యువనటి ప్రియాంక
తిరుమల : తెలుగు సినీపరిశ్రమలో తనకు మంచి పోత్సాహం లభిస్తోందని మదనపల్లెకు చెందిన యువ సినీనటి ప్రియాంక తెలిపారు. ఆదివారం శ్రీవారి దర్శనార్థ ఆమె తిరుమలకు వచ్చారు. ఈ సందర్భంగా ప్రియాంక అతిథిగృహం వద్ద ‘సాక్షి’తో మాట్లాడారు. మోహన్‌బాబు శ్రీవిద్యానికేతన్ కళాశాలలో చదివానని, అక్కడ జరిగిన కల్చరల్ ప్రోగ్రామ్ ద్వారా తనకు సినిమాల్లో నటించే అవకాశం వచ్చిందని తెలిపారు.
తెలుగులో తాను నటించిన ‘ప్రేమలేదు’ చిత్రానికి మంచి ఆదరణ వచ్చిందని, ప్రస్తుతం ‘జయహో’ చిత్రంలో నటిస్తున్నానని చెప్పారు. కన్నడ, తమిళంలో కూడా మంచి అవకాశాలు వస్తున్నాయన్నారు. ప్రతి ఏడాది కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకోవటం తనకు ఆనవాయితీగా వస్తోందన్నారు. తెలుగు సినీపరిశ్రమలో మంచి పేరు సంపాదించటమే తన లక్ష్యమన్నారు.
తెలుగు సినీపరిశ్రమలో ప్రోత్సాహం బాగుంది
Published Mon, Jul 7 2014 3:02 AM | Last Updated on Sat, Sep 2 2017 9:54 AM
Advertisement
Advertisement