుడ్ నటి, మాజీ మిస్ ఇండియా జోయా అఫ్రోజ్ అన్నారు. బంజారాహిల్స్‌లోని తాజ్‌కృష్ణా హోటల్లో శుక్రవారం గ్లిడ్జ్ అండ్ గ్లామ్ దుస్తుల ప్రదర్శనకు సంబంధించిన సన్నాహక కార్యక్రమంలో భాగంగా బ్రోచర్‌ను ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలుగు సినిమాలు చాలా బాగుంటాయని, ఇటీవల బాహుబలి సినిమా చూశానన్నారు. హాలీవుడ్ సినిమాకు ఏ మాత్రం తక్కువ కాదన్నారు. దక్షిణాదిలో అవకాశాలు వస్తున్నాయని, త్వరలోనే తెలుగు సినిమాలో హీరోయిన్గా నటిస్తానని చెప్పారు. ‘మొగల్ ఏ ఆజం’ సినిమా అంటే ఎంతో ఇష్టమని అందులో నటనకు పుష్కలమైన అవకాశం ఉందన్నారు. హైదరాబాద్వాసుల్లో ఎప్పుడూ హ్యాపీనెస్ కనబడుతుందని, అది తనకెంతో ఇష్టమన్నారు. కోకో కోలా యాడ్‌లో నటించడంతో మంచి గుర్తింపు వచ్చిందని పేర్కొన్నారు. ప్రస్తుతం బాలీవుడ్లో ‘ఎక్స్పోజ్’ అనే సినిమాలో నటిస్తున్నానని ఆమె చెప్పారు. - బంజారాహిల్స్ -
'రివ్యూలు చదవొద్దు.. ఎవరి మాటలు వినొద్దు'
హైదరాబాబాద్: 'బాహుబలి' సినిమా అత్యద్భుతంగా ఉందని హీరో అల్లు శిరీష్ అన్నారు. సినిమా చూస్తున్నంతసేపు తనను తాను మైమరచిపోయానని ట్విటర్ లో పేర్కొన్నారు. భారతీయ సినీ చరిత్రలో ఇలాంటి సినిమా ఇంతకు ముందెన్నడూ రాలేదన్నారు. తెలుగు చిత్రసీమ నుంచి ఇలాంటి గొప్ప సినిమా వచ్చినందుకు గర్వపడుతున్నానని తెలిపారు. 'బాహుబలి' సినిమా గురించి వర్ణించేందుకు మాటలు సరిపోవడం లేదన్నారు. ఈ చిత్రం గురించి ట్విట్టర్ లో చెప్పాల్సి వస్తే తనకు 10 నుంచి 15 ట్వీట్లు అవసరమవుతాయన్నారు. ఎటువంటి రివ్యూలు చదవొద్దు, ఎవరు చెప్పిన మాటలు వినొద్దు. నేరుగా ధియేటర్ కు వెళ్లి సినిమా చూడండి' అని ప్రేక్షకులకు సూచించారు. -
'ఎంత పనైపోయింది అత్తయ్యా..'
అత్తాలేని కోడలుత్తమూరాలూ ఓయమ్మా... కోడలు లేని అత్త గుణవంతురాలూ... ఆహుమ్.. ఆహుమ్... అసలు అత్తాకోడళ్లు లేకపోతే తెలుగు సినిమా ఇండస్ట్రీలో మొట్టికాయలు వేసేవాళ్లే ఉండేవాళ్లు కాదు. అత్త రుసరుసలు, కోడళ్ల విసవిసలు సిల్వర్ స్క్రీన్ నుంచి ఇప్పుడు ఇంట్లో టీవీల్లోకి వచ్చేశాయి. సీరియళ్లు సీరియళ్లుగా నడుస్తూ మ్యారథాన్ పరుగులు తీస్తున్నాయి. ఇది సరిపోక ఇప్పుడు యూట్యూబ్‌ని కూడా ఆక్రమించాయి. ‘చిన్నారి అత్తాకోడళు’్లగా యూ ట్యూబ్‌లో ఈ జంట పెద్ద హిట్. డిఫరెన్స్ ఏంటంటే... సినిమాల్లో అత్తాకోడళ్లు కొట్టుకునేవాళ్లు. టీవీల్లో కీచులాడుకుంటున్నారు. యూట్యూబ్‌లో కిసుక్కులాడుకుంటున్నారు. కోడలిగా ఐదేళ్ల యోధ, అత్తగా పదేళ్ల రమ్యశ్రీల యుద్ధాలు కడుపుబ్బా నవ్విస్తున్నాయి. నుదుటికి చేతులు ఆన్చుకుని అత్తగారు ఏడుస్తున్నారు. ఆమెను చూసి కోడలూ ఏడుపందుకుంది ‘అయ్యో... ఏమయింది అత్తయ్యా!’ అంటూ! ‘ఏం చెప్పనే తల్లీ.. మనిద్దరికీ పడదని, మనిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందని ఊరువాడా కోడై కూస్తోందే!’ అంటూ ఏడుపు రాగం పెంచింది అత్తగారు! ‘ఎంత పనైపోయింది అత్తయ్యా..’ అంటూ బుగ్గలు నొక్కుకుంటూ కోడలూ శ్రుతి పెంచింది. ఓ క్షణం ఇద్దరూ ఎవరి ఆలోచనల్లో వాళ్లుండిపోయి మొహమొహాలు చూసుకుని ఒక్కసారే ‘వా....’ అంటూ మళ్లీ ఏడుపు లంకించుకున్నారు. శోకరాగాలు పెట్టీపెట్టీ చివరకు అత్తగారు ఓ కన్క్లూజన్కొచ్చారు. ‘ఒసే శిరీషా... ఇక నుంచి మనిద్దరం పోట్లాడుకోకూడదు. నేను చెప్పింది నువ్వు వినాలి. నువ్వు చెప్పింది నేను వింటాను సరేనా?’ అంది. ‘అలాగే అత్తయ్య.. నేను చెప్పింది మీరు వినండి.. మీరు చెప్పింది నేను వింటాను’ అంది కోడలు కళ్లు తుడుచుకుంటూ! ‘నేననేదీ అదేనే పిచ్చిమొద్దూ.. నేను చెప్పింది నువ్వు వినాలి.. నువ్వు చెప్పింది నేను వింటాను’ అంది అత్త గద్దిస్తూ! ‘నేననేదీ అదే అత్తయ్యా.... నేను చెప్పింది మీరు వినాలి.. మీరు చెప్పింది నేను వింటాను’ అంది కోడలూ అదే స్వరంతో! ‘కాదు నేను చెప్పింది వినాలి’ అని అత్త అంటే ‘కాదు నేను చెప్పింది’ అని కోడలు. అలా నేనంటే నేను అని పోట్లాటకు దిగారు ఇద్దరూ! ఇదేదో సూర్యకాంతం, సావిత్రి నటించిన సినిమా కాదు. కానీ వాళ్లను సైతం మరిపించిన బుల్లి ఆర్టిస్టుల స్కిట్! అత్తగా పదేళ్ల రమ్యశ్రీ, కోడలిగా అయిదేళ్ల యోధ.. అదరగొట్టారు! డిఫరెంట్ ఇష్యూస్ మీద అత్తాకోడళ్ల స్కిట్స్‌తో ఈ సమ్మర్‌ని కూల్ చేశారు. అత్తగారిలా మెటికలు విరవడం, బుగ్గలు నొక్కుకోవడం... ముక్కున వేలేసుకొని విస్తుపోవడం.. లాంటి మ్యానరిజమ్స్ ఎలా తెలిశాయి? అని బుజ్జి అత్త రమ్యశ్రీని అడిగితే.. ‘సూర్యకాంతంగారి వల్ల’ అంటూ ఠక్కున జవాబు చెప్తుంది. ‘ఆవిడ ఎవరో నీకు తెలుసా?’ అని మనం ఆశ్చర్యపోయేలోపే ‘గుండమ్మ కథ’ సినిమాలో గుండమ్మగా యాక్ట్ చేసిన ఆవిడ! నాకు ఆ సినిమా అంటే చాలా ఇష్టం. అందులో సూర్యకాంతం గారంటే మరీ ఇష్టం. నన్ను అత్తగారిలా చేయమని చందూ అన్నయ్య (ఈ అత్తాకోడళ్ల స్కిట్స్ డెరైక్టర్, యోధ తండ్రి కె. చంద్రశేఖర్) చెప్పగానే నాకు గుండమ్మ కథ సినిమా, అందులో సూర్యకాంతం గారే గుర్తొచ్చారు. అంతే... ఆమెనే ఇమిటేట్ చేశా!’ అని వివరించేసింది రమ్యశ్రీ. సొగసరి కోడలు సూర్యకాంతం లాంటి గడసరి అత్త పెద్దరికానికి సమయస్ఫూర్తితో చెక్‌పెట్టే సావిత్రి లాంటి సొగసరి కోడలుగా హండ్రెడ్ మార్క్స్ కొట్టేసింది యోధ. ‘కోడలు అంటే అలా మూతి ముడవాలని, ముక్కు తిప్పాలని ఎవరు చెప్పారు?’ అని అడిగితే ‘ఎన్ని సీరియల్స్ చూడట్లేదూ?’ అంటూ దీర్ఘం తీసింది. ‘కోడలు శిరీషగా చేస్తున్నప్పుడు టీవీలో వచ్చే ‘అమ్మ నా కోడలా’లో కోడలినే గుర్తు తెచ్చుకున్నావా?’ అని అడిగితే ‘ఉహూ.. సావిత్రిగారిని!’ అని యోధ ఆన్సర్. ‘అబ్బో సావిత్రిగారు కూడా తెలుసా నీకు?’ అంటూ అబ్బురపడుతుంటే ‘మా అత్తగారికి సూర్యకాంతం తెలిసినప్పుడు నాకు సావిత్రిగారు తెలియరేంటి?’ అంది గడుసుగా. ‘అయితే నువ్వూ గుండమ్మ కథ చూశావా?’ అన్నప్పుడు... ‘చూశాను’ అంది. ‘కానీ గుండమ్మ కథలో సావిత్రిగారేం నీలాంటి మాటకారి కోడలు కాదే?’ అని అడిగితే... ‘మాటకారి తనాన్ని నేను యాడ్ చేసుకున్నా’ అంటుంది ఆరిందలా చేతులు తిప్పుతూ! ‘సరే.. అత్తాకోడళ్లుగా చేశారు కదా... ఏమనిపించింది?’ అని అడిగితే... ‘యాక్టింగ్ అంటే నాకు చాలా ఇష్టం. గోవిందుడు అందరివాడేలే, ఒక లైలా కోసం, సూర్య వర్సెస్ సూర్య, ప్యార్ మే పడిపోయానే అలా ఇప్పటిదాకా 39 సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా యాక్ట్ చేశా. కాబట్టి నాకు మా నాన్న ఇచ్చిన కోడలి వేషం చాలా ఇంట్రెస్టింగ్‌గానే అనిపించింది మరి. ఈజీ చేసేశా’ అంటూ అంతే ఈజీగా చెప్పేసింది యోధ. ‘అత్తగారి వేషం వేయడానికి నాకూ పెద్ద కష్టమనిపించలేదు. ఎందుకంటే నేను కూచిపూడి డాన్సర్‌ని కాబట్టి. ఇందాకే చెప్పాను కదా.. సూర్యకాంతంగారిని గుర్తుతెచ్చుకున్నానని. ఈ రెండూ రీజన్స్ వల్ల ఈజీగా యాక్ట్ చేశాను’ తన విజయ రహస్యం చెప్పింది రమ్యశ్రీ అత్త ఉత్తమురాలు... కోడలు గుణవంతురాలు ఈ స్కిట్స్‌లో అత్తాకోడలుగా మీరిద్దరూ కౌంటర్స్ వేసుకుంటుంటారు కదా.. రియల్ లైఫ్‌లో అత్తాకోడళ్లు ఎలా ఉండాలనుకుంటున్నారు? అని అడిగితే... ‘కోడలు ఇలా మాత్రం ఉండొద్దమ్మా..!’ అంటూ రమ్యశ్రీ ముక్కు తిప్పితే.. ‘అత్తగారూ ఇలా ఉండొద్దు లెండీ!’ అంటూ యోధా మూతి ముడిచింది. అంతలోకే నవ్వుకుంటూ ఇద్దరూ ఒకరి భుజం మీద ఒకరు చేతులేసుకొని ‘అత్తా, కోడలు ఇద్దరూ ప్రేమగా ఉండాలి.. కలిసికట్టుగా ఒక జట్టుగా ఉండాలి’ అని చెప్పారు. - సరస్వతి రమ, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఫొటోలు: ఎస్.ఎస్.ఠాకూర్ రిలీఫ్ కోసం తీస్తే హిట్ అయింది చదువు విషయంలో పిల్లలకు ఎలాగూ చాయిస్ లేదు. మనిష్టాన్నే రుద్దుతున్నాం. కనీసం సెలవుల్లోనైనా వాళ్ల ఇష్టాయిష్టాలను గమనించి వాటినే నేర్పిస్తే బాగుంటుంది కదా అనిపించింది. ఆ ఆలోచనతో ఉన్న నాకు మా పిల్లలు గురుగులు పెట్టి ఆడుకోవడం.. అచ్చు గృహిణుల్లా మాట్లాడుకోవడం చూసి అప్పటికప్పుడు వచ్చిన ఐడియాతో ఈ అత్తాకోడళ్ల స్కిట్ తయారు చేశా. ఒకటి చేయించి ఆ వీడియోను ఎఫ్బీ, యూ ట్యూబ్‌లో అప్లోడ్ చేశాక వచ్చిన రెస్పాన్స్ చూసి.. దీన్ని కేవలం ఎంటర్టైన్మెంట్గానే కాక అత్తాకోడళ్ల మధ్య ఎలాంటి రిలేషన్ ఉంటే బాగుంటుంది, అలాగే ఆడపిల్లలు ఎంత స్ట్రాంగ్‌గా ఉండాలి అనే చిన్న మెసేజీ ఇచ్చేలా మలిస్తే బాగుంటుంది అనిపించింది. అంతే.. డిఫరెంట్ థీమ్స్‌తో ఈ కాన్సెప్ట్‌ని ఇలా డెవలప్ చేశాను. ఈ రోజు విదేశాలనుంచి కూడా కాల్స్ వస్తున్నాయి. యూసఫ్‌గూడ (హైదరాబాద్)లో మా పిల్లలు చదివే ఎస్జీబీ స్కూల్ ప్రిన్సిపల్ సునీతారాణిగారు పిల్లలకు ఫ్రీఎడ్యుకేషన్ ఇస్తానని చెప్పారు. చాలా హ్యాపీగా ఉంది. వాళ్లను దీవిస్తున్న అందరికీ థాంక్స్!’ - కె. చంద్రశేఖర్ (యోధ తండ్రి, స్కిట్స్ డెరైక్టర్) టెన్ థీమ్స్: శిరిషా కాఫీ, జనాభా లెక్కలు, అత్తగారి నెక్లెస్, పనిమనిషి, గంగిరెద్దు, అలనాటి జ్ఞాపకం, మెసేజ్, న్యూస్ పేపర్, పాపులర్ అత్తాకోడళ్లు, యాంకరింగ్.. ఇలా ఈ అత్తా కోడళ్లు వేసిన ఈ పది థీమ్స్‌కి యూట్యూబ్‌లో వ్యూస్ వేల సంఖ్యలో ఉన్నాయి. -
సెలూన్లపై సెలబ్రిటీల కన్ను!
దేశంలో ‘నష్టం లేని వ్యాపారమేదైనా ఉందంటే అది సెలూన్ షాపే’ అనేది ఇదివరకటి జోకు. కానీ... అందానికి మెరుగులద్దే ఈ సెలూన్ వ్యాపారంలో అందనంత లాభాలున్నాయనేది నేటి వాస్తవం. అందుకే సెలబ్రిటీలు, కార్పొరేట్లూ అందరూ బ్యూటీ మార్కెట్‌పై దృష్టి సారించారు. దాదాపు రూ.40 వేల కోట్లకు పైగా వార్షిక టర్నోవర్ ఉండి... 34 లక్షల మందికి ఉపాధినిస్తున్న ఈ వ్యాపారంలోకి దిగటమే కాక జోరుగా విస్తరణకూ సన్నాహాలు చేస్తున్నారు. - బిజినెస్ బ్యూరో, హైదరాబాద్ • స్పా, సెలూన్, జిమ్, మేకోవర్ స్టూడియోలతో రంగంలోకి • దేశంలో అందం, ఆరోగ్యం పరిశ్రమ రూ.41,224 కోట్లు • ఏటా 20-23 శాతం వృద్ధి రేటు నమోదు • 2018 నాటికి రూ. 80,370 కోట్లకు చేరొచ్చని అంచనా • దక్షిణాది రాష్ట్రాలపై అంతర్జాతీయ సంస్థల దృష్టి సెలబ్రిటీలకు వ్యాపారాలు కొత్త కాదు. కాకపోతే సెలూన్, స్పా వ్యాపారమనేది ఇప్పటి ట్రెండ్. ఈ ట్రెండ్ ఇపుడు తెలుగు సినీ పరిశ్రమకు కూడా శరవేగంగా పాకింది. ఉదాహరణకు మెగాస్టార్ తనయుడు, హీరో రామ్‌చరణ్‌నే తీసుకుంటే... ఈయన జూబ్లీహిల్స్‌లో లాటిట్యూడ్స్ పేరుతో జిమ్, సెలూన్ సెంటర్‌ను నిర్వహిస్తున్నారు. ఇక ఒకప్పటి హీరోయిన్ రాశి... శ్రీనగర్‌కాలనీలో కలర్స్ హెల్త్‌కేర్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట బ్యూటీ సెంటర్‌ను నిర్వహిస్తోంది. బరువు తగ్గటం, ఒబేసిటీ వంటివి తమ స్పెషాలిటీలుగా ఈ సంస్థ చెబుతోంది. గాయని స్మిత జూబ్లీహిల్స్‌లో బబూల్స్ పేరుతో బ్యూటీ సెలూన్ అండ్ స్పాను నడుపుతోంది. ఇక నటి రాజ్యలక్ష్మి బంజారా హిల్స్‌లో మిర్రర్ పేరిట సెలూన్, స్పా సెంటర్‌ను ప్రారంభించారు. ఇలా చెప్పుకుంటూ వెళితే చాలా ఉన్నాయి. అంతెందుకు! బాలీవుడ్ హీరో ఫర్హాన్ అఖ్తర్ భార్య అధునా అఖ్తర్ సహ భాగస్వామిగా ప్రారంభించిన ‘బి:బ్లంట్’ కూడా ఇటీవలే హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో బ్రాంచి తెరిచింది. ఈ సంస్థలో గోద్రెజ్ కన్స్యూమర్ కేర్ 30% ఇన్వెస్ట్ చేసింది. ఏటా 20-23 శాతం వృద్ధి... భారతీయ సౌందర్య పరిశ్రమ ప్రధానంగా చర్మం, జుట్టు, రంగులు, సుగంధ ద్రవ్యాలు అనే విభాగాలుగా విస్తరిస్తోంది. 2013-14 ఆర్థిక సంవత్సరంలో దేశంలో సంఘటిత, అసంఘటిత రంగాల్లో అందం, ఆరోగ్య సంరక్షణ వ్యాపారం రూ.41,224 కోట్లుగా నమోదైనట్లు ఇటీవల ఫిక్కీ, ప్రైస్ వాటర్‌హౌస్ కూపర్స్ కలిసి విడుదల చే సిన నివేదిక వెల్లడించింది. మొత్తం మార్కెట్లో పశ్చిమ, దక్షిణాది రాష్ట్రాల వాటా 25-35%. ఏటా 20-23 శాతం వృద్ధిని నమోదు చే స్తున్న ఈ పరిశ్రమ 2018 నాటికి రూ.80,370 కోట్లకు చేరుకుంటుందనేది నిపుణుల అంచనా. సర్వీస్ ట్యాక్స్ ప్రభావం... ‘‘గతంలో సగటున 45 రోజులకోసారి సెలూన్‌కు వచ్చేవారు ఇపుడు 30 రోజులకే వస్తున్నారు. సింగిల్ సర్వీస్ బదులు రెండు గంటలుండి మూడు సర్వీసులు చేయించుకుంటున్నారు. వ్యాపారం బాగా పెరుగుతోంది’’ అని హైదరాబాద్‌లో 7 బ్రాంచ్‌లు నడుపుతున్న ఎన్ఆర్బీ బ్యూటీ సెలూన్ నిర్వాహకుడు నందు చెప్పారు. సౌందర్య పోషణ పై ప్రజల్లో ఆసక్తి పెరగడంతో ఖర్చుకు వెనకాడటం లేదన్నారు. ఏటా విదేశాల నుంచి మన దేశానికి 400 మిలియన్ డాలర్ల విలువైన సుగంధ ద్రవ్యాలు, తైలాలు దిగుమతి అవుతున్నాయని వీఎల్సీసీ గ్రూప్ ఫౌండర్, చైర్ పర్సన్ వందన లూథ్రా ‘సాక్షి బిజినెస్ బ్యూరో’కు చెప్పారు. తాజాగా సర్వీస్ టాక్స్ పెంపుతో సేవలు ఖరీదయ్యే అవకాశం ఉందన్నారు. సెలూన్లలో మెనిక్యూర్, పెడిక్యూర్, వాకింగ్స్, థ్రెడింగ్, ఫేషియల్స్‌కు రూ.4,000 నుంచి రూ.6,000 వరకు... కేశ సంరక్షణకు రూ.12,000 వరకు ఖర్చవుతుంది. అంతర్జాతీయ కంపెనీలు దక్షిణాదిలో... ఇటాలియన్ కంపెనీ బొటెగా డి లుంగావిటా (బీడీఎల్) దేశంలో ఈ ఏడాది ముగిసేసరికి వంద ఎక్స్‌క్లూజివ్ స్టోర్లను ప్రారంభించాలనే లక్ష్యంతో ఉంది. ఈ నెలాఖరులోగా ఉత్తరప్రదేశ్‌లోని పలు నగరాల్లో 7-8 స్టోర్లను ప్రారంభించి, ఆ తర్వాత దక్షిణాది రాష్ట్రాల్లోనూ ఎక్స్‌క్లూజివ్ స్టోర్లను తెరవనుంది. ఈ కంపెనీ ప్రస్తుతం 180కి పైగా సౌందర్య ఉత్పత్తులను తయారు చేస్తోంది. ఫ్రెంచ్ కాస్మోటిక్ కంపెనీ లోరియాలా పారిస్ ఈ ఏడాది చివరికి బెంగళూరు, చెన్నైల్లో, ఆపైన హైదరాబాద్‌లో స్టోర్లను ప్రారంభించనుంది. పీఈ ఇన్వెస్టర్ల నుంచి నిధులు సమీకరించేందుకు ప్రముఖ సెలూన్ చెయిన్ జావేద్ హబీబ్స్ ప్రయత్నిస్తోంది. షహనాజ్ హుస్సేన్, ఎన్రిచ్ బ్యూటీ సెలూన్స్, వైఎల్‌జీ వంటి కంపెనీల విస్తరణలో పడ్డాయి. ఆన్లైన్లో అమ్మకాలు 30,000 కోట్లు.. హై ఎండ్ కాస్మెటిక్స్, చర్మ సంరక్షణ ఉత్పత్తుల అమ్మకాలు ఆఫ్‌లైన్‌లో కంటే ఆన్లైన్లోనే ఎక్కువ. గూగుల్ అధ్యయనం ప్రకారం.. 2020 నాటికి ఆన్లైన్లో సౌందర్య సంరక్షణ ఉత్పత్తుల అమ్మకాలు సుమారు రూ. 30,000 కోట్లకు చేరుకుంటాయి. వచ్చే ఐదేళ్లలో ఎఫ్ఎంసీజీ సంస్థల అమ్మకాల్లో సుమారు 10 శాతం వాటా ఈ-కామర్స్ ద్వారానే జరుగుతుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. అందుకే ఆన్లైన్ అమ్మకాలపై ఎఫ్ఎంసీజీ కంపెనీలు దృష్టి సారించాయి. లోరియల్‌కి సంబంధించి ప్రధాన బ్రాండ్స్ లోరియల్ ప్యారిస్, గార్నియర్ విక్రయాల్లో 1 శాతం వాటా ఆన్లైన్ అమ్మకాలదే. మేబెలీన్ బ్రాండ్ మేకప్ శ్రేణి టర్నోవరులో 3 శాతం వాటా ఆన్‌లైన్‌దే. దీంతో జార్జియో అర్మానీ, ఈవ్స్ సెయింట్ లారెంట్, ల్యాంకోమ్ వంటి లగ్జరీ సౌందర్య సాధనాలు, లా రోష్-పొసే, విషీ వంటి కాస్మొటిక్స్‌ను కూడా ఆన్‌లైన్‌లోకి తెస్తున్నాయి. షీసీడో తాజాగా జెడ్ఏ బ్రాండ్ కింద కొత్తగా మేకప్ ఉత్పత్తులను ఆన్‌లైన్‌లోనూ ప్రవేశపెట్టే యోచనలో ఉంది. మహిళలతో సమానంగా పురుషులూ.. సౌందర్య పోషణకు మహిళలతో పాటు పురుషులూ భారీగానే ఖర్చు చేస్తున్నారు. ఇది దాదాపు 200 మిలియన్ డాలర్లని అసోచామ్ నివేదిక చెబుతోంది. ఆ నివేదిక ముఖ్యాంశాలు చూస్తే... ► 65 శాతం టీనేజర్లు తమ జేబులోని 75 శాతం సొమ్మును కాస్మొటిక్స్కే వెచ్చిస్తున్నారు. ► విదేశాల్లో 55 ఏళ్లు దాటినవారిని టార్గెట్ చేసే కాస్మొటిక్ కంపెనీలు ఇక్కడ 30 దాటిన వారిని టార్గెట్ చేస్తూ ఉత్పత్తులు తెస్తున్నాయి. ► 2004కు ముందు ఏటా సగటున 50 కొత్త సౌందర్య ఉ త్పత్తులు మార్కెట్లోకొచ్చేవి. ఇప్పుడీసంఖ్య 350 పైనే. -
వంద మంది కథా నాయకులను అందిస్తా
స్టార్ ఫిల్మ్ మేకర్ సత్యానంద్ సీతమ్మధార: విశాఖలో పుట్టిన తనకు ఎంతో మంది సినిమా నటులను తీర్చిదిద్దే అవకాశం కల్పించిన కళామతల్లికి సర్వదా రుణపడి ఉంటానని ఫిల్మ్ స్టార్ మేకర్ ఎల్.సత్యానంద్ అన్నారు. సీతమ్మధారలో నూతనంగా ఏర్పాటు చేసిన మిరాకిల్ డాన్స్ అకాడమీని ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు చలన చిత్రరంగానికి 100 మంది కథానాయకులను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఉన్నట్టు చెప్పారు. ఇప్పటి వరకు తెలుగు సినీ రంగంలో ఎంతో కీర్తినార్జించిన 85 మంది ప్రముఖ కథానాయకులకు శిక్షణ ఇచ్చిన భాగ్యం తనకు లభించడం అదృష్టంగా భావిస్తున్నట్టు చెప్పారు. మిరాకిల్ డాన్స్ అకాడమీ డెరైక్టర్ ఎం.డి.షకీల్ మాట్లాడుతూ తమ సంస్థ స్థాపించి ఇప్పటికి పదేళ్లు పూర్తకావస్తుందన్నారు. నగరంలో అక్కయ్యపాలెం, ఎం.వి.పి.కాలనీలలో ఇప్పటికే తమ సంస్థ ద్వారా శిక్షణ ఇస్తున్నట్టు తెలిపారు. ఇప్పుడు సీతమ్మధారలో నూతనంగా ప్రారంభించి బ్రాంచ్‌లో శాస్త్రీయ, జానపద, పాశ్చాత్య నృత్యాలలో శిక్షణ ఇస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో గోల్డెన్ ఓక్ ఫ్రీ స్కూల్ ైడె రెక్టర్ పి.వి.రాజు, చిన్నారులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
తెలుగువారి కీర్తిపతాక... పానగల్...
