List Of Upcoming Multi Starrer Movies In Tollywood, Deets Inside - Sakshi
Sakshi News home page

మల్టీ హంగామా.. ఆ సినిమాలపై ఓ లుక్‌ వేయండి!

Oct 16 2022 5:09 AM | Updated on Oct 16 2022 11:47 AM

Upcoming Multi-starrer movies in Tollywood - Sakshi

ఈ ఏడాది మల్టీస్టారర్‌ ట్రెండ్‌ తెలుగులో బాగా కనిపించింది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘భీమ్లానాయక్‌’, ‘బంగార్రాజు, ‘ఆచార్య’ వంటి మల్టీస్టారర్‌ సినిమాలు వచ్చాయి. ఇద్దరు స్టార్‌ హీరోలు కనిపించిన ఈ ‘మల్టీ హంగామా’లను ప్రేక్షకులు బాగా ఎంజాయ్‌ చేశారు. వచ్చే ఏడాది మరికొన్ని మల్టీస్టారర్‌ ఫిల్మ్స్‌ రానున్నాయి. ప్రస్తుతం సెట్స్‌లో ఉన్న ఆ సినిమాలపై ఓ లుక్‌ వేయండి.

దాదాపు ఇరవైరెండు సంవత్సరాల తర్వాత హీరో చిరంజీవి, రవితేజ స్క్రీన్‌ షేర్‌ చేసుకుంటున్నారు.  కేఎస్‌ రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో రూపొందుతున్న ‘వాల్తేరు వీరయ్య’ (ప్రచారంలో ఉన్న టైటిల్‌) సినిమాలోనే స్క్రీన్‌ షేర్‌ చేసుకుంటున్నారు చిరంజీవి, రవితేజ. ఇంతకుముందు ఈ ఇద్దరూ కలిసి ‘అన్నయ్య’ (2000) సినిమా చేశారు. ఆ చిత్రంలో చిరంజీవి తమ్ముడు పాత్ర చేశారు రవితేజ.

ఇప్పుడు వాల్తేరు వీరయ్య’ చిత్రంలో కూడా చిరంజీవి, రవితేజ బ్రదర్స్‌గానే కనిపిస్తారనే టాక్‌ ఫిల్మ్‌ నగర్‌లో వినిపిస్తోంది. ఇందులో రవితేజ పోలీసాఫీసర్‌ పాత్రలో నటిస్తున్నారని సమాచారం. చిరంజీవి, రవితేజల కాంబినేషన్‌ సీన్స్‌ చిత్రీకరణ కూడా ఇటీవల వైజాగ్‌లో జరిగింది. ఇక అప్పుడు ‘అన్నయ్య’ చిత్రం జనవరిలో సంక్రాంతి పండక్కి రిలీజ్‌ కాగా, ఇప్పుడు ‘వాల్తేరు వీరయ్య’ సినిమా కూడా సంక్రాంతి సందర్భంగానే రిలీజ్‌ కానుండటం విశేషం. మైత్రీ మూవీమేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌ నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రుతీహాసన్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

ఇక వెంకటేష్, సల్మాన్‌ ఖాన్, రామ్‌చరణ్‌లు కలిసి సిల్వర్‌ స్క్రీన్‌పై ఒకేసారి కనిపిస్తే వారి అభిమానులు విజిల్స్‌ వేయాల్సిందే. ఈ ముగ్గురూ కలిసి హిందీ చిత్రం ‘కిసీ కీ భాయ్‌ కీసీ కీ జాన్‌’ అనే సినిమాలో  స్క్రీన్‌ షేర్‌ చేసుకున్నారు. సల్మాన్‌ ఖాన్, వెంకటేశ్‌ లీడ్‌ హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రంలో రామ్‌చరణ్‌ది అతిథి పాత్ర. ఓ పాటలో మాత్రమే చరణ్‌ కనిపిస్తారు. ఫర్హాద్‌ సామ్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే, జగపతిబాబు ఇతర లీడ్‌ రోల్స్‌ చేస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది రంజాన్‌కి రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు.

