
వరద బాధితులను ఆదుకోండి: జగన్
సాక్షి, హైదరాబాద్: నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో కురుస్తున్న వర్షాలు, వరదలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలను ఆదుకోవాలని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ నేతలను ఆదేశించారు. ఆయన బుధవారం ఆ జిల్లాల పార్టీ నేతలతో ఫోన్‌లో మాట్లాడి అక్కడి పరిస్థితులను తెలుసుకున్నారు. ఇబ్బందుల పడుతున్న వారి కోసం తక్షణం సహాయక చర్యలు చేపట్టాలని వారికి సూచించారు.
మరింత అప్రమత్తంగా ఉండండి
అధికారులు, ప్రజాప్రతినిధులకు సీఎం ఆదేశం
సాక్షి, విజయవాడ బ్యూరో: వచ్చే రెండు రోజుల్లో భారీ వర్షాలు కురవనున్న నేపథ్యంలో మరింత అప్రమత్తంగా ఉండాలని చిత్తూరు, నెల్లూరు జిల్లాల కలెక్టర్లను సీఎం చంద్రబాబు ఆదేశించారు. బుధవారం గుంటూరు జిల్లా ఉండవల్లిలోని తన నివాసం నుంచి రెండు జిల్లాల కలెక్టర్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జన్మభూమి కమిటీలు, ప్రజాప్రతినిధులతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్షాలు, వరదల్లో చిక్కుకొని ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలను వెంటనే పునరావాస శిబిరాలకు తరలించాలని సూచించారు. వైద్య ఆరోగ్య శాఖ, గ్రామీణ నీటి సరఫరా, పారిశుధ్య విభాగాల అధికారులు బృందాలుగా ఏర్పడి క్లోరినేషన్, వైద్య శిబిరాల నిర్వహణలో పాల్గొనాలని చెప్పారు. బాధిత ప్రజలకు అందుబాటులో ఉండడం మినహా మరో ముఖ్యమైన కార్యక్రమం లేదని స్పష్టం చేశారు.
తమిళనాడుకు మన వంతు సాయం చేద్దాం
సీఎస్ రాజీవ్ శర్మకు సీఎం కేసీఆర్ ఆదేశం
సాక్షి, హైదరాబాద్: చెన్నైలో కురిసిన భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తం కావడం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తమిళనాడు ప్రభుత్వానికి అవసరమైన సహాయమందించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు. తమిళనాడు అధికారులతో మాట్లాడి కావాల్సిన సాయం చేయాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మను ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జ్ఞాన్ దేసికన్‌తో రాజీవ్ శర్మ ఫోన్‌లో మాట్లాడారు. సీఎం కేసీఆర్‌కు, ప్రభుత్వానికి దేసికన్ కృతజ్ఞతలు తెలిపారు. తమ ప్రభుత్వాన్ని సంప్రదించి సహాయం కోరుతామని పేర్కొన్నారు.
తమిళనాడుకు బాసటగా తెలుగు సినీ పరిశ్రమ
తమిళనాడులో సంభవించిన తుపాను ఆ రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేస్తోంది. భారీ వర్షాల కారణంగా అక్కడి ప్రజలు ఇబ్బందులపాలవుతున్నారు. ఇప్పటికే తమిళ సినిమా తారలు ఆర్థిక సహాయంతో పాటు, ఆహారం అందజేయడం వంటివి చేస్తున్నారు. ‘మేము సైతం’ అంటూ మన తెలుగు తారలు కూడా సహాయానికి ముందుకొచ్చారు. ఇప్పటివరకూ మన తెలుగు,తమిళ పరిశ్రమల నుంచి తారల ఆర్థిక సహాయం వివరాలు రూపాయల్లో