చెన్నై సెంట్రల్ తెలుగువారి కబుర్లు ఆ పార్క్ పేరు చెప్పడమంటే తెలుగు సినీపరిశ్రమ గురించి చెప్పడమే. తెలుగు ప్రముఖులకు అదొక సమావేశ వేదిక. సాహితీ చర్చలకు ఆలయం. ఎందరికో నీడనిచ్చి, సేదతీర్చిన చలువరాతి మేడ. ఎందరినో సంపన్నులను చేసిన అపర లక్ష్మీదేవి. ఎందరో ఆర్టిస్టులకు అన్నపూర్ణ నిలయం ఆ పార్కు. ఎందరినో తన చల్లని ఒడిలో సేదతీర్చిన అచ్చ తెలుగు అమ్మ. మద్రాసు చలనచిత్ర పరిశ్రమకు వచ్చిన వారంతా పానగల్ పార్కులో అడుగుపెట్టి, ఆ చెట్టుతల్లుల ఆశీర్వాదాలందుకుని అత్యున్నత స్థాయికి చేరుకున్నారు. ఆరుద్ర, శ్రీశ్రీ, ఆత్రేయ... ఒకరేమిటి సాహితీ ఉద్దండులందరికీ అదే చర్చా వేదిక. అదే సమావేశ మందిరం. ఆ పార్కు వల్ల ప్రముఖులయ్యారా, ప్రముఖుల వల్ల ఆ పార్కు ప్రముఖం అయ్యిందా... అంటే ‘గుడ్డు ముందా! కోడి ముందా!’ అన్న చందాన ఉంటుంది. పానగ ల్ పార్కులోని చిగురాకు మొదలు చిటారుకొమ్మల వరకు ఒకే మాట పలుకుతాయి.. ‘చలనచిత్ర పరిశ్రమకు గురుకులం వంటి వారు మల్లాది రామకృష్ణశాస్త్రిగారు’ అని. పానగల్ పార్కులో రామకృష్ణశాస్త్రిగారి బెంచికి దక్కిన గౌరవం మరెవరికీ లేదు. పార్కుకి ఏ కొత్త సందర్శకులు వచ్చినా ముందుగా ప్రశ్నించే మాట, ‘‘మల్లాది వారి బెంచీ ఎక్కడ’’ అని. ఎందుకంటే మల్లాది వారికి పానగల్ పార్కే తల్లి, తండ్రి, దైవం. మల్లాదివారు నిత్య సందర్శకులు. ఆయనకు ఆసనం ఇచ్చి, ఆయనను గౌరవించి, తనను తాను ఉన్నత శిఖరాలకు ఎదిగేలా చేసుకుంది పానగల్ పార్కు. ఒక్కరోజు ఆయన కనిపించకపోయినా అక్కడి చెట్లన్నీ దిగాలుపడి పోయేవి. ఆకులు రాలుస్తూ కన్నీరు విడిచేవి. చలనచిత్రాలలో చేరాలనుకునే ఎందరో ఔత్సాహికులకు ఈ పార్కే వరాలిచ్చే దేవాలయం అయ్యింది. ప్రతి సినీ ప్రముఖులు, సాహితీవేత్తలు పానగల్ పార్కుకి నిత్య అతిథులే. మూడు పైసలతో టీ తాగి మూడు పైసలు గేటు దగ్గర ఉండే వ్యక్తికి ఇచ్చి కాళ్లు కడుపులో ముడుచుకుని నిద్రించినవారు ఎందరో! బెంచి మీద నుంచి బెంజి కారు వరకు ఎదిగిన ఎందరో నటులకు పానగల్ పార్కు ప్రత్యక్షసాక్షి. ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ పార్కు ఎందరో మహానుభావుల పాదస్పర్శతో పులకాంకితం అయ్యింది. మల్లాదివారు ‘భువనవిజయం’ అని ఒక సమావేశాన్ని ఏర్పాటుచేసి, కొత్త సినీ రచయితలతో చర్చలు నిర్వహించి, సినిమాలకు మంచి స్క్రిప్ట్ రాయాలంటే ఆంగ్లనవలలు చదవాలని సూచించిన శిక్షణాలయం పానగల్ పార్కు. పానగల్ పార్క్ బయట పేవ్మెంట్ బెంచీల మీద సైతం సాహిత్య సమాలోచనలు, సాహిత్యసభలు రసికులైన వారి మధ్యనిత్యం జరుగుతుండేది. మల్లాది రామకృష్ణశాస్త్రి, సముద్రాల, ఆత్రేయ, పాలగుమ్మి, గోవిందరాజుల సుబ్బారావు, ఎంఎస్. చలపతి, వేదాంతం రాఘవయ్య, వెంపటి చినసత్యం... వీరంతా సాయంత్రమయ్యేసరికి కొలువు తీరేవారు. రాత్రి ఏడు గంటలకు పన్యాల రంగనాథరావు గొంతులో కార్పొరేషన్ లౌడ్స్పీకర్లలో ప్రసారమయ్యే వార్తలు విని 7.15 నిమిషాలకు ‘ఇక చాలు ఇళ్లకు వెళ్లిపోదామా’ అని పార్కుని విడిచి ఇళ్లకు బయలుదేరేవారు. చలనచిత్రాలలో ఎన్నో పాటలకు ఈ పార్క్ చెట్లే అందం తీసుకువచ్చాయి. చలనచిత్ర ప్రముఖులంతా పానగల్ పార్క్ చెట్ల కింద నిద్ర చేసినవారే. సాహితీ ప్రముఖులు, నటులే కాకుండా మదరాసులోని వివిధ ప్రాంతాలకు చెందిన వారికి కూడా దేశంలో ఏ సమాచారం జరుగుతోందో తెలియచెప్పింది పానగల్ పార్కే. దీనిపక్కనే ‘లండన్ మార్కెట్’ అని ముద్దుగా పిలువబడే మార్కెట్లో కూరగాయలు కొనడానికి వస్తుండేవారు. ఉదయం ఆరు నుంచి తొమ్మిది గంటల వరకు, అక్కడ ఉన్న సుమారు యాభై దుకాణాలలో రకరకాల స్వదేశీ విదేశీ కూరలు అమ్ముతుండేవారు. వచ్చినవారు వాటిని కొంటూనే, వార్తలు కూడా తెలుసుకుని ఇళ్లకు వెళ్లేవారు. పానగల్ పార్కులో ఎన్నో సంగీత సాహిత్య చర్చలు జరిగేవి. ముఖ్యంగా పింగళివారు ఎన్నో విషయాలు అందరితో ముచ్చటించేవారు. మద్రాసులో ఉన్నప్పుడు ఎక్కువ రోజులు నాగయ్య గడిపినది ఈ పార్కులోనే. ఆయన గౌరవార్థం ఆయన శిలావిగ్రహాన్ని పానగల్ పార్కులో ఒక మూల ఉంచారు. పానగల్‌పార్క్‌లో ప్రస్తుతం నాగయ్య గారి విగ్రహం ఓ మూల దుమ్ము కొట్టుకుని పోయి దీనంగా కనిపిస్తూ ఉంటుంది. ఎంత శుష్కించినా తల్లి తల్లే అవుతుంది. నాటి ఠీవి, నాటి ఆదరణ, నాటి గౌరవం, నాటి దర్జా దర్పం నేడు పానగల్పార్కుకి పూర్తిగా లోపించినా, సుమారు పాతిక సంవత్సరాల అనంతరం చెన్నై నగరాన్ని దర్శించుకున్నవారు ఒకసారి ఆ పార్కులోకి అడుగుపెడితే గతం తాలూకు మధురస్మృతులు ఎద వీణలను ఒకసారి సుతారంగా మీటుతాయి. - ఫోటోలు, కథనం: డా. పురాణపండ వైజయంతి, సాక్షి, చెన్నై తెలుగు వారి కోసం తెలుగు జమీందారు అయిన పానగల్రాజు వెంకటరాయనింగారుఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో కట్టించినదే ఈ పార్కు. శ్రీరాజా సర్ పానగంటి రామరాయనింగారు, పానగల్ సంస్థానానికి జమీందారు. కాళహస్తిలో జన్మించిన ఈయన పేదల వకీలుగా, అణగారిన వర్గాలను ఉద్ధరించే వ్యక్తిగా నిలిచారు. 1921 నుంచి 1926 వరకు ముఖ్యమంత్రిగా మద్రాసు ప్రావిన్సీకి పనిచేసి, ఎన్నో సంస్కరణలు ప్రవేశపెట్టారు. వైద్యపరంగా ఎన్నో మార్పులు తీసుకువచ్చారు. ఆయన పేరు మీద ఆయన గౌరవార్థం ఈ పార్కుకి ‘పానగల్ పార్కు’ అని పేరు పెట్టారు. గణేశ్ అయ్యర్ డిజైన్ చేసిన ఈ పార్కు చెన్నై నగరానికే శోభాయమానం. (ఇన్పుట్స్: భువనచంద్ర, సినీ గేయ రచయిత) -
తెలుగు చిత్ర పరిశ్రమకు ఢోకా లేదు
రాష్ట్రాలు విడిపోయినా తెలుగు చిత్ర పరిశ్రమకు వచ్చిన ఇబ్బందే మీ లేదని ప్రముఖ దర్శకులు పూరి జగన్నాథ్ అన్నారు. తన తనయుడు ఆకాశ్‌పూరి హీరోగా నటిస్తున్న ‘ఆంధ్రాపోరి’ సినిమా షూటింగ్‌ను చూసేందుకు శుక్రవారం పాల్వంచ వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. ⇒ రాష్ట్రాలు విడిపోయినా ఇబ్బందేమీ లేదు ⇒ హైదరాబాద్‌లోనే ఇండస్ట్రీ ఉంటుంది ⇒ పైరసీని అరికట్టే వ్యవస్థ రావాలి ⇒ ప్రముఖ చిత్ర దర్శకుడు పూరి జగన్నాథ్ పాల్వంచ : రాష్ట్రాలు విడిపోయినా తెలుగు చిత్ర పరిశ్రమకు ఇబ్బందేమీ లేదని ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ అన్నారు. హైదరాబాద్‌లోనే ఇండస్ట్రీ ఉంటుందని తెలిపారు. తన తనయుడు ఆకాశ్ పూరి హీరోగా నిర్మిస్తున్న ‘ఆంధ్రాపోరి’ షూటింగ్ చూడ్డానికి జగన్నాథ్ శుక్రవారం పాల్వంచకు వచ్చారు. ఈ సందర్భంగా బృందావన్ రెస్టారెంట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్టీఆర్ హీరోగా రూపొందించిన ‘టెంపర్’ చిత్రం అంచనాలకు మించి విజయవంతమైందని తెలిపారు. దేశ విదేశాల్లో ఈ సినిమా అత్యధిక థియోటర్లలో ఆడుతుండడం ఆనందంగా ఉందన్నారు. మహేష్‌బాబుతో తన తదుపరి చిత్రం ఉంటుందని, జ్యోతిలక్ష్మితో మరో చిత్రం తీస్తున్నానని తెలిపారు. పైరసీల కారణంగా చిత్రపరిశ్రమ నష్టాలు చవిచూడాల్సి వస్తోందన్నారు. కోట్లు ఖర్చు పెట్టి సినిమాలు తీస్తుండగా పైరసీ కారణంగా కలెక్షన్లు పడిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేరాన్ని అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. విదేశాల్లో చిత్రాలను నెట్లో డౌన్లోడ్ చేసుకోగానే పోలీసులకు సమాచారం వెళ్లిపోతుందని, పైరసీ చేసిన వారి వివరాలు తెలిసిపోతాయని అన్నారు. అలాంటి టెక్నాలజీ ఈ దేశంలోకి రావాలని కోరుకుంటున్నానన్నారు. చక్రీ అకాల మరణం చిత్రపరిశ్రమకు తీరని లోటన్నారు. దర్శకుడు రాజు మదిరాజ్ వచ్చి ఆకాశ్‌తో సినిమా చేస్తానంటూ చెప్పిన కథ నచ్చడంతో ఓకే అనేశానని అన్నారు. భవిష్యత్తులో తన దర్శకత్వంలో ఆకాశ్ సినిమా ఉంటాయని చెప్పారు. షూటింగ్ స్పాట్లకు ఖమ్మం చాలా బాగుంటుందని, త్వరలో తన చిత్రాలను ఇక్కడే నిర్మాస్తానని అన్నారు. -
పరిశ్రమకు ఏదో పట్టింది.. అవసరమైతే పూజలు..
-
ఎమ్మెస్ మా గుండెల్లో ఉంటారు: ఆలీ
-
కామెడికి పెద్ద లోటు: ఎస్వీ కృష్ణారెడ్డి
-
"అందరూ నవ్వూతూ ఉండాలనుకునేవారు"
-
పైన వినోదం కరువై తీసుకెళ్తున్నారేమో..
-
ఏ అడ్రస్ పట్టుకొని వెళ్ళిపోయాడో..