మరోవైపు ‘మనం’, ‘బంగార్రాజు’ చిత్రాల్లో పెద్ద కుమారుడు నాగచైతన్యతో కలిసి నటించిన నాగార్జున ఇప్పుడు చిన్న కుమారుడు అఖిల్‌తో ఓ సినిమా చేయనున్నారు. అక్కినేని నాగేశ్వరరావు–నాగార్జున– నాగచైతన్య నటించిన ‘మనం’లో అఖిల్‌ ఓ గెస్ట్‌ రోల్‌లో కనిపించిన విషయం తెలిసిందే. ఇప్పుడు నాగార్జున, అఖిల్‌ హీరోలుగా మోహన్‌రాజా దర్శకత్వంలో ఓ భారీ మల్టీస్టారర్‌ ఫిల్మ్‌ తెరకెక్కనుంది.

ఇంకోవైపు ‘అగ్ని నక్షత్రం’ కోసం తొలిసారి స్క్రీన్‌ షేర్‌ చేసుకుంటున్నారు తండ్రీకూతురు మంచు మోహన్‌ బాబు, మంచు లక్ష్మి. ప్రతీక్‌ ప్రజోష్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విశ్వంత్, చిత్రా శుక్లా, మలయాళ నటుడు సిద్ధిఖ్‌ ఇతర లీడ్‌ రోల్స్‌ చేస్తున్నారు. శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, మంచు ఎంటర్‌టైన్‌ మెంట్‌పై ఈ చిత్రం రూపొందుతోంది.
మలయాళ హిట్‌ ‘ఆండ్రాయిడ్‌ కుంజప్పన్‌ వెర్షన్‌ 5.25’ తెలుగు రీమేక్‌ హక్కులను హీరో– నిర్మాత విష్ణు మంచు దక్కించు కున్నారని తెలిసింది. ఈ సినిమాలో తండ్రి పాత్రలో మోహన్‌బాబు నటించనున్నారు. తనయుడు పాత్రలో టాలీవుడ్‌లోని ఓ యంగ్‌ హీరో కనిపిస్తారట. ఒకవేళ మంచు విష్ణుయే ఈ పాత్రనూ చేస్తే అది మరో మల్టీస్టారర్‌ అవుతుంది.

ఇంకోవైపు మేనమామ... మేనల్లుడు పవన్‌ కల్యాణ్‌– సాయిధరమ్‌ తేజ్‌లు స్క్రీన్‌ షేర్‌ చేసుకోనున్నారనే వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. తమిళంలో విజయం సాధించిన ‘వినోదాయ సిత్తమ్‌’ తెలుగులో రీమేక్‌ కానుందని, ఈ చిత్రంలోనే పవన్‌ కల్యాణ్, సాయిధరమ్‌ నటించనున్నారన్నది ఫిల్మ్‌ నగర్‌ టాక్‌. సముద్రఖని ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తారట. ఇంకోవైపు మీడియమ్‌ రేంజ్‌ హీరోల మల్టీస్టారర్‌ మూవీస్‌ కూడా రానున్నాయి. హీరో సత్య దేవ్, డాలీ ధనంజయ (‘పుష్ప’ సినిమాలో యాక్ట్‌ చేశారు) కలిసి ఓ మల్టీస్టారర్‌ ఫిల్మ్‌ చేస్తున్నారు. ఈ సినిమాకు ఈశ్వర్‌కార్తీక్‌ దర్శకుడు. అలాగే రాజ్‌ తరుణ్, ‘జార్జిరెడి’్డ ఫేమ్‌ సందీప్‌ మాధవ్‌ ‘మాస్‌ మహా
రాజు’ అనే సినిమా చేస్తున్నారు. ఇవేకాదు.. మరికొన్ని మల్టీస్టారర్‌ ఫిల్మ్స్‌కి  కాంబినేషన్‌ సెట్‌ అవుతోందని తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement