
నిర్మాతలకు అండాదండ ఏఎన్నార్
తనలాంటి చాలా మంది నిర్మాతలకు అక్కినేని అండగా నిలిచారని ప్రము ఖ నిర్మాత రామానాయుడు అన్నారు. శుక్రవారం ఫిలిం ఛాంబర్ ఆడిటోరియం
- ఏఎన్నార్ ఘాట్ నిర్మించాలి
- అక్కినేని సంస్మరణ సభలో కోరిన వక్తలు
బంజారాహిల్స్, న్యూస్‌లైన్: తనలాంటి చాలా మంది నిర్మాతలకు అక్కినేని అండగా నిలిచారని ప్రము ఖ నిర్మాత రామానాయుడు అన్నారు. శు క్రవారం ఫిలిం ఛాంబర్ ఆడిటోరియం లో అక్కినేని నాగేశ్వర్‌రావు సంస్మరణ స భ జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన రామానాయుడు మాట్లాడుతూ ప్రేమ్‌నగర్ వల్లే తాను నిర్మాతగా పరిశ్రమలో నిలబడ్డాడని చెప్పారు. క్రమశిక్షణకు మా రుపేరు నాగేశ్వర్‌రావు అని కొనియాడా రు. ఎన్టీఆర్‌లా ఏఎన్నార్‌కు కూడా స్మార క ఘాట్ నిర్మించాలని తమ్మారెడ్డి భరద్వాజ సూచించారు.
అక్కినేని తెరిచిన ఓ పుస్తకమని చెప్పారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ సినీ పరిశ్రమకు భీష్ముల్లాంటి వారని పరుచూరి వెంకటేశ్వర్‌రావు అన్నారు. దైవభక్తి ఉన్న ఎన్‌టీఆర్‌ను అంతగా నమ్మని ఏఎన్నార్‌ను దేవుడు సమానంగా చూశాడని ఆయన పేర్కొన్నారు. అక్కినేని వ్యక్తి కాదు మహా సంస్థ అని ఆదిశేషగిరిరావు అన్నారు. అక్కినేనితో తన అనుబంధాన్ని నిర్మాత రాఘవ గుర్తుచేసుకున్నారు. తాను నాగేశ్వర్‌రావుకు వీరాభిమానినని దర్శకుడు కోడిరామకృష్ణ స్ప ష్టం చేశారు. అక్కినేని ఎప్పటికి అమరుడేనని, తెలుగు చిత్ర పరిశ్రమ మద్రాసు నుంచి హైదరాబాద్ తరలిరావడానికి ఆయన చేసిన కృషి అమోఘమని పేర్కొన్నారు.
అక్కినేని నేటి యువతకు ఆదర్శప్రాయుడని తెలిపారు. అక్కినేని అభిమానులను తనతో సమానంగా చూసేవారని చెప్పారు. అక్కినేని అమరజీవి అని వడ్డేపల్లి అన్నారు. ఈ కార్యక్రమంలో అక్కినేని కుటుంబసభ్యులు సుమంత్, నాగసుశీల, సుశాంత్, సినీ ప్రముఖులు కవిత, గిరిబాబు, చాట్ల శ్రీరాములు, హాస్యనటులు బాబూమోహన్, అలీ, రచయిత జొన్నవిత్తుల వెంకటేశ్వర్‌రావు పెద్ద సంఖ్యలో పరిశ్రమకు చెందిన వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కినేని చిత్రపటానికి సినీ ప్రముఖులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.