-
'కర్ణాటక నుంచి వచ్చి తనదైన ముద్రవేశారు'
హైదరాబాద్: సినిమా పేరునే ఇంటి పేరుగా మార్చుకున్న అతి తక్కువ మంది నటుల్లో ఆహుతి ప్రసాద్ ఒకరని నటుడు శ్రీకాంత్ తెలిపారు. ఆదివారం కన్నుమూసిన ఆహుతి ప్రసాద్ కు నివాళులు అర్పించిన శ్రీకాంత్ మీడియాతో మాట్లాడారు. చిన్న చిన్న క్యారెక్టర్లు వేసి చాలా ఉన్నత స్థానాన్ని అధిరోహించిన ఆహుతి ఇక లేకపోడం చాలా బాధాకరమన్నారు. కర్ణాటక ఇండస్ట్రీలో చాలా సినిమాలు చేసిన ఆయన తూర్పు గోదావరి జిల్లా శైలిని బాగా అనుకరించడం సాధారణ విషయం కాదని శ్రీకాంత్ తెలిపారు. ప్రస్తుతం ఆయన బిజీ షెడ్యూల్ తో ఉన్నారని.. ఈ సమయంలో సినిమా ఇండస్ట్రీని వదిలి అనంత లోకాలకు వెళ్లిపోయారన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని శ్రీకాంత్ ఆవేదన వ్యక్తం చేశారు. -
ఆహుతి ప్రసాద్ మృతికి ప్రముఖుల సంతాపం
ప్రముఖ నటుడు, క్యారెక్టర్ అర్టిస్ట్ ఆహుతి ప్రసాద్ ఆదివారం కిమ్స్ ఆసుపత్రిలో కన్నుమూశారు. దీంతో తెలుగు చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్ర్బాంతి వ్యక్తం చేసింది. *ఆహుతి ప్రసాద్ మృతి చిత్ర పరిశ్రమకు తీరని లోటని ప్రముఖ నటుడు గిరిబాబు అన్నారు. సినిమా షూటింగ్ సమయంలో బాబాయి బాబాయి అంటూ ఉండే వాడని ఆయన తెలిపారు. *ప్రసాద్ మరణ వార్త తీవ్ర దిగ్బ్రాంతి కలిగించిందని ప్రముఖ నటుడు తనికెళ్ల భరణి తెలపారు. ఇద్దరం కలసి చాలా సినిమాల్లో నటించామన్నారు. చాల ప్రెండ్లీగా ఉండేవాడని భరణి ఈ సందర్బంగా ప్రసాద్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తమ మధ్య 20 ఏళ్లగా పరిచయం ఉందన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమకు ఏదో శని పట్టినట్లుందని తనికెళ్ల భరణి ఆవేదన వ్యక్తం చేశారు. గత ఏడాది చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు మృతి చెందిన సంగతి ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. *ప్రసాద్ మృతి వార్తా చాలా షాక్‌కు గురి చేసిందని ప్రముఖ నటుడు, మాటల రచయిత ఉత్తేజ్ తెలిపారు. తమ ఇద్దరి కాంబినేషన్లో చాలా చిత్రాలు వచ్చాయని చెప్పారు. ఇద్దరం కలసి నంది అవార్డులు అందుకున్నామని గుర్తు చేసుకున్నారు. అందరితో స్నేహ పూర్వకంగా మెలిగేవారని ఉత్తేజ్ ఈ సందర్బంగా గుర్తు చేసుకున్నారు. చిత్ర పరిశ్రమలోని వాళ్లకు ఇలా జరుగుతుందని అనుకుంటున్న తరుణంలో ప్రసాద్ మరణ వార్త వినాల్సి వస్తుందని అనుకోలేదన్నారు. దాదాపు 15 సినిమాల్లో ఇద్దరం కలసి నటించామని చెప్పారు. తన మనస్సుకు దగ్గరగా ఉన్న వారిలో ప్రసాద్ ఒకరని.... ఆయన ఇలా వదిలి వెళ్లిపోవడం బాధకరమని ఉత్తేజ్ తెలిపారు. ఆహుతి ప్రసాద్ ఆకస్మిక మృతిపట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిలు సంతాపం వ్యక్తం చేశారు. -
తలసానితో టాలీవుడ్ పెద్దలు భేటీ
హైదరాబాద్ : తెలంగాణ వాణిజ్య పన్నులు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో తెలుగు చిత్రపరిశ్రమ పెద్దలు సోమవారం భేటీ అయ్యారు. వారు ఈ సందర్భంగా చిత్ర పరిశ్రమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకు వెళ్లారు. త్వరలో సినీ ప్రముఖలతో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. మంత్రి తలసానిని కలిసిన వారిలో కేఎస్ రామారావు, దగ్గుబాటి సురేష్ బాబు తదితరులు ఉన్నారు. -
ప్రముఖ దర్శకుడు భాస్కర రావు ఇకలేరు
-
ఇంత కష్టపడ్డా 10 కోట్లే వచ్చిదంటే..!
-
మీ చీకటిలో వెలుగులమై..
హుద్‌హుద్ బాధితుల కోసం చేయీచేయీ కలిపి... తరలివచ్చిన తారా లోకం రోజంతా వినోదాల విందు హుషారెత్తించిన నృత్యాలు ఉల్లాసభరితంగా క్రీడలు సందడిగా మేముసైతం హుదూద్ తుపాను తీవ్రతకు దెబ్బతిన్న విశాఖ ప్రాంతాన్ని ఆదుకునేందుకు తెలుగు చలనచిత్ర పరిశ్రమ కదలి వచ్చింది. బాధితులకు సాయమందించడంలో భాగంగా నిధులు సేకరించేందుకు నటీనటులు ‘మేముసైతం’ అంటూ ముందుకొచ్చారు. ఆదివారం అన్నపూర్ణ స్టూడియోలో సంగీత విభావరి, కోట్ల విజయ భాస్కరరెడ్డి ఇండోర్ స్టేడియంలో సినీతారల క్రీడా పోటీలు నిర్వహించారు. టికెట్ల ద్వారా వచ్చిన నగదును ముఖ్యమంత్రి సహాయ నిధికి అందిచారు. తారల ఆటపాటలతో.. అభిమానుల సందడితో ఆద్యంతం ఉత్సాహంగా సాగింది. -
కోరుకున్నది దేవుడిచ్చేశాడు!
అంతర్వీక్షణం: సంపూర్ణేశ్ బాబు తెలుగు సినిమా పరిశ్రమలో ఓ విలక్షణత సంపూర్ణేశ్‌బాబు. తెలుగు సినిమాలపై వ్యంగ్యాస్త్రంగా ఆయన సంధించిన ‘హృదయ కాలేయం’ చిత్రం ఆ మధ్య అందరి దృష్టినీ ఆకర్షించింది. ఒక్క సినిమాతో అందరికీ సుపరిచితుణ్ణి చేసింది. ఒక్క సినిమాతో వంద సినిమాల ఆదరణ చూపిన ప్రేక్షకులకు వందనమనే ‘సంపూ’తో కొన్ని ముచ్చట్లు... ఎక్కడ పుట్టారు?... మెదక్ జిల్లాలోని సిద్ధిపేట పక్కన మిట్టపల్లి అమ్మానాన్నలు?...నాన్న మహాదేవ్, అమ్మ కౌసల్య ఎలాంటి వ్యక్తులను ఇష్టపడతారు? ఇలా, అలా అని లేదు. అందరినీ ఇష్టపడతాను. ఎదుటి వారిని చూసే దృష్టి కోణం ఎలా ఉంటుంది ? ఒక్కసారి చూడగానే అంచనా వేసేటంత గొప్ప వాడిని కాదు, అందరితో స్నేహంగా ఉంటాను. అందరిలో స్నేహితులనే చూస్తాను. మీలో మీకు నచ్చే లక్షణం ఏది? ఫలానా అంటూ ఏ ఒక్కటో కాదు. నాకు నేను చాలా ఇష్టం. ఆ తర్వాత ప్రపంచాన్ని ఇష్టపడతాను. ఏ రంగంలో స్థిరపడాలనుకున్నారు? చిన్నప్పటి నుంచి నటన అంటే చాలా ఇష్టం. ఆర్టిస్టుగా విలక్షణమైన స్థానం కావాలనుకున్నాను. ప్రభావితం చేసిన వ్యక్తి ?... మోహన్‌బాబు. మీ తొలి సంపాదన?...‘హృదయకాలేయం’ సినిమాకి తీసుకున్న అడ్వాన్సు. అత్యంత సంతోషం కలిగిన రోజు... 2014 ఏప్రిల్ 4 - ‘హృదయకాలేయం’ విడుదలైన రోజు. ఎవరికైనా క్షమాపణ చెప్పుకోవాల్సి ఉందా ? ఇంతవరకు ఎవరూ లేరు. ఇకపై తప్పు చేస్తే క్షమించమని ప్రేక్షకులనే అడుగుతాను. మిమ్మల్ని భయపెట్టే విషయాలేంటి?...భయపడాల్సిన అవసరమే రాలేదింత వరకు. ఎప్పుడైనా అబద్ధం చెప్పారా?...‘నేనింత వరకు అబద్ధమే చెప్పలేదు’ అని ఎవరైనా అంటే ... ఆ మాట నిజమని నమ్మవచ్చా? చిన్నప్పుడు హోమ్‌వర్క్ చేయక స్కూల్లో అబద్ధం చెప్పడం వంటివి తప్ప ఘోరాలకు, నేరాలకు దారి తీసే అబద్ధాలేమీ చెప్పలేదు. దేవుడు ప్రత్యక్షమైతే ఏం కోరుకుంటారు?... నేను కోరుకున్నది ఇచ్చేశాడు. కాబట్టి అందరూ బాగుండాలని కోరుకుంటాను. ఇంతమందిని హాయిగా ఉంచుతున్న దేవుడు నన్ను మాత్రం ఎందుకు కష్టపెడతాడు? అద్దంలో చూసుకున్నప్పుడు ఏమనుకుంటారు ?... మేకప్ కుదిరిందా లేదా అని చూస్తాను. ఎవరికైనా కృతజ్ఞతలు చెప్పుకోవాల్సి ఉందా?... ప్రసారమాధ్యమాలకు, సోషల్ నెట్వర్క్ మీడియాకి ప్రత్యేక కృతజ్ఞతలు. మీడియా నాకు చేసిన సహాయం చాలా గొప్పది. ఎప్పటికీ మర్చిపోలేను. నన్ను తమ ఇంటి వ్యక్తిగా ఆదరించింది. అలాగే అందరు హీరోల అభిమానులకు నా ధన్యవాదాలు. అందరికీ సదా రుణపడి ఉంటాను. మీ ప్రేమకు బానిసను. సంపూర్ణేశ్ బాబు అంటే ఏమి గుర్తు రావాలనుకుంటారు?... ‘హృదయ కాలేయం’ గుర్తు రావాలి, స్టీవెన్ శంకర్ అనే దర్శకుడు లేకపోతే సంపూర్ణేశ్ బాబు లేడు... అని కూడా. - వాకా మంజులారెడ్డి -
తెలుగులో నయా బ్యూటీస్ హవా!
-
ప్రత్యేక చర్చ : చిన్న సినిమాలే.. పెద్ద హిట్లైన వేళ..!
-
చిన్న సినిమాలే.. దుమ్ము దులిపాయ్!!
-
వేతన చర్చల్లో పురోగతి... యధావిధిగా మళ్ళీ షూటింగ్‌లు...
సినీ కార్మికుల వేతనాల పెంపు విషయంలో తెలుగు సినీ నిర్మాతలకూ, పరిశ్రమలోని 24 శాఖల కార్మికులకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఏ.పి. ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్‌కూ మధ్య జరుగుతున్న చర్చలు సానుకూల దిశలో పురోగమిస్తున్నాయి. బుధవారం, శుక్రవారం జరిగిన చర్చల ఫలితంగా కార్మికులకు సగటున 35 నుంచి 40 శాతం దాకా వేతనాలు పెరగనున్నాయి. ఈ నేపథ్యంలో తెలుగు చిత్రపరిశ్రమలో 20వ తేదీ నుంచి జరుగుతున్న షూటింగ్‌ల బంద్‌కు తెరపడింది. శుక్రవారం నుంచి షూటింగ్‌లూ యధావిధిగా జరుగుతున్నాయి. ఏ.పి. ఫిల్మ్ చాంబర్ ప్రతినిధులు, ఫెడరేషన్ ప్రతినిధులు చర్చించుకొంటూ, రోజుకు రెండు, మూడు యూనియన్ల వంతున ప్రతి ఒక్కరితో కొత్త వేతన ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి. ‘‘నవంబర్ 9 నాటి కల్లా అన్ని శాఖలతో కొత్త వేతన ఒప్పందాలు పూర్తవుతాయి. కొత్త వేతనాలు అక్టోబర్ 24 నుంచే అమలులోకి వస్తాయి. నిర్మాతల మండలి నుంచి లిఖితపూర్వక హామీ కూడా ఇచ్చారు. ఈలోగా షూటింగులకు ఇబ్బంది లేకుండా చూడాలని కోరారు. అందుకు మేమూ అంగీకరించాం’’ అని ఫెడరేషన్ అధ్యక్షుడు కొమర వెంకటేశ్, ‘సాక్షి’ ప్రతినిధికి వివరించారు. ఈ ఏడాది ఫిబ్రవరి ఆఖరుతో ముగిసిన మూడేళ్ళ వేతన ఒప్పందానికి కొనసాగింపుగా ఇప్పుడీ కొత్త ఒప్పందాలు అమలులోకి వస్తాయి. పెరిగిన ఖర్చుల దృష్ట్యా నూరు శాతం మేర వేతనాలు పెంచాలని కార్మికులు అభ్యర్థించారు. ఆ మేరకు పెరగనప్పటికీ, తాజా వేతనాల వల్ల 20 వేల మంది దాకా తెలుగు సినీ కార్మికులకు నేరుగా లబ్ధి కలగనున్నట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. -
టాలీవుడే టాప్
తెలుగు చిత్రాల నిర్మాణం... విడుదలలో టాలీవుడ్ గత ఏడాది దూసుకుపోయింది. దేశవ్యాప్తంగా గత ఏడాది (ఏప్రిల్ 2013 - మార్చి 2014) మొత్తం1966 సినిమాలు విడుదలయ్యాయి. వాటిలో 349 తెలుగు చిత్రాలు విడుదలై టాలీవడ్ మొదటి స్థానంలో నిలిచింది. 326 తమిళ చిత్రాల విడుదలతో తమిళ చిత్ర పరిశ్రమ ఆ తర్వాత స్థానాన్ని పొందింది. 263 హింది చిత్రాల విడుదలతో బాలీవుడ్ మూడో స్థానంలో నిలిచింది. అయితే 2012- 13 ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా 1724 చిత్రాలు విడుదలయ్యాయి. వాటిలో తమిళ చిత్రాలు 292 విడుదలై... మొదటిస్థానాన్ని ఆక్రమించగా, 280 చిత్రాలతో తెలుగు సినిమా రెండో స్థానంలో నిలిచింది. అలాగే 255 హిందీ చిత్రాలతో మూడో స్థానంలో నిలిచింది. కానీ అంతకుముందు ఏడాదిలో ఉన్న తమిళ చిత్రాల సంఖ్యను పడతోసి టాలీవుడ్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. అంతకుముందు మొదటి స్థానంలో ఉన్న తమిళ చిత్రాల స్థానాన్ని గత ఏడాది తెలుగు చిత్రాలు అక్రమించాయి. అయితే తెలుగు చిత్రాలు భారీ సంఖ్యలో విడుదలవుతున్న బాక్సాఫీసు వద్ద అంతగా విజయం సాధించలేకపోతున్నాయి. అది పెద్ద పెద్ద హీరోలు నటించిన ఈ పరిస్థితి నెలకొంది. చిత్రాల నిర్మాణంపై ఉన్న అసక్తితో చిన్న చిత్రాలు విడుదల సంఖ్య భారీగా పెరిగిందని... అలాగే డిజిటల్ టెక్నాలజీ కూడా అందుబాటులోకి రావడంతో టాలీవుడ్ పరిశ్రమలో భారీ సంఖ్యలో చిత్రాలు విడుదలవుతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. -
షూటింగ్‌లు బంద్..చాంబర్లో చర్చలు..
సోమవారం తెలుగు సినిమా షూటింగులు బంద్ అయ్యాయి. చలనచిత్ర సీమకు చెందిన కార్మికుల వేతనాలు, ఇతర అంశాలపై ఏపీ ఫిలిం ఎంప్లాయీస్ ఫెడరేషన్ ప్రతినిధులకూ, నిర్మాతలకు మధ్య చర్చలు కొలిక్కి రాకపోవడంతో ఫెడరేషన్ సోమవారం నుంచి షూటింగ్‌ల బంద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. షూటింగ్‌లకు అవాంతరం ఏర్పడడంతో సోమవారం సాయంత్రం నుంచి ఇరు వర్గాల మధ్య హైదరాబాద్‌లోని ఏ.పి. ఫిలింఛాంబర్లో విస్తృత స్థాయి చర్చలు జరిగాయి. దీనిపై తెలుగు ఫిలిం ఫెడరేషన్ అధ్యక్షుడు కొమర వెంకటేశ్ మాట్లాడుతూ -‘‘ప్రస్తుతం చర్చలు సానుకూలంగా జరుగుతున్నాయి. కొందరు నిర్మాతల్లో మిశ్రమ స్పందన కనిపించినా... సినీ కార్మికులకు అనుకూలంగానే ఫలితం వస్తుందని ఆశిస్తున్నాం. సోమవారం చర్చ ఆసాంతం కార్మికుల పనివేళలు, బేటాల పైనే జరిగింది. ఆ వ్యవహారం కూడా పూర్తి స్థాయిలో ఓ కొలిక్కి రాలేదు. ఇంకా వేతనాలు, తదితర అంశాల గురించి చర్చించాల్సి ఉంది’’ అని వివరించారు. ఈ వార్త ప్రచురించే సమయానికి చర్చలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి ‘‘మంగళవారం కూడా షూటింగ్‌ల బంద్‌ను కొనసాగించాలా, వద్దా అన్నదానిపై ఇంకా ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. అది రాత్రి పొద్దుపోయాక వచ్చే చర్చల ఫలితాన్ని బట్టి ఉంటుంది’’ అని వెంకటేశ్ చెప్పారు. -
రూ.35 లక్షల చెక్కు అందచేసిన బాలకృష్ణ
విశాఖ : హుదూద్ తుఫాను బాధితులను ఆదుకునేందుకు తెలుగు సినీ పరిశ్రమ కూడా భాగం పంచుకుంటుందని సినీనటుడు, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు. ఆయన శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిశారు. ఈ సందర్భంగా బాలకృష్ణ తుఫాను బాధితుల సహాయార్ధం రూ.35 లక్షల చెక్కును చంద్రబాబు అందించారు. అనంతరం బాలకృష్ణ మాట్లాడుతూ గతంలోనూ తుఫాను బాధితులను ఆదుకునేందుకు తెలుగు చిత్ర పరిశ్రమ పని చేసిందన్నారు. ఎన్టీఆర్ జోలెపట్టి విరాళాలు సేకరించారని ఆయన గుర్తు చేశారు. విశాఖకు అపారమైన నష్టం వాటిల్లిందని బాలకృష్ణ అన్నారు. తుఫాను బాధిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రితో కలిసి పర్యటించనున్నట్లు ఆయన చెప్పారు. -
తుపాను బాధితులకు తాజా విరాళాలు
తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘం-5 లక్షలు తెలంగాణ ప్రొడ్యూసర్స్ గిల్డ్-3 లక్షలు నటుడు, ఎంపీ మురళీమోహన్ -25 లక్షలు (ఎంపీ లాడ్స్), రెండు నెలల జీతం (సుమారు 1 లక్ష) హీరో సచిన్ జోషీ-15 లక్షలు దర్శకుడు సురేందర్‌రెడ్డి-5 లక్షలు దర్శకుడు శివ కొరటాల-3.5 లక్షలు దర్శకుడు శ్రీవాస్-2.5 లక్షలు సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్-2 లక్షలు కెమేరామేన్ ఛోటా కె. నాయుడు-1 లక్ష దర్శకుడు మలినేని గోపీచంద్-1 లక్ష హీరో నాగశౌర్య-1 లక్ష నటుడు అలీ-1 లక్ష -
అదుర్స్ అనిపించేలా.. ఎన్టీఆర్ లుక్!
-
ఫిల్మ్‌సిటీకి కేసీఆర్ పేరైతేనే బాగుంటుంది!
-
నేడు చెన్నై అడయార్‌లో బాపు అంత్యక్రియలు
చెన్నై, సాక్షి ప్రతినిధి: వృద్ధాప్య అనారోగ్య కారణాలతో ఆదివారం చెన్నైలో కన్నుమూసిన ప్రముఖ సినీ దర్శకుడు, చిత్రకారుడు బాపు (సత్తిరాజు లక్ష్మీనారాయణ) అంత్యక్రియలు మంగళవారం జరగనున్నాయి. ఆయన కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ చెన్నైలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. చివరి ఘడియల్లో ఆయన ఏకైక కుమార్తె భానుమతి, రెండో కుమారుడు వెంకటరమణ బాపు చెంతనే ఉన్నారు. బాపు మరణానికి సరిగ్గా రెండు రోజుల కిందటే ఆయన పెద్దకుమారుడు వేణుగోపాల్ జపాన్ వెళ్లారు. సోమవారం ఆయన చెన్నై చేరుకోగానే అంత్యక్రియలు నిర్వహించాలని తొలుత నిర్ణయించారు. తండ్రి మరణవార్త తెలుసుకున్న వెంటనే తిరుగు ప్రయాణమైన వేణుగోపాల్ సోమవారం అర్ధరాత్రి చెన్నైకి చేరుకున్నారు. పెద్దకుమారుని రాక ఆలస్యం కావడంతో అంత్యక్రియలను మంగళవారానికి వాయిదావేశారు. చెన్నై అడయార్‌లోని బాపు ఇంటికి సమీపంలోని బీసెంట్‌నగర్ శ్మశాన వాటికలో మంగళవారం మధ్యాహ్నం బాపు పార్థివదేహానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. బాపుకు కడసారి నివాళులర్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధిగా మంత్రులు పల్లె రఘునాథరెడ్డి హాజరు కానున్నారు. తరలివచ్చిన తెలుగు చిత్రసీమ... తమ అభిమాన బాపు కడసారి చూపుకోసం తెలుగు చిత్రసీమ సోమవారం తరలివచ్చింది. అశ్రు నయనాలతో వచ్చిన నటీనటుల ఆవేదనతో బాపు గృహం శోకసంద్రమైంది. తెల్లని సాధారణ పంచె, బనీను పోలిన తెల్లని చొక్కా ధరించి నిశ్శబ్దంగా తన పనిలో తాను నిమగ్నమై ఉండే బాపు అదే నిశ్శబ్దాన్ని కొనసాగిస్తున్నట్లుగా హాలు మధ్యలో ఐస్‌బాక్స్‌లో పార్థివదేహంగా కనిపించారు. నందమూరి బాలకృష్ణ, సినీ నేపధ్య గాయకుడు ఎస్.పి.బాలసుబ్రమణ్యం, దర్శకుడు శేఖర్ కమ్ముల సుమారు రెండు గంటల పాటు విషణ్ణవదనాలతో బాపు పార్థివదేహం వద్దనే కూర్చుండిపోయారు. పెళ్లిపుస్తకం చిత్రం ద్వారా బాపు బొమ్మగా పరిచయం అయిన సినీనటి దివ్యవాణి ఆయన భౌతికకాయం వద్ద, మీడియా ముందు కన్నీటి పర్యంతమయ్యూరు. భూమన నివాళులు బాపు మరణంతో.. ప్రపంచం గర్వించదగిన వ్యక్తిని తెలుగు జాతి కోల్పోయిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి నివాళులర్పించారు. పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ప్రతినిధిగా భూమన సోమవారం చెన్నై చేరుకుని బాపు భౌతిక కాయాన్ని సందర్శించి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలుగు భాషకు, సంస్కృతికి వన్నెలద్దిన వ్యక్తి బాపు అని కీర్తించారు. ఆయనలో అద్భుత మానవతావాది ఉన్నారని అన్నారు. -
మహా మనీషి బాపు..
సినీ, సాహిత్య రంగాల్లోనేగాక యావత్ తెలుగుజాతి గర్వించదగిన వ్యక్తి బాపు. తెలుగు భాషలో బాపు బొమ్మకు ఎంతటి ప్రాముఖ్యత ఉందో ప్రపంచంలోని తెలుగు జాతి కంతటికీ తెలుసు. ఆలోచనల్లో ఎంతో గొప్పగా ఉండే బాపు నిజజీవితంలో మాత్రం చాలా సామాన్యంగా ఉండేవారు. స్నేహానికి పర్యాయపదంగా జీవించారు. సినీ దర్శకునిగా, చిత్రకారునిగా, కార్టూనిస్టుగా, డిజైనర్‌గా బాపు చేసిన సేవలు అసామాన్యం. బాపు బొమ్మ, బాపు అక్షరాలు, బాపు సినిమాలు, బాపు కార్టూన్లు దేనికదే ఓ మహా కావ్యం. తెలుగువాడిగా పుట్టి ప్రపంచవ్యాప్తంగా తన గీత(బొమ్మ) ద్వారా పరిచయమైన బాపు మహోన్నత వ్యక్తిత్వం కలిగిన బహుముఖ ప్రజ్ఞాశాలి. తెలుగుజాతి, భారతదేశం ఓ మహానుభావుడిని, ఓ మహా మనీషిని కోల్పోయింది. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. -వైఎస్ జగన్మోహన్రెడ్డి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు బాపు మరణం తెలుగువారందరికీ మహా విషాదం. బాపు మృతితో తెలుగు నేల చిన్నబోయింది. తెలుగుదనం మసకబారింది. ఒక శకం ముగిసినట్లయింది. నా రెండో సినిమాగా ‘మనవూరి పాండవులు’ బాపు దర్శకత్వంలో నటించడం వల్లనే ఒక నటుడిగా నన్ను నేను తీర్చిదిద్దుకోగలిగాను. - చిరంజీవి, నటుడు, రాజ్యసభ సభ్యుడు స్నేహం అనే పదంలో ఒక అక్షరం బాపు, మరో అక్షరం రమణ. స్నేహానికి అర్థం బాపు- రమణ. తెలుగు సాహితీలోకానికి వారు చేసిన సేవ అజరామరం. తెలుగు భాష ఉన్నంత కాలం బాపు పేరు ఉంటుంది. సాహితీ లోకంలో ఎంత ఎత్తుకు ఎదిగినా నిరాడంబరతను ఆభరణంగా ధరించిన బాపు మృతి చెందిన రోజు అత్యంత విషాదకరం. బాపు మృతి సాహితీవేత్తలకు, వ్యక్తిగతంగా నాకు తీరని ఆవేదన. కె.వి.రమణాచారి (తెలంగాణ ప్రభుత్వ సలహాదారు) ఆత్మీయుడిని కోల్పోయాం.. బాపు మృతి తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు. ఓ గొప్ప ఆత్మీయుడిని కోల్పోయాను. అందాల రాముడు, సీతా కళ్యాణం, సంపూర్ణ రామాయణం, ముత్యాల ముగ్గు, భక్తకన్నప్ప చిత్రాల్లో బాపు నాతో రాయించిన గీతాలు ఎంతో ప్రజాదరణ పొందాయి - సి.నారాయణరెడ్డి, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత బాపు మృతి తీరని లోటు. బాపు తీసిన చిత్రాల్లో 90 శాతం సినిమాలకు ఆయనతో కలిసి పనిచేశాను. నా తొలి పాట బాపు జన్మదినమైన డిసెంబర్ 15న రికార్డయింది. ఇది జీవితంలో మరచిపోలేని ఘట్టం. బాపు దగ్గరకు రానిచ్చే అతి కొద్ది మందిలో నేనూ ఒకడిని. జూలైలో ఆయన వద్దకు వెళ్లాను. ఆ సమయంలో ఆయనకు ఇష్టమైన కొన్ని పాటలను పాడి వినిపించాను. అదే నేను చివరిసారిగా బాపుని కలిసింది. జనాబ్ మెహదీ హసన్ అన్నా, ఆయన ఘజల్స్ అన్నా బాపుకి అమితమైన ఇష్టం. - ఎస్పీ బాల సుబ్రమణ్యం, గాయకుడు తెలుగు జాతి, సినీ పరిశ్రమ ఓ మహోన్నత వ్యక్తిని కోల్పోయాయి. బాపు తెలుగువాడిగా పుట్టడం తెలుగుజాతి చేసుకున్న అదృష్టం. ఆయన మరణంతో కన్నీరు పెట్టని తెలుగు వారుండరు. - పరుచూరి వెంకటేశ్వరరావు, సినీరచయిత ‘రాజాధిరాజు’ సినిమాకోసం బాపుతో కలసి పనిచేశా. గొప్ప కళాహృదయమున్న ఆయనతో కలసి పనిచేయడం మరపురాని అనుభూతిని మిగిల్చింది. ఆయన మరణం బాధాకరం. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. - విజయచందర్, వైఎస్సార్సీపీ ప్రచార విభాగం కన్వీనర్ తెలుగు చిత్రానికి, చలన చిత్రానికి అపరబ్రహ్మగా బాపు ప్రాణప్రతిష్ట చేశారు. తన చిరకాల మిత్రుడు రమణను కలుసుకునేందుకే మనందరినీ వదిలివెళ్లారు. ప్రపంచం మెచ్చిన చలనచిత్రాలతో బాపు దర్శక దిగ్గజంగా చిరస్థాయిగా నిలిచిపోతారు. - పరకాల ప్రభాకర్, ఏపీ కమ్యూనికేషన్స్ సలహాదారు -
నిర్మాత బెల్లంకొండ ఇంటి ముందు మంచు లక్ష్మీ అనుచరుల ధర్నా
బంజారాహిల్స్: తమకు రావాల్సిన డబ్బులు ఇవ్వాలంటూ నిర్మాత బెల్లంకొండ సురేశ్ ఇంటి ఎదుట మంగళశారం రాత్రి 9 గంటల ప్రాంతంలో నటుడు మోహన్‌బాబు కూతురు మంచులక్ష్మి అనుచరులు ఆందోళనకు దిగారు. మంచు లక్ష్మి నిర్మించిన ‘ఊ కొడతారా... ఉలికిపడతారా...’ సినిమా సెట్టింగ్‌ను నిర్మాత బెల్లండ సురేశ్ రభస సినిమా కోసం అద్దెకు తీసుకున్నారు. ఇందుకోసం రూ.58 లక్షలు ఇస్తానని మంచు లక్ష్మితో ఒప్పందం కుదుర్చుకున్నట్టు సమాచారం. అనుకున్న ప్రకారం... డబ్బులు ఇవ్వడానికి బెల్లంకొండ సురేశ్ వెనుకడుగు వేశారని మంచు లక్ష్మి అనుచరులు ఆరోపిస్తున్నారు. రభస సినిమా బుధవారం విడుదలవుతుంది. తమ డబ్బులు చెల్లించిన తరువాతే సినిమా విడుదల చేసుకోవాలంటూ వీరంతా సురేశ్ ఇంటి ఎదుట బైఠాయించారు. దీంతో ఫిలింనగర్‌లోని సురేశ్ ఇంటి వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులు పరిస్థితిని సమీక్షించారు. పోలీసులు ఆందోళనకారులకు నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించడంతో పరిస్థితి సద్దుమణిగింది. -
తెలుగు సినీ పరిశ్రమ దారెటు..?
-
అదే జరిగితే ప్రభుత్వం, పరిశ్రమ రెంటికీ నష్టమే!
-
తెలంగాణ సినిమా అంటే..?
-
తెలుగు సినీ పరిశ్రమ ఎక్కడికీ తరలిపోదు!
-
సినీ పరిశ్రమలో అసలేం జరుగుతోంది? Part 2
-
సినీ పరిశ్రమలో అసలేం జరుగుతోంది? Part 1
-
కొత్త ఫిల్మ్‌సిటీకి కేసీఆర్ పేరు పెట్టాలి
-
ఫిల్మ్‌సిటీకి కేసీఆర్ పేరు పెట్టాలి: కృష్ణ
హైదరాబాద్ : తెలంగాణలో రెండువేల ఎకరాలతో నిర్మించబోయే ఫిల్మ్ సిటీకి కేసీఆర్ పేరు పెడితే బాగుంటుందని సూపర్ స్టార్ కృష్ణ ప్రతిపాదించారు. ఫిల్మ్ సిటీ నిర్మాణానికి ఆయన మద్దతు ప్రకటించారు. ఇప్పటికే తెలుగు చిత్ర పరిశ్రమ... ఫిల్మ్‌సిటీ నిర్మాణాన్ని స్వాగతించింది. పలువురు సినీ పెద్దలు ఈ సందర్భంగా కేసీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. రెండువేల ఎకరాల్లో రాష్ట్రంలో ఫిల్మ్ సిటీని నిర్మించనున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. షూటింగులు, టీవీ సీరియళ్ల నిర్మాణానికి అనుగుణంగా భారీ స్థాయిలో ‘సినిమా సిటీ’ నిర్మించాలని, ఇందులో గ్రాఫిక్స్, ఎఫెక్ట్స్ సౌకర్యాలతో స్టూడియోలు ఉండాలని కేసీఆర్ సూచించారు. ప్రపంచ సినిమాకు హైదరాబాద్ ప్రధాన కేంద్రం కావాలని ఆకాంక్షను వ్యక్తం చేశారు. సినీ పరిశ్రమ హైదరాబాద్ నుంచి ఎట్టిపరిస్థితుల్లోనూ తరలిపోదని కూడా ఆయన ధీమా వ్యక్తం చేశారు. దీంతో సినీ పరిశ్రమకు మేలు జరగడంతో పాటు స్థానికులకు ఉపాధి, ఉద్యోగావకాశాలు లభిస్తాయని అభిప్రాయపడ్డారు. -
సీరియల్సే..సో బెటరూ: శ్రీలక్ష్మి
అబ్బ.. దబ్బ.. జబ్బ.. అంటూ మౌనంగానే నవ్వుల పూలు పూయించగలరు... తాగుబోతు దేవదాసుగా కిందపడిపోతూ, పైకిలేస్తూ ఫక్కున నవ్వించగలరు.. వెరైటీ కవితలు, కొత్తరకం వంటకాలతో హాస్యపు జల్లులు కురిపించగలరు.. ఆమే నవ్వుల లక్ష్మి శ్రీలక్ష్మి. కమెడియన్లుగా మగవారే హల్చల్ చేస్తున్న రోజుల్లో హాస్యనటిగా ఆమె ఉన్నత శిఖరాలు అధిరోహించారు. కరుణరసం, గయ్యాలి పాత్రల్లోనూ చక్కగా ఇమిడిపోయే రూపం ఆమెది. ఎంతోకాలంపాటు మరో హాస్యనటికి అవకాశం ఇవ్వకుండా వెండితెరను ఏలిన శ్రీలక్ష్మి ఓ టీవీ సీరియల్ షూటింగ్లో పాల్గొనేందుకు కైకలూరు వచ్చారు. ఈ సందర్భంగా ఆమె ‘సాక్షి’తో మాట్లాడారు. ప్రశ్న : సినీ పరిశ్రమలో మీ ఎంట్రీ ఎలా జరిగింది? శ్రీలక్ష్మి : మా తండ్రి అమరనాథ్ నటుడు, నిర్మాత. సోదరుడు రాజేష్ కూడా నటుడిగా రాణించారు. నాన్న మరణించాక 1980లో స్వర్గం సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమయ్యాను. ప్ర : ఎన్ని సినిమాల్లో నటించారు? శ్రీలక్ష్మి : దాదాపు 500 సినిమాల్లో నటించాను. తమిళ, కన్నడ, మళయాలంలో హీరోయిన్ పాత్రలు కూడా చేశాను. సుమారు 40 మంది కామెడీ యాక్టర్లతో పనిచేశాను. ప్ర : హీరోయిన్ అవుదామని వచ్చి కమెడియన్‌గా ఎలా స్థిరపడ్డారు. శ్రీలక్ష్మి : కళను ప్రదర్శించాలే కానీ.. అది హీరోయిన్ అయితే ఏంటీ, కామెడీ అరుుతే ఏంటీ. నేనెప్పుడూ ఆవిధంగా ఆలోచించలేదు. దర్శకులు జంధ్యాల, రేలంగి నరసింహారావు, ఈవీవీ సత్యనారాయణ నాకు చక్కటి పాత్రలు ఇచ్చారు. ప్ర : టీవీ సీరియళ్లలోకి రావడానికి కారణమేమిటీ? శ్రీలక్ష్మి : బుల్లితెరకు, పెద్దతెరకు తేడా ఏం ఉండదు. సినిమాల కంటే టీవీ సీరియళ్లకే ఎక్కువ ఆఫర్లు వస్తున్నాయి. ‘మేఘమాల’లో బామ్మ పాత్ర పోషించాను. ఇప్పుడు ‘సఖీ’ సీరియల్లో హీరోయిన్ అమ్మగా చేస్తున్నాను. సరస్వతి అనే పెలైట్ ప్రాజెక్టు ఆఫర్ కూడా వచ్చింది. ప్ర : కొల్లేరుపై మీ అభిప్రాయం.. శ్రీలక్ష్మి : హీరో కృష్ణ, ప్రభ హీరోహీరోయిన్లుగా తిలక్ దర్శకత్వంలో ‘కొల్లేటి కాపురం’ సినిమా తీశారు. అలా.. కొల్లేరు పేరు వినడమే కానీ ఎప్పుడూ చూడలేదు. పక్షులు, వాతావరణం ఎంతో బాగుంటుందని చెప్పారు. ఆ అందాలను తప్పకుండా వీక్షిస్తాను. ప్ర : టీవీ సీరియళ్ల ప్రభావం సినిమాలపై ఉందా.. శ్రీలక్ష్మి : దేని దారి దానిది. ఇటీవల సీరియల్స్ చూసేవారు ఎక్కువయ్యారు. దానికి కారణం సీరియళ్లలో వివిధ కుటుంబ పాత్రలు. మంచిని చూపిస్తే ప్రజలు ఎప్పుడూ ఆదరిస్తారు. ప్ర : సీనియర్ నటిగా కొత్త వారికి మీరిచ్చే సలహా.. శ్రీలక్ష్మి : సినీ పరిశ్రమలో ఎంతోమంది సీనియర్లు ఉన్నారు. సలహాలు చెబుదామంటే వినేవారే లేరు. అడిగేవారూ లేరు. అందరూ మాకు అన్ని తెలుసు అనే ధోరణితోనే వస్తున్నారు. మా కాలంలో అలా లేదు. చివరిగా నేను చెప్పేదేంటంటే మనం ఎంచుకున్న లక్ష్యం కోసం చిత్తశుద్ధిగా పనిచేస్తే ఏ రంగంలోనైనా రాణించవచ్చు. -
ఆ కుటుంబాల గుప్పిట్లోనే 'తెలుగు సినీ పరిశ్రమ'
హైదరాబాద్: తెలుగు సినీ పరిశ్రమ కేవలం నాలుగు కుటుంబాల కబంధ హస్తాల్లో చిక్కుకుందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి శనివారం హైదరాబాద్‌లో ఆరోపించారు. తెలంగాణ నిర్మాతలు, కళాకారులకు సీని పరిశ్రమలో తగిన ప్రాధాన్యం దక్కలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చిత్ర పరిశ్రమకు రెండు వేల ఎకరాలు కేటాయిస్తామన్న.. తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటనను స్వాగతిస్తున్నామని తెలిపారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రాంత కళాకారులకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఫిలింనగర్ సొసైటీలో జరుగుతున్న అక్రమాలను బయటపెట్టాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వ స్థలాల్లో చిత్ర పరిశ్రమకు చెందిన వారి నిర్మాణాలపై విచారణ జరిపించాలని ప్రభుత్వానికి ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. -
మన నూరేళ్ళ సినిమాపై... మంచు విష్ణు డాక్యుమెంటరీ సిరీస్!
భారతీయ సినిమా ఇప్పటికి 101 ఏళ్ళు పూర్తి చేసుకొని, దిగ్విజయంగా ముందుకు వెళుతోంది. మూగగా మొదలై మాటలు నేర్చిన సినిమా తెలుగు భాషలోనూ ఇప్పటికి 82 ఏళ్ళుగా సామాన్యుల్ని అలరిస్తూనే ఉంది. అయితే, వేషభాషలతో సహా మానవ జీవితాన్నే ఎంతో మార్చేసిన ఈ శతాధిక వత్సర అద్భుతం తాలూకు చరిత్ర ఇప్పటికీ సమగ్రంగా రికార్డు కాలేదనే చెప్పాలి. కొద్దిమంది ప్రయత్నాలు చేసినా, ఆర్థిక వనరుల కొరత మొదలు అనేక ఇబ్బందులతో సంతృప్తికర ఫలితాలు తెరపైకి రానే లేదు. ఈ నేపథ్యంలో మన తెలుగు హీరో - నిర్మాత మంచు విష్ణు తాజాగా ఓ ప్రయత్నం చేస్తున్నారు. నూరు వసంతాల భారతీయ సినిమాపై ఓ డాక్యుమెంటరీ సిరీస్‌ను తీయాలని భావిస్తున్నారు. దాదాసాహెబ్ ఫాల్కే దర్శకత్వంలో రూపొందిన తొలి భారతీయ మూకీ ఫీచర్ ఫిల్మ్ ‘రాజా హరిశ్చంద్ర’ (1913) దగ్గర మొదలుపెట్టి, హెచ్.ఎం. రెడ్డి దర్శకత్వంలో 1932 ఫిబ్రవరి 6న విడుదలైన తొలి పూర్తి తెలుగు టాకీ ‘భక్త ప్రహ్లాద’ మీదుగా ఇప్పటి వరకు మన సినీ ప్రస్థానాన్ని పలు భాగాల డాక్యుమెంటరీగా తెర కెక్కించనున్నట్లు భోగట్టా. విష్ణు తీసే ఈ డాక్యుమెంటరీ సిరీస్‌కు ఆయన తండ్రి, నటుడు, నిర్మాత అయిన మోహన్‌బాబు ఆర్థికంగా అండగా నిలుస్తున్నట్లూ, తెలుగు సినీ పరిశ్రమకు తమ వంతు సేవగా ఈ ప్రయత్నం చేస్తున్నట్లూ కృష్ణానగర్ కబురు. ఈ విశిష్ట ప్రయత్నంపై వినవస్తున్న వార్తల గురించి ‘సాక్షి’ ప్రతినిధికి విష్ణు వివరణనిస్తూ, ‘‘అవును. డాక్యుమెంటరీ సిరీస్ తీయాలనుకుంటున్నది నిజమే’’ అని అంగీకరించారు. ‘‘నేను కొన్ని భాగాలు తీస్తే, మరో ప్రముఖ దర్శకుడు కొన్ని భాగాలు తీస్తారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేసుకుంటున్నాం’’ అని ఈ యువ హీరో తెలిపారు. మరో వారం రోజుల్లో ఈ డాక్యుమెంటరీ ప్రయత్నం గురించి పూర్తి వివరాలను అధికారికంగా తెలియజేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. వివరాల మాట అటుంచితే, మన సినిమా చరిత్ర రికార్డు కాలేదని ఆవేదన చెందుతున్న సినీ ప్రియులకు ఇది శుభవార్తే. సాధికారికమైన సమాచారంతో, సమగ్రంగా ఈ డాక్యుమెంటరీ ప్రయత్నం సాగితే అంతకన్నా ఇంకేం కావాలి! ఆల్ ది బెస్ట్ విష్ణూ! -
తెలుగు సినీపరిశ్రమలో ప్రోత్సాహం బాగుంది
యువనటి ప్రియాంక తిరుమల : తెలుగు సినీపరిశ్రమలో తనకు మంచి పోత్సాహం లభిస్తోందని మదనపల్లెకు చెందిన యువ సినీనటి ప్రియాంక తెలిపారు. ఆదివారం శ్రీవారి దర్శనార్థ ఆమె తిరుమలకు వచ్చారు. ఈ సందర్భంగా ప్రియాంక అతిథిగృహం వద్ద ‘సాక్షి’తో మాట్లాడారు. మోహన్‌బాబు శ్రీవిద్యానికేతన్ కళాశాలలో చదివానని, అక్కడ జరిగిన కల్చరల్ ప్రోగ్రామ్ ద్వారా తనకు సినిమాల్లో నటించే అవకాశం వచ్చిందని తెలిపారు. తెలుగులో తాను నటించిన ‘ప్రేమలేదు’ చిత్రానికి మంచి ఆదరణ వచ్చిందని, ప్రస్తుతం ‘జయహో’ చిత్రంలో నటిస్తున్నానని చెప్పారు. కన్నడ, తమిళంలో కూడా మంచి అవకాశాలు వస్తున్నాయన్నారు. ప్రతి ఏడాది కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకోవటం తనకు ఆనవాయితీగా వస్తోందన్నారు. తెలుగు సినీపరిశ్రమలో మంచి పేరు సంపాదించటమే తన లక్ష్యమన్నారు. -
ఇద్దరు ముఖ్యమంత్రులతో ప్రకటన ఇప్పిస్తాం
‘‘తెలుగు సినీ పరిశ్రమను వైజాగ్‌కు తరలిస్తున్నట్లు వస్తున్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదు. తెలుగు సినిమా హైదరాబాద్‌లోనే స్థిరంగా ఉంటుంది. త్వరలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుగారిని, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసీఆర్‌గారిని కూర్చోబెట్టి వారిద్దరి ద్వారా ఈ విషయంపై ఓ ప్రకటన ఇప్పించనున్నాం. వారిద్దరూ కలిసి ఓ ప్రకటన చేస్తే ఇక ఈ విషయంపై ఎలాంటి సందేహాలూ ఉండవు’’ అని తెలుగు చలనచిత్ర నటీనటుల సంఘం అధ్యక్షుడు, పార్లమెంట్ సభ్యుడు మురళీమోహన్ అన్నారు. మంగళవారం ఆయన పుట్టిన రోజు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మురళీ మోహన్ మాట్లాడుతూ -‘‘చెన్నయ్ నుంచి తెలుగు చిత్ర పరిశ్రమ హైదరాబాద్‌కి తరలిరావడానికి 20 ఏళ్లు పట్టింది. మళ్లీ ఇక్కడ్నుంచీ వైజాగ్ అంటే... మాలాంటి వారికి తేలికే కానీ, పరిశ్రమలోని చిన్న చిన్న కార్మికులకు, జూనియర్ ఆర్టిస్టులకు అది కష్టతరమైన విషయం’’ అని చెప్పారు. ఇటీవలే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ని ఈ విషయంపై కలిశామని, ఆయన కూడా సానుకూలంగా స్పందించారని మురళీమోహన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మురళీమోహన్‌తో పాటు నటుడు రఘుబాబు పుట్టిన రోజును కూడా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఘనంగా నిర్వహించింది. పరుచూరి గోపాలకృష్ణ, మహర్షి రాఘవ, కృష్ణుడు, ఉత్తేజ్, శశాంక్ తదితరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
ఇద్దరు ముఖ్యమంత్రులతో ప్రకటన ఇప్పిస్తాం
‘‘తెలుగు సినీ పరిశ్రమను వైజాగ్‌కు తరలిస్తున్నట్లు వస్తున్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదు. తెలుగు సినిమా హైదరాబాద్‌లోనే స్థిరంగా ఉంటుంది. త్వరలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుగారిని, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసీఆర్‌గారిని కూర్చోబెట్టి వారిద్దరి ద్వారా ఈ విషయంపై ఓ ప్రకటన ఇప్పించనున్నాం. వారిద్దరూ కలిసి ఓ ప్రకటన చేస్తే ఇక ఈ విషయంపై ఎలాంటి సందేహాలూ ఉండవు’’ అని తెలుగు చలనచిత్ర నటీనటుల సంఘం అధ్యక్షుడు, పార్లమెంట్ సభ్యుడు మురళీమోహన్ అన్నారు. మంగళవారం ఆయన పుట్టిన రోజు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మురళీ మోహన్ మాట్లాడుతూ -‘‘చెన్నయ్ నుంచి తెలుగు చిత్ర పరిశ్రమ హైదరాబాద్‌కి తరలిరావడానికి 20 ఏళ్లు పట్టింది. మళ్లీ ఇక్కడ్నుంచీ వైజాగ్ అంటే... మాలాంటి వారికి తేలికే కానీ, పరిశ్రమలోని చిన్న చిన్న కార్మికులకు, జూనియర్ ఆర్టిస్టులకు అది కష్టతరమైన విషయం’’ అని చెప్పారు. ఇటీవలే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ని ఈ విషయంపై కలిశామని, ఆయన కూడా సానుకూలంగా స్పందించారని మురళీమోహన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మురళీమోహన్‌తో పాటు నటుడు రఘుబాబు పుట్టిన రోజును కూడా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఘనంగా నిర్వహించింది. పరుచూరి గోపాలకృష్ణ, మహర్షి రాఘవ, కృష్ణుడు, ఉత్తేజ్, శశాంక్ తదితరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
ఇండస్ట్రీ ఎక్కడికెళ్లినా నా పని నవ్వించడమే!
-
రాష్ట్రం విడిపోయాక పరిశ్రమ కలిసుండడం అసాధ్యం
‘‘తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నేపథ్యంలో.. తెలంగాణ సినిమాను ప్రోత్సహించడానికి, తెలంగాణ సినీ కళాకారులకు చేయూతనివ్వడానికి హైదరాబాద్‌లోని ఏపి ఫిలిం ఛాంబర్ కార్యాలయంలోని ఓ భాగాన్ని తెలంగాణ ఫిలిం ఛాంబర్ కార్యాలయానికి తక్షణం కేటాయించాలి’’ అని తెలంగాణ నిర్మాతల మండలి అధ్యక్షుడు సానా యాదిరెడ్డి ఉద్ఘాటించారు. గురువారం హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘అన్ని రంగాల్లో జరిగినట్లే సినీరంగంలో కూడా తెలంగాణ వారికి అన్యాయం జరుగుతూనే ఉంది. ఇటీవలే ఫిలిం ఛాంబర్ పెద్దలు తెలంగాణ సినిమాను ప్రాంతీయ భాషా సినిమాగా వేరు చేసి చూపించారు. దీనిలోని ఆంతర్యమేంటో బయటపెట్టాలి. ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్న తర్వాత కూడా ఈ వివక్ష తగదు. ఇక్కడి నిర్మాతల సంఖ్య పెంచుకోవడం కోసం, తెలంగాణ సినిమాను అభివృద్ధి చేసుకోవడం కోసం ప్రభుత్వం ప్రత్యేక రాయితీలు, సబ్సిడీలు కల్పించాలి’’ అని కోరారు. తెలంగాణ నేలపై సినిమాలు తీస్తూ, తెలంగాణవారి సినిమాను ఓ ప్రాంతీయ సినిమాగా అభివర్ణించడం సరికాదని, ఇలాంటి చర్యలు తక్షణం విడనాడి తెలంగాణ సినిమాలను ప్రత్యేకంగా గుర్తించి, గౌరవించాలని తెలంగాణ దర్శకుల సంఘం అధ్యక్షుడు అల్లాణి శ్రీధర్ పేర్కొన్నారు. ఈ విషయంపై తెలంగాణ దర్శక, నిర్మాతలు ఐక్యంగా పోరాటం సాగించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుపై ట్విట్టర్ ద్వారా అనుచిత వ్యాఖ్యలు చేసిన దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ తక్షణం తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలని శ్రీధర్ డిమాండ్ చేశారు. రాష్ట్రం విడిపోయాక సినీ పరిశ్రమ కలిసి ఉండటం అసాధ్యమని సంగిశెట్టి దశరథ పేర్కొన్నారు. ఇంకా ప్రేమ్‌రాజ్, కుమార్ మాట్లాడారు. -
సినీ పరిశ్రమ చూపు.. విశాఖ వైపు..!
-
'విభజనతో 220 సినిమాలు ఆగిపోయాయి'
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తెలుగు చిత్ర పరిశ్రమకు గట్టి దెబ్బ అని చిత్ర నిర్మాత, తెలుగుదేశం పార్టీ నాయకుడు అంబికా కృష్ణ తెలిపారు. బుధవారం తిరుమలలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ... చిన్న సినిమాలు ఇప్పటికే అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, విభజనతో ఆ ఇబ్బందులు మరింత తీవ్ర మయ్యాయని అన్నారు. దాదాపు 220 సినిమాలు అర్థంతరంగా నిలిచిపోయాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విభజనతో చిన్న సినిమాల నిర్మాతలకు తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. అంతకు ముందు అంబికా కృష్ణ కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. -
నిర్మాతలకు అండాదండ ఏఎన్నార్
ఏఎన్నార్ ఘాట్ నిర్మించాలి అక్కినేని సంస్మరణ సభలో కోరిన వక్తలు బంజారాహిల్స్, న్యూస్‌లైన్: తనలాంటి చాలా మంది నిర్మాతలకు అక్కినేని అండగా నిలిచారని ప్రము ఖ నిర్మాత రామానాయుడు అన్నారు. శు క్రవారం ఫిలిం ఛాంబర్ ఆడిటోరియం లో అక్కినేని నాగేశ్వర్రావు సంస్మరణ స భ జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన రామానాయుడు మాట్లాడుతూ ప్రేమ్‌నగర్ వల్లే తాను నిర్మాతగా పరిశ్రమలో నిలబడ్డాడని చెప్పారు. క్రమశిక్షణకు మా రుపేరు నాగేశ్వర్రావు అని కొనియాడా రు. ఎన్టీఆర్‌లా ఏఎన్నార్‌కు కూడా స్మార క ఘాట్ నిర్మించాలని తమ్మారెడ్డి భరద్వాజ సూచించారు. అక్కినేని తెరిచిన ఓ పుస్తకమని చెప్పారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ సినీ పరిశ్రమకు భీష్ముల్లాంటి వారని పరుచూరి వెంకటేశ్వర్రావు అన్నారు. దైవభక్తి ఉన్న ఎన్టీఆర్‌ను అంతగా నమ్మని ఏఎన్నార్‌ను దేవుడు సమానంగా చూశాడని ఆయన పేర్కొన్నారు. అక్కినేని వ్యక్తి కాదు మహా సంస్థ అని ఆదిశేషగిరిరావు అన్నారు. అక్కినేనితో తన అనుబంధాన్ని నిర్మాత రాఘవ గుర్తుచేసుకున్నారు. తాను నాగేశ్వర్రావుకు వీరాభిమానినని దర్శకుడు కోడిరామకృష్ణ స్ప ష్టం చేశారు. అక్కినేని ఎప్పటికి అమరుడేనని, తెలుగు చిత్ర పరిశ్రమ మద్రాసు నుంచి హైదరాబాద్ తరలిరావడానికి ఆయన చేసిన కృషి అమోఘమని పేర్కొన్నారు. అక్కినేని నేటి యువతకు ఆదర్శప్రాయుడని తెలిపారు. అక్కినేని అభిమానులను తనతో సమానంగా చూసేవారని చెప్పారు. అక్కినేని అమరజీవి అని వడ్డేపల్లి అన్నారు. ఈ కార్యక్రమంలో అక్కినేని కుటుంబసభ్యులు సుమంత్, నాగసుశీల, సుశాంత్, సినీ ప్రముఖులు కవిత, గిరిబాబు, చాట్ల శ్రీరాములు, హాస్యనటులు బాబూమోహన్, అలీ, రచయిత జొన్నవిత్తుల వెంకటేశ్వర్రావు పెద్ద సంఖ్యలో పరిశ్రమకు చెందిన వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కినేని చిత్రపటానికి సినీ ప్రముఖులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. -
చక్కనయ్యా చందమామ ఎక్కడున్నావు?
కామన్‌మెన్ గుండె చప్పుడు ఆగిపోయింది... తెలుగమ్మాయి స్కూల్ పుస్తకంలోకొచ్చిన మొదటి హీరో ఫొటో కనపడకుండా పోయింది... సినిమా థియేటర్‌కి కట్టిన మొట్టమొదటి హీరో బ్యానర్ గాలికి ఎగిరిపోయింది... తన కోసం క్యూలో జనానికి తొక్కిసలాట అలవాటు చేసిన తొలి తెలుగు సినిమా టికెట్... 91 ఏళ్ల తర్వాత ఇప్పుడు చినిగిపోయింది... తెలుగు హీరో అడ్రస్‌కి పోస్ట్‌మేన్ తెచ్చిన తొలి ప్రేమలేఖ... ఊరి గోడలు దాటి నట్టింటికొచ్చిన మొదటి సినిమా పోస్టర్... సెలూన్ గోడలమీద సినిమా హీరోలకు చోటిచ్చిన స్టయిలిష్ హీరో స్టిల్ ఫొటో... ఇప్పటికీ ఊళ్లో వైన్ షాప్ బోర్డ్ మీద గ్లాస్ పట్టుకొని కనిపించే దేవదాసు బొమ్మ... భౌతికంగా ఇక లేదు. వెండితెర చిన్నబోయిన వేళ అది... సినిమా తల్లి గర్భశోకంతో వెక్కి వెక్కి ఏడ్చిన వేళ అది. తెలుగునేల జనసంద్రంగా మారిన వేళ అది. 75 ఏళ్ల పాటు అసమాన నటనతో తెలుగుతెరను స్వర్ణయుగశోభితం చేసిన అద్వితీయ నటుడు అక్కినేని.. భౌతికంగా ఇక కనబడరని తెలిసి కోట్లాది జనం గుండెలవిసేలా తల్లడిల్లిన వేళ అది. ప్రేమలోని మాధుర్యాన్ని వెండితెర సాక్షిగా తెలియజేసిన అందాల ‘బాలరాజు’ ఇక లేడా? ‘కలిమిలేములు కష్టసుఖాలు.. కావడిలో కుండలని భయమేలోయీ..’ అని ధైర్యం చెప్పిన ‘దేవదాసు’ ఇక రాడా? విరహాన్నీ, విషాదాన్నీ, హాస్యాన్ని, ఆగ్రహాన్నీ అన్ని రసాలనీ అనితరసాధ్యంగా అభినయించి దశాబ్దాల పాటు ఆనందాన్ని పంచిన అభినయ శిఖరం భౌతికంగా ఇక కనిపించదా? నిన్నటిరోజు తెలుగు ప్రజానీకం గుండెల్లో ప్రతిధ్వనించిన ప్రశ్నలివి. విషణ్ణ వదనాలతో అక్కినేని భౌతికకాయాన్ని అనుసరించినవారు లక్షలాదిగా ఉంటే... కోట్లాది మంది జనాలు టీవీ సెట్లకు అతుక్కుపోయారు. కన్నీటితోనే ఆ మహా నటుడికి తుది వీడ్కోలు పలికారు. గురువారం ఉదయం 11.30 నిమిషాల నుంచి సాయంత్రం 3 గంటల వరకూ జరిగిన అక్కినేని అంతిమయాత్రలో... సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు లక్షలాదిగా అభిమానులు పాల్గొన్నారు. అగ్నిసంస్కారం జరిగే వరకూ ఆ బహుదూరపు బాటసారికి తోడుగా నిలిచారు. కుటుంబ సభ్యులతో పాటు, సినీ ప్రముఖులు సైతం కన్నీటి పర్యంతమైన ఆ ఘట్టం... మాటలతో వర్ణించరానిదే. అగ్నిలో పునీతుడవుతున్న అక్కినేనిని చూసి, అశేష తెలుగు జనం అశ్రు నివాళి అర్పించిన వేళ అది. -
‘నీ స్నేహం’తో తెరంగేట్రం
సత్యం సినిమాలో ‘పులిరాజుకు ఎయిడ్స్ వచ్చింది’ డైలాగ్‌తో గుర్తింపు వచ్చింది ఇప్పటి వరకు 250 చిత్రాల్లో నటించా ‘న్యూస్‌లైన్’తో సినీ నటుడు సత్యం రాజేష్ భూదాన్‌పోచంపల్లి, న్యూస్‌లైన్ సత్యం సినిమాలో ‘పులిరాజుకు ఎయిడ్స్ వచ్చింది’ డైలాగ్‌తో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ అనతికాలంలోనే మనసు దోచుకున్నాడు. పదేళ్లలో 250 సినిమాలలో పైగా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషిం చాడు. నటుడిగా గుర్తింపు నిచ్చిన సత్యం సినిమానే ఇంటిపేరుగా మార్చుకొన్న సత్యం రాజేష్ గురువారం భూదాన్‌పోచంపల్లి మండలం ముక్తాపూర్‌లో నారా రోహిత్ హీరోగా నటిస్తున్న ఓ సినిమాలో పాల్గొనడానికి వచ్చారు. ఈ సందర్భంగా తన సినీ జీవిత విశేషాలను ‘న్యూస్‌లైన్’తో పంచుకున్నారు. ఆయన జీవిత విశేషాలు అతని మాటల్లోనే.. ‘‘మాది వైజాగ్. నా అసలు పేరు రాజేష్‌బాబు. మధ్య తరగతి కుటుంబం మాది. నాన్న రాజేంద్రప్రసాద్ టెలికామ్ రిటైర్డ్ ఉద్యోగి, అమ్మ మణికుమారి గృహిణి . ఎంబీఏ వరకు చదువుకొన్నాను. ఆ తరువాత వైజాగ్‌లోని మహీంద్రా కంపనీలో ఉద్యోగం చేస్తుండగా హైదరాబాద్‌కు బదిలీ అయ్యా. ఇక్కడికి వచ్చిన తరువాత సినిమాల్లో అవకాశాలు సాధించాను. నా మొదటి సినిమా... నాకు చిన్నప్పటి నుంచి సినిమాలంటే చాలా ఇష్టం. చిరంజీవి వల్లే సినిమాల్లో నటించాలనే ప్రేరణ కల్గింది. ఆయన సిని మాలు బాగా చూసేవాడిని. ఉద్యోగరీత్యా హైదరాబాద్‌కు వచ్చిన అనంతరం నీ స్నేహం సినిమాకు అడిషన్స్‌లో ఎంపికయ్యాను. హీరో సుమంత్ స్నేహితుడిగా నటించే అవకాశం లభించింది. ఇలా తెరంగేట్రం చేశాను. సత్యం సినిమాతో గుర్తింపు.. రెండో సినిమా సత్యం సినిమాలో ‘పులిరాజుకు ఎయిడ్స్ వచ్చింది’ అనే డైలాగ్ ద్వారా నాకు నటుడిగా మంచి గుర్తింపు వచ్చింది. ఈ పదేళ్ల కాలంలో సుమారు 250 ైపైగా సినిమాలలో నటించాను. ప్రేక్షకులు ఆదరించినంత కాలం వారిని నవ్విస్తూనే ఉంటాను. కాగా మిర్చి, వేదం, బలుపు, జల్సా, ప్రేమ కాదలన్ ఇష్క్, నాయక్, ఒక విచిత్రం, అత్తారింటికి దారేది తదితర చిత్రాలు పేరు తెచ్చాయి. భీమవరం బుల్లోడు, రారా కృష్ణయ్య సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. మరో ఐదారు సినిమాల్లో నటిస్తున్నాను. బ్రహ్మనందాన్ని ఆదర్శంగా తీసుకుంటా... నాకు హీరోగా చేయాలని లేదు. ప్రేక్షకులను నవ్విస్తూ హాస్యనటుడిగా పేరు తెచ్చుకొవాలని ఉంది. హాస్యనటుల్లో బ్రహ్మానందాన్ని ఆదర్శంగా తీసుకుంటాను. అలాగే చిరంజీవి తరువాత పవన్‌కల్యాణ్, రవితేజ నా అభిమాన నటులు. ధన్‌రాజ్, తాగుబోతు రమేష్, నల్ల వేణు నాతో పాటు వచ్చిన కమెడియన్లే. చిత్ర పరిశ్రమలో అవకాశాలకు కొదవలేదు.... తెలుగు చిత్ర పరిశ్రమలో ఏడాదికి వంద నుంచి 150 సినిమాలు విడుదల అవుతున్నాయి. టాలెంట్ ఉన్నవారికి ఆలస్యమైన అవకాశాలకు మాత్రం కొదవ లేదు. నిరుత్సాపడకుండా పోటీపడితే విజయం తథ్యం’’. -
నటుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యంకు సినీ ప్రముఖుల నివాళి
ప్రముఖ హాస్య నటుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం(53) శనివారం రాత్రి కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన దిల్‌షుక్‌నగర్‌లోని తన స్వగృహంలోని తుది శ్వాసవిడిచారు. ఆనందో బ్రహ్మ హాస్య సీరియల్ తో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సుబ్రహ్మణ్యం అకస్మిక మృతి సినీ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది.ఆయన భౌతికాయాన్ని ఆదివారం సినీ,రాజకీయ ప్రముఖులు సందర్శించి నివాళులు అర్పించారు. -
ధర్మవరపు కన్నుమూత
సాక్షి, హైదరాబాద్/ఒంగోలు: ‘మాక్కూడా తెలుసు బాబూ..’ వంటి మాటల విరుపులు, విలక్షణ నటనతో అశేష తెలుగు ప్రేక్షకులను అలరించిన ప్రముఖ నటుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం(59) ఇక లేరు. ఆరు నెలలుగా కాలేయ కేన్సర్‌తో బాధపడుతున్న ఆయన శనివారం రాత్రి 10.30 గంటలకు ఇక్కడి చైతన్యపురిలోని గీతా ఆస్పత్రిలో మృతిచెందారు. పరిస్థితి విషమించడంతో నాలుగు రోజుల కింద ట ఆయనను ఆస్పత్రికి తరలించారు. ఆయనకు భార్య కృష్ణజ, ఇద్దరు కుమారులు రోహన్ సందీప్, రవిబ్రహ్మతేజ ఉన్నారు. సందీప్ వివాహితుడు కాగా, రవిబ్రహ్మతేజ డిగ్రీ చదువుతున్నారు. ధర్మవరపు కుటుంబం దిల్‌సుఖ్‌నగర్‌లోని శారదానగర్‌లో నివాసం ఉంటోంది. ఆయన పార్థివ దేహాన్ని ఇంటివద్ద ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. అనంతరం అద్దంకి దగ్గర్లోని శింగరకొండ దేవాలయం వద్ద ఉన్న ఆయన ఫామ్‌హౌస్‌లోనే అంత్యక్రియలు నిర్వహిస్తారు. దర్శకుడు తేజ.. ధర్మవరపు భౌతికకాయాన్ని సందర్శించారు. ఆనందోబ్రహ్మతో: ధర్మవరపు సుబ్రహ్మణ్యం 1954 సెప్టెంబర్ 20న ప్రకాశం జిల్లాలోని బల్లికురవ మండలం కొమ్మినేనివారి పాలెంలో జన్మించారు. ఒంగోలులోని సీఎస్ఆర్ కళాశాలలో పీయూసీ వరకు చదివారు. అలా చదువుతున్న రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి రాష్ట్ర గౌరవాధ్యక్షుడు నల్లూరి వెంకటేశ్వర్లుతో ఏర్పడింది. ‘గాలివాన’ నాటకంలోని జగన్ పాత్రతో ధర్మవరపు 18 ఏళ్ల వయసులోనే నటనలో సత్తా చాటారు. తర్వాత సినిమా అవకాశాల కోసం ప్రయత్నించారు. విలేజ్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ ఉద్యోగానికి ఎంపికైన ఆయన హైదరాబాద్‌లో శిక్షణ పొందుతున్న సమయంలో దూరదర్శన్‌లో ‘ఆనందో బ్రహ్మ’ సీరియల్లో నటించి గుర్తింపు పొందారు. తర్వాత ఎన్నో టీవీ సీరియళ్లలో నటించారు. ఎమ్మెల్యేలకు నిర్వహించే క్రీడాపోటీలకు వ్యాఖ్యానం చెప్పే అవకాశం కూడా ఆయనకు లభించింది. ‘జయమ్ము నిశ్చయమ్మురా’తో తెరంగేట్రం.. జంధ్యాల చిత్రం ‘జయమ్ము నిశ్చయమ్మురా’తో ధర్మవరపు తెరంగేంట్ర చేశారు. ‘నువ్వు-నేను’ తదితర చిత్రాలు ఆయనకు పేరు తెచ్చాయి. ఆయన నరేష్ నటించిన ‘తోకలేనిపిట్ట’ చిత్రానికి దర్శకత్వం వహించారు. హాస్యంతో పాటు క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను సొంతం చేసుకున్నారు. ఆయన కొన్నేళ్లుగా సాక్షి టీవీలో నిర్వహిస్తున్న రాజకీయ వ్యంగ్య కార్యక్రమం ‘డింగ్‌డాంగ్’ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ధర్మవరకు రాష్ట్ర సాంస్కృతికమండలి చైర్మన్‌గా పనిచేశారు. ‘ఆలస్యం అమృతం’కు ఉత్తమ కమెడియన్ ఆర్టిస్టుగా నంది అవార్డు అందుకున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ధర్మవరపు కాంగ్రెస్‌లో చేరారు. తర్వాత రాష్ట్ర సాంస్కృతిక మండలి చైర్మన్‌గా కళారంగ వికాసానికి కృషి చేశారు. ఆయన నటించిన ‘ప్రేమాగీమా జాంతానై’ విడుదల కావాల్సి ఉంది. అప్పటికే అనారోగ్యంగా ఉన్నప్పటికీ ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం మేరకు వికారాబాద్‌లో జరిగిన షూటింగ్‌కు హాజరై తమకెంతో సహకరించారని చిత్ర దర్శకుడు ఆర్వీ సుబ్బు తెలిపారు. ధర్మవరపు మరణంపై రాష్ట్ర బాలల హక్కుల సంఘం అధ్యక్షుడు అచ్యుతరావు సంతాపం తెలిపారు. -
నటుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం కన్నుమూత
ప్రముఖ హాస్య నటుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం(53) శనివారం రాత్రి కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన దిల్‌షుక్‌నగర్‌లోని తన స్వగృహంలోని తుది శ్వాసవిడిచారు. ఆనందో బ్రహ్మ హాస్య సీరియల్ తో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సుబ్రహ్మణ్యం అకస్మిక మృతి సినీ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. -
నటుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం కన్నుమూత
హైదరాబాద్:ప్రముఖ హాస్య నటుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం(53) శనివారం రాత్రి కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన దిల్‌షుక్‌నగర్‌లోని తన స్వగృహంలోని తుది శ్వాసవిడిచారు. ఆనందో బ్రహ్మ హాస్య సీరియల్ తో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సుబ్రహ్మణ్యం అకస్మిక మృతి సినీ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. బావా బావా పన్నీరు సినిమాతో సినీ ప్రస్థానం మొదలు పెట్టిన ఆయన నరేష్ హీరోగా తోకలేని పిట్ట సినిమాకు దర్శకత్వం వహించారు. ఇప్పటి వరకూ ఆయన దాదాపు 870 చిత్రాల్లో పలుపాత్రల్లో నటించి అభిమానులను అలరించారు. ఆయన అకస్మిక మృతి తెలుగు సినీ లోకాన్ని విషాదంలోకి నెట్టింది. ప్రకాశం జిల్లాలోని కొమ్మునేని వారి పాలెంలో పుట్టిన ఆయన తెలుగు చిత్రసీమలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతికి మండలి ఛైర్మన్ గా సేవలందించారు. గత 350 ఎపిసోడ్ ల నుంచి సాక్షి టీవీలో ప్రసారమయ్యే డింగ్ డాంగ్ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా పని చేస్తున్నారు. ప్రస్తుతం గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందుతున్న రుద్రమదేవి సినిమాలో నటిస్తున్నారు. -
శ్రీహరికి కేన్సర్ లేదు, చనిపోయారంటే నమ్మలేకపోతున్నా: ప్రభుదేవా
టాలీవుడ్ నటుడు శ్రీహరి అకస్మికమరణాన్ని నమ్మలేకపోతున్నానని ప్రముఖ నటుడు, దర్శకుడు ప్రభుదేవా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రెండు రోజుల ముందు కూడా ఆయన షూటింగ్లో పాల్గొన్నారని, ఎలాంటి అనారోగ్యం లేకుండా ఉల్లాసంగా గడిపారని చెప్పారు. బుధవారం ముంబైలో హఠాన్మరణం చెందిన శ్రీహరి.. ప్రభుదేవా దర్శకత్వంలో 'ఆర్.. రాజ్‌కుమార్' సినిమా షూటింగ్ కోసం అక్కడికి వెళ్లారు. 'శ్రీహరి చనిపోయారంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నా. తెలుగు సినీ పరిశ్రమలో ఆయనకు ఉక్కు మనిషిగా పేరుంది. నేను పనిచేసిన అత్యంత ఆరోగ్యకరమైన, ఫిట్నెస్ ఉన్న నటుల్లో శ్రీహరి ఒకరు. ఆయనకు కేన్సర్ ఉన్నట్టు వచ్చిన వార్తలు అవాస్తవం. ముంబైలో షూటింగ్లో పాల్గొన్నాక ఊహించనివిధంగా అస్వస్థతకు గురయ్యారు. గుండెపోటు రావడంతో చనిపోయారు' అని ప్రభుదేవా చెప్పారు. ఆయన హైదరాబాద్ వచ్చి శ్రీహరి కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. -
శ్రీహరి అంత్యక్రియలు పూర్తి
-
శ్రీహరికి ప్రముఖుల నివాళులు-part 2
-
శ్రీహరికి ప్రముఖుల నివాళులు-Part 1
-
శ్రీహరి నివాసానికి అభిమానుల తాకిడి